
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ముగ్గురు కీలక ఆటగాళ్లను కొనసాగించడం దాదాపుగా ఖాయమైంది. మూడు టైటిల్స్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను మరో ఆలోచన లేకుండా ముంబై అట్టి పెట్టుకోనుంది. అతనితో పాటు పాండ్యా సోదరులను కూడా రిటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన హార్దిక్ పాండ్యాతో పాటు 2017 ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన కృనాల్ పాండ్యాను కూడా ముంబై కొనసాగించనుంది. పొలార్డ్, జస్‌ప్రీత్ బుమ్రాలను ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా జట్టులోకే తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది.
టీమ్‌లో ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులను రిటెయిన్ చేసుకుంటే రూ. 21 కోట్లు (12.5+ 8.5), ముగ్గురిని రిటెయిన్ చేసుకుంటే రూ. 33 కోట్లు (15+11+7) చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ముంబై ఇండియన్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంకా అరంగేట్రం చేయని కృనాల్‌ను రూ. 3 కోట్లకే తమతో కొనసాగించుకునేందుకు సిద్ధంగా ఉందని బీసీసీఐ అధికారి ఒకరు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment