కొలంబో: శ్రీలంకకు చెందిన ముగ్గురు క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో ముగ్గురు లంక క్రికెటర్లు ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు రాగా, దానిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విచారణ చేపట్టింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడామంత్రి డుల్లాస్ అలహుపెరుమా వెల్లడించారు. కాగా, ఆ క్రికెటర్లు ఎవరు అనే విషయాన్ని మాత్రం మంత్రి స్పష్టం చేయలేదు. తమ దేశ క్రికెట్‌లో ఈ తరహా ఆరోపణలు రావడం నిజంగా బాధకరమని డుల్లాస్ తెలిపారు. ‘ మా గౌరవ క్రీడామంత్రి ఏదైతో చెప్పారో దాన్ని మేము విశ్వసిస్తున్నాం. మా దేశానికి చెందిన ముగ్గురు క్రికెటర్లపై ఐసీసీ మ్యాచ్ ఫిక్సింగ్ విచారణ చేపట్టనుందనే విషయాన్ని మంత్రి ద్వారా తెలుసుకున్నాం. వారు ప్రస్తుతం జట్టులో ఉన్న క్రికెటర్లు కాదు’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) ఓ ప్రకటనలో తెలిపింది. (ఇంత ఆటవికమా: రోహిత్ శర్మ)
ఇదిలా ఉంచితే, గతవారం డ్రగ్ కేసులో ఇరుక్కున్న షెహన్ మధుశంకాను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేయడంతో మరో కొత్త తలనొప్పి శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఎదురైంది. ఈ ఘటనపై కూడా మంత్రి స్పందించారు. ‘ ఇది చాలా బాధాకరం. ఆ క్రికెటర్‌పై మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. ఈ పరిస్థితుల్లో డ్రగ్ కేసులో దొరకడం నిజంగా బాధిస్తోంది’ అని డుల్లాస్ తెలిపారు. డ్రగ్ కేసులో ఇరుక్కున్నందున షెహన్ కాంట్రాక్ట్ రద్దయ్యింది.(యువీకి సరికొత్త తలనొప్పి)
Comments
Please login to add a commentAdd a comment