
BSNL 365 Days Plan: ప్రభుత్వ రంగ టెలికమ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం చౌకైన, సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది పూర్తి ఏడాది అంటే 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ సిమ్‌ను సెకండరీ నంబర్‌గా వాడే యూజర్లకు ఈ ప్లాన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్ ధర కేవలం రూ .1198 మాత్రమే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఏడాది. దీని ప్రకారం దీని నెలవారీ సగటు సుమారు రూ.100 వరకు ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్ గా ఉండాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.
ప్లాన్ ప్రయోజనాలు
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల ప్లాన్‌తో వినియోగదారులు ప్రతి నెలా 300 నిమిషాల వరకు ఏ నెట్వర్క్‌కైనా ఉచిత కాలింగ్ సదుపాయాన్ని పొందుతారు. ఇది కాకుండా ప్రతి నెలా 30 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు ప్రతి నెలా 3 జీబీ హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. అంతే కాదు దేశం అంతటా రోమింగ్ సమయంలో ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ ప్రయోజనాన్ని కూడా పొందుతారు.
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ నెట్‌వర్క్ విస్తరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ 4జీ సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని, తద్వారా త్వరలోనే వినియోగదారులకు మెరుగైన నెట్‌వర్క్, వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment