మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం.. శ్రీలంక వరల్డ్‌కప్‌ విన్నర్‌ అరెస్టు! | Sri Lanka World Cup winner arrested for match fixing | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వివాదం.. శ్రీలంక వరల్డ్‌కప్‌ విన్నర్‌ అరెస్టు!

Sep 6 2023 4:49 PM | Updated on Sep 6 2023 5:05 PM

Sri Lanka World Cup winner arrested for match fixing - Sakshi

శ్రీలంక మాజీ క్రికెటర్‌ సుచిత్ర సేనానాయకే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కేసులో అరెస్టు అయ్యాడు. ఆ దేశపు క్రీడా మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు సేనానాయకే బుధవారం లోంగిపోయాడు. అతడిని త్వరలోనే కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంక క్రికెట్‌ చరిత్రలోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ సంబంధించి  న్యాయ విచారణకు హాజరకానున్న మొదటి క్రికెటర్‌ సేనానాయకే కావడం గమనార్హం.

లంక ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌..
సేనానాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను సేనానాయకే టెలిఫోన్‌లో సంప్రదించినట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి.

దీంతో అతడు విదేశాలకు వెళ్లకుండా మూడు నెలల పాటు ట్రావెల్‌బ్యాన్‌ కొలంబోలోని స్ధానికి కోర్టు విధించింది.  కోర్టు ఉత్తర్వులను అటార్నీ జనరల్ డిపార్ట్‌మెంట్ పొందింది. అటార్నీ జనరల్ ఆదేశాల మెరకు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగం సేనానాయక్‌పై  నేరారోపణలు మోపింది.

ఈ  ‍క్రమంలో సేనానాయకేనే ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు లొంగిపోయాడు. ఇక 28 ఏళ్ల  సేనానాయకే శ్రీలంక తరపున  49 వన్డేలు, 24 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2016 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న జట్టులో సేనానాయకే భాగంగా ఉన్నాడు.
చదవండి: Rohit Sharma: సిగ్గుపడాలి రోహిత్‌! నువ్వు చేసిన చెత్త పని ఏంటో తెలుస్తోందా? నెటిజన్స్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement