Prepaid Plans
-
తిరుగులేని రీఛార్జ్ ప్లాన్.. హాఫ్‌డే ఇష్టమొచ్చినంత డేటా
నష్టాల్లో ఉన్న ప్రైవేట్ టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా పోటీని తట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఏడాది కాలపరిమితితో కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను (Vi SuperHero) ప్రవేశపెట్టింది. కస్టమర్లు అర్ధరాత్రి 12 నుండి మధ్యాహ్నం 12 వరకు అపరిమిత డేటాను ఆస్వాదించవచ్చు.దీనికితోడు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 వరకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితం. ఈ ప్రీ–పెయిడ్ ప్లాన్స్ ధర ర.3,599 నుంచి ర.3,799 వరకు ఉంది. ప్రస్తుతానికి ఇవి మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానాకు పరిమితం.వీఐ సూపర్‌హీరో ప్లాన్ల ప్రయోజనాలు⇒ అపరిమిత డేటా: ప్రతి రోజు హాఫ్-డే (అర్ధరాత్రి 12 నుండి మధ్యాహ్నం 12 వరకు) అపరిమిత డేటా.⇒ రోజువారీ డేటా కోటా: మిగిలిన గంటలలో ( మధ్యాహ్నం 12 నుండి అర్ధరాత్రి 12 వరకు) 2 GB హై-స్పీడ్ డేటా.⇒ వారాంతపు డేటా రోల్ఓవర్: వినియోగదారులు ఉపయోగించని వారాంతపు డేటాను ఫార్వార్డ్ చేయవచ్చు. వారాంతంలో దాన్ని ⇒ ఉపయోగించుకోవచ్చు.⇒ ఓటీటీ (OTT) ప్రయోజనాలు: రూ.3,699 ప్లాన్ ఒక సంవత్సరం డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. అదే రూ.3,799 ప్లాన్‌లో యితే ఒక సంవత్సరం అమేజాన్ ప్రైమ్ లైట్ (Amazon Prime Lite) సబ్స్క్రిప్షన్ ఉంటుంది.ఓవైపు వొడాఫోన్ ఐడియా తన 4G నెట్‌వర్క్‌లో దేశవ్యాప్తంగా విస్తరించే పనిలో ఉండగా పోటీ సంస్థలు జియో, ఎయిర్టెల్ ఇప్పటికే తమ కస్టమర్ల కోసం అపరిమిత 5G డేటా ప్లాన్లను రూపొందించాయి. ఈ కొత్త "సూపర్‌హీరో" ప్లాన్లతో వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) దాని సబ్‌స్క్రైబర్ బేస్‌ను పెంచుకోవడానికి, కొనసాగుతున్న ఆర్థిక సవాళ్ల మధ్య తన మార్కెట్ ఉనికిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది.అదే సమయంలో వోడాఫోన్ ఐడియా 19.77 లక్షల మంది వినియోగదారులను కోల్పోయింది. గడిచిన సెప్టెంబర్ నెలలో 15.5 లక్షల మంది యూజర్లను చేజార్చుకుంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల విడుదల చేసిన అప్డేట్ ప్రకారం.. వోడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా 18.30% వద్ద ఉంది. రిలయన్స్ జియో 39.9% వాటాతో మార్కెట్ లీడర్‌గా ఉంది. భారతి ఎయిర్టెల్ 33.5% వాటాతో రెండవ స్థానంలో ఉంది.ఇక కంపెనీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో విక్రయిస్తున్న వార్షిక ప్లాన్స్‌లో భాగంగా రాత్రి 12 నుంచి ఉదయం 6 వరకు అపరిమిత డేటా అందుకోవచ్చు. అలాగే రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు.బీఎస్ఎన్ఎల్ స్పెషల్ ఆఫర్ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ (BSNL) కూడా ప్రత్యేక వార్షిన్ ప్లాన్ తీసుకొచ్చింది. న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ (Recharge Plan) చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌కి 395 రోజుల వ్యాలిడిటీ ఉండేది.బీఎస్ఎన్ఎల్ నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే డేటా, కాలింగ్ ప్రయోజనాలు మునుపటిలాగే 395 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా నుండి ఈ ఆఫర్ గురించి సమాచారాన్ని అందించింది.ఈ ప్రత్యేక ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ రూ. 2,399 ప్లాన్‌పై వినియోగదారులకు 30 రోజుల అదనపు వ్యాలిడిటీని ఇస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్‌కు 395 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో అంటే జనవరి 16 లోపు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 425 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. ఇంత దీర్ఘకాలం చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్. -
Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటా
రిలయన్స్ జియో తన డేటా-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను అప్డేట్ చేసింది. కొత్త చవక డేటా ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ 10జీబీ డేటాను అందిస్తుంది. పూర్తి యాక్టివ్ ప్లాన్ అవసరం లేకుండా తక్షణ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది.కొత్త డేటా ప్లాన్జియో పరిచయం చేసిన కొత్త చవక డేటా ప్లాన్ ధర రూ. 11. ఈ ప్లాన్ ఒక గంట చెల్లుబాటుతో 10జీబీ డేటాను అందిస్తుంది. ఈ "డేటా-ఓన్లీ" యాడ్-ఆన్లు జియో ప్రామాణిక బూస్టర్ ప్యాక్‌ల నుండి విభిన్నంగా ఉంటాయి. ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రిప్షన్‌తో సంబంధం లేకుండా వినియోగదారుల కోసం స్వతంత్రంగా పనిచేస్తాయి. అయితే వాయిస్ కాల్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లేకపోయినప్పటికీ, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లతో ఈ పరిమితి పెద్దగా ప్రభావం చూపదు.జియోలో ప్రస్తుత డేటా ప్లాన్లు ఇవే..» రూ. 11 ప్లాన్: 10జీబీ డేటా, 1 గంట వ్యాలిడిటీ.» రూ. 49 ప్లాన్: 25జీబీ డేటా, 1 రోజు చెల్లుబాటు.» రూ. 175 ప్లాన్: 10జీబీ డేటా, 28 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అలాగే జియోసినిమా ప్రీమియం, సోనీ లివ్‌తో సహా 10 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్.» రూ. 219 ప్లాన్: 30జీబీ డేటా, 30 రోజుల చెల్లుబాటు.» రూ. 289 ప్లాన్: 40జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ.ఇదీ చదవండి: రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్ -
రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. తన చవక రీచార్జ్ ప్లాన్లతో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈసారి రోజుకు రూ. 6 ఖర్చుతోనే అపరిమిత కాలింగ్, 2జీబీ డేటాను అందించే అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. అది ఏ ప్లాన్.. ఎన్ని రోజులు వ్యాలిడిటీ.. బెనిఫిట్స్ ఏంటి అన్నవి ఇక్కడ తెలుసుకుందాం…ఇటీవల, ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. కానీ ప్రభుత్వ టెల్కో అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ప్లాన్ల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ఖరీదైన టారిఫ్ ప్లాన్లను భరించలేని లక్షల మంది వినియోగదారులు ఆయా కంపెనీలను వీడి బీఎస్ఎన్ఎల్కి మారుతున్నారు.కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి, పాత యూజర్లను ఆకట్టుకునేందుకు బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా రోజుకు 6 రూపాయల కంటే తక్కువ ధరతో అపరిమిత కాలింగ్, 2GB డేటా, ఇతర అనేక ప్రయోజనాలను అందించే ప్లాన్ అందిస్తోంది. ఇది ఏడాదికిపైగా సుదీర్ఘ వ్యాలిడిటీని అందిస్తుంది. తరచుగా రీఛార్జ్ చేసే టెన్షన్‌ను తొలగిస్తుంది.ప్లాన్ వివరాలుఈ ప్లాన్ ధర రూ. 2399. దీని వ్యాలిడిటీ 395 రోజులు. రోజు ప్రకారం చూస్తే రూ. 6 కంటే తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. బడ్జెట్ విభాగంలో ఈ ప్లాన్ చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఇందులో అపరిమిత కాలింగ్, రోజువారీ 2GB డేటా, 100 ఎస్ఎంఎస్లు వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఒక్క సారి రీఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్ ఇంటర్నెట్, కాలింగ్‌ని ఆస్వాదించవచ్చు. -
జియో దీపావళి ధమాకా ఆఫర్.. 90 రోజులు అన్లిమిటెడ్
దేశంలో అగ్రగామి టెలికం సంస్థ రిలయన్స్ జియో పరిమిత-కాల దీపావళి ధమాకా ఆఫర్లో భాగంగా రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. మొత్తం 200GB డేటా, అపరిమిత కాల్స్, రూ. 3,350 వరకు విలువైన కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందించే ఈ ప్లాన్ కస్టమర్లకు నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది.ప్రయోజనాలు ఇవే..జియో రూ. 899 ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రీపెయిడ్ ప్యాకేజీలో 2GB రోజువారీ డేటాతో పాటు 20GB అదనపు డేటాతో మొత్తం 200GB హై-స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. అలాగే రోజుకు 100 SMS, అపరిమిత కాలింగ్‌ను కూడా కవర్ చేస్తుంది. మీది 5G ఫోన్ అయితే, మీ ప్రాంతంలో 5G నెట్వర్క్ అందుబాటులో ఉంటే ఉచిత అపరిమిత 5Gని కూడా పొందవచ్చు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!అదనపు బెనిఫిట్స్ అజియోలో రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే కస్టమర్లకు ఫ్లాట్ రూ. 200 తగ్గింపు లభిస్తుంది. ఈజీట్రిప్ ద్వారా చేసిన విమానాలు, హోటల్ బుకింగ్ చేస్తే రూ. 3,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. స్విగ్గిలో రూ. 399 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్ చేసినప్పుడు రూ. 150 ఆదా చేయవచ్చు. -
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా..
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన తర్వాత చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది యూజర్లను ఆకట్టుకునేందుకు ఏడాదిపాటు ప్రయోజనాలు అందించే చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.చౌకైన రీఛార్జ్ ప్లాన్బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1,198. ఈ రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు 365 రోజులు లేదా 12 నెలలు. ఇక ఇతరర ప్రయోజనాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కు అయినా కాల్ చేయడానికి వినియోగదారులకు ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు లభిస్తాయి. అలాగే ప్రతి నెలా 3GB హై స్పీడ్ 3G/4G డేటాను పొందుతారు. ఇది మాత్రమే కాదు.. ఈ ప్లాన్‌లో ప్రతి నెలా 30 ఉచిత SMSల సౌకర్యాన్ని కూడా ఆనందివచ్చు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బీఎస్ఎన్ఎల్.. మరో మైలురాయి!ధర తగ్గిన మరో ప్లాన్ కొత్త ప్లాన్‌ను ప్రారంభించడంతోపాటు బీఎస్ఎన్ఎల్ తన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్లలో మరొకదాని ధరను కూడా తగ్గించింది. రూ. 1999 ప్లాన్ ధరను రూ. 100 తగ్గించి ఇప్పుడు రూ. 1899కే అందిస్తోంది. ఈ ప్లాన్ బెనిఫిట్స్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 600GB డేటా, ప్రతిరోజూ 100 ఉచిత SMS వంటి ఉన్నాయి. -
తక్కువ రీచార్జ్‌తో ఉచితంగా ఓటీటీలు
వెబ్ సిరీస్‌ల నుండి సినిమాల వరకు అన్నింటినీ చూడటానికి ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు మంచి ఎంపికగా మారాయి. అయితే వీటిని వీక్షించాలంటే ప్రత్యేక సభ్యత్వం తీసుకోవాలి. అలాంటి అవసరం లేకుండా మొబైల్‌కి రీఛార్జ్ చేసుకుంటే చాలు కొన్ని ఓటీటీలను ఉచితంగా చూసేయచ్చు.దేశంలో అతిపెద్ద యూజర్ బేస్ కలిగిన టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. వీటి ఖర్చు కూడా చాలా తక్కువే. రూ. 500 కంటే తక్కువ ధరకే ఎంపిక చేసిన ప్లాన్లతో మీరు ఈ కాంప్లిమెంటరీ ప్రయోజనాలను పొందవచ్చు.రూ. 448 ప్లాన్జియోటీవీ ప్రీమియం ప్లాన్లలో భాగమైన ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో 2జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. ఇది అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. ఇందులో సోనీలివ్, జీ5 వంటి డజను ఓటీటీ సేవలు ఉన్నాయి. అంతే కాకుండా జియో యాప్‌లకు యాక్సెస్ కూడా పొందవచ్చు.రూ. 175 ప్లాన్ఇది జియోలో చౌకైన డేటా ప్లాన్. 28 రోజుల చెల్లుబాటుతో 10జీబీ అదనపు డేటాను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. ఓటీటీల విషయానికి వస్తే సోనీలివ్, జీ5తో సహా 10 ఓటీటీ సేవలను ఉచితంగా ఆనందించవచ్చు.రూ.329 ప్లాన్కొంతమందికి మ్యూజిక్ వినడం ఇష్టంగా ఉంటుంది. యాప్ ద్వారా మ్యూజిక్ వింటున్నప్పుడు ప్రకటనలు చికాకు పెడతాయి. రూ. 329 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుసుకుంటే ప్రకటన రహితంగా సంగీతాన్ని ఆనందించవచ్చు. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది 1.5జీబీ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. దీంతో జియోసావన్ ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. -
ఆకర్షణీయమైన బెనిఫిట్లతో జియో కొత్త రీచార్జ్ ప్లాన్లు
రిలయన్స్ జియో (Jio) తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఇటీవల సగటున 15 శాతం పెంచింది. దీనిపై కస్టమర్ల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో అప్డేట్లో భాగంగా కంపెనీ ఇప్పటికే ఉన్న ప్లాన్లపై కొన్ని ప్రయోజనాలను జియో సవరించింది.వివిధ కస్టమర్ల అవసరాలకు అనుగుణగా జియో కొత్త ఆప్షన్లను రూపొందించింది. కొత్త ఆఫర్లలో రూ. 1,028, రూ. 1,029 రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ రెండూ వినియోగదారులకు సమగ్ర ప్రయోజనాలను అందించేలా రూపొందించారు. ఏ ప్లాన్ ఏయే బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.రూ. 1,028 ప్లాన్జియో రూ. 1,028 ప్లాన్ 84 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. అదనంగా సబ్స్క్రైబర్లు 2జీబీ రోజువారీ డేటాను అందుకుంటారు. ప్లాన్ వ్యవధిలో మొత్తం 168జీబీ లభిస్తుంది. జియో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.రూ. 1,028 ప్లాన్‌లో స్విగ్గీ వన్ లైట్ మెంబర్షిప్ ఉంది. తరచుగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లకు ఇది సరైనది. అంతేకాకుండా జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ సేవలకు కూడా యాక్సెస్‌ను పొందుతారు.రూ. 1,029 ప్లాన్జియో రూ. 1,029 ప్లాన్ విషయానికి వస్తే అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు 84 రోజులపాటు ఆనందించవచ్చు. రోజూ 2జీబీ 4జీ డేటా, అందుబాటులో ఉన్న చోట అపరిమిత 5జీ డేటా వినియోగించుకోవచ్చు. స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించే వినియోగదారులకు ఈ ప్లాన్ అమెజాన్ ప్రైమ్ లైట్ ప్రయోజనాలను అందిస్తుంది. దీంతోపాటు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్కి యాక్సెస్ ఉంటుంది. -
తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్స్!
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తోంది. నెలకు రూ. 200 కంటే తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని ఈ ప్రీపెయిడ్ ప్లాన్ లతో ఆనందించవచ్చు. దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూసే వారు ఈ వీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పై ఒక లుక్కేయండి..రూ. 997 ప్లాన్బీఎస్ఎన్ఎల్ రూ. 997 ప్రీపెయిడ్ ప్లాన్ 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డైలీ 2జీబీ హై స్పీడ్ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు. అక్టోబర్ 24వ తేదీ లోపుగా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే యూజర్లకు 24 రోజుల చెల్లుబాటు కలిగిన 24GB ల అదనపు డేటా లభిస్తుంది.రూ. 1,198 ప్లాన్బీఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్ ఏడాది అంటే 365 రోజులు వ్యాలిడిటీని అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ ప్రయోజనాలు నెలవారీగా అందుతాయి. ఈ ప్లాన్ తో నెలకు 300 మినిట్స్ కాలింగ్, 3జీబీ డేటా, 30 ఎస్ఎంఎస్ల చొప్పున 12 నెలలపాటు లభిస్తాయి. ప్లాన్‌ను అక్టోబర్ 24వ తేదీ లోపు రీఛార్జ్ చేసుకునే వారు 24 రోజుల వ్యాలిడిటీ కలిగిన 24జీబీ డేటాను అదనంగా పొందవచ్చు. -
జియో సూపర్‌హిట్ ప్లాన్.. చవగ్గా అన్లిమిటెడ్ 5జీ, కాలింగ్..
చవకైన రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న జియో కస్టమర్లకు ఓ సూపర్‌హిట్ ప్లాన్ ఉంది. అదే రూ. 198 ప్లాన్. ఇది 14 రోజుల పాటు అపరిమిత 5జీ డేటాను అందిస్తుంది. దీంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలూ ఉన్నాయి.జియో రూ. 198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులు 14 రోజుల పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు, ప్రతిరోజూ 2 జీబీఆ 4జీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ పొందుతారు. అదనంగా జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీ వంటి జియో సూట్ యాప్‌లకు యాక్సెస్‌ను ఆనందించవచ్చు.రూ.198 ప్లాన్‌ను మైజియో యాప్ లేదా ప్రీపెయిడ్ సేవలను అందించే ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. మైజియో యాప్‌లో రీచార్జ్ చేసుకుంటే ఎటువంటి అదనపు రుసుములు ఉండవు. కానీ గూగుల్ పే, పేటీఎం లేదా ఫోన్‌పే వంటి ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 1 నుండి రూ. 3 వరకు అధిక రుసుము ఉంటుంది. -
జియోలో అత్యంత చవకైన ప్లాన్ ఇదే..
ప్రైవేటు టెలికం సంస్థలు గత నెలలో తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కి మారారు. బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్లను అందిస్తుండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో తమ వినియోగదారులను నిలుపుకోవడానికి పలు చవక రీఛార్జ్ ప్లాన్లను రూపొందించింది.సాధారణంగా కాలింగ్, డేటాతో కూడిన రీఛార్జ్ ప్లాన్‌కు నెలకు కనీసం రూ. 180 నుండి రూ.200 ఖర్చవుతుంది. కానీ ఈ జియో ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే అంతకన్నా తక్కువ ఖర్చవుతుంది. అదే రిలయన్స్ జియో రూ.1,899 రీఛార్జ్ ప్లాన్. ఇది 336 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే నెలకు రూ. 173 మాత్రమే ఖర్చవుతుంది.ఈ ప్లాన్ దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, దేశవ్యాపంగా ఉచిత రోమింగ్ అందిస్తుంది. రోజువారీ పరిమితి లేకుండా మొత్తంగా 24GB హై-స్పీడ్ డేటా, 3600 ఉచిత ఎస్ఎంఎస్లను ఆనందించవచ్చు. అంతేకాకుండా జియో అనుబంధ యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. -
ఒకేసారి రీచార్జ్.. ఏడాదంతా డైలీ 3జీబీ డేటా
దీర్ఘకాలం వ్యాలిడిటీతో రోజూ ఎక్కువ డేటా కావాలనుకునేవారికి ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌తో తక్కువ ధరకే డైలీ 3జీబీ డేటాను ఆస్వాదించవచ్చు. ఇలాంటి ప్లాన్లు ఇతర ప్రైవేటు టెలికం కంపెనీల్లో లేకపోవడం గమనార్హం.365 రోజులు వ్యాలిడిటీ 365 రోజులు వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ధర రూ. 2,999. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదంతా అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ ఆనందించవచ్చు. ప్రతిరోజూ 3జీబీ హై స్పీడ్ డేటా పొందవచ్చు. ఈ వార్షిక ప్లాన్‌లో కస్టమర్లకు ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి.సినిమాల స్ట్రీమింగ్, గేమింగ్ కోసం ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఏడాదిపాటు ప్రతిరోజూ 3జీబీ డేటా అందించే ప్లాన్లు ఇతర ప్రైవేట్ టెలికం కంపెనీల్లో లేవు. గరిష్టంగా 84 రోజుల వ్యాలిడిటీతో ఇలాంటి ప్లాన్ జియోలో రూ.1799లకు, ఎయిర్‌టెల్‌లో రూ.1798లకు అందుబాటులో ఉంది. -
ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్, 2 జీబీ డేటా.. జియో బెస్ట్ ప్లాన్ ఇదే..
దేశంలో అత్యధిక యూజర్లు ఉన్న టెలికాం కంపెనీ రిలయన్స్ జియో. దీనికి సుమారు 48 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇటీవల టారిఫ్‌లు పెంచిన తర్వాత మంచి ప్రయోజనాలు ఉన్న బెస్ట్ ప్లాన్ల కోసం యూజర్లు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తూ ఇతర బెనిఫిట్స్ లభించే ఒక బెస్ట్ జియో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..నెట్‌ఫ్లిక్స్‌తో కూడిన కొత్త కాంబో ప్లాన్‌ను జియో ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మెరుగైన మొబైల్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఆప్షన్ అవుతుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే ఇది నెట్‌ఫ్లిక్స్ (మొబైల్) ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో వస్తుంది. దీంతో మీరు స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌ఫ్లిక్స్ విస్తారమైన లైబ్రరీలో ఉన్న వేలాది మూవీస్, వెబ్ సిరీస్‌లను ఆస్వాదించవచ్చు.ప్లాన్ బెనిఫిట్స్ఈ ప్లాన్ ధర రూ. 1,299. వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. వినియోగదారులు ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందుతారు. అపరిమిత కాలింగ్‌తో యూజర్లు ఏ నెట్‌వర్క్‌లో అయినా ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీంతోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు ఉచిత యాక్సెస్‌ను పొందవచ్చు. 5జీ ఫోన్‌ని ఉపయోగిస్తున్నవారు తమ ప్రాంతంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటే 5జీ డేటాను ఉపయోగించవచ్చు. -
నెట్‌ఫ్లిక్స్ ఫ్రీగా కావాలా? ఈ ప్లాన్లు ట్రై చేయండి..
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీ కోసమే.. ప్రధాన టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రూ.199 విలువ చేసే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌ను ఉచితంగా అందిస్తున్నాయి.ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ అందిస్తున్న ప్లాన్లు ఇవే..జియో రూ.1,299 ప్లాన్: ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత 5జీ డేటాతో 84 రోజుల పాటు (మొత్తం 168 జీబీ మొత్తం) రోజుకు 2 జీబీ డేటాను ఆస్వాదించవచ్చు.జియో రూ.1,799 ప్లాన్: 84 రోజుల పాటు (మొత్తం 252 జీబీ) 3 జీబీ రోజువారీ డేటాతో పాటు రూ .1,299 ప్లాన్ మాదిరిగానే అపరిమిత ప్రయోజనాలను పొందండి.వొడాఫోన్ ఐడియా రూ.1,198 ప్లాన్: ఈ ప్లాన్ మొత్తం 70 రోజుల పాటు 2 జీబీ రోజువారీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 140 జీబీ. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.వొడాఫోన్ ఐడియా రూ.1,599 ప్లాన్: ఈ ప్లాన్‌తో 84 రోజుల పాటు 2.5 జీబీ రోజువారీ డేటాను మొత్తంగా 210 జీబీ డేటాను పొందుతారు. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లు కూడా ఉన్నాయి.ఎయిర్టెల్ రూ.1,798 ప్లాన్: ఈ ప్లాన్ 84 రోజుల పాటు రోజుకు 3 జీబీ డేటాను అందిస్తుంది. మొత్తం 252 జీబీ డేటా. అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ 5జీ డేటా లభిస్తుంది. -
దిగొచ్చిన జియో.. సైలెంట్‌గా మళ్లీ పాత ప్లాన్
టారిఫ్ పెంపుతో యూజర్లలో తీవ్ర అసంతృప్తిని మూటకట్టుకున్న రిలయన్స్ జియో, వారిని సంతృప్తి పరచడానికి కాస్త దిగివచ్చింది. తన రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌ని నిశ్శబ్దంగా తిరిగి ప్రవేశపెట్టింది.ఎక్కువ మంది రీచార్జ్ చేసుకునే రూ.999 ప్లాన్ ధరను జూలై 3న రూ.1,199కి జియో పెంచేసింది. అయితే తాజాగా కొన్ని సవరించిన ప్లాన్ ఫీచర్లు, ప్రయోజనాలతో పాత ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది.కొత్త రూ. 999 ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దాని పొడిగించిన వ్యాలిడిటీ. పాత ప్లాన్‌లో ఇది 84 రోజులు ఉండగా కొత్త ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. అంటే 14 రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట. కానీ రోజువారీ డేటాను మాత్రం కొత్త ప్లాన్‌లో తగ్గించేశారు. గత ప్లాన్‌లో రోజుకు 3GB డేటా లభిస్తుండగా కొత్త ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. డేటా పరిమితి తగ్గినప్పటికీ దీంతో 5జీ డేటాను ఆనందించవచ్చు. ఇక రోజుకు 100 SMSలు, అపరిమిత వాయిస్ కాలింగ్ ఫీచర్లు ఉన్నాయి.దీనికి పోటీగా ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ కూడా రూ.979 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే అపరిమిత 5G డేటాను ఆనందించవచ్చు. ఇక ఎయిర్టెల్ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనం ఏమిటంటే, 56 రోజుల పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్. -
జియో యూజర్లకు ఊరట.. అందుబాటులోకి చౌక ప్లాన్లు
రిలయన్స్ జియో కోట్లాది మంది వినియోగదారులకు ఊరటను కలిగించింది. రీఛార్జ్ ప్లాన్ల ధరల పెంపు తర్వాత, వినియోగదారులు చౌకైన ప్లాన్ల కోసం చూస్తున్నారు. వీరి కోసం ఇప్పుడు కంపెనీ వినియోగదారుల కోసం రెండు చౌకైన ప్లాన్లను తీసుకొచ్చింది.రిలయన్స్ జియో తన రీఛార్జ్ ప్లాన్ల ధరలను ఈ నెల 3వ తేదీ నుంచి పెంచింది. దాదాపు 25 శాతం వరకు టారిఫ్‌లు పెరిగాయి. దీంతో అప్పటి వరకూ ఉన్న రూ. 149, రూ. 179 వంటి చౌక, సరసమైన ప్లాన్లను జియో జాబితా నుండి తొలగించింది. దీంతో వాటిని రీచార్జ్ చేసుకునే యూజర్లు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అలాంటి యూజర్ల కోసం సరికొత్త చౌక ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త ప్లాన్ల ధరలను రూ. 189, రూ. 479గా నిర్ణయించింది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్లను మై జియో యాప్ నుంచి రీఛార్జ్ చేసుకోవాలి.జియో రూ.189 ప్లాన్రూ.189 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీని ఇస్తుంది. ఏ నెట్‌వర్క్‌కైనా 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్ చేయవచ్చు. 300 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 2GB డేటా మాత్రమే లభిస్తుంది. అన్ని సాధారణ ప్లాన్ల మాదిరిగానే, జియో కస్టమర్లకు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.జియో రూ. 479 ప్లాన్దీర్ఘకాలం వ్యాలిడిటీ కోసం చూసే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత ఉచిత కాలింగ్, 1000 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో 84 రోజుల పాటు 6GB డేటాను అందిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. -
రేపటి నుంచే కొత్త రీచార్జ్ ప్లాన్లు.. ఇక నెలకు కనీసం..
ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లపై టారిఫ్ పెంపును ప్రకటించాయి. ఆయా కంపెనీలు 25 శాతం వరకు పెంచాయి. ఇవి మరి కొన్ని గంటల్లో అమల్లోకి వస్తాయి. ఎయిర్టెల్, జియో కొత్త ప్లాన్లు జూలై 3 నుంచి, వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లు జూలై 4 నుంచి వర్తిస్తాయి.మునుపటి ప్లాన్ల మాదిరిగానే, మూడు టెల్కోలు వేర్వేరు యూజర్ల కోసం ఉద్దేశించిన వేర్వేరు బండిల్స్‌ను అందిస్తున్నాయి. వీటిలో నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే చాలా మంది నెలవారీ ప్లాన్లను రీచార్జ్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మూడు టెల్కోలకు సంబంధించిన మంత్లీ మినిమమ్ రీచార్జ్ ప్లాన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం..ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ఎయిర్టెల్ తన కనీస నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ .179 నుంచి రూ .199 కు పెంచింది. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, అన్లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ ఉంటాయి. కేవలం కాల్స్, మెసేజింగ్ కోసం సిమ్ కార్డును ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ చాలా మంచిది.జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్జియో అత్యంత తక్కువ నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఇది రూ .155 నుంచి భారీగా పెరిగింది. 28 రోజుల వాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు, 2 జీబీ 4జీ డేటా లభిస్తుంది. హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ఉండి, ఎక్కువ మొబైల్ డేటాను ఉపయోగించని వారికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.వీఐ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్వొడాఫోన్ ఐడియాలో కూడా అత్యంత సరసమైన నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ .199. ఈ ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ, 2 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
సైలెంట్‌గా వచ్చిన కొత్త రీచార్జ్ ప్లాన్! అధిక వ్యాలిడిటీతో..
అధిక వ్యాలిడిటీ, అన్ లిమిటెడ్ కాలింగ్ తో ఎయిర్ టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను విడుదల చేసింది. రూ.279 విలువైన ఈ ప్లాన్ ను సైలెంట్‌గా వెబ్సైట్లో చేర్చేసింది. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునేవారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఈ రీచార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.సాధారణంగా చాలా రీచార్జ్ ప్లాన్లు 28 లేదా 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటాయి. కానీ రూ .279 ప్లాన్ 45 రోజుల వాలిడిటీతో వస్తుంది. కాబట్టి, 15 రోజులు చెల్లుబాటు అదనంగా లభిస్తుంది. అధిక వ్యాలిడిటీ మాత్రమే కాకుండా ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, లోకల్, ఎస్టీడీ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.ఇక అధిక వ్యాలిడిటీ ఉన్న ఇతర ప్రీపెయిడ్ ప్లాన్ల మాదిరిగానే రూ .279 ప్లాన్ కూడా చాలా తక్కువ డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ 2 జీబీ డేటాను మాత్రమే అందిస్తుంది. ఎక్కువ డేటాను పొందాలనుకుంటే, ప్రత్యేక డేటా వోచర్లలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జియో తన చాలా ప్లాన్లతో ఇచ్చినట్లుగా ఇందులో ఉచిత అపరిమిత 5జీ ఆప్షన్ లేదు. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు మొత్తం 600 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. -
ఉచితంగా ఓటీటీ సబ్స్క్రిప్షన్లు.. అదిరిపోయే జియో కొత్త ప్లాన్స్
రిలయన్స్ జియో మూడు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్లు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో వస్తాయి. అపరిమిత కాలింగ్, డేటా అలాగే సోనీ లివ్ (SonyLiv), జీ5 (Zee5) కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తాయి. రూ. 3662 ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 2.5 GB డేటా, అపరిమిత 5G డేటా, రోజుకు 100 SMSలతో వస్తుంది. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు ఉచితంగా వస్తాయి. 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ. 3226 ప్లాన్: ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMSలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు సోనీలివ్ సబ్స్క్రిప్షన్లు ఇతర ప్రయోజనాలు. రూ. 3225 ప్లాన్: ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, 5G డేటాతో పాటు 2GB రోజువారీ 4G డేటా కోటా, రోజుకు 100 SMS వంటి ప్రయోజనాలు ఉంటాయి. జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్‌తో పాటు ఈ ప్లాన్‌లో జీ5 సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇక ఓటీటీ సబ్స్క్రిప్షన్లు వద్దనుకున్నవారికి తక్కువ ధరకు మరో వార్షిక ప్లాన్ అందుబాటులో ఉంది. అదే రూ. 1,999 ప్లాన్. ఇది అపరిమిత 5G డేటా, కాలింగ్‌తో వస్తుంది. వీటితో పాటు 2.5GB రోజువారీ 4G డేటా, రోజుకు 100 SMS కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో థర్డ్-పార్టీ ఓటీటీ ప్రయోజనాలేవీ లేవు కానీ ఇందులో జియో యాప్‌లు, సేవలకు యాక్సెస్ ఉంటుంది. -
ఇదే తొలిసారి.. రిలయన్స్ జియో యూజర్లకు బంపరాఫర్!
యూజర్లకు జియో శుభవార్త చెప్పింది. తొలిసారి నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. జియో యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌ను వీక్షించేలా రెండు ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. తొలి రూ.1,099 ప్లాన్‌లో 84 రోజుల వ్యాలిడిటీ నెలకు రూ. 149 విలువైన నెట్‌ఫ్లిక్స్ (మొబైల్) ప్లాన్‌ను అందిస్తుంది. దీంతో పాటు జియో వెల్కమ్ ఆఫర్‌తో అపరిమిత 5జీ డేటా, 2జీబీ/రోజు డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మాట్లాడవచ్చు. రెండో ప్లాన్‌లో 84 వ్యాలిడిటీతో రూ.1,499 చెల్లించవచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్ నెలకు రూ. 199 విలువైన నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చు. జియో వెల్కమ్ ఆఫర్ కింద ప్రతి రోజూ 3జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్‌తో యూజర్ అపరిమిత 5జీ డేటాను సొంతం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా జియో ప్లాట్‌ఫారమ్ సీఈవో కిరణ్ థామస్ మాట్లాడుతూ.. “వినియోగదారులకు ప్రపంచ స్థాయి సేవల్ని అందించేందుకు కట్టుబడి ఉన్నాం. మా ప్రీపెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ బండిల్‌ను వినియోగదారులకు అందించేందుకు మరో అడుగు ముందుకు వేశాం. నెట్‌ఫ్లిక్స్ లాంటి గ్లోబల్ పార్టనర్లతో చేతులు కలపడం సంతోషంగా ఉందని అన్నారు. చదవండి👉 ఆ వార్తల్లో వాస్తవం లేదు.. క్లారిటీ ఇచ్చిన రిలయన్స్ -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్: ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్, ఆఫర్లేంటో చూడండి!
సాక్షి, ముంబై: ముఖేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఐదు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.269 -రూ. 789మధ్య వీటిని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆప్లాన్లలో జియో సావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. కొత్త జియో ప్లాన్లలో అపరిమిత డేటా, యాడ్-ఫ్రీ మ్యూజిక్, లిమిట్లెస్ డౌన్లోడ్లు, అత్యుత్తమ ఆఫ్‌లైన్ మ్యూజిక్ క్వాలిటీ, JioSaavn సబ్‌స్క్రిప్షన్‌తో జియో టూన్స్ ఫీచర్లను యాక్సెస్ ఉంటుంది. ప్లాన్లు, ఆఫర్లు రూ. 269 ప్లాన్ :ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. అపరిమిత, ఉచిత వాయిస్ కాలింగ్, రోజుకు 1.5జీబీ డేటా, అలాగే రోజుకు 100SMSలు ఉచితం. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) రూ. 529 ప్లాన్ : రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100SMS అందిస్తుంది. ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఇంకా Jio సూట్ యాప్‌లకు యాక్సెస్ ఉచిత Jio Saavn సబ్స్క్రిప్షన్ (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) రూ.589 ప్లాన్: 56 రోజుల వాలిడిటీతో వస్తున్న జియో రూ.589 ప్లాన్‌లో ప్రతిరోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS Jio సూట్ యాప్‌లకు ఉచిత యాక్సెస్ రూ.739 ప్లాన్: 84 రోజుల చెల్లుబాటు. రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 126 జీబీ డేటా. ఇంకా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితం. JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity , JioCloudతో సహా Jio యాప్‌లకు ఉచిత సభ్యత్వం ఇతర ప్రయోజనాలు. రూ. 789 ప్లాన్: 84 రోజుల వాలిడిటీ. రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా. ఇంకా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితం. JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity , JioCloudతో సహా Jio యాప్‌లకు ఉచిత సభ్యత్వం ఇతర ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. -
ఓటీటీ బెనిఫిట్స్‌తో వొడాఫోన్ ఐడియా కొత్తప్లాన్స్, రోజుకి 2 జీబీ డేటా
సాక్షి, ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లను ప్రకటించింది. జియో, ఎయిర్టెల్ లాంటి దిగ్గజాలతో పోలిస్తే 5జీ సేవల్లో వెనుకబడి ఉన్న వొడాఫోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకునే క్రమంలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది. త్వరలో 5జీని తీసుకు రావాలని యోచిస్తున్నట్లు హామీ ఇచ్చిన కంపెనీ తాజాప్లాన్లు ప్రకటించడం విశేషం. (Infinix INBook Y1 Plus Neo రూ. 20వేలకే ల్యాప్‌ట్యాప్, ఎట్రాక్టివ్ ఫీచర్స్!) యాక్టివ్ కస్టమర్ బేస్‌ను నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా,రూ 368, రూ 369 ధరలతో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. రోజువారీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు పలు ఓటీటీ ప్లాట్ ఫారమ్ లకు సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది. రూ.368, రూ.369 ప్లాన్స్ మధ్య ఉన్న తేడా ఏంటంటే.. వొడాఫోన్ ఐడియా రూ.368 అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకి 2జీబీ డేటా, రోజుకి 100 ఎస్ఎంఎస్ ఉచితం. వాలిడిటీ 30 రోజులు. అంటే టోటల్‌గా 60జీబీ డేటాని వినియోగదారులు ఎంజాయ్ చేయొచ్చు. దీంతోపాటు 30 రోజులు చెల్లుబాటు అయ్యేలా సన్‌నెక్ట్స్ యాప్ కి యాక్సెస్ లభిస్తుంది. వీకెండ్ రోలోవర్ ఫెసిలిటీ, వీఐ మూవీస్ సబ్స్క్రిప్షన్, ప్రతినెల 2జిబి డేటా బ్యాకప్ లభిస్తాయి. అయితే ఈ బెనిఫిట్స్ పొందేందుకు వీఐ యాప్ యూజర్లు 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది. (బీ అలర్ట్: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, కంపెనీ స్పందన ఏంటంటే?) వొడాఫోన్ ఐడియా రూ.369 ఈప్లాన్లోకి రూ.368 ప్లాన్ లాంటి ప్రయోజనాలే లభ్యం. కానీ బింజ్ ఆల్ నైట్, వీకెండ్ డేటా రోలోవర్, సోనిలివ్ యాప్ యాక్సెస్, వీఐ మూవీస్, టీవీ యాప్స్, ప్రతినెల 2జీబీ వరకు డేటా బ్యాకప్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని క్లెయిమ్ చేయడానికి 121249 కి డయల్ చేయాల్సి ఉంటుంది. (layoffs: షాకిచ్చిన ఇండియన్ ట్విటర్, 30 శాతం మందికి గుడ్ బై?) -
IPL 2023: జియో అదిరిపోయే ఆరు ప్రీపెయిడ్ ప్లాన్స్
సాక్షి, ముంబై: దేశంలో క్రికెట్ పండుగ ప్రారంభానికి ముందు టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో క్రికెట్ అభిమానులకు 6 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి షురూ కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల కోసం ఈ కొత్త ప్లాన్లను జియో ప్రకటించింది. (జియో కస్టమర్లకు భారీ షాక్: ఎంట్రీ-లెవల్ బాదుడే మామూలుగా) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023కి ప్రారంభానికి ముందు రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ఆరు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను తీసుకొచ్చింది.ఐపీఎల్ , ఈసారిJioCinema యాప్‌లో వీక్షించే వినియోగదారులకు ఇవి మరింత సౌకర్యంగా మారనున్నాయి. 4కేలో గేమ్‌ను చూడాలంటే ఎక్కువ డేటా కావాల్సిందే. అందుకే జియో కస్టమర్ల కోసం ఆరు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. వీటిల్లో మూడు వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలతో పాటు అపరిమిత డేటాప్రయోజనాలతో వస్తాయి మిగిలిన మూడు డేటా యాడ్-ఆన్ వోచర్లు మాత్రమే అనేది గమనించాలి. (ఇదీ చదవండి: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు) జియో రూ.999, రూ.399, రూ.219, రూ.222, రూ.444, రూ.667 ప్లాన్ల వివరాలు రూ.999: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. రోజూ 3జీబీ హై స్పీడ్ డేటా ఉచితం. ఇక అపరిమిత కాల్స్, రోజువారీ 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా లభిస్తాయి. ఇవి కాకుండా మరో రూ.241 వోచర్ ఉచితంగా లభిస్తుంది. ఇందులో 40 జీబీ బోనస్ డే డేటా కూడా ఉంటుంది. రూ.399, రూ.219: ఈ రెండు ప్లాన్లలో రోజువారీ 3జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్. ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉంటాయి. రూ.399 ప్లాన్ లో రూ.61 విలువైన వోచర్ ఉచితంగా వస్తుంది. 6జీబీ అదనపు డేటా కూడా పొందొచ్చు. వ్యాలిడిటీ 28 రోజులు. 6 జీబీ బోనస్ డేటా రూ.219 ప్లాన్ వ్యాలిడిటీ 14 రోజులు. రోజువారీ 3 జీబీ ఉచిత డేటాకు అదనంగా 2 జీబీ బోనస్ డేటా ఉచితం. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ డేటా యాడ్-ఆన్ వోచర్లు బేస్ ప్రీపెయిడ్ ప్లాన్‌పై అదనపు డేటా రూ.222ప్లాన్‌లో ప్రస్తుత ప్లాన్ ఎక్స్ పైరీ గడువు 50జీబీ డేటా లభిస్తుంది. రూ.444: ఈ ప్లాన్ లో 100 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 60 రోజులు. రూ.667 డేటా ప్యాక్ తో 150 జీబీ ఉచిత డేటా వస్తుంది. 90 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. -
జియో యూజర్లకు గుడ్ న్యూస్! ఇకపై
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ రిలయన్స్ జియో కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్‌ను పరిచయం చేసింది. కస్టమర్లు ఒక నెలపాటు ఉచితంగా ట్రయల్ చేయవచ్చు. ప్లాన్స్ రూ.399 నుంచి ప్రారంభం. అదనంగా మూడు సిమ్‌లను తీసుకోవచ్చు. ఒక్కొక్క సిమ్‌కు నెలకు రూ.99 చార్జీ చేస్తారు. అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకోవచ్చు. రూ.399 ప్యాక్‌లో నలుగురు సభ్యుల కుటుంబానికి మొత్తం చార్జీ రూ.696 ఉంటుంది. నలుగురు సభ్యులు ఒక నెలలో మొత్తం 75 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. రూ.699 ప్లాన్‌లో 100 జీబీ డేటా అందుకోవచ్చు. అలాగే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియోటీవీ, జియో సినిమాస్ యాప్స్‌ను ఆస్వాదించవచ్చు. ఇండివిడ్యువల్ ప్లాన్స్‌లో రూ.299 ప్యాక్‌కు 30 జీబీ, రూ.599 ప్యాక్ అయితే అపరిమిత డేటా ఆఫర్ చేస్తోంది. సెక్యూరిటీ డిపాజిట్ ప్లాన్‌నుబట్టి రూ.375–875 ఉంది. జియోఫైబర్, కార్పొరేట్ ఉద్యోగులు, జియోయేతర పోస్ట్‌పెయిడ్ యూజర్స్, క్రెడిట్ కార్డ్ కస్టమర్లు, మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి ఈ సెక్యూరిటీ డిపాజిట్ లేదు. -
వొడాఫోన్ కొత్త ప్లాన్: జియో, ఎయిర్టెల్ తరహాలోనే, ఏది బెటర్?
సాక్షి,ముంబై:వొడాఫోన్ ఇండియా సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. దేశీయ వినియోగదారుల కోసం రూ. 296ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ని తీసుకొచ్చింది. ఎక్కువ డేటాను వినియోగించే కస్టమర్లు లక్క్ష్యంగా ఈ ప్లాన్‌ను రూపొందించింది. ముఖ్యంగా ఎయిర్టెల్, జియోకు చెందిన రూ.296 రీచార్జ్ ప్లాన్లకు దీటుగా తాజా బల్క్ డేటా ప్లాన్‌ను తీసుకొచ్చింది. వొడాఫోన్ రూ.296 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు 25 జీబీ బల్క్ డేటా అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకు 100ఎస్ఎంఎస్లు ఉచితం ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వీఐ మూవీస్, టీవీని ఎంజాయ్ చేయవచ్చు కానీ, వివో అన్లిమిటెడ్ ప్రయోజనాలుండవు. ఎయిర్టెల్ రూ. 296 ప్లాన్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకి100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు ఏంటంటే.. అపోలో 24|7 సర్కిల్, ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్, ఉచిత హెలోట్యూన్స్ , వింక్ మ్యూజిక్ ఫ్రీ. రిలయన్స్ జియో రూ. 296 ప్లాన్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ , రోజుకు 100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో రిలయన్స్ జియో వినియోగదారులు జియోటీవీ, జియో సినిమా జియో క్లౌడ్,జియో సెక్యూరిటీల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి -
జియో మైండ్‌బ్లోయింగ్ ఆఫర్.. ఈ ప్లాన్‌తో 23 రోజుల వ్యాలిడిటీ, 75జీబీ డేటా.. ఫ్రీ, ఫ్రీ!
టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే కస్టమర్లకు తనవైపు తిప్పుకుని దూసుకుపోతూ రిలయన్స్ జియో సంచలనంగా మారింది. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెడుతోంది జియో. ఇప్పుడు మరో వార్షిక రీఛార్జ్ ప్లాన్‌ను విడుదల చేసింది. కొత్త ఏడాది కానుకగా తన కస్టమర్లకు సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు అదనంగా కొన్ని రోజుల వ్యాలిడిటీ, ఉచిత డేటా వంటి బెనిఫిట్స్‌ని అందిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం! జియో యూజర్లకు.. స్పెషల్ ఆఫర్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్లు నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ల కంటే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఎందుకంటే అవి నెలవారీ ప్లాన్ల కంటే అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వార్షిక ప్లాన్లతో, కస్టమర్లు ప్రతి నెలా వారి ఫోన్ నంబర్‌ను రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. బదులుగా, వారు సంవత్సరానికి ఒకసారి రీఛార్జ్ చేసుకోవడంతో బోలెడు బెనిఫిట్స్‌ను పొందచ్చు. రూ. 2999 ధర ఉన్న ప్రస్తుత వార్షిక ప్లాన్‌లో.. రోజుకు 2.5GB రోజువారీ డేటా ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు. అంతేకాకుండా ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMSలు పొందుతారు. జియో కస్టమర్లు ఈ ప్లాన్‌లో జియో టీవీ (Jio TV), జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌లకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా పొందుతారు. ఈ వార్షిక ప్లాన్‌లో అందించే 2.5 GB రోజువారీ డేటా ముగిసిన తర్వాత కూడా ఇంటర్నెట్ వేగం 64Kbps స్పీడ్‌కి చేరకుంటుంది.. ఈ బెనిఫిట్స్‌తో పాటు మరింత ప్రయెజనాలు ఈ ప్లాన్‌లో జత చేసింది రిలయన్స్ జియో. ప్రత్యేక ఆఫర్ కింద, 23 రోజుల అదనపు వ్యాలిడిటీతో పాటు 75 జీబీ ఉచితంగా డేటా కూడా ఉంటుంది. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా!