టీ20 ప్రపంచకప్‌లో ముచ్చటగా మూడోసారి సెమీ ఫైనల్ చేరిన దక్షి ణాఫ్రికా.. ఈసారి గతంలో మాదిరి పొరపాట్లకు తావివ్వకూడదని పట్టుదలగా ఉంది. 2009, 2014లలో సెమీస్‌లోనే వెనుదిరిగి అపఖ్యాతిని మూటగట్టుకున్న ప్రొటిస్ జట్టు.. ఎలాగైనా ఫైనల్ చేరాలని పట్టుదలగా ఉంది.
దర్జాగా సెమీస్‌లో
కాగా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తమ జోరు ప్రదర్శించిన విషయం తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మూడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టింది. సూపర్–8 దశలో ఆడిన మూడూ గెలిచిన సఫారీ 6 పాయింట్ల తో గ్రూప్–2 టాపర్‌గా, 4 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో జట్టుగా సెమీఫైనల్స్‌కు చేరాయి.
మరోవైపు రెండుసార్లు టీ20 చాంపియన్, ఆతిథ్య వెస్టిండీస్ కథ ‘సూపర్–8’లోనే ముగిసింది. ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులే చేసింది. కైల్ మేయర్స్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోస్టన్ చేజ్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.
వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయం
రోవ్‌మన్ పావెల్ (1), రూథర్‌ఫోర్డ్ (0), రసెల్ (15) చేతులెత్తేయడంతో కరీబియన్ జట్టు ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తబ్రేజ్ షమ్సీ 3 వికెట్లు తీశాడు. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసిన దశలో వర్షంతో 50 నిమిషాలు ఆటకు అంతరాయం కలిగింది.
దాంతో దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్ణయించారు. ఆ జట్టు 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి నెగ్గింది. స్టబ్స్ (27 బంతుల్లో 29; 4 ఫోర్లు), క్లాసెన్ (10 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్), జాన్సెన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) లక్ష్యంవైపు తీసుకెళ్లారు. ఛేజ్ 3, రసెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు.
రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీ
ఇక ఈ విజయంతో టోర్నీలో ముందుకు సాగే అవకాశం దక్కించుకున్న సౌతాఫ్రికా.. గురువారం నాటి తొలి సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌తో తలపడనుంది. ఊహించని రీతిలో బంగ్లాదేశ్‌ను ఓడించి తొలిసారి వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరిన రషీద్ ఖాన్ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియం ఇందుకు వేదిక.
అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదే
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి సౌతాఫ్రికా అద్బుతంగా ఆడిందన్న ఈ కంగారూ క్రికెటర్.. రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్‌తో పాటు స్పిన్ దళం మ్యాజిక్ చేసిందని కొనియాడాడు.
ముఖ్యంగా హెండ్రిక్స్ సూపర్‌గా ఆడుతున్నాడని.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడు అదరగొట్టి ఫైనల్‌కు చేర్చుతాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ నైపుణ్యాలు అమోఘమన్న బ్రాడ్ హాగ్.. ప్రొటిస్ జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా ఉందన్నాడు.
సౌతాఫ్రికా సెమీస్‌లో గనుక అఫ్గనిస్తాన్‌ను ఓడిస్తే ఈసారి టైటిల్ వాళ్లదేనంటూ బ్రాడ్ హాగ్ జోస్యం చెప్పాడు. కాగా తొలి సెమీస్‌లో సౌతాఫ్రికా- బంగ్లాదేశ్ తలపడనుండగా.. రెండో సెమీస్ ఫైనల్లో టీమిండియా- ఇంగ్లండ్ తాడోపేడో తేల్చుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment