టెస్టు క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇవ్వాలనకున్న టీమిండియా మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్‌కు నిరాశే ఎదురైంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అయ్యర్‌కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
ఇప్పటిలో అతడు భారత టెస్టు జట్టులోకి వచ్చే సూచనలు కన్పించడం లేదు. దేశీవాళీ క్రికెట్‌లో అయ్యర్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో విఫలమైన శ్రేయస్.. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన అయ్యర్ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు.
భారత్-డి జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. తొలి మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చేలా కన్పించాడు. కానీ తర్వాత ఇండియా-ఎ రెండో రౌండ్ మ్యాచ్‌లో డకౌటయ్యాడు.
దీంతో అతడిని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. తాజాగా అయ్యర్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్‌ను అయ్యర్ సీరియస్‌గా తీసుకోవడం లేదని అలీ చెప్పుకొచ్చాడు
"ఒక క్రికెటర్‌గా శ్రేయస్ అయ్యర్‌ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. అయ్యర్‌కు ఇప్పుడు రెడ్-బాల్ ఆడాలన్న ఆసక్తి లేదు. అతడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆడుతున్నట్లు ఉంది. అనంతపూర్ వంటి వికెట్‌పై అయ్యర్ సెంచరీ లేదా డబుల్ సెంచరీలు చేసి ఉండాల్సింది. కానీ అతడికి కేవలం బౌండరీలు సాధించాలన్న తపన తప్ప మరొకటి లేదు.
ఏకాగ్రత లేకుండా ఆడి ఈజీగా పెవిలియన్‌కు చేరుతున్నాడు. శ్రేయస్‌కు వైట్‌బాల్ క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. వన్డే ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు సాధించిన తర్వాత అయ్యర్‌ను కొంతమంది విరాట్ కోహ్లితో పోల్చారు. కానీ విరాట్‌కు, శ్రేయస్‌కు చాలా తేడా ఉంది.
నేను భారత సెలక్టర్ అయివుంటే దులీప్ ట్రోఫీలో అయ్యర్‌ను ఆడేంచివాడిని కాదు. అతను ఆటను గౌరవించడు. దులీప్ ట్రోఫీలో రహానే, పుజారా ఆడకపోవడం అయ్యర్ అదృష్టం. లేదంటే అతడికి దులీప్ ట్రోఫీలో కూడా చోటు దక్కపోయిండేంది అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బసిత్ అలీ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2025: శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్!?
Comments
Please login to add a commentAdd a comment