రిలయన్స్ జియో లోగో (ఫైల్ ఫోటో)
ముంబై : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రవేశం భారత టెలికాం మార్కెట్‌లో ఓ సంచలనం. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లలో భారీగా ధరల పతనం ఏర్పడింది. ఒక్కసారిగా డేటా ధరలన్నీ కిందకి దిగొచ్చాయి. తాజాగా ఈ కంపెనీ పోస్టు పెయిడ్ మార్కెట్ స్పేస్‌ను టార్గెట్ చేసింది. పోస్టు పెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌ల రేట్లను తగ్గించడానికి సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తోంది. 199 రూపాయల ప్లాన్‌ను గత రెండు నెలల క్రితమే రిలయన్స్ జియో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌పై 25 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, అపరిమిత ఎస్‌ఎంఎస్‌లు, ఉచిత రోమింగ్‌ను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌తో, ఇతర టెలికాం దిగ్గజాలు సైతం తమ రేట్లను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. వొడాఫోన్ తన డేటా పరిమితులను పెంచడానికి సరికొత్త పోస్టు పెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించడం ప్రారంభించింది.
జియో ప్లాన్ రూ.199కు పోటీగా వొడాఫోన్ రూ.299 ప్లాన్‌ను తీసుకొచ్చింది. రెడ్ పోస్టు పెయిడ్ ప్లాన్ల కింద రెండు రోజుల క్రితమే దీన్ని ఆవిష్కరించింది. ఈ ప్యాక్‌పై జియో కంటే కాస్త తక్కువగా 20 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అంతేకాక అపరిమిత వాయిస్ కాల్స్, ఉచిత రోమింగ్, 100ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. కస్టమర్లకు ఇది శుభవార్త అని, కానీ ఇది ప్రీపెయిడ్ నుంచి పోస్టు పెయిడ్‌కు మారేందుకు ప్రోత్సహిస్తుందా అని? గేమ్స్ ఎడిటర్ రిషి అల్వాని అన్నారు. అయితే పోస్టుపెయిడ్ సెగ్మెంట్‌పై అనాసక్తితో ఉన్న కస్టమర్లకు మాత్రం జియో సరికొత్త జోష్‌ను అందిస్తుందని టెలికాం విశ్లేషకులు చెప్పారు. జియో ఎఫెక్ట్‌తో వొడాఫోన్‌తో పాటు, టెలికాం, ఐడియా లాంటి సంస్థలు కూడా తమ పోస్టు పెయిడ్ ప్లాన్లను చౌకైన ధరల్లో ఆఫర్ చేయడం మొదలు పెడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment