
కొలంబో: సిరీస్ విజేతను తేల్చే మూడో వన్డేలో సమష్టి ప్రదర్శన కనబర్చిన శ్రీలంక... దక్షిణాఫ్రికాపై 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 203 పరుగులు చేసింది. అసలంక (47; 2 ఫోర్లు), దుష్మంత చమీర (29; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీశాడు. ఛేదనలో దక్షిణాఫ్రికా 30 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ (4/37)తో దక్షిణాఫ్రికాను పడగొట్టాడు. అతడికి చమీర (2/16), హసరంగ (2/32) సహకరించారు. చమీర ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
చదవండి: శిఖర్ ధావన్ విడాకులు
Comments
Please login to add a commentAdd a comment