Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

PM Narendra Modi slammed Pakistan on Lex Fridman podcast1
శాంతి కోసం యత్నిస్తే.. శత్రుత్వం, ద్రోహమే ఎదురైంది: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ఆసియా దేశాల్లో భాగమైన పాకిస్తాన్ ఎప్పుడూ తమతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. వారి(పాకిస్తాన్)తో ఎప్పుడూ శాంతి చర్చలకోసం ప్రయత్నించినా అది విఫలయత్నంగానే మిగిలిపోయిందన్నారు. వారితో శాంతి చర్చలు చేసిన ప్రతీసారి ద్రోహం​, శత్రుత్వం మాత్రమే ఎదురైంది. వారికి ఎప్పటికైనా జ్ఞానం కలిగి తమతో శాంతి మార్గాన్ని ఎంచుకుంటారనే ఆశిస్తున్నామన్నారు ప్రధాని మోదీ., లెక్స్ ఫ్రిడ్‌ మ్యాన్ తో జరిగిన పాడ్ కాస్ట్ లో పాకిస్తాన్ తో ఎదురైన అనుభవాలను ప్రధాని మోదీ పంచుకున్నారు.2014లో తాను ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆహ్వానించిన సంగతిని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ తో సంబంధాలు తిరిగి గాడిలో పడతాయని ఆశించినట్లు ఆయన పేర్కొన్నారు. కానీ వారితో ఎప్పుడు శాంతి ప్రయత్నాలు చేసినా అవి విఫలంగానే మిగిలిపోయాయన్నారు మోదీ.కాకపోతే పాకిస్తాన్ లో ప్రజలు ఎప్పట్నుంచో శాంతిని కోరుకుంటున్నారని, వారు ఇప్పటికే అక్కడ జరిగే ఉగ్రదాడులతో అలసిపోయి ఉన్నారన్నారన్నారు. తాను తొలిసారిగా ప్రధానిగా సేవలందించే క్రమంలోనే పాకిస్తాన్ తో శాంతి చర్చల కోసం ఆహ్వానించానన్నారు.‘దశాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ దౌత్యపరమైన చర్యలకు అడుగులు వేశాం. విదేశాంగ విధానం పట్ల నా విధానాన్ని ఒకప్పుడు ప్రశ్నించిన వ్యక్తులు.. అన్ని సార్క్ దేశాధినేతలను ఆహ్వానించానని తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయారు. ఆ విషయాన్ని మన అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన జ్ఞాపకాలలో అందంగా రాసుకున్నారు కూడా’ అని మోదీ పేర్కొన్నారు.

Ap Coalition Government Borrowed Another Rs 11000 Crore2
మరో రూ.11వేల కోట్లు.. అప్పు చేసిన కూటమి ప్రభుత్వం

సాక్షి,విజయవాడ : కూటమి ప్రభుత్వం అమరావతి కోసం రూ.11 వేల కోట్లు అప్పు చేసింది. ఈ అప్పు మొత్తాన్ని మొత్తం అప్పు అమరావతిలో నిర్మాణాలకు ఖర్చు పెట్టనుంది.ఇక,రూ.11 వేల కోట్ల అప్పు కోసం హాడ్కోతో సీఆర్డీఏ ఒప్పందం కుదర్చుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందం జరిగింది. ప్రపంచ బ్యాంకు ఋణానికి అదనంగా హడ్కో రుణం తీసుకుంది. రూ. 11 వేల కోట్లను అమరావతిలో పనులకు కూటమి ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

How much does NASA pay Sunita Williams and Butch Wilmore in compensation3
Sunita Williams: భూమ్మీదకు సునీతా విలియమ్స్‌.. ఆమె జీతం ఎంతో తెలుసా ?

