test cricket
-
స్టీల్ స్మిత్...
లెగ్ స్పిన్నర్‌గా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆ కుర్రాడు... క్లిష్ట సమయాల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందాడు. చిత్రవిచిత్రమైన స్టాన్స్‌తో ప్రత్యర్థి బౌలర్లను తికమక పెట్టడమే పనిగా పెట్టుకున్న అతడు... సుదీర్ఘ ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ‘బాల్ ట్యాంపరింగ్’ వివాదంతో ఏడాది పాటు ఆటకు దూరమైనా... తిరిగి వచ్చాక తన పరుగుల దాహం తీరనిదని నిరూపించుకున్నాడు. టెస్టు క్రికెట్లో రెండు వేర్వేరు దేశాలపై 10కిపైగా సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన ఆ ప్లేయర్... తాజాగా మరో ఘనత తన పేరిట లిఖించుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 10,000 పరుగులు పూర్తి చేసుకున్న 15వ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మనం ఇంత సేపు చెప్పుకున్నది ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ గురించే. శ్రీలంకతో తొలి టెస్టు ద్వారా 10 వేల పరుగుల మైలురాయిని దాటిన నాలుగో ఆస్ట్రేలియా ప్లేయర్‌పై ప్రత్యేక కథనం... సాక్షి క్రీడా విభాగం టెక్నిక్‌లో విరాట్ కోహ్లిని సమం చేయలేకపోయినా... నిలకడలో జో రూట్‌ని తలపించకపోయినా... క్లాసిక్ షాట్లలో కేన్ విలియమ్సన్తో పోటీ పడలేకపోయినా... భారీగా పరుగులు చేయడంలో మాత్రం స్టీవ్ స్మిత్ ఈ ముగ్గురికి ఏమాత్రం తీసిపోడు. ఆధునిక క్రికెట్లో ‘ఫ్యాబ్–4’గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నలుగురిలో ఇప్పటికే ఇంగ్లండ్ మాజీ సారథి రూట్ (12,972) పది వేల పరుగుల మైలురాయి దాటగా... శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ (10,103) ఈ క్లబ్లో చేరాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ విలియమ్సన్ (9,276), భారత మాజీ సారథి కోహ్లి (9,230) ఈ జాబితాలో కాస్త వెనక ఉన్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో భారీగా పరుగులు చేయడం అలవాటుగా మార్చుకున్న స్మిత్... 115వ టెస్టులో 10 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భాగంగా భారత్‌పైనే స్మిత్ ఈ మార్క్ అందుకుంటాడు అనుకుంటే... సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగుల వద్ద అవుటై... 9,999 పరుగుల వద్ద నిలిచిపోయాడు. గతంలో ఆస్ట్రేలియా నుంచి 10 వేల పరుగుల మైలురాయి దాటిన అలెన్ బోర్డర్, స్టీవ్ వా సిడ్నీలోనే ఈ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించగా... తాజాగా స్మిత్ గాలే స్టేడియంలో ఆ జాబితాలో చేరాడు. 55 కంటే ఎక్కువ సగటుతో... మ్యాచ్‌ల సంఖ్య పరంగా చూసుకుంటే స్మిత్ 115వ టెస్టులో 10 వేల పరుగుల మైలురాయి దాటి... సంగక్కరతో కలిసి వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. బ్రియాన్ లారా 111వ టెస్టులోనే ఈ మార్క్ దాటి అగ్రస్థానంలో ఉన్నాడు. ఇన్నింగ్స్‌ల పరంగా స్మిత్ (205) ఐదో స్థానంలో ఉన్నాడు. లారా (195 ఇన్నింగ్స్‌లు), సచిన్ టెండూల్కర్ (195 ఇన్నింగ్స్‌లు), కుమార సంగక్కర (195 ఇన్నింగ్స్‌లు), రికీ పాంటింగ్ (196 ఇన్నింగ్స్‌లు) ముందున్నారు. ఇక టెస్టు క్రికెట్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న వారిలో స్మిత్ మూడో అత్యుత్తమ సగటు (56.44) నమోదు చేసుకున్నాడు. పాంటింగ్ (58.72), టెండూల్కర్ (57.61) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కెరీర్లో తొలి 20 టెస్టుల్లో దాదాపు లెగ్స్పిన్నర్గానే జట్టులో చోటు దక్కించుకున్న స్మిత్... ఆ తర్వాత ఆడిన 50 టెస్టుల్లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటాడు. వరుసగా 78వ టెస్టు మ్యాచ్‌లో 55 కంటే ఎక్కువ సగటుతో బ్యాటింగ్ చేసిన తొలి ప్లేయర్‌గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. సచిన్ వరుసగా 65 టెస్టుల్లో 55కు పైగా సగటుతో బ్యాటింగ్ చేశాడు. 2015లో చివరిసారి స్మిత్ సగటు 55 కంటే తక్కువ నమోదైంది. ఆ తర్వాత భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతూ ముందుకు సాగిన స్మిత్ రికార్డులు తిరగరాయడమే పనిగా పెట్టుకున్నాడు. గోడకు కొట్టిన బంతిలా... అటు ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్, ఇటు భారత్‌తో ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో పరుగుల వరద పారించిన స్మిత్... దశాబ్ద కాలానికి పైగా ఆసీస్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఈ రెండు సిరీస్‌ల్లోనూ స్మిత్ తనదైన ముద్ర వేశాడు. చాన్నాళ్లుగా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వస్తున్న స్మిత్... ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించేందుకు కూడా వెనుకాడలేదు. ఆసీస్ తరఫున వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడి జట్టును గెలిపించడమే తన లక్ష్యమని గతంలో పలుమార్లు వెల్లడించిన స్మిత్... దక్షిణాఫ్రికా సిరీస్‌లో ‘బాల్ ట్యాంపరింగ్’తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ సంఘటన అనంతరం తన తప్పేం లేదని చిన్న పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చిన స్మిత్... నిషేధం ముగించుకొని తిరిగి వచ్చాక ఇతర ఆటగాళ్ల సారథ్యంలోనూ అంతే నిబద్ధతతో ఆడాడు. గోడకు కొట్టిన బంతిలా విజృంభించి విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై ఇప్పటి వరకు 12 శతకాలు బాదిన స్మిత్... ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో సెంచరీని కలుపుకుంటే టీమిండియాపై 11 శతకాలు కొట్టాడు. రెండు వేర్వేరు జట్లపై 10కి పైగా టెస్టు సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ స్మిత్ మాత్రమే అంటే అతడి నిలకడ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇంటా బయటా అనే తేడా లేకుండా పరుగుల దాహంతో దూసుకుపోతున్న స్మిత్ ఇదే జోరు కొనసాగిస్తే... అతడి ఖాతాలో మరిన్ని రికార్డులు చేరడం ఖాయమే! -
స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత.. 10000 పరుగుల క్లబ్లో చేరిక
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith) అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో 10000 పరుగుల క్లబ్లో చేరాడు. గాలే వేదికగా శ్రీలంకతో ఇవాళ (జనవరి 29) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో స్టీవ్ ఈ ఘనత సాధించాడు. 9999 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టీవ్.. తొలి బంతికే 10000 పరుగుల మార్కును అందుకున్నాడు. స్టీవ్ ఈ ఘనత సాధించిన నాలుగో ఆస్ట్రేలియన్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. స్టీవ్‌కు ముందు రికీ పాంటింగ్ (13378), అలెన్ బోర్డర్ (11174), స్టీవ్ వా (10927) ఈ ఘనత సాధించారు. 10000 పరుగుల మార్కును తన 205వ ఇన్నింగ్స్‌లో అధిగమించిన స్టీవ్.. బ్రియాన్ లారా (195), సచిన్ టెండూల్కర్ (195), కుమార సంగక్కర (195), రికీ పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) ఈ ఫీట్‌ను సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.There it is!Steve Smith is the fourth Australian to reach 10,000 Test runs 🙌#SLvAUS pic.twitter.com/06FLk8iqMI— 7Cricket (@7Cricket) January 29, 2025టెస్ట్ క్రికెట్లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో జో రూట్ (12972) తర్వాత స్టీవ్ స్మిత్ ఒక్కడే 10000 పరుగుల క్లబ్లో చేరాడు. స్టీవ్ సమకాలీకులు కేన్ విలియమ్సన్ (9276), విరాట్ కోహ్లి (9230) ఇంకా 9000 పరుగుల క్లబ్‌లోనే ఉన్నారు. రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ (Kane Williamson), విరాట్ కోహ్లిలను (Virat Kohli) ఈ జమానా ఫాబ్ ఫోర్‌గా కీర్తిస్తారు. స్టీవ్ తన 115 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 205 ఇన్నింగ్స్‌లు ఆడి 56.18 సగటున 10056* పరుగులు చేశాడు. ఇందులో 4 డబుల్ సెంచరీలు, 34 సెంచరీలు, 42 అర్ద సెంచరీలు ఉన్నాయి.శ్రీలంకతో మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ 74 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా 51 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది.ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (102 నాటౌట్) చాలాకాలం తర్వాత సెంచరీతో మెరువగా, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్ అర్ద సెంచరీలతో రాణించారు. హెడ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి 40 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా తన సెంచరీలో 8 బౌండరీలు, ఓ సిక్సర్ కొట్టాడు. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్యకు హెడ్ వికెట్ దక్కగా.. జెఫ్రీ వాండర్సేకు లబూషేన్ (20) వికెట్ దక్కింది.కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25లో భాగంగా ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ (రెండు వన్డేలు కూడా) కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ ఫలితంతో సంబంధం లేకుండానే ఆసీస్ ఇదివరకే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. జూన్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్.. సౌతాఫ్రికాతో ఆమీతుమీ తేల్చుకోనుంది.శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరంగా ఉన్నాడు. గాయం కారణంగా కమిన్స్ ఈ సిరీస్‌లో పాల్గొనడం లేదు. ఈ కారణంగా స్టీవ్ స్మిత్ ఆసీస్‌కు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఈ సిరీస్‌లో ట్రవిస్ హెడ్‌కు ప్రమోషన్ లభించింది. మిడిలార్డర్ బ్యాటింగ్‌కు దిగే హెడ్.. తొలి టెస్ట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. వచ్చీ రాగానే హెడ్ ఓపెనింగ్ స్థానంలో తనదైన మార్కును చూపించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగే హెడ్.. ఇక్కడ కూడా అదే తరహా చెలరేగిపోయాడు. -
PAK VS WI 2nd Test: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఏకంగా 20 వికెట్లు పడ్డాయి. ఆసియా ఖండంలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు 20 వికెట్లు పడటం ఇదే మొదటిసారి. గతంలో ఎన్నడూ ఆసియా పిచ్‌లపై తొలి రోజే 20 వికెట్లు పడలేదు. తొలి రోజు పడిన వికెట్లలో 16 స్సిన్నర్లకు దక్కగా.. 4 పేస్ బౌలర్లు పడగొట్టారు.ఈ మ్యాచ్ తొలి రోజు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 163 పరుగులకు ఆలౌటైంది. నౌమన్ అలీ హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు పడగొట్టి విండీస్ నడ్డి విరిచాడు. సాజిద్ ఖాన్ 2, అబ్రార్ అహ్మద్, కషిఫ్ అలీ తలో వికెట్ తీశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు గడకేశ్ మోటీ (55), కీమర్ రోచ్ (25), గోమెల్ వార్రికన్ (36 నాటౌట్), కవెమ్ హాడ్జ్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 154 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు. గోమెల్ వార్రికన్ 4, గుడకేశ్ మోటీ 3, కీమర్ రోచ్ 2 వికెట్లు పడగొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ రిజ్వాన్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌద్ షకీల్ 32 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 15, ముహమ్మద్ హురైరా 9, బాబర్ ఆజమ్ 1, కమ్రాన్ గులామ్ 16, సల్మాన్ అఘా 9, నౌమన్ అలీ 0, సాజిద్ ఖాన్ 16 (నాటౌట్), అబ్రార్ అహ్మద్ 2, కషిఫ్ అలీ డకౌటయ్యారు.9 పరుగుల లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 244 పరుగులకు ఆలౌటైంది. విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బ్రాత్‌వైట్ (52) అర్ద సెంచరీతో రాణించాడు. అమీర్ జాంగూ (30) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. చివరి వరుస బ్యాటర్లు టెవిన్ ఇమ్లాచ్ (35), కెవిన్ సింక్లెయిర్ (28), గుడకేశ్ మోటీ (18), గోమెల్ వార్రికన్ (18) రెండంకెల స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్, నౌమన్ అలీ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. కషిఫ్ అలీ, అబ్రార్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు.255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. కెప్టెన్ షాన్ మసూద్ (2), ముహమ్మద్ హురైరా (2), కమ్రాన్ గులామ్ (19) నిరాశపరచగా.. బాబర్ ఆజమ్ (31) మరోసారి లభించిన శుభారంభాన్ని భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు.సౌద్ షకీల్ (13)తో పాటు కషిఫ్ అలీ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో పాక్ గెలవాలంటే మరో 178 పరుగులు చేయాలి. విండీస్ బౌలర్లలో కెవిన్ సింక్లెయిర్ రెండు వికెట్లు పడగొట్టగా.. గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రికన్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో పాక్ తొలి టెస్ట్‌లో 127 పరుగుల తేడాతో నెగ్గింది. -
ICC టెస్టు జట్టు ప్రకటన.. భారత్ నుంచి ముగ్గురు.. కెప్టెన్ ఎవరంటే?
అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) 2024 ఏడాదికిగానూ పురుషుల అత్యుత్తమ టెస్టు(ICC Men’s Test Team of the Year 2024) జట్టును శుక్రవారం ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్ నుంచి అత్యధికంగా నలుగురికి స్థానం దక్కింది. ఇక ఈ జట్టుకు ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథిగా ఎంపికయ్యాడు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్-2024లో ఓపెనర్లుగా టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal)- ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ డకెట్ చోటు దక్కించుకోగా.. వన్డే బ్యాటర్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్(Kane Williamson) స్థానం సంపాదించాడు.లంక నుంచి అతడుఇక మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో ఇంగ్లండ్ మాజీ సారథి, టెస్టు క్రికెట్ వీరుడు జో రూట్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఐదో స్థానంలో ఇంగ్లండ్ నూతన వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్.. ఆరో స్థానంలో శ్రీలంక శతకాల ధీరుడు కమిందు మెండిస్ చోటు దక్కించుకున్నారు. ఇక వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేమీ స్మిత్ ఎంపిక కాగా.. ఆల్‌రౌండర్‌గా టీమిండియా స్పిన్ స్టార్ రవీంద్ర జడేజాకు స్థానం దక్కింది. ఇక ఈ జట్టులో ఏకంగా ముగ్గురు పేసర్లకు ఐసీసీ చోటిచ్చింది. కెప్టెన్ కమిన్స్‌తో పాటు.. న్యూజిలాండ్ రైటార్మ్ బౌలర్ మ్యాట్ హెన్రీ.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఈ జాబితాలో ఉన్నారు. కోహ్లి- రోహిత్‌లకు దక్కని చోటుఇటీవలి కాలంలో వరుస వైఫల్యాల కారణంగా టీమిండియా ప్రధాన బ్యాటర్లు విరాట్ కోహ్లి- రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే, రోహిత్ ఓపెనింగ్ జోడీ యశస్వి జైస్వాల్ మాత్రం గతేడాది అత్యుత్తమంగా రాణించాడు.జైసూ, బుమ్రా హిట్ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో భారీ శతకం(161) బాదడం అతడి ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మూడు ఫార్మాట్లలో కలిపి 2024లో జైసూ 1771 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా సైతం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధికంగా 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.మరోవైపు.. జడేజా సైతం స్థాయికి తగ్గట్లుగా రాణించి.. ఈ జట్టుకు ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే... ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్-2024ను కూడా శుక్రవారం ప్రకటించారు. ఇందులో టీమిండియా నుంచి ఒక్కరికి కూడా స్థానం దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టులో శ్రీలంక క్రికెటర్లు హవా చూపించారు.ఐసీసీ మెన్స్ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కమిందు మెండిస్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ప్యాట్ కమిన్స్(కెప్టెన్), మ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా.ఐసీసీ మెన్స్ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్- 2024: చరిత్ అసలంక (శ్రీలంక- కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్(అఫ్గనిస్తాన్), పాతుమ్ నిసాంక(శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక- వికెట్‌కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్(వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), వనిందు హసరంగ(శ్రీలంక), షాహీన్ షా అఫ్రిది(పాకిస్తాన్), హరీస్ రౌఫ్(పాకిస్తాన్), అల్లా ఘజన్ఫర్(అఫ్గనిస్తాన్).చదవండి: రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్ -
WI Vs PAK: 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా.. బ్యాట్‌తో రికార్డు సృష్టించిన విండీస్ బౌలర్లు
148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ ఇన్నింగ్స్‌లో చివరి ముగ్గురు ఆటగాళ్లు.. తొలి ఎనిమిది మంది ఆటగాళ్ల కంటే ఎక్కువ స్కోర్ చేశారు. టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. పాకిస్తాన్‌తో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో విండీస్ ప్లేయింగ్ ఎలెవెన్‌లోని చివరి ముగ్గురు ఆటగాళ్లు గుడకేశ్ మోటీ, జోమెల్ వార్రకన్, జేడెన్ సీల్స్ వరుసగా 19, 31 (నాటౌట్), జేడెన్ సీల్స్ 22 పరుగులు చేశారు. విండీస్ ఇన్నింగ్స్‌లో వీరికి మించి ఎవరూ స్కోర్ చేయలేదు. టాప్-8 బ్యాటర్స్‌లో అత్యధిక స్కోర్ 11 పరుగులు మాత్రమే. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్, ఎనిమిదో నంబర్ ఆటగాడు కెవిన్ సింక్లెయిర్ తలో 11 పరుగులు చేశారు. మిగతా ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 66 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో చివరి ముగ్గురు బ్యాటర్లు ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టును మూడంకెల స్కోర్ (137) దాటించారు.ఇక్కడ మరో ఆసక్తికర మరో విషయం ఏంటంటే.. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్లుగా నిలిచిన చివరి ముగ్గురు రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా కూడా తెరవలేకపోయారు. ఈ మ్యాచ్‌లో విండీస్ పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడినా విండీస్ బౌలర్లు బ్యాట్‌తో సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ చివరి ఇద్దరు ఆటగాళ్లు మరో రికార్డు నెలకొల్పారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో (ఓ ఇన్నింగ్స్‌లో) చివరి ఇద్దరు ఆటగాళ్లు (జోమెల్ వార్రకన్ (31 నాటౌట్), జేడెన్ సీల్స్ 22) టాప్ స్కోరర్లుగా నిలవడం ఇది మూడోసారి.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 127 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో పాక్ స్పిన్ త్రయం సాజిద్ ఖాన్ (9 వికెట్లు), నౌమన్ అలీ (6 వికెట్లు), అబ్రార్ అహ్మద్ (5 వికెట్లు) మొత్తం 20 వికెట్లు పడగొట్టింది. వెస్టిండీస్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 137, 123 పరుగులకే పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైన పాక్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విండీస్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ 10 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో మరో రికార్డు కూడా నమోదైంది. పాక్ గడ్డపై అతి పొట్టి టెస్ట్ మ్యాచ్‌గా (బంతుల పరంగా) ఈ మ్యాచ్ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్ కేవలం 1064 బంతుల్లోముగిసింది.ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్లో బంతుల పరంగా అతి త్వరగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌గా భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్ 2023-24లో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ కేవలం 642 బంతుల్లోనే ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
'డబుల్ సెంచరీ'పై కన్నేసిన బుమ్రా...
మెల్బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు గురువారం(డిసెంబర్ 26) నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా 6 వికెట్లు పడగొడితే.. 200 టెస్టు వికెట్ల మైలురాయి అందుకుంటాడు.తద్వారా టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా బుమ్రా నిలుస్తాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ ఉన్నాడు. అశ్విన్ కేవలం 37 టెస్టుల్లోనే 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఇక ఇప్పటి వరకు 43 టెస్టులు ఆడిన బుమ్రా 83 ఇన్నింగ్స్‌ల్లో 194 వికెట్లు పడగొట్టాడు.ప్రస్తుతం బుమ్రా ఉన్న ఫామ్‌కు ఈ ఫీట్ సాధించడం నల్లేరు మీద నడక అని చెప్పాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 21 వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ఆసీస్ తుది జట్టుఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్. -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్..
బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ అరుదైన ఘనత నమోదు చేశాడు. టెస్టు క్రికెట్లో 150 ఔట్లు సాధించిన మూడో భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు.ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ ఖవాజా క్యాచ్ అందుకున్న పంత్.. ఈ రేర్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పంత్ ఇప్పటివరకు 41 టెస్టు మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌గా 135 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లు చేశాడు. పంత్ కంటే ముందు ఎంఎస్ ధోనీ, సయ్యద్ కిర్మాణి మాత్రమే ఈ ఘనత అందుకున్నారు. మిస్టర్ కూల్ 256 క్యాచ్‌లు, 36 స్టంపింగ్‌లతో 294 ఔట్లలో భాగస్వామ్యమయ్యాడు.అదే విధంగా రెండో స్ధానంలో ఉన్న సయ్యద్ కిర్మాణి 160 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లతో మొత్తంగా 198 ఔట్ల్లో పాలుపంచుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో రోజు వరుణుడు కరుణించాడు. తొలిసెషన్లో ఆస్ట్రేలియాకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా చుక్కలు చూపించాడు.28/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన ఆస్ట్రేలియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే తొలి సెషన్లో భారత్ ఆధిపత్యం చెలాయించినప్పటకీ.. తర్వాత ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. 53 ఓవర్లకు ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.చదవండి: IND vs AUS: కోహ్లితో అట్లుంటది మరి.. దెబ్బకు నోరు మూసుకున్న ఆసీస్ ఫ్యాన్స్! వీడియో -
బుమ్రా టెస్టులను వదిలేస్తే బెటర్: షోయబ్ అక్తర్
జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియాకే కాదు ప్రపంచ క్రికెట్లోనే అగ్రశేణి బౌలర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. బుమ్రా గత కొంత కాలంగా మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటలో ఉన్న బుమ్రా అక్కడ కూడా సత్తాచాటుతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడిన బుమ్రా.. మొత్తంగా 11 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో జస్ప్రీత్ను ఉద్దేశించి షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా ఎక్కువకాలం పాటు తన కెరీర్‌ను కొనసాగించాలంటే టెస్టు క్రికెట్‌ను వదిలేయాలని అక్తర్ సూచించాడు."బుమ్రా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. అతడికి టెస్టు క్రికెట్ కంటే వన్డేలు, టీ20లు సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే అతను లెంగ్త్‌ని అర్థం చేసుకున్నాడు. డెత్ ఓవర్లలో, పవర్‌ప్లేలో బంతితో అద్భుతంగా రాణిస్తున్నాడు. బంతిని రెండు విధాలుగా స్వింగ్ చేయగల్గే సత్తా అతడికి ఉంది. కానీ బుమ్రా తన కెరీర్‌ను ఎక్కువ కాలం కొనసాగించాలంటే టెస్టులను వదేలియాలి. టెస్టుల్లో లాంగ్ స్పెల్స్ వేయాలి. పేస్ బౌలర్లను ఎటాక్ చేయడానికి అన్ని సార్లు ప్రయత్నించరు. కాబట్టి ఎక్కువ పేస్‌తో బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బౌలింగ్‌లో పేస్ లేకపోతే బంతి సీమ్ లేదా రివర్స్ స్వింగ్ కాదు. మళ్లీ అప్పుడు బౌలింగ్ తీరుపై పలు ప్రశ్నలకు లేవనెత్తుతుంది. టెస్టు క్రికెట్లో బుమ్రా వికెట్లు తీయగలడు. అందులో ఎటువంటి సందేహం లేదు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతను పెద్దగా రాణించలేకపోయాడు. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది. అయితే అతడు టెస్టుల్లో కొనసాగాలంటే బౌలింగ్ వేగాన్ని పెంచాలి.ఇలా చేయడం వల్ల అతను గాయపడే ప్రమాదం ఉంది. అతడి స్ధానంలో నేనే ఉంటే కేవలం వన్డేలు, టీ20లకే పరిమితమయ్యేవాడిని" అని అక్తర్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. -
చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. ప్రపంచ క్రికెట్లో తొలి జట్టుగా
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు చరిత్ర సృష్టించింది.టెస్టుల్లో 5 లక్షలు పరుగులు చేసిన తొలి జట్టుగా ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఈ అరుదైన ఘనత సాధించింది. క్రికెట్ పుట్టినిల్లుగా పేరొందిన ఇంగ్లండ్ జట్టు తమ తొలి టెస్టు మ్యాచ్ 1877లో ఆస్ట్రేలియాతో ఆడింది. అప్పటినుంచి ఇప్పటివరకు 1082 టెస్టులు ఆడిన ఇంగ్లీష్ జట్టు 5 లక్షలకు పైగా పరుగులు చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఇంగ్లండ్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా(4,28,794 ప్లస్ రన్స్), భారత్( 2,78,700 ప్లస్ రన్స్) వరుసగా ఉన్నాయి. అదేవిధంగా టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్ బ్యాటర్లు 929 సెంచరీలు చేశారు.పట్టు బిగించిన ఇంగ్లండ్..ఇక కివీస్‌తో రెండో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 378/5 స్కోరుతో ఉంది. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.క్రీజులో జో రూట్(73 బ్యాటింగ్), బెన్ స్టోక్స్(35 బ్యాటింగ్) ఉన్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ కేవలం 125 పరుగులకే ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 280 పరుగులు చేసింది. ఇక ఇప్పటికే తొలి టెస్టులో కివీస్‌ను ఇంగ్లండ్ చిత్తు చేసింది.చదవండి: IND vs AUS:బుమ్రా మాస్టర్ మైండ్.. ట్రాప్‌లో చిక్కుకున్న స్మిత్! వీడియో -
టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ అద్భుతం.. గడిచిన 46 ఏళ్లలో..!
టెస్ట్ క్రికెట్లో విండీస్ బౌలర్ జేడన్ సీల్స్ అద్భుతం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సీల్స్ 15.5 ఓవర్లలో 10 మెయిడిన్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీశాడు. గడిచిన 46 ఏళ్లలో టెస్ట్ క్రికెట్లో ఇదే అత్యంత పొదుపైన స్పెల్‌గా రికార్డులు చెబుతున్నాయి. JAYDEN SEALES BOWLED THE MOST ECONOMICAL SPELL IN TEST CRICKET IN LAST 46 YEARS:15.5-10-5-4. 🤯pic.twitter.com/CYoA6ljM6Y— Mufaddal Vohra (@mufaddal_vohra) December 2, 2024ఈ ఇన్నింగ్స్‌లో సీల్స్ ఎకానమీ రేట్ 0.31గా ఉంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది ఏడో అత్యుత్తమ ఎకానమీ రేట్గా రికార్డుల్లోకెక్కింది. ఈ రికార్డును సాధించే క్రమంలో సీల్స్ దిగ్గజ బౌలర్ జిమ్ లేకర్ రికార్డును అధిగమించాడు. 1957లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో లేకర్ ఓవర్‌కు సగటున 0.37 పరగులిచ్చాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ సగటు భారత దిగ్గజ బౌలర్ బాపు నాదకర్ణి పేరిట ఉంది. నాదకర్ణి 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓవర్‌కు సగటున 0.15 పరుగులిచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌లో నాదకర్ణి 32 ఓవర్లు వేసి కేవలం 5 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ఇందులో 27 మెయిడిన్లు ఉన్నాయి.ఆల్‌టైమ్ రికార్డుటెస్ట్ క్రికెట్లో సీల్స్ అత్యంత పొదుపైన నాలుగు వికెట్ల (15.5-10-5-4) ఘనత సాధించిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు పాక్‌కు చెందిన పర్వేజ్ సజ్జద్ పేరిట ఉండేది. 1965లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సజ్జద్ 12 ఓవర్లలో 8 మెయిడిన్లు వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో సజ్జద్ సగటు 0.41 కాగా.. బంగ్లాతో మ్యాచ్‌లో సీల్స్ సగటు 0.31గా ఉంది.ఉమేశ్ యాదవ్ రికార్డు బద్దలు కొట్టిన సీల్స్1978 నుంచి టెస్ట్‌ల్లో అత్యంత పొదుపైన సగటు భారత పేసర్ ఉమేశ్ యాదవ్ పేరిట ఉండేది. 2015లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్ 0.42 సగటున బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో 21 ఓవర్లు వేసిన ఉమేశ్ 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో 16 మెయిడిన్లు ఉన్నాయి. తాజాగా ఉమేశ్ రికార్డును సీల్స్ బద్దలు కొట్టాడు.కుప్పకూలిన బంగ్లాదేశ్జమైకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ పట్టు సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 71.5 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది. జేడన్ సీల్స్ 4, షమార్ జోసఫ్ 3, కీమర్ రోచ్ 2, అల్జరీ జోసఫ్ ఓ వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. బంగ్లా తరఫున షద్మాన్ ఇస్లాం (64), మెహిది హసన్ మిరాజ్ (36), షహాదత్ హొసేన్ దీపు (22), తైజుల్ ఇస్లాం (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 70 పరుగులు చేసింది. మికైల్ లూయిస్ 12 పరుగులు చేసి ఔట్ కాగా.. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (33), కీసీ కార్తీ (19) క్రీజ్‌లో ఉన్నారు. లూయిస్ వికెట్ నహిద్ రాణాకు దక్కింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు విండీస్ ఇంకా 94 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, రెండు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ తొలి మ్యాచ్‌లో 201 పరుగుల తేడాతో నెగ్గింది. -
చరిత్ర సృష్టించిన కేన్ విలియమ్సన్.. తొలి న్యూజిలాండ్ క్రికెటర్‌గా
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తన రీఎంట్రీలో సత్తా చాటాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ విలియమ్సన్ అద్బుత ప్రదర్శన చేశాడు.తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగులు చేసిన కేన్ మామ.. రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విలియమ్సన్ టెస్టు క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కేన్ సాధించిన రికార్డులు ఇవే..👉టెస్టుల్లో 9000 పరుగుల మార్క్‌ను దాటిన తొలి కివీ ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. ఇప్పటివరకు 103 టెస్టులు ఆడిన విలియమ్సన్.. 54.76 సగటుతో 9035* పరుగులు చేశాడు.👉టెస్టు క్రికెట్లో అత్యంతవేగంగా 9000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గా యూనిస్ ఖాన్, కుమార్ సంగర్కర రికార్డును విలియమ్సన్ సమం చేశాడు. ఈ జాబితాలో ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్(99) తొలి స్ధానంలో ఉన్నాడు.ఆ తర్వాత స్ధానంలో బ్రియన్ లారా(101 మ్యాచ్‌లు) కొనసాగుతున్నాడు. అదేవిధంగా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి(116 మ్యాచ్‌లు), జోరూట్(106)లు కంటే విలియమ్సన్ ముందున్నాడు.చదవండి: IND vs AUS: టీమిండియాతో రెండు టెస్టు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్ -
సౌతాఫ్రికా ప్లేయర్ వరల్డ్ రికార్డు.. 120 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
డర్బన్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా స్టార్ ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన సంచలన బౌలింగ్‌తో లంక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అతడి పేస్ బౌలింగ్ ధాటికి లంకేయులు విల్లవిల్లాడారు.తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 6.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన జాన్సెన్.. కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా పర్యాటక లంక 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే ఆలౌటైంది.చరిత్ర సృష్టించిన జాన్సెన్...ఇక సంచలన ప్రదర్శన చేసిన జాన్సెన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 7 వికెట్ల ఘనత సాధించిన ఆసీస్ దిగ్గజం హ్యూ ట్రంబుల్ రికార్డును జాన్సెన్ సమం చేశాడు. మార్కో జాన్సెన్ 6.5 ఓవర్ల(41 బంతులు)లో ఈ ఫీట్ సాధించగా.. హ్యూ ట్రంబుల్ కూడా సరిగ్గా 6.5 ఓవర్ల(41 బంతులు)లోనే ఈ రికార్డును నమోదు చేశాడు.1902లో ఇంగ్లండ్‌పై హ్యూ ట్రంబుల్ ఈ ఘనత సాధించాడు. మళ్లీ ఇప్పుడు 120 ఏళ్ల తర్వాత జాన్సెన్ ఈ రేట్ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దిరి తర్వాత స్ధానంలో ఆస్ట్రేలియా లెజెండ్ మాంటీ నోబెల్ ఉన్నారు. నోబెల్ ఈ రికార్డును 7.4 ఓవర్లలో క్రియేట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. ప్రోటీస్ ప్రస్తుతం 406 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా? -
చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఆసీస్ గడ్డపై తొలిసారి ఆడుతున్న జైశ్వాల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు.జైశ్వాల్ ప్రస్తుతం 90 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. కేఎల్ రాహుల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను జైశ్వాల్ అద్భుతంగా ముందుకు నడపిస్తున్నాడు. జైశ్వాల్ వరల్డ్ రికార్డు..ఈ క్రమంలో జైశ్వాల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఈయర్‌లో టెస్టుల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్లో జైశ్వాల్ ఇప్పటివరకు 34 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉండేది. మెక్కల్లమ్ 2014 ఏడాదిలో టెస్టుల్లో 33 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌లో నాథన్ లియోన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన జైశ్వాల్.. మెకల్లమ్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(26) ఉన్నారు.ఇక రెండో రోజు ఆటలో కూడా ఆసీస్‌పై భారత్ పై చేయి సాధించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్(90), కేఎల్ రాహుల్(62) నాటౌట్‌గా ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.చదవండి: కేఎల్ రాహుల్ అవుట్‌పై రగడ.. స్పందించిన స్టార్క్ -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 35 ఏళ్ల సౌథీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది డిసెంబర్లో తన హోం గ్రౌండ్( హామిల్టన్‌లోని సెడాన్ పార్క్)లో ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్ అనంతరం టెస్టులకు విడ్కోలు పలకనున్నట్లు సౌథీ వెల్లడించాడు.ఒకవేళ కివీస్ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తే మాత్రం అతడు తన దేశం తరపున ఆడేందుకు అందుబాటులో ఉండనున్నాడు. అదే విధంగా దేశీవాళీ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నట్లు ఈ కివీ స్టార్ పేసర్ చెప్పుకొచ్చాడు. "న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. 18 సంవత్సరాలుగా బ్లాక్‌క్యాప్స్ కోసం ఆడటం నాకు చాలా స్పెషల్. టెస్టు క్రికెట్‌కు నా హృదయంలో ప్రత్యేక స్ధానం ఉంది. ఏ జట్టుపై అయితే నేను టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశానో, ఇప్పుడు అదే జట్టుపై నా కెరీర్‌ను ముగించనున్నాను. నాకు బాగా ఇష్టమైన మూడు మైదానాల్లో సెడాన్ పార్క్ ఒకటి.అందుకే అక్కడే టెస్టులకు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను"అని సౌథీ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా 2008లో ఇంగ్లండ్‌పై సౌథీ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. తన 18 ఏళ్ల కెరీర్లో కివీస్ తరపున ఇప్పటివరకు 104 టెస్టులు ఆడిన సౌథీ.. 385 వికెట్లతో పాటు 2185 పరుగులు సాధించాడు. మరోవైపు 161 వన్డేల్లో 742 పరుగులు, 221 వికెట్లు తీశాడు. 125 టీ20లు ఆడిన సౌథీ 303 పరుగులు, 164 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది -
Ind vs NZ: ‘రిజర్వ్’ నుంచి ‘హీరో’గా మారి... టీమిండియాపై గెలుపులో కీలకంగా
ముంబై: న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్ 2020 డిసెంబర్లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే భారత్‌తో సిరీస్‌కు ముందు వరకు ఈ నాలుగేళ్లలో అతను 16 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. ప్రతీసారి రిజర్వ్ ఆటగాడిగానే ఎంపిక కావడం... విరామంలో సహచరులకు డ్రింక్స్ అందించడం మినహా అతనికి చెప్పుకోదగ్గ అవకాశాలే రాలేదు! జట్టులో ఎవరైనా గాయపడితే తప్ప యంగ్ పేరును టీమ్ మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి. గాయం నుంచి కేన్ విలియమ్సన్ కోలుకోకపోవడంతో ముందుగా తొలి టెస్టులో చాన్స్ లభించింది. ఆ తర్వాత విలియమ్సన్ తర్వాతి మ్యాచ్‌లూ ఆడలేడని ఖాయం కావడంతో యంగ్ చోటుకు ఢోకా లేకుండా పోయింది. చివరకు సిరీస్‌లో మొత్తం 244 పరుగులు సాధించి కివీస్ చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. డ్రింక్స్ అందించడమే తనకు అలవాటుగా మారిపోయిందని... ఇప్పుడు టీమ్‌ను గెలిపించడం తనకు గర్వంగా అనిపిస్తోందని విల్ యంగ్ వ్యాఖ్యానించాడు. ‘నాలుగేళ్లలో వేర్వేరు కారణాలతో నేను మైదానంలో కంటే బయటే ఎక్కువగా ఉన్నాను. ఎప్పుడూ రిజర్వ్ బ్యాటర్‌గానే నా పేరు ఉండేది. జట్టు సభ్యులకు డ్రింక్స్ అందించడమే ఒక అనుభవంగా మారిపోయింది. అయితే ఎప్పుడు అవకాశం వచ్చినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించా. విలియమ్సన్ స్థానంలో వచ్చి నా అతడిని అనుకరించకుండా నా సొంత ఆటనే ఆడాను. ఇప్పుడు నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది’ అని యంగ్ అన్నాడు. భారత్‌ను స్పిన్ పిచ్‌లపైనే చిత్తు చేయడం గొప్పగా అనిపించిందని యంగ్ చెప్పాడు. -
పంత్ పోరాటం వృథా.. మూడో టెస్టులో టీమిండియా ఘోర ఓటమి
సొంత గడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 25 పరుగుల తేడాతో భారత్ దారుణ ఓటమి చవిచూసింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా చతకలపడింది.లక్ష్య చేధనలో కేవలం 121 పరుగులకే భారత జట్టు కుప్పకూలింది. భారత బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. రిషబ్ పంత్(64) మినహా మిగితా అందరూ విఫలమయ్యారు. విరాట్ కోహ్లి, జైశ్వాల్, గిల్, సర్ఫరాజ్, జడేజా వంటి స్టార్ ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.ఆరేసిన అజాజ్ పటేల్..మరోసారి వాంఖడేలో కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్బుతం చేశాడు. తన స్పిన్ మయాజాలంతో భారత్ బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు పార్ట్ టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. పేసర్ మాట్ హెన్రీ కూడా ఓ వికెట్ సాధించాడు.ఇదే తొలిసారి..భారత గడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాను వైట్‌వాష్ చేసిన తొలి జట్టుగా న్యూజిలాండ్ రికార్డులకెక్కింది. ఈ సిరీస్ ముందు వరకు ఏ జట్టు చేతిలో కూడా టీమిండియా స్వదేశంలో వైట్ వాష్‌కు గురువ్వలేదు. ఇప్పుడు న్యూజిలాండ్ భారత జట్టును వైట్ వాష్ చేసి చరిత్ర సృష్టించింది.భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టు(నవంబర్ 1- 5)వేదిక: ముంబై, వాంఖడే స్టేడియంటాస్: న్యూజిలాండ్.. తొలుత బ్యాటింగ్న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 235టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 263న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 174భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 121ఫలితం: 25 పరుగుల తేడాతో భారత్ ఓటమి -
టీమిండియా ఇంకొక్కటి ఓడినా ఖేల్ ఖతమే?!
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయాలకు న్యూజిలాండ్ బ్రేక్‌లు వేసింది. పుణే వేదికగా కివీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ 113 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో టీమిండియా సమర్పించుకుంది. ఈ ఓటమితో 12 ఏళ్ల తర్వాత తొలిసారిగా స్వదేశంలో భారత్ కోల్పోయింది.ఈ మ్యాచ్‌లో 359 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 245 పరుగులకు ఆలౌటైంది. ఇక పుణే టెస్టులో ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 సీజన్ పాయింట్ల పట్టికలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పాయింట్ల పరంగా టీమిండియా(90) అగ్రస్ధానంలో ఉన్నప్పటకి.. విన్నింగ్ పర్సంటేజీలో తగ్గుదల కనిపించింది.భారత జట్టు 68.62 శాతం నుంచి 68.06 శాతానికి పడిపోయింది. మరోవైపు పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్(60) నాలుగో స్ధానంలో కొనసాగుతోంది. ఈ విజయంతో కివీస్ విన్నింగ్ పర్సంటేజీలో భారీగా పెరుగుదల కన్పిచింంది. బ్లాక్ క్యాప్స్ 44.40 శాతం నుంచి 50.00 శాతానికి పెరిగింది. ఇక పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత స్ధానాల్లో ఆస్ట్రేలియా (62.50), శ్రీలంక (55.56) ఉన్నాయి.టీమిండియా ఫైనల్ చేరాలంటే?ఇక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్ధానంలో ఉన్నప్పటికి ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుత సైకిల్లో ఇప్పటి వరకు ఆడిన 13 టెస్టుల్లో 8 విజయాలు సాధించిన భారత్ నాలుగింటిలో ఓడి ఒక దానిని డ్రా చేసుకుంది. ఈ సైకిల్లో భారత్ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‌తో ఒక మ్యాచ్, ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. కాగా భారత్ ఫైనల్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే కనీసం నాలుగింటిలోనైనా విజయం సాధించాలి. అప్పుడే టీమిండియా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి పాయింట్ల కోత లేకుండా చూసుకోవాలి.అయితే, న్యూజిలాండ్‌తో మిగిలిన ఇంకొక్క మ్యాచ్ ఓడినా టీమిండియాకు కష్టమే. ఎందుకంటే.. సొంతగడ్డపై ఈ మ్యాచ్ గనుక రోహిత్ సేన ఓడితే.. ఆసీస్ పర్యటనలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టలేదు. కాబట్టి ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన మిచెల్ సాంట్నర్.. -
టీమిండియాతో రెండో టెస్టు.. పట్టు బిగించిన న్యూజిలాండ్
పుణే వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో పర్యాటక న్యూజిలాండ్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. క్రీజులో గ్లెన్ ఫిలిప్స్(9), టామ్ బ్లండెల్(30) ఆజేయంగా ఉన్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 301 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బ్లాక్ క్యాప్స్ కెప్టెన్ టామ్ లాథమ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. 133 బంతుల్లో 10 ఫోర్లతో 86 పరుగులు చేసి లాథమ్ ఔటయ్యాడు. భారత బౌలర్లలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మరోసారి తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సుందర్ ఇప్పటివరకు 4 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ ఒక వికెట్ సాధించాడు.తేలిపోయిన భారత బ్యాటర్లు..అంతకుముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. కివీస్ స్పిన్ వలలో భారత్ చిక్కుకుంది. మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. టీమిండియా బ్యాటర్లలో రవీంద్ర జడేజా(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు యశస్వీ జైశ్వాల్(30), శుబ్‌మన్ గిల్(30) పర్వాలేదన్పించారు.చదవండి: IND vs NZ: బెడిసికొట్టిన గంభీర్ వ్యూహం..! టీమిండియా ఫ్యాన్స్ ఫైర్? -
బెడిసికొట్టిన గంభీర్ వ్యూహం..! టీమిండియా ఫ్యాన్స్ ఫైర్?
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా దారుణ ప్రదర్శన కొనసాగుతోంది. బెంగళూరు వేదికగా కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర ఓటమి చవిచూసిన భారత్.. ఇప్పుడు పుణేలో జరుగుతున్న రెండో టెస్టులో కూడా అదే తీరును కనబరుస్తోంది.తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో అదరగొట్టిన టీమిండియా, బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. న్యూజిలాండ్ స్పిన్నర్ల దాటికి భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో కేవలం 156 పరుగులకే భారత్ కుప్పకూలింది.బెడిసి కొట్టిన గంభీర్ వ్యూహం...కాగా తొలి టెస్టులో ఓటమి అనంతరం కివీస్‌పై భారత జట్టు మెనెజ్‌మెంట్ స్పిన్ అస్త్రాన్ని సంధించాలని భావించింది. ఈ క్రమంలో పుణే పిచ్‌ను డ్రై వికెట్‌గా స్పిన్నర్లకు అనుకూలించేలా హెడ్ కోచ్ గౌతం గంభీర్ అండ్ కో తయారు చేయించింది.అయితే 'ఎవరు తీసుకున్న గోతిలో వారే పడినట్లు' అన్న చందంగా టీమిండియా పరిస్థితి మారింది. ప్రత్యర్ధిని స్పిన్‌తో బోల్తా కొట్టించాలనుకున్న టీమిండియా.. ఇప్పుడు అదే స్పిన్ వలలో చిక్కుకుని విల్లవిల్లాడింది. కివీస్ స్పిన్నర్ల ముందు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. మొత్తం 10 వికెట్లలో 9 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం గమనార్హం. కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో భారత్ పతనాన్ని శాసించారు.ఆఖరికి పార్ట్‌టైమ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌ను కూడా భారత బ్యాటర్లు ఎదుర్కోలేకపోయారు. అసలు మనం చూస్తుంది భారత బ్యాటర్లనేనా అన్నట్లు ఇన్నింగ్స్ సాగింది. విరాట్ కోహ్లి వంటి స్టార్ క్రికెటర్లు సైతం చెత్త షాట్లు ఆడి తన వికెట్‌ను సమర్పించుకున్నారు.దీంతో భారత జట్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ప్లాన్ మిస్ ఫైర్ కావడంతో గౌతం గంభీర్‌ను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. "ఇది టెస్టు క్రికెట్ డ్యూడ్" ఎక్కువగా ప్లాన్స్ చేయవద్దు అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. Next level hai #INDvsNZ pic.twitter.com/HZJ1T8qbgr— Hesy Rock (@Hesy_R0ck) October 25, 2024 Team India be like. #INDvsNZ pic.twitter.com/yr4E1dX9VL— Sagar (@sagarcasm) October 25, 2024 -
చరిత్ర సృష్టించిన వాషింగ్టన్.. తొలి భారత ప్లేయర్‌గా
పుణే వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక న్యూజిలాండ్ జట్టు 259 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్ల దాటకి కివీస్ ఓ మోస్తారు స్కోర్‌కే పరిమితమైంది. ఆఫ్ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అశ్విన్ ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పు తిప్పులు పెట్టారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ అయితే తన రీ ఎంట్రీలో సత్తాచాటాడు. దాదాపు 3 ఏళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన సుందర్.. తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్‌ను దెబ్బతీశాడు. టెస్టుల్లో 5 వికెట్లు పైగా సుందర్ పడగొట్టడం తన కెరీర్లో ఇదే తొలిసారి కావడం విశేషం.అరుదైన ఘనత..ఇక మొదటి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన వాషింగ్టన్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో పూణెలోని ఏంసీఎ స్టేడియంలో ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా సుందర్ నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్‌గా సుందర్ నిలిచాడు. సుందర్ కంటే ముందు ఆస్ట్రేలియా స్పిన్నర్ స్టీఫెన్ ఒకీఫ్ పుణే మైదానంలో 5 వికెట్ల హాల్ నమోదు చేశాడు. న్యూజిలాండ్‌పై 7 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో భారత్ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో సుందర్ కంటే ముందు ఎస్ వెంకటరాఘవన్, ఎరపల్లి ప్రసన్న, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.చదవండి: IND vs NZ: వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలోనే -
అతడెందుకు దండగ అన్నారు.. కట్ చేస్తే! 7 వికెట్లతో
అతడిని ఎందుకు ఎంపిక చేశారు? కుల్దీప్ యాదవ్ కన్న తోపు స్పిన్నరా? అసలు రోహిత్ శర్మ, గంభీర్‌కు ఏమైంది? ఇవన్నీ న్యూజిలాండ్‌తో రెండో టెస్టుకు వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేయడంపై మాజీలు సంధించిన విమర్శల బాణాలు. అయితే మ్యాచ్ ఆరంభం తర్వాత మొత్తం సీన్ మారిపోయింది. సుందర్‌ను విమర్శించిన నోళ్లే ఇప్పుడు శెభాష్ అంటున్నాయి.45 నెలల తర్వాత..కివీస్ తొలి టెస్టు ఓటమి అనంతరం మిగిలిన రెండు టెస్టులకు అనూహ్యంగా వాషింగ్టన్ సుందర్‌ను భారత జట్టులోకి బీసీసీఐ చేర్చింది. రంజీ ట్రోఫీలో తమిళనాడుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సుందర్ అర్ధాంతరంగా పుణేలో టీమిండియాతో చేరాడు. అయితే అతడిని కేవలం బ్యాకప్‌గానే తీసుకున్నారని అంతా భావించారు.కానీ రెండో టెస్టుకు టీమిండియా మెనెజ్‌మెంట్ తుది జట్టులో వాషీకి చోటిచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. కుల్దీప్ యాదవ్ వంటి స్టార్ స్పిన్నర్‌ను తీసుకురావడాన్ని పలువురు మాజీలు తప్పుబట్టారు. అయితే 45 నెలల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన సుందర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచి అందరి అంచనాలను తలకిందలు చేశాడు. ఏకంగా 7 వికెట్లు పడగొట్టి కివీస్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమితం చేశాడు. బంతిని గింగరాలు తిప్పుతూ న్యూజిలాండ్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. తొలి స్పెల్‌లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సుందర్.. రెండో స్పెల్‌లో రవీంద్రను ఔట్ చేసి తన వికెట్ల వేటను మొదలు పెట్టాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 23.1 ఓవర్లు బౌలింగ్ చేసిన వాషింగ్టన్.. 59 పరుగులు ఇచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. సుందర్ ఈ ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లను క్లీన్‌బౌల్డ్ చేయడం విశేషం. అంతేకాకుండా టెస్టుల్లో ఈ తమిళ తంబీ ఐదు వికెట్ల కంటే ఎక్కువ పడగొట్టడం ఇదే తొలిసారి.కివీస్@259ఇక ఈ మ్యాచ్‌లో పర్యాటక కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రచిన్ రవీంద్ర(65) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో సుందర్‌తో పాటు మరో తమిళనాడు స్పిన్నర్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. 🚨 WASHINGTON SUNDAR PRODUCE THE BALL OF THE SERIES 🚨 pic.twitter.com/vLvo4ipYAY— Johns. (@CricCrazyJohns) October 24, 2024 -
IND vs NZ: ముగిసిన తొలి రోజు ఆట.. రోహిత్ శర్మ డకౌట్
పుణే వేదికగా న్యూజిలాండ్-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆటముగిసే సమయానికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్(10), యశస్వీ జైశ్వాల్(6) పరుగులతో ఆజేయంగా ఉన్నారు.అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నిరాశపరిచాడు. 9 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. కివీస్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో రోహిత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.ఏడేసిన సుందర్..ఇక ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 7 వికెట్లతో సుందర్ సత్తాచాటాడు. కివీస్ నామమాత్రపు స్కోర్‌కే పరిమితం కావడంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ డేవాన్ కాన్వే (76; 141 బంతుల్లో 11 ఫోర్లు) హాఫ్ సెంచరీతో మెరవగా.. రచిన్ రవీంద్ర (65; 105 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. -
సూపర్ బాల్.. రోహిత్‌కు మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్ టిమ్ సౌథీ అద్బుతమైన బంతితో హిట్‌మ్యాన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే సౌథీ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు శర్మ ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ 3 ఓవర్ వేసిన సౌథీ ఆఖరి బంతిని మిడిల్ అండ్ ఆఫ్దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని హిట్‌మ్యాన్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి టర్న్ అయ్యి రోహిత్ బ్యాక్ ప్యాడ్ తాకుతూ స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో సౌథీ దెబ్బకు రోహిత్ తన ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. రోహిత్ ఔటైన వెంటనే మైదానంలో ఉన్న ప్రేక్షకులు అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక8 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది. క్రీజులో గిల్(8), జైశ్వాల్(2) పరుగులతో ఉన్నారు.7 వికెట్లతో చెలరేగిన సుందర్..అంతకుముందు న్యూజిలాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లతో అదరగొట్టాడు.అతడితో పాటు రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లతో సత్తాచాటాడు. కివీస్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రచిన్ రవీంద్ర(65) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. Dear Rohit Sharma,I respect you a lot and love you but as an honest Indian cricket fan I believe you should consider giving up your opening spot for the betterment of the team. You struggle to bat in test match and pick the length so it might be better to retire with dignity🙏. pic.twitter.com/9G8MxWKmuc— ` (@Was_divote) October 24, 2024 -
కివీస్‌తో రెండో టెస్ట్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
సౌథీ అరుదైన ఘనత.. సెహ్వాగ్ సిక్సర్ల రికార్డు బ్రేక్
బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ టిమ్ సౌథీ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగుల భారీ స్కోర్‌ను సాధించడంలో సౌథీ కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్రతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.73 బంతులు ఎదుర్కొన్న సౌథీ 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేశాడు. ఈ ఇక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన సౌథీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జాబితాలో సౌథీ ఆరో స్ధానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు 147 టెస్టు ఇన్నింగ్స్‌లలో సౌథీ 92 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్(91) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్‌ను ఈ కివీ వెటరన్ అధిగమించాడు. ఇక అరుదైన ఫీట్ నమోదు చేసిన జాబితాలో బెన్ స్టోక్స్(131) అగ్రస్ధానంలో ఉన్నాడు.చదవండి: IND vs PAK 2nd Test: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్.. -
జడేజా మ్యాజిక్ డెలివరీ.. గ్లెన్ ఫిలిప్స్ మైండ్ బ్లాంక్(వీడియో)
బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ దుమ్ములేపుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 402 పరుగుల భారీ సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్లాక్ క్యాప్స్‌కు 356 పరుగుల ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర(134) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కాన్వే(91), టిమ్ సౌథీ(65) ఆర్ధశతకాలు సాధించారు. భారత బౌలర్లలో జడేజా, కుల్దీప్ యాదవ్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. వీరిద్దరితో పాటు సిరాజ్ రెండు, బుమ్రా, అశ్విన్ చెరో వికెట్ సాధించారు.జడ్డూ మ్యాజిక్..ఇక ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా సంచలన బంతితో మెరిశాడు. కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్‌ను జడ్డూ ఔట్ చేసిన తీరు ఇన్నింగ్స్ మొత్తానికే హైలెట్. జడేజా అద్భుతమైన బంతితో ఫిలిప్స్‌ను బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 63వ ఓవర్లో మూడో బంతిని మిడిల్ స్టంప్ దిశగా లెంగ్త్ డెలివరీని జడ్డూ సంధించాడు. ఆ బంతిని ఫిలిప్స్ బ్యాక్ ఫుట్ నుండి డిఫెన్సివ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతడి బ్యాట్‌ను మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. అది చూసిన ఫిలిప్స్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. Phillips' bright start has a dim end thanks to Ravindra Jadeja 👌#IDFCFirstBankTestTrophy #JioCinemaSports #INDvNZ pic.twitter.com/sjjrzLnGxX— JioCinema (@JioCinema) October 18, 2024 -
ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన పాకిస్తాన్..
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపరకు బ్రేక్ పడింది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో 152 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో 11 మ్యాచ్‌ల తర్వాత పాక్ జట్టు తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా పాక్‌కు తమ సొంతగడ్డపై 1349 రోజుల తర్వాత దక్కిన తొలి విజయమిది. చివరగా పాక్ జట్టు తమ స్వదేశంలో 2021 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై టెస్టు విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ మ్యాచ్ ముందు వరకు ఒక్క టెస్టు విజయం కూడా పాక్ నమోదు చేయలేకపోయింది.తిప్పేసిన నమాన్..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 297 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ పాక్ స్పిన్నర్ నోమన్ అలీ చుక్కలు చూపించాడు. అతడి స్పిన్ వలలో చిక్కుకున్న పర్యాటక జట్టు కేవలం 144 పరుగులకే కుప్పకూలింది. నోమన్ ఏకంగా 8 వికెట్లు పడగొట్టి ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు మరో స్పిన్నర్ సాజిద్ ఖాన్ రెండు వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు పాకిస్తాన్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 221 పరుగులకు ఆలౌటైంది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 297 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఉంచింది. అయితే ఆ టార్గెట్‌ను చేధించడంలో ఇంగ్లీష్ జట్టు చతకిల పడింది.ఏడేసిన సాజిద్..ఈ మ్యాచ్‌లో మరో పాక్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ కూడా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్(119) సెంచరీతో మెరిశాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అదే విధంగా పాక్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 366 పరుగులు చేసింది. కాగా సాజిద్, నోమన్ అలీ కలిపి ఈ మ్యాచ్‌లో ఏకంగా 20 వికెట్లు పడగొట్టడం గమనార్హం. ఇక ఇరు జట్ల మూడో టెస్టు ఆక్టోబర్ 24 నుంచి ప్రారంభం కానుంది. -
భారత్ చెత్త రికార్డు.. 92 ఏళ్ల ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ బౌలర్ల జోరు ముందు.. భారత బ్యాటర్లు చేతులేత్తేశారు. బ్లాక్ క్యాప్స్ బౌలర్ల దాటికి టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా.. రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(20) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత ఇన్నింగ్స్‌లో అయిదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, జడేజా, కేఎల్ రాహుల్, అశ్విన్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. ఇక ఈ మ్యాచ్‌లో కుప్పకూలిన టీమిండియా పలు చెత్త రికార్డులను తమ పేరిట లిఖించుకుంది.➔92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు స్వదేశంలో ఇదే అత్యల్ప స్కోర్. ఇంతకుముందు 1987లో న్యూజిలాండ్‌పై భారత్ 62 పరుగులు చేసింది.➔ఓవరాల్‌గా టెస్టుల్లో భారత్‌కు ఇది మూడో అత్యల్ప స్కోర్. గతంలో ఆస్ట్రేలియాపై టీమిండియా 36 పరుగులకు ఆలౌట్ కాగా, లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 32 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఇదో లోయస్ట్ టోటల్. -
IND Vs NZ: కివీస్ బౌలర్ మాస్టర్ మైండ్.. బెంబేలెత్తిన విరాట్ కోహ్లి(వీడియో)
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి పరుగులేమి చేయకుండా పెవిలియన్‌కు చేరాడు. తొలి బంతి నుంచే కివీస్ పేసర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన విరాట్.. 9 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.న్యూజిలాండ్ యువ పేసర్ ఓ'రూర్క్ అద్బుతమైన బంతితో కోహ్లిని బోల్తా కట్టించాడు. భారత ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన రూర్క్.. ఆఖరి బంతిని కోహ్లి ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. అయితే బంతి ఒక్కసారిగా టర్న్ అయ్యి లోపలకు వచ్చింది. దీంతో బంతి తన ప్యాడ్లకు తాకకుండా ఉండడానికి కోహ్లి లెగ్ సైడ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో లెగ్ గల్లీ వద్ద ఫిలిప్స్ జంప్ చేస్తూ అద్బుతమైన క్యాచ్ అందుకున్నాడు. అయితే అది క్లీన్ క్యాచ్ కాదా? అని ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌తో సప్రందించాడు. థర్డ్ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించి ఔట్‌గా ప్రకటించాడు.దీంతో చేసేదేమి లేక కోహ్లి నిరాశతో మైదానాన్ని వీడాడు. అయితే ఆఫ్ సైడ్ పడిన బంతి అంత షార్ప్‌గా టర్న్ అవుతుందని కోహ్లి అస్సలు ఊహించలేదు. అంతేకాకుండా లెగ్ సైడ్‌లో గల్లీ ఫీల్డర్‌ను పెట్టి మరి విరాట్‌ను ట్రాప్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.ఎనిమిదేళ్ల తర్వాత.. కాగా టెస్టుల్లో కోహ్లి ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు రావడం ఎనిమిదేళ్ల తర్వాత ఇదే మొదటి సారి. యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గైర్హాజరీతో ఈసారి కోహ్లి వన్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ కోహ్లికి వన్ డౌన్ కలిసిరాలేదు. గతంలో కోహ్లి వన్ డౌన్లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. చివరిసారిగా 2016లో వెస్టిండీస్‌పై ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 3, 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటివరకు విరాట్ కేవలం నాలుగు టెస్టుల్లోనే ఈ ప్లేస్‌లో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో 97 పరుగులు సాధించాడు.pic.twitter.com/0Z9o2PcVCb— ViratKingdom (@kingdom_virat1) October 17, 2024 -
పాకిస్తాన్ చెత్త రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి
టెస్టు క్రికెట్లో పాకిస్తాన్ జట్టు తమ ఓటముల పరంపరను కొనసాగిస్తోంది. ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్‌లో 47 పరుగుల తేడాతో పాక్ ఘోర ఓటమిని చవిచూసింది. 267 పరుగుల వెనకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 823 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్(317) ట్రిపుల్ సెంచరీతో మెరవగా,జో రూట్(262) డబుల్ సెంచరీ చేశారు.147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారిఇక ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ అంత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టెస్టు చరిత్రలోనే తొలి ఇన్నింగ్స్‌లో 550కి పైగా పరుగులు చేసినప్పటికీ, ఆ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయిన తొలి జట్టుగా పాక్ నిలిచింది. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలో ఇలా జరగడం ఇదే తొలిసారి. పాక్ కంటే ముందు ఏ జట్టు కూడా మొదటి ఇన్నింగ్స్‌లో అంత భారీ స్కోర్ సాధించి ఆ మ్యాచ్‌ను కోల్పోలేదు.అదేవిధంగా గత 40 నెలలగా పాకిస్తాన్ కనీసం ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా గెలవలేదు. చివరగా 2021లో రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికాపై టెస్టు మ్యాచ్ విజయాన్ని పాక్ నమోదు చేసింది. అప్పటి నుంచి 11 మ్యాచ్‌లు ఆడిన పాక్ జట్టు.. రెండు డ్రాలు, తొమ్మిదింట ఓటమి పాలైంది. అంతేకాకుండా ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాక్ ఆఖరి స్ధానానికి పడిపోయింది. -
పాకిస్తాన్‌కు మరో షాక్.. ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి
పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగులతో పాక్‌ను ఇంగ్లీష్ జట్టు చిత్తు చేసింది. 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ 220 పరుగులకే ఆలౌటైంది. దీంతో మసూద్ సేన ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ జాక్ లీచ్ 4 వికెట్లు పడగొట్టగా.. అట్కినసన్, కార్సే తలా రెండు వికెట్లు సాధించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అఘా సల్మాన్(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బ్రూక్, రూట్ విధ్వంసం..అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసం సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్‌ను ఇంగ్లీష్ జట్టు 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్, జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో మెరిశారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 454 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్(151), సల్మాన్(104), షఫీక్(102) సెంచరీలతో చెలరేగారు. ఏదమైనప్పటకి పాక్ ఓటమి పాల్వడంతో వారి సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆక్టోబర్ 15 నుంచి ముల్తాన్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ప్లీజ్.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్ మాజీ క్రికెటర్ -
'టీమిండియాకు ఆడాలనేది నా కల.. ఎప్పుడు నెరవేరుతుందో'
గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు అవగింజంత అదృష్టం కూడా ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. సరిగ్గా ఈ సామెత బెంగాల్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్‌కు సరిపోతుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తున్నప్పటకి ఇప్పటివరకు భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయలేకపోయాడు.ఒకట్రెండు సార్లు భారత జట్టుకు ఎంపికైనప్పటకి డెబ్యూ చేసే అవకాశం మాత్రం రాలేదు. అయితే 31 ఏళ్ల ఈశ్వరన్ త్వరలోనే టీమిండియా క్యాప్‌ను అందుకునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకు అభిమన్యును సెలక్టర్లు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మకు బ్యాకప్‌గా అతడిని ఆస్ట్రేలియాకు పంపాలని బీసీసీఐ పంపించాలని భావిస్తుందంట. హిట్‌మ్యాన్ వ్యక్తిగత కారాణాలతో తొలి రెండు టెస్టులో ఏదో ఒక మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ స్ధానంలో అభిమన్యు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముందని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే తాజాగా ఈశ్వరన్ కూడా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే తన కోరికను వ్యక్తిపరిచాడు."నేను ఎప్పుడూ ప్రస్తుతం కోసమే మాత్రమే ఆలోచిస్తాను. భవిష్యత్తు కోసం పెద్దగా ఆలోచించను. కానీ కొన్నిసార్లు అది అంత సులభం కాదు. ఆ సమయంలో ఏదీ మన చేతుల్లో ఉండదని నన్ను నేనే కంట్రోల్ చేసుకుంటాను. మనకంటూ ఒక రోజు వస్తుందని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను. దేశం తరఫున ఆడాలనేది నా కల. అందుకోసం ఎప్పటినుంచే ఎదురుచూస్తున్నాను. భారత జట్టులో ఉండాలని, విజయాల్లో నా వంతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను. కానీ మనం ఆశలు పెట్టుకున్నప్పటకి ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. ప్రస్తుతానికి, నేను రంజీ ట్రోఫీపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. బెంగాల్‌కు విజయాలను అందించడమే నా ముందున్న లక్ష్యమని" అభిమన్యు NDTV స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అభిమన్యు ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 98 మ్యాచ్‌లు ఆడి 53.63 సగటుతో 7506 పరుగులు చేశాడు. అతడి కెరీర్లో 26 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్
టెస్ట్ క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోర్ నమోదైంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ 7 వికెట్ల నష్టానికి 823 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 1997లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంకేయులు 6 వికెట్ల నష్టానికి 952 పరుగులు చేశారు. టెస్ట్‌ల్లో రెండు, మూడు అత్యధిక స్కోర్లు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉండటం విశేషం. ఇంగ్లీష్ జట్టు 1938లో ఆస్ట్రేలియాపై, 1930లో వెస్టిండీస్‌పై వరుసగా 903 (7 వికెట్ల నష్టానికి), 849 పరుగులు చేసింది.ఇంగ్లండ్, పాక్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాక్ ఓటమి దిశగా సాగుతోంది. నాలుగో రోజు చివరి సెషన్లో పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. ఈ మ్యాచ్‌లో పాక్ గట్టెక్కాలంటే మరో 130 పరుగులు చేయాలి. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో మరో రోజు ఆట మిగిలి ఉంది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (102), షాన్ మసూద్ (151), అఘా సల్మాన్ (104 నాటౌట్) సెంచరీలతో కదం తొక్కగా.. సౌద్ షకీల్ (82) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ మూడు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ చెరో రెండు.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 823/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. జో రూట్ (262), హ్యారీ బ్రూక్ (317) డబుల్, ట్రిపుల్ సెంచరీలతో విరుచుకుపడగా.. జాక్ క్రాలే (78), బెన్ డకెట్ (84) అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, సైమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు తీయగా.. షాహీన్ అఫ్రిది, ఆమెర్ జమాల్, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.267 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ శరవేగంగా వికెట్లు కోల్పోతుంది. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ 0, సైమ్ అయూబ్ 25, షాన్ మసూద్ 11, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 29, మొహమ్మద్ రిజ్వాన్ 10 పరుగులు చేసి ఔట్ కాగా.. అఘా సల్మాన్ (36), అమెర్ జమాల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు, క్రిస్ వోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ తీసి పాక్ పుట్టి ముంచారు.చదవండి: బాబర్ ఆజమ్.. ఇక మారవా..? -
ENG vs PAK: జో రూట్ డబుల్ సెంచరీ.. సచిన్ రికార్డు సమం
టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డబుల్ సెంచరీతో రూట్ చెలరేగాడు. బ్యాటింగ్‌కు స్వర్గధామం మారిన ముల్తాన్ పిచ్‌పై రూట్ దుమ్ములేపుతున్నాడు. 305 బంతుల్లో 14 ఫోర్లతో రూట్ తన డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రూట్‌కు ఇది ఆరో టెస్టు డబుల్ సెంచరీ కావడం గమనార్హం. ప్రస్తుతం 203 పరుగులతో రూట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడితో హ్యారీ బ్రూక్(174) డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.సచిన్ రికార్డు సమం..ఇక ఈ మ్యాచ్‌లో ద్విశతకంతో మెరిసిన ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన జాబితాలో ఏడో స్ధానానికి రూట్ ఎగబాకాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లి కేన్ విలియమ్సన్, ఆటపట్టు, వీరేంద్ర సెహ్వాగ్, యూనిస్ ఖాన్ సరసన రూట్ నిలిచాడు.ఈ దిగ్గజాలు కూడా టెస్టుల్లో ఆరు డబుల్ సెంచరీలు నమోదు చేశారు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్(12) అగ్రస్ధానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్ధాన్లాలో కుమార సంగర్కర(11), లారా(9) కొనసాగుతున్నారు. -
హార్దిక్ రీ ఎంట్రీ చాలా కష్టం.. ఒకవేళ అదే జరగాలంటే?
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇటీవల రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు పాండ్యా తీవ్రంగా శ్రమిస్తున్నాడన్న ఊహాగానాలు ఊపుందుకున్నాయి. తాజాగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్ ఆడేందుకు హార్దిక్ ఫిట్‌గా లేడని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు.హార్దిక్ పాండ్యా టెస్టుల్లో రీఎంట్రీ ఇస్తాడని నేను అనుకోవడం లేదు. బహుశ వైట్ బాల్ అందుబాటులో లేపోవడంతో అతడు ఎర్ర బంతితో ప్రాక్టీస్ చేసి ఉంటాడు. నాలుగు రోజులు లేదా ఐదు రోజుల పాటు టెస్టు క్రికెట్ ఆడేందుకు అతడి శరీరం సహకరించదు.ఒకవేళ హార్దిక్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలంటే అంతకంటేముందు కనీసం ఒక్క ఫస్ట్-క్లాస్ మ్యాచ్ అయినా ఆడాలి. అలా జరుగుతుందని నేను అనుకోవడం లేదని ఓ ఇంటర్వ్యూలో పార్ధివ్ పేర్కొన్నాడు.హార్దిక్ పాండ్యా 2018లో తన చివరి టెస్ట్ మ్యాచ్ భారత్ తరపున ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాకే కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఫిట్నెస్ లేమి కారణంగా పాండ్యా కేవలం వైట్-బాల్ క్రికెట్‌పై మాత్రమే దృష్టి సారించాడు. గత ఆరేళ్లగా అతడిని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. మధ్యలో ఓసారి పాండ్యా వెన్నుముక సర్జరీ కూడా చేసుకున్నాడు. ఈ కారణాలతో అతడు రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు తిరిగి మళ్లీ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో భారత జట్టులోకి రానున్నాడు.చదవండి: SA vs IRE: దక్షిణాఫ్రికా ఓపెనర్ విధ్వంసం.. చిత్తుగా ఓడిన ఐర్లాండ్ -
కమిందు మెండిస్.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఆటగాడు..!
శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్ టెస్ట్ క్రికెట్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. కమిందు టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో వరుసగా ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. తద్వారా 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బ్యాటర్ అరంగేట్రం నుంచి ఇన్ని మ్యాచ్‌ల్లో వరుసగా 50 ప్లస్ స్కోర్లు చేయలేదు. పాక్ ఆటగాడు సౌద్ షకీల్ అరంగేట్రం నుంచి వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. ఆతర్వాత న్యూజిలాండ్ ఆటగాడు బెర్ట్ సచ్‌క్లిఫ్, పాక్‌కు చెందిన సయీద్ అహ్మద్, భారత్‌కు చెందిన సునీల్ గవాస్కర్ అరంగేట్రం నుంచి వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశారు.శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 306 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో) చేసింది.దినేశ్ చండీమల్ (116) సూపర్ సెంచరీతో కదంతొక్కగా.. ఏంజెలో మాథ్యూస్ (78 నాటౌట్), కమిందు మెండిస్ (51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. దిముత్ కరుణరత్నే 46 పరుగులతో పర్వాలేదనిపించగా.. పథుమ్ నిస్సంక కేవలం ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టగా.. కరుణరత్నే రనౌటయ్యాడు.కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో శ్రీలంక 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్ సెంచరీతో.. ప్రభాత్ జయసూర్య తొమ్మిది వికెట్లు తీసి లంక గెలుపులో ప్రధానపాత్ర పోషించారు.టెస్ట్ అరంగేట్రం నుంచి ఎనిమిది మ్యాచ్‌ల్లో కమిందు చేసిన స్కోర్లు.. - 61 vs AUS.- 102 & 164 vs BAN.- 92* vs BAN.- 113 vs ENG.- 74 vs ENG.- 64 vs ENG.- 114 vs NZ.- 51* vs NZ. చదవండి: 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్టు.. ధోని, రోహిత్‌లకు నో ప్లేస్..! -
'గిల్, బుమ్రా, రాహుల్ కాదు.. అతడే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్'
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన రీ ఎంట్రీలో సత్తాచాటుతున్నాడు. దాదాపు 600 రోజుల తర్వాత టెస్టు క్రికెట్లో పునరాగమనం చేసిన రిషబ్.. తన తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.టెస్టుల్లో 6వ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా రిషబ్ పంత్ 2022 డిసెంబర్లో ఘోరమైన కారు ప్రమాదానికి గురయ్యాడు. దాదాపు ప్రాణాలు పోగొట్టుకునే స్థితి నుంచి అతను కోలుకున్న తీరు నమ్మలేనిది. కేవలం రెండేళ్లలోనే పూర్తి ఫిట్నెస్ సాధించి దుమ్ములేపుతున్న పంత్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.వసీం అక్రమ్ వంటి దిగ్గజాలు సైతం ఈ ఢిల్లీ ఆటగాడిని పొగడ్తలతో ముంచెత్తాడు. పంత్‌ను మిరాకిల్ కిడ్ అని వసీం కొనియాడాడు. తాజాగా ఈ జాబితాలోకి మరో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా చేరాడు. భారత జట్టులో వరల్డ్‌క్లాస్ ప్లేయర్లు ఉన్నారని, భవిష్యత్తులో భారత టెస్టు జట్టును పంత్ లీడ్ చేస్తాడని కనేరియా జోస్యం చెప్పాడు."ప్రస్తుత భారత జట్టును చూస్తుంటే ముచ్చటేస్తోంది. జట్టు విజయాల్లో ప్రతీ ప్లేయర్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి అద్భతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. అందుకే భారత్ ప్రపంచ స్థాయి జట్టుగా నిలిచింది. రిషబ్ పంత్ భవిష్యత్తులో టెస్టుల్లో భారత జట్టుకు కచ్చితంగా సారథ్యం వహిస్తాడు. అతడు పునరాగమనం తర్వాత చాలా బాగా రాణిస్తున్నాడు. వికెట్ కీపర్‌గా అతడు ఎప్పుడూ బౌలర్లు, ఫీల్డర్లతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అలా చేయడంతో మైదానంలో అందరూ చురుగ్గా ఉంటారు. నిజంగా భారత క్రికెట్ నుంచి బుల్లెట్ వంటి చురుకైన ఆటగాళ్లు పుట్టుకొస్తున్నారు" అని ఐఎఎన్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా పేర్కొన్నాడు. -
సంచలనం.. . 86 ఫోర్లు, 7 సిక్సర్లతో 498 పరుగులు! ఎవరీ ద్రోణ దేశాయ్?
దివాన్ బల్లూభాయ్ కప్ అండర్-19 మల్టీ డే టోర్నమెంట్లో గుజరాత్ యువ క్రికెటర్ ద్రోణ దేశాయ్ సంచలనం సృష్టించాడు. ఈ టోర్నీలో సెయింట్ జేవియర్స్ స్కూల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 18 ఏళ్ల ద్రోణ దేశాయ్.. జెఎల్ ఇంగ్లిష్ స్కూల్‌పై మారాథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో దేశాయ్ క్వాడ్రాపుల్ సెంచరీతో చెలరేగాడు. తృటిలో 500 పరుగుల మార్క్‌ను ఈ గుజరాతీ చేజార్చుకున్నాడు.దేశాయ్ ఊచకోత.. రిపోర్ట్స్ ప్రకారం.. సెప్టెంబర్ 23న ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే సెయింట్ జేవియర్స్కు ఎదురుదెబ్బ తగిలింది. 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ద్రోణ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు.ఈ క్రమంలో ద్రోణ మొదట హెట్ దేశాయ్‌తో కలిసి 350 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత జట్టు కెప్టెన్ విరాట్ తలతితో కలిసి 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ ఇద్దరు బ్యాటర్లు కూడా సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 320 బంతులు ఎదుర్కొన్న దేశాయ్.. 86 ఫోర్లు, 7 సిక్స్‌లతో 498 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో రెండు పరుగులు చేసి ఉంటే 500 పరుగుల మార్క్‌ను అందుకునే వాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా జేవియర్స్ 844 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 845 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జెఎల్ ఇంగ్లిష్ స్కూల్ కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో 712 పరుగుల తేడాతో సెయింట్ జేవియర్స్ ఘన విజయాన్ని అందుకుంది.ఎవరీ ద్రోణ దేశాయ్?గుజరాత్‌కు చెందిన ద్రోణ దేశాయ్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ. తన 7ఏళ్ల వయస్సు నుంచే క్రికెట్ ఆడటం దేశాయ్ మొదలు పెట్టాడు. అతడు ఇప్పటికే గుజరాత్ అండర్-19 జట్టుకు ప్రాతనిథ్యం వహించాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఆదర్శంగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. గుజరాత్ అండర్-19 జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు. అయితే ద్రోణ క్రికెట్ జర్నీ వెనక అతడి తండ్రిది కూడా కీలక పాత్ర అనే చెప్పాలి. చిన్నతనంలో అతడి ప్రతిభను గుర్తించి క్రికెట్ కోచింగ్ ఆకాడమీలో చేర్చాడు. అదే విధంగా కోచ్ జయప్రకాష్ పటేల్ కూడా అతడిని మెరుగైన క్రికెటర్‌గా తీర్చిదిద్దాడు.ఇక స్కూల్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన మూడో క్రికెటర్‌గా దేశాయ్ నిలిచాడు. ఈ జాబితాలో ప్రణవ్ ధనవాడే (1009*), పృథ్వీ షా (546) ఉన్నారు.చదవండి: IND Vs BAN 2nd Test: గంభీర్ మరో మాస్టర్ ప్లాన్.. ఇక బంగ్లాకు చుక్కలే? -
‘రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమే’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై బంగ్లాదేశ్ వెటరన్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ జట్టుకు అశూ సేవలు మరువలేనివని.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు అతడు ఏమాత్రం తీసిపోడని కొనియాడాడు. తన దృష్టిలో టీమిండియాలో అత్యంత ముఖ్యమైన ఆటగాడు అతడేనని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు.బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి టెస్టులో అశ్విన్ సత్తా చాటిన విషయం తెలిసిందే. చెన్నైలోని సొంతమైదానం చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో విలువైన సెంచరీ చేయడంతో పాటు.. ఆరు వికెట్లు తీసి బంగ్లాదేశ్ ఓటమిని శాసించాడు. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.ఆరు శతకాలు.. 522 వికెట్లుఈ క్రమంలో టెస్టు క్రికెట్లో ఇప్పటికే 522 వికెట్లతో పాటు... 3422 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఇందులో ఆరు సెంచరీలు ఉండం విశేషం. ఇక గతంలోనూ పలు టెస్టుల్లో టీమిండియా చిక్కుల్లో పడ్డవేళ ఆపద్భాందవుడిలా తన ఇన్నింగ్స్‌తో గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ‘‘తొలి టెస్టులో అశ్విన్ అద్బుతంగా ఆకట్టుకున్నాడు. స్పెషలిస్టు బ్యాటర్ మాదిరి ఇన్నింగ్స్ ఆడాడు. నేను విదేశీయుడిని.. అయితే, నాలాగే చాలా మందికి ఎక్కువగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పేర్లే వినిపిస్తున్నాయి.రోహిత్, కోహ్లిలే కాదు.. టీమిండియాకు అతడూ ముఖ్యమేఅయితే, నా దృష్టిలో మాత్రం వాళ్లిద్దరితో పాటు టీమిండియాకు అశ్విన్ కూడా అంతే ముఖ్యం. కానీ.. అశూ లాంటి వాళ్లు సెంచరీ చేసినపుడు.. ఐదు లేదా ఆరు వికెట్లు పడగొట్టినపుడు మాత్రమే మనం వాళ్ల గురించి మాట్లాడతాం. అయితే, భారత క్రికెట్ జట్టు విజయపథంలో నడవడంలో అశ్విన్ వంటి మేటి ఆటగాళ్ల కృషి ఎంతగానో ఉంది’’ అని పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లి మాదిరే అతడూ టాప్ ప్లేయరేనని తమీమ్ ఇక్బాల్ ఈ సందర్భంగా అశ్విన్‌ను ప్రశంసించాడు.చదవండి: ఇరగదీస్తున్న ఆసియా దేశాలు.. ఒక్క పాక్ మినహా..!📽️ WATCHThe dismissal that completed five-wicket haul number 37 in Test Cricket for @ashwinravi99 👏👏#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/tDKMeNn33O— BCCI (@BCCI) September 22, 2024 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 72 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే
చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో మరుపురాని జ్ఞాపకంగా మిగలనుంది.భారత టెస్టు క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి ఓటముల సంఖ్యను టీమిండియా అధిగమించింది. ఇప్పటి వరకు 580 టెస్టులు ఆడిన భారత్.. 179 విజయాలు సాధించింది. మరో 178 ఓటములు, 222 మ్యాచ్‌లను డ్రా, ఒకటి టైగా ముగించింది. ఈ మ్యాచ్ కంటే ముందు టెస్టుల్లో భారత్ గెలుపోటముల సంఖ్య(178) సమనంగా ఉన్నాయి. ఇప్పుడు బంగ్లా విజయం సాధించడంతో ఓటముల కంటే అత్యధిక విజయాలను టీమిండియా నమోదు చేసింది. కాగా భారత తొలి టెస్టు విజయం కూడా చెన్నైలోని చిదబంరం స్టేడియంలోనే సాధించడం గమనార్హం.1952లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌పై భారత్ తొలి టెస్టు విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు యాదృచ్చికంగా 72 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ చరిత్రలో ఈ సరికొత్త ఆధ్యాయానికి చెపాక్ స్టేడియమే వేదిక కావడం విశేషం. కాగా 72 ఏళ్ల ప్రయాణంలో భారత జట్టు కెప్టెన్లుగా 36 మంది పనిచేశారు.చదవండి: IND vs BAN: అశ్విన్ స్పిన్ మాయ.. బంగ్లాపై భారత్ ఘన విజయం -
'బంగ్లాను తేలికగా తీసుకోవద్దు'.. రోహిత్‌ను హెచ్చరించిన సన్నీ
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమైంది. సెప్టెంబర్ 19ను చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-25లో భాగంగా జరగనున్న ఈ సిరీస్‌లో బంగ్లాను చిత్తు చేసి ముందుకు వెళ్లాలని టీమిండియా భావిస్తోంది. ఇప్పటికే చెన్నైకు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే తొలి టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ హెచ్చరించాడు. బంగ్లాదేశ్‌ను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని హిట్‌మ్యాన్‌ను అతడు సూచించాడు. కాగా బంగ్లా జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. పాకిస్తాన్‌పై చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించి భారత గడ్డపై బంగ్లా జట్టు అడుగుపెట్టింది. ఇప్పటివరకు ఒక్కసారి టెస్టుల్లో టీమిండియాను బంగ్లా ఓడించనప్పటకి.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం ఓటమి రుచిని చూపించింది. 2007 వన్డే ప్రపంచ కప్, 2012 ఆసియా కప్, 2015, 2022 ద్వైపాక్షిక సిరీస్‌లలో బంగ్లా జట్టు భారత్‌కు షాకిచ్చింది."పాకిస్తాన్‌ను వారి సొంత గడ్డపై ఓడించి బంగ్లాదేశ్ తమ సత్తా చాటింది. వారి టెస్టు క్రికెట్ హిస్టరీలోనే పాక్‌పై తొలి సిరీస్ విజయం సాధించి ప్రపంచ క్రికెట్‌కు సవాలు విసిరింది. ఇప్పుడు రెట్టింపు ఆత్మవిశ్వాసంతో భారత గడ్డపై అడుగుపెట్టారు.టీమిండియాను ఓడించాలన్న లక్ష్యంతో వారు ఉన్నారు. రెండేళ్ల క్రితం భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్ కోసం బంగ్లా పర్యటనకు వెళ్లింది. అప్పుడు కూడా వారు గట్టీ పోటీ ఇచ్చారు. ప్రస్తుతం బంగ్లా జట్టులో కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన వెంటనే ప్రత్యర్థిపై ఎలా ఆధిపత్యం ప్రదర్శించాలనేది త్వరగా నేర్చుకొంటున్నారు. పాక్‌పై విజయంతో బంగ్లా టీమ్‌ను ఏ ప్రత్యర్ధి కూడా తక్కువగా అంచనా వేయడం లేదు. కాబట్టి బంగ్లా-భారత్ సిరీస్ కచ్చితంగా మంచి సిరీస్ అవుతోంది" అని గవాస్కర్ తెలిపాడు.మరో 10 మ్యాచ్‌లు..టీమిండియా వచ్చే నాలుగైదు నెలల్లో 10 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే కనీసం ఐదు మ్యాచ్‌లోనైనా గెలవాలి. రాబోయే టెస్టు సీజన్ మొత్తం భారత్‌కు సవాల్‌తో కూడుకున్నది అని గవాస్కర్ మిడ్-డే కాలమ్‌లో రాసుకొచ్చాడు.చదవండి: 'రోహిత్ నా బౌలింగ్ ఆడలేకపోయాడు.. బుమ్రా సైతం మెచ్చుకున్నాడు' -
అరుదైన రికార్డ్‌కు అడుగు దూరంలో ఉన్న టీమిండియా
టెస్ట్ క్రికెట్లో టీమిండియా ఓ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉంది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో గెలిస్తే భారత్ ఓ అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంటుంది. టెస్ట్‌ల్లో ఇప్పటి వరకు కేవలం నాలుగు జట్లు మాత్రమే పరాజయాల కంటే ఎక్కువ విజయాలు సాధించాయి. బంగ్లాతో మ్యాచ్‌లో భారత్ గెలిస్తే ఈ రికార్డు సాధించిన ఐదో జట్టుగా చరిత్రపుటల్లోకెక్కుతుంది. భారత్ ఇప్పటివరకు 579 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 178 విజయాలు, 178 పరాజయాలను ఎదుర్కొంది. మిగతా 223 మ్యాచ్‌ల్లో 222 డ్రా కాగా.. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. బంగ్లాపై తొలి టెస్ట్‌లో గెలిస్తే భారత్ విజయాల సంఖ్య పరాజయాల సంఖ్య కంటే ఎక్కువుతుంది. చరిత్రలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్ మాత్రమే పరాజయాల కంటే ఎక్కువ విజయాలు సాధించాయి. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 866 టెస్ట్‌లు ఆడి 414 విజయాలు, 232 పరాజయాలు ఎదుర్కొంది. ఇంగ్లండ్ ఇప్పటివరకు 1077 మ్యాచ్‌లు ఆడి.. 397 విజయాలు, 325 పరాజయాలు ఎదుర్కొంది. దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 466 టెస్ట్‌లు ఆడి 179 విజయాలు, 161 పరాజయాలు ఎదుర్కొంది. పాకిస్తాన్ ఇప్పటివరకు 458 టెస్ట్‌లు ఆడి 148 విజయాలు, 144 పరాజయాలు ఎదుర్కొంది.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించారు. భారత ఆటగాళ్లంతా చెన్నైలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో జోరుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.తొలి టెస్ట్‌కు భారత జట్టు..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశ్ దయాల్, జస్ప్రీత్ బుమ్రాచదవండి: జోరుగా సాగుతున్న టీమిండియా ప్రాక్టీస్.. వీడియో -
'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'
టెస్టు క్రికెట్లో రీ ఎంట్రీ ఇవ్వాలనకున్న టీమిండియా మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్‌కు నిరాశే ఎదురైంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అయ్యర్‌కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఇప్పటిలో అతడు భారత టెస్టు జట్టులోకి వచ్చే సూచనలు కన్పించడం లేదు. దేశీవాళీ క్రికెట్లో అయ్యర్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో విఫలమైన శ్రేయస్.. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన అయ్యర్ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు.భారత్-డి జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. తొలి మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చేలా కన్పించాడు. కానీ తర్వాత ఇండియా-ఎ రెండో రౌండ్ మ్యాచ్‌లో డకౌటయ్యాడు.దీంతో అతడిని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. తాజాగా అయ్యర్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్‌ను అయ్యర్ సీరియస్‌గా తీసుకోవడం లేదని అలీ చెప్పుకొచ్చాడు"ఒక క్రికెటర్‌గా శ్రేయస్ అయ్యర్‌ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. అయ్యర్‌కు ఇప్పుడు రెడ్-బాల్ ఆడాలన్న ఆసక్తి లేదు. అతడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆడుతున్నట్లు ఉంది. అనంతపూర్ వంటి వికెట్‌పై అయ్యర్ సెంచరీ లేదా డబుల్ సెంచరీలు చేసి ఉండాల్సింది. కానీ అతడికి కేవలం బౌండరీలు సాధించాలన్న తపన తప్ప మరొకటి లేదు. ఏకాగ్రత లేకుండా ఆడి ఈజీగా పెవిలియన్‌కు చేరుతున్నాడు. శ్రేయస్‌కు వైట్‌బాల్ క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. వన్డే ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు సాధించిన తర్వాత అయ్యర్‌ను కొంతమంది విరాట్ కోహ్లితో పోల్చారు. కానీ విరాట్‌కు, శ్రేయస్‌కు చాలా తేడా ఉంది. నేను భారత సెలక్టర్ అయివుంటే దులీప్ ట్రోఫీలో అయ్యర్‌ను ఆడేంచివాడిని కాదు. అతను ఆటను గౌరవించడు. దులీప్ ట్రోఫీలో రహానే, పుజారా ఆడకపోవడం అయ్యర్ అదృష్టం. లేదంటే అతడికి దులీప్ ట్రోఫీలో కూడా చోటు దక్కపోయిండేంది అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బసిత్ అలీ పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్!? -
అత్యంత చెత్త రికార్డు.. 91 ఏళ్ల చరిత్రలో తొలిసారి?
టెస్టు క్రికెట్లో తమ ఉనికిని చాటుకోవాలనుకున్న అఫ్గానిస్తాన్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. నోయిడా వేదికగా న్యూజిలాండ్‌తో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. భారీ వర్షం కారణంగా నోయిడాలోని మైదానం ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది.దీంతో అయిదో రోజు ఆట కూడా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో కనీసం టాస్ పడకుండానే ఈ టెస్టు మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. ఈ క్రమంలో ఒక్క బంతి కూడా పడని అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ టెస్టు పలు అరుదైన రికార్డుల జాబితాలో చేరింది.ఆసియాలో తొలిసారి..టెస్టు క్రికెట్ హిస్టరీలో బంతి పడకుండా రద్దయిన ఎనిమిదో మ్యాచ్‌గా ఈ నోయిడా టెస్టు రికార్డులకెక్కింది. 1890లో మొట్టమొదటి సారి ఇలా జరిగింది. మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయింది. ఆ తర్వాత 1930లో ఆస్ట్రేలియా- ఇంగ్లండ్, 1970లో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్, 1989లో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్, 1990లో ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్, 1998లో పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే, 1998లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్టులు కనీసం టాస్ పడకుండానే రద్దు అయ్యాయి.ఇప్పుడు 26 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్-అఫ్గానిస్తాన్ టెస్టు మ్యాచ్ ఈ జాబితాలోకి చేరింది. ఇక ఆసియాలో వర్షం కారణంగా రద్దు అయ్యిన తొలి టెస్టు మ్యాచ్ మాత్రం అఫ్గాన్-న్యూజిలాండ్ మ్యాచే కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆసియాలో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు. ఆసియాలో 91 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు.చదవండి: Cristiano Ronaldo Followers: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా -
టీమిండియా స్టార్ ప్లేయర్ రీఎంట్రీ..?
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రెడ్ బాల్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న రంజీ ట్రోఫీ సీజన్‌తో సుదీర్ఘ ఫార్మాట్లో పాండ్యా పునరాగమనం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా పాండ్యా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. నెట్స్‌లో రెడ్ బాల్‌తో బౌలింగ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో పోస్ట్ చేశాడు.దీంతో అతడు మళ్లీ భారత టెస్టు జట్టులోకి కమ్‌బ్యాక్ ఇవ్వనున్నాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అక్టోబర్‌లో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో బరోడాకు హార్దిక్ ప్రాతినిథ్యం వహించే అవకాశముంది.చివరి టెస్టు ఎప్పుడు ఆడడంటే?హార్దిక్ పాండ్యా 2018లో తన చివరి టెస్ట్ మ్యాచ్ భారత్ తరుపన ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాకే కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఫిట్నెస్ లేమి కారణంగా పాండ్యా కేవలం వైట్-బాల్ క్రికెట్‌పై మాత్రమే దృష్టి సారించాడు. గత ఆరేళ్లగా అతడిని గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. మధ్యలో ఓసారి పాండ్యా వెన్నుముక సర్జరీ కూడా చేసుకున్నాడు. ఈ కారణాలతో అతడు రెడ్‌బాల్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. అయితే పాండ్యా ప్రస్తుతం గతంతో పోలిస్తే ఫిట్నెస్ పరంగా మెరుగయ్యాడు. దీంతో అతడు టెస్టుల్లో రీ ఎంట్రీ దిశగా అడుగులు వేస్తున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత పాండ్యా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు తిరిగి మళ్లీ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో భారత జట్టులోకి రానున్నాడు.చదవండి: పాకిస్తాన్‌లోనే చాంపియన్స్ ట్రోఫీ: ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ -
చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆసియాలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్ పర్యటనలో శ్రీలంకకు ఊరట విజయం దక్కింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై సిరీస్ కోల్పోయిన శ్రీలంక.. నామమాత్రపు మూడో టెస్టులో మాత్రం జూలు విధిల్చింది. లండన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను లంక చిత్తు చేసింది. దీంతో వైట్‌వాష్ నుంచి లంకేయులు తప్పించుకున్నారు. 219 పరుగుల విజయ లక్ష్యాన్ని లంక 40.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పాథుమ్ నిసాంక(127) ఆజేయ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు కుశాల్ మెండిస్ (39 నాటౌట్), ఏంజెలో మాథ్యూస్ (32) రాణించారు.లంక అరుదైన రికార్డు.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన శ్రీలంక ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన తొలి ఆసియా జట్టుగా శ్రీలంక చరిత్ర సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 2010లో ఆస్ట్రేలియాపై 180 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ఛేజ్ చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో పాక్ ఆల్‌టైమ్ రికార్డును లంక బ్రేక్ చేసింది. ఈ జాబితాలో పాక్ తర్వాత టీమిండియా ఉంది. 1971లో ఇంగ్లండ్‌పై 173 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.చదవండి: IND vs AUS: ముషీర్ ఖాన్‌కు బీసీసీఐ బంపరాఫర్.. టీమిండియాలో చోటు? -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బ్రేక్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ పరుగుల వరద పారించాడు. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రూట్ 75.00 సగటుతో 375 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు ఉన్నాయి. లంకతో సిరీస్‌ను 2-1తో ఇంగ్లండ్ సొంతం చేసుకోవడంలో జో కీలక పాత్ర పోషించాడు. కాగా సిరీస్ అసాంతం అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో రూట్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది. రూట్‌కు ఇది టెస్టుల్లో 6వ ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు కావడం విశేషం. దీంతో పలు అరుదైన రికార్డులను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు.రూట్ సాధించిన రికార్డులు ఇవే..⇥టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా రూట్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ ఆటగాళ్లు గ్రాహం గూచ్, ఆండ్రూ స్ట్రాస్, జేమ్స్ ఆండర్సన్‌ల పేరిట ఉండేది. వీరిముగ్గురూ 5 సార్లు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌లగా నిలిచారు. తాజా సిరీస్‌లో ఆరోసారి అవార్డు గెలుచుకున్న రూట్.. ఈ దిగ్గజ త్రయాన్ని అధిగమించాడు.⇥ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు సొంతం చేసుకున్న జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను రూట్ అధగమించాడు. సచిన్ తన టెస్టు కెరీర్లో 5 సార్లు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రూట్ దిగ్గజ క్రికెటర్లు మాల్కం మార్షల్, కర్ట్లీ ఆంబ్రోస్, స్టీవ్ వాలతో కలిసి సంయుక్తంగా ఆరో స్ధానంలో నిలిచాడు.చదవండి: AUS vs ENG: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. ఇంగ్లండ్ క్రికెట్ కీలక నిర్ణయం -
‘టెస్టుల్లో ఐదు శతకాలు.. నా వరకు ఎక్కువే’
టెస్టు క్రికెట్లో ఐదు శతకాలు బాదినందుకు తాను గర్వపడుతున్నానని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అన్నాడు. మేటి బ్యాటర్ జో రూట్‌ను అనుకరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించానని.. అయితే అతడిలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లడం తనకు సాధ్యంకాలేదని తెలిపాడు. ఎలాంటి వ్యూహాలు లేకుండానే క్రీజులోకి వెళ్లి సెంచరీలు చేయడం తనకే ఆశ్చర్యంగా ఉండేదని పేర్కొన్నాడు.మూడు ఫార్మా ట్లలో త్తా చాటిన మొయిన్ అలీకాగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్, టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్లలో సభ్యుడైన అలీ... తన కెరీర్లో ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 2014లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన అతడు.. పదేళ్ల కెరీర్లో 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20 మ్యాచ్‌లూ ఆడాడు. బంతితో, ఇటు బ్యాట్‌తో రాణించి.. టెస్టుల్లో 3094 పరుగులు చేయడంతోపాటు 204 వికెట్లు పడగొట్టాడు. అతడి ఖాతాలో ఐదు టెస్టు సెంచరీలు ఉండటం విశేషం. అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ మొయిన్ అలీ తన మార్కు చూపించాడు. వన్డేల్లో 2355 పరుగులు సహా 111 వికెట్లు.. అంతర్జాతీయ టీ20ల్లో 1229 పరుగులతో పాటు 51 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అందుకే రిటైర్మెంట్తనలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా మిగిలే ఉందని.. అయితే, కొత్త తరానికి అవకాశం ఇవ్వడం కోసమే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు 37 ఏళ్ల మొయిన్ అలీ ఆదివారం వెల్లడించాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకొన్నా.. ఫ్రాంచైజీ క్రికెట్లో మరి కొన్నాళ్లు ఆడతానని స్పష్టం చేశాడు.ఆ విషయంలో విఫలమయ్యానుఈ నేపథ్యంలో తన టెస్టు కెరీర్ గురించి నెమరువేసుకున్న మొయిన్ అలీ.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుసేన్తో మాట్లాడుతూ.. ‘‘నేను ఐదు శతకాలు బాదినందుకు గర్వపడుతున్నా. కేవలం ఐదే కదా అని అందరికీ అనిపించవచ్చు. కానీ.. డౌన్ ఆర్డర్లో వచ్చి మరీ ఇలా ఆడటం నాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది.అసలేం చేయగలనో తెలియని స్థితిలో క్రీజులోకి వెళ్లి.. పరుగులు రాబట్టడం నా వరకు ఊహించని విషయమే. ఉన్న కాసేపైనా బ్యాటింగ్ చేయడాన్ని పూర్తిగా ఆస్వాదించేవాడిని. నిజానికి జో రూట్‌లా నేనూ పక్కా ప్లాన్‌తో ఆడాలని భావించేవాడిని. కానీ విఫలమయ్యాను. అప్పటికప్పుడు పరిస్థితికి తగ్గట్లుగా మారిపోవడమే నాకు తెలుసు. అయితే, ఒక్కోసారి అనుకున్న మేర పరుగులు సాధించలేకపోయాననే భావన వెంటాడేది’’ అని చెప్పుకొచ్చాడు. తన కెరీర్ పట్ల మొయిన్ అలీ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ టెస్టుల్లో 12377 పరుగులు చేశాడు. ఇందులో 34 శతకాలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానమే లక్ష్యంగా రూట్ ముందుకు సాగుతున్నాడు.చదవండి: Ind vs Ban: అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు! -
విరాట్ వర్సెస్ రూట్.. ఎవరు బెస్ట్ టెస్టు క్రికెటర్?
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టెస్టుల్లో సెంచరీలు మోత మోగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు.తద్వారా ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా రూట్(34) చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డువైపు రూట్ అడుగులు వేస్తున్నాడు. లండన్ వేదికగా శ్రీలంకతో జరగనున్న మూడో టెస్టుకు అతడు సిద్దమవుతున్నాడు.విరాట్ వర్సెస్ రూట్.. ఎవరు బెస్ట్?అయితే తాజాగా ఓ పోడ్కాస్ట్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు పాల్గోన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికి ఓ కఠినమైన ప్రశ్న ఎదురైంది. విరాట్ కోహ్లి వర్సెస్ జో రూట్.. ఇద్దరిలో ఎవరూ అత్యుత్తమ టెస్టు క్రికెటర్? అన్న ప్రశ్నను హోస్ట్ అడిగాడు. వెంటనే వాన్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్‌గా జో రూట్‌ను ఎంచుకున్నాడు. కానీ గిల్లీ మాత్రం అందుకు అంగీకరించలేదు. విరాట్ కోహ్లినే టెస్టుల్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని ఈ ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ అదిరిపోయే సమాధానమిచ్చాడు."రూట్ ఇంగ్లండ్‌లో అత్యుత్తమ ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్వదేశంలో రూట్ గణాంకాలు చూస్తేనే ఆర్ధమవుతోంది. అతడు సాధించిన సెంచరీలలో సగానిని పైనా ఇంగ్లండ్‌లో చేసినవే. కానీ విరాట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మెరుగ్గా రాణించగలడు. విరాట్ కోహ్లి పెర్త్‌లో ఆడిన ఇన్నింగ్స్ నాకు ఇప్పటికి బాగా గుర్తుంది. పెర్త్ మైదానంలో నేను చూసిన అత్యుత్తమ సెంచరీలలో విరాట్ నాక్ ఒకటి. అది కూడా అతడు పెర్త్‌లో తన మొదటి మ్యాచ్‌లోనే కావడం విశేషం. అందుకే నా దృష్టిలో కోహ్లినే బెస్ట్ టెస్టు బ్యాటర్" అని గిల్లీ క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్కాస్ట్లోపేర్కొన్నాడు. అయితే గిల్‌క్రిస్ట్ దెబ్బకు వాన్ తోకముడిచాడు. ఆస్ట్రేలియాలో విరాట్ బెస్ట్ అని, కానీ వేరే చోట రూటే అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అని వాన్ చెప్పుకొచ్చాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లినే అత్యుత్తమ బ్యాటర్ అని వాన్, గిల్లీ ఇద్దరూ అంగీకరించడం గమనార్హం.గణాంకాల్లో రూట్.. అక్కడ మాత్రం విరాట్కాగా టెస్టుల్లో రూట్ గణాంకాలతో పోలిస్తే విరాట్ కాస్త వెనకబడ్డాడనే చెప్పకోవాలి. కోహ్లి తన కెరీర్లో ఇప్పటివరకు 113 టెస్టులు ఆడి.. 49.15 సగటుతో 8848 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే కోహ్లి ఆస్ట్రేలియా గడ్డపై 6 టెస్టు సెంచరీలు చేయడం గమనార్హం. విదేశీ గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి పేరిటే ఉంది. ఇక రూట్ విషయానికి వస్తే.. 145 టెస్టులు ఆడి 12377 పరగులు చేశడు. అతడి ఇన్నింగ్స్‌లలో 34 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఆసీస్ గడ్డపై రూట్ ఇప్పటివరకు కనీసం ఒక్క టెస్టు సెంచరీ చేయలేదు. అతడి సాధించిన సెంచరీలలో 20కు పైగా ఇంగ్లండ్‌లో సాధించినవే కావడం గమనార్హం. -
బాబర్ ఆజం రిటైర్మెంట్..? క్లారిటీ ఇచ్చిన హెడ్ కోచ్
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆజం నిరాశపరిచాడు. తొలి టెస్టులో దారుణ ప్రదర్శన కనబరిచిన బాబర్.. రెండో టెస్టులోనూ అదే ఆటతీరును కనబరిచాడు.తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన ఆజం, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. టెస్టు క్రికెట్లో అయితే బాబర్ హాఫ్ సెంచరీ సాధించి 20 నెలలపైనే అయింది. అతడు చివరగా టెస్టుల్లో డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై ఫిఫ్టీ స్కోర్లు సాధించాడు. ఈ క్రమంలో బాబర్ ఆజంపై తీవ్ర విమర్శల వర్షం కురుస్తోంది. అయితే వరుసగా విఫలమవుతుండడంతో టెస్టు క్రికెట్‌కు బాబర్ వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు ఓ రిటైర్మెంట్ నోట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బాబర్‌కు ఇదే చివరి టెస్టు అని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను పాకిస్తాన్ హెడ్‌కోచ్ జాసన్ గిల్లెస్పీ ఖండించాడు. బాబర్‌కు సపోర్ట్‌గా గిల్లెస్పీ నిలిచాడు."బాబర్ ఒక అద్భుతమైన ఆటగాడు. అతడొక వరల్డ్‌క్లాస్ ప్లేయర్. బాబర్ తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడని భావిస్తున్నాను. త్వరలోనే అతడి నుంచి మనం ఓ భారీ ఇన్నింగ్స్ చూస్తాము. నాకు ఆ నమ్మకం ఉంది. అతడు తన లభించిన ఆరంభాలను భారీ స్కోర్లగా మలుచుకోవడంలో విఫలమయ్యాడు అని" 4వ రోజు ఆట అనంతరం గిల్లెస్పీ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.చదవండి: Pak vs Ban: ఆలస్యమైతే అవుటే!.. భయంతో పాక్ క్రికెటర్ పరుగులు -
ధోని కంటే రోహిత్ చాలా డిఫరెంట్ కెప్టెన్: హర్భజన్
ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ.. ఇద్దరూ భారత క్రికెట్ జట్టుకు వరల్డ్‌కప్‌లు అందించిన కెప్టెన్లు. అయితే రోహిత్ గొప్ప, ధోని గొప్ప అంటే మాత్రం సమాధనం చెప్పలేం. ఎందుకంటే కెప్టెన్సీలో గానీ, ఆటలో గానీ ఎవరికి వారే మేటి. తాజాగా ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీ శైలుల గురించి భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని, రోహిత్ ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ స్టైల్స్‌ను కలిగి ఉన్నారని భజ్జీ చెప్పుకొచ్చాడు.కెప్టెన్సీలో ధోని, రోహిత్‌లకు ఎటువంటి పోలిక లేదు. ఇద్దరూ వేర్వేరు కెప్టెన్సీ శైలిలను కలిగి ఉన్నారు. ధోని కెప్టెన్సీలో నేను భారత జట్టుతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కేన్ విలియమ్సన్ వరసుగా బౌండరీలు బాది ఒత్తడిలోకి నెట్టాడు. ఆ సమయంలో షార్ట్ ఫైన్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాను. వెంటనే ధోని వద్దకు వెళ్లి ఠాకూర్ తన బౌలింగ్ లెంగ్త్‌ను మార్చుకుంటే బాగుంటుందని సూచించాను. కానీ ధోని మాత్రం పాజీ నేను ఇప్పుడు అతనితో చెబితే, శార్ధూల్ ఎప్పటికీ నేర్చుకోడు. తనంతట తానే నేర్చుకోనివ్వండి అంటూ నాతో అన్నాడు. ఇది ధోని స్టైల్ కెప్టెన్సీ. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ మరో రకం. రోహిత్ చాలా డిఫరెంట్. అతను వెళ్లి ప్రతి ప్లేయర్‌తో మాట్లాడతాడు. ఆటగాడి భుజం మీద చేయి వేసి తన నుంచి ఏమి ఆశిస్తున్నాడో చెబుతాడు. మీరు చేయగలరన్న నమ్మకం అతడు కలిగిస్తాడు. టెస్టు క్రికెట్లో కెప్టెన్‌గా వ్యవహరించినప్పటి నుంచి హిట్‌మ్యాన్ మరింత మెరుగయ్యాడు. ఎవరైనా టెస్టుల్లో జట్టును నడిపించినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు. టెస్ట్ క్రికెట్‌కు ఖచ్చితమైన వ్యూహాలు, వాటని అమలు చేయడం చాలా అవసరం. దీంతో ఒక ఉత్తమ నాయకుడిగా నిలుస్తారని "తరువర్ కోహ్లీ పోడ్కాస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు. -
బాబర్ ఆజం కథ ముగిసినట్టేనా.. 20 నెలల నుంచి నిరీక్షణ?
బాబర్ ఆజం.. పాకిస్తాన్‌కే కాదు వరల్డ్ క్రికెటలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. కెప్టెన్సీతో పాటు తన క్లాసిక్ ఇన్నింగ్స్‌లతో పాక్‌కు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. బాబర్ క్రీజులో ఉన్నాడంటే పాక్ డగౌట్లో కొండంత బలం. టీ20ల్లో కాస్త స్లోగా ఆడుతాడని పేరు ఉన్నప్పటకి మిగితా రెండు ఫార్మాట్లలో తనకు తిరుగులేదని బాబర్ ఎప్పుడో నిరూపించుకున్నాడు. కానీ ఇదింతా ఒకప్పుడు. గత కొంత కాలంగా బాబర్ బ్యాట్ ముగిబోయింది.ఒకనొక దశలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లితో పోటీ పడిన ఈ పాకిస్తానీ క్రికెటర్‌కు ఇప్పుడు ఏమైంది. కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకోవడానికి తెగ కష్టపడతున్నాడు. ముఖ్యంగా తన ఫేవరేట్ టెస్టు క్రికెట్లో కూడా బాబర్ తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు.బాబర్‌కు ఏమైంది?స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో బాబర్ మరోసారి నిరాశపరిచాడు. తొలి టెస్టులో కేవలం 22 పరుగులు మాత్రమే చేసిన ఆజం.. ఇప్పుడు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కూడా విఫలమయ్యాడు. కేవలం 31 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. స్పిన్నర్లకు అద్బుతంగా ఆడుతాడని పేరు గాంచిన బాబర్.. అదే స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. క్రీజులో ఉన్నంత సమయం తీవ్ర ఒత్తిడితో బ్యాటింగ్ చేశాడు. ఆఖరికి షకీబ్ బౌలింగ్‌లో బాబర్ ఇన్నింగ్స్ ముగిసింది.చివరి హాఫ్ సెంచరీ ఎప్పుడంటే?బాబర్ ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి దాదాపు 20 నెలలు దాటింది. అతడు చివరగా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై 161 పరుగులు చేశాడు. అప్పటి నుంచి హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటలేకపోతున్నాడు. గత 20 నెలలలో టెస్టుల్లో అతడు సాధించిన అత్యధిక స్కోర్ 41 పరుగులే కావడం గమనార్హం. జనవరి 2023 నుంచి ఇప్పటివరకు 15 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆజం.. 21.33 సగటుతో కేవలం 320 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా బాబర్ తన మార్క్‌ను చూపిస్తాడో లేదో వేచి చూడాలి. -
టెస్ట్‌లకే నా మొదటి ప్రాధాన్యత: సూర్యకుమార్ యాదవ్
టీమిండియా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ క్రికెట్‌పై తన మనోగతాన్ని వెల్లడించాడు. టెస్ట్‌ల్లో ఆడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. స్పోర్ట్స్టార్తోమాట్లాడుతూ.. రెడ్ బాల్ క్రికెట్‌కే తన మొదటి ప్రాధాన్యత అని అన్నాడు. టీ20ల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన స్కై.. సుదీర్ఘ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. చిన్నతనం నుంచి రెడ్ బాల్ క్రికెట్ ఆడుతూనే పెరిగానని గుర్తు చేసుకున్న స్కై.. ఆ వయసు నుంచే టెస్ట్ క్రికెట్‌పై మక్కువ ఎక్కువగా ఉండేదని అన్నాడు.భారత టెస్ట్ జట్టులో స్థానం కోసం చాలామంది అహర్నిశలు శ్రమించారని అన్న స్కై.. తాను కూడా టెస్ట్ జట్టులో చోటే లక్ష్యంగా కష్టపడుతున్నానని తెలిపాడు. యువ క్రికెటర్లకు టెస్ట్ జట్టులో స్థానంపై స్కై స్పందిస్తూ.. అర్హులైన వారందరికీ సరైన అవకాశాలు లభించాయని అన్నాడు. కాగా, సూర్యకుమార్ గతేడాది టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే తొలి టెస్ట్ ఆడిన అనంతరం అతను గాయపడి జట్టుకు దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో యువ ఆటగాళ్లు అతని స్థానాన్ని ఆక్రమించాడు. తనకు లభించిన ఏకైక అవకాశాన్ని స్కై సద్వినియోగం చేసుకోలేకపోయాడు. స్కై టెస్ట్‌ల్లో తన ఏకైక ఇన్నింగ్స్‌లో 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.త్వరలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌లు జరుగనున్న నేపథ్యంలో స్కై టెస్ట్ జట్టులో చోటు ఆశిస్తున్నాడు. మిడిలార్డర్లో స్కై.. కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్ లాంటి వారి నుంచి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్కై.. త్వరలో జరుగనున్న దేశవాలీ మ్యాచ్‌ల్లో రాణిస్తే టెస్ట్ జట్టు తలుపులు తట్టే అవకాశాలు లేకపోలేదు. ఏదిఏమైనా మిడిలార్డర్లో పోటీ తీవ్రంగా ఉంది కాబట్టి స్కై అనుకున్న దానికంటే మరింత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. -
WI vs SA: చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్..
దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో సౌతాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన స్పిన్నర్‌గా మహారాజ్ రికార్డులెక్కాడు. గయనా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన కేశవ్ ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 52 టెస్టులు ఆడిన ఈ ప్రోటీస్ స్టార్ స్పిన్నర్.. 171 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు సౌతాఫ్రికా లెజెండరీ స్పిన్నర్ హ్యూ టేఫీల్డ్(170) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో హ్యూ టేఫీల్డ్ ఆల్‌టైమ్ రికార్డును కేశవ్ బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో సఫారీ పేస్ గన్(439) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో టెస్టులో విండీస్‌పై 40 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 0-1 తేడాతో ప్రోటీస్ జట్టు కైవసం చేసుకుంది.స్కోర్లుదక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 160/10వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 144/10దక్షిణాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్: 246/10విండీస్ సెకెండ్ ఇన్నింగ్స్: 222/10ఫలితం: 40 పరుగుల తేడాతో విండీస్‌పై ప్రోటీస్ విజయం -
'పాక్ జట్టులో మ్యాచ్ ఫిక్సర్లు లేరు.. అందరి లక్ష్యం ఒక్కటే'
టీ20 వరల్డ్‌కప్-2024లో ఘోర పరాభావం తర్వాత పాకిస్తాన్ తొలి సిరీస్‌కు సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాకిస్తాన్ తలపడనుంది. ఈ రెడ్ బాల్ సిరీస్ కోసం పాక్ జట్టు ఇప్పటికే తమ ప్రాక్టీస్‌ను ఆరంభించింది.లహోర్‌లోని హైఫెర్మామెన్స్ సెంటర్లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే తాజాగా ప్రీ-సిరీస్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గోన్న పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒలింపిక్స్‌లో పాకిస్తాన్‌కు చారిత్రత్మక గోల్డ్‌మెడల్ అందించిన అర్షద్ జావెద్‌పై మీ అభిప్రాయమేంటని ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నించాడు.అదే విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా దేశ కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి కదా అని సదరు జర్నలిస్టు మరో ప్రశ్నను సంధించాడు."ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ సెటప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదానికి తావులేదు. జట్టులోని ప్రతీ ఒక్కరూ పాకిస్తాన్‌కు విజయాలు అందించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. ఏ క్రికెటర్ కూడా తమ దేశ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరించారని నేను అనుకుంటున్నాను. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత మేము తొలి సిరీస్ ఆడుతున్నాం. ఈ సిరీస్‌లో గెలిచేందుకు మేము శర్వశక్తులా ప్రయత్నిస్తాము. అయితే ఆటలో గెలుపు, ఓటములు సహజం. మేము ఓడిన ప్రతీసారి చాలా నిరాశచెందుతాం. ఇక అర్షద్ నదీమ్ ఒక నేషనల్ హీరో. నదీమ్‌ను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగుతామని" విలేకరుల సమావేశంలో మసూద్ పేర్కొన్నాడు.బంగ్లాదేశ్ టెస్టులకు పాకిస్థాన్ టెస్టు జట్టుషాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అమీర్ జమాల్ (ఫిట్‌నెస్‌కు లోబడి), అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, కమ్రాన్ గులామ్, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీపర్), షాహీన్ షా అఫ్రిది. -
63 టెస్టులు.. 294 వికెట్లు! జాక్వెస్ కల్లిస్ రికార్డు బద్దలు
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ నిప్పులు చేరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లు బౌలింగ్ చేసిన రబాడ.. మూడు కీలక వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బ తీశాడు. అతడితో పాటు మహారాజ్ 4 వికెట్ల పడగొట్టడంతో ఆతిథ్య కరేబియన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్రోటీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగుల ఆధిక్యం లభించింది. విండీస్ బ్యాటర్లలో కీసీ కార్తీ(42) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 357 పరుగులకు ఆలౌటైంది.రబాడ అరుదైన ఘనత..ఇక ఈ మ్యాచ్‌లో కగిసో రబాడ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆరో సఫారీ బౌలర్‌గా రబడ రికార్డులకెక్కాడు. విండీస్ బ్యాటర్ కావెం హాడ్జ్‌ను ఔట్ చేసిన రబాడ.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 63 టెస్టులు ఆడిన రబాడ 294 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు ప్రోటీస్ క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కల్లిస్ (291) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కల్లిస్‌ను రబాడ అధిగమించాడు. ఇక ఈ జాబితాలో దక్షిణాఫ్రికా పేస్ గన్ డేల్ స్టెయిన్ 439 వికెట్లతో అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో షాన్ పొలాక్(421), ఎన్తిని(390) ఉన్నారు. -
SA vs WI 1st Test: చెలరేగిన కెప్టెన్.. పటిష్ట స్థితిలో సౌతాఫ్రికా
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది.క్రీజులో ముల్డర్(37), రబాడ(12) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్ టెంబా బావుమా(86) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు టోనీ డి జోర్జి(78), బవెర్రెయిన్నే(39) పరుగులతో రాణించారు. అయితే ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్, స్టార్ బ్యాటర్ ఐడైన్ మార్క్రమ్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి మార్క్రమ్ ఔటయ్యాడు. ఇక విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ 3 వికెట్లు పడగొట్టగా.. కీమర్ రోచ్, సీల్స్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా వర్షం కారణంగా తొలి రోజు కేవలం 15 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది. -
సర్ఫరాజ్ కెప్టెన్సీలో ఆడనున్న టీమిండియా సారథి
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టెస్టు జట్టులోనూ పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ క్రమంలో దేశీ రెడ్‌బాల్ టోర్నమెంట్ ఆడేందుకు ఈ ముంబై బ్యాటర్ సిద్ధమయ్యాడు. రానున్న బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో భాగంగా సూర్య వైట్ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు.ఈ విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ధారించింది. ఇక తన నిర్ణయం గురించి సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడబోతున్నాను. తద్వారా.. దేశవాళీ సీజన్(రంజీ) మొదలయ్యే ముందు నాకు కావాల్సినంత ప్రాక్టీస్ దొరుకుతుంది. ఈనెల 25 తర్వాత జట్టుతో చేరతా. నాకు వీలున్నపుడల్లా కచ్చితంగా ముంబై జట్టుకు, క్లబ్ టీమ్‌కు తప్పక ఆడతా’’ అని స్పష్టం చేశాడు.ఇక సూర్య ఈ టోర్నీలో ఆడటంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ‘‘ఈ టోర్నీకి అందుబాటులో ఉంటానని సూర్య ముందే చెప్పాడు. అతడు అందరిలాంటి వాడు కాదు. క్లబ్ మ్యాచ్‌లు ఆడతానన్నాడు. కెప్టెన్‌గా ఉంటారా అని మేము తనని అడిగాం. అయితే, సూర్య మాత్రం సర్ఫరాజ్‌నే సారథిగా కొనసాగించమని చెప్పాడు. తను ఆటగాడిగా ఉంటానని చెప్పాడు’’ అని ముంబై వర్గాలు తెలిపాయి.కాగా టీమిండియా పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలిసారి శ్రీలంకలో పర్యటించిన సూర్యకుమార్ యాదవ్.. 3-0తో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్న విషయం తెలిసిందే. అయితే, వన్డే, టెస్టుల్లో సూర్య రికార్డు అంతగొప్పగా ఏం లేదు. టీమిండియా తరఫున ఇంతవరకు ఒకే ఒక్క టెస్టు ఆడిన సూర్య కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు.ఇక బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో పాల్గొంటున్న ముంబై జట్టుకు సర్ఫరాజ్ ఖాన్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. అజింక్య రహానే, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ వంటి సీనియర్ల గైర్హాజరీలో సర్ఫరాజ్‌కు ఈ సువర్ణావకాశం వచ్చింది. తొలిసారి జట్టుకు నాయకుడిగా వ్యవహరించబోతున్నాడు. అయితే, సూర్య రాకతో సర్ఫరాజ్ పదవి చేజారుతుందని భావించగా.. సూర్య మాత్రం అతడినే కొనసాగించాలని చెప్పినట్లు తెలుస్తోంది.కాగా మోతవరపు మహిపతి నాయుడు బుచ్చిబాబు నాయుడుగా సుపరిచితులు. ఒకప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో 1868లో జన్మించారు ఆయన. క్రికెట్ క్లబ్లో స్వదేశీయులకు అవకాశాలు కల్పించారు. ఆయన జ్ఞాపకార్థం తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బుచ్చిబాబు నాయుడు టోర్నమెంట్ నిర్వహిస్తోంది. దేశీ రెడ్‌బాల్ జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయి. ఆగష్టు 15న టోర్నీ మొదలుకానుంది. బుచ్చిబాబు టోర్నమెంట్-2024కు తొలుత ముంబై ప్రకటించిన జట్టుసర్ఫరాజ్ ఖాన్ (కెప్టెన్), సిద్ధేశ్ లాడ్, దివ్యాంశ్ సక్సేనా, అమోగ్ భత్కల్, అఖిల్ హెర్వాద్కర్, ముషీర్ ఖాన్, నూతన్ గోయల్, సూర్యాన్ష్ షెడ్గే, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, తనూష్ కొటియన్, అథర్వ అంకోలేకర్, హిమాన్షు సింగ్, ధనిత్ రౌత్, సిల్వెస్టర్ డిసౌజా, జునైద్ ఖాన్, హర్ష్ తనా. -
147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు
జింబాబ్వే క్రికెటర్ క్లైవ్ మండాడే టెస్టు చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక ఇన్నింగ్స్‌లో ‘బై’స్ రూపంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐర్లాండ్‌తో టెస్టు సందర్భంగా ఈ పరాభవం మూటగట్టుకున్నాడు. టెస్టుల్లో అరంగేట్రంలోనే చేదు జ్ఞాపకాన్ని పోగుచేసుకున్నాడు.అరంగేట్రంలో డకౌట్ఏకైక టెస్టు ఆడేందుకు ఐర్లాండ్ జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య బెల్ఫాస్ట్ వేదికగా గురువారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన పర్యాటక ఐర్లాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే.. 71.3 ఓవర్లలో 210 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది.ఓపెనర్లు గుంబీ 49, మస్వారే 74 పరుగులతో రాణించారు. సీన్ విలియమ్స్ 35 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ క్లైవ్ మండాడే ఏడో స్థానంలో బరిలోకి దిగి.. డకౌట్‌గా వెనుదిరిగాడు.ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ 250 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ మూర్ 79 రన్స్ చేయగా.. ఆండీ మెక్‌బ్రైన్ 28 పరుగులతో ఐరిష్ ఇన్నింగ్స్‌లో రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే కంటే.. 40 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.90 ఏళ్ల రికార్డు బద్దలుఅయితే, ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా 24 ఏళ్ల క్లైవ్ మండాడే బైస్ రూపంలో ఏకంగా 42 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా 90 ఏళ్ల క్రితం ఇంగ్లండ్ వికెట్ కీపర్ లెస్ ఆమ్స్ నమోదు చేసిన చెత్త రికార్డును బద్దలు కొట్టాడు. తద్వారా 147 ఏళ్ల చరిత్రలో ఇలాంటి అన్వాంటెడ్ రికార్డు సాధించిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. అయితే, ఇందులో కేవలం క్లైవ్‌ను మాత్రమే తప్పుపట్టడానికి లేదు. జింబాబ్వే బౌలర్లకు కూడా ఇందులో భాగం ఉంది. కాగా 1934లో ఆమ్స్ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 37 పరుగులు బైస్ రూపంలో ఇచ్చుకున్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సరికి జింబాబ్వే ఐర్లాండ్ కంటే 28 పరుగులు వెనుకబడి ఉంది. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది జింబాబ్వే.తుదిజట్లుజింబాబ్వేజోయ్ లార్డ్ గుంబీ, ప్రిన్స్ మస్వారే, డియాన్ మేయర్స్, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), సీన్ విలియమ్స్, బ్రియాన్ బెన్నెట్, క్లైవ్ మాండాడే (వికెట్ కీపర్), బ్లెస్సింగ్ ముజరాబానీ, రిచర్డ్ నగరవా, తనకా చివంగా, టెండాయ్ చటారా.ఐర్లాండ్ఆండ్రూ బాల్బిర్నీ (కెప్టెన్), పీటర్ మూర్, కర్టిస్ కాంఫర్, హ్యారీ టెక్టర్, పాల్ స్టిర్లింగ్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), ఆండీ మెక్‌బ్రైన్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, మాథ్యూ హంఫ్రీస్. -
శుబ్‌మన్ గిల్‌కు మళ్లీ ప్రమోషన్?.. బుమ్రాకు షాక్!
శ్రీలంక పర్యటన తర్వాత భారత జట్టు బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా ఆతిథ్య బంగ్లాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు ముందు బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్‌ను గిల్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీ20లు, వన్డేల్లో భారత జట్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలను గిల్‌కు బీసీసీఐ అప్పగించిన సంగతి తెలిసిందే.అయితే ఆల్ఫార్మాట్లలో టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతలను గిల్‌కు అప్పగించే దిశగా భారత క్రికెట్ బోర్డు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టెస్టుల్లో భారత వైస్ కెప్టెన్‌గా ఉన్న స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా తప్పించి.. గిల్‌ను రోహిత్ శర్మ డిప్యూటీగా నియమించాలని బోర్డు యోచిస్తుందట.ఇక శ్రీలంకతో టీ20 సిరీస్ నుంచి భారత వైట్‌బాల్ వైస్ కెప్టెన్‌గా గిల్ ప్రయాణం ప్రారంభం కానుంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై వేటు వేసి మరి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ గిల్‌కు అప్పగించింది.అదేవిధంగా కెప్టెన్‌గా కూడా గిల్ ఆకట్టుకున్నాడు. అతడి సారథ్యంలోనే జింబాంబ్వేతో టీ20 సిరీస్‌ను భారత్ 4-1తో సొంతం చేసుకుంది. కాగా శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహిస్తున్నాడు. -
ఓలీ పోప్ సూపర్ సెంచరీ.. 416 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
నాటింగ్హమ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ అదరగొట్టింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 88.3 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్ ఓలీ పోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు.121 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 121 పరుగులు చేశాడు. అతడితో పాటు బెన్ డకెట్ (71; 14 ఫోర్లు), స్టోక్స్ (69; 8 ఫోర్లు) రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోషఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సింక్లైర్, సీల్స్, హోడ్జ్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఇంగ్లండ్ 4.2 ఓవర్లలో 50 పరుగులు చేసి టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన జట్టుగా తమ పేరిటే ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 1994లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ 4.3 ఓవర్లలో 50 పరుగులు సాధించింది. -
‘704’తో ముగించిన అండర్సన్
లండన్: 21 సంవత్సరాల టెస్టు కెరీర్... 188 మ్యాచ్‌లు...40,007 బంతులు...704 వికెట్లు...26.45 సగటు...ఘనమైన ఆటకు ముగింపు లభించింది. టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ కెరీర్‌కు తెర పడింది. శుక్రవారం వెస్టిండీస్‌తో ముగిసిన తొలి టెస్టుతో అతను ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2003 మే 22–24 మధ్య ఇదే లార్డ్స్ మైదానంలో తొలి టెస్టు ఆడిన అండర్సన్ అక్కడే ఆటకు వీడ్కోలు పలికాడు. విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో తన 12వ ఓవర్లో జోషువా డి సిల్వాను కీపర్ క్యాచ్ ద్వారా అవుట్ చేయడంతో అండర్సన్ ఖాతాలో చివరిదైన 704వ వికెట్ చేరింది. టెస్టుల్లో మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా... సచిన్ టెండూల్కర్ (200) తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన రెండో ఆటగాడిగా ఈ దిగ్గజం సొంత అభిమానుల సమక్షంలో మైదానం వీడాడు. మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్, 114 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 79/6తో ఆట కొనసాగించిన విండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. 12.1 ఓవర్లలో ఆ జట్టు మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. గుడకేశ్ మోతీ (31 నాటౌట్) మాత్రమే కొద్దిగా పోరాడగలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అట్కిన్సన్ (5/61) విండీస్‌ను దెబ్బ తీశాడు. రెండో టెస్టు గురువారం నుంచి నాటింగ్‌హామ్‌లో జరుగుతుంది. -
శెభాష్ ఆండర్సన్.. వీడ్కోలు మ్యాచ్‌లో వరల్డ్ రికార్డు
తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నిప్పులు చేరుగుతున్నాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆండర్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో ఓ కీలక వికెట్ పడగొట్టిన ఆండర్సన్.. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆదిలోనే రెండు వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బతీశాడు. అయితే తన విడ్కోలు టెస్టులో ఆండర్సన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టు క్రికెట్ చరిత్రలో 40,000 బంతులు వేసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా ఆండర్సన్ రికార్డులెక్కాడు. ఈ మ్యాచ్‌లో తన 10వ ఓవర్ వేసిన అనంతరం ఆండర్సన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు 188 టెస్టులు ఆడిన ఆండర్సన్.. 6666. 5(40000 బంతులు) ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో ఆండర్సన్ నాలుగో స్ధానంలో ఉన్నాడు. ఈ జాబితాలో దిగ్గజ స్పిన్నర్లు ఆండర్సన్ కంటే ముందు అనిల్ కుంబ్లే(44039), షేన్ వార్న్(40850), ముత్తయ్య మురళీధరన్(40705) ఉన్నారు.అదేవిధంగా ఆండర్సన్ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో విండీస్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా ఆండర్సన్ నిలిచాడు. ఆండర్సన్ ఇప్పటివరకు వెస్టిండీస్‌పై 90 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(89) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కపిల్ దేవ్ రికార్డును ఆండర్సన్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో గ్లెన్ మెక్‌గ్రాత్(110) తొలి స్ధానంలో ఉన్నాడు. Jimmy Anderson, there are no words 🤯 pic.twitter.com/bBRCS1uykD— England Cricket (@englandcricket) July 11, 2024 -
7 వికెట్లతో చెలరేగిన అండర్సన్.. ఇక విండీస్‌కు చుక్కలే!
ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జూలై 10 నుంచి లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టెస్టు అనంతరం ఆండర్సన్ తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు పలకనున్నాడు. అయితే తన ఆఖరి టెస్టుకు ముందు ఆండర్సన్ నిప్పలు చేరిగాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో లాంక్షైర్కు ప్రాతినిథ్యం వహిస్తున్న అండర్సన్.. నాటింగ్హమ్షైర్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆండర్సన్ ఏకంగా 7 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు వేసిన అండర్సన్ కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 6 వికెట్ల పైగా అండర్సన్ పడగొట్టడం ఇది 16వ సారి కావడం గమనార్హం. అండర్సన్ నిప్పులు చేరగడంతో నాటింగ్హమ్షైర్ 126 పరుగులకే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాంక్షైర్ 353 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక ఆండర్సన్‌కు వరల్డ్‌క్రికెట్‌లో ప్రత్యేకమైన స్ధానం ఉంది. 41 ఏళ్ల ఆండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్‌గా 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్ 987 వికెట్లు పడగొట్టాడు. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒకే రోజు 525 పరుగులు!
చెపాక్ వేదికగా దక్షిణాఫ్రికా మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలి రోజు టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. మొదటి రోజు ఏకంగా టీమిండియా 4 వికెట్ల నష్టానికి 525 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగగా.. స్మృతి మంధాన సెంచరీతో మెరిసింది. 197 బంతులు ఎదుర్కొన్న షఫాలీ 27 ఫోర్లు, 8 సిక్స్‌లతో 205 పరుగులు చేయగా.. మంధాన 161 బంతుల్లో 149 పరుగులు చేసింది.వీరితో పాటు జెమిమా రోడ్రిగ్స్(55) పరుగులతో రాణించింది. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్(42), రిచా ఘోష్(43) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డెల్మీ టక్కర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డీక్లార్క్ ఒక్క వికెట్ సాధించింది.చరిత్ర సృష్టించిన టీమిండియా..ఇక ఈ మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శన కనబరిచిన భారత మహిళల జట్టు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. పురుషుల, మహిళల టెస్టు క్రికెట్లో ఒక రోజులో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది.అంతకుముందు 2002లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఒకే రోజులో 9 వికెట్లు కోల్పోయి 509 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో లంకేయుల రికార్డును భారత మహిళలు బద్దలు కొట్టారు. ఇప్పటివరకు మహిళల టెస్టు క్రికెట్లో అయితే 431 పరుగులే అత్యధిక కావడం గమనార్హం. -
SL Vs BAN: చరిత్ర సృష్టించిన శ్రీలంక బ్యాటర్.. టెస్ట్ క్రికెట్లో ఒకే ఒక్కడు..!
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగింది. ఏడు అంతకంటే కింది స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి, ఒకే టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్ చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కమిందు ఈ అద్భుత రికార్డును నమోదు చేశాడు. 150 ఏళ్లకు పైబడిన టెస్ట్ క్రికెట్లో కమిందుకు ముందు ఒక్క ఆటగాడు కూడా ఈ ఘనత సాధించలేదు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగి సెంచరీ (102) చేసిన కమిందు.. ఇదే మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ప్లేస్‌లో బరిలోకి దిగి 100 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మరో ఘనత కూడ ఉంది. లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వ కూడా ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశాడు. ధనంజయ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 102 పరుగులు చేసిన ధనంజయ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ధనంజయ, కమిందు సెంచరీలతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగులు చేసి ఆలౌటైంది. వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రాణించలేకపోయారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. విశ్వ ఫెర్నాండో (4/48), రజిత (3/56), లహిరు కుమార (3/31) విజృంభించడంతో 188 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో తైజుల్ ఇస్లాం (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 92 పరుగుల లీడ్‌తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. మూడో రోజు టీ సమయానికి 7 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసి 430 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. లంక సెకెండ్ ఇన్నింగ్స్‌లో ధనంజయ, కమిందుతో పాటు కరుణరత్నే (52) కూడా రాణించాడు. -
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. 3 ఏళ్ల తర్వాత ఎంట్రీ
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా తన టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. శ్రీలంక క్రికెట్ సూచన మెరకు హసరంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. కాగా వైట్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించేందుకు గతేడాది ఆగస్టులో టెస్టు క్రికెట్‌కు విడ్కోలు హసరంగా విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్న వనిందు.. మళ్లీ రెడ్‌బాల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ శ్రీలంక జట్టులో హసరంగా చోటు దక్కించుకున్నాడు. సోమవారం బంగ్లా సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టుకు ధనంజయ డిసిల్వా సారథ్యం వహించనున్నాడు. ఈ జట్టులో వనిందు హసరంగాతో పాటు యువ క్రికెటర్లు నిషాన్ పీరిస్, చమిక గుణశేఖరలకు చోటు దక్కింది. అదేవిధంగా కుసాన్ రజితా సైతం రీ ఎంట్రీ ఇచ్చాడు. మార్చి 22 నుంచి సెల్హాట్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా 29 ఏళ్ల హసరంగా చివరిసారిగా 2021లో బంగ్లాదేశ్‌తో టెస్ట్ ఆడాడు . శ్రీలంక టెస్టు జట్టు: ధనంజయ డిసిల్వా (కెప్టెన్), కుసాల్ మెండిస్ (వైస్ కెప్టెన్), దిముత్ కరుణరత్నే, నిషాన్ మదుష్క, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, లహిరు ఉదరా, వనిందు హసరంగా, ప్రబాత్ జయసూర్య, రమేష్ మెండిస్, నిషాన్ పెసిరి, నిషాన్ పెసిరి ఫెర్నాండో, లహిరు కుమార, చమిక గుణశేఖర -
Rohit Sharma: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క మొనగాడు
టీమిండియా కెప్టెన్ రోహిత్ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యంకాని ఓ గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్‌లో సెంచరీతో (103) కదంతొక్కిన హిట్‌మ్యాన్.. తన టెస్ట్ కెరీర్లో 12వ శతకాన్ని నమోదు చేశాడు. రోహిత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ (110), అశ్విన్ (9 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (7 వికెట్లు) చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్లో సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. రోహిత్ తన కెరీర్లో చేసిన 12 టెస్ట్ సెంచరీలు టీమిండియా విజయానికి దోహదపడ్డాయి. ఇలా ఓ ఆటగాడు చేసిన తన తొలి 12 టెస్ట్ సెంచరీలు జట్టు విజయానికి దోహదపడటం క్రికెట్ చరిత్రలో ఇదే ప్రధమం. ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో రోహిత్ తప్ప ఈ ఘనతను ఎవరూ సాధించలేకపోయారు. లేటు వయసులో టెస్ట్ ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన రోహిత్.. వయసు మీద పడుతున్నా ఏమాత్రం తగ్గకుండా ఎవరికీ సాధ్యంకాని ఈ గొప్ప రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉండిన హిట్‌మ్యాన్ ఈ సిరీస్‌లో ఆడిన 9 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 44.44 సగటున 400 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. సిరీస్ ఆధ్యాంతం రోహిత్‌తో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, సిరీస్ ఎగరేసుకుపోయింది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. 92 యేళ్ళ టెస్టు క్రికెట్ హిస్టరీలోనే?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను టీమిండియా ఘన విజయంతో ముగించింది. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఇక ఈ విజయంతో టీమిండియా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు 579 టెస్టులు ఆడిన భారత్.. 178 మ్యాచ్‌ల్లో గెలవగా, 178 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 222 మ్యాచ్‌లు ‘డ్రా’ గా ముగిసి మరో టెస్టు ‘టై’ అయింది. అయితే భారత జట్టు టెస్టు చరిత్రలో విజయాలు, పరాజయాల సంఖ్య సమానంగా రావడం ఇదే తొలిసారి. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ గెలుపు ఓటముల నిష్పత్తి సమానం కాలేదు. ఇప్పుడు ఈ అరుదైన రికార్డుకు ధర్మశాల వేదికైంది. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. జైశ్వాల్ ఈ సిరీస్ ఆసాంతం అద్బుతమైన కనబరిచాడు. 712 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: #Shreyas Iyer: ఏమైంది శ్రేయస్? మరోసారి ఫెయిల్! ఇక కష్టమే మరి -
జో రూట్ అరుదైన ఘనత.. తొలి క్రికెటర్‌గా
ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. టీమిండియాపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన క్రికెటర్‌గా రూట్ రికార్డులకెక్కాడు. ధర్మశాల వేదికగా భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో 84 పరుగులు చేసిన రూట్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. రూట్ ఇప్పటివరకు భారత్‌పై టెస్టుల్లో 21 సార్లు ఏభై పైగా పరుగులు చేశాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది. పాంటింగ్ భారత్‌పై 20 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ చేతిలో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టు ఓటమి పాలైంది. భారత బౌలర్ల దాటికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో సొంతం చేసుకుంది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలవగా.. యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచాడు. చదవండి: IND vs ENG: రిటైర్మెంట్పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. 112 ఏళ్ల తర్వాత! ప్రపంచంలోనే
ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులోనూ ఇంగ్లండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తొలి టెస్టులో ఓటమి పాలైన భారత్.. తిరిగి పుంజుకుని వరుసగా నాలుగు టెస్టుల్లోనూ విజయ భేరి మ్రోగించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1తో భారత్ కైవసం చేసుకుంది. కాగా ఆఖరి టెస్టులో 473/8తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 4 పరుగులు మాత్రమే చేసి 477 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ(103), గిల్(110) సెంచరీలతో చెలరేగగా.. పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 48.1 ఓవర్లలోనే 195 పరుగులకు కుప్పకూలింది. 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో ఇంగ్లిష్ జట్టు పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కుల్దీప్, బుమ్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌటైంది. రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఇక ఈ విజయంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 112 ఏళ్ల తర్వాత ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓడి 4-1తో సిరీస్ కైవసం చేసుకున్న కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన రోహిత్ సేన.. తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో పర్యాటక జట్టును చిత్తు చేసింది. కాగా సొంతగడ్డపై భారత్‌కు ఇది 400వ విజయం కావడం గమనార్హం. -
BCCI: ఆరేళ్ల తర్వాత మళ్లీ...
ముంబై: భారత దేశవాళీ క్యాలెండర్లో మహిళా క్రికెటర్ల కోసం ఆరేళ్ల తర్వాత రెడ్ బాల్ టోర్నీని నిర్వహించనున్నారు. ఈనెల 28 నుంచి ఏప్రిల్ 11 వరకు పుణేలో ఈ టోర్నీ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. మొత్తం ఆరు జోనల్ జట్లు (ఈస్ట్, నార్త్ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, నార్త్, సౌత్‌జోన్) ఈ టోర్నీలో పోటీపడతాయి. ప్రతి మ్యాచ్ మూడు రోజులపాటు జరుగుతుంది. నార్త్, సౌత్ జోన్ జట్లకు నేరుగా సెమీఫైనల్ బెర్త్‌లు లభించగా... ఈస్ట్–నార్త్ ఈస్ట్; వెస్ట్–సెంట్రల్ జోన్ జట్ల మధ్య నాకౌట్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో గెలిచిన జట్లు సెమీఫైనల్స్‌లో నార్త్, సౌత్ జోన్ జట్లతో ఆడతాయి. చివరిసారి 2018లో మహిళా క్రికెటర్లకు రెడ్ బాల్ టోర్నీని ఏర్పాటు చేయగా... ఆ సమయంలో రెండు రోజుల మ్యాచ్‌లు నిర్వహించారు. -
ప్యాట్ కమ్మిన్స్ అరుదైన ఘనత.. కపిల్ దేవ్ సరసన
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 100 వికెట్లు పడగొట్టిన రెండో ఆసీస్ కెప్టెన్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో డారిల్ మిచెల్‌ను ఔట్ చేసిన కమిన్స్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన పదో కెప్టెన్‌గా కమ్మిన్స్ నిలిచాడు. సారథిగా వందకు పైగా వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ 71 ఇన్నింగ్స్‌లలో 187 వికెట్లు పడగొట్టారు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(111) సైతం ఉన్నారు. ఈ ఘనత సాధించిన కెప్టెన్లు వీరే ఇమ్రాన్ ఖాన్ (పాక్): 187 వికెట్లు రిచీ బెనాడ్ (ఆసీస్): 138 వికెట్లు గార్ఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్): 117 వికెట్లు డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్): 116 వికెట్లు కపిల్ దేవ్ (భారత్): 111 వికెట్లు వసీం అక్రమ్ (పాక్): 107 వికెట్లు బిషన్ సింగ్ బేడీ (భారత్): 106 వికెట్లు షాన్ పొలాక్ (దక్షిణాఫ్రికా): 103 వికెట్లు జాసన్ హోల్డర్ (వెస్టిండీస్): 100 వికెట్లు పాట్ కమిన్స్ (ఆసీస్): 100 వికెట్లు A century of wickets for Pat Cummins as Australia captain 👏#NZvAUS pic.twitter.com/r7Trg0o6JV — ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2024 -
చరిత్ర సృష్టించిన ఐర్లాండ్.. ఆరేళ్ల నిరీక్షణకు తెర
ఐర్లాండ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. రెడ్‌బాల్ క్రికెట్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తమ ఆరేళ్ల నిరీక్షణకు తెరదించింది. 2018లో టెస్టు హోదా పొందిన ఐర్లాండ్.. అప్పటి నుంచి తొలి గెలుపు కోసం ఆరేళ్లగా ఎదురుచూస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో 111 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ ఆండీ బల్బిర్నీ (58) నాటౌట్‌గా నిలిచి తమ జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. అతడితో పాటు లారెన్ టక్కర్(27) పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో నవీద్ జద్రాన్ 2 వికెట్లు, మసూద్, రెహ్మన్ తలా వికెట్ సాధించారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్.. ఐర్లాండ్ బౌలర్ల దాటికి 155 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఐర్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్‌కు 108 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌటైన అఫ్గానిస్తాన్ ఐర్లాండ్ ముందు 111 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్‌లో 8 వికెట్లతో సత్తాచాటిన ఐరీష్ పేసర్ మార్క్ అడైర్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు వరించింది. చదవండి: NZ vs AUS: చరిత్ర సృష్టించిన ఆసీస్ క్రికెటర్లు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలి సారి -
భారత క్రికెటర్లకు జాక్‌పాట్..!
భారత్ ఆటగాళ్లలో రెడ్ బాల్ క్రికెట్‌పై ఆసక్తి పెంచేందుకు బీసీసీఐ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆటగాళ్లకు ఆర్దికపరమైన తాయిలాలు ప్రకటించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. ఓ ఆటగాడు ఏడాది మొత్తంలో జరిగే అన్ని రంజీ మ్యాచ్‌ల్లో పాల్గొంటే 75 లక్షల రూపాయలు.. అలాగే ఓ ఆటగాడు ఓ ఏడాదిలో జరిగే అన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే 15 కోట్ల రూపాయలు ఇవ్వాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై బోర్డు పెద్దలు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే భారత్‌లో టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో పాటు ఆటగాళ్లకు ఆర్దికంగా భారీ లబ్ది చేకూరుతుంది. ఈ మొత్తం ఐపీఎల్ కాంట్రాక్ట్ వల్ల లభించే మొత్తంతో ఏమాత్రం తీసిపోదు. ఇదిలా ఉంటే, బీసీసీఐ 2024-25 వార్షిక కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మొత్తం 30 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. ఏ ప్లస్ కేటగిరిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.. ఏ కేటగిరిలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా.. బి కేటగిరిలో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్.. సి కేటగిరిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ద్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పాటిదార్ చోటు దక్కించుకున్నారు. -
అరుదైన మైలురాయిని అధిగమించిన రోహిత్ శర్మ
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 4000 టెస్ట్ పరుగుల మార్కును తాకిన హిట్‌మ్యాన్.. టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన 17వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. హిట్‌మ్యాన్‌కు ముందు సచిన్ (15921), ద్రవిడ్ (13265), గవాస్కర్ (10122), కోహ్లి (8848), లక్ష్మణ్ (8781), సెహ్వాగ్ (8503), గంగూలీ (7212), పుజారా (7195), వెంగ్సార్కర్ (6868), అజారుద్దీన్ (6215), గుండప్ప విశ్వనాథ్ (6080), కపిల్ దేవ్ (5248), రహానే (5077), ధోని (4876), మొహిందర్ అమర్నాథ్ (4378), గంభీర్ (4154) భారత్ తరఫున టెస్ట్‌ల్లో 4000 పరుగుల మైలురాయిని దాటారు. అత్యంత వేగంగా 4000 పరుగుల మార్కును తాకిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ పదో స్థానంలో నిలిచాడు. ఈ మైలురాయిని వీరేంద్ర సెహ్వాగ్ అందరి కంటే వేగంగా చేరుకున్నాడు. వీరూ కేవలం 79 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును తాకగా.. హిట్‌మ్యాన్‌కు 100 ఇన్నింగ్స్‌లు పట్టాయి. టెస్ట్ క్రికెట్లోకి ఆలస్యంగా అడుగుపెట్టన రోహిత్.. ఈ ఫార్మాట్లో 58 మ్యాచ్‌లు ఆడి 11 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల సాయంతో 44.99 సగటున 4004 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. వన్డేల్లో 10000 పరుగుల మైలురాయిని (262 మ్యాచ్‌ల్లో 10709) దాటిన రోహిత్.. టీ20ల్లో 4000 పరుగుల మార్కుకు 26 పరుగుల దూరంలో (151 మ్యాచ్‌ల్లో 3974 పరుగులు) ఉన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు దాదాపుగా ఖరారైంది. మరో 152 పరుగులు చేస్తే భారత్ విజయఢంకా మోగిస్తుంది. రోహిత్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (16) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. అంతకుముందు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్ (5/51), కుల్దీప్ (4/22) ధాటికి ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో పేకమేడలా కూలింది. జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (60) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో (30), ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. రూట్ (122) అజేయ సెంచరీతో కదంతొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్ (47) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (73), దృవ్ జురెల్ (90) అర్దసెంచరీలతో రాణించారు. షోయబ్ బషీర్ (5/119) టీమిండియా పతనాన్ని శాశించగా.. హార్ట్లీ 3, ఆండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
ఫస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఫట్టు.. సెకెండ్ ఇన్నింగ్స్‌ల్లో హిట్టు
టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లో దూసుకుపోతున్నప్పటికీ.. టెస్ట్‌ల్లో మాత్రం ఆశించినంతగా రాణించలేకపోతున్నాడన్నది కాదనలేని సత్యం. అతడి గణాంకాలే ఇందుకు నిదర్శనం. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో గిల్ ఇప్పటివరకు ఆడిన 58 మ్యాచ్‌ల్లో 7 సెంచరీలు (ఓ వన్డే డబుల్ సెంచరీ), 14 హాఫ్ సెంచరీల సాయంతో 2606 పరుగులు సాధించగా.. 43 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల సాయంతో కేవలం 1292 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గిల్ గణాంకాల్లో ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. అదేంటంటే.. గిల్ తన 23 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో ఫస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఫట్టనిపించినా.. సెకెండ్ ఇన్నింగ్స్‌ల్లో మాత్రం హిట్టనిపించాడు. గిల్ తానాడిన 23 తొలి ఇన్నింగ్స్‌ల్లో 25.91 సగటున కేవలం 596 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ఒ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. సెకెండ్ ఇన్నింగ్స్‌ల విషయానికొస్తే గిల్ చాలా మెరుగ్గా కనిపిస్తున్నాడు. 20 ఇన్నింగ్స్‌ల్లో 40.94 సగటున 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 696 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు చూసి నెటిజన్లు గిల్‌ను సెకెండ్ ఇన్నింగ్స్ హీరో అంటున్నారు. టెస్ట్‌ల్లో సెకెండ్ ఇన్నింగ్స్‌ల్లో లాగే గిల్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఛేజింగ్‌లో మాంచి రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లలో గిల్ ఇప్పటివరకు చేసిన సెంచరీల్లో సగం ఛేదనల్లో చేసినవే కావడం విశేషం. ఇదిలా ఉంటే, ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో గిల్ పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో (23, 0) విఫలమైనా.. రెండు (34, 104), మూడు టెస్ట్‌ల్లో (0, 91) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మూడో టెస్ట్ సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ గిల్ తొమ్మిది పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మూడో టెస్ట్‌లో గిల్‌తో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్ చెలరేగడంతో భారత్ 434 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. టీమిండియా వరుసగా రెండు, మూడు మ్యాచ్‌లో విజయాలు సాధించి మరో సిరీస్ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. -
మార్చి 7, 8 తేదీల్లో సెంచరీలు కొట్టనున్న నలుగురు క్రికెటర్లు..!
మార్చి 7, 8 తేదీల్లో నలుగురు అంతర్జాతీయ క్రికెటర్లు సెంచరీలు కొట్టనున్నారు. ఇదేంటని అనుకుంటున్నారా..? అయితే ఇది చూడండి. పై పేర్కొన్న తేదీల్లో ఓ భారత ఆటగాడు, ఓ ఇంగ్లండ్ ఆటగాడు, ఇద్దరు న్యూజిలాండ్ ఆటగాళ్లు టెస్ట్‌ల్లో వందో మ్యాచ్ ఆడనున్నారు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మార్చి 7న మొదలయ్యే ఐదో టెస్ట్ మ్యాచ్ రవిచంద్రన్ అశ్విన్, జానీ బెయిర్‌స్టోలకు వందో టెస్ట్ మ్యాచ్ కానుండగా.. న్యూజిలాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 8న మొదలయ్యే రెండో టెస్ట్ మ్యాచ్ కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, టిమ్ సౌథీలకు సెంచరీ మ్యాచ్ అవుతుంది. ఈ తేదీల కంటే ముందు ఫిబ్రవరి 15న మరో ఆటగాడు కూడా సెంచరీ టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్‌కు వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. రోజుల వ్యవధిలో ఐదుగురు ఆటగాళ్లు వంద టెస్ట్‌ల మార్కును తాకడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ ఆటగాళ్లతో పాటు మరికొందరు శతాధిక టెస్ట్ ప్లేయర్లు ఒకేసారి రిటైరైతే టెస్ట్ క్రికెట్లో ఓ శకం ముగిసినట్లవుతుంది. నేటి వరకు (ఫిబ్రవరి 13) పై పేర్కొన్న ఐదుగురు ఆటగాళ్ల గణాంకాలు ఇలా ఉన్నాయి. బెన్ స్టోక్స్- 99 టెస్ట్‌ల్లో 13 సెంచరీలు, 6251 పరుగులు, 197 వికెట్లు జానీ బెయిర్‌స్టో- 97 టెస్ట్‌ల్లో 12 సెంచరీలు, 5902 పరుగులు రవింద్రన్ అశ్విన్- 97 టెస్ట్‌ల్లో 5 సెంచరీలు, 3271 పరుగులు, 499 వికెట్లు కేన్ విలియమ్సన్- 98 టెస్ట్‌ల్లో 31 సెంచరీలు, 8490 పరుగులు, 30 వికెట్లు టిమ్ సౌథీ-98 టెస్ట్‌ల్లో 6 హాఫ్ సెంచరీలు, 2059 పరుగులు, 375 వికెట్లు టెస్ట్‌ల్లో ఇప్పటివరకు 75 మంది 100 టెస్ట్‌ల మార్కును తాకారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తరఫున 15 మంది, భారత్ తరఫున 13, వెస్టిండీస్ నుంచి 9, సౌతాఫ్రికా 8, శ్రీలంక 6, పాకిస్తాన్ 5, న్యూజిలాండ్ తరఫున నలుగురు 100 టెస్ట్‌ల మార్కును తాకారు. -
రచిన్ రవీంద్ర విధ్వంసం.. ఏకంగా డబుల్ సెంచరీతో
మౌంట్ మాంగనుయ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర దుమ్మురేపుతున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రవీంద్ర అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. 340 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్‌తో డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా రవీంద్ర తన తొలి సెంచరీనే ద్విశతకంగా మార్చాడు. ప్రస్తుతం రవీంద్ర 222 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. 135 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 5 వికెట్ల నష్టానికి 437 పరుగలు చేసింది. క్రీజులో రవీంద్రతో పాటు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. అదే విధంగా మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేన్ మామ(118) పరుగులు చేశాడు. కాగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ రచిన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. What an incredible moment! After over 8 hours at the wicket, Rachin Ravindra has passed 200 runs - a historic double hundred 🔥👏@BLACKCAPS v South Africa: 1st Test | LIVE on DUKE and TVNZ+ pic.twitter.com/00Xlbjoirl — TVNZ+ (@TVNZ) February 5, 2024 -
Shubman Gill: నీవు మరి మారవా గిల్..? ఇంకా ఎన్ని ఛాన్స్‌లు! అతడిని తీసుకోండి?
టెస్టు క్రికెట్లో టీమిండియా స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 23 పరుగులు మాత్రమే చేసిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో ఓలీ పోప్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కాగా గత 9 ఇన్నింగ్స్‌లలో గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. క చివరి 9 ఇన్నింగ్స్‌లలో గిల్ స్కోర్లు (6), (10), (29*), (2), (26) (36),(10), (23),(0) ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో గిల్‌పై టీమిండియా అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. నీవు మరి మారవా గిల్ అంటూ సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మరి కొంతమంది అయితే గిల్ స్ధానంలో రజిత్ పాటిదార్‌కు ఛాన్స్ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. చదవండి: IND vs ENG: బెన్ స్టోక్స్ బుల్లెట్ త్రో.. పాపం జడేజా! ఇదే తొలిసారి? వీడియో వైరల్ Common Knowledge (Compulsory Tweet) :- Ruturaj Gaikwad >>> Shubman Gill pic.twitter.com/285jAooVA5 — Aufridi Chumtya (@ShuhidAufridi) January 28, 2024 Shubman Gill's downfall era 💉 pic.twitter.com/8VetokZhtD — DEVARATHA DONWAY🐐 (@divonconvey) January 28, 2024