Shoaib Akhtar
-
ఆసీస్‌నూ వదలకండి: అఫ్గన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్(Afghanistan vs England)తో మ్యాచ్‌లో హష్మతుల్లా బృందం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుందని.. ఇదే జోరులో ఆస్ట్రేలియాను కూడా ఓడించాలని ఆకాంక్షించాడు. అఫ్గన్ ఆటగాళ్లను చూస్తుంటే ముచ్చటేస్తుందని... దేశం మొత్తాన్ని గర్వించేలా చేశారని కొనియాడాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా అఫ్గనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లతో కలిసి గ్రూప్-‘బి’లో ఉంది. ఈ క్రమంలో తమ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 107 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది అఫ్గనిస్తాన్. అయితే, తదుపరి మ్యాచ్‌లో మాత్రం అద్బుత విజయంతో సెమీస్ రేసులోకి దూసుకువచ్చింది.ఇంగ్లండ్ నిష్క్రమించగా..లాహోర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో అనూహ్య రీతిలో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఎనిమిది పరుగుల తేడాతో బట్లర్ బృందాన్ని ఓడించింది. దీంతో ఇంగ్లండ్ ఈ ఐసీసీ వన్డే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. అఫ్గనిస్తాన్ తదుపరి ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టే గ్రూప్-బి నుంచి సెమీస్ చేరబోయే జట్లు ఖరారు కానున్నాయి.మీరేం బాధపడకండి సోదరా..!ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అఫ్గనిస్తాన్ జట్టును ఆకాశానికెత్తాడు. ‘‘మీకు శుభాకాంక్షలు. మీ విజయం పట్లనాకెంతో సంతోషంగా ఉంది. గుల్బదిన్(అఫ్గనిస్తాన్ ఆల్‌రౌండర్)ను కలిసినపుడు.. ‘మీరు ఇంగ్లండ్‌ను తప్పక ఓడించాలి’ అని అతడితో అన్నాను. అప్పుడు అతడు.. ‘మీరేం బాధపడకండి సోదర.. వాళ్లను మేము అస్సలు ఉపేక్షించం.. ఓడించి తీరతాం’ అన్నాడు.ఆ తర్వాత నేను.. ‘ఆస్ట్రేలియాను కూడా మీరు ఓడించాలి’ అని కోరాను. దుబాయ్‌లో ఉన్నపుడు నేను గుల్బదిన్తో ఈ మాటలు చెప్పాను. ఏం చేసైనా ఇంగ్లండ్‌పై గెలుపొందాలని అతడికి బలంగా చెప్పాను. ఈరోజు అఫ్గనిస్తాన్ ఆ పని చేసి చూపించింది. ఆటలో ఎలా ముందుకు దూసుకువెళ్లాలో చెబుతూ గొప్ప పరిణతి కనబరిచింది.పటిష్ట జట్టును ఓడించింది. ఈరోజు మీదే. అయితే, సెమీ ఫైనల్ చేరాలనే లక్ష్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. గతంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఏం జరిగిందో గుర్తుంది కదా. ఈసారి అది పునరావృతం కాకూడదు. ఆసీస్‌నూ వదలకండినిజానికి మీరు సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లతో కూడిన కఠినమైన గ్రూపులో ఉన్నారు. అయినా, సరే ఈరోజు అత్యద్భుతంగా ఆడారు. మాకు మజానిచ్చే మ్యాచ్ అందించినందుకు ధన్యవాదాలు’’ అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఇంగ్లండ్‌ను ఓడించిన హష్మతుల్లా షాహిది బృందం.. ఈసారి కూడా వారిపై గెలుపొందింది. అయితే, నాటి టోర్నీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ విజయానికి చేరువైన సమయంలో గ్లెన్ మాక్స్వెల్ భీకర ద్విశతకంతో అఫ్గన్ నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. ఈ క్రమంలోనే అక్తర్ ఈసారి అఫ్గనిస్తాన్ మరింత జాగ్రత్తగా ఆడాలని సూచించాడు.చాంపియన్స్ ట్రోఫీ-2025: అఫ్గనిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్👉వేదిక: గడాఫీ స్టేడియం, లాహోర్👉టాస్: అఫ్గనిస్తాన్.. తొలుత బ్యాటింగ్👉అఫ్గనిస్తాన్ స్కోరు: 325/7 (50)👉ఇంగ్లండ్ స్కోరు: 317 (49.5)👉ఫలితం: ఇంగ్లండ్‌పై ఎనిమిది పరుగుల తేడాతో అఫ్గన్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఇబ్రహీం జద్రాన్(146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 177 రన్స్).చదవండి: అతడొక అద్భుతం.. క్రెడిట్ తనకే.. బాధగా ఉంది: బట్లర్ -
బాబర్ ఆజం ఒక మోసగాడు.. మొదటి నుంచి అంతే: షోయబ్ అక్తర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. దీంతో తమ సెమీస్ అవకాశాలను పాక్ జట్టు సంక్లిష్టం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో కూడా అదే ఫలితం పునరావృతమైంది. దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో పాక్ పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమైన ఆతిథ్య జట్టు ఈ ఘోర ఓటమిని మూటకట్టుకుంది.దీంతో పాక్ జట్టు ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటుంది. తాజాగా ఈ జాబితాలోకి పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ చేరాడు. ఈ మ్యాచ్‌లో విఫలమైన పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం(Babar Azam)పై విమర్శలు గుప్పించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన బాబర్ ఆట తీరును అక్తర్ తప్పుబట్టాడు."మనం ఎప్పుడూ బాబర్ ఆజంను విరాట్ కోహ్లితో పోలుస్తాం. విరాట్‌కు బాబర్‌కు చాలా వ్యత్యాసం ఉంది. కోహ్లి.. సచిన్ టెండూల్కర్‌ను రోల్‌మోడల్‌గా తీసుకుని తన కెరీర్‌ను ప్రారంభించాడు. టెండ్కూలర్ అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేశాడు. విరాట్ ఇప్పుడు అతడి వారసత్వాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు.సచిన్ సెంచరీలకు చేరువతున్నాడు. కానీ బాబర్ ఆజంకు ఎవరూ ఆదర్శం లేరు. అతడి ఆలోచిన విధానం సరిగ్గాలేదు. అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టి తన రిథమ్‌ను కోల్పోయాడు. బాబర్ ఆజం ఒక మోసగాడు. అతడు కెరీర్ ఆరంభం నుంచి సెల్ఫిష్‌గా ఉన్నాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడేందుకు నాకు ఆసక్తి లేదు" అని అక్తర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజం 23 పరుగులు చేసి ఔటయ్యాడు.విరాట్ కోహ్లి సూపర్ సెంచరీ..కాగా ఈ మ్యాచ్‌లో 242 పరుగుల టార్గెట్‌ను భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి ఆజేయ సెంచరీతో చెలరేగాడు. కోహ్లి 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(67 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56), శుబ్‌మన్ గిల్(46) పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్బర్ ఆహ్మద్, కుష్దిల్ షా తలా రెండు వికెట్లు వికెట్ సాధించారు.చదవండి: పాకిస్తాన్ మ్యాచ్‌లో హార్దిక్ ధరించిన వాచీ ధర తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..! -
CT 2025: ఆసీస్ కాదు!.. సెమీస్ చేరే జట్లు ఇవే: షోయబ్ అక్తర్
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఐసీసీ టోర్నీలో ఈసారి మూడు ఆసియా దేశాలు సెమీ ఫైనల్ చేరతాయని అంచనా వేశాడు. అదే విధంగా.. మరోసారి 2017 నాటి ఫైనలిస్టులే టైటిల్ కోసం హోరాహోరీ తలపడటం ఖాయమని జోస్యం చెప్పాడు.కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక వన్డే టోర్నమెంట్లో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్(Dubai)లోనే ఆడనుంది. రెండు గ్రూపులుఇక ఈ మెగా ఈవెంట్‌కు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ తమ ప్రదర్శన ఆధారంగా బెర్తులు ఖరారు చేసుకున్నాయి.ఆసీస్ లేదు.. మూడు ఆసియా దేశాలుఇక ఈ ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో దాయాదులు భారత్, పాకిస్తాన్‌తో పాటు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉండగా.. గ్రూప్-‘బి’లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్పాకిస్తాన్తో మాట్లాడిన పాక్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్.. సెమీస్ చేరే మూడు జట్లను అంచనా వేశాడు.‘‘చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాకిస్తాన్, ఇండియాతో పాటు అఫ్గనిస్తాన్ ఈసారి టాప్-4కు చేరుతుంది’’ అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. అయితే, నాలుగో జట్టుగా వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ఆస్ట్రేలియా ఉంటుందన్న మెజారిటీ విశ్లేషకుల అభిప్రాయాల నడుమ అక్తర్ మాత్రం ఆ పేరును విస్మరించి.. కేవలం మూడు పేర్లే చెప్పడం గమనార్హం.ఈసారి పాక్‌దే పైచేయిఇక ఈసారి భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో తమ జట్టే పైచేయి సాధిస్తుందని షోయబ్ అక్తర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘ఫిబ్రవరి 23న పాకిస్తాన్ టీమిండియాను ఓడిస్తుందని ఆశిస్తున్నాను. ఈ రెండూ ఈసారి కూడా ఫైనల్ చేరతాయి’’అని జోస్యం చెప్పాడు. కాగా 2017లో ఆఖరిసారిగా చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించగా.. నాడు టైటిల్ కోసం భారత్- పాకిస్తాన్ తలపడ్డాయి.అఫ్గనిస్తాన్ జట్టు ఫేవరెట్.. ఎందుకంటేఅయితే, ఆ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి పాక్ జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. అక్తర్ చెప్పినట్లు ఈసారి అఫ్గనిస్తాన్ జట్టు సెమీస్ ఫేవరెట్లలో ఒకటిగా ఉందనడంలో సందేహం లేదు. భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023లో తొలిసారి పాకిస్తాన్‌ను ఓడించి చరిత్ర సృష్టించిన అఫ్గన్.. లీగ్ దశలో ఆస్ట్రేలియాకు కూడా గట్టిపోటీనిచ్చింది.తృటిలో సెమీస్ అవకాశాలకు చేజార్చుకుని ఆరోస్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు.. టీ20 ప్రపంచకప్-2024లోనూ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గనిస్తాన్.. ఏకంగా సెమీ ఫైనల్ చేరి ఆశ్చర్యపరిచింది. ఇక ఈ రెండు టోర్నీల్లోనూ కనీసం టాప్-4లో అడుగుపెట్టలేకపోయిన పాకిస్తాన్.. చాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఫేవరెట్‌గానే ఉంది. మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలో ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డ మీద పాకిస్తాన్ రికార్డు విజయాలతో వన్డే సిరీస్‌లను గెలుచుకోవడమే ఇందుకు కారణం.ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొడుతుంది. అనంతరం మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో లీగ్ దశను ముగిస్తుంది.చదవండి: సెంచరీకి చేరువలో ఉన్నాడని.. ఇలా చేస్తావా?: మండిపడ్డ గావస్కర్ -
టీమిండియా ఆటగాళ్లతో స్నేహం వద్దు.. ఎందుకంటే: పాక్ మాజీ కెప్టెన్
భారత్- పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ అంటే ఇరు దేశాల అభిమానులకే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తానికి ఆసక్తి. దాయాది దేశాల జట్లు నువ్వా- నేనా అన్నట్లు హోరాహోరీ తలపడుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవంటారు క్రికెట్ ప్రేమికులు.ఇక ఇరుదేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా కేవలం ఆసియా కప్(Asia Cup), ఐసీసీ మేజర్ టోర్నమెంట్లలో మాత్రమే భారత్- పాకిస్తాన్ ముఖాముఖి పోటీపడుతున్నాయి. ఇందులోనూ ఎక్కువ సందర్భాల్లో టీమిండియానే చిరకాల ప్రత్యర్థిపై పైచేయి సాధిస్తోంది. ఈ క్రమంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ అదే ఫలితం పునరావృతం చేయాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది.స్నేహంగా మెలుగుతున్న ఆటగాళ్లు2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనున్న పాకిస్తాన్ కూడా వరుస విజయాలపై కన్నేసింది. అయితే, ఆటలో ప్రత్యర్థులే అయినా.. మైదానం వెలుపల మాత్రం ఇరు దేశాల ఆటగాళ్లు స్నేహభావంతోనే మెలుగుతున్నారు. నిన్నటితరం ఆటగాళ్లు హర్భజన్ సింగ్- షోయబ్ అక్తర్ చిన్నపిల్లల్లా మైదానంలోకి పరుగులు తీస్తున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ కావడం ఇందుకు నిదర్శనం. View this post on Instagram A post shared by Shoaib Akhtar (@imshoaibakhtar) వారితో స్నేహం వద్దుఅయితే, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ మాత్రం భారత్- పాక్ క్రికెటర్లను ఉద్దేశించి విచిత్ర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో టీమిండియా ఆటగాళ్లతో ఎక్కువగా స్నేహంగా మెలగవద్దని సూచించాడు. ప్రత్యర్థి జట్టుతో ఫ్రెండ్షిప్ చేస్తే దానిని వాళ్లు అడ్వాంటేజ్‌గా మలచుకుంటారని అభిప్రాయపడ్డాడు.నాకైతే అర్థం కావడం లేదు‘‘అసలు ఇటీవలి కాలంలో పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ సమయంలో మన ఆటగాళ్లు ప్రవర్తిస్తున్న తీరు నాకు చిత్రంగా అనిపిస్తోంది. భారత బ్యాటర్లు క్రీజులోకి రాగానే మనవాళ్లు వెళ్లి.. వారి బ్యాట్‌ను పరిశీలించడం, వాళ్ల వెన్నుతట్టడం, స్నేహంగా మాట్లాడటం.. ఇదంతా ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు.మాట్లాడాల్సిన అవసరమే లేదుమైదానం లోపల, వెలుపల ప్రొఫెషనల్‌గా ఉండాలి. వాళ్లతో అంత స్నేహంగా మెలగాల్సిన అవసరం లేదు. ఆటగాళ్లు అయినా.. కొన్ని హద్దులు ఉంటాయి. అసలు మైదానంలో టీమిండియా ఆటగాళ్లతో అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదని మా సీనియర్లు చెప్పేవారు.ఎందుకంటే.. ప్రత్యర్థి జట్టుతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటే.. అది మన బలహీనతకు సంకేతంలా కనిపిస్తుంది’’ అని ఉష్నా షా పాడ్‌కాస్ట్‌లో మొయిన్ ఖాన్ చిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం ఈ టోర్నీలో తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అనంతరం ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం.. లీగ్ దశలో చివరిగా మార్చి 2న న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడుతుంది. చదవండి: T20 WC 2025: ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించిందిలా! -
బుమ్రా టెస్టులను వదిలేస్తే బెటర్: షోయబ్ అక్తర్
జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియాకే కాదు ప్రపంచ క్రికెట్లోనే అగ్రశేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. బుమ్రా గత కొంత కాలంగా మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటలో ఉన్న బుమ్రా అక్కడ కూడా సత్తాచాటుతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన బుమ్రా.. మొత్తంగా 11 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో జస్ప్రీత్ను ఉద్దేశించి షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఎక్కువకాలం పాటు తన కెరీర్‌ను కొనసాగించాలంటే టెస్టు క్రికెట్‌ను వదిలేయాలని అక్తర్ సూచించాడు."బుమ్రా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. అతడికి టెస్టు క్రికెట్ కంటే వన్డేలు, టీ20లు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే అతను లెంగ్త్‌ని అర్థం చేసుకున్నాడు. డెత్ ఓవర్లలో, పవర్‌ప్లేలో బంతితో అద్భుతంగా రాణిస్తున్నాడు. బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగల్గే సత్తా అతడికి ఉంది. కానీ బుమ్రా తన కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించాలంటే టెస్టులను వదేలియాలి. టెస్టుల్లో లాంగ్ స్పెల్స్ వేయాలి. పేస్ బౌలర్లను ఎటాక్ చేయడానికి అన్ని సార్లు ప్రయత్నించరు. కాబట్టి ఎక్కువ పేస్‌తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో పేస్ లేకపోతే బంతి సీమ్ లేదా రివర్స్ స్వింగ్ కాదు. మళ్లీ అప్పుడు బౌలింగ్ తీరుపై పలు ప్రశ్నలకు లేవనెత్తుతుంది. టెస్టు క్రికెట్లో బుమ్రా వికెట్లు తీయగలడు. అందులో ఎటువంటి సందేహం లేదు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతను పెద్దగా రాణించలేకపోయాడు. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. అయితే అతడు టెస్టుల్లో కొనసాగాలంటే బౌలింగ్ వేగాన్ని పెంచాలి.ఇలా చేయడం వల్ల అతను గాయపడే ప్రమాదం ఉంది. అతడి స్ధానంలో నేనే ఉంటే కేవలం వన్డేలు, టీ20లకే పరిమితమయ్యేవాడిని" అని అక్తర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
పాకిస్తాన్లో ఆడేందుకు కోహ్లి ఉవ్విళ్ళూరుతున్నాడు: షోయబ్ అక్తర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరుగుతుందా? లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఈ మెగా ఈవెంట్లో పాల్గోనేందుకు పాకిస్తాన్‌కు భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరకారించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ మెగా టోర్నీ హైబ్రిడ్ మోడల్ నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేస్తోంది. అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బోర్డు మాత్రం ససేమేర అంటుంది. అయితే ఇటీవలే జరిగిన ఐసీసీ బోర్డు మీటింగ్‌లో హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరించిందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.కానీ భారత క్రికెట్ బోర్డు ముందు బీసీసీఐ కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే కాలంలో భారత్ వేదికగా జరిగే ఐసీసీ ఈవెంట్లను కూడా ఇదే హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పీసీబీ కోరినట్లు తెలుస్తోంది.అయితే పీసీబీ కాండీషన్స్ను భారత బోర్డు తిరష్కరించినట్లు సమాచారం. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. కాగా పాక్ మాజీ క్రికెటర్లు సైతం భారత జట్టు తమ దేశానికి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాక్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు."ఇండియన్ క్రికెట్ టీమ్ పాకిస్తాన్లో ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. వారికి మా దేశంలో ఆడటమంటే చాలా ఇష్టం. ఇక్కడ ఆడటం మా జట్టు కంటే భారత జట్టుకే ఎక్కువ ఇష్టం. విరాట్ కోహ్లి సైతం పాక్‌లో ఆడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. భారత వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మా దేశంలో జరిగితే.. టీవీ రైట్స్, స్పాన్సర్‌షిప్‌లు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుతాయి.కానీ అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పాక్‌కు పంపేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి ఇప్పటివరకు భారత సీనియర్ జట్టు తరపున ఒక్కసారి కూడా పాక్ గడ్డపై ఆడలేదు. గతంలో భారత అండర్-19 జట్టు తరపున మాత్రం పాక్‌లో కోహ్లి ఆడాడు.చదవండి: ‘పింక్ బాల్’తో అంత ఈజీ కాదు.. నాకిదే ‘తొలి’ టెస్టు: టీమిండియా స్టార్ బ్యాటర్ -
CT 2025: షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు.. ముందే!
చాంపియన్స్ ట్రోఫీ -2025 నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య హక్కులను వేరే దేశంతో పంచుకునే క్రమంలో ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంలో తప్పులేదన్నాడు. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్‌కు రాకపోయినా... పాక్ జట్టు మాత్రం భవిష్యత్తులో భారత్‌కు వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నాడు.కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. రోహిత్ సేన ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించాలని ఐసీసీకి తెలిపింది.ఐసీసీ వార్నింగ్.. దిగి వచ్చిన పాక్అయితే, పీసీబీ మాత్రం ఇందుకు నిరాకరించింది. భారత జట్టు తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబట్టింది. బీసీసీఐ సైతం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పరిస్థితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐసీసీ.. టీమిండియా మ్యాచ్‌లను పాక్ వెలుపల ఆడేందుకు వీలుగా హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించింది. అంతేకాదు.. రెవెన్యూపరంగానూ నష్టం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.అయితే, పాక్ మాత్రం ఇందుకు కూడా అంగీకరించకుండా పంతానికి పోయింది. ఈ క్రమంలో ఐసీసీ హెచ్చరికలకు దిగకతప్పలేదు. ఒకవేళ పీసీబీ పట్టువీడకపోతే.. వేదిక మొత్తాన్ని తరలిస్తామని హెచ్చరించింది. దీంతో దిగి వచ్చిన పాక్.. ఎట్టకేలకు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినా.. మూడు షరతులు విధించినట్లు సమాచారం.టీమిండియా ఇక్కడికి రాకున్నా.. పాకిస్తాన్ భారత్‌కు వెళ్లాలిఅందులో ప్రధానంగా.. భవిష్యత్తులో భారత్‌లో ఐసీసీ ఈవెంట్లు నిర్వహిస్తే తాము కూడా అక్కడికి వెళ్లబోమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. ‘‘ఆతిథ్య హక్కులు పంచుకునేందుకు ఒప్పుకొంటే.. అధిక ఆదాయం అడగటం న్యాయమే. అయినా పీసీబీ కనీసం దీనికోసమైనా పట్టుబట్టడంలో తప్పులేదు.అయితే, భవిష్యత్తులో భారత్‌లో ఈవెంట్లు నిర్వహిస్తే ఆడబోము అనడం మాత్రం సరికాదు. మనం వారికి స్నేహ హస్తం అందించాలి. మన జట్టు ఇండియాకు తప్పకుండా అక్కడికి వెళ్లాలి. అంతేకాదు.. అక్కడ వారిని ఓడించాలి. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ విషయంలో హైబ్రిడ్ విధానం ముందుగానే ఫిక్సయినట్లు అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు.చదవండి: రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! -
కోహ్లి పాకిస్తాన్లో ఆడాలని అనుకుంటున్నాడు: పాక్ దిగ్గజ బౌలర్
చాంపియన్స్ ట్రోఫీ-2025.. వచ్చే ఏడాది జరుగనున్న ఈ మెగా టోర్నీ వేదిక విషయమై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ ఐసీసీ ఈవెంట్‌కు సంబంధించిన ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తమ దేశంలోనే మ్యాచ్‌లన్నింటినీ నిర్వహించాలని పట్టుబడుతోంది. మరోవైపు.. తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేది లేదని.. బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ మండలికి తేల్చిచెప్పేసింది.తాము ఆడబోయే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం కావాలని ఐసీసీని కోరింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ఒప్పుకొనే ప్రసక్తే లేదని పంతానికి పోతోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మాజీ క్రికెటర్లు టోర్నీ నిర్వహణ అంశంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.కోహ్లికి పాకిస్తాన్లో ఆడాలని ఉందిఈ క్రమంలో పాక్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ తమ దేశంలో నిర్వహించే అవకాశం లేదని.. ఏదేమైనా చివరిదాకా ఆశావాదంతోనే ఉంటామని పేర్కొన్నాడు. ఇక టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి కూడా పాకిస్తాన్‌కు రావాలని ఉందని.. ఇక్కడ గనుక అతడు సెంచరీ చేస్తే కెరీర్ పరిపూర్ణం అవుతుందంటూ అక్తర్ వ్యాఖ్యానించాడు. ఐసీసీకి 95- 96 వరకు స్పాన్సర్షిప్ ఇండియా నుంచే‘‘చాంపియన్స్ ట్రోఫీ వేదిక విషయంలో మా ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని భావిస్తున్నాం. ఐసీసీకి 95- 96 వరకు స్పాన్సర్షిప్ ఇండియా నుంచే వస్తుందనేది కాదనలేని వాస్తవం. ఇక ఇప్పుడు ఈ టోర్నీ గురించి ఇరుదేశాల ప్రభుత్వాలదే తుదినిర్ణయం.బీసీసీఐ గానీ.. పీసీబీ గానీ ఈ అంశంలో నిర్ణయం తీసుకోలేవు. విరాట్ కోహ్లి మొదటిసారి పాకిస్తాన్లో ఆడాలని కోరుకుంటున్నాడు. పాకిస్తాన్ కూడా అతడు మా దేశంలో ఆడితే చూడాలని ఉవ్విళ్లూరుతోంది. పాకిస్తాన్ గడ్డ మీద విరాట్ సెంచరీ చేస్తే.. ఆ ఊహే ఎంత బాగుందో కదా! అదే జరిగితే అతడి కెరీర్ పరిపూర్ణం అవుతుంది.నమ్మకం లేదుపెద్ద పెద్ద టోర్నీలను పాకిస్తాన్ విజయవంతంగా నిర్వహించలేదనే అపవాదు ఉంది. కనీసం ఈసారైనా అది తప్పని నిరూపించాలని పీసీబీ సిద్ధమవుతోంది. కానీ.. ఈ ఈవెంట్ పూర్తిస్థాయిలో ఇక్కడే జరుగుతుందనే నమ్మకం లేదు. అయితే, చివరి నిమిషం వరకు మేము ఆశలు కోల్పోము. నేనైతే టీమిండియా పాకిస్తాన్‌కు వస్తుందనే ఇప్పటికీ నమ్ముతున్నా’’ అని షోయబ్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.చదవండి: గిల్ స్థానంలో అతడిని ఆడించండి.. ఓపెనర్‌గా కేఎల్ బెస్ట్: భారత మాజీ క్రికెటర్ -
నీరజ్ చోప్రా తల్లిపై షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు..
భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి తన మంచి మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. ప్యారిస్ ఒలింపిక్స్-2024లో తన కొడుకు బంగారు పతకాన్ని తృటిలో చేజార్చుకునప్పటకి ఆమె మాత్రం ఏ మాత్రం దిగులు చెందలేదు.పసిడి పతకం సొంతం చేసుకున్న పాకిస్తాన్ స్టార్ అథ్లెట్‌పై సరోజ్ దేవి ప్రశంసల వర్షం కురిపించారు. అర్షద్‌ను కూడా తన కొడుకులాంటివాడని.. వారిద్దరు పోటీపడుతుంటే చూడముచ్చటగా ఉంటుందని ప్రేమను చాటుకున్నారు. ఈ క్రమంలో నీరజ్ తల్లి చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ మనసును హత్తుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆమె తల్లి ప్రేమని అక్తర్ కొనియాడాడు. " ఎవరో స్వర్ణం పతకం సాధిస్తే.. అతడు కూడా మా కుమారుడే అని ఆమె చెప్పారు. ఇలా చెప్పడం ఒక తల్లికి మాత్రమే సాధ్యం. నిజంగా ఇదొక అద్భుతమని" ఎక్స్‌లో అక్తర్ రాసుకొచ్చాడు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను 89.45 మీటర్లు విసిరి రెండో స్ధానంలో నిలిచిన నీరజ్.. వరుసగా రెండో ఒలిపింక్ పతకాన్ని ముద్దాడాడు. అయితే అర్షద్ నదీమ్ బంగారు పతకాన్ని సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఫైనల్లో ఏకంగా జావెలన్ రికార్డు స్ధాయిలో 92.97 మీటర్ల దూరం విసిరి గోల్డ్‌మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. -
'బుమ్రా, బ్రెట్‌లీ కాదు.. క్రికెట్ చరిత్రలో అతడిదే బెస్ట్ యార్కర్'
ప్రస్తుత వరల్డ్ క్రికెట్లో యార్కర్ల కింగ్ ఎవరంటే అందరికి టక్కున గుర్తు వచ్చేది టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రానే. రెప్పపాటులో తన యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించడం బుమ్రా స్పెషల్. చాలా మంది దిగ్గజ క్రికెటర్లు సైతం ఇప్పటివరకు బుమ్రాలా యార్కర్ల వేసే బౌలర్‌ను చూడలేదని కితాబు ఇచ్చారు. కానీ దక్షిణాఫ్రికా పేస్ గన్ డేల్ స్టేయిన్ దృష్టిలో బెస్ట్ యార్కర్ల వేసే బౌలర్ బుమ్రా కాదట. తాజాగా ఐస్లాండ్ క్రికెట్ వరల్డ్ క్రికెట్ హిస్టరీలో బెస్ట్ యార్కర్ వేసిన బౌలర్ ఎవరు? అన్న ప్రశ్నను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అందుకు బదులుగా డేల్ స్టేయిన్.. 1999 వరల్డ్‌కప్‌లో షోయబ్ అక్తర్ వేసిన యార్కర్ తన బెస్ట్ అంటూ సమధానమిచ్చాడు. అయితే స్టేయిన్ బుమ్రాను గానీ, ఆసీస్ బౌలింగ్ దిగ్గజం బ్రెట్‌లీని గానీ ఎంచుకోకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.ఇక స్టెయిన్ విషయానికి వస్తే.. తన కెరీర్లో 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20 మ్యాచులు ఆడిన ఈ సఫారీ పేస్‌గన్ మూడు ఫార్మాట్లలో కలిపి 699 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా తరపున టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటికి స్టెయిన్ పేరిటే ఉంది.అంతేకాకుండా 2008 నుంచి 2014 వరకు ఏకంగా 263 వారాల పాటు టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెం1 బౌలర్ గా స్టెయిన్ కొనసాగాడు. 2008లో ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఈ సఫారీ దిగ్గజం నిలిచాడు. అదే విధంగా 2013లో విజ్డన్ లీడింగ్ క్రికెటర్ అవార్డు అందుకున్నాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత బౌలింగ్ కోచ్‌గా, కామెంటేటర్‌గా కొనసాగతున్నాడు. -
ఫైనల్లో సౌతాఫ్రికాకు చుక్కలు చూపిస్తారు.. భారత్‌దే కప్: షోయబ్ అక్తర్
క్రికెట్ అభిమానులను ఉర్రుతలూగిస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024 తుది అంకానికి చేరుకుంది. జూన్ 29 (శనివారం) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి ఎండ్ కార్డ్ పడనుంది. ఈ టైటిల్ పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనునన్నాయి.ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రెండో వరల్డ్‌కప్ టైటిల్‌ను ఖాతాలో వేసుకోవాలని భారత జట్టు భావిస్తే.. దక్షిణాఫ్రికా మాత్రం తొలి సారి ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా జట్టుకు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కీలక సూచనలు చేశాడు. భారత జట్టు నుంచి ముప్పు పొంచి ఉందని సఫారీలను అక్తర్ హెచ్చరించాడు."సెమీస్‌లో భారత్ అద్బుతమైన విజయం సాధించింది. వారు ఈ విజయానికి నిజంగా అర్హులు. ఫైనల్‌కు చేరినందుకు టీమిండియాకు నా అభినందనలు. గత రెండు వరల్డ్‌కప్(టీ20, వన్డే)ల్లో టీమిండియా ఛాంపియన్స్‌గా నిలుస్తుందని భావించాను. కానీ ఆఖరి మెట్టుపై భారత్ బోల్తా పడింది. ఈ సారి కూడా భారత్ ఛాంపియన్స్‌గా నిలవాలని ఆశిస్తున్నాను. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు తీవ్రమైన పోటీ ఎదురుకానుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలి. అప్పుడే ప్రోటీస్ ఎడ్జ్‌లో గెలిచే ఛాన్స్ ఉంటుంది. అయితే దక్షిణాఫ్రికాకు మాత్రం గెలుపు అవకాశాలు తక్కువ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వారు తొలిసారి ఫైనల్లో తలపడతున్నారు. కచ్చితంగా వారిపై ఒత్తిడి ఉంటుంది.అంతేకాకుండా భారత జట్టులో వరల్డ్‌క్లాస్ స్పిన్నర్లు ఉన్నారు. వారిని ఎదుర్కొని ప్రోటీస్ బ్యాటర్లు ఎలా పరుగులు సాధిస్తారో ఆర్ధం కావడం లేదు. చివరిగా ఈ ఫైనల్ పోరులో భారత్ గెలవాలని నేను కోరుకుంటున్నానని" తన యూట్యూబ్ ఛానల్లో అక్తర్ పేర్కొన్నాడు. -
ట్రోఫీ గెలిచే అర్హత అతడికే ఉంది: షోయబ్ అక్తర్
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజయపరంపర కొనసాగుతోంది. లీగ్, సూపర్-8 దశలో ఓటమన్నదే ఎరుగక రోహిత్ సేన సెమీ ఫైనల్ చేరుకుంది. కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో ఫైనల్లో అడుగుపెట్టేందుకు.. ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.సెయింట్ లూసియా వేదికగా గురువారం(జూన్ 27) ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023లోనే రోహిత్ ట్రోఫీ గెలవాల్సిందని.. ఈసారి కూడా టీమిండియాకే గెలిచే అర్హత ఉందని పేర్కొన్నాడు.‘‘ఇండియా అద్భుతంగా ఆడింది. ఇది మీ వరల్డ్‌కప్. ఈసారి మీరు కచ్చితంగా గెలవాలి. ఉపఖండంలోనే ప్రపంచకప్ ట్రోఫీ ఉండాలి.ఇటీవలే మంచి ఛాన్స్ మిస్ అయ్యారు. ఈసారి మాత్రం వందకు వంద శాతం మీకే టైటిల్ గెలిచే అర్హత ఉంది. నా పూర్తి మద్దతు మీకే. రోహిత్ వ్యూహాలు బాగున్నాయి. ట్రోఫీ గెలిచేందుకు అతడు అర్హుడు.వన్డే వరల్డ్‌కప్-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమిండియా సారి బదులు తీర్చుకుంది. డిప్రెషన్ నుంచి బయటపడి ప్రత్యర్థిని సరైన సమయంలో దెబ్బకొట్టింది’’ అని షోయబ్ అక్తర్ భారత క్రికెట్ జట్టును ఆకాశానికెత్తాడు.కాగా సూపర్-8లో భాగంగా ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 24 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్(41 బంతుల్లో 92)తో జట్టుకు విజయం అందించాడు.మరోవైపు.. దాయాది పాకిస్తాన్ మాత్రం గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. గ్రూప్-ఏలో అమెరికా, టీమిండియా చేతిలో ఓడిపోయి.. సూపర్-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఈ క్రమంలో బాబర్ ఆజం బృందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. India's perfect revenge on a big stage pic.twitter.com/bcuK19Bbzz— Shoaib Akhtar (@shoaib100mph) June 24, 2024 -
టీమిండియా విజయం.. క్రెడిట్ మొత్తం మా వాళ్లకే: అక్తర్
‘‘టీమిండియా విజయంలో క్రెడిట్ మొత్తం పాకిస్తాన్‌కే ఇవ్వాలి. ఓడిపోవడానికి అత్యుత్తమంగా ప్రయత్నించారు. ఇంతకంటే గొప్పగా వాళ్ల గురించి చెప్పడానికి ఏమీ లేదు.పాకిస్తాన్ మిడిలార్డర్‌ను గమనించారా? మిమ్మల్ని ఎవరూ షాట్లు ఆడమని అడుగలేదు. కనీసం చెత్త షాట్లు ఆడకుండా ఉంటే చాలని మాత్రమే కోరుకున్నాం.కానీ మీరదే చేశారు. సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించేశారు. విజయం చేరువగా వచ్చినా.. మాకొద్దే వద్దు అన్నట్లు వెనక్కి నెట్టేశారు. ఇది నిజంగా షాకింగ్‌గా.. సర్ప్రైజ్గా ఉంది’’ అని పాకిస్తాన్ దిగ్గజ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ బాబర్ ఆజం బృందంపై విరుచుకుపడ్డాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. న్యూయార్క్ వేదికగా తలపడ్డ దాయాదుల పోరు ఆద్యంతం ఆసక్తి రేపింది.తొలుత అద్భుత బౌలింగ్‌తో టీమిండియాను 119 పరుగులకే కట్టడిచేయగలిగిన పాకిస్తాన్.. లక్ష్య ఛేదనలో మాత్రం చేతులెత్తేసింది. విజయానికి ఆరు పరుగుల దూరంలో నిలిచి మరోసారి టీమిండియా చేతిలో భంగపాటుకు గురైంది. నిజానికి ఏ ఒక్క బ్యాటర్ కాసేపు ఓపికగా నిలబడినా ఫలితం వేరేలా ఉండేదేమో!అయితే, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ధాటికి పరుగులు రాబట్టలేక చతికిల పడ్డ పాక్ బ్యాటర్లు.. ఓటమిని చేజేతులా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీమిండియాతో మ్యాచ్‌లో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 31 పరుగులతో పాక్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లలో వరుసగా బాబర్ ఆజం 13, ఉస్మాన్ ఖాన్ 13, ఫఖర్ జమాన్ 13, ఇమాద్ వసీం 15, షాబాద్ ఖాన్ 4, ఇఫ్తికార్ అహ్మద్ 5, షాహిన్ ఆఫ్రిది 0*, నసీం షా 10* పరుగులు చేశారు.చదవండి: Ind vs Pak: కావాలనే బంతులు వృథా చేశాడు: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్ -
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
టాలీవుడ్లో మురారి, ఇంద్ర లాంటి సూపర్ హిట్ సినిమాలతో మెప్పించిన భామ సోనాలి బింద్రే. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై మెరిసింది. ఇటీవల ది బ్రోకెన్ న్యూస్ సీజన్-2 తో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తన వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా సోనాలికి ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. గతంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ మీపై విపరీతంగా ప్రేమించాడని వార్తలొచ్చాయి.. అంతేకాదు పెళ్లికి ఒప్పుకోకపోతే కిడ్నాప్ చేస్తానని అన్నట్లు తెగ వైరలయ్యాయి.అయితే తాజా ఇంటర్వ్యూలో వీటిపై సోనాలి బింద్రే స్పందించింది. ఆ ప్రశ్న వినగానే సోనాలి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీని గురించి మాట్లాడుతూ.. 'అతను నిజంగా చెప్పాడో లేదో నాకు తెలియదు.. అయితే ఇది ఎంతవరకు నిజమో కూడా నాకు తెలియదు.. ఇప్పటికీ ఆ ఫేక్ న్యూస్ ఉందని ఆమె కొట్టిపారేశారు. అయితే అతను తన అభిమాని కావడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు.అయితే 2019లో సోనాలికి సంబంధించి తాను ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదని షోయబ్ స్పష్టం చేశాడు. షోయబ్ తన సొంత యూట్యూబ్ ఛానెల్లో దీనిపై వీడియో పోస్ట్ చేశారు. ఇంతటితో ఈ రూమర్స్‌కు స్వస్తి చెప్పాలనుకుంటున్నట్లు తెలిపారు. నేను ఆమెను సినిమాల్లో చూశాను.. తన అందమైన నటి కూడా అని అన్నారు. అయితే ఆమె క్యాన్సర్‌తో పోరాడిన తీరు చూసి అభిమానించడం మొదలుపెట్టానని షోయబ్ వెల్లడించారు. -
సొంత బిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు: పాక్ లెజెండ్
ICC WC 2023- PM Modi Gesture: టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుగా నిలిచిన తీరుపై పాకిస్తాన్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. తన చర్య ద్వారా దేశం మొత్తం జట్టుకు అండగా ఉందనే సందేశాన్ని ఇచ్చారని ప్రధానిని కొనియాడాడు. ఆటగాళ్లను తన సొంత బిడ్డల్లా ఆప్యాయంగా హత్తుకున్న విధానం ఎంతో గొప్పగా ఉందని ప్రశంసించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. సెమీస్ వరకు అజేయంగా కొనసాగిన టీమిండియా అహ్మదాబాద్‌లో ఆదివారం నాటి తుదిపోరులో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయింది. ఫలితంగా సొంతగడ్డపై ట్రోఫీ అందుకోవాలన్న కల చెదిరిపోయింది. కళ్లలో నీళ్లు నింపుకొని ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ తదితరులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. లక్ష పైచిలుకు అభిమానుల మధ్య ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేక.. కళ్లలో నీళ్లు నింపుకొని మైదానాన్ని వీడారు. షమీని ఆత్మీయంగా హత్తుకుని దీంతో అభిమానులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. టీమిండియాను ప్రేమించే వాళ్లంతా హృదయం ముక్కలైందంటూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ భారత జట్టు డ్రెస్సింగ్‌రూంకు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు. రోహిత్, కోహ్లిలను దగ్గరకు తీసుకుని.. ఆటలో గెలుపోటములు సహజమంటూ నచ్చజెప్పారు. మహ్మద్ షమీని ఆప్యాయంగా హత్తుకుని మరేం పర్లేదంటూ ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సొంతబిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ జీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘డ్రెస్సింగ్రూంకి వెళ్లి.. వాళ్లకు తానున్నానంటూ ప్రధాని ధైర్యం చెప్పారు. దేశం మొత్తం మీ వెంటే ఉందనే సందేశాన్ని ఇచ్చారు. నిజానికి భారత్‌కు అదొక ఉద్విగ్న క్షణం. అలాంటి సమయంలో ప్రధాని మోదీ ఆటగాళ్లను తన సొంతపిల్లల్లా అక్కున చేర్చుకున్నారు. వాళ్లకు నైతికంగా మద్దతునిచ్చి తలెత్తుకోవాలంటూ స్ఫూర్తి నింపారు. ఆటగాళ్ల పట్ల ఆయన ఎంతో గొప్పగా వ్యవహరించారు’’ అని ప్రశంసల వర్షం కురిపించాడు. చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం? -
భారత్ అద్బుతంగా ఆడుతోంది.. మమ్మల్ని కోలుకోలేని దెబ్బ కొట్టారు: అక్తర్
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్.. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కాగా వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటివరకు 8 సార్లు పాకిస్తాన్‌ను భారత జట్టు ఓడించింది. 1992 వన్డే ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్‌పై భారత్ ఆదిపత్యం చెలాయిస్తోంది. ఇక ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన టీమిండియా.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 2011 వరల్డ్‌కప్ విజయాన్ని పునరావృతం చేసే దిశగా టీమిండియా అడుగులు వేస్తుందని అక్తర్ కొనియాడాడు. భారత్ 2011 ప్రపంచకప్ చరిత్రను పునరావృతం చేయబోతోందని నేను నమ్ముతున్నాను. సెమీ-ఫైనల్స్‌లో వారు విజయం సాధిస్తే.. కచ్చితంగా ఛాంపియన్స్‌గా నిలుస్తారు. ప్రస్తుత భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఈ టోర్నీలో మమ్మల్ని ఓడించి కోలుకోలేని దెబ్బ కొట్టారు. పాకిస్తాన్‌కు ఇది ఘోర పరాభావం. భారత జట్టు మమ్మల్ని ఓ పసికూనలా ఓడించింది. మా రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడని తన యూట్యూబ్ ఛానల్లో అక్తర్ పేర్కొన్నాడు. చదవండి: Eng Vs Afg: ముజీబ్‌ను హత్తుకుని ఏడ్చేసిన బుడ్డోడు.. మ్యాచ్ కోసం ఏకంగా! వీడియో వైరల్ -
‘టీమిండియా నిర్ణయం సరైంది కాదు’.. అవునా? తెలివి తక్కువోళ్లు ఎవరంటే!
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఉందంటే ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఇప్పటికే మ్యాచ్‌కు ముందు తన పోస్టుతో నెటిజన్లకు దొరికిపోయిన అక్తర్.. దాయాదుల మ్యాచ్‌లో టాస్ సందర్భంగా తన వ్యాఖ్యలతో మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... అహ్మదాబాద్‌లో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా పాక్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ పిచ్‌పై ఇదే సరైన నిర్ణయమన్న విశ్లేషణల నడుమ.. షోయబ్ అక్తర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘ఈ వికెట్ చాలా బాగుంటుంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడం నాకెందుకో సరైన నిర్ణయం అనిపించలేదు. అంతేకాదు.. వాళ్లు అదనపు స్పిన్నర్‌ను కూడా తీసుకోలేదు. పాకిస్తాన్ ఇక్కడ తొలుత బ్యాటింగ్‌కు దిగడం నాకైతే సంతోషంగా ఉంది. వాళ్లు కచ్చితంగా మంచి స్కోరు చేస్తారు. టీమిండియా తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నదనిపిస్తోంది. పాకిస్తాన్ భారీగా పరుగులు చేసేందుకు వాళ్లు అవకాశమిచ్చారు’’ అని ఎక్స్ ఖాతాలో వీడియో షేర్ చేశాడు. అయితే, అక్తర్ అంచనాలు తలకిందులైన విషయం తెలిసిందే. తాను టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాడినన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం వ్యాఖ్యలకు సమర్థింపుగా.. టీమిండియా బౌలర్లు అద్భుతం చేసి.. పాక్‌ను 191 పరుగులకే కట్టడి చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. భారత బౌలర్ల దెబ్బకు 42.5 ఓవర్లకే పాక్ బ్యాటర్లు తోకముడిచారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు రోహిత్ శర్మ(86), శ్రేయస్ అయ్యర్(53- నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో విజయం అందించారు. వరల్డ్‌కప్ చరిత్రలో మరోసారి హిస్టరీని రిపీట్ చేస్తూ పాక్‌పై భారత్ పైచేయి సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది తాజా ఎడిషన్‌లో హ్యాట్రిక్ గెలుపు అందుకుంది. ఈ నేపథ్యంలో.. షోయబ్ అక్తర్‌ను ట్రోల్ చేస్తూ టీమిండియా ఫ్యాన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘తెలివి తక్కువ వాళ్లు ఎవరో అర్థమైందా? అక్తర్?’’ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ ఆరంభానికి ముందు చరిత్ర పునరావృతం అంటూ చేసిన కామెంట్‌ను ప్రస్తావిస్తూ.. ‘‘థాంక్యూ నీ మాట నిజమైంది’’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. చదవండి: Ind vs Pak: మా ఓటమికి కారణం అదే.. అతడు అద్భుతం: బాబర్ ఆజం Ahhh. That quietness on our boundaries. I remember this from the 90's. pic.twitter.com/Sl4IBlz5Vl — Shoaib Akhtar (@shoaib100mph) October 14, 2023 View this post on Instagram A post shared by ICC (@icc) -
Ind vs Pak: హిస్టరీ రిపీట్.. పాక్ ఓటమిని ధ్రువీకరించిన అక్తర్! థాంక్యూ..
ICC ODI WC 2023- Ind Vs Pak: haar manli: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌ను టీమిండియా అభిమానులు సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ‘‘నిజాలు ఒప్పుకొంటున్నందుకు థాంక్యూ’’ అంటూ సెటైర్లు వేస్తూ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా దాయాదులు భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇరు దేశాల్లోనే కాదు.. క్రికెట్ ప్రపంచం మొత్తానికి మహా ఇష్టం. హోరాహోరీకి సిద్ధం! నువ్వా- నేనా అంటూ చిరకాల ప్రత్యర్థులు హోరాహోరీ తలపడితే చూడటానికి ఫ్యాన్స్‌కు రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. అలాంటి హై వోల్టేజీ మ్యాచ్ ఆరంభానికి సమయం ఆసన్నమైంది. భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 13వ ఎడిషన్‌లో తొలిసారి భారత్- పాక్ అక్టోబరు 14న పరస్పరం ఢీకొట్టనున్నాయి. ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘‘రేపు.. చరిత్ర పునరావృతమవుతుంది’ అంటూ వికెట్ తీసిన సంబరంలో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. కాగా.. ఇది సచిన్ టెండుల్కర్‌ను అవుట్ చేసినప్పటి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలా కనిపించింది. హిస్టరీ రిపీట్.. థాంక్యూ అక్తర్ ఈ నేపథ్యంలో అక్తర్.. ‘హిస్టరీ రిపీట్’ కామెంట్‌ను భారత జట్టు అభిమానులు హైలైట్ చేస్తూ పాకిస్తాన్ ఓటమిని నువ్వే ఖరారు చేశావు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘నీకు నువ్వుగా.. ఓటమిని అంగీకరించావు.. టీమిండియాను సపోర్టు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మీ మాట నిజం కావాలి. ఎందుకంటే మీరన్నదే నిజం కాబట్టి’’ అంటూ అక్తర్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు టీమిండియాను పాకిస్తాన్ ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. రెండేసి విజయాలతో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. అత్యుత్సాహం ప్రదర్శించిన అక్తర్‌కు దిమ్మతిరిగేలా నెటిజన్లు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ మాజీ ఫాస్ట్‌బౌలర్ తన పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023లో ఆడిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా.. ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌లపై గెలుపొందగా.. పాకిస్తాన్ .. నెదర్లాండ్స్, శ్రీలంకను ఓడించింది. ఇరు జట్లు రెండేసి విజయాలతో మూడో మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. Khud hi haar manli🤣 — Shivani (@meme_ki_diwani) October 13, 2023 Thank you for Supporting India sir 🙌🏻🇮🇳 1992 - India Win 1996 - India Win 1999 - India Win 2003 - India Win 2011 - India Win 2015 - India Win 2019 - India Win 2023 - India win (According to Shoaib Akhtar History will Repeat) 😌 https://t.co/cUiTS0aA03 — Diwakar Singh (@realdiwakar) October 13, 2023 Thank you for confirming. https://t.co/p2Wfqah7a8 — Srinivas R (@srini_r_twit) October 13, 2023 It really seems tough for you to choose your favourite one.. let me help you.. We too wish the history repeat 😜#ThandRakh https://t.co/dbPJjt1eXL pic.twitter.com/QMYCaUXhYu — RAHUL S BELAKOPPAD (@rahulsbelkoppad) October 13, 2023 చదవండి: ‘శార్దూల్ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’ -
అందరూ కోహ్లిని మాత్రమే ప్రశంసిస్తున్నారు.. అతడి సంగతి ఏంటి మరి?
వన్డే ప్రపంచకప్-2023ను టీమిండియా విజయంతో ఆరంభించిన సంగతి తెలిసిందే. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 200 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 3 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడింది. ఈ సమయంలో విరాట్ కోహ్లి(85), కేఎల్ రాహుల్(97 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి కంటే రాహుల్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని అక్తర్ అభిప్రాయపడ్డాడు. "కేఎల్ రాహల్ బ్యాటింగ్ చేసిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతడు వరల్డ్‌కప్ టోర్నీలో కాకుండా వేరే లీగ్ క్రికెట్లో ఆడినట్లు అన్పించింది. విరాట్ కోహ్లి కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ విరాట్‌కు ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్ డ్రాప్ రూపంలో ఓ అవకాశం ఇచ్చారు. విరాట్ కోహ్లి క్యాచ్ మాత్రం టర్నింగ్ పాయింట్. కాగా రాహుల్ మాత్రం ఎటువంటి అవకాశం ఇవ్వకుండా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అవసరమైనప్పుడు షాట్లు ఆడుతూ రాహుల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రాహుల్ ప్రతీ మ్యాచ్‌లోనూ తన వంతు సహకారం అందిస్తూ ఉంటాడు. అతడికి ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. అదే విధంగా వికెట్ కీపింగ్ కూడా అద్బుతంగా చేయగలడు. అందరూ కోహ్లి ఫిట్నెస్ను, వికెట్ల మధ్య అద్భుతంగా పరిగెడతాడని అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ రాహుల్ కూడా అతడితో పాటు పరిగెత్తున్నాడు. అదే విధంగా 50 ఓవర్లపాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తున్నాడు. కాబట్టి రాహుల్ వంటి ఆటగాడికి అందరూ సపోర్ట్ చేయాలని" తన యూట్యూబ్ ఛానల్లో అక్తర్ పేర్కొన్నాడు. చదవండి: CWC 2023 ENG vs BAN: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లండ్.. 364 పరుగుల భారీ స్కోర్ -
బంగ్లా చేతిలో ఓడిపోయారు.. శ్రీలంకపై గెలవాలంటే: పాక్ మాజీ క్రికెటర్
Asia Cup, 2023- India vs Sri Lanka, Final: ఆసియా కప్-2023 ఫైనల్‌కు ముందు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ టీమిండియాను హెచ్చరించాడు. శ్రీలంకను తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నాడు. సొంతగడ్డపై పటిష్టంగా కనిపిస్తున్న దసున్ షనక బృందాన్ని ఓడించడం అంత తేలికేమీ కాదని వార్నింగ్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ చేతిలో ఓటమి ఊహించారా? కొలంబో వేదికగా ఆదివారం టీమిండియా- శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోతుందని ఊహించామా? కానీ అదే జరిగింది. అలాగే పాకిస్తాన్ శ్రీలంక చేతిలో ఓడిపోయింది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంగ్లా చేతిలో టీమిండియా ఓటమి కంటే పాక్ నిష్క్రమణ మరీ ఘోరం. ఏదేమైనా.. ఇప్పటికీ భారత జట్టుకు అవకాశం ఉంది. వాళ్లు ఫైనల్ ఆడబోతున్నారు. టీమిండియా సత్తాకు పరీక్ష కానీ అంతకంటే ముందే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పరాజయం వారికి కనువిప్పు కలిగించిందనే అనుకుంటున్నా. కఠినంగా శ్రమించి.. వ్యూహాలు పక్కాగా అమలు చేస్తేనే ఫైనల్లో అనుకున్న ఫలితం రాబట్టగలరు. శ్రీలంకను ఓడించడం అనుకున్నంత సులువు కాదు. టీమిండియా సత్తాకు పరీక్ష ఇది. శ్రీలంకను తక్కువ అంచనా వేయకండి రోహిత్ సేనను ఎలాగైనా ఓడించి ట్రోఫీ గెలవాలని శ్రీలంక కాచుకుని కూర్చుంది. ప్రపంచకప్ టోర్నీకి ముందు ఏ జట్టుకైనా ఇలాంటి విజయాలు అవసరం. ఐసీసీ ఈవెంట్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. ఇప్పటికైనా టీమిండియా కళ్లు తెరవాలి. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిని మర్చిపోవద్దు’’ అని చెప్పుకొచ్చాడు. సమిష్టిగా రాణిస్తూ విజయపరంపర కాగా స్టార్లు ప్లేయర్లు లేకుండా.. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన శ్రీలంక ఒక్కో అవరోధం దాటుకుంటూ ఫైనల్ వరకూ చేరుకుంది. ఇక గతేడాది టీ20 ఫార్మాట్లో ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్ విజేతగా దసున్ షనక జట్టు నిలిచిన విషయం తెలిసిందే. సమిష్టిగా రాణించడం శ్రీలంకకు బలం. ఈ నేపథ్యంలోనే రోహిత్ సేనను ఉద్దేశించి అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: ఆర్సీబీ పేసర్‌కు లక్కీ ఛాన్స్! టీమిండియాలో చోటు.. బీసీసీఐ ప్రకటన WC 2023: పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ! ఆసియా కప్ పోయింది.. ఇక.. -
‘టీమిండియా మ్యాచ్ ఫిక్స్ చేశారు’.. మండిపడ్డ అక్తర్! మనోళ్లకు చేతకాదు..
Asia Cup 2023- India vs Sri Lanka: ‘‘అసలు మీరేం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసిందంటూ నాకు మీమ్స్‌తో కూడిన మెసేజ్‌లు వచ్చిపడుతున్నాయి. పాకిస్తాన్‌ను రేసు నుంచి తప్పించేందుకు టీమిండియా ఉద్దేశపూర్వకంగానే ఓడిపోతుందనేది వాటి సారాంశం. మీరంతా బాగానే ఉన్నారు కదా? అసలు ఇలా మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? శ్రీలంక బౌలర్లు శక్తిని కూడదీసుకుని ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. వెల్లలలగే, అసలంక కఠినంగా శ్రమించారు. 20 ఏళ్ల పిల్లాడి పట్టుదల చూశారా? ఆ 20 ఏళ్ల పిల్లాడి తాపత్రయాన్ని మీరు చూశారా? 43 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇదంతా చూస్తూ ఉన్నా.. ఇండియా నుంచి, ఇతర దేశాల అభిమానుల నుంచి నాకు ఒకటే ఫోన్ కాల్స్. ఈరోజు ఇండియా కావాలనే ఓడిపోతుందని ఒకటే వాగడం’’ అంటూ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలగే పోరాటం చూసిన తర్వాత కూడా ఇలా ఎలా మాట్లాడగలిగారో అర్థం కావడం లేదంటూ సోకాల్డ్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో పాకిస్తాన్‌ను 228 పరుగులతో చిత్తు చేసిన భారత జట్టు.. మంగళవారం శ్రీలంకతో తలపడింది. తిప్పేసిన స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో కొలంబోలో రోహిత్ సేన ఎలాంటి పొరపాటు చేయలేదు. పాక్‌తో మ్యాచ్ ముగిసిన 15 గంటల్లోపే మళ్లీ మైదానంలో దిగిన టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో లంక స్పిన్నర్లు వెల్లలగే, చరిత్ అసలంక ధాటికి 213 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై వెల్లలగే బంతిని తిప్పేసి ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. టీమిండియా- లంక ఫలితంపై అయితే, లక్ష్య ఛేదనలో లంక 172 పరుగులకే ఆలౌట్ కావడంతో అతడి పోరాటం వృథాగా పోయింది. 41 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా నేరుగా ఫైనల్లో ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. గ్రూప్-ఏలో భారత జట్టుతో పాటు ఉన్న పాకిస్తాన్‌కు ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. లంకను రోహిత్ సేన ఓడించాల్సిందే! ఈ నేపథ్యంలోనే కొంతమంది టీమిండియా టాపార్డర్ విఫలం కావడం చూసి.. లంకను గెలిపించి పాక్‌ను రేసు నుంచి తప్పించేందుకు ఇలా ఆడుతున్నారంటూ ఆరోపించారు. ఇదే విషయమై తనకు కాల్స్ వచ్చాయని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా తెలిపాడు. వాళ్లంతా కష్టపడ్డారు.. మనోళ్లకు చేతకాదు ‘‘వాళ్లు ఎందుకు అలా అంటున్నారో అర్థం కాలేదు. అసలు టీమిండియా ఎందుకు ఓడిపోవాలని అనుకుంటుంది? గెలిస్తే ఎంచక్కా ఫైనల్ చేరే అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటుంది? ఎలాంటి కారణాలు లేకుండా ఇలాంటి పిచ్చిపని ఎందుకు చేయాలనుకుంటుంది? లో స్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు పట్టుదలగా పోరాడారు. కుల్దీప్ అద్భుతం చేశాడు. జట్టును గెలిపించేందుకు జస్ప్రీత్ బుమ్రా శక్తిమేర కష్టపడ్డాడు. ఇక లంక కుర్రాడు వెల్లలగే బౌలింగ్, బ్యాటింగ్ రెండూ చేయగలడు. కానీ మన వాళ్ల సంగతి వేరు. వాళ్ల నుంచి ఇలాంటి పోరాటం ఎప్పుడూ చూడలేదు. మన ఫాస్ట్‌బౌలర్లు షాహిన్ ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, నసీం షా 10 ఓవర్లు బౌలింగ్ చేసినా గాయపడకుండా ఉంటే చూడాలని ఉంది. మన వాళ్లు కూడా పోరాటపటిమ కనబరచాలి’’ అని అక్తర్ వ్యాఖ్యానించాడు. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిస్తేనే ఫైనల్ బెర్తు ఖరారవుతుంది. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! 5 వికెట్లు మాత్రమే కాదు.. సిక్సర్లు, సెంచరీ హీరో కూడా! ఎవరీ దునిత్ వెల్లలగే? Super11 Asia Cup 2023 | Super 4 | India vs Sri Lanka | Highlightshttps://t.co/EI2KjpFup6#AsiaCup2023 — AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023 -
పాకిస్తాన్‌ను వర్షం కాపాడింది.. బాబర్ తెలివి తక్కువ పనిచేశాడు: అక్తర్
ఆసియాకప్-2023 సూపర్-4లో పాకిస్తాన్ బౌలర్లకు భారత ఓపెనర్లు చుక్కలు చూపించారు. లీగ్ మ్యాచ్‌లో పాక్‌పై విఫలమైన రోహిత్ శర్మ, గిల్.. ప్రధాన దశలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదిని రోహిత్, గిల్ చెడుగుడు ఆడుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్(56), గిల్(58) పరుగులతో టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ జట్టు బాధ్యతను తీసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో అందరూ ఊహించిన అతిథి వచ్చేశాడు. అదేనండి వరుణుడు. భారీ స్కోర్దిశగా సాగుతున్న భారత ఇన్నింగ్స్ జోరుకు వర్షం కళ్లెం వేసింది. భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను రిజర్వ్ డే అయిన సోమవారంకు అంపైర్లు వాయిదా వేశారు. వర్షం వల్ల ఆట నిలిచిపోయే సమయానికి 24.1 ఓవర్లలో భారత్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు సాధించింది. క్రీజులో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను వర్షం కాపాడిందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. 'నేను భారత్-పాక్ మ్యాచ్ చూడటానికి ఇక్కడకు వచ్చాను. నాతో పాటు ఇరు దేశాల అభిమానులు మ్యాచ్ ప్రారంభం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో మా జట్టును వర్షం కాపాడిందనిఅనుకోవాలి. అంతకుముందు లీగ్ మ్యాచ్‌లో భారత్‌ను వర్షం రక్షించింది. కానీ బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై బాబర్ బౌలింగ్ ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. అది తెలివైన నిర్ణయం కాదు" అని సోషల్ మీడియాలో ఓ వీడియోను అక్తర్ పోస్ట్ చేశాడు. చదవండి: Asia Cup 2023: రిజర్వ్‌డే రోజు కూడా వర్షం పడితే.. ఏంటి పరిస్థితి? అలా జరిగితే భారత్‌కు కష్టమే Well. I don't see this starting again. Colombo ki baarish is crazy pic.twitter.com/KiY8Mbzl77 — Shoaib Akhtar (@shoaib100mph) September 10, 2023 -
కోహ్లితో ఎక్కువ మాట్లాడకండి.. అతడిని ఎలా అయినా ఔట్ చేయాలి: అక్తర్
ఆసియాకప్ 2023 సూపర్-4లో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ పోరుకు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కొలంబో వేదికగా మధ్యహ్నం 3 గంటలకు జరగనుంది. ఇక భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ తమ బౌలర్లకు కొన్ని విలువైన సలహాలు ఇచ్చాడు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో ఎక్కువగా చర్చల్లో పాల్గొనవద్దని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ సూచించాడు. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షోయబ్ మాట్లాడుతూ.. బౌలర్లు ఎక్కువగా విరాట్ కోహ్లితో మాట్లాడకూడదు. అతడిని ఒత్తడిలోకి నెట్టి, ఆటపై దృష్టి కోల్పోయేలా చేయాలి. అతడు తన రిథమ్‌లో వచ్చాడంటే అపడం ఎవరు తరం కాదు. మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపిస్తాడని చెప్పుకొచ్చాడు. కాగా ఈ టోర్నీలో కోహ్లి రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ.. పాకిస్తాన్‌పై మాత్రమే బ్యాటింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే పాక్‌పై మాత్రం కేవలం 4 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో నేటి మ్యాచ్‌లో విరాట్ చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ రిజర్వ్ డేను కేటాయించింది. చదవండి: Asia Cup 2023: అది నిజంగా సిగ్గుచేటు.. భారత్- పాక్ మ్యాచ్‌కు రిజర్వ్ డేపై టీమిండియా లెజెండ్ ఫైర్ -
అప్పట్లో ఒకడుండేవాడు.. అతడే ధోని! కానీ రోహిత్ మాత్రం: పాక్ దిగ్గజం
ICC ODI WOrld Cup 2023: ‘‘అప్పట్లో ఒకడుండేవాడు.. మొత్తం ఒత్తిడి తానే భరించి జట్టును రిలాక్స్‌గా ఉంచేవాడు. అతడు మరెవరో కాదు ధోని. జట్టు మొత్తం అతడి వెనుకే ఉండేది. అందరి భారాన్ని అతడే మోసేవాడు’’ అంటూ పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనిని కొనియాడాడు. రోహిత్ శర్మ మంచి బ్యాటర్ అని, అయితే కెప్టెన్‌గా ఒత్తిడి అధిగమించలేకపోతున్నాడని అభిప్రాయపడ్డాడు. కాగా భారత్‌కు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఏకైక కెప్టెన్‌గా ధోని కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2007, వన్డే వరల్డ్‌కప్-2011, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచిన ఘనత మిస్టర్ కూల్ సొంతం. పుష్కరకాలం తర్వాత భారత గడ్డపై.. ఇదిలా ఉంటే.. పుష్కరకాలం తర్వాత మరోసారి భారత్ వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. సొంతగడ్డపై ఐసీసీ ఈవెంట్ నేపథ్యంలో రోహిత్ సేనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా విరాట్ కోహ్లి నుంచి టీమిండియా పగ్గాలు చేపట్టిన తర్వాత హిట్‌మ్యాన్ ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొట్టాడు. కానీ ఆసియా టీ20 కప్, టీ20 ప్రపంచకప్, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ల రూపంలో ఎదురైన సవాలును మాత్రం ఎదుర్కోలేకపోయాడు. ఈ మూడు ఈవెంట్లలో జట్టును విజేతగా నిలపలేక రోహిత్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ కెప్టెన్ కాకుంటేనే బాగుండేది ‘‘రోహిత్ మంచి బ్యాటర్. కానీ కెప్టెన్ అయిన తర్వాత ఆందోళనకు గురవుతున్నాడు. భయపడిపోతున్నాడు. రోహిత్ పట్ల నా వ్యాఖ్యలు పరుషంగా అనిపించవచ్చు... కానీ రోహిత్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోకపోయి ఉంటే ఆటగాడిగా మరింత మెరుగ్గా ఉండేవాడు. నిజానికి విరాట్ కోహ్లి కూడా రోహిత్ శర్మ అంత టాలెంటెడ్ కాదు. అతడు ఆడిన షాట్లు కోహ్లి కూడా ఆడలేడు. క్లాసిక్ బ్యాటర్. అలాంటి ప్లేయర్‌కు కెప్టెన్సీ ఎందుకు? ఈ ప్రశ్న నన్ను నేను చాలాసార్లు అడిగాను. ఆనాడే దాయాదుల సమరం క్లిష్ట పరిస్థితుల్లో అతడు ఒత్తిడిని జయించగలడా? అంటే లేదు అనే సమాధానమే! రోహిత్ కూడా ఇలా తనను తాను ప్రశ్నించుకోవాలి’’ అని రెవ్‌స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ కెప్టెన్ పదవి తీసుకోకపోయి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. కాగా అక్టోబరు 5 నుంచి వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో దాయాదులు భారత్- పాకిస్తాన్ మధ్య అక్టోబరు 14న అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరుగనుంది. చదవండి: ధోని, యువరాజ్ తర్వాత అలాంటి వాళ్లు రాలేదు.. ఇప్పుడు ఇతడు! కోహ్లిపై షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన గంగూలీ! ఏమన్నాడంటే? -
కోహ్లిపై షోయబ్ అక్తర్ వ్యాఖ్యలు.. కొట్టిపారేసిన గంగూలీ! ఏమన్నాడంటే?
Sourav Ganguly disagreed with Shoaib Akhtar’s suggestion: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి కెరీర్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలను భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ కొట్టిపారేశాడు. కోహ్లి తనకు నచ్చినన్ని రోజులు నచ్చిన తీరుగా ఆడతాడని వ్యాఖ్యానించాడు. కాగా ఆగష్టు 18, 2008లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్లో శుక్రవారం నాటితో 15 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. వరల్డ్‌కప్ తర్వాత గుడ్‌బై చెబితే! ఈ సందర్భంగా రన్‌మెషీన్‌పై ప్రశంసల వర్షం కురిపించిన షోయబ్ అక్తర్.. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కోహ్లి వీడ్కోలు పలికితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ సెంచరీ సెంచరీల రికార్డు బద్దలు కొట్టాలంటే విరాట్ ఇకపై పూర్తిగా టెస్టు క్రికెట్‌పైనే దృష్టి సారించాలని సూచించాడు. ఈ మేరకు.. ‘‘ప్రపంచకప్ టోర్నీ ముగిసిన తర్వాత కోహ్లి 50- ఓవర్ల క్రికెట్ ఎక్కువగా ఆడకపోతేనే మంచిది. టీ20ల విషయంలోనూ ఆలోచించాలి. కనీసం ఇంకా ఆరేళ్లపాటు కోహ్లి క్రికెట్ ఆడాలి. అప్పుడే సచిన్ టెండుల్కర్ రికార్డు బ్రేక్ చేయగలడు. అక్తర్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన దాదా వరల్డ్‌కప్ తర్వాత అతడు పూర్తిగా టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించాలి’’ అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ రెవ్‌స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. అయితే, అక్తర్ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా గంగూలీని కోరగా.. ‘‘ఎందుకు? విరాట్ కోహ్లి తనకు ఎన్నాళ్లు ఆడాలనిపిస్తే అన్నాళ్లు ఆడతాడు. నాడు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి అది కూడా తనకిష్టమైన ఫార్మాట్లో ఆడతాడు. ఎందుకంటే ఇప్పటికీ తను మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు’’ అని బదులిచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పగా.. నాడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ ప్రోద్బలంతోనే వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించినట్లు వార్తలు వచ్చాయి. కోహ్లిని అడిగిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని గంగూలీ చెప్పగా.. అసలు తనను ఎవరూ సంప్రదించలేదని ప్రెస్‌మీట్ పెట్టి మరీ కోహ్లి దాదా వ్యాఖ్యలను ఖండించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా.. గంగూలీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: ఐర్లాండ్‌తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్ -
Virat Kohli: మళ్లీ రారాజుగా అవతరించు అని ఆ దేవుడే ఇలా!
Virat kohli Completes 15 Years As International Cricketer: ‘‘ఆ మ్యాచ్ ఆసాంతం విరాట్ కోహ్లి గురించే చర్చ. క్రికెట్ దేవుళ్లు అతడు పని పూర్తి చేయాలని దీవించారు. అప్పటికి అతడు అత్యుత్తమ ఫామ్‌లో లేడు. సొంత ప్రేక్షకుల నుంచే విమర్శలు. మీడియా అయితే.. అతడి వెంట పడింది. కానీ.. దేవుడు మాత్రం.. ఇది నీకై వేచిన వేదిక.. మునుపటి వైభవం అందుకో.. మళ్లీ రారాజుగా అవతరించు అని అతడిని ఆశీర్వదించినట్లుగా అనిపించింది. ఆరోజు మ్యాచ్ చూసిన వాళ్లకు విషయం అర్థమయ్యే ఉంటుంది. దాదాపు లక్ష మంది నేరుగా చూస్తుండగా.. 1.3 బిలియన్ల భారతీయులు, 30 కోట్ల మంది పాకిస్తానీలు ఆ అద్భుతాన్ని వీక్షించారు. ఆ రెండు సిక్సర్లు మహాద్బుతం క్రికెట్ ప్రపంచమంతా కోహ్లి ఆట కోసం ఎదురుచూసిన తరుణంలో.. హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో ఆ రెండు సిక్సర్లు.. మహా అద్భుతం. అతడు తన రాజ్యంలోకి తిరిగి అడుగుపెట్టాడు. ఆరోజు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఇలా జరగాలని అతడి విధిరాతలో రాసి ఉంది’’ అంటూ పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఆకాశానికెత్తాడు. కోహ్లి ఎల్లప్పుడూ కింగ్ కోహ్లిగానే ఉంటాడంటూ రన్‌మెషీన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. టీ20 వరల్డ్‌కప్-2022లో పాకిస్తాన్‌పై పరుగుల యంత్రం అద్భుత ఇన్నింగ్స్‌ను ప్రస్తావిస్తూ తనదైన శైలిలో కొనియాడాడు. కాగా 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. పద్దెనిమిదేళ్ల వయసులో అరంగేట్ర మ్యాచ్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన విఫలమైన ఈ అండర్-19 వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్.. అంచెలంచెలుగా ఎదుగుతూ రికార్డుల రారాజుగా పేరొందాడు. అయితే, ఆసియా టీ20 కప్-2022 ముందు వరకు కెరీర్లో తొలిసారి అత్యంత గడ్డుకాలం ఎదుర్కొన్న కోహ్లి.. ఈ మెగా ఈవెంట్ సందర్భంగా సెంచరీతో మునుపటి లయను అందుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అతడి ఇన్నింగ్స్ వింటేజ్ కోహ్లిని గుర్తు చేసింది. సెంచరీల వీరుడిపై రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ప్రశంసలు మెల్బోర్న్ మ్యాచ్‌లో 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి పాక్‌పై భారత్ మరోసారి పైచేయి సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో మళ్లీ పూర్వవైభవం దిశగా అడుగులు వేశాడు. నేటి(ఆగష్టు 18)తో కోహ్లి అంతర్జాతీయ కెరీర్‌కు 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.. ఈ మేరకు తమ జట్టుపై కోహ్లి విధ్వంసకర ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ అతడికి శుభాభినందనలు తెలియజేశాడు. కాగా కోహ్లి ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 76 సెంచరీలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. చదవండి: టీమిండియా క్యాప్ అందుకోవడం ఈజీ అయిపోయింది.. అదే జరిగితే బుమ్రా అవుట్! -
అసలు ఈ డిజాస్టర్ ఏంటి?.. ఆ సాంగ్‌పై షోయబ్ అక్తర్ ఆసక్తికర కామెంట్స్!
ఒకప్పుడు బాలీవుడ్ అంటే మెలోడీ సాంగ్స్, హిట్ సినిమాలే గుర్తొచ్చేవి. కానీ ఆ పరిస్థితి తలకిందులైంది. ఇటీవల పఠాన్ సినిమా మినహాయిస్తే వరుస ఫ్లాప్ సినిమాలే దర్శనమిస్తున్నాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ రీమేక్‌లపై ఆధారపడిందంటూ పలువురు సినీ ప్రముఖుల నుంచి విమర్శలొచ్చాయి. దీంతో రోజు రోజుకీ హిందీ చిత్రాల పరిస్థితి మరింత దిగజారిపోతోంది. (ఇది చదవండి: పరువు తీసుకుంటున్న బాలీవుడ్.. చివరకి ఆ పాట!) దక్షిణాది చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో పోటీ పడుతుంటే.. బాలీవుడ్ మాత్రం ఇంకా రీమేక్‌లపైనే ఆధారపడుతోంది. అయితే ఈ సారి ఏకంగా ఓ పాకిస్థానీ పాటను రీమేక్ చేయడంతో బాలీవుడ్ రేంజ్ మరింత దిగజారింది. యంగ్ హీరో ఇటీవలే అల వైకుంఠపురములో చిత్రాన్ని హిందీలో 'షెహజాదా' పేరుతో రీమేక్ చేసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. అయితే తాజాగా ఆయన నటించిన సత్యప్రేమ్ కీ కథ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ స్థాయిలో ఫేమస్ అయిన పాకిస్థానీ పాట 'పసూరి'ని రీమేక్ చేశారు. గతేడాది ఎక్కువమంది యూట్యూబ్ లో వెతికిన వాటిలో ఈ సాంగ్ అగ్రస్థానంలో నిలిచింది. దీన్నే కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా 'సత్యప్రేమ్ కీ కథ' చిత్రంలో వాడేశారు. ఇప్పటికే చిత్రబృందం ఈ సాంగ్ రిలీజ్ చేయగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన కాస్తా ఫన్నీగా ట్వీట్ చేశారు. అసలేంటీ ఈ డిజాస్టర్ అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్స్ కూడా అదేస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!) కాగా.. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కిస్తోన్న సత్య ప్రేమ్ కి కథ చిత్రానికి సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. భూల్ భూలయ్యా- 2 తర్వాత ఈ జంట మరోసారి ప్రేక్షకులను అలరించనుంది. Aye ki pasoori paayi ay. — Shoaib Akhtar (@shoaib100mph) June 27, 2023 -
2014లో పెళ్లి.. ఇంత పెద్ద కూతురు ఎలా? హీరోయిన్లా ఉంది! ఎంతైనా..
Shoaib Akhtar's rare picture with his 'daughter': పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తాడు. తన సుదీర్ఘ కెరీర్లో మేటి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు చేరువగా ఉంటున్నాడు. తన క్రికెట్ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు.. వ్యక్తిగత అంశాలు కూడా పంచుకుంటున్నాడు. కూతురితో ఇలా సరదాగా ఈ క్రమంలో ఇటీవల ఓ టీనేజ్ అమ్మాయితో ఉన్న ఫొటోను షేర్ చేసిన అక్తర్.. ‘‘చిల్ మోడ్ విత్ మై డాటర్’’ అంటూ క్యాప్షన్ జతచేశాడు. ఫొటోలో ఉన్న అమ్మాయి తన కూతురని, ఆమె పేరు అలీనా షేక్ అని పేర్కొన్నాడు. అయితే, అక్తర్ ఈ మేరకు చేసిన పోస్ట్ అభిమానులను కన్ఫ్యూజన్లోకి నెట్టేసింది. అక్తర్ షేర్ చేసిన ఫొటో ఇద్దరు కుమారులే ఎందుకంటే.. అంతర్జాలంలో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. షోయబ్ అక్తర్ 2014, జూలై 23న రుబాబ్ ఖాన్ అనే మహిళను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. మొదటి సంతానంగా 2016, నవంబరు 7న మహ్మద్ మైకేల్ అలీ, రెండో సంతానంగా 2019 జూలై 14న మరో కుమారుడికి జన్మనిచ్చింది ఈ జంట. అయితే, అక్తర్‌కు అకస్మాత్తుగా టీనేజీలో ఉన్న కూతురు ఎలా వచ్చిందన్న అంశంపైనే నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అక్తర్ ఈ అమ్మాయిని దత్తత తీసుకున్నాడేమోనని కొందరు.. అతడి అన్న లేదా తమ్ముడి కూతురు అయి ఉంటుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్లా ఉంది! ఇంకొందరు మాత్రం.. ఆ అమ్మాయి ఎవరైనా సరే చాలా అందంగా ఉందని, హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదంటూ తమదైన శైలిలో ట్వీటుతున్నారు. కాగా తన అంతర్జాతీయ కెరీర్లో 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడిన అక్తర్.. వరుసగా 178, 247, 19 వికెట్లు పడగొట్టాడు. అత్యంత వేగం( 161.3 kmph)తో బౌలింగ్ చేసిన ఫాస్ట్‌బౌలర్‌గా ఇప్పటికీ రికార్డుల్లో కొనసాగుతున్నాడు. చదవండి: రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే.. వరల్డ్ క్రికెట్లో రోహిత్ టైగర్.. అతడిని మించినవారు లేరు: ఆసీస్ లెజెండ్ Shoaib Akhtar uploads picture with his daughter@shoaib100mph #ShoaibAkhtar pic.twitter.com/Cf6p22BzIb — Cricket Pakistan (@cricketpakcompk) June 15, 2023 -
WC 2023: ఈసారి ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్! బీసీసీఐ, పీసీబీ ఏమీ చేయలేవు!
World Cup 2023- India Vs Pakistan: ‘‘ఇండియా- పాకిస్తాన్ ఫైనల్లో తలపడాలి అంతే! ఫైనల్ మ్యాచ్ ముంబైలోనా లేదంటే అహ్మదాబాద్లోనా అన్న అంశంతో నాకు సంబంధం లేదు. ఏదేమైనా ఇండియా- పాక్ మధ్యే టైటిల్ పోరు జరగాలి’’ అని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. 2011 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని బాబర్ ఆజం బృందానికి విజ్ఞప్తి చేశాడు. కాగా 1983 వన్డే వరల్డ్‌కప్ ఈవెంట్లో కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారి టైటిల్ గెలిచిన భారత జట్టు.. స్వదేశంలో 2011లో జరిగిన టోర్నీలో ధోని కెప్టెన్సీలో మరోసారి ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత మళ్లీ వన్డే ప్రపంచకప్ విజేతగా నిలవలేకపోయింది. ఇక ఈ ఏడాది సొంతగడ్డపై ఈ ఐసీసీ టోర్నీ జరుగనున్న నేపథ్యంలో రోహిత్ సేనకు.. ఈ అపవాదు చెరిపివేసే సువర్ణావకాశం ముంగిట నిలిచింది. మరోవైపు.. 1992లో ట్రోఫీ గెలిచిన పాకిస్తాన్‌కు ఇప్పటికీ ఆ టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది. ఇదిలా ఉంటే.. 2011 సెమీస్‌లో పాకిస్తాన్ ఓడించి ఫైనల్ చేరిన టీమిండియా.. శ్రీలంకపై గెలుపొంది విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. బీసీసీఐ, పీసీబీ ఏమీ చేయలేవు! ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ స్పోర్ట్స్‌తక్‌తో మాట్లాడుతూ.. ఈసారి ఫైనల్లో ఇండియా- పాకిస్తాన్ తలపడితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్ నిర్వహణ వేదిక అంశం గురించి స్పందిస్తూ.. ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు మద్దతుగా నిలిచాడు. ‘‘ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు. ఇవన్నీ వట్టి మాటలు. బీసీసీఐ లేదంటే పీసీబీ ఈ విషయంలో ఏమీ చేయలేవు. అనవసరపు మాటలు వద్దు భారత ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బీసీసీఐ.. పాకిస్తాన్ గవర్నమెంట్ అనుమతి లేకుండా పీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేవు. కాబట్టి భారత్- పాక్ క్రికెట్ మ్యాచ్‌ల విషయంలో మాజీ క్రికెటర్లు ఎవరూ ప్రతికూలంగా మాట్లాడవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’ అని అక్తర్ పేర్కొన్నాడు. ఒకవేళ భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందంటే టీమిండియా పాకిస్తాన్లో పర్యటించడానికి బీసీసీఐ తప్పకుండా అనుమతినిస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఇరు దేశాల మాజీ క్రికెటర్లు సంయమనం పాటించాలని అనవసరపు మాటలు మాట్లాడద్దని అక్తర్ విజ్ఞప్తి చేశాడు. చదవండి: WC 2023: వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆరంభం ఆరోజే.. ఫైనల్ ఎక్కడంటే! హైదరాబాద్‌లోనూ.. Virat Kohli: విరాట్ కోహ్లికి ఊహించని షాక్! అయితే ధోని మాదిరి.. -
సచిన్ రికార్డు బద్దలు కొట్టేది అతడే.. 110 సెంచరీలతో: పాక్ మాజీ పేసర్
OTD- Sachin Tendulkar 100 Centuries: పదకొండేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. ఆసియా కప్ టోర్నీ-2012లో భాగంగా మార్చి 16న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సచిన్ ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. 147 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 114 పరుగులు సాధించాడు. ఫలితం ఏదైనా ఈ మ్యాచ్ మాత్రం భారత క్రికెట్ చరిత్రలో ఓ మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక ఇప్పటి వరకు సచిన్ సాధించిన ఈ అత్యంత అరుదైన రికార్డుకు చేరువగా రాగలిగింది టీమిండియా స్టార్, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి మాత్రమే! ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇటీవలే కోహ్లి 75వ శతకం నమోదు చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆఖరిదైన అహ్మదాబాద్ టెస్టులో తాజా సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆకాశమే హద్దు సచిన్ టెండుల్కర్తో ఎన్నో మ్యాచ్‌లలో తలపడిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బద్దలు కొట్టగల సత్తా కోహ్లికే ఉందని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్సీ భారం దిగిపోయిన తర్వాత పరుగుల యంత్రం ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడని అక్తర్ పేర్కొన్నాడు. 110 సెంచరీలు చేస్తాడు ‘‘విరాట్ కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడం నాకేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. ఇప్పుడు తనపై కెప్టెన్సీ భారం లేదు. మానసికంగా ఒత్తిడి లేదు. కేవలం బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టే వీలు కలిగింది. కోహ్లి 110 సెంచరీలు చేసి సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న 100 శతకాల రికార్డును బ్రేక్ చేస్తాడని నాకు నమ్మకం ఉంది. పరుగుల దాహంతో ఉన్న కోహ్లికి ఈ ఫీట్ అసాధ్యమేమీ కాదు’’ అని షోయబ్ అక్తర్ ఏఎన్ఐతో వ్యాఖ్యానించాడు. కాగా సచిన్ టెండుల్కర్.. అంతర్జాతీయ వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు సాధించాడు. కోహ్లి ఇప్పటి వరకు వన్డేల్లో 46, టెస్టులో 28, టీ20లలో ఒక సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వంద సెంచరీల మార్కుకు ఇంకా 25 శతకాల దూరంలో ఉన్నాడు. ఇక 34 ఏళ్ల కోహ్లి తదుపరి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సమాయత్తమవుతున్నాడు. ఇదిలా ఉంటే అక్తర్ ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్-2023 సీజన్‌తో బిజీగా ఉన్నాడు. ఆసియా లయన్స్‌కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: IPL 2023: కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్‌రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా! PSL 2023: పోలార్డ్పైకి దూసుకెళ్లిన అఫ్రిది.. నాలుగు సిక్సర్లు కొట్టాడన్న కోపంలో..! -
సచిన్ టెండూల్కర్‌పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
Shoaib Akhtar-Sachin Tendulkar: పాకిస్తాన్ మాజీ స్పీడ్‌స్టర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.. క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై సంచలన కామెంట్స్ చేశాడు. సచిన్‌కు, ప్రస్తుత టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లికి మధ్య పోలికలపై అక్తర్ విశ్లేషిస్తూ.. సచిన్ కెప్టెన్సీపై అనవసర వ్యాఖ్యలు చేశాడు. సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదంటూనే మాస్టర్ బ్లాస్టర్ కెప్టెన్సీలో లోపాలను వేలెత్తి చూపే ప్రయత్నం చేశాడు. సచిన్ కెప్టెన్‌గా తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోయాడని, అందుకు అతను స్వచ్చందంగా సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని, కెప్టెన్‌గా సచిన్ ఫెయిల్యూర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ భారం దించుకున్నాక సచిన్, మునుపటి కంటే ఎక్కువగా రెచ్చిపోయాడని, కోహ్లి సైతం సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత సచిన్‌లాగే చెలరేగుతున్నాడని అన్నాడు. కెప్టెన్సీ వదులుకున్న తర్వాత ఆటపై ఫోకస్ పెట్టేందుకు కోహ్లికి కావాల్సిన సమయం దొరికిందని.. మనసు, మెదడు ఫ్రీ అయ్యాక కోహ్లి ఇప్పుడిప్పుడే పరుగులు చేయడం మొదలెట్టాడని తెలిపాడు. కోహ్లిని పొగడటం తన ఉద్దేశం కాదని, టీ20 వరల్డ్ కప్ 2022, ఆ తర్వాత కోహ్లి గణాంకాలు చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్ధమవుతుందని చెప్పుకొచ్చాడు. ఈ తరంలో కోహ్లికి మించిన బ్యాటర్ లేడని ఆకాశానికెత్తిన అక్తర్.. కోహ్లి కూడా ఒకానొక సమయంలో సచిన్ లాగే జట్టు భారాన్నంతా మోశాడని కితాబునిచ్చాడు. కాగా, సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి పరిమిత ఓవర్ల ఫార్మాట్లో రెచ్చిపోతున్నప్పటికీ.. టెస్ట్‌ల్లో మాత్రం వైఫల్యాల పరంపరను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఇప్పటివరకు 3 టెస్టులు ఆడిన కోహ్లి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. -
2002లో కెప్టెన్సీ ఛాన్స్.. కానీ వద్దనుకున్నా! ఒకవేళ అదే జరిగి ఉంటే..
Shoaib Akhtar Comments: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకడిగా పేరొందిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. అత్యంత వేగవంతమైన బంతిని విసిరి చరిత్ర సృష్టించాడు. గంటకు 161 కిలోమీటర్ల వేగంతో బాల్ వేసిన అక్తర్ రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఇక పాకిస్తాన్ తరఫున 1997లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్తర్ 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వరుసగా 178 వికెట్లు, 247 వికెట్లు, 19 వికెట్లు పడగొట్టాడు. జట్టులో కీలక సభ్యుడైన అతడు 2011లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2002లోనే ఛాన్స్.. కానీ అయితే, ఒకానొక సందర్భంలో అతడికి కూడా కెప్టెన్సీ అవకాశం వచ్చిందట. అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్‌ను వదులుకున్నాడట. ఈ విషయాన్ని షోయబ్ అక్తర్ స్వయంగా వెల్లడించాడు. ‘‘2002లో నాకు కెప్టెన్సీ అవకాశం వచ్చింది. కానీ నేను సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేను. ఆ సమయంలో పూర్తి ఫిట్‌గా లేను. ఐదు మ్యాచ్‌లు ఉంటే.. కేవలం 3 మాత్రమే ఆడే పరిస్థితి. ఒకవేళ అప్పుడు నేను ప్రతీ మ్యాచ్ ఆడి ఉంటే కేవలం ఒకటిన్నర- రెండేళ్లపాటే నా కెరీర్ కొనసాగేది’’ అని అక్తర్ క్రికెట్ పాకిస్తాన్‌తో వ్యాఖ్యానించాడు. బోర్డులో అనిశ్చితి ఇక నాటి మేనేజ్మెంట్ గురించి వివరిస్తూ.. ‘‘జట్టు సభ్యులకు నేను పూర్తి మద్దతుగా నిలబడ్డాను. నిజానికి అప్పుడు బోర్డులో అనిశ్చితి నెలకొంది. మిస్మేనేజ్మెంట్ కారణంగా సమస్యలు తలెత్తాయి’’ అని 47 ఏళ్ల అక్తర్ చెప్పుకొచ్చాడు. కాగా ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత క్రికెట్ విశ్లేషకుడిగా మారిన అక్తర్.. తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిమానులకు మరింత చేరువగా ఉంటున్నాడు. చదవండి: IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త సారధి పేరు ప్రకటన Ind Vs Aus ODI Series: టీమిండియాతో వన్డే సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ల రీఎంట్రీ -
పాక్ కెప్టెన్‌పై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంపై జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్‌కు ఇంగ్లీష్ అంతగా రాదని.. అందుకనే తమ దేశంలో అతను బ్రాండ్ అంబాసిడర్ కాలేకపోయాడంటూ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా అక్తర్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్తర్ మాట్లాడుతూ..''పాకిస్థాన్‌లో ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగల క్రికెటర్లు ఎవరైనా ఉన్నారంటే?.. అది నేను, షాహిద్ ఆఫ్రిది, వసీం అక్రమ్ మాత్రమే. అందుకనే మా ముగ్గురికే అన్ని వ్యాపార, వాణిజ్య ప్రకటనలు వస్తాయి. ఎందుకంటే.. మేము ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడడం అనే విషయాన్ని ఒక జాబ్‌గా భావించాం. ఇక క్రికెట్లో రాణించడం ఒక ఎత్తు అయితే.. మీడియాతో మాట్లాడడం, వాళ్ల ప్రశ్నలకు బదులివ్వడం అనేది మరొక ఎత్తు. ప్రస్తుతం పాక్ జట్టులో ఉన్న ఎవరూ పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడలేరు. అవార్డు ప్రజెంటేషన్ సమయంలో వాళ్లకు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. బాబర్ ఆజం ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడేటప్పుడు గమనించండి. హిందీ, ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడడం చూస్తుంటాం. బాబర్‌కు తన గురించి, తన ఆట గురించి కూడా ఇంగ్లీష్‌లో వర్ణించడం రాదు. ఒకవేళ అతను అనర్గళంగా, చక్కగా ఆంగ్లం మాట్లాడగలిగితే పాకిస్థాన్‌లో నంబర్ 1 బ్రాండ్ అంబాసిడర్ అయ్యేవాడు. అయినా ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమైన పనా?'' అని అక్తర్ ప్రశ్నించాడు. ఇక పాకిస్తాన్ క్రికెటలో తన ఆటతో అక్తర్ చెరగని ముద్ర వేశాడు. 1997లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్తర్ 2011లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. వేగానికి మారుపేరైన అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టుల్లో 178 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టి20 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్లో వేగవంతమైన బంతి వేసిన బౌలర్‌గా షోయబ్ అక్తర్ రికార్డు సృష్టించాడు. 2003లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అక్తర్ గంటకు 161.3. కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. అక్తర్ తర్వాత ఎందరో ఫాస్ట్ బౌలర్లు వచ్చినప్పటికి అక్తర్ రికార్డు మాత్రం పదిలంగా ఉంది. Former Pakistan speedster Shoaib Akhtar says Babar Azam cannot speak and hence he is not the biggest brand in Pakistan. Modern-day cricketers in Pakistan cannot speak on media, TV or in post-match presentations. Do you agree with this statement? pic.twitter.com/xMrNwYQe1X — Farid Khan (@_FaridKhan) February 21, 2023 చదవండి: 'బజ్‌బాల్' ఎలా అడ్డుకోవాలి?.. ఫ్యాన్స్‌ను వేడుకున్న కివీస్ టాప్ వెబ్సైట్ 10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్‌కు -
అందం ఒక్కటే సరిపోదు.. తెలివి కూడా ఏడిస్తే బాగుండు!
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రస్తుతం ఓటీటీ యాంకర్‌గా మారిపోయాడు. 'షోయబ్ అక్తర్ షో' పేరిట ఓటీటీ ఫ్లాట్‌ఫామ్.. ఉర్ఫూప్లిక్స్(UrfuFlix)లో కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన అక్తర్ తానే స్వయంగా హోస్ట్ చేస్తున్నాడు. తాజాగా తన షోకు నిదా యాసిర్ అనే మహిళా సెలబ్రిటీని అతిథిగా ఆహ్వానించాడు. నిదా యాసిర్‌ను టీజ్ చేద్దామని భావించిన అక్తర్ ఒక సింపుల్ ప్రశ్నను అడిగాడు. అయితే అతిథిని కన్ఫూజ్ చేసేందుకు కొంచెం తికమకగా అడిగాడు. '1992 వరల్డ్‌కప్‌ను పాకిస్తాన్ ఏ సంవత్సరంలో గెలిచింది' అంటూ అడిగాడు. నిజానికి ప్రశ్నలోనే జవాబు ఉంది. ఆ విషయాన్ని పసిగట్టని నిదా యాసిర్ కన్ఫూజన్‌కు గురైంది. తనతో పాటు వచ్చిన రెండో గెస్ట్‌ను సహాయం కూడా కోరింది. అయితే చివరకు '2006' అంటూ తప్పుడు సమాధానం చెప్పింది. నిదా యాసిర్ సమాధానం విన్న అక్తర్ తనలో తానే నవ్వుకుంటూ ఈసారి ప్రశ్నను మరో రూపంలో అడిగాడు. '2009 టి20 వరల్డ్‌కప్‌ను పాకిస్తాన్ ఏ సంవత్సరంలో గెలుచుకుంది' అంటూ ప్రశ్న వేశాడు. ఈసారి ప్రశ్న మారిందన్న కనీస అవగాహన లేకుండా '1992' అంటూ నిదా యాసిర్ టక్కున చెప్పేసింది. దీంతో అక్తర్‌తో పాటు షో చూడడానికి వచ్చిన ప్రేక్షకులు కూడా నిదా యాసిర్ తెలివికి నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కాలేదు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ట్రోల్స్ బారిన పడిపోయింది. ''ప్రశ్నలోనే జవాబున్నా కనుక్కోలేకపోయావు.. నీ తెలివికి జోహార్లు''.. ''అందం ఒక్కటే ఉంటే సరిపోదు.. కాస్త తెలివి కూడా ఏడిస్తే బాగుండు'' అంటూ కామెంట్స్ చేశారు. కాగా ఇదే ఫ్లాట్‌ఫామ్‌లో క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియా మీర్జాలు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న మాలిక్ మీర్జా షోకు పోటీగా అక్తర్ తన షోను నిర్వహిస్తున్నాడు. pic.twitter.com/OXdAQTFDsH — Out Of Context Cricket (@GemsOfCricket) February 15, 2023 చదవండి: టెస్టుల్లోనూ నెంబర్‌వన్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొత్త చరిత్ర -
'నాకు నచ్చలేదు.. బయోపిక్ నుంచి తప్పుకుంటున్నా'
'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' అనగానే మదిలో మెదిలే బౌలర్ పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్. ఇప్పుడు అదే 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' పేరుతో బయోపిక్ రూపొందించాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌ను ముహ్మద్ ఫర్హాజ్ ఖాసిర్ డైరక్టర్‌గా వ్యవహరించగా.. క్యూ ఫిలిం ప్రొడక్షన్ తెరకెక్కించింది. అయితే తాజాగా బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు షోబయ్ అక్తర్ శనివారం రాత్రి ట్విటర్ వేదికగా ప్రకటించాడు. ప్రొడక్షన్ హౌస్‌తో వచ్చిన విబేధాల కారణంగానే బయోపిక్ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అంతేకాదు తన అనుమతి లేనిదే బయోపిక్ రూపొందిస్తే లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మేకర్స్‌ను హెచ్చరించాడు. ''రావల్పిండి ఎక్స్‌ప్రెస్ బయోపిక్ నుంచి తప్పుకోవడం చాలా బాధాకరం. కొన్ని నెలల కింద నుంచే మేకర్స్‌తో మనస్పర్థలు వచ్చాయి. ఈ కారణంగానే బయోపిక్ రూపొందించడాన్ని విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నా. త్వరలోనే నా మేనేజ్మెంట్, లీగల్ టీమ్ మేకర్స్‌తో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేసుకోనుంది. నా అనుమతి లేకుండా మేకర్స్ బయోపిక్‌ను తెరకెక్కిస్తే మాత్రం లీగల్‌గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా'' అంటూ అక్తర్ ట్వీట్ చేశాడు. ఇక పాకిస్తాన్ క్రికెటలో తన ఆటతో అక్తర్ చెరగని ముద్ర వేశాడు. 1997లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన అక్తర్ 2011లో ఆటకు గుడ్‌బై చెప్పాడు. వేగానికి మారుపేరైన అక్తర్ పాకిస్తాన్ తరపున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టి20 మ్యాచ్‌లు ఆడాడు.అక్తర్ ఒక మ్యాచ్‌లో 161 కిమీవేగంతో విసిరిన బంతి క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిగా కొన్నేళ్ల పాటు నిలిచిపోయింది. Important announcement. pic.twitter.com/P7zTnTK1C0 — Shoaib Akhtar (@shoaib100mph) January 21, 2023 చదవండి: భారత క్రికెటర్‌కు చేదు అనుభవం.. నమ్మితే నట్టేట ముంచాడు -
అక్తర్ పేరిట ఉన్న ఆ రికార్డు తప్పక బద్దలు కొడతా: భారత యువ పేసర్
Umran Malik- Shoaib Akhtar: ’రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ పేరిట ఉన్న రికార్డును తప్పక బద్దలు కొడతానని టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ అన్నాడు. అత్యంత వేగంతో బంతిని విసిరి అక్తర్‌ను అధిగమిస్తానని ఈ కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే, వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే తనకు మరింత ముఖ్యమని పేర్కొన్నాడు. కాగా శ్రీలంకతో స్వదేశంలో సిరీస్‌ల నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ టీ20, వన్డే జట్లకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో న్యూస్ 24తో మాట్లాడిన 23 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్‌కు అక్తర్ రికార్డు గురించి ప్రశ్న ఎదురుకాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా ధ్యాస మొత్తం దానిమీదే ‘‘అదృష్టవశాత్తూ అంతా సాఫీగా జరిగి.. నా ప్రదర్శన బాగుంటే షోయబ్ అక్తర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొడతాను. అయితే, నేను రికార్డుల గురించి మాత్రం ఆలోచించడం లేదు. నా మొదటి ప్రాధాన్యం జట్టు ప్రయోజనాలే. దేశం కోసం ఆడటమే. నిజానికి మ్యాచ్ జరుగుతున్న సమయంలో మనమెంత వేగంగా బంతిని విసిరామనే సంగతి తెలియదు. మ్యాచ్ ముగిసిన తర్వాతే ఈ విషయాలు తెలుసుకోగలుగుతాం. నా ధ్యాస.. ఎంత వేగంతో బంతిని విసురుతున్నామన్న అంశం మీద కాకుండా సరైన ఏరియాలో బంతి పడుతుందా లేదో అంచనా వేసి విసరడం మీదే ఉంటుంది’’ ఉమ్రాన్ మాలిక్ చెప్పుకొచ్చాడు. కాగా జనవరి 3 నుంచి భారత్- లంక జట్ల మధ్య తొలి టీ20తో సిరీస్ మొదలుకానుంది. అక్తర్ పేరిట రికార్డు అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన రికార్డు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేరిట ఉంది. 2003 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతడు గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇక ఉమ్రాన్ సాధారణంగా సుమారు 150 కిమీ/గంటకు పైగా వేగంతో బంతిని విసరడగలన్న సంగతి తెలిసిందే. చదవండి: Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్, జట్లు, ఇతర వివరాలు హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేస్తారా? బీసీసీఐకి వార్నింగ్ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్ -
‘సారీ బ్రదర్... దీన్నే కర్మ అంటారు' అక్తర్‌కి కౌంటర్ ఇచ్చిన షమీ
మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్-2022 విజేతగా నిలిచింది. అయితే ఫైనల్లో పాక్ ఓటమిని ఆ దేశ మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఓటమి అనంతరం పాకిస్తాన్ దిగ్గజ పేసర్ ‘గుండె బద్ధలైంది’ అన్నట్టుగా ఎమోజీని ట్వీట్ చేశాడు. అయితే అక్తర్ ట్వీట్‌పై భారత పేసర్ మహ్మద్ షమీ వ్యంగ్యంగా స్పందించాడు. ‘సారీ బ్రదర్... దీన్నే కర్మ ’ అంటారు అంటూ షమీ రిప్లే ఇచ్చాడు. కాగా సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై ఓటమి పాలై ఇంటిముఖం పట్టిన భారత జట్టును పాక్ మాజీలు హేళన చేశారు. "ఈ ఆటతీరుతో ప్రపంచకప్ ఫైనల్‌కు వస్తుందా.. పాక్‌తో తలపడే అర్హత టీమిండియాకు లేదంటూ " అక్తర్ కూడా విమర్శలు చేశాడు. దీనికి బదులుగా షమీ ఇప్పుడు గట్టి కౌంటర్ ఇచ్చాడు. అదృష్టం కలిసొచ్చి సెమీస్‌కు గ్రూప్ స్టేజీలోనే ఇంటి దారి పడుతోంది అనుకున్న పాకిస్తాన్ జట్టు అదృష్టం కలిసొచ్చి సెమీస్‌లో అడుగుపెట్టింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలవ్వడంతో పాకిస్తాన్ లక్కీగా సెమీస్‌కు చేరుకుంది. అయితే సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై అనూహ్య విజయంతో పాక్ ఫైనల్లో అడుగుపెట్టింది. కానీ పటిష్టమైన ఇంగ్లండ్ ముందు పాక్ తలవంచింది. ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైన పాకిస్తాన్ రన్నరప్‌గా నిలిచింది. Sorry brother It’s call karma 💔💔💔 https://t.co/DpaIliRYkd — Mohammad Shami (@MdShami11) November 13, 2022 చదవండి: T20 WC 2022: అప్పుడు వన్డే ప్రపంచకప్.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్! హీరో ఒక్కడే -
'ఇది ఆటేనా.. ఫైనల్లో పాక్‌తో తలపడే అర్హత భారత్‌కు లేదు'
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. భారత జట్ట పేలవ ప్రదర్శనపై అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులు మండిపడుతున్నారు. ప్రపంచకప్ టోర్నీలో ఇలాంటి ప్రదర్శనేంటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా ప్రదర్శన అత్యంత పేలవంగా ఉందని విమర్శలు గుప్పించాడు. భారత జట్టు ప్రదర్శన పాతాళానికి పాడిపోయిందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. 'మెల్బోర్న్లో జరిగే ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్‌తో తలపడే అర్హత భారత్‌కు లేదు. టీమిండియా సత్తా ఏంటో ఈ మ్యాచ్‌తో తేలిపోయింది. సెమీ ఫైనల్‌కు చేరడం గొప్పేం కాదు. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. ఐసీసీ టోర్నీల్లో ఇలా ఉంటే చాలా కష్టం. టీమిండియా కెప్టెన్సీపై పునరాలోచించుకోవాలి. దారుణ పరాభవానికి జట్టు యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాలి.' అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో టీమిండియా నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ సనాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ అర్ధ సెంచరీలతో కదం తొక్కి 10 వికెట్ల తేడాతో తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించి ఫైనల్ చేర్చారు. భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక చేతులెత్తేశారు. మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మద్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అద్భుత ఫాంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలని చూస్తుండగా.. 1992 సీన్‌ను రిపీట్ చేసి ఇంగ్లాండ్‌ను ఓడించి మరోసారి కప్పు ఎగరేసుకుపోవాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఏదేమైనా ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అలరించనుంది. చదవండి: ఐపీఎల్ బ్యాన్ చేస్తేనే దారిలోకి వస్తారా! -
మెల్బోర్న్లో వెయిట్ చేస్తుంటాం.. రండి, తేల్చుకుందాం.. టీమిండియాకు అక్తర్ సవాల్
టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా నిన్న (నవంబర్ 9) జరిగిన తొలి సెమీఫైనల్లో పాకిస్తాన్.. న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించి 13 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు పటిష్టంగా కనిపించిన న్యూజిలాండ్.. నాకౌట్ మ్యాచ్‌లో ఒత్తిడికి గురై, స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక, అదృష్టం కొద్దీ సెమీస్‌కు చేరిన పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్.. ఇలా అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శన కనబర్చిన కివీస్.. మెగా టోర్నీల్లో పాక్ చేతిలో చిత్తయ్యే సంప్రదాయాన్ని కొనసాగించింది. మరోవైపు ఇవాళ (నవంబర్ 10) జరిగే రెండో సెమీఫైనల్లో టీమిండియా-ఇంగ్లండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. రసవత్తరంగా సాగుతుందని భావిస్తున్న ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో విజేత నవంబర్ 13న మెల్బోర్న్ వేదికగా జరిగే టైటిల్ పోరులో పాకిస్తాన్‌తో తలపడుతుంది. Dear India, good luck for tomorrow. We'll be waiting for you in Melbourne for a great game of cricket. pic.twitter.com/SdBLVYD6vm — Shoaib Akhtar (@shoaib100mph) November 9, 2022 ఈ నేపథ్యంలో టీమిండియాను ఉద్దేశిస్తూ పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సెమీస్ మ్యాచ్ కోసం టీమిండియాకు గుడ్ లక్ చెబుతూనే.. మరో రసవత్తర సమరం కోసం మెల్బోర్న్లో వెయిట్ చేస్తుంటామంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. భారత అభిమానులు అక్తర్ ట్వీట్‌పై తగు రీతిలో స్పందిస్తున్నారు. ఏదో అదృష్టం కలిసొచ్చి సెమీస్‌కు చేరిన మీకు అంత బిల్డప్ అవసరమా.. కొంచెం ఓపిక పట్టు.. వస్తున్నామంటూ కౌంటరిస్తున్నారు. అప్పుడే ఏమైంది అక్తర్.. ఇవాళ ఇంగ్లండ్‌ను ఓడించి, ఫైనల్లో మీ తాట తీస్తామంటూ ఘాటుగా బదులిస్తున్నారు. ఇంకొందరైతే.. ఫైనల్లో న్యూజిలాండ్ అయితే టీమిండియాకు కాస్త ఇబ్బంది అయ్యేదేమో, మీరైతే అస్సలు టెన్షన్ పడాల్సి అవసరం లేదు, ఆడుతూ పాడుతూ మీ ఆట కట్టిస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు. -
భారత బ్యాటర్లు ఓపికగా ఆడితే బాగుండేది! ప్రొటిస్ మమ్మల్ని సైతం ఓడించి..
ICC Mens T20 World Cup 2022- India vs South Africa: ‘‘ఇండియా మా సెమీస్ అవకాశాలను గల్లంతు చేసింది. భారత్ పరాజయం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. అయినా ఇందులో వాళ్ల తప్పేమీ లేదు. మేమే చెత్తగా ఆడి.. మా తలరాతను ఇతరులు నిర్ణయించే దుస్థితిలో ఉన్నాం’’ అని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లయింది. అద్భుతాలు జరిగితే తప్ప బాబర్ ఆజం బృందం టోర్నీలో ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ క్రమంలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. ఐసీసీ టోర్నీలో పాక్ ఆట తీరుపై విమర్శలు గుప్పించాడు. టీమిండియా మమ్మల్ని నిరాశపరిచింది అదే సమయంలో రోహిత్ సేన.. దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఉంటే తమకు కాస్త మేలు చేసిన వాళ్లు అయ్యేవారంటూ వ్యాఖ్యానించాడు. టీమిండియా- సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపై తన యూట్యూబ్ చానెల్లో స్పందించిన అక్తర్.. ‘‘పెర్త్ లాంటి పిచ్‌లపై ఆడటం కాస్త కష్టమే. ఏదేమైనా టీమిండియా మమ్మల్ని నిరాశకు గురిచేసింది. భారత బ్యాటర్లు కాస్త ఓపికగా ఆడి ఉంటే బాగుండేది. పెవిలియన్‌కు క్యూ కట్టకుండా.. కనీసం 150 పరుగులు స్కోరు చేసి ఉంటే ప్రయోజనకరంగా ఉండేది. మమ్మల్ని కూడా ఓడిస్తారు! అయితే, దక్షిణాఫ్రికా తన అనుభవజ్ఞులైన ఆటగాళ్ల సేవలను చక్కగా ఉపయోగించుకుంది. మిల్లర్ నిజంగా కిల్లర్ ఇన్నింగ్స్ ఆడాడు. మార్కరమ్‌తో కలిసి తన అనుభవన్నంతా ఉపయోగించి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. లుంగి ఎంగిడి అద్భుతాలు చేయగలడని మరోసారి నిరూపించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో ఇండియా గెలిస్తే మాకు ఆశలు మిగిలి ఉండేవి. కానీ అలా జరుగలేదు. ఇక సౌతాఫ్రికా ఇప్పుడు.. టీమిండియా లాగే మమ్మల్ని సైతం ఓడించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12: ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ స్కోర్లు: ఇండియా- 133/9 (20) దక్షిణాఫ్రికా- 137/5 (19.4) 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: లుంగి ఎంగిడి(4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 4 వికెట్లు) చదవండి: T20 WC 2022: టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తేనే! పాక్ దింపుడు కల్లం ఆశలు.. T20 WC 2022: ఇదేమి బెంగళూరు వికెట్ కాదు.. దినేశ్ కార్తిక్‌పై సెహ్వాగ్ సెటైర్లు! ఇప్పటికైనా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘పాక్ పని అయిపోయింది! వచ్చే వారం టీమిండియా కూడా!’ అంత లేదులే
ICC Mens T20 World Cup 2022 - Shoaib Akhtar: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ‘‘మీ జట్టు విషయంలో మాత్రమే నీ అంచనాలు నిజమవుతాయిలే!’’ అంటూ అతడిని ట్రోల్ చేస్తున్నారు భారత అభిమానులు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి దంచికొట్టిన విషయం తెలిసిందే. 82 పరుగులతో అజేయంగా నిలిచిన కింగ్ జట్టును గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్ తర్వాత షోయబ్ అక్తర్ స్పందిస్తూ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసిస్తూనే.. ఇక టీ20లకు అతడు గుడ్ బై చెప్పాలంటూ సలహా ఇచ్చాడు. దీంతో కింగ్ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. టీమిండియాను ఉద్దేశించి ఇక ఇప్పుడు అక్తర్ టీమిండియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భారత అభిమానులకు అతడు టార్గెట్ అయ్యేలా చేశాయి. కాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో పాకిస్తాన్ ఒక్క పరుగు తేడాతో ఓడి సెమీస్ చేరే అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కెప్టెన్ బాబర్ ఆజంను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన అక్తర్.. టీమిండియా సెమీస్ అవకాశాలపై కూడా స్పందించాడు. వచ్చే వారం వాళ్లు కూడా అవుట్! ఈ మేరకు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ మొదటి వారంలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడుతుందని నేను ముందే చెప్పాను. ఇక వచ్చే వారం ఇండియా వంతు! వాళ్లు కూడా టోర్నీ నుంచి అవుట్ అవుతారు. వాళ్లు సెమీస్ ఆడతారేమో గానీ.. తీస్ మార్ ఖాన్ మాత్రం కాలేరు’’ అని పేర్కొన్నాడు. ఇప్పటికే రెండు విజయాలతో 4 పాయింట్లతో గ్రూప్-2 టాపర్‌గా ఉన్న రోహిత్ సేన సెమీస్ చేరడం లాంఛనమే అని చెప్పొచ్చు. అంతేకాదు కోహ్లి, సూర్య సూపర్ ఫామ్‌లో ఉండటం సహా భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ మెరుగ్గా రాణిస్తున్నారు. ఇలాంటి సానుకూల అంశాల నేపథ్యంలో ఈసారి టీమిండియా ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎక్కువేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో అక్తర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో నీకంత సీన్ లేదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Pak Vs Zim: పాక్ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించాడు! ‘ఈసారైనా మోసం చేయకండి’! ఈ మిస్టర్ బీన్ గోలేంటి? T20 WC 2022 Paul Van Meekeren: క్రికెట్ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు Ind Vs Ned: నాటి వరల్డ్‌కప్‌లో తండ్రి సచిన్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Shoaib Akhtar predicts that India will also return home after the semis since they are also not that good (or as he says 'Tees Maar Khan'). pic.twitter.com/zj5BFnjXYI — Kanav Bali🏏 (@Concussion__Sub) October 28, 2022 -
'బాబర్ ఒక పనికిరాని కెప్టెన్.. ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి'
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో పాకిస్తాన్ కంగుతిన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. ఇక జింబాబ్వే వంటి పసికూన చేతిలో బాబర్ సేన ఓటమి పాలవ్వడంపై పాకిస్తాన్ దిగ్గజ షోయబ్ అక్తర్ నిరాశ వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్ వ్యూహాలపై, బాబర్ ఆజం కెప్టెన్సీపై అక్తర్ తీవ్ర విమర్శలు చేశాడు. తన యూట్యూబ్ ఛానల్లో అక్తర్ మాట్లాడుతూ... " పాకిస్తాన్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అస్సలు బాగోలేదు. ఇప్పటికే ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను. పాకిస్తాన్‌కు ఒక చెత్త కెప్టెన్ ఉన్నాడు. ఈ టోర్నీలో కెప్టెన్సీ నిర్వహణ ప్రధాన లోపం. ప్రపంచకప్ టోర్నీ నుంచి పాకిస్తాన్ దాదాపు నిష్క్రమించింది. ఇక ఆడింది చాలు ఇంటికి వచ్చేయండి. జింబాబ్వే వంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోయారంటే మీ ఆట తీరు ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పటికైన జట్టు మేనేజేమెంట్‌కు జ్ఞానోదయం అవుతుందో లేదో నాకు అర్ధ కావడం లేదు" అని పేర్కొన్నాడు. బాబర్ బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు పాకిస్తాన్ లైనప్‌లో మార్పులు గురుంచి కూడా అక్తర్ చర్చించాడు. "జింబాబ్వేతో మ్యాచ్‌లో మా జట్టు నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగింది. జట్టు మేనేజేమెంట్‌కు బుర్ర లేదు. కేవలం ముగ్గురు పేసర్లు, సరైన మిడిలార్డర్ బ్యాటర్‌తో బరిలోకి దిగాల్సింది. ఇక బాబర్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు రావాలి. పవర్ ప్లేలో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చే మంచి ఓపెనర్లు అవసరం. ఫఖర్ జమాన్‌ను కేవలం బెంచ్‌కే పరిమితం చేశాడు. అతడికి ఆస్ట్రేలియాలో బాగా రాణించే సత్తా ఉంది. షాహీన్ షా ఆఫ్రిది ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. అయినప్పటికీ అతడికి అవకాశం ఇస్తున్నారు. అతడు పరుగులు భారీగా సమర్పించుకుంటున్నాడు అక్తర్ తెలిపాడు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: T20 World Cup 2022: వరుస ఓటములు.. అయినా పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు చేరే ఛాన్స్? -
‘కోహ్లి ఇప్పటికైనా రిటైర్ అవ్వాలి.. ఎందుకంటే’! నీ చచ్చు సలహాలు ఆపు!
T20 World Cup 2022- India Vs Pakistan- Virat Kohli: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. నిలకడలేమి ఫామ్‌తో విమర్శల పాలైన ఈ రన్‌మెషీన్ ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో శతకంతో తిరిగి పూర్వవైభవం సాధించాడు. దీంతో ఎన్నో అంచనాల నడుమ పాక్‌తో మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి విలువైన ఇన్నింగ్స్ ఆడి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. బ్యాట్‌తోనే విమర్శలకు సమాధానం ‘టీ20లకు కోహ్లి పనికిరాడు.. రిటైర్ అయితే మంచిదంటూ’ ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్లకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడంటూ వచ్చిన వార్తలు కింగ్ అభిమానులను కలవరపెట్టగా.. వారి అనుమానాలు పటాపంచలు చేస్తూ టీ20లో తన సత్తా ఏమిటో మరోసారి ఘనంగా చాటాడు. అక్తర్ షాకింగ్ కామెంట్స్ ఈ క్రమంలో కోహ్లిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుండగా.. పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. కోహ్లి ఇక టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయితే బాగుంటుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అందుకు గల కారణాన్ని కూడా అతడు వెల్లడించాడు. భారత్- పాకిస్తాన్ ఫలితంపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. ‘‘పాకిస్తాన్ అద్భుతంగా ఆడింది. ఆటగాళ్లూ.. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. నిజానికి ఇండియా మనకంటే అత్యద్భుతంగా ఆడింది. అందుకే వాళ్లు చరిత్రలో గుర్తుండిపోయే మ్యాచ్ గెలిచారు. రనౌట్లు, నో బాల్ వివాదం, స్టంపింగ్‌లు అన్నీ ఉన్నాయి. అయితే, టోర్నీలో ఇంకా మ్యాచ్‌లు మిగిలే ఉన్నాయి. ఇండియా- పాకిస్తాన్ తప్పక మరోసారి తలపడతాయి. పాక్‌కు మరో అవకాశం ఉంది’’ అని పేర్కొన్నాడు. కోహ్లిపై ప్రశంసలు కురిపిస్తూనే ఇక 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను గెలిపించిన కోహ్లి ఇన్నింగ్స్ గురించి అక్తర్ ప్రస్తావిస్తూ.. ‘‘మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఒక్కసారి పైకి లేచామంటే మునుపటి వైభవం సాధించవచ్చు. పట్టుదలగా ఆడి మనమేంటో నిరూపించుకోవచ్చు. విరాట్ కోహ్లి చేస్తున్నది అదే! తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఇన్నింగ్స్ అతడు ఆడేశాడు. తనపై తనకున్న నమ్మకం, తన పట్టుదలే అతడి విజయానికి కారణం’’ అంటూ ప్రశంసించాడు. రిటైర్ అవ్వాలి.. ఎందుకంటే! ‘‘కోహ్లి అదిరిపోయే ఇన్నింగ్స్‌తో తిరిగి వచ్చాడు. అయితే, తను టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ బాగుంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే.. తన శక్తిసామర్థ్యాలన్నింటినీ కేవలం టీ20లకే పరిమితం చేయడం సరికాదు. పాక్‌తో ఆడిన ఇన్నింగ్స్ మాదిరే వన్డేల్లోనూ చెలరేగాలి. ఓ మూడు సెంచరీలు సాధించాలి’’ అంటూ అక్తర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాజీ ఫాస్ట్‌బౌలర్ వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘కోహ్లి ఉంటే మీ ఆటలు సాగవనే ఇలా చెబుతున్నావా? కింగ్ ఎప్పటికీ, ఎక్కడున్నా కింగే! ఫార్మాట్ ఏదైనా తను బ్యాట్ ఝులిపించగలడు. సెంచరీలు తనకేమీ కొత్త కాదు... నీ చచ్చు సలహాలు అక్కర్లేదు గానీ.. పోయి పని చూసుకో’’ అంటూ కోహ్లి ఫ్యాన్స్ అక్తర్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా పాక్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా వరల్డ్‌కప్-2022 ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించింది. చదవండి: Ind Vs Pak: టీమిండియా మోసం చేసి గెలిచిందంటూ అక్కసు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్ కండరాల నొప్పి?! స్టార్ ప్లేయర్‌కు రెస్ట్?! కోచ్ క్లారిటీ.. అన్ని మ్యాచ్‌లు ఆడతాడంటూ WC 2022: పాక్‌తో మ్యాచ్‌లో విఫలం.. అందరి దృష్టి అతడిపైనే! నెట్స్‌లో తీవ్ర సాధన! పసికూనతో అయినా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC 2022: అక్తర్, బ్రాడ్ హాగ్‌లు దొరికేశారు కదా..!
తెగ గొంతులు చించేసుకున్నారు. అది అనైతికం అంటూ ప్రకటనలు ఇచ్చేశారు.. అది విజయమే కాదనేశారు.. ఆ గెలుపును తక్కువ చేసే యత్నం చేశారు. వాళ్లే క్రికెట్ నిష్ణాతుల్లా బిల్డప్‌లు ఇచ్చేశారు. ఇదంతా ఓ ఇద్దరి మాజీ క్రికెటర్ల గురించి చెబుతున్న మాట. క్రికెట్లో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు క్రికెట్ రూల్స్‌నే పక్క దారి పట్టించి అందర్నీ కన్ఫ్యూజ్ చేసిన బ్రాడ్ హాగ్, షోయబ్ అక్తర్‌లు గురించే ఇదంతా. ఇందులో ఒకరు ఆస్ట్రేలియా మాజీ అయితే, మరొకరు పాకిస్తాన్ మాజీ క్రికెటర్. ఏదిబడితే అది మాట్లాడితే ఇలానే ఉంటుంది.. ఎవరికైనా మనదాకా వస్తేగానీ అసలు విషయం బోధపడదని సామెత ఉంది. ఇది సరిపోతుంది ఈ ఇద్దరి మాజీ క్రికెటర్లకు. ఇది ఏ కాలం.. మనం ఎక్కడున్నాం..అనేది ముందు తెలుసుకోవాలి. సోషల్ మీడియా అంతగా లేని రోజుల్లో రుజువులు లేకపోతే అది గాల్లోకి కలిసిపోయేది. కానీ ఇప్పుడు అది కుదరదు. మనం మాట్లాడేముందు జాగ్రత్తగా ఉండాలంటారు. మనం సెలబ్రెటీ హోదాలో ఉండి ఏదో మాట్లాడేస్తే గతం బయటకొస్తుంది. ఇప్పుడు అలానే బయటకు తీశారు భారత్ క్రికెట్ అభిమానులు. ఇంకే ముందు బ్రాడ్ హాగ్, అక్తర్లను ఆడేసుకుంటున్నారు. ఎప్పుడో 2005లో జరిగిన ‘నో బాల్ బైస్ ఉదంతాన్ని’ మరొకసారి తెరపైకి తీసుకొచ్చి బ్రాడ్ హాగ్, అక్తర్‌లకు ప్రశ్నలు సంధిస్తున్నారు. గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో టీమిండియా తుది వరకూ పోరాడి పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్ఢుతమైన విజయానికి విరాట్ కోహ్లినే కారణం. కడవరకూ క్రీజ్‌లో టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. ఇక్కడ ఫ్రీ హిట్లో బంతి బెయిల్స్‌కు తాకినా కోహ్లి-దినేశ్ కార్తీక్‌లు మూడు పరుగులు చేయడాన్ని అక్తర్, హాగ్‌లు తప్పుబట్టారు. ఇది డెడ్ బాల్ కదా అంటూ గళం విప్పారు. ఇది అంపైర్లు ఒత్తిడిలో ఉండే అలా చేశారంటూ బిల్డప్ ఇచ్చే పని చేశారు. 17 ఏళ్ల క్రితం మ్యాచ్‌లోనే బెయిల్స్ పడినా.. కానీ ఎప్పుడో 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ మ్యాచ్‌లో ఫ్రీ హిట్లో బెయిల్స్ పడినా బైస్ రూపంలో వచ్చిన పరుగులకు సమస్య రాలేదు. 2005, జనవరి 13 వ తేదీన ఆస్ట్రేలియా-ఎ, పాకిస్తాన్ జట్ల మధ్య అడిలైడ్‌లో మ్యాచ్ జరిగింది. అది ట్వంటీ 20 మ్యాచ్. ఆ మ్యాచ్‌లో ముందుగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసే సమయంలో జేమ్స్ హోప్స్-బ్రాడ్ హాడిన్‌లు ఓపెనర్లగా దిగారు. ఈ క్రమంలోనే అక్తర్ వేసిన ఓవర్లో ఒక బంతి నో బాల్ అయ్యింది. ఫలితంగా ఫ్రీ హిట్ వచ్చింది. ఆ బంతిని వికెట్ల వెనుకు వెళ్లి ఆడిన హాడిన్ మిడ్ వికెట్‌గా మీదుగా షాట్ ఆడాడు. దానికి రెండు పరుగులు వచ్చాయి. ఫ్రీహిట్‌గా వేసిన బంతి కూడా నో బాల్ కావడంతో బంతి కౌంట్ కాలేదు. మళ్లీ ఫ్రీ హిట్ వచ్చింది. ఆ బంతిని కూడా సేమ్ ఆలానే ఆడబోయాడు హాడిన్. కానీ అది బెయిల్స్‌ను గిరాటేసింది. అది ఫ్రీ హిట్ కావడంతో బతికిపోయిన హాడిన్ రెండు పరుగులు తీశాడు. మరి అప్పుడు అక్తర్ ఎటువంటి చప్పుడు చేయలేదు. నెక్స్ట్ బాల్ వేయడానికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అది మ్యాచ్ ఆరంభం కాబట్టే అక్తర్ దాన్ని పట్టించుకోలేదా..మరొకవైపు అస్ట్రిలియా కాబట్టి ఆస్ట్రేలియన్లు ఎవరు నోరు విప్పే సాహసం చేయలేదా..అప్పుడు రూల్స్ లేవా బ్రాడ్ హాగ్, అక్తర్.. ఇదిగో ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది..మరి ఓ లుక్కేయండి Did you play that match @Brad_Hogg sir? pic.twitter.com/pC1eVoNjhM — Koushik Karfa (@koushikkarfa12) October 23, 2022 -
అంపైర్లపై అక్తర్ ట్వీట్.. అంతగా బుర్ర చించుకోకు! బాగా మండుతున్నట్లుంది కదా!
T20 World Cup 2022- India Vs Pakistan- Shoaib Akhtar: టీ20 ప్రపంచకప్.. అసలే దాయాదుల పోరు.. బంతి బంతికీ ఉత్కంఠ... గెలవడానికి భారత్ చివరి ఓవర్లో 16 పరుగులు చేయాలి. క్రీజులో ‘హార్డ్ హిట్టర్’ హార్దిక్ పాండ్యా, కోహ్లి ఉన్నారు. హార్దిక్ జోరు చూస్తుంటే మూడు షాట్లలో మ్యాచ్‌ను ముగించేస్తాడనిపించింది. కానీ ఆదివారం నాటి ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 19.1 నవాజ్ వేసిన తొలి బంతికి భారీ షాట్ ఆడిన పాండ్యా అవుటయ్యాడు. 19.2క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 1 పరుగు తీసి కోహ్లికి స్ట్రయిక్ ఇచ్చాడు. 19.3 కోహ్లి 2 పరుగులు తీశాడు. భారత విజయ సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులు. 19.4 నవాజ్ వేసిన ఫుల్‌టాస్‌ను కోహ్లి డీప్ స్క్వేర్‌లో సిక్సర్‌గా మలిచాడు. అంపైర్ దీనిని ‘హైట్ నోబాల్‌గా’ ప్రకటించాడు. దీంతో భారత్ ఖాతాలో 1 బంతికి 7 పరుగులు చేరాయి. భారత్‌కు ‘ఫ్రీ హిట్’ అవకాశం కూడా వచ్చింది. విజయ సమీకరణం 3 బంతుల్లో 6 పరుగులుగా మారింది. 19.4 ఈసారి నవాజ్ వైడ్ వేశాడు. ఫ్రీ హిట్ సజీవంగా నిలిచింది. 19.4 ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయ్యాడు. ‘ఫ్రీ హిట్’పై కేవలం రనౌట్ అయితేనే అవుట్‌గా పరిగణిస్తారు. వికెట్లకు తగిలిన బంతి థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లింది. కోహ్లి, కార్తీక్ 3 ‘బై’ పరుగులు తీశారు! చర్చకు తెరతీసిన ఆ మూడు పరుగులు ఇప్పుడు ఈ విషయంపై క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఫ్రీ హిట్ బంతికి కోహ్లి బౌల్డ్ అయినా ఈ మూడు పరుగులు ఎలా ఇచ్చారన్న అంశం మీద ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ ఇప్పటికే పలు ప్రశ్నలు లేవెనెత్తిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంలో అంపైర్ల నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘‘భయ్యా.. ఈరోజు రాత్రంతా బుర్ర చించుకునేలా మెదడుకు బాగానే మేత వేశారు కదా’’ అంటూ అంపైర్లను ఉద్దేశించి అతడు వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అంతలా బుర్ర చించుకోకు.. ఇందుకు స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో అక్తర్‌కు కౌంటర్ ఇస్తున్నారు. ‘‘మరీ అంతలా బుర్ర చించుకోకు. బాగా మండుతున్నట్లుంది. బర్నాల్ రాసుకో. ఆ తర్వాత తీరిగ్గా ఐసీసీ రూల్స్ చదువు. సరేనా.. కాస్త ప్రశాంతంగా ఉండు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రకరకాల మీమ్స్‌తో అక్తర్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా నో బాల్ నేపథ్యంలో 3 పరుగులు వచ్చిన తర్వాత విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఈ క్రమంలో.. 19.5 దినేశ్ కార్తీక్ స్వీప్ షాట్ ఆడగా బంతి అతని ప్యాడ్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. కార్తీక్ క్రీజులోకి వచ్చేలోపు పాక్ కీపర్ రిజ్వాన్ స్టంపౌట్ చేశాడు. విజయ సమీకరణం 1 బంతికి 2 పరుగులుగా మారింది. 19.5 తీవ్ర ఒత్తిడిలో ఉన్న నవాజ్ లెగ్ సైడ్‌లో బంతి వేశాడు. అంపైర్ దానిని వైడ్‌గా ప్రకటించాడు. దాంతో భారత విజయ సమీకరణం 1 బంతికి 1 పరుగుగా మారింది. 19.6 ఈసారి నవాజ్ వేసిన బంతిని అశ్విన్ మిడాఫ్‌లో ఫీల్డర్ మీదుగా షాట్ ఆడాడు. పరుగు తీశాడు. భారత్ విజయం ఖరారైంది. టీమిండియా అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింగ్ కోహ్లిపై సాహో అంటూ క్రీడాలోకం ప్రశంసల వర్షం కురిపించింది. చదవండి: ఓటమిని జీర్ణించుకోలేక టీవీ పగలగొట్టిన పాక్ అభిమాని.. సెహ్వాగ్ ట్వీట్ వైరల్ Virat Kohli: కోహ్లి తప్ప ఇంకెవరూ ఆ షాట్లు ఆడలేరు.. ఆ రెండు సిక్స్‌లు ప్రత్యేకం.. పాండ్యా ఫిదా.. కింగ్‌పై ప్రశంసల జల్లు Umpire bhaiyo, food for thought aaj raat k liye 😉 pic.twitter.com/vafnDG0EVd — Shoaib Akhtar (@shoaib100mph) October 23, 2022 For you and for all Pakistan 😜 pic.twitter.com/kALP0Cz2rB — sneha karmakar (@snehakarmaka) October 23, 2022 READ pic.twitter.com/igLHOU0aVH — King Kohli🇮🇳🇮🇳 (@shreyas13071992) October 23, 2022 -
బౌలౌట్‌లో ఇప్పటికీ ఓడించలేకపోతుంది.. పాపం పాకిస్తాన్
2007లో తొలిసారి నిర్వహించిన టి20 ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించి విజేతగా అవతరించిన టీమిండియా తొలి టి20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. అంతకముందు ఇదే ప్రపంచకప్‌లో టీమిండియా, పాకిస్తాన్‌లు గ్రూఫ్ దశలోనే తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్ టై కావడం.. ఆ తర్వాత బౌలౌట్‌లో విజేతను తేల్చడం అభిమానులు ఇప్పటికి గుర్తుపెట్టుకున్నారు. టీమిండియా, పాకిస్తాన్ల మధ్య అప్పటివరకు ఎన్నో మ్యాచ్‌లు జరిగినప్పటికి.. బౌలౌట్ మ్యాచ్‌కు మాత్రం చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంటుంది. విషయానికి వస్తే.. తాజాగా వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచకప్ 2022లో అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్‌లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాల అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంటే.. పాక్ మాత్రం మరో విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు నెలరోజుల సమయం ఉన్నప్పటికి ఆసక్తి మాత్రం తారాస్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా, పాకిస్తాన్‌కు చెందిన దిగ్గజ క్రికెటర్లు 2007 బౌలౌట్ ఫ్లాష్‌బ్యాక్ పేరిట వీడియోనూ రూపొందించారు. ఈ వీడియోలో బౌలౌట్ ద్వారా ఫలితాన్ని నిర్ణయించాలనుకున్నారు. కాగా భారత్ తరపున దిగ్గజాలు సునీల్ గావస్కర్, శివరామకృష్ణన్, వివిఎస్ లక్ష్మణ్‌లు పాల్గొనగా.. పాకిస్తాన్ నుంచి రమీజ్ రాజా, షోయబ్ అక్తర్, అమీర్ సోహైల్‌లు ఉన్నారు. బౌలౌట్‌లో తొలి బంతిని పాకిస్తాన్ నుంచి రమీజ్ రాజా వేయగా మిస్ అయింది. ఇక భారత్ నుంచి సునీల్ గావస్కర్ వేయగా వికెట్లకు తాకడంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో ప్రయత్నంలో పాకిస్తాన్ నుంచి అమీర్ సోహైల్ వేయగా.. ఈసారి కూడా గురి తప్పింది.. ఇక భారత్ నుంచి సొగసరి బ్యాటర్ వివిఎస్ లక్ష్మణ్ వేయగా.. గురి తప్పలేదు.. భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక ముచ్చటగా మూడోసారి పాక్ తరపున షోయబ్ అక్తర్ వేయగా.. బంతి చాలా దూరం నుంచి వెళ్లింది. ఇక చివరగా భారత్ నుంచి శివరామకృష్ణన్ వేయగా.. నేరుగా బంతి వికెట్లను గిరాటేసింది. అంతే భారత్ 3-0తో బౌలౌట్‌లో విజయం సాధించింది. ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు.. భారత్ దిగ్గజాలకు అభినందనలు తెలిపారు. 2007 bowl out flashbacks 😂 pic.twitter.com/eQOy3YoaRd — Out Of Context Cricket (@GemsOfCricket) September 17, 2022 దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు మాత్రం వినూత్నంగా స్పందించారు. ''2007లో పాకిస్తాన్ తొలిసారి బౌలౌట్‌లో ఓడిపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకు బౌలౌట్‌లో ఓడిపోతూనే వస్తుంది''.. ''ఎన్నిసార్లు బౌలౌట్లు నిర్వహించినా విజయం టీమిండియాదే..'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక అప్పటి బౌలౌట్ విషయానికి వస్తే.. 2007 టి20 ప్రపంచకప్‌లో టీమిండియా స్కాట్లాండ్తో తొలి మ్యాచ్ ఆడాల్సింది. కానీ వర్షం కారణంగా రద్దు కావడంతో తర్వాతి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఎదుర్కొంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండయా 141 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో అన్నే పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో అప్పటి నిబంధనల ప్రకారం బౌల్ ఔట్‌కు వెళ్లా్ల్సి వచ్చింది. అంతర్జాతీయ టీ20ల చరిత్రలో బౌలౌట్ నిర్వహించడం ఇది రెండోసారి మాత్రమే.పాకిస్థాన్ బౌలర్లు ముగ్గురూ ఒక్కసారి కూడా వికెట్లను పడగొట్టలేకపోగా.. భారత్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప ఒక్కో బాల్ వేసి వికెట్లను పడగొట్టారు. దీంతో 3-0 తేడాతో భారత్ గెలుపొందింది. ఆ తర్వాత బౌలౌట్ స్థానంలో సూపర్ ఓవర్ తీసుకొచ్చారు. మరో విషయం ఏంటంటే.. బౌటౌట్ సమయంలో పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మాములుగానే వికెట్ల వెనుక నిలబడగా.. ధోనీ మాత్రం తెలివిగా.. బౌలర్ల ఏకాగ్రత చెదరకుండా ఉండటం కోసం వికెట్ల వెనుక మోకాళ్ల మీద కూర్చున్నాడు. ఇది భారత్ విజయానికి ఎంతో ఉపయోగపడిందని చెప్పొచ్చు. -
'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!'
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పీసీబీ సెలెక్టర్లపై మండిపడ్డాడు. టి20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన పాక్ జట్టు పరమ చెత్తగా ఉందని.. ఇలా అయితే ప్రతిష్టాత్మక టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరుగుతుందంటూ పేర్కొన్నాడు. టి20 ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈ గురువారం ప్రకటించారు. బాబర్ ఆజం కెప్టెన్ కాగా.. షాదాబ్ ఖాన్ వైస్‌కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫాస్ట్ బౌలర్ షాహిన్ అఫ్రిది తిరిగి జట్టులోకి రాగా.. చాలాకాలం తర్వాత హైదర్ అలీ జ్టుటలో చోటు సంపాదించాడు. అయితే ఆశ్చర్యంగా ఫఖర్ జమాన్‌ను రిజ్వర్ జాబితాలో చోటు కల్పించింది. ఇక సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌కు సెలక్టర్లు మరో సారి మొండి చేయి చూపించారు. ఇక ఆసియా కప్ ఫైనల్ ఆడిన జట్టులోని ఆటగాళ్లంతా టి20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యారు. కాగా జట్టు ఎంపికపై షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. ''టి20 ప్రపంచకప్‌కు ప్రకటించిన పాకిస్తాన్ జట్టు సమతుల్యంగా లేదు. ముఖ్యంగా మిడిలార్డర్ చాలా వీక్‌గా కనిపిస్తోంది. ఇలాంటి మిడిలార్డర్ ఉంటే ప్రతిష్టాత్మక టోర్నీలో తొలి రౌండ్లోనే వెనుదిరగడం గ్యారంటీ. మిడిలార్డర్లో సమర్థుల అవసరం ఉంది.. బ్యాటింగ్ డెప్త్ పెంచాల్సిందే. ఇది సాధ్యం కాకపోతే పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఒక్కో మ్యాచ్ గెలవడానికి కష్టపడాల్సిందే. అలా జరగకూడదని కోరుకుంటున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అక్తర్ వ్యాఖ్యలపై అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''మొన్ననే కదా ఆసియాకప్‌లో ఫైనల్ వరకు చేరారు.. అంత మాట ఎలా అంటావు అక్తర్''.. ''మిడిలార్డర్ కాదు.. ముందు బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తీసేయాలి.. అప్పుడే టీం బాగా ఆడుతుంది.'' అంటూ పేర్కొన్నారు. ఇక టి20 ప్రపంచకప్‌లో గ్రూఫ్-2లో ఉన్న పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం) ఆడనుంది. ఆ తర్వాత సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, క్వాలిఫయర్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. టి20 ప్రపంచకప్‌కు పాకిస్థాన్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది మసూద్, ఉస్మాన్ ఖాదిర్ రిజర్వ్ ఆటగాళ్లు: ఫఖర్ జమాన్, మహ్మద్ హరీస్, షానవాజ్ దహానీ చదవండి: క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్న ఉసేన్ బోల్ట్ కడసారి చూపులకు 13 గంటలు నిరీక్షించిన మాజీ కెప్టెన్ -
T20 WC 2022: ‘ప్రపంచకప్ తర్వాత కోహ్లి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు’!
T20 World Cup 2022- Virat Kohli: ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో సెంచరీతో సత్తా చాటాడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి. అంతర్జాతీయ కెరీర్లో ఈ రన్‌మెషీన్‌కు ఇది 71వ శతకం కాగా.. పొట్టి ఫార్మాట్లో మొదటి సెంచరీ. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తరఫున టాప్ స్కోరర్(274 పరుగులు) కూడా కోహ్లినే కావడం విశేషం. ఈ నేపథ్యంలో.. ఇదే తరహాలో టీ20 వరల్డ్‌కప్-2022 ఈవెంట్లోనూ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాలని కింగ్ కోహ్లి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మాత్రం కోహ్లి రిటైర్మెంట్ గురించి ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడం ఫ్యాన్స్‌కు చిరాకు తెప్పిస్తున్నాయి. పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెబుతాడు! పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది.. కోహ్లిని ఉద్దేశించి.. కెరీర్లో ఉన్నత స్థితిలో ఉన్నపుడే ఆటకు వీడ్కోలు పలికితే బాగుంటుందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సైతం ఇదే తరహాలో మాట్లాడాడు. టీ20 ప్రపంచకప్-2022 తర్వాత కోహ్లి పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెబుతాడని అంచనా వేశాడు. ఈ మేరకు ఈ మాజీ ఫాస్ట్‌బౌలర్.. ‘‘టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత ఈ ఫార్మాట్‌కు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. నేనైతే అలాగే చేస్తాను.. ఎందుకంటే! అయితే, మిగతా ఫార్మాట్లలో మాత్రం అతడు కొనసాగుతాడు. ఒకవేళ నేను గనుక అతడి స్థానంలో ఉండి ఉంటే.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకునేవాడిని. మిగిలిన రెండు ఫార్మాట్లపై మరింత ఎక్కువ దృష్టి సారించి.. కెరీర్‌ను కొనసాగించే అవకాశం దొరుకుతుంది’’ అని ఇండియా డాట్‌కామ్ సెషన్లో పేర్కొన్నాడు. కాగా గతేడాది ప్రపంచకప్ ముగిసిన తర్వాత కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీ జరుగనుంది. ఈ ఐసీసీ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. ఇక ప్రపంచకప్ కంటే ముందు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో రోహిత్ సేన వరుస సిరీస్‌లు ఆడనుంది. చదవండి: 'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'.. ఎంతైనా పాక్ క్రికెటర్! పవర్ హిట్టర్ రీ ఎంట్రీ.. టి20 ప్రపంచకప్‌కు విండీస్ జట్టు -
Asia Cup 2022: అనుష్క ఐరన్ లేడీ.. కోహ్లి ఉక్కు మనిషి..: పాక్ మాజీ క్రికెటర్
Asia Cup 2022 Virat Kohli Century: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, అతడి సతీమణి, నటి అనుష్క శర్మపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనుష్క ఐరన్ లేడీ.. కోహ్లి ఉక్కు మనిషి అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. కాగా గతకొన్ని రోజులుగా విమర్శల పాలైన కోహ్లి.. ఆసియా కప్-2022 టోర్నీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూసిన సెంచరీ ఫీట్ నమోదు చేశాడు. దాదాపు మూడేళ్ల తర్వాత శతకం బాదాడు. సూపర్-4లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి 61 బంతుల్లో 122 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. దీంతో రన్‌మెషీన్ 71వ సెంచరీ చూడాలని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఇక తనకు టీ20 ఫార్మాట్లో ఇదే తొలి శతకం కావడం.. అది కూడా అత్యంత కఠిన పరిస్థితుల్లో శతకం బాదడంతో కోహ్లి సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. వాళ్లిద్దరికీ అంకితం అఫ్గన్‌తో మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. గడ్డు పరిస్థితుల్లో తన భార్య అనుష్క తనకు అండగా నిలిచిందని.. ఈ సెంచరీ ఆమెకు, తమ చిన్నారి కూతురు వామికాకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక కోహ్లి వ్యాఖ్యలపై స్పందించిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్.. విరుష్క జోడీని ఆకాశానికెత్తాడు. హ్యాట్సాఫ్ అనుష్క! తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందిస్తూ.. ‘‘మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. ఆమె నా జీవితంలో చేదు ఘటనలను దగ్గరగా చూసింది అన్నాడు. అతడు తన భార్య గురించే ఆ మాటలు చెప్పాడు. హ్యాట్సాఫ్ టూ అనుష్క శర్మ.. వెల్డన్! నువ్వు ఐరన్ లేడీవి. అతడు ఉక్కుతో తయారైన మనిషి.. అతడెవరంటే మిస్టర్ విరాట్ కోహ్లి’’ అని అక్తర్ అభివర్ణించాడు. అదే విధంగా కోహ్లి మరో 29 సెంచరీలు చేసి సచిన్ వంద సెంచరీల రికార్డును సమం చేస్తే చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచిపోతాడని పేర్కొన్నాడు. ఇందుకోసం కోహ్లి ఎంతో సంయమనం.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించాడు. నువ్వు మంచివాడివి.. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది అంటూ కోహ్లిపై అభిమానం చాటుకున్నాడు. కాగా ఆసియా కప్-2022లో భారత జట్టు కనీసం ఫైనల్ కూడా చేరకుండానే నిష్క్రమించింది. దుబాయ్ వేదికగా సెప్టెంబరు 11న శ్రీలంక- పాకిస్తాన్ మధ్య ట్రోఫీ కోసం పోరు జరుగనుంది. చదవండి: ఫైనల్లో నసీం షా ఇబ్బంది పెడతాడనుకుంటున్నారా? లంక ఆల్‌రౌండర్ రిప్లై ఇదే! -
తుది జట్టులో ఎవరుండాలో ఓ క్లారిటీతో ఉండాలి.. !
ఆసియా కప్ సూపర్-4 దశలో పాక్ చేతిలో పరాజయం అనంతరం ఆ దేశ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ టీమిండియా తుది జట్టు ఎంపికపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో ఎవరెవరు ఉండాలో కనీసం కోచ్‌కైనా పూర్తి అవగాహణ ఉండాలని చవాక్కులు పేలాడు. తుది జట్టు ఎంపికలో ఇంత గందరగోళం ఏంటని ప్రశ్నించాడు. 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు టీమిండియా మేనేజ్మెంట్ నానా అవస్థలు పడుతుందని, జట్టు కూర్పు విషయంలో యాజమాన్యం, కోచ్‌కు ఓ క్లారిటీ ఉండాలని బిల్డప్ ఇచ్చాడు. ఓ ఆటగాడు విఫలమైతే లేదా గాయపడితే ప్రత్యామ్నాయ ఆటగాడిని ముందే ఎంచుకోవాలని అనవసర సలహాలు ఇచ్చాడు. గాయం కారణంగా రవీంద్ర జడేజా, అనారోగ్యం కారణంగా ఆవేశ్ ఖాన్లు జట్టుకు దూరమైన నేపథ్యంలో వారి స్థానాల్లో సంబంధిత స్పెషలిస్ట్‌లను జట్టులోకి తీసుకోవాలి కాని.. అనవసర మార్పులు, చేర్పులు చేసి చేతులు కాల్చుకుందని అన్నాడు. స్పెషలిస్ట్ వికెట్‌కీపర్ కమ్ ఫినిషర్ కోటాలో ఎంపిక చేసుకున్న దినేశ్ కార్తీక్‌ను పక్కకు పెట్టి ఎక్స్ట్రా స్పిన్నర్‌ను తీసుకోవడమేంటని అవగాహన లేకుండా పేలాడు. ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హుడాను తీసుకున్నప్పుడు అతనితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించకపోవడమేంటని ప్రశ్నించారు. మొత్తంగా సూపర్-4 దశలో పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా ఎంపిక గందరగోళంగా ఉందని అన్నాడు. తన సొంత యూట్యూబ్ ఛానల్ వేదికగా అక్తర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, భారత్-పాక్‌ల మధ్య ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన సమరంలో.. పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ గెలుపొందింది అనడం కంటే.. టీమిండియా పరాజయంపాలైందని అనడమే బెటరని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: లంకతో సమరం.. పంత్, చహల్‌లను పక్కకు పెట్టడమే ఉత్తమం..! -
భారత్-పాక్‌లు పోటీపడి మరీ చెత్తగా ఆడాయి.. క్రికెట్లో ఇదో చీకటి రోజు..!
ఆసియా కప్ 2022లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య నిన్న (ఆగస్ట్ 28) జరిగిన హైఓల్టేజీ పోరుపై పాకిస్థాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్-పాక్‌లు పోటీపడి మరీ చెత్తగా ఆడాయని, ఓడిపోయేందుకు ఇరు జట్లు సర్వశక్తులు ఒడ్డాయని, క్రికెట్లో ఇదో చీకటి రోజని వివాదాస్పద ఆరోపణలు చేశాడు. ఓడిపోయే ప్రయత్నంలో భారత్ దాదాపుగా విజయం సాధించిందని, అయితే హార్ధిక్ టీమిండియా ప్రయత్నాన్ని అడ్డుకున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. పాక్ ఆటగాళ్లు జిడ్డు బ్యాటింగ్‌లో తమకు సాటే లేరన్నట్లుగా ఆడారని, ఇందుకు వారిని అభినందించకుండా ఉండలేమని చతుర్లు విసిరాడు. ఇరు జట్ల కూర్పు విషయంలోనూ అక్తర్ నోరు పారేసుకున్నాడు. పంత్‌ను పక్కకు పెట్టడంపై భారత కెప్టెన్ రోహిత్ శర్మను విమర్శించాడు. రోహిత్ అనునిత్యం ప్రయోగాలు చేస్తూ గాలివాటం విజయాలు సాధిస్తున్నాడని అన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు అధ్వానంగా ఆడాయని మ్యాచ్ అనంతరం తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అక్తర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇరు దేశాల అభిమానులు మండిపడుతున్నారు. అక్తర్ క్రికెట్ పరిజ్ఞానం లేని వ్యక్తి అని, అతని వ్యాఖ్యలపై స్పందించడం అనవసరమని కౌంటరిస్తున్నారు. పాక్ ఓడిందన్న వైరాగ్యంలో అక్తర్ ఇలాంటి పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడని ఇండియన్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. చదవండి: ప్రత్యర్ధినైనా కోహ్లికి అభిమానినే.. ఆటోగ్రాఫ్ ప్లీజ్..! -
11 ఏళ్లుగా నొప్పిని భరిస్తూ.. ఎట్టకేలకు
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఎమెషనల్ వీడియోతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఇటీవలే మోకాలి సర్జరీ కోసం అక్తర్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. మెల్బోర్న్లోని ఒక ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న అక్తర్ కోలుకుంటున్నాడు. కాగా అక్తర్ గత 11 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఒక రకంగా అక్తర్ క్రికెట్ నుంచి వైదొలగడానికి పరోక్షంగా ఇది కూడా ఒక కారణం. మొత్తానికి ఇన్నేళ్లకు మోకాలీ సర్జరీ చేయించుకున్న అక్తర్ కాస్త రిలీఫ్ అయ్యాడు. ఈ సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ.. ''11 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నా. వాస్తవానికి క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అయితే మోకాలి నొప్పితో మరో నాలుగైదేళ్లు ఆడి ఉంటే మాత్రం కచ్చితంగా వీల్‌చైర్‌కు పరిమితమయ్యేవాడిని. ఎలాగోలా ఇన్నేళ్లకు సర్జరీ చేయించుకున్నా. కాస్త నొప్పిగా ఉంది. మీ ప్రార్థనలు నేను తొందరగా కోలుకునేలా చేస్తాయని ఆశిస్తున్నా. ఇదే నా చివరి సర్జరీ కూడా కావాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ప్రస్తుతం షోయబ్ అక్తర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక షోయబ్ అక్తర్ పాకిస్తాన్ తరపున అన్ని ఫార్మాట్లు కలిపి 224 మ్యాచ్‌లాడి 444 వికెట్లు పడగొట్టాడు. Alhamdolillah, surgery went well. It will take some time to recover. Need your prayers. A special thanks to @13kamilkhan as well, he's a true friend who is looking after me here in Melbourne. pic.twitter.com/jCuXV7Qqxv — Shoaib Akhtar (@shoaib100mph) August 6, 2022 చదవండి: Kieron Pollard: చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. ఎవరికి అందనంత ఎత్తులో -
Shoaib Akhtar: పట్టాలెక్కనున్న రావల్పిండి ఎక్స్‌ప్రెస్
పాకిస్థాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుంది. ఈ విషయాన్ని అక్తరే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ఈ చిత్రానికి ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అనే పేరును ఖరారు చేస్తూ.. 'రన్నింగ్ అగెయిన్స్ట్ ది ఆడ్స్' అంటూ టైటిల్ క్యాప్షన్‌ను జోడించాడు. అందమైన ప్రయాణానికి ఇది ప్రారంభం.. ఈ సినిమా ద్వారా ఇప్పటివరకు వెళ్లని రైడ్‌కు మీరు వెళ్లనున్నారు.. పాకిస్తాన్ క్రీడాకారునికి సంబంధించి ఇది తొలి విదేశీ చిత్రం.. వివాదాస్పదంగా మీ షోయబ్ అక్తర్ అంటూ అక్తర్ తన ట్వీట్లో రాసుకొచ్చాడు. Beginning of this beautiful journey. Announcing the launch of my story, my life, my Biopic, "RAWALPINDI EXPRESS - Running against the odds" You're in for a ride you've never taken before. First foreign film about a Pakistani Sportsman. Controversially yours, Shoaib Akhtar pic.twitter.com/3tIgBLvTZn — Shoaib Akhtar (@shoaib100mph) July 24, 2022 బయోపిక్కు సంబంధించిన గ్లింప్స్‌ను అక్తర్ ట్విటర్ ద్వారా విడుదల చేస్తూ.. 2023 నవంబర్ 16న సినిమా విడుదల అవుతుందని స్ఫష్టం చేశాడు. పాక్ దర్శకుడు ముహమ్మద్ ఫరాజ్ కైజర్ ఈ బయోపిక్‌ను తెరకెక్కించనున్నాడు. ఈ బయోపిక్కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాకిస్థాన్‌లోని రావల్పిండి ప్రాంతానికి చెందిన అక్తర్ తన క్రికెట్, క్రికెటేతర జీవితంలోని అనుభవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. గతంలో భారత క్రికెటర్లు సచిన్, ధోని, మిథాలీ రాజ్, ప్రవీణ్ తాంబేల బయోపిక్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. 1997లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అక్తర్.. 13 ఏళ్ల కెరీర్లో 46 టెస్ట్‌లు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడి ఓవరాల్‌గా 444 వికెట్లు పడగొట్టాడు. చదవండి: Ind Vs WI: మీ అత్యుత్తమ స్పిన్నర్ ఎవరో తెలియదా? అతడి విషయంలో ఎందుకిలా? -
పంత్ కాస్త బరువు తగ్గు
-
చూడటానికి బాగుంటాడు.. కాస్త బరువు తగ్గితే! కోట్లలో సంపాదించవచ్చు!
Shoaib Akhtar Comments On Rishabh Pant: టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్‌పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత పంత్‌దే అని కొనియాడాడు. తన దూకుడైన ఆటతో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టిస్తాడని, వైవిధ్యమైన షాట్లతో అలరిస్తాడంటూ కితాబిచ్చాడు. అయితే, ఈ 24 ఏళ్ల యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలని, బరువు తగ్గితే బాగుంటుందని అక్తర్ సూచించాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో పంత్ 125 పరుగులతో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. పంత్ సెంచరీ ఇన్నింగ్స్‌కు హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన తోడు కావడంతో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో పంత్ గురించి షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ చానెల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిషభ్ పంత్ దూకుడైన ఆటగాడు. ప్రత్యర్థి ఎవరైనా అతడు భయపడడు. కట్ షాట్, పుల్ షాట్, రివర్స్ స్వీప్, స్లాగ్ స్వీప్, పాడల్ స్వీప్.. ఇలా వైవిధ్యమైన షాట్లు ఆడగలడు. ఆస్ట్రేలియా గడ్డ మీద చిరస్మరణీయ టెస్టు విజయం అందించాడు. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ భారత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు’’ అని పంత్‌ను ప్రశంసించాడు. బాగుంటాడు.. మోడల్ అయితే! ఇక ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఉండాల్సిన దానికన్నా పంత్ ఎక్కువ బరువు ఉన్నాడు. ఈ విషయంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే.. ఇండియన్ మార్కెట్ చాలా పెద్దదన్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి పంత్ చూడటానికి బాగుంటాడు. గట్టిగా ప్రయత్నిస్తే మోడల్‌గా రాణించగలడు. కోట్లు సంపాదించే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఎవరైనా సూపర్‌స్టార్‌గా అవతరిస్తే కచ్చితంగా వారిపై కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉంటారు కదా’’ అని అక్తర్ చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. యూకే టూర్ ముగించుకుని ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. చదవండి: NZ vs IRE: తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా..! -
T20 WC: ఈసారి టీమిండియాను ఓడించడం పాక్‌కు అంత ఈజీ కాదు: అక్తర్
T20 World Cup 2022- India Vs Pakistan: టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియాను ఓడించడం పాకిస్తాన్‌కు అంత సులభమేమీ కాదని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఈసారి భారత జట్టు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుందని పేర్కొన్నాడు. కాబట్టి బాబర్ ఆజం బృందానికి గెలుపు అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డాడు. కాగా గతేడాది జరిగిన పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్ అనూహ్య రీతిలో టీమిండియాను ఓడించిన విషయం తెలిసిందే. ఏకంగా 10 వికెట్ల తేడాతో కోహ్లి సేనను మట్టికరిపించి ఐసీసీ టోర్నీలో భారత్‌పై తొలి గెలుపు నమోదు చేసింది. తద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇక ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనుంది. అక్టోబరు 16న మెగా టోర్నీ మొదలు కానుంది. ఇందులో భాగంగా భారత్- పాకిస్తాన్ జట్లు అక్టోబరు 23న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో తలపడనున్నాయి. ఈసారి అంత వీజీ కాదు! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్‌బౌలర్ షోయబ్ అక్తర్ పాకిస్తాన్ క్రికెట్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ మేరకు.. ‘‘ఈసారి టీమిండియా సరైన ప్రణాళికలతో బరిలోకి దిగుతుంది. ఈసారి టీ20 వరల్డ్‌కప్ ఈవెంట్లో భారత్‌ను ఓడించడం పాకిస్తాన్‌కు అంత తేలికేమీ కాదు. ఇప్పుడే విజేతను అంచనా వేయడం కష్టమే. అయితే, మెల్బోర్న్ పిచ్ పాతబడే కొద్ది బౌన్సీగా తయారవుతుంది. ఫాస్ట్ బౌలర్లకు అనూకూలిస్తుంది. కాబట్టి టాస్ గెలిస్తే పాకిస్తాన్ తొలుత బౌలింగ్ చేయకూడదు’’ అని సూచించాడు. మొదట బ్యాటింగ్ చేస్తే మెరుగైన ఫలితం పొందవచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా దాదాపు లక్షా యాభై వేల మంది ప్రేక్షకులు మెల్బోర్న్ గ్రౌండ్‌కు వచ్చే అవకాశం ఉందని అక్తర్ అంచనా వేశాడు. చదవండి: Rohit Sharma- Virat Kohli: కోహ్లికి అండగా నిలిచిన రోహిత్ శర్మ.. అతడు చేసింది కరెక్టే! అయినా కపిల్ దేవ్... T20 World Cup 2022: జెయింట్ రిషబ్ పంత్.. గాడ్జిల్లాలా ఎంట్రీ.. ! Welcome to The Big Time, Rishabh Pant 🚁 🚁#T20WorldCup pic.twitter.com/ZUSK63ssFZ — T20 World Cup (@T20WorldCup) July 10, 2022 -
IND Vs IRE: గంటకు 208 కి.మీ. వేగం.. అక్తర్ రికార్డు బద్దలు కొట్టిన భువీ?
India vs Ireland T20 Series: ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొదటి ఓవర్ ఐదో బంతికే ఐరిష్ కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీని అవుట్ చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ వైస్ కెప్టెన్ 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. తద్వారా హార్దిక్ పాండ్యా సేన ఐర్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందడంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా భువీ బౌలింగ్ చేస్తున్నపుడు స్పీడోమీటర్ రెండుసార్లు గంటకు 200కు పైగా కిలోమీటర్ల వేగంతో అతడు బంతి విసిరినట్లు చూపడం గమనార్హం. ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌కు భువీ వేసిన బాల్ 201 Km/h, అదే విధంగా బల్బిర్నీకి 208 201 Km/h వేగంతో బంతిని విసిరినట్లు చూపింది. నిజానికి అంతర్జాతీయ మ్యాచ్‌లో అత్యంత వేగంగా బంతిని విసిరిన రికార్డు పాకిస్తాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్(161.3 km/h) పేరిట ఉంది. అయితే, భువీ నిజంగా ఈ ఫీట్ నమోదు చేశాడా లేదంటే సాంకేతిక తప్పిదం కారణంగా స్పీడోమీటర్ ఇలా చూపిందా అన్న విషయం అంతుబట్టక నెటిజన్లు తికమకపడుతున్నారు. అదే సమయంలో.. భువీని కొనియాడుతూ.. ‘‘తప్పో.. ఒప్పో.. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. ఇంతకీ షోయబ్ అక్తర్’’ ఎవరూ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా స్పీడోమీటర్‌లో చూపింది విండ్స్పీడ్రా బాబూ అంటూ మరికొంత మంది పేర్కొంటున్నారు. ఏదేమైనా ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ స్కోర్లు: టాస్- భారత్- బౌలింగ్, వర్షం కారణంగా మ్యాచ్ 12 ఓవర్లకు కుదింపు ఐర్లాండ్ స్కోరు: 108/4 (12) టీమిండియా స్కోరు: 111/3 (9.2) విజేత: హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం చదవండి: IND Vs IRE- Hardik Pandya: మరీ ఇంత స్వార్థం పనికిరాదు! పాండ్యాపై నెటిజన్ల ఫైర్ Shoaib Akhtar, Umran Malik who??? Bhuvi just bowled the fastest ball ever.🤣🤣 Real pic, just took ss pic.twitter.com/2wDDDJQ6gK — Usama Kareem (@UsamaKarem2) June 26, 2022 201 kmph 😂😂#INDvIRE pic.twitter.com/QFNlhedAlb — Arslan Awan (@iamArslanawan) June 26, 2022 -
'ఉన్నప్పుడు పెద్దగా ఏం పీకలేదు.. ఇప్పుడెందుకు ఈ ముచ్చట్లు'
క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది టీమిండియా, పాకిస్తాన్‌లు. ఈ రెండు జట్లు ఎప్పుడు ఎక్కడ తలపడినా సరే.. ఆయా దేశాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఓడిన జట్టు విమర్శల పాలైతే.. గెలిచిన జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇక వరల్డ్‌కప్ లాంటి మేజర్ టోర్నీలైతే ఇక చెప్పనవసరం లేదు. కప్ గెలవకపోయినా సరే.. చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధిస్తే చాలని రెండు దేశాల అభిమానులు కోరుకుంటారు. ఇప్పటివరకు జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ల్లో పాకిస్తాన్ టీమిండియాను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో కీలకమైన సెమీఫైనల్లో దాయాదులు తలపడ్డాయి. సెమీస్ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. మొహలీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అప్పటి ఇరు దేశాల ప్రధానమంత్రులు మొహాలీకి తరలివచ్చారు. ఎంఎస్ ధోని సారథ్యంలోని టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (85), వీరేంద్ర సెహ్వాగ్ (38), సురేశ్ రైనా (36) రాణించారు. పాక్ తరఫున వహాబ్ రియాజ్ 5 వికెట్లు తీశాడు. అయితే లక్ష్య ఛేదనలో పాక్.. 49.5 ఓవర్లలో 231 పరుగుల వద్దే ఆలౌట్ అయింది. మిస్బా ఉల్ హక్ (56), మహ్మద్ హఫీజ్ (43) లు పాక్ ను ఆదుకున్నారు. భారత బౌలర్లు (జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, హర్భజన్ సింగ్, యువరాజ్) లు సమిష్టిగా రాణించి తలా రెండు వికెట్లు తీసి భారత్ కు విజయాన్ని అందించారు. దీంతో ఫైనల్ చేరిన టీమిండియా ఆ తర్వాత శ్రీలంకను ఓడించి 28 ఏళ్ల తర్వాత విశ్వ విజేతగా అవతరించింది.మరి ఇదంతా ఇప్పుడెందుకు చెబుతున్నారనే కాదా మీ డౌటూ. అక్కడికే వస్తున్నాం. 2011 వన్డే వరల్డ్‌కప్ సెమీస్ మ్యాచ్‌పై తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడి ఉంటే భారత్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యేదని.. ప్రపంచకప్ ఫైనల్‌కు పాకిస్తాన్ వెళ్లేదంటూ పేర్కొన్నాడు. అక్తర్ మాట్లాడుతూ.. ‘మొహాలీ జ్ఞాపకాలు నన్ను తీవ్రంగా వెంటాడుతున్నాయి. 2011 వరల్డ్ కప్ సెమీస్ లో నేను ఆడి ఉండాల్సింది. కానీ మా టీమ్ మేనేజ్మెంట్ మ్యాచ్‌కు ఫిట్ గా లేనని నన్ను పక్కనబెట్టింది. ఇది దారుణం. నేను భారత్ ను ఓడించి పాక్ ను వాంఖెడే (పైనల్ జరిగిన స్టేడియం) కు తీసుకెళ్లాలని భావించా. స్వదేశంలో మాతో మ్యాచ్ అంటే భారత్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దేశ ప్రజలు, మీడియా అంతా మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు మమ్మల్ని పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో మాపై ఒత్తిడి లేదు. ఆ మ్యాచ్ లో గనక నేను ఆడి ఉంటే సచిన్, సెహ్వాగ్ లను ముందే ఔట్ చేసేవాడిని. దాంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయేది. దాంతో మేం మ్యాచ్ ను ఈజీగా నెగ్గేవాళ్లం. ఆ మ్యాచ్ లో నన్ను డగౌట్ లో కూర్చోబెట్టి పాక్ ఓడిపోతుంటే చూడటం నేను తట్టుకోలేకపోయా. అంత కీలక మ్యాచ్ లో ఓడితే చాలా మంది ఏడుస్తారు. కానీ నేను అలా కాదు. ఏడ్వడం కంటే నా చుట్టు పక్కల ఉన్న వస్తువులను పగలగొడతా. మేం ఓడిపోతున్నప్పుడు కూడా చాలా వస్తువులు పగలగొట్టా. నేను చాలా నిరాశకు గురయ్యా. ఆ వేదన ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది..’ అని తెలిపాడు. అక్తర్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ''అంతకముందు 2003 వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు జట్టులోనే ఉన్నావుగా. మీ జట్టు ఓడిపోయిన సంగతి మరిచిపోయావా.. నీ బౌలింగ్‌లో సచిన్ శివతాండవం చేసింది గుర్తులేదా.. జట్టులో ఉన్నప్పుడు పెద్దగా పీకింది ఏం లేదు.. ఇప్పుడెందుకు ఈ ముచ్చట్లు'' అని కామెంట్స్ చేశారు. చదవండి: Tilak Varma: ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు.. దటీజ్ తిలక్ వర్మ ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు.. వీడియో వైరల్ -
T20 WC: కోహ్లి, రోహిత్ తమ మార్కు చూపించాలి.. లేదంటే ఇదే చివరి వరల్డ్‌కప్!