వాషింగ్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్‌ (Sunita Williams), బుచ్‌ విల్మోర్‌లు(butch wilmore) భూమ్మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వాళ్లిద్దరు మార్చి 19 (బుధవారం) భూమ్మీదకు రానున్నారు.ఈ క్రమంలో పరిశోధనల నిమిత్తం ఎనిమిది రోజుల పాటు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన వ్యోమగాములు నెలల తరబడి అక్కడే ఉండాల్సి వచ్చింది. మరి నెలల తరబడి స్పేస్‌ స్టేషన్‌లో గడిపిన సునీత విలియమ్స్‌,బుచ్‌ విల్మోర్‌లకు నాసా ఎంత జీతం ఇస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో వ్యోమగాముల జీత భత్యాలపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగాఆస్ట్రోనాట్ జీతం ఎంతంటే?అమెరికా ఫెడరల్‌ గవర్నమెంట్‌లో జీఎస్‌(జనరల్‌ షెడ్యూల్‌)-15 కేటగిరీలో అత్యున్నత స్థాయి పదవుల్లో విధులు నిర్వహిస్తుంటారు ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు 2024 లెక్క‌ల ప్ర‌కారం.. ఏడాదికి 136,908 నుంచి 178,156 డాల‌ర్ల వ‌ర‌కు వేతనాలు తీసుకునేవారు. ఆ లెక్క‌న సునీత విలియ‌మ్స్‌,బుచ్ విల్మోర్‌ల ఏడాది వేత‌నం అంచ‌నా ప్ర‌కారం.. 125,133 నుంచి 162,672 డాలర్లకు (భార‌త క‌రెన్సీ ప్ర‌కారం.. రూ.1.08 కోట్లు నుంచి రూ.1.41కోట్ల వ‌ర‌కు) ఉంటుంది.నాసా అంత చెల్లించదుప‌రిశోధ‌న‌ల నిమిత్తం 9 నెల‌ల పాటు ఐఎస్ఎస్‌లో ఉన్న ఈ ఇద్ద‌రి ఆస్ట్రోనాట్స్‌ల‌కు నాసా 93,850 డాల‌ర్ల నుంచి 122,004 డాల‌ర్ల వ‌ర‌కు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం (భార‌త క‌రెన్సీలో రూ.81ల‌క్ష‌ల నుంచి రూ.1.05 కోట్లు). కానీ, నాసా అంత చెల్లించ‌దని, ఇలాంటి అనూహ్య ప‌రిణామాలు ఎదురైన‌ప్పుడు రోజుకు నాలుగు డాల‌ర్లు (రూ.347 )మాత్ర‌మే చెల్లిస్తుంద‌ని రిటైర్డ్ నాసా ఆస్ట్రోనాట్ క్యాడీ కోల్‌మ‌న్ తెలిపారు. మరీ ఇంత తక్కువాసునీతా విలియ‌మ్స్ ,బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్‌లో 8 రోజులకు బ‌దులు 287 రోజులు గ‌డ‌పాల్సి వ‌చ్చింది. ఆ లెక్క‌న కేవ‌లం రూ1,148డాల‌ర్లు (రూ.1ల‌క్ష‌) అదనంగా తీసుకోనున్నారు. ఫ‌లితంగా, అస‌లు జీతంతో పాటు అదనంగా 1,148 డాల‌ర్లు (సుమారు రూ. 1లక్ష) చెల్లించనుంది. ఈ మిషన్ కోసం వారి మొత్తం సంపాదన 94,998 డాల‌ర్ల నుంచి 123,152 డాల‌ర్ల వ‌ర‌కు (సుమారు రూ. 82 లక్షలు - రూ. 1.06 కోట్లు) ఉంటుందని అంచనా. నేటికి 284 రోజులుసునీతా విలియమ్స్‌ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది! 2024 జూన్‌ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్‌ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్‌.ఎస్‌.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్‌ స్టార్‌లైనర్‌’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది!‘నాసా’ టీమ్‌ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. ఏమైతేనేం, వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్‌ భూమి పైకి తిరిగొచ్చే తేదీ ఖరారైంది. అందుకోసం ఎలాన్‌ మస్క్‌ సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌’ దగ్గర రన్నింగ్‌లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను సిద్ధం చేశారు. క్రూ-10 మిషన్‌ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం విజయవంతమైంది.

one of the victims In Mayanmar Meets Union Minister Bandi Sanjay4
బండి సంజయ్ చొరవ.. మయన్మార్ బాధితులకు విముక్తి

కరీంనగర్ జిల్లా: అక్రమ ఉపాధి పేరుతో మోసపోయి మయన్మార్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 540 మందిని ప్రత్యేక విమానంలో భారత్ కు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మయన్మార్ బాధితుల కథనాన్ని సాక్షి మీడియా వెలుగులోకి తేవడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. దాంతో అక్కడ చిక్కుకున్న 500 మందికి పైగా బాధితుల్ని భారత్ కు తీసుకొచ్చారు.ఈక్రమంలోనే మయన్మార్ నుంచి తిరిగొచ్చిన కరీంనగర్ జిల్లా మానుకొండూరం మండలం రంగం పేటకు చెందిన మధుకర్ రెడ్డి.. బండి సంజయ్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని బండి సంజయ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు బండి సంజయ్. Met Madhukar Reddy from Rangampet, Manakondur Mandal, who safely returned home, thanks to Hon’ble PM Shri @narendramodi ji’s leadership. He is one of the 540 cybercrime victims lured to Myanmar through fraudulent job offers.Trapped in forced cyber fraud operations, many like… pic.twitter.com/Cckg20otqS— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 16, 2025

Boatman Pintu Mahara Tax Notice After Earning 30 Crore in 45 Days of Maha Kumbh Mela5
బోట్‌వాలాకు ఐటీ నోటీసులు, 45 రోజుల్లో 30 కోట్ల సంపాదన ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌

లక్నో: మహాకుంభమేళా (maha kumbh 2025) పడవ వ్యాపారి పింటు మహరా (pintu mahara) రూ.౩౦కోట్ల సంపాదనలో ట్విస్ట్‌ చేసుకుంది. తాను ఒక్కబోటు మీద రూ.30 కోట్లు సంపాదించలేదని, పదుల సంఖ్యలో పడవలు ఉండగా.. కుంభమేళా కోసం అదనంగా మరిన్ని పడవలు కొనుగులో చేసినట్లు పింటు మహరా చెబుతున్నారు. ఇందుకోసం తన ఆస్తుల్ని తాకట్టు పెట్టినట్లు చెప్పారు. అయితే, ఐటీ అధికారులు తనకు నోటీసులు (12.8 Crore Rupees Tax Notice) జారీ చేయడంపై.. ఆ మొత్తాన్ని ఎలా చెల్లించాలో అర్ధం కావడం లేదని తలలు పట్టుకుంటున్నాడు. ఇదే అంశం విషయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాడు. మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. 144 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అరుదైన వేడుకను ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగీ ప్రభుత్వం విజయ వంతం చేసింది. భారతీయ ఆధ్యాత్మికతకు, ఆత్మకు ప్రతిరూపంగా భావించే మహా కుంభమేళా భక్తితో పాటు ఆర్థికంగా కొన్ని కోట్లాది మంది జీవితాల్ని మార్చేసింది. వారిలో ప్రయాగరాజ్‌లో త్రివేణి సంగమం తీరాన ఉన్న అరైల్ గ్రామానికి చెందిన పడవ వ్యాపారి పింటు మహరా.సీఎం యోగి నోట.. కుంభమేళా జనవరి 13న పుష్య పౌర్ణమి స్నానంతో ప్రారంభమై ఫిబ్రవరి 26 మహా శివరాత్రి నాడు ముగిసింది. అయితే, పడవ వ్యాపారం చేసుకునే పింటు మహరా 45 రోజుల్లో రూ.30 కోట్లు సంపాదించారు. దీంతో పింటు పేరు సోషల్‌ మీడియాలో మారుమ్రోగింది. ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం యోగి ఆధిత్యనాథ్‌ (Yogi Adityanath) పింటు పేరును ప్రస్తావించారు. కుంభమేళా వల్ల పింటు రూ.౩౦కోట్లు సంపాదించడమే కాదు,౩౦౦ మందికి పరోక్షంగా ఉపాధి అవకాశం కల్పించామని చెప్పాడు. సీఎం యోగి ప్రకటనతో ఐటీ శాఖ నోటీసులు? సీఎం యోగి ఆధిత్యనాథ్‌ ప్రకటన ప్రకారం.. పింటు మహరా కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి. జనవరి 23 నుండి ఫిబ్రవరి 26 వరకు ఒక్కో పడవ సగటున రూ. 23 లక్షల లాభాల్ని అర్జించారని పేర్కొన్నారు. అంతే, సీఎం యోగి ప్రకటనతో ఆదాయపు పన్ను శాఖ పింటు మహరా రూ. 12.8 కోట్ల పన్ను నోటీసు జారీ చేసిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.రూ.12.8కోట్లు ట్యాక్స్‌ అంటే ఎలా?ఆదాయపు పన్నుశాఖ పింటు మహ్రాకు నోటీసులు పంపిందనే సమాచారంపై సెబీ రిజిస్టర్డ్‌ ఫైనాన్షియల్‌ ప్లాన్‌ ఏకే నందన్‌ స్పందించారు. పింటు మహరా రోజుకు రూ. 500 సంపాదించే సాధారణ పడవ వ్యాపారి. మహాకుంభమేళాతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. భక్తుల రద్దీతో ఒక్కో ప్రయాణానికి ఛార్జీ వేలల్లో వసూలు చేశారు. ఫలితంగా తన మొత్తం ఆదాయం రూ. 30 కోట్లకు చేరింది. అదే సమయంలో ఆదాయపు పన్ను శాఖ రూ.12.8 కోట్ల పన్ను చెల్లించాలంటూ నోటీసులు అందించడంతో ఆందోళన చెందుతున్నాడని అన్నారు. పన్నుల గురించి తెలియని ఒక సామాన్యుడు ఇప్పుడు పెద్ద మొత్తంలో పన్నుల భారాన్ని ఎదుర్కోవడం బాధాకరం’ అని అన్నారు. పింటూ మహర కుటుంబం ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు. అయితే, ఈ అధిక ఆదాయం పన్ను చట్టాల ప్రకారం పెద్ద మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితిని తెచ్చి పెట్టిందన్నారు. ఆస్తుల్ని తాకట్టు పెట్టిమరోవైపు, పింటు మహర రూ.౩౦కోట్ల సంపాదనలో ట్విస్ట్‌ చేసుకుంది. 42 రోజుల్లో తాను ఒక్క పడవమీదే రూ.౩౦ కోట్లు సంపాదిస్తున్నానని అనుకుంటున్నారు. అదేం లేదు.కుంభమేళాకు ముందు తన వద్ద 60 బోట్లు ఉండేవి. కుంభమేళా రద్దీని అంచనా వేసి మరో 70 బోట్లు అప్పు చేసి కొన్నా. అందుకోసం ఇంట్లో నగలు, ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చినట్లు పలు మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడారు.

Bill Gates Praises India Tech and Health Ahead of Visit Third Time6
భారత్‌కు బిల్ గేట్స్!.. దేశంపై ప్రశంసలు కురిపించిన టెక్ దిగ్గజం

అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ప్రముఖ కుబేరులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు సైతం ఇండియాను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) మరోమారు (మూడేళ్ళలో మూడోసారి) భారత్ పర్యటనకు వస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తన లింక్డ్ఇన్‌ ఖాతాలో వెల్లడించారు.ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ పురోగతి అనన్య సామాన్యమని బిల్ గేట్స్ అన్నారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తోందని, కీలక రంగాలలో పురోగతిని సాధించడానికి ప్రభుత్వం, పరిశోధకులు, వ్యవస్థాపకులతో కలిసి పనిచేస్తుందని బిల్ గేట్స్ హైలైట్ చేశారు. గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్‌లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని ఆయన అన్నారు.వ్యాధి నిర్మూలనలుపోలియో నిర్మూలన, హెచ్ఐవీ నివారణ, క్షయ నిర్మూలన వంటి వాటికోసం భారతదేశం చేపట్టిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలను బిల్ గేట్స్ ప్రస్తావించారు. పోలియోను నిర్మూలించడంలో ఇండియా సాధించిన విజయాన్ని గేట్స్ ప్రశంసించారు. 2011లో దేశం చివరి పోలియో కేసు నమోదైందని అన్నారు. హెచ్ఐవీ నివారణకు చేపడుతున్న అవహాన్ వంటి కార్యక్రమాలను సైతం కొనియాడారు.నేడు క్షయవ్యాధి (TB)పై భారత్‌ పోరాటం చేస్తోందన్నారు. టీకాల తయారీ, రోగ నిర్ధరణలో దేశ సామర్థ్యాలను ప్రశంసించారు. భారతీయ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న టీబీ పరీక్షలు.. ఆఫ్రికాలో ఆ వ్యాధి నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందన్నారు. భారతదేశం క్షయవ్యాధి (TB) నిర్మూలనలో ముందంజలో ఉందని గేట్స్ అన్నారు.డిజిటల్ విప్లవంబ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ మరియు ప్రభుత్వ సేవలకు మెరుగైన ప్రాప్యతను అందించిన ఆధార్ మరియు డిజిటల్ చెల్లింపులతో సహా భారతదేశ డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను (DPI) గేట్స్ గుర్తు చేశారు. గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలు ముందస్తు వ్యాధి గుర్తింపును మెరుగుపరచడానికి, గర్భధారణ సంరక్షణను ఆప్టిమైజ్ చేయడానికి, రోగి డేటాను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడటానికి భారతదేశం ఏఐ బేస్డ్ డీపీఐ సాధనాలను ఉపయోగిస్తోందని ఆయన అన్నారు. వ్యవసాయంలో కూడా ఏఐ వాడకం ప్రశంసనీయమని ఆయన అన్నారు.ఇదీ చదవండి: కస్టమర్‌ ఆర్డర్‌ చేసిన ఫుడ్‌.. తినేసిన డెలివరీ బాయ్‌.. థాంక్స్‌ జొమాటోభారతదేశ పురోగతి దాని సరిహద్దులను దాటి విస్తరించిందని గేట్స్ నొక్కిచెప్పారు. ముఖ్యంగా భారతదేశం G20 అధ్యక్ష పదవి సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం యొక్క ఆవిష్కరణలను ప్రపంచవ్యాప్తంగా పంచుకుంటామని ప్రతిజ్ఞ చేసిన తర్వాత.. టీకా తయారీ నుంచి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్స్ వరకు ఇక్కడ అభివృద్ధి చేస్తున్న పరిష్కారాలను ప్రపంచంతో పంచుకుంటున్నారు. బిల్ గేట్స్ భారతదేశానికి వచ్చిన తరువాత.. ఇక్కడ ప్రభుత్వ అధికారులతో, శాస్త్రవేత్తలు చర్చలు.. సమావేశాలు జరిపే అవకాశం ఉంది.

Mohammed Shami Daughter Attacked By Cleric For Playing Holi7
హోలీ ఆడినందుకు షమీ కూతురిపై మండిపడ్డ ముస్లిం మత పెద్ద

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీని ప్రముఖ మతాధికారి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఇటీవలికాలంలో తరుచూ టార్గెట్‌ చేస్తున్నాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్‌ తాగడాన్ని తప్పుబట్టిన మౌలానా షాబుద్దీన్ రజ్వీ.. తాజాగా షమీ కూతురు ఐరా హోలీ ఆడటాన్ని పెద్ద ఇష్యూ చేశాడు. హోలీ రోజు ఐరా రంగులు పూసుకొని దిగిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో ప్రత్యక్షం కావడంతో మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఫైరయ్యాడు. పవిత్ర రంజాన్ మాసంలో ఐరా హోలీ ఆడటాన్ని తప్పుబట్టాడు. ఐరాను రంగులు పూసుకునేందుకు అనుమతించిన తల్లి హసీన్‌ జహాను తిట్టి పోశాడు. రంజాన్‌ మాసంలో ముస్లింలు హోలీ ఆడటం అక్రమమని.. షరియత్‌కు ఇది వ్యతిరేకమని అన్నాడు.ఐరా లాంటి చిన్నారి రంజాన్‌ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవచ్చు. రంజాన్‌ విశిష్టత తెలియకుండా ఆ చిన్నారి హెలీ ఆడి ఉంటే అది నేరం కాదు. అయితే ఐరా రంజాన్‌ పవిత్రత తెలిసి కూడా హోలీ ఆడి ఉంటే మాత్రం అది ఇస్లాం చట్టానికి విరుద్ధమని ఓ వీడియో ద్వారా సందేశాన్ని పంపాడు. ఐరా విషయంలో మౌలానా షాబుద్దీన్ రజ్వీ స్పందించిన తీరును చాలా మంది తప్పుబడుతున్నారు. చిన్నారి సరదాగా రంగులు పూసుకుంటే ఇంత రాద్దాంతం చేయాలా అని మండిపడుతున్నారు. కొందరేమో ఇందులో చిన్నారి ఐరా తప్పు లేదు కానీ, రంజాన్‌ మాసం అని తెలిసి కూడా ఆమె తల్లి హోలీ ఆడేందుకు అనుమతించడం పెద్ద నేరమని​ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ఐరా తల్లిని తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఐరా తల్లి హసీన్‌ జహా మహ్మద్‌ షమీతో విడాకులు తీసుకొని ప్రస్తుతం వేరుగా ఉంటుంది. కాగా, మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్‌ తాగినప్పుడు కూడా పెద్ద రాద్దాంతం చేశాడు. రంజాన్‌ మాసంలో రోజా (ఉపవాసం) ఉండకుండా షమీ పెద్ద నేరం చేశాడని అరోపించాడు. ఇలా చేసి షమీ ఇస్లాం సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాడని విమర్శించాడు. మౌలానా షాబుద్దీన్ రజ్వీ వ్యాఖ్యలపై అప్పట్లో భారత క్రికెట్‌ అభిమానులు మండిపడ్డారు. షమీ ఏం తప్పు చేశాడని ఇంత పెద్ద షో చేస్తున్నావని రజ్వీని ప్రశ్నించారు. దేశం​ కోసం శ్రమించాల్సి వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలని అనడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. మతోన్మాధం​ ఎక్కువైనప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చురకలంటించారు.ఇదిలా ఉంటే, షమీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో అద్భుతంగా రాణించి భారత్‌ టైటిల్‌ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో షమీ 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి టోర్నీ లీడింగ్‌ వికెట్‌ టేకర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన షమీ.. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. షమీ త్వరలో ఐపీఎల్‌లో ఆడనున్నాడు. ఈ సీజన్‌లో షమీని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. షమీ గత సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడాడు. మెగా వేలంలో షమీని సన్‌రైజర్స్‌ రూ. 10 కోట్లకు దక్కించుకుంది.

Sunita Williams reveals what she will miss the most about space8
ఆ ‘మెరుపు’ను నాతోనే దాచుకుంటాను: సునీతా విలియమ్స్‌

అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. తన అనుభవాలను మరోసారి పంచుకున్నారు. అంతరిక్షం నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడారు. ‘ నేను, బుచ్ ఒక మిషన్ ను కంప్లీట్ చేసే క్రమంలో అంతరిక్షంలో అడుగుపెట్టాం. ఇక్కడ ఉన్నాన్నా‍ళ్లు ఒకరికొకరు సమన్వయంతో సహకారంతో పని చేశాం. మేము ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు గమనించాం. ఇక్కడ మనం నివసించడం వల్ల ఒక ప్రత్యేకమైన థృక్పదం ఏర్పడుతుంది. ఇక్కడ నా సుదీర్గ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను. దాన్ని నాతోనే దాచుకుంటాను’ అని సునీతా విలియమ్స​ స్పష్టం చేశారు.సునీతా విలియమ్స్‌ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులు. అంటే సుమారు 9 నెలలకు పైగానే అయ్యింది. 2024 జూన్‌ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్‌ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్‌.ఎస్‌.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్‌ స్టార్‌లైనర్‌’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! దాంతో కొన్ని నెలల పాటు వారు అంతరిక్షంలోనే ఉండిపోయారు.అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నాసా-స్పేస్‌ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌ ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం విజయవంతమైంది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9:40 గంటలకు ఈ అనుసంధాన ప్రక్రియ జరిగినట్లు వెల్లడించిన నాసా.. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.నాసా-స్పేస్‌ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఫాల్కన్‌ 9 రాకెట్‌ డ్రాగన్‌ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. సునీతా విలియమ్స్‍, బచ్ లు బుధవారం భూమ్మీదకు వచ్చే అవకాశం ఉంది. That’s good to hear! #SunitaWilliams returns to earth 🌎 https://t.co/RGUUmJh6lQ— Samina Shaikh 🇮🇳 (@saminaUFshaikh) March 16, 2025

Samantha Removes matching tattoo with Naga Chaitanya Netizens reaction Viral9
చైతూ టాటూ తొలగించిన సమంత.. నెటిజన్ల రియాక్షన్‌ చూశారా?

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన సమంత ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్‌లో చేయడం లేదు. తెలుగులో చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో మాత్రమే కనిపించింది. ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా డేటింగ్ వార్తలతో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ డైరెక్టర్‌ రాజ్ నిడిమోరుతో సామ్ రిలేషన్‌లో ఉన్నట్లు చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరు కలిసి తరచుగా ఈవెంట్లకు హాజరు కావడంతో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి.ఇవన్నీ పక్కనపెడితే తాజాగా సోషల్ మీడియాలో సామ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాను నిర్మిస్తోన్న కొత్త మూవీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. అందులో తన టీమ్‌తో ఉన్న ఫోటోలకు వరుసగా క్యాప్షన్‌ ఇస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే సామ్ షేర్ చేసిన తొలి ఫోటోపైనే అందరి కళ్లు పడ్డాయి. ఎందుకంటే ఆ ఫోటోలో సామ్ చేతికి టాటూ కనిపించడమే కారణం. టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య ప్రేమలో ఉన్నప్పుడు ఆ టాటూ వేయించుకుంది. ప్రస్తుతం ఆ టాటూను తొలగించుకున్నప్పటికీ.. కొద్ది కొద్దిగా కనిపించడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి నాగచైతన్యకు గుర్తుగా వేయించుకున్న టాటూను తొలగించుకున్నారంటూ కొందరు కామెంట్స్ చేశారు. సమంత ఎట్టకేలకు చైతూ టాటూను తొలగించినట్లు కనిపిస్తోందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇప్పటి నుంచి మీ స్వంత రియాలిటీని సృష్టించండి అంటూ రాసుకొచ్చారు. టాటూను తొలగించుకున్నందుకు మంచిది.. ఇకపై మీ భాగస్వామి పేరును ఎప్పుడూ టాటూలుగా వేయించుకోకండి అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. అయితే ఈ ఫోటోలతో పాటు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్న పిక్‌ను కూడా సమంత పోస్ట్ చేసింది.కాగా.. చైతూ సినిమాలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సమంత.. చాలా కాలం పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నాలుగేళ్లకే వీరిద్దరూ విడిపోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఆ ఆ తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్లను గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Ysrcp Leader Bhumana Karunakar Reddy Fires On Chandrababu10
‘కాశీనాయన’ కూల్చివేత వెనుక దుష్టశక్తులు ఎవరు?: భూమన

సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో మహిమాన్వితమైన కాశీనాయన క్షేత్రం కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మధ్య ఉన్న వైరుధ్యాలతో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీనాయన క్షేత్రం కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూధర్మం గుండెలను బుల్డోజర్‌లతో బద్దలుకొట్టడమేనని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...సనాతనధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్?సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదు. పాశవికంగా, దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఈ కూల్చివేతలు చేపట్టిన అటవీశాఖ సనాతన ధర్మ పరిరక్షకుడుగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో, ఆయన పర్యవేక్షణలో పనిచేస్తోంది. సనాతన ధర్మంపై దాడి చేస్తే, వారి తలలు తీస్తాను అంటూ భీకర ప్రతిజ్ఞలు చేసే పవనానందుల గొంతుక ఇప్పుడు మాత్రం మూగబోయింది. ఆయన దీనిపై స్పందించాల్సిన అవసరం లేదా? గతంలో తిరుపతిలో ఆరుగురు చనిపోయినప్పుడు నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పారు.ఈ రోజు కాశీనాయన క్షేత్రాన్ని పవన్ పరిధిలోని శాఖకు చెందిన అధికారులే కూల్చేవేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీకు బదులుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు క్షమాపణలు చెప్పారు? తిరుపతి విషయంలో సారీలు చెప్పడం మా పార్టీ విధానం కాదు అంటూ ఆనాడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలు చేయడం నిజం కాదా? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆధీనంలోని అటవీశాఖ అధికారులు చేసిన దానికి విద్యాశాఖ మంత్రిగా క్షమాపణలు చెప్పడం, తానే కాశీనాయన క్షేత్రంను నిర్మించి ఇస్తానని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. నారా లోకేష్, పవన్ కల్యాణ్‌ల మధ్య ఉన్న వైరుధ్యాల వల్ల పవిత్ర క్షేత్రాలు నలిగిపోవాలా?సోషల్ మీడియా సాక్షిగా వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు అందరికీ తెలిసినవే. రెడ్‌బుక్ గుడ్డితనం కమ్మి గతంలో ఆలయాలను కూల్చిన వారు నేడు కాశీనాయన క్షేత్రంపై విరుచుకుపడ్డారు. ఎవరు కూల్చారో తెలియదు, ఉత్తర్వులు ఎవరో గుడ్డిగా ఇచ్చారంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇది సమర్థించుకోవడం కాదు? మీకు తెలియకుండానే ఆలయాలు నేలమట్టం అవుతాయా? ఆశ్రమాలు కూలతాయా? ప్రసాదంలో విషాలు కలుస్తాయా? కాషాయం కింద విషం చిమ్ముతున్నది మీది కాదా? పార్టీ మీటింగ్‌లకు ప్రభుత్వ సొమ్ముతో గాలిలో ఎగిరి ప్రయాణాలు చేసే పవన్ కళ్యాణ్ హెలికాఫ్టర్‌కు కాశీనాయన క్షేత్రంకు దారి కనిపించడం లేదా?మా ఇంట్లోనే సనాతన ధర్మం పుట్టింది అంటూ గతంలో పవన్ చెప్పారు. ఆయనే మా తండ్రి పూజ గదిలో వెలిగే దీపారాదనతో సిగరెట్‌ వెలిగించుకునేవారు అని కూడా అన్నారు. ఇవ్వన్నీ కూడా సనాతన ధర్మం కిందకు వస్తాయా అని కూడా పవనానంద స్వామీ చెప్పాలి. శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చివేస్తారా?కాశీనాయన క్షేత్రం కూల్చివేతలపై దేవాదాయశాఖ మంత్రి స్పందిస్తూ ఈ క్షేత్రం టైగర్‌జోన్ పరిధిలో ఉన్నందునే కూల్చివేశారు అంటూ ప్రకటన చేశారు. టైగర్‌జోన్ పరిధిలోనే ఉన్న శ్రీశైలంను కూడా కూల్చివేస్తామనే ఉద్దేశం ఆ శాఖ మంత్రి మాటల్లో అర్థమవుతోంది. టైగర్‌జోన్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను కూల్చివేయాలన్నదే ఈ కూటమి ప్రభుత్వ అసలు లక్ష్యం. కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు దిక్కులేకుండా పోయింది.ఆలయాల పరిరక్షణకు ఎటువంటి చర్యలు లేవు. రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న కాశీనాయన క్షేత్రంకు ఉన్న ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా దీనిని అటవీ చట్టాల పరిధి నుంచి మినహాయించాలని ఆనాడే సీఎం హోదాలో వైఎస్‌ జగన్ కేంద్ర అటవీశాఖకు లేఖ రాశారు. ఇప్పుడు సనాతన సారధి పవన్ కళ్యాణ్ పరిధిలోని అటవీశాఖ అధికారులు కేంద్ర అటవీశాఖ నుంచి ఎటువంటి ఉత్తర్వులు, ఆదేశాలు లేకుండానే ఈ క్షేత్రంలోని నిర్మాణాలను కూల్చివేశారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండానే ఈ కూల్చివేతలు జరిగాయా? వీటిని కూల్చివేస్తున్నారని తెలిసి కూడా ఎందుకు పవన్ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయడం, మోయడంలో తనమునకలు అయ్యి ఉండటం వల్లే ఇటువంటి ఘోరమైన సంఘటనను పట్టించుకోలేదా? బొట్లు పెట్టడం, మెట్లు కడగడం మినహా ఆలయాలను పరిరక్షించాలనే విషయాన్ని విస్మరించారు. బీజేపీ కూడా ఎందుకు స్పందించడం లేదు. కాశీనాయన క్షేత్రంను కులం కోణంలో చూస్తున్నారా అనే అనుమానాలు, అది అసలు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అనే భావనను కలిగిస్తున్నారా అనుమానం భక్తుల్లో కలుగుతోంది.కూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలంకూటమి పాలనలో హిందూధర్మంకు గడ్డుకాలం దాపురించింది. కూటమి ప్రభుత్వానికి వైయస్‌ఆర్‌సీపీపై అభాండాలు మోపి పబ్బం గడుపుకోవడమే తెలుసు. తిరుయల లడ్డూలో కల్తీనెయ్యి అంటూ ఒక పచ్చి అబద్దాన్ని తెరమీదికి తీసుకువచ్చి ఆనాడు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై దుర్మార్గమైన నిందలు మోపారు. ఆవుకొవ్వు, పందికొవ్వు కలిపారంటే సాక్షాత్తూ సీఎం ఒక ప్రకటన చేయడం, వారి రాజకీయం కోసం ఎంత దూరమైన సరే దిగజారిపోతారనడానికి నిదర్శనం.జనం దీనిని నిజమని నమ్మేలా శతవిధాల ప్రయత్నించారు. దీనిపై సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అత్యున్నత పదవిలో ఉన్నవారు బాధ్యతారహితంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. ఇదంతా ఒక కుట్ర అంటూ వైఎస్సార్‌సీపీ ధైర్యంగా ఎదుర్కోవడంతో ఈ కూటమి ప్రభుత్వం సిగ్గుతో వెనక్కి తగ్గింది.అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కారణంగా తొక్కిసాలకు గురై ఆరుగురు మృతి చెందడం, 45 మందికి పైగా గాయపడ్డారు. వైఎస్సార్‌సీపీ పాలనలో చిన్నచిన్న పొరపాట్లను కూడా అత్యంత దారుణంగా చిత్రీకరించారు. అదే కూటమి పాలనలో జరుగుతున్న అరాచకాలను ఏదో పొరపాటున జరిగిన చిన్న అంశంగా సమర్థించుకుంటున్నారు. తాజాగా ఒక తాగుబోతు నేరుగా శ్రీవారి ఆలయ ప్రాంగణం బయట మద్యం మత్తులో పెద్ద ఎత్తున గొడవ చేశాడు. శ్రీవారి కొండపై మద్యం ఎంతైనా దొరుకుతుందంటూ వీరంగం సృష్టించారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఎర్రచందనం కొండపై పట్టుబడింది. దానిపై ఎటువంటి చర్యలు లేవు. ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి పుట్టిన పార్టీ టీడీపీమంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శవాలపైన పుట్టిన పార్టీ అంటూ మాట్లాడారు. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి, ఆయన శవాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని లాక్కుని అనే విషయం లోకేష్ గుర్తించాలి. తెలుగుదేశం అధికారపీఠం కింద విగతజీవులైన పింగళి దశరథ్‌రామ్, వంగవీటి మోహనరంగా వంటి వారు ఉన్నారని లోకేష్ తెలుసుకోవాలి.గిల్లి జోల పాడటం, చంపి మాలవేయడం, వెన్నుపోటు పొడిచి పీఠమెక్కడం టీడీపీ లక్షణం. కూటమి ప్రభుత్వంలో కూర్చున్నందుకే కాషాయదళం నోరువిప్పడం మానేసింది. ఏపీలో సనాతన ధర్మానికి జరుగుతున్న అన్యాయం, ఆలయాల విధ్వంసం, శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న అనాచారం, దళారీల మయంగా మారిన పవిత్రక్షేత్రం కాషాయదళానికి కనిపించడం లేదు. అమరావతిలో శ్రీవారి కళ్యాణం జరిపామంటూ ఎంతో ఆర్భాటంగా ప్రకటించుకున్న సీఎం చంద్రబాబు.. గతంలో వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు స్వామివారి కళ్యాణాలను గ్రామాల్లోకి తీసుకువచ్చాం. 2004 డిసెంబర్ నుంచే నేను టీటీడీ బోర్డ్ సభ్యుడగా ఉన్నప్పుడే మొట్టమొదటి సూళ్ళూరిపేట దళితవాడలో స్వామివారి కళ్యాణంను అద్భుతంగా నిర్వహించాం. తరువాత కొన్ని పదుల సంఖ్యలో శ్రీవారి కళ్యాణాలు చేయించాం’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
బోట్‌వాలాకు ఐటీ నోటీసులు, 45 రోజుల్లో 30 కోట్ల సంపాదన ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌

లక్నో: మహాకుంభమేళా (maha kumbh 2025) పడవ వ్

title
శాంతి కోసం యత్నిస్తే.. శత్రుత్వం, ద్రోహమే ఎదురైంది: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ:  ఆసియా దేశాల్లో భాగమైన పాకిస్తాన్ ఎప్పుడూ త

title
పుట్టిన ఏడాదికే తల్లి వెంటే జైలుకు పసిబిడ్డ.. పాపం ఈ చిన్నారికి ఎంత కష్టమొచ్చిందో

బెంగళూరు : ప్రసవించిన 14రోజులకే అనివార్య కారణాలతో రూ.60వేలకు

title
మిజోరం వండర్‌ కిడ్‌కి అమిత్‌ షా స్పెషల్‌ గిఫ్ట్‌

మిజోరాం: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి

title
అమాయకురాల్ని.. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకం..: రన్యా రావు లేఖ

కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) క

International View all
title
శాంతి కోసం యత్నిస్తే.. శత్రుత్వం, ద్రోహమే ఎదురైంది: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ:  ఆసియా దేశాల్లో భాగమైన పాకిస్తాన్ ఎప్పుడూ త

title
భారత్‌కు బిల్ గేట్స్!.. దేశంపై ప్రశంసలు కురిపించిన టెక్ దిగ్గజం

అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి.

title
ఘోర అగ్ని ప్రమదం.. 51 మంది దుర్మరణం!

నార్త్ మెసీడోనియా: యూరప్ లోని నార్త్ మెసీడోనియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

title
పాకిస్థాన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. 10 మంది సైనికులు మృతి!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది.

title
అమెరికాలో రంజనీ శ్రీనివాసన్‌ వీసా రద్దు.. కారణం ఇదే..

వాషింగ్టన్‌: భారత్‌కు చెందిన రంజనీ శ్రీనివాసన్‌కు వీసా రద్దు

International View all
title
Sunita Williams: భూమ్మీదకు సునీతా విలియమ్స్‌.. ఆమె జీతం ఎంతో తెలుసా ?

వాషింగ్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చిక్కుకున

title
ఆ ‘మెరుపు’ను నాతోనే దాచుకుంటాను: సునీతా విలియమ్స్‌

అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్..

title
స్టూడెంట్‌ మైండ్‌ బ్లాక్‌ స్పీచ్‌..! ఫిదా అవ్వాల్సిందే..

ఒక విద్యార్థి తన ఉద్వేగభరిత గళంతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

title
సునీత వచ్చేస్తోంది.. ఐఎస్‌ఎస్‌తో క్రూ-10 అనుసంధానం సక్సెస్‌

అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది.

title
‘మీ టైమ్‌ అయిపోయింది’.. వారికి ట్రంప్‌ హెచ్చరిక

సానా: యెమెన్‌లో హౌతీలపై అమెరికా సైన్యం విరుచుకుపడింది.

NRI View all
title
కెనడా కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారతీయులు

ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్‌ క

title
పాపం ఉష.. ఇష్టం లేకున్నా నవ్వాల్సిందే!

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తన భార్య ఉషా

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

NRI View all
title
గ్రీన్‌కార్డులపై బాంబు పేల్చిన జేడీ వాన్స్‌.. అమెరికా పౌరసత్వం కట్‌!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసార

title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
డాక్టర్‌ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!

డొమినికన్ రిపబ్లిక్‌లో  కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడు

title
USA: భారత సంతతి సుదీక్ష అదృశ్యం.. బీచ్‌లో ఏం జరిగింది?

వర్జీనియా: అమెరికాలో చదువుతున్న భారత సంతతి విద్యార్థిని సుదీ

Advertisement
Advertisement