south afirca
-
సౌతాఫ్రికా దిగ్గజం సంచలన నిర్ణయం.. 13 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని, అతడి భార్య స్యూ విడాకులు తీసుకున్నారు. తమ 13 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు వారిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గత కొంత కాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై వస్తున్న ఊహాగానాలకు ఎట్టుకేలకు తెరపడింది.గతేడాది నవంబర్ నుంచి డుమిని, స్యూ విడిపోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో వారి విడాకుల విషయం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలను ఒకొకరు తమ సోషల్ మీడియా ఖాతాలో తొలిగించారు.అన్నీ ఆలోచించాకే మేము ఇద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా 12 ఏళ్ల వైవాహిక బంధంలో ఎన్నో మరుపురాని క్షణాలను ఆస్వాదించాము. అంతకమించి మా బంధానికి గుర్తుగా ఇద్దరు కుమార్తెలు జన్మించడం మా అదృష్టం. మా నిర్ణయాన్ని ప్రతీ ఒక్కరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాము.దయచేసి మా ప్రైవసీకి భంగం కలిగించకండి. మేము ఇద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికి, మంచి స్నేహితులగా కొనసాగుతాము. ఈ సమయంలో మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఇట్లు మీ జేపీ అండ్ సూ అని ఇద్దరూ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. జేపీ డుమిని,స్యూ 2011 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఇటీవలే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. మార్చి 2023లో వైట్ బాల్ ఫార్మాట్లలో ప్రోటీస్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన డుమినీ.. 20 నెలల పాటు ఆ పదవిలో కొనసాగాడు.డుమిని నేతృత్వంలోనే దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్‌కు చేరింది. ఇక కాగా డుమిని 2004- 2019 మధ్యకాలంలో దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20ల్లో ప్రాతినిథ్యం వహించాడు. డుమిని తన అంతర్జాతీయ కెరీర్లో 9,154 పరుగులు చేశాడు.చదవండి: ‘జట్టు నుంచి తప్పించారు.. అతడు మాట్లాడేందుకు సిద్ధంగా లేడు.. అందుకే’ View this post on Instagram A post shared by JP Duminy (@jpduminy) -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సౌతాఫ్రికాకు షాక్..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు సౌతాఫ్రికా(South Afrcia)కు ఊహించని షాక్ తగిలింది. ఆ స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్(David Miller) గాయపడ్డాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిల్లర్ మోకాలికి గాయమైంది. ఈ టోర్నీలో పార్ల్ రాయల్స్‌కు సారథ్యం వహిస్తున్న మిల్లర్.. డర్బన్ బ్యాటర్ మార్కస్ స్టోయినిస్ కొట్టిన షాట్‌ను ఆపే క్రమంలో మిల్లర్ గాయపడ్డాడు.వెంటనే వైద్య బృందం వచ్చి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ కొన్ని నిమిషాల తర్వాత మిల్లర్ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రన్ ఛేజ్‌లో బ్యాటింగ్ కూడా రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మిల్లర్ గాయం బారిన పడటం ప్రోటీస్ సెలక్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా క్రికెట్ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో మిల్లర్ చోటు దక్కించుకున్నాడు.ఒక వేళ ఛాంపియన్స్ ట్రోఫీకి మిల్లర్ దూరమైతే అది సఫారీలకు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొంతకాలంగా వైట్‌బాల్ క్రికెట్లో దక్షిణాఫ్రికాకు మిడిలార్డర్లో మిల్లర్ కీలక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ఓంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించే సత్తా అతడిది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా క్రికెట్ మిల్లర్‌పై గాయంపై ఇప్పటికే అప్డేట్ తెలుసుకున్నట్లు సమాచారం.అతడి గాయం తీవ్రతను సౌతాఫ్రికా క్రికెట్ వైద్యబృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే ఎస్ఎ టీ20లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు సౌతాఫ్రికా స్పీడ్ స్టార్ లుంగీ ఎంగిడీ సైతం కాలి గజ్జ గాయంతో బాధపడుతున్నాడు.పార్ల్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంగిడి గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గతేడాది జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న ఎంగిడీ ఇటీవలే క్రికెట్ మైదానంలో తిరిగి అడుగుపెట్టాడు. అంతలోనే మళ్లీ ఈ స్టార్ ఫాస్ట్ బౌలర్ గాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఎంగిడీ కూడా ఉన్నాడు.అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి మరో 24 రోజుల సమయం ఉండడంతో వీరిద్దరూ పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని సౌతాఫ్రికా అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ ఐసీసీ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా ఫిబ్రవరి 21న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రస్సీ వాన్ డెర్ డస్సెన్చదవండి: AUS vs SL 1st Test: ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్.. -
రీ ఎంట్రీ ఇస్తా.. క్రికెట్ ఆడాలని ఉంది.. కానీ: డివిలియర్స్
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్(AB De Villiers) అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను తిరిగి కాంపిటేటివ్ క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే, మరోసారి ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లేదంటే.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం ఆడలేనని స్పష్టం చేశాడు.లెజెండరీ బ్యాటర్గాకాగా 2004లో సౌతాఫ్రికా(South Africa) తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన డివిలియర్స్ లెజెండరీ బ్యాటర్‌గా ఎదిగాడు. ప్రొటిస్ జట్టు కెప్టెన్‌గానూ పనిచేశాడు. ఇక వికెట్ కీపర్‌గానూ సత్తా చాటిన ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. తన కెరీర్లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 8765, 9577, 1672 పరుగులు చేశాడు.ఇక డివిలియర్స్ ఖాతాలో ఖాతాలో 22 టెస్టు సెంచరీలు, 25 వన్డే శతకాలు ఉన్నాయి. ఐపీఎల్లో సుదీర్ఘ కాలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ.. ఓవరాల్‌గా 184 మ్యాచ్‌లు ఆడి 5162 రన్స్ సాధించాడు. ఇందులో మూడు శతకాలు కూడా ఉండటం విశేషం.‘రియల్ క్రికెట్’ ఆడాలని ఉందికాగా 2021 నవంబరులో డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం తన సమయంలో ఎక్కువ భాగం కుటుంబానికి కేటాయించిన ఏబీడీ.. చారిటి, బ్రాడ్‌కాస్టింగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరోసారి తనకు ‘రియల్ క్రికెట్’ ఆడాలని ఉందంటూ అతడు వ్యాఖ్యానించడం విశేషం.ఈ విషయం గురించి మెలిండా ఫారెల్‌కు చెందిన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ.. ‘‘ఈరోజుకీ నేను క్రికెట్ ఆడగలననే నమ్మకంతో ఉన్నాను. అయితే, ఇప్పటి వరకు ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా పిల్లలు మాత్రం నాపై ఒత్తిడి పెంచుతున్నారు. వాళ్లతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నాలో మళ్లీ క్రికెట్ ఆడాలనే కోరిక కలిగింది.ఏదో ఓ చోట కాంపిటేటివ్ క్రికెట్ ఆడాలని భావిస్తున్నా. అయితే, నేను ఆర్సీబీ గురించి మాత్రం మాట్లాడటం లేదు. ఐపీఎల్ లేదంటే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం పాల్గొనను. కేవలం నా పిల్లల కోసం, క్రికెట్ మీదున్న ప్రేమ కారణంగా మళ్లీ బరిలోకి దిగాలని భావిస్తున్నా.ఏదేమైనా మరోసారి ఒత్తిడిలోకి కూరుకుపోవాలని మాత్రం అనుకోవడం లేదు. కాస్త సరదాగా.. సంతృప్తికరంగా నా ఇన్నింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా’’ అని 40 ఏళ్ల ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.చదవండి: Ajinkya Rahane: రోహిత్ శర్మకు అంతా తెలుసు.. రిలాక్స్డ్గా ఉంటాడు -
సన్నగిల్లుతున్న భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు
భారత్, ఆస్ట్రేలియా ఆ మధ్య మెల్బోర్న్లో జరుగుతున్న నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆట నువ్వా నేనా అన్నట్టు సాగింది. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక దశలో కేవలం పదకొండు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ ని ఆధిపత్యాన్ని అందించాడు. లంచ్ విరామం తర్వాత బుమ్రా చెలరేగిపోయి మొదట ఆస్ట్రేలియా తరుఫున ఈ సిరీస్ లో అత్యధిక స్కోర్ సాధించిన ట్రావిస్ హెడ్ ని ఒక పరుగుకే పెవిలియన్ పట్టించాడు.దీంతో బుమ్రా తన టెస్ట్ కెరీర్ లో రెండు వికెట్ల రికార్డు ని పూర్తి చేసుకున్నాడు. బుమ్రా అతి తక్కువ సగటుతో ఈ రికార్డు ని నెలకొల్పడం విశేషం. బుమ్రా 20.29 సగటు తో కేవలం 44 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం మాల్కం మార్షల్ 20.94 సగటు తో నెలకొల్పిన రెకార్డ్ ని అధిగమించి ఈ రికార్డ్ ని సాధించడం గమనార్హం. బుమ్రా నాలుగు బంతుల వ్యవధిలో ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్షల్ ని డకౌట్ చేసాడు. బుమ్రా తన తర్వాత ఓవర్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అలెక్స్ క్యారీని రెండు పరుగులకు అవుట్ చేసాడు. ఈ దశలో ఆస్ట్రేలియా 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ప్రమాదంలో పడింది.మూడు క్యాచ్ లు జారవిడిచిన జైస్వాల్ అయితే భారత్ యువ బ్యాట్స్‌మన్ యశస్వీ జైస్వాల్ ఈ దశలో రెండు కీలకమైన క్యాచ్ లు జారవిడవడం తో ఆస్ట్రేలియా కి అదృష్టం కలిసి వచ్చింది. ఇందులో అత్యంత కీలకమైన మార్నస్ లబుషేన్ క్యాచ్ కూడా ఉండడం గమనార్హం. అప్పటికి ఇంకా తన ఖత కూడా తెరవని లబుషేన్ ఆ తర్వాత ఏకంగా 70 పరుగులు సాధించి ఆస్ట్రేలియా తరఫున ఈ ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోర్ సాధించడమే గాక కెప్టెన్ పాట్ కమిన్స్ తో కలిసి ఏడో వికెట్ కి 59 పరుగులు జోడించడం విశేషం. జైస్వాల్ ఆ తరువాత స్పిన్నర్ అజయ్ జడేజా బౌలింగ్ లో కమిన్స్ ఇచ్చిన క్యాచ్ ని కూడా జారవిడిచాడు. ఈ మూడు క్యాచ్ లు భారత్ విజయావకాశాలను దెబ్బతీసాయనడంలో సందేహం లేదు. జైస్వాల్ క్యాచ్ లను జారవిడవడం పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేసాడు.అప్పటికి భారత్ ఈ టెస్ట్ మ్యాచ్ లో పట్టు బిగించే పరిస్థితి లో ఉంది. అయితే లబుషేన్, కమిన్స్ లు అవుటైన అనంతరం నాథన్ లియాన్ (41 నాటౌట్) మరియు స్కాట్ బోలాండ్ (10 పరుగులతో నాటౌట్) చివరి వికెట్ కి మరో 55 పరుగులు జోడించి అజేయంగా నిలిచారు.దీనితో ఆస్ట్రేలియా ఆధిక్యం ౩౩౩ పరుగులకి చేరుకొంది. ఆట చివరి రోజున ఇంత భారీ లక్ష్యాన్ని సాధించడం భారత్ బ్యాట్స్‌మెన్ కి అంత సులువు కాకపోవచ్చు. అసలే తడబడుతున్న భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ చివరి రోజున ఎలా రాణిస్తారో చూడాలి.గత వారం బ్రిస్బేన్‌లో జరిగిన డ్రా తర్వాత భారత్ యొక్క వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల శాతం 57.29 నుండి 55.88 కి పడిపోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ సారధ్యంలోని భారత్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక లో మూడవ స్థానంలో ఉంది.ఆదివారం సెంచూరియన్‌లో పాకిస్థాన్‌ను ఓడించి దక్షిణాఫ్రికా (63.67) లార్డ్స్‌లో వచ్చే ఏడాది లో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తమ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (58.89) మరియు దక్షిణాఫ్రికా (63.67) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు టెస్టుల్లో గెలవని పక్షంలో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశాలు తక్కువనే చెప్పాలి. -
దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ విధ్వంసం.. 12 ఫోర్లు, 12 సిక్స్‌లతో ఊచకోత
మహిళల బిగ్ బాష్ లీగ్-2024లో హోబర్ట్ హరికేన్స్ మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. సిడ్నీ వేదికగా పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగులతో తేడాతో ఘన విజయాన్ని హోబర్ట్ అందుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ స్టార్ ఓపెనర్, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ లిజెల్ లీ విధ్వంసకర సెంచరీతో మెరిసింది.సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విఫలమైన లీ.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగింది. ప్రత్యర్ధి బౌలర్లను ఈ దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఊచకోత కోసింది. ఆమెను ఆపడం పెర్త్ స్కార్చర్స్ బౌలర్లు వంతు కాలేదు. ఆమె బౌండరీలు బాదుతుంటే ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర పోషించారు.ఓవరాల్‌గా 75 బంతులు ఎదుర్కొన్న లీ..12 ఫోర్లు, 12 సిక్స్‌లతో 150 పరుగులు చేసి ఆజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హీథర్ గ్రహమ్(23) రాణించింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో హోబర్ట్ హరికేన్స్ 3 వికెట్లు కోల్పోయి 203 పరుగుల భారీ స్కోర్ సాధించింది.అనంతరం లక్ష్య చేధనలో పెర్త్ జట్టు కేవలం 131 పరుగులకే కుప్పకూలింది. హోబర్ట్ బౌలర్లలో హీథర్ గ్రహమ్ మూడు వికెట్లు పడగొట్టగా, స్మిత్, స్ట్రానో తలా రెండు వికెట్లు సాధించారు. పెర్త్ బ్యాటర్లలో అనిస్వర్త్(41) ఒంటరి పోరాటం చేసింది.అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన లీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్‌గా లీ రికార్డులకెక్కింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్రేస్ హ్యారీస్(136 నాటౌట్) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హ్యారీస్ అల్‌టైమ్ రికార్డును లీ బ్రేక్ చేసింది.చదవండి: BAN vs AFG 2nd Odi: మెరిసిన షాంటో.. అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం -
దక్షిణాఫ్రికా బౌలర్ల ఉగ్రరూపం.. 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్
టీమిండియా చేతిలో వైట్‌వాష్‌కు గురైన బంగ్లాదేశ్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన మొదటి టెస్టులో బంగ్లాదేశ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చేరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు సఫారీ బౌలర్లు చుక్కలు చూపించారు. సౌతాఫ్రికా పేసర్ల దాటికి బంగ్లా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. రబడా, ముల్డర్, కేశవ్ మహారాజ్ తలా మూడు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు. బంగ్లా బ్యాటర్లలో మెహదీ హసన్ జాయ్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా బంగ్లాదేశ్ గత నెలలో భారత్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది.తుది జట్లుబంగ్లాదేశ్: షాద్మన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్దక్షిణాఫ్రికా : టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, ర్యాన్ రికెల్టన్, మాథ్యూ బ్రీట్జ్కే, కైల్ వెర్రెయిన్నే(వికెట్ కీపర్), వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, డేన్ పీడ్ -
స్టబ్స్ విధ్వంసర సెంచరీ.. సౌతాఫ్రికా చేతిలో ఐర్లాండ్ చిత్తు
అబుదాబి వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 174 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0 తేడాతో ప్రోటీస్ సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 344 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్.. సఫారీ బౌలర్ల దాటికి కేవలం 169 పరుగులకే కుప్పకూలింది. ప్రోటీస్ పేసర్ లిజార్డ్ విలియమ్స్ 3 వికెట్లు పడగొట్టగా.. ఎంగిడీ, జార్న్ ఫోర్టుయిన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, బార్టమన్ చెరో వికెట్ పడగొట్టారు. ఐరీష్ బ్యాటర్లలో క్రెయిగ్ యంగ్(29) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.సెంచరీతో చెలరేగిన స్టబ్స్..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 343 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 81 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 112 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. స్టబ్స్‌కు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. స్టబ్స్‌తో పాటు వెర్నయనే(67), ముల్డర్(43) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఐర్లాండ్ బౌలర్లలో యంగ్, కాంఫ్హర్, హోయ్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే ఆక్టోబర్ 7న అబుదాబి వేదికగా జరగనుంది.చదవండి: T20 WC: న్యూజిలాండ్ చేతిలో ఘోర ఓటమి.. భారత్ సెమీస్ చేరాలంటే? -
SA vs BAN: దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లు దూరం
బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బావుమా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా దాదాపు ఏడాదిన్నర స్పిన్నర్ సెనూరన్ ముత్తుసామికి ప్రోటీస్ టెస్టు జట్టులో చోటు దక్కింది.అయితే ఈ సిరీస్‌కు అన్రిచ్ నోర్జే, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడీ, గెరాల్డ్ కోయెట్జీ వంటి వంటి స్టార్ పేసర్లు దూరమయ్యారు. జాన్సెన్, కోయిట్జేలకు విశ్రాంతి ఇవ్వగా.. ఎంగిడీ, నోర్జేలను సెలక్టర్లు ఎందుకు పక్కన పెట్టారో తెలియలేదు.బంగ్లా సిరీస్‌లో సఫారీల పేస్ దళానికి కగిసో రబాడ నాయకత్వం వహించనున్నాడు. ఫాస్ట్ బౌలర్ల కోటాలో రబాడతో పాటు బర్గర్, డేన్ ప్యాటర్సన్,ముల్డర్‌లకు చోటు లభించింది.గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దక్షిణాఫ్రికా క్రికెట్..కాగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా ఈ టెస్టు సిరీస్‌పై సందిగ్ధం నెలకొంది. అయితే తమ ఆటగాళ్ల భద్రతపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు హామీ ఇవ్వడంతో దక్షిణాఫ్రికా క్రికెట్ తమ జట్టు పర్యటనకు గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. ఆక్టోబర్ 21 నుంచి ఢాకా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.బంగ్లాతో టెస్టులకు దక్షిణాఫ్రికా జట్టుటెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రామ్, వియాన్ ముల్డర్, సెనూరన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్ట్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికల్టన్ వెర్రేన్నే(వికెట్ కీపర్) -
దక్షిణాఫ్రికా ఓపెనర్ శుభారంభం.. చిత్తుగా ఓడిన ఐర్లాండ్
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. అబుదాబి వేదికగా జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రొటియేస్ జట్టు ఊదిపడేసింది.కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలో ఛేదించింది. లక్ష్య ఛేదనలో సఫారీ ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్ విధ్వంసం సృష్టించారు. ఐరీష్ బౌలర్లను ఊచకోత కోశాడు.వీరిద్దరూ తొలి వికెట్‌కు 13 ఓవర్లలో 136 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. రికెల్టన్ 48 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 76 పరుగులు చేయగా.. హెండ్రిక్స్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 51 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఐరీష్ బ్యాటర్లలో కర్టిస్ కాంఫర్(49) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో పాట్రిక్ కుర్గర్ 4 వికెట్లతో సత్తాచాటాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 అబుదాబి వేదికగా సెప్టెంబర్ 29న జరగనుంది.చదవండి: SL vs NZ: జయసూర్య 'సిక్సర్'.. 88 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్ -
63 టెస్టులు.. 294 వికెట్లు! జాక్వెస్ కల్లిస్ రికార్డు బద్దలు
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ నిప్పులు చేరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లు బౌలింగ్ చేసిన రబాడ.. మూడు కీలక వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు. అతడితో పాటు మహారాజ్ 4 వికెట్ల పడగొట్టడంతో ఆతిథ్య కరేబియన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్రోటీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగుల ఆధిక్యం లభించింది. విండీస్ బ్యాటర్లలో కీసీ కార్తీ(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 357 పరుగులకు ఆలౌటైంది.రబాడ అరుదైన ఘనత..ఇక ఈ మ్యాచ్‌లో కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో సఫారీ బౌలర్‌గా రబడ రికార్డులకెక్కాడు. విండీస్ బ్యాటర్ కావెం హాడ్జ్‌ను ఔట్ చేసిన రబాడ.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 63 టెస్టులు ఆడిన రబాడ 294 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు ప్రోటీస్ క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ (291) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కల్లిస్‌ను రబాడ అధిగమించాడు. ఇక ఈ జాబితాలో దక్షిణాఫ్రికా పేస్ గన్ డేల్ స్టెయిన్ 439 వికెట్లతో అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో షాన్ పొలాక్(421), ఎన్తిని(390) ఉన్నారు. -
దక్షిణాఫ్రికాతో ఫైనల్.. చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ
టీ20 వరల్డ్‌కప్-2024లో ఫైనల్ పోరుకు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నీ ఫైనల్లో బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికా- భారత్ జట్లు తాడోపేడో తెల్చుకోనున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్టర్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డును ఊరిస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ మరో 6 పరుగులు సాధిస్తే టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేరిట ఉంది. టీ20 ప్రపంచకప్‌లలో ఇప్పటివరకు కోహ్లి 1,216 పరుగుల చేశాడు. రోహిత్ విషయానికి వస్తే.. టీ20 వరల్డ్‌కప్‌లలో 1,211 పరుగులు చేశాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌తో విరాట్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలయ్యే అవకాశముంది.కాగా ప్రస్తుత వరల్డ్‌కప్‌లో హిట్‌మ్యాన్ అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మెగా ఈవెంట్లో 7 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. 248 పరుగులతో మూడో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. -
దక్షిణాఫ్రికా గెలవాలంటే అదొక్కటే మార్గం: మోర్కెల్
టీ20 వరల్డ్-2024 ఫైనల్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్లో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టైటిల్ పోరు కోసం ఇరు జట్లు ఇప్పటికే తమ ఆస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకున్నాయి.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తమ 13 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరదించాలని భారత్ భావిస్తుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా తొలిసారి ట్రోఫీని ముద్దాడాలన్న కసితో ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు ఆ జట్టు మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ కీలక సూచనలు చేశాడు. ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కొనేందుకు ప్రోటీస్ బ్యాటర్లు అతిగా ఆలోచించకూడదని మోర్కల్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది మెగా టోర్నీలో బుమ్రా, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ దుమ్ములేపుతున్నారు. బుమ్రా తన 7 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ కేవలం 4 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు."బుమ్రా అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడిని ఎదుర్కొవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆరంభంలో వికెట్లు తీసే సత్తా బుమ్రాకు ఉంది. అంతేకాకుండా డెత్ ఓవర్లలో కూడా అతడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలడు.పవర్ ప్లేలో రెండు ఓవర్లు, తర్వాత మళ్లీ ఆఖరి ఓవర్లలోనే బుమ్రా అటాక్‌లో వస్తాడు. కాబట్టి మా జట్టుకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. మిడిల్ ఓవర్లలో మా బ్యాటర్లు బాగా రాణించి పరుగులు చేపట్టాలి. అప్పుడే గౌరవప్రదమైన స్కోరును సాధించడానికి అవకాశముంటుంది. అయితే మిడిల్ ఓవర్లలో భారత బౌలర్లను ఎటాక్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతడొక వికెట్ టేకర్. తన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తడిలోకి నెట్టగలడు. కాబట్టి సౌతాఫ్రికా బ్యాటర్లు ఒత్తడికి లోనవ్వకుండా బాల్ టూ బాల్ టూ ఆచితూచి ఆడాలి. అప్పుడే దక్షిణాఫ్రికా గేమ్‌లో ఉటుందని"ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోర్కల్ పేర్కొన్నాడు. కాగా వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఆడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే టైటిల్ సౌతాఫ్రికాదే: ఆసీస్ దిగ్గజం
టీ20 ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోసారి సెమీ ఫైనల్ చేరిన దక్షి ణాఫ్రికా.. ఈసారి గతంలో మాదిరి పొరపాట్లకు తావివ్వకూడదని పట్టుదలగా ఉంది. 2009, 2014లలో సెమీస్‌లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్ జట్టు.. ఎలాగైనా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది. దర్జాగా సెమీస్లోకాగా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ జోరు ప్రదర్శించిన విషయం తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మూడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. సూపర్–8 దశలో ఆడిన మూడూ గెలిచిన సఫారీ 6 పాయింట్ల తో గ్రూప్–2 టాపర్‌గా, 4 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీఫైనల్స్‌కు చేరాయి.మరోవైపు రెండుసార్లు టీ20 చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్ కథ ‘సూపర్–8’లోనే ముగిసింది. ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. కైల్ మేయర్స్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోస్టన్ చేజ్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయంరోవ్మన్ పావెల్ (1), రూథర్‌ఫోర్డ్ (0), రసెల్ (15) చేతులెత్తేయడంతో కరీబియన్ జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తబ్రేజ్ షమ్సీ 3 వికెట్లు తీశాడు. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసిన దశలో వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయం కలిగింది.దాంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్ణయించారు. ఆ జట్టు 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి నెగ్గింది. స్టబ్స్ (27 బంతుల్లో 29; 4 ఫోర్లు), క్లాసెన్ (10 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), జాన్సెన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) లక్ష్యంవైపు తీసుకెళ్లారు. ఛేజ్ 3, రసెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు.రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీఇక ఈ విజయంతో టోర్నీలో ముందుకు సాగే అవకాశం దక్కించుకున్న సౌతాఫ్రికా.. గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఊహించని రీతిలో బంగ్లాదేశ్‌ను ఓడించి తొలిసారి వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియం ఇందుకు వేదిక.అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి సౌతాఫ్రికా అద్బుతంగా ఆడిందన్న ఈ కంగారూ క్రికెటర్.. రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు స్పిన్ దళం మ్యాజిక్ చేసిందని కొనియాడాడు.ముఖ్యంగా హెండ్రిక్స్ సూపర్‌గా ఆడుతున్నాడని.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు అదరగొట్టి ఫైనల్‌కు చేర్చుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ నైపుణ్యాలు అమోఘమన్న బ్రాడ్ హాగ్.. ప్రొటిస్ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందన్నాడు.సౌతాఫ్రికా సెమీస్‌లో గనుక అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేనంటూ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పాడు. కాగా తొలి సెమీస్‌లో సౌతాఫ్రికా- బంగ్లాదేశ్ తలపడనుండగా.. రెండో సెమీస్ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి.చదవండి: ట్రోఫీ గెలిచే అర్హత అతడికే ఉంది: షోయబ్ అక్తర్ -
సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్.. 143 పరుగుల తేడాతో ఘన విజయం
స్వదేశంలో దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ వెళ్లింది. 266 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా భారత బౌలర్లు దాటికి 37.4 ఓవర్లలో కేవలం 122 పరుగులకే కుప్పకూలింది.భారత బౌలర్లలో ఆశా శోభన 4 వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా.. దీప్తీ శర్మ రెండు, పూజా, రేణుకా సింగ్, తలా వికెట్ పడగొట్టారు. ప్రోటీస్ బ్యాటర్లలో సునీ లూస్(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల భారీ స్కోర్ సాధించింది.టీమిండియా బ్యాటర్లలో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన సెంచరీతో చెలరేగింది.ఈ మ్యాచ్‌లో 127 బంతులు ఎదుర్కొన్న మంధాన 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 117 పరుగులు చేసింది. స్మృతికి ఇది ఆరో అంతర్జాతీయ వన్డే సెంచరీ కావడం గమనార్హం. భారత బ్యాటర్లలో మంధానతో పాటు దీప్తీ శర్మ(37), పూజా వస్త్రాకర్(31 నాటౌట్) పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా.. క్లాస్ రెండు, డెకరసన్, మల్బా, షాంగసే తలా వికెట్ సాధించారు. -
జట్టును ప్రకటించిన వెస్టిండీస్.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
టీ20 వరల్డ్‌కప్-2024లో సన్నాహకాల్లో భాగంగా వెస్టిండీస్ తమ స్వదేశంలో ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలి దశ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఇరు జట్లు ఆడనునున్నాయి. టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత మరో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.మే 23న జమైకా వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రోటీస్‌తో సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు ఐపీఎల్-2024లో భాగమైన విండీస్ ఆటగాళ్లు దూరమయ్యారు. కెప్టెన్ కెప్టెన్ రావ్‌మెన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, హెట్‌మైర్ వంటి కీలక ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు సన్నద్దమవుతున్నారు. ఈ సిరీస్‌లో విండీస్ కెప్టెన్‌గా బ్రాండన్ కింగ్ వ్యవహరించనున్నాడు.దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, రోస్టన్ చేజ్, అలిక్ అథానాజ్, జాన్సన్ చార్లెస్, ఆండ్రీ ఫ్లెచర్, మాథ్యూ ఫోర్డే, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, షమర్ జోసెఫ్, కైల్ మేయర్స్, ఒబెడ్ మెక్కాయ్, గుడాకేష్ మోటీ, రొమారియోడెన్ షెఫెర్డ్ వాల్ష్. -
T20 World Cup: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా అమూల్...
టీ20 వరల్డ్‌కప్-2024 మరో నెల రోజుల్లో తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో భాగమయ్యే ఆయా క్రికెట్ బోర్డులు ఒక్కొక్కటిగా తమ జట్ల వివరాలను వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి అగ్రశ్రేణి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత డెయిరీ దిగ్గజం అమూల్ అమెరికా, దక్షిణాఫ్రికా జట్ల ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ మెరకు గురువారం న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులతో అమూల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని ఇరు జట్ల క్రికెట్ బోర్డులు ధ్రువీకరించాయి. కాగా గతంలో కూడా దక్షిణాఫ్రికాకు స్పాన్సర్‌గా అమూల్ వ్యవహరించింది. దక్షిణాఫ్రికాతో పాటు నెదర్లాండ్స్, అఫ్గానిస్తాన్ జట్లకు సైతం అమూల్ స్పాన్సర్ చేసింది. కాగా ఈ మెగా ఈవెంట్లో బాగా రాణించాలని అమెరికా, దక్షిణాఫ్రికా జట్లకు అమూల్ మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా అమెరికా, ప్రోటీస్ క్రికెట్ బోర్డులతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ పొట్టి వరల్డ్‌కప్‌లో అమెరికా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 1న కెనడాతో తలపడగా.. దక్షిణాఫ్రికా జూన్ 3న శ్రీలంకను ఢీకొట్టనుంది. -
గజరాజు ప్రతాపం : అమాంతం ఎత్తి పడేసింది! వీడియో వైరల్
సరదాగా సఫారీకి వెళ్లిన టూరిస్టులు చేదులో అనుభవం ఎదురైంది. తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఒక ఏనుగును దగ్గరినుంచి చూడాలనుకుని ముచ్చపట్టారు. అంతటితో ఆగకుండా ఫోటో తీయాలని ప్రయత్నించారు. అంతే క్షణాల్లో ఊహంచని పరిణామం ఎదురైంది. ఏనుగు సఫారీ ట్రక్కును అమాంతం దొర్లించేసింది. దక్షిణాఫ్రికాలోని పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. An elephant attacks a tourist truck in South Africa 🇿🇦 pic.twitter.com/BX8typkcUq — Africa In Focus (@AfricaInFocus_) March 19, 2024 అసలు ఏమైందంటే... ఏబీసీ న్యూస్ రిపోర్ట్ ప్రకారం పిలానెస్‌బర్గ్ నేషనల్ పార్క్‌లో 22 సీటర్ ట్రక్కులో పర్యాటకులు సఫారీకి వెళ్లారు. ఇంతలో భారీ ఏనుగు కనిపించింది. పర్యాటకులు ఫోటోలు తీయడానికి ప్రయత్నించినపుడు ఏనుగు మరింత దగ్గరగా వచ్చింది. ఉన్నట్టుండి ట్రక్పైదాడి చేసింది. ఏనుగును ట్రక్కును అమాతం ఎత్తేసింది. ఇలా చాలా సార్లు పడేసింది. దీంతో ట్రక్ లోపల ఉన్నవాళ్లంతా భయంతో వణికి పోయారు. సీట్ల కింద దాక్కున్నారు. ఇంతలో డ్రైవర్ పో...ఫో గట్టిగా అదిలించాడు. ట్రక్‌పై కొడుతు పెద్దగా శబ్దం చేశాడు. దీంతో ఏనుగు భయపడిందో.. శాంతించిందో తెలియదు గానీ పక్కకు తొలగిపోయింది. దీంతో అందరూ బతుకు జీవుడా అనుకున్నారు. హెండ్రీ బ్లోమ్ ఈ సంఘటనను కెమెరాలో బంధించాడురు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏనుగు ట్రక్కు దగ్గరకు వచ్చిన సమయంలో పర్యాటకులు ఫోటోలు తీయాలనుకున్నందున అది దూకుడుగా ప్రవర్తించిందని పార్క్ అధికారి తెలిపారు ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదన్నారు. అయితే బాగా బెంబేలెత్తిపోయిన ఒక కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు టూర్ కంపెనీ మాంక్వే గేమ్ ట్రాకర్స్ వెల్లడించారు. మరోవైపు టూర్ గైడ్ సమయానుకూలంగా వ్యవహరించిన తీరును వన్యప్రాణి నిపుణులు ప్రశంసించారు. -
మూడు మ్యాచ్‌లకు రూ.1.25 కోట్లు.. పెళ్లినే వాయిదా వేసుకున్న స్టార్ క్రికెటర్
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఇటీవలే(మార్చి 10) తన గర్ల్ ఫ్రెండ్ కామిల్లా హారిస్‌ను వివాహమడిన సంగతి తెలిసిందే. అయితే వాస్తవానికి వీరిద్దరి పెళ్లి గత నెలలోనే జరగాల్సింది. కానీ మిల్లర్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తన పెళ్లిని వాయిదా వేసున్నాడు. బీపీఎల్‌లో ఫార్చూన్ బరిషల్ జట్టుకు మూడు మ్యాచులు ఆడితే ఏకంగా రూ. 1.25 కోట్లను చెల్లించేందుకు ఆ ఫ్రాంచైజీ ఆఫర్ ఇచ్చింది. దీంతో మిల్లర్ తన పెళ్లిని వాయిదా వేసుకుని ఫార్చూన్ బరిషల్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు . ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్ 2), మార్చి 1న (ఫైనల్) ఫార్చూన్ బరిషల్‌కు మిల్లర్ ఆడాడు. బీపీఎల్-2024 విజేతగా ఫార్చూన్ బరిషల్ జట్టు నిలిచింది. తాజాగా ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ వెల్లడించాడు. "పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బీజీగా ఉండటంతో బీపీఎల్‌ను పెద్దగా ఫాలో కాలేదు. అయితే ఈ ఏడాది బీపీఎల్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారన్న విషయం గురించి నా స్నేహితులను ఆడిగాను. అప్పుడే నాకు ఓ సంచలన విషయం తెలిసింది. మూడు మ్యాచ్‌లు ఆడితే డేవిడ్ మిల్లర్‌కు 1.50 లక్షల డాలర్లు ఇచ్చేందుకు ఫార్చూన్ బరిషల్ ఫ్రాంచైజీ ముందుకు వచ్చింది. దీంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు" దిపెవిలియన్ షోలో అక్రమ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు మిల్లర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం -
వరల్డ్‌కప్ ఫైనల్లో బోల్తా పడ్డ భారత్.. నాలుగో సారి జగజ్జేతగా నిలిచిన ఆస్ట్రేలియా
అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. యంగ్ ఇండియాతో ఇవాళ (ఫిబ్రవరి 11) జరిగిన ఫైనల్లో యువ ఆసీస్ జట్టు 79 పరుగుల తేడాతో విజయం సాధించి, నాలుగో సారి జగజ్జేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. భారత సంతతికి చెందిన హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, నమన్ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన యువ భారత్.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు నిరాశ కలిగించింది. భారత ఇన్నింగ్స్‌లో ఆదర్శ్ సింగ్ (47), తెలుగు ఆటగాడు మురుగన్ అభిషేక్ (42), ముషీర్ ఖాన్ (22), నమన్ తివారి (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లు బియర్డ్మ్యాన్ (3/15), రాఫ్ మెక్‌మిలన్ (3/43), కల్లమ్ విడ్లర్ (2/35), ఆండర్సన్ (1/42) టీమిండియా పతనాన్ని శాశించారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్ 168 పరుగుల వద్ద టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. కల్లమ్ ముల్దర్ బౌలింగ్‌లో మురుగన్ అశ్విన్ (42) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ డౌన్ వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి దాదాపుగా ఖరారైపోయింది. 122 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. మెక్‌మిలన్ బౌలింగ్‌లో రాజ్ లింబాని (0) క్లీన్ బౌల్డయ్యాడు. ఏడో వికెట్ కోల్పోయిన భారత్ 115 పరుగులకే భారత్ ఏడు వికెట్లు కోల్పోయింది. బియర్డ్మ్యాన్ బౌలింగ్‌లో ఆదర్శ్ సింగ్ (47) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే ఇంకా 139 పరుగులు చేయాలి. చేతిలో కేవలం మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆరో వికెట్ డౌన్ 91 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. తెలంగాణ కుర్రాడు అవనీశ్ రాఫ్ మెక్‌మిలన్ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో భారత్ వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 90 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. ఆండర్సన్ బౌలింగ్‌లో ప్రియాంశు మోలియా (9) ఔటయ్యాడు. టీమిండియా గెలవాలంటే ఇంకా 164 పరుగులు చేయాలి. చేతిలో కేవలం ఐదు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆదర్శ్ సింగ్ (32), అవీనశ్ రావు క్రీజ్‌లో ఉన్నారు. 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ఛేదనలో యంగ్ ఇండియా 68 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్టార్ త్రయం ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్, సచిన్ దాస్ సహా అర్శిన్ కులకర్ణి ఔట్ కాగా.. ఆదర్శ్ సింగ్ (31), ప్రియాంశు మోలియా (7) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ గెలవాలంటే ఈ మ్యాచ్‌లో మరో 170 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో కేవలం ఆరు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ముషీర్ ఖాన్ క్లీన్ బౌల్డ్ 40 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. బియర్డ్మెన్ బౌలింగ్‌లో ముషీర్ ఖాన్ (22) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆదర్శ్ సింగ్ (12), ఉదయ్ సహారన్ క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా గెలవాలంటే ఇంకా 213 పరుగులు చేయాలి. చేతిలో మరో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 254 పరుగుల లక్ష్య ఛేదనలో యువ భారత్ జట్టు 3 పరుగులకే వికెట్ కోల్పోయింది. కల్లమ్ విడ్లెర్ బౌలింగ్‌లో ర్యాన్ హిక్స్‌కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ కులకర్ణి (3) ఔటయ్యాడు. ఆదర్శ్ సింగ్‌కు జతగా ముషీర్ ఖాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. టీమిండియా టార్గెట్ ఎంతంటే..? అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఆస్ట్రేలియా 254 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందుంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో హర్జస్ సింగ్ (55) అర్దసెంచరీతో రాణించగా.. హ్యారీ డిక్సన్ (42), హగ్ వెబ్జెన్ (48), ఒలివర్ పీక్ (46 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్ 187 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. ముషీర్ ఖాన్ బౌలింగ్‌లో రాఫ్ మెక్‌మిలన్ (2) ఔట్ అయ్యాడు. 40 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 187/6గా ఉంది. ఒలివర్ పీక్ (10), చార్లీ ఆండర్సన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్ 181 పరుగుల వద్ద ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. సౌమీ పాండే బౌలింగ్‌లో హర్జస్ సింగ్ (55) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 38 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 181/5గా ఉంది. ఒలివర్ పీక్ (6), రాఫ్ మెక్‌మిలన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్ 165 పరుగుల వద్ద ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. రాజ్ లింబాని బౌలింగ్‌లో ర్యాన్ హెండ్రిక్స్ (20) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. 35 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 167/గా ఉంది. ఒలివర్ పీక్ (1), హర్జస్ సింగ్ (46) క్రీజ్‌లో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 99 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. నమన్ తివారి బౌలింగ్‌లో మురుగన్ అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి హ్యారీ డిక్సన్ (42) ఔటయ్యాడు. 23 ఓవర్ల తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ 100/3గా ఉంది. ర్యాన్ హిక్స్ (1), హర్జస్ సింగ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 94 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. నమర్ తివారి బౌలింగ్‌లో ముషీర్ ఖాన్ క్యాచ్ పట్టడంతో హగ్ వెబ్జెన్ (48) ఔటయ్యాడు. 21 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 94/2గా ఉంది. హ్యారీ డిక్సన్ (39), హర్జస్ సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. 12 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 49/1 12 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో హ్యూ వీబ్జెన్(244), డిక్సాన్(21) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 39/1 8 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టానికి 39 పరుగులు చేసింది. క్రీజులో హ్యూ వీబ్జెన్(14), డిక్సాన్(21) పరుగులతో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. భారత పేసర్ రాజ్ లింబానీ బౌలింగ్‌లో సామ్ కాన్స్టాస్ క్లీన్ బౌల్డయ్యాడు. 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/0 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 16/0 2 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. క్రీజులో డిక్సాన్(15), సామ్ కాన్స్టాస్(0) పరుగులతో ఉన్నారు. అండర్-19 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో బెనోని వేదికగా ఆస్ట్రేలియా- భారత జట్లు తలపడతున్నాయి. తుది పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగగా.. ఆసీస్ మాత్రం ఒక మార్పుతో ఆడనుంది. కాగా భారత్-ఆసీస్ ఫైనల్లో తలపడడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు ఫైనల్ పోరులో రెండు సార్లు భారత్ విజయం సాధించగా.. ఆసీస్ ఒక్కసారి గెలుపొందింది. తుది జట్లు: ఆస్ట్రేలియా: హ్యారీ డిక్సన్, సామ్ కొన్‌స్టాస్, హ్యూ వీబ్జెన్ (కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్ (వికెట్ కీపర్), ఆలీ పీక్, చార్లీ ఆండర్సన్, రాఫెల్ మాక్మిలన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మాన్, కల్లమ్ విడ్లర్ భారత్: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ అహ్మద్ ఖాన్, ఉదయ్ సహారన్ (కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్ (వికెట్‌కీపర్), మురుగన్ అభిషేక్, నమన్ తివారీ, రాజ్ లింబాని, సౌమీ పాండే -
చరిత్ర సృష్టించిన డేవిడ్ మిల్లర్.. తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా మిల్లర్ రికార్డులకెక్కాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో భాగంగా బుధవారం జో బర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన ఎలిమేనిటర్ మ్యాచ్‌లో28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మిల్లర్.. ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ లీగ్‌లో పార్ల్ రాయల్స్ కెప్టెన్‌గా మిల్లర్ వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు 466 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్ 10019 పరుగులు చేశాడు. కాగా ఈ మైలు రాయిని సౌతాఫ్రికా దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, ఫాప్ డుప్లెసిస్ కూడా అందుకోలేకపోయారు. ఇక ఓవరాల్‌గా ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న జాబితాలో మిల్లర్ 12 స్ధానంలో నిలిచాడు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(14562) తొలి స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. జో బర్గ్ సూపర్ కింగ్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైన పార్ల్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాళ్లు వీరే? క్రిస్ గేల్ (14562) షోయబ్ మాలిక్ (13077) కీరన్ పొలార్డ్ (12577), అలెక్స్ హేల్స్ (12002), విరాట్ కోహ్లి (11994), డేవిడ్ వార్నర్ (11860), ఆరోన్ ఫించ్ (11458), రోహిత్ శర్మ (11156), జోస్ బట్లర్ 11146), కోలిన్ మున్రో (10602) జేమ్స్ విన్స్ (10019) డేవిడ్ మిల్లర్(10019) -
వన్డేల్లో దక్షిణాఫ్రికా అత్యంత చెత్త రికార్డు..
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా.. భారత్ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది. కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల తేడాతో సౌతాఫ్రికా పరాజయం పాలైంది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించగా.. మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు పేసర్ మహ్మద్ సిరాజ్ ఆరంభంలోనే డికాక్‌ను ఔట్ చేసి సఫారీలను చావుదెబ్బ కొట్టాడు. ప్రోటీస్ బ్యాటర్లలో జానెసన్(13) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా చెత్త రికార్డు.. ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన దక్షిణాఫ్రికా ఓ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ వన్డేల్లో పరుగుల పరంగా సౌతాఫ్రికా ఇదే అతిపెద్ద పరాజయం. ఇంతకుముందు 2002లో పాకిస్తాన్‌తో జరిగిన ఓ వన్డేలో 182 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో మరోసారి ఆప్రతిష్టతను ప్రోటీస్ మూటకట్టుకుంది. చదవండి: మాకు ఎటువంటి స్సెషల్ ప్లాన్స్ లేవు.. అతడొక ఛాంపియన్! జడ్డూ కూడా: రోహిత్ శర్మ -
దక్షిణాఫ్రికా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్ టార్గెట్ 358 పరుగులు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. డస్సెన్ 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133 పరుగులు చేయగా.. డికాక్ 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు సాధించాడు. వీరిద్దరితో పాటు డేవిడ్ మిల్లర్ 53 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీయగా.. నీషమ్, బౌల్ట్ ఒక్క వికెట్ పడగొట్టారు. చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మ్యాక్స్‌వెల్‌కు ప్రమాదం! తలకు తీవ్ర గాయం -
కంగారెత్తించే కంగారులకు ఏమైంది? తిరిగి గాడిలో పడేనా?
వన్డే ప్రపంచకప్ 2023లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా. తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. 5 సార్లు వరల్డ్ ఛాంపియన్స్ అయిన ఆసీస్ జట్టు.. పసికూన కంటే దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్ అంటే వార్ వన్ సైడే అని భావించేవారు. కానీ ఇప్పడు పరిస్థితి మరోలా ఉంది. భారత్ చేతిలో తొలి మ్యాచ్‌లోనే ఓటమి పాలైన కంగారులు.. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ ఘోర పరభావం మూటకట్టుకుంది. సఫారీల దెబ్బకు ఆసీస్ జట్టు విలావిల్లాడింది. ఏకంగా 134 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 311 పరుగుల భారీ లక్ష్య చేధనలో కేవలం 177 పరుగులకే కుప్పకూలింది. వరల్డ్‌కప్ అంటే చెలరేగిపోయే ఆసీస్ ఎందుకు ఈ స్ధాయికి దిగజారింది? కంగారులు ఎక్కడ తప్పుచేస్తున్నారు? తర్వాత మ్యాచ్‌ల్లో కమ్మిన్స్ సేన తిరిగి పుంజుకుంటుందా వంటి విషయాలను ఓసారి చర్చిద్దాం. ఓపెనర్లు విఫలం.. ఆస్ట్రేలియాకు బౌలింగ్ ఎంత బలమో.. బ్యాటింగ్ కూడా అంతే బలం. 300 పరుగుల టార్గెట్ కూడా ఆసీస్ బ్యాటింగ్ జోరు ముందు చిన్నబోయేది. అటువంటి ఆస్ట్రేలియా ఈ వరల్డ్‌కప్‌లో 200 పరుగుల మార్క్‌ను అందుకోవడానికి కూడా నానా కష్టాలు పడుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఓపెనర్లు విఫలం. ఈ మెగా టోర్నీకి ఆసీస్ రెగ్యూలర్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ గాయం కారణంగా దూరమయ్యాడు. హెడ్ లేని లోటు ఆసీస్ జట్టులో స్పష్టంగా కన్పిస్తోంది. హెడ్ గైర్హాజరీలో ఆసీస్ ఇన్నింగ్స్‌ను మిచెల్ మార్ష్.. డేవిడ్ వార్నర్‌తో కలిసి ఆరంభిస్తున్నాడు. ఓపెనర్‌గా వస్తున్న మార్ష్ కనీసం ఒకట్రెండు ఓవర్లు కూడా క్రీజులో ఉండలేకపోతున్నాడు. భారత్‌తో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన మార్ష్.. ప్రోటీస్‌పై కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కాస్త పర్వాలేదనపిస్తున్నాడు. టీమిండియాపై 41 పరుగులతో రాణించిన వార్నర్.. దక్షిణాఫ్రికాపై మాత్రం 13 పరుగులకే తమ ఇన్నింగ్స్‌ను ముగించాడు. అయితే ఇది వార్నర్ నుంచి ఆశించిన ప్రదర్శన కాదు. తర్వాతి మ్యాచ్‌లో ఆసీస్ తిరిగి గాడిలో పడాలంటే ఓపెనింగ్ జోడిని మార్చాలిందే. మరో వికెట్ కీపర్ లేడా? ప్రస్తుత ఆస్ట్రేలియాతో జట్టులో సమర్థవంతమైన వికెట్ కీపర్ బ్యాటర్ లేడు. ఒకప్పుడు ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఇయాన్ హీలీ వంటి వికెట్ కీపర్ బ్యాటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఆసీస్.. ఇప్పుడు ఆ స్ధాయి కీపర్లను తయారుచేయలేకపోతుంది. వికెట్ కీపర్ అంటే.. వికెట్ల వెనుక మెరుగ్గా రాణిస్తే చాలు అన్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పరిస్థితి ఉంది. ప్రస్తతం ఆసీస్ జట్టులో రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా అలెక్స్ కారీ కొనసాగుతున్నాడు. వికెట్లు వెనుక పర్వాలేదనపిస్తున్న కారీ.. బ్యాటింగ్ పరంగా తీవ్ర నిరాశపరిస్తున్నాడు. జట్టుకు కీలకమైన మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తున్న అతడు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితమవుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే కారీ పెవిలియన్‌కు చేరాడు. దీంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు క్యారీ ఆసీస్ జట్టు మేనెజ్మెంట్ పక్కన పెట్టింది. అతడి స్ధానంలో జోష్ ఇంగ్లీష్ జట్టులోకి వచ్చాడు. జోష్ ఇంగ్లీష్ కూడా అదే తీరును కనబరిచాడు. 5 పరుగులకే తన ఇన్నింగ్స్‌ను జోష్ ముగించాడు. కచ్చితంగా వీరిద్దరి ప్రత్యామ్నాయం వెతకాల్సిన సమయం క్రికెట్ ఆస్ట్రేలియాకు అసన్నమైంది. ఫినిషింగ్ లేదు.. ఆస్ట్రేలియా అంటే విధ్వంసకర ఆటకు మారుపేరు. అటువంటిది ప్రస్తుత మెగా టోర్నీలో ఆసీస్ ఆటగాళ్ల బ్యాట్లు మూగబోయాయి. సిక్స్‌లు మాట పక్కన పెడితే ఫోర్లు కూడా కొట్టడానికి కష్టపడుతున్నారు. టాపర్డర్‌లో వార్నర్.. మిడిలార్డర్లో స్మిత్, లాబుషేన్ కొన్ని మంచి ప్రదర్శనలు చేస్తున్నారు. కానీ ఆసీస్‌కు ఫినిషింగ్ మాత్రం దొరకడంలేదు. వరల్డ్ క్రికెట్లో విధ్వంసకర ఆటగాళ్లగా పేరు గాంచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, గ్రీన్, స్టోయినిష్ తుస్సుమనిపిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో గ్రీన్, మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సఫారీలతో మ్యాచ్‌కు గ్రీన్ స్ధానంలో స్టోయినిష్కు అవకాశం ఇచ్చారు. స్టోయినిష్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మ్యాక్స్‌వెల్‌ది కూడా అదే పరిస్ధితి. బౌలింగ్‌లో పర్వాలదేనపిస్తున్న మ్యాక్సీ.. బ్యాటింగ్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ హిట్టర్లు తిరిగి గాడిలో పడకపోతే ఈ మెగా టోర్నీలో ఆసీస్ ఇంటిముఖం పట్టకతప్పదు. జంపా ఫెయిల్.. ఆసీస్ బౌలింగ్ పరంగా కాస్త పర్వాలేదనపిస్తుంది. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి కష్టాలోక్కి నెట్టారు. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు తమ రిథమ్‌ను కోల్పోవడంతో టీమిండియా విజేతగా నిలిచింది. హాజిల్‌వుడ్, స్టార్క్, కమ్మిన్స్ వంటి తమ స్ధాయికి తగ్గట్టు ప్రదర్శన చేస్తున్నారు. కానీ కంగారుల ఫ్రంట్ లైన్ స్పిన్నర్ ఆడమ్ జంపా మాత్రం తీవ్ర నిరాశపరిస్తున్నాడు. వికెట్లు తీయడంలో విఫలమవుతున్న జంపా.. పరుగులు భారీగా సమర్పించుకుంటున్నాడు. చెత్త ఫీల్డింగ్.. ఆస్ట్రేలియా క్రికెటర్లు మైదానంలో చాలా చురుగ్గా ఉంటారు. ఎన్నో అద్బుత క్యాచ్‌లను అందుకోవడం మనం చూశాం. కానీ దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ఫీల్డింగ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచింది. 4 ఈజీ క్యాచ్‌లను ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రాప్ చేశారు. అంతేకాకుండా మిస్ ఫీల్డ్‌లు కూడా చాలా చేశారు. శ్రీలంకతో.. ఆసీస్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 16న శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించాలంటే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి మూడు విభాగాల్లో తిరిగిపుంజుకోవాలి. అయితే శ్రీలంక బ్యాటింగ్ పరంగా దుమ్మురేపుతోంది.కాబట్టి శ్రీలంకనుంచి కూడా ఆసీస్‌కు గట్టిపోటి ఎదునుకానుంది. చదవండి: WC 2023: దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమి.. 48 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా చెత్త రికార్డు -
నేనేమి నిద్రపోలేదు.. అందుకు కారణం కెమెరా యాంగిల్: దక్షిణఫ్రికా కెప్టెన్
వన్డే ప్రపంచకప్-2023 ప్రారంభానికి ముందు బుధవారం అహ్మదాబాద్‌లో కెప్టెన్స్ మీట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మీట్‌కు 10 జట్ల కెప్టెన్లు హాజరయ్యారు. అయితే ఈ మీట్ సందర్భంగా దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ టెంబా బావుమా నిద్రపోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరలవుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై బావుమా స్పందించాడు. కెప్టెన్సీ మీట్లో తానేమి నిద్రపోలేదని బావుమా తెలిపాడు. ఆ ఫోటో తప్పుదోవ పట్టడానికి కారణం కెమెరా యాంగిల్ అని బావుమా సృష్టం చేశాడు. బవుమా కెప్టెన్స్ కాన్ఫరెన్స్‌లో కళ్లుమూసుకుని ఉన్న ఫోటోను ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ ఎక్స్(ట్విటర్) షేర్ చేసింది. అందుకు ప్రతిస్పందనగా బావుమా.. నేను నిద్రపోలేదు. కెమెరా యాంగిల్ కారణంగానే అలా కన్పిస్తోందని" ట్విట్ చేశాడు. ఇక ఈ మెగా టోర్నీకి మరి కొన్ని గంట్లలో తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. చదవండి: టీమిండియా స్టార్ క్రికెటర్‌కు విడాకులు మంజూరు.. Temba Bavuma has just fallen asleep in the World Cup captain's conference pic.twitter.com/GqQXZ3MenG — England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) October 4, 2023 -
'పాక్, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్‌కప్ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే'
వన్డే వరల్డ్‌కప్-2023 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్‌కు చేరే జట్లను భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఎంచుకున్నాడు. భారత్, ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరుతాయని అతడు అంచనా వేశాడు. "రాబోయే ఏడు వారాలు క్రికెట్ అభిమానులకు అన్ని రకాల వినోదం ఉండబోతుంది. 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ భారత్‌కు తిరిగి వస్తోంది. సుదీర్ఘంగా సాగే ఈ మెగా టోర్నీలో మొత్తం పది జట్లు మిగతా జట్లతో ఒక్కోసారి తలపడతాయి. లీగ్ దశ ముగిశాక ఆతిథ్య భారత్, ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు నాకౌట్ దశ సెమీఫైనల్‌కు చేరుకుంటాయని అంచనా. మాజీ విజేత భారత్, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్లను కచ్చితమైన టైటిల్ ఫేవరెట్స్‌గా పరిగణిస్తాను. భారత బ్యాటర్లతోపాటు బౌలర్లు కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. చివరి నిమిషంలో గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానంలో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ జట్టులోకి రావడం భారత్‌కు మరింత మేలు చేసే విషయం. ఇక ఇంగ్లండ్ దూకుడైన ఆటతో తమకంటూ ప్రత్యేక బ్రాండ్‌ను సృష్టించుకుంది. బెన్ స్టోక్స్ కూడా అందుబాటులోకి రావడంతో ఇంగ్లండ్ మరింత పటిష్టంగా మారింది. బౌలింగ్‌లోనూ కెప్టెన్ జోస్ బట్లర్‌కు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పెద్ద టోరీ్నల్లో, కీలక సమయాల్లో పైచేయి సాధించడం ఆస్ట్రేలియా జట్టుకు అలవాటు. అందుకే ఆ జట్టు ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచింది. ఎన్నో సీజన్ల నుంచి ఐపీఎల్ ఆడటంద్వారా చాలా మంది ఆ్రస్టేలియా ఆటగాళ్లకు ఇక్కడి పరిస్థితులపై మంచి అవగాహన ఏర్పడింది. ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రదర్శన ఆస్ట్రేలియాకు కీలకం కానుంది. ప్రపంచకప్‌లో అత్యంత నిలకడమైన జట్లలో ఒకటిగా న్యూజిలాండ్‌కు పేరుంది. కేన్ విలియమ్సన్ రూపంలో ఆ జట్టులో సూపర్‌స్టార్ ఉన్నా... మిగతా ఆటగాళ్లు కూడా చివరి వరకు పోరాడేందుకు వెనుకాడరు. ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ లేకపోవడం ఆ జట్టుకు లోటుగా ఉన్నా అతడి లేని లోటును భర్తీ చేసే ఆటగాళ్లు న్యూజిలాండ్ జట్టులో చాలా మంది ఉన్నారు అని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు. చదవండి: ప్రపంచకప్‌కు ముందు అన్ని జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన న్యూజిలాండ్ -
బ్యాడ్ లక్కు బ్రాండ్ అంబాసిడర్ దక్షిణాఫ్రికా.. ఈసారైనా సెమీస్ గండం గట్టెక్కేనా?
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లు. నిప్పులు చేరిగే ఫాస్ట్ బౌలర్లు. కళ్లు చెదిరే ఫీల్డింగ్. ప్రతీసారి వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరేట్. కానీ ఒక్కసారి కూడా ఆ జట్టు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టలేకపోయింది. నాలుగు సార్లు సెమీఫైనల్‌కు చేరినా వరల్డ్‌కప్ టైటిల్‌ను ముద్దాడ లేకపోయింది. ఈ ఉపోద్ఘామంతా ఏ జట్టు కోసం ఇప్పటికే మీకు అర్ధమైంది ఉంటుంది. అవును మీరు అనుకుంటున్నది నిజమే. ఇదంతా వరల్డ్‌కప్‌లోలో బ్యాడ్ లక్కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న దక్షిణాఫ్రికా జట్టు కోసమే. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగుతున్న దక్షిణాఫ్రికా.. కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో అదృష్టం కలిసిరాక ఇంటిదారి పడుతుంటుంది. గత 27 ఏళ్లగా వరల్డ్‌కప్ కోసం ప్రోటీస్ పోరాడుతోంది. మరోసారి ప్రపంచకప్ ట్రోఫీ లక్ష్యంగా భారత గడ్డపై సఫారీలు అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో దక్షిణాఫ్రికాకు అదృష్టం కలిసిరాని 5 మ్యాచ్‌లను ఓసారి చూద్దాం. దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్.. 1992 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా అతిథ్యం ఇచ్చాయి. దక్షిణాఫ్రికా జట్టుకు ఇదే మొట్ట మొదటి వరల్డ్‌కప్. ప్రోటీస్ జట్టు తొలి ప్రపంచకప్‌లోనే సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. ఈ మెగా టోర్నీ రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో కెప్లర్ వెసెల్స్ సారధ్యంలోని దక్షిణాఫ్రికా తలపడింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 45 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్ కూడా లక్ష్య ఛేదనలో అదరగొట్టింది. ఆఖరి 13 బంతుల్లో విజయానికి 22 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో ఉన్న బ్రియాన్ మెక్‌మిలన్ (21), డేవ్ రిచర్డ్సన్(13) మంచి జోష్‌లో ఉన్నారు. చేతిలో ఇంకా 4 వికెట్లు ఉన్నాయి. దీంతో ప్రోటీస్ ఫైనల్‌కు చేరడం ఖాయమని అంతా భావించారు. ఈ దశలో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది. సరిగ్గా ఇదే సమయంలో వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. వర్షం అంతరాయం కలిగించడంతో.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 1 బంతికి 22 పరుగులుగా విజయ సమీకరణం మారింది. ఈ క్రమంలో కేవలం 4 పరుగులు మాత్రమే సాధించిన సౌతాఫ్రికా.. 19 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో అదృష్టం కలిసి రాకపోవడం ఇక్కడ నుంచే మొదలైంది. దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వేదికగా జరిగిన 1999 వరల్డ్ కప్‌లో కూడా దక్షిణాఫ్రికా సెమీఫైనల్ల్లో అడుగుపెట్టింది. ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ వరల్డ్క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 213 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ వా, మైఖేల్ బెవాన్లు హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రోటీస్‌కు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సరిగ్గా ఇదే సమయంలో బౌలింగ్‌కు వచ్చిన షేన్ వార్న్ తన స్పిన్ మయాజాలంతో వరుస క్రమంలో మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ప్రోటీస్ కష్టాల్లో పడింది. ఆ సమయంలో జాక్వెస్ కల్లిస్(53),జాంటీ రోడ్స్(43) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో జట్టును విజయ తీరాల వైపు నడిపారు. అనంతరం వీరిద్దరూ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత వారిద్దరి బాధ్యతను లాన్స్ క్లూసెనర్ తీసుకున్నాడు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 9 పరుగులు అవసరం. ప్రోటీస్ చేతిలో కేవలం ఒకే వికెట్ ఉంది. క్రీజులో క్లూసెనర్‌తో పాటు అలన్ డోనాల్డ్ ఉన్నాడు. అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ. ఆఖరి ఓవర్లో డామియన్ వేసిన మొదటి రెండు బంతులను క్లూసెనర్ బౌండరీలకు తరిలించాడు. దీంతో స్కోర్లు సమయ్యాయి. ప్రోటీస్ విజయానికి 4 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే అవసరమైంది. ఇక్కడే ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడో బంతికి సింగిల్ ప్రయత్నించగా.. రనౌట్ అవకాశం మిస్ అయ్యింది. ఈ క్రమంలో నాలుగో బంతిని క్లూసెనర్ మిడ్-ఆఫ్ దిశగా షాట్‌గా ఆడాడు. వెంటనే క్లూసెనర్ సింగిల్ కోసం నాన్ స్ట్రైకర్స్ ఎండ్ వైపు పరిగెత్తగా.. అలన్ డోనాల్డ్ మాత్రం బంతిని చూస్తూ ఉండిపోయాడు. ఈ క్రమంలో ఇద్దరూ నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉండిపోయారు. వెంటనే రికీ పాంటింగ్ వికెట్ కీపర్ గిల్‌క్రిస్ట్‌కు త్రో చేశాడు. గిల్‌క్రిస్ట్‌ను స్టంప్స్‌ను పడగొట్టాడు. మ్యాచ్ టై అయింది దీంతో ఒక్కసారిగా దక్షిణాఫ్రికా శిబరం మొత్తం షాక్‌లో ఉండిపోయింది. అయితే రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. అప్పటిలో సూపర్ ఓవర్ లేదు. దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక సొంత గడ్డపై జరిగిన 2003 ప్రపంచకప్‌లో శ్రీలంకతో ప్రోటీస్ డూ ఆర్ డై మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. 45 ఓవర్ల తర్వాత ప్రొటీస్ లక్ష్యానికి చేరువగా ఉన్న సమయంలో.. వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి చివరి బంతి ఆడిన మార్క్ బౌచర్ పరుగు చేయలేదు. బౌచర్ ఒక్క పరుగు కూడా తీసి ఉంటే దక్షిణాఫ్రికా విజయం సాధించి ఉండేది. సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ భారత్ వేదికగా జరిగిన 2011 వరల్డ్‌కప్ లీగ్ స్టేజిలో గ్రేమ్ స్మిత్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. లీగ్ దశ ముగిసే సమయానికి గ్రూప్ బి లో ప్రోటీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఆరు గ్రూప్ దశ మ్యాచ్‌లలో ఐదు విజయాలు సాధించింది. ఈ క్రమంలో క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు సౌతాఫ్రికా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌కు ప్రోటీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. సఫారీ బౌలర్ల దాటికి కివీస్ కేవలం 221 పరుగులు మాత్రమే చేయగల్గింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 108 పరుగులతో పటిష్టస్ధితిలో నిలిచింది. క్రీజులో కల్లిస్, ఏబీ డివిలియర్స్ ఉన్నారు. ఈ సమయంలో కివీస్ పేసర్ టిమ్ సౌథీ.. కల్లిస్, ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జెపీ డుమినీ వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు. అదే ఓవర్లో రనౌట్ రూపంలో డుప్లెసిస్ వికెట్‌ను కూడా ప్రోటీస్ కోల్పోయింది. దీంతో ప్రోటీస్ పతనం మొదలైంది. ఆ తర్వాత కివీస్ స్పిన్నర్ల దాటికి న్యూజిలాండ్ 172 పరుగులకు ఆలౌటైంది. ఆఖరి 8 వికెట్లు కేవలం 64 పరుగుల వ్యవదిలోనే దక్షిణాఫ్రికా కోల్పోయింది. ప్రోటీస్ వర్సెస్ కివీస్ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన 2015 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టే టోర్నీ ఆసాంతం అదరగొట్టి సెమీఫైనల్‌కు చేరింది. కానీ సెమీస్ గండాన్ని ప్రోటీస్ గట్టెక్కలేకపోయింది. ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం న్యూజిలాండ్ టార్గెట్‌ను 298 పరుగులగా నిర్ధేశించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు బ్రాండెన్ మెక్కల్లమ్ , గుప్టిల్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం గ్రాంట్ ఇలియట్ కోరీ ఆండర్సన్ మధ్య కీలక భాగస్వామ్యంతో కివీస్‌ను విజయతీరాలకు చేర్చారు. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. అయితే 32 ఓవర్లో గ్రాంట్ ఇలియట్‌ను రనౌట్ చేసే ఈజీ ఛాన్స్‌ను డివిలియర్స్ మిస్ చేసుకున్నాడు. ఇందుకు దక్షిణాఫ్రికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. -
అయ్యో దక్షిణాఫ్రికా.. ఊహించిందే జరిగింది! ఇక కష్టమే మరి
వన్డే ప్రపంచకప్-2023కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. అంతా ఊహించినట్టుగానే ఆ జట్టు స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, సిసిందా మగాల గాయాల కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యారు. వరల్డ్‌కప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల ప్రోటీస్ జట్టులో వీరిద్దరూ భాగంగా ఉన్నారు. ఇక వీరిద్దరి స్ధానాలను ఫాస్ట్ బౌలర్లు ఆండిలే ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్‌లతో దక్షిణాఫ్రికా క్రికెట్ భర్తీ చేసింది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా వైట్-బాల్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ధృవీకరించాడు. కాగా నోర్జే వెన్నుగాయంతో బాధపడుతుండగా.. మగాల మోకాలి గాయంతో తప్పుకున్నాడు.అన్రిచ్, సిసిందా ఇద్దరూ వరల్డ్‌కప్‌కు దూరం కావడం మాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇది మమ్నల్ని చాలా నిరాశపరిచింది. వారిద్దరూ మా జట్టుకు చాలా విలువైన బౌలర్లు. వారు రీ ఎంట్రీ ఇవ్వడానికి మా సపోర్ట్ ఎల్లప్పడూ ఉంటుంది. వీరి స్ధానంలో ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్‌లకు అవకాశం ఇచ్చాం. వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన వైట్ బాల్ సిరీస్‌లలో ప్రోటీస్‌కు ప్రాతినిథ్యం వహించారు. వారు తమ టాలెంట్‌ను చూపించడానికి ఇదొక మంచి అవకాశమని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రాబ్ వాల్టర్ పేర్కొన్నాడు. ఇక వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న ఢిల్లీ వేదికగా శ్రీలంకతో తలపడనుంది. చదవండి: ODI World Cup: పిచ్ క్యూరేటర్లకు ఐసీసీ కీలక ఆదేశాలు.. -
దక్షిణాఫ్రికా రాజకీయాలు హింసకు దారి తీస్తున్నాయా?
దక్షిణాఫ్రికా రాజకీయనేత జూలియస్ మలేమా ఒక భారీ ర్యాలీకి సారధ్యం వహిస్తూ, జాతి హింసాత్మక నినాదాలతో రాజకీయాలను మరింత వేడెక్కించారు. ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ నాయకుడు మలేమా దక్షిణాఫ్రికాలోని డచ్ సెటిలర్లు లేదా బోయర్స్, శ్వేతజాతీయులను సూచిస్తూ "కిల్ ది బోయర్, ది ఫార్మర్" అనే జాతి విధ్వంసక వ్యతిరేక పోరాట గీతాన్ని ఆలపించారు. వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా రాజకీయాల్లో ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ అక్కడి ప్రముఖ రాజకీయ శక్తులలో ఒకటిగా అవతరించింది. నిజానికి మలేమా.. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ)లో యువనేత. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి నేత నెల్సన్ మండేలా నేతృత్వంలో శక్తమంతంగా ఎదిగింది. దక్షిణాఫ్రికా శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా హింసకు పిలుపునిచ్చినందుకు మలేమా ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్నారు. దక్షిణాఫ్రికాలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన డెమోక్రటిక్ అలయన్స్ (డీఏ) నేత జాన్ స్టీన్హుయిసెన్ తాజాగా మలేమా వ్యాఖ్యలను ఖండిస్తూ, అతను అంతర్యుద్ధాన్ని ప్రేరేపించాలని నిర్ణయించుకున్న వ్యక్తి అని అభివర్ణించారు. మలేమా.. రక్తపిపాసి అని, నిరంకుశుడు అని, సామూహిక హత్యకు పిలుపునిచ్చాడని ఆయన ఆరోపించారు. మలేమా తీరుపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో డీఎ ఫిర్యాదు చేస్తుందని కూడా ఆయన తెలిపారు. ఇది కూడా చదవండి: బాల భీములు పెద్దోళ్లయిపోయారు.. ఇప్పుడు ఉన్నారిలా.. కాగా ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ (ఈఎఫ్ఎఫ్) నూతన పార్టీ అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పార్టీ జనాదరణ పొందుతున్నట్లు కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. శ్వేతజాతి ఓటర్లకు మద్దతుగా నిలిచే ఉదారవాద డీఏ పార్టీ దాదాపు 16 శాతం ఓట్లను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నదని ఫ్రాన్స్ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. కాగా దక్షిణాఫ్రికన్లలో నల్లజాతీయులకు భూ యాజమాన్యహక్కులను కల్పించేందుకు పాటుపడుతూ, భూ సంస్కరణల కోసం వాదించే ఎకనామిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ పార్టీ (ఈఎఫ్ఎఫ్) దాదాపు 13 శాతం ఓటర్లకు ఆకట్టుకుంటోందని తెలిపింది. South Africa’s black party sings “kill the Boer (Whites), kill the White farmer”. pic.twitter.com/JdPg9Okgnj — Truthseeker (@Xx17965797N) July 30, 2023 జూలియస్ మలేమా ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని పదే పదే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన జాతివిద్వేష పూరిత పాటలను పాడారంటూ పౌర హక్కుల సంఘం ఆఫ్రిఫోరమ్ అతనిని కోర్టుకు లాగింది. మలేమా జాతి విద్వేషపూరిత ప్రసంగం చేస్తూ, వివక్షను వ్యతిరేకించారని బీబీసీ ఆమధ్య ఈఎఫ్ఎఫ్ పదేళ్ల వార్షికోత్సవ కథనంలో పేర్కొంది. 2019లో ఇదే విధమైన ర్యాలీలో.. సమానత్వాన్ని స్థాపించడానికి, ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మలేమా ప్రకటించారు. ‘శ్వేతజాతీయులారా, మాకు కావలసింది డిన్నర్ టేబుల్‌పై మీతో సమానంగా కలసి భోజనం చేయడమే’ అని సోవెటోలోని ఓర్లాండో స్టేడియంలో వేలాది మంది అనుచరుల మధ్య ఆయన పేర్కొన్నారు. ‘మేము మీతో పాటు టేబుల్ వద్ద కూర్చోవడం మీకు ఇష్టం లేకపోతే, టేబుల్‌ను నాశనం చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు’ అని మలేమా పేర్కొన్నారు. తమ పార్టీ దక్షిణాఫ్రికా నల్లజాతీయులకు సమానత్వం అందించాలని కోరుకుంటున్నదని, శ్వేత జాతీయులకు వ్యతిరేకం కాదని మలేమా తెలిపారు. 2019లో మలేమా మాట్లాడుతూ తాము ముందుగా భూమి సమస్యకు పరిష్కారం కోరుతున్నాం. పరిహారం అవసరంలేని విధంగా భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామన్నారు. తద్వారా నల్లజాతీయులకు ప్రయోజనం చేకూర్చాలనుకుంటున్నామన్నారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన బిలియనీర్ ఎలోన్ మస్క్.. మలేమా వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయన జాతి నిర్మూలనకు పురిగొల్పుతున్నారని వ్యాఖ్యానించారు. మలేమా వ్యాఖ్యలపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఎందుకు స్పందించడం లేదని మస్క్ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: వారి ఇలాకాలో కాలు మోపితే.. ఎవరికైనా నెక్స్ట్ బర్త్‌డే ఉండదు! -
పెళ్లి చేసుకున్న సన్‌రైజర్స్ కెప్టెన్.. అమ్మాయి ఎవరంటే?
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఓ ఇంటివాడయ్యాడు. శనివారం తన చిరకాల స్నేహితురాలు నికోల్‌ను మార్క్రమ్ పెళ్లాడాడు. వీరిద్దరి వివాహం సెంచూరియన్‌లోని ఓ పంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. వీరిద్దరి వివాహానికి వారి స్నేహితులు, బంధువులు హజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోను నికోల్ ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేసింది. కాగా వీరిద్దరూ గత 10 ఏళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ క్రమంలో గత ఏడాది వీరిద్దిరి నిశ్చితార్ధం కూడా జరిగింది. కాగా నికోల్ సొంతంగా ఆన్లైన్లో ఓ జ్యూవెలరీ స్టోర్‌ను నడుపుతోంది. ఇక మార్క్రమ్ ఐపీఎల్లో తొలిసారిగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఐపీఎల్-2023 సీజన్లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా వ్యవహరించిన మార్క్రమ్.. జట్టును విజయం పథంలో నడింపించలేకపోయాడు. ఈ ఏడాది సీజన్లో అతడి సారధ్యంలోని ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. కానీ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. చదవండి: #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్‌ప్రీత్.. కుండ బద్దలయ్యేలా! -
ప్రాజెక్ట్ చీతా.. కొత్త పరేషాన్
మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్‌లోని కూనో నేషనల్ పార్క్‌కు సంబంధించిన ఒక వార్త కలకలం రేపుతోంది. కూనో అభయారణ్యంలో చీతాలను స్వేచ్ఛగా విడిచిపెట్టిన తరువాత.. ఆధిపత్యం కోసం, అవి ఉండే స్థల నిర్థారణ కోసం వాటి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా ఈ అభయారణ్యంలోని పాల్పుర్ బీట్ సమీపంలో నమీబియా, సౌతాఫ్రికా చీతాల మధ్య పోరాటం జరిగింది. ఈ దాడులలో ‘అగ్ని’ అనే చిరుతకు తీవ్ర గాయాలయ్యాయి. దానికి కూనో పాల్పుర్ పశువైద్యశాలలో చికిత్స కొనసాగుతోంది. కూనో నేషనల్ పార్కులో సౌత్ ఆఫ్రికా,నమీబియాకు చెందిన చిరుతలు ఉన్నాయి. వీటిని ఈ అభయారణ్యంలో విడిచిపెట్టారు. వీటిని వేర్వేరు దిశలలో రిలీజ్ చేశారు. అయితే ఈ విశాల అరణ్యంలో ఉంటున్న ఈ చీతాలు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు పరస్పరం తలపడుతున్నాయి. ‘అగ్ని’కి ప్రత్యేక వైద్యం.. తాజాగా ఇటువంటి ఘటనే జరిగింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన ‘వాయు’, ‘అగ్ని’ చీతాలతో నమీబియాకు చెందిన ‘శౌర్య’, ‘గౌరవ్’లకు మధ్య పోరాటం జరిగింది. ఈ భీకర పోరాటంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన ‘అగ్ని’ తీవ్ర గాయాలపాలయ్యింది. ఈ చిరుతను మానిటరింగ్ చేస్తున్న టీమ్ దీనిని గమనించి వాటిని వేరుచేసి, వాటిని పాల్పుర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాటికి చికిత్స కొనసాగుతోంది. ఈ చిరుతలో తీవ్రంగా గాయపడిన ‘అగ్ని’కి పశువైద్యులు ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ఆగని పోరాటాలు.. కూనో నేషనల్ పార్క్ డీఎఫ్ఓ ప్రకాశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అభయారణ్యంలోని ‘అగ్ని’ అనే ఆడ చీతా గాయపడిందని, దానికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దాని ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కాగా నమీబియా నుంచి కూనో పార్కుకు తీసుకు వచ్చిన ‘శౌర్య’, ‘గౌరవ్’ చిరుతలు కవలలు. అవి భారత్‌కు వచ్చినప్పటి నుంచి కలివిడిగానే ఉంటున్నాయి. సౌత్ ఆఫ్రికా నుంచి తెచ్చిన ‘వాయు’, ‘అగ్ని’ చీతాలు వేర్వేరుగా మసలుతున్నాయి. ఇరుప్రాంతాలకు చెందిన ఈ చీతాల మధ్య అస్థిత్వం కోసం పోరాటాలు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: అమ్మో..! కుంభకర్ణుడిలా ఏడాదిలో 300 రోజులు నిద్రపోతాడు.. -
తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆరోజు జరిగిందిదే..
సరిగ్గా 56 ఏళ్ల క్రితం వైద్యచరిత్రలో ఒక అద్భుతం నమోదయ్యింది. 1967 డిసెంబరు 3న ప్రపంచంలో తొలిసారిగా ‘హ్యూమన్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ జరిగింది. 53 ఏళ్ల లూయీ వష్కాన్స్కీ గుండె స్థానంలో 25 ఏళ్ల డెనిన్ గుండెను ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హృద్రోగ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. యువత కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. గుండెపోటుతో సంభవించే హఠాన్మరణాల సంఖ్య పెరుగుతోంది. హృద్రోగ సమస్యలకు పరిష్కారంగా కొందరికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తుంటారు. ప్రపంచంలో తొలిసారిగా గుండె మార్పిడి శస్త్ర చికిత్స 56 ఏళ్ల క్రితం జరిగింది. 1967, డిసెంబరు 3న ప్రపంచంలో తొలిసారిగా జరిగిన ‘హ్యూమన్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్’ విజయవంతమయ్యింది. ఇది దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్‌లోని ‘గ్రూట్ షుర్ హాస్పిటల్’లో జరిగింది. ఈ హృదయ మార్పిడి శస్త్రచికిత్సను డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ సారధ్యంలో 30 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం నిర్వహించింది. ఈ శస్త్ర చికిత్స నిర్వహణకు 9 గంటల సమయం పట్టింది. ¿SABÍAS QUÉ?EL PRIMER TRANSPLANTE DE CORAZÓNEn el año de 1971 se dió un paso gigante en la historia de la medicina, pues se realizó con éxito el primer trasplante de corazón.La operación fue llevada por el Doctor Christiaan Barnard en la Ciudad del Cabo, capital de #Sudáfrica. pic.twitter.com/5T24TACYmF— Énfasis Comunica (@EnfasisComunica) June 17, 2023 ఈ శస్త్రచికిత్సకు అవసరమైన సాంకేతికతను అమెరికాకు చెందిన సర్జన్ నార్మన్ అభివృద్ధి చేశారు. దీనికి ముందు తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ 1958లో ఒక శునకానికి జరిగింది. తొలి హ్యూమన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో 53 ఏళ్ల లూయీ గుండె స్థానంలో 25 ఏళ్ల డెనిస్ గుండెను అమర్చారు. డెనిస్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. మనదేశంలో డిల్లీ ఎయిమ్స్‌లో 1994, ఆగస్టు 3న తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ రామ్‌నాయక్ అనే వ్యక్తికి జరిగింది. డాక్టర్ పి వేణుగోపాల్ సారధ్యంలోనే 20 మంది సర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహణలో పాల్గొంది. ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో జనం పిల్లలను కనడం లేదు! -
గోల్డ్ సిటీలో చీకటి సామ్రాజ్యం.. జనజీవనం సాగుతుందిలా..
ఆ నగరంలో ఎటుచూసినా బంగారమే. ప్రపంచంలోనే గోల్డ్సిటీగాపేరొందిన ఆ ప్రాంతంలోని ప్రజల జీవితాలు ‘అంధకారం’, హింస, క్రిమినల్ సిండికేట్ల వివాదాల మధ్య నలిగిపోతూ కనిపిస్తాయి. ఈ బంగారు గనుల మెరుపుల వెనుక ఇక్కడివారి జీవితంలోని మరో కోణం ఎలా ఉంటుంది? ఇక్కడి సాధారణ ప్రజల జీవితం ఎలా కొనసాగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో బంగారం మెరుపు ముందు మరేదీ సాటిరాదు. అలాగే బంగారాన్ని మించినది మరేదీ లేదని చెబుతుంటారు. బంగారం మాయ ప్రపంచాన్నంతటికీ ఒకే విధంగా కమ్మేసింది. చరిత్రకారులు తెలిపిన వివరాల ప్రకారం ఆ నగరం.. ప్రపంచంలోనే అత్యంత పురాతన బంగారు గనులు కలిగిన ప్రాంతం. ఇక్కడ బంగారం తవ్వకాలు 5 వేల ఏళ్ల క్రితం నుంచి జరుగుతున్నాయి. నాటి నుంచి నేటి వరకూ అంటే మహారాజుల కాలం నుంచి ప్రస్తుత యుగం వరకూ ఇక్కడ బంగారం తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. అయినా ఇక్కడి బంగారు వన్నె ఏమాత్రం తగ్గనేలేదు. భవిష్యత్‌లోనూ ఇది కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కూడా చదవండి: రూ. 500 చొప్పున 22 మంది పిల్లల కొనుగోలు.. 18 గంటల వెట్టి చాకిరీ.. అమెరికా, చైనా, భారత్, ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో పెద్దపెద్ద బంగారు గనులున్నాయి. కానీ ‘గోల్డ్ సిటీ ఆఫ్ వరల్డ్’ అని ఏప్రాంతాన్ని అంటారో తెలుసా? అదే దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్. ఇక్కడే అత్యంత భారీగా బంగారు నిల్వలు కలిగిన విట్వాటర్శాండ్ మైన్స్ ఉన్నాయి. ఈ విట్వాటర్ శాండ్ గనులు దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ సువిశాల బంగారు గనుల నుంచి ఉత్పత్తి అయ్యే బంగారం ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అయ్యే బంగారంలో 40 శాతం మేరకు ఉంటుంది. అందుకే జోహెన్స్ బర్గ్ పేరు బంగారంలా వెలిగిపోతుంటుంది. ఎంత బంగారం ఉందంటే... విట్వాటర్శాండ్కు చెందిన గోల్డ్ మైన్స్ భూమిలోపల మూడు వేల మీటర్ల లోతున ఉన్నాయి. ఇక్కడ 82 మిలియన్ ఔన్సుల బంగారం ఉందనే అంచానాలున్నాయి. ఇక్కడ గడచిన 61 ఏళ్లుగా బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి. 1961 నుంచి ఇక్కడి గనుల్లో మొదలైన తవ్వకాలు రాబోయే 70 ఏళ్ల వరకూ అంటే 2092 వరకూ కొనసాగే అవకాశాలున్నాయి. 2017లో ఇక్కడ 281,300 ఔన్స్‌లు, 2018లో 157,100 ఔన్సుల బంగారం ఉత్పత్తి జరిగింది. ఇక్కడ యురేనియం గునులు కూడా భారీగానే ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పకోదగిన ఐదు బంగారు గనులు ఉన్నాయి. అవి కూల్ప్ గోల్డ్‌మైన్, డ్రిఫోంటైన్ గోల్డ్ మైన్, సౌత్ డీప్ గోల్డ్ మైన్, ఇంపాలా మైన్, షిపాంగ్ మైన్. సామాన్యుల జీవితం ఇలా.. ఇక్కడి బంగారం మెరుపుల మధ్య సామాన్యుల జీవితం ఎంతో భిన్నంగా ఉంటుంది. జోహెన్స్ బర్గ్‌లోని గౌంటెడ్ ప్రాంతం దక్షిణాఫ్రికాలో అతి చిన్న భూభాగం. అంటే కేవలం 1.5 శాతం భూభాగం. అయితే ఇక్కడ అత్యధిక జనాభా నివసిస్తున్నారు. దేశంలోని 26 శాతం జనాభా అంటే ఒక కోటీ 60 లక్షల మంది ఇక్కడే ఉంటున్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలో ఐదు అతిపెద్ద మారణహోమాలివే.. గౌంటెడ్ ప్రాంతం.. వాల్ నదీ తీరంలో ఉంటుంది. పలు పర్వాతాలతో పాటు ఇక్కడి విభిన్న వాతారణం ఇక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే ఇక్కడి బంగారుల గనుల తవ్వకాలకు సంబంధించిన ఉపాధి పనులు, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి ప్రజలను ఇక్కడ ఉండేలా చేస్తున్నాయి. సముద్రమట్టానికి 1700 మీటర్ల ఎత్తున ఉన్న జోహెన్స్ బర్గ్ పట్టణ వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది. తరచుగా ఇక్కడ మంచు కురుస్తుంటుంది. గోల్డ్‌సిటీగా మారడం వెనుక.. జోహెన్స్ బర్గ్ గోల్డ్‌సిటీగా మారడం వెనుక ఆసక్తికర కథనం ఉంది. 19వ శతాబ్ధపు చివరినాళ్ల నుంచి ఇక్కడ బంగారం తవ్వకాలు మొదలయ్యాయి. నదీ తీరంలో ఉన్న ప్రాంతమైనందున ఈ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం జోహెన్స్ బర్గ్ జనాభా 50 లక్షలు దాటింది. బంగారు గనుల్లో పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా పలువురు ఇక్కడికి వస్తుంటారు. ఫలితంగా ఇక్కడి సంస్కృతి ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఇక్కడి రోడ్లపై ఆఫ్రికా వంటలు మొదలుకొని ఆసియాతోపాటు అన్ని రకాల యూరోపియన్ ఆహార పదార్థాలు లభ్యమవుతాయి. ఇక్కడి ప్రభుత్వం ఈ ప్రాంతంలో 60 లక్షల చెట్లను నాటి ఫారెస్ట్సిటీగా రూపమిచ్చింది. ఈ కారణంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యధిక చెట్లతో కూడా సిటీగానూ అబివర్ణిస్తుంటారు. ఇక్కడి గోల్డ్మైన్స్పై మొదట యూరప్ వ్యాపారవేత్తల హవా ఉండేది. తరువాతి కాలంలో అరబ్బుల ప్రభావం వేగంగా వ్యాప్తి చెందింది. క్రిమినల్ సిండికేట్లకు నిలయంగా.. ఇక్కడి అడవులు, పర్వతశ్రేణులలో అక్రమంగా తవ్వకాలు జరిపేందుకు ఆసియా- ఆఫ్రికా దేశాల నుంచి అనైతికంగా కూలీలను తీసుకువస్తుంటారు. చీకటితో కూడిన సొరంగాలలో బంగారం పొందవచ్చంటూ ఆశ చూపించి ఇక్కడ జరిగే పనుల్లో కూలీలను నియమిస్తారు. కిలోమీటర్ల పొడవున క్రిమినల్ సిండికేట్ అక్రమ తవ్వకాలు సాగిస్తుంటుంది. ఈ నేధ్యంలో అప్పుడప్పుడూ హింసాయుత ఘటనలు, తూటాల కాల్పులు చోటుచేసుకుంటాయి. ఈ ప్రాంతంలో 6 వేలకు పైగా బంగారు గనులు ఉన్నట్లు అంచనా. ఈ గనుల్లో తవ్వకాలు పూర్తయ్యాక వాటిని అలానే వదిలేస్తుంటారు. ఇక్కడి గనులను ఆక్రమించుకునేందుకు క్రిమినల్ సిండికేట్స్ మధ్య వివాదాలు జరుగుతుంటాయి. ఇంతటి భయావహ పరిస్థితుల మధ్య ఇక్కడ 50 లక్షల జనాభా నివసిస్తోంది. వీరంతా గోల్డ్‌మైన్స్ పనులపైననే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో జనం ఇక్కడికి తరలి వస్తున్నందున హౌసింగ్ సెక్టార్లో షార్టేజీ కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగిత కూడా 29 శాతం మేరకు పెరిగింది. సౌత్ ఆఫ్రికన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వెలువరించి న ఒక రిపోర్టు ప్రకారం 2015 నాటికి ఇక్కడ 30 వేలకు మించిన ఆక్రమణదారుల ఇక్కడ తమ కార్యకలాపాలు యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వీరిలో అత్యధికులు జోహెన్స్ బర్గ్ పట్టణ సమీప ప్రాంతాల్లోని గోల్డ్‌మైన్స్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. వీరిలో 75 శాతం మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం విశేషం. వీరంతా ఈ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్నారు. భారత్‌లో బంగారు గనుల విషయానికొస్తే.. బంగారు గనులనేవి కేవలం పర్వతప్రాంతాలు, పీఠభూములలోనే కాదు.. సముద్రపు లోతుల్లోని ప్రాంతాల్లోనూ వ్యాప్తిచెంది, ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కనిపిస్తాయి. భారత్‌లో కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఎంతో పేరొందిన ప్రాంతం. దేశంలో అత్యధక స్థాయిలో బంగారు ఉత్పాదన కర్నాటకలో జరుగుతుంది. ఇక్కడ కోలార్, హుట్టీ, ఉటీ పేర్లతో బంగారు గనులు ఉన్నాయి. ఇది కూడా చదవండి: బాధితులకు వైద్య సేవలు అందించే ఎక్స్‌ప్రెస్ రైలు కర్నాటకలో సుమారు 17 టన్నుల బంగారం నిల్వలు కలిగిన గనులు ఉన్నాయని భావిస్తున్నారు. అంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్‌లలోనూ బంగారు, వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే భారత్‌లోనూ బంగారు నిక్షేపాలు గుర్తించదగని రీతిలోనే ఉన్నాయని చెబుతుంటారు. చాలాదేశాల్లో బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు, తరలింపు చర్యలను అక్కడి ప్రభుత్వాలు సమర్ధవంతంగా అడ్డుకోవడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. -
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. విండీస్ జట్టు ప్రకటన! నాలుగేళ్ల తర్వాత బౌలర్ రీఎంట్రీ
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఇప్పటికే తమ జట్టును ప్రకటించిన క్రికెట్ వెస్టిండీస్.. తాజాగా వన్డే, టీ20 సిరీస్‌లకు కూడా రెండు వేర్వేరు జట్టులను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్‌లో ప్రోటీస్‌తో విండీస్ తలపడనుంది. ఫిబ్రవరి 28 నుంచి జరగనున్న తొలి టెస్టుతో విండీస్ పర్యటన ప్రారంభం కానుంది. అదే విధంగా మార్చి 16న విండీస్-ప్రోటీస్ మధ్య జరగనున్న తొలి వన్డేతో పరిమిత ఓవర్ల సిరీస్ మొదలుకానుంది. ఇక వన్డేల్లో షాయ్ హోప్ తొలిసారిగా విండీస్ జట్టుకు నాయకత్వం వహించనుండగా.. రోవ్‌మన్ పావెల్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు టీ20ల్లో కరీబియన్ జట్టుకు పావెల్ సారథ్యం వహిచంనుండగా.. అతడికి డిప్యూటీగా కైల్ మేయర్స్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇది ఇలా ఉండగా.. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫాస్ట్ బౌలర్ షానన్ గాబ్రియేల్ తిరిగి విండీస్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 34 ఏళ్ల గాబ్రియేల్ గతేడాది ఆఖరిలో జరిగిన సూపర్-50 వన్డే కప్‌లో గాబ్రియేల్ అద్భుతంగా రాణించాడు. ఈ నేపథ్యంలోనే అతడికి సెలక్టర్లు మళ్లీ పిలుపునిచ్చారు. గాబ్రియేల్ చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో విండీస్ తరపున ఆడాడు. వెస్టిండీస్ వన్డే జట్టు షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కారియా, కీసీ కార్టీ, రోస్టన్ చేజ్, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్ వెస్టిండీస్ టీ20జట్టు రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్‌కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కారియా, జాన్సన్ చార్లెస్, షెల్డన్ కాట్రెల్, జాసన్ హోల్డర్, అకేల్ హోసిన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్కాయ్, నికోలస్ పూరన్, రేమాన్ రీఫర్, రొమారియో షెపర్డ్ చదవండి: IND vs AUS: టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు! -
నమీబియా నుంచి మరో 12 చీతాలు వస్తున్నాయ్..
న్యూఢిల్లీ: భారత్‌లో చీతాల సంఖ్యను పెంచే లక్ష్యంతో వాటిని దక్షిణాఫ్రికా ఖండం నుంచి రప్పిస్తున్న మోదీ సర్కార్ ఈ దఫాలో 12 చీతాలను వాయుమార్గంలో తీసుకొస్తోంది. నమీబియా దేశం నుంచి 12 చీతాలను ఫిబ్రవరి 18వ తేదీన తీసుకొస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం చెప్పారు. ‘ నమీబియా నుంచి వాటిని తెచ్చేందుకు సీ–17 విమానం గురువారం బయల్దేరింది. భారత్‌కు తెచ్చాక వాటిని ఉంచేందుకు మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్కులో 10 క్వారంటైన్ ఎన్క్లోజర్లను సిద్ధంచేశాం’ అని మంత్రి చెప్పారు. ఈసారి ఏడు మగ, ఐదు ఆడ చీతాలను తీసుకొస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ తన పుట్టినరోజున కూనో పార్కులోకి ఐదు ఆడ, మూడు మగ చీతాలను విడిచిపెట్టిన విషయం విదితమే. భారత్‌లో 1948లో అంతరించిపోయిన చీతాలను మళ్లీ పెంచేందుకు భారత సర్కార్ నడుంబిగించింది. నమీబియా నుంచి దాదాపు పదేళ్లపాటు ఏటా 12 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయాలని భావిస్తున్నారు. చదవండి: మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీం తీర్పు నిజర్వ్.. -
బోణీ కొట్టిన శ్రీలంక.. దక్షిణాఫ్రికాపై సూపర్ విక్టరీ
మహిళల టీ20 ప్రపంచకప్-2022లో శ్రీలంక బోణీ కొట్టింది. కేప్‌టౌన్ వేదికగా అతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. 130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేయగల్గింది. సాతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ లూస్ 28 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక శ్రీలంక బౌలర్లలో రణవీర మూడు వికెట్లతో దక్షిణాఫ్రికా వెన్ను విరచగా.. రణసింఘే, సుగందికా కుమారి తలా రెండు వికెట్లు సాధించారు. అర్ధ సెంచరీతో చెలరేగిన ఆటపట్టు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ ఆటపట్టు 68 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు గుణరత్నే 35 పరుగులతో రాణించింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇస్మాయిల్, కాప్, క్లార్క్ తలా వికెట్ సాధించారు. చదవండి: T20 WC: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. టీమిండియాకు ఊహించని షాక్! -
ప్రపంచకప్ టోర్నీ ‘అర్హత’ కోసం దక్షిణాఫ్రికా, లంక పోరు! ఆ సిరీస్‌ల ఫలితాలు తేలితేనే
Icc World Cup 2023 Qualifying Race: భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచకప్-2023లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల ఆధారంగా 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తే.. మరో రెండు జట్లు క్వాలిఫియర్ రౌండ్లలో విజయం సాధించి ఈ మెగా ఈవెంట్లో అడుగుపెడతాయి. ఇక సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఇప్పటికే తొలి ఏడు స్థానాల్లో ఉన్న జట్లు నేరుగా ప్రపంచకప్ టోర్నీలో అడుగుపెట్టాయి. ఇక మిగిలిన ఒక్కగానొక్క చివరి స్థానం కోసం వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పోటీపడుతున్నాయి. అయితే ఈ ఏడాది మే1 నాటికి పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఏ జట్టు ఉంటుందో ఆ జట్టుకు నేరుగా ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ మూడు జట్లలో ఏ జట్టుకు ఐసీసీ టోర్నీలో డైరెక్ట్‌గా అడుగుపెట్టే ఛాన్స్ ఉందో.. అందుకు గల సమీకరణాలు ఎలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం. వెస్టిండీస్ ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో వెస్టిండీస్ జట్టు 88 పాయింట్లతో ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. అయితే కరీబియన్ జట్టు ఆడాల్సిన సూపర్ లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. కాబట్టి విండీస్ ప్రత్యక్షంగా ప్రపంచకప్‌కు చేరడం కష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే విండీస్ తర్వాతి స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికాకు రెండు మ్యాచ్‌లు, శ్రీలంకకు మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఈ రెండు జట్లలో ఏదో ఒకటి సులువగానే విండీస్‌ను అధిగమిస్తుంది. దక్షిణాఫ్రికా.. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా ప్రస్తుతం 79 పాయింట్లతో 9 వస్థానంలో ఉంది. గతేడాది ఆఖరి వరకు 11వ స్థానంలో ఉన్న ప్రోటీస్ జట్టు ఇంగ్లండ్‌పై మూడు వన్డేల సిరీస్‌లో రెండు వరుస విజయాలు సాధించడంతో 9వ స్థానానికి చేరుకుంది. ఇంకా సూపర్ లీగ్‌లో ప్రోటీస్ జట్టుకు రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో నెదార్లాండ్స్‌తో ప్రోటీస్ రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేస్తే 8వ స్థానానికి చేరుకుంటుంది. అయితే శ్రీలంక నుంచి మాత్రం దక్షిణాఫ్రికాకు ముప్పు పొంచి ఉంది. ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా శ్రీలంక.. కివీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపనడుంది. ఈ సిరీస్‌లో లంక కనీసం రెండు మ్యాచ్‌లలోనైనా ఓటమిపాలైతేనే ప్రోటీస్ తన ఎనిమిదవ స్థానాన్ని నిలబెట్టకుంటుంది. శ్రీలంక ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో శ్రీలంక ప్రస్తుతం 77 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేస్తే.. ఎటువంటి సమీకరాణాలతో సంబంధం లేకుండా ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తుంది. అదే విధంగా దక్షిణాఫ్రికా నెదార్లాండ్స్ చేతిలో రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి.. కివీస్‌పై లంక కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా విజయం సాధించిన చాలు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి చేరుకుంటుంది.! అయితే, డచ్ జట్టు వంటి పసికూనతో ప్రొటీస్ పోరు.. పటిష్టమైన కివీస్‌తో అది కూడా న్యూజిలాండ్ గడ్డపై పోటీ నేపథ్యంలో లంక కంటే సౌతాఫ్రికానే ఓ అడుగు ముందుంటుందని చెప్పడంలో సందేహం లేదు. చదవండి: ENG vs SA: దక్షిణాఫ్రికా గడ్డపై అర్చర్ సరికొత్త చరిత్ర.. 30 ఏళ్ల రికార్డు బద్దలు -
దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సెలక్టర్లు.. ఫిట్నెస్ టెస్టు పాస్ కాలేదని?
దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్‌కు సెలక్టర్లు బిగ్ షాకిచ్చారు. ఫిట్నెస్ టెస్టులో విఫలమవకావడంతో వాన్ నీకెర్క్‌ను మహిళల టీ20 ప్రపంచకప్-2023కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఆమె స్థానంలో ఆల్‌రౌండర్ సునే లూస్‌ను తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ ఎంపిక చేసింది. కాగా గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ ముందు వాన్ నీకెర్క్ కుడి కాలికి గాయమైంది. దీంతో ఆమె వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమైంది. అనంతరం ఆమె జట్టుకు దూరంగా ఉంటుంది. క్రికెట్ సౌతాఫ్రికా న్యూ రూల్స్ ఇవే.. క్రికెట్ సౌతాఫ్రికా తీసుకొచ్చిన కొత్త ఫిట్నెస్ రూల్స్ ప్రకారం.. మహిళా జట్టుకు ఎంపిక కావాలంటే క్రికెటర్లు కచ్ఛితంగా 9.3 నిమిషాల్లో 2 కి.మీ.ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. అయితే వాన్ నీకెర్క్ మాత్రం మరో 30 సెకన్లు అదనంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సెలక్టర్లు ఆమెను పక్కనపెట్టారు. టీ20ల్లో అద్భుత రికార్డు.. టీ20ల్లో వాన్ నీకెర్క్‌కు మంచి రికార్డు ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో వాన్ నీకెర్క్ 1877 పరుగులతో పాటు 65 వికెట్లు కూడా పడగొట్టింది. అంతేకాకుండా టీ20ల్లో 1500లకు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీసిన ఏకైక దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ కూడా వాన్ నీకెర్కే కావడం విశేషం. గతేడాది కేప్‌తో స్వలింగ వివాహం వాన్ నీకెర్క్ గతేడాది తన సహచర క్రికెటర్ మరిజాన్నే కేప్‌ని స్వలింగ వివాహం చేసుకుంది. కాగా టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన జట్టులో కేప్‌కు మాత్రం చోటు దక్కింది. టీ20ల్లో సౌతాఫ్రికా తరుపున హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా కేప్ ఉంది. ఇక ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10న జరగనున్న దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా జట్టు: అన్నరీ డెర్క్సెన్, సునే లూస్ (కెప్టెన్), మారిజాన్ కాప్, లారా గూడాల్, అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, షబ్నిమ్ ఇస్మాయిల్, తజ్మిన్ బ్రిట్స్, మసాబాటా క్లాస్, లారా వోల్వార్డ్ట్, సినాలో జాఫ్తా, నాన్కులులేకో మ్లాబా చదవండి: Shubman Gill: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్ రావాల్సిందే! Your heroines for the ICC Women's #T20WorldCup 🇿🇦 #MyHero #AlwaysRising #BePartofIt pic.twitter.com/MUVZNtVQ1k — Proteas Women (@ProteasWomenCSA) January 31, 2023 -
‘సూపర్ సిక్స్’ దశకు భారత్ అర్హత
బెనోని (దక్షిణాఫ్రికా): తొలిసారి నిర్వహిస్తున్న అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు లీగ్ దశను అజేయంగా ముగించింది. గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం స్కాట్లాండ్ జట్టుతో జరిగిన చివరిదైన మూడో లీగ్ మ్యాచ్‌లో భారత్ 85 పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా ఆరు పాయింట్లతో గ్రూప్ ‘డి’ టాపర్‌గా నిలిచి సూపర్ సిక్స్ దశకు అర్హత సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. టీమిండియాకు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి, గొంగడి త్రిష (51 బంతుల్లో 59; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. రిచా ఘోష్ (35 బంతుల్లో 33; 3 ఫోర్లు) కూడా రాణించింది. అనంతరం 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 13.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. భారత బౌలర్లు మన్నత్ కశ్యప్ (4/12), అర్చన దేవి (3/14), సోనమ్ యాదవ్ (2/1) స్కాట్లాండ్ను దెబ్బ తీశారు. చదవండి: Womens U19 World Cup: హైదరాబాద్ అమ్మాయికి బంపరాఫర్.. భారత జట్టులో చోటు -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆస్ట్రేలియా! మరి టీమిండియా సంగతి?
సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా దాదాపు ఖారారు చేసుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 75.56 శాతంతో తమ ఆగ్ర స్థానాన్ని మరింత సుస్ధిరం చేసుకుంది. అదే విధంగా రెండో స్థానం కోసం పోటీ పడుతున్న సౌతాఫ్రికా ఇప్పుడు 48.72 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. మూడో స్థానంలో శ్రీలంక 55.33 శాతంతో ఉంది. ఇక బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయంతో టీమిండియా 99 పాయింట్లతో 58.93 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఐదో స్థానంలో 46.97 శాతంతో ఇంగ్లండ్ ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరాలంటే.. ఆసీస్ చేతిలో 0-2 తేడాతో సౌతాఫ్రికా ఓడిపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్ చేరడం మరింత సులభం అయింది. కానీ మూడో స్థానంలో ఉన్న శ్రీలంక నుంచి టీమిండియాకు ముప్పు పొంచి ఉంది. అయితే స్వదేశంలో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 4-1తో భారత్‌ఓడిస్తే.. ఎటువంటి సమీకరాణాలతో సంబంధం లేకుండా రోహిత్ సేన (61.92 పాయింట్ల శాతం)తో ఫైనల్‌కు చేరుకుంటుంది. అదే విధంగా శ్రీలంక ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటలో భాగంగా రెండు మ్యాచ్ మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఒకవేళ ఈ సిరీస్‌ను లంక క్లీన్ స్వీప్ చేస్తే శ్రీలంక ఖాతాలో 61.11 పీసీటీ చేరుతుంది. అంటే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత్ ఓడిపోయినా, 2-2 డ్రా ముగించినా లంక ఫైనల్‌కు చేరుకుంటుంది. మరోవైపు నాలుగో స్థానానికి పడిపోయిన సౌతాఫ్రికా ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో 2-0 తేడాతో ప్రోటీస్ గెలుపొందితే.. 55.55 పీసీటీని సాధించగలుగుతుంది. కానీ భారత్ చివరి నాలుగు టెస్టుల్లో రెండు గెలిచినా దక్షిణాఫ్రికా ఫైనల్ ఆశలు గల్లంతు అయినట్లే. చదవండి: సర్ఫరాజ్ అహ్మద్ సెంచరీ.. ‘చేసింది చాలు.. ఇక నాటకాలు ఆపు!’.. ట్వీట్ లైక్ చేయడంతో మరింత దుమారం -
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. సెమీస్‌లో దక్షిణాఫ్రికా చిత్తు
బెంగళూరు: అంధుల టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో గురువారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 207 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అజయ్ కుమార్ రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. గుంటూరు జిల్లాకు చెందిన అజయ్ 81 పరుగులు సాధించడంతోపాటు 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మరో ప్లేయర్ సునీల్ రమేశ్ (110) సెంచరీ చేశాడు. ముందుగా భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 337 పరుగులు సాధించగా... దక్షిణాఫ్రికా 19.5 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. శనివారం జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడుతుంది. చదవండి: IND Vs BAN: కోహ్లి సైగ చేశాడు.. సిరాజ్ అనుకరించాడు; ఒళ్లు మండినట్టుంది -
వరుస ఓటములు.. అయినా పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు చేరే ఛాన్స్?
టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. సూపర్-12లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. తద్వారా ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. దీంతో పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఐదో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయితే టెక్నికల్‌గా మాత్రం పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరే దారులు ఇంకా మూసుకుపోలేదు. పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు చేరాలంటే గ్రూపు-2 నుంచి పాకిస్తాన్ సెమీస్‌లో అడుగు పెట్టాలంటే తమ తదుపరి మ్యాచ్‌ల్లో భారీ విజయం సాధించాలి. పాకిస్తాన్ వరుసగా నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో పాక్ విజయం సాధిస్తే వారి ఖాతాలో ఆరు పాయింట్లు చేరుతాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ సెమీస్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది. అప్పడు రన్‌రేట్ కీలకం కానుంది. ముఖ్యంగా పాకిస్తాన్ భవితవ్యం ఆక్టోబర్ 30న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో ఒక వేళ దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే.. పాకిస్తాన్ సెమీస్ దాదాపు గల్లంతు అయినట్లే. భారత్‌తో మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా.. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌తో ఆడనుంది. భారత్‌పై విజయం సాధించి.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో అయినా దక్షిణాఫ్రికా గెలిస్తే చాలు నేరుగా సెమీఫైనల్లో అడుగుపెడుతోంది. ఒక వేళ దక్షిణాఫ్రికా తమ తదుపరి మ్యాచ్‌ల్లో వరుసగా భారత్, పాకిస్తాన్ వంటి జట్లపై ఓటమి చెందితే.. అప్పుడు బాబర్ సేన ఆరు పాయింట్లతో సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. దక్షిణాప్రికా జట్టు నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించినా వారి ఖాతాలో కేవలం 5 పాయింట్ల మాత్రమే ఉంటాయి. ఇక భారత్ విషయానికి వస్తే.. ఈ మెగా టోర్నీలో భారత్ సెమీఫైనల్‌కు చేరడం దాదాపు ఖాయమైంది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న టీమిండియా.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే చాలు సెమీఫైనల్లో అడుగు పెడుతుంది. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా,బంగ్లాదేశ్, జింబాబ్వేతో తలపడుతోంది. ప్రస్తుత భారత్ దూకుడు చూస్తే ఈ రెండు జట్లపై సునాయసంగా విజయం సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా గ్రూపు-2 నుంచి పాయింట్ల పట్టికలో భారత్ 4, దక్షిణాఫ్రికా 3 పాయింట్లతో తొలి రెండు స్ధానాల్లో కొనసాగుతున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే సెమీఫైనల్‌కు చేరుతాయి. చదవండి: Sikandar Raza: పాక్ మూలాలున్న క్రికెటర్ ముచ్చెమటలు పట్టించాడు -
SA Vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. అగ్ర స్థానంలోకి ప్రోటీస్
టీ20 ప్రపంచకప్-2022లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. సూపర్-12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సెంచరీతో చెలరేగిన రిలీ రోసో ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రుసౌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ బావుమా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోసౌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ డికాక్ 63 పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఆల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టగా, హసన్ మహ్మద్, టాస్కిన్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. నిప్పులు చేరిగిన నోర్జే 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ప్రోటీస్ పేసర్ అన్రిచ్ నోర్జే చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన నోర్జే.. బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. అతడిపాటు స్పిన్నర్ షమ్సీ కూడా మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బ తీశాడు. ప్రోటీస్ బౌలర్ల ధాటికి బంగ్లా టైగర్స్ 101 పరుగులకే కుప్పకూలింది. నెం1 స్థానంలో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌పై అద్భుతమైన విజయం సాధించిన దక్షిణాఫ్రికా గ్రూప్-2 నుంచి పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకుంది. అదే విధంగా ధక్షిణాఫ్రికా రన్‌రేట్(+5.200) కూడా భారీగా మెరుగు పడింది. ఇక జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ గెలుపు దగ్గరగా ఉన్న సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. చదవండి: T20 WC 2022: పాపం బంగ్లాదేశ్.. 5 పరుగుల పెనాల్టీ! ఎందుకంటే? -
దక్షిణాఫ్రికా వర్సెస్ జింబాబ్వే.. తుది జట్టులో ఎవరెవరంటే!
టీ20 ప్రపంచకప్ సూపర్-12 (గ్రూప్-2)లో భాగంగా హోబర్ట్ వేదికగా దక్షిణాఫ్రికాతో జింబాబ్వే తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నలుగురు పేస్ బౌలర్లు, ఏకైక స్విన్నర్తో బరిలోకి దిగింది. అదే విధంగా జింబాబ్వే కూడా నలుగురు పేస్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో ఆడనుంది. తుది జట్లు దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), టెంబా బావుమా(కెప్టెన్), రిలీ రోసౌవ్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడా, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి జింబాబ్వే: రెగిస్ చకబ్వా(వికెట్ కీపర్), క్రెయిగ్ ఎర్విన్(కెప్టెన్), వెస్లీ మాధేవెరే, సీన్ విలియమ్స్, సికందర్ రజా, మిల్టన్ షుంబా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, టెండై చతారా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజారబానీ చదవండి: T20 WC 2022: 'ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే' -
SA T20 League: పార్ల్ రాయల్స్ హెడ్ కోచ్‌గా జేపీ డుమిని
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా పార్ల్ రాయల్స్‌ను ఐపీఎల్ ఫ్రాంజైజీ రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమ జట్టు కోచింగ్ స్టాప్ సభ్యల పేర్లను పెర్ల్ రాయల్స్ ప్రకటించింది. పార్ల్ రాయల్స్ హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని ఎంపికయ్యాడు. స్పిన్ బౌలింగ్, స్ట్రాటజీ కోచ్‌గా ప్రోటిస్ మజీ ఆటగాడు రిచర్డ్ దాస్ నెవ్స్.. మార్క్ చార్ల్టన్ (బ్యాటింగ్ కోచ్), ఏటీ రాజమణి ప్రభు( మెంటల్ కండిషనింగ్ కోచ్), మాండ్లా మాషింబీ (ఫాస్ట్ బౌలింగ్ కోచ్), లిసా కీట్లీ( టాక్టికల్ కోచ్) రస్సెల్ ఆస్పెలింగ్(జట్టు కేటాలిస్ట్)గా నియమితులయ్యారు. ఇక 2020 జనవరిలో డుమిని అన్ని రకాల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. The team behind the team for our first ever #SA20 campaign. 🙌💗#RoyalsFamily pic.twitter.com/L25o4ZqUbT — Paarl Royals (@paarlroyals) September 15, 2022 ప్రోటిస్ తరపున 46 టెస్టులు..199 వన్డేలు, 81 టీ20ల్లో ఆడాడు. డుమిని ప్రస్తుతం బోలాండ్ దేశీవాళీ జట్టుకు హెడ్ కోచ్‌గా కూడా పనిచేస్తున్నాడు. కాగా పార్ల్ రాయల్స్ ఇప్పటికే డేవిడ్ మిల్లర్, మెకాయ్, జోస్ బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఒప్పంతం కుదుర్చుకుంది. ఈ సరికొత్త దక్షిణాఫ్రికా టీ20 లీగ్ వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. చదవండి: ENG vs PAK: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ -
ప్రొటిస్‌కు చుక్కలు చూపించిన ఐర్లాండ్... ఓడినా ఆకట్టుకుంది
ఇటీవలి కాలంలో ఐర్లాండ్ జట్టు వరుసగా మ్యాచ్‌లు ఓడిపోతున్నా ప్రేక్షకులకు మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది. ప్రత్యర్థి జట్లు భారీ లక్ష్యాలను విధిస్తున్నా ఏ మాత్రం భయపడకుండా ఐర్లాండ్ బ్యాటర్లు లక్ష్య ఛేదనకు ప్రయత్నించడమే అందుకు కారణం. ఐర్లాండ్ పోరాట పటిమ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో ఐర్లాండ్ 21 పరుగులతో ఓడినా సౌతాఫ్రికాకు మాత్రం చుక్కలు చూపించింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ వికెట్ కీపర్ లోర్కన్ టక్కర్ (38 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 78 పరుగులు) రాణించగా.. చివర్లో జార్జ్ డాక్రెల్ (28 బంతుల్లో 43 పరుగులు, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఒక దశలో ఐర్లాండ్ విజయానికి చేరువగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు బ్యాటర్లు ఒకేసారి వెనుదిరగడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసి 21 పరుగులతో ఓటమి పాలైంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్(53 బంతుల్లో 74, 10 ఫోర్లు, ఒక సిక్స్), మార్ర్కమ్ (27 బంతుల్లో 56 పరుగులు, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగారు. చివర్లో ప్రిటోరియస్ 7 బంతుల్లో 21 పరుగులు చేయడంతో ప్రొటిస్ 200 పరుగుల మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక రెండో టి20 ఆగస్టు 5న(శుక్రవారం) జరగనుంది. చదవండి: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా మహిళలు -
కరేబియన్ ప్రీమియర్ లీగ్.. బార్బడోస్ రాయల్స్ కెప్టెన్‌గా మిల్లర్
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2022 సీజన్‌కు ముందు బార్బడోస్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌ను నియమించింది. కాగా వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్ స్థానంలో బార్బడోస్ నూతన సారథిగా మిల్లర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ ఏడాది సీజన్‌కు హోల్డర్‌తో పాటు కైల్ మైర్స్, ఒషానే థామస్, ఒబెడ్ మెక్కాయ్, హేడెన్ వాల్ష్ జూనియర్ వంటి కీలక ఆటగాళ్లను బార్బడోస్ రీటైన్ చేసుకుంది. అదే విధంగా దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్, ఆఫ్టానిస్తాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్‌తో బార్బడోస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక మిల్లర్ చివర సారిగా 2018లో జమైకా తల్లావాస్ తరఫున కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. అదే విధంగా 2016లో సెయింట్ లూసియా జౌక్స్కు ప్రాతినిధ్యం వహించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన మిల్లర్ 332 పరుగులు సాధించాడు. కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్-2022 ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన మిల్లర్ అద్భుతంగా రాణించాడు. గుజరాత్ టైటాన్స్ టైటిల్ కైవసం చేసుకోవడంలో మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు మిల్లర్ రాజస్తాన్ రాయల్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. కాగా బార్బడోస్ రాయల్స్ ఫ్రాంఛైజీలో కూడా రాజస్తాన్ వాటా కలిగి ఉంది. ఇక కెప్టెన్‌గా ఎంపికైన మిల్లర్ మాట్లాడుతూ.. "ఐపీఎల్లో రాజస్తాన్ జట్టుతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పడు అదే జట్టుతో సంబంధం ఉన్న బార్బడోస్ రాయల్స్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా కెప్టెన్‌గా ఎంపిక కావడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ జట్టు యువ ఆటగాళ్లతో కూడి ఉన్నంది. ఈ ఏడాది సీజన్లో జట్టుకు నా వంతు కృషి చేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని మిల్లర్ పేర్కొన్నాడు. చదవండి: IND Vs WI: కొంపముంచిన అత్యుత్సాహం.. గిల్ విషయంలో తప్పుడు ట్వీట్ -
ఒకే ఓవర్లో 28 పరుగులు.. బేబీ ‘ఏబీ’ విధ్వంసం.. వీడియో వైరల్
ఐపీఎల్లో గత సీజన్ వరకు తన విధ్వంసక ఆటతో అభిమానులను అలరించిన ఏబీ డివిలియర్స్ ఈ సారి నుంచి దూరమయ్యాడు. అయితే అతడిని గుర్తు చేసేలా 18 ఏళ్ల దక్షిణాఫ్రికా క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ మెరుపు ఇన్నింగ్స్‌ను ప్రదర్శించాడు. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌కు బ్రెవిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2022లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెవిస్ విధ్వసంకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లో 49 పరుగులు సాధించి ముంబై విజయంపై ఆశలు రేకెత్తించాడు. కాగా రాహుల్ చహర్ ఓవర్లో బ్రెవిస్ వరుసగా ఐదు బంతుల్లో 4, 6, 6, 6, 6 (మొత్తం 28 పరుగులు) బాదడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రెవిస్(49), సుర్యకూమార్ యాదవ్(43) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ముంబై కు విజయం వరించలేదు. పంజాబ్ కింగ్స్‌పై 12 పరుగుల తేడాతో ముంబై పరాజాయం పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్లో వరుసగా ఐదో ఓటమిని ముంబై చవి చూసింది. చదవండి: IPL 2022: తీరు మారని ముంబై ఇండియన్స్.. వరుసగా ఐదో ఓటమి.. పంజాబ్ ఘన విజయం 1, 4, 6, 6, 6, 6 Baby AB" Dewald Brevis is putting up a batting show against PBKS 🔥💥#DewaldBrevis #BabyAB #IPL2022 #MIvsRCB pic.twitter.com/1916DYWONK — Pritam Biswas (@pritambiswas_18) April 13, 2022 -
సెమీ ఫైనల్‌కి చేరిన దక్షిణాఫ్రికా.. మరి భారత్ చేరాలంటే!
వెల్లింగ్టన్: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా తర్వాత సెమీస్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది. గురువారం వెస్టిండీస్‌తో జరగాల్సిన కీలక మ్యాచ్ వర్షార్పణం కావడం ఆ జట్టుకు మేలు చేసింది. వాన వల్ల మ్యాచ్‌కు 26 ఓవర్లకు కుదించగా ఒక దశలో సఫారీ స్కోరు 22/4 వద్ద నిలిచింది. ఆట ఆగిపోయే సమయానికి ఆ జట్టు 10.5 ఓవర్లలో 4 వికెట్లకు 61 పరుగులు చేసింది. మళ్లీ వర్షం కురవడంతో ఇక మ్యాచ్ తిరిగి మొదలయ్యే అవకాశమే రాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మెగా ఈవెంట్లో రద్దయిన మ్యాచ్ ఇదొ క్కటే! దీని వల్ల 9 పాయింట్లతో దక్షిణాఫ్రికా సెమీస్ చేరగా వెస్టిండీస్ 7 పాయింట్ల వద్ద నిలిచింది. ఇంగ్లండ్ సునాయాస విజయం క్రైస్ట్‌చర్చ్: ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు పాక్‌పై సునాయాస విజయంతో సెమీస్ వైపు అడుగులేస్తోంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై జయభేరి మోగించింది. మొదట పాక్ 41.3 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. సీమర్ క్యాథరిన్ బ్రంట్ (3/17), స్పిన్నర్ సోఫీ (3/18) పాక్ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు. వీళ్లిద్దరి దెబ్బకు... ఓపెనర్ సిద్రా అమీన్ (32; 4 ఫోర్లు), సిద్రా నవాజ్ (23; 1 ఫోర్) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19.2 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 107 పరుగులతో ఛేదించింది. ఓపెనర్ డానీ వ్యాట్ (76 నాటౌట్; 11 ఫోర్లు) కెప్టెన్ హీథర్ నైట్ (24 నాటౌట్) రాణించారు. తప్పనిసరిగా గెలవాల్సిందే! భారత జట్టు సెమీస్ చేరాలంటే ఆదివారం దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మిథాలీ సేన ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. సఫారీని ఓడిస్తే వెస్టిండీస్ (7)ను వెనక్కి నెట్టి 8 పాయింట్లతో జట్టు ముందంజ వేస్తుంది. ఇంగ్లండ్ ఖాతాలో కూడా 6 పాయింట్లే ఉన్నప్పటికీ వారికి ఆఖరి పోరులో ఎదురయ్యేది కూన బంగ్లాదేశ్ కావడంతో ఇంగ్లండ్‌కూ మెరుగైన అవకాశాలున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లు ఒకే రోజు ఉన్నాయి. అయితే మన మ్యాచ్ కూడా వర్షం వల్ల రద్దయితే అప్పుడు భారత్, విండీస్ ఖాతాలో 7 పాయింట్లుంటాయి. అప్పుడు విండీస్‌కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న భారత్, ఇంగ్లండ్ సెమీస్ చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో మన జట్టు పూర్తి సత్తాను ప్రదర్శించాల్సి ఉంది. చదవండి: World Cup 2022: భారత్‌కు బ్యాడ్ న్యూస్.. దక్షిణాఫ్రికాపై తప్పక గెలవాల్సిందే.. లేదంటే! -
టీమిండియాకు మరో బిగ్ షాక్..
యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌ను స్వదేశంలో 4-0 తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా టెస్టుల్లో నంబర్‌వన్‌గా అవతరించింది. గురువారం విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా 119 పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా.. 117 పాయింట్లతో న్యూజిలాండ్ రెండవ స్థానంలో ఉంది. కాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన భారత్ 116 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది. నాలుగో స్ధానంలో ఇంగ్లండ్ నిలిచింది. ఇక భారత్‌పై టెస్ట్ సిరీస్ గెలిచిన ప్రోటీస్ ఐదో స్థానానికి ఎగబాకగా, పాకిస్థాన్ ఆరో స్థానానికి దిగజారింది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో భాగంగా ఆసీస్ పాకిస్తాన్లో మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం పర్యటించనుంది. కాగా 1998 తర్వాత ఆసీస్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. మరోవైపు స్వదేశంలో శ్రీలంకతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ విషయానికి వస్తే.. టీమిండియా ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 49.07 విజయ శాతంతో నాలుగు విజయాలు, మూడు ఓటములు, రెండు డ్రాలతో ఐదవ ర్యాంక్‌లో కోనసాగుతోంది. మరోవైపు, ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌లలో 86.66 విజయ శాతంతో నాలుగు విజయాలు, ఒక డ్రాతో రెండో స్థానంలో ఉంది. చదవండి: IND vs SA: ఎనిమిదేళ్ల తర్వాత బౌలింగ్‌లో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో అదుర్స్ -
భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం!
Quinton De Kock Retirement: దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు డికాక్ వీడ్కోలు పలికాడు. సెంచూరియన్ వేదికగా భారత్‌తో జరగిన తొలి టెస్ట్ అనంతరం డికాక్ ఈ విషయాన్ని ప్రకటించాడు. డికాక్ రిటైర్మెంట్ విషయాన్ని క్రికెట్ సౌత్ ఆఫ్రికా అధికారంగా ధ్రువీకరించింది. సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డి కాక్ 34 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేశాడు. కాగా మొదటి టెస్టులో ప్రోటీస్ 113 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతడు తెలిపాడు. "ఇది నేను అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు. సాషా, నేను మా మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించబోతున్నాము. నా జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే దాని గురించి చాలా ఆలోచించాను. నా కుటుంబమే నాకు సర్వస్వం. మా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాను" అని డికాక్ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా తరపున 54 టెస్ట్‌లు ఆడిన క్వింటన్ డి కాక్ ఆరు సెంచరీలు, 22 అర్ధ సెంచరీలతో 3,300 పరుగులు చేశాడు. చదవండి: IND Vs SA: స్టన్నింగ్ విక్టరీ.. డ్యాన్స్‌లతో దుమ్మురేపిన టీమిండియా ఆటగాళ్లు -
తగ్గేదే లే.. సౌతాఫ్రికాలోనూ టీమిండియా జోరు..!!
-
రెండో రోజు ఆట వర్షార్పణం... భారత్‌కు గెలుపు దక్కేనా!
సెంచూరియన్: తొలి రోజు చక్కటి ప్రదర్శనతో దక్షిణాఫ్రికా సిరీస్‌లో శుభారంభం చేసిన భారత్‌కు రెండో రోజే ప్రతికూలత ఎదురైంది. వరుణుడి కారణంగా అదే జోరును కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. వర్షం కారణంగా తొలి టెస్టు సోమవారం ఆట పూర్తిగా రద్దయింది. నగరంలో ఆదివారం రాత్రి నుంచే కురుస్తున్న వాన సోమవా రం కూడా కొనసాగడంతో క్రికెట్ సాధ్యం కాలేదు. మధ్యలో రెండుసార్లు వర్షం తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించేందుకు సిద్ధమయ్యారు. అయితే అదే సమయంలో మళ్లీ వర్షం రావడంతో చేసేదేమీ లేకపోయింది. ఫలితంగా ఒక్క బంతి కూడా వేయకుండానే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:55కు అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 3 వికెట్లకు 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (248 బంతుల్లో 122 బ్యాటింగ్; 17 ఫోర్లు, 1 సిక్స్), అజింక్య రహానే (81 బంతుల్లో 40 బ్యాటింగ్; 8 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. గెలుపు దక్కేనా! వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈ టెస్టు మూడు, నాలుగు రోజుల్లో ఎలాంటి వర్ష సూచన లేదు. ఆట పూర్తి స్ధాయిలో సజావుగా సాగే అవకాశం ఉంది. అయితే చివరి రోజైన గురువారం కూడా వాన పడే అవకాశం ఉందని నిపుణులు చెబు తున్నారు. అదే జరిగితే నాలుగు ఇన్నింగ్స్‌ల ఆట సాగడం దాదాపు అసాధ్యమే. పైగా ఇప్పటి వరకు స్పందిస్తున్న తీరు చూస్తే పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంది. ఒక్కసారిగా వికెట్లు కుప్పకూలిపోయే పరిస్థితి కూడా కనిపించడం లేదు. టీమిండియాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే ఆట సాగితే కచ్చితంగా మనదే పైచేయి అయి ఉండేది. సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలవాలని కోరు కుంటున్న భారత్‌కు వర్షం వల్ల మ్యాచ్‌లో ఆశించిన ఫలితం రాకపోతే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు. ఒలీవియర్ అందుకే ఆడలేదు! భారత్‌తో తొలి రోజు ఒక్క ఇన్‌గిడి మినహా దక్షిణాఫ్రికా బౌలర్లంతా పేలవ ప్రదర్శన కనబర్చారు. సీనియర్ రబడ పూర్తిగా విఫలం కాగా, కొత్త బౌలర్ మార్కో తేలిపోయాడు. గాయంతో నోర్జే సిరీస్‌కు దూరం కావడంతో అతని స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్, దేశవాళీలో అద్భుత ఫామ్‌లో ఉన్న డ్యువాన్ ఒలీవియర్ టెస్టులో కచ్చితంగా ఆడతారని అంతా భావించారు. అయితే అతడిని టెస్టుకు ఎంపిక చేయకపోవడంతో దక్షిణా ఫ్రికా సెలక్టర్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో సోమవారం క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) వివరణ ఇచ్చింది. ‘కొన్నాళ్ల క్రితం ఒలీవియర్ కోవిడ్–19 బారినపడ్డారు. కరోనా ప్రభావపు తదనంతర సమస్యల నుంచి అతను పూర్తిగా కోలుకోలేదు. క్వారంటైన్ కారణంగా సరిగా ప్రాక్టీస్ సాగకపోగా, క్యాంప్ ఆరంభంలోనే తొడ కండరాల గాయంతోనూ బాధ పడ్డాడు. అందుకే అతనికి బదులుగా మార్కోకు అవకాశమిచ్చాం’ అని సెలక్షన్ కమిటీ కన్వీనర్ విక్టర్ పిట్సంగ్ వెల్లడించారు. చదవండి: ఇదేమి బౌలింగ్రా బాబు.. 4 ఓవర్లలో 70 పరుగులు! -
"దక్షిణాఫ్రికాపై భారత్ గెలవడం చాలా కష్టం.. సిరీస్ వాళ్లదే"
సౌతాఫ్రికా-భారత్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టెస్ట్ సిరీస్‌లో సౌతాఫ్రికాపై భారత్ విజయం సాధించడం చాలా కష్టం అని అతడు అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌లో భాగంగా డిసెంబర్26 నుంచి సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానుంది. "ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలవడం చాలా కష్టం. ఇంతకు ముందు జట్టులో నోర్జే ఉన్నప్పుడు దక్షిణాఫ్రికా2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుందని చెప్పాను. ఇప్పుడు గాయం కారణంగా నోర్జే ప్రోటాస్కు దూరమయ్యాడు. కనుక ఈ సిరీస్‌కు1-1తో సమం కావచ్చు. ఎందుకంటే తొలి టెస్ట్‌కు వరుణుడు ఆటంకం కలిగించవచ్చు. ఈ సిరీస్ డ్రాగా ముగిస్తుందని నేను భావిస్తున్నాను. ఒక వేళ విజయం సాధిస్తే అది దక్షిణాఫ్రికా జట్టే అవుతుంది. దక్షిణాఫ్రికా జట్టు తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఆ జట్టులో యువ ఆటగాళ్లు అద్బుతంగా రాణిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో కూడా దక్షిణాఫ్రికా అద్బుతంగా ఆడింది" అని యూట్యూబ్ ఛానల్లో ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. భారత జట్టు(అంచనా): మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చదవండి: SA Vs IND: భారత ఆటగాళ్లకు ద్రవిడ్ స్పెషల్ క్లాస్.. ఎందుకో తెలుసా? -
భారత ఆటగాళ్లకు ద్రవిడ్ స్పెషల్ క్లాస్.. ఎందుకో తెలుసా?
దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌కు టీమిండియా అన్ని అస్త్రాలను సిద్దం చేసుకోంటుంది. డిసెంబర్26 న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ జట్టు ఆటగాళ్లపై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్ కోసం ఆటగాళ్లతో ద్రావిడ్ వ్యూహాలను రచిస్తోన్నాడు. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా రెండు వైట్ బోర్డులను తీసుకువచ్చి ద్రవిడ్ ఆటగాళ్లకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. ఈ క్లాస్‌లో కెప్టెన్ కోహ్లితో పాటు జట్టు ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ఈ సెషన్లో భాగంగా ఆటగాళ్లకు దిశా నిర్ధేశం చేశాడు. ఈ మ్యాచ్‌లో అనుసరించాల్సిన మార్గాలపై ద్రవిడ్ ఆటగాళ్లతో చర్చించాడు. కాగా గతంలో కూడా భారత మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిరెస్టన్ ఇటువంటి సెషన్స్ తీసుకునేవాడు. అయితే భారత జట్టు ఇప్పటివరకు సఫారీ గడ్డపై ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవ లేదు. దీంతో ఈ సిరీస్‌పై కోచ్ ద్రవిడ్‌తో పాటు, కెప్టెన్ కోహ్లి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. భారత జట్టు(అంచనా): మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చదవండి: IND vs SA Test Series: టీమిండియా అదరగొడుతోంది.. కానీ ఇక్కడ మాదే పైచేయి: ప్రొటిస్ కెప్టెన్ .@imVkohli's transformation 👏 Excitement about SA challenge 👌 Initial few months as Head Coach ☺️ Rahul Dravid discusses it all as #TeamIndia gear up for the first #SAvIND Test in Centurion. 👍 👍 Watch the full interview 🎥 🔽https://t.co/2H0FlKQG7q pic.twitter.com/vrwqz5uQA8 — BCCI (@BCCI) December 25, 2021 -
తగ్గేదేలే! చిరుతను చెట్టెక్కించిన ఏనుగు.. ఫోటోలు వైరల్
ఇక్కడ చిరుతపులి గజగజమంటోంది మనలా చలికి కాదండోయ్.. తనని తరుముకొచ్చిన గజరాజుని చూసి భయపడి.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు కదా. అయితే ఆ గొప్పోళ్ల జాబితాలో ఈ చిరుత ఉన్నట్లు లేదు.. అందుకే.. వేట కోసం బయలుదేరి.. తీరా వెళ్లకవెళ్లక ఏనుగుల గుంపు జోలికి పోయింది. దాని దురదృష్టానికి తగ్గట్లు ఆ వెళ్లిన గ్రూపులో ఇలాంటి తిక్క ఏనుగు కూడా ఉంది. అది ఊరుకుంటుందా.. వార్నింగ్ ఇవ్వడంతో సరిపెట్టకుండా.. ఉరుకులెత్తించింది. చదవండి: కోడి, గుర్రపు పందేలు తెలుసు కానీ.. పందుల పోటీలు గురించి విన్నారా ఏనుగులకు చెట్లెక్కడం రాదు కాబట్టి ఇదిగో ఇలా బతికి బట్టకట్టింది. లేకుంటే.. బతుకు బస్టాండు అయిపోయేది. దక్షిణాఫ్రికాలోని నార్త్‌వెస్ట్ ప్రావిన్స్‌లో ఉన్న రిజర్వు పార్కులో చోటుచేసుకున్న ఈ సన్నివేశాన్ని ఫొటోగ్రాఫర్ కెవిన్ డూలే క్లిక్‌మనిపించారు. చెట్టెక్కింది కదా అని ఈ ఏనుగు చిరుతను అంత ఈజీగా వదిలేయలేదట. దాదాపు గంటపాటు అక్కడే ఉండి.. రకరకాల విన్యాసాలతో చిరుతకు చుక్కలు చూపించిందట. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
స్టెయిన్ కొత్త అవతారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ డేల్ స్టెయిన్ ఇకపై సరికొత్త అవతారం ఎత్తనున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌గాను సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చెపట్టే అవకాశం ఉంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం... ఇప్పటికే స్టెయిన్‌తో సన్‌రైజర్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన వచ్చే వారం వెలువడనున్నట్లు ఈ నివేదిక తెలుపుతుంది. కాగా ఐపీఎల్లో 2013-2015 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున స్టెయిన్ ఆడాడు. 38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. టెస్టులు, వన్డేలు, టి20ల్లో కలిపి 699 వికెట్లు పడగొట్టాడు. 95 ఐపీఎల్ మ్యాచుల్లో 97 వికెట్లు తీశాడు. చదవండి: Rohit Sharma: గాయంతో సిరీస్‌కు దూరం.. 9 కోట్లతో భార్య పేరిట ప్రాపర్టీ కొనుగోలు చేసి! -
హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం.. ఇక భారత జట్టుకు..!
Hardik Pandya Request Selectors Not To Consider Him: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఐపీఎల్-2021 సీజన్లో ఆకట్టుకోలేకపోయిన పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలోనూ రాణించలేకపోయాడు. అటు బౌలింగ్ చేయలేక.. ఇటు బ్యాటర్‌గా కూడా మెరుగైన ప్రదర్శన కనబరచలేక విమర్శలు మూటగట్టుకున్నాడు. దీంతో స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా పాండ్యా ఎంపిక కాలేదు. కాగా వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాను పూర్తి స్ధాయి ఫిట్నెస్ సాధించినంతవరకు తనను సెలక్షన్లోకి పరిగణించవద్దు అని సెలెక్టర్లను కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే నెటజన్లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఓ నెట్‌జన్ స్పందిస్తూ.. 'నీవు ఏంటి సెలెక్టర్లను కోరేది, వాళ్లే నిన్ను సెలక్ట్ చేయరు' అని కామెంట్ చేశాడు. చదవండి: Ind Vs Nz 1st Test 2021: గిల్ ఓపెనర్‌గా కాకుండా ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి -
మరేం భయం లేదు.. ‘ఒమిక్రాన్’ అంత ప్రమాదకరం కాదు: యూకే శాస్త్రవేత్త
లండన్: ఒమిక్రాన్ అందరూ ఊహిస్తున్నంత ప్రమాదకరమైనది కాదని యూకే శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. కోవిడ్వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ వేరియెంట్ నుంచి రక్షణ పొందే అవకాశాలున్నాయని బ్రిటన్ ప్రభుత్వానికి కరోనాపై సలహాలు ఇచ్చే మైక్రోబయోలాజిస్ట్ ప్రొఫెసర్ కేలమ్ సెంపుల్ వెల్లడించారు. ఈ కొత్త వేరియెంట్‌తో తలనొప్పి, జలుబు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటివి వస్తాయే తప్ప ఆస్పత్రిలో చేరే అవకాశాలు, మరణాలు సంభవించడం వంటివి జరిగే అవకాశం తక్కువేనన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి, గతంలో కరోనా సోకడం వల్ల ఇమ్యూనిటీ వచ్చిన వారికి ఒమిక్రాన్ వేరియెంట్ నుంచి ముప్పు ఉండదని సెంపుల్ అభిప్రాయపడ్డారు. స్వల్ప లక్షణాలే: దక్షిణాఫ్రికా ఒమిక్రాన్‌తో లక్షణాలు స్వల్పంగా∙బయటపడుతున్నాయని దక్షిణాఫ్రికా మెడికల్అసోసియేషన్ చైర్పర్సన్ ఏంజిలిక్యూ కాట్జీ చెప్పారు. ప్రస్తుతానికి కోవిడ్ రోగుల్ని ఇంట్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దగ్గు, కండరాల నొప్పులు, అలసట తప్ప అంతకు మించి లక్షణాలేవీ ఈ కొత్త వేరియెంట్ ద్వారా బయటపడలేదని ఆమె చెప్పారు. ‘ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. కేసులు అత్యధికంగానే బయట పడుతున్నాయి. అయితే ఆస్పత్రులపై భారం పడడం లేదు. 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, వ్యాక్సిన్ తీసుకోని వారే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇంతవరకు ఈ వేరియెంట్ సోకలేదు. ఎంత ప్రమాదకరమో సంపూర్ణ అవగాహన రావాలంటే మరో 15 రోజులు పడుతుంది’ అని వివరించారు. -
ప్రపంచాన్ని వణికిస్తున్న బి.1.1.529.. డబ్ల్యూహెచ్ఓ ఏమంటోంది?
బ్రస్సెల్స్/జెనీవా: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. పతనమైన సెన్సెక్స్.. భారీగా నష్టపోయిన మదుపరులు.. పెరిగిన ముడి చమురు ధరలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు.. వీటన్నంటికీ కారణం ఒకేఒక్క కొత్త రకం కరోనా వైరస్. అదే బి.1.1.529. ఆఫ్రికా ఖండం బోట్స్వానా దేశంలో బయటపడిన ఈ వేరియంట్ దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బెల్జియం, ఇజ్రాయెల్‌కు సైతం విస్తరించింది. ఇది అత్యధిక వేగంతో వ్యాప్తిచెందే వేరియంట్ అని సమాచారం అందుతుండడంతో ఆసియా, యూరప్ దేశాలు అప్రమత్తమయ్యాయి. నియంత్రణ చర్యలు ప్రారంభించాయి. కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతం నుంచి విమాన ప్రయాణాలపై నిషేధానికి 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమి అంగీకరించింది. బి.1.1.529 వేరియంట్ తమ దేశంలోకి ప్రవేశిస్తే కష్టాలు తప్పవని జర్మనీ ఆరోగ్యమంత్రి జెన్స్ స్పాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సంబంధిత మరణాల సంఖ్య ఇప్పటికే 50 లక్షల మార్కును దాటేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైన కొత్త వేరియంట్ పంజా విసిరితే భరించే శక్తి లేదని చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ల ప్రభావాన్ని ఢీకొట్టే శక్తి కొత్త వేరియంట్‌కు ఉందన్న సమాచారం బెంబేలెత్తిస్తోంది. మనిషి శరీరంలోని రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకొనే సామర్థ్యం దీనికి ఉందని పరిశోధకులంటున్నారు. కరోనా టీకా తీసుకున్నా కొత్త వేరియంట్ జనాభాలో ఎక్కువ శాతం మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. తమ దేశంలో కొత్త వేరియంట్ తొలి కేసును గుర్తించినట్లు ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. మలావీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిలో ఈ వేరియంట్ బయటపడిందని వెల్లడించింది. అతడితోపాటు మరో ఇద్దరు అనుమానితులను ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపింది. వీరు గతంలో టీకా తీసుకున్నారంది. ఆంక్షలు వద్దంటున్న డబ్ల్యూహెచ్ఓ బి.1.1.529 వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను కూడా కుదిపేసింది. యూరప్, ఆసియాలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కొత్త వేరియంట్ విషయంలో ఇప్పుడే తుది నిర్ణయానికి రావొద్దని, భయాందోళనలు అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ భరోసానిచ్చారు. దేశాలు సరిహద్దులను మూసివేయొద్దని, ప్రయాణాలపై ఆంక్షలు సరికాదని సూచించారు. మైఖేల్ ర్యాన్ వినతిని బ్రిటన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. దక్షిణాఫ్రికాతోపాటు ఆఫ్రికా ఖండంలోని మరో ఐదు దేశాల నుంచి విమానాల రాకను నిషేధించింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇటీవలి కాలంలో ఆయా దేశాల నుంచి వచ్చినవాళ్లు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించింది. ఆఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకను నిలిపివేసినట్లు జర్మనీ ప్రకటించింది. కేవలం జర్మన్ పౌరులు మాత్రం రావొచ్చని, స్వదేశానికి వచ్చాక 14 రోజులపాటు క్వారంటైన్లో ఉండాలని సూచించింది. దక్షిణాఫ్రికా ప్రాంతంలోని ఏడు దేశాల నుంచి ఎవరూ తమ దేశంలోకి అడుగుపెట్టొద్దని ఇటలీ ఆరోగ్య శాఖ చెప్పింది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల నుంచి వచ్చిన తమ పౌరులు క్వారంటైన్లో ఉండాలని జపాన్ ప్రభుత్వం పేర్కొంది. బోట్స్వానా, ఎస్వాటినీ, లెసోతో, మొజాంబిక్, నమీబియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వే దేశాల నుంచి వచ్చే వారిపై సింగపూర్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. భారత్ సంగతేంటి? ప్రయాణ ఆంక్షలపై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి భారత్‌కు వచ్చినవారికి కరోనా నిర్ధారణ పరీ క్షలు కచ్చితంగా నిర్వహించాలంటూ ఆదే శాలు జారీ చేసింది. డబ్ల్యూహెచ్ఓ సలహాదారుల ప్రత్యేక భేటీ బి.1.1.529 వేరియంట్‌పై ప్రపంచమంతటా ఆందోళన వ్యక్తమవుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సాంకేతిక సలహాదారుల బృందం శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యింది. రూపాంతరం చెందిన వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరుపై చర్చించింది. బి.1.1.529 గురించి తమకు పెద్దగా తెలియదని, కానీ, ఇందులో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నట్లు తెలుస్తోందని, వైరస్ ప్రవర్తనపై ఈ మ్యుటేషన్ల ప్రభావం ఉంటుందని సాంకేతిక సలహా బృందం సభ్యుడు మారియావాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్ల పనితీరు తెలుసుకోవడానికి మరికొన్ని వారాలు అవసరమన్నారు. బి.1.1.529 వేరియంట్‌పై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని సాంకేతిక సలహా బృందం చైర్మన్, న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. -
ఆర్సీబీకి బిగ్ షాకిచ్చిన ఏబీ డివిలియర్స్
AB de Villiers Announces His Retirement From All Cricket: దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఆర్సీబీ విద్వంసకర ఆటగాడు ఏబి డివిలియర్స్ సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పుతున్నట్లు డివిలియర్స్ శుక్రవారం ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ఏబీ డివిలియర్స్ 2018లోనే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా.. ఐపీఎల్ లాంటి విదేశీ లీగ్‌ల్లో ఆడుతున్నాడు. తన వయస్సు పై బడిందని… అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏబీడీ తెలిపాడు. ఐపీఎల్లో గత కొన్నాళ్ల నుంచి ఆర్సీబీ తరుపున ఆడుతున్న మిస్టర్ 360.. భారత అభిమానుల్లో ప్రత్యేకమైన స్ధానం సంపాందించుకున్నాడు. ఈ క్రమంలో ఏబీడీ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. చివరగా ఐపీఎల్-2021లో ఆడిన ఏబి డివిలియర్స్.. 2 అర్ధ సెంచరీలతో 313 పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచ్‌లు డివిలియర్స్ ఆడాడు. "ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. నేను అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. పెరట్లో మా అన్నయ్యలతో మ్యాచ్ ఆడినప్పటి నుంచి మెదలు పెడితే, నేను స్వచ్ఛమైన ఆనందంతో, హద్దులేని ఉత్సాహంతో క్రికెట్ ఆడాను. ఇప్పుడు నా వయస్సు 37 ఏళ్లు దాటింది. ఈ వయసులో ఇదే సరైన నిర్ణయం. ఇన్నాళ్లు నాకు అండగా నిలిచిన అభిమానుల అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అని డివిలియర్స్ ట్విట్టర్లో పేర్కొన్నాడు. చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్ కెప్టెన్సీకి రాజీనామా It has been an incredible journey, but I have decided to retire from all cricket. Ever since the back yard matches with my older brothers, I have played the game with pure enjoyment and unbridled enthusiasm. Now, at the age of 37, that flame no longer burns so brightly. pic.twitter.com/W1Z41wFeli — AB de Villiers (@ABdeVilliers17) November 19, 2021 -
అరంగేట్ర మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు.. ఎవరు ఆ బౌలర్?
కొలంబో: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో శ్రీలంక 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 2-1తో లంకేయులు కైవసం చేసుకున్నారు. ఈ విజయంలో ఆ జట్టు స్పిన్నర్ మహీష్ తీక్షణ కీలక పాత్ర పోషించాడు. తన వన్డే అరంగేట్ర మ్యాచ్‌లో అధ్బుతమైన ప్రదర్శన చేశాడు. అతడు 10 ఓవర్లలో 4 వికెట్లు తీసి 37 పరుగులు ఇచ్చాడు. అయితే మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ దాసున్ శనక.. మహీష్ తీక్షణపై ప్రశంసల వర్షం కురిపించాడు. "దక్షిణాఫ్రికాతో టీ 20 ల్లో ఆడేందుకు తొలుత తీక్షణను జట్టులోకి తీసుకున్నాము.. ఆనుహ్యంగా మరో స్పిన్నర్ ను జట్టులోకి తీసుకున్నాను. కానీ నేను కెప్టెన్‌గా ఆ రిస్క్ తీసుకున్నాను. సెలెక్టర్లు ,కోచ్‌లు నాకు మద్దతు ఇచ్చారు. అది మాకు పెద్ద అడ్వాంటేజ్‌గా మారింది, ”అని మూడో వన్డే తర్వాత శనక వెల్లడించాడు. తీక్షణ ఇంతకు ముందు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడాడని, కుడి చేతి వాటం స్పిన్నర్ స్లీవ్‌లో చాలా వైవిధ్యాలు ఉన్నందున బ్యాట్స్మన్లు అతడి బౌలింగ్ ను ఆర్ధం చేసుకోవడం అంత సులభం కాదని దాసున్ శనక అన్నారు. చదవండి: Ayesha Mukherjee: అసలు ఎవరీ అయేషా..? శిఖర్‌తో విడిపోవడం వెనుక.. Four wickets on ODI debut 💪 A memorable performance from Maheesh Theekshana!#SLvSA pic.twitter.com/l7ZxALaJF7 — ICC (@ICC) September 8, 2021 -
దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. వన్డే సిరీస్ శ్రీలంకదే
కొలంబో: సిరీస్ విజేతను తేల్చే మూడో వన్డేలో సమష్టి ప్రదర్శన కనబర్చిన శ్రీలంక... దక్షిణాఫ్రికాపై 78 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 203 పరుగులు చేసింది. అసలంక (47; 2 ఫోర్లు), దుష్మంత చమీర (29; 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీశాడు. ఛేదనలో దక్షిణాఫ్రికా 30 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ (4/37)తో దక్షిణాఫ్రికాను పడగొట్టాడు. అతడికి చమీర (2/16), హసరంగ (2/32) సహకరించారు. చమీర ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. చదవండి: శిఖర్ ధావన్ విడాకులు -
ఎయిడ్స్ పేషెంట్లో 216రోజులుగా కరోనా!
డర్బన్: దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒక ఆసక్తికరమైన కేసును వెలుగులోకి తెచ్చారు. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ మహిళ శరీరంలో 216 రోజులుగా కరోనా వైరస్ పాతుకుపోయిన విషయాన్ని గుర్తించారు. అంతేకాదు ఆమె శరీరంలో ఆ వైరస్ 32 సార్లు మ్యూటేషన్స్కి గురైందని, అది ప్రమాదకరమైన వేరియెంట్లకు దారితీసిందని నిర్ధారించారు. ఈ కేసు గురించి మెడ్ఆర్గ్జివ్ మెడికల్ జర్నల్ ప్రముఖంగా ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముప్పై ఆరేళ్ల ఆ మహిళ 2006లో హెచ్ఐవీ బారిన పడింది. అప్పటి నుంచి ఆమె ఒంట్లో రోగనిరోధక శక్తి క్షీణిస్తూ వస్తోంది. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో ఆమె కరోనా బారిన పడింది. అయితే ఇన్నిరోజులుగా ఆమె శరీరంలో వైరస్ రకరకాల మార్పులు చెందింది. ఆ మ్యూటెంట్స్ వల్ల ఏర్పడిన వేరియెంట్స్(ఆమెవల్ల) ఇతరులకు సోకింది, లేనిది అనేదానిపై ఒక స్పష్టతకి రాలేకపోతున్నారు. క్వాజులూ నటాల్ ప్రాంతంలో ప్రతీ నలుగురిలో ఒకరికి కొత్త వేరియెంట్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ మహిళ కేసులో ఇన్నిసార్లు మార్పులు కలగడం, ప్రమాదకరమైన వేరియెంట్ల పుట్టుకకు కారణం కావడం ఆందోళన కలిగిస్తోందని రీసెర్చర్లు చెప్తున్నారు. కారణం ఇదే.. సాధారణంగా ఇమ్యూనిటీ లెవల్ తక్కువగా ఉన్నవాళ్లలో కరోనా వైరస్ ఎక్కువ కాలం ఉంటుంది. హెచ్ఐవీ అడ్వాన్స్డ్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్లలోనూ ఇది జరుగుతుంది. దక్షిణాఫ్రికా ఎయిడ్స్ పేషెంట్ కేసులో బాధిత మహిళకు కరోనా సోకినప్పుడు మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉన్నాయట. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా వైరస్ ఆమె శరీరంలో సజీవంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందని డర్బన్‌కి చెందిన జెనెటిసిస్ట్ టులియో డె ఒలివెయిరా తెలిపారు. త్వరగా ట్రీట్మెంట్ ఈ పరిశోధనతో హెచ్ఐవీ బారినపడ్డవాళ్లు.. మరిన్ని రకాల కరోనా వైరస్ వేరియెంట్లను వ్యాపింపజేసే అవకాశం ఉందన్న వాదనకు బలం చేకూరిందని రీసెర్చర్లు చెబుతున్నారు. ‘‘హెచ్ఐవీ బారినపడ్డవాళ్లను ట్రేస్ చేసి గుర్తించి, ఇమ్యూనిటీ పెంపొందించేలా మంచి మందులు, సరైన పోషకాహారం అందించాలని, కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ఒకవేళ కరోనా సోకినా మంచి ట్రీట్మెంట్ అందించడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చ’’ని టులియో చెప్పారు. ఇక భారత్‌లో సుమారు పది లక్షల మంది హెచ్ఐవీ పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ అందట్లేదని, వీళ్లకు గనుక కరోనా సోకితే పరిస్థితి ఘోరంగా మారొచ్చని ఈ రీసెర్చ్ స్టడీలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. చదవండి: తెలంగాణలో కండోమ్ కొనేందుకు సిగ్గు -
మరోసారి అమెరికా ట్రావెల్ ఆంక్షలు ?
వాషింగ్టన్: కోవిడ్ కట్టడి చేసే విషయమై బైడెన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో బ్రెజిల్, ఐర్లాండ్, యూకేలతో సహా 26 ఇతర యూరోపియన్ దేశల నుంచి వచ్చే అమెరికా యేతర పౌరుల ప్రయాణాలపై మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్ధమౌతున్నట్టు అమెరికా వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి వ్యాపించిన కరోనా వైరస్‌పై ఆందోళనలు నెలకొనడంతో ఆంక్షల జాబితాలో దక్షిణాఫ్రికాని కూడా చర్చనున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష స్థానాన్ని వీడే చివరి రోజుల్లో మంగళవారం నుంచి ట్రావెల్ ఆంక్షలను సడలిస్తున్నట్టు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలను తిప్పికొట్టిన అమెరికా నూతన అ«ధ్యక్షుడు బైడెన్, తిరిగి ప్రయాణ ఆంక్షలను విధించేందుకు సిద్ధమౌతున్నారు. -
కరోనా: 116 ఏళ్ల వృధ్దుడి కోరిక ఏంటంటే...
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు సంబంధించి భయంకరమైన విషయం ఏమిటంటే, సిగరెట్ అమ్మకాలపై నిషేధం విధించడం. ‘మే 8వ తేదీ సిగరెట్ లేకుండానే నా పుట్టిన రోజు గడచి పోవడం నాకు బాధాకరం’ ఈ మాటలు అన్నదెవరంటే 116 ఏళ్ల ప్రపంచ కురువద్ధుడైన ఫ్రెడీ బ్లామ్. ఆయన దక్షిణాఫ్రికాలోని అడలాయిడ్‌లో 1904, మే 8వ తేదీన జన్మించారు. ఆయనకు 14 ఏళ్లు ఉన్నప్పుడు, అంటే 1918లో ఆయన సోదరి స్పానిష్ ఫ్లూతో చనిపోయారట. ఆ వ్యాధి తనకు సోకకుండా బ్లామ్ ఆరు బయట గడ్డిలో పడుకునే వారట. అప్పట్లో స్పానిష్ ఫ్లూ వల్ల దక్షిణాఫ్రికాలో దాదాపు మూడు లక్షల మంది మరణించారు. (ఇవాంకా వ్యక్తిగత సహాయకురాలికి కరోనా!) కరోనా వైరస్ మహమ్మారి ఎంతటి ప్రమాదకారో బ్లామ్ అర్థం చేసుకోలేక పోతున్నారని, ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా సిగరెట్లు అందుబాటులో లేకపోవడం వెలితిగా భావించారని బ్లామ్ పొరిగింటాయన గైరోనెసా మైకేల్ తెలిపారు. ‘ఈ పుట్టిన రోజుకు సిగరెట్లు కావాలని కోరుకున్నాను. దేశాధ్యక్షుడు సిరిల్ రమఫోసా అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు’ అంటూ ఏకంగా దేశాధ్యక్షుడినే ఆయన తప్పు పట్టారు. గిన్నీస్ బుక్‌లోకి ఆయన మాత్రం ఎక్కలేదు. ఆయనకన్నా నాలుగేళ్లు చిన్న వాడైన బ్రిటన్ నివాసి, 112 ఏళ్ల బాబ్ వెయిటన్ ప్రపంచ వద్ధుడిగా గిన్నీస్ బుక్‌లోకి ఎక్కారు. (బాంబు పేలుడు : ఆర్మీ మేజర్ మృతి) బ్లామ్ గురించి ఎవరూ గిన్నీస్ బుక్ దష్టికి తీసుకెళ్లక పోవడం వల్లనే ఆయన పేరు రికార్డుల్లో నమోదు కాలేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన పుట్టిన రోజు గురించి మీడియా శుక్రవారం నాడు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు బ్లామ్ ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. మధ్యాహ్నం ఆయన మనవళ్లు, ఇరుగుపొరుగు వారు వచ్చి ఆయనకు పుట్టిన రోజు అభినందనలు తెలుపుతూ పాట పాడారు. కేప్‌టౌన్‌లో వ్యవసాయం చేసుకుని బతికిన బ్లామ్ చివరి దశలో 106 ఏళ్ల వరకు గార్డెనర్‌గా పనిచేస్తూ కట్టెలు కూడా కొట్టేవారట. ఆయన భార్య కూడా ఇప్పటికీ ఉన్నారు. ‘నేను ప్రతి రోజు డిస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటా. యూనో తాగుతాను. లాక్డౌన్ విధించే వరకు సిగరెట్లు కూడా తాగాను. అంతకుమించిన ఆరోగ్య రహస్యం మరేమి లేదు’ ఓ ప్రశ్నకు సమాధానంగా బ్లామ్ చెప్పారు. (పుతిన్‌కు కిమ్ జోంగ్ ఉన్ లేఖ) -
స్వదేశంలో మళ్లీ ఆట మొదలు
న్యూజిలాండ్ పర్యటనలో వన్డే, టెస్టు సిరీస్‌లలో అవమానకరంగా వైట్‌వాష్‌కు గురైన తర్వాత కొంత విరామంతో భారత జట్టు మరో పోరుకు సన్నద్ధమైంది. అయితే ఇప్పుడు వేదిక సొంతగడ్డకు మారింది. గత అక్టోబరులో ఇక్కడే జరిగిన టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా నాటి పర్యటనకు కొనసాగింపుగా ఇప్పుడు కేవలం వన్డేల కోసమే వచ్చింది. స్వదేశంలో ఆస్ట్రేలియాను వన్డేల్లో చిత్తు చేసిన ఉత్సాహంతో సఫారీలు భారత్‌లో అడుగు పెట్టారు. అయితే భారత్‌లో కోహ్లి సేనను నిలువరించడం అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో మూడు వన్డేల సమరం ఆసక్తికరంగా సాగనుంది. ధర్మశాల: భారత క్రికెట్ అభిమానులు ఐపీఎల్ మత్తులోకి వెళ్లే ముందు ఒక స్వల్ప వన్డే సిరీస్‌ను దాటాల్సి ఉంది! గతంలో నిర్ణయించిన ద్వైపాక్షిక షెడ్యూల్ ప్రకారం దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఇందులో భాగంగా నేడు జరిగే తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయిు. వరుసగా ఐదు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఓటముల తర్వాత విజయాన్ని అందుకోవాలని భారత్ భావిస్తుండగా... డి కాక్ నేతృత్వంలో సత్తా చాటాలని సఫారీలు పట్టుదలగా ఉన్నారు. ముగ్గురూ రెడీ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ఆడిన జట్టుతో పోలిస్తే భారత జట్టులో మూడు ప్రధాన మార్పులు ఖాయమయ్యాయి. గాయాలనుంచి పునరాగమనం చేసిన శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలు తుది జట్టులో ఉంటారు. కివీస్‌పై ఓపెనింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించిన నేపథ్యంలో సీనియర్ ఓపెనర్ ధావన్ కీలకం కానున్నాడు. అతను తన అసలు సత్తాను ప్రదర్శిస్తే టీమిండియాకు శుభారంభం లభిస్తుంది. మరో ఓపెనర్ పృథ్వీ షా కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడితే అతని వన్డే భవిష్యత్తు బాగుంటుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్లో మళ్లీ చెలరేగేందుకు ఉత్సాహంగా ఉన్నారు. వీరికి తోడు కెప్టెన్ కోహ్లి ఎలాగూ ఉన్నాడు. కివీస్ టూర్లో ఘోరంగా విఫలమైన విరాట్ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడాలని ఎదురు చూస్తున్నాడు. అతనికిదే సరైన వేదిక. బౌలింగ్‌లో బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్ కొత్త బంతిని పంచుకుంటాడు. గాయంనుంచి కోలుకున్న భువీ ఎంత మేరకు రాణిస్తాడనేది ఆసక్తికరం. పిచ్‌ను దృష్టిలో ఉంచుకుంటే మూడో పేసర్‌గా సైనీకి చోటు దక్కవచ్చు. అయితే ఆరో స్థానాన్ని తనకంటూ దాదాపుగా ఖరారు చేసుకున్న మనీశ్ పాండేను తీసుకుంటారా అనేదే ప్రశ్న. పాండ్యా స్థానంలో వచ్చినప్పటినుంచి ఆల్‌రౌండర్‌గా జడేజా అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పుడు పాండ్యా రాకతో అతడిని తప్పిస్తారా లేక ఇద్దరు ఆల్రౌండర్లను కొనసాగించి పాండేను పక్కన పెడతారా చూడాలి. బుధవారం జరిగిన ప్రాక్టీస్‌లో కెప్టెన్ కోహ్లి, పాండ్యా పాల్గొనలేదు. సీనియర్లే కీలకం... గత అక్టోబరులో భారత్‌లో పర్యటించినప్పుడు టి20 సిరీస్‌ను సమం చేసిన దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను 0–3తో కోల్పోయింది. తదనంతర పరిణామాల్లో డు ప్లెసిస్ కెప్టెన్సీని కూడా వదిలేసుకున్నాడు. డి కాక్ సారథ్యంలో ఇటీవలే ఆస్ట్రేలియాను వన్డేల్లో 3–0తో చిత్తు చేసి సఫారీలు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. బ్యాటింగ్‌లో ఆ జట్టుకు కెప్టెన్, మాజీ కెప్టెన్‌తో పాటు డేవిడ్ మిల్లర్ అనుభవం కీలకం కానుంది. వీరిని మినహాయిస్తే ఎక్కువ మందికి అనుభవం లేకపోవడం జట్టు ప్రధాన లోటు. అందులోనూ భారత గడ్డపై కొత్త ఆటగాళ్లు తొలి పర్యటనలో రాణించడం చాలా కష్టం. కాబట్టి ఆ జట్టు విజయావకాశాలు ముగ్గురి బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉన్నాయి. బవుమా, వాన్ డర్ డసెన్, క్లాసెన్ బ్యాటింగ్ భారాన్ని మోయాల్సి ఉంది. చివరి నిమిషంలో జట్టులో చేరిన జేన్‌మన్ మలాన్‌కు స్థానం దక్కుతుందా చూడాలి. రబడ లాంటి స్టార్ బౌలర్ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. ఫలితంగా పేస్ బౌలింగ్ అంతంత మాత్రంగా ఉంది. అయితే ఇక్కడి పిచ్‌పై తాము ప్రభావం చూపించగలమని పేసర్లు నమ్మతున్నారు. ఇన్‌గిడి ప్రధాన పేసర్ కాగా...నోర్జే, హెన్డ్రిక్స్లు సహకరిస్తారు. తుది జట్లు (అంచనా): భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, పృథ్వీ షా, శ్రేయస్, రాహుల్, పాండ్యా, జడేజా/ పాండే, భువనేశ్వర్, సైనీ, చహల్, బుమ్రా. దక్షిణాఫ్రికా: డి కాక్ (కెప్టెన్), బవుమా/ మలాన్, వాన్ డర్ డసెన్, డు ప్లెసిస్, క్లాసెన్, మిల్లర్, ఫెలుక్వాయో, కేశవ్ మహరాజ్, నోర్జే, ఇన్‌గిడి, హెన్డ్రిక్స్ పిచ్, వాతావరణం చల్లటి వాతావరణం, తేమ కారణంగా మొదటినుంచి ఇక్కడి పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. గతంలో చూస్తే రెండో బ్యాటింగ్ చేసిన జట్లే ఎక్కువ మ్యాచ్‌లు నెగ్గాయి. అయితే మ్యాచ్ రోజు వర్షం ముప్పు పొంచి ఉంది. పూర్తిగా గానీ ఏదో ఒక సమయంలో గానీ వాన ఇబ్బంది కలిగించవచ్చు. సెప్టెంబరులో ఇరు జట్ల మధ్య జరగాల్సిన టి20 మ్యాచ్ కూడా వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. ‘కరోనా భయం కారణంగా బంతి మెరుపు పెంచేందుకు ఈ సారి ఉమ్మును వాడరాదని మేమూ అనుకుంటున్నాం. అయితే దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేను. ఎందుకంటే అలా చేయకపోతే మెరుపు రాబట్టేది ఎలా! ఆ తర్వాత ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ మా బౌలింగ్‌ను చితక్కొడతారు. మీరేమో బౌలింగ్ బాగా చేయడం లేదని, విఫలమయ్యాడని అంటారు. డాక్టర్ల సలహా తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం’ –భువనేశ్వర్ కుమార్, భారత బౌలర్ -
సఫారీ అమ్మాయిల చరిత్ర
పెర్త్: టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మహిళలు చరిత్రకెక్కే విజయాన్ని సాధించారు. తొలిసారి ఇంగ్లండ్‌లాంటి మేటి జట్టుపై గెలుపొందారు. మహిళల టి20 మెగా ఈవెంట్లో సఫారీ జట్టు తమ తొలి మ్యాచ్‌లోనే బోణీ కొట్టింది. ఆదివారం ఉత్కంఠ రేపిన ఈ పోరులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. మొదట ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. సీవర్ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించింది. ఓపెనర్ జోన్స్ (20 బంతుల్లో 23; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. సఫారీ బౌలర్లు అయబొంగ (3/25), వాన్ నికెర్క్ (2/20), మరిజనె (2/19) సమష్టిగా దెబ్బతీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 19.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్, కెప్టెన్ వాన్ నికెర్క్ (51 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మరిజనె (33 బంతుల్లో 38; 6 ఫోర్లు) రాణించారు. ఇంగ్లిష్ బౌలర్ ఎకిల్‌స్టోన్ 2 వికెట్లు తీసింది. ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... బ్రంట్ వేసిన ఆ ఓవర్లోని 3, 4 బంతుల్ని డు ప్రీజ్ వరుసగా 6, 4 బాదడంతో 2 బంతులు మిగిలుండగానే దక్షిణాఫ్రికా విజయం సాధించింది. -
ఇంగ్లండ్‌దే కేప్‌టౌన్ టెస్టు
కేప్‌టౌన్: ఈ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా గెలవడం కష్టమే... కానీ ‘డ్రా’ చేసుకోవడం మాత్రం కష్టం కాదు. ఆఖరి సెషన్లో ఇంకా 13 ఓవర్లు మిగిలుండగా సఫారీ ఏడు వికెట్లను కోల్పోయింది. మిగతా మూడు వికెట్లతో 13 ఓవర్లు ‘డ్రా’మాలాడితే సరిపోయేది. కానీ ఇంగ్లండ్ పేసర్ బెన్ స్టోక్స్ (3/35) వారికి ఆ అవకాశమివ్వలేదు. ఇన్నింగ్స్ 134వ ఓవర్ వేసిన అతను వరుస బంతుల్లో ప్రిటోరియస్ (0), నోర్జే (0)లను డకౌట్ చేశాడు. దీంతో సఫారీ ‘డ్రా’ఆశలు కూలాయి. ఫిలాండర్ (51 బంతుల్లో 8) రూపంలో ఆఖరి వికెట్ కూడా స్టోక్సే తీయడంతో... దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ 189 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 438 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగళవారం 126/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆటకొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 137.4 ఓవర్లలో 248 పరుగుల వద్ద ఆలౌటైంది. చివరి రోజు డికాక్ (50; 7 ఫోర్లు) మినహా ఇంకెవరూ ప్రతిఘటించలేకపోయారు. ఈ గెలుపుతో నాలుగు టెస్టుల సిరీస్‌ను 1–1తో ఇంగ్లండ్ సమం చేసింది. ఈ నెల 16 నుంచి పోర్ట్ ఎలిజబెత్‌లో మూడో టెస్టు జరుగుతుంది. -
డుప్లెసిస్‌ను వదల్లేదు..!
-
శుబ్‌మన్ గిల్‌పైనే అందరి దృష్టి
తిరువనంతపురం: భారత సీనియర్ జట్టులో చోటు ఆశిస్తున్న కొందరు యువ ఆటగాళ్లకు సొంతగడ్డపై ‘ఎ’ సిరీస్ రూపంలో మరో అవకాశం లభించింది. భారత్ ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’ మధ్య ఐదు అనధికారిక వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు తొలి మ్యాచ్ జరుగుతుంది. ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్నా... దురదృష్టవశాత్తూ విండీస్‌తో సిరీస్‌లో ఎంపిక కాలేకపోయిన శుబ్‌మన్ గిల్‌పైనే అందరి దృష్టి నిలిచింది. ఈ సిరీస్‌లోనూ రాణిస్తే అతను మళ్లీ సీనియర్ జట్టులోకి రావడం ఖాయం. ప్రపంచకప్‌లో గాయంతో అనూహ్యంగా దూరమైన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా తన ఫిట్నెస్ను నిరూపించుకునేందుకు ఈ సిరీస్‌ను ఉపయోగించుకోనున్నాడు. విండీస్‌తో సిరీస్ విజయంలో భాగంగా ఉన్నా... చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్‌లు కూడా తిరిగి ఫామ్‌లోకి రావడం ‘ఎ’ సిరీస్ సరైన వేదిక కానుంది. ఇతర సీనియర్ జట్టు సభ్యులు కృనాల్, ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్ కూడా ఈ సిరీస్ బరిలోకి దిగుతున్నారు. మరో వైపు దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులో తెంబా బవుమా, హెండ్రిక్స్, క్లాసెన్, నోర్జేవంటి గుర్తింపు పొందిన అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ఈ నెల 31న రెండో వన్డే, ఆ తర్వాత సెప్టెంబర్ 2, 4, 6 తేదీల్లో మిగిలిన మూడు వన్డేలు జరుగుతాయి. -
మన సమరం నేడే ఆరంభం
టోర్నీ ప్రారంభమై ఆరు రోజులైంది...అన్ని జట్లు మైదానంలో దిగాయి... ఇప్పటికే ఏడు మ్యాచ్‌లు జరిగిపోయాయి... చిన్నాచితక సంచలనాలూ నమోదయ్యాయి... అయినా మన అభిమానుల్లో ఆ జోష్ లేదు... వారందరి నుంచి ఎదురవుతోంది ఒకటే ప్రశ్న......ఈసారి ప్రపంచ కప్‌లో ఊపు లేదెందుకని?...అంతా సాదాసీదాగా సాగుతుందేమని? దీనికి సమాధానం నేడే దొరకనుంది. వంద కోట్లమందిపైగా ఆశలను మోస్తూ... అంచనాలు నిలబెట్టుకుంటామని భరోసా ఇస్తూ... అదరగొట్టే ఆటతో కప్పు కొట్టుకొస్తామని ఊరిస్తూ... విశ్వ విజేతగా మువ్వన్నెలను రెపరెపలాడిస్తామంటూ... కోహ్లి సారథ్యంలోని భారత్ బరిలో దూకనుంది... మరిక...వినేవారికి వీనుల విందు కళ్లారా చూసేవారికి చూడ ముచ్చట టీవీల ముందు ప్రేక్షకులకు కన్నుల పండుగే! వీరాభిమానులకైతే మజా మజానే! ఇంకెందుకు ఆలస్యం...? ఆసాంతం ఆస్వాదిద్దాం... టీమిండియాకు శుభాభినందనలు చెబుదాం. సౌతాంప్టన్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ, మన వీరుల ప్రతాపం ఎలా ఉంటుందోనన్న ఊహల్లో విహరిస్తూ, ఎవరెవరు అదరగొడతారని లెక్కలేసుకుంటూ వస్తున్న భారత క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చింది. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ కోసం టీమిండియా పోరాటం బుధవారం నుంచే ప్రారంభం కానుంది. సౌతాంప్టన్ మైదానం వేదికగా విరాట్ కోహ్లి సేన తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తగినంత విశ్రాంతితో, తీరైన సన్నాహంతో, మంచి ప్రాక్టీస్‌తో భారత్ బల ప్రదర్శనకు దిగనుండగా... పరాజయాలు, ఫామ్ లేమితో సఫారీల పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వారికిది మూడో మ్యాచ్. ఇందులోనూ ఓడితే ఇకపై ప్రతి మ్యాచ్ నెగ్గితేనే కానీ కప్‌లో ముందుకెళ్లలేరు. మరోవైపు తుది కూర్పు కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తున్న టీమిండియా తాజాగా ప్రయాణం ప్రారంభించనుంది. వారిలో ఎవరు? సౌతాంప్టన్‌లో మబ్బులు కమ్మిన వాతావరణం ఎదురయ్యే వీలుండటంతో భారత్ రెండో ప్రధాన పేసర్‌గా భువనేశ్వర్‌ను ఆడించే యోచనలో ఉంది. టోర్నీలో ఫ్లాట్ వికెట్లపై షార్ట్ పిచ్ బంతులు వేయగల భువనేశ్వర్‌లాంటి బౌలర్లు విజయవంతం అవుతున్నారు. దీంతో షమీ స్థానంలో అతడిని తీసుకునే వీలుంది. ముగ్గురు పేసర్లనూ తీసుకుంటారని వార్తలు వచ్చినా అందుకు పెద్దగా అవకాశం లేదు. రెండో స్పిన్నర్ స్థానం కోసం జడేజా, చహల్ మధ్య పోటీ నెలకొంది. ఫిట్నెస్ సాధించిన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ మైదానంలో దిగడం ఖాయమైంది. స్పిన్ కూడా వేయగల అతడి చేరిక జట్టుకు బలాన్నిస్తుంది. ఐదో స్థానంలో ధోనినే రావొచ్చు. 6, 7లో జాదవ్, హార్దిక్ ఆడతారు. బ్యాట్ దూసే జడేజా, విలువైన పరుగులు చేయగల భువీని లెక్కలోకి తీసుకుంటే మొత్తం 9 మందితో లోతైన బ్యాటింగ్ ఆర్డర్ కనిపిస్తోంది. కష్టాల దక్షిణాఫ్రికా... గత మ్యాచ్ ప్రారంభంలోనే ఇన్‌గిడి సేవలను కోల్పోయిన దక్షిణాఫ్రికాకు ప్రధాన పేసర్ స్టెయిన్ సైతం దూరమయ్యాడు. లెక్క ప్రకారం చూస్తే ఆ జట్టుకు ఇప్పుడు నలుగురే స్పెషలిస్ట్ బౌలర్లున్నారు. ఐదో బౌలర్ కోటాను మార్క్రమ్, డుమిని తదితరులతో భర్తీ చేయాల్సి వస్తోంది. వీరిలో రబడ మాత్రమే పక్కా పేసర్. మోరిస్, ఫెలుక్వాయోలకు ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను దెబ్బతీయగల సత్తా లేదు. బంగ్లాదేశ్ చేతిలో సఫారీల ఓటమికి సరైన బౌలింగ్ వనరులు లేకపోవడమూ ఓ కారణమైంది. వెటరన్ ఆమ్లా తిరిగి రావడం బ్యాటింగ్‌ను పటిష్ట పరుస్తోంది. ఈ జట్టులోనూ 9వ నంబరు స్థానం వరకు బ్యాటింగ్ చేయగల వారుండటం గమనార్హం. బౌలింగ్‌లో ఎలాగూ దమ్ము లేదు కాబట్టి... మొదట క్రీజులో దిగితే భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిని సవాల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మైదానం ఇలా... సౌతాంప్టన్ మైదానంలో చివరి ఐదు వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 311. మూడుసార్లు తొలుత బ్యాటింగ్‌కు దిగిన జట్టే గెలిచింది. ఈ మ్యాచ్‌ల్లో పేసర్లు 6.4 ఎకానమీతో సగటున 58.4 పరుగులు ఇచ్చారు. స్పిన్నర్లు 6 ఎకానమీతో సగటున 60.1 పరుగులు ఇచ్చారు. ముఖాముఖి రికార్డు ఇరు జట్లు ఇప్పటివరకు 83 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. భారత్ 34 మ్యాచ్‌ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా 46 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో నాలుగు సార్లు ఎదురుపడగా భారత్ ఒక్కసారే (2015లో) నెగ్గింది. మిగతా మూడు సార్లు సఫారీలనే విజయం వరించింది. కమాన్ కోహ్లి... రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కోహ్లి మంచి ఇన్నింగ్సే ఆడాడు. కప్ కోసం సంసిద్ధమైనట్లు కనిపించాడు. ఎప్పటిలాగే అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. మార్చిలో ఆస్ట్రేలియా సిరీస్, తర్వాత ఐపీఎల్లో పెద్దగా ఆకట్టుకోని కోహ్లి కప్‌లో రాణిస్తే.. లోతైన బ్యాటింగ్ ఆర్డర్‌తో స్కోరును ముందుకు తీసుకెళ్లొచ్చు. అనుకోకుండా ఓపెనర్లు విఫలమైనా పెద్దగా ఇబ్బంది రాదు. రాహుల్... రాహుల్... ఎంతో ఊగిసలాట మధ్య ఎట్టకేలకు నంబ ర్–4గా కేఎల్ రాహుల్ స్థానం ఖాయమైంది. టీవీ షో వివాదం నుంచి తేరుకుని, ఐపీఎల్లో సత్తా చాటిన రాహుల్... రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ (108)తో తప్పక ఆడించే పరిస్థితి కల్పించాడు. ఇదే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా వైఫల్యం, గాయం బెడద విజయ్ శంకర్‌ను పక్కనపెట్టేలా చేసింది. క్లాస్ బ్యాట్స్‌మన్ అయిన రాహుల్ అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే భారత్ నిశ్చింతగా ఉండొచ్చు. పిచ్, వాతావరణం వర్షం కారణంగా క్రితం రోజంతా పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. పచ్చికను పూర్తిగా తొలగించారు. మంగళవారం వర్షం కారణంగా భారత నెట్ ప్రాక్టీస్ సెషన్‌కు అంతరాయం కలిగింది. పిచ్ బ్యాటింగ్‌కు బాగా సహకరించే వీలుంది. బుధవారం వర్షం కురిసే అవకాశం తక్కువే అయినా... చల్లని వాతావరణం మ్యాచ్‌పై ప్రభావం చూపొచ్చు. శుభ సూచకం మొత్తమ్మీద వన్డే గణాంకాలు చూసినా, కప్‌లో వారిపై గెలుపోటములు చూసినా దక్షిణాఫ్రికా కఠిన ప్రత్యర్థే. సఫారీలపై విజయం అంత తేలిక కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. అంతేకాక, వరుసగా పెద్ద జట్లతో ఆడాల్సిన పరిస్థితుల్లో... దక్షిణాఫ్రికాను తొలి మ్యాచ్‌లోనే ఎదుర్కొనడం సహజంగానే ఒత్తిడి, ఉత్కంఠ రేపుతుంది. కానీ, ఈసారి ప్రత్యర్థిని ముందే దెబ్బతీసి కాలం పరోక్షంగా మనకు మేలు చేసింది. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడటంతో పాటు ప్రధాన ఆటగాళ్లు గాయాలతో అందుబాటులో లేకపోవడంతో దక్షిణా ఫ్రికా ఒకవిధంగా ఆత్మరక్షణలో పడింది. దీంతో మానసికంగా భారత్‌దే పైచేయిగా ఉంది. ఈ ఆత్మ విశ్వాసంతో మైదానంలో రాణిస్తే టీమిండియాకు శుభారంభమే. ఎట్టకేలకు ప్రపంచ కప్‌లో మొదటి మ్యాచ్ ఆడబోతుండటం సంతోషంగా ఉంది. ఆలస్యంగా బరిలోకి దిగడం వల్ల మాకు కొంత మేలు జరిగిందనేది వాస్తవం. ఇతర జట్లు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడుతున్నాయి, వాతావరణం ఎలా ఉంటోంది అనేవి పరిశీలించి, ప్రణాళికలు రూపొందించుకోవడానికి అవకాశం దక్కింది. అయితే ఎన్ని వ్యూహాలు పన్నినా మ్యాచ్ రోజున ఎలా ఆడతామనేదే ముఖ్యం. మా టీమ్ ఎలాంటి లోపాలు లేకుండా అన్ని రకాలుగా పటిష్టంగా ఉంది. ఎలాంటి స్థితినైనా ఎదుర్కోగల సత్తా అందరిలో ఉంది. పిచ్‌ను బట్టే తుది జట్టు ఎంపిక ఉంటుంది. తొలిసారి ప్రపంచకప్‌లో దేశానికి నాయకత్వం వహిస్తుండటం గర్వంగా అనిపిస్తోంది. 2015లో టోర్నీ ఆడేటప్పుడు దీని గురించి అసలు ఏమాత్రం ఊహించలేదు. వేరే సిరీస్‌లతో పోలిస్తే ప్రపంచ కప్ ఎప్పటికీ ప్రత్యేకమే. ఇక ప్రత్యర్థి జట్టుకు గాయాల సమస్య ఉంది కాబట్టి వారిని బలహీనంగా భావించడం లేదు. మేం ఎవరినీ తేలిగ్గా తీసుకోం. మా బలాన్నే నమ్ముకున్నా. స్టెయిన్ నాకు మంచి మిత్రుడు కూడా కాబట్టి అతను టోర్నీకి దూరం కావడం బాధగా అనిపిస్తోంది. 2017 చాంపియన్స్ ట్రోఫీ నుంచి కొన్ని పాఠాలైతే నేర్చుకున్నాం. ఇంగ్లండ్‌లో పరిస్థితుల దృష్ట్యా తొలి పది ఓవర్లు ఎంతో కీలకం. గత రెండు ప్రపంచకప్‌ల తరహాలో తొలి మ్యాచ్‌లో నేను సెంచరీ కొట్టినా, కొట్టకపోయినా జట్టు గెలుపు అన్నింటికంటే ముఖ్యం. – విరాట్ కోహ్లి, భారత్ కెప్టెన్ వరుసగా రెండు ఓటముల తర్వాత బాధ ఉండటం సహజమే. అయితే నాలాంటి సీనియర్లలో ఆత్మవిశ్వాసం లోపిస్తే తొలిసారి ప్రపంచ కప్ ఆడుతున్న కొత్త కుర్రాళ్లు మానసికంగా మరింత బేలగా తయారవుతారు. తమపై తామే జాలి పడేలా వారిని వదిలేయలేం. బలమైన మాటలతో వారిలో విశ్వాసం నింపడం ముఖ్యం. లేదంటే జట్టు మొత్తం కుప్పకూలిపోతుంది. మా ప్రయత్నంలో లోపం లేకుండా కష్టపడతాం. కానీ ఫలితం మా చేతుల్లో లేదు. భారత్‌తో మ్యాచ్‌ను చావోరేవోగా భావించి ఆడమని మావాళ్లకు చెబుతున్నా. స్టెయిన్ తప్పుకోవడంతో ఇప్పుడు మాకు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు కూడా తక్కువగా ఉన్నాయి. గత రెండున్నరేళ్లుగా అతను గాయాలతో బాధపడ్డాడు. కోలుకుంటున్న సమయంలో ఐపీఎల్లో ఆ రెండు మ్యాచ్‌లు ఆడకుండా ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. –డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్ తుది జట్లు (అంచనా) ►భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), రాహుల్, జాదవ్, ధోని, హార్దిక్, జడేజా/చహల్, కుల్దీప్, భువనేశ్వర్/షమీ, బుమ్రా. ►దక్షిణాఫ్రికా: ఆమ్లా, డికాక్, డు ప్లెసిస్ (కెప్టెన్), డసెన్, మార్క్రమ్, మిల్లర్, డుమిని, మోరిస్, ఫెలుక్వాయో, తాహిర్, రబడ. -
అర్థం మార్చుకున్న గాంధీ ‘సర్వీసు’
మూణ్ణెళ్ల క్రితం వినియో గదారుల సమస్యలూ, అవ గాహన వంటి పార్శా్వల గురించి పరిశీలనగా ఆలోచి స్తున్నాను. మూడు దశా బ్దాల క్రితం మనందరికీ తరచు కనబడిన ఒక అంశం గుర్తుకు వచ్చింది. అది ఆకా శవాణి, దూరదర్శన్లలో గానీ, పత్రికలలోగానీ తరచూ వినబడేది కాదు, కన బడేది కాదు. కానీ పోస్టాఫీసులలో, బ్యాంకులలో బాగా కనబడేట్టు ప్రదర్శితమయ్యేది. అంతేకాదు కొన్ని దుకాణాలలో సైతం కనబడేది. ‘‘మన ఆవరణలో వినియోగదారుడు చాలా ముఖ్యమైన అతిథి ఆ వ్యక్తి మనమీద ఆధారపడ లేదు, నిజానికి మనమే అతనిమీద ఆధారపడ్డాం/ అతని రాక మనకు ప్రతిబంధకం కాదు, మన పనికి అసలు ప్రయోజనం అతనే అతనికి సేవలందిం చడం ద్వారా మనం ఎటు వంటి దయ చూపడం లేదు/నిజానికి ఆయనే మన మీద దయచూపుతు న్నాడు–మనకు ఒక అవకాశం ఇచ్చి’’ ఇప్పుడు చాలామందికి గుర్తొచ్చి ఉంటుంది. ‘ఎ కస్టమర్ ఈజ్...’ అనే ఇంగ్లిష్ వాక్యాల సము దాయం, దాని చివరి నుండే మహాత్మాగాంధీ పేరు. 1890లో దక్షిణాఫ్రికాలో ఒక ప్రసంగంలో ఆయన ప్రస్తావించారు ఈ వాక్యాలు. గాంధీ చెప్పని విష యం లేదు. అయితే కొన్ని వ్యాప్తిలోకి వచ్చాయి. మరికొన్ని మరుగునపడి పోయాయి. పర్యావరణం గురించి గాంధీ చెప్పిన విషయాలు అప్పటికన్నా, ఇప్పుడు ఎంతో ప్రయోజనకరమని పర్యా వరణ శాస్త్రవేత్త, పర్యావరణ ఉద్యమ నిర్మాత అనిల్ అగర్వాల్ రెండు దశాబ్దాల క్రితం స్పష్టంగా పేర్కొ న్నారు. అలాగే గాంధీ అనగానే ఆధ్యాత్మికత, భక్తి, మతం అనే ధోర ణిలో పడిపోయి సైన్స్ దృష్టి, సైన్స్ ప్రయోగధోరణి వంటి వాటి గురించి పూర్తిగా గమనించలేదు. ఈ భావాలు ఒకటి, రెండు దశా బ్దాలుగా ప్రపంచస్థాయిలో చర్చను లేపుతున్నాయి. అయితే మన దేశం లోగానీ, తెలుగు ప్రాంతాల్లోగానీ, వీటిని చర్చించిన దాఖలాలు లేవు. 3 దశాబ్దాలలో మన ఆలోచనా ధోర ణిలో చాలా మార్పులు వచ్చాయి. సర్వీస్ అనే మాట గతంలో ఒక రకంగా స్ఫురిస్తే, ఇప్పుడు ఇంకోలా ధ్వనిస్తుంది. కంప్యూటర్లు, నెట్ వగైరా వచ్చాక సర్వీస్ అనే మాట కొత్త అర్థంతో రావడమే కాదు. ‘సర్వీస్ చార్జ్’ అనే కొత్త పదబంధం ప్రచారం లోకి వచ్చింది. ఇదివర కటి సర్వీసు అనే అర్థం నేడు కావాలంటే ‘వాలంటరీ సర్వీసు’ అనే పదబంధం వాడాలి. ఇప్పుడు మనం గాంధీజీ 150వ జయంతి సంవత్సరంలో ఉన్నాం. గాంధీజీ సహిష్ణుతమూ, సమన్వయానికీ, సాధారణ జీవితానికీ, ఒళ్లు వంచి కష్టపడటానికీ, సత్యసంధతతకూ, ప్రచా రం లేని సేవకూ ప్రతిరూపం. ఆయన ధరించిన గోచిపంచె మన ప్రాంతం నుంచి స్వీకరించినది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆయన కొల్లాయి గుడ్డ ధారణలో కూడా ఆంధ్రదేశ ప్రేరణ ఉందని చరిత్రజ్ఞులు చెబుతారు. ఒకసారి ఆయన ఆంధ్రదే శంలో పర్యటన చేస్తుం డగా, అది రాయలసీమ ప్రాంతమంటారు, బీడు వారిపోతున్న నేలలు, దైన్యమూ, దారిద్య్రమూ, అంతులేని శ్రమ పెట్టుబడులుగా జీవన వ్యాపారం చేస్తున్న కర్షకులను, కార్మికులను, పశువుల కాపరులను, ఒంటినిండా బట్ట ధరించ లేని వారిని వారి కార్యక్షేత్రాలలో చూసి ఎంతో పరితాపం పొంది నట్లూ– ఇంతటి పేదరికంతో అల మటిస్తున్న అభాగ్యులెందరో నా దేశంలో ఉండగా వాళ్లకు ప్రాతి నిధ్య సంకేతికంగా తాను మాత్రం ఒంటినిండా వస్త్రం ఎందుకు ధరిం చాలి? అని కఠోర నిర్ణయానికి ఆయన వచ్చినట్లు గాంధీజీ సన్నిహితులు రాశారు. సరే, వినియోగదారుడు వగైరా విషయం నేడు ఎలా ఉంది? అప్పులు ఇస్తాం, వస్తు వులిస్తాం, అది స్తాం, ఇదిస్తాం– అని చెవిలో ఫోన్ పోరుబెట్టి, పిమ్మట అంటగట్టి, ఇక ఆ తర్వాత చుక్కలు చూపించడం పరిపాటి. అలాగే ఒక వస్తువు కొన్న తర్వాత, ఏ చిన్న భాగం పాడయినా మోదే సర్వీసు చార్జీలు, విడి భాగాల ఖరీదూ విపరీతం. ఇటువంటి హింస ఎవరైనా, ఎంతైనా చెబుతారు నేడు. వినియోగదారుల చట్టాలు, న్యాయస్థానాలు, తీర్పులు ఎన్నో ఉన్నా పీడన మాత్రం మరింత సృజ నాత్మకంగా మారిపోతోంది. కానీ దీనికి ముందు గాంధీ చెప్పినట్టు ‘సేవలందించే వ్యక్తి ధోరణి’ మారితే తప్పా ప్రయోజనం ఉండదేమో అనిపి స్తుంది. గాంధీ జయంతి 150వ సంవత్సరం వేళ ఆయన దార్శనికత మరింత అర్ధవంతంగా కనబడు తోంది. అంతేకాదు మనం దానికి మరింత దూరమ వుతున్నామని కూడా బోధపడుతోంది. (నేడు గాంధీజీ వర్ధంతి) వ్యాసకర్త డైరెక్టర్, రీజినల్ అకాడమీ, ఆకాశవాణి, హైదరాబాద్ ‘ మొబైల్ : 94407 32392 డా‘‘ నాగసూరి వేణుగోపాల్ -
సహకార బలోపేతానికి కార్యాచరణ
న్యూఢిల్లీ: కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార బలోపేతానికి మూడేళ్ల పాటు వ్యూహాత్మక కార్యక్రమాన్ని అమలుపరచాలని భారత్, దక్షిణాఫ్రికాలు నిర్ణయించాయి. రక్షణ, వ్యాపారం, తీరప్రాంత భద్రత తదితర భిన్న రంగాల్లో సంబంధాల విస్తరణకు ఈ కొత్త ప్రయోగం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు భారత్ వచ్చిన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు, రామఫోసా స్పందిస్తూ..వ్యూహాత్మక కార్యక్రమాన్ని వెంటనే అమల్లోకి తేవాలని రెండు దేశాల మంత్రులు, అధికారులను ఆదేశించామని తెలిపారు. దక్షిణాఫ్రికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని, గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఇరు దేశాలు నైపుణ్యాభివృద్ధిలోనూ కలసిపనిచేస్తున్నాయి. -
భారత ‘ఎ’ జట్టులో విహారి, సిరాజ్, భరత్
న్యూఢిల్లీ: వచ్చే నెలలో దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగనున్న రెండు అనధికారిక టెస్టుల్లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును జాతీయ సెలెక్టర్లు సోమవారం కోల్‌కతాలో ప్రకటించారు. ఆగస్టు 4 నుంచి బెల్గామ్, 10 నుంచి బెంగళూరులో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబై బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనున్న ‘ఎ’ జట్టులో హైదరాబాద్ ప్లేయర్ సిరాజ్, ఆంధ్ర ఆటగాళ్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్‌లకు చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ కోహ్లి సూచన మేరకు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను ఎంపిక చేశారు. ఆగస్టు 17 నుంచి విజయవాడ వేదికగా దక్షిణాఫ్రికా ‘ఎ’, ఆస్ట్రేలియా ‘ఎ’లతో జరిగే నాలుగు జట్ల వన్డే టోర్నీలో తలపడే భారత్ ‘ఎ’ జట్టుకు అయ్యర్, ‘బి’ జట్టుకు మనీశ్ పాండే సారథ్యం వహిస్తారు. ఇక దులీప్ ట్రోఫీలో పాల్గొనే ఇండియా ‘బ్లూ’కు ఫైజ్ ఫజల్... ‘రెడ్’కు అభిమన్యు మిథున్... ‘గ్రీన్’కు పార్థివ్ పటేల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ‘రెడ్’ జట్టులో ఆంధ్ర పేసర్ ఎర్రా పృథ్వీరాజ్‌కు స్థానం దక్కింది. అయితే, డోపింగ్‌లో పట్టుబడి సెప్టెంబరు 14 వరకు నిషేధంలో ఉన్న పంజాబ్ కీపర్ అభిషేక్ గుప్తాను కూడా ‘రెడ్’కు ఎంపిక చేయడం ఆశ్చర్యపరుస్తోంది. -
రెండో టెస్టూ లంకే గెలిచింది
కొలంబో: శ్రీలంక సారథి లక్మల్. బేసిక్‌గా బౌలర్. అలాగని ఒక్క వికెట్ తీయలేదు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగినా ఒక్క పరుగు (డకౌట్) చేయ లేదు. ఫీల్డర్‌గా ఓ క్యాచ్ కూడా పట్టలేదు. ఎవర్నీ రనౌట్ చేయలేదు. కీపర్ కాదు కాబట్టి స్టంపింగ్ అవకాశమే లేదు. మొత్తానికి ఈ టెస్టు ఆడినా... అన్ని రంగాల్లో ఎక్కడా భాగస్వామ్యం కాలేదు లక్మల్. అయితేనేం అతని సారథ్యంలోనే ఈ మ్యాచ్ లంక గెలిచింది. అతని చేతులతో సిరీస్‌ను తలకెత్తుకుంది. క్రికెట్లో ఏదైనా సాధ్యమే అన్నట్టు... ఇది కూడా సాధ్యమైందిపుడు!! దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ శ్రీలంక జట్టు 199 పరుగుల తేడాతో గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. 490 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు 139/5 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవా రం ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 290 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బ్రుయిన్ (101; 12 ఫోర్లు) సెంచరీ సాధించాడు. ఇతనికి బవుమా (63; 4 ఫోర్లు) సహకారం అందించాడు. ఇద్దరు ఆరో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. 236 స్కోరు వద్ద హెరాత్... బవుమాను ఔట్ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్ కూలేందుకు ఎంతోసేపు పట్టలేదు. మరో 13 ఓవర్ల వ్యవధిలో 54 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగన హెరాత్ (6/98) మరోసారి మాయాజాలం చేసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ పతనాన్ని శాసిం చాడు. హెరాత్‌కు మరో ఇద్దరు స్పిన్నర్లు దిల్రువాన్ పెరీరా (2/90), అఖిల ధనుంజయ (2/67) సహకారం అందించారు. ఫలితంగా దక్షిణాఫ్రికా కోల్పోయిన 10 వికెట్లూ స్పిన్నర్ల ఖాతాలోకే వెళ్లాయి. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 338, దక్షిణాఫ్రికా 124 పరుగులు చేశాయి. 214 పరుగుల ఆధిక్యం పొందిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను 275/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. -
లంక స్పిన్‌కు దక్షిణాఫ్రికా దాసోహం
గాలె: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో శ్రీలంక అద్భుతం చేసింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 278 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లంక స్పిన్ ఉచ్చులో చిక్కిన సఫారీ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడం అటు ఉంచితే వికెట్ కాపాడుకోవడానికి విలవిల్లాడారు. 352 పరుగుల లక్ష్యంతో శనివారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా... ఆఫ్ స్పిన్నర్ దిల్రువాన్ పెరీరా (6/32), వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ (3/38) ధాటికి బెంబేలెత్తి 73 పరుగులకే ఆలౌటైంది. ఫిలాండర్ (22 నాటౌట్) టాప్ స్కోరర్. ఈ స్పిన్ జోడీ ధాటికి కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. 1991లో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం తర్వాత దక్షిణాఫ్రికాకు ఒక ఇన్నింగ్స్‌లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అంతకుముందు 111/4తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక 190 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూస్ (35; 1 ఫోర్, 1 సిక్స్), లక్మల్ (33 నాటౌట్; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో మహరాజ్ 4, రబడ 3 వికెట్లు పడగొట్టారు. దిముత్ కరుణరత్నేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి కొలంబోలో రెండో టెస్టు జరుగనుంది. ►73 పునరాగమనం అనంతరం ఒక ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు అత్యల్ప స్కోరు. గతంలో 79 (భారత్‌పై 2015లో). ►రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి దక్షిణాఫ్రికా జట్టు చేసిన మొత్తం పరుగులు 199. శ్రీలంక ఓపెనర్ కరుణరత్నే ఒక్కడే రెండు ఇన్నింగ్స్‌లలో 218 పరుగులు చేయడం విశేషం. -
మహా పోరాటయోధుడు
‘ఒక వ్యక్తికి ఉన్న జీవించే హక్కును హరిస్తే అతడు తిరుగుబాటుదారుడు కాక తప్పదు’ అంటారు నెల్సన్ మండేలా. నిజమే. అణచివేత కలకాలం సాగదు. అణచివేత పెరిగే కొలదీ నియంతల అహంకారం పతనమయ్యే క్షణాలు సమీపిస్తున్నట్టే. ఇదే ప్రపంచ దేశాల చరిత్రలో కనిపిస్తుంది. అయితే అందుకు సాగిన ఉద్యమాల స్వరూపాలు వేరు. పోరాటాల స్వభావాలు వేరు. వాటికి నాయకత్వం వహించిన నేతల పంథాలు వేరు. నెల్సన్ మండేలా అనే మహా పోరాటయోధుడు కూడా అందులో ఒకరు. తన జాతి స్వేచ్ఛ కోసం 27 ఏళ్లు ఆయన తన స్వేచ్ఛను జైలు గోడలకు బలిచేసుకున్నాడు. దక్షిణాఫ్రికా ఆధునిక ప్రపంచ చరిత్రలో వివక్షకూ, నిరంకుశత్వానికీ చిరునామాగా కనిపిస్తుంది. ఈ దేశం పేరుతో భారతీయులకు కూడా చిరపరిచయమే ఉంది. ఆ దేశంతో, భారతీయులు జాతిపితగా పిలుచుకునే మహాత్మా గాం«ధీ అక్కడ జరిపిన హక్కుల పోరాట చరిత్రతో భారతీయుల పరిచయం ఉద్వేగ భరితమైనది. నల్లజాతీయులు (అక్కడి శ్వేతజాతి ప్రభుత్వం దృష్టిలో నల్లవారే కాదు, భారతీయుల కూడా నల్లవారి కిందే లెక్క) జుట్టు పెంచినా పన్ను కట్టించుకున్న దేశమది. పెళ్లి కూడా ఒక మత సంప్రదాయం మేరకే జరగాలన్న వ్యవస్థ అది. ఫస్ట్‌క్లాస్ టిక్కెట్‌తో రైలు ఎక్కినా నల్లజాతీయుడు కాబట్టి గాంధీజీని రైలు బోగీ నుంచి కిందకు నెట్టివేసిన అధికార మదం ఆనాటి ఆ దేశ ప్రభుత్వానిది. అలాంటి చోట జాతి వివక్ష ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న శ్వేతజాతిని నెల్సన్ మండేలా తల వంచేటట్టు చేయగలిగారు. నెల్సన్ మండేలా (జూలై 18,1918– డిసెంబర్ 5,2013)కూ, గాంధీజీకీ కొన్ని విషయాలలో సామ్యాలు కనిపిస్తాయి. అహింసా పద్ధతులతో నిరంకుశత్వాన్ని మెట్టు దిగేటట్టు చేయవచ్చునని గాంధీజీ విశ్వాసం. శాసనోల్లంఘన ద్వారా ఎలాంటి ప్రభుత్వాలనైనా కదిలించవచ్చునని ఆయన అనుభవం. నెల్సన్ మండేలా ఉద్యమ తొలి దశ కూడా అలాగే మొదలైంది. అహింస ద్వారా, శాసనోల్లంఘన ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముందు తలొగ్గేటట్టు చేయవచ్చునని ఆయన అనుకున్నారు. కానీ ఆయన శాంతియుత పంథాను విడిచిపెట్టి సాయుథ పథం వైపు నడవక తప్పని పరిస్థితులు తలెత్తాయి. మహాత్ముడి ఉద్యమానికీ, మండేలా ఉద్యమానికి మధ్య కాలం తన లక్షణాన్ని అంతగా మార్చుకుందేమోమరి! మండేలా రాజకీయాలు, ఉద్యమం, ప్రస్థానం గురించి చెప్పుకునే ముందు ఆయన గత చరిత్రను స్మరించుకోవాలి. ఆయనను ఉద్యమకారునిగా మారడం వెనుక వాస్తవాలు అందులోనే ఉన్నాయి. అదొక దేశ చరిత్ర. ఒక జాతి బాధల గాథ. అందులో ఆగ్రహం, ఆవేశాల కథ. ఇలాంటి వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడం లాంఛనం అని చెప్పలేం కూడా. అదొక చారిత్రక అవసరం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్న కాలమది. కానీ ఆ యుద్ధం తెచ్చిన విపత్తులతో, కరువు కాటకాలతో ప్రపంచం కొత్త యుద్ధం ప్రారంభిస్తున్న కాలం. కానీ ఆ యుద్ధం కొన్ని గణనీయ మార్పులు తెచ్చింది. నాలుగు నియంతృత్వాలు కుప్పకూలాయి. జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, రష్యా నియంతలు పతనమయ్యారు. కొత్త రాజకీయ తాత్వికతలు బలం పుంజుకున్నాయి. రాజకీయాలు వేడెక్కాయి. రాడికల్ భావాలు పదునెక్కాయి. కానీ శ్వేతజాతి అధీనంలో, లేదా శ్వేతజాతి నల్లబంటుల చేతిలో ఉన్న దక్షిణాఫ్రికా మాత్రం మార్పునకు నోచుకోలేదు. బహుశా మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్ విజయం అందుకు అవకాశం ఇచ్చి ఉండవచ్చు. కానీ యుద్ధం ఆరంభం కావడానికి ముందే గాంధీజీ ఆ దేశంలో రాజకీయ చైతన్యానికీ, హక్కుల స్పృహకూ అంకురార్పణ చేశారు. ఇదంతా జరిగిన దాదాపు రెండు దశాబ్దాల తరువాత దక్షిణాఫ్రికా రాజకీయ వాతావరణం మీద ఉన్న అసంతృప్తి కొత్త మలుపు తీసుకుంది. ఆగ్రహంగా, ఆవేశంగా ఆ అసంతృప్తి రూపు దాలుస్తున్న సమయంలో మండేలా జన్మించారు. నెల్సన్ మండేలా అసలు పేరు నెల్సన్ రోలిలాహ్లా మండేలా. మాడిబా ఆయన ముద్దుపేరు. థెంబు తెగ. కేప్ పరిధిలోని ఉటాటా అనే ప్రాంతంలో మెజో అనే ఊళ్లో ఆయన జన్మించారు. మాట్లాడే భాష హోసా. కానీ చదువుకు సుదూరంగా ఉండిపోయిన తెగలలో అదొకటి. తండ్రి గాడ్లా హెన్రీ. బహుభార్యాత్వం ఉన్న ఆ తెగలో గాడ్లా నాలుగు వివాహాలు చేసుకున్నాడు. వారిలో మూడవ భార్య కుమారుడు నెల్సన్. గాడ్లా థెంబు తెగకు అధిపతి. ఆ తెగ నుంచి మొదటిసారి పాఠశాలలో చేరిన వాడు నెల్సన్ మండేలాయే. అక్కడే క్రైస్తవ ఉపాధ్యాయురాలు ‘నెల్సన్’ అన్న అక్షరాలను అతడి తెగ ఇచ్చిన పేరులో చేర్చింది. అలా ఎందుకు జరిగిందో తనకు మాత్రం తెలియదని మండేలా ‘లాంగ్ వాక్ టు ఫ్రీడమ్’ పుస్తకంలో చెప్పుకున్నారు. తరువాత ఉన్నత చదువుల కోసం ఆయన పెద్ద త్యాగం, సాహసం చేయవలసి వచ్చింది. వారి ఆచారం మేరకు తెగ ఆధిపత్యాన్ని త్యజించిన తరువాత మాత్రమే నెల్సన్‌కు ఉన్నత చదువులకు వెళ్లడానికి అవకాశం చిక్కింది. విట్వాటర్సాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు నెల్సన్. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయాలు మొదలయ్యాయి. నల్లజాతీయుల విముక్తికోసం అప్పటికే ఉద్యమిస్తున్న ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో మండేలా సభ్యుడయ్యారు. ఆ వెంటనే, అంటే 1944లో ఆ సంస్థ యువజన శాఖకు నాయకుడయ్యారు. చదువు పూర్తి చేసి న్యాయవాదిగా నల్లజాతీయుల కోసం సలహాలు ఇచ్చేందుకు మొదట ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు (నిజానికి గాంధీజీ చేసిన పని కూడా ఇదే. దక్షిణాఫ్రికా ప్రభుత్వం నుంచి హక్కులు సాధించేందుకు నల్లజాతీయులను, భారతీయులను ఏకం చేయడానికి ముందు గాంధీజీ అక్కడ న్యాయసలహాదారుగానే పనిచేశారు). తన మండేలా బాల్యమిత్రుడు, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడు అలీవర్ టాంబో సంఘం ఏర్పాటులో సహకరించారు. 1948 తరువాత జాతి వివక్ష ప్రభుత్వం రుద్దిన చట్టాలతో సర్వం కోల్పోయిన వారికి న్యాయ సహాయం చేయడమే వీరి ఉద్దేశం. దీనితో పాటు ఇలాంటి చట్టాల గురించి నల్లజాతీయులలో అవగాహన కల్పించడానికి దేశమంతా తిరుగుతూ ఉండేవారు. 1948లో జరిగిన ఎన్నికలు నల్లజాతీయుల ఆగ్రహాన్ని మరింత పెంచాయి. అప్పుడు అధికారంలోకి వచ్చిన నేషనల్‌పార్టీ ప్రభుత్వం నల్లజాతీయుల హక్కులకు మరింతగా ఆటంకాలు కల్పించడం ఆరంభించింది. అప్పటిదాకా జరిగిన పోరాటాలు వ్యర్థమైపోయే సూచనలు కనిపించాయి. అల్పసంఖ్యాక శ్వేత జాతి ప్రభుత్వం మరింత బలపడే విధంగా చర్యలు మొదలయినాయి. పైగా నల్లజాతీయులకు పూర్తి స్థాయి పౌరసత్వం కల్పించాలంటూ అఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమం కూడా ఊపందుకుంటున్న కాలం. అందుకోసం అహింసా పద్ధతులలో సమ్మెలు, బాయ్కాట్లు, శాసనోల్లంఘన జరుగుతోంది. అప్పుడే మండేలా ప్రభుత్వం దృష్టిలో పడ్డారు. నిజానికి నల్లజాతీయుల స్వేచ్ఛ కోసం 1955లో అక్షరబద్ధమైన ‘ఫ్రీడమ్ చార్టర్’ రచనలో కూడా మండేలాదే కీలక పాత్ర. ఆ హక్కుల పత్రాన్ని అప్పటి ప్రభుత్వం నిషేధించింది. అందుకే ప్రభుత్వం ఆయన మీద మరింతగా దృష్టి కేంద్రీకరించింది. మండేలాను వెంటాడడం మొదలయింది. నిఘా విస్తరించింది. డిసెంబర్ 5,1956న మండేలా సహా, 155 మంది ఉద్యమకారులను శ్వేతజాతి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆరోపణ – దేశద్రోహం. ఈ కేసును 1961లో న్యాయస్థానం కొట్టివేసింది. కానీ ఒక దశలో మండేలా సహా పలువురికి మరణశిక్ష పడవచ్చునని అంతా భయపడ్డారు. ఇది జరగడానికి ముందే మరో దారుణం జరిగింది. దానిపేరే షార్ప్‌విల్లే హత్యాకాండ. మార్చి 21, 1960న ఆ దుర్ఘటన జరిగింది. నల్లజాతి యువకులను మరింత వేధించడానికీ, వారి జీవించే హక్కును మరింత పరిమితం చేయడానికీ జాత్యహంకార ప్రభుత్వం అంతకు ముందే ఒక చట్టం తెచ్చింది. దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పట్టణాలకు వచ్చే నల్లజాతీయులు వారి వివరాలను తెలిపే పత్రాలను తప్పనిసరిగా ఉంచుకోవాలి. 16 సంవత్సరాలు దాటిన ప్రతి నల్లవానికి ఇది అనివార్యం. తరువాత నల్లజాతి మహిళలకు కూడా ఈ చట్టాన్ని వర్తింపచేశారు. అంటే పట్టణాలకు వారి వలసను నిరోధించడమే ఈ చట్టం ఉద్దేశం. ఇలాంటి పత్రాలు లేవంటూ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సంస్థ సభ్యులని, పాన్ ఆఫ్రికన్ ఆఫ్రికనిస్టు కాంగ్రెస్ సభ్యులను వేధించేవారు (పాన్ ఆఫ్రికనిస్టు కాంగ్రెస్ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌లో చీలిక వర్గం). అప్పటి నేషనల్‌పార్టీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అధినేత డాక్టర్ హెన్రిక్ వెర్వోర్డ్ ఇందుకు బాధ్యులు. ఈ చర్యకు నిరసనగా శాంతియుతంగా ఉద్యమం చేయాలని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. నిజానికి ఆ మార్చి 31న నిరసనలు చేపట్టాలని ఆ సంస్థ ఉద్దేశం. కానీ పాన్ ఆఫ్రికనిస్టులు మార్చి 21న నిరసన జరపాలని నిర్ణయించారు. దేశమంతా ఉద్యమం జరిగినా, షార్ప్‌విల్లే దురాగతం మాత్రం (ట్రాన్స్‌వాల్ దగ్గరలోనిది. ఇది కూడా ఆనాటి గాంధీజీ ఉద్యమ క్షేత్రాలలో ఒకటి) ఘోరమైనది. ఏడు నుంచి పదివేల మంది వరకు ఉద్యమకారులు షార్ప్‌విల్లే పోలీసు స్టేషన్‌ను ముట్టడించాలని వచ్చారు. వారి నినాదం ఒక్కటే– ‘మా దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. మమ్మల్ని వెంటనే అరెస్టు చేయండి!’ ఉద్యమం శాంతియుతంగా జరుగుతూ ఉండగా పోలీసులే రెచ్చగొట్టి కాల్పులు జరిపారని ఉద్యమకారుల ఆరోపణ. ఉద్యమకారులే హింసకు దిగారని పోలీసుల వాదన. ఏమైనా కాల్పులలో 69 మంది చనిపోయారు. 29 మంది చిన్నారులు సహా 260 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉదంతమే చాలామంది నల్లజాతీయులకు శాంతియుత పంథా మీద నమ్మకం పోయేలా చేసింది. ఈ దుర్ఘటన దక్షిణాఫ్రికా నల్లజాతీయుల మనసులను ఎంతగా గాయపరిచిందంటే, ఆ రక్తపంకిల చరిత్రను నేటికీ మార్చి 21న దేశమంతా స్మరించుకుంటుంది. ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది. షార్ప్‌విల్లే హింసాకాండతో మండేలా కూడా తన అహింసా సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. 1961లో ఏర్పడిన ఉఖంటో వి సిజ్వే (జాతి చేతిలోని బల్లెం) లేదా ‘ఎమ్ కె’ అనే సంస్థలో ఆయన సభ్యుడయ్యారు. నిజానికి ఇది ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌తో ఎడబాటు కాదు. ఎమ్ కె కూడా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌కు అనుబంధంగా పనిచేసే సాయుధ పోరాట సంస్థ. గెరిల్లా పోరాట పంథాలో జాత్యహంకార ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం దీని ఉద్దేశం. ఇందుకోసమే ఆయన అల్జీరియా వెళ్లి కొద్దికాలం గెరిల్లా యుద్ధతంత్రంలో శిక్షణ పొంది వచ్చారు. కానీ అక్కడ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆగస్ట్ 5, 1962న మండేలాను జాత్యహంకార ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆ రోజే బయటి ప్రపంచంతో ఆయన బంధం తెగిపోయింది. మళ్లీ ఆయన వెలుగు చూడడానికి 27 ఏళ్లు పట్టింది. విచారణ తరువాత మండేలాను జూన్ 12, 1964న కేప్‌టౌన్‌కు సమీపంలోని రూబెన్స్ ఐలెండ్ జైలుకు తరలించారు. ఇందులో ఆయన ఏకాంత ఖైదీ. భార్య విన్నీ మండేలాను తప్ప వేరెవరినీ ఆయనను కలుసుకోవడానికి అనుమతించలేదు. ఖైదీ నం. 46664 ముద్రతో రాళ్లు కొట్టారు. కానీ ఆ రాళ్లతో పాటు జాత్యహంకార ప్రభుత్వ ఆధిపత్యం కూడా చితికిపోతూ వచ్చిందన్నది వాస్తవం. మండేలా స్వస్థలం ట్రాన్స్కెయికి పరిమితమైతే విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రతిపాదన పంపించింది. అందుకు మండేలా సమాధానం, ‘జాతి వివక్ష ఎన్ని రూపాల్లో ఉన్నప్పటికీ దాని అన్ని రూపాలను కూడా నేను తీవ్రంగా ద్వేషిస్తున్నాను. దీని మీద తుది వరకు పోరాడతాను.’ 1973 నుంచి 1988 వరకు కూడా ఇలాంటి ప్రతిపాదనను అంగీకరించమని ప్రభుత్వం మండేలాను బలవంత పెడుతూనే ఉండేది. మధ్యలో మాట మార్చి హింసను వీడితే విడుదల గురించి ఆలోచిస్తామని కూడా 1985లో మరో ప్రతిపాదన పంపించింది. దీనిని కూడా ఆయన అంగీకరించలేదు. ఆయన రూపం మారిపోయింది. ఆరోగ్యం క్షీణించింది. అవేమీ బయట ప్రపంచానికి తెలియకుండానే 18 ఏళ్లు గడచిపోయాయి. 1988లో క్షయ వ్యాధి సోకింది. అప్పెడు విక్టర్ వెర్సటర్ జైలుకు తరలించారు. మధ్యలో మళ్లీ పోల్స్మూర్ జైలులో కొన్నాళ్లు ఉంచారు. 1980 నాటికి ప్రపంచంలో మండేలా విడుదలకు ఉద్యమం ప్రారంభమైంది. కానీ జాత్యహంకార ప్రభుత్వం వాటిని చెవిన పెట్టలేదు. కానీ 1990 నాటికి అధ్యక్షుడు బోథా అధ్యాయం ముగిసింది. జాత్యహంకార ప్రభుత్వం వాస్తవాలను గుర్తించక తప్పని వాతావరణంలో బోథాకు ఎఫ్ డబ్లు్య డీక్లార్క్ వారసునిగా అధ్యక్ష స్థానంలోకి వచ్చాడు. ఇతడు కొన్ని వాస్తవాలను గమనించాడని చెప్పక తప్పదు. అంతర్జాతీయ ఒత్తిడి ఎక్కువయింది. అంతర్యుద్ధ భయం పెరిగింది. దీనితో చర్చలు జరిపి మొత్తానికి మండేలాను విడుదల చేయడమే కాకుండా నల్లజాతీయులకు అధికారం అప్పగించడానికి కూడా అంగీకరించాడు డీక్లార్క్. అలా ప్రపంచం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మండేలా విడుదల సాధ్యమైంది. ఫిబ్రవరి 11, 1990 ఆయన జైలు నుంచి విముక్తి పొందారు. అంతకాలం దాదాపు రెండు దశాబ్దాల పాటు మండేలా అంటే ఒక్క ఫొటోను బట్టే తెలిసేది. కానీ ఆయన బయటకు వచ్చే సమయానికి ఆ రూపమే వేరు. పుట్టుకతోనే మనిషిలో ద్వేషించే గుణం ఉండదని అంటారు మండేలా. అది ఆయన ఔన్నత్యానికి నిదర్శనం. అందుకే రంగు ఏదైనా అందరికీ స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఉండాలన్నదే నా ఆకాంక్ష అన్నారాయన. ఇది ఆయన దక్షిణాఫ్రికాకు అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత అన్న మాట అనుకుంటే పొరపాటు. ఆయన జైలులో మగ్గుతున్నప్పటికీ కూడా అలాంటి మాట ఆయన హృదయం పలకగలిగింది. అందుకే మండేలా మహోన్నతుడయ్యాడు. అమెరికా ఆయన మీద ఉగ్రవాది ముద్ర వేసింది. కానీ ప్రపంచం ఆ ముద్రను పట్టించుకోలేదు. ఒక పోరాట యోధునిగా, హక్కుల ఉద్యమానికి నిలువెత్తు ఆదర్శంగా గౌరవించింది. మండేలా 1994–1999 మధ్య దక్షిణాఫ్రికా అధ్యక్షునిగా పనిచేశారు. దేశంలోని నలుపు తెలుపు వర్ణాల మధ్య అంతరాలను నిర్మూలించడానికి ఆ కొద్దికాలంలోనే ఆయన కృషి చేశారు. వారి మనసుల మధ్య ఇంద్రచాపం వంటి వారథి నిర్మించడానికి తపన పడ్డారు. రగ్బీ తెల్లజాతి క్రీడ కాబట్టి దానిని దూరంగా ఉంచాలని ఉద్యమకాలంలో కొందరు గట్టిగా అభిప్రాయపడ్డారు. దానిని చాలాకాలం అమలు చేశారు. కానీ ఆ క్రీడను తిరిగి ఆడమని అందరినీ ఆయన ప్రోత్సహించాడు. సయోధ్యకు మండేలా అనుసరించిన వ్యూహం ఇంత సున్నితంగా ఉంది. దక్షిణాఫ్రికాకు ఆయన అధ్యక్షుడైన తరువాతే తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వెనుకబాటు తెచ్చిన అనారోగ్యంతో బాధపడుతున్న తన వారి కోసం 500 ఆస్పత్రులు నిర్మించాడాయన. 15 లక్షల మంది బాలలను బడికి పంపించాడు. చిరకాలం బానిసత్వంతో మగ్గిన ఒక జాతిని పునరుజ్జీవింప చేయడానికి ఆయన చేసిన కృషి మండేలాలోని పరిపాలకుడిని, ద్రష్టనే కాకుండా ఆయనలోని నిజమైన రాజనీతిజ్ఞుడిని ఆధునిక ప్రపంచం ఎదుట ఆవిష్కరించింది. పదవి నుంచి దిగిపోయిన తరువాత మండేలా సేవారంగాన్ని ఎంచుకున్నారు. ఆయన కుమారుడు ఎయిడ్స్ వ్యాధితో మరణించాడు. అతడి జ్ఞాపకార్థం ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన పనిని చేపట్టారు మండేలా. భార్య విన్నీ మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమెతో విడిపోయారు. తాను ఒక జాతి స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడిన మాట నిజమే అయినా, తనకూ కొన్ని బలహీనతలు ఉన్నాయని, కాబట్టి తనను మనిషిగానే చూడాలని ఆయన సవినయంగా మనవి చేశారు. జీవితాన్ని తెరచిన పుస్తకంలా ప్రపంచం ఎదుట ఇలా ఉంచిన నేతలు నిజంగానే అరుదు. - డా. గోపరాజు నారాయణరావు -
ఆ నేతల్ని అందించిన ఘనత మనది
పీటర్‌మారిట్జ్‌బర్గ్: గొప్ప నాయకుల్ని అందించినందుకు భారత్, దక్షిణాఫ్రికాల్ని ప్రపంచం గౌరవిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో గాంధీజీని రైల్లోంచి తోసేసిన సంఘటనకు 125 ఏళ్లు పూర్తైన సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్యాయానికి, వివక్షకు గురైన ప్రజల్లో నమ్మకం నింపేందుకు గాంధీజీ, నెల్సన్ మండేలాలు పోషించిన పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ‘మన నుంచి ప్రపంచం ఎంతో లాభపడింది. గొప్ప నాయకుల్ని అందించినందుకు ప్రపంచం గౌరవిస్తోంది. బానిస ప్రజల్లో గాంధీజీ, మండేలా ఆశను ఉదయింపచేశారు. వలస బానిసత్వం నుంచి విముక్తి కల్పించడం ద్వారా భారత్, ఆఫ్రికా దేశాలకు నమ్మకం కలిగించారు’ అని సుష్మా స్వరాజ్ చెప్పారు. 25 ఏళ్ల క్రితం పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మండేలా మాట్లాడిన అంశాల్ని ఆమె ప్రస్తావించారు. అలాగే వర్ణవివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికా జరిపిన పోరుకు భారత్ అందించిన మద్దతును గుర్తుచేశారు. అంతకుముందు పెంట్రిక్ నుంచి పీటర్‌మారిట్జ్‌బర్గ్‌కు రైలులో ప్రయాణించారు. ఐదురోజుల పర్యటన నిమిత్తం దక్షిణాఫ్రికాలో ఉన్న సుష్మా స్వరాజ్ మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే మహాత్మాగాంధీ డిజిటల్ మ్యూజియంను ప్రారంభిచారు. ‘ద బర్త్ ఆఫ్ సత్యాగ్రహ’ అనే కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో పాటు.. దక్షిణాఫ్రికా డిప్యూటీ విదేశాంగ మంత్రి లాండర్స్‌తో కలిసి పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ, వర్ణవివక్షతపై పోరాడిన ప్రముఖ నేత ఒలివర్ టాంబోల పోస్టల్ స్టాంపుల్ని విడుదల చేశారు. -
ఏబీ ప్రపంచకప్ వరకు కొనసాగాల్సింది
-
అతని నిర్ణయంతో షాకయ్యా: దక్షిణాఫ్రికా కోచ్
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అనూహ్య రిటైర్మెంట్పై క్రికెట్ ప్రపంచం మొత్తం విస్తుపోయింది. మైదానంలోని తన ప్రత్యేకమైన ఆటతో ఏబీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. అయితే ఏబీ అనూహ్య నిర్ణయంతో తాను షాక్‌కు గరైనట్లు దక్షిణాఫ్రికా కోచ్ ఒటిస్ గిబ్సన్ తెలిపాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏబీ ప్రకటనతో షాకయ్యా. ఏబీ రిటైర్మెంట్ ప్రకటించే ఉదయం నన్ను పిలిచి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పె యోచనలో ఉన్నట్లు తెలిపాడు. నేను నిజంగా ఆలోచించే మాట్లాడుతున్నావా? నీవు చేసేది సరైనదేనా అని ప్రశ్నించా. అతను అలసిపోయానని తెలిపాడు. కానీ ఇంతలోనే అతని నిర్ణయాన్ని ప్రకంటించాడు. దీంతో తీవ్ర నిరాశకు గురయ్యా. ఏబీ గొప్ప బ్యాట్స్‌మన్. అతని నిర్ణయం అభిమానులను, దేశప్రజలను నిరాశపరిచింది. ఐపీఎల్లో అతని స్పైడర్‌మన్ క్యాచ్‌లు చూసి క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాడని అనుకున్నాం. కానీ ఇలా క్రికెట్ దూరం అవుతాడని ఊహించలేదు. టెస్టు మ్యాచ్‌లు అతని ఇష్టం.. ప్రపంచకప్ దృష్ట్యా కనీసం వన్డేలోనైనా కోనసాగాల్సింది. నిర్ణయం తీసుకోకముందే అతనితో ఈ విషయంపై మాట్లాడల్సింది. ఏబీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే అతన్ని మార్చడం చాలా కష్టం.’ అని గిబ్సన్ చెప్పుకొచ్చాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తక్షణమే వైదొలుగుతున్నట్లు ఏబీ ట్వీటర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలసిపోయినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న మిస్టర్ 360.. 2004 డిసెంబరు 17న ఇంగ్లండ్‌పై తాను టెస్టు అరంగేట్రం చేసిన పోర్ట్ ఎలిజబెత్ మైదానం నేపథ్యంలో చిత్రీకరించిన ‘రిటైర్మెంట్ వీడియో’ సందేశాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. చదవండి: ‘ఏబీ’భత్సానికి బ్రేక్