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్-2022 నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి మరింత ఒత్తిడిలో కూరుకుపోయే అవకాశం ఉందని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఫామ్‌లేమి కారణంగా వారు ఇబ్బంది పడుతున్నారని.. ఒకవేళ వాళ్లిద్దరికీ ఇది చివరి వరల్డ్‌కప్ అనుకుంటే ఒత్తిడి రెట్టింపు అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఏ ఆటగాడి కెరీర్‌లోనైనా ఇలాంటి పరిస్థితులు ఎదురవడం సహజమని, సచిన్ టెండుల్కర్ సైతం చాలా కాలం పాటు సెంచరీ చేయలేక సతమైన సందర్భాన్ని ఈ పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ గుర్తు చేశాడు. కాగా గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఘోర వైఫల్యంతో విమర్శలు మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత రోహిత్ శర్మ భారత జట్టు కెప్టెన్ అయ్యాడు. ఇద్దరిదీ ఒకే కథ! హిట్‌మ్యాన్ సారథ్యంలో స్వదేశంలో వరుస టీ20 సిరీస్‌లు గెలిచిన టీమిండియా ఈ ఏడాది పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌నకు సిద్ధమవుతోంది. అయితే, ఐపీఎల్-2022లో కోహ్లి, రోహిత్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆర్సీబీ బ్యాటర్ విరాట్ 341 పరుగులు చేశాడు. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ కేవలం 268 పరుగులు మాత్రమే చేసి విమర్శలపాలయ్యాడు. ఎన్నడూ లేని విధంగా ముంబై జట్టు సైతం ఘోరంగా విఫలమైంది. ఆఖరి స్థానంతో ఐపీఎల్-2022 సీజన్‌ను ముగించింది. సచిన్‌కే తప్పలేదు! అవును.. అందుకే! ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్, టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ మధ్య వీరిద్దరి భవిష్యత్ గురించి ఆసక్తికర చర్చ నడిచింది. స్పోర్ట్స్‌కీడాతో అక్తర్ మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు ఇదే రకమైన ఆట కొనసాగిస్తే.. వారికి ఇదే చివరి ఐపీఎల్, చివరి వరల్డ్‌కప్ అని అనుకుంటే.. ఫామ్‌లేమి కారణంగా మరింత ఒత్తిడిలో కూరుకుపోతారు. కెరీర్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇందుకు సచిన్‌నే ఉదాహరణగా తీసుకుంటే.. ఒకానొక సందర్భంలో అతడు సెంచరీ సాధించడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో, ఎంతగా ఎదురుచూడాల్సి వచ్చిందో తెలుసు కదా’’ అని పేర్కొన్నాడు. ఇందుకు భజ్జీ బదులిస్తూ.. ‘‘అవును.. వాళ్లిద్దరికీ ఈ ఐపీఎల్ సీజన్ అంత గొప్పగా ఏమీలేదు. నిజానికి వాళ్లిద్దరికీ టీ20 వరల్డ్‌కప్ కీలకం. నవతరం ఆటగాళ్లు దూసుకువస్తున్నారు. ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో తెలియదు. కాబట్టి కోహ్లి, రోహిత్ కచ్చితంగా ఈ ప్రపంచకప్‌లో తమ మార్కు చూపించాలి’’ అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ సరిగ్గా ఆడకపోతే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డాడు. చదవండి: IPL 2022: 'మేము అతడి సేవలను కోల్పోయాము.. మా జట్టులో ఉంటే బాగుండేది' IPL 2022: ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న ఎస్ఆర్హెచ్..! -
విమర్శలు పట్టించుకోకు కోహ్లి.. నువ్వేంటో నిరూపించు.. అప్పుడే: అక్తర్
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆట తీరుపై విమర్శలు చేయడం సరికాదని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. కోహ్లి ఫామ్‌లేమి గురించి విమర్శించే వారు.. ఒక్కసారి అతడు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలన్నాడు. ఓ క్రికెటర్‌గా, అత్యుత్తమ ఆటగాడిగా గౌరవం పొందేందుకు కోహ్లి అర్హుడని పేర్కొన్నాడు. కాగా గతేడాది నుంచి ఫామ్‌లేమితో ఈ ‘రన్‌మెషీన్’ ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ఆరంభానికి ముందే టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్ బై చెబుతానన్న కోహ్లి.. మెగా టోర్నీలో ఘోర పరాభవంతో సారథ్య బాధ్యతలకు ముగింపు పలికాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సుదీర్ఘకాలంగా సారథిగా వ్యవహరించిన కోహ్లి.. గతేడాది ఆ బాధ్యతల నుంచి కూడా వైదొలిగాడు. ఇక కెప్టెన్సీ భారం లేకపోవడంతో ఈ సీజన్లోనైనా బ్యాట్ ఝులిపిస్తాడనుకుంటే.. పూర్తిగా నిరాశపరిచాడు. ఐపీఎల్-2022లో పదహారు మ్యాచ్‌లలో కలిపి కోహ్లి సాధించిన పరుగులు 341. సగటు 22.73. కేవలం రెండు అర్ధ శతకాలు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇయాన్ బిషప్, వీరేంద్ర సెహ్వాగ్, డేనియల్ వెటోరీ వంటి మాజీ ఆటగాళ్లు కోహ్లి ఫామ్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ కోహ్లికి అండగా నిలిచాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చే ముందు కాస్త ముందూ వెనుకా ఆలోచించాలి. చిన్న పిల్లలు కూడా ఈ విషయాలు గమనిస్తూ ఉంటారు. కాబట్టి కోహ్లి గురించి, అతడి ఆట గురించి కాస్త మంచి మాటలు చెప్పండి. గౌరవం పొందేందుకు అతడు అన్ని విధాలా అర్హుడు. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్. అతడు అంతర్జాతీయ క్రికెట్లో 110 సెంచరీలు చేయాలని నేను కోరుకుంటున్నా. 45 ఏళ్లు వచ్చే వరకు కోహ్లి క్రికెట్ ఆడుతూనే ఉండాలి’’ అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. ‘‘110 సెంచరీలకు చేరువయ్యే క్రమంలో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నపుడు కొంతమంది నిన్ను తారస్థాయిలో విమర్శిస్తారు. నీకు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తారు. నువ్వు దీపావళి గురించి ట్వీట్ చేసినా అందులో తప్పులు వెతుకుతారు. నీ భార్య, బిడ్డ గురించి కామెంట్లు చేస్తారు. నువ్వు వరల్డ్‌కప్‌లో ఓడిపోతే దారుణంగా విమర్శలు చేస్తారు. ఇలాంటివి అన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీదైన శైలిలో ముందుకు సాగు. విరాట్ కోహ్లి అంటే ఏంటో వాళ్లకు ఒక్కసారి చూపించు’’ అని అక్తర్ కోహ్లికి మద్దతుగా నిలిచాడు. చదవండి: Rafael Nadal: జొకోవిచ్‌కు షాకిచ్చిన నాదల్.. వరల్డ్ నంబర్ 1 ఘోర పరాజయం -
IPL 2022 Final: వారు గెలవాలని మనసు కోరుకుంటోంది.. కానీ: అక్తర్
IPL 2022 Final GT Vs RR- Winner Prediction: ఆస్ట్రేలియా క్రికెట దిగ్గజం, దివంగత షేన్ వార్న్ కోసమైనా రాజస్తాన్ రాయల్స్ ఈసారి ఐపీఎల్ టైటిల్ గెలవాలని పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. వార్న్‌కు నివాళిగా ట్రోఫీ సాధించి చిరస్మరణీయ విజయం సొంతం చేసుకోవాలని ఆశించాడు. అయితే అదే సమయంలో.. గుజరాత్ టైటాన్స్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ జట్టే విజేతగా నిలుస్తుందని అంచనా వేశాడు. కాగా క్యాష్ రిచ్ లీగ్ మొదటి సీజన్ ఐపీఎల్-2008లో రాజస్తాన్ రాయల్స్‌కు సారథ్యం వహించిన షేన్ వార్న్.. అరంగేట్రంలోనే జట్టుకు టైటిల్ అందించాడు. చరిత్ర సృష్టించాడు. అయితే, ఆ తర్వాత రాజస్తాన్ మళ్లీ ఫైనల్ చేరుకోవడానికి పద్నాలుగేళ్లు పట్టింది. మరోవైపు ఐపీఎల్-2022తో మెగా టోర్నీలో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో ఈ ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం(మే 29) ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మనసేమో రాజస్తాన్ గెలవాలని కోరుకుంటే.. ఓ ఆటగాడిగా కొత్త జట్టు గుజరాత్ ట్రోఫీ గెలిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘రాజస్తాన్ 14 ఏళ్ల తర్వాత మరోసారి ఫైనల్ చేరింది. ఎన్నో సవాళ్లు అధిగమించి వాళ్లు ఇక్కడిదాకా చేరుకున్నారు. షేన్ వార్న్ జ్ఞాపకార్థం వాళ్లు గుజరాత్‌ను ఓడించి టైటిల్ గెలవాలి. వార్న్ కోసమైనా రాజస్తాన్ గెలవాలని మనసు కోరుకుంటోంది. అయితే, ముందు నుంచి చెప్పినట్లుగా కొత్త టీమ్ గుజరాత్ టోర్నీ ఆసాంతం అదరగొట్టింది. కాబట్టి గెలుపొందేందుకు గుజరాత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’’ అని స్పోర్ట్స్‌కీడాతో అక్తర్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి హార్దిక్ పాండ్యా బృందానికే తన ఓటు వేశాడు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్. చదవండి 👇 IPL 2022 Prize Money: ఐపీఎల్ విజేత, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విన్నర్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే! IPL 2022 Final: ఎవరు గెలిచినా చరిత్రే.. టాస్ ఓడితే మాత్రం అంతే సంగతులు! అయితే.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); The sweet memories of this #SeasonOfFirsts will keep coming back long after the final tomorrow 💙 Let's see which is that one memory most special to our Titans! 🤩@Amul_Coop#AavaDe #PaidPartnership pic.twitter.com/MR81OsPiUl — Gujarat Titans (@gujarat_titans) May 28, 2022 Jaipur, you were amazing yesterday. 🥹💗#RoyalsFamily | #HallaBol | #RRvRCB pic.twitter.com/9vRP63Usa3 — Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022 Is #SundayMotivation a thing yet? 🙏 pic.twitter.com/l7zVpHfIfE — Rajasthan Royals (@rajasthanroyals) May 29, 2022 -
పాక్ మాజీ బౌలర్‌పై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అక్తర్ బౌలింగ్‌ను చక్కర్ అంటూ ఒక టీవీ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ.. '' అక్తర్ తన ఎల్బోను కదలిస్తూ బౌలింగ్ చేసేవాడు. ఈ తరహా బౌలింగ్‌ను క్రికెట్ భాషలో చక్కర్ అని సంబోధిస్తారు. అందుకే అక్తర్ బౌలింగ్‌ను ఐసీసీ కొంతకాలం బ్యాన్ చేసింది. ఇక ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ బౌలింగ్ యాంగిల్ కాస్త డౌన్లో వస్తుంది.. అందువల్ల అతని బౌలింగ్ పెద్ద కష్టంగా అనిపించదు. అయితే షోయబ్ బౌలింగ్‌లో మాత్రం బంతి ఎక్కడి నుంచి వస్తుందో తెలిసేది కాదు. అందుకే అక్తర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కాస్త కష్టంగా అనిపించేది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ షేన్ బాండ్ కూడా నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో ఒకడు. అతని స్వింగ్ బౌలింగ్ ఎక్కువగా ఆఫ్‌స్టంప్ అవతల పడుతూ బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టేవి. ఇక బ్రెట్ లీ బౌలింగ్‌లో ఆడడం పెద్దగా భయం లేనప్పటికి.. అక్తర్‌ను మాత్రం మనం నమ్మలేం. అతను సంధించే బీమర్.. యార్కర్ ఎక్కడ నా కాలుకు తగులుతుందోనని భయపడేవాడిని. కానీ బ్యాటింగ్ మాత్రం ఎప్పుడు కంఫర్ట్‌గానే ఉండేది.'' అంటూ వెల్లడించాడు. ఇక అక్తర్ బౌలింగ్‌ను సెహ్వాగ్ సహా.. మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, ద్రవిడ్, లక్ష్మణ్‌లు బాగా ఎంజాయ్ చేసేవారు. ముఖ్యంగా సెహ్వాగ్ పాకిస్తాన్‌పై 90 సగటుతో ఒక సెంచరీ, రెండు డబుల్ సెంచరీలు, ఒక ట్రిపుల్ సెంచరీ అందుకోవడం విశేషం. చదవండి: Andrew Symonds: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్ సోదరి లేఖ -
మాలిక్ నా రికార్డును బద్దలు కొట్టినట్లయితే సంతోషిస్తాను: షోయబ్ అక్తర్
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ది బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ ఏడాది సీజన్లో ప్రతీ మ్యాచ్‌లో గంటకు 150 కి.మీ పైగా స్పీడ్‌తో మాలిక్ బౌలింగ్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఈ సీజన్లో ఫాస్టెస్ట్ డెలివరీ (157 కెఎమ్‌పిహెచ్) వేసిన రికార్డు కూడా మాలిక్ పేరిటే ఉంది. తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో తన వేసిన ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును మాలిక్ బద్దలు కొడితే చూడాలన్న తన కోరికను అక్తర్ వ్యక్తం చేశాడు. కాగా ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగవంతమైన డెలివరీ వేసిన రికార్డు అక్తర్ పేరున ఉంది. 2003 ప్రపంచకప్‌లో అక్తర్ గంటకు 161.3 కి.మీ వేగంతో వేశాడు." మాలిక్ చాలా కాలం పాటు క్రికెట్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. నేను అంతర్జాతీయ క్రికెట్లో వేగవంతమైన డెలివరీ చేసి 20 సంవత్సరాలైంది, కానీ ఎవరూ నా రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. అయితే నా రికార్డును ఎవరైనా బద్దలు కొడితే చూడాలని ఉంది. ఒక వేళ ఉమ్రాన్ నా రికార్డును బ్రేక్ చేస్తే సంతోషిస్తాను. కానీ అతను ప్రక్రియలో గాయపడకుండా చూసుకోవాలి. అతడు ఎటువంటి గాయాల బారిన పడకుండా తన కెరీర్‌ను కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా అంతర్జాతీయ మ్యాచ్‌లలో అతడిని నేను చూడాలనుకుంటున్నాను. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉమ్రాన్ మాత్రం ఆ వేగంతో నిలకడగా బౌలింగ్ చేయడం చూశాం" అని అక్తర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 RR Vs CSK: రాజస్థాన్ అభిమానులకు గుడ్ న్యూస్.. విధ్వంసకర ఆటగాడు వచ్చేశాడు -
IPL 2022: అతడు ఇకనైనా దూకుడు ప్రదర్శించాలి.. లేదంటే: అక్తర్
IPL 2022 SRH Vs RCB: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇకనైనా బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించాలని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సూచించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో కేన్ తన స్థానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని, అయితే ఓపెనర్‌గా తనకున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022 ఆరంభంలో వరుస పరాజయాలు చవిచూసిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత విజయాల బాట పట్టింది. కానీ చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమితో వరుస పరాజయాలు నమోదు చేసింది. దీంతో ఆడిన 10 మ్యాచ్‌లలో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. ఈ క్రమంలో టాప్-4లో ఉన్న ఆర్సీబీతో హైదరాబాద్ ఆదివారం(మే 8) తలపడనుంది. ప్లే ఆఫ్ రేసులో ముందుండాలంటే కేన్ సేనకు ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనసరి. ఇదిలా ఉంటే... కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ రాణిస్తున్నప్పటికీ బ్యాటర్‌గా మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ సీజన్లో 10 ఇన్నింగ్స్‌లలో కలిపి అతడు చేసినవి 199 పరుగులు(ఒక హాఫ్ సెంచరీ). స్ట్రైక్‌రేటు 96.13. ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ కేన్ ఆట తీరుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. షోయబ్ అక్తర్(ఫైల్ ఫొటో) ఈ మేరకు.. ‘‘కేన్ ఇక విలియమ్సన్ నుంచి విలన్‌గా మారాలి. బ్యాటింగ్‌లో దూకుడు ప్రదర్శించాలి. పరుగులు రాబట్టాలి. లేదంటే అతడి జట్టు కష్టాల్లో కూరుకుపోతుంది. నిజానికి టీ20 ఫార్మాట్లో ఓపెనర్లకు భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ కేన్ దానిని సద్వినియోగం చేసుకోవడం లేదనిపిస్తోంది’’ అని స్పోర్ట్స్‌కీడాతో అక్తర్ తన అభిప్రాయం పంచుకున్నాడు. ఇక సన్‌రైజర్స్ బ్యాటర్ నికోలస్ పూరన్ అద్భుతంగా రాణిస్తున్నాడన్న అక్తర్.. పేసర్లు నటరాజన్, భువనేశ్వర్ కుమార్ తన నైపుణ్యాలను చక్కగా వినియోగించుకుంటూ జట్టుకు ఉపయోగపడతారనrి ప్రశంసించాడు. కాగా ముంబైలోని వాంఖడే వేదికగా సన్‌రైజర్స్, ఆర్సీబీ తలపడబోతున్నాయి. ఇందుకు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. చదవండి👉🏾Shimron Hetmyer: కీలక సమయంలో స్వదేశానికి రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు? When the going gets tough, the tough get going. 💪@tyagiktk | #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/gRloHrBby6 — SunRisers Hyderabad (@SunRisers) May 7, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఫాస్టెస్ట్ డెలివరీ వేసింది అక్తర్ కాదు, నేనే.. అప్పట్లో మిషన్లు పని చేయక..!
Mohammad Sami: క్రికెట్ చరిత్రలో వేగవంతమైన బంతి ఎవరు వేశారన్న అంశంపై మాట్లాడుతూ పాక్ మాజీ పేసర్ మహ్మద్ సమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అందరూ అనుకుంటున్నట్లుగా షోయబ్ అక్తర్‌ది కాదు.. తాను రెండు సందర్భాల్లో అంతకుమించిన వేగంతో బంతులు విసిరాను, అయితే అప్పట్లో మిషన్లు (స్పీడ్ గన్) పని చేయక ఆ క్రెడిట్ తనకు దక్కలేదని వాపోయాడు. పాకిస్థాన్‌లోని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమీ మాట్లాడుతూ.. ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో తాను రెండు బంతుల్ని 160 కిమీ వేగానికిపైగా సంధించానని, అందులో ఒకటి 162 కిమీ, మరొకటి 164 కిమీ వేగంతో దూసుకెళ్లాయని, కానీ.. అప్పుడు స్పీడ్‌గన్ పనిచేయకపోవడంతో తాను సాధించిన ఘనత ప్రపంచానికి తెలియలేదని అన్నాడు. పాక్ తరఫున 36 టెస్టులు, 87 వన్డేలు, 13 టీ20లు ఆడిన సమీ 2003లో జింబాబ్వే జరిగిన ఓ మ్యాచ్‌లో 156.4 కిమీ స్పీడ్‌తో బౌలింగ్ చేశాడు. అదే అతడి అత్యుత్తమ బౌలింగ్ స్పీడ్ గా రికార్డై ఉంది. క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు 20 ఏళ్లుగా పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ పేరిటే కొనసాగుతూ ఉంది. 2002లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్తర్ 161.3 కిమీ వేగంతో బంతిని సంధించాడు. అదే నేటికీ వేగవంతమైన బంతిగా చలామణి అవుతూ ఉంది. కాగా, సమీ భారత్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో 162.3 కిమీ వేగంతో బౌలింగ్ చేసినట్లున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. @shoaib100mph Dear Shoaib Akhter you are not the worlds fastest bowler but Mohammed Sami is 😅 check out this delivery and speed recording. @BrettLee_58 @ICC @SGanguly99 @IrfanPathan @virendersehwag @TheRealPCB pic.twitter.com/ibREseICvr — Farhan Khan ©™️ (@ThHollywoodKhan) November 2, 2020 ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ క్రమం తప్పకుండా 150 కిమీపైగా వేగంతో బంతులు సంధిస్తూ స్పీడ్ సెన్సేషన్‌గా మారాడు. ఈ కశ్మీరి కుర్రాడు మ్యాచ్ మ్యాచ్‌కు వేగాన్ని పెంచుకుంటూ పోవడంతో పాటు వికెట్లు కూడా సాధిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఉమ్రాన్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లోనే అక్తర్ రికార్డు బద్ధలు కావడం ఖాయమని దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. చదవండి: 140 కి.మీ స్పీడుతో యార్కర్..దెబ్బకు బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్! -
'కోహ్లికి నేను బౌలింగ్ చేసి ఉంటే.. ఇన్ని పరుగులు సాధించే వాడు కాదు'
ఐపీఎల్-2022లో విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి తనతో తలపడి ఉంటే కేరిర్‌లో ఇన్ని పరుగులు సాధించి ఉండేవాడిని కాదని అక్తర్ తెలిపాడు. ఐపీఎల్లో స్టార్ ఆటగాళ్లు రాణించకపోతే ఆ జట్టు వారిని పక్కన పెట్టాలి అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పేర్కొన్నాడు. కాగా కోహ్లి , అక్తర్ 2010 ఆసియా కప్‌లో తలపడ్డారు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లికు ఆడే అవకాశం రాలేదు. కాగా గతంలో కోహ్లి కూడా అక్తర్‌తో తలపడాలన్న తన కోరికను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్‌తో పోటీపడడాన్ని తాను ఆస్వాదిస్తాని కోహ్లి తెలిపాడు. "విరాట్ కోహ్లి ఒక అద్భుతమైన ఆటగాడు. అయితే స్టార్ ఆటగాళ్లు నుంచి భారీ ఇన్నింగ్స్‌ను మాత్రమే ఆశిస్తాము. నేను కోహ్లికు తన కేరిర్‌లో బౌలింగ్ చేసి వుంటే అతడు ఇన్నింగ్ పరుగులు సాధించేవాడు కాదు. అతడు అత్యత్తుమ ఆటగాడు ఆనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం కోహ్లి పరుగులు సాధించాడానికి చాలా కష్టపడుతున్నాడు. కోహ్లి నుంచి ఎప్పుడూ నేను భారీ ఇన్నింగ్స్‌ను మాత్రమే ఆశిస్తాను" అని అక్తర్ పేర్కొన్నాడు. ఇక తన అంతర్జాతీయ కెరీర్లో 458 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 23, 650 పరుగులు సాధించాడు. -
'సాధారణ ఆటగాడిలా ఫీలవ్వు'.. కోహ్లికి మాజీ క్రికెటర్ సలహా
పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మన్ కోహ్లికి తన ఆటతీరును మార్చుకోవాలంటూ సలహా ఇచ్చాడు. ఐపీఎల్ 2022లో కోహ్లి తొలి రెండు మ్యాచ్‌ల్లో 40 ప్లస్ స్కోర్లు చేశాడు. ఆ తర్వాత వరుసగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో తక్కువ రన్స్‌కే వెనుదిరిగాడు. ఇందులో రెండు రనౌట్లు తన స్వయంకృతపరాథమే. సీఎస్కేతో మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తప్పిదంతో కోహ్లి ఎల్బీగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కోహ్లి ఆటతీరుపై అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''బాగా ఆడకపోతే కోహ్లి అయినా సరే టైమ్ వస్తే జట్టు నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్ హోదా పనికిరాదు. ఎందుకంటే ఆ జట్టులో యువ ఆటగాళ్లు ఎందరో ఉన్నారు. కోహ్లి రాణించని రోజున అతన్ని డ్రాప్ చేసే అవకాశాలు ఉంటాయి. కోహ్లి బుర్రలో నాకు తెలిసి ఒక 10వేల ఆలోచనలు తిరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. అతను మంచి వ్యక్తి.. అంతకుమించి గొప్ప క్రికెటర్. కానీ ఈ మధ్యన అతని ఫోకస్ సరిగా ఉండడం లేదు. కోహ్లి ఇప్పుడు ఫోకస్ కోల్పోకూడదు. ఇప్పటికే బాగా ఆడడం లేదని కోహ్లివైపు క్రికెట్ ఫ్యాన్స్ వేలెత్తి చూపిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే అతను ప్రమాదంలో ఉన్నట్లే. అందుకే ఒక విషయం చెబుతున్నా.. కోహ్లి అన్ని విషయాలు పక్కనబెట్టి ఒక సాధారణ ప్లేయర్‌గా ఫీలవ్వు.. బ్యాట్‌తో పరుగులు చేసి చూపించు. నువ్వు ఫామ్‌లోకి వస్తే ఆపడం ఎవరి తరం కాదు'' అంటూ అక్తర్ పేర్కొన్నాడు. చదవండి: ఐపీఎల్ 2022 సీజన్ కోహ్లికి కలిసిరావడం లేదా! -
'అవకాశమొచ్చినా ఉపయోగించుకోరు.. అదే మన దరిద్రం'
పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ సొంతజట్టు ఆటతీరుపై మరోసారి విమర్శలు సంధించాడు. మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం వచ్చినప్పటికి దానిని ఉపయోగించుకోలేకపోవడం మనకు మాత్రమే చెల్లిందంటూ తెలిపాడు. విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో పాకిస్తాన్ ఆరంభాన్ని ఘనంగానే ఆరంభించింది. షాహిన్ అఫ్రిది తొలి ఓవర్లోనే ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. కాగా ఫించ్‌కు అఫ్రిది బౌలింగ్‌లో ఇది వరుసగా రెండో గోల్డెన్ డక్ కావడం విశేషం. ఈ గొప్ప ఆరంభాన్ని పాక్ బౌలర్లు వినియోగించుకోలేకపోయారు. ఆసీస్ ఓపెనర్ ట్రెవిస్ హెడ్, వన్‌డౌన్‌లో వచ్చిన బెన్ మెక్డెర్మొట్లు పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వారికి ఏ మాత్రం అవకాశమివ్వని హెడ్, మెక్డెర్మొట్లు బౌండరీల వర్షం కురిపించారు. ఈ దశలోనే హెడ్ 89 పరుగులు చేసి ఔటవ్వగా.. మెక్ డెర్మోట్ 104 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరి తర్వాత లబుషేన్ కూడా 59 పరుగులు చేయడంతో ఆసీస్ మరోసారి భారీ స్కోరు దిశగా పరుగులు తీసింది. ఈ నేపథ్యంలోనే అక్తర్ మరోసారి బాబర్ ఆజం నేతృత్వంలోని పాక్ జట్టును విమర్శించాడు.''ఆట ఎలా ఆడాలో ఆస్ట్రేలియాను చూసి నేర్చుకోండి. ఆ జట్టు ఆరంభంలోనే ఫించ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ట్రెవిస్ హెడ్, మెక్ డెర్మొట్లు ఇన్నింగ్స్ నడిపించిన తీరు అద్బుతం. ఈ రోజుల్లో ఒక వన్డే మ్యాచ్ ఎలా ఆడాలో వీరిని చూసి నేర్చుకోండి. అవకాశం వచ్చినా ఉపయోగించుకోకపోవడం మనకు అలవాటైపోయింది.. అదే మన దరిద్రం''అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇంతకముందు కూడా అక్తర్ మూడో టెస్టు సందర్భంగా పాకిస్తాన్ ఆడిన తీరును తనదైన శైలిలో ఎండగట్టాడు. చదవండి: AUS vs PAK: పాపం గెలవాలన్న కసి అనుకుంటా.. అందుకే గోల్డెన్ డక్ Australia giving us a proper reminder again that this is how ODIs are supposed to be played these days :) — Shoaib Akhtar (@shoaib100mph) March 31, 2022 -
Shoaib Akhtar: పాంటింగ్ కాకుండా వేరే వాళ్లైయ్యుంటే తల బద్దలయ్యేదే..!
పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. దిగ్గజ ఆసీస్ ప్లేయర్ రికీ పాంటింగ్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 1999లో పెర్త్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాటి ఆసీస్ పర్యటనలో పాక్ అప్పటికే 0–2తో వెనుకబడి ఉందని, మూడో టెస్ట్‌లో ఎలాగైనా గెలవాలనే కసితో ప్రత్యర్ధులపై బౌన్సర్లతో విరుచుకుపడాలని డిసైడయ్యానని పేర్కొన్నాడు. ప్లాన్‌లో భాగంగా పాంటింగ్‌ను టార్గెట్ చేశానని, అయితే ఆ సమయంలో పాంటింగ్ కాకుండా ఏ ఇతర ఆటగాడు క్రీజ్‌లో ఉన్నా బంతితో తల పగులగొట్టేవాడినేనని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. ఇదే సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ.. 2005 ఆసీస్ పర్యటనలో జస్టిన్ లాంగర్‌తో గొడవ జరిగిందని, అలాగే మాథ్యూ హేడెన్‌తో చిన్నపాటి ఘర్షణ కొట్టుకునేంతవరకు వెళ్లిందని గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్లలాగే తాను కూడా దూకుడుగా ఉండే వాడినని.. ఆ యాటిట్యూడ్ ఆసీస్ ఆటగాళ్లకు కూడా బాగా నచ్చేదని చెప్పుకొచ్చాడు. అప్పట్లోలా ప్రస్తుత ఆస్ట్రేలియా ఆటగాళ్లలో దూకుడు లేదని, అంతా సున్నితంగా ఉన్నారని, నేటి తరం ఆసీస్ ఆటగాళ్లలో ఆ వైఖరి ఎందుకు కొరవడిందో అర్ధం కావడం లేదని అన్నాడు. బ్రిస్బేన్‌లోని జెఫ్ థామ్సన్ ఇల్లు తనకు రెండో ఇల్లు లాంటిదని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. చదవండి: వరల్డ్‌కప్‌కు ముందే భారత్- పాక్ మ్యాచ్.. ఎప్పుడంటే..? -
'ఏదో ఒకరోజు సెహ్వాగ్ చెంప చెళ్లుమనిపిస్తా’
టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరు డాషింగ్ ఓపెనర్‌గా పేరు పొందితే.. మరొకరు రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా పేరు సాధించాడు. ఈ ఇద్దరు మైదానంలో ప్రత్యర్థులుగా తలపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వీరిద్దరి ఆటను అభిమానులు బాగానే ఎంజాయ్ చేసేవారు. ఆన్‌ఫీల్డ్‌లో ప్రత్యర్థులైనప్పటికీ.. ఆఫ్‌ఫీల్డ్‌లో మాత్రం మంచి స్నేహితులుగా మెలిగారు. బయట ఈ ఇద్దరు ఎక్కడ కలిసినా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా గడిపేవారు. ఒకసారి సెహ్వాగ్ బట్టతలపై అక్తర్ కామెంట్ చేశాడు. మరో సందర్భంలో ఒకపార్టీ సందర్బంగా అక్తర్ సూట్, టై కట్టుకొని వెళ్లాడు. కాగా ఇది చూసిన సెహ్వాగ్.. అచ్చం వెయిటర్‌లా కనిపిస్తున్నావు అని కామెంట్ చేశాడు. ఇలాంటి సరదా సందర్బాలు చాలానే ఉన్నాయి. He should learn from @virendersehwag about giving reply. I'm sure @shoaib100mph will also agree pic.twitter.com/qOTUgSKCon — Guruprasad Shenoy 🇮🇳 (@guruji_prasad) January 23, 2022 తాజాగా అక్తర్ యూట్యూబ్ వేదికగా జరిగిన ఒక స్టాండప్ కమెడియన్ షోలో పాల్గొన్నాడు. తన్మయ్ భట్, అక్తర్‌ల మధ్య సంభాషణ హైలెట్‌గా నిలిచింది. ఆద్యంతం నవ్వులు విరిసిన ఈ షోలో షోయబ్ ఆఖరున ఒక మాట అన్నాడు. ''నాకు ఒక కోరిక మిగిలిపోయింది.. ఏదో ఒకరోజు నా ప్రియ మిత్రుడు సెహ్వాగ్ చెంపను గట్టిగానే చెళ్లుమనిపిస్తా'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. కాగా దీనిపై సెహ్వాగ్ దగ్గర నుంచి ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ లేదు. సెహ్వాగ్ స్పందిస్తాడో లేదో చూడాలి. టీమిండియా తరపున 2001లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సెహ్వాగ్ 251 వన్డేల్లో 8273 పరుగులు, 104 టెస్టుల్లో 8586 పరుగులు, 19 టి20ల్లో 394 పరుగులు చేశాడు. తన దూకుడైన ఆటతీరుతో డాషింగ్ ఓపెనర్‌గా ముద్రపడిన సెహ్వాగ్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక 2007టి 20, 2011 వన్డే వరల్డ్‌కప్ సాధించిన టీమిండియా జట్టులో సెహ్వాగ్ సభ్యుడిగా ఉన్నాడు. ఇక పాకిస్తాన్ తరపున ఫాస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందిన షోయబ్ అక్తర్ 163 వన్డేల్లో 247 వికెట్లు, 46 టెస్టుల్లో 178 వికెట్లు, 15 టి20ల్లో 19 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2022: కప్ గెలుస్తారో లేదో తెలీదు.. మా మనసులు దోచుకున్నారు PAK vs AUS: 24 ఏళ్ల క్రితం రాళ్లు రువ్వారు.. కట్‌చేస్తే Ranji Trophy 2022: ధోని హోం టీమ్ ప్రపంచ రికార్డ్.. ఏకంగా 1008 పరుగుల ఆధిక్యం -
Shoaib Akhtar: మాంసం తింటాం, సింహాల్లా వేటాడతాం.. అదే మాకు భారత బౌలర్లకి తేడా..!
Shoaib Akhtar Highlights X Factor Lacked By Indian Pacers: టీమిండియా పేసర్లను ఉద్ధేశించి పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఫాస్ట్ బౌలింగ్‌లో పాక్ పేసర్ల ఆధిపత్యం గురించి ఆసీస్ మాజీ స్పీడ్‌స్టర్ బ్రెట్ లీతో మాట్లాడుతూ భారతీయుల ఆహారపు అలవాట్లను కించపరిచేలా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో భారత పేస్ దళం బాగా పుంజుకున్నప్పటికీ.. కొన్ని విషయాల్లో పాక్ పేసర్లతో పోలిస్తే బాగా వెనకపడి ఉందని అన్నాడు. భారత పేసర్లు తమ ఆహారపు అలవాట్ల కారణంగా బలహీనంగా కనిపిస్తారని, ఇదే వారికి పాక్ పేసర్లకు తేడా అని పేలాడు. పాక్ పేసర్ల ముఖాల్లో కనిపించే కసి, యాటిట్యూడ్ భారత పేస్ బౌలర్ల ముఖాల్లో కనిపించవని, ఈ వ్యత్యాసం క్రికెట్ తొలినాళ్ల నుంచే ఉందని, అందుకు కారణం మా తిండి, వాతావరణం అని తెలిపాడు. పాక్ బౌలర్లు బౌలింగ్ వేసే సమయంలో ఇతర విషయాల గురించి ఆలోచించరని.. వికెట్ తీయడమే వారి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ యాటిట్యూడే వేగంగా బంతులు వేసేందుకు కావాల్సిన ఎనర్జీని ఇస్తుందని వివరించాడు. దీనికి తోడు మేము ఎక్కువగా మాంసాహారం తింటామని, అందుకే దృడంగా ఉంటామని, ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే సింహాల్లా పరుగెడతామని కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం తరం పాక్ పేసర్లలో షాహీన్ ఆఫ్రిదీ, హసన్ ఆలీల్లో ఈ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయని ఈ సందర్భంగా ఉదహరించాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో టీమిండియా పేస్ యూనిట్‌కు మించిన ఫాస్ట్ బౌలింగ్ దళం ఏ జట్టుకు లేదనడం అతిశయోక్తి కాదు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీ, టి నటరాజన్ వంటి పేసర్లతో భారత పేస్ విభాగం కలకలలాడుతోంది. ఈ విషయంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్ జట్ల పేసర్ల కంటే భారత పేస్ దళం దృడంగా కనిపిస్తుంది. చదవండి: ధోని నా భార్య కాదు.. బీసీసీఐలో నాకు గాడ్ ఫాదర్లు ఎవ్వరూ లేరు..! -
ఇప్పుడున్న రూల్స్‌కు లక్ష పరుగులు ఈజీగా కొట్టేవాడు
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ చరిత్రలో లెక్కలేనన్ని రికార్డులు సొంతం చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి అంతర్జాతీయ క్రికెట్లో 34,357 పరుగులు సాధించాడు. వన్డే,టెస్టులు కలిపి 100 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సచిన్ రికార్డును బ్రేక్ చేయడం కష్టతరమే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సచిన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో జరిగిన యూట్యూబ్ ఇంటర్య్వులో అక్తర్ మాట్లాడాడు. చదవండి: చరిత్ర సృష్టించనున్న టీమిండియా.. రోహిత్‌కు అరుదైన గౌరవం ''క్రికెట్లో ఇప్పుడున్న రూల్స్ అన్ని బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉన్నాయి. రెండు కొత్త బంతుల నిబంధన.. మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌కు మూడు రివ్యూలు.. ఇలా ఏవి చూసుకున్నా బ్యాటర్స్‌కే అనుకూలంగా ఉంది. ఒకవేళ సచిన్ ఆడుతున్న సమయంలో ఇలాంటి రూల్స్ ఉండుంటే కచ్చితంగా లక్ష పరుగుల పైనే కొట్టేవాడు. కానీ సచిన్‌కు ఆ అవకాశం లేకుండా పోయింది. అందుకే సచిన్‌ను.. ''నేను పూర్ సచిన్'' అని పేర్కొంటున్నా. సచిన్ ఆడుతున్న సమయంలో దిగ్గజ బౌలర్లు వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, షేన్ వార్న్, బ్రెట్ లీ, మెక్‌గ్రాత్ సహా నాలాంటి బౌలర్లతో పాటు తర్వాతి జనరేషన్ బౌలర్లను కూడా ఎదుర్కొన్నాడు. అందుకే అతన్ని కఠినమైన బ్యాట్స్‌మన్‌గానూ అభివర్ణిస్తా'' అంటూ పేర్కొన్నాడు. అక్తర్ సమాధానం విన్న రవిశాస్త్రి తన సలహాను కూడా వెల్లడించాడు. ఇప్పుడున్న రూల్స్‌ను బ్యాలెన్స్ చేయాలంటే.. ఓవర్‌కు రెండు చొప్పున బౌన్సర్లు వేసేందుకు అనుమతి ఉంది. దాని లిమిట్‌ను పెంచితే బాగుంటుంది అని అభిప్రాయపడ్డాడు. చదవండి: WI vs ENG: అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం -
ఫైనల్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న క్రికెటర్లు
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఆఖరి అంకానికి చేరింది. శనివారం రాత్రి వరల్డ్ జెయింట్స్, ఆసియా లయన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు సూపర్‌స్టార్ ఆటగాళ్లతో నిండిఉండడంతో రెండు ఫెవరెట్‌గానే కనిపిస్తున్నాయి. అయితే మ్యాచ్ మొదలవడానికి ముందు రెండు జట్లలోని ఇద్దరు ఐకానిక్ ప్లేయర్స్ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. వారిలో ఒకరు ఆసియా లయన్స్ తరపున ఆడుతున్న షోయబ్ అక్తర్.. రెండో ఆటగాడు వరల్డ్ జెయింట్స్ ప్లేయర్ బ్రెట్ లీ. విషయంలోకి వెళితే.. ఫైనల్ గెలిచిన తర్వాత అందించే ట్రోఫీని వీడియోలో షేర్ చేస్తూ.. అక్తర్‌ను టాగ్ చేస్తూ... నేను రెడీగా ఉన్నా.. బ్లాక్బాస్టర్ పోరుకు నువ్వు రెడీయే నా అక్తర్ అంటూ పేర్కొన్నాడు. దీనికి బదులుగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్ వినూత్న రీతిలో స్పందించాడు. పుట్టుకతోనే నేను రెడీగా ఉన్నా అంటూ లీకి దిమ్మతిరిగే సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Only a few hours away from the final #legendsleaguecricket 🏆 I hope your ready @shoaib100mph 🏏👑 pic.twitter.com/IktKuMtfSZ — Brett Lee (@BrettLee_58) January 29, 2022 -
'పిచ్చి ప్రశ్నలు వేస్తోంది.. స్విమ్మింగ్‌ఫూల్‌లో పడేయండి'
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. తనను ఇంటర్య్వూ చేయడానికి వచ్చిన యాంకర్‌కు అక్తర్ వార్నింగ్ ఇచ్చాడు. పిచ్చి ప్రశ్నలతో సమయం వృధా చేసింది.. వెంటనే ఆమెను స్విమ్మింగ్‌ఫూల్‌లో పడేయండంటూ పేర్కొన్నాడు. అయితే ఇది నిజమైన వార్నింగ్ అనుకుంటే మీరు పొరబడ్డట్టే. విషయంలోకి వెళితే.. ఇండియన్ టెలివిజన్ యాంకర్ షఫాలీ బగ్గా షోయబ్ అక్తర్‌ను ఫన్నీ ఇంటర్య్వూ చేసింది. చదవండి: కప్పలా నోరు తెరిచాడు.. ఏమైంది గిల్లీ! ఈ సందర్భంగా ఆమె.. అక్తర్‌ను తన ఫన్నీ ప్రశ్నలతో నవ్విస్తానని చాలెంజ్ చేసింది. షఫాలీ బగ్గా అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా అక్తర్ నవ్వలేదు. అయితే చివరి ప్రశ్నకు మాత్రం అక్తర్ నవ్వేశాడు. దీంతో యాంకర్ బగ్గా మీరు ఓడిపోయారని ఒప్పుకోండి.. అని అడిగింది. దీనికి అక్తర్ నవ్వుతూ.. ''ప్రొడ్యూసర్! ఆమె ప్రశ్నలయిపోయాయిగా.. స్విమ్మింగ్‌ఫూల్‌లో పడేయండి'' అంటూ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ షఫాలీ బగ్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Mohammad Rizwan: రిజ్వాన్ కెప్టెన్ ఇన్నింగ్స్... ముల్తాన్ సుల్తాన్ ఘన విజయం View this post on Instagram A post shared by Shefali Bagga (@shefalibaggaofficial) -
'కోహ్లి 120 సెంచరీలు చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది'
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి స్థానంలో తాను ఉండి ఉంటే అనుష్క శర్మతో వివాహం చేసుకునేవాడిని కాదని అక్తర్ పేర్కొన్నాడు. వివాహం ఆటగాడి జీవితంలో మరింత బాధ్యతను పెంచుతుంది. విరాట్ కెప్టెన్‌గా ఉండాలని ఎప్పుడూ నేను కోరుకోలేదు అని అతడు తెలిపాడు. "విరాట్ దాదాపు 7 సంవత్సరాలు కెప్టెన్‌గా ఉన్నాడు. నేను ఎప్పుడూ అతడు కెప్టెన్‌గా ఉండాలని అనుకోలేదు. అతడు బ్యాటింగ్‌పై దృష్టి సారించి, 100 నుంచి 120 పరుగులు సాధించాలని కోరుకున్నాను. కెప్టెన్సీ అదనపు బాధ్యతలు ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపుతాయి. నేను అతని స్థానంలో ఉంటే, నేను అంత త్వరగా పెళ్లి చేసుకో పోయేవాడని. పెళ్లి చేసుకోవడం తప్పని అనడం లేదు, ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని కూడా చెప్పడం లేదు. కోహ్లి 120 సెంచరీలు చేసిన తర్వాత పెళ్లి చేసుకుంటే బాగున్ను. విరాట్ కోహ్లి అంటే అభిమానులకు పిచ్చి. మరో 20 ఏళ్లు పాటు విరాట్ క్రికెట్లో కొనసాగాలి" అని అక్తర్ పేర్కొన్నాడు. చదవండి: Ind Vs SA - Deepak Chahar: గెలిచే అవకాశం ఇచ్చాడు కానీ! కన్నీళ్లు పెట్టుకున్న దీపక్ చహర్.. వైరల్ -
"కోహ్లిని బలవంతంగా తప్పుకునేలా చేశారు.." పాక్ మాజీ బౌలర్ సంచలన వ్యాఖ్యలు
Shoaib Akhtar On Virat Kohli: టీమిండియా కెప్టెన్సీ వివాదంపై పాక్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏడేళ్లు టీమిండియాను విజయవంతంగా నడిపించిన కోహ్లిని బలవంత పెట్టి మరీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకునేలా చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. లెజెండ్స్ లీగ్‌లో ఆడుతున్న అక్తర్.. ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. అసలు కోహ్లికి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనే లేదని, కొందరు బలవంత పెట్టి మరీ అతన్ని తప్పుకునేలా చేశారని సంచలన ఆరోపణలు చేశాడు. ఏది ఏమైనప్పటికీ.. కోహ్లి ప్రస్తుతం టీమిండియాలో సాధారణ ఆటగాడిగా కొనసాగాల్సిందేనని, అతను బ్యాటింగ్ ఫామ్ తిరిగి అందుకోవాలని, లేకపోతే మున్ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించాడు. కోహ్లి ప్రస్తుత తరంలో గొప్ప బ్యాటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదని, అయినప్పటికీ జట్టులో కొనసాగాలంటే కచ్చితంగా రాణించాల్సిందేనని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరనే అంశంపై మాట్లాడుతూ.. బుమ్రాకు సారధ్య బాధ్యతలు అప్పచెబితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్ కప్ 2021 అనంతరం పొట్టి ఫార్మాట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన కోహ్లికి.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరే ముందు బీసీసీఐ ఊహించని షాకిచ్చింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే కారణంగా అతని వన్డే కెప్టెన్సీని లాక్కుంది. తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం అతను టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి కూడా తప్పుకోవడంతో జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. చదవండి: జాతీయ గీతాలాపన సందర్భంగా కోహ్లి అనుచిత ప్రవర్తన.. ఫైరవుతున్న ఫ్యాన్స్ -
'ఈసారి కూడా మాదే పైచేయి'.. బాస్ దానికి చాలా టైముంది
టి20 ప్రపంచకప్ 2022లో లీగ్ దశలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే గ్రూఫ్‌లో ఉన్న కారణంగా టీమిండియా, పాకిస్తాన్ అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ జరగడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం ఉన్నప్పటికి పాకిస్తాన్ ఆటగాళ్లు ఇప్పటినుంచే కత్తులు దూస్తున్నారు. తాజాగా షోయబ్ అక్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: "ఈ సారి కూడా విజయం పాకిస్తాన్‌దే.. కోహ్లి, రోహిత్ తప్ప..." ''ఈసారి కూడా విజయం మాదే. టి20 ప్రపంచకప్‌లో మెల్బోర్న్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్ మరోసారి పై చేయి సాధిస్తుంది. టి20 క్రికెట్లో పాకిస్తాన్ ఎప్పుడు భారత్ కంటే బెటర్‌గానే కనిపిస్తుంది. ఇరు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా.. భారత్ మీడియా పనిగట్టుకొని టీమిండియాపై అనవసర ఒత్తిడి పెంచుతున్నారు. ఇది మాకు సానుకూలంగా మారుతుంది.. టీమిండియా అందుకే ఓడిపోతుంది'' అంటూ కామెంట్ చేశాడు. అయితే అక్తర్ వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అంత సీన్ లేదు.. ఈసారి టీమిండియాదే పై చేయి అవుతుంది... మ్యాచ్‌కు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది.. ఇప్పుడే అంత తొందరెందుకు అక్తర్.. దానికి చాలా సమయం ఉంది''.. అంటూ కామెంట్స్ చేశారు. కాగా టీ20 ప్రపంచకప్-2021 లీగ్ దశలో పాక్ చేతిలో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2022 అక్టోబర్ 16నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. నవంబర్ 9న తొలి సెమీఫైనల్, నవంబర్ 10న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక ఫైనల్ మెల్బోర్న్ వేదికగా నవంబర్ 13న జరగనుంది. మొత్తం 8 జట్లును రెండు గ్రూపులుగా ఐసీసీ విభిజించింది. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు ఉండగా, గ్రూప్-2లో టీమిండియా,పాకిస్తాన్,దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. చదవండి: SA vs IND: చివరి వన్డేలో గెలిచి భారత్ పరువు నిలుపుకునేనా? -
ఒకే జట్టులో సచిన్, ధోని,యువరాజ్.. కోహ్లి, రోహిత్‌కు నోఛాన్స్!
పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. తన జట్టులో నలుగురు భారత ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాడు. కాగా తన జట్టులో ఓపెనర్లుగా గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్, వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు గోర్డాన్ గ్రీనిడ్జ్‌ని ఎంచుకున్నాడు. పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్‌కి వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో చోటు కల్పించాడు. ఐదో స్ధానంలో భారత మాజీ కెప్టెన్ ధోనికి అవకాశం ఇచ్చాడు. ఆరో స్ధానంలో ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్‌కి చోటు దక్కింది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో కపిల్‌దేవ్, యువరాజ్ సింగ్‌ను అక్తర్ ఎంపిక చేశాడు. తన జట్టులో ఏకైక స్పిన్నర్‌గా షేన్ వార్న్‌ను ఎంచుకున్నాడు. ఇక ఫాస్ట్ బౌలర్ల కోటాలో ఇక బౌలర్ల కోటాలో వసీం అక్రమ్, వకార్ యూనిస్‌కు చోటు దక్కింది. కాగా అక్తర్ ప్రకటించిన జట్టులో భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి చోటు దక్కలేదు. షోయబ్ అక్తర్ ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: సచిన్ టెండూల్కర్, గోర్డాన్ గ్రీనిడ్జ్, ఇంజమామ్-ఉల్-హక్, సయీద్ అన్వర్, మహేంద్ర సింగ్ ధోనీ, ఆడమ్ గిల్‌క్రిస్ట్, యువరాజ్ సింగ్, షేన్ వార్న్ (కెప్టెన్), వసీం అక్రమ్, కపిల్ దేవ్, వకార్ యూనిస్ చదవండి: IND Vs SA: భారత్‌తో ఓటమి.. దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం! -
షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన హర్భజన్ సింగ్
Shoaib Akhtars mothers demise: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అక్తర్ తల్లి అనారోగ్యంతో ఆదివారం మరణించింది. ఈ విషయాన్ని అతడు ట్విటర్ వేదికగా తెలిపాడు. పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రకారం.. షోయబ్ తల్లి ఆరోగ్యం క్షీణిచడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందూతూ మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు ఇస్లామాబాద్‌లో జరగనున్నాయి. కాగా అక్తర్ తల్లి మృతికి టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, షోయబ్ మాలిక్‌తో పాటు పలువురు క్రికెటర్లు సంతాపం తెలిపారు. "ఈ క్లిష్ట సమయంలో మీకు అల్లా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఆమె కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని హర్భజన్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నాడు. చదవండి: Vijay Hazare Trophy Final: అర్ధ సెంచరీతో మెరిసిన దినేష్ కార్తీక్.. -
Akthar: తాను హెచ్చరించిన గంటన్నరలోపే హార్ధిక్ గాయపడ్డాడు..!
Shoaib Akhtar On Hardik Pandya Injury: వెన్నెముక గాయం కారణంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెరీర్ ప్రమాదంలో పడిన సంగతి తెలిసిందే. గాయానికి ముందు ఓ వెలుగు వెలిగిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు.. శస్త్ర చికిత్స అనంతరం తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ మునుపటి ఫామ్‌ను అందుకోలేకపోతున్నాడు. ఇటీవలి కాలంలో అతని ఫామ్ మరీ దారుణంగా ఉండటంతో జట్టులో స్థానాన్ని సైతం కోల్పోయాడు. ఈ నేపథ్యంలో పాండ్యా గాయంపై పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆకాశ్ చోప్రా ఛానల్‌తో మాట్లాడుతూ.. హార్ధిక్ గాయాన్ని ముందు ఊహించానంటూ వ్యాఖ్యానించాడు. తాను హెచ్చరించిన గంటన్నరలోపే హార్ధిక్ గాయపడ్డాడని తెలిపాడు. 2018 ఆసియా కప్ సందర్భంగా హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాలను కలిశానని, ఆ సమయంలో వాళ్లు మరీ బక్కపలచగా ఉన్నారని, వాళ్లకి వెన్నెముకలు ఉన్నాయా లేవా అన్నట్లు ఉండేవారని అన్నాడు. అప్పుడే తాను పాండ్యా గాయపడతావని హెచ్చరించానని, తాను చెప్పిన గంటన్నరలోపే పాక్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు గాయపడ్డాడని చెప్పుకొచ్చాడు. కాగా, గాయం కారణంగా ఫామ్ కోల్పోయిన హార్ధిక్ టెస్టులకు గుడ్‌బై చెప్పి, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు మాత్రమే పరిమతమయ్యే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం..