Iyer
-
'అతడు ఆటను గౌరవించడు.. జట్టులో చోటు దండగ'
టెస్టు క్రికెట్లో రీ ఎంట్రీ ఇవ్వాలనకున్న టీమిండియా మిడిలార్డర్ శ్రేయస్ అయ్యర్‌కు నిరాశే ఎదురైంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో అయ్యర్‌కు చోటు దక్కలేదు. అతడి స్ధానంలో ముంబై ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.ఇప్పటిలో అతడు భారత టెస్టు జట్టులోకి వచ్చే సూచనలు కన్పించడం లేదు. దేశీవాళీ క్రికెట్లో అయ్యర్ నిలకడగా రాణించలేకపోతున్నాడు. బుచ్చిబాబు టోర్నీలో విఫలమైన శ్రేయస్.. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన అయ్యర్ కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు.భారత్-డి జట్టుకు సారథ్యం వహిస్తున్న అయ్యర్.. తొలి మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ సాధించి ఫామ్‌లోకి వచ్చేలా కన్పించాడు. కానీ తర్వాత ఇండియా-ఎ రెండో రౌండ్ మ్యాచ్‌లో డకౌటయ్యాడు.దీంతో అతడిని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. తాజాగా అయ్యర్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్‌ను అయ్యర్ సీరియస్‌గా తీసుకోవడం లేదని అలీ చెప్పుకొచ్చాడు"ఒక క్రికెటర్‌గా శ్రేయస్ అయ్యర్‌ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. అయ్యర్‌కు ఇప్పుడు రెడ్-బాల్ ఆడాలన్న ఆసక్తి లేదు. అతడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆడుతున్నట్లు ఉంది. అనంతపూర్ వంటి వికెట్‌పై అయ్యర్ సెంచరీ లేదా డబుల్ సెంచరీలు చేసి ఉండాల్సింది. కానీ అతడికి కేవలం బౌండరీలు సాధించాలన్న తపన తప్ప మరొకటి లేదు. ఏకాగ్రత లేకుండా ఆడి ఈజీగా పెవిలియన్‌కు చేరుతున్నాడు. శ్రేయస్‌కు వైట్‌బాల్ క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. వన్డే ప్రపంచకప్‌లో రెండు సెంచరీలు సాధించిన తర్వాత అయ్యర్‌ను కొంతమంది విరాట్ కోహ్లితో పోల్చారు. కానీ విరాట్‌కు, శ్రేయస్‌కు చాలా తేడా ఉంది. నేను భారత సెలక్టర్ అయివుంటే దులీప్ ట్రోఫీలో అయ్యర్‌ను ఆడేంచివాడిని కాదు. అతను ఆటను గౌరవించడు. దులీప్ ట్రోఫీలో రహానే, పుజారా ఆడకపోవడం అయ్యర్ అదృష్టం. లేదంటే అతడికి దులీప్ ట్రోఫీలో కూడా చోటు దక్కపోయిండేంది అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బసిత్ అలీ పేర్కొన్నాడు.చదవండి: IPL 2025: శ్రేయస్ అయ్యర్‌కు షాక్.. కేకేఆర్ కెప్టెన్‌గా సూర్యకుమార్!? -
మేడిగడ్డ డిజైన్లలో వైరుధ్యాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పోల్చితే మేడిగడ్డ బ్యారేజీ నిర్మిత స్థలంతోపాటు ర్యాఫ్ట్–ఎగువ/దిగువ కాటాఫ్ వాల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లలో వైరుధ్యాలు ఎందుకు ఉన్నాయని నీటిపారుదల శాఖలో కీలకమైన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో)ను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. ఈ విషయంలో సీడీవో తీసుకున్న అంతర్గత నిర్ణయాలకు సంబంధించిన నోట్స్‌ను అందించాలని కోరింది. ‘‘కాఫర్ డ్యామ్ నిర్మాణంలో భాగంగా నది గర్భంలో పాతిన షీట్‌పైల్స్‌ను మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తిగా తొలగించారా? లేదా? కుంగిపోయిన ఏడో బ్లాక్ పునాదులకు ఎదురుగా కొంతభాగంలో షీట్‌పైల్స్‌ను అలానే వదిలేశారా? అక్కడ భూమి కోతకు గురికావడానికి ఇదే కారణమా?’’ అని నిలదీసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల్లోని లోపాలపై అధ్యయనం జరిపి, పరిష్కారాలను సూచించడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రంలో రెండోసారి పర్యటించిన కమిటీ.. 52 ప్రశ్నలతో సీడీవో విభాగానికి ప్రశ్నావళి అందించి, త్వరగా బదులివ్వాలని కోరింది. ర్యాఫ్ట్, సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లపై ఫోకస్ మేడిగడ్డ బ్యారేజీల పునాది (ర్యాఫ్ట్), సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, నిర్మాణంపై అయ్యర్ కమిటీ ప్రధాన దృష్టిసారించింది. బ్యారేజీల్లో లోపాలకు ఇవి కూడా ముఖ్యకారణం కావచ్చన్న చర్చ ఉంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ఎగువ/దిగువ కాటాఫ్లు–ర్యాఫ్ట్ల మధ్య జాయింట్లకు సంబంధించిన డిజైన్లు, డ్రాయింగ్స్‌ను అందించాలని సీడీవోను కమిటీ కోరింది. ‘‘జాయింట్లలో లాకింగ్ ఏర్పాట్లున్నాయా? బ్యారేజీలకు రక్షణ కల్పించాల్సిన అప్రాన్ దెబ్బతిని ర్యాఫ్ట్ కుంగిపోతే, సెకెంట్ పైల్స్–ర్యాఫ్ట్ మధ్య జాయింట్లు విరిగిపోవా? మేడిగడ్డ బ్యారేజీ ర్యాఫ్ట్ 2.5 మీటర్ల మందం ఉంటే.. ర్యాఫ్ట్–సెకెంట్ పైల్స్ మధ్య జాయింట్‌గా వేసిన శ్లాబు మందం 1.5 మీటర్లు మాత్రమే ఉంది. నీటి ఒత్తిడిని జాయింట్ ఎలా తట్టుకుంటుంది?.’’ అని ప్రశ్నించింది. దృఢమైన రాతిపై కటాఫ్వాల్స్ను నిర్మిస్తే.. ర్యాఫ్ట్ కుంగిపోయేందుకు ఉన్న అవకాశాలను ఊహించలేదా? అని అడిగింది. బ్యారేజీలను తేలియాడే కట్టడాలుగా డిజైన్ చేశారా? స్థిరంగా ఉండేలా చేశారా అని ప్రశ్నించింది. సీడీవోలో ఎవరేం చేస్తారు? సీడీవోలో చీఫ్ ఇంజనీర్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారాల శ్రేణి, బాధ్యతలను, విభాగం నిర్మాణ క్రమాన్ని తెలపాలని కమిటీ కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ రూపకల్పనలో సీడీవో పాత్ర, ఇతర వివరాలు ఇవ్వాలని అడిగింది. ‘‘బ్యారేజీలకు పరీక్షలను సంతృప్తికర స్థాయిలో జరిపారా? మార్గదర్శకాలకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్లు చేశారా? లోటుపాట్లు ఏమైనా గుర్తించారా?’’ అని ప్రశ్నించింది. డీపీఆర్, ఆ తర్వాత నిర్మాణ దశల్లో ప్రతి బ్యారేజీ విషయంలో నిర్వహించిన సబ్ సర్ఫేస్ జియోలాజికల్/జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ల వివరాలను అందించాలని కోరింది. డిజైన్ ఉల్లంఘనలేమిటి ? సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్‌ను ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణ విభాగం జరిపిన నిర్మాణాలేమిటో తెలపాలని నిపుణుల కమిటీ కోరింది. లేఖలు/ సవరణ డ్రాయింగ్స్ ద్వారా ఆ ఉల్లంఘనలకు తర్వాతి కాలంలో అనుమతి ఇచ్చారా? ఇస్తే ఆ సవరణ డ్రాయింగ్స్ జాబితా ఇవ్వండి అని అడిగింది. ‘‘సీడీవో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ జారీ చేయడానికి ముందే నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించాయా? దీనివల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో డ్రాయింగ్స్‌ను మళ్లీ సవరించాలనే ఒత్తిడిని సీడీవో ఎదుర్కోవాల్సి వచ్చిందా? బ్యారేజీల నిర్మాణానికి పరిశీలించిన ప్రత్యామ్నాయ స్థలాలేవి? ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు’’ అని ప్రశ్నించింది. బ్యారేజీల గేట్ల నుంచి విడుదలయ్యే వరదతో దిగువన భూమి కోతకు గురవకుండా తగిన మోతాదులో నీరుండేలా టెయిల్ పాండ్‌ను డిజైన్ చేశారా అని.. నిబంధనల ప్రకారమే గేట్లను ఆపరేట్ చేశారా? వివరాలు ఇవ్వాలని కోరింది. -
అయ్యారే అయ్యర్!
