జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియాకే కాదు ప్రపంచ క్రికెట్‌లోనే అగ్రశేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. బుమ్రా గత కొంత కాలంగా మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటలో ఉన్న బుమ్రా అక్కడ కూడా సత్తాచాటుతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన బుమ్రా.. మొత్తంగా 11 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో జస్ప్రీత్‌ను ఉద్దేశించి షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఎక్కువకాలం పాటు తన కెరీర్‌ను కొనసాగించాలంటే టెస్టు క్రికెట్‌ను వదిలేయాలని అక్తర్ సూచించాడు.
"బుమ్రా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. అతడికి టెస్టు క్రికెట్ కంటే వన్డేలు, టీ20లు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే అతను లెంగ్త్‌ని అర్థం చేసుకున్నాడు. డెత్ ఓవర్లలో, పవర్‌ప్లేలో బంతితో అద్భుతంగా రాణిస్తున్నాడు. బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగల్గే సత్తా అతడికి ఉంది.
కానీ బుమ్రా తన కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించాలంటే టెస్టులను వదేలియాలి. టెస్టుల్లో లాంగ్ స్పెల్స్ వేయాలి. పేస్ బౌలర్లను ఎటాక్ చేయడానికి అన్ని సార్లు ప్రయత్నించరు. కాబట్టి ఎక్కువ పేస్‌తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో పేస్ లేకపోతే బంతి సీమ్ లేదా రివర్స్ స్వింగ్ కాదు. మళ్లీ అప్పుడు బౌలింగ్ తీరుపై పలు ప్రశ్నలకు లేవనెత్తుతుంది.
టెస్టు క్రికెట్‌లో బుమ్రా వికెట్లు తీయగలడు. అందులో ఎటువంటి సందేహం లేదు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతను పెద్దగా రాణించలేకపోయాడు. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. అయితే అతడు టెస్టుల్లో కొనసాగాలంటే బౌలింగ్ వేగాన్ని పెంచాలి.
ఇలా చేయడం వల్ల అతను గాయపడే ప్రమాదం ఉంది. అతడి స్ధానంలో నేనే ఉంటే కేవలం వన్డేలు, టీ20లకే పరిమితమయ్యేవాడిని" అని అక్తర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment