టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. లీగ్, సూపర్-8 దశలో ఓటమన్నదే ఎరుగక రోహిత్ సేన సెమీ ఫైనల్ చేరుకుంది. కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో ఫైనల్‌లో అడుగుపెట్టేందుకు.. ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
సెయింట్ లూసియా వేదికగా గురువారం(జూన్ 27) ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023లోనే రోహిత్ ట్రోఫీ గెలవాల్సిందని.. ఈసారి కూడా టీమిండియాకే గెలిచే అర్హత ఉందని పేర్కొన్నాడు.
‘‘ఇండియా అద్భుతంగా ఆడింది. ఇది మీ వరల్డ్‌కప్. ఈసారి మీరు కచ్చితంగా గెలవాలి. ఉపఖండంలోనే ప్రపంచకప్ ట్రోఫీ ఉండాలి.
ఇటీవలే మంచి ఛాన్స్ మిస్ అయ్యారు. ఈసారి మాత్రం వందకు వంద శాతం మీకే టైటిల్ గెలిచే అర్హత ఉంది. నా పూర్తి మద్దతు మీకే. రోహిత్ వ్యూహాలు బాగున్నాయి. ట్రోఫీ గెలిచేందుకు అతడు అర్హుడు.
వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా సారి బదులు తీర్చుకుంది. డిప్రెషన్ నుంచి బయటపడి ప్రత్యర్థిని సరైన సమయంలో దెబ్బకొట్టింది’’ అని షోయబ్ అక్తర్ భారత క్రికెట్ జట్టును ఆకాశానికెత్తాడు.
కాగా సూపర్-8లో భాగంగా ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్(41 బంతుల్లో 92)తో జట్టుకు విజయం అందించాడు.
మరోవైపు.. దాయాది పాకిస్తాన్ మాత్రం గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్-ఏలో అమెరికా, టీమిండియా చేతిలో ఓడిపోయి.. సూపర్-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో బాబర్ ఆజం బృందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
India's perfect revenge on a big stage pic.twitter.com/bcuK19Bbzz
— Shoaib Akhtar (@shoaib100mph) June 24, 2024
Comments
Please login to add a commentAdd a comment