వరాహనేరి వెంకటేశ సుబ్రమణ్యం అయ్యర్ (వి.వి.ఎస్. అయ్యర్) భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తమిళ భారతీయ విప్లవకారుడు. అతని సమకాలీనులలో సుబ్రమణ్య భారతి, వి.ఒ. చిదంబరం పిళ్లై వంటి వారు ఉన్నారు, వీరందరూ బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవాత్మక భావాలు కలవారు. అయ్యర్ తమిళ రచయిత. ఆధునిక తమిళ చిన్న కథకు పితామహుడిగా ఆయన్ని భావిస్తారు. అయ్యర్ 1925 జూన్ 3న.. పాపనాశం జలపాతంలో మునిగిపోతున్న తన కూతురిని రక్షించే ప్రయత్నంలో తనూ చనిపోయారు. వీవీఎస్ ధీశాలి. సునిశిత దృష్టి కలిగినవారు. ఆయన లండన్‌లోని విద్యార్థి వసతిగృహం ‘ఇండియా హౌస్’ లో ఉన్నప్పుడు మహారాష్ట్రకు చెందిన కీర్తికార్ అనే డెంటిస్ట్రీ విద్యార్థి ‘హౌస్’లో చేరాడు. ఆ హౌస్‌లోనే రాజన్ అని అయ్యర్ మిత్రుడు, వైద్యుడు ఉండేవారు. ఆయనకు కీర్తికార్ మీద అనుమానం వచ్చింది. కీర్తికార్ తన స్నేహితురాలి నృత్య ప్రదర్శనకు వెళ్లాడని నిర్ధారించుకున్న తరువాత నకిలీ తాళం చెవితో అయ్యర్ తదితరులు కీర్తికార్ గది తెరిచి చూశారు. అనుమానం నిజం. అతడు పోలీసు ఏజెంట్. కీర్తికార్ కణతకు రివాల్వర్ గురిపెట్టి నిలదీశారు అయ్యర్. నిజం ఒప్పుకున్నాడు కీర్తికార్. అతన్ని హౌస్‌లోనే ఉంచుకుని అతడి ద్వారా చాలాకాలం పోలీసులను తప్పుతోవ పట్టించారు అయ్యర్ -వి.వి.ఎస్. అయ్యర్ -
Vidya Iyer: వాయిస్ ఆఫ్ విద్య
భారతదేశంలో పుట్టింది. పెరిగిందేమో అమెరికాలో. డాక్టర్ అవ్వాలనుకుంది, కానీ అనుకోకుండా మంచి సింగర్‌గా మారింది. ఒక దేశంలో పుట్టి మరో దేశంలో పెరిగినప్పటికి.. దేశీయ సంప్రదాయ సంగీతాన్ని వెస్ట్రన్ మ్యూజిక్‌తో కలిపి, వీటికి తన సృజనాత్మకతను జోడించి సరికొత్త మ్యాషప్ సాంగ్స్‌తో ప్రపంచ వ్యాప్త వ్యూవర్స్‌ను ఉర్రూతలూగిస్తోంది విద్యా అయ్యర్. విద్యా అయ్యర్ భారత సంతతికి చెందిన అమెరికన్ పాపులర్ మ్యాషప్సాంగ్స్ సింగర్. చెన్నైలో పుట్టిన విద్య, తల్లిదండ్రులు వృత్తిరీత్యా అమెరికాలోని వర్జీనియాకు మకాం మార్చడంతో చిన్నతనంలోనే అక్కడికి వెళ్లింది. అక్కడే పెరిగిన విద్య బీఎస్సీ (సైకాలజీ, బయోమెడికల్ సైన్స్) డిగ్రీ చేసింది. తరువాత మెడిసిన్ చదివేందుకు ఎమ్క్యాట్ (మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్)కు సన్నద్ధ మవుతున్న సమయంలో తన స్నేహితుడు శంకర్ టక్కర్ ఓ యూట్యూబ్ చానల్ నిర్వహించేవాడు. విద్య చిన్నప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నట్లు తెలుసుకున్న టక్కర్ తన యూట్యూబ్ చానల్‌కోసం పాటలు పాడమని అడగడంతో వీకెండ్స్‌లో విద్య పాటలు పాడేది. విద్య గొంతు వినసొంపుగా సుమధురంగా ఉండడంతో టక్కర్ నిర్వహించే వివిధ కన్సర్ట్లలో పాల్గొని పాటలు పాడేది. విద్య గాత్రం ఎక్కువ మంది శ్రోతల్ని ఆకట్టుకోవడంతో టక్కర్.. విద్యను ‘‘నువ్వు కూడా ఒక యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించు’’ అని చెప్పడంతో తన గొంతుకు వస్తున్న ఆదరణను చూసిన విద్య సంగీతాన్నే కెరియర్‌గా మలుచుకోవాలనుకుంది. విద్యా వోక్స్... మెడిసిన్ చదివేందుకు ప్రిపేర్ అవుతోన్న విద్య ఒక్కసారిగా తన ఆలోచన మార్చుకుని మ్యూజిక్‌ను కెరియర్‌గా ఎంచుకుంటానంటే తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోలేదు. ‘‘రెండేళ్లు సమయం ఇస్తా. నిన్ను నువ్వు నిరూపించుకోగలిగితే ఒకే, లేదంటే... తిరిగి మెడిసిన్ చదవాలి’’ అని అమ్మ కండిషన్ పెట్టింది. అమ్మమాటను ఒప్పుకుని 2013లో ముంబై వచ్చి సంగీతంలో మరిన్ని మెళకువలు నేర్చుకుంది. రెండేళ్లపాటు ఇక్కడే ఉండి కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, వెస్ట్రన్ వాయిస్ పాఠాలను నేర్చుకుని తిరిగి 2015లో ఆమెరికా వచ్చేసింది. ఇదే ఏడాది ఏప్రిల్‌లో ‘విద్యావోక్స్’ పేరిట యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించింది. ‘వోక్స్’ అంటే లాటిన్లో వాయిస్ అని అర్థం. మ్యాషప్ సాంగ్స్... సమకాలీన, సంప్రదాయమైన పాటలకు వెస్ట్రన్ సంగీతాన్ని జోడించి సరికొత్త పాటలను విద్యావోక్స్లో అప్లోడ్ చేసేది. ‘బిగ్ గార్ల్స్ క్రై’, ‘కభీ జో బాదల్ బర్సే’ మ్యాషప్ పాటలను అప్లోడ్ చేసింది. ‘మ్యాడ్ డ్రీమ్స్’ ‘కుథు ఫైర్’ సాంగ్స్ విద్యకు బాగా పాపులారిటీని తెచ్చిపెట్టాయి. విద్యకు బాగా పేరు వచ్చిన వాటిలో ‘‘లవ్ మీ లైక్ యూ డు, కబీరా–క్లోజర్, లీన్ ఆన్, జింద్ మహి, వుయ్ డోంట్ టాక్ ఎనీమోర్, పానీ ద ర్యాంగ్, కుట్టునందన్ పుంజయితే’’లు ఉన్నాయి. వెస్ట్రన్ పాప్ హిట్ సాంగ్స్‌కు భారతీయ సంగీతానికి జోడించి మ్యూజిక్ వీడియోలను రూపొందిస్తూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. విద్య తనే పాటలు రాయడం, స్వయంగా కంపోజ్ చేసి, సొంత బ్యాండ్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష షోలు కూడా నిర్వహిస్తోంది. ఇప్పటిదాకా ఇండియా, మారిషస్, ట్రినిడాడ్, సురనామ్, దుబాయ్, హాంగ్‌కాంగ్, అమెరికాలలో లైవ్‌షోలు నిర్వహించి శోతల్ని తన సుమధుర గానం, మ్యాషప్ పాటలతో ఆలరించింది. టక్కర్‌తో ప్రారంభించిన తన మ్యూజిక్ జర్నీ ఇప్పటికీ అతని సలహాలు, సూచనలతో కొనసాగడం విశేషం. కెమెరా, ఎడిటింగ్, డైరెక్షన్లలో సాయం చేస్తూ విద్యను ముందుండి నడిపిస్తున్నాడు. విద్య తల్లి, చెల్లి కూడా తనని ప్రోత్సహించడంతో ఆమె చానల్ ప్రస్తుతం 7.41 మిలియన్ల (దాదాపు డెభైఐదు లక్షలు) మంది సబ్స్క్రైబర్స్తో దూసుకుపోతోంది. మనం ఎంచుకున్న రంగం ఏదైనా విభిన్నంగా ఆలోచిస్తూ, కష్టపడి ముందుకు సాగితే ఉన్నతస్థాయికి ఎదగవచ్చు అనడానికి విద్య గొప్ప ఉదాహరణ. ఆమె ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. -
ముంబైతోనే రోహిత్, పాండ్యా
న్యూఢిల్లీ: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ముగ్గురు కీలక ఆటగాళ్లను కొనసాగించడం దాదాపుగా ఖాయమైంది. మూడు టైటిల్స్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను మరో ఆలోచన లేకుండా ముంబై అట్టి పెట్టుకోనుంది. అతనితో పాటు పాండ్యా సోదరులను కూడా రిటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన హార్దిక్ పాండ్యాతో పాటు 2017 ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన కృనాల్ పాండ్యాను కూడా ముంబై కొనసాగించనుంది. పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రాలను ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా జట్టులోకే తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. టీమ్‌లో ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులను రిటెయిన్ చేసుకుంటే రూ. 21 కోట్లు (12.5+ 8.5), ముగ్గురిని రిటెయిన్ చేసుకుంటే రూ. 33 కోట్లు (15+11+7) చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ముంబై ఇండియన్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా అరంగేట్రం చేయని కృనాల్‌ను రూ. 3 కోట్లకే తమతో కొనసాగించుకునేందుకు సిద్ధంగా ఉందని బీసీసీఐ అధికారి ఒకరు వివరించారు. -
డబుల్ సెంచరీతో ఇరగదీశాడు..
ముంబై: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ లో భారత్ 'ఎ' ఆటగాడు శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీతో ఇరగదీశాడు. 210 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లతో 202 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 85 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రేయస్ అయ్యర్.. ఆద్యంత ఆకట్టుకుని డబుల్ సెంచరీతో మెరిశాడు. అంతకుముందు176/4 ఓవర్ నైట్ స్కోరు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 'ఎ' జట్టు తొలి సెషన్ లో రిషబ్ పంత్(21) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత కాసేపటికి ఇషాన్ కిషన్(4) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో గౌతమ్ తో కలిసి అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ జోడి ఏడో వికెట్ కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ 'ఎ' గాడిలో పడింది. ఈ క్రమంలోనే అయ్యర్ డబుల్ సెంచరీ చేయగా గౌతమ్(74) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అయితే గౌతమ్ అవుటైన తరువాత చివరి వరుస ఆటగాళ్ల ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో భారత్ 'ఎ' జట్టు 91.5 ఓవర్లలో403 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 469/7 డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ డ్రానే ఖాయంగా కనబడుతోంది. -
శ్రేయస్ అయ్యర్ చితక్కొట్టుడు..
ముంబై: ఆస్ట్రేలియాతో ఇక్కడ బ్రాబోర్న్ స్టేడియంలో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ లో భారత్ యువ జట్టు దీటుగా బదులిస్తోంది. శనివారం రెండో రోజు ఆటలో తడబాటును కొనసాగించిన భారత్ 'ఎ' జట్టు.. శ్రేయస్ అయ్యర్ బాధ్యతాయుత ఆట తీరుతో తేరుకుంది. 85 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రేయస్ అయ్యర్..లంచ్ సమయానికి 166 వ్యక్తిగత పరుగులు నమోదు చేశాడు. 186 బంతుల్లో 21 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో భారీ శతకం నమోదు చేశాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న అయ్యర్.. కొన్ని కీలక భాగస్వామ్యాలను నమోదు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.దాంతో చివరి రోజు ఆటలో లంచ్ విరామానికి భారత్ 'ఎ' జట్టు 83.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. అంతకుముందు176/4 ఓవర్ నైట్ స్కోరు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 'ఎ' జట్టు తొలి సెషన్ లో రిషబ్ పంత్(21) వికెట్ ను కోల్పోయింది. ఆ తరువాత ఇషాన్ కిషన్(4) వికెట్ ను నష్టపోయింది. ఆ తరుణంలో గౌతమ్ తో కలిసి అయ్యర్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఈ జోడి ఏడో వికెట్ కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ 'ఎ' గాడిలో పడింది. ఈ క్రమంలోనే గౌతమ్(65 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. -
దక్కన్లో నేనొక్కణ్ణే...
రేడియో అంతరంగాలు నిజాం కాలంలోని దక్కన్ రేడియోలో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆలిండియా రేడియోలో సుదీర్ఘ కాలం స్టాఫ్ ఆర్టిస్ట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు పి. కుప్పుస్వామి అయ్యర్ (94). ఏడేళ్ల వయసప్పుడే వీణ, వయొలిన్ చేతపట్టిన కుప్పుస్వామి.. ప్రతి సంగీత ఉపాసకునికీ గురుభక్తి, దైవభక్తి తప్పనిసరిగా ఉండాలంటారు. ప్రముఖ రేడియో కళాకారిణి శారదాశ్రీనివాసన్ తనను కలిసినప్పుడు, ఆయన నెమరు వేసుకున్న 32 ఏళ్ల్ల రేడియో అనుభవాలు, జీవిత విశేషాలు... ఆయన మాటల్లోనే... త్యాగరాజుగారి శిష్యుడు కృష్ణభాగవతార్ ముని మనుమణ్ణి అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా మొదటి గురువు మా నాన్నగారు పిచ్చయ్య భాగవతార్. చెన్నైలో ఆయన దగ్గరే వీణ, వయొలిన్ నేర్చుకున్నాను. ఓ రోజు మా నాన్న నన్ను ‘‘కుప్పా! సంధ్యావందనం చేయాలి త్వరగా రా’’ అన్నారు. కంగారుగా పరుగెత్తుతూ వీణను కింద పడేశా. దాంతో అదీ పగిలింది, నన్నూ పగలగొట్టారు (నవ్వుతూ). తర్వాత కరూర్‌కి వెళ్లి గురుకులంలో చేరి శ్రీకరూర్ చిన్నస్వామి అయ్యర్ దగ్గర శిష్యరికం చేశాను. నేను సంగీతాన్ని వృత్తిగా చేసుకోవడం మా నాన్నకు ఇష్టం లేదు. కానీ ఆసక్తి మేరకు నేను ఆ రంగంలోకి వెళ్లాను. మద్రాస్ టు హైదరాబాద్ 1941లో జపాన్ వాళ్లు మద్రాసుపై రెండు బాంబులు వేశారు. అప్పుడు అక్కడి వారంతా ఎక్కడెక్కడికో వలస వెళ్లారు. మా విద్యార్థుల్లో ఓ అయ్యంగార్ కుటుంబ బంధువులు హైదరాబాద్‌లో ఉండేవారు. వాళ్ల ఇంటికి వారితోపాటు నన్నూ రమ్మన్నారు. అలా 1942లో ఇక్కడ అడుగుపెట్టాను. హిమాయత్ నగర్‌లోని వాళ్లింట్లోనే ఆరేళ్లు ఉన్నాను. నాకు తిండి పెట్టి, వసతి ఇచ్చి బాగా చూసుకునే వాళ్లు (కన్నీళ్లు పెట్టుకుంటూ). రోజుకో గంట కార్యక్రమం ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయిన చీఫ్ ఇంజినీర్ మహాలింగం గారింట్లో వాళ్ల అమ్మాయికి సంగీతం చెబుతుండేవాణ్ణి. అప్పుడు ఆయన ‘‘స్టేషన్లో వయొలిన్, మృదంగం వాయించే వాళ్లు కావాలి. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు చేసి వెళ్లండి’’ అన్నారు. నేను ట్యూషన్లు చెప్పే కీలక సమయం అది. కాబట్టి నేను రాలేనన్నాను. కానీ ఆయన పట్టు వదలకుండా అడిగే సరికి ఒప్పుకున్నాను. అలా 1947లో దక్కన్ రేడియోలో రోజూ గంట కార్యక్రమం చేయడానికి వెళ్లేవాణ్ణి. అప్పుడు హైదరాబాద్‌లో నేనొక్కణ్ణే సంగీత విద్వాంసుణ్ణి. దక్కన్ రేడియోలో రోజూ ప్రారంభంలో ఓ అయిదు నిమిషాలు వయొలిన్ వాయించేవాణ్ణి. నల్లకుంట నుంచి ఖైరతాబాద్‌కు సైకిల్‌పై వెళ్లేవాణ్ణి ఆఫీసుకు. ఇందిరమ్మ మేలు 1950లో ఆలిండియా రేడియోను భారత ప్రభుత్వం తీసుకుంది. అప్పుడు ఢిల్లీ నుంచి బంట్రోతు వస్తున్నాడంటే కూడా ఎంతో భయపడే వాళ్లం. ఇందిరా గాంధీ సమాచార, ప్రసారాలశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నా జీతం రూ.160 నుంచి ఒకేసారి రూ.300లకు పెరిగింది. నేను రిటైర్ అయ్యేటప్పుడైనా అంత జీతం తీసుకుంటానా అనుకునే వాణ్ణి. కర్ణాటక సంగీతం నేను మొదటి నుంచీ కర్ణాటక సంగీతంపైనే సాధన చేశాను. వరదరాజన్‌గారు కర్ణాటక సంగీతానికి ప్రొడ్యూసర్‌గా ఉండేవారు. ఆయన బంగారం లాంటి మనిషి. ఎవరైనా గాయకులు చిన్న చిన్న తప్పులు చేస్తే ‘‘ఏం ఫర్వాలేదు. చిన్న తప్పే కదా’’ అనేంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన మంచి స్వభావం గల పెద్ద విద్వాంసుడు. మంచాల జగన్నాథరావుగారు హిందుస్థానీ సంగీత విభాగంలో ప్రొడ్యూసర్‌గా ఉండేవారు. ఆయన వీణ వాయించేవారు. మా అందరి మధ్య మంచి స్నేహపూర్వక సంబంధాలుండేవి. నాతో పని చేసే పురుషోత్తం, జగన్నాథంతో కలిసి ఎప్పుడూ గోపీ హోటల్, అసెంబ్లీ దగ్గరుండే మైసూర్ కేఫ్‌కు వెళ్లేవాణ్ణి. భక్తి గీతాలు నేను భక్తి రంజని కార్యక్రమంలో ఎన్నో పాటలు పాడించేవాణ్ణి. దీపావళి, నవరాత్రి పండుగలకు ప్రత్యేక కార్యక్రమాలు చేశాను. అంబాళి, సుబ్రహ్మణ్యస్వామి, కృష్ణుడు, శివుడు, గణపతుల పై ఎన్నో పాటలు చేశాం. నా ప్రత్యేకత వయొలిన్ వాయించడం. నా భార్య రాజ్యలక్ష్మి కూడా ఆకాశవాణిలో పాడేది. 1980లో నేను పదవీ విరమణ తీసుకున్నాను. అప్పుడే నేను నిర్వహించిన కార్యక్రమాల రికార్డులన్నీ తెచ్చుకున్నాను. ఇప్పటికీ నా దగ్గర అవి భద్రంగా ఉన్నాయి. నాకున్న ఆసక్తితో అప్పుడప్పుడు ఆకాశవాణికి వెళ్లి ఇప్పటికీ కార్యక్రమాలు చేస్తుంటాను. ప్రెజెంటేషన్: నిఖితా నెల్లుట్ల ఫోటోలు: జి. రాజేశ్ అంత డబ్బు ఏం చేసుకోవాలో అర్థం అయ్యేది కాదు! అప్పట్లో సంగీతం నేర్చుకుంటే ఏ ఉద్యోగం రాకపోయినా బతికేయొచ్చు అనే వాళ్లు.. అలాగే నేను మా గురువు చిన్నస్వామిగారి దగ్గర ఉండగానే సంగీతం నేర్పిస్తే రూ.7 సంపాదించే అవకాశం దొరికింది. దాన్ని ఆయనకు ఇస్తే నా హోటల్ ఖర్చులు అన్నీ చూసుకుంటూ నెలకు రూపాయి మిగిల్చేవాళ్లు.. ఆ తర్వాత మరో మూడు, నాలుగు ట్యూషన్లకు ఒప్పందం కుదుర్చుకున్నా. మొత్తం నెలకు రూ.22 వచ్చేవి. అంత డబ్బు ఏం చేసుకోవాలో అర్థం అయ్యేది కాదు. ఆ గురువుగారి దగ్గర నేను మొత్తం ఆరేళ్లు ఉన్నాను. నాకు తిండి, బట్టలు పెట్టేవారు. ఆయన రుణం నా జన్మలో తీర్చుకోలేను.