SriLankaTeam
-
అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియ జోరు
-
కింగ్, లూయిస్ ఊచకోత.. శ్రీలంకను చిత్తు చేసిన వెస్టిండీస్
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యాన్ని కరేబియన్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లో చేధించింది.లక్ష్య చేధనలో విండీస్ ఓపెనర్లు బ్రాండెన్ కింగ్, ఈవెన్ లూయిస్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. 33 బంతులు ఎదుర్కొన్న కింగ్ 11 ఫోర్లు, 1 సిక్స్‌లతో 63 పరుగులు చేయగా, లూయిస్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 రన్స్ చేశాడు. లంక బౌలర్లలో మతీషా పతిరానా రెండు వికెట్లు పడగొట్టగా, హసరంగా, మెండిస్,థీక్షణ చెరో వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.లంక బ్యాటర్లలో కెప్టెన్ అసలంక(59, 9 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, కమిందు మెండిస్(51) పరుగులతో రాణించాడు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు వికెట్లు, అల్జారీ జోషఫ్, షెమర్ జోషఫ్, మోటీ,స్ప్రింగర్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆక్టోబర్ 15న దంబుల్లా వేదికగానే జరగనుంది.చదవండి: T20 WC: ఆసీస్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్‌కు చేరాలంటే? -
వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన ఆసీస్.. శ్రీలంక టోర్నీ నుంచి ఔట్
మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. షార్జా వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది.94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా అమ్మాయిలు చేధించారు. స్టార్ ఓపెనర్ బెత్ మూనీ 43 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. లంక బౌలర్లలో ప్రబోధని, రణవీర, కుమారి తలా వికెట్ సాధించారు.తేలిపోయిన లంక బ్యాటర్లు.. అంతకముందు ఆసీస్ బౌలర్ల దాటికి శ్రీలంక బ్యాటర్లు తేలిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులకే పరిమితమైంది.ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ స్కాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. మోలనిక్స్ రెండు వికెట్లు సాధించింది. ఇక ఈ ఓటమితో శ్రీలంక దాదాపు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఆసీస్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న న్యూజిలాండ్‌తో తలపడనుంది.చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా? -
NZ vs SL 2nd Test: విజయానికి 5 వికెట్ల దూరంలో శ్రీలంక
న్యూజిలాండ్‌పై చారిత్రక సిరీస్ క్లీన్‌స్వీప్‌నకు శ్రీలంక జట్టు ఐదు వికెట్ల దూరంలో నిలిచింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న శ్రీలంక... రెండో టెస్టులోనూ విజయానికి చేరువైంది. శనివారం మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 22/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్... లంక లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య ధాటికి విలవిలలాడి 39.5 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది.శ్రీలంకపై న్యూజిలాండ్‌కు ఇదే అత్యల్ప స్కోరు. మిషెల్ సాన్‌ట్నర్ (51 బంతుల్లో 29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా... రచిన్ రవీంద్ర (10), డారిల్ మిషెల్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టామ్ లాథమ్ (2), డ్వేన్ కాన్వే (9), కేన్ విలియమ్సన్ (7), ఎజాజ్ పటేల్ (8), టామ్ బ్లండెల్ (1), గ్లెన్ ఫిలిప్స్ (0) విఫలమయ్యారు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 6, నిషాన్ మూడు వికెట్లు పడగొట్టారు.లంక సారథి ధనంజయ ఐదు క్యాచ్‌లు అందుకోవడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగుల భారీ ఆధిక్యం దక్కించుకున్న శ్రీలంక... న్యూజిలాండ్‌ను ఫాలోఆన్ ఆడించగా.. శనివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 41 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆత్మరక్షణ ధోరణిలో ఆడి దెబ్బతిన్న న్యూజిలాండ్... రెండో ఇన్నింగ్స్‌లో ఎదురుదాడికి దిగింది. డ్వేన్ కాన్వే (62 బంతుల్లో 61; 10 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధసెంచరీ సాధించగా.. కేన్ విలియమ్సన్ (58 బంతుల్లో 46; 4 ఫోర్లు), బ్లండెల్ (50 బంతుల్లో 47 బ్యాటింగ్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (41 బంతుల్లో 32 బ్యాటింగ్; 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో నిషాన్ మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు శ్రీలంక 602/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉండగా... చేతిలో 5 వికెట్లు ఉన్న న్యూజిలాండ్ జట్టు... ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 315 పరుగులు చేయాల్సి ఉంది. వెలుతురులేమి కారణంగా మూడోరోజు ఆట నిర్ణీత సమయం కంటే ముందే ముగిసింది. మొత్తంగా న్యూజిలాండ్ శనివారం ఇక్క రోజే రోజు 13 వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్లోనే 9 వికెట్లు నెలకూలాయి.చదవండి: IND vs BAN: బంగ్లాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడికి చోటు -
జయసూర్య 'సిక్సర్'.. 88 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ ఘోర ఓటమి దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ దారుణ ప్రదర్శన కనబరిచింది. శ్రీలంక బౌలర్ల దాటికి న్యూజిలాండ్ కేవలం 88 పరుగులకే కుప్పకూలింది.లంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య స్పిన్ వలలో కివీస్ చిక్కుకుంది. జయసూర్య తన మాయాజాలంతో డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ కీలక వికెట్లు పడగొట్టాడు. ఏకంగా తొలి ఇన్నింగ్స్‌లో జయసూర్య 6 వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అరంగేట్ర పేసర్ నిషాన్ పీరిస్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. బ్లాక్ క్యాప్స్ ఇన్నింగ్స్‌లో 7 మంది ఆటగాళ్లు కేవలం సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితయమయ్యారు. మిచెల్ శాంట్నర్(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఘోర ప్రదర్శన కరబరిచిన కివీస్ ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది. ఫాలో ఆన్‌లో కూడా కివీస్ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 30 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇంకా 385 పరుగులు వెనకబడి ఉంది. ఇప్పటికే తొలి టెస్టులో లంక చేతిలో కివీస్ ఓటమి చవిచూసింది. -
చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. నెదర్లాండ్స్ చిత్తు
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక అదరగొట్టింది. సెయింట్ లూసియా వేదికగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది.శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్(29 బంతుల్లో 5 ఫోర్లు, 46), అసలంక(21 బంతుల్లో 1 ఫోరు, 5 సిక్స్‌లు, 46) టాప్ స్కోరర్లగా నిలిచారు. వీరిద్దరితో పాటు దనుంజయ డిసిల్వా(30),మాథ్యూస్(30) పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్‌బీక్ రెండు వికెట్లు పడగొట్టగా.. కింగ్మా, దత్, వాన్‌మీకరన్, ప్రింగిల్ తలా వికెట్ సాధించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 118 పరుగులకే కుప్పకలింది. ఫలితంగా శ్రీలంక 83 పరుగులతో జయభేరి మోగించింది. చరిత్ అసలంకకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా శ్రీలంక ఇప్పటికే సూపర్-8 అవకాశాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. కానీ తప్పు ఎక్కడ జరిగిందో తెలియదు: బాబర్ -
శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ దిగ్గజం..
శ్రీలంక ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జూన్‌లో అమెరికా, విండీస్ వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్ వరకు జావేద్ తన పదవిలో కొనసాగనున్నాడు. ఈ మెరకు శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటన విడుదల చేసింది. "పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ ఆకిబ్ జావేద్‌ను మా జాతీయ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించడం జరిగింది. అతడు టీ20 వరల్డ్‌కప్-2024 పూర్తి అయ్యేంతవరకు జట్టుతో కలిసి పనిచేస్తాడు శ్రీలంక క్రికెట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా హెడ్‌కోచ్‌గా, బౌలింగ్ కోచ్‌గా జావేద్‌కు అపారమైన అనుభవం ఉంది. 2009 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన పాకిస్తాన్ జట్టుకు జావేద్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అదేవిధంగా యూఏఈ జట్టుకు హెడ్‌కోచ్‌గా అతడి నేతృత్వంలోనే యూఏఈకు వన్డే హోదా లభించింది. అంతేకాకుండా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో కూడా జావేద్ కోచ్‌గా పనిచేశాడు. ఇక పాకిస్తాన్ తరపున 163, 22 వన్డేలు, టెస్టులు ఆడిన జావేద్ .. వరుసగా 182, 54 వికెట్లు పడగొట్టాడు. 1992 వన్డే వరల్డ్‌కప్ గెలుచుకున్న పాక్ జట్టులో జావేద్ సభ్యునిగా ఉన్నాడు. -
జింబాబ్వేతో వన్డే సిరీస్.. శ్రీలంక జట్టు ప్రకటన! కెప్టెన్‌గా మెండిస్
స్వదేశంలో జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌తో వికెట్ కీపర్ బ్యాటర్ కుశాల్ మెండిస్.. శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. అతడి డిప్యూటీగా మిడిలార్డర్ బ్యాటర్ చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. ఇక గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా పునరాగమనం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ జట్టులో అతడికి చోటు దక్కింది. కాగా ఇటీవలే శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌గా హసరంగా ఎంపికైన సంగతి తెలిసిందే. అదే విధంగా గాయం కారణంగా వన్డే ప్రపంచకప్-2023 మధ్యలోనే తప్పుకున్న మాజీ కెప్టెన్ దసున్ షనక కూడి జింబాబ్వే సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా తొలుత ఈ సిరీస్‌కు 21 మంది సభ్యుల ప్రిలిమనరీ జట్టును ఎంపిక చేసింది. అందులో ఇప్పుడు 17 మంది పేర్లను ఉపుల్ తరంగా నేతృత్వంలోని లంక సెలెక్షన్ కమిటీ ఖారారు చేసింది. జనవరి 6న కొలంబో వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. జింబాబ్వేతో వన్డేలకు శ్రీలంక జట్టు: కుశాల్ మెండిస్ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), పాతుమ్ నిస్సంక, అవిష్క ఫెర్నాండో, సదీర సమరవిక్రమ, సహన్ అరాచ్చిగే, నువానీడు ఫెర్నాండో, దసున్ షనక, జనిత్ లియానాగే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, దుష్మంత చమీర, ప్రమోద్ చమీర, వాండర్సే, అకిల దనంజయ, వనిందు హసరంగా (ఫిట్‌నెస్‌కు లోబడి). చదవండి: #Saim Ayub: బ్యాటింగ్‌లో విఫలం.. ఈజీ క్యాచ్ వదిలేశాడు.. బాబర్ రియాక్షన్ వైరల్ -
శ్రీలంకకు బిగ్ షాక్.. వరల్డ్‌కప్ నుంచి కెప్టెన్ ఔట్
వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ దసున్ షనక గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ దూరమయ్యాడు. అతడు తొడ కండరాల గాయంతో వన్డే ప్రపంచకప్ 2023 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా దృవీకరించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆక్టోబర్ 10న హైదరాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో షనక కుడి తొడకు గాయమైంది. అతడు కోలుకోవడానికి దాదాపు 3 నుంచి 4 వారాల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతడి స్ధానాన్ని ఆల్‌రౌండర్ కరుణరత్నేతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. మరోవైపు యువ పేసర్ మతీషా పతిరానా కూడా భుజం గాయం కారణంగా ఈ టోర్నీలో ఒకట్రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో లంక బోణీ కొట్టలేదు. తొలి రెండు మ్యాచ్‌లలోనూ శ్రీలంక ఓటమి పాలైంది. చదవండి: World Cup 2023: అంపైర్‌కు కండలు చూపించిన రోహిత్ శర్మ.. ఎందుకంటే? వీడియో వైరల్ -
CWC 2023 SA VS SL: శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం (ఫొటోలు)
-
టోలీచౌకీ కుర్రాడు.. అదరగొట్టేశాడు: రాజమౌళి ట్వీట్ వైరల్!
ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్లతో శ్రీలంకను ఊచకోత కోసిన హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్‌పై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. నగరంలోని టోలీచౌకి బాయ్ ఆరు వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ చేశాడంటూ కొనియాడారు. సిరాజ్‌ను ప్రశంసిస్తూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేయడంతో పాటు ట్వీట్ చేశారు. (ఇది చదవండి: అలాంటి వాళ్లను పెడితే బిగ్‌బాస్ ఎవరూ చూడరు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్) రాజమౌళి ట్వీట్ రాస్తూ.. 'సిరాజ్ మియాన్, మన టోలీచౌకీ కుర్రాడు ఆసియా కప్ ఫైనల్లో 6 వికెట్లతో మెరిశాడు. అంతే కాకుండాతన బౌలింగ్‌లో బౌండరీని ఆపడానికి లాంగ్-ఆన్కి పరిగెత్తి అందరి హదయాలను గెలిచాడు.' అంటూ పోస్ట్ చేశారు. రాజమౌళి చేసిన ట్వీట్‌ను చూసిన అభిమానులు సైతం సిరాజ్ ఘనతను ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఆసియాకప్ ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది. Siraj Miyan, Our Tolichowki boy shines at the Asia Cup final with 6 wickets…👌🏽👌🏽👌🏽👏🏻👏🏻👏🏻 And has a big heart, running to long-on to stop the boundary off his own bowling… 🤗🤗🤗 — rajamouli ss (@ssrajamouli) September 17, 2023 -
మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం.. శ్రీలంక వరల్డ్‌కప్ విన్నర్ అరెస్టు!
శ్రీలంక మాజీ క్రికెటర్ సుచిత్ర సేనానాయకే మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్టు అయ్యాడు. ఆ దేశపు క్రీడా మంత్రిత్వ శాఖలోని ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు సేనానాయకే బుధవారం లోంగిపోయాడు. అతడిని త్వరలోనే కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంక క్రికెట్ చరిత్రలోనే మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించి న్యాయ విచారణకు హాజరకానున్న మొదటి క్రికెటర్ సేనానాయకే కావడం గమనార్హం. లంక ప్రీమియర్ లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్.. సేనానాయకే లంక ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి ఇద్దరు ఆటగాళ్లను సేనానాయకే టెలిఫోన్లో సంప్రదించినట్లు పలు రిపోర్టులు వెల్లడించాయి. దీంతో అతడు విదేశాలకు వెళ్లకుండా మూడు నెలల పాటు ట్రావెల్‌బ్యాన్ కొలంబోలోని స్ధానికి కోర్టు విధించింది. కోర్టు ఉత్తర్వులను అటార్నీ జనరల్ డిపార్ట్మెంట్ పొందింది. అటార్నీ జనరల్ ఆదేశాల మెరకు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రత్యేక దర్యాప్తు విభాగం సేనానాయక్పై నేరారోపణలు మోపింది. ఈ క్రమంలో సేనానాయకేనే ప్రత్యేక దర్యాప్తు విభాగం ముందు లొంగిపోయాడు. ఇక 28 ఏళ్ల సేనానాయకే శ్రీలంక తరపున 49 వన్డేలు, 24 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. 2016 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న జట్టులో సేనానాయకే భాగంగా ఉన్నాడు. చదవండి: Rohit Sharma: సిగ్గుపడాలి రోహిత్! నువ్వు చేసిన చెత్త పని ఏంటో తెలుస్తోందా? నెటిజన్స్ ఫైర్ -
వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై
శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టుక్రికెట్‌కు హసరంగా విడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడు మంగళవారం శ్రీలంక క్రికెట్‌కు తెలియజేశాడు. పరిమిత ఓవర్లపై దృష్టిసారించేందుకే హసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అతడిని నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్ కూడా అంగీకరించరింది. మేము హసరంగా నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాము. "మా వైట్-బాల్ జట్టులో హసరంగా కీలక ఆటగాడిగా కొనసాగుతాడని భావిస్తున్నామని శ్రీలంక క్రికెట్ సీఈవో ఆష్లే డి సిల్వా పేర్కొన్నాడు. కాగా శ్రీలంక పరిమిత ఓవర్ల జట్టులో ముఖ్యమైన ఆటగాడిగా ఉన్న హసరంగా.. టెస్టులకు మాత్రం గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నాడు. అతడు చివరగా టెస్టుల్లో 2021లో బంగ్లాదేశ్‌పై ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టు అరంగేట్రం చేసిన వనిందు.. తన కెరీర్లో కేవలం 4 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లు సాధించాడు. అదే విధంగా ఇప్సటివరకు శ్రీలంక తరపున 48 వన్డేలు, 58 టీ20ల్లో అతడు ప్రాతినిథ్యం వహించాడు. హసరంగా ప్రస్తుతం లంక ప్రీమియర్ లీగ్‌లో బీలవ్‌కాండీ జట్టుకు సారధిగా ఉన్నాడు. చదవండి: ODI WC 2023: టీమిండియాలో నాలుగో స్ధానం ఎవరిది.. యువరాజ్ సింగ్ వారసుడెవరు? -
చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్.. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా!
శ్రీలంక మహిళల జట్టు కెప్టెన్ చమారీ ఆటపట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఉమన్స్ వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మొదటి శ్రీలంక క్రికెటర్‌గా ఆటపట్టు రికార్డులకెక్కింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 758 పాయింట్లతో ఆటపట్టు టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ బెత్ మూనీ(758)ను వెనుక్కి నెట్టింది. కాగా స్వదేశంలో న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో అటపట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలతో చెలరేగింది. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో 248 పరుగులు అటపట్టు సాధించింది. ఈ అద్బుత ప్రదర్శన ఫలితంగా తన కెరీర్లో తొలిసారి నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. జయసూర్య తర్వాత చమారీనే.. ఇక ఓవరాల్‌గా శ్రీలంక మెన్స్, ఉమెన్స్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా కూడా ఆటపట్టు నిలిచింది. ఇప్పటివరకు శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ సాధించాడు. సెప్టెంబరు 2002 నుంచి మే 2003 వరకు జయసూర్య నెం1 ర్యాంక్‌లో కొనసాగాడు. అ తర్వాత ఏ ఒక్క శ్రీలంక క్రికెటర్(మెన్స్ అండ్ ఉమన్స్) టాప్ ర్యాంక్‌ను సాధించలేకపోయారు. తాజాగా అటపట్టు 20 ఏళ్ల తర్వాత అగ్రస్ధానానికి చేరుకుని రికార్డులకెక్కింది. ఇక తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్ రు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకుంది. శ్రీలంక సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో సోఫీ డివైన్ 137 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది. చదవండి: Harbhajan Singh: ప్రపంచంలో టాప్ 5 బెస్ట్ ప్లేయర్స్ వీరే.. కోహ్లి, రోహిత్‌కు నో ఛాన్స్! -
పతిరణకు నేను ఉన్న అంటున్న ధోని..
-
పతిరణకి ధోని సలహా...మండి పడుతున్న మలింగ
-
శ్రీలంక వేదికగా ఆసియా కప్.. పాపం పాకిస్తాన్!
ఆసియా కప్-2023 నిర్వహణపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ఏడాది ఆసియా కప్‌ను పాకిస్తాన్లో కాకుండా శ్రీలంక వేదికగా నిర్వహించనున్నట్టు సమాచారం. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీని పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కానీ భారత్-పాక్ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ క్రమంలో తాజాగా పాకిస్తాన్ లో టోర్నీ నిర్వహిస్తే తాము వెళ్లబోమని శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డులు బీసీసీఐకి మద్దతు తెలిపాయి. దీంతో ఆసియాకప్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. ఆసియా కప్ నిర్వహణ వేదికపై ఈ నెలాఖరున ఆసియా క్రికెట్ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చదవండి: సచిన్ నన్ను బ్యాట్‌తో కొట్టాడు.. పిచ్చివాడిని చేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు: సెహ్వాగ్ -
చరిత్ర సృష్టించిన జయసూర్య.. 71 ఏళ్ల వరల్డ్ రికార్డు బద్దలు
టెస్టు క్రికెట్లో శ్రీలంక స్పిన్నర్ ప్రబాత్ జయసూర్య అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్లు సాధించిన స్పిన్నర్‌గా జయసూర్య నిలిచాడు. గాలె వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌తో పాల్ స్టిర్లింగ్‌ను ఔట్ చేసిన ప్రబాత్ జయసూర్య.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డును కేవలం 7 మ్యాచ్‌ల్లోనే జయసూర్య సాధించాడు. ఈ వరల్డ్ రికార్డు ఇప్పటి వరకు వెస్టిండీస్ మాజీ స్పిన్నర్ ఆల్ఫ్ వాలెంటైన్ పేరిట ఉండేది. ఆల్ఫ్ వాలెంటైన్ ఎనిమిది టెస్టు మ్యాచ్‌ల్లో అద్భుతమైన రికార్డును సాధించాడు. వాలెంటైన్ 1951-52 మధ్య కాలంలో నెలకొల్పాడు. తాజా మ్యాచ్‌తో 71 ఏళ్ల ప్రపంచ రికార్డును ప్రబాత్ బ్రేక్ చేశాడు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి శ్రీలంక బౌలర్‌గా కూడా జయసూర్య రికార్డులకెక్కాడు. చదవండి: IPL 2023-Teamindia: కిషన్ వద్దు.. అతడికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్! విధ్వంసం సృష్టిస్తాడు.. అదే విధంగా ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో ఈ రికార్డు సాధించిన రెండో బౌలర్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన వెర్నాన్ ఫిలాండర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ టామ్ రిచర్డ్‌సన్‌తో జయసూర్య సంయుక్తంగా నిలిచాడు. ఇక ఐరీష్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల హాల్ సాధించిన జయసూర్య.. రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ మాత్రమే సాధించాడు. చదవండి: IPL 2023: బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.. రాజస్తాన్‌కు దొరికిన ఆణిముత్యం! -
డబుల్ సెంచరీతో చెలరేగిన కుశాల్ మెండీస్.. 18 ఫోర్లు, 11 సిక్స్‌లతో
గాలే వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ సాధించింది. తమ తొలి ఇన్నింగ్స్‌ను 704/3 వద్ద డిక్లేర్ చేసింది. శ్రీలంక 212 పరుగుల అదధిక్యంలో నిలిచింది. కుశాల్ మెండిస్, నిషాన్ మదుష్కా డబుల్ సెంచరీలతో చెలరేగారు. 339 బంతుల్లో మదుష్కా 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 205 పరుగులు చేయగా.. మెండిస్ 18 ఫోర్లు, 11 సిక్స్‌లతో కేవలం 291 బంతుల్లోనే 245 పరుగులు చేశాడు. కాగా వీరిద్దరికి ఇదే తొలి టెస్టు డబుల్ సెంచరీ కావడం విశేషం. వీరిద్దరితో పాటు మాథ్యూస్(101 నాటౌట్) సెంచరీతో అదరగొట్టాడు. అంతకుముందు ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 492 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ అరుదైన రికార్డు సాధించాడు.సొంత గడ్డపై టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన నాలుగో శ్రీలంక బ్యాటర్‌గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే(374) తొలి స్థానంలో ఉండగా.. సనత్ జయసూర్య(340),కుమార సంగక్కర(287) వరుసగా రెండు మాడు స్ధానాల్లో నిలిచారు. చదవండి: IPL 2023 RCB Vs KKR: కోహ్లి కాలికి దండం పెట్టిన రింకూ సింగ్.. ఫోటోలు వైరల్ అదే విధంగా మరో రికార్డును కూడా మెండిస్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన శ్రీలంక బ్యాటర్‌గా మెండిస్ రికార్డులకెక్కాడు. ఐర్లాండ్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కుశాల్ 11 సిక్స్‌లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు కుమార సంగక్కర(8) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సంగక్కర రికార్డును మెండిస్ బ్రేక్ చేశాడు. చదవండి: IPL 2023: మద్యం మత్తులో మహిళతో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు అనుచిత ప్రవర్తన..! -
ఆస్ట్రేలియా ‘హ్యాట్రిక్’ విజయం.. శ్రీలంకను చిత్తు చేసిన కంగారూలు
గెబెర్హా: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్ ‘1’ మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ముందుగా లంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగు లకే పరిమితమైంది. హర్షిత (34)దే అత్యధిక స్కోరు. అనంతరం ఆసీస్ 15.5 ఓవర్లలో వికెట్ కో ల్పోకుండా 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (43 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బెత్ మూనీ (53 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. చదవండి: స్టన్నింగ్ క్యాచ్.. అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్ -
సచిన్ ను దాటేసిన కోహ్లీ.. స్వదేశంలో 20వ సెంచరీ
-
స్వదేశంలో టీమిండియా వరుస సిరీస్ లు.. షెడ్యూల్ ఇదే..!
-
రాణించిన శ్రీలంక బౌలర్లు..
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్, ఘనీ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే మిడిలార్డర్ బ్యాటర్లు అంతగా రాణించకపోవడంతో ఆఫ్గాన్ 150 పరుగుల మార్క్‌ను దాటలేకపోయింది. ఆఫ్గాన్ బ్యాటర్లలో గుర్బాజ్(28), ఘనీ(22), ఇబ్రహీం జద్రాన్(22) పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక బౌలర్లలో హాసరంగా మూడు వికెట్ల పడగొట్టగా.. కుమారా రెండు, రజితా, డి సిల్వా తలా వికెట్ సాధించారు. ఇక ఈ మ్యాచ్‌లో ధనుంజయ డి సిల్వా 66 పరుగులతో చెలరేగడంతో శ్రీలంక.. ఆఫ్గనిస్తాన్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 WC 2022: భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఆట రద్దు అయితే? -
T20 WC 2022: చమీరా ఔట్.. మూడేళ్ల తర్వాత శ్రీలంక పేసర్ రీఎంట్రీ
టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంకను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో శ్రీలంక ఆటగాళ్లు గుణతిలక, చమీరా, దిల్షాన్ మధుశంక దూరమయ్యారు. అదే విధంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన పేసర్ ప్రమోదు మధుషాన్ కూడా ఈ టోర్నీలో ఆడేది అనుమానంగా మారింది. ఇక ఇప్పటికే మధుశంక స్థానాన్ని పేసర్ ఫేర్నాండోతో భర్తీ చేసిన శ్రీలంక క్రికెట్.. తాజాగా గుణతిలక, చమీరా రిప్లేస్మెంట్స్ను కూడా శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. గుణతిలక స్థానంలో స్టాండ్‌బై జాబితాలో ఉన్న యువ బ్యాటర్ ఆషెన్ బండార, చమీరా స్థానంలో కసున్ రజితాను శ్రీలంక క్రికెట్ ఎంపిక చేసింది. అదే విధంగా వీరిద్దరి భర్తీని టీ20 ప్రపంచకప్-2022 టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా కసున్ రజితా చివర సారిగా 2019లో శ్రీలంక జట్టు తరపున టీ20ల్లో ఆడాడు. ఇక గురువారం(ఆక్టోబర్ 20) నెదర్లాండ్స్‌తో జరిగిన క్వాలిఫియర్ మ్యాచ్‌లో విజయం సాధించిన శ్రీలంక.. సూపర్-12 అర్హత సాధించింది. చదవండి: T20 WC 2022: నమీబియాకు షాకిచ్చిన యూఏఈ.. సూపర్-12కు నెదర్లాండ్స్ -
73 పరుగులకే కుప్పకూలిన యూఏఈ.. శ్రీలంక ఘన విజయం
ICC Mens T20 World Cup 2022- Sri Lanka vs United Arab Emirates, 6th Match, Group A: శ్రీలంక వర్సెస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్వాలిఫైయర్ మ్యాచ్ 73 పరుగులకే కుప్పకూలిన యూఏఈ.. శ్రీలంక ఘన విజయం టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ ‘ఎ’(క్వాలిఫియర్స్) తొలి రౌండ్లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగుల తేడాతో శ్రీలంక విజయ భేరి మోగించింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ.. 17.1 ఓవర్లలోనే కేవలం 73 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో చమీరా, హాసరంగా చెరో మూడు వికెట్లతో యూఏఈను దెబ్బ తీయగా.. తీక్షణ రెండు, షనక, మధుషాన్ తలా వికెట్ సాధించారు. ఇక యూఏఈ బ్యాటర్లలో ఆఫ్జల్ ఖాన్(19) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక 60 బంతుల్లో 74 పరుగులతో లంక ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యూఏఈ బౌలర్లలో కార్తిక్ మెయప్పన్ హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జహూర్ ఖాన్ రెండు, అయాన్ అఫ్జల్ ఖాన్ ఒకటి, ఆర్యన్ లక్రా ఒక వికెట్ తీశారు. 36 పరుగులకే 6 వికెట్లు.. ఓటమి దిశగా యూఏఈ 36 పరుగులకే యూఏఈ 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 9 పరుగులు చేసిన ఆరవింద్.. హాసరంగా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. యూఏఈ విజయానికి 54 బంతుల్లో 114 పరుగులు కావాలి. నాలుగో వికెట్ కోల్పోయిన యూఏఈ 21 పరుగుల వద్ద యూఏఈ నాలుగో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన సూరి.. మధుషాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 19 పరుగులకే మూడు వికెట్లు.. కష్టాల్లో యూఏఈ 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంక పేసర్ చమీరా మూడు వికెట్లు పడగొట్టి యూఏఈను ఆదిలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి వికెట్ కోల్పోయిన యూఏఈ 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన వసీం.. చమీరా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. యూఏఈతో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక 60 బంతుల్లో 74 పరుగులతో లంక ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కుశాల్ మెండిస్(18), ధనుజంయ డి సిల్వా(33) తప్ప మిగతా వాళ్లంత సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. యూఏఈ బౌలర్లలో కార్తిక్ మెయప్పన్ హ్యాట్రిక్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జహూర్ ఖాన్ రెండు, అయాన్ అఫ్జల్ ఖాన్ ఒకటి, ఆర్యన్ లక్రా ఒక వికెట్ తీశారు. మరో వికెట్ కోల్పోయిన లంక లంకకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 15వ ఓవర్లో వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన దసున్ షనక బృందం.. ఆ మరుసటి ఓవర్లో మరో వికెట్ నష్టపోయింది. 16వ ఓవర్లో అఫ్ఝల్ ఖాన్ బౌలింగ్‌లో నాలుగో బంతికి హసరంగ.. బాసిల్ హమీద్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్కోరు: 121-6. చమిక కరుణరత్నె, పాథుమ్ నిసాంక క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు యూఏఈ బౌలర్ మెయప్పన్ శ్రీలంకను కోలుకోలేని దెబ్బకొట్టాడు. 15వ ఓవర్ నాలుగో బంతికి రాజపక్సను పెవిలియన్‌కు పంపిన అతడు.. ఆ మరుసటి రెండు బంతుల్లో అసలంక, దసున్ షనకలను బౌల్డ్ చేశాడు. దీంతో ఒకే ఓవర్లో శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మెయప్పన్ హ్యాట్రిక్ తీసిన సంతోషంలో సంబరాలు చేసుకున్నాడు. 15 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరు: 117-5 14 ఓవర్లు ముగిసే సరికి లంక స్కోరెంతంటే యూఏఈ జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్‌లో శ్రీలంక 14 ఓవర్లు ముగిసే సరికి 114/2 రెండు వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. పాథుమ్ నిసాంక, భనుక రాజపక్స క్రీజులో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక 12వ ఓవర్ మొదటి బంతికే శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. అఫ్జల్ ఖాన్ బౌలింగ్‌లో ధనుంజయ (33పరుగులు) రనౌట్‌గా వెనుదిరిగాడు. 10 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 84/1 10 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ కోల్పోయి 84 పరుగులు చేసింది. క్రీజులో నిస్సాంక(38), ధనుంజయ డి సిల్వా(27) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక 42 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన కుశాల్ మెండిస్.. లక్రా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 5 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 57/1 2 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 19/0 2 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్ మెండిస్(13), నిస్సాంక(5) పరుగులతో ఉన్నారు. టీ20 ప్రపంచకప్-2022 క్వాలిఫియర్స్(గ్రూప్-ఎ)లో యూఏఈ, శ్రీలంక జట్లు చావోరేవో తేల్చుకోవడానికి శ్రీలంక సిద్దమయ్యాయి. గీలాంగ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌కు శ్రీలంక ఆటగాడు గుణతిలక గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో అసలంక తుది జట్టులోకి వచ్చాడు. కాగా ఇరు జట్లు కూడా తమ తొలి మ్యాచ్‌లో ఓటమి చెందాయి. ఈ క్రమంలో సూపర్-12 అర్హత సాధించాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. తుది జట్లు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్సే, చరిత్ అసలంక, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ యూఏఈ: చిరాగ్ సూరి, ముహమ్మద్ వసీం, కాషిఫ్ దౌద్, వృత్త్యా అరవింద్(వికెట్ కీపర్), ఆర్యన్ లక్రా, బాసిల్ హమీద్, చుండంగపోయిల్ రిజ్వాన్(కెప్టెన్), అయాన్ అఫ్జల్ ఖాన్, కార్తీక్ మెయ్యప్పన్, జునైద్ సిద్దిక్, జహూర్ ఖాన్ చదవండి: T20 WC NED Vs NAM: ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్ విజయం.. సూపర్-12కు అర్హత! -
మధుశంక స్థానంలో శ్రీలంక యువ పేసర్
టీ20 ప్రపంచకప్-2022కు మెకాలి గాయం కారణంగా శ్రీలంక యువ పేసర్ దిల్షాన్ మధుశంక దూరమైన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో స్టాండ్‌బై జాబితాలో ఉన్న బినురా ఫెర్నాండోను క్రికెట్ శ్రీలంక భర్తీ చేసింది. కాగా బినురా ఫెర్నాండోను భర్తీని టీ20 ప్రపంచకప్-2022 టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. కాగా శ్రీలంక ప్రస్తుతం క్వాలిఫియర్స్ రౌండ్లో తలపడుతోంది. తొలి రౌండ్(గ్రూప్ ‘ఎ’)లో భాగంగా ఆదివారం నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘోరపరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 55 పరుగుల తేడాతో ఓటమి చెందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రయ్‌లింక్ (28 బంతుల్లో 44; 4 ఫోర్లు), స్మిత్ (16 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్,షికోంగో, ఫ్రైలింక్, వైస్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: T20 World Cup 2022: కుశాల్ మెండిస్ సంచలన క్యాచ్.. ఒంటి చేత్తో డైవ్ చేస్తూ.. -
కుశాల్ మెండిస్ సంచలన క్యాచ్.. ఒంటి చేత్తో డైవ్ చేస్తూ
టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. నమీబియా ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో కరుణరత్నే వేసిన ఓ ఆఫ్ సైడ్ బంతిని బ్యాటర్ జాన్ నికోల్ లోఫ్టీ-ఈటన్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ వైపుకు వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ డైవ్ చేసి ఒంటి చేత్తో అద్భతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో నమీబియా బ్యాటర్ కూడా ఒక్క సారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రీలంకపై 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో స్కోల్ట్జ్,షికోంగో, ఫ్రైలింక్, వైస్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్లలో జాన్ ఫ్రైలింక్(43), జేజే స్మిత్(31) పరుగులతో రాణించారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 World Cup 2022: శ్రీలంకకు భారీ షాక్.. యువ బౌలర్ దూరం -
శ్రీలంకపై అద్భుత విజయం.. అమ్మాయిల సెలబ్రేషన్స్ మామాలుగా లేవుగా
మహిళల ఆసియాకప్-2022ను భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైన్లలో విజయం సాధించిన భారత్.. 7వ ఆసియాకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు.. రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. సెలబ్రేషన్స్ అదుర్స్ ఇక శ్రీలంకపై అద్భుతవిజయం అనంతరరం భారత జట్టు అమ్మాయిలు వినూత్న రీతిలో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మైదానంలోనే పంజాబీ డ్యాన్స్‌లు, కేరింతలతో ఊర్రూతలూగించారు. కలర్ పేపర్స్‌ను ఒకరిపై ఒకరు చల్లుకుని భారత క్రికెటర్లు సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ ఉమెన్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం భారత్ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Post-win vibes, be like 🎉 🙌#TeamIndia | #AsiaCup2022 | #INDvSL pic.twitter.com/LsUG1PxNiO — BCCI Women (@BCCIWomen) October 15, 2022 చదవండి: Women's Asia Cup 2022: ఛాంపియన్ భారత్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..? -
మహిళల ఆసియా కప్ విజేత భారత్ (ఫొటోలు)
-
ఛాంపియన్ భారత్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?
మహిళల ఆసియాకప్-2022 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం షెల్లాట్ జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి 7వ ఆసియాకప్ టైటిల్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక ఆసియాకప్ ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టుకు ఫ్రైజ్‌మనీ ఎంత లభించింది?.. ఆసియాకప్ టాప్ రన్ స్కోరర్ ఎవరు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. విజేతకు ఎంతంటే? ఆసియాకప్ విజేతగా నిలిచిన భారత్‌కు ఫ్రైజ్‌మనీ రూపంలో ఇరవై వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 16లక్షల నాలభై ఎనిమిది వేల రూపాయలు) లభించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను టోర్నీ నిర్వహకులు భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు అందజేశారు. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన శ్రీలంకకు 12,500 డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం సుమారు పది లక్షల ముఫ్పై వేలు)ఫ్రైజ్‌మనీ దక్కింది. ఆసియాకప్-2022లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు వీరే జెమిమా రోడ్రిగ్స్(భారత్)- 8 మ్యాచ్‌ల్లో 217 పరుగులు హర్షిత మాధవి(శ్రీలంక)- 8 మ్యాచ్‌ల్లో 202 పరుగులు షఫాలీ వర్మ(భారత్)- 6 మ్యాచ్‌ల్లో-166 పరుగులు సిద్రా అమీన్(పాకిస్తాన్)- 7 మ్యాచ్‌ల్లో 158 పరుగులు నిదా దార్(పాకిస్తాన్) - 7 మ్యాచ్‌ల్లో 145 పరుగులు ఆసియాకప్ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు దీప్తి శర్మ(భారత్)- 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు ఇనోక రణావీరా(శ్రీలంక)- 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు రుమనా ఆహ్మద్(బంగ్లాదేశ్)-5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు ఓమైమా సోహెల్(పాకిస్తాన్)-7 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు ఇక ఈ మెగా ఈవెంట్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డు దక్కింది. దీప్తికి అవార్డు రూపంలో 2000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు లక్షా ఆరవై నాలుగు వేల రూపాయలు) లభించింది. చదవండి: T20 World Cup 2022:టీమిండియాతో మ్యాచ్.. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు దూరం -
ఫైనల్లో శ్రీలంక చిత్తు.. ఆసియాకప్ విజేతగా భారత్
మహిళల ఆసియాకప్-2022 విజేతగా భారత్ నిలిచింది. షెల్లాట్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా 7వ ఆసియాకప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన(51) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను పూర్తి చేసింది. ఇక ఈ కీలక పోరులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భారత బౌలర్లు చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో భారత పేసర్ రేణుకా సింగ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 3⃣ Overs 1⃣ Maiden 5⃣ Runs 3⃣ Wickets Renuka Thakur put on a stunning show with the ball & bagged the Player of the Match award as #TeamIndia beat Sri Lanka in the #AsiaCup2022 Final. 👏 👏 #INDvSL Scorecard ▶️ https://t.co/r5q0NTVLQC pic.twitter.com/APPBolypjE — BCCI Women (@BCCIWomen) October 15, 2022 రేణుక తన నాలుగు ఓవర్ల కోటాలో మూడు వికెట్లు పడగొట్టి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆమెతో పాటు స్పిన్నర్లు రాజేశ్వరీ గైక్వాడ్, స్నేహ్ రాణా చెరో రెండు వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇక శ్రీలంక బ్యాటర్లలో రణ్సింఘే(13),రణవీర(18) మినహా మిగితా అందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. చదవండి: Rohit Sharma Press Meet: వరల్డ్‌కప్ కంటే అతడి కెరీర్ ముఖ్యం! మాకు ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరంటే.. -
33 పరుగులకే ఆలౌట్.. మలేషియాపై శ్రీలంక ఘన విజయం
మహిళల ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంక వరుసగా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. లంక బ్యాటర్లలో రణసింగే(23), ఆతపత్తు(21) పరుగులతో రాణించారు. మలేషియా బౌలర్లలో ఆజ్మీ, హమీజ్ హాసం రెండు వికెట్లు సాధించారు. ఇక 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా.. లంక స్పిన్నర్లు చెలరేగడంతో మలేషియా కేవలం 33 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో మల్షా షెహానీ నాలుగు వికెట్లతో మలేషియాను దెబ్బతీయగా.. కుమారి, రణవీరా చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక మలేషియా బ్యాటర్లలో హంటర్ 18 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. చదవండి: John Campbell: వెస్టిండీస్ క్రికెటర్‌పై నాలుగేళ్ల నిషేధం.. -
Asia Cup Final: స్టార్లు అవసరం లేదని శ్రీలంక నిరూపించింది..!
ఆసియా కప్-2022లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి భారత్, పాక్ లాంటి ప్రపంచ స్థాయి జట్లకు షాకిచ్చి ఏకంగా టైటిల్‌ను ఎగురేసుకుపోయిన శ్రీలంక జట్టుపై వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక.. పాక్‌ను మట్టికరిపించిన తీరు థ్రిల్లింగ్‌గా అనిపించిందని ట్వీటాడు. క్రికెట్ లాంటి టీమ్ గేమ్‌లో జట్టు గెలవాలంటే సెలబ్రిటీలు, సూపర్ స్టార్లు అవసరం లేదని లంకేయులు మరోసారి నిరూపించారని అన్నాడు. టీమ్ వర్క్ ఉంటే ఎంత చిన్న జట్టైనా అద్భుతాలు చేయగలదని మరోసారి రుజువైందని తెలిపాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. I am thrilled at Sri Lanka’s victory this evening. Not because I wanted Pakistan to lose. But because Sri Lanka’s victory reminds us that Team Sports are not about celebrities & superstars but about—yes—Teamwork! #AsiaCup2022Final — anand mahindra (@anandmahindra) September 11, 2022 కాగా, దుబాయ్ వేదికగా నిన్న (సెప్టెంబర్ 11) జరిగిన ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక.. 23 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించి ఆరో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. 58 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకను భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు).. హసరంగ (21 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్) సాయంతో ఆదుకున్నాడు. ఛేదనలో పాక్ ఓ సమయంలో విజయం దిశగా సాగినప్పటికీ.. లంక బౌలర్లు ప్రమోద్ మధుశన్ (4/34), హసరంగ (3/27), చమిక కరుణరత్నే (2/33) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 147 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. -
బంగ్లాదేశ్ కొంపముంచిన నో బాల్.. ఒక్కడికే మూడు ఛాన్స్‌లు!
ఆసియాకప్-2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా గ్రూప్ 'బి' నుంచి సూపర్-4లో అడుగు పెట్టిన రెండో జట్టుగా శ్రీలంక నిలిచింది . కాగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో శ్రీలంక ఆటగాడు అసిత ఫెర్నాండో మూడు బంతుల్లో 10 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు సాధించింది. బంగ్లా బ్యాటర్లలో అఫీఫ్ హొస్సేన్ 39, మెహదీ హసన్- 38 పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో హాసరంగా, కరుణరత్నే చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మధుశంక, తీక్షణ, అసిత ఫెర్నాండో తలా ఒక్కో వికెట్ తీశారు. ఇక 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మరో నాలుగు బంతులు మిగిలూండగానే చేధించింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ కుశాల్ మెండీస్(60) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు కెప్టెన్ దసున్ షనక కూడా 45 పరుగులు చేసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక అఖరిలో ఆల్‌రౌండర్ కరుణరత్నే(16), అసిత ఫెర్నాండో(10) పరుగులు సాధించి తమ వంతు పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తొలి మ్యాచ్ ఆడిన ఎబాడోత్ హొస్సేన్ మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్ రెండు, ముస్తాఫిజుర్, మెహెదీ హసన్ చెరో వికెట్ సాధించారు. బంగ్లాదేశ్‌కు ఓటమికి కారణాలు ఇవే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ప్రత్యర్ధి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే బ్యాటింగ్‌లో అదరగొట్టిన షకీబ్ సేన.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. కాగా అరంగేట్ర మ్యాచ్ ఆడుతోన్న బంగ్లా బౌలర్ ఎబాడోత్ హొస్సేన్ తన తొలి రెండు ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టినప్పటకీ . అఖరి రెండు ఓవర్లలో మాత్రం భారీగా పరుగులు సమర్పించకున్నాడు. హొస్సేన్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 51 పరుగులు ఇచ్చాడు. మరోవైపు సీనియర్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కూడా విఫలమయ్యాడు. కెప్టెన్ షకీబ్ కూడా పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఫీల్డింగ్ విషయానికి వస్తే.. శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన టాస్కిన్ ఆహ్మద్ బౌలింగ్‌లో కుశాల్ మెండిస్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను వికెట్ కీపర్ రహీమ్ జార విడిచాడు. దీంతో 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మెండిస్ బతికిపోయాడు. కొంపముంచిన నో బాల్ ఈ మ్యాచ్‌లో బంగ్లా బౌలర్లు ఏకంగా నాలుగు నో బాల్స్ వేశారు. తొలుత శ్రీలంక ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన మెహదీ హసన్ బౌలింగ్‌లో మెండీస్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో వికెట్ సెలబ్రేషన్స్‌లో బంగ్లా ఆటగాళ్లు మునిగి తేలిపోయారు. అయితే ఆ బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో బంగ్లా ఆటగాళ్ల ఆనందం కొద్ది క్షణాల్లోనే ఆవిరైపోయింది. మళ్లీ 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మెండిస్ బతికిపోయాడు. అదే విధంగా 8వ ఓవర్ వేసిన ఎబాడోత్ హొస్సేన్ బౌలింగ్‌లో మెండిస్ లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్లడంతో వికెట్ కీపర్ క్యాచ్‌కు అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ దాన్ని వైడ్‌గా ప్రకటించాడు. కాగా బంగ్లా జట్టుకు ఇంకా రివ్యూలు మిగిలిన్నప్పటికీ షకీబ్ మెగ్గు చూపలేదు. అయితే రిప్లేలో బంతి క్లియర్‌గా మెండిస్ గ్లౌవ్కు తాకి రహీమ్ చేతికి వెళ్లింది. దీంతో ముచ్చటగా మూడో సారి కూడా ఔటయ్యే ప్రమాదం నుంచి మెండిస్ తప్పించుకున్నాడు. కాగా శ్రీలంక విన్నింగ్స్ రన్ కూడా నో బాల్ రూపంలో రావడం గమనార్హం. Srilanka players doing Naagin dance after winning the match against Bangladesh 😂😂#SLvsBAN pic.twitter.com/lPcvbVzVp6 — ClockTower🏳️🌈 (@Clocktower45) September 1, 2022 Karma will always hit Bangladesh for their past bad behaviour against their opponent teams#AsiaCupT20 #SLvsBAN #INDvsPAK pic.twitter.com/JZbVowVmRp — 🇮🇳🤝🇮🇱🤝🇷🇺 (@Praneet98344061) September 1, 2022 చదవండి: టీమిండియాకు షాక్.. న్యూజిలాండ్ సిరీస్ నుంచి స్టార్ పేసర్ ఔట్ -
'ఇదేం చెత్త అంపైరింగ్.. కళ్లు కనిపించడం లేదా'
ఆసియాకప్-2022లో భాగంగా శ్రీలంక- ఆఫ్గానిస్తాన్ తొలి మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. శ్రీలంక ఇన్నింగ్స్ 2 ఓవర్ వేసిన నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో బంతి పాతుమ్ నిస్సంక బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ వికెట్ కీపర్ చేతికి వెళ్లింది. వెంటనే బౌలర్‌తో పాటు వికెట్ కీపర్ కూడా క్యాచ్‌కు అప్పీల్ చేశాడు. అయితే ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి వెంటనే ఔట్ అని వేలు పైకిత్తాడు. ఈ క్రమంలో నిస్సంక నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న గుణతిలకతో చర్చించి రివ్యూకు వెళ్లాడు. అయితే రిప్లేలో బ్యాట్‌ను బంతి దాటే సమయంలో ఎటువంటి స్పైక్ కనిపించలేదు. అయినప్పటికీ థర్డ్ అంపైర్ మాత్రం బంతి బ్యాట్‌కు తాకినట్లు కన్పించింది అంటూ ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంతో బ్యాటర్‌తో పాటు డగౌట్లో ఉన్న శ్రీలంక జట్టు మేనేజ్మెంట్ కూడా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థర్డ్ అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయంపై శ్రీలంక అభిమానులు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఇదేం చెత్త అంపైరింగ్‌రా.. కళ్లు కనిపించడం లేదా" అంటూ కామెంట్ చేశాడు. Can't even ask 'Out or not out' 😵💫 Pathum Nissanka at the receiving end of a shocker in #AsiaCup2022 #SLvAFG #AsiaCup pic.twitter.com/e47XDC6Kwi — CricXtasy (@CricXtasy) August 27, 2022 Sri lanka dedicating this scorecard to their father india (Source: Daniel Alexander)#AFGvSL #AsiaCup2022 pic.twitter.com/dDpyDxIZ8E — YouAreWrong (@huihui_____) August 27, 2022 #AFGvSL #AsiaCup2022 Third Umpire taking decision on Pathum Nissanka's Dismissal: pic.twitter.com/HSZ2AY7ghD — Vichitra.Duniya 🌏 (@vichitra_duniya) August 27, 2022 -
ఆసీస్‌తో రెండో టెస్టు.. నిలకడగా ఆడుతోన్న శ్రీలంక..!
ఆస్ట్రేలియాతో గాలెలో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 184 పరుగులు చేసింది. కెప్టెన్ కరుణరత్నే (86; 10 ఫోర్లు), కుశాల్ మెండిస్ (84 బ్యాటింగ్; 9 ఫోర్లు) రాణించారు. అంతకు ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్మిత్(145), మార్నస్ లబుషేన్(104) పరుగులతో రాణించారు. ఇక అరంగేట్రం మ్యాచ్‌లోనే శ్రీలంక యువ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అదరగొట్టాడు. ఏకంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. చదవండి: ENG vs IND: టీ20ల్లో రోహిత్ శర్మ అరుదైన ఫీట్.. తొలి భారత ఆటగాడిగా..! -
18 నెలల తర్వాత సెంచరీ చేసిన స్మిత్.. వీడియో వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవన్ స్మిత్ ఎట్టకేలకు సెంచరీ సాధించాడు. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో అతడి 18 నెలల నిరీక్షణకు తెరపడింది. ఈ మ్యాచ్‌లో 193 బంతుల్లో అతడు శతకాన్ని సాధించాడు. ఇక తన టెస్టు కెరీర్లో స్మిత్‌కు ఇది 28వ సెంచరీ. 2021లో భారత్‌తో జరిగిన సిడ్నీ టెస్టులో అంతర్జాతీయ క్రికెట్లో స్మిత్ తన చివరి సెంచరీ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(109), కారీ(16) పరుగులతో ఉన్నారు. కాగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. ఓపెనర్లు డేవిడ్ వార్నర్( 5), ఉస్మాన్ ఖవాజా(37) రాణించక పోవడంతో 70 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ కలిసి మూడో వికెట్‌కి 134 పరుగుల భాగస్వామ్యంతో జట్టును అదుకున్నారు. ఈ క్రమంలో విదేశీ గడ్డపై తొలి సెంచరీను లబుషేన్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 104 పరుగులు సాధించిన లబుషేన్ ప్రబాత్ జయసూర్య బౌలింగ్‌లో ఔటయ్యాడు. శ్రీలంక బౌలర్లలో జయసూర్య మూడు వికెట్లు, రజితా, మెండీస్ తలా వికెట్ సాధించారు. చదవండి: IND vs ZIM: ఆరేళ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు టీమిండియా..! This is Steve Smith 28'th century moment pic.twitter.com/gxJXKAV9a5 — Hammered Truth 🇦🇺🦘 (@hammered_truth7) July 8, 2022 -
తొలి టెస్టులో శ్రీలంక చిత్తు.. ఆస్ట్రేలియా ఘన విజయం
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 5 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోకుండా చేధించింది. అంతకు ముందు శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ స్పిన్నర్లు నాథన్ లయాన్, హెడ్ తలా నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంకను దెబ్బ తీశారు. శ్రీలంక బ్యాటర్లలో కరుణ రత్నే 23 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక 313/8 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను మొదలపెట్టిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా109 పరుగుల అధిక్యం సాధించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో గ్రీన్(77),ఖావాజా(71) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో ఆర్ మెండీస్ నాలుగు వికెట్లు, ఫెర్నాండో, వాండర్సే చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా అంతకు ముందు లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది. ఇక ఇరు జట్లు మధ్య అఖరి టెస్టు జూలై8న గాలే వేదికగా ప్రారంభం కానుంది. చదవండి: SL Vs AUS: పాట్ కమిన్స్ భారీ సిక్స్.. రోడ్డుపై పడ్డ బంతి..వీడియో వైరల్..! -
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్‌కు కొవిడ్ పాజిటివ్..!
గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టులో శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కొవిడ్ బారిన పడడంతో టెస్టు మధ్యలో తప్పుకున్నాడు. అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఇక మాథ్యూస్ స్థానంలో ఓషద ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ 71 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఏంజెలో మాథ్యూస్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణైంది. "గురువారం నిర్వహించిన ర్యాపిడ్ యాంటీ-జెన్ పరీక్షలో అతడికి పాజిటివ్‌గా తేలింది. మిగిలిన ఆటగాళ్లకు నెగిటివ్‌గా తేలింది. మాథ్యూస్ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు" అని శ్రీలంక క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. ఇక ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 321 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో గ్రీన్(77),ఖావాజా(71) పరుగులతో రాణించారు. శ్రీలంక బౌలర్లలో ఆర్ మెండీస్ నాలుగు వికెట్లు, ఫెర్నాండో, వాండర్సే చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకు 109 పరుగుల అధిక్యం లభించింది. కాగా అంతకు ముందు లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది. చదవండి: SL vs AUS: పాట్ కమిన్స్ భారీ సిక్స్.. రోడ్డుపై పడ్డ బంతి..వీడియో వైరల్..! 🔴 Angelo Mathews tested positive for Covid-19. He was found to be positive during a Rapid Anti-Gen Test Conducted on the player. The test was done, as the player was feeling unwell. He has been isolated from the rest of the team members and is following covid-19 protocols. pic.twitter.com/6fUBT7D04z — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 1, 2022 -
శ్రీలంకతో తొలి టెస్టు.. ఆస్ట్రేలియా స్కోర్: 313/8
గాలేలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ (77), ఉస్మాన్ ఖాజా (71) అర్ధసెంచరీలు సాధించగా, అలెక్స్ క్యారీ (45) రాణించాడు. రమేశ్ మెండిస్ 4 వికెట్లు పడగొట్టగా, ఆస్ట్రేలియా ప్రస్తుతం 101 పరుగులు ముందంజలో ఉంది. చదవండి: SL-W vs IND-W: శ్రీలంకతో భారత్ తొలి పోరు.. -
శ్రీలంకపై ప్రకృతి ప్రకోపం.. వర్ష బీభత్సం ధాటికి అతలాకుతలమైన క్రికెట్ స్టేడియం
ఆర్ధిక మాంద్యంలో కూరుకుపోయి కొట్టిమిట్టాడుతున్న ద్వీప దేశం శ్రీలంకపై ప్రకృతి సైతం పగబట్టింది. ఇవాళ (జూన్ 30) ఉదయం కురిసిన భారీ వర్షం దెబ్బకు లంకలోని చాలా ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్ష బీభత్సం ధాటికి కొన్ని ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. వర్ష ప్రభావం శ్రీలంక-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌పై కూడా చూపింది. There's more cleaning up to do off the field than on it this morning... if anyone can get this ground ready for play it's the Galle team #SLvAUSpic.twitter.com/iklKta7xfM— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) June 30, 2022 వర్షం ధాటికి ఈ మ్యాచ్‌కు వేదిక అయిన గాలే స్టేడియం అతలాకుతలమైంది. తొలి టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభానికి రెండు గంటల ముందు ప్రారంభమైన గాలివాన దెబ్బకు ఓ స్టాండ్ రూఫ్ కూలిపోవడంతో పాటు స్టేడియం మొత్తం చిత్తడిచిత్తడిగా మారిపోయింది. ఫలితంగా రెండో రోజు ఆట దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈదురుగాలుల ధాటికి రూఫ్ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉంటే, వర్షం పూర్తిగా ఆగిపోయాక లంచ్ తర్వాత ఆట ప్రారంభమైంది. 98/3 ఓవర్‌నైట్ స్కోర్ వద్ద ప్రారంభమైన రెండు రోజు ఆటలో ఆసీస్ ఆధిపత్యం చలాయించింది. రెండు రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసి 101 పరుగుల లీడ్‌లో కొనసాగుతుంది. ఓవర్‌నైట్ బ్యాటర్ ఉస్మాన్ ఖ్వాజా (71), కెమరూన్ గ్రీన్ (77) అర్ధసెంచరీతో రాణించారు. అలెక్స్ క్యారీ (45) పర్వాలేదనిపించాడు. కమిన్స్ (26), లయన్ (8) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌటైంది. నాథన్ లయన్ 5 వికెట్లతో చెలరేగాడు. చదవండి: IND Vs ENG: ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా సై! ప్రాక్టీసు వీడియో! -
ఐపీఎల్ అయితే పట్టించుకుంటారా.. బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్..!
భారత మహిళల జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి టీ20 దంబుల్లా వేదికగా నేడు(జూన్ 23)న ప్రారంభమైంది. అయితే భారత్-శ్రీలంక మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు ఒక్క బ్రాడ్ కాస్టర్ కూడా ముందుకు రాలేదు. ఈ విషయంపై బీసీసీఐ సైతం పత్యేక చొరవ తీసుకోకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్ అయితే పట్టించుకుంటారా.. ఇదేనా మహిళల క్రికెట్ అభివృధ్ది అంటూ బీసీసీఐపై నెటిజన్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల ఐపీఎల్ మీడియా హక్కులు రూ. 48,390 కోట్ల రికార్డు ధరకు అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే.ఇక మ్యాచ్‌ల ప్రసారంపై బీసీసీఐ ఏ మాత్రం పట్టించుకోకపోయినా.. శ్రీలంక క్రికెట్ మాత్రం తమ అభిమానులు వీక్షించేందుకు పలు వేదికలను ఏర్పాటు చేసింది. "శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ మ్యాచ్‌లను శ్రీలంక క్రికెట్ యూట్యూబ్ ఛానల్, డైలాగ్ టెలివిజన్, ఛానల్ వన్ ఎన్ఈ లో వీక్షించొచ్చు" అని శ్రీలంక క్రికెట్ ట్విటర్లో పేర్కొంది. India Women Tour of Sri Lanka 2022, 3 T20Is & 3 ODIs, from 23rd June to 7th July. 👀 Catch the action LIVE on Sri Lanka Cricket YOUTUBE and ThePapare platforms ⬇️#SLvIND #SLWomens pic.twitter.com/3uP4chbFFR — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 22, 2022 ముందుకు వచ్చిన ఫ్యాన్‌కోడ్ ఇక చివరగా భారత్- శ్రీలంక మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ఫ్యాన్‌కోడ్ ముందుకు వచ్చింది. ఫ్రీగా తమ వెబ్, యాప్ వేదికల్లో ఇండియా వర్సెస్ శ్రీలంక వుమెన్స్ టూర్ ప్రసారం చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా ఫ్యాన్‌కోడ్ వెల్లడించింది. The wait is finally over! And we've got something better in store!🤩 How will the Women in Blue fare against the Sri Lankan lionesses on their home soil?🤔 Watch all the action FOR FREE from @BCCIWomen tour of @OfficialSLC LIVE on #FanCode👉https://t.co/324zYTfups . .#SLvIND pic.twitter.com/iUyaenWM3f — FanCode (@FanCode) June 22, 2022 -
ఇదేందయ్యా ఇది.. క్యాచ్ పట్టడానికి ప్రయత్నించిన అంపైర్.. వీడియో వైరల్!
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఫీల్డర్‌కు బదులు అంపైర్ క్యాచ్ పట్టడానికి ప్రయత్నించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఆలెక్స్ క్యారీ షార్ట్ పిచ్ బాల్‌ను స్వ్కేర్ లెగ్ దిశగా ఆడాడు. కాగా స్క్వేర్-లెగ్‌లో అంపైర్‌గా ఉన్న కుమార్ ధర్మసేన క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించాడు. అయితే తను ఫీల్డర్ కాదని అంపైర్ అని గ్రహించి అఖరి క్షణంలో ధర్మసేన తన చేతులను వెనక్కి తీసుకున్నాడు. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు అంతా ఒక్క సారిగా నవ్వుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అంపైర్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ధర్మసేన ఇప్పుడు అంపైర్‌గా కాదు శ్రీలంక ఆటగాడిగా ఫీలవుతున్నారని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో శ్రీలంక 2-1తో ఆదిక్యంలో కొనసాగుతోంది. ఇరు జట్లు మద్య నాలుగో వన్డే కొలంబో వేదికగా మంగళవారం జరగనుంది. చదవండి: IND vs ENG 5th Test: రవిచంద్రన్ అశ్విన్ కు కరోనా పాజిటివ్.. తగ్గాకే ఇంగ్లండ్‌కు..! Kumar Dharmasena going for a catch in SL vs Aus Odi match pic.twitter.com/DYyxn6kEsy — Sportsfan Cricket (@sportsfan_cric) June 20, 2022 -
ఆస్ట్రేలియాపై శ్రీలంక ఘన విజయం.. 9 ఏళ్ల తర్వాత..!
కొలంబో: ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 2013 తర్వాత ఆసీస్‌పై శ్రీలంక వరుసగా రెండు వన్డేల్లో నెగ్గడం ఇదే ప్రథమం. తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్లకు 291 పరుగులు చేసింది. ఫించ్ (62; 4 ఫోర్లు, 1 సిక్స్), హెడ్ (70 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం శ్రీలంక 48.3 ఓవర్లలో 4 వికెట్లకు 292 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ నిసాంక (137; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ చేయగా... కుశాల్ మెండిస్ (87 రిటైర్డ్ హర్ట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో లంక విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చదవండి: అతనొక్కడే.. 11 మంది కెప్టెన్లు.. భారత వెటరన్ ఖాతాలో అరుదైన రికార్డు -
శ్రీలంకతో రెండో వన్డే.. ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
శ్రీలంకతో రెండో వన్డే ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్లు మార్కస్ స్టోయినిస్, అష్టన్ అగర్ గాయం కారణంగా వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నారు. పల్లెకెల్లె వేదికగా జరిగిన తొలి వన్డేలో వీరిద్దరూ గాయపడ్డారు. ఇప్పటికే మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, సీన్ అబాట్ వంటి ఆటగాళ్లు గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. తాజాగా ఈ జాబితాలో స్టోయినిస్,అగర్ కూడా చేరారు. ఇక వీరిద్దరి స్థానంలో ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమాన్ జట్టులోకి రానున్నారు. కాగా తొలి వన్డేలో స్టోయినిస్ 44 పరుగులతో రాణించగా.. అగర్ రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలో శ్రీలంకపై ఆసీస్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఇరు జట్లు మధ్య రెండో వన్డే పల్లెకెల్లె వేదికగా గురువారం జరగనుంది. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్ దూరం..! -
శ్రీలంకతో తొలి వన్డే.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
శ్రీలంకతో జరగనున్న తొలి వన్డేకు ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, మిచెల్ మార్ష్ గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యారు. ఇక టీ20 సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ పాట్ కమ్మిన్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక పల్లెకెలె వేదికగా జూన్14న ఇరు జట్లు మధ్య తొలి వన్డే జరగనుంది. కాగా శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా పల్లెకెలె వేదికగా జరిగిన అఖరి టీ20లో ఆసీస్ ఆనూహ్యంగా ఓటమి చెందింది. అఖరి మూడు ఓవర్లలో 59 పరుగులను ఛేజ్ చేసి శ్రీలంక సంచలన విజయం నమోదు చేసింది. శ్రీలంకతో తొలి వన్డేకి ఆస్ట్రేలియా తుది జట్టు(SL Vs AUS: Australia Playing XI For 1st Odi): ఆరోన్ ఫించ్ (సి), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, అలెక్స్ కారీ, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, జో రిచర్డ్సన్, జోష్ హేజిల్‌వుడ్. చదవండి: IND vs SA: జట్టులో అతడు తప్ప వికెట్లు తీసే బౌలర్లు లేరు: సునీల్ గావస్కర్ -
శ్రీలంకతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్..!
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచిల్ మార్ష్ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొలంబోలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సమయంలో మార్ష్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దీంతో పల్లెకెలె వేదికగా జరిగిన మూడో టీ20కి మార్ష్ దూరమయ్యాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే పల్లెకెలె వేదికగా జాన్ 14న జరగనుంది. మరోవైపు శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా వన్డే జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, కెమెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ , డేవిడ్ వార్నర్ చదవండి: SL vs AUS: టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక.. తొలి జట్టుగా..! -
టీ20ల్లో చరిత్ర సృష్టించిన శ్రీలంక.. తొలి జట్టుగా..!
పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన అఖరి టీ20లో శ్రీలంక సంచలన విజయం సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక క్రమంగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది.17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6. విజయానికి చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో తమ జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. వరుసగా 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు రాబట్టిన లంక 4 వికెట్ల తేడాతో గెలిపొందింది. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అఖరి మూడు ఓవర్లో అత్యధిక పరుగులు ఛేజ్ చేసిన తొలి జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (39; 6 ఫోర్లు), స్టొయినిస్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (37 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. చదవండి: IND vs SA: 'అతడొక యంగ్ కెప్టెన్.. రానున్న మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణిస్తాడు' Highlights of last 3 overs#Shanaka#SLvAUS#AUSvsSL https://t.co/YlidfL0Qyp pic.twitter.com/2hPuNfNoTE — Ankit Chaudhary (@Ankit_Sihag_) June 12, 2022 -
3 ఓవర్లలో 59 పరుగులు.. శ్రీలంక సంచలన విజయం..!
పల్లెకెలె: ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో చివరి టి20...177 పరుగుల లక్ష్య ఛేదనలో 17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6... చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావాలి. కానీ కెప్టెన్ దసున్ షనక (25 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో అసాధ్యం అనిపించినదాన్ని ఒక్కసారిగా సుసాధ్యం చేసేశాడు. వరుసగా 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు రాబట్టిన లంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 19.5 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది. వార్నర్ (39; 6 ఫోర్లు), స్టొయినిస్ (38; 3 ఫోర్లు, 1 సిక్స్), స్మిత్ (37 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా 2–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. చదవండి: IND vs SA T20 Series: ఒడిశా ఎలా ఉంది?.. దక్షిణాఫ్రికా ఆటగాడి ఎపిక్ రిప్లై Hero of the match! 💪 What a knock by Dasun Shanaka 💥#SLvAUS #CheerForLions pic.twitter.com/n8ug04rQvh — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) June 11, 2022 -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన శ్రీలంక
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యలతో కూడిన తమ జట్టును శ్రీలంక శుక్రవారం ప్రకటించింది. గాయం కారణంగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా శ్రీలంక అండర్-19 జట్టు కెప్టెన్ దునిత్ వెల్లలగే సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రీలంక తలపడనుంది. ఇక పల్లెకెలె వేదికగా జూన్14న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అఖరి మ్యాచ్ శనివారం పల్లెకెలె వేదికగా జరగనుంది. శ్రీలంక జట్టు: దసున్ షనక, పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దినేష్ చండిమాల్, భానుక రాజపక్స, నిరోషన్ డిక్వెల్లా, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, అసిత, రమేశ్ తుషార మ, అసిత, రమేశ్ తుషార మ జయవిక్రమ, జెఫ్రీ వాండర్సే, లహిరు మధుశంక, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషన్ చదవండి: David Miller Birthday: 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం -
దురదృష్టమంటే మెండిస్‌దే.. బంతిని కొట్టబోయి పొరపాటున..!
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. శ్రీలంక ఇన్నింగ్స్ 14 ఓవర్ వేసిన రిచర్డ్సన్ బౌలింగ్‌లో షార్ట్ పిచ్ బంతిని ఫుల్ షాట్ ఆడటానికి మెండీస్ ప్రయత్నించాడు. అయితే ఫుల్ షాట్ ఆడే క్రమంలో నియంత్రణ కోల్పోయిన మెండిస్ తన బ్యాట్‌తో బెయిల్స్‌ని పడగొట్టాడు. దీని ఫలితంగా మెండిస్ హిట్ వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటి వరకు టీ20 క్రికెట్లో హిట్ వికెట్‌గా ఔటైన 20 ఆటగాడిగా మెండిస్ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... శ్రీలంకపై మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో ఆసీస్ కైవసం చేసుకుంది. శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టీ20: టాస్- ఆస్ట్రేలియా- తొలుత బౌలింగ్ శ్రీలంక స్కోరు: 124/9 (20) ఆస్ట్రేలియా స్కోరు: 126/7 (17.5) చదవండి: SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా! మా ఓటమికి కారణం అదే! Kusal Mendis Hit Wicket 36(36*) pic.twitter.com/ASwAial22l — Six Cricket (@Six6Cricket) June 8, 2022 -
శ్రీలంకతో ఆస్ట్రేలియా తొలి టి20.. మ్యాక్స్‌వెల్ మాయ చేస్తాడా..?
ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు కొలంబోలో నేడు జరిగే తొలి టి20 మ్యాచ్‌లో శ్రీలంక జట్టుతో తలపడుతుంది. వార్నర్, మ్యాక్స్‌వెల్, మిచెల్ మార్ష్, స్టార్క్, స్మిత్, లబుషేన్, హాజల్‌వుడ్‌లతో ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది. ఆసీస్–శ్రీలంక మధ్య జరిగే మూడు టి20లు, ఐదు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లకు టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తామని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. శ్రీలంకతో తొలి టీ20కి ఆస్ట్రేలియా తుది జట్టు(SL Vs AUS: Australia Playing XI For 1st T20I) ఆరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), ఆష్టన్ అగర్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, జోష్ హాజిల్‌వుడ్. శ్రీలంక జట్టు దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, కుసల్ మెండిస్, భానుక రాజపక్స(వికెట్ కీపర్), దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, రమేష్ మెండిస్, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, లహిరు మధుశంక, ప్రవేణ్ శంకన్, ప్రవేణ్ శంకన్, కసున్ రజిత, జయవిక్రమ, నువానీడు ఫెర్నాండో, మతీషా పతిరన, నువాన్ తుషార చదవండి: 'హార్ధిక్ పాండ్యా ఇద్దరి ఆటగాళ్లతో సమానం.. అయితే వన్డేల్లో మాత్రం ఆడకూడదు' -
తొలి బంతికే వికెట్ తీసిన జూనియర్ మలింగ.. వీడియో వైరల్
ఐపీఎల్లో శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరనా చెన్నై సూపర్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్-2022లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరనా డెబ్యూ చేశాడు. అయితే తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జూనియర్ మలింగగా పెరొందిన పతిరనా ఈ మ్యాచ్‌లో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా తన వేసిన తొలి బంతికే వికెట్ సాధించడం విశేషం. శుభ్‌మాన్ గిల్‌ను పతిరనా ఎల్బీడబ్ల్యూ చేశాడు. అచ్చం శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ లాగే పతిరనా బౌలింగ్ చేస్తున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. సీఎస్కే బ్యాటర్లలో రుత్‌రాజ్ గైక్వాడ్ 53 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు, రషీద్ ఖాన్, జోషప్, సాయి కిషోర్ తలా వికెట్ సాధించారు. ఇక 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. గుజరాత్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా(67) పరుగులతో రాణించాడు. చదవండి: IPL 2022: 'వారిద్దరూ త్వరలోనే భారత జట్టులోకి వస్తారు' A dream debut for Matheesha Pathirana 😍#MatheeshaPathirana #CSKvsGT #IPL2022 pic.twitter.com/D0bZn42fo5 — Ranjeet - Wear Mask😷 (@ranjeetsaini7) May 15, 2022 -
శ్రీలంకతో తొలి టెస్ట్.. బంగ్లాదేశ్‌కు గుడ్ న్యూస్..!
శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు బంగ్లాదేశ్ ఊరట లభించింది. కరోనా బారిన పడిన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కరోనా నుంచి కోలుకున్నాడు. దీంతో మే 15న ఛటోగ్రామ్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు షకీబ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మే9 న అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత షకీబ్ కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడు ఐషోలేషన్‌లో ఉన్నాడు. అయితే అతడికి తాజాగా నిర్వహించిన పరీక్షలలో నెగిటివ్‌గా తేలింది. ఇక షకీబ్ చివర సారిగా 2021లో పాకిస్తాన్‌పై ఆడాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లకు వ్యక్తిగత కారణాలతో షకీబ్ దూరమయ్యాడు. ఇక స్వదేశంలో బంగ్లాదేశ్ శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు ఛటోగ్రామ్ వేదికగా మే 15 నుంచి ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ జట్టు: మోమినుల్ హక్ (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్ ఖాన్, మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ కుమార్ దాస్, యాసిర్ అలీ చౌదరి, తైజుల్ ఇస్లాం, మెహెదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్ చౌద్యుల్, ఎబాడోత్ హుస్సేన్ చౌదుల్, హసన్ సోహన్, రెజౌర్ రెహమాన్ రాజా, షోహిదుల్ ఇస్లాం, షోరిఫుల్ ఇస్లాం చదవండి: Ben Stokes: వైరల్‌గా మారిన ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ చర్య -
'బంగ్లాదేశ్ ఆటగాళ్లకు టెస్టు క్రికెట్ ఆడే ఆలోచన లేదు'
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తమ జాతీయ జట్టుపై విమర్శలు గుప్పించాడు. తమ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ ఆడే ఆలోచన లేదని అతడు తెలిపాడు. కాగా ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్.. ఘోర పరాభావం మూటకట్టుకుంది. రెండు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. ఇక మే 15 నుంచి శ్రీలంకతో స్వదేశంలో బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. టెస్టుల్లో మా జట్టు ఎందుకు ఇలా ఆడుతుందో నాకు ఆర్ధం కావడం లేదు. గత ఐదు టెస్టుల్లో ఇదే పరిస్ధితి కన్పిస్తోంది. సిరీస్ తొలి టెస్టులో జట్టు గట్టి పోటీ ఇస్తుంది. కానీ రెండో టెస్టులో చిత్తుగా ఓడి పోతున్నాం. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో కూడా ఇలాగే జరిగింది. మా జట్టు ఆటగాళ్లు దీశీవాళీ టోర్నీల్లో ఎక్కువగా పాల్గొనరు. అదే విధంగా వారికి టెస్టు క్రికెట్ ఆడే ఆలోచనే లేదు. ఇప్పుడు అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీగా ఉన్నాం. వారిని దేశవాళీ క్రికెట్ ఆడేలా చేయలేము. లేదంటే దేశీయ క్రికెట్‌ను కొన్ని రోజులు వాయిదా వేయాలి" అని ఇండియా టుడే కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: కాన్వేకు పెళ్లి వర్కౌట్ అయినట్లుంది.. మొయిన్ అలీ ఫన్నీ కామెంట్ -
శ్రీలంకకు మరో భారీ షాక్.. ఆసియా కప్ 2022 వేదిక మార్పు...!
ఆసియా కప్ 2022 శ్రీలంక వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 జరగాల్సి ఉంది. అయితే శ్రీలంక ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌ను మరో చోటుకు తరలించాలని ఐసీసీ యోచిస్తోన్నట్లు సమచారం. ఆదివారం(ఏప్రిల్ 17) దుబాయ్‌లో జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) త్రైమాసిక సమావేశంలో" వేదిక మార్పుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆసియా కప్ టీ20 ఫార్మాట్లో జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఇప్పటికే ఈటోర్నీకి అర్హత సాదించగా.. క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ తర్వాత మరో జట్టు చేరుతుంది. ఇక చివరగా ఆసియా టీ20 కప్ 2016లో బంగ్లాదేశ్‌లో జరిగింది. చదవండి: IPL 2022: సూర్యకుమార్ యాదవ్ హెలికాప్టర్ షాట్.. 98 మీటర్ల భారీ సిక్సర్.. వీడియో వైరల్ -
టీమిండియాతో రెండో టెస్టు.. శ్రీలంకకు మరో బిగ్ షాక్!
టీమిండియాతో రెండో టెస్టుకు ముందు శ్రీలంకకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ దుష్మంత చమీరా రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అధిక పని భారం కారణంగా చమీరాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే మోకాలి గాయంతో బాధ పడుతున్న అతడు గత కొద్ది కాలంగా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడి పనిభారాన్ని తగ్గించాలని వైద్య బృందం శ్రీలంక క్రికెట్ బోర్డుకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు చమీరాను కేవలం వైట్-బాల్ క్రికెట్లో మాత్రమే ఆడించాలని కూడా వైద్య బృందం సూచించినట్లు సమాచారం. కాగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టుకు కూడా చమీరా దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఘోర ఓటమిని చవిచూసింది. ఇందులో భారత్ ఇన్నింగ్స్ అండ్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా చమీరాను ఐపీఎల్-2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక బెంగళూరు వేదికగా జరుగనున్న రెండో టెస్టుకు ఆ జట్టు ఆటగాడు పథుమ్ నిసాంక కూడా దూరం కానున్నాడు. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం! -
తొలి టెస్టు కోసం భారత్, శ్రీలంక జట్ల సాధన
-
కెప్టెన్‌గా ఓకే రోహిత్.. మరి బ్యాటింగ్ సంగతి ఏంటి ?
స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 50 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ సబా కరీమ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. తన బ్యాటింగ్ కారణంగానే రోహిత్ జట్టులో ఉన్నడాని, కెప్టెన్సీ అనేది కేవలం అదనపు బాధ్యత అని కరీమ్ అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ తన బ్యాటింగ్ కారణంగా జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నాడు. "కెప్టెన్సీ అనేది కేవలం అదనపు బాధ్యత మాత్రమే. రోహిత్ బ్యాటింగ్‌పై పట్టును కోల్పోకూడదు. జట్టును నడిసించే అదనపు బాధ్యత కారణంగా కెప్టెన్లు బ్యాటింగ్‌లో రాణించలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోహిత్ విషయంలో ఇది జరగకూడదు. రోహిత్‌కు కెప్టెన్‌గా ఇది ప్రారంభ దశ మాత్రమే. జట్టుకు తన బ్యాటింగ్ ఎంతో అవసరమో అతడు గ్రహించాలి. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్-2022లో రోహిత్ ప్రదర్శన చాలా కీలకం. అక్కడి గ్రౌండ్లు చాలా పెద్దవిగా ఉంటాయి. ప్రత్యర్ధి జట్టులో అత్యత్తుమ బౌలర్లు ఉంటారు. కాబట్టి వారిని ఎదుర్కొని రోహిత్ ఈ మెగా టోర్నమెంట్లో రాణించాలి" అని సబా కరీమ్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం -
భారత్, శ్రీలంక రెండో టీ20.. మ్యాచ్ జరిగేనా!
స్వదేశంలో టీమిండియా మరో టీ20 సిరీస్‌పై కన్నేసింది. ధర్మశాల వేదికగా శ్రీలంకతో రెండో టీ20లో శనివారం భారత్ తలపడనుంది. ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. రెండో టీ20లో గెలుపొంది సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే భారత్- శ్రీలంక రెండో టీ20కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది. గత మూడు రోజులుగా ధర్మశాలలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా చిరు జల్లులు పడే అవకాశం ఉందట. ఆకాశం మేఘావృతంగా ఉండనుంది. శనివారం వర్షం పడే అవకాశాలు కేవలం 60 శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్షం పడి మైదానం చిత్తడిగా మారింది. దీంతో పిచ్‌పై గ్రౌండ్ స్టాప్ కవర్లు వేసి ఉంచారు. ఒక వేళ వర్షం పడితే మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేసే అవకాశం లేకపోలేదు. భారత్ తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా / కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యుజ్వేంద్ర చాహల్ శ్రీలంక జట్టు (అంచనా): దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (వైస్ కెప్టెన్), చరిత్ అసలంక, దసున్ షనక (కెప్టెన్), బినుర ఫెర్నాండో, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, జెఫ్రీ వాండర్సే, లాహిరు కూమార -
'ఇషాన్ కిషన్ బాగా ఆడాడు.. కానీ ఇది సరిపోదు'
శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత ఆటగాడు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు సాధించాడు. అదే విధంగా దోని, పంత్‌కు సాధ్యం కాని రికార్డును కిషన్ సాధించాడు. 89 పరుగులు చేసిన కిషన్.. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన తొలి భారత భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలక వాఖ్యలు చేశాడు. టీ20ల్లో కిషన్‌కు మంచి రికార్డు ఉన్నప్పటికీ.. భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "ఈ మ్యాచ్‌లో కిషన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే ఇది మొదటి మ్యాచ్ మాత్రమే. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అతడు అంతగా రాణించలేదు. ఈడెన్‌లో పేస్ బౌలింగ్‌కు కిషన్ ఇబ్బంది పడ్డాడు. లక్నోలో పిచ్ బ్యాటర్లకు అనూకూలించింది. కానీ కిషన్ ఆడిన డ్రైవ్, పుల్ షాట్లు అద్భుతమైనవి. అయితే ముఖ్యంగా అతడి బ్యాటింగ్‌లో నిలకడ కావాలి. అతడు నిలకడగా ప్రదర్శన చేస్తే కచ్చితంగా భారత టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడు. ఎందుకంటే అతడు వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. అదే విధంగా అతడు ఐదు లేదా ఆరో స్ధానంలో కూడా బ్యాటింగ్ చేయగలడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs SL: 'కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు' -
46 మ్యాచ్‌లు.. 196 వికెట్లు.. ఏకంగా భారత జట్టులోకి ఏంట్రీ.. ఎవరీ సౌరభ్ కుమార్ ?
స్వదేశంలో శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్‌కు భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఉత్తర్ ప్రదేశ్ ఆల్ రౌండర్ సౌరభ్ కుమార్‌ను సెలెక్షన్ కమిటీ శ్రీలంకతో టెస్ట్‌లకు ఎంపిక చేసింది. 28 ఏళ్ల సౌరభ్ కుమార్ భారత జట్టు తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. అనూహ్యంగా భారత జట్టులోకి ఏంట్రీ ఇస్తున్న సౌరభ్ కుమార్ గురించి ఆసక్తికర విషయాలు. సౌరభ్ ఇప్పటి వరకు 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 25 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరభ్ అద్భుతంగా రాణిస్తోన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 46 మ్యాచ్‌లు ఆడిన సౌరభ్.. 196 వికెట్లు పడగొట్టాడు. ఈ లెప్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్.. గత ఏడాది డిసెంబర్లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన భారత-ఏ జట్టులో భాగమై ఉన్నాడు. అదే విధంగా గతఏడాది జరగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోను సౌరభ్ కుమార్ అద్భుతంగా రాణించాడు. ఇక రంజీ ట్రోఫీ 2019-20 సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 44 వికెట్లతో పాటు, 285 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో కుల్ధీప్ యాదవ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 192 పరుగుల రికార్డు భాగస్వామ్యం కూడా నెలకొల్పాడు. భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్ , రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్ చదవండి: Ind Vs SL: శ్రీలంకతో సిరీస్‌లకు జట్టు ప్రకటన.. కోహ్లి, పంత్ దూరం -
శ్రీలంకతో సిరీస్‌లకు జట్టు ప్రకటన.. కోహ్లి, పంత్ దూరం
స్వదేశంలో శ్రీలంకతో జరిగే టీ20, టెస్టు సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటన చేసింది. ఈ సిరీస్ లకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొత్తం 18 మంది ఆటగాళ్లను చేతన్ శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అదే విధంగా భారత టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌ను నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక శ్రీలంకతో టీ20 సిరీస్‌కు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్కి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ అవేష్ ఖాన్ భారత తరుపున టీ20ల్లో అరంగేట్రం చేయనున్నాడు. అదే విధంగా సంజు శాంసన్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. మరో వైపు గాయం కారణంగా కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో సిరీస్‌లకు దూరమయ్యారు. ఇక గాయం కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇక విండీస్‌తో సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఫాస్ట్ బౌలర్ జస్పీత్ర్ బూమ్రా కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక టెస్టు జట్టు విషయానికి వస్తే.. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సీనియర్ బ్యాటర్లు రహానే, పుజారాలపై సెలెక్టర్లు వేటు వేశారు. అదే విధంగా ఉత్తర ప్రదేశ్ స్పిన్నర్ సౌరభ్ కూమార్ టెస్టుల్లో భారత తరుపున అరంగేట్రం చేయనున్నాడు. భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, జస్ప్రీత్ బుమ్రా బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్, బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్ భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, కెఎస్ భరత్, ఆర్ అశ్విన్ , రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్, కుల్దీప్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, సౌరభ్ కుమార్ -
ఇక భారత జట్టులోకి కష్టమే.. తీరు మారని పుజారా!
Ranji Trophy 2021-22: టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా తన పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీలో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు బంతులు ఎదుర్కొన్న పుజారా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ముంబై బౌలర్ మోహిత్ అవస్తీ బౌలింగ్‌లో పుజారా ఎల్బీ రూపంలో వెనుదిరిగాడు. కాగా గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన పుజారాకి భారత జట్టులో చోటు దక్కడం ఇప్పటికే కష్టంగా మారింది. మార్చిలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు మరి కొద్దిరోజుల్లో జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఈ నేపథ్యంలో పుజారా డకౌట్ కావడం.. అతడు జట్టులోకి వచ్చే అవకాశాలను మరింత దెబ్బతీశాయి. ఇక పుజారా 2018-19 బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడిన పుజారా 521 పరుగులు చేశాడు. అయితే అప్పటి నుంచి పుజారా తన ఫామ్‌ను కోల్పోయాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 27 టెస్టులాడిన పుజారా కేవలం 1287 పరుగుల మాత్రమే చేశాడు. లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై అత్యధికంగా 91 పరుగులు పుజారా సాధించాడు. చదవండి: Ind Vs Wi 2nd T20: రోహిత్ ఆగ్రహం... అసహనంతో బంతిని తన్నిన హిట్‌మ్యాన్.. పాపం భువీ! -
శ్రీలంకతో టీ20 సిరీస్.. విరాట్ కోహ్లి దూరం.. కారణం అదేనా?
Former Indian skipper Virat Kohli: గాయం కారణంగా గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి రాబోతున్నాడు. శ్రీలంకతో స్వదేశంలో జరిగే సిరీస్‌లో జడేజా తిరిగి పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత పర్యటనలో భాగంగా శ్రీలంక మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. కాగా నేషనల్ క్రికెట్ అకాడమీలోని పునరావాస కేంద్రంలో గత కొంత కాలంగా జడేజా శిక్షణ పొందుతున్నాడు. అయితే ఇప్పటికే భారత్- శ్రీలంక తొలి టీ20 వేదిక అయిన లక్నోకు జడేజా చేరుకుని ఐసోలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. జడేజాతో పాటు జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. జడేజా, బుమ్రా ఇద్దరూ వేర్వేరు కారణాల వల్ల వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే.. ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే శ్రీలంకతో టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. అంతగా ఫామ్‌లో లేని కోహ్లి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే టీ20 సిరీస్ అనంతరం జరిగే టెస్ట్ సిరీస్‌కు కోహ్లి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు వన్డేల్లో మొత్తం కోహ్లి 24 పరుగులు మాత్రమే చేశాడు. ఇక విండీస్‌తో జరిగిన తొలి టీ20లోను కేవలం 17 పరుగులు మాత్రమే చేసి విరాట్ పెవిలియన్‌కు చేరాడు. చదవండి: Ind VS Wi 2nd T20: వరుసగా 8, 18, 0, 17.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా! -
అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ఆల్ రౌండర్ గుడ్‌బై..
శ్రీలంక స్టార్ ఆల్ రౌండర్ దిల్రువాన్ పెరీరా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. పెరీరా రిటైర్మెంట్ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు ద్రువీకరించింది. "శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిల్రువాన్ పెరీరా, అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు" అని శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన పెరీరా.. దేశవాళీ క్రికెట్లో కొనసాగనున్నాడు. ఇప్పటి వరకు శ్రీలంక తరుపున 43 టెస్టు మ్యాచ్‌లు ఆడిన దిల్రువాన్ పెరీరా 161 వికెట్లు తీశాడు. కాగా అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు, హాఫ్ సెంచరీ చేసిన ఏకైక శ్రీలంక ఆటగాడిగా దిల్రువాన్ పెరీరా అరుదైన ఘనత సాధించాడు. అదే విధంగా 13 వన్డేలు, 3 టీ20లు ఆడిన దిల్రువాన్.. వరుసగా 13, 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే 200కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 800 వికెట్లు తీశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లో శ్రీలంక తరుపున దిల్రువాన్ ఆరంగట్రేం చేశాడు. చదవండి: IPL 2022: 'ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది.. అతడే నా ఫేవరెట్ కెప్టెన్' -
ఆ ముగ్గురు ఆటగాళ్లపై నిషేధం ఎత్తివేత.. మళ్లీ క్రికెట్ ఆడొచ్చు
శ్రీలంక స్టార్ క్రికెటర్లు కుశాల్ మెండిస్, నిరోషన్ డిక్వెల్లా, దనుష్క గుణతిలకలపై ఏడాదిపాటు విధించిన నిషేధాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఎత్తివేసింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డ్ మీడియా సమావేశంలో ద్రువీకరించింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు దేశీయ క్రికెట్‌తో, జాతీయ జట్టు ఎంపికకు కూడా అందుబాటులో ఉంటారని బోర్డ్ పేర్కొంది. కాగా గత ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక ఆటగాళ్లు డిక్వెల్లా, గుణతిలక, మెండిస్ బయో బబుల్‌ను ఉల్లంఘించి బయట తిరుగుతూ కనిపించారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయాన్ని సిరీయస్‌గా తీసుకున్న శ్రీలంక క్రికెట్ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురు ఆటగాళ్లపై ఏడాది పాటు నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. "ముగ్గురు ఆటగాళ్ల వినతి మేరకు బోర్డు వాళ్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ సమయంలో ముగ్గురు ఆటగాళ్లకు కౌన్సెలింగ్ ఒక డాక్టర్‌తో కౌన్సిలింగ్ ఇప్పించాం. డాక్టర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం అని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారి ఒకరు పేర్కొన్నారు. చదవండి: SA vs IND: రిషభ్ పంత్కి భారీ షాక్! -
10 ఫోర్లు, 4సిక్స్‌లు.. సెంచరీతో చెలరేగిన శ్రీలంక బ్యాటర్!
లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. డిసెంబర్21న దంబుల్లా జెయింట్సతో జరిగిన క్వాలిఫైయర్ 2లో 23 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈమ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ ఓపెనర్ అవిష్క ఫెర్నాండో సెంచరీతో మెరిశాడు. 64 బంతుల్లో అవిష్క ఫెర్నాండో 100 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జాఫ్నా కింగ్స్‌కు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, అవిష్క ఫెర్నాండో 122 పరుగల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుర్బాజ్ 40 బంతుల్లో 70 పరుగలు సాధించాడు. దీంతో నిర్ణీత 20 ఓవరల్లో జాఫ్నా కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దంబుల్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులకే పరిమితమైంది. కాగా అఖరిలో 75 పరగులతో దంబుల్లా బౌలర్ కరుణరత్నే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఫలితం లేకుండా పోయింది. ఇక జాఫ్నా కింగ్స్ బౌలర్లలో సీల్స్ మూడు వికెట్లు పడగొట్టగా, మహేష్ తీక్షణ, పెరెరా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కాగా డిసెంబర్23న ఫైనల్లో గాలె గ్లాడియటర్స్తో జాఫ్నా కింగ్స్ తలపడనుంది. చదవండి: ఆ టీమిండియా బ్యాటర్‌కి బౌలింగ్ చేయడం చాలా కష్టం: పాక్ బౌలర్ -
క్రికెటర్లకు షాకిచ్చిన బోర్డు... అలా జరగనట్లయితే జీతాల్లో కోత!
శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ జట్టు ఆటగాళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై జట్టు ఆటగాళ్లంతా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలని, లేక పోతే వాళ్ల జీతాల్లో కోత విధిస్తామని హెచ్చరించింది. నివేదికల ప్రకారం.. ప్రతీ ఆటగాడు 2 కిలోమీటర్ల దూరాన్నికేవలం 8.10 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఒకవేళ రన్ పూర్తిచేసే సమయం 8:55 దాటితే సదరు ఆటగాడిని సెలెక్షన్‌కు పరిగణించరు. 8:35 నుంచి 8:55 నిమిషాల్లో పూర్తి చేస్తే వాళ్ల జీతాల్లో కోత విధిస్తారు. ఇక వచ్చే ఏడాదిలో మొత్తంగా నాలుగు సార్లు యోయో టెస్ట్‌లను శ్రీలంక నిర్వహించనుంది. తొలి ఫిట్నెస్ టెస్ట్ జనవరి7న జరగనుంది. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రవేశ పెట్టిన కొత్త రూల్స్ జనవరి 2022 నుంచి అమలులోకి రానున్నాయి. "ఇకపై ప్రతీ ఆటగాడు 2 కిలోమీటర్ల దూరాన్ని 8.10 నిమిషాలలోపు పూర్తి చేయాలి. ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. ఫిట్‌నెస్‌లో లోపాలను అసలు మేము సహించం" అని శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక శ్రీలంక జట్టు వచ్చే ఏడాది ఫిభ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో 5 టీ20ల సిరీస్ ఆడనుంది. అనంతరం భారత్‌లో పర్యటించనుంది. ఇక శ్రీలంక పురుషుల సీనియర్ జట్టుకు కన్సల్టింగ్ కోచ్‌గా మహేల జయవర్దనే ఇటీవల ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: Bhuvneshwar Kumar: భారత జట్టు డాటర్స్ లిస్టులో మరో రాకుమారి.. భువీ కూతురు ఫొటో వైరల్! -
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌కు కీలక పదవి..
కొలొంబో: శ్రీలంక దిగ్గజ క్రికెటర్, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ అయిన మహేళ జయవర్దనేకు కీలక పదవి దక్కింది. అతన్ని ఏడాది కాలం పాటు శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా నియమిస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. వచ్చే ఏడాది శ్రీలంక బిజీ షెడ్యూల్ కలిగి ఉన్న నేపథ్యంలో జయవర్దనేకు కీలక బాధ్యతలు అప్పచెబుతున్నట్లు లంక క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈవో ఆష్లే డిసిల్వా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. Sri Lanka Cricket wishes to announce the appointment of former Sri Lanka Captain Mahela Jayawardena as the ‘Consultant Coach’ for the National Teams, effective 1st January 2022. READ:https://t.co/8Kry3xwm62 #LKA #SLC— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) December 13, 2021 కాగా, జయవర్దనే ముంబై ఇండియన్స్ కోచింగ్ బాధ్యతలతో పాటు శ్రీలంక అండర్-19 జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా లంక క్రికెట్ బోర్డు నిర్ణయంతో జయవర్దనేకు ప్రమోషన్ లభించింది. నూతన బాధ్యతల్లో జయవర్దనే.. శ్రీలంక హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్‌తో పాటు ఇతర శిక్షణా సిబ్బందికి సలహాలిస్తారు. చదవండి: ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు ఎంపికైన ఆసీస్ స్టార్ ఓపెనర్ -
విధ్వంసం సృష్టించిన శ్రీలంక ఆల్ రౌండర్.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ..
Thisara Perera scores a half century as Jaffna Kings defeat Colombo Stars by 93 runs: లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ కెప్టెన్ తిసార పెరీరా విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే 5 సిక్సర్లు, మూడు ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. దీంతో కొలంబో స్టార్స్‌పై జాఫ్నా కింగ్స్ 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆటను 18 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జఫ్నా కింగ్స్ 18 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. జాఫ్నా కింగ్స్ బ్యాటర్లలో కోహ్లర్-కాడ్మోర్(44), మాలిక్(44), బండారా(42)పరుగులతో రాణించారు. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కొలంబో స్టార్స్ జాఫ్నా బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలింది. కొలంబో స్టార్స్ బ్యాటర్లలో ఆషాన్ ప్రియాంజన్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జాఫ్నా బౌలర్లలో మహేశ్ తీక్షణ,వహాబ్ రియాజ్ చెరో నాలుగు వికెట్లు సాధించారు. చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు -
వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన శ్రీలంక..
గాలే: వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆతిథ్య శ్రీలంక క్లీన్‌స్వీప్ చేసింది. రెండో టెస్టులో శ్రీలంక 164 పరుగులతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. 297 పరుగుల లక్ష్యంతో శుక్రవారం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన విండీస్ 56.1 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో లసిత్ ఎంబుల్దేనియా (5/35), రమేశ్ మెండిస్ (5/66) కరీబియన్ జట్టును పడగొట్టేశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 328/8తో ఆటను కొనసాగించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 121.4 ఓవర్లలో 345/9 వద్ద డిక్లేర్ చేసింది. ధనంజయ డిసిల్వా (155 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేశాడు. ధనంజయకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... రమేశ్ మెండిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. చదవండి: IND Vs NZ: ఒకే ఒక్కడు 6వికెట్లు.. భారత్‌పై అరుదైన రికార్డు సాధించిన కివీస్ స్పిన్నర్.. -
పాపం వెస్టిండీస్.. ఘోర ఓటమి
గాలే: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 187 పరుగుల తేడాతో గెలుపొందింది. 348 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన విండీస్ లంక స్పిన్నర్ల ధాటికి నిలబడలేక 160 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లు రమేశ్ మెండిస్ 5 వికెట్లు, లసిత్ ఎంబుల్డేనియా 4 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించారు. చదవండి: ‘చాంపియన్’తో సమరానికి సై అంతకు ముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటై 156 పరుగుల ఆధిక్యం కోల్పోయిం ది. శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 191 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కరుణరత్నే (83), మాథ్యూస్ (69) అర్ధ సెంచరీలు చేశారు. చదవండి: టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బంగ్లా టి20 కెప్టెన్ -
దురదృష్టమంటే ధనంజయ డి సిల్వాదే.. ఇలా కూడా ఔట్ అవ్వొచ్చా..
Dhananjaya de Silva gets out hit wicket in a hilarious manner: గాలే వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో శ్రీలంక బ్యాటర్ ధనంజయ డిసిల్వా దురదృష్టకర రీతిలో తన వికెట్ కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో 61 పరుగులు చేసిన ధనంజయ డి సిల్వా మంచి టచ్‌లో కనిపించాడు. అయితే వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ గాబ్రియెల్ వేసిన 95వ ఓవర్లో.. రెండో బంతిని డి సిల్వా ఢిపెన్స్ ఆడగా అది ఎడ్జ్ తీసుకుని స్టంప్స్‌ను తాకబోయింది. చదవండి: Rohit Sharma- Ashwin: అశ్విన్‌పై రోహిత్ ప్రశంసలు.. కెప్టెన్‌కు అటాకింగ్ ఆప్షన్ అంటూ.. ఈ క్రమంలో బంతిని స్టంప్‌కు తగలకుండా డి సిల్వా ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అతడు అనుకోకుండా తన బ్యాట్‌తో బెయిల్స్‌ని పడగొట్టాడు. దీని ఫలితంగా ధనంజయ డి సిల్వా హిట్ వికెట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. కాగా టెస్టుల్లో హిట్ వికెట్‌గా వెనుదిరగడం అతడికి ఇది రెండోసారి. అధేవిధంగా టెస్ట్ క్రికెట్లో రెండు సార్లు హిట్ వికెట్‌గా ఔటైన రెండో శ్రీలంక ఆటగాడిగా ధనంజయ డి సిల్వా నిలిచాడు. చదవండి: Lendi Simmons T20 XI: ఒకే జట్టులో ధోని, కోహ్లి.. కెప్టెన్‌గా ఎవరంటే..? Here's the moment Dhananjaya de Silva becomes the second Sri Lankan to hit his own wickets twice in Test cricket. #SLvWI pic.twitter.com/DyGShkaByE — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) November 22, 2021 -
SL Vs WI: కరుణరత్నే సెంచరీ.. భారీ స్కోర్ దిశగా శ్రీలంక
గాలె: వెస్టిండీస్‌తో ఆదివారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక క్రికెట్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 3 వికెట్లకు 267 పరుగులు సాధించింది. కెప్టెన్, ఓపెనర్ దిముత్ కరుణరత్నే (265 బంతుల్లో 132 బ్యాటింగ్; 13 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు.దీంతో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 2021లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అత్యధికంగా 6 సెంచరీలు చేశాడు. కాగా మరో ఓపెనర్ పథుమ్ నిసాంక (140 బంతుల్లో 56; 7 ఫోర్లు)తో కలిసి కరుణరత్నే తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించి లంకకు శుభారంభం ఇచ్చాడు. కరుణరత్నే టెస్టు కెరీర్లో ఇది 13వ సెంచరీ. నిసాంక అవుటయ్యాక ఒషాడా ఫెర్నాండో (3), మాథ్యూస్ (3) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అనంతరం కరుణరత్నేతో ధనంజయ డిసిల్వా (77 బంతుల్లో 55 బ్యాటింగ్; 5 ఫోర్లు) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించారు. చదవండి: IND Vs NZ: పాపం హర్షల్ పటేల్.. రాహుల్ తర్వాత ఆ చెత్త రికార్డు నమోదు.. -
శ్రీలంక కోచ్‌గా మహేల జయవర్ధనే!
Mahela Jayawardene in Srilanka Coaching staff: శ్రీలంక హెడ్ కోచ్ బాధ్యతల నుంచి మిక్కీ ఆర్థర్ తప్పకున్న తర్వాత ఆ జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు జరగనున్నాయి. ఆ జట్టు మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేని కన్సల్టెంట్ కోచ్‌లో ఒకరిగా నియమించేందుకు శ్రీలంక క్రికెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో వైపు కన్సల్టెంట్ కోచ్‌లుగా ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లు రంగనా హెరాత్, నువాన్ కులశేఖర, లసిత్ మలింగలను కూడా నియమించేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డ్ చర్చలు జరుపుతుంది. శ్రీలంక జాతీయ జట్టు, శ్రీలంక ‘ఎ’ జట్టు, అండర్-19 జట్టును కూడా జయవర్ధనే పర్యవేక్షిస్తారని సమాచారం. మహేల జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము చాలా సంతోషిస్తాం అని శ్రీలంక క్రికెట్ అధికారి ఒకరు తెలిపారు. “మహేలా జయవర్ధనే జట్టులోకి రావడానికి అంగీకరిస్తే మేము సంతోషిస్తాము. అతడు టీ20 ప్రపంచకప్ సమయంలో యూఏఈలో జట్టుతో ఉన్నప్పుడు జట్టులో వత్యాసం మాకు సృష్టంగా కనిపించింది. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది నుంచి మాకు లభించిన ఫీడ్‌బ్యాక్ అద్భుతంగా ఉంది” అని శ్రీలంక క్రికెట్ అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు, ది హండ్రెడ్ లీగ్‌లో సదరన్ బ్రేవ్ జట్టుకు హెడ్ కోచ్‌గా జయవర్ధనేబాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: Rishab Pant: ధోనిలా అద్బుతాలు చేస్తాడని ఆశించా.. అలా జరగడం లేదు -
T20 World Cup 2021: లంక బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఐర్లాండ్
లంక బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఐర్లాండ్..70 పరుగుల తేడాతో ఘన విజయం 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్ లంక బౌలర్ల ధాటికి 101 పరుగులకే కుప్పకూలింది. మహీశ్ తీక్షణ 3 వికెట్లతో విజృంభించగా.. కరుణరత్నే, లహిరు కుమార చెరో 2 వికెట్లు.. చమీరా, హసరంగ తలో వికెట్ పడగొట్టి ఐర్లాండ్‌ను ఆలౌట్ చేశారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ(41), కర్టిస్ కాంఫర్(24) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఈ విజయంతో శ్రీలంక సూపర్-12 స్టేజ్ బెర్తు ఖరారు చేసుకుంది. ఐర్లాండ్ టార్గెట్ 172.. 5 ఓవర్ల తర్వాత 33/3 172 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్‌కు లంక బౌలర్లు ఆరంభంలోనే చుక్కలు చూపించారు. తొలి ఓవర్లో కరుణరత్నే.. కెవిన్ ఓ బ్రయాన్(5)ను, 3వ ఓవర్లో తీక్షణ.. పాల్ స్టిర్లింగ్(7)ను, 5వ ఓవర్లో హసరంగ.. గ్యారెత్ డెలానీ(2)ని ఔట్ చేశారు. 5 ఓవర్ల తర్వాత ఐర్లాండ్ స్కోర్ 33/3. హసరంగ, నిస్సంక అర్ధ శతకాలు.. ఐర్లాండ్ టార్గెట్ 172 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకను వనిందు హసరంగ(47 బంతుల్లో 71; 10 ఫోర్లు, సిక్స్), పథుమ్ నిస్సంక(47 బంతుల్లో 61; 3 ఫోర్లు) అర్ధ శతకాలతో ఆదుకున్నారు. వీరిద్దరు మినహా జట్టు మొత్తం విఫలమైంది. ఆఖర్లో కెప్టెన్ దసున్ శనక(11 బంతుల్లో 21; 2 ఫోర్లు, సిక్స్) వేగంగా ఆడడంతో నిర్ణీత ఓవర్ల ముగిసే సరికి శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో జాషువా లిటిల్ 4 వికెట్లు పడగొట్టగా, మార్క్ అదైర్ 2, పాల్ స్టిర్లింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. 11 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 80/3 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న లంక జట్టును వనిందు హసరంగ(33 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్), పథుమ్ నిస్సంక(25 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డును నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నారు. 11 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 80/3. 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక ఐర్లాండ్ బౌలర్లు జాషువా లిటిల్(2/4), పాల్ స్టిర్లింగ్(1/4) ధాటికి శ్రీలంక జట్టు 8 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుశాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో గోల్డెన్ డక్‌గా వెనుదిరగగా.. దినేశ్ చండీమాల్ 6 పరుగులు చేసి ఔటయ్యాడు. 1.4 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 8/3. క్రీజ్‌లో వనిందు హసరంగ, పథుమ్ నిస్సంక(2) ఉన్నారు. అబుదాబీ: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా బుధవారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్-ఏ మ్యాచ్‌లో శ్రీలంక, ఐర్లాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఐర్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు: శ్రీలంక: కుశాల్ పెరీరా(వికెట్ కీపర్), పాథుమ్ నిషంక, దినేశ్ చండిమాల్, అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, వనిందు హసరంగ, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, లాహిరు కుమార. ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, కెవిన్ ఒబ్రెయిన్, ఆండ్రూ బల్బిర్నీ(కెప్టెన్), గరేత్ డిలనీ, కర్టిస్ కాంపర్, హ్యారి టెక్టార్, నీల్ రాక్(వికెట్ కీపర్), సిమీ సింగ్, మార్క్ అదేర్, క్రెయిగ్ యంగ్, జోషువా లిటిల్. -
2 ప్రపంచకప్‌లలో 2 వేర్వేరు దేశాలు.. చరిత్ర సృష్టించిన నమీబియా క్రికెటర్
David Wiese Played For Two Nations In Consecutive World Cups: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో నమీబియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డేవిడ్ వీస్ చరిత్ర సృష్టించాడు. వరుస ప్రపంచకప్‌లలో రెండు వేర్వేరు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2016 ప్రపంచకప్‌లో జన్మస్థలమైన దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన వీస్.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తన తండ్రి స్వస్థలమైన నమీబియా తరఫున ఆడుతున్నాడు. 36 ఏళ్ల సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన వీస్.. 2013లో దక్షిణాఫ్రికా తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అరంగేట్రం చేసి 6 వన్డేలు, 20 టీ20లు ఆడాడు. గత టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున 3 మ్యాచ్‌లు ఆడిన వీస్.. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. 2019లో నమీబియా టీ20 ప్రపంచకప్‌కు క్వాలిఫై కావడంలో కీలకపాత్ర పోషించిన వీస్.. నాటి నుంచి ఆ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం(అక్టోబర్ 18) శ్రీలంకతో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగిన అతను.. కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో లంక బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా 96 పరుగులకే ఆలౌట్ కాగా.. శ్రీలంక కేవలం 3 వికెట్లు కోల్పోయి 13.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచకప్‌లో అన్నీ అనుకూలించి నమీబియా సూపర్ 12 స్టేజ్‌కి చేరితే.. అక్కడ దక్షిణాఫ్రికాతో తలపడే అవకాశం ఉంది. చదవండి: ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టిన 'జార్వో' మళ్లీ వచ్చేశాడు.. -
T20 World Cup 2021: పసికూన నమీబియాపై శ్రీలంక సూపర్ విక్టరీ
పసికూన నమీబియాపై శ్రీలంక సూపర్ విక్టరీ నమీబియా నిర్ధేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక జట్టు ఆరంభంలో తడబడినప్పటికీ మిడిలార్డర్ బ్యాటర్లు అవిష్క ఫెర్నాండో(28 బంతుల్లో 30 నాటౌట్; 2 సిక్సర్లు), భానుక రాజపక్స(27 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా శ్రీలంక 7 వికెట్ల తేడాతో నమీబియాపై ఘన విజయం సాధించింది. నమీబియా బౌలర్లలో స్మిట్, బెర్నార్డ్, రూబెన్ ట్రంపెల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. స్కోర్ వివరాలు: నమీబియా 96 ఆలౌట్.. శ్రీలంక 100/3 లంక బౌలర్ల ధాటికి 96 పరుగులకే కుప్పకూలిన నమీబియా లంక బౌలర్లంతా మూకుమ్మడిగా దాడి చేయడంతో పసికూన నమీబియా విలవిలలాడింది. నిర్ణీత ఓవర్లు కూడా ఆడలేక 19.3 ఓవర్లలో 96 పరుగులకే చాపచుట్టేసింది. నమీబియా జట్టులో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్‌ను చేయగలిగారు. వారిలో క్రెయిగ్ విలియమ్స్(29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక బౌలర్లలో తీక్షణ 3 వికెట్లు.. లహీరు కుమార, హసరంగ చెరో రెండు వికెట్లు.. చమీరా, కరుణరత్నే తలో వికెట్ పడగొట్టారు. 10 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 54/2 లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 54/2గా ఉంది. క్రీజ్‌లో క్రెయిగ్ విలియమ్స్(15), గెర్హార్డ్(15) ఉన్నారు. మహీశ్ తీక్షణ రెండు వికెట్లు పడగొట్టాడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న లంక బౌలర్లు.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా జట్టుకు లంక బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మహీశ్ తీక్షణ పసికూనపై చెలరేగి బౌలింగ్ చేస్తూ రెండు వికెట్లు పడగొట్టాడు. మూడో ఓవర్లో బార్డ్(7)ను పెవిలియన్‌కు పంపిన తీక్షణ.. ఆరో ఓవర్లో జేన్ గ్రీన్(8)ను కూడా ఔట్ చేశాడు. 6 ఓవర్ల తర్వాత నమీబియా స్కోర్ 30/2. క్రీజ్‌లో క్రెయిగ్ విలియమ్స్(9), గెర్హార్డ్ ఉన్నారు. అబుదాబీ: టీ20 ప్రపంచకప్-2021 క్వాలిఫయర్స్ పోటీల్లో భాగంగా సోమవారం రాత్రి 7:30 గంటలకు షెడ్యూలైన గ్రూప్-ఏ మ్యాచ్‌లో శ్రీలంక, నమీబియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్లు: శ్రీలంక: కుశాల్ పెరీరా(వికెట్ కీపర్), పాథుమ్ నిషంక, దినేశ్ చండిమాల్, అవిష్క ఫెర్నాండో, భనుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), చమిక కరుణరత్నే, వనిందు హసరంగ, దుష్మంత చమీర, మహీశ్ తీక్షణ, లాహిరు కుమార. నమీబియా: స్టీఫెన్ బార్డ్, జానే గ్రీన్, క్రెయిగ్ విలియమ్స్, గెర్హాడ్ ఎరాస్మస్(కెప్టెన్), డేవిడ్ వీజ్, జేజే స్మిత్, జాన్ ఫ్రిలింక్, పిక్కీ యా ఫ్రాన్స్, జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్, రూబెన్ ట్రంపెల్మాన్, బెర్నార్డ్ షోల్ట్. -
శ్రీలంక క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ మృతి..
Sri Lanka First Test Captain Bandula Warnapura Passed Away: శ్రీలంక టెస్ట్ జట్టుకు తొట్ట తొలి సారధిగా వ్యవహరించిన బందుల వర్ణపుర(68) సోమవారం మృతి చెందాడు. షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల అతను మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. 1982 ఫిబ్రవరిలో కొలొంబొ వేదికగా ఇంగ్లండ్‌తో శ్రీలంక ఆడిన తొలి టెస్ట్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వర్ణపుర.. శ్రీలంక తరఫున తొలి బంతిని ఎదుర్కొన్న బ్యాటర్‌గా, తొలి పరుగు చేసిన ఆటగాడిగా.. అలాగే ఓపెనింగ్ బ్యాటింగ్, ఓపెనింగ్ బౌలింగ్ చేసిన తొలి ఆటగాడిగా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కెరీర్ మొత్తంలో 4 టెస్ట్‌లు, 12 వన్డేలు ఆడిన అతను.. 1975 ప్రపంచకప్ ద్వారా వన్డే అరంగేట్రం చేశాడు. రిటైర్మెంట్ అనంతరం అతను శ్రీలంక కోచ్‌గా కూడా వ్యవహరించాడు. చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన బంగ్లా ఆల్‌రౌండర్ -
టీ20 ప్రపంచకప్‌కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
Mahela Jayawardene As Consultant For Sri Lanka: వచ్చే నెల జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జట్టు మాజీ దిగ్గజ ఆటగాడు మహేలా జయవర్ధనేను వరల్డ్‌కప్‌లో మెదటి రౌండ్ మ్యాచ్‌లు కోసం కన్సల్టెంట్‌గా శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. ఆదే విధంగా వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జరిగే అండర్-19 ప్రపంచకప్ కోసం అతడిని కన్సల్టెంట్, మెంటర్‌గా ఎంపిక చేసింది. టీ20 ప్రపంచకప్ సూపర్12కు ఆర్హత సాధించడానికి శ్రీలంక మెదటి రౌండ్లో ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియాతో తలపడనుంది. కాగా 2017 నుంచి ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా ఉన్న జయవర్ధనే ఆ జట్టుకు మూడు సార్లు టైటిల్‌ను అందించాడు. యూఏఈ వేదికగా జరగతున్న ఐపీఎల్ సెకెండ్ ఫేజ్ ముగిసాక నేరుగా జయవర్ధనే శ్రీలంక జట్టు బయోబబుల్‌లో చేరుతారని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. చదవండి: MS Dhoni: బ్రావో ఇలా చేశాడే అనుకుంటారు కదా.. ఆ విషయంలోనే మాకు ‘గొడవలు’! -
టీమిండియాపై సత్తా చాటిన వారికి అవకాశం.. స్టార్ ప్లేయర్స్‌కు షాక్
కొలంబో: అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ 2021 కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు డసున్ శనక సారథ్యం వహించనుండగా.. స్టార్ బ్యాట్స్‌మెన్ ధనంజయ్ డిసిల్వా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో ఆకట్టుకున్న 21 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ మహిష్ తీక్షణ తొలిసారి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జులైలో టీమిండియాపై గెలిచిన జట్టులోని మెజారిటీ సభ్యులు ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఆ సిరీస్‌లో ధవన్ సేనపై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన వనిందు హసరంగ, దుష్మంత చమీరా, వికెట్ కీపర్ మినోద్ భానుక, ప్రవీణ్ జయవిక్రమ జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. మరోవైపు ఇంగ్లండ్‌లో కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడం ద్వారా నిషేధానికి గురైన స్టార్ ఆటగాళ్లు నిరోషన్ డిక్వెల్లా, కుశాల్ మెండిస్, ధనుష్క గుణతిలకలకు ఈ జట్టులో చోటు దక్కపోగా, గాయం నుంచి కోలుకున్న కుశాల్ పెరీరా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇదిలా ఉంటే, డసున్ శనక నాయకత్వంలోని లంక జట్టు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా(ధవన్ సేన)ను ఓడించిన విషయం తెలిసిందే. జులైలో జరిగిన ఈ సిరీస్‌ను లంక జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక జట్టు మొదటగా క్యాలిఫైర్ మ్యాచ్‌లు ఆడనుంది. శ్రీలంక టీ20 ప్రపంచకప్ జట్టు: డసున్ శనక (కెప్టెన్), ధనంజయ్ డిసిల్వా (వైస్ కెప్టెన్), కుశాల్ పెరీరా, దినేష్ చండీమల్, అవిష్క ఫెర్నాండో, రాజపక్స, అసలంక, వనిందు హసరంగ, కె మెండిస్, కరుణరత్నే, నువాన్ ప్రదీప్, దుష్మంత చమీరా, జయవిక్రమ, మధుశంక, తీక్షణ. రిజర్వ్ ప్లేయర్స్: లహిరు కుమార, బి ఫెర్నాండో, అఖిల ధనంజయ, పి తరంగ చదవండి: అదే జరిగితే 2-2తో సిరీస్ సమం అవుతుంది.. -
అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు.. ఎవరు ఆ బౌలర్?
కొలంబో: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-1తో లంకేయులు కైవసం చేసుకున్నారు. ఈ విజయంలో ఆ జట్టు స్పిన్నర్ మహీష్ తీక్షణ కీలక పాత్ర పోషించాడు. తన వన్డే అరంగేట్ర మ్యాచ్‌లో అధ్బుతమైన ప్రదర్శన చేశాడు. అతడు 10 ఓవర్లలో 4 వికెట్లు తీసి 37 పరుగులు ఇచ్చాడు. అయితే మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక.. మహీష్ తీక్షణపై ప్రశంసల వర్షం కురిపించాడు. "దక్షిణాఫ్రికాతో టీ 20 ల్లో ఆడేందుకు తొలుత తీక్షణను జట్టులోకి తీసుకున్నాము.. ఆనుహ్యంగా మరో స్పిన్నర్ ను జట్టులోకి తీసుకున్నాను. కానీ నేను కెప్టెన్‌గా ఆ రిస్క్ తీసుకున్నాను. సెలెక్టర్లు ,కోచ్‌లు నాకు మద్దతు ఇచ్చారు. అది మాకు పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది, ”అని మూడో వన్డే తర్వాత శనక వెల్లడించాడు. తీక్షణ ఇంతకు ముందు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడాడని, కుడి చేతి వాటం స్పిన్నర్ స్లీవ్‌లో చాలా వైవిధ్యాలు ఉన్నందున బ్యాట్స్మన్లు అతడి బౌలింగ్ ను ఆర్ధం చేసుకోవడం అంత సులభం కాదని దాసున్ శనక అన్నారు. చదవండి: Ayesha Mukherjee: అసలు ఎవరీ అయేషా..? శిఖర్‌తో విడిపోవడం వెనుక.. Four wickets on ODI debut 💪 A memorable performance from Maheesh Theekshana!#SLvSA pic.twitter.com/l7ZxALaJF7 — ICC (@ICC) September 8, 2021 -
దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. వన్డే సిరీస్ శ్రీలంకదే
కొలంబో: సిరీస్ విజేతను తేల్చే మూడో వన్డేలో సమష్టి ప్రదర్శన కనబర్చిన శ్రీలంక... దక్షిణాఫ్రికాపై 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 203 పరుగులు చేసింది. అసలంక (47; 2 ఫోర్లు), దుష్మంత చమీర (29; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీశాడు. ఛేదనలో దక్షిణాఫ్రికా 30 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ (4/37)తో దక్షిణాఫ్రికాను పడగొట్టాడు. అతడికి చమీర (2/16), హసరంగ (2/32) సహకరించారు. చమీర ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. చదవండి: శిఖర్ ధావన్ విడాకులు -
రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు
కొలంబో: వర్షం అంతరాయం కలిగించిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 67 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత సఫారీ జట్టు 47 ఓవర్లలో 6 వికెట్లకు 283 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జేన్‌మన్ మలాన్ (135 బంతుల్లో 121; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. హెండ్రిక్స్ (51; 5 ఫోర్లు) రాణించాడు. వర్షం కారణంగా శ్రీలంక లక్ష్యాన్ని 41 ఓవర్లకు 265 పరుగులుగా కుదించారు. ఛేదనలో లంక 36.4 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. చరిత్ అసలంక (77; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. షమ్సీ 5 వికెట్ల శ్రీలంకను కట్టడి చేశాడు. చదవండి: BAN Vs NZ: వార్నీ ఇదేం డెలివరీ.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్ -
టీమిండియానా మజాకా.. మనతో క్రికెట్ ఆడితే కనకవర్షం కురవాల్సిందే..!
కొలంబో: టీమిండియాతో సిరీస్ ఆడేందుకు ప్రపంచంలోని ఏ క్రికెట్ బోర్డయినా ఆసక్తి కనబరుస్తుంది. ఎందుకంటే, మన జట్టుతో ఆడితే ప్రత్యర్ధి దేశాల బోర్డులపై కనక వర్షం కురుస్తుంది మరి. తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు.. బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుని స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్‌ను ప్లాన్ చేసింది. ఈ సిరీస్ నష్టాల్లో కూరుకుపోయిన లంక బోర్డుపై కాసుల వర్షం కురిపించింది. ఆటగాళ్లకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న బోర్డుకు వంద కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూర్చింది. లంక బోర్డు సెక్రటరీ మోహన్ డిసిల్వా కథనం ప్రకారం.. ఈ సిరీస్ ద్వారా లంక బోర్డుకు రూ.107.7 కోట్లు వచ్చాయని తెలుస్తోంది. నిజానికి ఈ పర్యటనలో తొలుత మూడు వన్డేల సిరీస్ మాత్రమే జరగాల్సి ఉండింది. అయితే అక్కడి బోర్డు బీసీసీఐని అభ్యర్థించి మరో మూడు టీ20ల సిరీస్ ఆడటానికి ఒప్పించింది. ఇది ఆర్థికంగా అక్కడి బోర్డుకు బాగా కలిసి వచ్చింది. బ్రాడ్‌కాస్టింగ్, ఇతర స్పాన్సర్‌షిప్స్‌ల ద్వారా భారీ మొత్తం దక్కించుకోగలిగింది. కాగా, ఈ సిరీస్ కోసం వచ్చి, విజయవంతం చేసిన కోచ్ ద్రవిడ్, ధవన్ సేనకు లంక బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. ఈ టూర్లో వన్డే సిరీస్ టీమిండియా గెలవగా.. టీ20 సిరీస్‌ను శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే. -
భారత ప్లేయర్‌కు కరోనా.. రెండో టీ20 వాయిదా!
-
ఆరంగ్రేట్రం మ్యాచ్‌లోనే గోల్డెన్ డక్
కోలంబో: భారత యువ ఓపెనర్ పృధ్వీ షా తన టీ20 ఆరంగ్రేట్ర మ్యాచ్‌లో భారత అభిమానులను నిరాశపరిచాడు. శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో ఆడిన తొలి బంతికే డౌకౌట్ అయ్యి పెవిలియన్‌కు చేరాడు. తద్వారా గోల్డెన్ డకౌట్ అపప్రథను మూటగట్టుకున్నాడు. చమీరా వేసిన మొదటి ఓవర్ లో మొదటి బంతికే కీపర్ క్యాచ్ తో పృథ్వీ షా ఔట్ అయ్యి వెనుతిరిగాడు. కాగా ఆరంగ్రేట్ర మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయిన రెండో భారత ఆటగాడుగా రికార్డు నమోదు చేశాడు. ఇంతకు ముందు కెఎల్ రాహుల్ ఆరంగ్రేట్రం టీ20 మ్యాచ్‌లో ఇలానే గోల్డెన్ డక్ అయ్యాడు. 2016లో జింబావ్వేపై కెఎల్ రాహుల్ గోల్డెన్ డక్ కాగా, రెండో భారత ఆటగాడిగా పృథ్వీ షా చేరాడు. కాగా, ఇటీవల లంకేయులతో ముగిసిన వన్డే సిరీస్‌లో పృథ్వీ షా పర్వాలేదనిపించాడు. తొలి వన్డేలో 43, రెండో వన్డేలో 13, మూడో వన్డేలో 49 పరుగులు చేశాడు. ఆ వన్డే సిరీస్‌లో 20 బౌండరీల సాయంతో 105 పరుగులు చేశాడు. -
వరుస ఓటములు.. శ్రీలంకకు మరో భారీ షాక్!
కొలంబో: టీమిండియా చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పొంది.. సిరీస్‌ని చేజార్చుకున్న శ్రీలంకకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొలంబో వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా శ్రీలంక జట్టుకు జరిమానా విధించారు. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ రంజన్.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టీమ్ నిర్దిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసింది. అయితే శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తప్పిదాన్ని అంగీకరించడంతో ఎలాంటి తదుపరి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఇక ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ నిబంధనల ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఒక్కో పాయింట్ కోత విధిస్తారు. ఈ నేపథ్యంలో.. ఒక్క ఓవర్ తక్కువగా వేసిన శ్రీలంక ఓ పాయింట్‌ను కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచేలా కనిపించిన శ్రీలంక టీమ్.. టీమిండియా ఆటగాడు దీపక్ చహర్ (69) దెబ్బకి అనూహ్యరీతిలో 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగానే శుక్రవారం మూడో వన్డే జరగనుంది. -
భారత్, శ్రీలంక తొలి వన్డే: ధావన్ ధమాకా.. ఒక్క వన్డే 10 రికార్డులు
ముంబై: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ధావన్ సారధ్యంలో టీమిండియా యువ క్రికెటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దీంతో ఈ మ్యాచ్‌లో 10 కొత్త రికార్డులు నమోదయ్యాయి. ఆ 10 రికార్డులు ఏంటంటే.. ► తొలి వన్డే భారత్, శ్రీలంక మధ్య 160 వ వన్డే మ్యాచ్ కాగా, శ్రీలంకపై 92 విజయాలు నమోదు చేసి కొత్త రికార్డును నమోదు చేసుకున్నది భారత్. పాకిస్తాన్ కూడా శ్రీలంకపై 155 మ్యాచులు ఆడి 92 విజయాలు నమోదు చేసుకున్నది. అయితే పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును టీమిండియా సమం చేసింది. ►శ్రీలంకను 9 వరుస మ్యాచుల్లో ఓడించి టీమిండియా కొత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఘనత ఇంతవరకు ఏ జట్టు సాధించలేదు. గతం లో 4 వరుస మ్యాచుల్లో గెలుపొంది దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. ►అంతర్జాతీయ క్రికెట్లో శిఖర్ ధావన్ 10 వేల పరుగులు పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన ధావన్ భారత్ నుంచి 14 వ బ్యాట్స్ మాన్ గా రికార్డు నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ 34,357 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలో శిఖర్ ధావన్ 95 బంతులు ఆడి 86 పరుగులు చేశాడు ►శిఖర్ ధావన్ తన వన్డే కెరీర్లో 50 వ సారి 50 కి పైగా పరుగులు సాధించాడు. గబ్బర్ ఇప్పటివరకు వన్డేల్లో 33 అర్ధ సెంచరీలు, 17 సెంచరీలు చేశాడు. ఇటువంటి ఘనత సాధించిన 10వ భారత ఆటగాడు గా ధావన్ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ అందరికన్నా ముందున్నాడు. ►తొలి వన్డేలో 23 వ పరుగులు చేయగానే శిఖర్ ధావన్ వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకుని గంగూలీని వెనక్కి నెట్టాడు. తక్కువ వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తిచేసిన నాలుగో ఆటగాడిగా శిఖర్ ధావన్ నిలిచాడు. సౌరవ్ గంగూలీ 147 ఇన్నింగ్స్‌లో 6 వేల పరుగులు చేయగా, శిఖర్ 141 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. 123 ఇన్సింగ్స్‌ల్లో వేగంగా 6 వేల పరుగులు పూర్తి చేసి హషీం ఆమ్లా తొలి స్థానంలో ఉన్నారు. ►శ్రీలంకపై అతి తక్కువ ఇన్నింగ్స్ లో 1000 పరుగులు మైలురాయిని చేరిన రికార్డును కూడా ధావన్ తన పేరిట నమోదు చేసుకున్నాడు. శ్రీలంకపై శిఖర్ 17 ఇన్నింగ్స్‌లు ఆడి వేగంగా వేయి పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచి దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీం ఆమ్లా రికార్డును బద్దలు కొట్టాడు. ►కెప్టెన్‌గా ఆడిన తొలి వన్డేలో 50 ప్లస్ పరుగులు చేసిన శిఖర్ ధావన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా ఆడిన తొలి వన్డేలోనే 50 ప్లస్ పరుగులు చేసిన ఐదో భారతీయ క్రికెటర్‌గా శిఖర్ నిలిచాడు. ధావన్ కన్నా ముందు అజిత్ వాడేకర్, రవిశాస్త్రి, సచిన్, అజయ్ జడేజా ఉన్నారు. ►ఇదే వన్డేలో అరగేంట్ర మ్యాచ్‌లోనే ఇషాంత్ కిషన్ కొత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఒకే ఏడాదిలో వన్డేతోపాటు టీ20 లో హాఫ్ సెంచరీ చేసిన అరగేంట్ర రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో 42 బంతులను ఎదుర్కొన్న ఇషాంత్ కిషన్ 59 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 లో ఇషాంత్ కిషన్ హాఫ్ సెంచరీ చేశాడు. ►పవర్ ప్లేలో అత్యధిక పరుగులు నమోదు చేసిన జట్టుగా ఇండియాకు కొత్త రికార్డు నమోదు చేసింది. తొలి 10 ఓవర్లలో ఇండియా వికెట్ నష్టపోయి 91 పరుగులు చేసింది. 2013 నుంచి ఇదే అత్యధిక స్కోర్. 2019 లో వెస్టిండీస్‌పై పవర్ ప్లేలో ఇండియా 83 పరుగులు చేసింది. ►ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా అర్ధ సెంచరీ చేయకుండా శ్రీలంక అత్యధిక స్కోర్ నమోదు చేయడం ఇదే మెదటి సారి. 9 వికెట్లు కోల్పోయి శ్రీలంక 262 పరుగులు చేసింది. గతంలో హాఫ్ సెంచరీలు లేకుండా శ్రీలంక జట్టు (పాకిస్తాన్ జట్టుపై 2006లో ) 253 పరుగులు చేసింది. WATCH: 📽 1st ODI Highlights | Sri Lanka vs India 2021 - https://t.co/qxjvmP1VGl #SLvIND — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 19, 2021 -
గబ్బర్ సేనను ఢీకొట్టబోయే లంక జట్టు ఇదే..
కొలంబో: శిఖర్ ధవన్ నేతృత్వంలోని భారత జట్టును ఢీకొట్టబోయే శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. జూలై 18 నుంచి ప్రారంభం కాబోయే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ల కోసం 25 మంది సభ్యులతో కూడి జంబో జట్టును ఎంపిక చేసింది. సిరీస్ మొత్తానికి డసన్ షనకను నూతన సారధిగా ఎంపిక చేసింది. గడిచిన నాలుగేళ్లలో శ్రీలంకకు షనక ఆరో కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. 2018 నుంచి దినేశ్ చండీమాల్, ఎంజెలో మాథ్యూస్, లసిత్ మలింగా, దిముత్ కరుణరత్నే, కుశాల్ పెరీరా కెప్టెన్లుగా వ్యవహరించారు. మరోవైపు గాయం కారణంగా మాజీ కెప్టెన్ కుశాల్ పెరీరా, బినురా ఫెర్నాండో సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. కాగా, షనక 2019లో తొలిసారి శ్రీలంక కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని సారధ్యంలో పాకిస్థాన్‌పై టీ20 సిరీస్ విజయాన్నందించాడు. అనంతరం వెస్టిండీస్ పర్యటనకు కూడా ఎంపికైనప్పటికీ వీసా సమస్య కారణంగా వెళ్లలేకపోయాడు. ఇక భారత్‌తో సిరీస్‌లకు ధనుంజయ డిసిల్వా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో టీ20, వన్డే సిరీస్‌ల్లో చిత్తుగా ఓడిన శ్రీలంక జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. దీనికి తోడు జట్టులో కరోనా కేసులు, బోర్డుతో కాంట్రాక్ట్ వివాదం వంటివి జట్టును కుదుపునకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో భారత్‌తో సిరీస్‌లో ఏమేరకు ప్రభావం చూపగలుగుతుందోనని ఆ దేశ అభిమానలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పర్యటనలో స్టార్ ప్లేయర్లు కుశాల్ మెండిస్, వికెట్ కీపర్ నిరోషన్ డిక్ వెల్లా, ధనుష్క గుణతిలక బయో బబుల్ నిబంధనలను అధిగమించి నిషేధానికి గురయ్యారు. ప్రస్తుతం వారిపై విచారణ జరుగుతుంది. మరోవైపు ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ల విషయంలోనూ వివాదం నడుస్తోంది. చివరకు 29 మంది ఆటగాళ్లు కాంట్రాక్టులపై సంతకాలు చేసినప్పటికీ సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ వ్యక్తిగత కారణాలతో భారత్‌తో సిరీస్‌లకు దూరమయ్యాడు. శ్రీలంక జట్టు: డసన్ షనక(కెప్టెన్), ధనుంజయ డిసిల్వా(వైస్ కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, భనుక రాజపక్స, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, వానిందు హరసరంగ, యాషెన్ బండార, మినొద్ భానుక, లాహిరు ఉడారా, రామేశ్ మెండీస్, చామిక కరుణరత్నే, దుష్మంత చమీరా, లక్షణ్ సందకన్, అకిలా ధనుంజయ, షిరన్ ఫెర్నాండో, ధనుంజయ లక్షణ్, ఇషాన్ జయరత్నే, ప్రవీణ్ జయవిక్రెమా, అసితా ఫెర్నాండో, కసున్ రజితా, లాహిరు కుమార, ఇసురు ఉడాన -
లంక జట్టును వదలని కరోనా భూతం.. తాజాగా క్రికెటర్‌కు పాజిటివ్
కొలంబో: ఇంగ్లండ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన శ్రీలంక క్రికెట్ జట్టును కరోనా భూతం వదలట్లేదు. తొలుత బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కు వైరస్ నిర్ధారణ కాగా, ఆ తరువాత డేటా అనలిస్టు జీటీ నిరోషన్‌కు కరోనా సోకిందని తేలింది. తాజాగా, సందున్ వీరక్కోడి అనే క్రికెటర్ మహమ్మారి బారిన పడ్డాడని తేలడంతో సహచర క్రికెటర్లతో పాటు భారత శిబిరంలోనూ ఆందోళన మొదలైంది. ప్రస్తుతం వీరక్కోడిని లంక క్రికెట్ బోర్డు ఐసోలేషన్‌కు తరలించింది. అతడితో కలిసున్న వారినీ కూడా ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్‌కు పంపింది. కాగా, అంతకుముందు వీరక్కోడి.. మరో 15 మంది సీనియర్ క్రికెటర్లతో కలిసి సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేశాడు. టీమిండియాతో సిరీస్‌కు ముందు సాధన మ్యాచులు ఆడించేందుకు కొందరు క్రికెటర్లను లంక క్రికెట్ బోర్డు శుక్రవారం రాత్రి దంబుల్లాకు పంపింది. అందులో వీరక్కోడి సహా 26 మంది క్రికెటర్లు ఉన్నారు. దీంతో వీరంతా ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. అయితే, ఇంగ్లండ్ నుంచి తిరిగొచ్చిన లంక జట్టులో వీరక్కోడి సభ్యుడు కాకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే, కరోనా దెబ్బకు శ్రీలంకతో వన్డే సిరీస్ ఐదు రోజులు ఆలస్యంగా మొదలుకానుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 13న ప్రారంభంకావాల్సిన వన్డే సిరీస్.. జులై 18 నుంచి మొదలవుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. లంక క్రికెట్ జట్టులో వరుసగా కరోనా కేసులు వెలుగు చూడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు 18, 20, 23 తేదీల్లో జరుగుతాయని పేర్కొన్నారు. అనంతరం జులై 25 నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతోందని సూచన ప్రాయంగా ప్రకటించారు. -
లంక క్రికెట్లో పెను సంక్షోభం.. రిటైర్మెంట్ యోచనలో స్టార్ క్రికెటర్
కొలంబో: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాశించిన శ్రీలంక క్రికెట్ జటు,ఇప్పుడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దశాబ్ద కాలం కిందటితో పోలిస్తే ఇప్పుడు జట్టు పూర్తి బలహీనంగా మారడం, వరుస ఓటములు, బోర్డుతో క్రికెటర్ల విభేదాలు.. శ్రీలంక క్రికెట్‌ను కష్టాల్లోకి నెట్టాయి. కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు లంక క్రికెటర్లు నో అంటున్నారన్న వార్తల నేపథ్యంలో సీనియర్ ప్లేయర్ ఏంజలో మాథ్యూస్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారన్న వార్త సంచలనంగా మారింది. త్వరలోనే ఈ విషయాన్ని అతను శ్రీలంక క్రికెట్ బోర్డుకు చెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, వన్డేలు, టీ20ల నుంచి తనను తప్పించడంపై మాథ్యూస్ అసంతృప్తితో ఉన్నాడు. యువ ఆటగాళ్లకు ఛాన్సిచ్చే పేరుతో లంక సెలక్టర్లు అతన్ని పక్కనపెట్టారు. అయితే దశాబ్ద కాలంగా శ్రీలంక క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న చాలా తక్కువ మంది క్రికెటర్లలో మాథ్యూస్ ఒకడు. 2017లో పరిమిత ఓవర్ల క్రికెట్లో అతని సగటు 63 కాగా, 2018లో 52గా ఉంది. 2019 వన్డే ప్రపంచకప్‌లో లంక జట్టు తరఫున బెస్ట్ బ్యాట్స్‌మన్ కూడా అతడే. అయితే తాజాగా లంక బోర్డు కాంట్రాక్ట్‌ను వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేసిన ప్లేయర్స్‌కు నాయకత్వం వహించిన మాథ్యూస్.. అనూహ్యంగా కాంట్రాక్ట్‌పై సంతకం చేయడానికి అంగీకరించాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన మాథ్యూస్ లంక తరఫున 90 టెస్టులు, 218 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. మొత్తం 13,219 పరుగులు, 218 వికెట్లు పడగొట్టాడు. -
ధావన్ సేన ప్రాక్టీస్ షురూ
కొలంబో: పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు శ్రీలంక చేరిన ధావన్ సేన శుక్రవారం ప్రాక్టీస్‌లో పాల్గొంది. మూడు రోజుల క్వారంటైన్ ముగియడంతో ఆటగాళ్లందరూ ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో నెట్ ప్రాక్టీస్ చేశారు. అక్టోబర్, నవంబర్లలో యూఏఈలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే చివరి సిరీస్ ఇది. ఈ స్వల్పకాలిక పర్యటనలో ధావన్ నేతృత్వంలోని భారత్ 3 వన్డేలతో పాటు 3 టి20లు కూడా ఆడుతుంది. ప్రపంచకప్ ఆశలు పెట్టుకున్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, సంజూ సామ్సన్‌లకు ఈ టూర్ కీలకంగా మారింది. కొలంబోలో ఇరు జట్ల మధ్య ఈ నెల 13న తొలివన్డే జరుగనుం ది. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి సారథ్యంలోని టీమిం డియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. -
ఇంగ్లండ్ క్లీన్‌స్వీప్
సౌతాంప్టన్: శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ ల టి20 సిరీస్‌ను ఇంగ్లండ్ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. శనివారం జరిగిన ఆఖరి టి20లో ఇంగ్లండ్ 89 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. మొదట ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (48 బంతుల్లో 76; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), బెయిర్‌స్టో (43 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. దీంతో తర్వాత బ్యాట్స్‌మెన్ విఫలమైనా ఆతిథ్య జట్టు భారీస్కోరు చేసింది. చమీరాకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం శ్రీలంక 18.5 ఓవర్లలో 91 పరుగులకు ఆలౌటైంది. బినుర ఫెర్నాండో (20), ఒషాడో ఫెర్నాండో (19), డిక్వెలా (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లు విల్లే 3, స్యామ్ కరన్ 2 వికెట్లు తీశారు. -
ఆటగాళ్లకు షాకిచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆటగాళ్ల జీతాలు తగ్గించడంపై వివాదం తలెత్తింది. ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకొన్నది. దీంతో కెప్టెన్ కరుణరత్నే, మాథ్యూస్,సురంగ లక్మల్,దినేష్ చండిమల్ సహా పలువురు సీనియర్ క్రికెటర్లు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. కొత్త కేంద్ర ఒప్పందం ప్రకారం వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలు. బోర్డు వీరిని టాప్ క్యాటగిరిలో వేసింది. దీంతో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. మే 23 నుంచి బంగ్లాదేశ్‌లో ఈ జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడవలసి ఉన్నది. కెప్టెన్‌కు కూడా తగ్గనున్న జీతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కరుణరత్నేకు కూడా ఆయన జీతంలో రూ.22 లక్షలు కోత విధించారు. ఈ ఏడాది జనవరిలో వాండరర్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన కరునరత్నే.. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌లలో 427 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయినప్పటికీ బోర్డు నుంచి ఏమాత్రం ఉపశమనం లభించలేదు. కొత్త కాంట్రాక్టులో కరుణరత్నే జీతం రూ.73 లక్షల నుంచి రూ.51 లక్షలకు తగ్గించారు. (చదవండి:10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్) -
Sri Lanka Tour: హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఇంగ్లండ్ పర్యటన లో భాగంగా బీసీసీఐ తుది జట్టును కొన్ని రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితో పాటుగా శ్రీలంక పర్యటన కోసం మరో టీంను బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించారు. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే మరోక వన్డే జట్టును శ్రీలంక పర్యటనకు పంపనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు విరాట్‌కోహ్లి సారథ్యంలో టీమిండియా ఈ నెల 29 న ఇంగ్లండ్‌కు పయనమవనున్నారు. ఇక న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన నెల తరువాత ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సమయంలోనే టీమిండియా శ్రీలంక పర్యటన చేయనుంది. ఈ నేపథ్యంలో భారత వన్డే జట్టుకు కోచ్ రవిశాస్త్రి అందుబాటులో ఉండడు. దీంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో జరిగే మ్యాచులకు రాహుల్ ద్రవిడ్‌ను హెడ్ కోచ్‌గా పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. వీరితో పాటుగా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ)కు సంబంధించిన సిబ్బంది కూడా శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జూలై 13న తొలి వన్డే కొలంబో: శ్రీలంకలో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సంబంధించి మ్యాచ్‌ల తేదీలు ఖరారయ్యాయి. ఈ టూర్లో భాగంగా భారత్, లంక మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. జూలై 13, 16, 19 తేదీల్లో వన్డేలు... జూలై 22, 24, 27 తేదీల్లో టి20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. హంబన్‌టోట, దంబుల్లాలను వేదికలుగా పరిశీలిస్తున్నారు. 2018 నిదాహస్ ట్రోఫీ తర్వాత భారత జట్టు శ్రీలంకలో ఆడలేదు. చదవండి: క్రీడా శాఖ మంత్రిగా మనోజ్ తివారి -
క్రికెట్‌కు తిషారీ పెరీరా గుడ్ బై
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ తిషారా పెరీరా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. తన నిర్ణయం ఈరోజు నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ)కి లేఖ ద్వారా పెరీరా తెలియజేశాడు. తన వీడ్కోలుకు ఇదే తగిన సమయమని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. శ్రీలంక తరఫున ఆరు టెస్టులు మాత్రమే ఆడిన పెరీరా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం 166 వన్డేలు, 84 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 37 మ్యాచ్‌లు ఆడాడు. వన్డే ఫార్మాట్లో 2,338 పరుగులు చేసిన పెరీరా.. టీ20ల్లో 1204 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 175 వికెట్లు సాధించిన పెరీరా.. అంతర్జాతీ టీ20ల్లో 51 వికెట్లు తీశాడు. ‘ నేను శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్పగా భావిస్తున్నాను. ఓవరాల్‌గా ఏడు క్రికెట్ వరల్డ్‌కప్‌లో శ్రీలంక తరఫున ఆడాను. 2014లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాను. ఇది నా జీవితంలో ఒక గొప్ప ఘనత’ అని ఎస్ఎల్సీకి రాసిన లేఖల పేర్కొన్నాడు. తిషారా పెరీరా వీడ్కోలుపై ఎస్ఎల్సీ సీఈవో అష్లే డిసిల్వా మాట్లాడుతూ.. ‘ అతనొక గొప్ప ఆల్‌రౌండర్. శ్రీలంక క్రికెట్ సాధించిన పలు ఘనతల్లో పెరీరా భాగస్వామ్యం ఉంది. లంక క్రికెట్‌కు పెరీరా ఎంతో చేశాడు’ అని పేర్కొన్నారు. ఇక్కడ చదవండి: ఐపీఎల్ రద్దు తప్పదా? ఇద్దరు ప్లేయర్లకు కరోనా, నేటి మ్యాచ్ వాయిదా! -
మాజీ క్రికెటర్‌పై ఐసీసీ 8 ఏళ్ల నిషేధం
దుబాయ్: శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్హారా లోకుహెట్టిగేపై ఎనిమిదేళ్ల నిషేధం పడింది. అతనిపై అవినీతి ఆరోపణలు, ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో దిల్హారాపై సుదీర్ఘ నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. 2013లో శ్రీలంక తరఫున చివరిసారి ఆడిన అతను దాదాపు ఎనిమిదేళ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కానీ శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన దిల్హారా లోకుహెట్టిగేపై అవినీతి, ఫిక్సింగ్‌లకు పాల్పడినట్లు ఐసీసీకి చెందిన అవినీతి నిరోధక విభాగం ధృవీకరించింది.. ఐసీసీ ఆర్టికల్ 2.1.1 నియమావళి ప్రకారం ఫిక్సింగ్ చేయడానికి సహకరించడం, ఫిక్సింగ్‌కు పాల్పడటం, మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి అంగీకరించడం లాంటి తప్పిదాలను చేసినట్లు సదురు అవినీతి నిరోధక విభాగం గుర్తించింది. అదే సమయంలో ఇతరులను ప్రత్యక్షంగా లేక పరోక్షంగా గానీ ప్రలోభపెట్టడం. ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించేందుకు సలహాలు ఇవ్వడం, ఆశ చూపడం వంటి తప్పిదాలకు పాల్పడ్డాడు. ఆర్టికల్ 2.1.4 నియమావళి ప్రకారం దీన్ని ఉల్లంఘిస్తే నిషేధం తప్పనిసరి. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నిర్వహించిన టీ10 లీగ్‌లో నిబంధనలు ఉల్లంఘించి ఫిక్సింగ్‌కు సహకరించడంతో లోకుహెట్టిగేపై బ్యాన్ తప్పలేదు. శ్రీలంక తరఫున 2005 నుంచి 2013 వరకూ అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. జాతీయ జట్టుకు 9 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లకు మాత్రమే లోకుహెట్టిగే ప్రాతినిథ్యం వహించాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన అతనికి అంతర్జాతీయ సెంచరీలు కానీ హాఫ్ సెంచరీలు కానీ లేవు. -
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన శ్రీలంక ఆల్‌రౌండర్
కొలొంబో: శ్రీలంక ఆల్‌రౌండర్ తిసార పెరీరా అరుదైన రికార్డును సాధించాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి లంక క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు. శ్రీలంక లిస్ట్ ఏ క్రికెట్లో భాగంగా శ్రీలంక ఆర్మీ అండ్ స్పోర్ట్స్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ప్రత్యర్ధి బౌలర్ దిల్హన్ కూరే బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో అతను 13 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ(52 పరుగులు) పూర్తి చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ కాగా, అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు శ్రీలంక ఆల్‌రౌండర్ కౌసల్య వీరరత్నే పేరిట నమోదై ఉంది. రంగన క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన వీరరత్నే 2005 నవంబర్‌లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ(18 బంతుల్లో 66) పూర్తిచేశాడు. శ్రీలంక లిస్ట్ ఏ క్రికెట్లో ఇదే వేగవంతమైన అర్ధశతకం. వీరరత్నే ఫిఫ్టీలో 2 ఫోర్లు, 8 సిక్సర్లుండగా... అందులో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు సాధించడం విశేషం. కాగా, తిసార పెరీరా ఈ ఘనతను సాధించడానికి కొద్ది వారాల క్రితమే అంతర్జాతీయ టీ20లో విండీస్ యోధుడు కీరన్ పోలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. శ్రీలంకతోనే జరిగిన ఈ మ్యాచ్‌లో లంక బౌలర్ అఖిల ధనుంజయ బౌలింగ్‌లో పోలార్డ్ ఈ ఘనతను సాధించాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్ల జాబితాలో తిసార పెరీరా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పెరీరాకు ముందు గ్యారి సోబర్స్(వెస్టిండీస్), రవిశాస్త్రి(భారత్), గిబ్స్(దక్షిణాఫ్రికా), యువరాజ్(భారత్), రాస్ వైట్లీ(ఇంగ్లండ్), హజ్రతుల్లా జజాయ్(ఆఫ్ఘనిస్తాన్), లియో కార్టర్(న్యూజిలాండ్), పోలార్డ్(వెస్టిండీస్) ఉన్నారు. చదవండి: ముంబై ఇండియన్స్ శిబిరంలో రోహిత్ -
ఇండియాదే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి20 కప్
-
ఇండియాదే లెజెండ్స్ కప్
రాయ్‌పూర్: రిటైర్డ్ క్రికెటర్లతో నిర్వహించిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టి20 క్రికెట్ టోర్నీ కప్‌లో భారత్ లెజెండ్స్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలోని భారత జట్టు 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్ జట్టును ఓడించింది. యూసుఫ్ పఠాన్ (36 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు)... యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో... తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగుల భారీ స్కోరు చేసింది. సెహ్వాగ్ (12 బంతుల్లో 10; 1 సిక్స్) విఫలంకాగా... సచిన్ టెండూల్కర్ (23 బంతుల్లో 30; 5 ఫోర్లు) రాణించాడు. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. దిల్షాన్ (18 బంతుల్లో 21; 3 ఫోర్లు), జయసూర్య (43; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే వీరిద్దరు అవుటయ్యాక లంక జోరు తగ్గింది. చివర్లో జయసింఘే (30 బంతుల్లో 40; ఫోర్, 2 సిక్స్‌లు), వీరరత్నే (15 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా ఫలితం లేకపోయింది. భారత స్పిన్నర్ యూసుఫ్ పఠాన్ రెండు వికెట్లు తీశాడు. చత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ చేతుల మీదుగా సచిన్ లెజెండ్స్ కప్‌ను అందుకున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: (యువీ దూకుడు.. యూసఫ్ మెరుపులు) -
యువీ దూకుడు.. యూసఫ్ మెరుపులు
రాయ్‌పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం శ్రీలంక లెజెండ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 182 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన శ్రీలంక లెజెండ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఇండియా లెజెండ్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఇండియా లెజెండ్స్ ఓపెనర్లలో సెహ్వాగ్(10) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై బద్రీనాథ్(7) కూడా నిరాశపరిచాడు. కాగా, సచిన్ టెండూల్కర్(30; 23 బంతుల్లో 5 ఫోర్లు)లు ఆకట్టుకున్నాడు. అటు తర్వాత యువరాజ్ సింగ్- యూసఫ్ పఠాన్లు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. యువీ(60; 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగగా, యూసఫ్(62 నాటౌట్; 36 బంతుల్లో 4 ఫోర్లు, 5సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా లెజెండ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ జోడి నాల్గో వికెట్‌కు 85 పరుగులు చేసింది. శ్రీలంక లెజెండ్స్ బౌలర్లలో హెరాత్, సనత్ జయసూర్య, మహరూఫ్, వీరరత్నేలకు తలో వికెట్ లభించింది. -
మ్యాచ్ మధ్యలో గ్రౌండ్లో ఉన్న వారంతా పడుకున్నారు..
ఆంటిగ్వా: విండీస్, శ్రీలంక జట్ల మధ్య సోమవారం జరిగిన మూడో వన్డేలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మ్యాచ్ మధ్యలో హఠాత్తుగా తేనెటీగలు రంగప్రవేశం చేయడంతో గ్రౌండ్లో ఉన్న వారంతా నేలపై బోర్లా పడుకున్నారు. ఈ సంఘటన శ్రీలంక ఇన్నింగ్స్38వ ఓవర్లో చోటు చేసుకుంది. విండీస్ బౌలర్ అండర్సన్ ఫిలిప్ బౌలింగ్ చేస్తుండగా, ఒక్కసారిగా తేనెటీగల గుంపు మైదానాన్ని చుట్టుముట్టింది. ఇది గమనించిన ఆటగాళ్లు, అంపైర్లు వాటి నుంచి రక్షణ కోసం ఫీల్డ్‌పై పడుకున్నారు. కాసేపటికి తేనెటీగల గుంపు ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా వెళ్లిపోవడంతో గ్రౌండ్లో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. అనుకోని ఈ పరిణామానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. Bee 🐝 attack in #WIvSri#INDvENGt20 #Cricket pic.twitter.com/KgA5as5myR — Cricket Scorecards (@MittiDaPutla) March 14, 2021 కాగా, మ్యాచ్ మధ్యలో తేనెటీగలు అంతరాయం కలిగించడం ఇదే తొలిసారేమీ కాదు. 2019 ప్రపంచకప్సందర్భంగా దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా శ్రీలంక, విండీస్ జట్ల మధ్య తాజాగా జరిగిన ఈ వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య విండీస్ జట్టు 5 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. -
వయసు పైబడినా వన్నె తగ్గలేదు..
రాయ్‌పూర్: అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై ఏళ్లు గడిచినా.. దిగ్గజ ఆటగాళ్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. రోడ్ సేఫ్టీ సిరీస్‌లో భాగంగా మొన్న బంగ్లా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (80 నాటౌట్; 35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. నిన్న విండీస్ ఆల్ టైమ్ గ్రేట్ బ్రియాన్ లారా (49 బంతుల్లో 8 ఫోర్లతో 53 నాటౌట్), శ్రీలంక దిగ్గజ ఆటగాడు ఉపుల్ తరంగ(35 బంతుల్లో 8 ఫోర్లుతో 53 నాటౌట్)లు సత్తా చాటాడు. టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక లెజెండ్స్.. విండీస్ లెజెండ్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా(53 నాటౌట్), డ్వేన్ స్మిత్ (27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47) రాణించారు. శ్రీలంక బౌలర్లలో తిలకరత్నే దిల్షాన్, చింతక జయసింఘే చెరో వికెట్ తీశారు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక లెజెండ్స్.. ఉపుల్ తరంగా(53 నాటౌట్) అజేయ అర్ధశతకంతో చెలరేగడంతో 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తరంగాకు తోడుగా తిలకరత్నే దిల్షాన్(37 బంతుల్లో 8 ఫోర్లతో 47) రాణించాడు. విండీస్ బౌలర్లలో టినో బెస్ట్, సులేమాన్ బెన్ రెండేసి వికెట్లు తీయగా.. ర్యాన్ ఆస్టిన్ ఓ వికెట్ పడగొట్టారు. కీలక ఇన్నింగ్స్ అడిన తరంగాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఆదివారం జరుగనున్న తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ లెజెండ్స్‌తో, బంగ్లా దిగ్గజాలు తలపడనున్నారు. -
శ్రీలంక-వెస్టిండీస్ టీ-ట్వంటీలో హైడ్రామా
-
బస్సు డ్రైవర్‌గా లంక స్పిన్నర్...
మెల్బోర్న్: సూరజ్ రణ్దీవ్ గుర్తున్నాడా... శ్రీలంక తరఫున ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో 12 టెస్టులు, 31 వన్డేలు, 7 టి20 మ్యాచ్‌లు ఆడిన ఆఫ్‌స్పిన్నర్. అతని ప్రదర్శనకంటే ఒకసారి మన సెహ్వాగ్ సెంచరీ పూర్తి చేయకుండా ఉద్దేశపూర్వకంగా ‘నోబాల్’ వేసిన బౌలర్‌గానే భారత అభిమానులకు బాగా తెలుసు. రెండేళ్ల క్రితం స్వదేశంలో చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అతను ఉపాధిని వెతుక్కుంటూ ఆస్ట్రేలియాకు చేరుకున్నాడు. మెల్బోర్న్లో స్థానిక క్లబ్‌లలో క్రికెట్ ఆడుతున్నా... సంపాదన కోసం అతను మరో ఉద్యోగాన్ని చూసుకోక తప్పలేదు. దాంతో రణ్దీవ్ అక్కడ బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఫ్రాన్స్ కంపెనీ ‘ట్రాన్స్‌డెవ్’ నిర్వహణలో నడుస్తున్న ప్రజా రవాణా బస్సులో అతను డ్రైవర్‌గా ఉన్నాడు. కొన్ని చిన్నస్థాయి క్రికెట్ దేశాల్లో ఆదాయం కోసం ఇతర పనులు చేయడం సాధారణమే అయినా... ఒక ఆసియా జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రికెటర్ చిరుద్యోగం చేయడం మాత్రం పెద్దగా కనిపించదు. 2011 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రణ్దీవ్ 8 మ్యాచ్‌లు ఆడి ఆకట్టుకునే ప్రదర్శనే (7.68 ఎకానమీ) కనబర్చాడు. లంక తరఫున రణ్దీవ్ 2016లో చివరి మ్యాచ్ ఆడాడు. అతనితోపాటు మరో ఇద్దరు క్రికెటర్లు చింతక జయసింఘే (శ్రీలంక–5 టి20లు), వాడింగ్టన్ వయెంగా (జింబాబ్వే–1 టెస్టు, 3 వన్డేలు) కూడా ఇదే కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఇక్కడ చదవండి: ‘అస్సలు నమ్మలేకపోతున్నా.. గర్వపడేలా చేశాడు’ -
పాస్‌పోర్టు గల్లంతు: కీలక టోర్నికి కెప్టెన్ దూరం?
కొలంబో: విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్టు తప్పనిసరి. అయితే పాస్‌పోర్టు లేకపోతే ఇతర దేశాలకు అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. ఈ పాస్‌పోర్టు పోగొట్టుకోవడంతో ఆ దేశ క్రికెట్ జట్టు కెప్టెన్ విలువైన మ్యాచ్‌లను కోల్పోయే పరిస్థితి వచ్చింది. పాస్‌పోర్ట్ లేదని ఆలస్యంగా గుర్తించగా.. మళ్లీ కొత్తది తీసుకోవడానికి సమయం పడుతుండడంతో ఆ కెప్టెన్ మ్యాచ్‌లకు హాజరవడం అనుమానంగా ఉంది. శ్రీలంక టీ20 కెప్టెన్ దాసూన్ శనక. వెస్టిండీస్ టూర్‌కు ఆయన సారథ్యంలో శ్రీలంక జట్టు వెళ్లింది. శ్రీలంక- వెస్టిండీస్ మధ్య మొత్తం మూడు టీ20, మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. దీనికోసం షెడ్యూల్ ఖరారైంది. మార్చ్ 2 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు వెస్టిండీస్‌లో శ్రీలంక జట్టు పర్యటించనుంది. ఈ మేరకు శ్రీలంక ఆటగాళ్లు వెస్టిండీస్‌కు మంగళవారం పయనమవగా.. టీ20 కెప్టెన్‌గా ఉన్న దాసూన్ శనక వెళ్లలేదు. పాస్‌పోర్టు లేదని గ్రహించాడు. దీంతో వెస్టిండీస్ ప్రయాణం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రెండేళ్ల కిందట పాస్‌పోర్ట్ పోయిందని దాసూన్ శనక తెలిపాడు. తనకు ఐదేళ్ల యూఎస్ వీసా ఉండగా అది వెస్టిండీస్ వెళ్లేందుకు ఉపయోగపడదు. ప్రస్తుతం పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోగా అది వచ్చేందుకు సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో శనక వెస్టిండీస్ పర్యటనకు వెళ్లడం అనుమానంగా ఉంది. పాస్‌పోర్టు లేకపోవడం కారణంగా మ్యాచ్‌లకు దూరం కావడం అనేది జీర్ణించుకోలేని విషయం. -
డుప్లెసిస్ 199.. శ్రీలంక 180
సెంచూరియన్: శ్రీలంకతో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకను రెండో ఇన్నింగ్స్‌లో 180 కుప్పకూల్చి ఇన్నింగ్స్ విజయాన్ని సఫారీలు నమోదు చేశారు. 65/2 ఓవర్‌నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన లంకేయులు మరో 115 పరుగులు జత చేసి మిగతా ఎనిమిది వికెట్లను చేజార్చుకున్నారు. దక్షిణాఫ్రికా బౌలింగ్ దెబ్బకు లంకేయులు చేతులెత్తేశారు. కుశల్ పెరీరా(64), వానిందు హసరంగా( 59)లు మినహా మిగతా ఏ ఒక్కరూ ఆకట్టుకోలేదు. లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నోర్తేలు లంకను ఆరంభంలోనే దెబ్బ కొట్టడంతో ఆ జట్టు ఇక తేరుకోలేకపోయింది. లంకేయులు తమ ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కాగా, దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 621 పరుగులు చేసింది. ఇక్కడ డుప్లెసిస్ పరుగు తేడాతో డబుల్ సెంచరీ కోల్పోయాడు. డుప్లెసిస్ 199 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఫలితంగా టెస్టుల్లో 199 పరుగుల వద్ద ఔటైన 11వ బ్యాట్స్‌మన్‌గా డుప్లెసిస్ నిలిచాడు. కాగా, డుప్లెసిస్ తొలి ఇన్నింగ్స్‌లో కొట్టిన పరుగుల కంటే శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరు నమోదు చేయడం గమనార్హం. డుప్లెసిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. (రహానే ఖాతాలో స్పెషల్ మెడల్.. దాని ప్రత్యేకత ఏమిటి?) -
చెలరేగిన షాహిద్ అఫ్రిది
హంబన్‌తోట: పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మరొకసారి బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. శ్రీలంక వేదికగా జరుగుతున్న లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) టీ20 ఆరంభపు సీజన్లో గాలే గ్లాడియేటర్స్‌కు సారథ్యం వహిస్తున్న అఫ్రిది బ్యాటింగ్‌లో రెచ్చిపోయి ఆడాడు. జఫ్నా స్టాలియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి తన బ్యాటింగ్ పవర్ మరోసారి చూపెట్టాడు.(రాహుల్‌కు క్షమాపణ చెప్పా: మ్యాక్స్‌వెల్) అఫ్రిది హాఫ్ సెంచరీలో మూడు ఫోర్లతో పాటు ఆరు సిక్సర్లు ఉండటం విశేషం. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్రిది వచ్చీ రావడంతో బ్యాట్ ఝుళిపించాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. టీ20 ఫార్మాట్లో అఫ్రిది యాభైకి పైగా పరుగులు సాధించడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2017లో టీ20 బ్లాస్ట్ టోర్నీలో భాగంగా హాంప్‌షైర్ తరఫున ఆడిన అఫ్రిది.. డెర్బీషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకం సాధించాడు. అపై ఇదే అఫ్రిదికి టీ20ల్లో పెద్ద స్కోరు. కాగా, ఎల్పీఎల్లో అఫ్రిది దూకుడుతో గాలే గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కానీ అఫ్రిది జట్టు గెలవలేదు. జఫ్నా స్టాలియన్స్ ఇంకా మూడు బంతులు ఉండగానే 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అవిష్కా ఫెర్నాండో 63 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 92 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షోయబ్ మాలిక్(27 నాటౌట్) అండగా నిలిచాడు. ఈ జోడి 110 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. -
ఎల్పీఎల్లో ఇర్ఫాన్ పఠాన్
న్యూఢిల్లీ: ఈ నెలలో ఆరంభం కానున్న లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆడనున్నాడు. కండీ టస్కర్స్ తరఫున ఇర్ఫాన్ ఆడేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు ఇర్ఫాన్ గుడ్ బై చెప్పడంతో అతను విదేశీ లీగ్‌లో ఆడటానికి మార్గం సుగుమం అయ్యింది. దాంతో లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడటానికి కండీ టస్కర్స్‌తో ఇర్ఫాన్ ఒప్పందం చేసుకున్నాడు. దీనిపై ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ..‘ ఈ లీగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. నేను టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాను. కానీ విదేశీ లీగ్‌లో ఆడాలని నిర్ణయించుకున్నా. నా గేమ్ ఎలా ఉండబోతుందనే దానిపై నాకు ఆసక్తి ఉంది. ఎందుచేత అంటే రెండేళ్ల నుంచి క్రికెట్ ఆడటం లేదు. కానీ ఆడే సత్తా నాలో ఇంకా ఉంది. ఈ లీగ్‌లను మెల్లగా ఆరంభిస్తా. ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా. ఇది నా రీఎంట్రీకి ఒక మార్గమని అనుకుంటున్నా. (ధోని.. యెల్లో జెర్సీలో చివరి మ్యాచ్ ఇదేనా ?) కరోనా వైరస్ కారణంగా రెండుసార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) ఈ నెల 14వ తేదీ నుంచి ఆరంభం కానుంది. ఈ లీగ్ ఆలస్యం కావడంతో క్రిస్ గేల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న వీరిద్దరూ యూఏఈ నుంచి నేరుగా ఎల్పీఎల్ ఆడేందుకు వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ ట్వంటీ 20 శ్రీలంక టోర్నమెంట్ ఆగస్టులో ఆరంభం కావాల్సి ఉంది. కానీ అది నవంబర్ 14కు వాయిదా పడింది. కరోనాతో ఆ లీగ్‌ను జరపాలా..మానాలా అనే సందిగ్థంలో ఉన్న మేనేజ్మెంట్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ లీగ్‌లో గేల్, డుప్లెసిస్లతో పాటు షాహిద్ ఆఫ్రిది, కార్లోస్ బ్రాత్‌వైట్‌లు కూడా ఆడనున్నారు. సుమారు 20 మందికి పైగా విదేశీ ఆటగాళ్లు ఆ లీగ్‌లో ఆడటానికి సుముఖుత వ్యక్తం చేయడం ఆ లీగ్ అదనపు అట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆ లీగ్ ఆడే ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్లో ఉండాలి. అక్కడికి చేరుకున్న తర్వాత క్వారంటైన్ నిబంధనను పూర్తి చేసి బరిలోకి దిగాలి. ఈ లీగ్‌ను కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. ఎల్పీఎల్ నిర్వహణకు ముందుగా మూడు వేదికలు అనుకోగా వాటిని రెండుకు కుదించారు. కాండీ, హమ్‌బాన్‌తోటలో లీగ్ జరగనుంది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకూ ఈ లీగ్‌ను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు ఎల్పీఎల్ జట్లు ఉండగా ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది. ఇదే తొలి ఎడిషన్ కావడం గమనార్హం. -
ఎల్పీఎల్లో క్రిస్‌గేల్, డుప్లెసిస్
కొలంబో: కరోనా వైరస్ కారణంగా రెండుసార్లు వాయిదా పడ్డ లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్) వచ్చే నెలలో ఆరంభం కానుంది. ఈ లీగ్ ఆలస్యం కావడంతో క్రిస్ గేల్, డుప్లెసిస్ వంటి ఆటగాళ్లు అక్కడ ఆడేందుకు అవకాశం లభించింది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న వీరిద్దరూ యూఏఈ నుంచి నేరుగా ఎల్పీఎల్ ఆడేందుకు వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ ట్వంటీ 20 శ్రీలంక టోర్నమెంట్ ఆగస్టులో ఆరంభం కావాల్సి ఉంది. కానీ అది నవంబర్ 14కు వాయిదా పడింది. కరోనాతో ఆ లీగ్‌ను జరపాలా..మానాలా అనే సందిగ్థంలో ఉన్న మేనేజ్మెంట్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ లీగ్‌లో గేల్, డుప్లెసిస్లతో పాటు షాహిద్ ఆఫ్రిది, కార్లోస్ బ్రాత్‌వైట్‌లు కూడా ఆడనున్నారు. సుమారు 20 మందికి పైగా విదేశీ ఆటగాళ్లు ఆ లీగ్‌లో ఆడటానికి సుముఖుత వ్యక్తం చేయడం ఆ లీగ్ అదనపు అట్రాక్షన్ వచ్చే అవకాశం ఉంది. (రెండో సూపర్ ఓవర్ కూడా టైగా ముగిస్తే..? ) ఆ లీగ్ ఆడే ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్లో ఉండాలి. అక్కడికి చేరుకున్న తర్వాత క్వారంటైన్ నిబంధనను పూర్తి చేసి బరిలోకి దిగాలి. ఈ లీగ్‌ను కూడా ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనున్నారు. ఎల్పీఎల్ నిర్వహణకు ముందుగా మూడు వేదికలు అనుకోగా వాటిని రెండుకు కుదించారు. కాండీ, హమ్‌బాన్‌తోటలో లీగ్ జరగనుంది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకూ ఈ లీగ్‌ను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు ఎల్పీఎల్ జట్లు ఉండగా ప్రతీ ఫ్రాంచైజీ ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకునే వీలుంది. ఇదే తొలి ఎడిషన్ కావడం గమనార్హం.(ధోని.. మీరు అవకాశాలు ఇచ్చింది ఏది?) -
నేడు విచారణకు సంగక్కర
కొలంబో: ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐయూ) ముందు నేడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర హాజరు కానున్నాడు. 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో లంక ఆటగాళ్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మాజీ క్రీడల మంత్రి మహిందనంద అలత్గమగే ఈ ఆరోపణ చేశాడు. అప్పట్లో ఆయన క్రీడల మంత్రిగా వ్యవహరించారు. ఫొన్సెక నేతృత్వంలోని బృందం ఆ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన శ్రీలంక ఆటగాళ్లను విచారిస్తోంది. గురువారం ఉదయం 9 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా 2011 వరల్డ్‌కప్‌లో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించిన సంగక్కరను కోరింది. బుధవారం ఓపెనర్ ఉపుల్ తరంగాను రెండు గంటల పాటు విచారించింది. నాటి వరల్డ్‌కప్ ఫైనల్లో తరంగ 20 బంతులు ఆడి రెండు పరుగులు చేశాడు. ‘కమిటీ అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చాను. నా స్టేట్మెంట్ను వారు రికార్డు చేశారు’ అని తరంగ తెలిపాడు. కానీ ప్రశ్నలేంటో చెప్పలేదు. అప్పట్లో చీఫ్ సెలక్టర్‌గా వ్యవహరించిన శ్రీలంక విఖ్యాత ఆటగాడు అరవింద డిసిల్వాను మంగళవారం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. లంకలో ఫిక్సింగ్‌కు పాల్పడితే క్రిమినల్ నేరం కింద కఠినంగా శిక్షిస్తారు. లంక కరెన్సీలో రూ. 10 కోట్ల జరిమానాతో పాటు పదేళ్ల జైలు శిక్ష విధించేలా గత నవంబర్‌లో చట్టం తెచ్చారు. -
‘ప్లాన్-బితోనే క్రికెట్లోకి వచ్చా’
కొలంబో: ప్రపంచ టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరిట ఉన్న సంగతి తెలిసిందే. తన టెస్టు కెరీర్లో 800 వికెట్లను ఖాతాలో వేసుకున్న మురళీధరన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తన ఆఫ్ బ్రేక్‌తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించడంలో మురళీధరన్‌తో ప్రత్యేకమైన శైలి. అయితే తన యాక్షన్‌పై అనేకసార్లు వార్తల్లో నిలిచిన మురళీధరన్..ఎప్పటికప్పుటూ ఐసీసీ గ్రీన్ సిగ్నల్ పొందుతూనే అరుదైన రికార్డును సాధించడం ఇక్కడ విశేషం. 1998-99 సీజన్ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో మురళీధరన్ యాక్షన్‌పై అనుమానం వ్యక్తం చేసిన అంపైర్ రాస్ ఎమెర్సన్ వరుసగా నో బాల్స్ ఇవ్వడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. మురళీ బంతిని సంధించడం అంపైర్ నోబాల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. అయినప్పటికీ తన యాక్షన్‌లో ఎటువంటి లోపం లేదని నిరూపించుకున్న ఈ స్పిన్ మాంత్రికుడు టెస్టు ఫార్మాట్ అత్యధిక వికెట్ల టేకర్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. (వారిద్దరూ ఇంగ్లండ్ టూర్‌కు డుమ్మా) అయితే తాను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సమయంలో ఆఫ్ బ్రేక్ బౌలింగ్ సెట్ కాకపోయి ఉంటే లెగ్ స్పిన్ బౌలర్‌గా అవతరించేవాడినన్నాడు. తాను మణికట్టు స్పిన్‌ను కూడా ప్రాక్టీస్ చేసి ప్లాన్-బిని సిద్ధంగా ఉంచుకున్న విషయాన్ని తెలిపాడు. ‘ నేను యువకుడిగా ఉన్నప్పడు లెగ్ స్పిన్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని. ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా టెస్టుల్లో సెట్ కాకపోతే పరిస్థితి ఏంటి అనే దాని కోసం లెగ్ స్పిన్‌ను ప్రాక్టీస్ చేసేవాడిని. ఒకవేళ టెస్టుల్లో ఆఫ్ స్పిన్నర్‌గా కొనసాగిన నేను అది వర్క్ కాకపోయి ఉంటే కచ్చితంగా లెగ్ స్పిన్నర్‌ను అయ్యేవాడిని’ అని తెలిపాడు. ఎవరైనా ఎప్పుడైతే క్రికెట్లోకి రావాలనుకుంటారో ప్లాన్-ఏ, ప్లాన్-బిలు సిద్ధంగా ఉండాలన్నాడు. ఏదొక దానికే మాత్రమే కట్టుబడి ఉంటే అది వర్కౌట్ కాకపోతే సమస్యలు వస్తాయన్నాడు. ప్రొఫెషనల్ స్థాయిలో ఒక గేమ్‌ను ఆడాలంటే మానసిక ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుందన్నాడు. ఇది కేవలం క్రికెట్ మాత్రమే పరిమితం కాదని, అన్ని క్రీడలకు వర్తిస్తుందన్నాడు. మానసిక బలమే ఆటలో కీలక పాత్ర పోషిస్తుందని మురళీ చెప్పుకొచ్చాడు.(‘మాపై ప్రయోగం చేయడం లేదు’ ) -
ముగ్గురు క్రికెటర్లపై ఫిక్సింగ్ ఆరోపణలు
కొలంబో: శ్రీలంకకు చెందిన ముగ్గురు క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో ముగ్గురు లంక క్రికెటర్లు ఫిక్సింగ్ పాల్పడినట్లు ఆరోపణలు రాగా, దానిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విచారణ చేపట్టింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడామంత్రి డుల్లాస్ అలహుపెరుమా వెల్లడించారు. కాగా, ఆ క్రికెటర్లు ఎవరు అనే విషయాన్ని మాత్రం మంత్రి స్పష్టం చేయలేదు. తమ దేశ క్రికెట్లో ఈ తరహా ఆరోపణలు రావడం నిజంగా బాధకరమని డుల్లాస్ తెలిపారు. ‘ మా గౌరవ క్రీడామంత్రి ఏదైతో చెప్పారో దాన్ని మేము విశ్వసిస్తున్నాం. మా దేశానికి చెందిన ముగ్గురు క్రికెటర్లపై ఐసీసీ మ్యాచ్ ఫిక్సింగ్ విచారణ చేపట్టనుందనే విషయాన్ని మంత్రి ద్వారా తెలుసుకున్నాం. వారు ప్రస్తుతం జట్టులో ఉన్న క్రికెటర్లు కాదు’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ఓ ప్రకటనలో తెలిపింది. (ఇంత ఆటవికమా: రోహిత్ శర్మ) ఇదిలా ఉంచితే, గతవారం డ్రగ్ కేసులో ఇరుక్కున్న షెహన్ మధుశంకాను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేయడంతో మరో కొత్త తలనొప్పి శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఎదురైంది. ఈ ఘటనపై కూడా మంత్రి స్పందించారు. ‘ ఇది చాలా బాధాకరం. ఆ క్రికెటర్‌పై మేము చాలా ఆశలు పెట్టుకున్నాం. ఈ పరిస్థితుల్లో డ్రగ్ కేసులో దొరకడం నిజంగా బాధిస్తోంది’ అని డుల్లాస్ తెలిపారు. డ్రగ్ కేసులో ఇరుక్కున్నందున షెహన్ కాంట్రాక్ట్ రద్దయ్యింది.(యువీకి సరికొత్త తలనొప్పి) -
తీవ్ర గాయం చేసిన ‘సూపర్’ ప్రాక్టీస్
అడిలైడ్: త్వరలో జరుగనున్న టీ20 మహిళా వరల్డ్‌కప్‌లో భాగంగా ఓ వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక వుమెన్స్ క్రికెటర్ అచిన కులసురియా తీవ్రంగా గాయపడింది. తలకు బంతి బలంగా తగలడంతో ఆమె మైదానంలో కుప్పకూలిపోయింది. దాంతో ఆమెను స్ట్రైచర్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్లు తలపడ్డాయి. దీనిలో భాగంగా లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కులసురియా... దక్షిణాఫ్రికా క్రీడాకారిణి ట్రయాన్ కొట్టిన బంతిని అంచనా వేయడంలో తప్పుగా అంచనా వేయడంతో అది కాస్తా వచ్చి నేరుగా తలపై పడింది. (ఇక్కడ చదవండి: భారత్, పాక్ మహిళల టి20 మ్యాచ్ రద్దు) దాంతో చాలాసేపు అలాగే మోకాళ్లపై కూలబడిపోయిన కులసురియా విలవిల్లాడిపోయింది. ఆ క్రమంలోనే మొదట ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత మ్యాచ్‌ను రద్దు చేశారు. తొలుత దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో గెలిచినప్పటికీ, ఫీల్డింగ్ ప్రాక్టీస్ కోసం సూపర్ ఓవర్ ఆడిస్తుండగా కులసురియా గాయపడటం కలకలం రేపింది. ఫిబ్రవరి 21వ తేదీ నుంచి టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు.. ఆతిథ్య ఆస్ట్రేలియాతో తలపడనుంది. -
‘జూనియర్ మలింగా’ వరల్డ్ రికార్డు
బ్లోమ్‌ఫొంటెన్: సుమారు నాలుగు నెలల క్రితం శ్రీలంక కాలేజ్ క్రికెట్ స్థాయిలో ఎక్కువగా వినిపించిన పేరు మతీషా పతిరాణా. అచ్చం లసిత్ మలింగా తరహా యాక్షన్‌ను పోలి ఉండే పతిరాణా.. ఇప్పుడు అండర్-19 క్రికెట్ ఆడేస్తున్నాడు. గతేడాది సెప్టెంబర్‌లో ఒక కాలేజ్ మ్యాచ్‌లో పతిరాణా ఏడు పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించాడు. ప్రధానంగా యార్కర్లేనే తన ఆయుధంగా చేసుకుని బ్యాట్స్‌మెన్‌కు వణుకుపుట్టించాడు. ఆ ప్రదర్శనే ఇప్పుడు పతిరాణా అండర్-19 వరల్డ్‌కప్ ఆడటానికి కారణమైంది. అయితే ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పతిరాణా వికెట్ సాధించకపోయినప్పటికీ ఒక వరల్డ్ రికార్డును మాత్రం లిఖించాడు. పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పిలవబడే షోయబ్ అక్తర్ ఫాస్టెస్ట్ బాల్ రికార్డును పతిరాణా బ్రేక్ చేశాడు. నిన్నటి మ్యాచ్‌లో పతిరాణా 175 కి.మీ వేగంతో బంతిని సంధించి కొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఏ స్థాయిలోనైనా ఇదే ఫాస్టెస్ట్ బాల్. భారత్ ఇన్నింగ్స్ నాల్గో ఓవర్లో యశస్వి జైశ్వాల్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో సంధించిన బంతి రికార్డు పుస్తకాల్లో లిఖించబడింది. అయితే ఆ బంతి వైడ్ బాల్ కావడంతో ఎక్స్ట్రా రూపంలో భారత్‌కు పరుగు వచ్చింది. 2003 వరల్డ్‌కప్‌లో షోయబ్ అక్తర్ 161.3కి.మీ వేగంతో వేసిన బంతి ఫాస్టెస్ట్ బాల్‌గా ఇప్పటివరకూ ఉండగా దాన్ని పతిరాణా బ్రేక్ చేశాడు. (ఇక్కడ చదవండి: యువ భారత్ శుభారంభం) -
నేను ఎందుకిలా?: లసిత్ మలింగా
పుణె: టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను కనీసం పోరాడకుండానే కోల్పోవడంపై శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ జట్టు నుంచి పూర్తి స్థాయి ప్రదర్శన రాకపోవడం కారణంగానే భారత్ ముందు ఘోరంగా చతికిలబడ్డామన్నాడు. ఇక్కడ ప్రధానంగా తన వ్యక్తిగత ప్రదర్శనను సైతం మలింగా విమర్శించుకున్నాడు. ‘ నేను చాలా అనుభవం ఉన్న క్రికెటర్‌ను. నాకు చాలా అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఉంది. వికెట్ టేకింగ్ బౌలర్‌నే కానీ భారత్‌తో కనీసం వికెట్ తీయలేకపోయా. వికెట్లు సాధించలేక ఒత్తిడిలో పడ్డా. ఫ్రాంచైజీ క్రికెట్లో చాలా మ్యాచ్‌లో ఆడినా భారత్‌తో సిరీస్ ఆఖరి రోజు ముగిసే సరికి నేను ఉపయోగపడలేదు’ అని మలింగా ఆవేదన వ్యక్తం చేశాడు.(ఇక్కడ చదవండి: కోహ్లి వరల్డ్ రికార్డు.. సిరీస్ భారత్ కైవసం) ప్రధానంగా కెప్టెన్సీ కూడా తనపై భారం చూపిందన్నాడు. ఇక్కడ జట్టు పరంగా శ్రీలంక ఆశించిన స్థాయిలో లేకపోవడమే కెప్టెన్‌గా తనపై ఒత్తిడి పడిందన్నాడు. 2014లో తాను కెప్టెన్‌గా చేసిన సమయంలో తనకు పెద్దగా భారం అనిపించకపోవడానికి కారణం జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండటమేనన్నాడు. కుమార సంగక్కరా, జయవర్ధనే, దిల్షాన్ వంటి క్రికెటర్లు తమ జట్టులో ఉండటం వల్ల కెప్టెన్సీ భారం అనిపించేది కాదన్నాడు.ఇక టీ20ల్లో భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యమైనది మలింగా స్పష్టం చేశాడు. ఒకవైపు భారత ఆటగాళ్లు మెరుగైన భాగస్వామ్యాలు సాధిస్తే, తమ జట్టు మాత్రం విఫలమైందన్నాడు. టీ20ల్లో ప్రతీ బంతి విలువైనదేనని, కనీసం ప్రతీ బంతికి సింగిల్ అయినా తీయాలన్నాడు. మరొకవైపు టీమిండియా బ్యాటింగ్ అమోఘం అంటూ కొనియాడాడు. వారు షాట్లు కొడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతంగా ఉందన్నాడు. దాదాపు ఏడాదిన్నర నుంచి తమ ప్రదర్శన మెరుగపడిన దాఖలాలు లేవని మలింగా అంగీకరించాడు. గతంలో శ్రీలంక అంటే పటిష్టంగా ఉండేదని సంగతిని గుర్తు చేసుకున్నాడు. కుమార సంగక్కరా-మహేలా జయవర్ధననే, దిల్షాన్‌లు ఇన్నింగ్స్‌లు నిర్మించి లంక విజయాల్లో కీలక పాత్ర పోషించే వారన్నాడు. ప్రస్తుతం తమ జట్టులో అది కొరవడిందనే విషయం ఒప్పుకోవాల్సిందేనన్నాడు. తమ జట్టులో ఉన్న ఆటగాళ్లు యువ క్రికెటర్లే కాకుండా టాలెంట్ కూడా ఉందన్నాడు. కాకపోతే పరిస్థితులన్ని బట్టి ఆడటంలో వారు విఫలమవుతున్నారన్నాడు. భవిష్యత్తులోనైనా పరిస్థితిని అర్థం చేసుకుని క్రికెట్ ఆడతారని ఆశిస్తున్నట్లు మలింగా తెలిపాడు.(ఇక్కడ చదవండి: సామ్సన్ చాలా మిస్సయ్యాడు..!) -
‘ఆ బంతితో బౌలింగ్ కష్టమనిపించేది’
పుణె: శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ నవదీప్ సైనీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. రెండో టీ20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న సైనీ.. మూడో టీ20లో కూడా మెరిశాడు. రెండో టీ20లో రెండు వికెట్లు, మూడో టీ20లో మూడు వికెట్లతో సత్తాచాటాడు. 145 నుంచి 150 కి.మీ వేగంతో బంతుల్ని సునాయాసంగా సంధిస్తున్న సైనీ.. ప్రత్యర్థి శ్రీలంకను హడలెత్తించాడు. శుక్రవారం చివరి టీ20లో భారత్ గెలిచి సిరీస్‌ను 2-0తో గెలిచిన తర్వాత మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును అందుకునే క్రమంలో మాట్లాడిన సైనీ.. తన బౌలింగ్‌లో వేగం అనేది సహజంగానే వచ్చిందన్నాడు.(ఇక్కడ చదవండి: అందులో వాస్తవం లేదు: కోహ్లి) ‘నేను వైట్ బాల్ బంతితో ఆడటానికి ముందు రెడ్ బాల్‌తో ఎక్కువగా ఆడేవాడిని. ఎర్రబంతితో బౌలింగ్ చేయడం కష్టంగా అనిపించేది కాదు.. కానీ వైట్ బాల్‌తో బౌలింగ్ చేయడానికి మాత్రం ఎక్కువ శ్రమించే వాడిని. వైట్ బాల్‌తో ఎక్కువ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు సులువుగానే అనిపిస్తోంది. నా బౌలింగ్‌ను మెరుగుపరుచుకున్న తర్వాత వైట్ బాల్‌తో బౌలింగ్ ఎటువంటి ఇబ్బంది పెట్టడం లేదు. నా సీనియర్లు నుంచి తీసుకున్న సలహాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఏయే పరిస్థితుల్లో ఎలా బౌలింగ్ చేయాలో వారు నాకు చెబుతున్నారు. నా జిమ్, నా డైట్ తర్వాత భారత్‌కు క్రికెట్ ఆడటం అనేది నా గోల్. దాదాపు నాలుగైదేళ్ల నుంచి రెడ్ బాల్‌తో ఆడుతున్నా. అంతకుముందు టెన్నిస్ బాల్‌తో ప్రాక్టీస్ చేసేవాడిని’ అని సైనీ పేర్కొన్నాడు.(ఇక్కడ చదవండి: సామ్సన్ చాలా మిస్సయ్యాడు..!) -
భారత్ సిరీస్ కైవసం
-
కోహ్లి వరల్డ్ రికార్డు.. సిరీస్ భారత్ కైవసం
పుణె: శ్రీలంకతో జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకను 15.5 ఓవర్లలో 123 పరుగులకే కట్టడి చేసిన భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఫలితంగా సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా, రెండో టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధనంజయ డిసిల్వా(57), ఏంజెలో మాథ్యూస్ (31)లు రాణించగా మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లలో సైనీ మూడు వికెట్లు సాధించగా, వాషింగ్టన్ సుందర్, శార్దూల ఠాకూర్లు తలో రెండు వికెట్లు తీశారు. బుమ్రాకు వికెట్ దక్కింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 202 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.ఓపెనర్లు శిఖర్ ధావన్(52), కేఎల్ రాహుల్(54)లు శుభారంభాన్ని ఇస్తే, మనీష్ పాండే(31 నాటౌట్; 18 బంతుల్లో 4 ఫోర్లు), శార్దూల్ ఠాకూర్(22 నాటౌట్;8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) సమయోచితంగా ఆడారు. దాంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. భారత్ బ్యాటింగ్‌ను ధావన్-కేఎల్ రాహుల్‌లు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ పోటీ పడి పరుగులు తీశారు. ఓ దశలో ధావన్ చెలరేగి ఆడాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో బదులిచ్చాడు ధావన్.(ఇక్కడ చదవండి: సామ్సన్ చాలా మిస్సయ్యాడు..!) కాగా, ధావన్ 52 వ్యక్తిగత పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. సందకాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి ధావన్ పెవిలియన్ చేరాడు. సుదీర్ఘ విరామం తర్వాత రెండో టీ20 ఆడుతున్న సంజూ సామ్సన్(6) నిరాశపరిచాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు. వచ్చీ రావడంతోనే తొలి బంతినే సిక్స్ కొట్టిన సామ్సన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. తన ఆడిన రెండో బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. హసరంగా బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. ఇక రాహుల్ హాఫ్ సెంచరీ సాధించి మూడో వికెట్‌గా ఔట్ కాగా, కాసేపటికి అయ్యర్(4) సైతం విఫమయ్యాడు. సందకాన్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి(26;17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్-మనీష్ పాండేల జోడి బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. వీరిద్దరూ కలిసి చివరి ఓవర్లో 19 పరుగులు సాధించడంతో భారత స్కోరు రెండొందలు దాటింది. కోహ్లి వరల్డ్ రికార్డు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో వరల్డ్ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యంత వేగవంతంగా 11వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న కెప్టెన్‌గా నూతన అధ్యాయాన్ని లిఖించాడు. శ్రీలంకతో మూడో టీ20కి ముందు ఈ ఫీట్ సాధించడానికి పరుగు దూరంలో నిలిచిన కోహ్లి దాన్ని చేరుకున్నాడు. కెప్టెన్‌గా 169 మ్యాచ్‌ల్లో కోహ్లి 11వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించాడు. మరొకవైపు భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన రెండో కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు.అంతకుముందు ఎంఎస్ ధోని కెప్టెన్‌గా 11వేలకు పైగా అంతర్జాతీయ పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్‌గా 11వేలు, అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు సాధించిన జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్(న్యూజిలాండ్), ఎంఎస్ ధోని(భారత్), అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా), గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)లు ఉన్నారు. పాంటింగ్ 324 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి15,440 పరుగులు చేయగా, గ్రేమ్ స్మిత్ 286 మ్యాచ్‌ల్లో 14, 878 పరుగులు చేశాడు. ఇక ఫ్లెమింగ్ 303 మ్యాచ్‌ల్లో 11, 561 పరుగులు చేయగా, ధోని 332 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 11, 207 పరుగులు సాధించాడు. సుదీర్ఘ విరామం తర్వాత ధావన్.. శిఖర్ ధావన్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. కొన్నాళ్లుగా ఒకవైపు గాయాలు, మరొకవైపు ఫామ్ లేమితో సతమవుతున్న ధావన్ బ్యాట్ విదిల్చాడు. శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ అర్థ శతకం నమోదు చేశాడు. ఇది ధావన్‌కు 15 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ. 2018, నవంబర్ నెలలో చివరిసారి టీ20 హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత ధావన్‌కు ఇదే తొలి అర్థ శతకం. -
సామ్సన్ విఫలం.. శ్రీలంకకు భారీ టార్గెట్
పుణె: శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో టీమిండియా 202 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(52), కేఎల్ రాహుల్(54)లు శుభారంభాన్ని ఇస్తే, మనీష్ పాండే(31 నాటౌట్; 18 బంతుల్లో 4 ఫోర్లు), శార్దూల్ ఠాకూర్(22 నాటౌట్;8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) సమయోచితంగా ఆడారు. దాంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. భారత్ బ్యాటింగ్‌ను ధావన్-కేఎల్ రాహుల్‌లు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ పోటీ పడి పరుగులు తీశారు. ఓ దశలో ధావన్ చెలరేగి ఆడాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో బదులిచ్చాడు ధావన్. కాగా, ధావన్ 52 వ్యక్తిగత పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. సందకాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి ధావన్ పెవిలియన్ చేరాడు.(ఇక్కడ చదవండి: సామ్సన్ చాలా మిస్సయ్యాడు..!) సామ్సన్ విఫలం.. సుదీర్ఘ విరామం తర్వాత రెండో టీ20 ఆడుతున్న సంజూ సామ్సన్(6) నిరాశపరిచాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు. వచ్చీ రావడంతోనే తొలి బంతినే సిక్స్ కొట్టిన సామ్సన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. తన ఆడిన రెండో బంతికి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. హసరంగా బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. ఇక రాహుల్(54) హాఫ్ సెంచరీ సాధించి మూడో వికెట్‌గా ఔట్ కాగా, కాసేపటికి అయ్యర్(4) సైతం విఫమయ్యాడు. సందకాన్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి(26;17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు. చివర్లో శార్దూల్ ఠాకూర్-మనీష్ పాండేల జోడి బ్యాట్ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. వీరిద్దరూ కలిసి చివరి ఓవర్లో 19 పరుగులు సాధించడంతో భారత స్కోరు రెండొందలు దాటింది. లంక బౌలర్లలో సందకాన్ మూడు వికెట్లు సాధించగా, లహిరు కుమార, హసరంగాలు తలో వికెట్ తీశారు.( ఇక్కడ చదవండి: ధావన్ ఎన్నాళ్లకెన్నాళ్లకు..) -
ధావన్ ఎన్నాళ్లకెన్నాళ్లకు..
పుణె: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. కొన్నాళ్లుగా ఒకవైపు గాయాలు, మరొకవైపు ఫామ్ లేమితో సతమవుతున్న ధావన్ బ్యాట్ విదిల్చాడు. శ్రీలంకతో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ అర్థ శతకం నమోదు చేశాడు. ఇది ధావన్‌కు 15 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ. 2018, నవంబర్ నెలలో చివరిసారి టీ20 హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత ధావన్‌కు ఇదే తొలి అర్థ శతకం. శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. భారత్ బ్యాటింగ్‌ను ధావన్-కేఎల్ రాహుల్‌లు ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ పోటీ పడి పరుగులు తీశారు. ఓ దశలో ధావన్ చెలరేగి ఆడాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో బదులిచ్చాడు ధావన్. కాగా, ధావన్ 52 వ్యక్తిగత పరుగుల వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. సందకాన్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయి ధావన్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత సంజూ సామ్సన్ క్రీజ్‌లోకి వచ్చాడు. వచ్చీ రావడంతోనే తొలి బంతినే సిక్స్ కొట్టాడు. అయితే తన ఆడిన రెండో బంతికి సామ్సన్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఇక రాహుల్(54) హాఫ్ సెంచరీ సాధించి మూడో వికెట్‌గా ఔటయ్యాడు.(ఇక్కడ చదవండి: సామ్సన్ చాలా మిస్సయ్యాడు..!) -
సామ్సన్ చాలా మిస్సయ్యాడు..!
పుణె: ఈ ఏడాది వరల్డ్ టీ20 ఉన్న తరుణంలో యువ ఆటగాళ్లను సాధ్యమైనంతవరకూ పరీక్షించాలనే తలంపుతో ఉన్న టీమిండియా మేనేజ్మెంట్ ఎట్టకేలకు కేరళ వికెట్ కీపర్ సంజూ సామ్సన్‌కు అవకాశం ఇచ్చింది. శ్రీలంకతో చివరిదైన మూడో టీ20లో సామ్సన్‌కు తుది జట్టులో అవకాశం కల్పించారు. ఈ మ్యాచ్‌కు ముందు ఏకైక అంతర్జాతీయ టీ20 ఆడిన సామ్సన్..ఆ తర్వాత దేశవాళీ, ఐపీఎల్‌లలో రాణించినా మళ్లీ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. 2015లో జింబాబ్వేతో చివరిసారి ఆడిన సామ్సన్.. ఎట్టకేలకు ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అంతకు కొద్ది రోజుల క్రితం విజయ్ హజారే వన్డే టోర్నీలో చేసిన డబుల్ సెంచరీ చేయడంతో సామ్సన్ను బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌లలో అతడిని ఆడించకుండా రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు. తర్వాత ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడితే విండీస్‌తో సిరీస్‌కు మళ్లీ ఎంపిక చేశారు. ఇక్కడ కూడా సామ్సన్‌కు నిరాశే ఎదురైంది. కాగా, శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో సామ్సన్‌కు ఎట్టుకేలకు తుది జట్టులో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు తన కెరీర్లో రెండో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సామ్సన్.. ఒక అరుదైన జాబితాలో కూడా చోటు సంపాదించాడు. భారత్ తరఫున తన తొలి మ్యాచ్‌కు ఆపై రెండో మ్యాచ్‌కు పట్టిన అంతర్జాతీయ టీ20ల పరంగా చూస్తే సామ్సన్ టాప్‌లో ఉన్నాడు. 2015 నుంచి నేటి సామ్సన్ రీ ఎంట్రీ ముందు వరకూ భారత్ జట్టు 73 అంతర్జాతీయ టీ20లు ఆడింది. అంటే సామ్సన్ 73 అంతర్జాతీయ మ్యాచ్‌లను మిస్సయ్యాడు. భారత్ తరఫున ఒక ఆటగాడికి తొలి టీ20 మ్యాచ్‌కు రెండో టీ20 మ్యాచ్ ఇంతటి మ్యాచ్‌ల వ్యవధి రావడంలో సామ్సన్ రీ ఎంట్రీనే టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ ఉన్నాడు. 2012లో ఉమేశ్ తొలి అంతర్జాతీయ టీ 20 ఆడగా, రెండో టీ20 ఆడటానికి ఆరేళ్లు నిరీక్షించాడు. ఈ క్రమంలోనే 65 టీ20 మ్యాచ్‌లను ఉమేశ్ కోల్పోయాడు. ఆ తర్వాత స్థానంలో దినేశ్ కార్తీక్(56 మ్యాచ్‌లు) మూడో స్థానంలో ఉండగా, మహ్మద్ షమీ(43 మ్యాచ్‌లు) నాల్గో స్థానంలో ఉన్నాడు.ఇక ఓవరాల్‌గా ఒక జట్టు తరఫున పరిశీలిస్తే ఇంగ్లండ్ క్రికెటర్ జో డెన్లీ(79 మ్యాచ్‌లు) తొలిస్థానంలో కొనసాగుతున్నాడు. 2010 నుంచి 2018 మధ్యకాలంలో డెన్లీ తన రెండో టీ20 ఆడే సమయానికి ఈ ఫార్మాట్లో 79 మ్యాచ్‌లు మిస్సయ్యాడు. -
సామ్సన్ వచ్చేశాడు..
పుణె: భారత్‌తో జరుగుతున్న చివరిదైన మూడో టీ20లో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగా ముందుగా టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక రెండు మార్పులు చేసింది. ఏంజెలో మాథ్యూస్, సందకాన్‌లు తుది జట్టులోకి తీసుకుంది. ఇక భారత్ మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. వికెట్ కీపర్ సంజా సామ్సన్‌కు తుది జట్టులో అవకాశం కల్పించారు. రిషభ్ పంత్ స్థానంలో సామ్సన్‌కు చోటిచ్చారు. 2015లో చివరిసారి జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సామ్సన్.. ఆపై ఆడే అవకాశం దక్కలేదు. కొంత కాలంగా సామ్సన్ను జట్టులో ఎంపిక చేస్తున్నప్పటికీ తుది జట్టులో మాత్రం చోటివ్వడం లేదు. రిషభ్ పంత్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న టీమిండియా మేనేజ్మెంట్ ఎట్టకేలకు సామ్సన్‌కు మరోసారి ఆడే అవకాశం కల్పించింది. మరొకవైపు మనీష్ పాండే, చహల్‌లకు కూడా అవకాశం కల్పించారు. శివం దూబే స్థానంల పాండే రాగా, కుల్దీప్ స్థానంలో చహల్‌ను తుది జట్టులో ఎంపిక చేశారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి 2–0తో కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. తద్వారా 2020కి ఘనమైన విజయారంభం ఇవ్వాలని ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో ఏమాత్రం పోరాటమే ఇవ్వలేకపోయిన లంకపై భారత్ ఆడుతూ పాడుతూ చెమట చిందించకుండానే గెలిచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లో భారత్‌దే ఆధిపత్యమైంది. ఈ విజయమిచ్చిన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతుంటే... ప్రత్యర్థి శ్రీలంక మాత్రం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. గత మ్యాచ్‌లో లంకేయులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఈ మ్యాచ్‌లోనైనా సత్తాచాటి టీమిండియాను కట్టడి చేయాలని యోచిస్తోంది. -
మరో వరల్డ్ రికార్డుకు చేరువలో..
పుణె: టీమిండియా కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లిని మరో వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. టీమిండియా కెప్టెన్‌గా 11వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించడానికి కోహ్లి పరుగు దూరంలో నిలిచాడు. శ్రీలంకతో మూడో టీ20లో కోహ్లి పరుగు సాధిస్తే కెప్టెన్‌గా పదకొండ వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయిని అందుకుంటాడు. ఫలితంగా ఈ ఘనతను వేగవంతంగా సాధించిన కెప్టెన్‌గా కూడా వరల్డ్ రికార్డు సృష్టిస్తాడు. ఇప్పటివరకూ కోహ్లి కెప్టెన్‌గా 168 మ్యాచ్‌ల్లో 10,999 పరుగులు సాధించాడు. ఒక పరుగు తీస్తే కెప్టెన్‌గా 11వేల అంతర్జాతీయ పరుగుల్ని సాధించడమే కాకుండా తన పేరిట కొత్త రికార్డును లిఖించుకుంటాడు. మరొకవైపు ఈ ఫీట్ సాధించిన ఆరో కెప్టెన్‌గా కోహ్లి నిలుస్తాడు. అదే సమయంలో భారత్ తరఫున ఎంఎస్ ధోని తర్వాత కెప్టెన్‌గా ఈ మార్కును చేరిన రెండో ఆటగాడిగా కోహ్లి గుర్తింపు పొందుతాడు. కెప్టెన్‌గా 11వేలు, అంతకంటే ఎక్కువ అంతర్జాతీయ పరుగులు సాధించిన జాబితాలో స్టీఫెన్ ఫ్లెమింగ్(న్యూజిలాండ్), ఎంఎస్ ధోని(భారత్), అలెన్ బోర్డర్(ఆస్ట్రేలియా), గ్రేమ్ స్మిత్(దక్షిణాఫ్రికా), రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)లు ఉన్నారు. పాంటింగ్ 324 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి15,440 పరుగులు చేయగా, గ్రేమ్ స్మిత్ 286 మ్యాచ్‌ల్లో 14, 878 పరుగులు చేశాడు. ఇక ఫ్లెమింగ్ 303 మ్యాచ్‌ల్లో 11, 561 పరుగులు చేయగా, ధోని 332 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసి 11, 207 పరుగులు సాధించాడు. వీరి సరసన నిలిచేందుక కోహ్లి పరుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. శ్రీలంకతో చివరిదైన మూడో టీ20లో కోహ్లి ఈ ఘనతను చేరుకునే అవకాశం ఉంది. (ఇక్కడ చదవండి: కోహ్లి ఒక ఉఫ్.. అయ్యర్ మరొక ఉఫ్!) -
రికార్డుకు వికెట్ దూరంలో బుమ్రా..
పుణె: గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు విశ్రాంతి తీసుకుని ఇటీవలే భారత క్రికెట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. కేవలం ఒక వికెట్ మాత్రమే తీసిన బుమ్రా తన మార్కు బౌలింగ్ వేయడంలో కూడా విఫలమయ్యాడు. ప్రధానంగా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా పేరున్న బుమ్రా.. ఆఖరి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు సమర్పించుకున్నాడు. శ్రీలంక ఆటగాడు హసరంగా హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడమే బుమ్రా పేస్ బౌలింగ్‌లో వేడి తగ్గిందనడానికి ఉదాహరణ. తన బౌలింగ్‌పై పెద్దగా సంతృప్తిగా లేని బుమ్రా.. చివరి టీ20లో రాణించాలని చూస్తున్నాడు. శుక్రవారం భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 జరుగనుంది. ఇక్కడ బుమ్రాను ఒక రికార్డు ఊరిస్తోంది. భారత్ తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన ఘనతను సాధించడానికి బుమ్రా వికెట్ దూరంలో నిలిచాడు. ప్రస్తుతం అశ్విన్-చహల్‌లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న బుమ్రా.. వ్యక్తిగత అత్యధిక వికెట్లు సాధించడానికి వికెట్ కావాలి. అశ్విన్-చహల్-బుమ్రాలు 52 టీ20 వికెట్లతో టాప్‌లో ఉన్నారు. రేపటి మ్యాచ్‌లో చహల్ ఆడే అవకాశాలు తక్కువగా ఉండటంతో భారత్ తరఫున అత్యధిక వికెట్ల మార్కును బుమ్రా అందుకునే చాన్స్ ఉంది. శ్రీలంక జట్టులో ఎక్కువ మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటంతో పాటు గత మ్యాచ్‌లో కుల్దీప్ రాణించడంతో అతనికే తుది జట్టులో ఆడే అవకాశాలు ఉన్నాయి. దాంతో చహల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. బుమ్రా 44 టీ20 మ్యాచ్‌లు ఆడి 52 వికెట్లు సాధించగా, చహల్ 36 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. అశ్విన్ 46 మ్యాచ్‌ల్లో 52 వికెట్లు సాధించాడు. -
కోహ్లి ఒక ఉఫ్.. అయ్యర్ మరొక ఉఫ్!
ఇండోర్: తన హావభావాలను ప్రదర్శించడంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆట ఆడుతున్న సమయంలో కానీ, స్టేడియంలో కూర్చొని ఉన్న సమయంలో కానీ ఏది చేయాలనిపిస్తే అది తన ఎక్స్‌ప్రెషన్స్‌తో చూపిస్తూ ఉంటాడు కోహ్లి. ఇది కొన్ని సందర్భాల్లో అభిమానులకు సైతం నవ్వులు తెప్పిస్తూ ఉంటుంది. మంగళవారం ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో కోహ్లికి అయ్యర్ కొట్టిన సిక్స్ చూసి మైండ్ బ్లాక్ అయ్యింది 101 కి.మీ దూరంగా అయ్యర్ కొట్టిన భారీ హిట్‌కు కోహ్లి ఫిదా అయ్యాడు.(ఇక్కడ చదవండి: కోహ్లి ఫన్నీ మీమ్స్ వైరల్..) దాంతో వెంటనే ‘ఉఫ్’ అంటూ తన హావభావాల్ని ప్రదర్శించాడు. అయితే తన సిక్స్‌ను తానే నమ్మలేకపోయినా అయ్యర్ కూడా కోహ్లినే ఫాలో అయ్యాడు. అచ్చం కోహ్లి తరహాలోనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అయ్యర్. శ్రీలంక బౌలర్ వేసిన 17 ఓవర్ ఆఖరి బంతికి అయ్యర్ సిక్స్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు, సైనీ, కుల్దీప్ యాదవ్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, బుమ్రా, వాషింగ్టన్ సుందర్‌లకు చెరో వికెట్ దక్కింది. భారత బౌలర్ల వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో లంకేయులు భారీ స్కోరును సాధించలేకపోయారు.ఆపై 143 లక్ష్యంతో ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్(45), శిఖర్ ధావన్(32)లు శుభారంభం ఇవ్వగా, కోహ్లి( 30 నాటౌట్) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. -
టీమిండియా ఘనవిజయం
ఇండోర్: శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 143 పరుగుల టార్గెట్‌ను భారత్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ ఆటగాళ్లలో కేఎల్ రాహుల్(45; 32 బంతుల్లో 6 ఫోర్లు), శిఖర్ ధావన్(32;29 బంతుల్లో 2 ఫోర్లు) శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు సాధించిన తర్వాత రాహుల్ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తరుణంలో ధావన్‌కు శ్రేయస్ అయ్యర్ జత కలిశాడు. కాగా, జట్టు స్కోరు 86 పరుగుల వద్ద ధావన్ ఔట్ అయ్యాడు. అటు తర్వాత అయ్యర్-విరాట్ కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను నడిపించారు. కాగా, భారత్ విజయానికి 6 పరుగుల దూరంలో ఉండగా అయ్యర్(34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌గా ఔటయ్యాడు. కోహ్లి-రిషభ్ పంత్‌లు మరో వికెట్ పడకుండా విజయాన్ని అందించారు. కోహ్లి( 30 నాటౌట్; 17 బంతుల్లో 2 సిక్స్‌లు, 1 ఫోర్) సిక్స్ కొట్టడంతో 17.3 ఓవర్లోనే టీమిండియా విజయం సాధించింది.ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. లంక ఆటగాళ్లలో కుశాల్ పెరీరా 34 పరుగులే అత్యధికం కావడం గమనార్హం.. భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్ లంకేయుల్ని కట్టడి చేశారు. బుమ్రా, షైనీ, శార్దూల్ ఠాకూర్లు తమ పేస్‌తో ముప్పు తిప్పలు పెట్టగా, స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లు తమ మ్యాజిక్‌ను ప్రదర్శించారు. దాంతో లంకేయులు సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు సాధించగా, సైనీ, కుల్దీప్ యాదవ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్, బుమ్రాలకు చెరో వికెట్ దక్కింది. -
అచ్చం భజ్జీ యాక్షన్‌ను దించేశాడుగా..!
-
బుమ్రా బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు..
ఇండోర్: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక 143 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్ చేసి లంకేయుల్ని కట్టడి చేశారు. బుమ్రా, సైనీ, శార్దూల్ ఠాకూర్లు తమ పేస్‌తో ముప్పు తిప్పలు పెట్టగా, స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లు తమ మ్యాజిక్‌ను ప్రదర్శించారు. దాంతో లంకేయులు సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు. లంక ఆటగాళ్లలో కుశాల్ పెరీరా 34 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా లంకేయుల్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో లంక బ్యాటింగ్‌ను దనుష్క గుణతిలకా- ఆవిష్క ఫెర్నాండాలో ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 38 పరుగులు జత చేసిన తర్వాత ఫెర్నాండో(22) పెవిలియన్ చేరాడు. మరో 16 పరుగుల వ్యవధిలో గుణ తిలకా(20) కూడా పెవిలియన్ చేరడంతో లంక 54 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.ఆపై పెరీరా- ఒషాడో ఫెర్నాండాలో జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 28 పరుగులు జత చేసిన తర్వాత ఒషాడో ఫెర్నాండా(10) ఔట్ కాగా, అటు తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు ఆకట్టుకోలేదు. 33 పరుగుల వ్యవధిలో ఆరుగురు లంక ఆటగాళ్లు పెవిలియన్ చేరడంతో ఆ జట్టు భారీ స్కోరును చేయలేకపోయింది. చివర్లో హసరంగా(16 నాటౌట్; 3 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించాడు. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్లో హ్యట్రిక్ ఫోర్లు కొట్టాడు. చివరి మూడు బంతుల్ని ఫోర్లుగా మలచడంతో లంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు సాధించగా, సైనీ, కుల్దీప్ యాదవ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్ సుందర్, బుమ్రాలకు చెరో వికెట్ దక్కింది. -
అచ్చం భజ్జీ యాక్షన్‌ను దించేశాడుగా..!
ఇండోర్: టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్ గురించి క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేదు. కాస్త వైవిధ్యంగా ఉండే హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌ను ఇప్పటివరకూ ఎవరూ అనుకరించిన దాఖలాలు లేవు. అయితే భజ్జీ యాక్షన్‌ను అచ్చం దించేశాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. అప్పుడప్పుడు సరదాగా మిగతా క్రికెటర్ల శైలిని కాపీ చేసి నవ్వులు పూయించే కోహ్లి.. ఈసారి హర్భజన్‌ను ఎంచుకున్నాడు. శ్రీలంకతో రెండో టీ20కి ముందు ప్రాక్టీస్ సెషన్లో భజ్జీని మళ్లీ గుర్తు చేశాడు కోహ్లి. భజ్జీ శైలితో బౌలింగ్ ప్రాక్టీస్ చేసే క్రమంలో కోహ్లి తన నవ్వును ఆపుకోలేకపోయాడు. అసలు ఈ యాక్షన్‌తో బౌలింగ్ సాధ్యమేనా అనే విధంగా కోహ్లి పగలబడి మరీ నవ్వుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
టాస్ గెలిచిన కోహ్లి.. గెలుపు ఎవరిదో?
ఇండోర్: శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా ప్రత్యర్థి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గత మ్యాచ్‌లో కూడా టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నప్పటికీ అది వర్షార్పణం అయ్యింది. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. దాంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో బోణీ చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో ఆధిక్యంలో నిలుస్తుంది. దాంతో పాటు ఇది మూడు టీ20ల సిరీస్ కాబట్టి సిరీస్‌ను గెలవాలంటే ప్రతీ మ్యాచ్ టీమిండియాకు ముఖ్యమైనదే. దాంతో ఏమాత్రం పొరపాట్లు చేయకుండా మ్యాచ్‌కు సన్నద్ధమైంది కోహ్లి అండ్ గ్యాంగ్. అదే సమయంలో మలింగా నేతృత్వంలోని లంకేయులు కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. తమ జట్టులో యువ ఆటగాళ్లతో పాటు సీనియర్లు కూడా ఉండటంతో టీమిండియాను ఓడించడం కష్టమేమీ కాదనే విశ్వాసంతో ఉన్నారు. రోహిత్ శర్మకు సహచరుడిగా ఇటీవల కేఎల్ రాహుల్ రెండో ఓపెనర్ పాత్రలో అద్భుతంగా ఆడుతున్నాడు. దాంతో సీనియర్ శిఖర్ ధావన్ కెరీర్‌కు సంకటం ఎదురైంది. రోహిత్ విశ్రాంతితో ఈ సిరీస్‌లో ధావన్ అవకాశం దక్కించుకున్నాడు. తనలో ఇంకా టి20 సత్తా ఉందని అతను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో నిలిచాడు. ధావన్ ఇక ఈ ఫార్మాట్‌కు పనికి రాడంటూ మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ సహా పలువురి నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో... ధావన్ తన పూర్తి సత్తాను ప్రదర్శించాల్సిందే. కోహ్లి, అయ్యర్, పంత్, దూబేలతో దుర్బేధ్యంగా కనిపిస్తున్న భారత బ్యాటింగ్ గురించి ఏ రకమైన ఆందోళన అవసరం లేదు. భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌కు ప్రకటించిన జట్టుతోనే రెండో టీ20కి కూడా సిద్ధమైంది. ఇక 12 ఏళ్ల కిత్రం విరాట్ కోహ్లి అరంగేట్రం చేసినప్పటి నుంచీ భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ (మూడు ఫార్మాట్లలోనూ)లన్నింటిలోనూ శ్రీలంక ఓడింది. అప్పటి నుంచి వరుసగా 16 మ్యాచ్‌లలో ఆ జట్టు పరాజయం పాలైంది. ఒక్క 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మాత్రం గెలిచింది. ఈ నేపథ్యంలో పటిష్టమైన భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు. జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఎక్కువే ఉన్నప్పటికీ భారత్‌ను స్వదేశంలో ఓడించడం లంకకు కాస్త కష్టమే. లంక సైతం గత మ్యాచ్‌కు ప్రకటించిన తుది జట్టుతోనే బరిలోకి దిగుతోంది. భారత జట్టు విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, బుమ్రా శ్రీలంక జట్టు లసిత్ మలింగా(కెప్టెన్), దినుష్కా గుణతిలకా, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ పెరీరా, ఒషాడో ఫెర్నాండో, భానుక రాజపక్సే, ధనంజయ డిసిల్వా, షనకా, ఇసురు ఉదాన, వానిందు హసరంగా, లహిరు కుమార -
ఆ స్థానం అతనిదే: రోహిత్ శర్మ
న్యూఢిల్లీ: చాలాకాలంగా టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో నాల్గో స్థానం కోసమే అన్వేషణ సాగిందనేది కాదనలేని వాస్తవం. అయితే దీనికి శ్రేయస్ అయ్యర్ ద్వారా టీమిండియా మేనేజ్మెంట్కు దాదాపు సమాధానం దొరికినట్లే కనబడుతోంది. ఇటీవల కాలంలో భారత జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా చోటు సంపాదిస్తున్న అయ్యర్.. ఎక్కువగా నాల్గో స్థానంలోనే ఆడుతున్నాడు. అసలు నాల్గో స్థానం కోసమే అయ్యర్‌ను తుది జట్టులో కొనసాగిస్తురంటే బాగుంటుందేమో. కీలకమైన నాల్గో స్థానంలో ఎలా ఆడాలో అయ్యర్ బాగా వంట బట్టించుకున్నాడనే సెలక్టర్లు విశ్వసిస్తున్నారు. ఇదే విషయాన్ని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా తాజాగా తేల్చిచెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో నాల్గో స్థానంలో అయ్యరే సరైన వాడని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడమే కాకుండా నాల్గో స్థానంలో భారత క్రికెట్ జట్టుకు భరోసా కల్పిస్తున్నాడని రోహిత్ తెలిపాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ జరగుతున్న తరుణంలో అయ్యర్‌పై విశ్వాసం వ్యక్తం చేశాడు రోహిత్. ఈ సిరీస్‌కు రోహిత్‌కు విశ్రాంతి కల్పించడంతో అతను కుటుంబంతో గడుపుతున్నాడు.దీనిలో భాగంగా మాట్లాడిన రోహిత్.. ‘ భారత క్రికెట్ జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదు. రాబోవు సిరీస్‌ల్లో వారు తమ సత్తా చాటుకుని ప్రత్యేక ముద్ర వేయాలని ఆశిస్తున్నా. తదుపరి ఐసీసీ టైటిల్( టీ20 వరల్డ్‌కప్ నాటికి) టీమ్ అంతా సెట్ అవుతుందని ఆశిస్తున్నా. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా. విషయం ఏమిటంటే.. ఇప్పటివరకూ కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివం దూబేలు ఒక గ్రూప్‌గా ఆడిన మ్యాచ్‌లో చాలా తక్కువ. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. వీరంతా టీమ్‌గా ఆడుతున్న సమయంలో వారు మరింత ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవం ఖాయం. భారత క్రికెట్ జట్టులో పరిస్థితులు మారాయి. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ బాగా ఆడుతున్నాడు. ఆ స్థానంలో అయ్యర్ చాలాకాలం ఆడే అవకాశం ఉంది. ఆ స్థానంలో అయ్యర్ అమితమైన ఆత్మవిశ్వాసంతో కన్పిస్తున్నాడు. పరిస్థితుల్ని బట్టి గేమ్‌ను అర్థం చేసుకుంటూ అతని ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేస్తున్నాడు. ఆ స్థానం ఇక అయ్యర్‌దే. పంత్ కూడా వెస్టిండీస్ సిరీస్‌లో బాగా ఆడాడు. దూబే అరంగేట్రం చేసి ఎంతోకాలం కాకపోయినా ఆకట్టుకుంటున్నాడు. అయినా ఇప్పుడు, రాబోయే సంవత్సరాల్లో కూడా నాల్గో స్థానంలో అయ్యరే వస్తాడు. దాంతో మిగతా వారు ఏయే స్థానాల్లో సెట్ అవుతారో ముందుగా వెతుక్కోవాల్సి ఉంటుంది. కేఎల్ రాహుల్ కూడా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. దీన్ని ముందుకు తీసుకువెళతాడని ఆశిస్తున్నా. రెండు-మూడు మ్యాచ్‌ల్లో ఈ గ్రూప్‌పై అంచనాకు రాలేం. మరికొన్ని మ్యాచ్‌లు ఆడే వరకూ నిరీక్షించక తప్పదు. ’ అని రోహిత్ అన్నాడు. -
రద్దు చేయకుండానే క్రికెటర్లు వెళ్లిపోయారు!
గవాహటి: టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. సాయంత్రం టాస్ పడిన తర్వాత భారీ వర్షం కురవడంతో మైదానం పూర్తిగా తడిసిపోగా, కవర్లు కప్పి ఉంచినా వర్షపు నీరు గ్రౌండ్లోకి వచ్చింది. దీనిపై విమర్శలు వచ్చాయి. పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచినా వికెట్‌పైకి వర్షం నీరు రావడానికి నాసిరకం కవర్లు వాడటమే కారణమంటూ పలువురు విమర్శించారు. ఇదిలా ఉంచితే, పిచ్‌ను నిర్ణీత సమయానికి సిద్ధం చేయకపోవడతో రాత్రి గం.9.54 ని.లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చివరగా అంపైర్లు, మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ వికెట్‌ను పరిశీలించి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా, మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించకముందే క్రికెటర్లలో చాలా మంది స్టేడియం నుంచి వెళ్లిపోయినట్లు అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కార్యదర్శి దేవజీత్ స్పష్టం చేయడమే కాకుండా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.(ఇక్కడ చదవండి: ఇది బీసీసీఐకే షేమ్..!) ‘భారత్-శ్రీలంక మధ్య ఆదివారం గువాహటిలో జరగాల్సిన మ్యాచ్‌కు సాయం త్రం 6.45 నుంచి గంటపాటు కురిసిన భారీ వర్షంతో మైదానం మొత్తం తడిసిపోగా..కవర్లు కప్పిఉంచినా పిచ్‌కూడా చిత్తడిగా మారింది. దాంతో 7.45 తర్వాత ఒకసారి, 9.30కు మరోసారి అంపైర్లు, మ్యాచ్ రెఫరీ డేవిడ్ బూన్ వికెట్‌ను పరిశీలించారు. అర్ధగంట సస్పెన్స్ తర్వాత అంటే రాత్రి 9.54కి మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మ్యాచ్‌ను రద్దు చేయడానికి అరగంట ముందే క్రికెటర్లలో చాలామంది స్టేడియం నుంచి వెళ్లిపోయారు.రాత్రి గం. 9.30 ని.లకు పిచ్ పరిశీలిస్తే, చాలామంది ఆటగాళ్లు 9 గంటలకే స్టేడియాన్ని వీడారు. మ్యాచ్ రద్దు కాకముందే ఆటగాళ్లు మైదానాన్ని వీడటం కొత్తగా అనిపించడమే కాకుండా మిస్టరీగా కూడా ఉంది. అభిమానులు గొడవ చేయకుండా ఉండేందుకు అలా ప్రకటించారేమో. కానీ క్రికెటర్లు ముందుగానే వెళ్లిపోవడం మాత్రం నిజం’ అని సైకియా చెప్పాడు. రాత్రి గం,. 8.45 నిమిషాలకల్లా గ్రౌండ్‌ను సిద్ధం చేయకుంటే మ్యాచ్‌ను రద్దు చేయక తప్పదని గ్రౌండ్స్‌మెన్‌కు మ్యాచ్ అధికారులు స్పష్టంజేసినట్టు కూడా ఆయన వెల్లడించాడు. మైదానాన్ని సిద్ధం చేసేందుకు గ్రౌండ్స్‌మెన్‌కు 57 నిమిషాల సమయమే ఇచ్చారు. మరికొంత సమయం ఇచ్చుంటే మైదానాన్ని రెడీ చేసేవాళ్లం. రివర్స్ ఆస్మోసిస్ విధానం వల్ల పిచ్ చిత్తడిగా మారింది’ అని దేవ్జీత్ అన్నాడు. (ఇక్కడ చదవండి: టీ20 మ్యాచ్: గువాహటి.. యూ బ్యూటీ!) -
ఆ గిఫ్ట్‌ను చూసి కోహ్లి ఫిదా..!
గువాహటి: ఒక అభిమాని ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్‌ను చూసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫిదా అయ్యాడు. పాత సెల్ఫోన్లు, వైర్లతో కళాఖండాన్ని తలపించేలా విరాట్ చిత్రాన్ని రాహుల్ పరేక్ అనే అభిమాని రూపొందించాడు. ఆదివారం భారత్-శ్రీలంకల తొలిటీ20 సందర్భంగా తన అభిమాన క్రికెటర్‌కు రాహుల్ దానిని అందజేశాడు. ఆ చిత్రాన్ని చూసి విరాట్ ఎంతో సంతోషించాడు. దానిపై తన సంతకం చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘పాత ఫోన్లతో తయారు చేసిన విరాట్ కోహ్లి చిత్రం.. ఆ అభిమాని ప్రేమ ఎలా ఉంది’ అని రాసింది.(ఇక్కడ చదవండి: గువాహటి.. యూ బ్యూటీ!) ఈ చిత్రాన్ని తయారు చేసేందుకు తనకు మూడు రోజులు పట్టినట్టు రాహుల్ పరేక్ తెలిపాడు. కాగా, అతడి ప్రతిభకు విరాట్ అచ్చెరువొంది భుజం తట్టి ప్రోత్సహించాడు. భారత్-శ్రీలంకల తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత భారీ వర్షం కురిసింది. ఆపై వర్షం వెలిసినా సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పిచ్‌ను ఔట్ ఫీల్డ్‌ను ఆరబెట్టడం గ్రౌండ్‌మెన్ వల్ల కాలేదు. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది.(ఇక్కడ చదవండి: ఇది బీసీసీఐకే షేమ్..!) -
ఇది బీసీసీఐకే షేమ్..!
గువాహటి: టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. వర్షం వల్ల మ్యాచ్ రద్దయ్యింది అనే కంటే అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) వద్ద సరైన మౌలిక సదుపాయాలు లేని కారణంగానే మ్యాచ్ జరగలేదంటేనే బాగుంటుందేమో. వర్షం వెలిసిన తర్వాత పిచ్ ఆరబెట్టడానికి సదరు అసోసియేషన్ హెయిర్ డ్రయర్స్, ఐరన్ బాక్స్‌లు ఉపయోగించడమే ఇందుకు కారణం. ఇది ఏకంగా అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా చెప్పబడుతున్న బీసీసీఐకే మచ్చతెచ్చే విషయం. ఒక అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ తరహా విధానాన్ని అవలంభించడమే విమర్శలకు దారి తీసింది. (ఇక్కడ చదవండి: మెరుపుల్లేవ్... చినుకులే!) మ్యాచ్ రద్దయిన తర్వాత ఏసీఏ అవలంభించిన తీరుపైనే కాకుండా బీసీసీఐనే ఆడుసుకుంటున్నారు నెటిజన్లు. ‘ 1980 కాదురా నాయనా.. 2020. ఏకంగా ఫ్లైయింగ్ కార్స్‌ని వాడతారనుకుంటే, మరి ఏమిటో మనం వెనక్కి పయనిస్తున్నాం. ఇది బీసీసీఐకే షేమ్’ అని ఒక నెటిజన్ ఎద్దేవా చేయగా, ‘ శ్రీలంక ప్రేమదాస స్టేడియంలో ఉపయోగించే వర్షపు కవర్లను తెచ్చుకుని ఉండాల్సింది’ అని మరొకరు విమర్శించారు. ఒక మహిళ చికెన్‌ను రోస్ట్ చేయడానికి హెయిర్ డ్రయర్‌ను ఉపయోగిస్తున్న ఇమేజ్ను పోస్ట్ చేసి మరీ మరొక అభిమాని సెటైర్ వేశాడు. ‘ ఇది ఇండియన్ పవర్ఫుల్ హెయిర్ డ్రయర్’ అని మరొకరు చమత్కరించారు. ‘ పిచ్‌ను హెయిర్ డ్రయర్‌తో ఆరబెట్టారు.. ఇక పిచ్‌ను చదును చేసే క్రమంలో మన తలలతో చేస్తే బాగుంటుందేమో’ అని మరో అభిమాని విమర్శించాడు. -
టీమిండియా-శ్రీలంకల తొలి టీ20 రద్దు
గుహవాటి: టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య ఇక్కడ జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. పిచ్‌తో పాటు అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతోమ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ పడిన తర్వాత భారీ వర్షం పడటంతో అంతరాయం ఏర్పడింది. కాగా, వర్షం వెలిసిన తర్వాత మ్యాచ్‌ను జరపడానికి ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. మధ్యలో మరొకసారి వర్షం పడగా పిచ్, అవుట్ ఫీల్డ్‌లు చిత్తడిగా మారిపోయాయి. దాంతో పిచ్‌ను ఆరబెట్టడానికి గ్రౌండ్‌మెన్ కష్టపడ్డప్పటికీ చివరకు పిచ్‌ను సిద్ధం చేయడంలో విఫలమయ్యారు. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ జరిపించాలని చూసినా అది కూడా సాధ్యం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే మ్యాచ్ వర్షం పడితే పిచ్‌ను త్వరితగతిన సిద్ధం చేసే సాధ్యమైనన్ని వనరులు అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) వద్ద లేవనే విషయం మరోసారి బయటపడింది. దాంతో రాత్రి గం.10.00ల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆపై కాసేపటికి భారీ వర్షం పడి మ్యాచ్‌కు ఆటంకం కల్గించింది. రెండో టీ20 ఇండోర్ వేదికగా మంగళవారం జరుగనుంది. -
టాస్ గెలిచిన టీమిండియా
గుహవాటి: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇక్కడ బార్సపరా స్టేడియంలో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా లంకేయుల్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక్కడ భారత్ ఆడిన చివరి మ్యాచ్‌లో ఛేజింగ్ చేసి గెలవడంతో భారత్ ముందుగా ఫీల్డింగ్‌కే మొగ్గుచూపింది. ఇదే విషయాన్ని కోహ్లి స్పష్టం చేశాడు. ఇక మలింగా మాత్రం తొలుత బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉందన్నాడు. సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి భారత్‌కు సవాల్ విసురుతామన్నాడు. ఈ ట్రాక్ సెకాండాఫ్‌లో విపరీతమైన మార్పులు ఉంటాయని తాను అనుకోవడం లేదన్నాడు. కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించాలని టీమిండియా యోచిస్తోంది. గడిచిన ఏడాదిని విజయంతో ముగించిన కోహ్లి అండ్ గ్యాంగ్ అదే ప్రదర్శనను లంకేయులతో టీ20 సిరీస్‌లోనూ రిపీట్ చేయాలని భావిస్తోంది. తొలి టీ20ని గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మరొకవైపు శ్రీలంక కూడా విజయంతో శుభారంభం చేయాలని చూస్తోంది. 12 ఏళ్ల కిత్రం విరాట్ కోహ్లి అరంగేట్రం చేసినప్పటి నుంచీ భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ (మూడు ఫార్మాట్లలోనూ)లన్నింటిలోనూ శ్రీలంక ఓడింది. అప్పటి నుంచి వరుసగా 16 మ్యాచ్‌లలో ఆ జట్టు పరాజయం పాలైంది. ఒక్క 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో మాత్రం గెలిచింది. అటు టి20 కెపె్టన్‌గా మలింగ రికార్డు పేలవం గా ఉంది. అతని సారథ్యంలో ఆ జట్టు 9 మ్యాచ్‌లు ఓడితే ఒకటే గెలిచింది! ఈ నేపథ్యంలో పటిష్టమైన భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు. జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఎక్కువే ఉన్నప్పటికీ భారత్‌ను స్వదేశంలో ఓడించడం లంకకు కాస్త కష్టమే.అయితే టాస్ వేసిన తర్వాత వర్షం పడింది. దాంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. దాంతో మ్యాచ్ ఆరంభం కావడానికి అంతరాయం ఏర్పడింది. భారత జట్టు విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, బుమ్రా శ్రీలంక జట్టు లసిత్ మలింగా(కెప్టెన్), దినుష్కా గుణతిలకా, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ పెరీరా, ఒషాడో ఫెర్నాండో, భానుక రాజపక్సే, ధనంజయ డిసిల్వా, షనకా, ఇసురు ఉదాన, వానిందు హసరంగా, లహిరు కుమార -
ప్రాక్టీస్‌ను రిషభ్ కామెడీ చేశాడు..!
గుహవాటి: ఇటీవల కాలంలో తన ఆటతీరుతో, నిలకడలేమితో, కీపింగ్ లో వరుస వైఫల్యాలు చూస్తున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. తన నైపుణ్యాలను పెంచుకునే పనిలో ఉన్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో భాగంగా తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాడు. దీనిలో భాగంగా ఫిట్నెస్ ట్రైనింగ్‌లో స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ నిక్ వెబ్ తో ప్రాక్టీస్‌ను పంచుకున్నాడు. ఇందులో కొన్ని బాక్సింగ్ పంచ్‌లను రిషభ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ వీడియోతో పాటు సెకాండాఫ్‌లో చహల్, సంజూ శాంసలన్లతో కలిసి ఉన్న వీడియోను ఒకటి షేర్ చేశాడు. దీనికి వర్కౌట్ సమయంలో.. వర్కౌట్స్ తర్వాత అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇక్కడ సీరియస్‌గా ప్రాక్టీస్ చేయడానికి బదులు రిషభ్ కామెడీ చేసినట్లే కనబడింది. దీనిపై అభిమానులు సెటైర్లు గుప్పిస్తున్నారు. ‘ ఇదేదో ఆటలో చూపించు వచ్చు కదా’ అని ఒక అభిమాని పేర్కొనగా, ‘ ఇంతటి వర్కౌట్స్ చేసేవాడివి గ్రౌండ్లో కొన్ని పరుగులు చేస్తే బాగుంటుంది’ అంటూ ఎద్దేవా చేశాడు. During After Workout Vs Workout pic.twitter.com/OSaoxPu3YG — Rishabh Pant (@RishabhPant17) January 4, 2020 -
టీ20 సిరీస్: ‘4’,‘6’లను కూడా అనుమతించం
గుహవాటి: అంతర్జాతీయ స్థాయిలో ఏ మ్యాచ్ జరుగుతున్నా ప్లకార్డులతో అభిమానులు స్టేడియాలకి వెళ్లడం సర్వసాధారణం. అది క్రికెట్ మ్యాచ్ కావొచ్చు.. ఫుట్‌బాల్ మ్యాచ్ కావొచ్చు. ఇక్కడ అభిమానులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆటను ఆస్వాదిస్తూ ఉంటారు. కాగా, టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం బార్సపారా క్రికెట్ స్టేడియంలో ప్లకార్డులపై నిషేధం విధిస్తూ అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ సమయంలో ఏ విధమైన ప్లకార్డులు ప్రదర్శించకూడదనే ఆదేశాలు జారీ చేసింది. చివరకు ఫోర్, సిక్స్ ప్లకార్డులను సైతం బ్యాన్ చేసినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ టీమిండియా-శ్రీలంకల మధ్య ఇక్కడ తొలి మ్యాచ్‌లో భాగంగా స్టేడియం లోపలికి ఏ విధమైన ప్లకార్డులు తీసుకెళ్లడానికి అనుమతి లేదు.(ఇక్కడ చదవండి: రోహిత్ లేడు.. ఇక ఆ రికార్డు కోహ్లిదే!) ఫోర్, సిక్స్ ప్లకార్డులను కూడా తీసుకు రావొద్దు. ఇలా ప్లకార్డుల ప్రదర్శంచడం గందరగోళానికి దారి తీస్తోంది. ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు తమ ప్రకటనలకు కోసం ప్లకార్డులను తయారు చేసి వారి ప్రచారానికి వాడుకుంటున్నాయి. సదరు కంపెనీలు తయారు చేసిన ప్లకార్డులను అభిమానులు స్టేడియాల్లోకి తీసుకొచ్చి వాటిని ప్రదర్శిస్తున్నారు. దాంతోనే ప్లకార్డులతో పాటు బ్యానర్లను కూడా నిషేధిస్తున్నాం. మార్కర్ పెన్స్‌కు కూడా అనుమతి లేదు. కేవలం పురుషుల వాలెట్లు, మహిళల హ్యాండ్ బ్యాగ్స్, మొబైల్ ఫోన్స్, అభిమానుల వాహనాల తాళాలు మాత్రమే స్టేడియం లోపలకి తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని అభిమానులు స్టేడియానికి రావాలి’ అని అసోం క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. -
రోహిత్ లేడు.. ఇక ఆ రికార్డు కోహ్లిదే!
గువాహటి: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌కు టీమిండియా సిద్ధమైంది. ఆదివారం ఇక్కడ శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. గతేడాది డిసెంబర్లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను, మూడు వన్డేల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ ఏడాది ఆరంభపు సిరీస్‌లో కూడా సత్తాచాటి శుభారంభం చేయాలని చూస్తోంది. కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని ఒక రికార్డు ఊరిస్తోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన విరాట్ కోహ్లి.. అంతర్జాతీయ టీ20 పరుగుల్లో సహచర ఆటగాడు రోహిత్ శర్మతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు రోహిత్‌ను దాటేసే అవకాశం కోహ్లి ముందుంది.(ఇక్కడ చదవండి: తొలి పరీక్షకు సై!) ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి-రోహిత్‌లు తలో 2,633 పరుగులు సాధించి టాప్‌లో కొనసాగుతున్నారు. రేపటి మ్యాచ్‌లో రోహిత్‌ను కోహ్లి అధిగమించడం దాదాపు ఖాయం. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో కోహ్లి సింగిల్‌గా అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంటాడు. కేవలం పరుగు సాధిస్తే రోహిత్‌ను అధిగమించే కోహ్లి.. లంకేయులతో టీ20 సిరీస్‌లో పరుగుల వేట కొనసాగిస్తే మాత్రం హిట్ మ్యాన్‌కు అందనంత దూరంలో నిలుస్తాడు.విండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో 50 బంతుల్లో 94 పరుగులు సాధించిన కోహ్లి.. ఇక మూడో టీ20లో 29 బంతుల్లో అజేయంగా 70 పరుగులు సాధించాడు. దాంతో తాను మూడు ఫార్మాట్లకు సరిపోయే క్రికెటర్‌నని, అవసరమైతే తన హిట్టింగ్ ఇలా ఉంటుందంటూ విమర్శకుల నోళ్ల మూయించాడు. ఇదే ఫామ్‌ను శ్రీలంకతో జరుగనున్న పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో కూడా కొనసాగించాలని యోచిస్తున్నాడు. -
టాప్ ప్లేయర్.. టాప్ కట్!
న్యూఢిల్లీ: ఈ ఏడాదిని కొత్తగా ఆరంభించాలనే ఉద్దేశంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సరికొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు. తాజాగా టాప్ కట్ అని పిలవబడే హెయిర్ కట్‌ను కోహ్లి చేయించుకున్నాడు. శ్రీలంకతో ఆదివారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానున్న తరుణంలో కోహ్లి.. ఇలా తన కొత్త లుక్‌తో ఆకట్టుకునేందుకు సిద్ధమయయాడు. హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హాకీమ్తో కోహ్లి టాప్ కట్ చేయించుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను హకీమ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీనిపై బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ‘టెర్రిఫిక్’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఐసీసీ టెస్టు, వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న కోహ్లి.. తన టాప్ హెయిర్ కట్‌తో ఒక మంచి ఆరంభాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అటు ఫిట్నెస్ను కాపాడుకోవడంతో పాటు విన్నూత్నమైన స్టైల్‌ను అవలంభించడం కోహ్లికి అలవాటు. ఎప్పుడూ తన లుక్‌తో కొత్తగా కనిపించే కోహ్లికి ఈ లుక్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూద్దాం. గతేడాదిని ఘనంగా ముగించిన టీమిండియా.. ఈ ఏడాదిలో శ్రీలంకపై గెలిచి శుభారంభం చేయాలని చూస్తోంది. View this post on Instagram New Year ... New Cut🤘 ...The KING 👑 @virat.kohli ❤️ #viratkohli #king 🤘👑 A post shared by Aalim Hakim (@aalimhakim) on Jan 2, 2020 at 9:18am PST -
శ్రీలంక టీమ్ వచ్చేసింది..
న్యూఢిల్లీ: టీమిండియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక జట్టు భారత పర్యటనకు వచ్చేసింది. ఈ నెల 5వ తేదీన ఇరు జట్ల మధ్య జరుగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆరంభం కానుంది. లంకేయుల జట్టుకు వెటరన్ పేసర్ లసిత్ మలింగా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం 16 మందితో కూడిన జట్టుని బుధవారం ప్రకటించిన శ్రీలంక.. ఈరోజు ఉదయం భారత్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 5న గౌహతి వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత 7న ఇండోర్, 10న పుణె వేదికగా ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది. దాదాపు 16 నెలల విరామం తర్వాత ఆల్‌రౌండర్ ఎంజెలో మాథ్యూస్ శ్రీలంక టి20 జట్టులోకి వచ్చాడు. 32 ఏళ్ల మాథ్యూస్ 2018 ఆగస్టులో చివరిసారి టి20 మ్యాచ్ ఆడాడు. శ్రీలంక టి20 జట్టు: మలింగ (కెప్టెన్), గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఎంజెలో మాథ్యూస్, దసున్ షనక, కుశాల్ పెరీరా, డిక్వెల్లా, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉడాన, భానుక రాజపక్స, ఒషాడా ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్ మెండిస్, సందకన్, కసున్ రజిత. -
టి20 జట్టులో మాథ్యూస్ రీఎంట్రీ
కొలంబో: దాదాపు 16 నెలల విరామం తర్వాత ఆల్‌రౌండర్ ఎంజెలో మాథ్యూస్ శ్రీలంక టి20 జట్టులోకి వచ్చాడు. భారత్‌తో ఈనెల 5న మొదలయ్యే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక జట్టును బుధవారం ప్రకటించారు. 16 మంది సభ్యులుగల జట్టుకు లసిత్ మలింగ సారథ్యం వహిస్తాడు. 32 ఏళ్ల మాథ్యూస్ 2018 ఆగస్టులో చివరిసారి టి20 మ్యాచ్ ఆడాడు. శ్రీలంక టి20 జట్టు: మలింగ (కెప్టెన్), గుణతిలక, అవిష్క ఫెర్నాండో, ఎంజెలో మాథ్యూస్, దసున్ షనక, కుశాల్ పెరీరా, డిక్వెల్లా, ధనంజయ డిసిల్వా, ఇసురు ఉడాన, భానుక రాజపక్స, ఒషాడా ఫెర్నాండో, వనిందు హసరంగ, లాహిరు కుమార, కుశాల్ మెండిస్, సందకన్, కసున్ రజిత. -
నసీమ్ షా సరికొత్త రికార్డు
కరాచీ: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పాకిస్తాన్ 263 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 2009 తర్వాత స్వదేశంలో శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన పాకిస్తాన్.. తొలి టెస్టును డ్రా చేసుకోగా, రెండో టెస్టులో ఘన విజయం సాధించింది. శ్రీలంకకు 476 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించిన పాకిస్తాన్ చెలరేగిపోయి బౌలింగ్ వేసింది. ప్రధానంగా పాకిస్తాన్ టీనేజ్ క్రికెటర్ నసీమ్ షా విజృంభించాడు.రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించి శ్రీలంక పతనాన్ని శాసించాడు. నసీమ్ షా దెబ్బకు లంకేయులు తమ రెండో ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్ అయ్యారు. చివరి మూడు వికెట్లలో రెండు వికెట్లను నసీమ్ షా సాధించడంతో లంకకు ఘోర ఓటమి తప్పలేదు. కాగా, ఈ క్రమంలోనే నసీమ్ షా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టు మ్యాచ్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు సాధించాడు. ఆదివారం ఆటలో చివరి బంతికి దిల్రువాన్ పెరీరాను ఔట్ చేసిన నసీమ్.. ఈ రోజు ఆటలో తొలి బంతికే లసిత్ ఎంబల్దెనియాను పెవిలియన్‌కు పంపాడు. దాంతో హ్యాట్రిక్ సాధించే అవకాశం నసీమ్‌కు వచ్చింది. కాగా, దాన్ని సాధించడంలో నసీమ్ విఫలమైనప్పటికీ, మరొక ఓవర్లో విశ్వ ఫెర్నాండో ఔట్ చేసి ఐదు వికెట్ల మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన తన తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌ను 555/3 వద్ద డిక్లేర్డ్ చేసింది. షాన్ మసూద్, అబిద్ అలీ, అజహర్ అలీ, బాబర్ అజామ్‌లు సెంచరీలతో మెరిశారు. ఇక శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌటైంది. -
చేతులెత్తేసిన భారత్
విశాఖ స్పోర్ట్స్: బీచ్ వాలీబాల్ కాంటినెంటల్ కప్ ఫేజ్ వన్ సెంట్రల్ జోన్ టోర్నీలో భారత్ జట్లు చేతులెత్తేయగా... డిఫెండింగ్ చాంప్ శ్రీలంక ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. విశాఖ సాగర తీరంలోని ఇసుకతిన్నెలపై బుధవారం ఉదయం సెషన్లో ఇరాన్ ఏ జట్టుతో కజకిస్తాన్ ఏ జట్టు తలపడనుండగా ఇరాన్ బి జట్టుతో కజకిస్తాన్ బి జట్టు ఆడనుంది. సాయంత్రం సెషన్లో కజకిస్తాన్ ఏ జట్టుతో శ్రీలంక ఏ జట్టు తలపడనుండగా మరో మ్యాచ్‌లో కజకిస్తాన్ బి జట్టుతో శ్రీలంక బి జట్టు ఆడనుంది. సాయంత్రం సెషన్ రెండుగంటలకే ప్రారంభం కానుంది. మంగళవారం జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ జట్టు ఓటమి పాలైంది. ఉదయం జరిగిన తొలి మ్యాచ్‌లో తిరోన్–జయన్(శ్రీలంక) జోడి 2–0 స్ట్రయిట్ సెట్లలో ప్రహ్లాద్–ఆరోన్(భారత్) జోడిపై విజయం సాధించగా... రెండో మ్యాచ్‌లో శ్రీలంక జోడిపై తొలి సెట్‌ను గెలుచుకున్న భారత్ జోడి తరువాత సెట్లలో చేతులెత్తేసింది. అశాంక–అషేన్(శ్రీలంక) జోడి 2–1తో నరేష్–రాజు(భారత్) జోడిపై విజయం సాధించింది. సాయంత్రం సెషన్లో జరిగిన సెమీస్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకకు చెందిన మహిళా జోడి లక్షణి–ప్రసాదిని జోడి 2–0తో జెనిఫర్–సుబ్రజ జోడిపైన విజయం సాధించగా... చతురిక–దీపిక(శ్రీలంక) 2–0తో లావణ్య–సుమలత(భారత్) జోడిపైన విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నారు. -
‘అతనొక లెజెండ్.. నాకు అలా కావాలని ఉంది’
కరాచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్‌ను పలువురు పోల్చిన సంగతి తెలిసిందే. దానిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్న బాబర్.. మరొకసారి కోహ్లితో పోలిక తేవడంపై స్పందించాడు. ‘ ప్రస్తుతం నేను ఎవరితోనూ పోలిక కాదు. నా ఆట నాది.. కోహ్లి ఆట కోహ్లిది. ప్రస్తుతం నేను దిగ్గజ క్రికెటర్లతో పోల్చదగని క్రికెటర్‌ను కాదు. కోహ్లి ఒక లెజెండ్ క్రికెటర్. భారత్‌కు కోహ్లి ఒక దిగ్గజ క్రికెటర్. నన్ను కోహ్లితో కానీ, స్టీవ్ స్మిత్‌తో కానీ పోల్చవద్దు. ఇది నాపై ఒత్తిడి ఏమీ పెంచదు.. కానీ వారిద్దరూ సమకాలీన క్రికెట్లో మేటి క్రికెటర్లు. ఇప్పటికే కోహ్లి ఎంతో సాధించాడు. భారత్‌లో దిగ్గజ క్రికెటర్ కోహ్లి. అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటప్పుడు నాకు అతనితో పోలిక ఎలా ఉంటుంది. ఇప్పుడు కోహ్లి ఏ స్థాయిలో ఉన్నాడు.. నాకు అలాగే కావాలని ఉంది. మీడియా, అభిమానులు మా ఇద్దరి మధ్య పోలిక తెస్తున్నారు. రెడ్ బాల్ క్రికెట్లో నేను ఇంకా చాలా పరుగులు చేయాలి. టాప్ ప్లేయర్స్ జాబితాలో చోటు సంపాదించాలి. టెస్టు క్రికెట్లో నేను నిలకడగా క్రికెట్ ఆడుతూ పరుగులు సాధించడంపైనే గత కొంతకాలంగా దృష్టి పెట్టా. నా బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగుపరుగుకుంటూ ముందుకు వెళ్లాలన్నదే నా లక్ష్యం. అందుకోసం నా ఇన్నింగ్స్‌ల వీడియోలు చూస్తూ ఆటను సరిచేసుకుంటున్నా. నా తప్పులను పట్టుకుని మళ్లీ వాటిని రిపీట్ చేయకూడదనే సంకల్పంతో సాగుతున్నా’ అని బాబర్ అజామ్ అన్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అజామ్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు రోజులు వర్షం అడ్డుకున్న ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా, ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో అజామ్ తొలిసారి టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చోటు సంపాదించాడు. ప్రస్తుతం అజామ్ 9వ ర్యాంకులో ఉన్నాడు. -
ఇదేం బౌలింగ్రా నాయనా.. ఆడమ్స్‌ను మించిపోయావే!
అబుదాబి: శ్రీలంకకు చెందిన కెవిన్ కొతత్తిగొడ తన బౌలింగ్ యాక్షన్‌తో వార్తల్లో నిలిచాడు. అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా బంగ్లా టైగర్స్ తరఫున ఆడుతున్న కొతత్తిగొడ.. డెక్కన్ గ్లాడియేటర్స్‌తో మూడు రోజుల క్రితం తన వైవిధ్యమైన బౌలింగ్‌తో క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. గతంలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ పాల్ ఆడమ్స్ ఇదే తరహాలో బౌలింగ్ వేస్తూ హాట్ టాపిక్‌గా మారగా, ఇప్పుడు పాల్ ఆడమ్స్‌నే మించిపోయి మరీ బౌలింగ్ వేశాడు ఈ 24 ఏళ్ల శ్రీలంక స్పిన్నర్. 90 దశకాల్లోని క్రికెట్ అభిమానులకు దక్షిణాఫ్రికా స్పిన్నర్ పాల్ ఆడమ్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. బంతి విసిరడానికి ముందు తలను పూర్తిగా కిందకు వంచి రెండు చేతులూ పైకి చాస్తూ ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌కు బంతులేసేవాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆ తరహా బౌలింగ్ యాక్షన్ మనకు దాదాపు కరువైందనే చెప్పాలి. తాజాగా కొతత్తిగొడ.. ఆడమ్స్‌ను గుర్తు చేస్తున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో గాలే క్రికెట్ క్లబ్ తరుపున లిస్ట్-ఎ, టీ20 మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేశాడు. లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు తీసిన అతడు నాలుగు టీ20ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. 2017 ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ తరఫున ఆడిన శివం కౌశిక్‌ది కూడా ఈ విధమైన ప్రత్యేకమైన బౌలింగ్ శైలే కావడం విశేషం. ఇప్పుడు కెవిన్ కొతత్తిగొడ బౌలింగ్ యాక్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో అభిమానులు విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదే బౌలింగ్రా నాయనా.. పాల్స్ ఆడమ్స్‌ను మించిపోయావే అంటూ కామెంట్లు పెడుతున్నారు. #NewFavePlayer Kevin Koththiigoda. Consonant in a blender pic.twitter.com/9EmOBFuNOW — Paul Radley (@PaulRadley) November 16, 2019 -
పదేళ్ల తర్వాత పాకిస్తాన్లో..
కరాచీ: ఇటీవల కాలంలో పాకిస్తాన్లో క్రికెట్ ఆడటానికి పలు దేశాలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. 2009లో శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏ దేశం కూడా అక్కడికి పంపించడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)కు శ్రీకారం చుట్టిన తర్వాత ఆ దేశంలో కాస్త మార్పు కనిపిస్తోంది. పాక్‌లో పీఎస్ఎల్లో ఆడటానికి పలువురు విదేశీ క్రికెటర్లు ఆసక్తి కనబరచడం ఒకటైతే, కొన్ని రోజుల క్రితం శ్రీలంక కూడా టీ20 సిరీస్ ఆడటానికి పాక్‌లో పర్యటించింది. అయితే ఈ పర్యటనకు శ్రీలంక స్టార్, సీనియర్ క్రికెటర్లు దాదాపు పది మంది దూరమైనప్పటికీ ‘జూనియర్ జట్టు’నే అక్కడికి పంపించీ మరీ ఎస్ఎల్సీ తమ ఒప్పందాన్ని కొనసాగించింది. కాగా, పాకిస్తాన్లో టెస్టు సిరీస్ జరిగి దాదాపు పదేళ్లు అవుతుంది. ఒక ద్వైపాక్షిక సిరీస్‌ను పాకిస్తాన్లో ఆడించాలన్న పీసీబీ కోరిక పరోక్షంగా ఇన్నాళ్లకు నెరవేరింది. తాజాగా పాక్‌లో టెస్టు సిరీస్ ఆడటానికి శ్రీలంక సమాయత్తమైంది. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా పాక్‌లో శ్రీలంక టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. దాంతో పాక్‌లో టెస్టు సిరీస్ ఆడుతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇరు జట్ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 11 నుంచి 15 వరకూ రావల్పిండిలో తొలి టెస్టు జరుగనుండగా, డిసెంబర్ 19నుంచి 23 వరకూ కరాచీలో రెండో టెస్టు జరుగనుంది.