దేశభక్తి ఏ ఒక్కరి సొత్తూ కాదు | Patriotism is not the property of any one of them | Sakshi
Sakshi News home page

దేశభక్తి ఏ ఒక్కరి సొత్తూ కాదు

Published Fri, Feb 19 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

దేశభక్తి ఏ ఒక్కరి సొత్తూ కాదు

దేశభక్తి ఏ ఒక్కరి సొత్తూ కాదు

రోహిత్ ఘటనపై విచారణ తేదీలను మార్చాలి
{పముఖ విద్యావేత్త చుక్కా రామయ్య

 
హైదరాబాద్: ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దేశభక్తి పేరుతో జరుగుతున్నదంతా కేంద్రం సృష్టేనని, దేశభక్తి ఏ ఒక్కరి సొత్తూ కాదని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ ఘటనపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్ పర్యటన అనుమానాలకు తావిస్తోందన్నారు. విద్యార్థులు వర్సిటీలో లేని సమయంలో కమిషన్ పర్యటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నిజానిజాలను తెలుసుకోవడమే న్యాయవిచారణ లక్ష్యం అయితే అందులో విద్యార్థులదే కీలక పాత్ర  అని, అలాంటప్పుడు విద్యార్థులు లేని సమయంలో కమిషన్ వచ్చి ఏం చేస్తుందని చుక్కా రామయ్య నిలదీశారు. మాజీ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు మాట్లాడుతూ విద్యార్థులు నగరంలో ఉండరని తెలిసే ఏకసభ్య విచారణ కమిషన్ ఈ నెల 23,24,25 తేదీల్లో పర్యటిస్తుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. చలో ఢిల్లీ అన ంతరం 26వ తేదీ తరువాత విద్యార్థులు అందుబాటులో ఉంటారని, దీనికనుగుణంగా కమిషన్ తేదీల్లో మార్పు చేసుకోవాలని డిమాండ్ చేశారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన సీడీఎస్ వ్యవస్థాపకులు మల్లెపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ విద్యార్థులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన వారం రోజుల తర్వాత ఢిల్లీనుంచి ఏకసభ్య కమిషన్ అదే తేదీల్లో వస్తున్నట్టు ప్రకటించిడం కేంద్రం కుట్రలో భాగమని అన్నారు. పార్లమెంటులో రోహిత్ అంశాన్ని మరుగుపర్చేందుకు జేఎన్‌యూలో జరిగిన చిన్న సంఘటనను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రతిపక్షాలు ఆ ఉచ్చులో పడకూడదని హెచ్చరించారు. మీడియాపైన ఢిల్లీలోనూ, మేడారం జాతరలో సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరిపైనా జరిగిన దాడిని లక్ష్మయ్య తీవ్రంగా ఖండించారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు యాదయ్య, సీడీఎస్ డెరైక్టర్ వైబి సత్యనారాయణ, భరత్ భూషణ్, సిద్ధోజి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement