Rohit
-
కన్జ్యూమర్ వాచ్డాగ్ చీఫ్ రోహిత్ చోప్రాను తొలగించిన ట్రంప్
పామ్ బీచ్ (యూఎస్): వినియోగదారుల ఆర్థిక రక్షణ సంస్థ డైరెక్టర్ రోహిత్ చోప్రాను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలగించారు. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.. ఇప్పటికీ పదవిలో ఉన్న డెమొక్రటిక్ అధికారుల్లో చోప్రా ఒకరు. చోప్రా తొలగింపును ఈమెయిల్ ద్వారా ఆయనకు తెలియజేశారు. దీంతో తన నిష్క్రమణ గురించి చోప్రా శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఏజెన్సీతో తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘చట్టాన్ని ఉల్లంఘించినందుకు శక్తివంతమైన కంపెనీలు, వాటి ఎగ్జిక్యూటివ్‌లపై చర్యలు తీసుకోవడంలో మీరు మాకు సహాయపడ్డారు. మా పనిని మెరుగుపరిచారు’’అని చోప్రా పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం చోప్రా ఐదేళ్ల పాటు సీఎఫ్‌పీబీ డైరెక్టర్‌గా కొనసాగాల్సి ఉంది. అయితే కొత్త అధ్యక్షుడు కోరితే తన పదవి నుంచి తప్పుకుంటానని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. చోప్రా తన పదవీకాలంలో క్రెడిట్ రిపోర్టుల నుంచి వైద్య రుణాన్ని తొలగించడం, ఓవర్‌డ్రాఫ్ట్‌ల జరిమానాలపై పరిమితులను తొలగించడం వంటి చర్యలు తీసుకున్నారు. ఆయన చర్యలను రెగ్యులేటరీ అతిక్రమణగా కొందరు వ్యతిరేకించారు. చోప్రా తొలగింపు.. వినియోగదారుల రక్షణ శకానికి ముగింపును సూచిస్తుందని డెమొక్రాట్, కాలిఫోర్నియా ప్రతినిధి మాక్సిన్ వాటర్స్ అన్నారు. వాల్‌స్ట్రీట్ బిలియనీర్లకు లొంగిపోయి సంస్థను నాశనం చేయడానికి రిపబ్లికన్లు ప్రయత్నిస్తే.. పోరాటం చేస్తామని వారెన్ హెచ్చరించారు. 2008లో ఏర్పాటైన బ్యూరో 2008 ఆర్థిక సంక్షోభం తరువాత తనఖాలు, కారు రుణాలు, ఇతర వినియోగదారుల ఫైనాన్స్‌ను నియంత్రించడానికి బ్యూరోను ఏర్పాటు చేశారు. దీన్ని రిపబ్లికన్లు, వారి ఆర్థిక మద్దతుదారులు చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నారు. బ్యూరోను బలహీనపరిచే ఒక సవాలును గతేడాది సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీనికి నిధులు సమకూర్చే విధానం రాజ్యాంగాన్ని ఉల్లంఘించదని తీర్పు ఇచ్చింది. -
సస్పెన్స్ థ్రిల్లర్
‘బిగ్ బాస్’ ఫేమ్ రోహిత్ సహాని(Rohit Sahani), అబిద్ భూషణ్(నటుడు నాగభూషణం మనవడు), రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిస్ టీరియస్’(Miss Terious). మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. ఉష, శివాని సమర్పణలో ఆష్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్(యూఎస్ఏ) నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మహి కోమటి రెడ్డి మాట్లాడుతూ–‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మిస్ టీరియస్’.అద్భుతమైన కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని తెలిపారు. ‘‘మా సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకుల్లో ఉత్కంఠ తగ్గదు. మహి కోమటిరెడ్డి వంటి విజన్ ఉన్న దర్శకుడితో ఈ చిత్రం నిర్మించడం సంతోషం. ఎమ్ఎల్ రాజా అద్భుతమైన సంగీతం అందించారు’’ అని జయ్ వల్లందాస్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: పరవస్తు దేవేంద్ర సూరి (దేవా), ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: రామ్ ఉప్పు. -
స్టార్స్ ఫ్లాప్ షో...
ఆఫ్‌స్టంప్ అవతల పడ్డ బంతులను ఆడే విషయంలో తీరు మార్చుకోని విరాట్ కోహ్లి... బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలో బరిలోకి దిగినా వైఫల్యాల బాట వీడని రోహిత్ శర్మ... అడపా దడపా మెరుపులు తప్ప నిలకడగా ఆకట్టుకోలేక ఇబ్బంది పడ్డ కేఎల్ రాహుల్... ఆల్‌రౌండరే అయినా అటు బ్యాట్‌తో, ఇటు బంతితోతనదైన ముద్ర వేయలేకపోయిన రవీంద్ర జడేజా... పేరుకు ప్రధాన పేసరే అయినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన మొహమ్మద్ సిరాజ్... ఇలా ఒకరిని మించి మరొకరు పేలవ ప్రదర్శన కనబరిస్తే ఫలితం ఇలా కాక మరెలా ఉంటుంది! స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ‘వైట్‌వాష్’ నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండానే... ఆ్రస్టేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో కనీస ప్రదర్శన కనబర్చలేకపోయింది. గత రెండు పర్యాయాలు అద్వి తీయ ఆటతీరుతో కంగారూలను మట్టికరిపించి ప్రతిష్టాత్మక సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా... ముచ్చటగా మూడోసారి అదే మ్యాజిక్ చేయాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ‘కర్ణుడి చావుకు కారణాలు అనేకం’ అన్నట్లు... భారత జట్టు సిరీస్ కోల్పోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. వాటిని ఓసారి పరిశీలిస్తే... –సాక్షి క్రీడావిభాగం ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో భారత జట్టు పరాజయానికి ప్రధాన కారణం బ్యాటింగే అనడంలో సందేహం లేదు. గత రెండు పర్యటనల్లో ఆ్రస్టేలియాపై భారత జట్టు పైచేయి సాధించడంలో అటు బౌలర్లతో పాటు బ్యాట్‌తో చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గంటల తరబడి క్రీజులో పాతుకుపోయి కంగారూ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన పుజారా వంటి ఆటగాడు తాజా జట్టులో లేకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బ కొట్టింది. అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లు.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోవడంతో సిరీస్‌లో ఏ దశలోనూ భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబర్చలేకపోయింది. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు అందుబాటులో లేకపోయిన రెగ్యులర్ కెపె్టన్ రోహిత్ శర్మ ఆ తర్వాత వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో 3, 6, 10, 3, 9 పరుగులు చేశాడు. మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన తర్వాత నిలకడ పెరగడంతో పాటు విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు సాధించిన ‘హిట్ మ్యాన్’... వరుస వైఫల్యాలతో చివరి మ్యాచ్ నుంచి తనంతట తానే తప్పుకున్నాడంటే అతడి ఫామ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జట్టులో అందరికంటే సీనియర్ అయిన విరాట్ కోహ్లి తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత వరుసగా 7, 11, 3, 36, 5, 17, 13 స్కోర్లు చేశాడు. విరాట్ అంకెల కన్నా అతడు అవుటైన తీరే సగటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఆఫ్‌స్టంప్ అవతల బంతి వేయడం... విరాట్ దాన్ని ఆడాలా వద్దా అనే సంశయంలో బ్యాట్ తాకించడం... వికెట్ల వెనక క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం... ఈ సిరీస్ మొత్తం ఇదే తంతు సాగింది. టన్నుల కొద్దీ పరుగులు చేసి ‘రన్ మెషిన్’ అనిపించుకున్న విరాట్ ఈ సిరీస్‌లో పూర్తిగా విఫలమవడం... జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. నిలకడలేమే ప్రధాన సమస్య రోహిత్ గైర్హాజరీలో ఓపెనర్‌గా బరిలోకి దిగి ఆకట్టుకున్న కేఎల్ రాహుల్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించడంలో విఫలమయ్యాడు. 26, 77, 37, 7, 84, 4, 24, 0, 4, 13 ఈ సిరీస్‌లో రాహుల్ గణాంకాలివి. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఫర్వాలేదనిపించిన అతడు చివరి రెండు టెస్టుల్లో విఫలం కావడంతో జట్టుకు మెరుగైన ఆరంభాలు లభించలేదు. స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమయ్యాడు.సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సిరీస్ మధ్యలోనే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా... జడ్డూ తన వంతు బాధ్యత సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. ఆసీస్ పిచ్‌లపై మెరుగైన రికార్డు, మంచి అనుభవం ఉన్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఆ స్థాయి ప్రభావం చూపలేకపోయాడు. మరో ఎండ్ నుంచి బుమ్రా కంగారూల వెన్నులో వణుకు పుట్టిస్తుంటే... దాన్ని సొమ్ము చేసుకుంటూ వికెట్లు పడగొట్టాల్సింది పోయి... ప్రత్యరి్థకి సులువుగా పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. మొత్తంగా ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 20 వికెట్లు తీసినా... ఈ ప్రదర్శన అతడి స్థాయికి తగ్గదని చెప్పలేం. జట్టు పరిస్థితులతో సంబంధం లేకుండా పదే పదే తప్పుడు షాట్ సెలెక్షన్ కారణంగా వికెట్ సమర్పించుకున్న రిషబ్ పంత్ విమర్శల పాలైతే... వచ్చిన కొన్ని అవకాశాలను శుబ్‌మన్ గిల్ ఒడిసి పట్టలేకపోయాడు. టెస్టు ఫార్మాట్లో ఇంటా బయట నిలకడైన ఆటతీరు కనబరుస్తూ గత రెండు పర్యాయాలు ‘ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్’ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టు... ఈసారి మాత్రం నిరాశ పరిచింది. చివరగా ఆడిన ఎనిమిది టెస్టుల్లో టీమిండియా కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసుకు దూరం కాక తప్పలేదు. ముఖ్యంగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో సిరీస్ కోల్పోవడం టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. నితీశ్, యశస్వి అదుర్స్ పదేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ చేజారడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయినప్పటికీ ఈ సిరీస్ ద్వారా భారత జట్టుకు కొంత మేలు కూడా జరిగింది. స్టార్ ఆటగాళ్లు అంచనాలకు అందుకోలేకపోతున్న సమయంలో మేమున్నామంటూ యువ ఆటగాళ్లు బాధ్యతలు తీసుకున్నారు. తొలిసారి ఆ్రస్టేలియాలో పర్యటించిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటకట్టుకోగా... ఈ సిరీస్ ద్వారానే అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అదరగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేసిన జైస్వాల్ భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, బోలండ్ వంటి పేసర్లను జైస్వాల్ అలవోకగా ఎదుర్కొన్న తీరు భవిష్యత్తుపై భరోసా పెంచుతోంది. ఇక పేస్ ఆల్‌రౌండర్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న టీమిండియాకు నితీశ్ రెడ్డి రూపంలో జవాబు దొరికింది. మీడియం పేస్‌కు తోడు చక్కటి బ్యాటింగ్‌తో అతడు ఈ సిరీస్‌పై తనదైన ముద్రవేశాడు. 9 ఇన్నింగ్స్‌లు కలిపి నితీశ్ మొత్తం 298 పరుగులు సాధించి సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. టి20 ఫార్మాట్లో ధనాధన్ షాట్లు ఆడే నితీశ్... సుదీర్ఘ ఫార్మాట్‌కు పనికిరాడని విమర్శించిన వారికి మెల్బోర్న్ సెంచరీతో బదులిచ్చాడు. తనలో దూకుడుగా ఆడే శక్తితో పాటు క్రీజులో సుదీర్ఘ సమయం గడపగల సంయమనం కూడా ఉందని నిరూపించాడు. ఈ ప్రదర్శనతో నితీశ్ రెడ్డి టెస్టు జట్టులో చోటు నిలబెట్టుకోవడం ఖాయం కాగా... బౌలింగ్‌లో అతడు మరింత రాటుదేలితే భారత జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. ఇక ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన అంటే అది బుమ్రాదే. తొలి టెస్టులో సారథిగా జట్టును గెలిపించిన బుమ్రా... సిరీస్ ఆసాంతం టీమ్ భారాన్ని భుజాల మీద మోశాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 32 వికెట్లు తీసిన బుమ్రా... చివరి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు చేయలేకపోవడంతోనే టీమిండియా పరాజయం పాలైందనడంలో అతిశయోక్తిలేదు. ‘బుమ్రా ఎడం చేత్తో బౌలింగ్ చేసేలా చట్టం తీసుకొస్తాం’ అని ఆ్రస్టేలియా ప్రధాని ఆల్బనీస్ అన్నాడంటే ఈ సిరీస్‌లో జస్ప్రీత్ జోరు ఎలా సాగిందో ఊహించుకోవచ్చు. -
బీజేపీలో చేరిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి
భోపాల్: దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి రోహిత్ ఆర్య బీజేపీ పార్టీలో చేరారు. కాగా, రోహిత్ ఆర్య అనేక కేసుల్లో తీర్పులను వెల్లడించారు. ఆయన ఇచ్చిన తీర్పులపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.వివరాల ప్రకారం.. రోహిత్ ఆర్య బీజేపీలో చేరారు. భోపాల్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాఘవేంద్ర శర్మ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. కాగా, పదవీ విరమణ చేసిన మూడు నెలల తర్వాత ఆ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇక, 2013 సెప్టెంబరు 12న మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రోహిత్ ఆర్య నియమితులయ్యారు. 2015 మార్చి 26న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులైన ఆయన అనేక కేసుల్లో తీర్పులు ఇచ్చారు.ఇదిలా ఉండగా.. జస్టిస్ రోహిత్ ఆర్య వెల్లడించిన కొన్ని తీర్పులు వివాదాస్పదం కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. 2020లో మహిళ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తికి జస్టిస్ రోహిత్ ఆర్య బెయిల్ మంజూరు చేశారు. రక్షా బంధన్ రోజున బాధిత మహిళకు రాఖీ కట్టాలని, ఆమెకు రక్షణ కల్పించేలా నిందితుడు హామీ ఇవ్వాలని షరతు విధించారు. అయితే ఈ తీర్పు వివాదస్పదం కావడంతో సుప్రీంకోర్టు రద్దు చేసింది.అలాగే, 2021లో ఇండోర్‌లో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్ సందర్భంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ హాస్యనటులు మునావర్ ఫరూకీ, నలిన్ యాదవ్‌లకు బెయిల్ నిరాకరించారు. అయితే హైకోర్టు ఆదేశాలను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఫరూఖీకి బెయిల్ మంజూరు చేసింది. -
‘శరద్ పవార్‌కు టచ్‌లో 19 మంది అజిత్ వర్గం ఎమ్యెల్యేలు’
ముంబై: లోక్‌సభ ఎన్నికల ముగిసిన తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) నేత రోహిత్ పవార్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని అధికార ఎన్సీపీ నుంచి 18-19 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నారని తెలిపారు. వచ్చే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆ పార్టీకి గుడ్‌బై చెబుతారన్నారు. 2023 జూలైలో ఎన్సీపీలో చీలికలు జరిగినప్పటి నుంచి అజిత్ వర్గంవైపు ఉన్న ఎమ్మెల్యేలు ఎప్పుడూ ఒక్కమాట కూడా ఎన్సీపీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, ఇతర సీనియర్ నేతలపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదని గుర్తుచేశారు.‘అజిత్ వర్గం ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. తమ నియోజకవర్గం అభివృద్ధి పనుల నిధుల కోసం సమావేశాల్లో పాల్గొంటారు. తర్వాత వారంతా అజిత్ వర్గం నుంచి బయటకు వచ్చేస్తారు. 18 నుంచి 19 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు శరద్‌పవార్‌తో టచ్‌లో ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత శరద్ పవార్ వర్గంలో వారంతా చేరనున్నారు’అని రోహిత్ పవార్ అన్నారు. అజిత్ పవార్ వర్గం రాజ్యసభ ఎంపీప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. తనకు కేబినెట్ విస్తరణలో కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెతున్నారు. అంటే అజిత్ పవార్ వర్గంపై ప్రఫుల్‌కు మంచిపట్టు ఉందని తెలుస్తోంది. కానీ, అజిత్ పవార్ అనుకుంటున్న రాష్ట్ర అభివృద్ధి కోసమా? లేదా తనను ఈడీ నుంచి రక్షించుకోవడానికా? అని రోహిత్ పవార్ నిలదీశారు.ఇటీవల ఎంపీ ప్రఫుల్ పటేల్‌కు ఎన్డీయే ప్రభుత్వం కేంద్రమంత్రి( సంతంత్ర హోదా) పదవి ఆఫర్ ఇస్తే.. దానిని తిరస్కరించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపి( ఎస్పీ) 8, అజిత్ వర్గం ఎన్సీపీ 1 ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. ఇక.. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జూన్ జూన్ 27 నుంచి జూలై 12 వరకు జరగనున్నాయి. అక్టోబర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..
-
రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతని ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని.. అలాగే అతను ఎస్సీ అనేందుకు ఎటువంటి ఆధారాలు కూడా లేవని, బీసీ వడ్డెర కులానికి చెందినవాడని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ అప్పారావుకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పలు పిటిషన్లలో విచారణను ముగించింది. రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐ ఆర్‌ను రద్దు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వర్సిటీ వైస్ చాన్సిలర్ అప్పారావుతో పాటు పలు కారణాలతో మరికొందరు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ శుక్రవారం తీర్పు వెలువరించా రు. ట్రయల్ కోర్టులో పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిగణన లోకి తీసుకుని ఇక్కడి పిటిషన్లలో విచారణ ముగిస్తున్నట్లు చెప్పారు. సస్పెండ్ చేయడంతోనే ఆత్మహత్యరోహిత్ వేములను సస్పెండ్ చేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని ట్రయల్ కోర్టులో పోలీసులు రిపోర్టు దాఖలు చేశారు. రోహిత్ మృతిపై నిరసనలు వెల్లువెత్తడంతో గచ్చిబౌలి స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశామని అతనిది హత్య అనేందుకు ఎలాంటి సాక్ష్యాధారాల్లేవని, కనుక కేసును మూసివేయాలని భావిస్తున్నామని అందులో పేర్కొన్నారు. రోహిత్ వేముల కుటుంబానికి చెందిన కుల ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ చేశారని, అతడు దళితుడని చెప్పేందుకు ఆధారాలు లేకపోవడంతో కేసును మూసివేస్తున్నామని అందులో తెలిపారు.దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు: హైకోర్టుపోలీసుల పిటిషన్‌పై దిగువ స్థాయి కోర్టులో అప్పీలు చేసుకోవచ్చని వేముల రోహిత్ కుటుంబానికి హైకోర్టు సూచించింది. దీంతో.. ఈ కేసులో నిందితులుగా ఉన్న సికింద్రాబాద్ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో పాటు పలువురు ఏబీవీపీ నేతలకు ఈ కేసు నుంచి ఉపశమనం దొరికినట్లైంది. -
ముంబై ‘మూడు’పోయింది
ముంబై ఇన్నింగ్స్... తొలి 21 బంతుల్లో 20 పరుగులు, 4 వికెట్లు... ఇందులో రోహిత్ శర్మ సహా ముగ్గురు తొలి బంతికే డకౌట్... ముంబై ఇన్నింగ్స్ మొదలవడంతోనే ముగిసినట్లు అనిపించింది... బౌల్ట్ కొట్టిన ఈ దెబ్బ తర్వాత కొంత కోలుకున్నా 125 పరుగుల స్కోరు ఏమాత్రం సరిపోలేదు... రాజస్తాన్ రాయల్స్ అలవోకగా మరో 27 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించేసింది... సొంతగడ్డపై కూడా బోణీ చేయలేకపోయిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో ఇంకా గెలుపు ఖాతా తెరవని ఏకైక జట్టుగా నిలిచింది. అభిమానులు...అదే తీరు! హార్దిక్ పాండ్యాకు ముంబై సొంత మైదానం వాంఖెడేలోనూ ఫ్యాన్స్ నుంచి నిరసన ఎదురైంది. రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఆగ్రహంగా ఉన్న అభిమానులు గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే ఈసారి కూడా పాండ్యా పేరు వినిపించినప్పుడల్లా గేలి చేశారు. టాస్కు వచ్చినప్పుడు మాట్లాడకుండా అంతరాయం కలిగించారు. చివరకు వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ‘మర్యాద పాటించండి’ అని చెప్పినా జనం పట్టించుకోలేదు. అనంతరం ముంబై ఫీల్డింగ్ సమయంలో ఒక అభిమాని నేరుగా గ్రౌండ్లో రోహిత్ వద్దకు వెళ్లి కౌగిలించుకోవడం భద్రతా సిబ్బంది వైఫల్యాన్ని చూపించింది. అనూహ్యంగా దూసుకొచి్చన ఫ్యాన్ రోహిత్ కూడా ఒక్కసారిగా భయపడిపోయాడు! ముంబై: ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో పరాజయాల ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఆ జట్టు ఓటమి పాలైంది. సోమవారం జరిగిన పోరులో రాజస్తాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ముంబైను ఓడించి విజయాల ‘హ్యాట్రిక్’ సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులే చేసింది. హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 34; 6 ఫోర్లు), తిలక్ వర్మ (29 బంతుల్లో 32; 2 సిక్స్‌లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/22) పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని ఆరంభంలోనే దెబ్బ తీయగా... చహల్‌కు కూడా 3 వికెట్లు దక్కాయి. అనంతరం రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లకు 127 పరుగులు చేసి గెలిచింది. రియాన్ పరాగ్ (39 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో గెలిపించాడు. టపటపా... రాజస్తాన్ బౌలింగ్ ధాటికి ముంబై బ్యాటింగ్ ఆరంభంలోనే కకావికలమైంది. బౌల్ట్ ధాటికి రోహిత్ శర్మ (0) తొలి బంతికే అవుట్ కాగా, తర్వాతి బంతికే నమన్ ధీర్ (0) వెనుదిరిగాడు. ఐపీఎల్లో అతి ‘తొందరగా’ రెండో ఓవర్లోనే ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన బ్రెవిస్ (0) కూడా తన తొలి బంతికే పెవిలియన్ చేరాడు. మరోవైపు ఇషాన్ కిషన్ (16) వికెట్ బర్గర్ ఖాతాలో పడింది. స్కోరు 20/4కు చేరిన దశలో తిలక్, పాండ్యా కొద్దిసేపు నిలిచి జట్టును ఆదుకున్నారు. బర్గర్ ఓవర్లో 3 ఫోర్లతో పాండ్యా ధాటిని ప్రదర్శించాడు. అయితే ఐదో వికెట్‌కు 36 బంతుల్లో 56 పరుగులు జోడించిన తర్వాత ముంబైని చహల్ దెబ్బ తీశాడు. తక్కువ వ్యవధిలో అతను పాండ్యా, తిలక్లను అవుట్ చేయడంతో ముంబై పరిస్థితి మరింత దిగజారింది. తిలక్ వెనుదిరిగాక జట్టు కోలుకోలేకపోయింది. అతను అవుటైన తర్వాత 40 బంతుల్లో 30 పరుగులే వచ్చాయి. టిమ్ డేవిడ్ (17) కూడా ప్రభావం చూపలేకపోయాడు. రాణించిన పరాగ్... లక్ష్యం చిన్నదే అయినా రాయల్స్ ఇన్నింగ్స్ కాస్త తడబాటుకు లోనైంది. తొలి ఓవర్లోనే యశస్వి (10) వెనుదిరగ్గా... సంజూ సామ్సన్ (12), బట్లర్ (13) కూడా విఫలమయ్యారు. అయితే పరాగ్ జాగ్రత్తగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. అశి్వన్ (16)తో కలిసి అతను ఐదో వికెట్‌కు 40 పరుగులు జత చేశాడు. విజయానికి 15 పరుగులు కావాల్సిన దశలో పరాగ్ వరుసగా 6, 6, 4 బాది ముగించాడు. ఈ క్రమంలో 38 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) సామ్సన్ (బి) బర్గర్ 16; రోహిత్ (సి) సామ్సన్ (బి) బౌల్ట్ 0; నమన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 0; బ్రెవిస్ (సి) బర్గర్ (బి) బౌల్ట్ 0; తిలక్ (సి) అశ్విన్ (బి) చహల్ 32; పాండ్యా (సి) (సబ్) పావెల్ (బి) చహల్ 34; చావ్లా (సి) హెట్‌మైర్ (బి) అవేశ్ 3; డేవిడ్ (సి) బౌల్ట్ (బి) బర్గర్ 17; కొయెట్జీ (సి) హెట్‌మైర్ (బి) చహల్ 4; బుమ్రా (నాటౌట్) 8; ఆకాశ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1–1, 2–1, 3–14, 4–20, 5–76, 6–83, 7–95, 8–111, 9–114. బౌలింగ్: బౌల్ట్ 4–0–22–3, బర్గర్ 4–0–32–2, అవేశ్ ఖాన్ 4–0–30–1, చహల్ 4–0–11–3, అశ్విన్ 4–0–27–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) డేవిడ్ (బి) మఫాకా 10; బట్లర్ (సి) చావ్లా (బి) ఆకాశ్ 13; సామ్సన్ (బి) ఆకాశ్ 12; పరాగ్ (నాటౌట్) 54; అశ్విన్ (సి) తిలక్ (బి) ఆకాశ్ 16; శుభమ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (15.3 ఓవర్లలో 4 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1–10, 2–42, 3–48, 4–88. బౌలింగ్: మఫాకా 2–0–23–1, బుమ్రా 4–0–26–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–20–3, కొయెట్జీ 2.3–0–36–0, పీయూష్ చావ్లా 3–0–18–0. -
పురుడు పోశారు.. పునర్జన్మనిచ్చారు
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కొండపైకి 150 మెట్లెక్కి వెళ్లి మరీ ఓ గర్భిణికి పురుడు పోసి పునర్జన్మనిచ్చి స్థానికుల ప్రశంసలు 108 సిబ్బంది అందుకున్న ఘటన విజయవాడలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... బతుకుతెరువు కోసం కాశీ నుంచి నగరానికి వచ్చి న రోహిత్, హారతి కుటుంబం విజయవాడ భవానీపురం పరిధిలోని కుమ్మరిపాలెం కొండ ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. నెలలు నిండిన హారతికి నొప్పులు రావడంతో దిక్కుతోచని స్థితిలో రోహిత్ 108 అంబులెన్స్‌కు కాల్ చేశాడు. కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న 108 సిబ్బంది ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్నారు. కొండపైన 150 మెట్లు ఎక్కి ఆమె వద్దకు చేరుకున్నారు. నొప్పులు తీవ్రం కావడంతో అల్లాడుతున్న భార్యను చూసి భర్త కన్నీరుమున్నీరుగా విలపించసాగాడు. అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయిన 108 అంబులెన్స్ ఈఎంటీ విజయ్, పైలెట్ సందీప్‌కుమార్ తీవ్రంగా శ్రమించి ఆమెకు కాన్పు చేశారు. మగ బిడ్డ జన్మించాడు. క్షేమంగా ఉన్న తల్లీబిడ్డను మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇదంతా గమనించిన స్థానికులు శెభాష్ అంటూ 108 సిబ్బందిని అభినందించారు. -
దేశానికి కీలక ఆస్తి మానవ వనరులే
రాయదుర్గం: మానవ వనరులపై సకాలంలో దృష్టి పెట్టడం భారతదేశ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఆయన ఆర్థికవేత్త రోహిత్ లాంబాతో కలిసి రచించిన ‘బ్రేకింగ్ ది మౌల్డ్’ పుస్తకంపై ఐఎస్బీ ప్రొఫెసర్ భగవాన్ చౌదరితో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లోని ఖేమ్కా ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, రాబోయే దశాబ్దాలలో దేశాభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ అత్యంత ముఖ్యమైన ఆస్తిగా మానవ వనరులని చెప్పవచ్చని, పెద్ద సంఖ్యలో వారికి సరైన శిక్షణ ఇవ్వగలిగితే దేశానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. దేశంలో అభివృద్ధికి అనేక ప్రణాళికలు ఉన్నాయని, అయితే వాటిని అమలు చేయడంలోనే లోపం ఉందని తెలిపారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారడానికి లక్ష్యాలను నిర్దేశించుకునే ముందు ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాల కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఐఎస్బీ లాంటి విద్యాసంస్థలో చదివే విద్యార్థులు చాలా మంది ఉద్యోగాలు సృష్టించడం కంటే ఉద్యోగాలు చేయడంపైనే దృష్టి సారించారని రఘురాం రాజన్ పేర్కొన్నారు. విద్యార్థులంతా సంస్థలను స్థాపించి తాము ఉపాధి పొందుతూ, నలుగురికి ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపార పాఠశాలల్లో ఐఎస్బీ ఒకటని, ఈ విద్యాసంస్థ దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించే సత్తా కలిగిన విద్యార్థులను తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సహ రచయిత రోహిత్ లాంబా, పలువురు ఐఎస్బీ ఫ్యాకల్టి, విద్యార్థులు పాల్గొన్నారు. -
మూడు ముళ్లు... ఏడడుగులు
సీనియర్ నటి రాధ కుమార్తె, ‘రంగం’ ఫేమ్ హీరోయిన్ కార్తీక వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. రోహిత్ మేనన్ తో కార్తీక ఏడడుగులు వేశారు. తిరువనంతపురంలోని కవడియార్ ఉదయ ఫ్యాలెస్ కన్వెన్షన్ సెంటర్లో కేరళ సంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు హీరో చిరంజీవి–సురేఖ దంపతులు, నటీనటులు రాధిక, సుహాసిని, రేవతి, భాగ్యరాజ్ తదితరులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా నాగచైతన్య హీరోగా రూపొందిన ‘జోష్’(2009) సినిమాతో కార్తీక తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించి, తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015 తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బిజీ అయ్యారు. -
19 ఏళ్ల పోరాటం.. ఈసారైనా ఆమెను ఓడిస్తారా?
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల విషయంలో కొన్నిసార్లు ఆసక్తికర విషయాలు సంతరించుకుంటాయి. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నాదమ్ముళ్లు పోటీపడి అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ, ఒకే ప్రత్యర్థిపై ఒకే కుటుంబానికి చెందిన వారు వరుసగా పోటీ చేయడం అరుదుగా జరుగుతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు మెదక్ నియోజకవర్గంలో కనిపించింది. ఎమ్మెల్యే పద్మపై మైనంపల్లి కుటుంబీకులు చాలా ఏళ్లుగా పోటీ చేస్తూ రావడం ఆసక్తి సంతరించుకుంది. మెదక్: ప్రస్తుత మెదక్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఉమ్మడి ఏపీలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ జిల్లా రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి ప్రస్తుత మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సతీమణి మైనంపల్లి వాణి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు రామాయంపేట ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో 2008లో జరిగిన రామాయంపేట ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మళ్లీ పద్మాదేవేందర్‌రెడ్డి పోటీ చేయగా, ఆమె ప్రత్యర్థిగా టీడీపీ నుంచి మైనం పల్లి హన్మంత రావు బరిలో నిలిచి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో.. అనంతరం నియోజకవర్గాల పునర్ విభజనలో రామాయంపేట నియోజకవర్గాన్ని రద్దుచేసి చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాలను మెదక్ నియోజకవర్గంలో కలిపారు. ఈ నేపథ్యంలో 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా మెదక్ టికెట్‌ను మైనంపల్లి హన్మంతరావుకు కేటాయించడంతో పద్మాదేవేందర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మైనంపల్లి చేతిలో మరోసారి ఓటమి చవి చూశారు. ఆ తర్వాత 2014, 2018 లో వరుసగా పద్మాదేవేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యరి్థగా పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా మూడోసారి సైతం పద్మారెడ్డికి బీఆర్ఎస్ హైకమాండ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఈసారి పద్మపై రోహిత్.. గతంలో మైనంపల్లి హన్మంతరావు, వాణి దంపతులు పద్మాదేవేందర్‌రెడ్డిపై పోటీ పడగా, ప్రస్తుతం వారి కుమారుడు రోహిత్‌రావు కాంగ్రెస్ అభ్యరి్థగా పద్మకు పోటీగా బరిలో నిలిచారు. నాడు తల్లీదండ్రులు, నేడు కొడుకు పోటీపడుతుండడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 19 ఏళ్లుగా రాజకీయ వైరం వీరి మధ్యలోనే జరుగుతుండడం విశేషం. -
రెండు ఊపిరితిత్తుల మార్పిడి.. ప్రపంచంలో అరుదైన ట్రాన్స్‌ప్లాంట్
సికింద్రాబాద్, రాంగోపాల్‌పేట్: విషం తాగి తీవ్ర ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఓ యువకుడికి యశోద ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌తో ప్రాణం పోశారు. ఒకేసారి డబుల్ లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా చేసి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఇలాంటి శస్త్ర చికిత్స నాలుగవది కావడం గమనార్హం. శుక్రవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి డైరెక్టర్ గోరుకంటి పవన్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ హరికిషన్‌లు వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా మర్రాయిగూడెంకు చెందిన 23 ఏళ్ల రోహిత్ గత నెలలో వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో అతన్ని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చేర్చారు. విషం ఊపిరితిత్తుల్లోకి వెళ్లి కోలుకోలేని పల్మనరీ ఫైబ్రోసిస్ పరిస్థితి ఏర్పడింది. అలాగే కిడ్నీలు, కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయనకు మెకానికల్ వెంటిలేటర్స్ వైద్యం అందించిన తర్వాత 20 రోజులకు పైగానే ఎక్మోపై చికిత్స అందించారు. అయినా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడలేదు. దీంతో రెండు ఊపిరితిత్తులను మారిస్తేనే యువకుడి ప్రాణాలు నిలబెట్టవచ్చని వైద్యులు బావించారు. కానీ భారతదేశంలో ఇలాంటి కేసుల్లో ఎక్మో వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన వాళ్లు లేరు. శరీరంలో ఎటువంటి పురుగుల మందు అవశేషాలు లేవని నిర్ధారించుకున్నాక ఊపిరితిత్తుల మారి్పడి కోసం జీవన్‌దాన్‌లో నమోదు చేశారు. జీవన్‌దాన్ చొరవతో ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు డాక్టర్ హరికిషన్, థొరాసిక్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కేఆర్ బాల సుబ్రహ్మణ్యం, డాక్టర్ మంజునాథ్ బాలే, డాక్టర్ చేతన్, డాక్టర్ శ్రీచరణ్, డాక్టర్ మిమి వర్గీస్‌లతో కూడిన బృందం ఆరు గంటల పాటు శ్రమించి విజయవంతంగా రెండు ఊపిరితిత్తులను మార్చారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో రోహిత్‌ను డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు. -
అధికారమే లక్ష్యంగా కొట్లాడండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా నేతలంతా కలిసికట్టుగా కొట్లాడాలని ఏఐసీసీ ఆగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్ర నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ సహా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, మేడ్చల్ నేత నక్కా ప్రభాకర్ గౌడ్, భువనగిరి నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఉదయం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ థాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. నేతలందరినీ రాహుల్‌కు రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్టీలోకి నేతలను ఆహ్వనించిన రాహుల్, వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, ఇప్పటికే పార్టీ ప్రకటించిన గ్యారంటీ స్కీమ్‌లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లగలిగితే పార్టీ విజయం తథ్యమన్నారు. కొత్త, పాత తారతమ్యాలను పక్కనపెట్టి నేతలంతా ఒక్కటిగా పనిచేయాలని సూచించినట్లు తెలిసింది. -
బీఆర్ఎస్కు మైనంపల్లి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఒక వీడియో ప్రకటనను ఆయన విడుదల చేశారు. మల్కాజిగిరి ప్రజలు, శ్రేయోభిలాషుల కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకే ముందుకు నడుస్తానని, దేనికీ లొంగే ప్రసక్తి లేదని వ్యాఖ్యానించారు.మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మైనంపల్లి తన కుమారుడు రోహిత్‌కు మెదక్ నుంచి పార్టీ టికెట్ ఆశించారు. ఈ క్రమంలో గత నెల 21న బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడానికి కొన్ని గంటల ముందు మంత్రి హరీశ్‌రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మైనంపల్లికే మరోమారు టికెట్ కేటాయించిన కేసీఆర్.. రోహిత్‌కు మాత్రం టికెట్ ఇవ్వలేదు. దీంతో మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారనే ప్రచారం జరిగినా బీఆర్ఎస్ వేచి చూసే ధోరణి అవలంభించింది. ఈ నెల 26న ఢిల్లీలో సోనియా, రాహుల్ సమక్షంలో మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరిక ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజశేఖర్‌రెడ్డికి టికెట్‌పై త్వరలో ప్రకటన నెల రోజుల క్రితం మైనంపల్లి ధిక్కార స్వరం వినిపించిన మరుక్షణం నుంచే కేసీఆర్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టారు. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైనంపల్లి రాజీనామా నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశముంది. ఎంపీగా పోటీ చేసిన మర్రి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2019లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మర్రి రాజశేఖర్‌రెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేతిలో 11 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి కూడా మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచే ఆయన పోటీ చేస్తారని భావించినా, తాజా పరిణామాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టికెట్‌ను ఇచ్చి, సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయించే యోచన లో కేసీఆర్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. -
మైనంపల్లికి సన్‌స్ట్రోక్ తప్పదా?
హైదరాబాద్: ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకోనున్నారనేది ప్రస్తుతం మల్కాజిగిరిలో చర్చనీయాంశంగా మారింది. అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మల్కాజిగిరి అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన మైనంపల్లి ఈ దఫా తనకు సిట్టింగ్ సీటుతో పాటు తన కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఆశించారు. రోహిత్ కొన్నాళ్లుగా మెదక్‌లో తన సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. మైనంపల్లికి సైతం మెదక్ జిల్లాతో సత్సంబంధాలు ఉండటంతో కచ్చితంగా అక్కడి నుంచి రోహిత్ పోటీలో ఉంటారంటూ ఇటీవల కాలంలో చెబుతూ వచ్చారు. అయితే.. బీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లికే మాత్రమే టికెట్ ఖరారు చేసింది. తన కుమారుడికి టికెట్ ప్రకటించకపోవడంపై మైనంపల్లి గుస్సా అయ్యారు. మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అధిష్టానం చివరి నిమిషంలోనైనా తన కుమారుడికి టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని, కొందరి నేతలపై తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అయిదు రోజుల క్రితం తన నివాసంలో మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పర్యటించి ప్రజాభిప్రాయం కూడా సేకరించి వారం రోజుల తర్వాత అన్ని విషయాలు మాట్లాడతానని మీడియా సమావేశంలో మైనంపల్లి ప్రకటించారు. కాగా.. ఇప్పటివరకు బీఆర్ఎస్ అధిష్టానం నుంచి మైనంపల్లి హన్మంతరావుకు పిలుపు రాలేదని తెలుస్తోంది. ఆయన కూడా అధిష్టానం వద్దకు వెళ్లివచ్చినట్లు కనిపించలేదు. అభ్యర్ధి మార్పుపై ఊహాగానాలు బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజిగిరి అభ్యర్థిగా మైనంపల్లిని మార్చడానికే సిద్ధమైనట్లు ప్రచార మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీఆర్ఎస్ తరఫున మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, శంభీపూర్ రాజు.. వీరిలో ఒకరిని ఇక్కడి నుంచి పోటీ చేయిస్తారనే వాదనలు బయలుదేరాయి. ఈ వాదనలను వారిద్దరూ ఖండించినప్పటికీ మైనంపల్లిని తప్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజెపీలో ఆయనకు చోటు లేదని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తండ్రీకొడుకుల్లో ఒక్కరికి మాత్రమే సీటు ఇచ్చేందుకు రెడీ అన్నట్టు తెలుస్తోంది. అది కూడా మల్కాజిగిరి నుంచి కాకుండా మేడ్చల్, మెదక్ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ టికెట్ కేటాయించే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. మైనంపల్లిని మల్కాజిగిరి నుంచి తప్పిస్తే ఇతర నియోజకవర్గాల్లోనూ ఆయన ప్రభావితం చూపుతారన్న విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందా? తేడా వస్తే ఎవరినీ లెక్క చేయని ఆ పార్టీ అధినేత ఇవన్నీ పట్టించుకుంటారా? మొత్తంగా తనయుడికి సీటు కోసం యుద్ధం చేస్తున్న మైనంపల్లి విజయం సాధిస్తారా? లేదంటే చివరికి సన్ స్ట్రోక్ తగిలి ఆయనే దెబ్బతింటారా? అనేది త్వరలోనే తేలనుంది. -
మైనంపల్లి రోహిత్ దారెటు?
మెదక్: మెదక్ టికెట్ తనకే వస్తుందని ఆశాభావంతో గత ఆరు నెలలుగా నియోజకవర్గంలో సొంత డబ్బులతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు డాక్టర్ మైనంపల్లి రోహిత్. తీరా సోమవారం సీఎం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. కాగా ఇన్నాళ్లు తననే నమ్ముకుని వెంట వచ్చిన వారికి న్యాయం చేయాలంటే తన కొడుకును పోటీలో నిలిపి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానని మైనంపల్లి హన్మంతరావు బహిరంగంగా మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళతారా..? లేక బీజేపీలో చేరి పోటీలో నిలబడతారా, లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా.. అనే చర్చసాగుతోంది. మంత్రి హరీశ్‌రావుపై ఆయన చేసిన విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్లో కొనసాగే అవకాశం లేదని, మల్కాజ్గిరి టిక్కెట్‌ను కూడా హన్మంతరావు తిరస్కరిస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీల నుంచి ఇప్పటికే వీరికి ఆహ్వానం అందినట్లు ప్రచారం జరుగుతోంది. మెదక్ బరిలో దిగి సత్తా చాటాలని హన్మంతరావు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మకు పలువురు నుంచి గట్టి పోటీ తప్పేలాలేదు. మైనంపల్లి రోహిత్ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకయిన రోహిత్ గత కొన్నాళ్లుగా వేర్వేరు రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మెడిసిటీ నుంచి MBBS చదివి డాక్టర్ అయిన రోహిత్.. మెడికల్ ప్రాక్టీస్ వైపు వెళ్లకుండా రాజకీయాల్లోకి రూటు మార్చారు. "మైనంపల్లి సోషల్ సర్వీస్ అర్గనైజేషన్" పేరిట ఓ స్వచ్ఛంధ సంస్ధను నెలకొల్పి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మల్కాజ్ గిరితో పాటు మెదక్ లో వేర్వేరుకార్యక్రమాలు చేపట్టారు. శానిటైజర్లు, మాస్క్ ల పంపిణీ, కమ్యూనిటీ హళ్ల నిర్మాణం, పేదలకు బియ్యం పంపిణీ, కాలనీల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేశారు. మెదక్ నుంచి ఎలాగైనా టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఇప్పటికే కోట్లాది రుపాయలు అక్కడ ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఇక సిల్వర్ స్పూన్ తో పుట్టిన రోహిత్ లైఫ్ స్టైల్ లోనూ అదే తరహాలో కనిపిస్తాడు. ఫెర్రారీ 488 స్పైడర్, మెర్సిడెస్ AMG, రేంజ్ రోవర్స్, ఆడి కార్లతో పాటు తరచుగా హర్లీ డేవిడ్ సన్ బైక్ లపై తిరుగుతాడు. ముఖ్యంగా మల్కాజ్ గిరిలో సీఎం కెసిఆర్ కు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా రోహిత్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది. వేలాది బ్యానర్లు, నిలువెత్తు కటౌట్లతో బోలెడు ప్రచారం నిర్వహించడం మైనంపల్లి కుటుంబానికే చెల్లింది. చదవండి: మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం! -
కాంగ్రెస్ గెలుపులో గిరిజనులే కీలకం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాల్లో ఆదివాసీ గిరిజనుల ఓట్లే కీలకమని ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్‌కు ఇచ్చిన మద్దతు చాలా గొప్పదని, అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లోనూ తెలంగాణ గిరిజన ప్రజలు కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఆదివారం గాందీభవన్‌లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి రాజకీయ ప్రాధాన్యతకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు.టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడు తేజావత్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులను మోసం చేస్తున్నాడని, మాయమాటలు చెప్పి వారి ఓట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. సంక్షేమ పథకాల అమలు, డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరీలో బీఆర్ఎస్ గిరిజనులకు తీవ్ర నష్టం చేసిందని విమర్శించారు. ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ భరత్ చౌహాన్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో పాటు కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, అన్ని జిల్లాల ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు టీపీసీసీ నేతలు అద్దంకి దయాకర్, శివసేనారెడ్డి, గోమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మైనంపల్లి రోహిత్ రాకతో పద్మా దేవేందర్ రెడ్డికి తలనొప్పి
-
వికాస్ ‘కంచు’ పట్టు
అస్తానా (కజకిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ రెండో రోజు పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు ఒక కాంస్య పతకం లభించింది. 72 కేజీల విభాగంలో వికాస్ కాంస్య పతక బౌట్లో 8–0తో ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో జెయిన్ తాన్ (చైనా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన సుమిత్ (60 కేజీలు), రోహిత్ దహియా (82 కేజీలు), నరీందర్ చీమా (97 కేజీలు) కూడా కాంస్య పతక బౌట్లలో పోటీపడ్డారు. కానీ ఈ ముగ్గురికీ నిరాశే ఎదురైంది. కాంస్య పతక బౌట్లలో సుమిత్ 6–14తో మైతా కవానా (జపాన్) చేతిలో... రోహిత్ 1–5తో అలీరెజా (ఇరాన్) చేతిలో... నరీందర్ 1–4తో ఒల్జాస్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
లోన్‌యాప్, క్రికెట్ బెట్టింగ్‌కు రోహిత్ బలి.. నా కొడుకులా మరొకరు కాకూడదంటూ..
సాక్షి, విజయవాడ: లోన్‌యాప్, క్రికెట్ బెట్టింగ్‌లకు మరో యువకుడు బలైపోయాడు. ఎన్టీఆర్ జిల్లా వేలేరు గ్రామానికి చెందిన రోహిత్ క్రికెట్ బెట్టింగ్ కోసం లోన్ యాప్‌లలో రుణం తీసుకున్నాడు. బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకోవడంతో తిరిగి చెల్లించలేకపోయాడు. ఓ వైపు లోన్ యాప్ నిర్వాహకులు, మరోవైపు క్రికెట్ బుకీల వేధింపులు తాళలేక రెండు రోజుల క్రితం గడ్డిమందు తాగి రోహిత్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో రోహిత్ మృతదేహానికి గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనపై రోహిత్ తండ్రి కోదండరామయ్య మాట్లాడుతూ.. క్రికెట్ బెట్టింగ్ వల్లే నాకొడుకు బలయ్యాడు. క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్‌లలో నా కొడుకుని మోసం చేశారు. 4వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించి వెంటనే ఆస్పత్రిలో చేర్పించాం. రెండు రోజులు మృత్యువుతో పోరాడి నాకొడుకు మరణించాడు. హనుమాన్ జంక్షన్‌కు చెందిన జోజి సునీల్ అనే వ్యక్తి వేధింపులకు గురి చేసినట్లు నా కొడుకు చెప్పాడు. లోన్యాప్లో కూడా రూ.2.50 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. జోజి సునీల్, లోన్‌యాప్ వేధింపులు తట్టుకోలేక, మాకు చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నట్లు నా కొడుకు తెలిపాడు. రాజు అనే వ్యక్తికి 60 రోజుల వ్యవధిలో సుమారు 7 లక్షలు బ్యాంక్ ద్వారా పంపాడు. ఆ డబ్బులు అతనికి ఎందుకు ఇచ్చాడు, ఆ డబ్బులు ఎక్కడవి అనేది తెల్చాలి. నా కొడుకులా మరొకరు కాకూడదు. క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ గేమ్‌లపై పోలీసులు నిఘా పెట్టాలి. కేసు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని రోహిత్ తండ్రి కోదండరామయ్య కోరారు. చదవండి: (Hyderabad: స్వప్నతో పరిచయం.. భార్యను పట్టించుకోకుండా..) -
కీర్తి వల్ల ఆత్మహత్యలు ఆగుతాయి: ఆదిరెడ్డి
స్పెషల్ గెస్టులతో బిగ్‌బాస్ ఫినాలే అదిరిపోయింది. అయితే సెలబ్రిటీలను ఊరికే పిలుస్తారా? వారితో ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. మొదటగా నిఖిల్ హౌస్‌లోకి వెళ్లి టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరైన రోహిత్‌ను ఎలిమినేట్ చేసి తనతోపాటు స్టేజీపైకి తీసుకొచ్చాడు. తర్వాత ధమాకా హీరోహీరోయిన్లు రవితేజ, శ్రీలీల జింతాత స్టెప్పుతో స్టేజీని అల్లాడించారు. అనంతరం ఆదిరెడ్డి ఎలిమినేట్ అయ్యాడు. పదిమంది నామీద పడి మాట్లాడినా నేను ఎదురునిలబడగలనన్న ధైర్యం బిగ్‌బాస్‌తో వచ్చిందన్నాడు ఆది. తర్వాత అతడు టాప్ 3 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ.. 'కీర్తి బిగ్‌బాస్ షోలో కనిపించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆత్మహత్యలు ఆగుతాయి. అన్ని కష్టాల్లో ఉన్న ఆమె అంత ధైర్యంగా ముందుకెళ్లడం చాలామందికి ఇన్స్పిరేషన్. రేవంత్‌లో 20 తప్పులు ఉంటే 40 పాజిటివ్‌లు ఉంటాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను వదిలి వచ్చి హౌస్‌లో గేమ్ ఆడటం అంటే మామూలు విషయం కాదు. నాకంటే ఆ ముగ్గురు బాగా ఆడారు. కాబట్టి వాళ్లకంటే ముందే ఎలిమినేట్ అయినందుకు సంతోషంగా ఉంది' అన్నాడు. చదవండి: కాసేపట్లో పెళ్లి పెట్టుకుని గ్రాండ్ ఫినాలేకు వచ్చిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ బిగ్‌బాస్ తెలుగు 6 సీజన్ లవర్ బాయ్ ఎవరంటే? -
రూ.5 లక్షలు గెలుచుకున్న శ్రీహాన్, రియలైజ్ అయిన కీర్తి
మాజీ కంటెస్టెంట్ల రాకతో బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కళ వచ్చింది. మొదటగా రోల్ రైడా హౌస్‌లో అడుగుపెట్టి త్వరలో బీబీ జోడీ షో రాబోతుందంటూ గుడ్‌న్యూస్ చెప్పాడు. అది కంటెస్టెంట్లు జంటలుగా పాల్గొనే రియాలిటీ డ్యాన్స్ షో అని తెలిపాడు. తర్వాత ఫైనలిస్టులకు ఆల్ ద బెస్ట్ చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. తర్వాత మెహబూబ్, అషూ జంటగా లోపలకు ఎంట్రీ ఇచ్చారు. వారు హౌస్‌మేట్స్‌తో ఫన్నీ గేమ్స్ ఆడించారు. అందులో భాగంగా ఏ ప్రశ్న అడిగినా తప్పు సమాధానమే చెప్పాలన్నారు. ఇందులో కీర్తి.. శ్రీహాన్ గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? అని అడగ్గా ఆదిరెడ్డి టపీమని ఇనయ పేరు చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ పడీపడీ నవ్వారు. అంతలోనే బ్యాడ్‌న్యూస్ అంటూ.. హౌస్‌లో ఒకరిని తమతోపాటు ఎలిమినేట్ చేసి తీసుకెళ్తామనగానే అందరి ముఖాలు వాడిపోయాయి. మరీ టెన్షన్ పెట్టడం మంచిదికాదని భావించిన వాళ్లు ఇది ప్రాంక్ అని చెప్పడంతో హౌస్మేట్స్ ఊపిరి పీల్చుకున్నారు. వారు వెళ్లిపోగానే అవినాష్- అరియానా వచ్చి డ్యాన్స్ చేసి, పంచ్‌లు పేల్చుతూ ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత చైతూ, కాజల్ వచ్చి ఫైనలిస్టులను సర్ప్రైజ్ చేశారు. శ్రీహాన్ అంటే ఎంటర్టైన్మెంట్, రేవంత్.. కోపం, ఆదిరెడ్డి.. కాన్ఫిడెంట్, రోహిత్.. కామ్ అండ్ కంపోజ్డ్, కీర్తి గేమ్ బాగా ఆడుతుందంటూ ఒక్కొక్కరి గురించి షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పాడు చైతూ. అనంతరం కొన్ని వస్తువులు వాడుతూ డ్యాన్స్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో కీర్తి గెలిచి ఫ్రైడ్ చికెన్ సంపాదించుకుంది. ఈ జంట వెళ్లిపోగానే రవి-భాను లోపలకు ఎంట్రీ ఇచ్చారు. ఫైనలిస్టులకు టంగ్ ట్విస్టర్స్ ఇచ్చి వాటిని స్పీడ్‌గా చెప్పాలన్నాడు. అందరూ బానే చెప్పినా తెలుగు రాని కీర్తి కొంత తడబడుతూ దాన్ని పూర్తి చేసింది. తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. సీజన్ ముగింపుకు వచ్చేసరికి ఎవరి మీద అభిప్రాయం మారిందో చెప్పాలన్నాడు. ముందుగా శ్రీహాన్ మాట్లాడుతూ.. మొదట్లో కీర్తి మంచి ఫ్రెండ్‌గా ఉండేది. కానీ రానురానూ గొడవలయ్యాయి. జీవితంలో ఎన్నో కష్టాలు దాటుకుంటూ వచ్చి ఇక్కడ గేమ్ మీద ఫోకస్ పెట్టి ఇంతవరకు రావడం చిన్న విషయం కాదంటూ ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాడు. నెక్స్ట్ ఆదిరెడ్డి.. మొదట్లో రేవంత్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడనిపించింది. కానీ చాలాకాలానికి అది యాటిట్యూడ్ కాదని అర్థమైందన్నాడు. రోహిత్ వంతు రాగా ఆదిరెడ్డి తప్పును అంగీకరిస్తారని తెలుసుకున్నానన్నాడు. రేవంత్ మాట్లాడుతూ.. ఆదిరెడ్డి రివ్యూయర్ కాబట్టి మానిప్యులేటర్ అనుకునేవాడిని. ఈ మధ్యకాలంలో అతడితో ఎక్కువగా ఉంటున్నాను. ఆ సమయంలోనే ఆయన్ను నేనెందుకు అర్థం చేసుకోలేకపోయానని ఫీలయ్యానని చెప్పాడు. కీర్తి వంతు రాగా.. శ్రీహాన్ జెన్యూన్ కాదు, డ్రామా చేస్తున్నాడనుకున్నాను. నాకు సారీ చెప్పినప్పుడు కూడా అది నిజమని నమ్మలేదు. కానీ తర్వాత ఆ అభిప్రాయం మారింది అని చెప్పింది. ఇకపోతే కొన్నివారాలుగా ఆన్లైన్లో లెన్స్‌కార్ట్ స్టైలిష్ కంటెస్టెంట్ పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే కదా! ఇందులో శ్రీహాన్ గెలిచి స్టైలిష్ కంటెస్టెంట్ ఆఫ్ ద సీజన్‌గా నిలవడమే కాకుండా రూ.5 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. ఆ మరుసటి రోజు అఖిల్ సార్థక్, తేజస్విని మదివాడ హౌస్‌లోకి వచ్చి ఆటపాటలతో సందడి చేసి వీడ్కోలు తీసుకున్నారు. చదవండి: అర్జున్ కల్యాణ్‌కు నేనంటే లవ్.. వీడియో చూసి షాకైన శ్రీసత్య బిగ్‌బాస్ విన్నర్ అతడే! -
సస్పెన్స్‌కు తెరపడింది.. బిగ్‌బాస్6 విన్నర్ అతడే!
బిగ్‌బాస్ సీజన్-6కి మరికాసేపట్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే సత్య ఎలిమినేట్ అవగా చివరగా ఐదుగురు సభ్యులు ఫినాలేకు చేరుకున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరన్న దానిపై నెట్టింట బాగా చర్చ నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఇదిలా ఉంటే ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌కు పొలిటికల్ రంగు కూడా పులుముకుంది. టాప్-2లో ఉండాల్సిన ఇనయాను కావాలనే ఎలిమినేట్ చేయడం, మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఫినాలేకు ఒకరోజు ముందు సత్యను ఎలిమినేట్ చేయడంపై ఇప్పటికే ఆడియెన్స్ ఫైర్ అవుతున్నారు. దీనికి తోడు పొలిటికల్ పవర్‌తో రేవంత్‌ను విన్నర్ కాకుండా చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు జరిగాయంటూ నెట్టింట వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో అసలు బిగ్‌బాస్ సీజన్-6 విజేత ఎవరన్నదానిపై హౌస్మేట్స్ ఫ్యామిలీతో పాటు ఆడియెన్స్‌లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న(శుక్రవారం)అర్థరాత్రే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో అందుతున్న ఓటింగ్ ప్రకారం చివరగా రోహిత్ నిలిచినట్లు తెలుస్తుంది. ఇక టాప్-4 ప్లేస్‌ను కీర్తి దక్కించుకుంది. టాప్-3లో ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్‌లు ఉన్నారు. వీరిలో అత్యదికంగా ఓట్లు సంపాదించుకొని సింగర్ రేవంత్ సీజన్-6 విజేతగా నిలవగా, శ్రీహాన్ రన్నరన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇక కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి టాప్-3తో సరిపెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతనిజం ఉందన్నది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే. -
నా తప్పులు మన్నించి విజేతగా నిలపండి.. ప్రేక్షకులను ఓట్లడిగిన శ్రీసత్య
Bigg Boss Telugu 6, Episode 102 Highlights: కంటెస్టెంట్లు అందరూ మీ గమ్యానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నారని ఫినాలే కోసం ఊదరగొట్టాడు బిగ్‌బాస్. మీ మనసుల్లోని మాటలను ప్రేక్షకులతో నేరుగా పంచుకుని వారి నుంచి ఓట్లు కోరవచ్చంటూ ఓట్ అప్పీల్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా మొదటగా మీకు వినిపిస్తుందా? అనే ఛాలెంజ్ ఇచ్చాడు. ఇందులో బిగ్‌బాస్ ప్లే చేసిన సౌండ్స్‌ను గుర్తించి సరైన ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో తక్కువ పాయింట్లు వచ్చిన కీర్తి, రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ఛాలెంజ్ నుంచి తొలగిపోయారు. అయితే శ్రీసత్య అరవడం వల్లే తన గేమ్ పోయిందని విసుకున్నాడు శ్రీహాన్. నీ తప్పు కూడా ఉంది, అనవసరంగా నన్ను బ్లేమ్ చేయకు అని గట్టిగానే ఆన్సరిచ్చింది శ్రీసత్య. కాసేపటికి శ్రీహాన్ సారీ చెప్పడంతో గొడవ చప్పున చల్లారింది. మొదటి ఛాలెంజ్‌లో గెలిచిన ఆదిరెడ్డి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ల అప్పీలు కోసం ఎన్నుకోమన్నాడు బిగ్‌బాస్. రేవంత్ మినహా మిగిలిన ముగ్గురూ రోహిత్‌కే ఓటేయడంతో అతడు ఓట్లు అడిగే అవకాశాన్ని గెలుచుకున్నాడు. దీంతో రోహిత్ మాట్లాడుతూ.. మొదటి నుంచి నేను ఎలా ఆడుతున్నాను? ఎలా మాట్లాడుతున్నాను? నా థింకింగ్ ఏంటి? నా క్యారెక్టర్ ఏంటి? అన్నీ మీరు చూస్తూ ఉన్నారు. మొదట్లో మెరీనాతో కలిసి ఆడేవాళ్లం. సెపరేట్ అయ్యాక విడివిడిగా ఆడాం. నాకు ఎప్పుడూ అదృష్టం కలిసిరావట్లేదు. ఈ సీజన్ 6 టైటిల్ గెలవాలన్నదే నా కోరిక. నా కుటుంబం గర్వపడేలా చేయాలనుకుంటున్నాను. అందుకు మీ సహకారం కావాలి' అంటూ తన స్పీచ్ ముగించాడు. తర్వాత ఎగ్స్ షాట్ అనే ఛాలెంజ్‌లో రేవంత్, శ్రీసత్య, కీర్తి, శ్రీహాన్ పాల్గొనగా రేవంత్, శ్రీసత్య గెలుపొందారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో సెలక్ట్ చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో శ్రీహాన్, కీర్తి, రోహిత్.. శ్రీసత్యకు ఓటేయగా ఆదిరెడ్డి ఒక్కడే రేవంత్‌కు మద్దతు పలికాడు. గెలిచేవాడికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఆదిరెడ్డి పరోక్షంగా రేవంతే విజేత అని అభిప్రాయపడినట్లు కనిపించింది. రేవంత్ స్ట్రాంగ్ ప్లేయర్ అని అతడికి ఈ ఓట్ అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వాలని శ్రీసత్యకు ఇస్తే ఏం యూజ్ ఉంటుందని మాట్లాడాడు. దీనికి శ్రీసత్య కూడా గట్టిగానే సమాధానమిచ్చింది. ఆల్రెడీ గెలుస్తాడంటున్నారు, అలాంటప్పుడు ప్రత్యేకంగా ఓట్లు అడిగే అవసరమెందుకు? అని కౌంటరిచ్చింది. ఏదేమైనా ఈ ఛాలెంజ్‌లో తనకు సపోర్ట్ చేయలేదని రేవంత్ ఒకింత హర్టయ్యాడు. ఇక శ్రీసత్య ప్రేక్షకులను ఓట్లు అడుగుతూ.. 'మొదట్లో నాకు దెబ్బలు తగలకుండా ఆడాలనుకునేదాన్ని. కానీ మూడో వారం నుంచి నేను వందశాతం ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. నేనేమైనా తప్పు చేసుంటే క్షమించండి. ఈ హౌస్‌లోకి వచ్చినప్పుడే విన్నర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ఆ విజయం మీ చేతుల్లోనే ఉంది. ఈ టైటిల్ నాకెంతో ముఖ్యం.. ఈ సీజన్‌కు లేడీ విన్నర్ అయితే బాగుంటుంది. కాబట్టి మర్చిపోకుండా నాకు ఓటేయండి' అని అభ్యర్థించింది. మరోపక్క సోషల్ మీడియాలో శ్రీసత్య మిడ్ వీక్ ఎలిమినేట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె లేడీ విన్నర్ కావాలనుకుంటుందని చెప్పడంతో అభిమానుల మనసు ఒక్కసారిగా కలుక్కుమంది. చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి ఎన్నో వారాలుగా అన్యాయం.. ఎట్టకేలకు రోహిత్‌కు ఛాన్స్ -
ఎన్నోవారాలుగా అన్యాయం.. చిట్టచివరికి రోహిత్‌కు ఒక్క ఛాన్స్
కంటెస్టెంట్ల ఎమోషన్స్‌తో ఓ ఆటాడుకుంటున్నాడు బిగ్‌బాస్. మరో మూడు రోజుల్లో గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టబోతున్నామని ఫుల్ ఖుషీలో ఉన్నారు టాప్ 6 కంటెస్టెంట్లు. కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ వారిలో ఒకరిని నేడే హౌస్ నుంచి పంపించేయనున్నారు. మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి కేవలం ఐదుగురిని మాత్రమే ఫినాలేకు పంపించనున్నారు. ఇకపోతే ఎప్పటిలాగే ఓట్ అప్పీల్ కోసం హౌస్‌మేట్స్‌కు ఆఖరి పోరాటం అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో సౌండ్స్ విని వాటిని గుర్తుపట్టి అవేంటో రాయాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి, రోహిత్ ఎక్కువ పాయింట్లు తెచ్చుకున్నారు. వీరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఓట్ అప్పీలు కోసం ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్. ఏకాభిప్రాయం అన్న ప్రతిసారి రోహిత్‌ను సైడ్ చేసుకుంటూ వచ్చిన హౌస్మేట్స్ ఈ ఒక్కసారికి మాత్రం అతడికే అవకాశం ఇవ్వడం గమనార్హం. దీంతో అతడు.. పదిహేను వారాలుగా మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు. కచ్చితంగా టైటిల్ గెలుస్తానని నమ్మకం ఉంది అని ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్ ఇవ్వగా ఇందులో రేవంత్, శ్రీసత్య ముందు స్థానాల్లో నిలిచారు. వీరిలో ఒకరిని ఏకాభిప్రాయంతో ఎన్నుకోమనగా ఆదిరెడ్డి.. రేవంత్‌కు, శ్రీహాన్.. శ్రీసత్యకు ఓటేశారు. మరి మిగతావాళ్లు ఎవరిని సెలక్ట్ చేశారు? ఎవరు ఓట్లు అడిగే ఛాన్స్ దక్కించుకున్నారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: పాపం శ్రీసత్య.. మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు బలి నన్ను ఛీ, తూ అని గెంటేశారు, ఇప్పుడు చెప్తున్నా..: కీర్తి -
బిగ్‌బాస్ 6 విజేత ఎవరో తెలుసా? గూగుల్ తల్లి ఏం చెప్తుందంటే?
బిగ్‌బాస్ షో ప్రారంభమవుతుందంటే మురిసిపోయే జనాలు షోకి శుభం కార్డు పడుతుందంటే మాత్రం తెగ ఫీలైపోతుంటారు. కానీ ఈసారి మాత్రం హమ్మయ్య, ఎట్టకేలకు ముగింపు కాబోతుందని ఊపిరి పీల్చుకుంటున్నారు. అలా ఉంది మరి ఈ సీజన్. ఎంటర్టైన్మెంట్కు అడ్డా ఫిక్స్ అని నాగ్ అన్నాడే తప్ప మరీ అంత భీభత్సమైన ఎంటర్టైన్మెంట్ అయితే లేదు. పైగా బాగా ఆడుతున్నారనుకున్న కంటెస్టెంట్లను అన్యాయంగా ఎలిమినేట్ చేసేసి తమకు కావాల్సిన వాళ్లనే టాప్ 5లో పెట్టుకుంది బిగ్‌బాస్ యాజమాన్యం.. అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇనయ సుల్తాన ఎలిమినేట్ అయిన తర్వాత ఆరో సీజన్‌పై మరింత విమర్శలు వచ్చిపడ్డాయి. అందుకు తగ్గట్టుగానే టీఆర్పీ కూడా ఢమాల్ అని పడిపోయింది. ఇవన్నీ పక్కనపెడితే ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు ఉన్నారు. రోహిత్, రేవంత్, కీర్తి, శ్రీహాన్, ఆదిరెడ్డి, శ్రీసత్య.. వీరిలో ఒకరు రేపు ఎలిమినేట్ కాబోతున్నారు. దీంతో మిగిలిన మిగతా ఐదుగురు ఫినాలేలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే విన్నర్ ఎవరనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ తరుణంలో గూగుల్ తల్లి బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విజేత ఎవరనేది ప్రకటించింది. ఈ షోలో మిస్టర్ పర్ఫెక్ట్గా నిలిచిన రోహిత్ విన్నర్‌గా అవతరించనున్నాడని తెలిపింది. బిగ్‌బాస్ 6 విన్నర్ ఎవరు? బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ విజేత ఎవరు? ఇలా ఎలా అడిగినా రోహిత్ పేరే సూచిస్తోంది. మరి నిజంగానే అతడు టైటిల్ అందుకుంటాడేమో చూడాలి! ప్రస్తుతానికి అనఫీషియల్ ఓటింగ్‌లో రేవంత్, శ్రీహాన్ మొదటి స్థానం కోసం పోటీపడుతున్నారు. ఆదిరెడ్డి, రోహిత్‌కు కూడా బాగానే ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. కీర్తి, శ్రీసత్య ఓట్ల శాతంలో వెనకపడినట్లు కనిపిస్తోంది. బిగ్‌బాస్ షోకి ముందు వరకు రోహిత్ ఎవరికీ పెద్దగా తెలియదు. హౌస్‌లో అడుగుపెట్టాకే తన మాటతో, ఆటతో, నిజాయితీతో అభిమానులను సంపాదించుకున్నాడు. అటు హౌస్‌మేట్స్‌తో, ఇటు ప్రేక్షకులతో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. కానీ ఆటలో మిగతావారికంటే కొద్దిగా వెనుకబడటంతో ఓట్లలో కూడా వెనుకపడుతున్నాడు. ప్రస్తుతానికైతే రేవంత్ గెలిచే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు.. శ్రీహాన్ ఎమోషనల్ -
‘లవ్ యూ రామ్’లో స్ఫూర్తి, సందేశం రెండూ ఉన్నాయి
రోహిత్ బెహల్, అపర్ణ జనార్ధన్ జంటగా నటించిన చిత్రం‘లవ్ యూ రామ్’. దర్శకుడు దశరథ్ కథ అందించిన ఈ సినిమాకు డీవై చౌదరి దర్శకత్వం వహించారు. దశరథ్, డీవై చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ.. ‘దశరత్ నాకు మంచి మిత్రుడు. 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న డీవై చౌదరి దర్శకత్వంలో వస్తున్న ఈ తొలి సినిమా విజయం సాధించాలి’ అన్నారు. ‘నా పాతికేళ్ల మిత్రుడు చౌదరితో కలిసి ఈ సినిమా చేయడం హ్యాపీ’అన్నారు కే. దశరథ్. ‘ఈ తరానికి కావాల్సిన సందేశం, స్పూర్తి ఈ సినిమాలో ఉన్నాయి’ అన్నారు డీవై చౌదరి. ‘ఈ సినిమా నాకు స్పెషల్’ అన్నారు రోహిత్. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: సుధాకర్ బొర్రా, డి. నేగేశ్వర్రావు. -
ముగ్గురమ్మాయిలపై రెచ్చిపోయిన కంటెస్టెంట్లు, తగ్గేదేలేదన్న రోహిత్
Bigg Boss 6 Telugu, Episode 90: 'టికెట్ టు ఫినాలే' ఛాలెంజ్ రేసులో రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, శ్రీహాన్, రోహిత్ ఐదుగురు మిగిలారు. అయితే తదుపరి ఛాలెంజ్‌లో వీరిలో నుంచి ముగ్గురు మాత్రమే పోటీపడాలన్నాడు బిగ్‌బాస్. దీంతో ఎవరికి వారు నేను తప్పుకోనంటే నేను తప్పుకోనంటూ వాదులాటకు దిగారు. దీంతో ఆ ముగ్గురు ఎవరో డిసైడ్ చేయండంటూ సంచాలకులైన ఇనయ, కీర్తి, శ్రీసత్యలపై భారం వేశాడు బిగ్‌బాస్. ఈ ముగ్గురు.. స్కోర్ బోర్డులో చివర్లో ఉన్న ఫైమా, రోహిత్, రేవంత్‌లను సెలక్ట్ చేశారు. టాప్‌లో ఉన్నవాళ్లను తీసేసి వేరేవాళ్లకు ఛాన్స్ ఇవ్వడమేంటి? ఈ సీజన్లో ఇదే వరస్ట్ డెసిషన్ అని చిరాకుపడ్డాడు ఆది. ఆలోచనలో పడ్డ రోహిత్.. టాప్ పొజిషన్లో ఉన్న వాళ్లను తీసేసి చివర్లో ఉన్న తనను ఆడేందుకు సెలక్ట్ చేయడం కరెక్ట్ కాదని భావించి గేమ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు ప్రకటించాడు. అంటే గేమ్ ఆడనని చెప్తున్నావా? అని ఇనయ అడగడంతో శ్రీహాన్ ఫైరయ్యాడు. ఆటలో నుంచి తప్పుకుంటున్నవాళ్లను ఎందుకు బతిమాలుతున్నావు? అందరికీ ఛాన్స్ ఇవ్వడానికి ఇది ఫన్డే గేమ్ కాదని చురకలంటించాడు. దీంతో వెనక్కు తగ్గిన సంచాలకులు తమ నిర్ణయం మార్చుకుని రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి ఆడుతున్నారని చెప్పారు. చివర్లో ఉన్న రోహిత్ ఆడను అన్నందున చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న ఫైమాను కూడా తొలగించామని ఇనయ స్పష్టతనిచ్చింది. ఈ ఒక్కమాటతో గేమ్‌లో ఉన్నవాళ్లంతా నిప్పులు చెరిగారు. ఇంతకుముందు ఓమాట ఇప్పుడో మాట అంటూ సంచాలకులను తిట్టిపోశారు. రోహిత్ అయితే నా వల్ల ఫైమాను తొలగించామంటారేంటి? అంటూ ఇనయ మీద మండిపడ్డాడు. అయితే టాప్ 3 లేదంటే లాస్ట్‌లో ఉన్న 3 మెంబర్స్‌నే ఆడించాలనుకున్నాం అని సంచాలకులుగా చెప్తున్నా.. అది మీరెలా డిసైడ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. అసలేం సంచాలకులు వీరు, ముగ్గురూ వేస్టే.. అంత భయమున్నప్పుడు బిగ్‌బాస్‌కు రాకూడదు అంటూ రేవంత్ మరోసారి తన నోటిదురుసు ప్రదర్శించాడు. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన ఛాలెంజ్‌లో రేవంత్ గెలవగా శ్రీహాన్, ఆది తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. సెకండ్ లెవల్ ముగిసే సమయానికి రేవంత్ 15, శ్రీహాన్, ఆది 14, ఫైమా 7, రోహిత్ 6 పాయింట్లతో వరుస స్థానాల్లో ఉన్నారు. సమాన పాయింట్లు వచ్చిన ఆది, శ్రీహాన్‌లకు ఓ గేమ్ ఇవ్వగా అందులో శ్రీహాన్ గెలిచాడు. దీంతో మొదటి రెండు స్థానాల్లో ఉన్న రేవంత్, శ్రీహాన్ టికెట్ టు ఫినాలే రేస్ కోసం పోటీపడ్డారు. ఇకపోతే శ్రీహాన్ టికెట్ టు ఫినాలే సొంతం చేసుకుని మొదటి ఫైనలిస్టుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. చదవండి: జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాల ఫామ్‌హౌస్ ఈ సీజన్లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే: ఆది -
ఈ సీజన్లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే: ఆదిరెడ్డి
ఏకాభిప్రాయం అనే ఒకే ఒక్క మాటతో హౌస్‌మేట్స్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాడు బిగ్‌బాస్. ఇంత దూరం వచ్చాక కూడా అందరికీ అవకాశం ఇవ్వకుండా మీలో మీరు కొట్టుకు చావండి, కానీ మీలో కొందరినే గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేసుకోమనడంతో కంటెస్టెంట్లు ఆవేశంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే రేసులో ఇనయ, శ్రీసత్య, కీర్తి గేమ్ నుంచి అవుట్ అయ్యారు. మిగిలిన ఐదుగురిలో ఏ ముగ్గురు నెక్స్ట్ ఛాలెంజ్ ఆడతారో ఏకాభిప్రాయానికి వచ్చి వారి పేర్లు చెప్పమన్నాడు బిగ్‌బాస్. ఎవరికి వారు నేను ఆడతానంటే నేను ఆడతాననడంతో సంచాలకులైన మిగతా ముగ్గురికి ఆ బాధ్యత అప్పజెప్పాడు. దీంతో ఇనయ.. స్కోర్ బోర్డులో టాప్‌లో ఉన్న ఆదిరెడ్డి, శ్రీహాన్‌ను తొలగించి రేవంత్, ఫైమా, రోహిత్ ఆడతారని వెల్లడించింది. ఇది విన్న ఆదిరెడ్డి ఈ సీజన్లో తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం ఇదేనని ఫైరయ్యాడు. ఈ గొడవంతా ఎందుకనుకున్న రోహిత్ తాను ఆట నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటానన్నాడు. గేమ్ ఆడాలి కానీ ఫెయిర్‌గా కూడా ఆడాలి అంటూ రోహిత్ మిగతావారికి ఛాన్స్ ఇస్తూ సైడ్ అయిపోయాడు. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు రోహిత్ ఆటలో గాని మాటలోగాని మచ్చలేని మనిషి అని మెచ్చుకుంటున్నారు. నిజాయితీకి నిలువెత్తు రూపం అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: విర్రవీగుతున్న రేవంత్, తప్పు చేసి అవతల వాళ్లను నిందించటమే పని! తండ్రయిన సింగర్ రేవంత్ -
నీలాంటోళ్లు బిగ్‌బాస్ హౌస్‌లోనే ఉండొద్దు: రేవంత్
Bigg Boss 6 Telugu, Episode 86: ఇరవై ఒక్క మందితో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. ఈ వారం ఇనయ కెప్టెన్‌గా ఉండటంతో ఆమె నామినేషన్స్ నుంచి తప్పించుకుంది. అటు రాజ్ తన వల్లే వెళ్లిపోయాడని తెగ ఫీలైంది ఫైమా. ఇంతకీ ఈరోజు బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదవాల్సిందే! నేను శ్రీసత్యతో కలిసి ఉన్నందుకు ఏవేవో అనేస్తున్నావు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావని రేవంత్ మీద సీరియసయ్యాడు శ్రీహాన్. ఏదైనా అనేముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడంటూ గరమయ్యాడు. దీంతో హర్టయిన రేవంత్ దూరంగా వెళ్లి కూర్చున్నాడు. కానీ కాసేపటికే ఈ గొడవలన్నీ ఎందుకు? మునుపటిలా మాట్లాడుకుందామంటూ కలిసిపోయారు. మరోపక్క ఫైమా.. తన ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల ఓట్లు వచ్చినా సరే రాజ్ వెళ్లిపోయాడని ఏడ్చేసింది. గతవారం రేవంత్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు పాడైపోయిన పండ్లు, ఆకుకూరల ఫొటోలను రోహిత్‌కు చూపించాడు బిగ్‌బాస్. ఇక మీదటైనా ఆహారం వేస్ట్ కాకుండా చూసుకోమని హెచ్చరించాడు. ఇంట్లో జరిగిన తప్పు కారణంగా తమకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ రద్దు చేయమని అడిగాడు ప్రస్తుతం రేషన్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రోహిత్. అనంతరం ఇంట్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.. ► ఆదిరెడ్డి.. రేవంత్, రోహిత్ ► ఫైమా.. రేవంత్, రోహిత్ ► శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి ► కీర్తి.. రేవంత్, శ్రీసత్య ► శ్రీసత్య.. కీర్తి, ఆదిరెడ్డి ► రోహిత్.. ఆది రెడ్డి, ఫైమా ► రేవంత్.. ఆది రెడ్డి, ఫైమా ► ఇనయ.. రేవంత్, శ్రీసత్య ముందుగా ఆదిరెడ్డి.. నాగార్జునగారు చూపించిన వీడియోలో ముందు జరిగిన డిస్కషన్ చూపించలేదు. నువ్వు గేమ్‌లో అమ్మాయి వస్తే మనకే లాభం అన్నట్లుగా మాట్లాడావు. అప్పుడు, ఇప్పుడు, ఇంకో పదేళ్ల తర్వాత కూడా నేను ఈ మాటపైనే స్టాండ్ అయి ఉంటా అని బల్లగుద్ది చెప్పాడు. అటు రేవంత్ మాత్రం నాగ్ సర్ ఆల్రెడీ నీదే తప్పని చెప్పాడు, ఇంక దీనికోసం చర్చించడం అనవసరం అంటూ నిట్టూర్చాడు. అటు ఫైమా - రేవంత్, శ్రీహాన్ - ఆదిరెడ్డిల మధ్య ఫైట్ మామూలుగా జరగలేదు. 'రోహిత్ స్ట్రాంగ్ అని నామినేట్ చేస్తున్నావ్, అంటే నువ్వు వీక్ కదా, అలాంటివాళ్లు హౌస్‌లో ఉండనవసరం లేదు, నిన్ను బయటకు పంపించడానికే నామినేట్ చేస్తున్నా' అని ఫైమాతో వాదించాడు రేవంత్. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఫైమా ఉగ్రరూపం దాల్చింది. 'రేవంత్ ముందొకటి మాట్లాడతాడు, వెనకాల ఒకటి మాట్లాడతాడు. ఇలా మాటలు మార్చేది ఎవరికీ కనిపించట్లేదా? ఎన్నోసార్లు నోరుజారాడు. అదెందుకు కనిపించట్లేదు?' అని అటు కంటెస్టెంట్లు, ఇటు బిగ్‌బాస్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది.ఫైనల్‌గా ఈ వారం ఫైమా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, రోహిత్, కీర్తి నామినేట్ అయ్యారు. చదవండి: నోరు జారుతుంది నువ్వు.. రేవంత్‌పై ఫైమా ఉగ్రరూపం బిగ్‌బాస్: రాజ్ రెమ్యునరేషన్ ఎంతంటే? -
ఇవే తగ్గించుకుంటే మంచిది.. శ్రీసత్యను హెచ్చరించిన తండ్రి
Bigg Boss Telugu 6, Episode 81: కన్నవాళ్లను చూడగానే అప్పటిదాకా పడ్డ శ్రమనంతా మర్చిపోతున్నారు హౌస్మేట్స్. 12 వారాల తర్వాత వారు ఎదురుపడటంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇక ఎవరి పేరెంట్స్ వచ్చినా ఆతృతగా దగ్గరికెళ్లి పలకరించి వారితో కలిసిపోవాలని ప్రయత్నిస్తూ అంతలోనే తన కన్నవాళ్లు గుర్తొచ్చి కన్నీళ్లను తుడుచుకుంటున్న కీర్తిని చూసి జాలిపడని వారే లేరు. మరి ఈరోజు ఎపిసోడ్లో ఏయే కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ హౌస్‌లో అడుగుపెట్టాయో చూద్దాం.. ఈరోజు మొదటగా ఫైమా తల్లి షాహీదా బిగ్‌బాస్ హౌస్‌లో హౌస్‌లో అడుగుపెట్టింది. ఆమె చూడగానే ఫైమా ముఖంలో సంతోషం వెల్లివెరిసింది. తల్లిని గట్టిగా హత్తుకుని ముద్దులు పెట్టేసింది. అందరూ నన్ను ఫైమా వాళ్ల అమ్మ అంటూ గుర్తుపట్టి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉందని ఎమోషనలైంది ఆమె తల్లి. అంతలోనే వాతావరణాన్ని కూల్ చేసేందుకు రేవంత్‌ను చూస్తే భయమైతుంది అంటూ హౌస్‌మేట్స్‌పై జోకులు పేల్చింది. ఇక ఫైమాను పక్కకు తీసుకెళ్లిన షాహీదా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ వాడొద్దని చెప్పింది. కోపం, వెటకారం తగ్గించుకోమని శ్రీసత్య, ఇనయలతో జాగ్రత్తగా ఉండమని సూచనలు చేసింది. తర్వాత తన కూతురితో పాటు ఇంటి సభ్యులందరితో కలిసి డ్యాన్స్ చేసింది. ఫైమా తన తల్లిని ఎత్తుకుని తిప్పుతుంటే కీర్తికి తన కన్నవాళ్లు గుర్తొచ్చి ఏడ్చేసింది. అందరిముందు తన బాధను బయపెట్టి వారి సంతోషాన్ని చెదరగొట్టడం ఇష్టం లేక బాత్రూమ్లోకి వెళ్లి బోరుమని ఏడ్చింది. తర్వాత బిగ్‌బాస్ ఇంటిసభ్యులను ఫ్రీజ్, ఫాస్ట్ ఫార్వర్డ్, లూప్ అంటూ ఓ ఆటాడుకున్నాడు. ఇదే ఛాన్స్ అనుకున్న ఇంటిసభ్యులు ఒకరినొకరు ఆటాడుకున్నారు. శ్రీహాన్‌ను ఫ్రీజ్ అన్నప్పుడు ఫైమా, శ్రీసత్య అతడికి ఆడవేషం కట్టి ఆటపట్టించారు. తర్వాత శ్రీసత్య తండ్రి గొంతు విని గార్డెన్ ఏరియాలోకి పరుగెత్తుకొచ్చింది. తండ్రిని, వీల్‌చైర్‌లో ఉన్న తల్లిని చూసి కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేసింది. తల్లికి గోరుముద్దలు తినిపించింది. పేరెంట్స్ ప్రేమ దక్కినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని సత్యతో చెప్పింది కీర్తి. ఇక సత్య తండ్రి ప్రసాద్ మాట్లాడుతూ.. 'నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు. ఇంత ఎత్తుకు ఎదుగుతావనుకోలేదు. కానీ కోపం, వెటకారం తగ్గించుకోవాలి. మొదటి మూడు వారాలు బాగున్నావు, తర్వాత ఇలా మారిపోయావేంటి? పాత సత్య ఇలా ఉండదు. నువ్వు పిచ్చిపిచ్చి నామినేషన్స్ వేశావు, ఇంట్లో ఎవరైనా సరే బలమైన కారణం లేకుండా సిల్లీ నామినేషన్స్ వేయొద్దు' అని హెచ్చరించాడు. వాళ్లు వెళ్లిపోగానే సత్య తన తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందింది. అమ్మ కాలు వాసింది, ఏదో భయంగా ఉంది. ఫిజియోథెరపీ ఆపేశారు. ఎవరూ సాయం చేయట్లేదని అర్థమైంది. వాళ్ల దగ్గర తినడానికి సరిపడా డబ్బులున్నాయి. కానీ చికిత్సకు సరిపేడంత లేవు అని ఏడ్చింది. అనంతరం తండ్రి తన కోసం చేసిన వంటకాలను అందరితో కలిసి పంచుకుంది. నెక్స్ట్ రోహిత్ అమ్మ అతడిని వెనక నుంచి వచ్చి కళ్లు మూసి సర్ప్రైజ్ చేసింది. తల్లిని చూడగానే భావోద్వేగానికి లోనైన రోహిత్.. ఆమె పాదాలమీద పడి ఆశీర్వాదం తీసుకుని అమ్మను పట్టుకుని ఏడ్చేశాడు. ఈ సందర్భంగా ఆమె.. నువ్వు ఒకసారి కెప్టెన్ అయి మా కలను నెరవేర్చు అని కోరింది. తర్వాత కొడుకుతో కలిసి బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేసింది. ఇక మెరీనా తనకోసం పంపిన ఫొటోఫ్రేమ్ చూసి కంటతడి పెట్టుకున్నాడు రోహిత్. రిలేషన్లో ఉన్నప్పుడు మొట్టమొదట దిగిన సెల్ఫీ ఫొటో అదేనని ఆ ఫొటో తాలూకు జ్ఞాపకాలను పంచుకున్నాడు రోహిత్. రేపటి ఎపిసోడ్లో మిగతా హౌస్మేట్స్ ఫ్యామిలీస్ రానున్నాయి. చదవండి: అప్పుడు ఏడిపించంటూ సవాల్.. ఇప్పుడు రోజూ ఏడుస్తూనే ఉంది 51 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న బిగ్‌బాస్ కంటెస్టెంట్ -
బిగ్‌బాస్: రోహిత్ కోసం ఎవరు వచ్చారో తెలుసా?
ఇంటిసభ్యుల రాకతో హౌస్మేట్స్ ముఖాలు మతాబుల్లా వెలిగిపోతున్నాయి. ఇప్పటికే ఆదిరెడ్డి తన కూతురి బర్త్‌డేను హౌస్‌లో సెలబ్రేట్ చేసినందుకు ఎగిరి గంతేస్తుండగా నెక్స్ట్ మా కోసం ఎవరు రాబోతున్నారా? అని ఇతర కంటెస్టెంట్లు గేటు వంక ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు శ్రీసత్య, ఫైమా, రోహిత్ తల్లి హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రోహిత్‌ను సర్ప్రైజ్ చేయాలని వెనక నుంచి వచ్చి కళ్లు మూసింది అతడి తల్లి. ఆమె స్పర్శ తగలగానే రోహిత్ ఎమోషనలయ్యాడు. అమ్మ చేతిని ఆప్యాయంగా ముద్దాడుతూ తనపై ప్రేమను గుమ్మరించాడు. మరోపక్క మ్యూజిక్ క్లాస్‌లో టీచర్ రాజ్‌ను ఆడేసుకున్నారు విద్యార్థులు. వీరెక్కడ దొరికార్రా బాబూ అనుకున్న రాజ్ వారినేం చేయలేక తల పట్టుకున్నాడు. మొత్తానికి గొడవలు పక్కన పెట్టేసి సంతోషంలో మునిగి తేలుతున్నారు హౌస్మేట్స్. మరి ఈ ఫ్యామిలీ సందడిని చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: ఆదిరెడ్డి కలను నిజం చేసిన బిగ్‌బాస్ -
ఆ ఐదుగురి మనసు స్వచ్ఛమైనది, మిగతావాళ్లు..: మెరీనా
Bigg Boss Telugu 6, Episode 78: ఈరోజు పెద్ద ట్విస్టులు, సర్ప్రైజ్లు లేకుండా సాదాసీదాగా సాగింది ఎపిసోడ్. ఊహించినట్లే మెరీనా ఎలిమినేట్ అయిపోగా ఆమె భర్త రోహిత్ మినహా మిగతా ఎవ్వరూ బాధపడలేదు. మరి హౌస్‌లో ఈ రోజు ఏం జరిగింది? మెరీనా వెళ్లిపోయేముందు హౌస్మేట్స్ గురించి ఏం చెప్పింది? అనేది నేటి ఎపిసోడ్ హైలైట్స్‌లో చూద్దాం.. నాగార్జున హౌస్‌లో ఉన్న పదిమందిలో ఎవరు బాటమ్ 5లో ఉంటారో చెప్పమని కంటెస్టెంట్లను ఆదేశించాడు. ఎవరు ఎవరెవరి పేర్లు చెప్పారంటే.. కంటెస్టెంట్ బాటమ్ 5 కంటెస్టెంట్లు ఆదిరెడ్డి మెరీనా, రోహిత్, రాజ్, కీర్తి, ఇనయ ఇనయ రాజ్, శ్రీసత్య, మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి కీర్తి శ్రీసత్య, మెరీనా, శ్రీహాన్, రాజ్, ఆదిరెడ్డి రాజ్ మెరీనా, రోహిత్, ఆదిరెడ్డి, ఇనయ, శ్రీహాన్ ఫైమా మెరీనా, రోహిత్, ఇనయ, కీర్తి, రాజ్ మెరీనా శ్రీహాన్, మెరీనా, ఇనయ, రాజ్, ఫైమా/శ్రీసత్య శ్రీహాన్ రోహిత్, మెరీనా, కీర్తి, రాజ్, ఆదిరెడ్డి రోహిత్ శ్రీహాన్, కీర్తి, మెరీనా, ఇనయ, రాజ్ శ్రీసత్య మెరీనా, రోహిత్, కీర్తి, ఇనయ, రాజ్ రేవంత్ మెరీనా, రోహిత్, కీర్తి, రాజ్, ఇనయ హౌస్ అంతా బల్లగుద్ది మరీ మెరీనాకు టాప్‌లో ఉండే అర్హతే లేదని స్పష్టం చేసింది. అన్నట్లుగానే నాగ్ మెరీనా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. ఆమె ఎలిమినేషన్‌ను హౌస్మేట్స్ ముందే పసిగట్టడంతో రోహిత్ తప్ప ఏ ఒక్కరూ బాధపడలేదు. నిత్యం వైఫైలా తన చుట్టూ తిరుగుతూ ఉండే మెరీనా ఒక్కసారిగా వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు రోహిత్. బాధను భరించలేక బయటకు ఏడ్చేశాడు. కాసేపు ఇద్దరూ తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరిపై ఒకరు ముద్దుల వర్షం కురిపించుకున్నారు. అనంతరం స్టేజీపైకి వచ్చిన మెరీనాతో హౌస్‌లో ప్యూర్ ఎవరు? ఇంప్యూర్ ఎవరు? అనే గేమ్ ఆడించాడు నాగ్. ముందుగా మెరీనా స్వచ్ఛమైన వాళ్ల లిస్ట్ చెప్పుకొచ్చింది. రోహిత్‌లాంటి స్వచ్ఛమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదంది. కీర్తి ఏదో బాధలో ఉంటుందంటారు.. ఆమె బాధ నిజమని, తనేమీ యాక్ట్ చేయట్లేదని చెప్పింది. ఆదిరెడ్డి తనలో తానే మాట్లాడుకోవడం చూసి దెయ్యంతో మాట్లాడుతున్నాడేమో అనుకునేదాన్ని, ఆ తర్వాత క్లారిటీ వచ్చిందని పేర్కొంది. అతడితో ఉంటే మనవాళ్లతో ఉన్న ఫీలింగ్ వస్తుందని తెలిపింది. రేవంత్‌కు కోపం వస్తే కోపం, బాధ అనిపిస్తే బాధ అన్నీ చూపిస్తాడని అదే స్వచ్ఛతకు నిదర్శనమని వివరించింది. నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే సాయం చేయడానికి ముందుకొచ్చే మొదటి వ్యక్తి రేవంత్ అని పొగిడింది. రాజ్ దగ్గర యాటిట్యూడ్ లేదని, ఒక్కో మెట్టు ఎక్కుతూ తనను తాను బిల్డ్ చేసుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. తర్వాత ఇనయ, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమాలను ఇంప్యూర్ జాబితాలో పెట్టింది. అప్పుడప్పుడైనా ఎదుటివాళ్లు చెప్పేది వినమని ఇనయకు సూచించింది. శ్రీసత్య మానిప్యులేట్ అయినట్లు అనిపించిందని, ఫైమా కొన్నిసార్లు మాటలు వదిలేస్తుందని పేర్కొంది. శ్రీహాన్‌ను ఇప్పటికైనా ఇంట్లో అందరినీ సమానంగా చూడమని సూచించింది. అంతేకాకుండా కోపం వచ్చినప్పుడు కంట్రోల్లో ఉండాలి, ఓసారి నామీద అరిచావు, నేను సైలెంట్ క్యాండిడేట్ కాబట్టి సరిపోయింది, అక్కడ వేరేవాళ్లు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఘాటుగా హెచ్చరించింది. అనంతరం బిగ్‌బాస్ జర్నీకి ఫుల్స్టాప్ పెడుతూ స్టేజీ నుంచి వెళ్లిపోయింది. చదవండి: గీతూ పేరెంట్స్‌తో మాట్లాడా: బాలాదిత్య మెరీనా ఎలిమినేట్ అవ్వడానికి కారణాలివే! -
టాప్ 10 కంటెస్టెంట్లలో అట్టడుగు స్థానంలో ఇనయ..
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం టాప్ 10 కంటెస్టెంట్లు మిగిలారు. వీరిలో ఒకరైన మెరీనా నేడు ఎలిమినేట్ కానుంది. దీంతో మిగిలిన తొమ్మిది మందైన రోహిత్, రాజ్, శ్రీహాన్, శ్రీసత్య, ఇనయ, కీర్తి, రేవంత్, ఆదిరెడ్డి,ఫైమా టైటిల్ కోసం పోటీపడనున్నారు. మరి వీరిలో ఎవరు బాటమ్ 5లో ఉంటారో హౌస్మేట్స్ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు నాగ్. ఈమేరకు రిలీజైన ప్రోమోలో ఒక్కొక్కరు ఒక్కో కంటస్టెంట్ పేరు చెప్పారు. ► ఆదిరెడ్డి.. మెరీనా ► ఇనయ, శ్రీసత్య.. రాజ్ ► రాజ్, ఫైమా.. ఇనయ ► కీర్తి.. ఆదిరెడ్డి ► మెరీనా.. శ్రీహాన్ ► శ్రీహాన్, రోహిత్.. కీర్తి ► రేవంత్.. రోహిత్‌ల పేర్లు చెప్పారు. మెజారిటీ ఇంటిసభ్యులు ఇనయ, రాజ్‌లు ఫినాలే చేరుకోలేరని తేల్చి చెప్పారట. కానీ అనధికారిక పోలింగ్స్ చూస్తే మాత్రం ఇనయ టాప్ 3లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయం తెలిస్తే శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి ఏమైపోతారో చూడాలి! చదవండి: పూర్తిగా గీతూలా మారిన ఆదిరెడ్డి యంగ్ హీరో చెంప పగలగొట్టిన తేజ -
బిగ్‌బాస్: టాప్ 10లో నుంచి ఎలిమినేట్ అయింది ఎవరంటే?
ఊహించని ఎలిమినేషన్లతో వరుస ట్విస్టులిచ్చిన బిగ్‌బాస్ ఈసారి మాత్రం ఊహించని కంటెస్టెంట్‌నే బయటకు పంపించాడు. ఈవారం ఎవరు బయటకు వెళ్తున్నారో మీకీపాటికే అర్థమై ఉంటుంది. ఇంకెవరు మెరీనానే! ఈ వారం కెప్టెన్ ఫైమా, ఇమ్యూనిటీ సంపాదించుకున్న రాజ్ మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు. వీరిలో మెరీనా, రోహిత్, కీర్తి డేంజర్ జోన్లో ఉండగా మెరీనాకు తక్కువ ఓట్లు పడటంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. మెరీనా.. తన కోరిక తీరకుండానే బిగ్‌బాస్ నుంచి బయటకు రానున్నట్లు కనిపిస్తోంది. ఇంకా ఒక్కవారం హౌస్‌లో ఉండాలని, భర్త రోహిత్‌తో కలిసి బిగ్‌బాస్ హౌస్‌లో పెళ్లిరోజు జరుపుకోవాలని కలలు కంది. చివరికి ఆమె కూడా తన ఎలిమినేషన్‌ను ముందే ఊహించిందో ఏమోకానీ జంటను విడదీయకండి బిగ్‌బాస్, ఉంటే ఇద్దరినీ ఉంచండి.. పంపిస్తే ఇద్దరినీ పంపించేయండి.. మేము యానివర్సరీ సెలబబ్రేట్ చేసుకోవాలని కోరింది. ఇద్దరినీ హౌస్‌లో ఉండమనడం ఓకే కానీ సేవ్ అయ్యే మనిషిని కూడా తనతో పాటే పంపించేయమనడమే ఒకింత విచిత్రంగా ఉంది. ఫినాలే దగ్గర పడుతున్న సమయంలో భర్తను ఇంటికి తీసుకెళ్లిపోతాననడమేంటని ఆడియన్స్ అవాక్కయ్యారు. కొంపతీసి మెరీనా అన్న మాటలను బిగ్‌బాస్ సీరియస్‌గా తీసుకుని డబుల్ ఎలిమినేషన్ పెడతారా? అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. కానీ చివరికి సింగిల్ ఎలిమినేషన్‌తో మెరీనాను మాత్రమే హౌస్‌లో నుంచి పంపించేసినట్లు తెలుస్తోంది. మరి మెరీనా ఎలిమినేషన్ రోహిత్‌కు ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అనేది చూడాలి! చదవండి: కర్మ ఫలితం.. రేవంత్, శ్రీహాన్‌లకు బుద్ధి చెప్పిన హౌస్మేట్స్ -
ఆడియన్స్ ప్రశ్నలతో బయటపడ్డ శ్రీహాన్, శ్రీసత్య నిజస్వరూపం!
Bigg Boss 6 Telugu, Episode 75: సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా బిగ్‌బాస్ ఇంటిసభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. మరోవైపు ఈ వారం వెళ్లిపోయేది తనే అని ఫిక్సయిన మెరీనా తన పెళ్లి రోజు గురించి కలలు కంది. నవంబర్ 29న వెడ్డింగ్ యానివర్సరీ ఉందని, ఆ రోజును ఇద్దరం కలిసే సెలబ్రేట్ చేసుకోవాలనుందని చెప్పింది. హౌస్ లోపల అయినా బయట అయినా ఇద్దరం కలిసే పెళ్లిరోజు జరుపుకోవాలని, అందుకు నువ్వే ఏదో ఒకటి చేయాలంటూ బిగ్‌బాస్‌ను వేడుకుంది. అంటే ఉంచితే ఇద్దరినీ హౌస్‌లో ఉంచమని పంపిస్తే డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరినీ పంపించేయమని చెప్పకనే చెప్పింది. బిగ్‌బాస్‌కు కొత్త కొత్త ఐడియాలివ్వకని రోహిత్ చురకలేశాడు. అనంతరం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ ప్రవేశపెట్టాడు. ఇందులో పోటీదారులు శ్రీహాన్, రేవంత్, ఆదిరెడ్డి, ఇనయ, రోహిత్.. ఇతరుల గోల్ పోస్ట్‌లోకి బంతి వేయాల్సి ఉంటుంది. మొదటి రౌండ్‌కు ఫైమా సంచాలకుడిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో రేవంత్, శ్రీహాన్ కలిసి ఆడినట్లే అనిపించింది. ఇది చూసిన ఫైమా.. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటాడు, మరి ఇప్పుడు ఈయన చేసేదేంటని సెటైర్లు వేసింది. మొదటి రౌండ్లో రోహిత్ అవుట్ అయ్యాడు. రెండో రౌండ్లో ఎవరూ అవుట్ కాకపోవడంతో కంటెండర్లు ఏకాభిప్రాయంతో ఒకరిని తొలగించాలన్నాడు బిగ్‌బాస్. ఎక్కువ ఓట్లు ఆదిరెడ్డికి పడటంతో అతడు అవుట్ అయ్యాడు. ఇక రేవంత్, ఫైమా గేమ్ ఆసాంతం దెబ్బలాడుకుంటూనే ఉన్నారు. నీలాగా సపోర్ట్ తీసుకుని ఆడను అని రేవంత్ ఫైమాను ఉద్దేశించి అన్నాడు. వెంటనే ఆదిరెడ్డి అందుకుంటూ బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నావా? అన్నాడు. ఓపక్క నాతో, అటు ఇనయతో, తీరా గేమ్‌లోకి దిగాక శ్రీహాన్‌తో కలిసి ఆడావని కౌంటరిచ్చాడు. దీనికి కిమ్మనుకుండా సైలెంట్ అయిపోయాడు రేవంత్. మూడో రౌండ్లో ఇనయ తనను తాను సేవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడింది, కానీ గెలవలేకపోయింది. దీంతో కెప్టెన్ కాలేకపోయానని వెక్కివెక్కి ఏడ్చింది ఇనయ. చివరగా రేవంత్.. శ్రీహాన్‌ను ఓడించి కెప్టెన్‌గా అవతరించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో రెండోసారి కెప్టెన్ అవడంతో రేవంత్ కంటి నుంచి ఆనందభాష్పాలు రాలాయి. అనంతరం ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పాలన్నాడు బిగ్‌బాస్. మొదటి ప్రశ్న: నీ కెప్టెన్సీలో కీర్తిని రూడ్‌గా వంట చేయమన్నావు. ఆమె తనకు రాదని చెప్తే నేర్చుకోమన్నావు. మరి నీ ఫ్రెండ్ శ్రీసత్యకు ఎందుకు చెప్పలేదు? శ్రీహాన్: వంట ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే ఆమెను కిచెన్ టీమ్‌లో వేశా. అంతేకాదు అప్పుడప్పుడు ఆమె కిచెన్‌లో పని చేయడం చూశాను. శ్రీసత్య వంట చేయను అన్న మాట నాకు వినిపించలేదు. అయినా తను కిచెన్‌లో ఏదో ఒక పని చేస్తూనే ఉంది అని చెప్పాడు. నిజానికి శ్రీసత్య వంట రాదు, చేయను అన్నా కూడా శ్రీహాన్ లైట్ తీసుకున్నాడు. ఇద్దరూ అడ్డంగా దొరికిపోవడంతో కీర్తి ముఖం మతాబులా వెలిగిపోయింది. రెండో ప్రశ్న: ఫైమా మీరు మొదట్లో చూడటానికి ఎంతో ఎంటర్టైనింగ్గా ఉండేవారు. కానీ ఇప్పుడు స్వార్థపరురాలిగా కనిపిస్తున్నారు. ఈ రెండింటిలో మీ అసలు రూపం ఏది? ఫైమా: ఆటలో గెలవాలన్న కసి ఎక్కువైంది. దానిమీద ఎక్కువ దృష్టి పెట్టి ఎంటర్టైన్ పక్కన పెట్టేశాను. మూడో ప్రశ్న: ఒక రివ్యూయర్ అయి ఉండి మీకు గేమ్ బాగా తెలుసని మీరే అంటుంటారు. కానీ మీ నామినేషన్స్ అందరికన్నా సిల్లీగా, సేఫ్‌గా ఉంటాయి. మీరు ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్స్‌ని నామినేట్ చేసి అప్పుడు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ ప్లేయర్ అనుకోండి.. ఆదిరెడ్డి: స్ట్రాంగ్ ప్లేయర్స్‌ను బయటకు పంపించాలన్న ఆలోచన నాకు లేదు. వారితో గేమ్ ఆడి గెలవాలనుకుంటాను. నా కళ్ల ముందు జరిగే సంఘటనలను బట్టే నామినేషన్స్ చేశాను, తప్ప సిల్లీ రీజన్స్ ఇవ్వలేదు. మీకలా అనిపిస్తే నేనేం చేయలేను. మరీ ముఖ్యంగా నన్ను రివ్యూయర్‌గా కాకుండా కంటెస్టెంట్‌గా చూడండి. ప్రశ్న: ఇనయ తన ఫ్రెండ్‌ని వెన్నుపోటు పొడిచిందన్నారు. కానీ మీరు రేవంత్‌ను మూడుసార్లు నామినేట్ చేశారు. కెప్టెన్సీలో తనకి సపోర్ట్ చేయలేదు. అర్జున్ను యూజ్ చేసుకున్నారు. తన గేమ్ కూడా మీరే ఆడి తనని నామినేట్ చేశారు. మీరు చెప్పే విషయాలు మీరసలు పాటిస్తారా? శ్రీసత్య: తప్పుంటే ఎవరినైనా నామినేట్ చేస్తాను. రేప్పొద్దున శ్రీహాన్ది తప్పుంటే అతడిని కూడా నామినేట్ చేస్తా. ఇనయను రెచ్చగొట్టడానికే ఆమె వెన్నుపోటు పొడిచిందన్నాను. ఫ్రెండ్షిప్, గేమ్ ఒకటి కాదు. రేపు పాయింట్ ఉంటే శ్రీహాన్‌ను కూడా నామినేట్ చేస్తాను. అర్జున్ను నేను యూజ్ చేసుకోలేదు. హోటల్ టాస్క్‌లో సర్వీసెస్ ఇచ్చి డబ్బులు తీసుకున్నాను. నేను చెప్పే విషయాలు కచ్చితంగా పాటిస్తాను. చదవండి: ఈడీ ఆఫీసులో పూరీ, చార్మీ కూతురి సినీ ఎంట్రీపై స్పందించిన రోజా -
తగ్గేదే లేదంటున్న బిగ్‌బాస్, విన్నర్‌కు మిగిలేది ఎంతంటే?
Bigg Boss 6 Telugu, Episode 74: వీలైనంత ప్రైజ్‌మనీని తగ్గించాలని బిగ్‌బాస్ కంకణం కట్టుకున్నట్లున్నాడు. కంటెస్టెంట్లు నో చెప్పడానికి వీలు లేని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌కు ఓ రేటు ఫిక్స్ చేశాడు. అలా ప్రైజ్‌మనీలో నుంచి కావాల్సినంత దండుకుంటున్నాడు. ఇంతకీ ప్రైజ్‌మనీ ఎన్ని లక్షలు తగ్గింది? నేటి ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేద్దాం.. రివ్యూలు వద్దని స్వయంగా నాగార్జునే చెప్పినా పట్టించుకోని ఆదిరెడ్డి ఈవారం ఎవరు వెళ్తారని సత్యతో డిస్కషన్ పెట్టాడు. దీనికామె క్షణం ఆలోచించకుండా కీర్తి అని చెప్పింది. అటు ఆదిరెడ్డి కూడా నాకూ అలాగే అనిపిస్తోందని వంత పాడాడు. అనంతరం బిగ్‌బాస్.. బీబీ ట్రాన్స్పోర్ట్ అనే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బీబీ ట్రక్కు సమయానుసారం ఒక్కో స్టాప్ దగ్గర ఆగిపోతుంది. అలా ఆగిన ప్రతిసారి ఎవరైతే ముందు వచ్చి ఎక్కుతారో వారే కెప్టెన్సీ పోటీదారులవుతారు. అయితే ప్రతి స్టాప్‌లో ఆ వాహనం ఎక్కేందుకు ఓ ధర ఉంటుందని, దాన్ని విన్నింగ్ ప్రైజ్‌మనీలో నుంచి తీసేస్తామని చెప్పాడు. దీనితోపాటు ఆ ట్రక్కు ఎక్కలేకపోయిన మిగతా ఇంటి సభ్యులు తమలో కెప్టెన్సీకి అనర్హులుగా భావించే ఇద్దరి పేర్లను చెప్తే వారిలో ఎవరు పోటీలో పాల్గొంటారు? ఎవరు రేస్ నుంచి తప్పుకుంటారనేది పోటీదారులు నిర్ణయిస్తారు. మొదటి రౌండ్లో ఆదిరెడ్డి గెలవగా అతడు తన కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం లక్ష రూపాయలు వాడతానన్నాడు. ఇక ఇంటిసభ్యులు పోటీలో నుంచి ఎవరిని తప్పిద్దామని చర్చలు మొదలుపెట్టారు. శ్రీహాన్.. రోహిత్ కెప్టెన్‌గా ఇంటిని చూసుకోగలడన్న నమ్మకం లేదన్నాడు. దీనికి రోహిత్ ఆన్సరిస్తూ.. నువ్వు నన్ను కాంపిటీషన్‌గా చూస్తున్నావేమో, అందుకే పక్కన పెడుతున్నావని కౌంటరిచ్చాడు. దీనికి శ్రీహాన్.. అసలు నువ్వు నాకు కాంపిటీషనే కాదని బిల్డప్ ఇవ్వడం గమనార్హం. ఇక కీర్తి.. శ్రీసత్య, శ్రీహాన్ పేరు చెప్పడంతో శ్రీహాన్ వెటకారం మొదలుపెట్టాడు. అలా వీళ్లిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. చివరగా రోహిత్, ఫైమాలను నిల్చోబెట్టగా వీళ్లలో రోహిత్‌కు ఛాన్స్ ఇచ్చి ఫైమాను తొలగించాడు ఆదిరెడ్డి. రెండోసారి రేవంత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఈ రౌండ్లో ప్రైజ్‌మనీలో నుంచి రూ.25 వేలు తగ్గించాడు బిగ్‌బాస్. హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్, రాజ్‌లను ఎన్నుకున్నారు. కెప్టెన్సీ కంటెండర్లయిన రేవంత్, ఆది.. శ్రీహాన్‌ను గేమ్‌లో ఉంచాలనుకుని రాజ్‌ను సైడ్ చేశారు. మూడో రౌండ్లో రోహిత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచాడు. ఇందుకుగానూ రూ.45,000 కట్ చేశాడు. హౌస్మేట్స్ ఏకాభిప్రాయంతో శ్రీహాన్, శ్రీసత్యలను నిలబెట్టగా కెప్టెన్సీ కంటెండర్లు శ్రీహాన్‌ను గేమ్‌లో కంటిన్యూ చేయనున్నట్లు ప్రకటించారు. నాలుగో రౌండ్లో శ్రీహాన్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలవగా ఇందుకోసం రూ.30,000 కోత పెట్టాడు బిగ్‌బాస్. కంటెండర్లు మెరీనాను ఆటలో కంటిన్యూ చేసి కీర్తిని సైడ్ చేశారు. ఐదో రౌండ్లో కంటెండర్‌షిప్ కోసం పోటీపడేందుకు రూ.70 వేలు పెట్టాడు బిగ్‌బాస్. ఈసారి ఇనయ ముందుగా ట్రక్ ఎక్కి కంటెండర్‌గా నిలిచింది. మొత్తానికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ద్వారా రూ.3 లక్షలు కోత పెట్టడంతో ప్రైజ్‌మనీ రూ. 41,00,300 చేరింది. తర్వాత శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్ సరదాగా మాట్లాడుకున్నారు. శ్రీహాన్, శ్రీసత్య మాట్లాడుకున్నప్పుడు నేను ఆటలో అరటిపండు అయ్యాననే టైంలో రాజ్ క్లోజ్ అయ్యాడన్నాడు రేవంత్. ఆ మాటతో మండిపడ్డ శ్రీహాన్.. మేము మాట్లాడుకునేటప్పుడు నిన్ను రావద్దని అనలేదు కదా? అని ప్రశ్నించాడు. నేనేదో చాలా సాధారణంగా అన్నానని రేవంత్ అన్నా సరే శ్రీహాన్ వినిపించుకోలేదు. మేమిద్దరం కలిసి నిన్ను ఏదో చేస్తున్నామన్నట్లుగా చెప్తున్నావని సీరియస్ అయ్యాడు. అటు శ్రీసత్య కూడా మధ్యలో అందుకుంటూ.. ఇప్పుడేంటి, నేను శ్రీహాన్‌తో ఎక్కువగా మాట్లాడొద్దు, అంతే కదా అని సూటిగా అడిగేసింది. చిన్నమాటను ఎక్కడికో తీసుకువెళ్తున్నారని భావించిన రేవంత్ గొడవ చేయడం ఎందుకని సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక ఈ వారం రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, ఇనయ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో రేవంత్ కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది! చదవండి: కాంతార హీరోకు గోల్డెన్ గిఫ్ట్ ఇచ్చిన రజనీకాంత్ ఓటీటీలో ప్రిన్స్, ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే? -
చెత్త రీజన్స్, చెత్త నామినేషన్స్.. కాకపోతే ఓ ట్విస్ట్!
Bigg Boss 6 Telugu, Episode 72: బిగ్‌బాస్ హౌస్‌లో టాప్ 10 కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక మీదట గేమ్ మరింత రంజుగా మారనుంది. అసలైన నామినేషన్స్ హీట్ ఇప్పుడు మొదలు కానుంది అనుకుంటే అంతా తలకిందులైంది. ఈరోజు నామినేషన్స్ అసలు నామినేషన్స్లానే లేవు. ఇస్తినమ్మా వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం అన్నట్లుగా నువ్వు నాకు వేశావు, నేను నీకు వేస్తున్నా అన్నట్లుగా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే ఇది చదివేయండి.. నాకు బాగా క్లోజ్ అయినవారందరూ వెళ్లిపోతున్నారు. గీతూ, బాలాదిత్య ఇద్దరూ వెళ్లిపోయారు, అంటే నేను కూడా వెళ్లిపోతానని హింటిస్తున్నావా బిగ్‌బాస్? అని తనలో తనే మదనపడ్డాడు ఆది రెడ్డి. అనంతరం ఇంట్లో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంట్లో ఉండి వ్యర్థం అనుకున్న ఇద్దరు ఇంటిసభ్యులపై చెత్త బుట్ట గుమ్మరించాలన్నాడు బిగ్‌బాస్. ముందుగా ఫైమా.. బూతు మాట్లాడావంటూ రోహిత్‌ను నామినేట్ చేసింది. రోజులు గడిచేకొద్దీ నీ కసి కోపంగా మారుతోంది. గేమ్‌ను పర్సనల్‌గా తీసుకుని కావాలని ఫిజికల్ అవుతున్నావంటూ ఇనయపై చెత్త గుమ్మరించింది. ► ఆదిరెడ్డి.. శ్రీహాన్, రోహిత్ ► ఇనయ.. ఆదిరెడ్డి, రాజ్ ► శ్రీహాన్.. రోహిత్, కీర్తి ► మెరీనా.. రేవంత్, ఇనయ ► రాజ్.. మెరీనా, ఇనయ ► శ్రీసత్య.. ఇనయ, కీర్తి ► రోహిత్.. రేవంత్, ఆదిరెడ్డి ► కీర్తి.. శ్రీసత్య, మెరీనా ► రేవంత్.. రోహిత్, మెరీనాలను నామినేట్ చేశారు. ఈ నామినేషన్స్‌లో కీర్తి- శ్రీసత్యల మధ్య ఇగో ఫైట్ నడిచింది. గేమ్ ఓడిపోయిన కోపంలో బూతులు మాట్లాడాడన్న కారణంతోనే రోహిత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అటు ఇనయది కూడా అదే పరిస్థితి. ఆవేశంలో నోటి నుంచి బూతులు వచ్చేస్తున్నాయి, కాస్త చూసుకోమని హెచ్చరించారు ఇంటిసభ్యులు. అంతకు మించి పెద్దగా వాదనలేమీ జరగలేదు. ఫైనల్‌గా ఈ వారం కెప్టెన్ ఫైమా మినహా ఇనయ, రోహిత్, మెరీనా, ఆదిరెడ్డి, కీర్తి, శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, రాజ్‌లు నామినేషన్లో ఉన్నారు. కాకపోతే ఓటింగ్ లైన్లు రేపు రాత్రి ఓపెన్ కానున్నాయి. అంటే నామినేషన్స్‌లో నుంచి సేవ్ అయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ సువర్ణావకాశం ఇవ్వనున్నాడు బిగ్‌బాస్. మరి ఈ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి! చదవండి: బాలాదిత్య, వాసంతిల పారితోషికం ఎంతో తెలుసా? సినిమాలకు బ్రేక్, హీరో షాకింగ్ నిర్ణయం -
ఆ ఇద్దరే టార్గెట్, నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే?
నామినేషన్స్ ఊహించగలమేమో కానీ ఎలిమినేషన్ మాత్రం ఊహించలేకున్నాం. ఈ మధ్య అనుకోని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటివరకు 11 మంది ఎలిమినేట్ అవడంతో ప్రస్తుతం హౌస్‌లో 10 మంది మాత్రమే మిగిలారు. తాజాగా వీరందరూ నామినేషన్స్ ప్రక్రియలో పాల్గొన్న ప్రోమో రిలీజైంది. ఇందులో నామినేట్ చేయాలనుకున్న ఇంటిసభ్యులపై చెత్తను గుమ్మరించాల్సి ఉంటుంది. మొదటిసారి ఆదిరెడ్డి.. తానింతవరకు నామినేట్ చేయని ఇంటిసభ్యులైన శ్రీహాన్, రోహిత్‌లను సెలక్ట్ చేసుకున్నాడు. బాతూ మాట్లాడాడంటూ రోహిత్‌పై చెత్త గుమ్మరించింది ఫైమా. ఎప్పటిలాగే శ్రీహాన్.. కీర్తిని నామినేట్ చేశాడు. ఇకపోతే శ్రీహాన్- ఇనయల గొడవ గాలి మళ్లి ఆది- ఇనయల గొడవగా మారింది. ఈ మధ్య వీరిద్దరు ఎక్కువ కొట్లాడుకుంటున్నారు. అయితే ఈవారం ఇనయను నామినేట్ చేయలేకపోవడంతో ఆది నెక్స్ట్ వీక్ మాత్రం తననే నామినేట్ చేస్తానని స్పష్టం చేశాడు. బిగ్‌బాస్ హెచ్చరించినా సరే శ్రీసత్య, శ్రీహాన్, రేవంత్ నామినేషన్లో ముసిముసి నవ్వులు నవ్వుతుండటం గమనార్హం. ఇక ఈ వారం కెప్టెన్ ఫైమా మినహా అందరూ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్స్‌లో ఎక్కువమంది రోహిత్, ఇనయలనే టార్గెట్ చేశారు. చదవండి: వాసంతి ఎలిమినేట్, ఆ ముగ్గురే తన ఫేక్ ఫ్రెండ్స్ -
శ్రీసత్యకు ఇచ్చిపడేసిన రేవంత్, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ పోటీ దాదాపు ముగిసినట్లే! లైవ్ టెలికాస్ట్‌లో ఫైమా కెప్టెన్‌గా అవతరించింది. ఇక మిగిలిందల్లా వరస్ట్ పర్ఫామర్‌ను ఎంచుకోవడమే! ఈమేరకు తాజాగా ఓ ప్రోమో రిలీజైంది. ఇందులో వరస్ట్ ఇంటిసభ్యులను ఎంచుకోమని ఆదేశించాడు బిగ్‌బాస్. సంబంధం లేని విషయాల్లో తలదూర్చుతోందని ఇనయకు స్టాంప్ గుద్దాడు ఆదిరెడ్డి. రోహిత్ కూడా ఇనయను చెత్త కంటెస్టెంట్‌గా పేర్కొన్నాడు. ముందు వారాలతో పోలిస్తే ఈవారం నీలో మార్పు కనిపించిందని, అది నచ్చలేదని రేవంత్‌కు స్టాంప్ గుద్దింది శ్రీసత్య. ఏం మార్పు, ఏమైనా లావయ్యానా? అని రేవంత్ సెటైర్ వేయగా ఈ వెటకారమే నచ్చలేదంది శ్రీసత్య. తర్వాత రేవంత్ వంతు రాగా.. ఎవరెంత అరుస్తారో అందరికీ తెలుసు, మీరు నాతో పోల్చుకోవడం నాకు నచ్చలేదు అంటూ శ్రీసత్యకు స్టాంప్ వేశాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు.. కెప్టెన్సీ టాస్క్‌లో అంత అన్యాయం చేసిన రేవంత్‌ను వదిలేసి రోహిత్.. ఇనయకు ఓటేయడమేంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ సగం తెలివితేటల వల్లే కెప్టెన్సీ పోగొట్టుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. అలాగే రేవంత్.. ఇన్నాళ్లకు సత్య నిజస్వరూపం తెలుసుకున్నాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అతడి ఫ్యాన్స్. మరి ఎవరు వరస్ట్ పర్ఫామర్‌గా ఎంపికై జైలుకెళ్లారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: చెత్త సంచాలక్, రోహిత్‌కు అన్యాయం -
రేవంత్ చెత్త సంచాలక్, రోహిత్‌కు తీవ్ర అన్యాయం
Bigg Boss Telugu 6, Episode 68: నిన్నటి ఎపిసోడ్లో కెప్టెన్సీ కంటెండర్‌గా తన స్థానంలో శ్రీసత్యను సెలక్ట్ చేశాడు శ్రీహాన్. హౌస్మేట్స్ అందరూ తనను టార్గెట్ చేయడంతో డీప్‌గా హర్టయ్యాడు రేవంత్. మరి ఈరోజు ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది? రేవంత్ తిరిగి నార్మల్ అయ్యాడా? అనేది చూద్దాం.. 'గేమ్‌లో ఫిజికల్ అవకముందే అయ్యానని అన్నారు. అంత కష్టపడి ఆడితే నాకు ప్రతిఫలం దక్కలేదు. అసలు ఈ హౌస్‌కు రాకుండా ఉండాల్సింది, ఓడిపోయాను' అని బాధపడ్డాడు రేవంత్. మెరీనా అతడిని ఓదారుస్తూ కంటనీరు తుడవగా.. కెప్టెన్సీలో సపోర్ట్ కావాలంటే నీకు, కీర్తికి సాయం చేస్తానని మాటిచ్చాడు రేవంత్. ఇక శ్రీసత్య తినడానికి పిలిస్తే కూడా తనకు ఒంటరిగా ఉండాలనుందని ఆమెను దూరం పెట్టాడు. అర్ధరాత్రి భార్య ఫొటో చూస్తూ ఆమెనే తలుచుకున్న రేవంత్ బిగ్‌బాస్ గెలిచే ఇంటికి వస్తానని మరోమారు గట్టిగా మనసులో అనుకున్నాడు. తర్వాతి రోజు కూడా రేవంత్ ముభావంగానే ఉన్నాడు. ఇంతలో బిగ్‌బాస్.. రేవంత్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి కెప్టెన్సీ టాస్క్ నిర్వహించమని చెప్పాడు. వస్తా నీ వెనుక అనే కెప్టెన్సీ టాస్క్‌లో శ్రీసత్య, ఫైమా, కీర్తి, ఆదిరెడ్డి, మెరీనా, రోహిత్ పోటీపడ్డారు. టాస్క్ మధ్యలో రకరకాల రూల్స్ పెట్టాడు రేవంత్. దీంతో శ్రీసత్య మధ్యలో నీకిష్టం వచ్చినట్లు ఎలా పెడతావని ఆగ్రహించింది. సంచాలక్‌గా నా ఇష్టం వచ్చిందే చేస్తానని తెగేసి చెప్పాడతడు. అతడు పెట్టిన నియమాల్లో బ్యాగు చేత్తో పట్టుకోవద్దని కూడా ఉంది. దీంతో రోహిత్ బ్యాగు చేత్తో పట్టుకోలేదు. కానీ ఆదిరెడ్డి మాత్రం చేత్తో అదిమి పట్టుకుంటున్నా సంచాలక్ నోరెత్తలేదు. పైగా రోహిత్ అవుట్ అని చెప్పడంతో అతడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. అక్కడ ఆది.. చేత్తో పట్టుకుంటే కనిపించడం లేదా? అని ప్రశ్నించాడు. తన గోనెసంచిని కాలితో తన్ని ఫ్రస్టేషన్ తీర్చుకున్నాడు. అన్‌ఫెయిర్ అంటూ రేవంత్ మీద మండిపడ్డాడు. దీంతో అతడు వెళ్లి ఎక్కడ తప్పు జరిగిందని ఆరా తీశాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చెత్త సంచాలక్‌గా వ్యవహరించడం వల్ల పోటీదారులు తికమకపడాల్సి వచ్చింది. ఫైనల్‌గా ఈ టాస్క్‌లో ఫైమా కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: బికినీలో నిహారిక, టాటూ ఫొటోలు వైరల్ -
Bigg Boss 6: కంట్రోల్ తప్పిన రోహిత్.. బ్యాగ్‌ని కాలితో తన్నుతూ.. ఫుల్ ఫైర్
బిగ్‌బాస్ హౌస్‌లో టాస్క్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా పదోవారం ఇంటి సభ్యులు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ మరింత వాడివేడిగా జరిగినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. కెప్టెన్సీ పోటీదారుల కోసం ఇచ్చిన ‘నాగమణి’టాస్క్‌లో విజయం సాధించిన పాముల టీమ్ సభ్యులు ఆదిరెడ్డి, రోహిత్, కీర్తిలతో పాటు శ్రీసత్య, మెరీనా కూడా ఈ వారం కెప్టెన్సీ పోటీలో నిలిచారు. వీరికి ‘వస్తా నీవెనుక’అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా థర్మాకోల్ బాల్స్ నిండి ఉన్న బ్యాగ్‌లను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఆదిరెడ్డి.. రోహిత్, మెరినాలను టార్గెట్ చేసినట్లు చేసింది. అందరికంటే ముందే మెరినా టాస్క్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక రోహిత్‌పై అటాక్‌కి వెళ్లిన ఆదిరెడ్డికి ఫైమా తోడైంది. ఇద్దరు కలిసి రోహిత్‌ని బ్యాగ్‌ను చించేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రోహిత్ సంచాలక్‌పై ఫైర్ అయ్యాడు. ఆదిరెడ్డి బ్యాగ్ పట్టుకుంటే ఏం అనలేదు కానీ.. నన్ను మాత్రం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాగ్‌ని కాలితో తన్నుతూ.. ‘నేను బ్యాగ్‌ని పట్టుకోలేదు’ అని గట్టిగా అరుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అయితే మెరినా మాత్రం రోహిత్‌ని కూల్ చేస్తూ..‘జనాలు చూస్తున్నారు’లే అని సర్థిచెప్పింది. అయినా రోహిత్ కోపం చల్లారలేదు. ఇక ఈ టాస్క్‌లో గెలిచి కెప్టెన్ అయిందెవరు అనేది నేటి ఎపిసోడ్లో తెలుస్తుంది. -
గీతక్క మాయలో ఆదిరెడ్డి, కొత్త కెప్టెన్ ఎవరంటే?
Bigg Boss 6 Telugu, Episode 61: బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం మిషన్ పాజిబుల్ అనే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతోంది. సీక్రెట్ మిషన్ టాస్క్‌లో భాగంగా రెడ్ టీమ్ కావాలనే బాత్రూమ్ను డర్చీగా మార్చింది. కానీ ఆ నిందను బ్లూ టీమ్ మేద వేయడంతో హౌస్‌లో రచ్చ రంబోలా జరిగింది. సీక్రెట్ గేమ్ సక్సెస్ కావడంతో బ్లూ టీమ్‌లో చనిపోయిన రోహిత్‌ను తిరిగి బతికించారు. మధ్యాహ్నం భోజనం సమయానికి సూర్య ప్లేటు కోసం ఇల్లంతా వెతికింది ఇనయ. ఎక్కడా కనిపించకపోవడంతో ప్లేటు మీద సూర్య పేరును ఎవరు చెరిపేశారు? అని నిలదీసింది. దీనికి బాలాదిత్య నువ్వు వాడుతున్నావనే చెరిపేశారని ఆన్సరిచ్చాడు. అది విన్న రేవంత్.. అలా అనడం తప్పంటూ అందుకున్నాడు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదు, సత్య ఏం అందో అదే చెప్పానని బదులిచ్చాడు. నా ఎమోషన్‌తో ఆడుకుంటున్నారని ఫైర్ అయిన ఇనయ అన్నం తిననంటూ ఓ మూలన కూర్చుని ఏడ్చింది. ఇది చూసిన శ్రీసత్య.. అంత ప్రేముంటే బిగ్‌బాస్‌ను అడిగి మిడ్ వీక్ ఎలిమినేషన్లో వెళ్లిపోయి సూర్య ఇంట్లో కూర్చోమను అని వెక్కిరించింది. ఇనయ అలిగి ఏడుస్తూ కూర్చోవడంతో కీర్తి ఓదార్చగా మెరీనా గోరు ముద్దలు తినిపించింది. తర్వాత గేమ్ తిరిగి ప్రారంభం కాగా రెడ్ స్క్వాడ్‌లో రేవంత్ కంటికి గాయం అయింది. ఇంతలో గీతూ అవుట్ అయింది. అనంతరం బిగ్‌బాస్ ఇచ్చిన రెండో మిషన్‌లో రెడ్ టీమ్ గెలవడంతో వారు రోహిత్‌ను తిరిగి చంపేశారు. ఇక ఈ రోజుకు టాస్క్ సమయం ముగిసిందన్నాడు బిగ్‌బాస్. అయితే రాత్రి టీ షర్ట్లు దొంగిలిద్దామని ప్లాన్ వేసింది గీతూ. కానీ ఆదిరెడ్డితో మాత్రం టాస్క్ ఆన్ అయ్యాకే తిరిగి గేమ్ స్టార్ట్ చేద్దామని మాయమాటలు చెప్పింది. అతడూ సరేనని నమ్మాడు. అలా అతడిని బురిడీ కొట్టించి అర్ధరాత్రి ఆది రెడ్డి టీషర్ట్ దొంగిలించింది గీతూ. తెల్లవారుజామున ఆదిరెడ్డికి గీతూ గేమ్ అర్థమైంది. గేమ్ పాజ్‌లో ఉన్నప్పుడు టీషర్ట్స్ స్ట్రాప్స్ తీసేయడం తప్పని వారించగా తానసలు తీయలేదని అబద్ధమాడింది గీతూ. గీతూ తీసిందని తేలితే ఇకపై గీతూ వర్సెస్ ఆదిరెడ్డి గేమ్ స్టార్ట్ అవుతుందని హెచ్చరించాడతడు. అయితే ఈ మిషన్ పాజిబుల్ గేమ్ డ్రా అయిందట. దీంతో రెండు టీమ్స్‌లోని మెరీనా, వాసంతి, ఇనయ, ఫైమా, సత్య, గీతూ కెప్టెన్సీ కోసం పోటీపడగా సత్య కెప్టెన్‌గా అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: బుజ్జమ్మ తన గర్ల్‌ఫ్రెండే కాదన్న సూర్య, ఇనయ లైన్ క్లియర్? -
వీడియోతో అడ్డంగా దొరికేసిన గీతూ, రోహిత్ కోసం ఆమె త్యాగం!
బిగ్‌బాస్ హౌస్‌లో అతడు ఇంకా ఎందుకున్నాడు? అన్న జనాల నోటితోనే ఇతడు హౌస్‌లో మరికొన్ని వారాలు ఉండాలి అనేలా చేశాడు రోహిత్. ఒక్క టాస్క్.. ఒకే ఒక్క టాస్క్‌తో తన గ్రాఫ పెంచుకున్నాడు. బ్యాటరీ రీచార్జ్ టాస్క్‌లో ఇంటిసభ్యులందరి కోసం రెండువారాలు నామినేషన్లో ఉండేందుకు సిద్ధపడ్డాడు. కానీ అతడు చేసిన త్యాగానికి హౌస్మేట్స్ ప్రతిఫలంగా వెన్నుపోటు పొడిచారు. ఫ్యామిలీతో మాట్లాడేందుకు వీలు లేకుండా ఒక్క ఫోన్ కాల్ కూడా తనను లిఫ్ట్ చేయనివ్వలేదు. అందుకు రోహిత్ మనసు చివుక్కుమంది. అయితే అతడి త్యాగాన్ని హోస్ట్ నాగార్జున గుర్తించాడు. రోహిత్ మీకోసం అంత పెద్ద త్యాగం చేస్తే మీరందరూ ఎంత స్వార్థం చూపించారని విమర్శించాడు. అతడి కోసం కచ్చితంగా ఎవరో ఒకరు ఏదైనా త్యాగానికి సిద్ధమవ్వాల్సిందేనని కరాఖండిగా తేల్చి చెప్పాడు. ఎవరు త్యాగం చేయాలో రోహిత్ డిసైడ్ చేస్తాడనడంతో అతడు వసంతిని ఎంచుకున్నాడు. బిగ్‌బాస్.. ఆమె జుట్టును భుజంపై వరకు కత్తిరించుకోవాలన్నాడు. తాజా ప్రోమోలో వసంతి అందుకు సిద్ధపడినట్లే కనిపిస్తోంది. మరోవైపు కెప్టెన్ రేవంత్ నిద్రపోయిన వీడియో, బాలాదిత్యకు.. గీతూ బిగ్‌బాస్‌తో మాట్లాడిన ముచ్చటంతా కళ్లకు కట్టినట్లు చూపించారు. మరి ఈ ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరగనుందో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: లుంగి డ్యాన్స్‌లో రెచ్చిపోయిన కీర్తి ఇనయనే వెనకాల తిరుగుతోంది: సూర్య గర్ల్‌ఫ్రెండ్ -
బిగ్‌బాస్: కర్వా చౌత్ సెలబ్రేట్ చేసుకున్న దంపతులు
Bigg Boss Telugu 6, Episode 41: బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం పోటీ నడుస్తోంది. ఈపాటికే కెప్టెన్సీ కంటెండర్ల పోటీ ముగిసింది. అయితే ఈ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో సుదీప బంతి తీసుకుని తన బాస్కెట్లో కాకుండా రోహిత్ బాస్కెట్లో వేసింది. దీంతో అతడు కెప్టెన్ బరిలో నిలిచాడు. తన గేమ్ తను ఆడకుండా వేరొకరికి ఎందుకు సపోర్ట్ చేయడమని ఫైమా, కీర్తి.. సుదీపపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో తన ఫ్రెండ్స్ అయిన ఇనయ, సూర్య తనకు సాయం చేసేందుకు ముందుకు రాలేదని బాధపడింది ఫైమా. అనంతరం రేవంత్, శ్రీసత్య, ఆదిరెడ్డి, రాజ్, అర్జున్, రోహిత్, సూర్య, వసంతిలకు బిగ్‌బాస్ 'ఆఖరి వరకు ఆగని పరుగు' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో పూలకుండీల మీద కంటెండర్ల ఫొటోలు అతికించి ఉంటాయి. బజర్ మోగినప్పుడు పోటీదారులు వారి పూలకుండీ కాకుండా ఇతరులది ఏదైనా పూలకుండీ తీసుకుని కంటెండర్ జోన్లోకి వెళ్లాలి. చివరగా కంటెండర్ జోన్లోకి వెళ్లిన పోటీదారుతోపాటు, అతడి చేతిలో ఏ సభ్యుడి పూలకుండీ ఉంటుందో.. ఆ ఇద్దరిలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించే బాధ్యత ఇంటిసభ్యులకు అప్పగించాడు బిగ్‌బాస్. మొదటి రౌండ్లో రాజ్ తన పూలకుండీ తానే తెచ్చుకోవడంతో పోటీలో అనర్హుడయ్యాడు. తర్వాత వసంతి, రేవంత్, అర్జున్, శ్రీసత్య, ఆది రెడ్డి వరుసగా గేమ్‌లో నుంచి వైదొలిగారు. చివరగా పోటీలో సూర్య, రోహిత్ మిగిలారు. మెజారిటీ ఇంటిసభ్యులతో పాటు మెరీనా కూడా సూర్యకే ఓటేసింది. చివరగా ఇనయకు ఓటేసే వంతు రాగా నా ఓటు అన్నయ్యకా? బావకా? అని మెలికలు తిరిగింది. అయినా అందరూ ఊహించినట్లుగానే సూర్యకే మద్దతిచ్చింది. ఫైనల్‌గా ఈ వారం సూర్య కెప్టెన్‌గా అవతరించాడు. అనంతరం రాత్రిపూట కర్వా చౌత్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు మెరీనా- రోహిత్. సాంప్రదాయ దుస్తులు ధరించిన మెరీనా జల్లెడలో చంద్రుడిని చూసి, ఆ వెంటనే తన భర్త రోహిత్‌ను చూసింది. అనంతరం భర్త పాదాలు తాకి అతడి ఆశీర్వాదం తీసుకుంది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఓ సాంగ్ ప్లే చేయడంతో ఇంటిసభ్యులంతా చిందులేశారు. చదవండి: కాంతార సెన్సేషన్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2లను దాటేసింది.. ఇంత ద్వేషం చూపిస్తూ అతడు చచ్చిపోతాడు: నటి -
దగా.. మోసం.. భర్తను కాదని సూర్యకు మెరీనా సపోర్ట్!
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఎలాగైనా కెప్టెన్‌గా నిలవాలని వాసంతి, రేవంత్, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్ పోటీపడుతున్నారు. అయితే కెప్టెన్ అవ్వాలంటే దానికి ఇంటిసభ్యుల మద్దతు తప్పనిసరి అని చెప్పాడు బిగ్‌బాస్. కానీ తనకెవరూ సపోర్ట్ చేయడం లేదని, గేమ్‌లో కార్నర్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది వాసంతి. తన స్నేహితులైన రేవంత్, శ్రీసత్యలు ఇద్దరూ తమకు ఓటేయమని నిల్చోగా.. శ్రీహాన్ శ్రీసత్యకు మద్దతు పలికాడు. ఏదో చిన్న కారణంతో తనకు సపోర్ట్ చేయలేదని గీతూ, బాలాదిత్యల మీద ఫైర్ అయింది శ్రీసత్య. చాలా చిన్న విషయం తీసుకువచ్చి నన్ను కెప్టెన్సీ కంటెండర్‌గా తీసేయడం సిల్లీగా ఉందని మండిపడింది. ఇక రోహిత్, సూర్య.. ఇద్దరిలో సూర్యకు సపోర్ట్ చేసింది మెరీనా. ఆఖరికి తన భార్య కూడా తనకు సపోర్ట్ చేయకపోవడంతో అవాక్కయ్యాడు రోహిత్. చదవండి: ఇంత ద్వేషమా? అతడు సూసైడ్ చేసుకుంటాడు: నటి ఒకే హోటల్లో సారా, శుభ్‌మన్ గిల్, వీడియో చూశారా? -
ఏం పీకలేనన్నారు, నేనేంటో చూపిస్తా.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ ఇచ్చిన బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ముగిసింది. ఈ టాస్క్‌లో రోహిత్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. హౌస్మేట్స్ కోసం రెండు వారాలు సెల్ఫ్ నామినేట్ అయిన రోహిత్‌కు కనీసం ఫోన్ మాట్లాడేందుకు ఛాన్సే ఇవ్వలేదు. తన త్యాగానికి తగిన గుర్తింపు దక్కలేదని రోహిత్ ఎమోషనలయ్యాడు. తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో గెలిచి రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. కానీ వీరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎన్నుకునే బాధ్యతను తిరిగి హౌస్మేట్స్ చేతిలో పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజైన ప్రోమోలో ఆఖరి వరకు ఆగని పరుగు అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా ఇతర పోటీదారుల పూలకుండీలను తీసుకుని చివరగా కంటెండర్స్ డోర్ జోన్లోకి వెళ్లిన పోటీదారు, వారి దగ్గర ఎవరి పూలకుండీ ఉందో ఆ సభ్యుడు.. ఈ ఇద్దరిలో ఎవరు కెప్టెన్ అవ్వకూడదో మిగతా ఇంటిసభ్యులు నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఆదిరెడ్డి, వాసంతి నిలబడగా.. నామినేషన్‌కు భయపడినవాళ్లు వీక్ అంటూ వాసంతిని ఏకిపారేసింది గీతూ. నా కెప్టెన్సీలో ఏం పీకలేనన్నారు. ఇప్పుడు కెప్టెన్ అయితే ఏంటో చూపిస్తానన్నాడు ఆది. ఇక శ్రీసత్య తనకు రెండో లేడీ కెప్టెన్ అవ్వాలని ఉందంటూ రోహిత్‌కు కాకుండా తనకు ఓటేయమని అడిగింది. ఫైనల్‌గా ఈ టాస్క్‌లో సూర్య కెప్టెన్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. సెల్ఫ్ నామినేట్ అయిన రోహిత్ ఒకవేళ కెప్టెన్ అయినా అతడికి ఇమ్యూనిటీ దక్కదన్న కారణంతో ఇంటిసభ్యులు సూర్యకు సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! చదవండి: హౌస్మేట్స్ కోసం రోహిత్ త్యాగం పూనమ్ కౌర్‌కు పెళ్లయిందా? -
హౌస్మేట్స్ కోసం త్యాగం, చివరకు బకరా అయిన రోహిత్!
Bigg Boss Telugu 6, Episode 40: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో ప్రస్తుతం బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీహాన్, శ్రీసత్య, సుదీప, బాలాదిత్య, ఇనయ, అర్జున్, ఆది రెడ్డి, గీతూలకు సర్ప్రైజ్లు అందాయి. వారు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి ఇంటిసభ్యులతో ఆడియో కాల్, వీడియో కాల్, ఫొటో ఫ్రేమ్, ఫుడ్ అందుకున్నారు. మిగిలిన హౌస్మేట్స్ నేడు వారి ఫ్యామిలీతో మాట్లాడారు. మరి ఎవరికి ఎలాంటి సర్ప్రైజ్లు అందాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి.. ఇనయ- సూర్యలు ఒకరికొకరు ఫెవికాల్లా అతుక్కుపోయారు. ఇప్పటిదాకా ఒకరికొకరు గోరుముద్దలు పెట్టుకున్న ఈ ఇద్దరు పొద్దుపొద్దున్నే ఒకరి లాలీపాప్‌ను మరొకరు చప్పరించారు. ఇనయ లాలీపాప్ తింటూ దాన్ని సూర్యతో షేర్ చేసుకుంది. అతడు కూడా వద్దనుకుండా దాన్ని నోట్లో పెట్టుకోవడం గమనార్హం. అటు బాలాదిత్య సిగరెట్లు లేక అల్లాడిపోయాడు. పొద్దునకల్లా తిరిగి పంపించేస్తాను ఒక్కసారి సిగరెట్లు ఇవ్వండి బిగ్‌బాస్ అని కెమెరాల దగ్గర మొత్తుకున్నాడు. కానీ బిగ్‌బాస్ ఏడిపించే రకమే కానీ కరుణించే రకం కాదు కదా! మరోవైపు అన్నం సరిపోవట్లేదు కొంచెం ఎక్కువ వండమని ఆదిరెడ్డి కెప్టెన్‌ను అడిగాడు. దానికతడు రైస్ వేస్ట్ కాకూడదు అంటూ కస్సుబుస్సులాడాడు. నీ కెప్టెన్సీలో అన్నం లేక ఇబ్బందిపడటం మీకు ఇష్టమా? అని ఆదిరెడ్డి ప్రశ్నించగా మీరు ఇబ్బందిపడ్డారా? అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడాడు రేవంత్. రైస్ ఎక్కువ ఉంది కాబట్టే అడిగానని ఆదిరెడ్డి చెప్తున్నా అతడు వినిపించుకోలేదు. ఇంతలో టెలిఫోన్ బూత్‌కు బిగ్‌బాస్ కాల్ చేశాడు. రోహిత్, వాసంతిలలో ఎవరైనా ఒకరు రెండు వారాలు స్వతాహాగా నామినేట్ అయితే బ్యాటరీ ఫుల్‌గా రీచార్జ్ అవుతుందన్నాడు. ఇంటిసభ్యుల కోసం తాను నామినేట్ అవడానికి సిద్ధమని రోహిత్ వెల్లడించడంతో బ్యాటరీ వంద శాతం రీచార్జ్ అయింది. కాకపోతే ఈసారి బిగ్‌బాస్ పిలవడం కాకుండా ఫోన్ రింగ్ అయినప్పుడు ఎవరు ముందుగా లిఫ్ట్ చేస్తే వారికే సర్ప్రైజ్ ఉంటుందన్నాడు. మొదటగా రేవంత్ కాల్ లిఫ్ట్ చేశాడు. అతడు 10 శాతం రీచార్జ్ వినియోగిస్తూ భార్య ఫొటో సెలక్ట్ చేసుకున్నాడు. ఫైమా 25 శాతం రీచార్జ్ ఉపయోగించి అమ్మతో వీడియో కాల్ మాట్లాడింది. కీర్తి.. 15 శాతం ఉన్న మానస్ ఆడియో మెసేజ్ విని సంతోషపడింది. సూర్య.. 20 శాతం ఉన్న అమ్మ లేఖ అందుకుని చదివి మురిసిపోయాడు. వాసంతి.. 15 శాతం రీచార్జ్ ఉన్న అక్క కూతురి ఫొటో తీసుకుంది. రాజ్.. 15 శాతం రీచార్జ్ వినియోగిస్తూ అమ్మతో ఆడియో కాల్ తీసుకున్నాడు. రోహిత్, మెరీనాలకు అవకాశం రాకుండానే బ్యాటరీ రీచార్జ్ మొత్తం అయిపోయింది. నిజానికి రోహిత్ వల్లే బ్యాటరీ రీచార్జ్ అయినా అతడికి, మెరీనాకు మాత్రం ఫ్యామిలీతో మాట్లాడేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. అనంతరం కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా బంతిని వారి బాస్కెట్లో వేయాల్సి ఉంటుంది. ఈ గేమ్‌లో కిందామీదా పడ్డ హౌస్‌మేట్స్‌కు స్వల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పట్టు విడవకుండా గేమ్ ఆడి రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, శ్రీసత్య, రాజ్, అర్జున్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. చదవండి: శ్రీసత్య కన్నింగ్, వాసంతి ఎడ్డిది: స్రవంతి సినిమా ఛాన్స్ పేరుతో నన్ను ఇంటికి పిలిచి... బిగ్‌బాస్ కంటెస్టెంట్ బండారం బయటపెట్టిన నటి -
ఆ ఇద్దరికీ దక్కని సర్ప్రైజ్.. హౌస్‌మేట్స్‌కు గాయాలు
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం రేవంత్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. హౌస్‌లో తను బెస్ట్ కెప్టెన్ అనిపించుకుంటానన్న రేవంత్ ఆ మాట నిలబెట్టుకునేట్లు కనిపించడం లేదు. బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తున్న సమయంలో ఇంటి నియమాలు ఎవరు పాటించకపోయినా బ్యాటరీ తగ్గుతుందని బిగ్‌బాస్ నొక్కి మరీ చెప్పాడు. అందరూ బిగ్‌బాస్ నియమాలు సరిగ్గా పాటించేలా చేయాల్సిన కెప్టెన్ రేవంతే ఆదమరిచి నిద్రపోయి రెండుసార్లు బ్యాటరీ తగ్గేందుకు కారణమయ్యాడు. దీంతో అతడికి నామినేషన్స్‌లో గట్టిగానే ఓట్లు పడేట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే టాస్క్ చివర్లో రాజ్ మొత్తం బ్యాటరీని వాడుకోవడంతో మెరీనా-రోహిత్‌లకు తమ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ అందకుండా పోయినట్లు తెలుస్తోంది.. కాగా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ వారం బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో హౌస్‌మేట్స్‌కు గాయాలైనట్లు కనిపిస్తోంది. టాస్క్‌లో భాగంగా బంతిని దక్కించుకునే క్రమంలో ఇంటిసభ్యులు గాయపడినట్లున్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం.. ఆది, వాసంతి, సూర్య, అర్జున్, రోహిత్, రేవంత్, సత్య, రాజ్ కెప్టెన్సీకోసం పోటీపడనున్నారట. మరి వీరిలో ఎవరు గెలిచి కెప్టెన్ అవుతారో చూడాలి! చదవండి: త్యాగానికి సిద్ధమైన రోహిత్, వాసంతి బతికిపోయిందిగా! సినిమా ఛాన్స్.. ఇంటికి పిలిచి..: నటి -
తన గొయ్యి తనే తీసుకున్న రోహిత్, తప్పించుకున్న వాసంతి!
బిగ్‌బాస్ షో మొదలై 50 రోజులైనా కాలేదు, అప్పుడే కంటెస్టెంట్లను సర్ప్రైజ్లతో ముంచెత్తుతున్నాడు బిగ్‌బాస్. బ్యాటరీ రీచార్జ్ టాస్క్ ద్వారా హౌస్‌మేట్స్‌కు వారి ఇంటిసభ్యుల నుంచి ఆడియో కాల్, వీడియో మెసేజ్, ఫొటో ఫ్రేమ్, బిర్యానీ.. ఇలా తమకు నచ్చిన ఆప్షన్లను సెలక్ట్ చేసుకునే అవకాశం కల్పించాడు. అయితే ఇందుకోసం ఇంటిసభ్యుల నుంచి కొన్ని త్యాగాలను ఆశిస్తున్నాడు. ఈ క్రమంలో బాలాదిత్య సిగరెట్లు మానేయగా ఫైమా అతి కష్టం మీద ఇంగ్లీష్‌లో సినిమా కథలను వివరించింది. తాజాగా బిగ్‌బాస్ వీటన్నిటికంటే క్లిష్టమైన త్యాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. వాసంతి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరు రెండు వారాలపాటు స్వతాహాగా నామినేట్ కావాలని ఆదేశించాడు. దీంతో రోహిత్ తాను నామినేట్ అవడానికి సిద్ధమని వెల్లడించాడు. ఇక్కడ బిగ్‌బాస్.. కంటెంట్ ఇవ్వని రోహిత్, వాసంతిలలో ఒకరిని బయటకు పంపించేందుకే వారిద్దరి పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గేమ్ ఆడట్లేదు, ఎంటర్టైన్ కూడా చేయట్లేదు.. ఇప్పుడు రోహిత్ సెల్ఫ్ నామినేట్ కావడంతో అతడు త్వరలోనే ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే తాజాగా రిలీజైన ప్రోమోలో రేవంత్‌కు ఫొటో ఫ్రేమ్, కీర్తికి మానస్ ఆడియో మెసేజ్, ఫైమాకు వీడియో కాల్ వచ్చినట్లు చూపించారు. మరి ఈ సర్ప్రైజ్లతో బూస్ట్ అందుకున్న హౌస్మేట్స్ ఇకనైనా గేమ్‌లో తమ ప్రతాపం చూపిస్తారా? లేదా? అనేది చూడాలి! చదవండి: విన్నర్ అయిపోతానన్న గీతూ, అంతొద్దు.. కేవలం టాప్ 5లోనే ఉంటావన్న తండ్రి -
వాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఎందుకుంటున్నారో తెలీట్లేదు: స్పై అక్క
ప్రతి బిగ్‌బాస్ సీజన్లో ఎంటర్టైన్మెంట్, టాస్కులు అంటూ వాటి వెనక పరుగులు తీస్తుంటారు కంటెస్టెంట్లు. కానీ ఈ సీజన్లో మాత్రం అదిగో కెమెరా, ఇదిగో కంటెంట్ అంటూ కాస్త అతి చేస్తున్నారు. ఆరో సీజన్ మొదలై ఐదు వారాలు పూర్తవుతున్నా ఇప్పటికీ కొందరు పూర్తిగా గేమ్‌లో దిగనేలేదు. అదేమంటే బిగ్‌బాస్ అంటే గేమ్ ఒక్కటే కాదని పాఠాలు వల్లిస్తున్నారు. అందులో రోహిత్, మెరీనా జంట కూడా ఉంది. కిచెన్‌లో ఎంతో కష్టపడే మెరీనా తన మంచితనంతోనే హౌస్‌లో నెట్టుకొస్తోంది. కానీ అదొక్కటే ఉంటే సరిపోదు కదా! అన్నింట్లోనూ ఉండాలి. బిగ్‌బాస్ షోపై రివ్యూలు ఇచ్చే స్పై అక్క కూడా ఇదే అంటోంది. మెరీనా- రోహిత్ ఎందుకుంటున్నారో తెలియడం లేదని వారి గాలి తీసేసింది. ఈ మేరకు బిగ్‌బాస్ కెఫెలో అరియానా గ్లోరీ కాలిఫోర్నియాలో ఉంటున్న స్పై అక్కతో వీడియో కాల్లో మాట్లాడింది. ఫెమినిస్ట్ పదానికి గొప్ప అర్థం తెచ్చిన మహానుభావుడు సూర్య.. అంటూ అతడిపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చాలామంది సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మెరీనా- రోహిత్ అసలు గేమే ఆడటం లేదు. గీతూ 24 గంటలు కంటెంట్ అంటూ కెమెరాలు ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఉంటుంది. తనే కాదు, అందరూ కంటెంట్ వెనకాల పరిగెడుతుంటే రేవంత్ వెనక కంటెంట్ పరిగెడుతోంది. బాలాదిత్య నా అంచనాలను తారుమారు చేస్తున్నాడు అంటూ ఈ సీజన్‌పై రివ్యూ ఇచ్చింది. చదవండి: బ్యాటరీ రీచార్జ్ టాస్క్.. ఏడ్చేసిన శ్రీహాన్, శ్రీసత్య చెల్లో షో బాలనటుడు మృతి -
నీవల్లే చంటి వెళ్లిపోయాడు.. నామినేషన్లో ఒకటే గుద్దుడు!
Bigg Boss 6 Telugu, Episode 37: మండే వచ్చిందంటే చాలు బయట వాతావరణం కూల్‌గా ఉన్నా బిగ్‌బాస్ హౌస్‌లో మాత్రం హీట్ ఓ రేంజ్లో ఉంటుంది. వారంలో ఎన్నడూ నోరు మెదపని కంటెస్టెంట్ కూడా నామినేషన్స్‌లో గొంతు విప్పాల్సిందే! అవసరమైతే పోట్లాటకు, కుదిరితే కొట్లాటకు సైతం రెడీగా ఉండాల్సిందే! ఆ లెవల్లో ఉంటాయి బిగ్‌బాస్ నామినేషన్స్. మరి ఈ ఆరోవారం నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే ఈ హైలైట్స్ చదివేయండి. మొన్నటిదాకా శ్రీసత్య- అర్జున్, సూర్య-ఆరోహిలను జంటలుగా చూపించారు. అయితే శ్రీసత్య తనకు ఇంట్రస్ట్ లేదని, ఎంత ట్రై చసినా వేస్ట్ అని చెప్పేయడంతో వారి ప్రేమ కహానీ అక్కడే ఆగిపోయింది. అటు ఆరోహి ఎలిమినేట్ అవడంతో ఇనయ వెంటపడ్డాడు సూర్య. ప్రస్తుతానికి హౌస్‌లో వీరేదో ప్రేమపక్షులు అన్నంత రేంజ్లో పర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఇదిలా పక్కన పెడితే ఆటకు కాకుండా అందానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే వాసంతి అంటే రేవంత్‌కు ఇంట్రస్ట్ ఉందంటూ ఆదిరెడ్డి చెవులు కొరికింది గీతూ. దీనికి అర్జున్ కూడా అవునంటూ వంత పాడాడు. అతడు వేరేవాళ్లను లింక్ చేస్తే జోక్.. మనం చేస్తే మాత్రం సీరియస్ అవుతాడని చిటపటలాడాడు. తర్వాత బిగ్‌బాస్.. ఇద్దరు ఇంటిసభ్యుల ముఖంపై ఫోమ్ పూసి నామినేషన్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించాడు. మొదటగా కెప్టెన్ రేవంత్.. బాలాదిత్య, సుదీపలను నామినేట్ చేశాడు. ఆదిరెడ్డి మాట్లాడుతూ.. హౌస్‌లో గేమ్ ఆడుతూ ఉండాలే తప్ప మంచితనంతో ఉండొద్దంటూ మెరీనాను నామినేట్ చేశాడు. ఓవర్ థింకింగ్ అంటూ కీర్తికి ఫోమ్ పూశాడు. మెరీనా నామినేట్ చేసేటప్పుడు ఆది హైపర్ అయిపోయాడు. ఈ క్రమంలో రోహిత్, ఆది కొట్టుకునేదాకా వెళ్లారు. కీర్తి.. గీతూ, సత్యలను; రోహిత్.. శ్రీహాన్, ఆదిని; సుదీప.. ఆది, కీర్తిలను; వాసంతి.. గీతూ, ఆదిలను; శ్రీహాన్.. గీతూ, రాజ్‌లను; బాలాదిత్య.. గీతూ, రాజ్‌లను; అర్జున్.. కీర్తిని, ఆదిని; సూర్య.. గీతూ, ఆదిని; ఫైమా.. సుదీప, బాలాదిత్యను; ఇనయ.. శ్రీహాన్, కీర్తి; రాజ్.. గీతూ, బాలాదిత్యను; మెరీనా.. కీర్తి, ఆది రెడ్డిని నామినేట్ చేశారు. రాజ్ తనను నామినేట్ చేయడం సహించలేకపోయిన గీతూ తన వంతు వచ్చేసరికి చెలరేగిపోయింది. 'నన్ను తుప్పాస్ రీజన్స్‌తో నామినేట్ చేశావు. నువ్వు ఈ హౌస్‌లో అందరికంటే వీక్, ఒక్క శాతం ఎంటర్టైన్మెంట్ చేయలేదు అంటూ రాజ్‌ను ఏకిపారేసింది. అతడితో పాటు కీర్తిని నామినేట్ చేసింది. శ్రీసత్య మాట్లాడుతూ.. బూతులు మాట్లాడావంటూ కీర్తిని, ఎంటర్టైన్మెంట్ తక్కువైందని ఆదిని నామినేట్ చేసింది. నీ వల్లే చంటి బయటకు వెళ్లాడని కీర్తికి ఎక్కువ నామినేషన్ ఓట్లు పడటం గమనార్హం. ఫైనల్‌గా ఈ వారం కీర్తి, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, రాజ్, శ్రీసత్య, మెరీనా నామినేట్ అయ్యారు. చదవండి: ఆ హగ్గులేంది? రాత్రిపూట ఆ రచ్చేంది? గీతూకే అంతుంటే నాకెంతుండాలి? -
నామినేషన్స్ హీట్: ఆదిరెడ్డితో గొడవకు దిగిన రోహిత్
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ ప్రారంభమై ఐదు వారాలు కావస్తున్నా కొందరి ఆటతీరు మాత్రం ఇప్పటికీ బయటపడటం లేదు. అసలు వాళ్లు ఎందుకు ఉన్నారో కూడా అర్థం కావడం లేదు. ఆ జాబితాలో రోహిత్- మెరీనా జంట ఉంది. తామేంటో నిరూపించుకునే అవకాశం రావడం లేదో మరి అవకాశాలు వచ్చినా ప్రూవ్ చేసుకోవడం లేదో కానీ ఇన్నివారాల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇచ్చిందే లేదు. ఎంటర్టైన్మెంట్ టాస్కుల్లో, కొట్లాటల దగ్గరా ఎక్కడా పెద్దగా కనిపించలేదు. అయితే విచిత్రంగా ఈరోజు నామినేషన్స్‌లో రోహిత్‌కు కోపమొచ్చింది. ప్రతిదానికీ రివ్యూ ఇచ్చే ఆదిరెడ్డితో గొడవపడ్డాడు. కళ్లు పెద్దవి చేస్తూ అతడి మీదమీదకు వెళ్లాడు. అటు సూర్యకు, గీతూకు.. ఇటు కీర్తి, ఇనయకు మధ్య కూడా పెద్ద వాగ్వాదమే జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ గొడవల్లో ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! చదవండి: బిగ్‌బాస్: నామినేషన్స్‌లో తొమ్మిది మంది ఈ దీపావళికి సందడి చేసే చిత్రాలివే! -
Bigg Boss 6: కెమెరా ముందు రోహిత్, మెరీనా రొమాన్స్.. ‘చూసింది చాల్లే పో’
Bigg Boss6 Telugu Episode 10: నామినేషన్లో చేసిన ఆరోపణలపై ఇంటి సభ్యులంతా వివరణ ఇచ్చుకున్నారు. అర్జున్ కల్యాణ్ వచ్చి శ్రీసత్యతో రేవంత్ చేసిన కామెడీపై చర్చించారు. అమ్మాయిలతో అలా ముడిపెట్టి కామెంట్ చేయడం నచ్చలేదని, అందుకే రేవంత్‌ని నామినేట్ చేశానని కల్యాణ్ చెప్పాడు. ఇక గీతూ, ఆదిరెడ్డిలు గేమ్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నారు. ‘నామినేషన్స్ తర్వాత సేవ్ అవ్వడానికి ట్రై చేయడం కన్నా..నామినేషన్స్‌లో ఉన్నప్పుడే నిన్ను నువ్వు సేవ్ చేసుకోచ్చు తెలుసా? అంటూ ఆదిరెడ్డికి ఉచిత సలహా ఇచ్చింది గీతూ. నామినేషన్స్‌లో నీకంటే వీక్‌గా ఉన్న కంటెస్టెంట్స్‌ని నామినేట్ చేస్తే.. వాళ్లు బయటకు వెళ్లే చాన్స్ ఉంటుందని గీతూ చెప్పుకొచ్చింది. రాజశేఖర్, ఇనయా సుల్తానా లాంటి వాళ్లను నామినేట్ చేస్తే మనం సేవ్ అవుతామని చెప్పింది. అయితే ఆదిరెడ్డి మాత్రం అన్నం తింటూ... గీతూ చెప్పింది విని వినట్టుగా ‘ఊ’కొట్టాడు అంతే. మరోవైపు బాలాదిత్య .. రేవంత్‌కి క్లాస్ తీసుకున్నాడు. నామినేషన్లో హైపర్ అవుతున్నామని, అది తగ్గించుకోవాలని చెప్పాడు. ‘ఒక మనిషి నీతో మాట్లాడడానికి సంకోచించాడు అంటే.. నీ సైడ్ నుంచి ఎక్కడో చిన్న పొరపాటు ఉన్నట్లే కదా? ఒకరిద్దరు చెప్తే వాళ్లది తప్పు కావొచ్చు, కానీ ఐదారుగురు చెప్పారంటే నీ సైడ్ తప్పు ఉండే అవకాశం ఉంది కదా? ఇప్పటికీ మించి పోయిందేమి లేదు. నువ్వు చర్చించినకొద్ది ఇంకా హైపర్ అయిపోతున్నావ్, కోపం వచ్చేస్తుంది.. అందుకే ఎక్కువగా చర్చించకు’అని రేవంత్‌కు హితబోధ చేశాడు బాలాదిత్య. ఇక ఆర్జే సూర్య, ఆరోహి..బాలాదిత్య గురించి మాట్లాడుకున్నారు. పట్టుకుందాం అంటే ఒక్క పాయింట్లో కూడా దొరకడం లేదని ఆరోహి అంటే.. దొరుకుతాడు దొరుకుతాడు అని సూర్య అన్నాడు. ఆదిరెడ్డి నామినేషన్స్‌లో నీకు సాలిడ్ కౌంటర్ ఇచ్చాడని ఆరోహితో చెప్పాడు సూర్య. దానికి ఆరోహి అవును. నేను కూడా ఏం మాట్లాడలేకపోయానని చెప్పింది. ‘ఈ హౌస్‌లో మనిద్దరమే ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి.. మనం కలసి ఆడుతున్నామనే మాట వస్తుంది. దానికి కూడా రెడీ అయ్యిండాలి’ అని ఆరోహితో చెప్పాడు ఆర్జే సూర్య. ఇక ఉదయాన్నే ముద్దులతో హల్చల్ చేసింది రోహిత్ మెరీనా జంట. బెడ్రూంలో ఇద్దరు హద్దులు మీరి ముద్దులు పెట్టుకున్నారు. కెమెరా ఉందని తెలిసినా.. కావాలనే కంటెంట్ కోసం వాళ్లు రొమాన్స్ చేశారు. పక్కనే ఉన్న నేహ చౌదరిని ‘చూసింది చాల్లే.. మేము రొమాన్స్ చేసుకోవాలి.. నువ్ వెళ్లిరా’అని మెరీనా అనడంతో.. నాక్కుడా వెంటనే పెళ్లి చేసుకోవాలని ఉంది అని అనేసింది నేహా. ఇక శ్రీ సత్య అయితే అందరితో కూర్చుని తినడం తన వల్ల కాదని.. నాకు నచ్చింది చేయడానికి ఇక్కడకు వచ్చాను తప్పితే.. అందరికీ నచ్చింది చేయడానికి రాలేదని చెప్పింది. ఆ తరువాత రెండోవారం కెప్టెన్సీ టాస్క్ ప్రారంభం అయ్యింది. దాని పేరే సిసింద్రీ. ఈ టాస్క్‌లో భాగంగా ప్రతి ఇంటి సభ్యులకు ఒక బేబీ బొమ్మను ఇస్తారు. ఇంటి సభ్యులందరూ తమ బేబీ బాగోగులు చూసుకుంటూ టాస్క్‌లో సమయానుసారం బిగ్‌బాస్ ఇచ్చే చాలెంజెస్లలో పాల్గొనాలి. బజర్ మోగినప్పుడల్లా ఏ ఐదుగురు సభ్యులైతే ముందుగా వారి బేబీస్‌ని గార్డెన్ ఏరియాలో ఉన్న చైర్లో ఉంచుతారో వారు మాత్రమే బిగ్‌బాస్ ఇచ్చే చాలెంజెస్‌లో పాల్గొనాలి. ప్రతి చాలెంజ్‌లో గెలిసిన సభ్యలు కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. టాస్క్ సమయంలో బేబీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. ఆ సమయంలో బేబీస్ మీ దగ్గర కాకుండా.. లాస్ట్ అండ్ పౌండ్ ఏరియాలో లభిస్తే కెప్టెన్సీ పోటీదారులు అయ్యే అవకాశాన్ని కోల్పోతారు. ఏ ఇంటి సభ్యులైనా బేబీని ఇంట్లో ఒంటరిగా వదిలేస్తే.. వారిని కెప్టెన్సీ పోటీదారుల నుంచి తప్పించడానికి మిగతా సభ్యులు ఆ బేబీని లాస్ట్ అండ్ పౌండ్ ఏరియాలో పెట్టవచ్చు’అని బిగ్‌బాస్ చెప్పాడు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన మొదటి చాలెంజెస్‌లో ఆరోహి, చంటి, రేవంత్, ఫైమా, గీతూ పాల్గొనగా.. చంటి విజయం సాధించాడు. -
ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్, ఒక్కరు కాదు ఇద్దరు ఎలిమినేట్ అవుతారట!
ఏదైనా కొత్తదనం చూపించాలనుకున్నాడో మరేంటో కానీ బిగ్‌బాస్ ఈసారి నామినేషన్స్‌ను ఏకంగా సోమవారం నుంచి బుధవారానికి మార్చేశాడు. మరి ఈ మూడు రోజుల్లో కంటెస్టెంట్లకు ఏమాత్రం ఓట్లు పడతాయో తెలీదు కానీ కచ్చితంగా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యేట్లు కనిపిస్తోంది. ఇంతకీ లేడీ కంటెస్టెంటే ఎందుకు ఎలిమినేట్ అవుతుంది? అసలు ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరున్నారు? అనేది బిగ్‌బాస్ ఆరో సీజన్‌లోని నాలుగో ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేయండి.. బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు ఇచ్చిన క్లాస్.. మాస్.. ట్రాష్ నిన్నటితోనే ముగిసింది. ట్రాష్‌లో ఉన్న ఆదిత్య, ఇనయ, అభినయ శ్రీ నేరుగా నామినేట్ అయ్యారు. క్లాస్ టీమ్‌లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా ఈవారం నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. మాస్ టీమ్‌లో ఉన్న మిగతా సభ్యులు నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. అయితే ఇక్కడే బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. జంటగా అడుగుపెట్టిన మెరీనా-రోహిత్ జంటగానే నామినేషన్లోకి వెళ్తారని, ఒకవేళ ఎలిమినేట్ అయినా ఇద్దరూ కలిసే బయటకు వెళ్తారని స్పష్టం చేశాడు. గతంలో వరుణ్-వితిక దంపతులు హౌస్‌లో అడుగుపెట్టినా ఎవరి ఆట వారే ఆడుకున్నారు, ఎవరి నామినేషన్ వారే చేసుకున్నారు. బయటకు వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు విడివిడిగానే వెళ్లిపోయారు. మరి ఈసారి ఎంట్రీ ఇచ్చిన కపుల్‌కు బిగ్‌బాస్ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడంటే ఈ సీజన్లో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఉండేట్లు కనిపిస్తోంది. ఇకపోతే బిగ్‌బాస్ షోలో మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. వేస్ట్ కంటెస్టెంట్లు అనుకునేవాళ్ల పేర్లను పేపర్‌పై స్టాంప్ చేసి, దాన్ని ఫ్లష్ చేయాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా రేవంత్ మాట్లాడుతూ.. పని చేయడానికి ముందుకు రావట్లేదంటూ ఫైమా, ఆరోహి రావులను నామినేట్ చేశాడు. తాను నిద్రపోయినప్పుడు కిచకిచమంటూ సూర్యతో ముచ్చట్లు పెడుతూ తన నిద్ర డిస్టర్బ్ చేసిందని ఆరోహిపై ఆరోపణలు గుప్పించాడు. దీనికి ఆ యాంకర్ స్పందిస్తూ.. ఆరోజు మీ నిద్ర డిస్టర్బ్ చేసినందుకు మీదగ్గరకు వచ్చి సారీ కూడా చెప్పానని, అనవసరంగా నన్ను బద్నాం చేయకండి అని గట్టిగానే కౌంటరిచ్చింది. కీర్తి భట్ మాట్లాడుతూ.. తనకు, శ్రీహాన్‌కు మధ్య ఉన్న బంధంపై రేవంత్ జోక్ చేశాడని, దీంతో శ్రీహాన్‌ను చోటు భయ్యా అని పిలవాల్సి వచ్చిందని చెప్పింది. తనలా చేయడం వల్ల శ్రీహాన్ సరిగా మాట్లాడటమే మానేశాడని వాపోయింది. మరోవైపు పనుల్లో ఇన్వాల్వ్మెంట్ లేదని చంటిని నామినేట్ చేసింది. తర్వాత ఆరోహి వంతు రాగా అత్యుత్సాహంతో మీకు తెలీకుండానే అందరినీ హర్ట్ చేస్తున్నావంటూ రేవంత్‌ను, నేను ప్రేమగా శ్రీసత్య అని చాలాసార్లు పిలిచాను, కానీ నువ్వు ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదంటూ శ్రీసత్యను నామినేట్ చేసింది. శ్రీసత్య వంతు వచ్చేసరికి.. నా లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల మనుషులతో మాట్లాడటం మానేశా. అందులోనూ కొత్తవాళ్లతో మాట్లాడటానికి టైం పడుతుంది. ముఖ్యంగా తనకు యాటిట్యూడ్ లేదని స్పష్టం చేస్తూ వాసంతి, రాజశేఖర్‌ను నామినేట్ చేసింది. అనంతరం సుదీప.. రేవంత్, చంటిని; ఫైమా.. రేవంత్, అర్జున్‌లను; అర్జున్.. ఫైమా, ఆరోహిలను; రాజశేఖర్.. వాసంతి, శ్రీ సత్యలను; షాని.. శ్రీసత్య, చంటిని; శ్రీహాన్.. రేవంత్, కీర్తిని; సూర్య.. రేవంత్, చంటిని; చంటి.. రేవంత్, సుదీపను; వాసంతి.. రేవంత్‌ను, యాటిట్యూడ్ చూపిస్తుందని శ్రీ సత్యను నామినేట్ చేసింది. మెరీనా- రోహిత్ దంపతులు.. ఫైమా, చంటిని నామినేట్ చేశారు. అనంతరం మెరీనా మాట్లాడుతూ.. నేను కిచెన్‌లో వంట చేస్తున్నప్పుడు ఆరోహి.. నేను మెరీనా కన్నా తక్కువ సైజ్ అని ఎవరితోనో చెప్పింది. నాకు బాడీ షేమింగ్ నచ్చదంటూ ఎమోషనలైంది. అయితే అసలు తను ఆ మాట అనలేదని ఆరోహి బలంగా చెప్పినప్పటికీ మెరీనా వినిపించుకోలేదు. నామినేషన్ ప్రక్రియ ముగిసేసరికి అందరికన్నా అత్యధికంగా రేవంత్‌కు 8 ఓట్లు పడటం గమనార్హం. నామినేషన్స్ తంతు ముగిసిందనుకునే సమయానికి చివర్లో బిగ్‌బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ట్రాష్లోని సభ్యులొకరు మాస్ టీమ్ మెంబర్‌తో స్వాప్ అవ్వొచ్చని చెప్పాడు. దీంతో బాలాదిత్యను సేఫ్ చేసి ఆ స్థానంలోకి ఆరోహిని పంపించారు. ఫైనల్‌గా మొదటి వారం రేవంత్, చంటి, శ్రీసత్య, ఫైమా, ఇనయ, ఆరోహి, అభినయశ్రీ ఇంటినుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. చదవండి: బిగ్‌బాస్‌కు వెళ్తానంటే ఆ కామెడీ షో వాళ్లు ఒప్పుకోలేదు -
బిగ్‌బాస్ హౌస్‌లో భార్యభర్తల కొట్లాట.. వీళ్లేం రొమాంటిక్ కపుల్ రా బాబూ!
బిగ్‌బాస్ హౌస్‌లోకి క్యూట్ కపుల్‌గా ఎంట్రీ ఇచ్చారు మెరీనా అండ్ రోహిత్. అంతకు ముందు సీజన్ 3లో హీరో రో వరుణ్ సందేశ్, వితికలు భార్యభర్తలుగా హౌస్‌లోకి వచ్చారు. కొన్ని విషయాల్లో వారిద్దరే గొడవపడేవారు. అయితే తొలి రెండు వారాలు మాత్రం ఇద్దరు చాలా క్లోజ్‌గా ఉంటూ కపుల్ అంటే ఇలా ఉండాలి అనేలా ప్రవర్తించారు. కానీ మెరీనా, రోహిత్ జంట మాత్రం తొలివారంలోనే గొడవలకు దిగారు. (చదవండి: నామినేషన్స్‌లో ఆ ముగ్గురు, బయటకు వెళ్లేది ఆవిడే!) బిగ్‌బాస్ వేదికపై నాగార్జున అడిగిన ప్రశ్నలకు ఇద్దరు సింక్ అయ్యేలా సమాధానం చేప్పడంతో వీరిద్దరి మధ్య ఎంతో అవగాహన ఉందని అంతా భావించారు. కానీ హౌస్‌లోకి వెళ్లగానే వారి ప్రవర్తనలో మార్పు మొదలైంది. ఒకరినొకరు విసుక్కోవడం ప్రారంభించారు. వాష్ రూమ్ దగ్గర గీతూ గురించి రోహిత్‌కి ఏదో చెప్పబోయింది మెరీనా. ఆ సమయంలో రోహిత్ అద్దంలో తన బాడీని చూసుకుంటూ ఆమె మాటలను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మెరీనా హర్ట్ అయింది. ‘నువ్వు ముందు నీ బాడీ అయినా చూసుకో లేదంటే నేను చెప్పేదైనా విను’ అని విసుక్కుంది. అప్పుడు రోహిత్.. ఓకే ఇప్పుడు చెప్పు అన్నాడు. కానీ అప్పటికే కోపం తెచ్చుకున్న మెరీనా నేను చెప్పనంటూ అక్కడ నుంచి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతొ రోహిత్.. ఓవర్ యాక్షన్ చేయకంటూ ఆమెపై కోపం ప్రదర్శించాడు. మెరీనా మాత్రం నేను ఏం చెప్పినా కళ్లల్లోకి కళ్లు పెట్టి వినాలి. వినడం ఇష్టంలేకుంటే నాకు ఇప్పుడు మూడ్ లేదు తర్వాత వింటా అని చెప్పాలి కానీ ఇలా చేయడం నాకు నచ్చలేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉన్న జంటగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన మెరీనా, రోహిత్.. మూడో రోజే ఇలా గొడవపడటంతో ‘వీళ్లేం రొమాంటిక్ కపుల్ రా బాబూ’అని నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. -
జంటగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ అండ్ మెరీనా
Marina And Rohit In Bigg Boss6 Telugu: మెరీనా పూర్తిపేరు మెరీనా అబ్రహం.‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో పాపులర్ అయిన మెరీనా ఆ తర్వాత 'ఉయ్యాల జంపాల'సీరియల్లో నటించింది. 2017 టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డు గెలుచుకుంది. మరోవైపు మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రోహిత్ 'నీలికలువలు','అభిలాష','కంటే కూతుర్నే కనాలి' వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యాడు. షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట 2017లో పెళ్లి చేసుకున్నారు. బిగ్‌బాస్ సీజన్-3లో వరుణ్ అండ్ వితికా షెరులు జోడీగా హౌజ్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు హజ్బెండ్ అండ్ వైఫ్‌గా రోహిత్-మెరీనాలు ఎంట్రీ ఇస్తున్నారు. మరి ఈ జోడీ ప్రేక్షకుల మనసుల్ని ఎంతవరకు గెలుచుకుంటారు అన్నది చూడాల్సి ఉంది. -
మారిన మందు.. బాలుడికి అస్వస్థత
పుత్తూరు రూరల్: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం ఉదయం జరిగిన ఘటన డాక్టర్లకు చెమటలు పట్టించింది. స్థానిక గేటు పుత్తూరులోని శెంగుంధర్ వీధికి చెందిన రాజ్‌కుమార్.. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఐదేళ్ల తన కుమారుడు రోహిత్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లకు చూపించాడు. పరీక్షించిన డాక్టర్ సిరప్ రాసిచ్చాడు. తర్వాత చీటీ చూపించి మందు తీసుకెళ్లి 5 ఎంఎల్ తాగించాడు. కొద్ది సేపటికి రోహిత్ కడుపులో మంటగా ఉందని చెప్పడంతో, సిరప్‌ను పరిశీలించి అది ల్యాన్‌డన్ లోషన్‌గా గుర్తించాడు. వెంటనే రోహిత్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. డాక్టర్ శంకర్‌నారాయణ పరీక్షించి కడుపులోని మందును వామ్టింగ్ చేయించడంతో పాటు తగిన చికిత్స అందించడంతో నిమిషాల్లోనే కోలుకొన్నాడు. మందు మారడానికి కారణాన్ని అన్వేషించగా.. ఫార్మసిస్ట్ సెలవులో ఉండటంతో సెక్యూరిటీ గార్డ్ (అవుట్ సోర్సింగ్)గా పనిచేస్తున్న వసంత్ మందును మార్చి ఇచ్చాడని గుర్తించారు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జరినా సెక్యూరిటీ గార్డ్ వసంత్‌ను తొలగించారు. రోహిత్‌ను మెరుగైన పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. మందు మార్చి ఇచ్చిన వసంత్ అనే వ్యక్తి తప్పిదం వల్ల మా బాబు ఇబ్బంది పడ్డాడు గానీ ఇందులో డాక్టర్ల తప్పిదమేమీ లేదని బాలుడి తండ్రి రాజ్‌కుమార్ చెప్పారు. విచారణ జరిపిన ఇన్చార్జి డీసీహెచ్ఎస్ పుత్తూరు రూరల్ః పుత్తూరు ప్రభుత్వ మందు మార్పు–బాలుడి అస్వస్థతపై తిరుపతి డీసీహెచ్ఎస్ వేదసాయి విచారణ చేశారు. ఆదివారం రాత్రి ఆమె పుత్తూరు ఆసుపత్రికి వచ్చి జరిగిన సంఘటపై పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న రోహిత్ ఆరోగ్య పరిస్థితి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. సిరప్‌ను ఇచ్చిన అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ వసంత్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. జరిగిన మొత్తం సంఘటనపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ డాక్టర్ జరినాకు మెమో ఇచ్చినట్లు తెలిపారు. -
ఎండల్లో పనులకు వెళ్లేది ఉండదని అంటివే.. ఏమై పోతివి బిడ్డా!
‘‘నన్ను కష్టపడి చదివిస్తున్నారు.. బాగా చదివి ఉద్యోగం చేసి నిన్ను, నాన్నని సాకతానమ్మా.. ఎండల్లో పనులకు వెళ్లే పనుండదని అంటివే నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా తండ్రీ.. దేవుడా చేతికి అంది వచ్చిన కొడుకును దూరం చేశావే మేము ఏమి చేసేది..’’ అని ఆ తల్లి రోదిస్తున్న తీరును చూసి స్థానికులు కంటతడి పెట్టారు. కుప్పం మండలం మల్లానూరు వద్ద రైలు కిందపడి గంగవరం మండలం మేలుమాయి క్రాస్‌కు చెందిన విద్యార్థి మృతిచెందాడు. దీంతో మేలుమాయిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సాక్షి, కుప్పం రూరల్/ గంగవరం: కుప్పం మండలంలోని మల్లానూరు వద్ద శనివారం రైలు నుంచి జారి పడి విద్యార్థి మృతిచెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజు కథనం మేరకు.. గంగవరం మండలం మేలుమాయి క్రాస్ పూజారిండ్లులో ఉంటున్న మురుగేష్, మంజుల దంపతుల కొడుకు రోహిత్ (20) నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎన్‌బీకేఆర్‌ఎన్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుప్పంలోని వైసీ జేమ్స్ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకునేందుకు శనివారం ఉదయం తిరుపతిలో రైలు ఎక్కాడు. కుప్పం మండలం మల్లానూరు వద్దకు రాగానే డోర్ వద్ద ఉన్న రోహిత్ అదుపు తప్పి రైలు కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చదవండి: (పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి.. ఇప్పుడు శ్రీజతో మరో పెళ్లి..) కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ఉద్యోగం చేసి బాగా చూసుకుంటానని చెప్పిన కొడుకు రోహిత్ దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులతోపాటు తమ్ముడు కిశోర్, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారిని ఇరుగుపొరుగు వారు ఓదార్చే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. రోహిత్ తండ్రి మేస్త్రీ పనులు చేస్తుంటాడు. తల్లి వ్యవసాయ కూలి. తమలా కష్టాలు పడకూడదని వారు పిల్లలను మంచి చదువులు చదివిస్తున్నారు. రోహిత్ కూడా చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. పదవ తరగతి వరకు కల్లుపల్లి జెడ్పీ హైస్కూల్లో చదువుకున్నాడు. తర్వాత కుప్పం వైసీ జేమ్స్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేశాడు. ప్రస్తుతం నాయుడుపేట ఎన్‌బీకేఆర్‌ఎన్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుప్పం వద్ద రైలు కింద పడి మృతిచెందడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చినా చదువుపైనే శ్రద్ధ చూపేవాడని, మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటానని చెప్పేవాడని, ఇలా శాశ్వతంగా దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ‘డ్రా’
‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం జరిగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. భారత్ తరఫున సారథి సునీల్ చెత్రీ 27వ నిమిషంలో గోల్ చేశాడు. చెత్రీకిది 76వ అంతర్జాతీయ గోల్ కాగా, బ్రెజిల్ దిగ్గజం పీలే గోల్స్ (77) రికార్డును సమం చేయడానికి చెత్రీ కేవలం ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. బంగ్లా ప్లేయర్ అరాఫత్ (74వ నిమిషంలో) గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. రోహిత్‌కు నిరాశ ఓస్లో (నార్వే): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రోహిత్ (65 కేజీలు)కు చుక్కెదురైంది. కాంస్య పతకం కోసం సోమవారం జరిగిన బౌట్లో రోహిత్‌పై ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిన తుల్గాతుముర్ ఒచిర్ (మంగోలియా) గెలుపొం దాడు. మ్యాచ్‌లో రోహిత్ 4–10తో వెనుకబడి ఉన్న సమయంలో ఒచిర్ ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని క్షణాల పాటు పట్టి ఉంచాడు. దాంతో రిఫరీ ఒచిర్‌ను విజేతగా ప్రకటించాడు. వాస్తవానికి రోహిత్ ప్రిక్వార్టర్స్‌లో ఓడగా... అతడిని ఓడించిన జగిర్ ఫైనల్‌కు చేరాడు. దాంతో రెపీచేజ్ ద్వారా రోహిత్ కాంస్యం బరిలో నిలిచాడు. తొలి మ్యాచ్‌లో రోహిత్ 12–2తో సెలాహట్టిన్ (టర్కీ)పై నెగ్గాడు. మహిళల 55 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్లో భారత రెజ్లర్ పింకీ 6–8తో నినా హెమ్మర్ (జర్మనీ) చేతిలో ఓడి పసిడి పోరుకు దూరమైంది. అయితే రెపీచేజ్ పద్ధతి ద్వారా ఆమె కాంస్యం గెలిచే అవకాశం ఉంది. మరో భారత రెజ్లర్ సంగీతా ఫోగాట్ (62 కేజీలు) ప్రిక్వార్టర్స్‌లో... పురుషుల విభాగాల్లో సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు), సుశీల్ (70 కేజీలు) క్వాలిఫయింగ్ రౌండ్‌ల్లో తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడారు. చదవండి: Dronavalli Harika: ఒలింపిక్ విజయంలాంటిదే.. నా భర్త అన్ని విధాలా అండగా నిలిచారు -
రోహిత్ ‘కళాకార్’ టీజర్ విడుదల చేసిన ప్రభాస్
ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్‌తో 6 టీన్స్, గర్ల్ ఫ్రెండ్, జానకి వెడ్స్ శ్రీరామ్ వంటి హిట్లు కొట్టిన నటుడు రోహిత్. అనంతరం క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా మారి శంకర్‌దాదా MBBS, నవ వసంతం వంటి సినిమాల్లో నటించాడు. ఆయన చాలా గ్యాప్ తర్వాత హీరోగా చేస్తున్న చిత్రం ‘కళాకార్’. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీకి శ్రీను బందెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదివారం (సెప్టెంబర్ 19న) విడుదల చేశాడు. ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రోహిత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని ఇటీవల నటుడు శ్రీకాంత్ విడుదల చేశాడు. ప్రభాస్ టీజర్ చూసి మెచ్చుకున్నారని, దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు మూవీ టీం తెలిపింది. కాగా, యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. -
‘కళాకార్’ మోషన్ పోస్టర్ విడుదల చేసిన అనిల్ రావిపూడి
‘6 టీన్స్’ మూవీ హీరో రోహిత్ నటిస్తోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కళాకార్’. ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. శ్రీను బందెల దర్శకుడు. ఇందులో షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే, గగన్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రల్లో నటించారు. ఇటీవల హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ‘కళాకార్’ మూవీ మోషన్ పోస్టర్‌ను బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి రిలీజ్చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సినిమాలో రోహిత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ మహేంద్ర వర్మగా కనిపించనున్నట్లు మోషన్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు మేకర్స్. క్రియేటివ్‌గా, స్టైలిష్‌గా ఉన్న ఈ మోషన్ పోస్టర్‌కు సోషల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా.. హీరో రోహిత్ మాట్లాడుతూ .. ‘ఇటీవల విడుదల చేసిన ‘కళాకార్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ ఆఫీసర్‌గా చాలా ఫిట్‌గా ఉన్నావు అని నా ఫ్రెండ్స్, సన్నిహితులు ఫోన్ చేసి ప్రసంశించారు. ఇప్పుడు మా మూవీ మోషన్‌పోస్టర్‌ను అనిల్ రావిపూడిగారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అన్నాడు. చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ.. ‘మేము అడిగిన వెంటనే మోషన్ పోస్టర్ని విడుదల చేసిన అనిల్ రావిపూడిగారికి మా ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ తరపున ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. తప్పకుండా కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు. ఇక దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో టీజర్ విడుదలచేస్తాం’ అని తెలిపారు. -
విషాదంగా మారిన ఫ్రెండ్షిప్ డే
నందిపేట్(ఆర్మూర్): స్నేహితుల దినోత్సవం రోజే ఓ స్నేహితుల బృందంలో విషాదం నెలకొంది. సరదాగా గడిపేందుకు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లిన మిత్రులలో ముగ్గురు నీటిలో గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి గ్రామానికి చెందిన సాయికృష్ణ, రోహిత్, రాజేందర్, బూర్గుల రాహుల్(19), ఉదయ్(20), శివ(19) స్నేహితులు. ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నందిపేట మండలంలోని జీజీ నడ్కుడ గ్రామ సమీపంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. స్నానం చేసేందుకు నీటిలోకి దిగారు. అయితే, ఆ ప్రాంతంలో గతంలో జేసీబీతో మట్టి తీసిన పెద్ద పెద్ద గుంతలున్నాయి. ఆ సంగతి తెలియని శివ మరింత ముందుకు వెళ్లడంతో కాలు జారి గుంతలోకి జారిపోయాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన రాహుల్, సాయికృష్ణ, ఉదయ్ కూడా నీటమునిగిపోయారు. గమనించిన రోహిత్, రాజేందర్ గట్టిగా కేకలు వేయగా, సమీపంలో ఉన్న ఓ పశువుల కాపారి పరిగెత్తుకొచ్చాడు. వాటర్‌పైపును నీటిలోకి వేయగా, సాయికృష్ణ చాకచక్యంగా దానిని పట్టుకుని బయటకు వచ్చాడు. మిగతా ముగ్గురు రాహుల్, ఉదయ్, శివ నీటిలోనే గల్లంతయ్యారు. సమాచారమం దుకున్న పోలీసులు, గ్రామస్తులు బ్యాక్ వాటర్ ప్రాంతానికి చేరుకుని గాలింపు చేపట్టారు. అర ్ధరాత్రి వరకూ గాలించినా ఆ ముగ్గురి ఆచూకీ లభిం చలేదని తహసీల్దార్ అనిల్ కుమార్, ఎస్సై శోభన్‌బాబు తెలిపారు. -
ఘనంగా శంకర్ కూతురి వివాహం, హాజరైన సీఎం
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె ఐశ్వర్య క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో ఏడడుగులు నడిచింది. వేదమంత్రాల సాక్షిగా ఆమె రోహిత్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. తమిళనాడులోని మహాబలిపురంలో ఆదివారం జరిగిన వీరి వివాహ వేడుకకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం, నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వరుడు రోహిత్ విషయానికి వస్తే అతడు ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఆయన తండ్రి దామోదర్ చెన్నైలో బడా పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నాడు. మధురై పాంతర్స్ క్రికెట్ టీమ్‌కు యజమానిగానూ వ్యవహరిస్తున్నాడు. ఇక శంకర్ కుమార్తె ఐశ్వర్య వృత్తిరీత్యా వైద్యురాలు. ఇదిలా వుంటే శంకర్ ప్రస్తుతం 'ఇండియన్ 2' మూవీని తెరకెక్కించే పనిలో బిజీగా ఉండగా, ఆ తర్వాత రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియా మూవీకి సిద్దంగా ఉన్నాడు. దీనితో పాటు హిందీలో రణ్వీర్ సింగ్‌తో అపరిచితుడు రీమేక్ కూడా చేయనున్నట్లు భోగట్టా. చదవండి: క్రికెటర్‌తో డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లి -
కరోనాతో ప్రముఖ జర్నలిస్టు కన్నుమూత: అమిత్‌షా సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరో సీనియర్ జర్నలిస్టును బలితీసుకుంది. ఆజ్ తక్ సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ యాంకర్ రోహిత్ సర్దానాకు ఇటీవల కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా గురువారం మెట్రో ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న సమయంలో శుక్రవారం తీవ్ర గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సర్దానా అకాలమరణంపై పలువురు జర్నలిస్టు పెద్దలు, ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మరో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు రోహిత్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఇంకా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష సిసోడియా, కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా రోహిత్ మరణం షాక్‌కు గురిచేసిందంటూ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కరోనా మహమ్మారి తన సన్నిహితుడిని బలి తీసుకుంటుదని ఊహించలేదంటూ జీ న్యూస్‌కు చెందిన సుధీర్ చౌదరి సంతాపం తెలిపారు. రోహిత్ మరణం జర్నలిస్టు లోకానికి తీరని నష్టమని మరో సీనియర్ జర్నలిస్ట్ భూపేంద్ర చౌబే వ్యాఖ్యానించారు. స్వయంగా ఆయన కోవిడ్‌తో బాధ పడుతున్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడంలో ఏ మాత్రం వెనుకాడలేదని తోటి జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు. కాగా 2000 జీ న్యూస్‌తో కరియర్‌ను ఆరంభించిన సర్దానా ఆ తరువాత సర్దానా 2017లో ఆజ్ తక్లో చేరారు. జీ న్యూస్‌లో 'తాల్ తోక్ కే' , ఆజ్ తక్లో "దంగల్" అనే చర్చా కార్యక్రమాలతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. 2018 లో గణేష్ విద్యార్తి పురస్కార్ అవార్డు గెల్చుకున్నారు. టీవీ న్యూస్ జర్నలిజంలో అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో రోహిత్ ఒకరు. (రెమిడెసివర్ కొరత: కేంద్రం కీలక నిర్ణయం) अब से थोड़ी पहले @capt_ivane का फ़ोन आया।उसने जो कहा सुनकर मेरे हाथ काँपने लगे।हमारे मित्र और सहयोगी रोहित सरदाना की मृत्यु की ख़बर थी।ये वाइरस हमारे इतने क़रीब से किसी को उठा ले जाएगा ये कल्पना नहीं की थी।इसके लिए मैं तैयार नहीं था।ये भगवान की नाइंसाफ़ी है.. ॐ शान्ति — Sudhir Chaudhary (@sudhirchaudhary) April 30, 2021 Pained to learn about Shri Rohit Sardana ji’s untimely demise. In him, the nation has lost a brave journalist who always stood up for unbiased and fair reporting. May God give his family the strength to bear this tragic loss. My deepest condolences to his family and followers. — Amit Shah (@AmitShah) April 30, 2021 More terrible news friends. Well known Tv news anchor Rohit Sardana has passed away. Had a heart attack this morning. Deep condolences to his family. RIP — Rajdeep Sardesai (@sardesairajdeep) April 30, 2021 -
Sub-Inspector Priyanka Sharma: గన్ లేడీ
ఎన్కౌంటర్ టీమ్‌లో గ్యాంగ్‌స్టర్‌తో తలపడిన తొలి మహిళా పోలీస్‌గా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రియాంక శర్మను యావత్భారత పోలీసు శాఖ అభినందిస్తోంది. ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌లో ‘ట్రాకింగ్’ టీమ్ అని ఒకటి ఉంటుంది. పెద్ద పెద్ద క్రిమినల్స్‌ని వలపన్ని, చుట్టుముట్టి, వారి చేతుల్ని తల వెనుక పెట్టించి, అదుపులోకి తీసుకునే ఎన్కౌంటర్ స్పెషలిస్టులు ఆ టీమ్‌లోని వాళ్లంతా! ఎస్సై ప్రియాంకా శర్మ పదమూడేళ్లుగా వాళ్లలో ఒకరిగా పని చేస్తున్నారు. మొన్న గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆమె పాల్గొన్నారు. ఒక బులెట్ వచ్చి ఆమె జాకెట్‌కు తగిలింది. గ్యాంగ్‌స్టర్, అతడి అనుచరుడు పట్టుబడ్డారు. ‘‘ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎన్కౌంటర్లో పాల్పంచుకున్న మొట్టమొదటి మహిళా పోలీస్ ప్రియాంక’’ అని ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ షిబేష్ సింగ్ అభినందించారు. ఆయనతో పాటు డిపార్ట్మెంట్ కూడా ప్రియాంకకు పూలగుచ్ఛాలు అందిస్తోంది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఎంతో కాలంగా వెతుకుతున్న గ్యాంగ్‌స్టర్ ఒకరు సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్నట్లు గురువారం తెల్లవారుజామున డిపార్ట్మెంట్కి సమాచారం అందింది. హుటాహుటిన టీమ్ అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో టీమ్‌తో ప్రియాంక కూడా ఉన్నారు. పట్టుకోబోతున్నది గ్యాంగ్‌స్టర్‌ని కనుక ప్రియాంక కూడా బులెట్ ప్రూమ్ జాకెట్ ధరించి ముఖాముఖి గన్ ఫైట్‌కు రెడీ అయి ఉన్నారు. గ్యాగ్‌స్టర్‌ని ఒక మూలకు రప్పించడం, పెడరెక్కలు విరిచి పోలీస్ వ్యాన్ ఎక్కించడం అంత తేలికేమీ కాదు. ముందసలు అతడు లొంగిపోయే మానసిక స్థితిలో ఉండడు. చంపడమో, చావడమో రెండే ఆప్షన్స్ తీసుకుంటాడు. ప్రగతి మైదాన్‌లోకి పోలీస్‌లు వచ్చారని తెలియగానే గ్యాగ్‌స్టర్ అలెర్ట్ అయ్యాడు. అతడితో ఒక అనుచరుడు ఉన్నాడు. ఇద్దరి దగ్గరా గన్స్ ఉన్నాయి. పోలీసులు దగ్గరకు రాగానే గ్యాంగ్‌స్టర్ కాల్పులు మొదలుపెట్టాడు. ప్రియాంక తన గన్‌తో అతడికి ఎదురుగా వెళ్లారు. ఆమెకు అతడిని కాల్చే ఉద్దేశం లేదు. లొంగిపొమ్మని హెచ్చరించడానికే తన గన్ తీశారు. వెంటనే గ్యాంగ్‌స్టర్ ఆమెపై కాల్పులు జరిపాడు. ఒక బులెట్ ఆమె జాకెట్కి తగిలింది. అదే సమయంలో తక్కిన పోలీసులు అతడి కాళ్లపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. అతడి అనుచరుడిపైన కూడా. ఇద్దర్నీ పట్టుకున్నారు. ప్రియాంకకు బులెట్ తగిలిన చోట పెద్ద గాయం ఏమీ అవలేదు. గ్యాంగ్‌స్టర్ పేరు రోహిత్ చౌదరి. అతడి అనుచరుడు ప్రవీణ్. రోహిత్‌పై రెండు కేసులు ఉన్నాయి. ఢిల్లీ, సాకేత్ కోర్టు బయట ఒకరిని హత్య చేయబోయిన కేసు, ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఒక హత్య ఘటనలో అతడి హస్తం ఉందన్న కేసు. రెండేళ్లుగా అతడు అరెస్ట్ కాకుండా పోలీసులను తప్పించుకుని తిరుగుతున్నాడు. తల మీద నాలుగు లక్షల రూపాయల రివార్డు ఉంది. ఎం.సి.ఓ.సి.ఎ. (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కింద కూడా రోహిత్, ప్రవీణ్‌లపై అనేక మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున 4.45 నిముషాలకు వాళ్లిద్దరూ కారులో భైరాన్ మార్గ్ గుండా వస్తూ పోలీసు పెట్రోలింగ్ ఆగమన్నా ఆగకుండా పోలీసులపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. పోలీసులూ వాళ్లపై కాల్పులు జరిపారు. ఆ సమాచారం అందుకున్న క్రైమ్ బ్రాంచ్ టీమ్ గ్యాంగ్‌స్టర్‌తో ఎన్‌కౌంటర్‌కు బయల్దేరింది. మొత్తానికి పోలీస్ కథ సుఖాంతం. ఈ కథలో నాయిక మాత్రం ప్రియాంకేనని ఢిల్లీ క్రైమ్ డిపార్ట్మెంట్ అంటోంది. ‘‘నేనేమీ భయపడలేదు. నా డ్యూటీలో అదొక భాగంగా మాత్రమే అనిపించింది’’ అని చిరునవ్వులు చిందిస్తూ అంటున్నారు ప్రియాంక. ఆ నవ్వులు సహజంగానే రోహిత్‌కు, ప్రవీణ్‌కు నచ్చకపోవచ్చు. ∙ -
పవర్ఫుల్ ప్రత్యర్థి
రవి వర్మ, వంశీ, రోహిత్, అక్షిత ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘ప్రత్యర్థి’. శంకర్ ముడావత్ దర్శకత్వంలో సంజయ్ షా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్థన్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. నాగం జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాణిజ్య అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అన్నారు శంకర్ ముడావత్. ‘‘హిందీ సినిమాలు నిర్మించాను. తెలుగులో ఇది నా తొలి సినిమా’’ అన్నారు సంజయ్ షా. -
బాలీవుడ్‌కి విఠల్వాడి
రోహిత్, సుధా రావత్ జంటగా నాగేందర్.టి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విఠల్వాడి’. జి.నరేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమయింది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులకు ‘విఠల్వాడి’ ప్రివ్యూ చూపించారు. జి.నరేష్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా నిర్మించిన చిత్రమిది. ఇందులో రొమాంటిక్ సీ¯Œ ్స, సెంటిమెంట్ సీ¯Œ ్స కూడా బాగున్నాయి. యాక్షన్, సెంటిమెంట్స్ సీన్స్‌కి అందరూ కనెక్ట్ అయ్యారు. మా చిత్రం ప్రివ్యూ చూసిన ప్రముఖులు సినిమా చాలా బాగుందని, రోషన్ కోటి సంగీతం వినసొంపుగా ఉందని యూనిట్‌ని అభినందించారు. హిందీలో ఒక ప్రముఖ నటుడి కొడుకుని లాంచ్ చెయ్యడానికి హిందీ రీమేక్ రైట్స్ కోసం ఆసక్తి చూపుతున్నారని గురుదేవ్ పిక్చర్స్ అధినేత ప్రమోద్ కుమార్ చెప్పడం సంతోషం. ఫస్ట్ లుక్, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుక జరపనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ అడపా. -
కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదని..
యాలాల/బంట్వారం: పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం రాలేదన్న ఆవేదనతో ఇద్దరు యువకులు వేర్వేరు చోట్ల బలవన్మరణాల కు పాల్పడ్డారు. ఈ వి షాదకర ఘటనలు వికారాబాద్ జిల్లా యాలాల మండలం రాస్నం, అదే జిల్లాకు చెందిన బంట్వారంలో చోటుచేసుకున్నాయి. కుటుంబీకులు, పోలీసు ల కథనం ప్రకారం.. రాస్నం గ్రామానికి చెంది న దోమ మల్లేశం, పుష్పమ్మ దంపతుల కుమా రుడు రోహిత్ అలియాస్ రంజిత్ (24) బీటెక్ వరకు చదివాడు. 2018లో వెలువడిన నోటి ఫికేషన్‌తో కానిస్టేబుల్ ఉద్యోగానికి సన్నద్ధమయ్యాడు. రెండు నెలల క్రితం ఈ ఫలితాలు వె లువడ్డాయి. బీసీ–డీ కేటగిరీకి చెందిన రంజిత్ కు 101 మార్కులు వచ్చాయి. కటాఫ్ 103 మార్కులు కావడంతో రెండు మార్కుల తేడా తో ఉద్యోగం కోల్పోయాడు. దీనిపై తరచూ స్నేహితులు, బంధువుల వద్ద చెబుతూ మనోవేదనకు గురవుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అతడు ఇంట్లో పైకప్పుకు తాడుతో ఉరేసుకున్నాడు. సోమవారం ఉద యం కుటుంబీకులు గమనించగా అప్పటికే విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. మృతుడి సోదరుడు రాకేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉరివేసుకొని ఆత్మహత్య.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేజారిందనే మనస్తాపంతో వికారాబాద్ జిల్లా బంట్వారం లో కుమార్ (24) అనే యువకుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన అల్లిపురం నర్సింలు, ఈశ్వరమ్మ దంపతుల నాలుగో కొడుకు కుమార్ డిగ్రీ వరకు చదివాడు. కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో హైదరాబాద్, తాండూ రులో శిక్షణ తీసుకున్నా డు. ఇటీవల విడుదలై న ఫలితాల్లో అతడికి ఉద్యోగం రాలేదు. అ దే గ్రామానికి చెందిన కుమార్ స్నేహితులకు ఇద్దరికి ఉద్యోగం వ చ్చింది. తనకు ఉద్యో గం రాలేదని అతడు మిత్రులకు చెప్పి ఆవేద న వ్యక్తం చేస్తుండేవాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కుమార్ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎదిగి వచ్చిన కొడుకు ఆత్మహత్యకు పాల్పడటంతో నర్సింలు దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
విఠల్వాడి ప్రేమకథ
రోహిత్, సుధ రావత్ జంటగా టి.నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విఠల్వాడి’. నరేష్ రెడ్డి .జి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటుడు జగపతిబాబు విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘విఠల్వాడి’ చిత్రం ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న రోహిత్‌కు అభినందనలు. నిర్మాత నరేష్ రెడ్డి మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలి. ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘హైదరాబాద్‌లోని విఠల్వాడి అనే ఏరియాలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలతో మా సినిమా నిర్మించాం. కథ, కథనాలు కొత్తగా ఉంటాయి. పాటలు, ఫైట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం’’ అన్నారు నరేష్ రెడ్డి. జి. ‘‘విఠల్వాడి’ సినిమాతో హీరోగా పరిచయం కావడం సంతోషం. నరేష్ రెడ్డిగారు బాగా ఖర్చు పెట్టి సినిమాను క్వాలిటీగా నిర్మించారు. ఈ చిత్రం మాకు మంచి పేరు తెచ్చిపెడుతుంది’’ అన్నారు రోహిత్. ‘‘నిజ జీవితంలో జరిగిన ఒక వాస్తవ ప్రేమకథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు టి.నాగేందర్. అమిత్, అప్పాజీ అంబరీష్ దర్బా, చమ్మక్ చంద్ర, జయశ్రీ, రోల్ రైడ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సతీష్ అడపా, సంగీతం: రోషన్ సాలూరు. -
మాంచెంస్టర్ మ్యాచ్‌లో టీంఇండియా పరుగుల వరద
-
ముంబైకి ఎదురుదెబ్బ.. రోహిత్ ఔట్
-
నేపాలీ కుర్రాడు... సచిన్ రికార్డును సవరించాడు
దుబాయ్: నేపాల్ టీనేజ్ క్రికెటర్ రోహిత్ పౌడెల్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 29 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతిపిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 16 ఏళ్ల 146 రోజుల వయసున్న రోహిత్ 58 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంతో సచిన్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో పాక్‌పై టెస్టు క్రికెట్లో చేసిన ఫిఫ్టీ తెరమరుగైంది. ఒక విధంగా వన్డే క్రికెట్లో ఆఫ్రిది (పాకిస్తాన్) రికార్డును కూడా రోహిత్ చెరిపేశాడు. ఆఫ్రిది 16 ఏళ్ల 217 రోజుల వయసులో శ్రీలంకపై 37 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇవన్నీ కూడా పురుషుల క్రికెట్‌కే పరిమితం. ఎందుకంటే మహిళల క్రికెట్లో జొమరి లాగ్టెన్‌బర్గ్ (దక్షిణాఫ్రికా) 14 ఏళ్ల వయసులోనే టెస్టు, వన్డేల్లో అర్ధసెంచరీలు చేసిన అతిపిన్న క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. -
హాకా... హాకా..!
భారత క్రికెటర్లకు మౌంట్ మాంగనీ మైదానంలో ‘పౌహిరి’ సాంప్రదాయ రీతిలో స్వాగతం లభించింది. ఇందులో భాగంగా స్థానిక మావోరీ తెగకు చెందిన వారు ముందుగా ‘హాకా డ్యాన్స్’ను టీమిండియా ఆటగాళ్ల ముందు ప్రదర్శించారు. ఆవేశంగా రెండు కాళ్లతో నేలను బలంగా కొట్టడంతో పాటు ‘హాకా హాకా’ అంటూ గట్టిగా అరవడం ఈ డ్యాన్స్‌లో కనిపిస్తుంది. అనంతరం ఎదురెదురుగా వెళ్లి షేక్‌హ్యాండ్ ఇవ్వడం సహా ఒకరి నుదురు, ముక్కులను మరొకరి నుదురు, ముక్కుతో రాయడం కూడా పౌహిరిలో భాగమే. దీనిని ‘హోంగీ’గా వ్యవహరిస్తారు. వేర్వేరు క్రీడాంశాలకు చెందిన న్యూజిలాండ్ ఆటగాళ్లు తరచుగా దీనిని మైదానంలో ప్రదర్శిస్తుండగా... జాతీయ రగ్బీ టీమ్ మాత్రం ‘హాకా’కు బాగా ప్రాచుర్యం కల్పించింది. కోహ్లి మైదానానికి రాకపోవడంతో రోహిత్ శర్మ జట్టును ముందుండి నడిపించాడు. ఇది చాలా సరదాగా అనిపించిందని, వారి దీవెనలు అందుకున్నట్లుగా అనిపించిందని దీనిపై శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. -
శ్వేత కల్యాణం
మొత్తానికి పెళ్లయింది!శ్వేతా బసు ప్రసాద్ పెళ్లి కాదు. ప్రియాంక, నిక్‌ల పెళ్లి.అంతకు ముందు కూడా..మొత్తానికి పెళ్లైంది. రణవీర్, దీపికల పెళ్లి.అంతకన్నా ముందూ..మొత్తానికి పెళ్లయింది. అనుష్క, కొహ్లీల పెళ్లి.బాలీవుడ్ తారల పెళ్లి డేట్లు ఒక పట్టాన కదిలి రావు. అందుకే..‘మొత్తానికి పెళ్లైంది’ అనిపిస్తుంది. శ్వేతాబసు మరీ అంత సాగతీయడం లేదు. డేట్ చెప్పారు. డేటింగ్ గురించీ చెప్పారు. నచ్చిన వరుడు. మెచ్చిన వధువు. పెళ్లి పనుల్లో ఉండి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. చూతము రారండి.. శ్వేతా కల్యాణం. త్వరలో ‘మిసెస్’ కాబోతున్నందుకు ముందుగా కంగ్రాట్స్... శ్వేత: థ్యాంక్స్. ఈ నెల 13న రోహిత్‌తో నా పెళ్లి. అందుకే పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నాం. అసలు మీ ఇద్దరూ ఫస్ట్ టైమ్ ఎక్కడ కలిశారు? దాదాపు ఐదేళ్ల క్రితం కలిశాం. ఫ్యాంథమ్ ఫిలిమ్స్‌లో నేను స్క్రిప్ట్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నప్పుడు రోహిత్ కూడా వేరే పని మీద అక్కడ ఉన్నాడు. అయితే చాలామంది అనుకుంటున్నట్లు తను అక్కడ పని చేయడం లేదు. అసిస్టెంట్‌గా కూడా వర్క్ చేయడం లేదు. తనకు డైరెక్టర్ అవ్వాలన్నది లక్ష్యం. ప్రొడ్యూసర్‌గా కూడా చేయాలనే ఎయిమ్‌తో ఉండేవాడు. మీ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిందట కదా? లేదు. పెళ్లికి ముందు రోజు మెహందీ, ఎంగేజ్మెంట్ ఉంటాయి. ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓ మంచి భర్తకు కావాల్సిన లక్షణాలు రోహిత్లో ఏం ఉన్నాయి? ఓపికకు మారు పేరు రోహిత్. అలాగే చేసే పని మీద శ్రద్ధ ఎక్కువ. చాలా వినయంగా ఉంటాడు. స్త్రీల దగ్గర తను నడుచుకునే తీరు చాలా బాగుంటుంది. ఆ తీరే నా మనసుని గెలుచుకుంది. రోహిత్‌ది చాలా మంచి పెంపకం. బాలీలో బ్యాచిలరెట్ పార్టీ చేసుకున్నట్లున్నారు. ఆ ప్లేస్‌నే సెలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? పార్టీకి అద్భుతమైన ప్లేస్ అది. అందుకే వెళ్లాం. గత నెల 25 నుంచి 30 వరకూ అక్కడే ఉన్నాం. శుక్రవారం రాత్రి ముంబై చేరుకున్నాం. బాలీలో ఓ ప్రైవేట్ విల్లాని బుక్ చేసుకున్నాం. మా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులతో వెళ్లాం. ముఖ్యంగా నన్ను బాగా ప్రేమించేవాళ్లతో ఈ పార్టీ చేసుకున్నాను. ఫుల్‌గా రిలాక్స్ అవ్వాలనే ఆలోచనతోనే ఈ పార్టీ ప్లాన్ చేశాను. బాలీ పొలాల్లో ఫార్మింగ్ చేశాం. అలాగే పొలాల్లో వంటలు చేసుకున్నాం. ఒకట్రెండు రోజులైతే విల్లా నుంచి బయటికి రాలేదు కూడా. బోర్డ్ గేమ్స్ ఆడుకున్నాం. నా బ్రదర్ రాహుల్ ప్లే చేసిన మ్యూజిక్‌కి డ్యాన్స్ చేశాం. ఫుల్‌గా రిలాక్స్ అయ్యాను. మీ ఇద్దరూ పేరెంట్స్‌ని ఒప్పించడానికి కష్టపడ్డారా? నా కుటుంబ సభ్యులకు రోహిత్ మూడేళ్లుగా తెలుసు. నాక్కూడా తన ఫ్యామిలీతో అన్నేళ్ల అనుబంధం ఉంది. మేమంతా ఒకే కుటుంబం అన్నట్లుగా ఉండటం మొదలుపెట్టాం. ఏ బంధంలో అయినా గౌరవం ఉంటే ఆ బంధం బలంగా ఉంటుంది. మాకు ఒకరి కుటుంబం అంటే మరొకరికి గౌరవం ఉంది. మా పెద్దలు కూడా ఒకరినొకరు గౌరవించుకుంటారు. అందుకే మా ప్రేమ గురించి చెప్పగానే కాదనలేదు. మరి.. సహజీవనం చేశారు కదా.. అప్పుడు కూడా ఏమీ అనలేదా? లేదు. దాదాపు రెండేళ్లు సహజీవనం చేశాం. మా నిర్ణయాల మీద మావాళ్లకు నమ్మకం ఉంది. అందుకే ఏమీ అనలేదు. పెళ్లి తర్వాత కెరీర్ కంటిన్యూ చేస్తారా? డెఫినెట్‌గా. రోహిత్‌కి అభ్యంతరం లేదు. పెళ్లయితే కెరీర్‌ని వదిలేసుకోవాలన్న మైండ్‌సైట్ నాకూ లేదు. నా మనవళ్లు, మనవరాళ్లు పుట్టేటప్పటికి కూడా నేను నటిస్తూనే ఉంటా (నవ్వుతూ). ప్రస్తుతం ఏం చేస్తున్నారు? హిందీ చిత్రం ‘తాష్కెంట్ ఫైల్స్’లో నటించాను. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నసీరుద్దీన్ షా, మిథున్ చక్రవర్తి, నేను, ఇంకొంతమంది ప్రముఖ స్టార్స్ నటించాం. మన రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిగారి డెత్ మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ‘జామున్’ అని మరో సినిమా చేశాను. తండ్రీ కూతురి అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. నా తండ్రిగా రఘుబీర్ యాదవ్ నటించారు. ఈ రెండూ వచ్చే ఏడాది విడుదలవుతాయి. ఫైనల్లీ... విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్? థ్యాంక్యూ వెరీ మచ్. నన్ను కథానాయికను చేసిన తెలుగు పరిశ్రమ అన్నా, తెలుగు ప్రేక్షకులన్నా నాకు చాలా అభిమానం. ఎవరీ రోహిత్? పూణేకు చెందిన బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు రోహిత్ మిట్టల్. వాళ్ల నాన్నగారు బిల్డర్. రోహిత్ లా పూర్తి చేసినప్పటికీ ఫిల్మ్ మేకింగ్ మీద శ్రద్ధతో లాస్ ఏంజెల్స్‌లో న్యూయార్క్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం బాలీవుడ్లో దర్శక–నిర్మాతగా కొనసాగుతున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం ‘ఆటోహెడ్’ అనే ఫీచర్ ఫిల్మ్ డైరెక్ట్ చేశారు. ఆ సినిమాకు కో–ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు రోహిత్. బాలీవుడ్లో చేయబోయే నెక్ట్స్ ఫీచర్ ఫిల్మ్ షూటింగ్ కూడా పూర్తయింది. ఎ... క్క...డ...?? ఎ..క్క..డ?? ఎ..క్క..డ..? అంటూ ఓ కొత్త డైలాగ్ మాడ్యులేషన్‌తో ‘కొత్త బంగారు లోకం’ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు శ్వేతా బసు. ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తయింది. అక్టోబర్ 9, 2008లో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా గురించి శ్వేతా మాట్లాడుతూ – ‘‘పదేళ్ల క్రితం ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను. సెన్సేషనల్ రొమాంటిక్ హిట్. పాటలు, సంభాషణలు అన్నీ కూడా యూత్‌కి ఇట్టే కనెక్ట్ అయిపోయాయి. కమర్షియల్ సక్సెస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. తెలుగులో నా ఫస్ట్ స్టెప్ ఓ స్వీట్ మెమరీ’’ అని పేర్కొన్నారు. పెళ్లి ఎక్కడ? రోహిత్‌ది పుణె. శ్వేత ఫ్యామిలీ ముంబైలో ఉంటుంది. పెళ్లి వేడుక పుణేలో జరుగుతుంది. రిసెప్షన్ మాత్రం పుణె, ముంబైలలో జరుగుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని, రిసెప్షన్‌కి సినిమా పరిశ్రమలోని వారిని ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు. శ్వేత ఇంట్లో పూజలు బాగా చేస్తారు. రోహిత్ ఫ్యామిలీకి కూడా దైవభక్తి ఎక్కువే అట. ఈ ఏడాది వినాయక చవితిని ఎప్పటిలానే గ్రాండ్‌గా చేసుకున్నారు శ్వేత. తన ప్రేయసి ఇంట్లో జరిగిన గణేశ్ పూజలో రోహిత్ పాల్గొన్నారు. అప్పుడు ఇద్దరూ వినాయకుడికి హారతి ఇచ్చిన సందర్భంగా దిగిన ఫొటో ఇది. ఈ కాబోయే దంపతులు అప్పట్లో ఇచ్చిన ఫస్ట్ హారతి. – డి.జి. భవాని -
కోహ్లికంటే రోహిత్ అదృష్టవంతుడా!
ఆసియా కప్‌ను మాత్రమే కాకుండా ఇటీవలి ఇంగ్లండ్ పర్యటన తర్వాత కోల్పోయిన అభిమానుల విశ్వాసాన్ని కూడా గెలుచుకునే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగు తోంది. మన జట్టు ఏదో అద్భుతం చేస్తుందంటూ ఇంగ్లండ్ పర్యటనపై ఉంచిన అంచనాలు దెబ్బ తినడంతో మెల్లగా మబ్బులు వీడిపోయాయి. ఆసియా కప్‌లో అద్భుతంగా ఆడితే ఆ గాయాలు మరచిపోయేలా చేయడంతో పాటు భారత క్రికెట్‌పై ఆసక్తి తగ్గిపోయిన వారిని కూడా మళ్లీ ఇటు వైపు చూసేలా చేయవచ్చు. హాంకాంగ్‌తో జరిగే తొలి మ్యాచ్ తర్వాతి రోజు పాకిస్తాన్‌తో పోరుకు ముందు మంచి వార్మప్‌గా చెప్పవచ్చు. భారత్ వరుసగా రెండు రోజులు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం, అదీ రెండో రోజు పాకిస్తాన్‌తో తలపడే విధంగా నిర్వాహకులు అసలు షెడ్యూల్‌ను ఎలా తయారు చేశారో అర్థం కావడం లేదు. అయితే దాని గురించి ఏమీ చేయలేం. క్వాలిఫయింగ్ టోర్నీలో తమకంటే బలమైన జట్లను ఓడించి హాంకాంగ్ ఈ దశకు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన ఆ జట్టు భారత్‌పై కాస్త మెరుగ్గా ఆడాలని భావిస్తోంది. భారత జట్టు కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది. ముఖ్యం గా రోహిత్ తన ఖాతాలో మరో ఒకట్రెండు సెంచరీలు చేర్చుకో వాలని భావిస్తున్నాడు. క్లిష్ట సమయాల్లో అండగా నిలిచేందుకు పక్కనే ధోని ఉండటం కూడా రోహిత్ అదృష్టం. సాధారణంగా ఇండియా జట్టు ఆకర్షణ అంతా బ్యాటింగ్‌లోనే కనిపిస్తుంది. కానీ ఈసారి బౌలింగ్‌లో ఉన్న వైవిధ్యం కూడా ఆకట్టుకునేలా చేస్తోంది. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు చహల్, కుల్దీప్ వేర్వేరు శైలిలో వికెట్లు పడగొట్టడమే కాకుండా ఒకరిని మరొకరు ప్రోత్స హించుకునే తీరు చాలా బాగుంటుంది. మామూలుగా అయితే తమ బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు క్రీజ్‌లో గడపాలని కోరుకుంటుంది కాబట్టి అవకాశం లభిస్తే భారత్ తొలుత బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతుంది. అయితే తర్వాతి రోజే పాకిస్తాన్‌తో ఆడాల్సి ఉంది కాబట్టి ఈ మ్యాచ్‌ను వీలైనంత తొందరగా ముగించి ప్రధాన పోరు కోసం తమ శక్తిని కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు. అది జరగాలంటే భారత్ టాస్ నెగ్గాలి. ఈ విషయంలో కోహ్లితో పోలిస్తే రోహిత్ అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి. -
చాంపియన్ లలిత్‌బాబు
అహ్మదాబాద్: జాతీయ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌తో తెలుగు కుర్రాడు గ్రాండ్‌మాస్టర్ ముసు నూరి రోహిత్ లలిత్‌బాబు విజేతగా నిలిచాడు. గుజరాత్లో శుక్రవారం జరిగిన చివరిదైన 11వ రౌండ్ గేమ్‌లో గ్రాండ్‌మాస్టర్ స్వప్నిల్ దోపాడే (ఇండియన్ రైల్వేస్)పై లలిత్‌బాబు (పీఎస్‌పీబీ) విజయం సాధించాడు. దీంతో 9.5 పాయింట్లతో అరవింద్ చిదంబరంతో కలిసి లలిత్‌బాబు సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా లలిత్ టైటిల్‌ను దక్కించుకోగా అరవింద్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. -
ఐపీఎల్ 2018 టోర్నీలో కెప్టెన్ల హవా
-
అతడే హంతకుడు
గౌతం చనిపోయాడన్న కబురు నన్ను కలచి వేసింది. గౌతం నా కో–ఎంప్లాయ్. ఎప్పటిలాగే నిన్న సాయంకాలం ఆఫీస్ వద్ద విడిపోయాం ఎవరి ఇళ్లకు వాళ్లం బయలుదేరుతూ. తెల్లారేసరికి ఈ కబురు. అరుణ ఫోన్ చేసి చెప్పింది. గౌతం భార్య అరుణ. తేరుకొని, ప్రస్తుతం నేను ఒక్కడినే ఉంటున్నాను కనుక, ఈజీగా తెములుకొని గౌతం ఇంటికి బయలుదేరాను. నేను వెళ్లే సరికి అక్కడ చాలా సాదాసీదాగా ఉంది. మెయిన్ డోర్ మూసి ఉంది. దానిని తోసుకొని లోనికి వెళ్లాను. హాలులో అర చేతుల్లో మొహం పెట్టుకొని ఏడుస్తున్న.. సోఫా మీది అరుణను గుర్తు ఎరిగాను. అటు వెళ్లి ఆమె పక్క సోఫా చైర్ లో కూర్చున్నాను. ‘ఏమిటి అరుణ ఇది. ఏం జరిగింది’ అనడగ్గలిగాను. అరుణ చేతుల్లోంచి మొహం బయట పెట్టింది. ఆమె కళ్లు ఉబ్బి ఉన్నాయి. నన్ను చూస్తూనే, ‘నాకూ ఏమీ బోధ పడట్లేదు’ అంది అరుణ. ‘ఏం జరిగింది’ అన్నాను. ఏం అడగాలో, ఎలా అడగాలో నాకూ బోధపడడం లేదు.అప్పుడే అక్కడకు రోహిత్ వచ్చాడు.గౌతం, అరుణల ఏకైక సంతానం రోహిత్. వాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.‘అంకుల్ వచ్చారా’ అంటూ అరుణ పక్కన కూర్చున్నాడు.నేనేం అనలేదు. వాడే చెప్పుకొచ్చాడు, ‘రాత్రి డిన్నర్ తర్వాత మమ్మీ డాడీలు హాలులో టీవీ వద్దకు, నేను నా రూంలోకి వెళ్లాం. ఉదయం మమ్మీ నా రూం తలుపు కొట్టి చెప్పింది డాడీ చనిపోయారని’ ‘టీవీ కట్టేసి మేము మా రూంకు వెళ్లిపోయాం. కొద్దిసేపు కబుర్ల తర్వాత నిద్రపోయాం. నేను లేచేసరికి గౌతం పక్కన లేరు. హాలులోనూ లేరు. మెయిన్ డోర్ లోపల నుంచి వేసిన లాక్ వేసినట్టే ఉంది. గౌతం కోసం ప్రాకులాడుతుండగా.. తను మా రూం అటాచ్ బాత్రూంలో కనిపించారు. నేల మీద పడి ఉన్నారు. గమనిస్తే చనిపోయారనిపించింది. ఆ వెంటనే రోహిత్ కు చెప్పాను. తర్వాత మీకు ఫోన్ చేశాను’ అని చెప్పింది అరుణ. ‘మమ్మీ చెప్పగానే నేను బయటకు వెళ్లాను గిరి అంకుల్ కోసం ఆయన ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో. వాళ్లది ల్యాండ్ ఫోన్. వాళ్లు మొబైల్ ఫోన్లు వాడరు కదా’ చెప్పాడు రోహిత్.‘గిరి అంకుల్ వచ్చారా’ అడిగింది అరుణ.‘లేదు మమ్మీ. ఆయన, సునీత ఆంటీ మార్నింగ్ వాక్కు వెళ్లారట. వాళ్ల పక్కింటి వాళ్లతో వాళ్లు రాగానే మన ఇంటికి అర్జెంట్‌గా పంపించమని చెప్పి వచ్చేశాను’ చెప్పాడు రోహిత్.వెంటనే, ‘ఆ పక్కింటి వాళ్లకి డాడీ విషయం చెప్పలేదు కదా’ అని అడిగింది అరుణ, రోహిత్‌ను.‘లేదు మమ్మీ’ చెప్పాడు రోహిత్. ‘మమ్మీ.. డాడీ బాడీని బయటకు చేరుద్దామా’ అడిగాడు రోహిత్ అరుణను.‘అన్నట్టు గౌతం బాడీ.. ఇంకా ఆ బాత్రూంలోనే ఉందా’ అన్నాను.‘అవునంకుల్. చెప్పేవరకు అటు వెళ్లొద్దని చెప్పింది మమ్మీ’ చెప్పాడు రోహిత్.‘అరె, అదేమిటి..? ఏమిటిది అరుణ’ అన్నాను.‘గౌతం బాడీని చూడలేం’ చెప్పింది అరుణ.‘అంటే’ నాకు అంతా విస్మయంగా ఉంది.‘రక్తంలో తేలినట్టు పడి ఉన్నారు’ చెప్పింది అరుణ.‘జారి పడ్డాడా‘ అడిగాను.‘లేదు. గౌతం గుండె వైపు లోతుగా కత్తి ఒకటి ఉంది. అటు నుంచే రక్తం కారినట్టు ఉంది’ చెప్పింది అరుణ.‘ఆత్మహత్యా..?’ అన్నాను.‘అలానే ఉంది’ అంది అరుణ.‘అరె. అంత అఘాయిత్యం ఏమిటి? గౌతం అసలు పిరికి వాడే కాదు’ అన్నాను గట్టిగానే. అరుణ ఏమీ అనలేదు.రోహిత్ సడన్‌గా, ‘హత్య కాదు కదా’ అనేశాడు. నేను గతుక్కుమన్నాను.అరుణ ఎటో చూస్తోంది.రోహిత్ గింజుకుంటున్నాడు.‘అక్కడకు పదండి మొదట’ అని అటువైపు కదిలాను.గౌతం ఇల్లంతా నాకు బాగా ఎరుకే.ఆ బాత్రూంలోకి వెళ్లి చూసేసరికి చాలా దారుణం అనిపించింది.‘అయ్యో’ అన్నాడు రోహిత్.అరుణ కనిపించలేదు. బయటే ఉండి పోయింది.రోహిత్ గట్టిగానే ఏడుస్తున్నాడు.గౌతం బాడీ అస్తవ్యస్తంగా ఉంది. ఆ బాడీని అంటిపెట్టుకొని నేలంతా రక్తం ముద్దలు ముద్దలుగా ఉంది. ఆ బాడీ గుండెవైపు కత్తి ఒకటి పిడి వరకు దిగబడి ఉంది.నేను బయటకు వచ్చేశాను రోహిత్‌ను సుమారుగా లాక్కుంటూనే.ఆ బెడ్రూంలో అరుణ లేదు.హాలులోకి వచ్చాం.అరుణ హాలులో ఆ సోఫాలోనే ఉంది.‘ఏం అనుకోవాలి’ అన్నాను.ఆ ఇద్దరూ ఏమీ అనడం లేదు.అప్పుడే గిరి, సునీతలు వచ్చారు. వీళ్లు గౌతం ఫ్యామిలీ ఫ్రెండ్స్.నేనే చొరవ తీసుకున్నాను. వాళ్లను తొలుత ఆ బాత్రూంలోకి తీసుకు వెళ్లి, తిరిగి హాలులోకి తీసుకు వచ్చాను. పిమ్మట మాట్లాడాను వాళ్లతో.‘మిస్టరీగా ఉందే’ అన్నారు గిరి.అరుణను ఓదారుస్తోంది సునీత.రోహిత్ ను దగ్గరగా తీసుకున్నారు గిరి.‘ఏం చేద్దాం’ నేను అడిగాను.ఎవరూ ఏమీ అనడం లేదు.నేనే, ‘పోలీస్ సహకారం తీసుకుందామా’ అనేశాను.‘వద్దు’ అంది అరుణ గమ్మున.నేను ఆశ్చర్యపోయాను. ‘ఈ సంగతి బయటకు పోతుంది. మా వాళ్ల వద్ద ఎగతాళి అవుతుందేమో. వాళ్లు గేలి చేస్తారేమో’ అంది అరుణ గజిబిజిగా.గౌతం, అరుణలది లవ్ మ్యారేజ్. ఇరువైపు పెద్దలూ సహకరించలేదు. అప్పటి నుంచి వీళ్లు వాళ్లకు దూరంగానే ఉంటున్నారు. కలపాలనే మా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి చాన్నాళ్ల కిందటే.‘ఐతే ఎలా. కనీసం విషయం మనకైనా తేలాలి కదా’ అన్నాను. గిరి అన్నారు అరుణతో, ‘విషయం నీకే తెలియాలి. మాకు మీ అన్యోన్యత తప్పా మరోటి తెలియదు’ అని.నేను అరుణనే చూస్తున్నాను ఏం చెబుతుందా అని.అప్పుడే, అరుణను, ‘చెప్పు అరు. నీకు ఏమైనా అనుమానం ఉందా’ అని అడిగింది సునీత.‘అబ్బే ఏమీ లేదు. నాకూ ఏమీ అర్థం కావడం లేదు సునీ‘ అంది అరుణ, సునీతతో.నేను, గిరి మొహాలు చూసుకున్నాం.‘మమ్మీ డాడీలు ఎప్పుడూ కనీసం కసురుకున్నట్టు కూడా మాట్లాడుకోలేదు. నాకు తెలుసుగా’ చెప్పాడు రోహిత్.‘య య. మాకూ తెలుసుగా. అందుకే ఎటూ తేల్చుకోలేకపోతున్నాం. ఏమీ అనలేకపోతున్నాం’ అన్నారు గిరి.నేనూ అదేఅన్నట్టు తలాడించాను.అప్పుడే పని మనిషి వచ్చింది.‘గంట ఆగి రావా’ అంది అరుణ ఆమెతో గబుక్కున.‘అదేమిటమ్మా’ అంది ఆ పని మనిషి.‘ఏమీ లేదు. సాయంకాలం రా’ అంది అరుణ చికాగ్గా.పని మనిషి వెళ్లిపోయింది.‘ఇలా ఎంతసేపు అని. ఏదోటి తేల్చేసుకోవాలి’ అన్నాను.‘నిజమేగా. బాడీని ఎంతసేపని దాయగలం’ అన్నారు గిరి.అరుణ ఏమీ మాట్లాడడం లేదు. అరుణే మాట్లాడాలి ఇక. అందుకే ఆమెపై ఒత్తిడి చేస్తున్నాను. సునీత కూడా అందుకు తోడ్పడుతోంది. గిరి ఏమీ అనకపోయినా తల పట్టుకొని కూర్చుండిపోయారు సోఫా కుర్చీలో. నేను అటూ ఇటూ తచ్చాడుతున్నాను.రోహిత్ ఎప్పుడో మరో సోఫా కుర్చీలోకి చేరిపోయాడు.‘కామ్‌గా బాడీని దహనపరిచేద్దామా’ అన్నాడు రోహిత్.‘ఎటూ తేలకుండానే’ అన్నాను.‘మరే. ఏమీ తేల్చుకోలేకపోతున్నాం. గౌతం ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి? అలాగే గౌతం హత్య కాబడడం ఏమిటి? రెండూ నమ్మలేం’ అన్నారు గిరి.నేను అరుణతో, ‘మీ మధ్య రాత్రి జరిగిన విషయాలు కాస్తా మాతో షేర్ చేసుకో ఓ మారు. ఏమైనా తేల్చుకోగలమేమో’ అని అన్నాను.అరుణ, ‘సాదాగానే మాట్లాడుకున్నాం’ అని అంటూనే, ‘టీవీ చూస్తుండగా ఏదో ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ గదిలో ఉంది. గౌతం వెళ్లి ఫోన్ మాట్లాడి తిరిగి వచ్చారు. అది సాధారణమే. ఇలా అప్పుడప్పుడూ కాల్స్ వస్తుంటాయి. అంతే. ఆ వెంటనే గౌతం టీవీ ఆఫ్ చేసేశారు. మేము మా రూంకు వెళ్లిపోయాం’ అంది.నేను, ‘సరే సరే. గౌతం ఫోన్ ఎక్కడా’ అని అన్నాను.‘మా బెడ్రూంలోనే ఉంటుంది’ అని చెప్పింది అరుణ. అంతలోనే లేవబోయింది.నేనే వారించి, అటు వెళ్లాను. ఆ ఫోన్‌తో తిరిగి వచ్చాను.స్క్రీన్ లాక్ పేటర్న్ ఇచ్చి ట్రూకాలర్ యాప్‌లోకి వెళ్లాను. మొదటిగా కనిపించిన కాల్ వివరాలు చూశాను. రాత్రి 9.40కి వచ్చిందది. కాలర్ రోహిత్.‘లాస్ట్ కాల్ వచ్చింది నీ నుంచే’ అన్నాను రోహిత్‌తో.‘అవును రాత్రి డాడీకి చేశాను. స్టడీకి వీలుకావడం లేదు టీవీ వాల్యూమ్ తగ్గించమని చెప్పాను’ అన్నాడు రోహిత్. ‘ఇది కామనే. వాడు చాలాసార్లు ఇలానే చేస్తాడు’ చెప్పింది అరుణ. ‘నిజానికి మమ్మీ, డాడీ తక్కువ వాల్యూమే పెడతారు. అది నా స్టడీకి ఇబ్బందే కాదు. కానీ తొమ్మిదిన్నర దాటాక వాళ్లు వెళ్లి నిద్రపోవాలని నేనలా కాల్ చేస్తుంటాను’ చెప్పాడు రోహిత్.అరుణ రోహిత్ వైపు చూస్తోంది.‘అబ్బే కారణం తెలుసుకోవడం మనకు సాధ్యం కాదు’ అనేశారు గిరి.కొద్దిసేపు మౌనం తర్వాత, అరుణ ఉన్నట్టు ఉండి, ‘బెబ్బెబ్బే’ అంటూ గొణగడం చేపట్టింది. నేను ఆమెను చూసి, పిమ్మట ఆమె చూస్తున్న వైపు చూశాను.అలా చూస్తూనే, ‘అరె గౌతం. అదేమిటి అలా నడుచుకు వచ్చేస్తున్నాడు’ అన్నాను.గౌతం నవ్వుకుంటూ మా వద్దకు వచ్చేశాడు. అతడి గుండెవైపు కత్తి అలానే ఉంది. బట్టల మీద రక్తం అలానే ఉంది.వస్తూనే అతడు, ‘ఆల్ ఆర్ ఫూల్స్’ అన్నాడు గబగబా నవ్వుతూనే.అవును కదూ, ఈ రోజు ఫూల్స్ డే కదూ.‘చాలు చాలు గొప్ప ఘనకార్యం చేశారు. హడలిపోతున్నాం తెలుసా. ఇది మీకు తగదు’ అన్నారు గిరి.అంతా గౌతం చుట్టూ చేరి ఉన్నాం.గౌతం నవ్వుతూనే తన గుండెవైపు కత్తిని తీశాడు. అది స్ప్రింగ్ బాక్.మేము నవ్వలేక నవ్వేయవలసి వస్తోంది. అప్పుడే చూశాను అరుణను, ఆమె స్పందన కానరాక.అరుణ ఆ సోఫాలనే ఉంది.మమ్మల్నే చూస్తోంది. కానీ ఆమెలో కదలిక లేదు. కుదిపి చూశాను. ఆమె గబుక్కున పక్కకు వాలిపోయింది. అంటే ... అరుణ గుండె ఆగి చనిపోయిందని, ‘ఈ ప్రాక్టికల్ జోక్ మూల్యం ఒక ప్రాణం’ అని అనకుండా ఉండలేకపోయాను. - బివిడి ప్రసాదరావు -
ప్రియురాలి మోజులో..
బనశంకరి: ప్రియురాలి మోజులో పడి వ్యక్తి భార్య,త న తల్లిపై దాడికి యత్నించిన శుక్రవారం నగరంలోని పులకేశినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నగరంలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న రోహిత్‌కు స్నేహ అనే యువతితో ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహం అనంతరం రోహిత్ భార్య స్నేహ, తల్లి నందారలతో కలసి పులకేశినగర్లో ఉంటున్నాడు. అయితే కొద్ది కాలం క్రితం అవంతిక అనే యువతితో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సం బంధానికి దారి తీయడంతో రోహిత్ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసాడు. దీంతో తల్లి నందా ర, భార్య స్నేహాలు ఇదే విషయమై రోహిత్‌తో గొడవ పడుతుండేవారు. శుక్రవారం కూడా ఇదే విషయమై ముగ్గురి మధ్య గొడవ చోటు చేసుకోవడంతో ప్రియురాలు అవంతికతో కలసి రోహిత్ తన తల్లి నందార, భార్య స్నేహలపై దాడికి యత్నించాడు. వీరి కేకలు విన్న స్థానికులు వెంటనే నందార, స్నేహలను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. నందార, స్నేహల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ముంబైతోనే రోహిత్, పాండ్యా
న్యూఢిల్లీ: ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ముగ్గురు కీలక ఆటగాళ్లను కొనసాగించడం దాదాపుగా ఖాయమైంది. మూడు టైటిల్స్ అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను మరో ఆలోచన లేకుండా ముంబై అట్టి పెట్టుకోనుంది. అతనితో పాటు పాండ్యా సోదరులను కూడా రిటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన హార్దిక్ పాండ్యాతో పాటు 2017 ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన కృనాల్ పాండ్యాను కూడా ముంబై కొనసాగించనుంది. పొలార్డ్, జస్ప్రీత్ బుమ్రాలను ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా జట్టులోకే తీసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. టీమ్‌లో ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులను రిటెయిన్ చేసుకుంటే రూ. 21 కోట్లు (12.5+ 8.5), ముగ్గురిని రిటెయిన్ చేసుకుంటే రూ. 33 కోట్లు (15+11+7) చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ముంబై ఇండియన్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా అరంగేట్రం చేయని కృనాల్‌ను రూ. 3 కోట్లకే తమతో కొనసాగించుకునేందుకు సిద్ధంగా ఉందని బీసీసీఐ అధికారి ఒకరు వివరించారు. -
పెళ్లిరోజున భావోద్వేగం
-
రోహిత్ జోడీకి టైటిల్
‘ఐటా’ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ అసోసియేషన్ (ఐటా) టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఏకే రోహిత్ సత్తా చాటాడు. పల్లవి మోడల్ స్కూల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో విజేతగా, సింగిల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. అండర్–18 బాలుర డబుల్స్ ఫైనల్లో రోహిత్–పి.కుమార్ ద్వయం 6–1, 6–7 (4/7), 10–5తో సీహెచ్ అర్జున్–కర్రా తరుణ్ జంటపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. సింగిల్స్ విభాగంలో రోహిత్ 4–6, 3–6తో సీహెచ్ అర్జున్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. బాలికల విభాగంలో సంస్కృతి దామెర చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో సంస్కృతి 6–1, 6–4తో ఎస్. సంజనపై గెలుపొందింది. -
వానలో కుమ్మేశారు
► భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు ► 124 పరుగులతో టీమిండియా ఘనవిజయం ► చెలరేగిన యువరాజ్, కోహ్లి ► రాణించిన రోహిత్, ధావన్ ► హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన అవలీలగా, అలవోకగా... అతి సునాయాసంగా, అసలు పోటీ అనేదే లేకుండా భారత్ ప్రత్యర్థిని కుమ్మేసింది... మాటలకే తప్ప మన ‘పక్కింటోడు’ ఆటలో మనకు ఆమడ దూరం దిగువన ఉన్నాడని మరో మారు ఢంకా బజాయించి చెప్పింది... ఎక్కడా తడబాటు లేకుండా పాకిస్తాన్ పని పట్టిన టీమిండియా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో 24,156 మంది రికార్డు స్థాయి ప్రేక్షకుల మధ్య మన విజయ ధ్వజాన్ని గర్వంగా ఎగరేసింది. వర్షం పదే పదే వెంటాడినా... చివరకు కోహ్లి సేననే విక్టరీ వానలో తడిసింది. ఏడాదిన్నర విరామం తర్వాత మళ్లీ జత కట్టిన రోహిత్, శిఖర్ జంట సాధికారికంగా తమ ఓపెనింగ్ బాధ్యతలు నెరవేర్చింది... ఆపై కోహ్లి ఎప్పటిలాగే మరో అర్ధ సెంచరీ...పాత బాకీ తీర్చాలన్నట్లుగా యువరాజ్ సింగ్ బ్యాటింగ్ మోతతో చెలరేగిపోగా, చివర్లో పాండ్యా హ్యాట్రిక్ సిక్సర్లతో తానూ ఉన్నానని గుర్తు చేశాడు. ఆరంభం నుంచే ఆపసోపాలు పడిన పాక్‌కు ఇది తలకు మించిన భారమే అయిపోయింది. ప్రతీ పరుగు కోసం శ్రమించిన ఆ జట్టు చివరకు బొక్కబోర్లా పడింది. బర్మింగ్‌హామ్: చాంపియన్స్ ట్రోఫీ విజయయాత్రను భారత్ ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై సునాయాస విజయంతో డిఫెండింగ్ టీమ్ తమ పదును చూపించింది. ఆదివారం ఇక్కడ ఏకపక్షంగా సాగిన వన్డేలో భారత్ 124 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 48 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (119 బంతుల్లో 91; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (68 బంతుల్లో 81 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్ (65 బంతుల్లో 68; 6 ఫోర్లు, 1 సిక్స్), యువరాజ్ సింగ్ (32 బంతుల్లో 53; 8 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరులో కీలక పాత్ర పోషించారు. చివరి 4 ఓవర్లలో భారత్ ఏకంగా 72 పరుగులు కొల్లగొట్టడం విశేషం. వర్షంతో అంతరాయం కలిగిన కారణంగా పాకిస్తాన్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 289 పరుగులుగా నిర్దేశించారు. అయితే పాక్ 33.4 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 8న శ్రీలంకతో ఆడుతుంది. మరో సెంచరీ... నాలుగేళ్ల క్రితం చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఐదు మ్యాచ్‌లలో వరుసగా 127, 101, 58, 77, 19 పరుగులు జోడించి జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి కూడా వీరిద్దరు భారత్‌కు అదిరే ఆరంభం ఇచ్చారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడిన వీరిద్దరు కుదురుకున్నాక చక్కటి షాట్లతో అలరించారు. ఆమిర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేయడంతో భారత్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 17వ బంతికి రోహిత్ తొలి ఫోర్ కొట్టగా, ధావన్ 23 బంతులు తీసుకున్నాడు. వర్షంతో వచ్చిన విరామం తర్వాత వీరిద్దరు వేగంగా దూసుకుపోయారు. షాదాబ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ కొట్టి రోహిత్ 71 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా... వహాబ్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన ధావన్ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో మూడు సెంచరీల భాగస్వామ్యాలు నమోదు చేసిన ఏకైక జోడి రోహిత్, ధావన్‌దే కావడం విశేషం. ఎట్టకేలకు ధావన్‌ను అవుట్ చేసిన షాదాబ్, పాక్‌కు తొలి వికెట్ అందించాడు. కొద్ది సేపటి తర్వాత సెంచరీ దిశగా దూసుకుపోతున్న సమయంలో రోహిత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు 43 పరుగుల వద్ద కోహ్లి ఇచ్చిన క్యాచ్‌లో డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫహీం అష్రఫ్ వదిలేశాడు. యువీ మెరుపులు... ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డేల్లో చెలరేగిన యువీ, ఇప్పుడు ఇంగ్లండ్‌లో తన సత్తా ప్రదర్శించాడు. 8 పరుగుల వద్ద లాంగాఫ్‌లో తాను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయగా, యువరాజ్ దానిని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అదే హసన్ బౌలింగ్‌లో 4 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ కొట్టిన యువీ, వహాబ్ బౌలింగ్‌లో 3 బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (29 బంతుల్లోనే)ని నమోదు చేశాడు. మరో ఎండ్‌లో కోహ్లి తనదైన శైలిలో చూడచక్కటి షాట్లతో అలవోకగా అర్ధ సెంచరీ సాధించాడు. వహాబ్ వేసిన 46వ ఓవర్లో భారత్ పండగ చేసుకుంది. ఈ ఓవర్లో కోహ్లి వరుసగా 4, 4, 6 కొట్టగా, యువీ మరో ఫోర్ బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. హసన్ బౌలింగ్‌లో యువీ అవుట్ కావడంతో ఈ 93 పరుగుల (9.4 ఓవర్లలో) భారీ భాగస్వామ్యానికి తెర పడింది. పాండ్యా సూపర్... ఇమాద్ వేసిన ఆఖరి ఓవర్లో కూడా భారత్ 23 పరుగులు పిండుకుంది. ఐపీఎల్ ఉత్సాహంతో ఉన్న హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు)ను బ్యాటింగ్‌లో ధోనికంటే ముందు పంపి భారత్ ఫలితం సాధించింది. తొలి మూడు బంతుల్లో పాండ్యా భారీ సిక్సర్లతో చెలరేగాడు. అదే ఓవర్ చివరి బంతికి కోహ్లి మరో ఫోర్ కొట్టి ఇన్నింగ్స్‌ను ముగించాడు. చాంపియన్స్ ట్రోఫీలో అతి చెత్త బౌలింగ్ ప్రదర్శన వహాబ్ రియాజ్ (0/87) పేరిట నమోదైంది. టపటపా... భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఏ దశలోనూ దూకుడు కనబర్చలేకపోయింది. ఓపెనర్ షహజాద్ (12), బాబర్ ఆజం (8) ఏ మాత్రం ప్రభావం చూపించకుండానే వెనుదిరిగారు. భారత పేసర్లు కట్టుదిట్టమైన బంతులు విసరడంతో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం దక్కలేదు. తొలి 15 ఓవర్లలో (90 బంతుల్లో) పరుగులు రాని బంతులు (డాట్ బాల్స్) ఏకంగా 56 ఉండటం మన బౌలింగ్ సత్తాను, పాక్ ఘోర వైఫల్యాన్ని చూపిస్తోంది. ఆ తర్వాత కూడా పాక్ పుంజుకోలేదు. రోహిత్ అవుటా...నాటౌటా? షాదాబ్ వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్లో కోహ్లి పాయింట్ దిశగా ఆడి సింగిల్‌కు ప్రయత్నించగా... బాబర్ విసిరిన త్రోను అందుకొని కీపర్ బెయిల్స్‌ను పడగొట్టాడు. ఆ సమయంలో రోహిత్ డైవ్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో నేలని తాకిన అతని బ్యాట్ పైకి లేచింది. థర్డ్ అంపైర్ కెటిల్‌బరో పలు రీప్లేల తర్వాత రోహిత్ అవుటైనట్లు ప్రకటించారు. అయితే దీనిపై కూడా సందేహాలు తలెత్తాయి. పాయింట్ దిశ నుంచే కాకుండా దానికి వ్యతిరేక దిశ అయిన స్క్వేర్ లెగ్ నుంచి అంపైర్ ఒక్క రీప్లే కూడా చూడలేదు. అప్పుడు మరింత స్పష్టత వచ్చి ఉండేదని వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. వర్షంతో అంతరాయం... ఊహించినట్లుగానే భారత్, పాక్ మ్యాచ్‌కు వాన అడ్డంకిగా నిలిచింది. ఆరంభంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్ణీత సమయానికే మ్యాచ్ ప్రారంభం అయింది. అయితే 9.5 ఓవర్లలో భారత్ స్కోరు 46/0 ఉన్న సమయంలో జోరుగా వాన కురిసింది. 45 నిమిషాల పాటు బ్రేక్ వచ్చిన తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది. 33.1 ఓవర్ల తర్వాత మరోసారి వర్షం బర్మింగ్‌హామ్ మైదానాన్ని పలకరిచింది. ఈసారి మరో 48 నిమిషాల పాటు ఆట ఆగిపోవడంతో మ్యాచ్‌ను 48 ఓవర్లకు కుదించారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లో 4.4 ఓవర్ల తర్వాత మళ్లీ వర్షం రావడంతో ఆ జట్టు లక్ష్యాన్ని, ఓవర్లను కుదించాల్సి వచ్చింది. మ్యాచ్‌కు ముందు లండన్‌లో శనివారం రాత్రి జరిగిన కత్తిపోట్ల దుశ్చర్యలో మరణించినవారికి నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు మౌనం పాటించారు. ► భారత్ తరఫున అత్యధిక ఐసీసీ టోర్నీలు ఆడిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ (14) నిలిచాడు. అతను 3 వన్డే వరల్డ్ కప్‌లు, 6 టి20 ప్రపంచ కప్‌లు, 5 చాంపియన్స్ ట్రోఫీలు ఆడాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ రనౌట్ 91; ధావన్ (సి) అజహర్ (బి) షాదాబ్ 68; కోహ్లి నాటౌట్ 81; యువరాజ్ సింగ్ ఎల్బీడబ్ల్యూ (బి) హసన్ అలీ 53; హార్దిక్ పాండ్యా నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (48 ఓవర్లలో 3 వికెట్లకు) 319. వికెట్ల పతనం: 1–136, 2–192, 3–285. బౌలింగ్: ఆమిర్ 8.1–1–32–0, ఇమాద్ వసీమ్ 9.1–0–66–0, హసన్ అలీ 10–0–70–1, వహాబ్ రియాజ్ 8.4–0–87–0, షాదాబ్ ఖాన్ 10–0–52–1, షోయబ్ మాలిక్ 2–0–10–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: అజహర్ అలీ (సి) పాండ్యా (బి) జడేజా 50; షెహజాద్ ఎల్బీడబ్ల్యూ (బి) భువనేశ్వర్ 12; బాబర్ ఆజం (సి) జడేజా (బి) ఉమేశ్ 8; హఫీజ్ (సి) భువనేశ్వర్ (బి) జడేజా 33; షోయబ్ మాలిక్ రనౌట్ 15; సర్ఫరాజ్ అహ్మద్ (సి) ధోని (బి) పాండ్యా 15; ఇమాద్ వసీమ్ (సి) జాదవ్ (బి) పాండ్యా 0; షాదాబ్ ఖాన్ నాటౌట్ 14; ఆమిర్ (సి) జాదవ్ (బి) ఉమేశ్ 9; హసన్ అలీ (సి) ధావన్ (బి) ఉమేశ్ 0; వహాబ్ రియాజ్ (అబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (33.4 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–47, 2–61, 3–91, 4–114, 5–131, 6–135, 7–151, 8–164, 9–164. బౌలింగ్: భువనేశ్వర్ 5–1–23–1, ఉమేశ్ 7.4–1–30–3, బుమ్రా 5–0–23–0, పాండ్యా 8–0–43–2, జడేజా 8–0–43–2. -
కుర్రాడు రఫ్
ఓ వైపు క్లాస్.. మరో వైపు మాస్ పాత్రలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు నారా రోహిత్. వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకుంటూ జోరుగా దూసుకెళుతున్న రోహిత్ నటించిన తాజా చిత్రం ‘కథలో రాజకుమారి’. నారా రోహిత్, నాగశౌర్య, నమితా ప్రమోద్, నందిత ముఖ్య తారలుగా మహేశ్ సూరపనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘తెలుగు తెరపై ఇప్పటి వరకూ చూడని విభిన్నమైన పాత్రలో నారా రోహిత్ కనిపిస్తారు. ఆయనది రఫ్ క్యారెక్టర్. రోహిత్, నాగ శౌర్య మధ్య సన్నివేశాలు హైలైట్. ఇళయరాజాగారు ఈ చిత్రానికి రెండు పాటలకు ట్యూన్స్ అందించడం విశేషం. విశాల్ చంద్రశేఖర్ మరో ఐదు పాటలను స్వరపరిచారు. ఈ చిత్రాన్ని జూన్ 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నరేష్ కె. రాణా, సమర్పణ: రాజేష్ వర్మ సిరివూరి, నిర్మాణం: ఆరోహి సినిమా, అరన్ మీడియా వర్క్స్, శ్రీహాస్ ఎంటర్టైన్మెంట్స్, సుధాకర్ ఇంపెక్స్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్. -
రోహిత్ మ్యాజిక్
-
రోహిత్ మ్యాజిక్
►ముంబైని గెలిపించిన నాయకుడు ►ఆకట్టుకున్న బట్లర్, రాణా, మెక్లీనగన్ ►బెంగళూరుకు మరో ఓటమి ముంబై: ముంబై ఇండియన్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. వరుసగా ఆరు విజయాల అనంతరం తగిలిన షాక్ నుంచి త్వరగానే కోలుకున్న రోహిత్ సేన తమ చివరి మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో నెగ్గగా.. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. ఆఖరి ఓవర్ వరకు జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్‌తో తుదికంటా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. అటు ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయిన కోహ్లి బృందం ఎప్పటిలాగే బ్యాటింగ్‌లో పెద్దగా ప్రభావం చూపకపోగా బౌలర్లు కాస్త రాణించినా ముంబై బ్యాట్స్‌మెన్ నిలకడ ముందు నిలవలేకపోయారు. ఫలితంగా ఐదు వికెట్లతో ముంబై గెలుపొందింది. వాంఖడే మైదానంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. డి విలియర్స్ (27 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), పవన్‌నేగి (23 బంతు ల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. మెక్లీనగన్‌కు మూడు, కృనాల్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లకు 165 పరుగులు చేసి నెగ్గింది. బట్లర్ (21 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. నేగికి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్‌శర్మకి దక్కింది. డి విలియర్స్ కీలక ఇన్నింగ్స్ ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు మరోసారి శుభారంభం అందకపోగా.. మూడు ఓవర్ల వ్యవధిలోనే ఓపెనర్లు విరాట్ కోహ్లి (14 బంతుల్లో 20; 2 సిక్సర్లు), మన్దీప్ సింగ్ (13 బంతుల్లో 17; 3 ఫోర్లు) వెనుదిరగడంతో 40 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. అయితే డి విలియర్స్ జట్టు ఇన్నింగ్స్ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. బరిలోకి దిగిన ఆరో ఓవర్లోనే వరుసగా 4,6తో చెలరేగాడు. కృనాల్ వేసిన తొమ్మిదో ఓవర్లోనే మరో ఫోర్, సిక్స్‌తో పరుగుల వేగాన్ని పెంచాడు. అయితే కృనాల్ తన వరుస రెండు ఓవర్లలో బెంగళూరుకు గట్టి షాకే ఇచ్చాడు. 11వ ఓవర్లో హెడ్ (15 బంతుల్లో 12; 1 ఫోర్)ను, 12వ ఓవర్లో ధాటిగా ఆడుతున్న డి విలియర్స్‌ను దెబ్బతీయడంతో ముంబై సంబరాల్లో మునిగింది. వాట్సన్ (3) కూడా స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో 108 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టు ఓ మాదిరి స్కోరైనా చేయగలుగుతుందా అనిపించింది. కానీ చివరి మూడు ఓవర్లలో కేదార్ జాదవ్, పవన్ నేగి జోడి జట్టును ఆదుకుంది. ముఖ్యంగా నేగి 18వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదడంతో 15 పరుగులు వచ్చాయి. అయితే చివరి ఓవర్లో తడబడిన జట్టు ఆఖరి మూడు బంతుల్లో నేగి, జాదవ్, అరవింద్ వికెట్లును కోల్పోయింది. ఆరో వికెట్‌కు జాదవ్, నేగి మధ్య 54 పరుగులు రావడంతో జట్టు స్కోరు 150 పరుగులు దాటగలిగింది. రోహిత్ నిలకడ ఓ మాదిరి లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబైకి తొలి బంతికే షాక్ తగిలింది. అనికేత్ బౌలింగ్‌లో ఫామ్‌లో ఉన్న పార్థివ్ పుల్ షాట్ ఆడబోయి డకౌటయ్యాడు. అయితే బట్లర్, నితీశ్ రాణా (28 బంతుల్లో 27; 4 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకున్నారు. రెండో ఓవర్లో రాణా రెండు ఫోర్లు బాదగా మరుసటి ఓవర్లో బట్లర్ మూడు ఫోర్లతో చెలరేగాడు. అయితే జోరు మీదున్న ఈ జోడిని పవన్ నేగి పెవిలియన్‌కు పంపాడు. 8వ ఓవర్లో బట్లర్‌ను అవుట్ చేయగా రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తన మరుసటి ఓవర్లో నితీష్ భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద క్యాచ్ అవుటయ్యాడు. దీంతో జట్టు 70 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. పొలార్డ్ (13 బంతుల్లో 17; 2 ఫోర్లు) కొద్దిసేపే క్రీజులో నిలిచాడు. కృనాల్ (2 రిటైర్డ్ హర్ట్) తానెదుర్కొన్న రెండో బంతికే సింగిల్ తీసే క్రమంలో త్రో బాల్ తగిలి మైదానం వీడాడు. ఇక చివరి 12 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన దశలో రోహిత్ ఓ సిక్స్ బాది ఒత్తిడి తగ్గించడంతో పాటు 34 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. చివరి ఓవర్లో ఏడు పరుగులు అవసరం కాగా మరో బంతి మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది. -
ముంబై మెరిసేనా..?
►నేడు గుజరాత్‌తో తలపడనున్న రోహిత్‌సేన ►ముంబై వరుస విజయాలకు పుణే అడ్టుకట్ట.. ►ఆత్మవిశ్వాసంతో లయన్స్ రాజ్‌కోట్: ఈ సీజన్లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ శనివారం గుజరాత్ లయన్స్‌తో తలపడనుంది. వరుసగా ఆరు విజయాలు సాధించిన ముంబై జోరుకు చివరి మ్యాచ్‌లో అడ్డుకట్ట పడింది. దీంతో మళ్లీ గెలుపుబాటలోకి ప్రవేశించాలని రోహిత్‌సేన భావిస్తుండగా.. చివరిమ్యాచ్‌లో నెగ్గి ఆత్మవిశ్వాసంతో ఉన్న గుజరాత్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ముంబై దూకుడు.. ఈ సీజన్లో ముంబై జోరు కొనసాగుతోంది. తొలిమ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ చేతిలో ఓడిన తర్వాత వరుసగా ఆరు విజయాలు సాధించింది. పట్టికలో ‘టాప్’స్థానం కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చాలాసార్లు తలపడింది. అయితే గత మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై దూకుడుకు మళ్లీ పుణేనే అడ్డుకట్ట వేసింది. వరుస విజయాలు తెచ్చిన ఊపులో మితిమీరిన అత్మవిశ్వాసంతో రోహిత్‌సేన ఆ మ్యాచ్‌లో ఓడిందంటే అతిశయోక్తి కాదు. దీన్ని సవరించుకోవాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. బ్యాటింగ్ విషయానికొస్తే కుర్ర బ్యాట్స్‌మన్ నితీశ్ రాణా ఎనిమిది మ్యాచ్‌ల్లో 266 పరుగులు చేసి జట్టు తరఫున అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. జోస్ బట్లర్ (230 పరుగులు), కీరన్ పోలార్డ్ (199 పరగులు) సత్తా చాటుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌ను అందుకోగా.. పార్థివ్ పటేల్ ఆకట్టుకుంటున్నాడు. పాండ్య సోదరులు కృనాల్, హర్దిక్ అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ తమ ప్రతిభను చాటుతున్నారు. ఇక బౌలింగ్ విషయానికొస్తే మిషెల్ మెక్లీనగన్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో సత్తాచాటాడు. జస్ప్రీత్ బుమ్రా 9 వికెట్లతో ఆకట్టుకోగా.. హర్భజన్ 4 వికెట్లు మాత్రమే తీసినా తక్కువ ఎకానమీ రేట్‌తో రాణించాడు. మలింగ ఫర్వాలేదనిపిస్తున్నాడు. ముంబై ఓడిన రెండు మ్యాచ్‌లు పుణేతో జరిగినవి కావడం విశేషం. ఈక్రమంలో గుజరాత్‌తో మ్యాచ్ ద్వారా తిరిగి విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఈ సీజన్లో ఇరుజట్లు పరస్పరం తలపడగా.. ఆరు వికెట్లతో ముంబై ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈక్రమంలో శనివారం మ్యాచ్‌లో రోహిత్‌సేన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. రైనా బరిలోకి దిగేనా.. మరోవైపు గుజరాత్ లయన్స్ ప్రస్థానం ఈ సీజన్లో పడుతూ లేస్తూ సాగుతోంది. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన రైనాసేన కేవలం మూడు మ్యాచ్‌ల్లో నెగ్గగా.. ఐదింటిలో పరాజయం పాలైంది. దీంతో పట్టికలో ఆరు పాయింట్లతో ఆరోస్థానంలో ఉంది. కెప్టెన్ సురేశ్ రైనా గాయం జట్టును ఆందోళన పరుస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రైనా భుజానికి గాయం అయింది. గాయంతోనే రైనా బ్యాటింగ్ కొనసాగించి జట్టును విజయాతీరాలకు చేర్చాడు. నాకౌట్‌కు చేరాలంటే మిగతా ఆరు మ్యాచ్‌ల్లో వీలైనన్నీ ఎక్కువ మ్యాచ్‌ల్లో గుజరాత్ విజయం సాధించాల్సిందే. ఈక్రమంలో సారథి గాయం జట్టును కలవరపరుస్తోంది. అయితే మ్యాచ్ ప్రారంభానికల్లా రైనా తుదిజట్టులోకి వస్తాడని జట్టు మేనేజ్మెంట్క్ష నమ్మకంతో ఉంది. మరోవైపు ఈసీజన్లో సూపర్‌ఫామ్‌లో ఉన్న రైనా.. 309 పరుగులతో జట్టు తరఫున అగ్రస్థానంలో కొనసాగుతున్నడు. బ్రెండన్ మెకల్లమ్, దినేశ్ కార్తిక్, ఆరోన్ ఫించ్ రాణిస్తున్నారు. ఇషాన్ కిషన్ తన బ్యాట్‌కు పనిచెప్పాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే సంచలన పేసర్ అండ్రూ టై 12 వికెట్లతో అదరగొడుతున్నాడు. స్టార్ స్పిన్నర్ రవీంద్ర జాడేజా.. బెంగళూరు మ్యాచ్‌లో తన మ్యాజిక్ చూపాడు. బాసిల్ థంప్సి, జేమ్స్ ఫాల్క్‌నర్ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. మరోవైపు గత సీజన్లో ముంబైతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ విజయం సాధించడం విశేషం. దీంతో శనివారం మ్యాచ్‌లో అదే ప్రదర్శన పునరావృతం చేయాలని రైనాసేన కృత నిశ్చయంతో ఉంది. -
అదరహో రోహిత్
-
మూత్ర విసర్జన విషయంలో గొడవ.. విద్యార్థి మృతి
బనశంకరి (కర్ణాటక) : మూత్ర విసర్జన విషయంలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈఘటన బెంగళూరులోని బ్యాడరహళ్లిపోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. నెలమంగల పరిధిలోని సోలూరు ప్రాంతానికి చెందిన రో హిత్(20) ఈస్ట్‌వెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతూ దేవరాజ్ అరసు హాస్టల్లో ఉంటున్నాడు. ఇదే కాలేజీలో చదువుతున్న అమరేశప్ప, విజయనగర ప్రభుత్వ కళాశాల విద్యార్థి రవీశ్‌లు కూడా అదే హాస్టల్లో ఉంటున్నారు. రవీశ్ గురువారం రాత్రి మద్యం సే వించి హాస్టల్‌కు చేరుకుని బాత్రూమ్కు వెళ్లాడు. తలు పు వేసుకోకుండా మూత్రచేస్తుండగా తలుపు వేసుకో వాలని రోహిత్, అమరేశ్ సూచించారు. ఈ విషయంలో వారి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రవీశ్ గదిలోకి వెళ్లి కత్తి తీసుకొని రోహిత్ గొంతుపై దాడిచేశాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన అమరేశ్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు. గాయపడిన ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం రోహిత్‌ను విక్టోరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. హస్టల్ వార్డె¯ŒS కేశవగౌడపాటిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాడరహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి రవీశ్‌ను అరెస్ట్ చేశారు. -
చెస్ చాంప్స్ రోహిత్, వరుణ్
సాక్షి, హైదరాబాద్: బ్రిలియంట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో రోహిత్ రెడ్డి, వరుణ్ సత్తా చాటారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో జరిగిన ఈ టోర్నీలో జూనియర్స్ విభాగంలో రోహిత్, ఓపెన్ విభాగంలో వరుణ్ చాంపియన్లుగా నిలిచారు. జూనియర్స్ విభాగంలో ఆరురౌండ్లు ముగిసేసరికి 5.5 పాయింట్లతో రోహిత్ రెడ్డి, కృష్ణ దేవర్‡్ష సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోర్ ఆధారంగా రోహిత్ విజేతగా నిలవగా... కృష్ణ దేవర్‡్ష రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 5 పాయింట్లతో గండికోట రిత్విక్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఓపెన్ కేటగిరీలో ఆరు రౌండ్లు ముగిసేసరికి 5.5 పాయింట్లు సాధించిన వి.వరుణ్ విజేతగా నిలిచాడు. రాఘవ శ్రీవాత్సవ, కార్తీక్ కుమార్ వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. అండర్–14 విభాగంలో కృష్ణ దేవర్‡్ష, శ్రీశాంతి... అండర్–12 విభాగంలో హృషికేశ్ అనీశ్, ఎ. భవిష్య... అండర్–10 విభాగంలో జి.రిత్విక్, సమీర, అండర్–8 విభాగంలో చిద్విలాస్ సాయి, శరణ్య విజేతలుగా నిలిచారు. ఈ టోర్నీలో జేఆర్సీ ప్రసాద్ ‘బెస్ట్ వెటరన్’ పురస్కారాన్ని గెలుచుకోగా... వి. సరయుకు ‘బెస్ట్ ఉమెన్’ అవార్డు దక్కింది. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సీనియర్ ఫైనాన్స్ మేనేజర్ కె. సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. జూనియర్స్ కేటగిరీ ఆరోరౌండ్ గేమ్ ఫలితాలు రిత్విక్ (5)... శ్రీశాంతి (4)పై, ప్రియాన్‡్ష రెడ్డి (4.5)... భవిష్య (3)పై, ఆర్ణవ్ ప్రధాన్ (4.5)... జి. విశాల్‌పై గెలుపొందారు. రోహిత్‌రెడ్డి (5.5), కృష్ణ దేవర్‡్ష (5.5)... చిద్విలాస సాయి (4.5), సిద్ధార్థ్ దేశ్‌పాండే (4)ల మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి. ఓపెన్ కేటగిరీ ఆరోరౌండ్ గేమ్ ఫలితాలు: రాఘవ శ్రీవాత్సవ (5)... రాజు (4)పై, షణ్ముఖ తేజ (5)... సురేశ్ బాబు (4)పై, దిగ్విజయ్ సునీల్ (4.5)... సత్యనారాయణ (3.5)పై నెగ్గారు. కార్తీక్ కుమార్ ప్రదీప్ (5), వరుణ్ (5.5)... ప్రతీక్ శ్రీవాస్తవ (4), శ్రీవిజయ్ సునీల్ (4)ల మధ్య జరిగిన గేమ్‌లు డ్రా అయ్యాయి. -
అక్షరాలు దిద్దించేటప్పుడే.. వివక్షలను చెరిపేయించాలి
రేపటికి ఏడాది! హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ మరణించి ఏడాది పూర్తయినా ఇంకా న్యాయం కోసం దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, విద్యార్థిలోకం ఎదురుచూస్తూనే ఉన్నాయి! విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోన్న వివక్షని భరిస్తూ, నిర్లిప్తతను అలవాటుగా మార్చుకున్న సమాజం మేల్కొనకపోతే రోహిత్ లాంటి బలవన్మరణాలు పునరావృతం అవుతూనే ఉంటాయి. అందుకే.. అసమానతలను పెంచి పోషించే ఈ విద్యావిధానంలో మార్పు రాకుండా విశ్వవిద్యాలయాల్లో మరణాలకు చరమగీతం పాడలేము అని అంటున్నారు పౌర హక్కుల ఉద్యమకారిణి, ప్రముఖ పాత్రికేయురాలు, గుజరాత్ అల్లర్లలో బాధితులకోసం ఏర్పాటు చేసిన ‘సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’ కార్యదర్శి తీస్తా సెతల్ వాద్. ఆమెతో సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. ► హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ విద్యార్థి రోహిత్ మరణించి ఏడాది అవుతోంది! ఇప్పటికీ కేసు ముందుకు సాగకపోవడానికి కారణమేమనుకుంటున్నారు? రోహిత్ కన్నా ముందూ, రోహిత్ తరువాత కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యలు జరిగాయి. మనసుని కుదిపేసే అంశాలెన్నో ఉన్నాయి కనుకనే రోహిత్ కేసు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. జెఎన్‌యులో విద్యార్థి ఉద్యమం కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారందరినీ కదిలించింది. విశ్వవిద్యాలయాలను మతోన్మాద రాజకీయాలు శాసిస్తున్నంత కాలం ఉద్యమాలు తప్పవు. రోహిత్ కేసులో న్యాయం జరగకపోవడానికి కారణం స్పష్టం. మంత్రులు, రాజకీయ నాయకులు ఈ కేసులో కీలక నిందితులు. వారిని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తుంది. ► విశ్వవిద్యాలయాల్లో వివక్షని ఎలా అర్థం చేసుకోవాలి? ఉన్నత విశ్వవిద్యాలయాల్లో కనిపిస్తున్న వివక్షపై గతంలో థోరట్ కమిటీ చేసిన సిఫార్సులు విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతోన్న అనేక అమానవీయ అంశాలను; దళితులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న వివక్షను వెలుగులోనికి తెచ్చాయి. ఉన్నత విశ్వవిద్యాలయాల్లోకి ప్రవేశిస్తోన్న తొలితరం విద్యార్థులకు కావాల్సిన తోడ్పాటు అందకపోగా, వారిని యూనివర్సిటీల నుంచి వెలివేసే స్థాయికి విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు దిగజారాయి. అట్టడుగు వర్గాలనుంచి వచ్చే విద్యార్థులకు రెమెడీ క్లాసులు నిర్వహించాలని థోరట్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాల నుంచి ఏదో రకమైన వివక్షపై ఫిర్యాదులు వస్తున్నాయి. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. థోరట్ కమిటీ రిపోర్టు ఇదే చెప్పింది. 84 శాతం ఎస్సి, ఎస్టి విద్యార్థులకు రెమెడీ క్లాసుల్లేవు. ఇదే సామాజిక వర్గాల విద్యార్థుల్లో 50 శాతం మందికి ఇంటర్నల్ మార్కుల్లో కోత పెట్టినట్టు తెలింది. అద్భతమైన ప్రతిభ కలిగిన విద్యార్థులు సైతం అన్ని సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సంపాదించినప్పటికీ కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్న పరిస్థితికి వివక్షే కారణం. ఇది అందరికీ తెలుసు. కానీ ఎవరికీ శిక్షలుండవు. దళిత, ఆదివాసీలకు ఉన్నత విద్యావ్యవస్థల్లో అవకాశాల్ని తిరస్కరించడంలో భాగమే ఈ వివక్ష. ►పరిష్కారం ఏమిటి? ఎక్కడా థోరట్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంలేదు. విద్యార్థుల్లో స్ట్రెస్‌ని తగ్గించేందుకు, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఎక్కడా కూడా ఇంతవరకు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. గ్రామీణ ప్రాతాల నుంచి వచ్చే దళిత ఆదివాసీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ లేదు. వారికి ఇంటర్నల్స్ మార్కుల్లో కోత, తరగతి గదుల్లో అవమానాలు, ల్యాబ్స్‌లో పరికరాలు అందుబాటులో ఉంచకపోవడం, కనీసం గైడ్‌ని కేటాయించకపోవడం ఇలాంటి ఎన్నో రకాల వివక్షను ఈ వర్గాల విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల విద్యాస్థాయి నుంచి స్త్రీపురుష వివక్షని, కుల వివక్షని పెంచి పోషిస్తోంది మన విద్యావ్యవస్థ. అక్కడే మార్పు అవసరం. థోరట్ కమిటీ సిఫార్సులను అమలు చేయడం, దాని ఆధారంగా వివక్షారహిత విశ్వవిద్యాలయాల కోసం ఒక యాక్ట్ ని తీసుకురావడం నేటి ఆవశ్యకత. అయితే అది రోహిత్ యాక్ట్ అయినా, సమానత్వాన్ని కాంక్షించే అంబేడ్కర్ యాక్ట్ అయినా అది సమ సమాజానికి దారి ఏర్పరచాలి. ► ఇప్పటికే ఎన్నో చట్టాలున్నాయి. ఉదాహరణకు ఎస్సి, ఎస్టి అట్రాసిటీ యాక్టు లాంటివి. రోహిత్ యాక్టు మాత్రం అమలు జరుగుతుందని మీరు భావిస్తున్నారా? ఏ చట్టమైనా సక్రమంగా అమలుచేయించే బాధ్యత మళ్లీ పౌరసమాజంపైనే ఉంటుంది. చట్టం అంటూ ఉంటే ప్రశ్నించే అధికారం ఉంటుంది. అందుకే రోహిత్ చట్టాన్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ ఉద్యమం మొత్తం రోహిత్ చట్టాన్ని ఒక్కదాన్నే కోరుకోలేదు. ఉద్యమ డిమాండ్లలో అది కూడా ఒకటి. అయితే ఎస్సి ఎస్టి అట్రాసిటీ కేసుల్లో దోషులను ఎలా తప్పిస్తున్నారో మనం రోహిత్ కేసులో స్పష్టంగా చూశాం. అదే చాలా వాటిల్లో జరుగుతోంది. ► ఎపి ప్రభుత్వం త్వరలోనే రోహిత్ దళితుడు కాదని, బీసీ అని తేల్చబోతోంది. దీనిపై మీ అభిప్రాయం? ఇది చాలా దుర్మార్గమైన విషయం. రోహిత్ తల్లి రాధిక ఒంటరి స్త్రీ. ఆమాటకొస్తే దళిత స్త్రీల పోరాటాలన్నీ ఒంటరి స్త్రీల పోరాటాలే. ఆమె సర్వస్వం త్యాగం చేసి బిడ్డల్ని పెంచి పెద్దచేసి, విద్యాబుద్ధులు నేర్పించినా తల్లి కులం బిడ్డకి రాకపోవడం పురుషాధిపత్య సమాజం నిజస్వరూపం. ఏ సంబంధమూ లేని తండ్రి కులం ఎలా వర్తిస్తుందో ఎపి ప్రభుత్వానికే అర్థం కావాలి. రోహిత్ బీసీ అని తేల్చబోవడం పెద్ద రాజకీయ కుట్ర. – అత్తలూరి అరుణ తీస్తా సెతల్ వాద్ ఉద్యమకారిణి -
పోటాపోటీగా...
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నారా రోహిత్. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘అప్పట్లో ఒకడుండేవాడు’. శ్రీవిష్ణు, తాన్యా హోప్ ముఖ్య పాత్రల్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఆరన్ మీడియా వర్క్స్ పతాకంపై ప్రశాంతి, కృష్ణ విజయ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని, ఈనెల 30న విడుదలవుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘తెలుగు చిత్రసీమలో ఇప్పటి వరకూ రాని వైవిధ్యభరితమైన కథా చిత్రమిది. ‘ప్రతినిధి’ చిత్రం తర్వాత రోహిత్, శ్రీవిష్ణు కలిసి నటించారు. ఒకరు పోలీసాఫీసర్‌గా, మరొకరు క్రికెటర్‌గా కనిపిస్తారు. ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. నారా రోహిత్ సహకారంతోనే ఈ చిత్రాన్ని అనుకున్న టైమ్‌కి పూర్తి చేశాం. సాయికార్తీక్ పాటలకు మంచి స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా చిత్రం నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నవీన్ యాదవ్, సమర్పణ: నారా రోహిత్. -
ప్రిక్వార్టర్స్‌లో రోహిత్, వైభవ్
సాక్షి, హైదరాబాద్: ఇండస్ స్కూల్ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో రోహిత్ అయ్యర్, వైభవ్ శివ్ కుమార్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన అండర్-14 బాలుర రెండోరౌండ్లో వైభవ్ 6-5 (8/6)తో జయేశ్ అగర్వాల్‌పై విజయం సాధించాడు. అండర్-12 బాలుర రెండో రౌండ్లో రోహిత్ అయ్యర్ 6-4తో ఎన్‌వీఎల్‌ఎన్ రాజు పై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ఇతర రెండోరౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు: అండర్-14 బాలురు: కాశీ విశ్వనాథ 6-1తో జైవంత్పై, రుషి చక్ర 6-0తో రుహల్ రెగడమిల్లిపై, హరి హశ్వత 6-2తో సనానండ్ర ప్రజ్ఞపై, అర్య జాదవ్ 6-5 (5)తో యువరాజపై, నాథన్ పీటర్ 6-1తో ధనుశ్ వర్మపై, వర్షిత్ కుమార్ 6-1 ఆర్యన్ సామల్, సిద్ధార్థ్ 6-5 (6)తో రోహన్‌పై, అనీశ్ రెడ్డి 6-4తో లిఖిత్ రెడ్డిపై, ఉప్ప సనీత్ 6-2తో రోహిత్ తరుణ్, సిద్ధార్థ్ శ్రీనివాస్ 6-1తో మనన్ భయానీపై గెలుపొందారు. అండర్-12 బాలురు: అనీశ్ రెడ్డి 6-0తో మనోహర్‌పై, వినీత్ 6-1తో ఆర్యబ్పై, రుషిచక్ర 6-1తో జైసింహాపై, లిఖిత్ రెడ్డి 6-4తో నీరజ్‌పై, శ్రీనాథ్ కోట 6-4తో సనీత్‌పై, తరుణ్ 6-1తో హేమంత్ సాయిపై, గౌరవ్ కృష్ణ 6-4తో రోహిత్ సాయిపై, ఆర్యంత్ రెడ్డి 6-1తో ప్రణవ్ రెడ్డిపై విజయం సాధించారు. -
వన్డే సిరీస్ టీమిండియా కైవసం.
-
అమ్మకు ప్రేమతో...
తల్లి పేరుతో బరిలోకి దిగిన భారత క్రికెటర్లు భారత క్రికెటర్లు అమ్మలకు అభిషేకం చేశారు. తమ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో నాన్నతో పాటు అమ్మకు కూడా అంతే భాగం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. టీమ్ స్పాన్సర్ స్టార్ ప్లస్ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘నయీ సోంచ్’ అనే కార్యక్రమం కోసం శనివారం జరిగిన వన్డే మ్యాచ్‌లో వారి పేర్లను ప్రదర్శించి తమ ప్రేమను, గౌరవాన్ని చాటారు. మన ఆటగాళ్లం తా తల్లి పేరు రాసి ఉన్న జెర్సీలను ధరించి బరిలోకి దిగారు. ధోనికి బదులుగా దేవకి, కోహ్లికి బదులుగా సరోజ్, రోహిత్ జెర్సీపై పూర్ణిమ, బుమ్రా చొక్కాపై దల్జీత్... ఇలా పేర్లు కనిపించారుు. ఇలా క్రికెటర్లు తమ పేరు కాకుండా మరో పేరుతో మైదానంలో ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం. స్టార్ ప్లస్, బీసీసీఐ కలిసి ఈ ‘కొత్త ఆలోచన’ను అమల్లోకి తీసుకు వచ్చారుు. కొన్నాళ్లుగా దీని గురించి టీవీలో ప్రముఖంగా ప్రచారం చేయగా, ఇప్పు డు మ్యాచ్‌ను కూడా అదే డ్రెస్‌తో ఆడారు. -
భారత్ ‘జిగేల్’
ఐదు వికెట్లతో చెలరేగిన అమిత్ మిశ్రా సిరీస్ 3-2తో ధోని సేన సొంతం చివరి వన్డేలో 190 పరుగులతో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం వెలుగుల పండుగకు ఒక రోజు ముందే భారత క్రికెట్ అభిమానులు దీపావళి చేసుకున్నారు. మన బౌలింగ్ ‘బాంబు’ అదిరేలా పేలడంతో విశాఖలో కివీస్ ‘తుస్’మంది. మిశ్రా ‘మిస్సైల్’ దాడికి ఆ జట్టు తునాతునకలైంది. వన్డే సిరీస్ అంతటా ఆకట్టుకున్న న్యూజిలాండ్ బ్యాటింగ్... అసలు సమయంలో పేలని టపాసులా తుస్‌మంది. ఎప్పటిలాగే సీజన్‌తో సంబంధం లేకుండా వెలుగులు విరజిమ్మే కోహ్లితో పాటు ‘దోసౌవాలా’ రోహిత్ తారాజువ్వలా ఉవ్వెత్తున ఎగిస్తే... చిన్నపాటి చిచ్చుబుడ్లలా ధోని, జాదవ్‌ల ఆట పండుగ వెలుగులు తెచ్చింది. మొత్తం మీద భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో న్యూజిలాండ్‌ను చీకటిలోకి పంపుతూ సగర్వంగా సిరీస్‌ను చేజిక్కించుకుంది. పదమూడేళ్ల వన్డే కెరీర్... ఆడిన మ్యాచ్‌లు మాత్రం నాలుగు పదులు దాటలేదు... జట్టుతోనే ఉన్నా మ్యాచ్‌లో ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు తీసేస్తారో తెలీదు. కానీ అమిత్ మిశ్రా మాత్రం తన ఆటపై పట్టును, పట్టుదలను కోల్పోలేదు. ఒక లెగ్‌స్పిన్నర్‌గా కుంబ్లే గర్వంగా చూస్తుండగా... భూచక్రాల్లా తిరుగుతూ అందకుండా వెళ్లిన గుగ్లీలతో కివీస్ పతనాన్ని శాసించి కోచ్‌కు కృతజ్ఞతలు ప్రకటించాడు. ‘ఈ సారి అంటించడం నా వంతు’ అన్న తరహాలో 19 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీసి అద్భుతం చేశాడు. వైజాగ్ గత రికార్డుతో పోలిస్తే అసాధ్యమేమీ కాకపోరుునా మరీ 79 పరుగులకే ఆట ముగించి కివీస్ పర్యటన ముగించింది. టెస్టు సిరీస్‌లో ఏకపక్షంగా 3-0తో ఘన విజయం అనంతరం వన్డేల్లో తడబాటుతో సిరీస్‌తో 2-2తో సమంగా నిలిచిన స్థితి. ఈ సమయంలో ధోని తన ఆటతో, వ్యూహంతో కివీస్‌ను చిత్తుగా ఓడించి పరువు పోకుండా (పోగొట్టుకోకుండా) కాపాడుకున్నాడు. ఒత్తిడిలో బరిలోకి దిగి చివరకు గెలుపుతో అందరికీ ఆనందం పంచాడు. సొంతగడ్డపై విజయంతో మొదలైన కొత్త సీజన్లో తొలి అంకం ఇప్పుడు విజయంతో ముగిసింది. ఇక ధోనికి మరి కొద్ది రోజులు ప్రశాంతంగా విశ్రాంతి... వచ్చే నెల 9నుంచి ఇంగ్లండ్‌తో కోహ్లి కొత్త ఆట (టెస్టులు) మొదలు! విశాఖపట్నం: సాగర తీరంలో భారత జట్టు అద్భుతం చేసింది. గత మ్యాచ్ వరకు తడబాటుగా సాగిన ఆటతో చివరి వన్డేకు ముందు సందేహాలు రేకెత్తించిన ధోని బృందం తమ అసలు సత్తాను ప్రదర్శించింది. కనీస పోటీకి కూడా అవకాశం లేకుండా న్యూజిలాండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి సిరీస్‌ను 3-2తో సొంతం చేసుకుంది. శనివారం ఇక్కడి వైఎస్ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఐదో వన్డేలో భారత్ 190 పరుగుల భారీ తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (65 బంతుల్లో 70; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (76 బంతుల్లో 65; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా, ధోని (59 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ 23.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. విలియమ్సన్ (27)దే టాప్ స్కోరు. 18 పరుగులకే 5 వికెట్లు పడగొట్టిన అమిత్ మిశ్రా ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకోవడంతో పాటు మొత్తం 15 వికెట్లతో ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. ఈ సిరీస్‌లో ధర్మశాల, మొహాలీ, వైజాగ్‌లలో జరిగిన మ్యాచ్‌లలో భారత్ గెలవగా, న్యూఢిల్లీ, రాంచీలలో కివీస్ విజయం అందుకుంది. ఈ పర్యటనలో కివీస్ టెస్టు, వన్డే సిరీస్‌లు రెండూ కోల్పోరుుంది. రోహిత్ మెరిశాడు సిరీస్ ఫలితాన్ని తేల్చే మ్యాచ్‌లో భారత జట్టు ధావల్ స్థానంలో బుమ్రాకు తిరిగి చోటు కల్పించగా, హార్దిక్ పాండ్యా స్థానంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం జయంత్ యాదవ్‌కు లభించింది. కివీస్ టీమ్‌లో డెవ్‌సిక్ స్థానంలో అండర్సన్ వచ్చాడు. సిరీస్‌లో గత వన్డేలతో పోలిస్తే విశాఖ పిచ్ చాలా నెమ్మదిగా కనిపించింది. దీంతో ఆరంభంలో భారత జట్టు జాగ్రత్తగా ఆడింది. ముఖ్యంగా రహానే (39 బంతుల్లో 20; 3 ఫోర్లు) కాస్త ఇబ్బంది పడ్డాడు. అరుుతే సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లలో విఫలమైన రోహిత్ అసలు పోరులో తన సత్తా ప్రదర్శించాడు. పవర్‌ప్లే చివరి ఓవర్లో రహానే అవుటైన తర్వాత భారత్ స్కోరు 45 పరుగులు. తొలి పది ఓవర్లలో 19 బంతులు మాత్రమే ఆడే అవకాశం వచ్చిన రోహిత్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. నీషమ్, సోధి ఓవర్లలో అతను కొట్టిన సిక్సర్లు హైలైట్‌గా నిలిచారుు. అరుుతే 17వ ఓవర్లో సింగిల్ తీసే ప్రయత్నంలో అతని కండరాలు పట్టేయడంతో ఫిజియో సహాయం తీసుకోవాల్సి వచ్చింది. చికిత్స తర్వాత సోధి ఓవర్లో ఫోర్‌తో 49 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్, అదే ఓవర్లో మరో భారీ సిక్సర్ బాదాడు. అరుుతే 66 పరుగుల వద్ద టేలర్ క్యాచ్ వదిలేసినా... దానిని ఉపయోగించుకోవడంలో విఫలమైన అతను తర్వాతి ఓవర్లో వెనుదిరిగాడు. రోహిత్, కోహ్లి రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించారు. అనంతరం కోహ్లి, ధోని కలిసి ఇన్నింగ్‌సను నడిపించారు. తన తొలి 22 బంతుల్లో 8 పరుగులే చేసిన ధోని...సోధి ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టి ఊపు మీదకు రాగా, కోహ్లి కూడా మరో భారీ సిక్స్‌తో వేగం పెంచాడు. ఈ జోడి కుదురుకునే ప్రయత్నంలో తొలి 40 బంతుల్లో 20 పరుగులే జోడించినా... తర్వాతి 52 బంతుల్లో 51 పరుగులు జత చేసింది. 71 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం తర్వాత ధోని వెనుదిరగ్గా, పాండే (0) విఫలమయ్యాడు. 44వ ఓవర్లో 220 పరుగుల వద్ద కోహ్లి వెనుదిరిగినప్పుడు జట్టు పరిస్థితి ఇబ్బందకరంగా కనిపించింది. కానీ కేదార్ జాదవ్ (37 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (18 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) ఆరో వికెట్‌కు 39 బంతుల్లోనే 46 పరుగులు జత చేయడంతో జట్టు మెరుగైన స్కోరు చేసింది. ఐదుగురు డకౌట్ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు స్వీయ విధ్వంసానికి పాల్పడింది. ఒక్క ఆటగాడు కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేక చేతులెత్తేశాడు. క్రీజ్‌లోకి వచ్చీ రావడంతో వికెట్ ఇచ్చేసి భారత్ విజయాన్ని మరింత సునాయాసం చేశారు. తొలి ఓవర్లోనే అద్భుత బంతితో గప్టిల్ (0)ను అవుట్ చేసి ఉమేశ్ భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత విలియమ్సన్ రెండో వికెట్‌కు లాథమ్ (17 బంతుల్లో 19; 3 ఫోర్లు)తో 28 పరుగులు, మూడో వికెట్‌కు టేలర్ (32 బంతుల్లో 19; 1 ఫోర్)తో కలిసి 35 పరుగులు జోడించడం మినహా కివీస్ ఏమీ చేయలేకపోరుుంది. ఒక దశలో 63/2తో మెరుగ్గా కనిపించిన ఆ జట్టు మరో 17 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 8 వికెట్లు కోల్పోరుుంది. ఇందులో 5 మిశ్రానే పడగొట్టడం విశేషం. అక్షర్‌కు 2 వికెట్లు దక్కగా, కెరీర్లో తొలి మ్యాచ్ ఆడిన జయంత్ కూడా ఒక వికెట్‌తో సంబరంలో పాలుపంచుకున్నాడు. 1 పూర్తిగా సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు ఆడిన అతి తక్కువ ఓవర్లు (23.1) ఇవే. 5 భారత గడ్డపై ఒక జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం ఇదే తొలిసారి. -
నేను రోహిత్‌ను మాట్లాడుతున్నా!
• మాది గుంటూరు... నేను దళితుడిని • ఆత్మహత్యకు ముందు వెలివాడ నుంచి మాట్లాడిన రోహిత్ • సోషల్ మీడియాలో వీడియో హల్చల్ • రూపన్వాల్ కమిషన్‌కు ఈ వీడియో సమాధానం: ఏఎస్ఏ సాక్షి, హైదరాబాద్: ‘‘నా పేరు రోహిత్, నేను గుంటూరు జిల్లాకు చెందిన వాడిని, నేను దళితుడిని, మా అమ్మ నన్ను పెంచి పెద్దచేసింది. హెచ్‌సీయూలో పరిశోధక విద్యార్థిని అయిన నాతోపాటు మరో నలుగురిని యూనివర్సిటీ పరిసరాల నుంచి, హాస్టల్ నుంచి యాజమాన్యం బహిష్కరించింది. ఈ పరిసరాల్లో మేము సంచరించడం కూడా వర్సిటీ నేరంగా భావించి మమ్మల్ని వెలివేసింది.’’ అంటూ రోహిత్ తనకు తానుగా దళితుడినని చెప్పిన వీడియో రోహిత్ కులంపై తలెత్తిన సమస్యకు సమాధానం చెబుతోందంటున్నారు విద్యార్థులు. ఇప్పుడీ వీడియో ‘రోహిత్ స్పీక్స్’ పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. గత జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడడానికి వారం పదిరోజుల ముందు వర్సిటీ షాప్‌కామ్ వద్దనున్న వెలివాడలో రోహిత్ మాట్లాడుతుండగా సెల్ఫోన్లో చిత్రీకరించిన వీడియో.. ఇప్పుడు అతని కులంపై కేంద్రం నియమించిన రూపన్వాల్ కమిషన్ రిపోర్టుకి సవాల్‌గా మారింది. తమ బహిష్కరణను వ్యతిరేకిస్తూ బాధిత విద్యార్థులు క్యాంపస్‌లోని ఉద్య మ వేదికకు ‘వెలివాడ’ అనే పేరుపెట్టుకున్నారు. రోహిత్ ఆత్మహత్యకు కొద్దిరోజుల ముందు బహిష్కరణకు గురైన విద్యార్థుల అభిప్రాయాలను రికార్డు చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయగా.. ఇప్పుడు బయటపడడంతో చర్చనీయాంశమైంది. వీడియో తీసిన సెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని.. వాటిని డిలీట్ చేయగా.. అనూహ్యంగా కంప్యూటర్లో ఇప్పుడు బయటపడినట్టు ఏఎస్ఏ నాయకుడు ప్రశాంత్ తెలిపారు. ఈ వీడియో రూపన్వాల్ కమిషన్‌కి సమాధానంగా భావిస్తున్నామని అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కన్వీనర్ సన్నంకి మున్నా అన్నారు. ఇంకా ఈ వీడియోలో.. తాను బయోటెక్నాలజీ విద్యార్థిగా క్యాంపస్‌లోకి అడుగుపెట్టినప్పటికీ సోషల్ సెన్సైస్ పట్ల ఉత్సుకతతో అందులోకి మారానని వివరించాడు. తాను దళితుడిని అయినప్పటికీ జనరల్‌లోనే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ పొందడానికి అది తనకు ఉపయోగపడినట్లు వివరించాడు. ఏబీవీపీతో జరిగిన ఘర్షణ తనకు కొత్తకాదని, 2012లో ఏబీవీపీ కేసు పెట్టినప్పుడు రెండు రోజులపాటు తాను స్టేషన్లోనే ఉన్నానని మాట్లాడుతుండగా మధ్యలోనే వీడియో కట్ అయిపోయింది. విద్యార్థి సంఘ నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ.. తాను బహిష్కరణకు గురైన విద్యార్థులందరి సామాజిక నేపథ్యాన్ని గురించి రికార్డు చేయాలనుకున్నానని మధ్యలోనే రోహిత్ ఏదో పనిపై పక్కకి వెళ్లిపోవడంతో వీడియోను పూర్తిగా చిత్రించలేకపోయినట్లు వివరించారు. -
మెరుగైన సాహా, రోహిత్, భువీ ర్యాంకులు
దుబాయ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో అద్భుతంగా ఆడిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, రోహిత్ శర్మ, పేసర్ భువనేశ్వర్‌ల ర్యాంకింగ్స్ మెరుగయ్యాయి. తాజాగా విడుదల చేసిన ఐసీసీ టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్‌సలో సాహా 18 ర్యాంకులను మెరుగుపర్చుకుని 56వ స్థానానికి చేరాడు. ఇక రోహిత్ కూడా 14 స్థానాలను ఎగబాకి 38వ ర్యాంకులో ఉన్నాడు. పుజారా 15వ ర్యాంకులో ఉండగా.. మురళీ విజయ్ ఐదు స్థానాలు దిగజారి 21వ ర్యాంకుకు చేరాడు. స్టీవ్ స్మిత్ టాప్‌లోనే కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ తొమ్మిది స్థానాలను మెరుగుపర్చుకుని 26వ ర్యాంకుకు చేరాడు. అశ్విన్ రెండు నుంచి మూడో ర్యాంకుకు చేరాడు. -
స్త్రీలను గౌరవించాలి
చరణ్ నాయుడు, షాలు, రోహిత్, శ్రావణి, కరుణాకరన్, విక్టోరియా ప్రధాన తారలుగా పాల్వాయి సుదర్శన్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘అరణ్యంలో’. ఈ నెలాఖరున విడుదల చేయాలనుకుంటున్నారు. ఇటీవల టీజర్ విడుదల చేశారు. పాల్వాయి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ -‘‘నాగరికత అంటే మనుషుల దుస్తుల్లో మార్పు రావడం కాదు, ఎల్లప్పుడూ మహిళలను గౌరవించాలనే కథాంశంతో తీసిన చిత్రమిది. సందేశంతో పాటు వాణిజ్య హంగులతో కూడిన సస్పెన్స్ ఎంటర్టైనర్. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే కథ, కథనం ఉంటాయి. అజయ్ పట్నాయక్ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. విడుదల తర్వాత ‘అరణ్యం 2’ తీస్తాం’’ అన్నారు. -
రాణించిన రోహిత్: భారత్ 258/6
విండీస్ ఎలెవన్ 91/1 బసెటెర్రె (సెయింట్ కిట్స్): ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (50), శిఖర్ ధావన్ (51)కు తోడు రోహిత్ శర్మ (54 నాటౌట్; 8 ఫోర్లు; 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలతో రాణించగా వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరుగుతున్న రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజును భారత్ ఆరు వికెట్లకు 258 పరుగుల వద్ద ముగించింది. ఓపెనర్లు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగిన అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి (14), రహానే (5) విఫలమయ్యారు. పుజారా కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. 102 బంతుల్లో కేవలం 34 పరుగులు మాత్రమే చేయడంతో డ్రెస్సింగ్ రూమ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో లోయర్ మిడిలార్డర్ సహకారంతో రోహిత్ చెలరేగాడు. వృద్ధిమాన్ సాహా (22), అమిత్ మిశ్రా (18 నాటౌట్) ఆకట్టుకున్నారు. వారిక్కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విండీస్ ఎలెవన్ కడపటి వార్తలందేసరికి 39 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులతో ఆడుతోంది. క్రీజులో రాజేంద్ర చంద్రిక (46 బ్యాటింగ్), షాయి హోప్ (41 బ్యాటింగ్) ఉన్నారు. -
హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత
సెంట్రల్ యూనివర్సిటీలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వర్సిటీ గేట్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. అనంతరం రోహిత్ చిత్రపటంతో ఊరేగింపు జరిపారు. ఈ నేపథ్యంలో క్యాంపస్ ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. -
అశోక్ గజపతిరాజుకు అలా... రోహిత్‌కు ఇలా...
అన్నవరం : అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తగా ఐవీ గోపాల రావు (రోహిత్) నియామకానికి అడ్డంకులు తొలగిపోయాయి. గత నవంబర్ 12న మృతి చెందిన ఈ దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త రాజా ఐవీ రామ్‌కుమార్ తనయుడే రోహిత్. దివంగత రామ్‌కుమార్ వారసుడిగా తనను వ్యవస్థాపక ధర్మకర్తగా నియమించాలని రోహిత్ గత డిసెంబర్లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై దేవాదాయ,ధర్మాదాయశాఖ అధికారులు పరిశీలన జరిపి అభ్యంతరాలు లేవని తేల్చారు. అయితే రామ్‌కుమార్‌పై కొన్ని కేసులు కోర్టులలో పెండింగ్‌లో ఉండడంతో న్యాయశాఖకు పంపించారు. గతవారం న్యాయశాఖ కూడా రోహిత్ నియామకంపై అభ్యంతరాలు లేవని ప్రభుత్వానికి సిఫార్స్ చేస్తూ ఫైలును ముఖ్యమంత్రికి పేషీకి పంపించింది. సీఎం సంతకం చేయడం లాంఛనమేనని, ఈ వారాంతంలోగా రోహిత్ నియామకానికి వీలుగా జీవో విడుదల అవుతుందని విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ స్థాయిలోనే ఈ జీఓను విడుదల చేయవచ్చు. కానీ రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఫైలును ముఖ్యమంత్రికి పంపించినట్టు సమాచారం. అన్నవరం దేవస్థానానికి రాజా ఐవీ రామ్‌కుమార్ 35 ఏళ్లపాటు వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్‌గా వ్యవహరించిన విషయం విదితమే. ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలుగా ప్రభుత్వం గుర్తించిన ఇనుగంటి వంశీకులలో రామ్‌కుమార్ ఐదో తరానికి చెందినవారు. రామ్‌కుమార్ వారసునిగా రోహిత్‌ను గుర్తించి డిసెంబర్లోనే వ్యవస్థాపక ధర్మకర్తగా నియమించాల్సి ఉంది. అయితే ధర్మకర్తగా నియమితులయ్యే వ్యక్తి వయసు 30 ఏళ్లు ఉండాలని, కానీ రోహిత్ వయసు 27 ఏళ్లు మాత్రమేనని కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దానికితోడు ఈ పదవిని ఆశించిన కొందరు అధికార పార్టీ నేతలు కూడా కొంత రాజకీయం చేశార ని సమాచారం. అయితే వ్యవస్థాపక ధర్మకర్త మృతి చెందితే ఆయన వారసుని నియమించేటపుడు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోనవసరం లేదని, వారసుడు మేజర్ అయితే చాలని ఉన్న నిబంధనలను రాష్ట్ర ఫౌండర్ ట్రస్టీస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ద్వారకాతిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు ప్రభుత్వానికి వివరించారు. దీంతో న్యాయశాఖ కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించి ఫైలు సీఎం పేషీకి సంతకం కోసం పంపించింది. అశోక్ గజపతిరాజుకు వారం.. రోహిత్‌కు ఆరు నెలలు సింహాచలం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త పి. ఆనందగజపతిరాజు మృతిచెందిన వారం రోజుల్లోనే ఆయన సోదరుడు, కేంద్రమంత్రి పి. అశోక్ గజపతిరాజును ఆ దేవస్థానానికి వ్యవస్థాపక ధర్మకర్తగా ప్రభుత్వం నియమించింది. కానీ అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త రాజా ఐవీ రామ్‌కుమార్ మృతిచెంది ఆరు నెలలయ్యాక కానీ రోహిత్ నియామకం ఓ కొలిక్కి రాలేదు. ఇప్పటికి ఫైల్ తుది దశలో ఉంది. రోహిత్ నియామకంపై త్వరలో ఆదేశాలు అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తగా రోహిత్‌ను నియమిస్తూ త్వరలో జీఓ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర దేవాలయ ఫౌండర్ ట్రస్టీస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ద్వారకాతిరుమల దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకర్‌రావు తెలిపారు. ఆయన ఫోన్లో ‘సాక్షి’ తో మాట్లాడారు. రోహిత్ నియామకం విషయమై న్యాయశాఖ కూడా ప్రభుత్వానికి సానుకూలంగా సిఫార్స్ చేసిందని, ఆ ఫైలు సీఎం పేషీ కి చేరిందని వివరించారు. -
రోహిత్ ఘటనపై సీబీఐ విచారణ జరపాలి: ఏబీవీపీ
సాక్షి, హైదరాబాద్: రోహిత్ వేముల ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) కోరింది. రోహిత్ వేముల ఉద్యమాన్ని కాంగ్రెస్, సీపీఎంలు స్పాన్సర్ చేస్తున్నాయని ఆరోపించింది. శనివారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏబీవీపీ హెచ్‌సీయూ అధ్యక్షుడు పల్సానియా మాట్లాడుతూ వర్సిటీలో మాదారి వెంకటేశం ఆత్మహత్యకు పాల్పడినప్పుడు జరగని రాద్ధాంతం..ఒక్క రోహిత్ విషయంలోనే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. రోహిత్‌కు నిజమైన న్యాయం జరిగేందుకు తాము కూడా ఉద్యమిస్తామని చెప్పారు. ఎస్ఎఫ్ఐ, జేఏసీ, ఏఎస్ఏలు మీడియాని తప్పుదోవపట్టిస్తున్నాయని ఆరోపించారు. ఏఎస్ఏ యూనివర్సిటీలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోందని, తనపై కూడా అర్ధరాత్రి దాడికి పాల్పడిందని హెచ్‌సీయూ ఏబీవీపీ ఇన్చార్జి సుశీల్ కుమార్ ఆరోపించారు. వర్సిటీలో విద్యార్థి ఉద్యమాలతో విద్యార్థుల భవిష్యత్తుని పాడుచేయొద్దని ఏబీవీపీ నాయకులు హితవు పలికారు. విద్యార్థులకు ఫ్లైట్ టిక్కెట్లు, ట్రైన్ టిక్కెట్లు, బస్సులకు డబ్బులెలా వచ్చాయని ప్రశ్నించారు. ఇదంతా స్పాన్సర్డ్ ఉద్యమం అని ఆరోపించారు. జేఏసీ విద్యార్థులు రాహుల్ దగ్గరకి ఖాళీ చేతుల్తో వెళ్ళి, సూట్‌కేసులు మోసుకొచ్చారని ఆరోపించారు. సమావేశంలో కుమార్ నాయక్, కిరణ్ గుండాల, భానుప్రతాప్ సింగ్, హరిత పాల్గొన్నారు. -
పుణే ఫటాఫట్
► 9 వికెట్లతో ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం ► తొలి మ్యాచ్‌లోనే డిఫెండింగ్ చాంపియన్‌కు షాక్ ► సమష్టిగా రాణించిన ధోని బృందం అదరగొట్టిన అజింక్య రహానే కొత్త ఆశలతో... కొంగొత్త ఆశయాలతో బరిలోకి దిగిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఐపీఎల్-9 సీజన్ తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపుతూ... టి20 స్టార్లు, తలపండిన అనుభవజ్ఞులతో కూడిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో ధోని సేన 9 వికెట్లతో రోహిత్ బృందంపై నెగ్గి శుభారంభం చేసింది. ముంబై: భారీ హిట్టర్లతో కూడిన ముంబై ఇండియన్స్‌ను... రైజింగ్ పుణే రఫ్ఫాడించింది. బంతితో నిప్పులు చెరుగుతూ స్టార్ బలగాన్ని ఓ మాదిరి స్కోరుకే కట్టిపడేసింది. దీంతో ఐపీఎల్-9లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ధోని బృందం 9 వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో.... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 121 పరుగులు చేసింది. హర్భజన్ (30 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), అంబటి తిరుపతి రాయుడు (27 బంతుల్లో 22; 2 ఫోర్లు) రాణించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ 14.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 126 పరుగులు చేసి నెగ్గింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అజింక్య రహానే (42 బంతుల్లో 66 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. డు ప్లెసిస్ (33 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్సర్లు) అండగా నిలిచాడు. చకచకా వికెట్లు.... ఆరంభం నుంచే పుణే బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో ముంబై చకచకా వికెట్లు కోల్పోయింది. అడపాదడపా ఫోర్లు బాదినా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైంది. రెండో ఓవర్లో రోహిత్ శర్మ (7), నాలుగో ఓవర్లో సిమన్స్ (8) అవుట్‌కాగా, ఐదో ఓవర్లో మార్ష్.... హార్దిక్ (9), బట్లర్ (0)లను పెవిలియన్‌కు పంపి షాకిచ్చాడు. పవర్‌ప్లేలో 4 వికెట్లకు 37 పరుగులు చేసిన ముంబైని మ్యాచ్ మధ్యలోనూ రజత్ భాటియా, మురుగన్ అశ్విన్‌లు కుదురుగా బౌలింగ్ చేసి కట్టడి చేశారు. క్రీజులో పాతుకుపోయిన రాయుడు సింగిల్స్‌కు పరిమితమైతే... రెండో ఎండ్‌లో భారీ హిట్టర్ పొలార్డ్ (1), గోపాల్ (2)లను అవుట్ చేయడంతో రన్‌రేట్ పడిపోయింది. 16వ ఓవర్లో రాయుడు అవుటైన తర్వాత హర్భజన్ ఎదురుదాడి మొదలుపెట్టాడు. భారీ సిక్సర్లు, ఫోర్లతో చివరి మూడు ఓవర్లలో 41 పరుగులు రాబట్టడంతో ముంబై స్కోరు 120 పరుగులు దాటగలిగింది. పుణే బౌలర్లలో ఇషాంత్, మార్ష్ చెరో రెండు వికెట్లు తీశారు. రహానే అదుర్స్... తొలి బంతి నుంచే దూకుడు చూపెట్టిన ఓపెనర్లు రహానే, డు ప్లెసిస్‌లు శుభారంభాన్నిచ్చారు. తొలి నాలుగు ఓవర్లలో ఐదు ఫోర్లు బాదిన ఈ జోడి... ఐదో ఓవర్లో మాత్రం చెరో సిక్సర్ కొట్టింది. బుమ్రా వేసిన ఆరో ఓవర్లో డు ప్లెసిస్ మరో రెండు సిక్సర్లు బాదడంతో 20 పరుగులు వచ్చాయి. దీంతో పవర్‌ప్లేలో పుణే స్కోరు 57/0కు చేరుకుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు స్ట్రయిక్ రొటేషన్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించినా.. ఏ దశలోనూ రన్‌రేట్ తగ్గకుండా చూశారు. తొలి వికెట్‌కు 9.4 ఓవర్లలో 78 పరుగులు జోడించాక డు ప్లెసిస్ అవుటయ్యాడు. ఈ దశలో వచ్చిన పీటర్సన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్సర్లు) హర్భజన్ వేసిన వరుస ఓవర్లలో లాంగాన్‌లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. ఇక 36 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో అజింక్య రహానే రెండు సిక్సర్లు సాధించాడు. దాంతో 32 బంతులు మిగిలి ఉండగానే పుణేకు విజయం దక్కింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమన్స్ (బి) ఇషాంత్ 8; రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 7, హార్దిక్ పాండ్యా (సి) ధోని (బి) మార్ష్ 9; బట్లర్ (సి) ఆర్.అశ్విన్ (బి) మార్ష్ 0; రాయుడు (సి) డు ప్లెసిస్ (బి) ఆర్.అశ్విన్ 22; పొలార్డ్ ఎల్బీడబ్ల్యు (బి) భాటియా 1; గోపాల్ (సి) రహానే (బి) ఎం.అశ్విన్ 2; హర్భజన్ నాటౌట్ 45; వినయ్ (సి) స్మిత్ (బి) ఆర్పీ సింగ్ 12; మెక్లీంగన్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1-8; 2-29; 3-29; 4-30; 5-40; 6-51; 7-68, 8-96. బౌలింగ్: ఆర్పీ సింగ్ 3-0-30-1; ఇషాంత్ శర్మ 4-0-36-2; మిషెల్ మార్ష్ 4-0-21-2; రజత్ భాటియా 4-1-10-1; మురుగన్ అశ్విన్ 4-0-16-1; రవిచంద్రన్ అశ్విన్ 1-0-7-1. రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే నాటౌట్ 66; డు ప్లెసిస్ (బి) హర్భజన్ 34; పీటర్సన్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (14.4 ఓవర్లలో 1 వికెట్‌కు) 126. వికెట్ల పతనం: 1-78. బౌలింగ్: మెక్లీంగన్ 3-0-27-0; బుమ్రా 3-0-30-0; వినయ్ కుమార్ 2-0-14-0; గోపాల్ 3-0-18-0; హర్భజన్ 3-0-24-1; హార్దిక్ పాండ్యా 0.4-0-12-0. ► 1 ముంబై ఇండియన్స్ జట్టులో టాప్-4 బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు చేయకుండా అవుటవ్వడం ఇదే ప్రథమం. ► 1 ఈ మ్యాచ్‌లో పుణే జట్టుకు చెందిన నలుగురు బౌలర్లు (ఇషాంత్, మిచెల్ మార్ష్, రజత్ భాటియా, అశ్విన్) ఇన్నింగ్స్‌లో తాము వేసిన తొలి బంతికే వికెట్‌ను తీశారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ► 300 ఈ మ్యాచ్‌తో కీరన్ పొలార్డ్ (ముంబై ఇండియన్స్) తన కెరీర్లో 300వ టి20 మ్యాచ్‌ను ఆడాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా పొలార్డ్ గుర్తింపు పొందాడు. ఇదే మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ 100వ టి20 మ్యాచ్‌ను... వినయ్ కుమార్ 100వ ఐపీఎల్ మ్యాచ్‌ను ఆడారు. ► ఇంతకంటే మంచి ఆరంభం లభిస్తుందని అనుకోను. ఈ ఘనత బౌలర్లకే చెందుతుంది. పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై ప్రత్యర్థులు కూడా బాగానే పోరాడారు. కానీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు లోయర్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగింది. వికెట్ ఎలా ఉన్నా... రహానే అద్భుతంగా ఆడతాడు. ఫినిషింగ్ కూడా బాగుంది. - ధోని (పుణే కెప్టెన్) -
తమన్నాకు మరో బంపర్ ఆఫర్!
ముంబై: బాహుబలి సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియాకు మరో బంపర్ ఛాన్స్ వచ్చింది. బాలీవుడ్ సినిమా బాజీరావ్ మస్తానీ ఘన విజయంతో జోరుమీదున్న రణ్వీర్ సింగ్ కు జోడీగా తమన్నా నటించనున్నట్టు బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దిల్ వాలే సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకున్న రోహిత్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. రణవీర్, రోహిత్ కలిసి నిర్మించనున్నారని సమాచారం. దీనిపై దిల్ వాలే డెరెక్టర్ ను ప్రశ్నించగా వేచి ఉండండి. కాలమే సమాధానం చెబుతుందని బదులిచ్చాడు. -
నో బాల్స్
► భారత్‌కు పరాభవం సెమీస్‌లో 7 వికెట్లతో వెస్టిండీస్ విజయం ► గెలిపించిన సిమన్స్, చార్లెస్, రసెల్ ► విరాట్ కోహ్లి శ్రమ వృథా ► ఆదివారం ఫైనల్లో ఇంగ్లండ్‌తో కరీబియన్ల ఢీ స్వయంకృతాపరాధం... భారత జట్టును వెస్టిండీస్ ఓడించలేదు... మనల్ని మనమే ఓడించుకున్నాం. ఇది స్వీయ విధ్వంసమే. ఒక స్పిన్నర్ అయి ఉండీ అశ్విన్ నోబాల్‌తో ఒక సారి బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్‌కు ప్రాణం పోస్తే, పాండ్యా మరో నోబాల్‌తో అతనికి బ్రతుకుదెరువు కల్పించాడు. ఫలితమే వరల్డ్ కప్‌నుంచి భారత జట్టు నిష్ర్కమణ. సెమీస్‌తోనే ముగిసిన ధోని సేన పోరాటం. ఎవరు ఊహించారు... 192 పరుగులు చేశాక కూడా భారత్ ఓడిపోతుందని. ఎవరు అనుకున్నారు... కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ తర్వాత కూడా ప్రత్యర్థికి అవకాశం లభిస్తుందని. సెమీఫైనల్‌కు ముందు వరకు బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తున్నా... బౌలర్ల గురించి ఎలాంటి ఫిర్యాదు లేదు. ఆస్ట్రేలియా పర్యటననుంచి అంతా బాగుందని మెచ్చుకుంటూ వచ్చిన బౌలర్లే చివరకు కొంప ముంచారు. ఏకంగా 11 సిక్సర్లు సమర్పించుకొని పరాజయాన్ని ఆహ్వానించారు. గేల్‌ను అవుట్ చేసి సగం మ్యాచ్ గెలిచామని సంబరపడేలోపే... సిమన్స్ రూపంలో భారత్‌ను ప్రళయం చుట్టేసింది. టోర్నీలో ఆడుతోంది తొలి మ్యాచ్ అయినా... ముంబై ఇండియన్స్ తరఫున వాంఖడేలో ఆడిన అనుభవాన్ని ఉపయోగించుకుని సంచలన హిట్టింగ్తో వెస్టిండీస్‌ను ఫైనల్‌కు చేర్చాడు. రసెల్, చార్లెస్‌ల అండతో తడబాటు లేకుండా కరీబియన్లను గట్టెక్కించాడు. ముంబై నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- కథ ముగిసిపోయింది... కోట్లాది మంది అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ భారత జట్టు ప్రపంచకప్ సెమీ ఫైనల్లోనే నిష్ర్కమించింది. కోహ్లి మెరుపు బ్యాటింగ్‌తో మరో విజయంపై ధీమా కనిపించినా... విండీస్ టి20 స్పెషలిస్ట్‌లు తమదైన బాణీలో బ్యాండ్ మోగించడంతో టీమిండియా నిరాశగా వెనుదిరగక తప్పలేదు. ఇక్కడి వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (47 బంతుల్లో 89 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు రోహిత్ శర్మ (31 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రహానే (35 బంతుల్లో 40; 2 ఫోర్లు) రాణించారు. అనంతరం విండీస్ 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లెండిల్ సిమన్స్ (51 బంతుల్లో 82 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా, చార్లెస్ (36 బంతుల్లో 52; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రసెల్ (20 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. ఈ విజయంతో విండీస్ రెండో సారి ఫైనల్ చేరింది. ఆదివారం కోల్‌కతాలో జరిగే తుది పోరులో ఆ జట్టు ఇంగ్లండ్‌తో తలపడుతుంది. కోహ్లి మళ్లీ సూపర్: గాయపడిన యువరాజ్ స్థానంలో మనీష్ పాండేకు అవకాశం దక్కగా, వరుసగా విఫలమవుతున్న ధావన్‌ను ఎట్టకేలకు తప్పించి టీమ్ మేనేజ్మెంట్ రహానేకు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చింది. రోహిత్, రహానే ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 44 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ అవుటయ్యాక కోహ్లి మరోసారి చెలరేగాడు. కోహ్లి, రహానే చకచకా పరుగులు తీశారు. భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే బౌండరీ వద్ద క్యాచ్ ఇవ్వడంతో 49 బంతుల్లో 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ధోని (9 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్) భారీ షాట్లు ఆడకపోయినా, కోహ్లికి అండగా నిలిచాడు ఈ క్రమంలో కోహ్లి 33 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో గేల్ (15)ను అధిగమించి అత్యధిక సార్లు (16) 50కి పైగా స్కోరు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సాధించాడు. వీరిద్దరు 27 బంతుల్లోనే అభేద్యంగా 66 పరుగులు జత చేశారు. ఇందులో కోహ్లి ఒక్కడివే 48 పరుగులు ఉన్నాయి. చివరి 4 ఓవర్లలో భారత్ 17, 11, 19, 12 (మొత్తం 59) పరుగులు సాధించింది. భారీ భాగస్వామ్యాలు: ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన బుమ్రా వెస్టిండీస్‌కు తొలి షాక్ ఇచ్చాడు. తక్కువ ఎత్తులో వచ్చిన ఫుల్‌టాస్ బంతి ఊహించినదానికంటే ఎక్కువగా స్వింగ్ అయి నేరుగా ఆఫ్‌స్టంప్‌ను తాకడంతో గేల్ (5) వెనుదిరిగాడు. శామ్యూల్స్ (8) కూడా తొందరగానే అవుటైనా...సిమన్స్, చార్లెస్ భాగస్వామ్యం భారత్‌ను ఇబ్బంది పెట్టింది. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నా, వీరిద్దరు ఆ తర్వాత భారీ షాట్లు ఆడారు. బుమ్రా, అశ్విన్, పాండ్యా, జడేజా... ఇలా ఏ భారత్ బౌలర్‌నూ వీరు వదిలి పెట్టలేదు. ఒక దశలో వరుసగా ఐదు ఓవర్లలో వీరిద్దరు కలిసి 64 పరుగులు రాబట్టారు. బౌలర్లంతా విఫలం కావడంతో చివరకు 13వ ఓవర్లో ధోని అనూహ్యంగా కోహ్లి చేతికి బంతిని అప్పగించాడు. కోహ్లి తొలి బంతికే వికెట్ తీసినా.... సిమన్స్కు జత కలిసిన రసెల్ కూడా అదే స్థాయి దూకుడు ప్రదర్శించడంతో స్కోరు జోరుగా పెరిగింది. వీరిద్దరు ఆ తర్వాత బౌలర్లపై భీకరంగా ఎదురు దాడికి దిగి 39 బంతుల్లోనే అభేద్యంగా 80 పరుగులు జోడించడంతో విండీస్ సంచలన విజయం సాధించింది. స్కోరు వివరాల భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) బద్రీ 43; రహానే (సి) బ్రేవో (బి) రసెల్ 40; కోహ్లి (నాటౌట్) 89; ధోని (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1-62; 2-128. బౌలింగ్: రసెల్ 4-0-47-1; బద్రీ 4-0-26-1; బ్రాత్‌వైట్ 4-0-38-0; బెన్ 4-0-36-0; బ్రేవో 4-0-44-0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) రోహిత్ (బి) కోహ్లి 52; గేల్ (బి) బుమ్రా 5; శామ్యూల్స్ (సి) రహానే (బి) నెహ్రా 8; సిమన్స్ (నాటౌట్) 82; రసెల్ (నాటౌట్) 43; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1-6; 2-19; 3-116. బౌలింగ్: నెహ్రా 4-0-24-1; బుమ్రా 4-0-42-1; జడేజా 40-0-48-0; అశ్విన్ 2-0-20-0; పాండ్యా 4-0-43-0; కోహ్లి 1.4-0-15-1. ► 2 వికెట్లు, 2 నోబాల్స్... అశ్విన్ వేసిన ఏడో ఓవర్లో సిమన్స్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ థర్డ్ మ్యాన్‌లో బుమ్రా చక్కటి క్యాచ్ అందుకున్నాడు. అయితే అది నోబాల్ కావడంతో సిమన్స్ బతికిపోయాడు. అప్పుటికి అతను చేసిన పరుగులు 18. ఆ తర్వాత వ్యక్తిగత స్కోరు 50 వద్ద పాండ్యా బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి సిమన్స్ అవుటయ్యాడు. కానీ అది కూడా నోబాల్. ఇక 18వ ఓవర్లో కూడా బౌండరీ వద్ద ర్యాలీ క్యాచ్‌తో జడేజా, కోహ్లి అవుట్ చేసేందుకు ప్రయత్నించినా, జడేజా కాలు బౌండరీకి తాకడంతో అది సిక్సర్‌గా మారింది. ముచ్చటగా మూడో సారి కూడా సిమన్స్కు అదృష్టం కలిసొచ్చింది. -
గెలవాలి....నిలవాలి
► నేడు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ► గెలిచిన జట్టు సెమీఫైనల్‌కి ► ఓడితే కథ ముగిసినట్లే ► టి20 ప్రపంచకప్ టోర్నీ సరిగ్గా సంవత్సరం క్రితం... మార్చి 26న సిడ్నీ మైదానంలో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తయింది. ఇప్పుడు ఏడాది వ్యవధిలో మరో ప్రపంచకప్ పోరు వచ్చింది. సెమీస్ కాకపోయినా, ఇప్పుడు కూడా నాకౌట్ పోరే. క్వార్టర్ ఫైనల్‌లాంటి ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు కథ ముగిసిపోతుంది. ఫార్మాట్ వేరు కావచ్చు కానీ వైరంలో మాత్రం తేడా ఉండదు. ఇక నాటి పరాజయానికి పదునైన జవాబు ఇవ్వడం మన వంతు. మన సొంతగడ్డపై ఆసీస్‌ను చిత్తు చేసి ఇంటికి పంపడం, దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టడం ఆదివారం భారత్ ముందున్న లక్ష్యం. మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి;- టి20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జైత్రయాత్ర ఆస్ట్రేలియాలోనే మొదలైంది. అక్కడి నుంచి 14 మ్యాచ్‌లలో 12 విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు వరల్డ్‌కప్ రేస్‌లో కీలక దశలో అదే ఆసీస్‌తో పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఇక్కడి ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఎలాంటి గణాంకాలు, రన్రేట్లతో పని లేకుండా ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇరు జట్లకు ఇది చావోరేవోలాంటి పరిస్థితి. ఉత్కంఠభరితంగా సాగిన గత మ్యాచ్‌లో భారత్ ఒక పరుగుతో గట్టెక్కగా, ఇదే మైదానంలో శుక్రవారం పాక్‌ను చిత్తు చేసి ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఉదాసీనత లేకుండా...: బంగ్లాదేశ్‌తో ఓటమి అంచుల్లోకి వెళ్లినా చివరకు భారత్ మ్యాచ్ కాపాడుకోగలిగింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి వస్తే ఒత్తిడిలో చిత్తవడానికి ఎదురుగా ఉన్న జట్టు బంగ్లాదేశ్ కాదు. చిన్నపాటి అవకాశం ఇచ్చినా ఆస్ట్రేలియన్లు మ్యాచ్ లాక్కోగలరు. కాబట్టి అన్ని రంగాల్లో జట్టు సమష్టిగా రాణించాల్సి ఉంది. చివరి రెండు మ్యాచ్‌లలో గెలిచినా నిజాయితీగా చెప్పాలంటే భారత జట్టు బ్యాటింగ్ ప్రదర్శన చెప్పుకోదగిన స్థాయిలో లేదు. ముఖ్యంగా ఓపెనర్లు ఒక్కసారి కూడా శుభారంభం ఇవ్వలేకపోయారు. ఈ టోర్నీకి ముందు స్టార్ హోదాతో బరిలోకి దిగిన రోహిత్‌తో పాటు ధావన్ ఒక్కసారి కూడా ఆకట్టుకోలేదు. పైగా వీరిద్దరూ నిర్లక్ష్యమైన రీతిలో వరుసగా ఒకే తరహాలో అవుట్ కావడం ఆసీస్ గుర్తిస్తే కష్టం. కోహ్లి విఫలమైతే చాలు... ఇక కష్టం అన్నట్లుగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కనిపించింది. శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ప్రధాన బ్యాట్స్‌మెన్‌తో పాటు లోయర్ ఆర్డర్ వరకు కూడా అంతా సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బౌలింగ్‌లో పేసర్లకంటే అశ్విన్, జడేజాల రాణింపుపైనే భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రాక్టీస్ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ సాధారణ సెషన్ తర్వాత బుమ్రాకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. గాల్లో లేచే బంతిని క్యాచ్ ఎలా అందుకోవాలో ప్రతీది విడమర్చి చెప్పడంతో పాటు చాలా సేపు సాధన చేయించాడు. అందరూ ఫామ్‌లోనే! తొలి మ్యాచ్‌లో కివీస్‌తో ఓడి ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై తడబడుతూ గెలిచిన ఆస్ట్రేలియా ఒక్కసారిగా సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చింది. జట్టులో అందరూ రాణించడంతో గత మ్యాచ్‌లో ఆ జట్టు పాక్‌పై ఘన విజయం సాధించింది. ఇది కచ్చితంగా వారిలో ఆత్మవిశ్వాసం పెంచే అంశం. వార్నర్ మినహా గత మ్యాచ్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా చెలరేగారు. అయితే వార్నర్ ఎప్పుడైనా ప్రమాదకర ఆటగాడే. అతనితో పాటు ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే వాట్సన్, మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్‌లకు ఇక్కడి పిచ్‌లపై మంచి అనుభవం ఉంది. ఈ టోర్నీతో రిటైర్ కానున్న వాట్సన్ తన జట్టును టోర్నీలో మరింత ముందుకు తీసుకెళ్లాని పట్టుదలగా ఉన్నాడు. పాక్‌తో బ్యాటింగ్ చూస్తే వాట్సన్ ఎంత ప్రమాదకారినో అర్థమవుతుంది. ఈ ఏడాది ఆరంభంలో ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌తో పోలిస్తే భారత్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఈసారి కూడా అదే జట్టు బరిలోకి దిగవచ్చు. ఈ టోర్నీలో ప్రభావం చూపిస్తున్న లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపా తొలిసారి భారత్‌పై ఆడబోతున్నాడు. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), ఫించ్, ఖాజా, వార్నర్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్, నెవిల్, కూల్టర్ నీల్, జంపా, హాజల్‌వుడ్. పిచ్, వాతావరణం టోర్నీలో ఇక్కడి రెండు వేర్వేరు పిచ్‌లపై జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ పరుగుల వరద పారింది. ఇప్పుడు కూడా బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్ కనిపిస్తోంది. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వాతావరణం సాధారణంగా ఉంది. వర్షంతో మ్యాచ్‌కు ఆటంకం కలిగే అవకాశాలు తక్కువ. 8 భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 12 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 8 గెలిచి 4 ఓడింది. వరల్డ్‌కప్‌లలో 4 మ్యాచ్‌లలో చెరో 2 గెలిచారు. -
ఫటాఫట్ ఫ్యాక్ట్స్
1 కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనత ధోని (28) సొంతం 2 ఈ టోర్నీ చరిత్రలో భారత్ రెండుసార్లు ఫైనల్ చేరింది. 3 ప్రపంచకప్‌లలో ‘టై’ అయిన మ్యాచ్‌లు. 4 నలుగురు లంక ఆటగాళ్లు మలింగ, దిల్షాన్, జయవర్ధనే, సంగక్కర టోర్నీలో అత్యధిక (31) మ్యాచ్‌లు ఆడారు. 5 ఇప్పటివరకూ జరిగిన ప్రపంచకప్‌లు 6 అంతర్జాతీయ టి20ల్లోఇప్పటివరకూ టై అయిన మ్యాచ్‌లు 7 ప్రపంచకప్‌లో నమోదైన సెంచరీలు 8 మహిళల తొలి మూడు ప్రపంచకప్‌లలో ఎనిమిదేసి జట్లు మాత్రమే పాల్గొన్నాయి. 9 ఈ మెగా ఈవెంట్లో భారత మహిళల జట్టుకు అత్యధికంగా తొమ్మిది మ్యాచ్‌ల్లో మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించింది. 10ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు గేల్ (10) 11ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్ రోహిత్ 12మరో 12 వికెట్లు తీస్తే మలింగ ప్రపంచ కప్‌లో 50 వికెట్లు పూర్తి చేస్తాడు. 13 ప్రపంచకప్‌లో 90 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత స్కోర్లు 13సార్లు వచ్చాయి. 14 మహిళల ప్రపంచకప్‌లో ఆసీస్ తర్వాత ఇంగ్లండ్, కివీస్ 14 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 15 ఎక్కువ పరాజయాలు బంగ్లాదేశ్ (15) 16 ఈసారి టోర్నీలో పాల్గొన్న, పాల్గొంటున్న మొత్తం జట్లు 17 మహిళల టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 17 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ఉమన్ దియాంద్రా డాటిన్ (వెస్టిండీస్) 18 ప్రపంచకప్‌లో భారత్ గెలిచిన మ్యాచ్‌లు. మొత్తం 28 మ్యాచ్‌లు ఆడింది. 9 ఓడిపోగా, ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 19 చరిత్రలో ఈ టోర్నీలో ఒక్కసారైనా ఆడిన జట్లు 20 మహిళల టి20 ప్రపంచకప్ పోటీల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధికంగా 20 ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జట్టు న్యూజిలాండ్. గత విజేతలు సంవత్సరం వేదిక విజేత రన్నరప్ 2007 దక్షిణాఫ్రికా భారత్ పాకిస్తాన్ 2009 ఇంగ్లండ్ పాకిస్తాన్ శ్రీలంక 2010 వెస్టిండీస్ ఇంగ్లండ్ ఆస్ట్రేలియా 2012 శ్రీలంక వెస్టిండీస్ శ్రీలంక 2014 బంగ్లాదేశ్ శ్రీలంక భారత్ ప్రైజ్‌మనీ వివరాలు విజేత : రూ. 23 కోట్ల 44 లక్షలు రన్నరప్ : రూ. 10 కోట్లు సెమీస్‌లో ఓడిన జట్లకు : రూ. 5 కోట్లు లీగ్ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు : రూ. 33 లక్షల 48 వేలు టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుకు : రూ. 2 కోట్లు ప్రపంచకప్ హీరోలు అత్యధిక పరుగులు : జయవర్ధనే (1016) అత్యధిక వ్యక్తిగత స్కోరు : బ్రెండన్ మెకల్లమ్ (123) అత్యధిక వికెట్లు : మలింగ (38) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు : అజంతా మెండిస్ (8 పరుగులకు 6 వికెట్లు) ఒక జట్టు అత్యధిక స్కోరు : శ్రీలంక (266- కెన్యాపై) అలా జరిగింది! ►దక్షిణాఫ్రికా క్రికెటర్ వాన్ డెర్ మెర్వ్ టి20 ప్రపంచకప్‌లో రెండు దేశాల తరఫున ఆడాడు. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన 2009 ప్రపంచకప్‌లో వాన్ డెర్ మెర్వ్ దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... 2016 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో నెదర్లాండ్స్ జట్టు తరఫున ఆడాడు. ►ఇప్పటివరకు ఐదుసార్లు టి20 ప్రపంచకప్ జరిగినా... ఆతిథ్య జట్టుకు టైటిల్ దక్కలేదు. ►డిఫెండింగ్ చాంపియన్ జట్లకు తదుపరి ప్రపంచకప్ కలసిరాలేదు. ఒకసారి విజేతగా నిలిచిన జట్టు తదుపరి టోర్నీలో కనీసం సెమీఫైనల్‌ను దాటలేకపోయింది. -
సమష్టిగా సాధిద్దాం
⇒నేటినుంచి టి20 ప్రపంచ కప్ ⇒తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఢీ ఐదేళ్ల క్రితం సొంతగడ్డపై ధోనిసేన సగర్వంగా వన్డే ప్రపంచకప్‌ను అందుకున్న జ్ఞాపకాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. విదేశాల్లో ఎంత పెద్ద సిరీస్‌లు గెలిచినా, ఎన్ని ట్రోఫీలు సాధించినా... స్వదేశంలో, సొంత ప్రేక్షకుల సమక్షంలో ప్రపంచకప్‌ను అందుకోవడం దేశంలో ప్రతి క్రికెట్ అభిమానికి గర్వకారణం. మరోసారి ధోని నేతృత్వంలోని భారత బృందం ఈ ఘనత సాధించడానికి సన్నద్ధమైంది. ఆటగాళ్లు మారినా, ఫార్మాట్ మారినా... కెప్టెన్ అయిన దగ్గరి నుంచి ధోనిది ఒకటే మంత్రం. ‘జట్టులో ప్రతి ఆటగాడి సక్సెస్‌ను మిగిలిన ఆటగాళ్లంతా ఆస్వాదించాలి’... ‘సమష్టితత్వం కనబరిస్తేనే విజయాలు దక్కుతాయి’.... ఈ రెండు సూత్రాలతోనే ధోని భారత క్రికెట్లో విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగాడు. మరోసారి అదే మంత్రంతో యువ జట్టును తీసుకుని ప్రపంచ సమరానికి సిద్ధమయ్యాడు. స్వదేశంలో ఆడుతున్న ఒత్తిడి తగ్గాలంటే తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించాలి. ఇప్పుడు భారత్ అదే లక్ష్యంతో ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. నాగ్‌పూర్‌నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ఆసియా కప్‌లో పరుగుల వరద పారని బోరింగ్ మ్యాచ్‌లను చూసిన విషయాన్ని ఇక మరచిపోండి. రికార్డులు కొల్లగొట్టే స్కోర్లు కనిపించలేదని బెంగ వద్దు. ఇప్పుడు అసలైన ధనాధన్ క్రికెట్‌కు చిరునామాగా టి20 ప్రపంచకప్ వచ్చేసింది. ఎన్నో రోజులుగా ఎదురు చూసిన అభిమానులు క్రికెట్లో ఆనందం వెతుక్కునే సమయం ఆసన్నమైంది. రాబోయే 20 రోజుల పాటు పరుగుల ప్రవాహం సాగే వరల్డ్ కప్ నేడు (మంగళవారం) ప్రారంభమవుతోంది. ఆతిథ్య జట్టు హోదాలో భారత్ మొదటి మ్యాచ్ ఆడుతోంది. ఇక్కడి జామ్తా మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఎలాంటి ప్రారంభోత్సవ కార్యక్రమంలాంటి హంగామా, సందడి లేకుండా నేరుగా మ్యాచ్‌తోనే టోర్నీ మొదలు కానుంది. బ్యాటింగ్ ఆర్డర్లో... తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియా సన్నాహకం భిన్నంగా సాగింది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు విడిగా వేర్వేరు నెట్స్‌లో సాధన మొదలు పెట్టారు. జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా నెట్స్‌లో త్రో డౌన్స్కే ప్రాక్టీస్ చేశారు. ముందుగా రోహిత్, ధావన్, కోహ్లి... ఆ తర్వాత రైనా, యువరాజ్, ధోని బ్యాటింగ్ చేశారు. చివర్లో కొన్ని బంతులు మినహా జట్టు సహాయక సిబ్బంది, ప్రాక్టీస్ బౌలర్లు విసిరిన బంతులకు అంతా భారీ షాట్లు ఆడారు. ప్రధాన బౌలర్లు ఎవరూ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయలేదు. మరో వైపు బౌలర్లు ప్రత్యేకంగా సాధన చేశారు. నెట్స్‌లో బ్యాట్స్‌మన్ లేకుండా కేవలం స్టంప్స్‌ను పెట్టి బౌలింగ్ చేశారు. అయితే బుమ్రా, షమీ మాత్రం బౌలింగ్ చేయకుండా కేవలం బంతులు అందించేందుకే పరిమితం కాగా... అశ్విన్, హర్భజన్, జడేజా మాత్రం చాలా కొద్ది సేపు మాత్రమే బౌలింగ్ చేశారు. సెషన్ ముగిసినా యువరాజ్ మాత్రం ఎక్కువ సేపు ప్రత్యేకంగా శ్రమించాడు. క్యురేటర్ చెప్పినదాని ప్రకారం పూర్తిగా బ్యాటింగ్ వికెట్, భారీ స్కోరుకు అవకాశం ఉండటంతో టీమ్ మేనేజ్మెంట్ అదే ఆలోచనతో ప్రాక్టీస్ చేయించినట్లుంది. ప్రస్తుత స్థితిలో బ్యాట్స్‌మెన్‌పైనే భారం ఎక్కువ కాబట్టి బౌలర్లను పెద్దగా శ్రమ పెట్టినట్లు లేదు. ఎప్పటిలాగే గాయాల భయంతో వార్మప్ ఫుట్‌బాల్‌కు దూరంగా ఉన్న నెహ్రా కూడా నెట్స్‌లో కనీసం రెండు ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేదు. అయితే షమీపై ఇంకా సందేహాలు ఉండటంతో తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. జోరుగా అండర్సన్ ‘ఐపీఎల్ ఎలాగూ ఆడుతున్నాడు కాబట్టి ఈ టోర్నీకి మెకల్లమ్ ఉంటే బాగుండేది. రిటైర్మెంట్కు ఇది తగిన సమయం కాదు’... కివీస్ కెప్టెన్ విలియమ్సన్ చేసిన వ్యాఖ్య ఇది. బ్రెండన్ ఉండి ఉంటే అతని ప్రభావం ఎలా ఉండేదో చెప్పడానికి ఈ మాట చాలు. బయట ఎంత క్రికెట్ ఆడినా ఒక రకంగా భారత్‌లో కివీస్ పూర్తిగా కొత్త జట్టులాంటిదే. ప్రాక్టీస్ సందర్భంగా నెట్స్‌లో న్యూజిలాండ్ అందరు ఆటగాళ్లను పరీక్షించింది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో శ్రమించారు. నేటి మ్యాచ్‌లో కివీస్ తరఫున కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న కోరీ అండర్సన్ తనదైన శైలిలో భారీ షాట్లు ఆడగా, మరో కీలక ఆటగాడు గప్టిల్ ఎక్కువసేపు సాధన చేశాడు. ఇక్కడ ఆ జట్టుకు ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉన్న స్పిన్‌పైనే వారు ఎక్కువగా శ్రద్ధ పెట్టారు. కివీస్‌కు సహకరించిన ప్రాక్టీస్ బౌలర్లంతా స్పిన్నర్లే కావడం విశేషం. జట్లు (అంచనా) భారత్ : ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా న్యూజిలాండ్ : విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, రాంచీ, టేలర్, ఇలియట్, సాన్‌ట్నర్, మెకల్లమ్, సౌతీ, మెక్లీన్గన్, బౌల్ట్. ఇక్కడ స్పిన్ పిచ్‌లు ఎదురవుతాయని తెలుసు. అందుకోసం సన్నద్ధమయ్యే వచ్చాం. టోర్నీకి ముందు ఎక్కువ టి20 మ్యాచ్‌లు ఆడలేదు. కానీ అదేమీ వరల్డ్ కప్ మ్యాచ్‌ల గెలుపుపై గ్యారంటీ ఇవ్వదు. బ్రెండన్ లేడని తెలుసు కాబట్టి దానికి అనుగుణంగానే మా వ్యూహాలు రూపొందించుకున్నాం. టోర్నీ గెలవగలిగితే మార్టిన్ క్రోకు అంతకంటే పెద్ద నివాళి ఉండదు - విలియమ్సన్, కివీస్ కెప్టెన్ వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీ ఆడుతున్నప్పుడు పాండ్యా, బుమ్రాలాంటి కుర్రాళ్లలో ఒక రకమైన ఉద్వేగం ఉంటుంది. 2011లో నేనూ దానిని అనుభవించాను. అయితే దీని వల్ల దృష్టి మరలకుండా ఏకాగ్రతగా ఆడటం ముఖ్యం. సొంతగడ్డపై కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. మైదానంలో మేం హాయిగా ఆడతాం. కానీ మైదానం బయట దీనిని తట్టుకోవడమే కష్టం. బ్యాటింగ్ చేసే అవకాశం రాని ఆటగాళ్లనుంచి ఎలాంటి ఫిర్యాదు లేకపోవడమే మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న మంచి వాతావరణానికి సూచన. టోర్నీలో శుభారంభంపై నమ్మకంతో ఉన్నాం. - విరాట్ కోహ్లి ⇒ 4 న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగు టి20 మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటీ గెలవలేదు. రా. గం. 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం, భారీ స్కోరు నమోదు కావచ్చని క్యురేటర్ కర్లేకర్ చెప్పారు. పేస్‌బౌలర్లు కొంత ప్రభావం చూపగలరు కానీ స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చు. మంచు ప్రభావం లేదు. శనివారం క్వాలిఫయర్ మ్యాచ్ రోజున అనూహ్యంగా ఇక్కడ వర్షం కురిసినా... ఇప్పుడు దాని ప్రభావం లేదు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశం ఉంది. భువనేశ్వర్ కూడా జట్టుతోనే గత ఏడాది వన్డే వరల్డ్ కప్ తరహాలోనే ఈ సారి కూడా భారత్ అదనపు ఆటగాడిని జట్టుతో కొనసాగిస్తోంది. షమీ గాయం గురించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో 15 మంది సభ్యుల జట్టులో లేని భువనేశ్వర్‌కుమార్ టీమ్‌తోపాటు వెళుతున్నాడు. సోమవారం షమీ ఒక్క బంతి వేయకపోగా, భువీ మాత్రం సుదీర్ఘంగా నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. నల్ల రిబ్బన్లతో న్యూజిలాండ్ ఆటగాళ్లు టి20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో న్యూజి లాండ్ ఆటగాళ్లు తమ భుజాలకు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగబోతున్నారు. తమ క్రికెట్ దిగ్గజం మార్టిన్ క్రో మృతికి నివాళిగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలం క్యాన్సర్‌తో పోరాడిన 53 ఏళ్ల మార్టిన్ క్రో ఈనెల 3న మరణించిన విషయం విదితమే. -
భారత్ ఎందుకు ఫేవరెట్ అంటే...
ప్రపంచకప్‌కు ముందు భారత్ సాధించిన విజయాలు, సొంతగడ్డపై చెలరేగే నిపుణులతో నిండిన భారత జట్టును ప్రతి ఒక్కరూ ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. మాజీ క్రికెటర్లు, ప్రత్యర్థులు, అభిమానులు... ఇలా అందరి దృష్టిలో ధోనిసేన ఎందుకు ఫేవరెట్ అయ్యింది..? ఈ ప్రశ్నకు సమాధానాలు చాలానే ఉన్నాయి. దూకుడుగా ఆడటంలో ఒకరిని మించిన వారు మరొకరు... సత్తా ఉన్న స్పిన్నర్లు... సమర్థులైన పేసర్లు... నాయకత్వ పటిమ, అద్భుత ఫామ్... అన్నింటికీ మించి సొంతగడ్డపై ఆడుతుండటం... ఇలా భారత్‌ను ఫేవరెట్‌గా మార్చిన అంశాలు చాలానే ఉన్నాయి. ఇతర జట్లు ఎంత సన్నద్ధమై వచ్చినా, భారత్‌లో ధోని సేనను ఓడించడం ఆషామాషీ కాదు. రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, ధోని ఇలా వరుసగా ప్రతీ ఆటగాడికి ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగల సామర్థ్యం ఉంది. ఫటాఫట్‌గా ముగిసిపోయే ఈ ఫార్మాట్లో ఏ ఇద్దరు రాణించినా ఆ రోజు జట్టుకు తిరుగుండదు. మనోళ్ల అంతర్జాతీయ, ఐపీఎల్ అనుభవం జత కలిస్తే ప్రత్యర్థి జట్లలో దేనికీ ఇంత బలమైన లైనప్ లేదు. సీనియర్ నెహ్రా, జూనియర్ బుమ్రాలతో పేస్ విభాగం మెరుగ్గా కనిపిస్తుండగా... ఇప్పుడు షమీ జత కలవడంతో పేస్ గురించి ఎలాంటి ఆందోళనా లేదు. ఇక మన పిచ్‌లపై అశ్విన్, జడేజాలను ఎదుర్కోవడం అవతలి బ్యాట్స్‌మెన్‌కు శక్తికి మించిన పనే. సహజంగానే స్పిన్ పిచ్‌లకు అవకాశం ఉంది కాబట్టి మన స్పిన్నర్ల బలం రెట్టింపు కావడం ఖాయం. సాధారణంగా గొప్పలు చెప్పుకునేందుకు ఇష్టపడని ధోని కూడా ‘మాలో ఏ లోపాలూ లేవు’ అని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాడంటే తన జట్టుపై అతనికి ఎలాంటి నమ్మకం ఉందో అర్థమవుతుంది. భారత్ తమ గ్రూప్ నుంచి సునాయాసంగా సెమీస్‌కు చేరే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల పాకిస్తాన్, ఆస్ట్రేలియాలను కూడా చిత్తు చేసిన మన జట్టుకు బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లపై కూడా పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. -
ఆ ముగ్గురూ ఆరోసారి
మిర్పూర్: మార్చిలో జరిగే టి20 ప్రపంచకప్ ద్వారా భారత క్రికెటర్లు ధోని, రోహిత్, యువరాజ్ అరుదైన ఘనత సాధించబోతున్నారు. వరుసగా ఆరోసారి ఈమెగా టోర్నీలో వీరు బరిలోకి దిగబోతున్నారు. మార్చి 8 నుంచి ఏప్రిల్ 3 వరకు భారత్‌లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే వారితో పాటు ఓవరాల్‌గా అన్ని జట్ల నుంచి 19 మంది ఆటగాళ్లున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఏకంగా ఐదుగురు (మొర్తజా, షకీబ్, తమీమ్, మహ్ముదుల్లా, ముష్ఫీకర్) ఉండగా.. మిగతా జట్లలో డ్వేన్ బ్రేవో, గేల్, రామ్‌దిన్ (విండీస్); నాథన్ మెకల్లమ్, టేలర్ (కివీస్); డి విలియర్స్, డుమిని (దక్షిణాఫ్రికా); దిల్షాన్, మలింగ (శ్రీలంక); ఆఫ్రిది (పాక్), వాట్సన్ (ఆసీస్) ఉన్నారు. ఇక మహిళల క్రికెట్ నుంచి 29 మంది వరుసగా ఐదో సారి ప్రపంచకప్ ఆడబోతున్నారు. వీరిలో భారత్ నుంచి కెప్టెన్ మిథాలీ రాజ్, జులన్ గోస్వామి ఉన్నారు. పాక్ నుంచి ఐదుగురు ఉండడం విశేషం. -
దేశభక్తి ఏ ఒక్కరి సొత్తూ కాదు
రోహిత్ ఘటనపై విచారణ తేదీలను మార్చాలి {పముఖ విద్యావేత్త చుక్కా రామయ్య హైదరాబాద్: ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశభక్తి పేరుతో జరుగుతున్నదంతా కేంద్రం సృష్టేనని, దేశభక్తి ఏ ఒక్కరి సొత్తూ కాదని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఘటనపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్ పర్యటన అనుమానాలకు తావిస్తోందన్నారు. విద్యార్థులు వర్సిటీలో లేని సమయంలో కమిషన్ పర్యటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిజానిజాలను తెలుసుకోవడమే న్యాయవిచారణ లక్ష్యం అయితే అందులో విద్యార్థులదే కీలక పాత్ర అని, అలాంటప్పుడు విద్యార్థులు లేని సమయంలో కమిషన్ వచ్చి ఏం చేస్తుందని చుక్కా రామయ్య నిలదీశారు. మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు మాట్లాడుతూ విద్యార్థులు నగరంలో ఉండరని తెలిసే ఏకసభ్య విచారణ కమిషన్ ఈ నెల 23,24,25 తేదీల్లో పర్యటిస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. చలో ఢిల్లీ అన ంతరం 26వ తేదీ తరువాత విద్యార్థులు అందుబాటులో ఉంటారని, దీనికనుగుణంగా కమిషన్ తేదీల్లో మార్పు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీడీఎస్ వ్యవస్థాపకులు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యార్థులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన వారం రోజుల తర్వాత ఢిల్లీనుంచి ఏకసభ్య కమిషన్ అదే తేదీల్లో వస్తున్నట్టు ప్రకటించిడం కేంద్రం కుట్రలో భాగమని అన్నారు. పార్లమెంటులో రోహిత్ అంశాన్ని మరుగుపర్చేందుకు జేఎన్‌యూలో జరిగిన చిన్న సంఘటనను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఆ ఉచ్చులో పడకూడదని హెచ్చరించారు. మీడియాపైన ఢిల్లీలోనూ, మేడారం జాతరలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరిపైనా జరిగిన దాడిని లక్ష్మయ్య తీవ్రంగా ఖండించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు యాదయ్య, సీడీఎస్ డెరైక్టర్ వైబి సత్యనారాయణ, భరత్ భూషణ్, సిద్ధోజి తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూ ఘటనకు కేంద్రానిదే బాధ్యత
రోహిత్ వేములది ఆత్మహత్యకాదని, ముమ్మాటికీ కేంద్రప్రభుత్వం చేసిన హత్యేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ పేర్కొన్నారు. సెంట్రల్‌యూనివర్సిటీలో ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థి నాయకులకు సోమవారం సీపీఐ నాయకులు సంఘీభావం ప్రకటిం చారు. రోహిత్ వేముల తల్లి రాధికకు లక్ష రూపాయాల చెక్కును అందజేశారు. రిలే దీక్షల్లో ఉన్న ప్రజాసంఘాల నాయకులతో సీపీఐ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. వీసీ అప్పారావు కేంద్రమంత్రి ఒత్తిడితోనే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. వీసీ, దత్తాత్రేయ, స్మతి ఇరానీ లను తొలగించి విచారణ చేపడితే ప్రజలకు నమ్మకం ఉంటుందన్నారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధానకార్యదర్శి విశ్వజీత్కుమార్ మాట్లాడుతూ.. రోహిత్ ఘటనపై దేశవ్యాప్త నిరసనలకు ఏఐఎస్ఎఫ్ పూనుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఏపీ కార్యదర్శి రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ నాయకులు స్టాలిన్, వేణు పాల్గొన్నారు. విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావంగా ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో పలువురు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. -
మహాత్మాగాంధీకి జరిగిన అన్యాయమే రోహిత్‌కు జరిగింది
* హెచ్‌సీయూ దీక్షలో రాహుల్ గాంధీ * ఆర్థిక, సామాజికాభివృద్ధిని వివక్ష అడ్డుకుంటోంది సాక్షి, హైదరాబాద్: దేశంలోని విశ్వవిద్యాలయాల్లో జరుగుతున్న వివక్షకు రోహిత్ ఒక ఉదాహరణ అని.. వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించిన మహాత్మాగాంధీకి జరిగిన అన్యాయమే నేడు రోహిత్‌కు జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ వివక్ష వల్లే దేశం అభివృద్ధి చెందలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షకు వ్యతిరేకంగా తాను తల ఎత్తానని, ఉద్యమం చేపట్టిన విద్యార్థులకు అండగా నిలుస్తానని ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ, సామాజిక న్యాయం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీయూలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమానికి సంఘీభావంగా రాహుల్ గాంధీ దీక్షలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన.. నేరుగా హెచ్సీయూకు వెళ్లి, రోహిత్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రోహిత్ తల్లి రాధిక, విద్యార్థులు విజయ్, విశాల్, సుంకన్నలతో కలసి ‘వెలివాడ’ శిబిరంలో దీక్ష చేపట్టారు. శనివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులకు అండగా ఉంటాం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ భావజాలం ఒక్కటేనని... వారు విద్యార్థుల మీద బలవంతంగా తమ భావజాలాన్ని రుద్దుతున్నారని రాహుల్ మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం ఒక చట్టం తేవాలని, లేదంటే ఆ విషయాన్ని విద్యార్థులే చూసుకుంటారని ప్రధాని మోదీని హెచ్చరించారు. దేశంలో నివసించే వారంతా భారతీయులేనని, వారు జాతి విద్రోహులు కారని స్పష్టం చేశారు. కుల, మత, ప్రాంతీయ, లింగ వివక్షల వల్ల దేశం ముందడుగు వేయలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక, సామాజికాభివృద్ధిని వివక్ష అడ్డుకుంటోందని... రోహిత్‌లాంటి ఆలోచనాపరులు వివక్షకు బలైపోతున్నారని చెప్పారు. ఇదే వివక్ష రేపు ప్రతి ఒక్కరికీ ఎదురుకావచ్చని, రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారికి కూడా జరగవచ్చని వ్యాఖ్యానించారు. కుల, మత, వర్గ విభేదాలకు తావులేని సమాజం కోసం రోహిత్ మరణించాడని... రోహిత్ గ్రహించిన వాస్తవాలను వెల్లడించడమే ఇక్కడ సమస్య అయిందని పేర్కొన్నారు. విద్యార్థులే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశం అభివృద్ధికి నోచుకోకపోవడానికి ఇక్కడి కులవ్యవస్థే కారణమని తనతో ఓసారి ప్రయాణించిన జపాన్ పౌరుడు అభిప్రాయపడ్డాడని రాహుల్ తెలిపారు. కులవివక్షను ఇంక అంగీకరించబోమని స్పష్టం చేశారు. ‘నేను హింసను బోధించను, అలాగే నేను తలవంచను..’ అన్న మహాత్మాగాంధీ సూక్తిని గుర్తు చేశారు. ఇప్పుడు తాను వివక్షకు వ్యతిరేకంగా తల ఎత్తానని... విద్యార్థులకు అండగా ఉంటానని చెప్పారు. ఈ ప్రసంగం అనంతరం సాయంత్రం ఆరు గంటల సమయంలో రాహుల్ గాంధీకి ప్రొఫెసర్ కంచ ఐలయ్య నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాహుల్ గాంధీకి అందజేశారు. శనివారం దీక్షలో కాకి మాధవరావు, కంచ ఐలయ్య, జస్టిస్ చంద్రకుమార్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. రోహిత్‌కు హెచ్‌సీయూ నుంచి రావాల్సిన స్టైఫండ్ రూ.లక్షా 70 వేలను వర్సిటీ చెల్లించలేదని.. దాంతో అదే మొత్తాన్ని ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం తరఫున కాకి మాధవరావు, గెడ్డం ఝాన్సీ, సూరేపల్లి సుజాతలు రోహిత్ తల్లికి అందజేశారని విద్యార్థులు తెలిపారు. ప్రధాన గేటు వద్ద గలాటా హెచ్‌సీయూలో ఉద్యమానికి సంఘీభావం గా రాహుల్‌గాంధీ దీక్ష చేపట్టిన నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీ నేతలు భారీగా రావడం.. రాహుల్ రాకకు నిరసనగా ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేయడం.. తదితర పరిణామాలతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీక్షలో ఉన్న రాహుల్‌ను కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యే సంపత్, మల్లు రవి, పలువురు స్థానిక నేతలు శనివారం హెచ్‌సీయూ వద్దకు వచ్చారు. వారిని హెచ్‌సీయూ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో అక్కడే ధర్నా చేపట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా... పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు రాహుల్ హెచ్సీయూకు రావడాన్ని నిరసిస్తూ ఏబీవీపీ కార్యకర్తలు వర్సిటీ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. రాహుల్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం దీక్షాస్థలానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. చివరికి పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ అన్యాయం మరెవరికీ జరగకూడదు: రోహిత్ తల్లి తన కుమారుడిని 27 ఏళ్లు పెంచి ఈ వర్సిటీకి అప్పజెప్పానని, త్వరలోనే ఉద్యోగం వస్తుందని రోహిత్ తనకు చెప్పాడని... కానీ విశ్వవిద్యాలయం తన బిడ్డ శవాన్ని అప్పగించిందని రోహిత్ తల్లి రాధిక కన్నీటిపర్యంతమయ్యారు. ఇంకెవరికీ ఇటువంటి పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. ఇక వర్సిటీలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన ముగ్గురు విద్యార్థుల ఆమరణ దీక్ష కొనసాగుతోంది. రాజకీయం చేస్తున్నారు : కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సాక్షి, న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్యను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసి లబ్ధిపొందాలని చూస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. ఇది హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడో రోహిత్ తన లేఖలో రాశాడని, దానిపై సమగ్ర విచారణ జరపాల్సి ఉందని చెప్పారు. వాస్తవాలు తెలుసుకుని వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై దృష్టి పెట్టకుండా రాజకీయం చేసి ప్రభుత్వంపై వ్యతిరేక ఉద్యమం చేయాలనుకోవడం సరికాదన్నారు. గతంలో వేర్వేరు వర్సిటీల్లో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రధానిపై వ్యతిరేక ప్రచారంతో రాజకీయం చేయడం సరికాదని, బాధ్యతతో వ్యవహరించాలని కాంగ్రెస్, వామపక్షాలు, బీఎస్పీలకు వెంకయ్య నాయుడు సూచించారు. -
సెలవుపై వెళ్లిన హెచ్‌సీయూ ఇంఛార్జ్ వీసీ
హైదరాబాద్ : విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. శనివారం రోహిత్ బర్త్‌డే. ఈ సందర్భంగా విద్యార్థులు దీక్ష చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విద్యార్థుల దీక్షకు సంఘీభావంగా తెలపనున్నారు. అందులోభాగాంగా ఆయన కూడా దీక్ష చేయనున్నారు. అయితే హెచ్‌సీయూ ఇంఛార్జ్ వీసీ విపిన్ శ్రీవాస్తవ నాలుగు రోజులు సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో డీన్ పెరియాస్వామి ఇంఛార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టారు. -
ఆగని పోరాటం
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యులైన వారిని పదవుల నుంచి తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఓయూ జేఏసీ, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించగా...పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు వర్సిటీలోనూ విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. -
హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఆందోళన
-
హెచ్‌సీయూలో కొనసాగుతున్న ఆందోళన
హైదరాబాద్ : విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్‌సీయూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. శుక్రవారం పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. వీసీ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించడం వల్ల సమస్య పరిష్కారం కాదని పరిపాలన భవనం సిబ్బంది స్పష్టం చేశారు. విద్యార్థులు తరగతులకు హాజరుకాకపోవడం వల్ల ల్యాబ్‌లో ఉపయోగించే అత్యంత విలువైన కెమికల్స్ వృథా అవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలకు సహకరిస్తే పరిష్కారం దొరుకుతుందని సిబ్బంది స్పష్టం చేశారు. -
రోహిత్ మరణంపై కేసీఆర్ స్పందించలేదు
హైదరాబాద్ : హెచ్‌సీయూ వీసీని సస్పెండ్ చేయాల్సిందే అని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోహిత్ కుటుంబానికి... సస్పెండ్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ... వీహెచ్ బుధవారం ట్యాంక్‌బండ్ వద్ద గంటపాటు మౌన దీక్ష చేపట్టారు. మౌన దీక్ష విరమించిన అనంతరం వీహెచ్ మాట్లాడుతూ.... రోహిత్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపై వీహెచ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ బడుగుల వ్యతిరేకి అని ఈ సందర్భంగా అర్థమైందని అన్నారు. రోహిత్ మరణానికి ఏబీవీపీ, బీజేపీలే కారణమని వీహెచ్ ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు జోక్యం వల్లే హెచ్‌సీయూ విద్యార్థులు సస్పెండ్ అయ్యారని విమర్శించారు. రోహిత్ కులంపై చర్చ అనవసరం అని వీహెచ్ అభిప్రాయపడ్డారు. బీఫ్ తినడంపై రాజకీయాలు చేస్తున్నాయని ఎంఐఎం, బీజేపీలపై వీహెచ్ నిప్పులు చెరిగారు. -
రోహిత్ ఆత్మహత్య పై ఎందుకు స్పందించడం లేదు
♦ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన ఓయూ విద్యార్థి జేఏసీ ♦ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయ గేటు వద్ద ధర్నా సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎందుకు స్పందించడం లేదని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) విద్యార్థి జేఏసీ ప్రశ్నించింది. రోహిత్ ఆత్మహత్య ఘటన చోటు చేసుకొని 10 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పోవడాన్ని నిరసిస్తూ ఓయూ విద్యార్థి జేఏసీ మంగళవారం సచివాలయ ముట్టడికి యత్నిం చింది. విద్యార్థులను పోలీసులు నిలువరించడంతో ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వేముల రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వారందరినీ పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత భాస్కర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నగర నడిబొడ్డునున్న హెచ్‌సీయూలో ఒక దళిత విద్యార్థి మృతి చెందితే కనీసం సంతాపం కూడా ప్రకటించకపోవడం సిగ్గుచేటన్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరామర్శిస్తున్నా.. సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు. రోహిత్ మృతికి కారణమైన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు, వీసీ అప్పారావు, ఏబీవీపీ నేత సుశీల్‌కుమార్‌లను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ నెల 29న సీఎం అధికారిక నివాసాన్ని ముట్టడిస్తామన్నారు. -
పౌరులకు జీవించే హక్కు లేకుండాపోయింది- బొజ్జా తారకం
స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు దాటిన పౌరులకు జీవించే హక్కు లేకుండా పోయిందని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బొజ్జ తారకం అన్నారు. రాజ్యాంగం క ల్పించిన హక్కులు పేదవాడికి అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఎస్వికె ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజ్యాంగం-పౌరహక్కులు అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బొజ్జ తారకం మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యంతో రాజ్యాంగ హక్కులు సామాన్యులకు అందకుండా పోతున్నాయని అన్నారు. పౌర హక్కుల కోసం ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు పోరాడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం లో ఉన్న ఏ హక్కులు సక్రమంగా అమలు కావడం లేదని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఉదంతం.. దీనికి ఒక ఉదాహరణ అని అన్నారు. యూనివర్సిటీల్లో వెలివాడలు.. జాతికి అవమానకరం అని ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ అప్పారావు ప్రవర్తన బాధాకరం అని అన్నారు. కుల విక్ష ఉన్నంత కాలం.. జీడీపీ ఎంత పెరిగినా.. ప్రపంచ దేశాల సరసన భారత్ నిలబడ లేదని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడి రోహిత్ దేశ ముద్దు బిడ్డ అని కన్నింటి పర్వమయ్యాడని అయినప్పటికి ఆయన మృతికి కారణమైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్య మంత్రి వర్సిటీవైపు కన్నెత్తి చూడలేదన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కూడా కొంత మంది స్వార్థప్రయోజనాల కోసం హరించి వేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. చట్టాలు చట్టబండలుగా మారాయని అన్నారు. దేశంలో అసహనం, ఉగ్రవాదం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వికె కార్యదర్శి ఎస్.వినయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ చల్లా కొండయ్య కూతురు శోభారాణి, మనువడు శ్రీశాంత్, మనువరాలు అజిత తదితరులు పాల్గొన్నారు. -
'కేంద్రం తీరు విద్యావ్యవస్థకే ప్రమాదకరం'
హైదరాబాద్: హెచ్‌సీయూలో నిరవధిక దీక్ష చేపట్టిన విద్యార్థులను తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ నేతలు శనివారం పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ... ఆత్మహత్య చేసుకున్న రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలని, భవిష్యత్ ను ఫణంగా పెట్టి ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు అండగా ఉంటామని అన్నారు. రోహిత్ ఘటనను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి వివరిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున విద్యార్థి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా డిమాండ్ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు విద్యా వ్యవస్థకే ప్రమాదకరంగా మారిందని వారు ఆరోపించారు. విద్యార్థులను పరామర్శించిన వారిలో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల, గీతారెడ్డి, సి. రామచంద్రయ్య, శైలజానాథ్ తదితరులు ఉన్నారు. కాగా రోహిత్ కుటుంబానికి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్టు హెచ్‌సీయూ ప్రొఫెసర్లు ప్రకటించారు. -
గౌహతిలో భగ్గుమన్న విద్యార్థి లోకం
-
హెచ్‌సీయూలో నాలుగోరోజుకు చేరిన విద్యార్థుల దీక్ష
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కి న్యాయం జరగాలంటూ హెచ్‌సీయూలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ నేత కె.నారాయణ హెచ్సీయూకు రానున్నారు. విద్యార్థులు చేపట్టిన దీక్షకు వారు సంఘీభావం తెలపనున్నారు. -
రాజంపేటలో విద్యార్థుల ర్యాలీ
హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ మృతికి నిరసనగా వైఎస్సార్ జిల్లా రాజంపేటలో విద్యార్థులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రోహిత్ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. -
నిరసనల హోరు
రోహిత్ మృతిపై కొనసాగుతున్న ఆందోళనలు మదనపల్లెలో మానవహారం, రిలేదీక్షలు ఎమ్మెల్యే మద్దతు మహిళా వర్సిటీలో తరగతులు బహిష్కరించిన విద్యార్థులు చిత్తూరులో గాంధీ విగ్రహం వద్ద ధర్నా యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి)/మదనపల్లె/చిత్తూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి రోహిత్ మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం కూడా జిల్లాలో నిరసనలు కొనసాగాయి. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులు గురువారం ఆందోళనలు నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థినులు తరగతులను బహిష్కరించారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఎన్టిఆర్ విగ్రహం వద్ద విద్యార్థినులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రోహిత్ మరణం బాధాకరణమని, కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మి, అధ్యాపక సంఘం అధ్యక్షురాలు కృష్ణకుమారిలు విద్యార్థుల ఆందోళనకు మద్దతు పలికారు. రోహిత్‌కు నివాళులర్పించారు. మహిళా డిగ్రీ కళాశాలలో.. శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో రోహిత్ ఆత్మహత్యపై విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. కళాశాల ఆవరణలోని పద్మావతి విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. రోహిత్ విశ్వవిద్యాలయాల్లో ఎదుర్కొన్న దీనపరిస్థితులవల్లే ఆత్మహత్య చేసుకున్నారని విద్యార్థినులు వాపోయారు. ఇలాంటి సంఘటనలు ఏ విద్యాసంస్థల్లో జరగకూడదని నినదించారు. సంఘటనపై బాధ్యులను శిక్షించాలని కోరారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి ఓబుల్‌రెడ్డి, టీఎస్ఎఫ్ నాయకులు అక్కులప్ప, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘనాయకులు మురళీధర్, ప్రభు, వెంకటస్వామి తదితరులుపాల్గొన్నారు. దళిత సంఘాల నివాళి రోహిత్ మృతికి సంతాపంగా తిరుపతిలో గురువారం రాత్రి దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనతో ఘనంగా నివాళులు అర్పించారు. -
రాజకీయ జోక్యాన్ని సహించం
హైదరాబాద్: మా శవాలు కూడా కుల దృవీకరణ పత్రాలు సమర్పించాల్సి వస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీలో హిందూత్వ రాజకీయ జోక్యం నశించేంత వరకు నిరాహార దీక్షను ఆపేది లేదు. వివక్షతో చావడం కన్నా, పోరాడి వీరమర ణం పొందడం మేలు. అని హెచ్‌సీయూలో నిరాహారదీక్ష చేస్తున్న విద్యార్థులు పేర్కొన్నారు. రోహిత్ మరణానికి కార కులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, వీసీ అప్పారావును పదవినుంచి తొలగించాలని, రోహిత్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి వర్సిటీలో ఉద్యోగం ఇవ్వాలని, అతని కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, స్కాలర్స్‌పై కేసులను ఎత్తివేయాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలి సిటీబ్యూరో: హెచ్‌సీయూలో పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర వి చారణ చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా గురువారం హై దరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దోమలగూడలోని కార్యాలయం నుంచి ఇందిరాపార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అ ద్యక్షులు నర్సిరెడ్డి మాట్లాడు తూ.. విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లాల్సిన వర్సిటీలు.. కులమత బేధాలకు నిలయాలుగా మార డం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండల్రావు, సంజీవరా వు, రేణు, శారద, సింహాచలం, రామకృష్ణ, నాగరాజు, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు జేఎన్టీయూహెచ్ బంద్ కేపీహెచ్‌బికాలనీ: హెచ్‌సీయూ విద్యార్ధి వేముల రోహిత ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ శుక్రవారం జేఎన్టీయూహెచ్ బంద్‌కు పిలుపు ఇచ్చినట్లు జేఎన్టీయూహెచ్ పరిధిలోని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. మా శవాలు కూడా దృవీకరణ పత్రాలు ఇవ్వాలా..! దళితులైనందునే మేం చనిపోతున్నాం. కానీ మా చావు తర్వాత కూడా మా కుల ధ్రువీకరణ పత్రాల్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. రోహిత్ మరణానికి కారకులైన కేంద్ర మంత్రి దత్తాత్రేయ సహా అందరిని శిక్షించి, వీసీని తొలగించాలి. వర్సిటీల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలి. ఆర్యత్ వైఖరి, పొలిటికల్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్. వివక్షకు కేంద్రబిందువు సెంట్రల్ యూనివర్సిటీ దళితుల వివక్షకు కేంద్రబిందువు. అంబేడ్కర్ స్టుడెంట్స్ అసోసియేషన్ ఆవిర్భావం నుంచి అనేక పోరాటాలు చేసింది. ఒక మేధావి మరణంతో దేశవ్యాప్తంగా ఉద్యమం వెల్లువెత్తింది. నిన్న రాహుల్ గాంధీ, నేడు కేజ్రీవాల్ అన్ని రాజకీయ పార్టీలూ వస్తున్నాయి మద్దతు పలుకుతున్నాయి. గుమ్మడి ప్రభాకర్, హిస్టరీ పీహెచ్డీ స్కాలర్ మాకు విముక్తి కావాలి బ్రాహ్మణికల్ అగ్రహారాల నుంచి మాకు విముక్తి కావాలి. వారికి మా ఉద్యమం ఓ గుణపాఠం కావాలి. రోహిత్‌లా మరోదళిత మేధావి జీవితం అర్థాంతరంగా ముగియకూడదు. అందుకే జాతీయ స్థాయిలో రోహిత్ చట్టం చేయాలి. ఉమామహేశ్వర్ రావు, పొలిటికల్ సైన్స్ పీహెచ్డీ స్కాలర్. డిమాండ్లు నెరవేర్చాలి ఉన్నత విశ్వవిద్యాలయాల్లో దళిత మేధావులను అంతమొందించే హిందూత్వ రాజకీయాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.బీజేపీ అధికారంలోకి వచ్చిన తొలినాటి నుంచే దళితులు, మెనారిటీలపై తీవ్రమైన దాడులకు దిగుతోంది. మా డిమాండ్లు నెరవేరినప్పుడే దీక్షను ఉపసంహరించుకుంటాం. మనోజ్.కె.పి. పీహెచ్డీ విద్యార్థి. -
'అతడి ఆత్మహత్య దేశానికే అవమానం'
హైదరాబాద్ : రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్‌సీయూలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులను న్యూఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గురువారం పరామర్శించారు. విద్యార్థులు చేపట్టిన దీక్షకు కేజ్రీవాల్ సంఘీభావం ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న రోహిత్ మెరిట్ ఆధారంగానే యూనివర్శిటీలో సీటు సంపాదించాడని.... అంతేకానీ... రిజర్వేషన్లతో అతడు యూనివర్శిటీలో అడుగు పెట్టలేదని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం దేశానికే అవమానం అని అన్నారు. హెచ్‌సీయూలో చోటు చేసుకున్న సంఘటనలపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఎలాంటి విచారణ జరపకుండా విద్యార్థులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాశారని కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ అంశాన్ని దళితులు... ఇతరులకు మధ్య ఘర్షణగా చిత్రీకరించారని విమర్శించారు. మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆదేశాలతోనే హెచ్‌సీయూకి కొత్త వీసీ వచ్చారన్నారు. ఏబీవీపీ వేధింపులతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నారని స్పష్టం చేశారు. యూనివర్శిటీలో ఏబీవీపీ నాయకుడు సునీల్ కుమార్‌పై ఏఎస్ఏ విద్యార్థులు దాడి చేయలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. సునీల్ ఆపరేషన్‌కి...ఏఎస్ఏ దాడికి సంబంధమే లేదని అన్నారు. యూనివర్శిటీలో విద్యార్థుల ఆత్మహత్యలు బాధాకరమని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
'పోరాటం కొనసాగిస్తాం'
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్‌సీయూ విద్యార్థుల జేఏసీ స్పష్టం చేసింది. ఏడుగురు విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారం రెండో రోజకు చేరుకుంది. వీసీ అప్పారావును సస్పెండ్ చేయాలని విద్యార్ధుల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తమ ఐదు డిమాండ్లు నెరవేర్చాలని విద్యార్థులు బుధవారం నిరవధిక దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. రోహిత్ ఘటనపై పోరును ఉధృతం చేసేందుకు విద్యార్థులు జేఏసీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. -
స్మృతి ఇరానీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
-
ఆ ఇద్దరు మంత్రులను మోదీ బర్తరఫ్ చేయాలి
-
'ఆ ఇద్దరు మంత్రులను మోదీ బర్తరఫ్ చేయాలి'
హైదరాబాద్ : కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ ఒత్తిళ్ల వల్లే... హెచ్‌సీయూ నుంచి విద్యార్థులను సస్పెండ్ చేశారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఆ ఇద్దరు మంత్రులను ప్రధాని మోదీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో బుధవారం హెచ్‌సీయూకి సీతారాం ఏచూరి విచ్చేశారు. స్థానిక విద్యార్థులతో మాట్లాడిన అనంతరం సీతారాం ఏచూరి విలేకర్లతో మాట్లాడుతూ... హెచ్‌సీయూ వీసీని తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. అసలు వీసీ నియామకమే రాజకీయంగా జరిగిందని విమర్శించారు. విద్యార్థుల మధ్య గొడవ సమసిపోయాక సదరు విద్యార్థులను సస్పెన్షన్ ఎలా చేశారని ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ కుట్రపూరితంగా జరిగాయని అన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. -
'రోహిత్ కుటుంబానికి రూ. 5 కోట్లు చెల్లించాలి'
హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ కుటుంబానికి రూ. 5 కోట్లు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్‌లో విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ... హెచ్ సీ యూ వీసీ పి. అప్పారావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే రోహిత్ మరణానికి కారణమైన కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో జరగకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. రోహిత్ కులంపై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ ఆరోపించింది. ఈ సందర్భంగా రోహిత్‌కు గతంలో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాన్ని విద్యార్థి జేఏసీ మీడియాకు విడుదల చేసింది. రోహిత్‌కు వ్యతిరేకంగా బీజేపీ, ఏబీవీపీ దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించింది. రోహిత్ అంత్యక్రియలను హడావిడిగా జరపడం వెనుక కుట్ర దాగి ఉందని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ అనుమానం వ్యక్తం చేసింది. -
'బీజేపీ, ఆరెస్సెస్‌కు ఇష్టం లేదు'
హైదరాబాద్ : దేశంలో దళితులు బాగుపడటం బీజేపీ, ఆరెస్సెస్‌కు ఇష్టం లేదని ప్రొ. కంచె. ఐలయ్య ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రొ. కంచె ఐలయ్య విలేకర్లతో మాట్లాడుతూ... హెచ్‌సీయూ విద్యార్థులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థుల గదుల్లో ఆయుధాలు ఏమైనా దొరికాయా ? అని నిలదీశారు. విద్యార్థులను తీవ్రవాదులుగా చిత్రీకరిస్తూ ఓ కేంద్రమంత్రి ఎలా కేంద్రానికి లేఖ రాస్తారన్నారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్‌కు రాజకీయాలతో సంబంధం లేదని ఐలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు. యూనివర్శిటీల్లో అగ్రకులాల ఆధిపత్యం నశించాలని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థి రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఈ సందర్భంగా ప్రొ.కంచె ఐలయ్య, ప్రొ.విశ్వేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. -
ఎందుకిలా? ప్రాణం విలవిల..
►‘ఈ లేఖ చదివే సమయానికి నేను మీ మధ్య ఉండను. ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను. మీలో కొందరు నన్ను ప్రేమించారు. కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆదరించారు. కానీ నాకు అనేక సమస్యలున్నాయి. అవే నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించాయి. బతికుండడం కంటే మరణంలోనే నాకు ఆనందం ఉంది.. నా దేహానికి, ఆత్మకు దూరం పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. కార్ల్ సాగన్ మాదిరిగా గొప్ప సైన్స్ రచయిత కావాలనుకున్నా. చివరికిలా ఆత్మహత్య లేఖ రాయాల్సి వచ్చింది.. నా చిన్ననాటి నుంచి ఒంటరితనానికి దూరం కాలేకపోయాను.. మరణించాక నా గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను..’ ఇది ఆత్మహత్యకు పాల్పడ్డ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ సూసైడ్ నోట్ సారాంశం! ►అమ్మకు ఎవరో చేతబడి చేశారని నాన్న నమ్మకం. ఆ అనుమానమే తల్లీ పిల్లలకు కలిగింది. బీటెక్ చదువుకున్న కొడుకు భువనేశ్వర్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఇంటికొచ్చేశాడు. అధ్యాపక వృత్తిలో ఉన్న పెద్దకొడుకు అనుమానాన్ని పెనుభూతంగా చేసుకుని ఏడాదిన్నర క్రితం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. మూడు రోజుల దాకా ఆ విషయం బయటకు పొక్కకుండా శవాన్ని ఇంట్లోనే ఉంచేశారు. దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగూ ఆరా తీస్తే కొడుకు చనిపోతే వాసన రాదా? అంటూ ఎదురు ప్రశ్న వేశారు. అయిన వారందరికీ దూరమయ్యారు. ఒంటరితనంతో గడుపుతున్నారు. ఆ తర్వాత కూడా ఆ ఇంటిని ‘భూతం’ వదల్లేదు. ఆదాయం వచ్చే పనిని తండ్రి వదిలేసుకున్నాడు. చేతబడిపై నమ్మకం చావని ఆయన మాంత్రికులు, తాయెత్తుల కోసం ఊళ్లు తిరుగుతూనే ఉన్నాడు. ఇంతలో తల్లీకొడుకులిద్దరూ ఉరేసుకుని ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఇది విశాఖ నగరం అక్కయ్యపాలెం రామచంద్రనగర్‌లో రెండ్రోజుల క్రితం తనువు చాలించిన కమల, రవికుమార్‌ల విషాదగాధ! - సాక్షి, విశాఖపట్నం ► పై ఘటనల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డవారు నిరక్షరాస్యులు కాదు.. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న వారు అంతకంటే కాదు.. మహానగరాల్లో ఉంటున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన వారూ.. సమాజంపై అవగాహన ఉన్నవారూ. ఇలాంటి వారే అఘాయిత్యాలకు పాల్పడుతుండడం, అందుకు దారితీసే పరిస్థితులను మానసిక వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు ఇలా విశ్లేషిస్తున్నారు. ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితులివీ ►తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లో డిప్రెషన్. ► తల్లిదండ్రుల నుంచి సరైన ప్రేమాభిమానాలు పొందలేకపోవడం ►విడిగా జీవించడం, సర్దుబాటు చేసుకోలేక పోవడం ►మానసిక, ప్రవర్తనలో అపసవ్యత ►అతి గారాబం, అతి నియంత్రణ ►చదువులో సరైన క్రమశిక్షణ లేకపోవడం ►ఎవరితోనూ కలవలేక ఒంటరిగా ఉండడం. ► ఇతరులకన్నా తక్కువన్న న్యూనత, భవిష్యత్‌పై నిరాశ ►సమాజ ం దూరంగా ఉంచడం.. గత సంఘటనలూ ప్రభావితం.. ఆత్మహత్యలకు గతంలో జరిగిన ఘటనలూ ప్రభావితం చేస్తాయి. అందులో కొన్ని.. ►{పేమ విఫలం, చిన్ననాటి దుర్ఘటనలు, ఆత్మీయులను కోల్పోయిన ఘటనలు మర్చిపోలేకపోవడం. ►మహిళల్లో అబార్షన్లు, పిల్లలు కలగరన్న నిర్థారణకు రావడం. ఆస్తులు కోల్పోయినప్పుడు.. ►అత్తమామల వేధింపులు, పరీక్షల్లో ఫెయిల్ వంటివి తనువు చాలించాలనుకుంటారు. అలాంటి వారిని గుర్తించవచ్చు.. ఆత్మహత్యకు పాల్పడాలనుకునే వారిని గుర్తించవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. ►ఎప్పుడు రెస్ట్‌లెస్‌గా, అసహనంగా ఉంటారు. అన్నీ తెలిసినట్టు కనిపిస్తారు. దేనిపైనా ఆసక్తి చూపరు. తిరస్కార భావంతో ఉంటారు. ఎవరి సలహాలు తీసుకోరు. ►ఎక్కువగా భయపడతారు.. నిద్రపోరు. చెప్పిందే చెబుతారు.. చేసిందే చేస్తుంటారు. ఈ లక్షణాలున్న వారిని వారి తల్లిదండ్రులు, స్నేహితులు, టీచర్లు, సైకాలజిస్టులు, సైక్రియాట్రిస్టులు గుర్తించగలుగుతారు. మాకెందుకులే అనుకోరాదు.. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి పట్ల వారి కుటుంబ సభ్యులే కాదు.. సాటి మనుషులు మాకెందుకులే అని ఊరుకోవడం సరికాదు. సమాజం కూడా స్పందించాలి. సైన్స్ అభివృద్ధి చెందుతున్నా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చెడుపు, చిల్లంగి వంటి మూఢనమ్మకాలు కొనసాగడం విచారకరం. ఇలాంటి రుగ్మతలతో ఉన్న వారిని సరైన సైకాలజిస్టుకు చూపిస్తే తిరిగి మామూలు మనుషులుగా మారతారు. సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ రోహిత్, అక్కయ్యపాలెంలోని కమల, రవికుమార్‌ల వంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు. కాలేజీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు వేసే కమిటీల్లో మానసిక శాస్త్రవేత్తలు, నిపుణులకు స్థానం కల్పించాలి. -ప్రొఫెసర్ ఎం.వి.ఆర్.రాజు, ఏయూ సైకాలజీ విభాగాధిపతి. స్కిజోఫినియా అయి వుండొచ్చు.. అక్కయ్యపాలెంలో ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీకొడుకుల పరిస్థితి చూస్తే స్కిజోఫినియాగా అనిపిస్తుంది. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న వారే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మూఢనమ్మకాల నుంచి బయటపడలేక మానసిక బలహీనత, అపోహలతో అయిన వారికి, చుట్టుపక్కల వారికీ దూరంగా ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్నట్టు అర్థమవుతోంది. తల్లి అనారోగ్యం వారిపై ప్రభావం చూపి ఉండొచ్చు. ఇలాంటి సమస్య వారి కుటుంబంలో ఎవరో ఒకరికి ఉండొచ్చు. జన్యుపరంగా కూడా ఇలాంటి రుగ్మత వస్తుంది. ఈ సమస్యకు మానసిక వైద్యులు చికిత్స చేసి నయం చేస్తారు. బంధువులు, స్నేహితులు ఆ బాధ్యతలు తీసుకుంటే ఫలితం ఉండేది. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వారిని వదిలేయకుండా తగిన వైద్యం చేయించాలి. -డాక్టర్ కె.నరసింహారెడ్డి, మానసిక వైద్య నిపుణుడు ఇవీ పరిష్కారాలు.. ►నమ్మిన వారి నుంచి సలహాలు తీసుకోవాలి. ► సైకాలజిస్టులు/సైక్రియాట్రిస్టులను సంప్రదించాలి. ►సానుకూల దృ క్పథంతో మసలుకోవాలి. ఆవేశాలను అణచుకోవాలి. ►తల్లిదండ్రులు ప్రేమానురాగాలు పంచాలి. పిల్లలకు దన్నుగా నిలవాలి. పెద్దలపట్ల ఆదరణ పెరగాలి. ►మానసిక సమస్యలు గల విద్యార్థినీ, విద్యార్థుల పరిస్థితిని వారి గురువులు గుర్తించి సరిదిద్దవచ్చు. ►వారు రోజూ స్కూలు/కాలేజీలకు వస్తున్నారా? లేదా? నలుగురితో కలుస్తున్నారా లేదా? గమనించాలి. హాస్టళ్లలో ఉంటున్న వారిని పట్టించుకునే బాధ్యత వార్డెన్లు తీసుకోవాలి. -
నివేదిక వచ్చిన తర్వాతే స్పందిస్తా: స్మృతీ
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం రాష్ట్రానికి చెందిన వ్యవహారమని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు. రోహిత్ ఆత్మహత్యపై మంగళవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. విద్యార్థి ఆత్మహత్యపై ద్విసభ్య కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే తాను ఈ అంశంపై స్పందిస్తానని చెప్పారు. అప్పటి వరకు తాను ఈ అంశంపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయనని స్మృతీ ఇరానీ తెలిపారు. -
'రోహిత్‌ది ఆత్మహత్య కాదు హత్యే'
కాకినాడ : హెచ్‌సీయూలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై అమలాపురం ఎంపీ పి.రవీంద్రబాబు స్పందించారు. మంగళవారం కాకినాడలో రవీంద్రబాబు మాట్లాడుతూ... రోహిత్‌ది ఆత్మహత్య కాదు హత్యే అని ఆయన స్పష్టం చేశారు. రోహిత్ మృతిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోహిత్ మరణానికి కులం, రాజకీయ రంగు అంటించవద్దని రాజకీయపార్టీలు, విద్యార్థి సంఘాలకు రవీంద్రబాబు సూచించారు. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీపై కేసులు నమోదు చేస్తే... ఈ వివాదం పక్కదారి పడుతుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌లో దళితులు ఇంకా అణచివేతకు గురవుతున్నారనడానికి రోహిత్ ఆత్మహత్యే ఓ నిదర్శనమని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
దత్తాత్రేయ ఇంటి వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్మ తీవ్ర దుమారం రేపుతోంది. ఈ క్రమంలో రాంనగర్ లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రోహిత్ ఆత్మహత్మ నేపథ్యంలో మంగళవారం తెలంగాణ జాగృతి దత్తాత్రేయ ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. జాగృతి కార్యకర్తలు, ఆందోళన కారులు పెద్ద ఎత్తున ఇంటి వద్దకు తరలి వచ్చారు. మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ కి వ్యకతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన ఎక్కువకావడంతో పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
రోహిత్ చావుకు ఎవరు బాధ్యులు?
‘చావు లాంఛనాల గురించి రాయడం మర్చిపోయాను. ఎవరూ నా ఆత్మహత్యకు బాధ్యులు కాదు. వారి చర్యల ద్వారాగానీ, మాటల ద్వారాగానీ నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించలేదు. ఇది పూర్తిగా నా స్వనిర్ణయం. నా చావుకు నేనే బాధ్యుడిని. నా స్నేహితులనుగానీ, నా శత్రువులగానీ నా ఆత్మహత్య కారణంగా వేధించకూడదు’ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి వేముల రోహిత్ సూసైడ్ నోట్ సారాంశం ఇదీ. ఓ దళిత విద్యార్థి ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల నుంచి అతడితో గొడవ పడిన ఏబీవీపీ, నాడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి స్వయంగా లేఖ రాసిన సాక్షాత్తు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తప్పించుకునేందుకు ఈ సూసైడ్ నోట్ రక్షణ కవచంలా ఉపయోగపడొచ్చు. బోల్డంతా భవిష్యత్తుకు తిలోదకాలిచ్చి అర్ధాంతరంగా వెళ్లిపోయిన వేముల ఆత్మహత్యలో దాగున్న వేదన, వాస్తవ పరిస్థితులు మనందరిని వేటాడుతూనే ఉంటాయి. మన పిరికితనం వల్ల వేముల చనిపోయాడు. తోటి అకాడమిక్ విద్యార్థుల పిరికితనం. యూనివర్శిటీ అధికారుల పిరికితనం. రోహిత్, అతడి సహచరులను క్యాంపస్ నుంచి వెళ్లగొట్టాల్సిందిగా వచ్చిన ఆదేశాలకు లొంగిపోయిన పిరికితనం, ఓ బీజేపీ కార్యకర్తను గాయపరిచారనే ఆరోపణలకు సంబంధించి ఎలాంటి బలమైన ఆధారాలు లేవని విచారణ కమిటీ నిగ్గు తేల్చినా పట్టించుకోని యూనివర్శిటీ అధికారుల పిరికితనం ఇవన్నీ కారణమే. రోహిత్ తోపాటు మరో నలుగురు అనుచరులను క్యాంపస్ నుంచి తరిమేసిన అధికారుల చర్యా కారణం. ఆత్మహత్య చేసుకోవాలని విపరీత నిర్ణయానికి రావడానికి దోహదం చేసిన పరిణామాలేమిటో వేముల రోహిత్ తన సూసైడ్ నోట్లో వెల్లడించకపోవచ్చు. అలాగే, ముంబై బాంబు పేలుళ్ల కేసులో మరణ శిక్ష పడిన యాకూబ్ మెమన్ ను గత ఏడాది ఉరితీయవద్దంటూ తన గ్రూప్ ప్రదర్శన జరపలేదని చెప్పలేదు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మతహింసపై ‘ముజఫర్ నగర్ బాకీ హై’ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదనీ చెప్పలేదు. ఈ చర్యల కారణంగా ఏబీవీపీ విద్యార్థులకు కోపం వచ్చిన విషయాన్ని చెప్పలేదు. వారి ప్రోద్బలంతో ఈ జాతి విద్రోహులపై చర్య తీసుకోమంటూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి బండారు దత్తాత్రేయ లేఖ రాసిని విషయాన్నీ చెప్పలేదు. గత రెండు వారాలుగా క్యాంపస్ ఆరుబయట నిద్రిస్తున్న విషయాన్నీ రోహిత్ చెప్పలేదు. దానికి బదులుగా ‘ఈ క్షణంలో నేను బాధ పడటం లేదు. విచారించడమూ లేదు. నా హృదయం ఖాళీ. నా పట్ల నాకు ఆందోళన లేదు. నేనెందుకు ఇలా చేస్తున్నాను’ అని లోలోన బాధపడిన రోహిత్, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాడన్న విషయం చెప్పలేదు. కానీ ప్రేమ, బాధ, జీవితం, చావు గురించి చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు, ఈ క్షణం తన గుర్తింపు ఏమిటీ అన్న స్థాయికి పడిపోయిన ప్రపంచ విలువల గురించి చెప్పాడు. మనిషి మేథస్సును కాకుండా, ఒక ఓటరుగా, జనాభాలో ఒక అంకెగా, ఓ వస్తువుగా మనిషి మారిపోయిన విషయాన్ని చెప్పాడు. తోటి మనుషులను ఓ మేధస్సు కలిగిన వ్యక్తులుగా చూడాలని చెప్పాడు. నక్షత్ర ధూళి నుంచి చదువులో, వీధుల్లో, జీవితాల్లో, ఆఖరికి చావులోనూ అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని చెప్పాడు. ఓ దళితుడిగా వేముల రోహిత్ చనిపోదల్చుకోలేదు. సైన్స్ రైటర్ కావాలనుకున్నాడు. నక్షత్రాలను తాకాలనుకున్నాడు. అంబేడ్కర్ విద్యార్థుల సంఘం సభ్యుడిగా జాతీయ స్ఫూర్తికి కట్టుబడ్డాడు. భారతీయ ముస్లింల తరఫున నిలబడ్డాడు. అన్ని వర్గాల నుంచి సంఘీభావాన్ని కూడగట్టాలనుకున్నాడు. అతడితో నడిచేందుకు ప్రపంచం విఫలమైంది. అందుకని రోహిత్ తన తనువు చాలించుకున్నాడు. వేముల రోహిత్ వంటి కలలను నిజం చేయాలని తపన పడేవారికి ఒక్క హైదరాబాద్ యూనివర్శిటీలోనే కాదు, ఏ యూనివర్శిటీలోనూ చోటు ఉండకపోవచ్చు. మనలాంటి పిరికివాళ్లు ఉన్న ఈ ప్రపంచంలో ఒంటరినని, తానొక ఖాళీ అని వేముల రోహిత్ ఎందుక భావించారు? -
రోహిత్ తల్లిని ఎంత ఓదార్చినా తక్కువే: వీసీ
హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ సస్పెన్షన్ వ్యవహారంలో ఏకపక్షంగా వ్యవహరించలేదని హెచ్‌సీయూ వైస్ ఛాన్సులర్ అప్పారావు తెలిపారు. ఆయన సోమవారం సాక్షి టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ...'రోహిత్ సస్పెన్షన్ పీరియడ్ తగ్గించడానికి చివరి వరకూ ప్రయత్నించాను. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖ ప్రభావం ఎంతమాత్రం లేదు. ఆయన లేఖ కారణంగానే రోహిత్‌ను సస్పెండ్ చేయలేదు. వర్సిటీలో కుల శక్తులు, అసాంఘిక శక్తులు లేవు. రోహిత్ తల్లి బాధ ఎంతకు తీరనిది. ఆమెను ఎంత ఓదార్చినా తక్కువే. రోహిత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వర్సిటీలో ఉద్రిక్తత కారణంగా రోహిత్ తల్లిని కలవలేకపోయాను. విద్యార్థులు ఆగ్రహంగా ఉన్నందువల్లే నా రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. నేను వీసీగా రాకముందే... విద్యార్థుల మధ్య గొడవ ఉంది. 14 రోజులపాటు విద్యార్థుల ఆందోళనపై ఇతర ప్రొఫెసర్లతో మాట్లాడుతూనే ఉన్నా' అని తెలిపారు. -
నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి: స్మృతి
న్యూఢిల్లీ : పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇద్దరు సభ్యుల బృందాన్ని పంపించామని, నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయని ఆమె సోమవారమిక్కడ అన్నారు. యూనివర్సిటీల నిర్వహణలో ప్రభుత్వ జోక్యం ఉండదని స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. ప్రస్తుతం హెచ్‌సీయూలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆమె తెలిపారు. రోహిత్ కుటుంబసభ్యులకు స్మృతి ఇరానీ ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా ఇదే ఘటనపై ఢిల్లీలోని స్మృతి ఇరానీ నివాసాన్ని ఇవాళ విద్యార్థులు ముట్టడించారు. మరోవైపు రోహిత్ ఆత్మహత్యపై సహ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
'రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదు'
-
రోహిత్ మృతిపై ద్విసభ్య కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతిపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ...ఇద్దరు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు షకీలా శంషూ, సురత్ సింగ్ లు సోమవారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. హెచ్‌సీయూలో ఏం జరిగిందన్న అంశంపై కమిటీ సభ్యులు విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు. మరోవైపు రోహిత్ భౌతికకాయానికి ఉస్మానియాలో పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం ఉప్పల్‌లోని అతని స్వగృహానికి తరలించారు. కాగా రోహిత్ కేసులో వీసీ అప్పారావును బర్తరఫ్ చేయాలని, రోహిత్ మృతికి కారణమైన దత్తాత్రేయపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత, అధ్యాపక సంఘాలు సోమవారం విశాఖ త్రి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. -
రోహిత్ ఆత్మహత్యతో సంబంధం లేదు: దత్తాత్రేయ
న్యూఢిల్లీ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. తన లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సోమవారమిక్కడ స్పష్టం చేశారు. 'యూనివర్సిటీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతోందని నాకు విజ్ఞాపన వచ్చింది. సంఘ, జాతి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. ఏబీవీపీ కార్యకర్తలను బాగా కొట్టినట్లుగా నాకు వినతిపత్రం వచ్చింది. దాన్ని మానవ వనరుల మంత్రిత్వ శాఖకు యథావిధిగా పంపించాను. వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో నాకు తెలియదు. బీజేపీకి గాని, నాకుగాని ఎలాంటి సంబంధం లేదు. విచారణ జరుగుతోంది, అసలు విషయాలు బయటకు వస్తాయి. నాపై నమోదైన కేసులు గురించి నేను కామెంట్ చేయను' అని బండారు దత్రాత్తేయ తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ...హెచ్‌సీయూకి అధికారులను పంపించనుంది. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంపై ఆ బృందం రేపు నివేదిక సమర్పించనుంది. -
'రోహిత్ ఆత్మహత్యకు వారిద్దరే కారణం'
హైదరాబాద్ : పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు ఇద్దరు బీజేపీ నేతలే కారణమని యూనివర్సిటీ అధ్యాపక సంఘం ఆరోపించింది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచంద్రరావు తమ పరిధులు దాటారని అధ్యాపక సంఘం వ్యాఖ్యానించింది. యూనివర్సిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని యూనివర్సిటీ అధ్యాపక సంఘం తీవ్రంగా ఖండించింది. యూనివర్సిటీ పాలనా విభాగం మొదటి నుంచీ తప్పులు చేస్తోందని, కమిటీలు విచారిస్తున్న తీరుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, విద్యార్థుల మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని, కేసులు విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసింది. మరోవైపు రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావు అంటూ వర్సిటీ విద్యార్థులు సోమవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రమంత్రితో పాటు వీసీ మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
హెచ్సీయూకు కేంద్ర బృందం
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటన, అనంతరం హెచ్‌సీయూలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. అధికారులతో కూడిన బృందాన్ని హెచ్సీయూకు పంపారు. హెచ్‌సీయూ పరిణామాలపై కేంద్ర బృందం విచారించి మంగళవారం నివేదిక సమర్పించనుంది. హెచ్‌సీయూ స్కాలర్ రోహిత్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. పోలీసు బలగాల మోహరింపు, విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత నెలకొంది. -
రోహిత్ ఆత్మహత్య; దత్తాత్రేయపై కేసు నమోదు
హైదరాబాద్ : హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయపై కేసు నమోదు అయింది. దత్తాత్రేయ ఇచ్చిన లేఖ వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు సోమవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే వైస్ ఛాన్సులర్ అప్పారావుపై కూడా కేసు నమోదు అయింది. ఏ1 వీసీ అప్పారావు, ఏ2 బండారు దత్తాత్రేయ, ఏ3 సుశీల్ కుమార్, ఏ4 విష్ణుపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం కూడా ...రోహిత్ ఘటనపై ఎలాంటి కమిటీ వేయకుండా చర్యలు తీసుకున్నారని, అందువల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసు బలగాల మోహరింపు, విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత నెలకొంది. -
హెచ్‌సీయూలో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. పోలీసు బలగాల మోహరింపు, విద్యార్థుల ఆందోళనతో హెచ్‌సీయూలో ఉద్రిక్తత నెలకొంది. రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా ఈ రోజు యూనివర్సిటీల బంద్‌కు విద్యార్థి సంఘాల పిలుపునిచ్చాయి. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. హెచ్‌సీయూలో పీహెచ్డీ చేస్తూ సస్పెన్షన్‌కు గురైన దళిత విద్యార్థి రోహిత్ కలత చెంది ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. రోహిత్ మృతదేహాన్ని తరలించకుండా విద్యార్థులు అడ్డుకోవడంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత ఏర్పడింది. వందలాది మంది విద్యార్థులు హాస్టల్లో మృతదేహన్ని ఉంచి ధర్నాకు దిగారు. విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ దశలో పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రోహిత్ ఆత్మహత్యకు వీసీ సమాధానం చెప్పాలని అతని తల్లి రాధిక డిమాండ్ చేసింది. వీసీ సమాధానం చెప్పేవరకు తాను యూనివర్సిటీ నుంచి వెళ్లనని, వీసీ వచ్చే వరకు రోహిత్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ చేయరాదని చెప్పింది. తాను టైలరింగ్ చేస్తూ తన కొడుకును చదివించానని, తన కొడుకుని సస్పెండ్ చేసి మనస్థాపానికి గురి చేశారని రాధిక కన్నీటిపర్యంతమైంది.