
‘బిగ్ బాస్’ ఫేమ్ రోహిత్ సహాని(Rohit Sahani), అబిద్ భూషణ్(నటుడు నాగభూషణం మనవడు), రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిస్ టీరియస్’(Miss Terious). మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. ఉష, శివాని సమర్పణలో ఆష్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్(యూఎస్‌ఏ) నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మహి కోమటి రెడ్డి మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మిస్ టీరియస్’.
అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ‘‘మా సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకుల్లో ఉత్కంఠ తగ్గదు. మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో ఈ చిత్రం నిర్మించడం సంతోషం. ఎమ్‌ఎల్ రాజా అద్భుతమైన సంగీతం అందించారు’’ అని జయ్ వల్లందాస్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: పరవస్తు దేవేంద్ర సూరి (దేవా), ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: రామ్ ఉప్పు.