postpaid plans
-
జియో కస్టమర్లకు ట్విస్ట్ : ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్ ఇక రూ. 299లు
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఎంట్రీ లెవల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను రూ.199 నుండి రూ.299కి పెంచేసింది. 100 రూపాయిలు పెంచిన ఈ ప్లాన్‌లో మిగిలిన ప్రయోజనాల్నీ ఒకేలా ఉండగా, 5 జీబీ డేటా అదనంగా అందిస్తోంది. (ఇదీ చదవండి: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు) కొత్త జియో రూ. 299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వెబ్సైట్ ప్రకారం, జియో ఎంట్రీ-లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 299 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 30జీబీ హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSల ఉచింతం అర్హతగల జియో సబ్స్క్రైబర్లు అపరిమిత 5జీ డేటాతో Jio వెల్కమ్ ఆఫర్‌ను పొందవచ్చు. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) పాత జియో రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ పాత రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 25 జీబీ హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందించింది. JioPrime సభ్యత్వం కోసం రూ. 99 వసూలు చేస్తుంది. ఈ ప్లాన్ రూ JioTV, JioCinema, JioSecurity , JioCloud వంటి అంతర్గత యాప్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇపుడిక పాత ఎంట్రీ-లెవల్ పోస్ట్‌పెయిడ్ రూ. 199 ప్లాన్ కస్టమర్లకు అందుబాటులో లేదు. కాగా గత వారం రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం రూ. 299తో ప్రారంభమయ్యే జియో ప్లస్ పేరుతో నాలుగు కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. (Upasana Konidela:ఉపాసన అరుదైన ఘనత.. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ!) -
ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్..!
పలు దిగ్గజ టెలికాం సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకుగాను బండిల్ రీచార్జ్ ప్లాన్లను ప్రకటించాయి. ఈ ప్లాన్స్‌తో పలు ఓటీటీ సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. కాగా తాజాగా ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సేవలు..! ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఉచితంగా డిస్నీ+హట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సేవలను ఉచితంగా పలు బండిల్ ప్లాన్స్‌తో అందిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఫ్యామిలీ రీఛార్జ్ ప్లాన్స్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్స్‌తో ఆయా ఎయిర్టెల్ యూజర్లు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సేవలను పొందవచ్చునని ఎయిర్టెల్ ప్రకటించింది. రూ. 1199, రూ. 1599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను ఎయిర్టెల్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది. ఇక రూ. 1599 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌తో పాటుగా, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను కూడా ఉచితంగా పొందవచ్చును. అంతేకాకుండా 500GB వరకు డేటా రోల్‌ఓవర్‌తో వస్తుంది. ఇది అపరిమిత లోకల్, STD , రోమింగ్ కాల్స్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ డిస్నీ+ హాట్‌స్టార్, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటుగా, అపరిమిత కాల్లు హ్యాండ్సెట్ రక్షణతో ఉచిత యాడ్-ఆన్ కనెక్షన్‌ని కూడా అందిస్తుంది. కాగా రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను సవరిస్తూ రూ. 1199గా ఎయిర్టెల్ ప్రవేశపెట్టింది. ఈ సర్వీసులను పొందాలంటే ఎయిర్టెల్ అధికారిక వెబ్సైట్ లేదా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లో సబ్‌స్రైబ్ చేసుకోవాలి. చదవండి: ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్,అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్! ఐపీఎల్ అభిమానులకు పండగే! -
ఎయిర్టెల్ మరో సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తాజాగా రూ. 299 నెలవారీ అద్దె వర్తించే ఎంట్రీ స్థాయి కార్పొరేట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో డేటాను నెలకు 30 జీబీ (గతంలో 10 జీబీ)కి పెంచింది. కొన్ని కార్పొరేట్ ప్లాన్లు రూ. 299 కన్నా తక్కువకి ఉన్నాయని, నెల రోజుల నోటీసు తర్వాత వీటన్నింటిని రూ. 299 ప్లాన్‌కి అప్‌గ్రేడ్ చేయనున్నామని సంస్థ తెలిపింది. దీనితో ప్రతీ యూజరుపై కంపెనీకి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) పెరుగుతుందని పేర్కొంది. రూ. 399 నెలవారీ అద్దె ప్లాన్‌ను ఉపయోగిస్తున్న కార్పొరేట్ కస్టమర్లకు డేటా పరిమితిని 50 జీబీ నుంచి 60 జీబీకి పెంచినట్లు, ట్రేస్‌మేట్ యాప్, గూగుల్ వర్క్‌స్పేస్, ఎయిర్టెల్ కాల్ మేనేజర్ వంటివి కూడా వీరికి అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వివరించింది. అన్ని ప్లాన్లలోనూ ఇకపైనా వింక్ మ్యూజిక్ యాప్, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాం షా అకాడమీకి ఏడాది పాటు యాక్సెస్ ఉంటుందని తెలిపింది. రూ. 499, రూ. 1,599 నెలవారీ రెంటల్ ఉండే హై–ఎండ్ కార్పొరేట్ ప్లాన్లలో వీఐపీ సర్వీస్ వంటివి కూడా జోడించినట్లు ఎయిర్టెల్ వివరించింది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇటీవల కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ తాజాగా డేటా రోల్ఓవర్ సదుపాయంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లందించే కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. డిసెంబర్ 1, 2020 నుంచి దేశవ్యాప్తంగా వీటిని లాంచ్ చేయనున్నామని తెలిపింది. రూ.199 రూ .798, 999 రూపాయల ధరతో మూడు కొత్త ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ తీసుకురాబోతోంది. ఈ ప్లాన్లలో అపరిమిత కాలింగ్, డేటా, డేటా రోల్ ఓవర్, ఫ్యామిలీ యాడ్-ఆన్ లాంటి ప్రయోజనాలు అందించనుంది ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో పాటు, బీఎస్ఎన్ఎల్ రెండు యాడ్-ఆన్ ప్లాన్లను రూ .150 రూ.250 లకు తీసుకొస్తోంది. ఇవి వరుసగా 40 జీబీ డేటా 70 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నాయి. రూ 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: 300 నిమిషాల ఉచిత ఆఫ్-నెట్ కాల్లతో అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 75 జీబీ వరకు రోల్ఓవర్ ప్రయోజనాలతో 25 జీబీ డేటాను కూడా ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్ కూడా ఇస్తుంది. యాడ్ ఆన్ ఫ్యామిలీ సదుపాయం లేదు. రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ సదుపాయం.150 జీబీ వరకు రోల్ఓవర్ ప్రయోజనాలతో 50 జీబీ డేటాను కూడా ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్ సదుపాయం.అలాగే ఇద్దరుకుటుంబ సభ్యులకు ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లను కూడా ఇస్తుంది. ఈ యాడ్-ఆన్‌లో అపరిమిత వాయిస్ సౌకర్యం, 50 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. రూ .999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రోల్ఓవర్ ప్రయోజనాలతో 75 జీబీ డేటాను 225 జీబీ వరకు ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్లు, 3 ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లను కూడా ఇస్తుంది. ఇందులో రోజుకు అపరిమిత వాయిస్ సౌకర్యం, 75 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభ్యం. -
జియోలో సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లస్ ఆఫర్లు..
ముంబై: వినియోగదారులకు సరికొత్త ఆఫర్లను జియో సంస్థ ప్రకటించింది. జియో సంస్థ పోస్ట్‌పెయిడ్ ప్లస్ విభాగాలలో వివిధ ఆఫర్లు ప్రకటించింది. దేశీయ టెలికం రంగాలలో ఎన్నో సంచాలనాలు సృష్టించామని, 40కోట్ల వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నామని జియో సంస్థ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ఎంటర్టైన్మెంట్, విదేశాలలో ప్రయాణించే వారికి రోమింగ్ సేవలు లాంటి సరికొత్త సేవలతో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ఆకట్టుకోనుందని అంబానీ తెలిపారు. మరోవైపు వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు నిరంతరం కృషి చేస్తామని సంస్థ తెలిపింది. తాజా పోస్ట్‌పెయిడ్ సేవలతో జియోలో కొత్త వినియోగదారులు సైతం మొగ్గు చూపే అవకాశమున్నట్లు సంస్థ అభిప్రాయపడింది. ఎంటర్టైన్మెంట్ ప్లస్: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ, హాట్‌స్టార్‌లలో సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. జియో యాప్‌లో 650లైవ్ చానెల్స్, వీడియో కంటెంట్లు, 300పైగా వార్తాపత్రికలను సబ్స్క్రిప్షన్ ద్వారా పొందవచ్చు. ఫీచర్ ప్లస్: 250 రూపాయలతో జియో ఫ్యామిలీ ప్లాన్ 500జీబీ వరకు డేటా రోలోవర్ భారత్ విదేశాలలో వైఫై సేవలు ఇంటర్నేషనల్ ప్లస్ విదేశాలకు వెళ్లె దేశీయ ప్రయాణికుల కోసం యూఎస్, యూఏఈలో ఫ్రీ రోమింగ్ సేవలు ఎక్స్పీరీయన్స్ ప్లస్ ఫ్రీ హోమ్ డెలివరీ, యాక్టివేషన్, ప్రీమియమ్ కాల్ సెంటర్ సేవలు జియో పోస్ట్ పేడ్ సేవలు కావాలంటే, జియో వినియోగదారులు వాట్సాప్ నెంబర్ 88 501 88 501కు మెసేజ్ చేయాలి. అయితే జియో పోస్ట్‌పేడ్ సేవలు మార్కెట్లో సెప్టెంబర్ 24(గురువారం) విడుదల కానుంది. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు http://jio.com/store-locator వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు జియో టారీఫ్ పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్స్: 399 రూపాయలతో 75జీబీ డేటా, 599 రూపాయలతో 100 జీబీ డేటా, 799 రూపాలతో 150జీబీ డేటా, 999 రూపాయలతో 200జీబీ డేటా, 1499 రూపాయలతో 300జీబీ డేటా పొందవచ్చు -
రూ.399 ప్లాన్‌పై 300 రూపాయల డిస్కౌంట్
బెస్ట్ పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేయడంలో భారతీ ఎయిర్టెల్ ఎల్లప్పుడు ముందు ఉంటుంది. కానీ ఎంట్రీ లెవల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల విషయంలో మాత్రం ఈ కంపెనీ, వొడాఫోన్ కంటే వెనుకంజలోనే ఉంది. వొడాఫోన్ రెడ్ రేంజ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 299 రూపాయల నుంచి ప్రారంభమవుతుంటే, భారతీ ఎయిర్టెల్ మైప్లాన్ ఇన్ఫినిటీ ప్లాన్‌ను 399 రూపాయలకు ఆఫర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ తన రూ.399 ప్లాన్‌పై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. 399 రూపాయల ప్లాన్‌పై 300 రూపాయల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు పేర్కొంది. 50 రూపాయల చొప్పున ఈ డిస్కౌంట్‌ను ఆరు నెలల పాటు ఆఫర్ చేయనుంది. అంటే మొత్తంగా రూ.300 డిస్కౌంట్ లభించనుంది. దీంతో తర్వాత ఆరు నెలలు రూ.399 ప్లాన్ ధర రూ.349కు తగ్గనుంది. అయితే అదనపు పన్నులతో మాత్రం దీని ధర రూ.385గా ఉండనుందని ఎయిర్టెల్ చెప్పింది. ఎయిర్టెల్ రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు.... ఈ ప్లాన్ కింద నెలకు 20 జీబీ డేటా పొందనున్నారు. డేటా క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీని ఎయిర్టెల్ ఆఫర్చేస్తోంది. ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితులు లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఇది అందిస్తోంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభ్యం కానున్నాయి. అదనంగా ఎయిర్టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఎయిర్టెల్ ఆఫర్చేస్తుంది. కానీ యూజర్లు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు అర్హులు కారు. వొడాఫోన్ మాదిరి ఆఫర్ చేసేందుకు ఎయిర్టెల్ అదనంగా ప్రతి నెల 20 జీబీ డేటాను 12 నెలల పాటు అందిస్తుంది. దీంతో మొత్తంగా ఎయిర్టెల్ యూజర్లు 40జీబీ డేటా పొందుతారు. -
పోస్టు పెయిడ్లోనూ జియో సంచలనమా?
ముంబై : ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్రవేశం భారత టెలికాం మార్కెట్లో ఓ సంచలనం. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లలో భారీగా ధరల పతనం ఏర్పడింది. ఒక్కసారిగా డేటా ధరలన్నీ కిందకి దిగొచ్చాయి. తాజాగా ఈ కంపెనీ పోస్టు పెయిడ్ మార్కెట్ స్పేస్‌ను టార్గెట్ చేసింది. పోస్టు పెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌ల రేట్లను తగ్గించడానికి సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తోంది. 199 రూపాయల ప్లాన్‌ను గత రెండు నెలల క్రితమే రిలయన్స్ జియో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌పై 25 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, అపరిమిత ఎస్ఎంఎస్లు, ఉచిత రోమింగ్‌ను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌తో, ఇతర టెలికాం దిగ్గజాలు సైతం తమ రేట్లను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. వొడాఫోన్ తన డేటా పరిమితులను పెంచడానికి సరికొత్త పోస్టు పెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించడం ప్రారంభించింది. జియో ప్లాన్ రూ.199కు పోటీగా వొడాఫోన్ రూ.299 ప్లాన్‌ను తీసుకొచ్చింది. రెడ్ పోస్టు పెయిడ్ ప్లాన్ల కింద రెండు రోజుల క్రితమే దీన్ని ఆవిష్కరించింది. ఈ ప్యాక్‌పై జియో కంటే కాస్త తక్కువగా 20 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అంతేకాక అపరిమిత వాయిస్ కాల్స్, ఉచిత రోమింగ్, 100ఎస్ఎంఎస్లను అందిస్తోంది. కస్టమర్లకు ఇది శుభవార్త అని, కానీ ఇది ప్రీపెయిడ్ నుంచి పోస్టు పెయిడ్‌కు మారేందుకు ప్రోత్సహిస్తుందా అని? గేమ్స్ ఎడిటర్ రిషి అల్వాని అన్నారు. అయితే పోస్టుపెయిడ్ సెగ్మెంట్‌పై అనాసక్తితో ఉన్న కస్టమర్లకు మాత్రం జియో సరికొత్త జోష్‌ను అందిస్తుందని టెలికాం విశ్లేషకులు చెప్పారు. జియో ఎఫెక్ట్‌తో వొడాఫోన్తో పాటు, టెలికాం, ఐడియా లాంటి సంస్థలు కూడా తమ పోస్టు పెయిడ్ ప్లాన్లను చౌకైన ధరల్లో ఆఫర్ చేయడం మొదలు పెడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
జియో బంపర్ ప్లాన్: ఫ్రీ ఇంటర్నేషనల్ రోమింగ్
సాక్షి,ముంబై: ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తన కస్టమర్లకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోనే తొలి జీరో కాస్ట్ పోస్ట్ పెయిడ్ సర్వీసులను ప్రకటించింది. ఒకే ఒక్క క్లిక్‌తో ఇంటర్నేషనల్ కాలింగ్ యాక్టివేషన సదుపాయాన్ని కల్పిస్తోంది. ఎలాంటి నెలవారీ ఛార్జీలు, డిపాజిట్లు లేకుండానే అంతర్జాతీయ కాలింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. రిలయన్స్ జియో కొత్త పోస్ట్‌పెయిడ్ రీచార్జ్ ప్లాన్ లో నెలకు 199రూపాయల ప్యాక్‌లో 25జీబీ డేటాని ఆఫర్ చేస్తోంది. అన్లిమిటెడ్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలను కల్పిస్తున్న ఈ ప్లాన్ మే 15నుంచి అమల్లోకి వస్తుందని గురువారం ఒక ప్రకటనలో జియో తెలిపింది. ముఖ్యంగా ఈ ప్యాక్ద్వారా జియో వినియోగదారులందరికీ అత్యంత ఆకర్షణీయమైన, ఇంటర్నేషనల్ కాలింగ్ అండ్ రోమింగ్ సౌలభ్యాన్నికూడా అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించింది. అంతర్జాతీయ కాలింగ్ నిమిషానికి 50 పైసలు నుంచి మొదలవుతుందని పేర్కొంది. ఎలాంటి సబ్స్క్రిప్షన్, సెక్యూరిటీ డిపాజిట్లు లేకుండానే ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. -
ఎయిర్టెల్ ఆ ప్లాన్ మళ్లీ వచ్చేసింది
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అంతకముందు రద్దు చేసిన ఆ 649 రూపాయల పోస్టు పెయిడ్‌ప్లాన్‌ను మళ్లీ ఆవిష్కరించింది. మైప్లాన్ ఇన్ఫినిటీ కింద ‘బెస్ట్ సెల్లింగ్ పోస్టుపెయిడ్ ప్లాన్స్’లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ కింద ప్రస్తుతం 50జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌ను ఆఫర్ చేయనున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. అంతకముందు ఈ ప్లాన్ కింద కేవలం కస్టమర్లకు 30జీబీ 3జీ, 4జీ డేటాను మాత్రమే ఆఫర్ చేసేది. ప్రస్తుతం అదనంగా 20జీబీ డేటాను పెంచేసింది. రిలయన్స్ జియో రూ.509, రూ.799 పోస్టు పెయిడ్ ప్లాన్లకు పోటీగా ఎయిర్టెల్ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కొత్త రూ.649 ప్లాన్ కింద నెలకు 50జీబీ డేటా మాత్రమే కాక, అపరిమిత వాయిస్ కాల్స్, రోమింగ్‌లో అవుట్గోయింగ్ కాల్స్ ఉచితం. ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితి లేదు. ఈ పోస్టుపెయిడ్ ప్లాన్ డేటా రోల్ఓవర్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. అంటే నెలలో సద్వినియోగం చేసుకోని డేటాను, తర్వాతి నెలకు పంపించుకునే అవకాశముంటుంది. ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌కు ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. వింక్ టీవీ సబ్స్క్రిప్షన్, లైవ్‌టీవీ, మూవీలు, హ్యాండ్సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను ఇది ఆఫర్ చేస్తోంది. ఎయిర్టెల్ ఇటీవలే 499 రూపాయలతో కొత్తగా ఓ పోస్టు పెయిడ్ ప్లాన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్ కింద అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ ఇన్కమింగ్/అవుట్‌గోయింట్ కాల్స్ ఉచితం, 40జీబీ 3జీ,4జీ డేటాను అందిస్తోంది. ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆఫర్ చేస్తోంది. -
బీఎస్ఎన్ఎల్: కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది.ఒకటి కాదు రెండు ఏకంగా ఆరు ప్లాన్లను తీసుకొచ్చింది. సరసమైన ధరలో రూ.118 ప్రారంభ ప్యాక్‌గా, రూ.379, రూ. 551 సహా ఇతర ప్రీపెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించింది. అలాగే రూ.339 ప్లాను రివ్యూ చేసి అదనపు సౌకర్యాలను జోడించింది. ముఖ్యంగా రిలయన్స్ జియోతో పాటు ఇతర టెలీకాం సంస్థల పోటీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ఈ కొత్త టారిఫ్ ప్లాన్లను తీసుకొచ్చింది. దీంతోపాటు ఈ అన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో వినియోగదారులు వ్యక్తిగతీకరించిన రింగ్ బ్యాక్ టోన్ (పీఆర్బీటీ) కు ఉచితంగా అందిస్తోంది. రూ. 118 ప్లాన్: 1జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, 28 రోజులు వాలిడిటీ. ఈ ప్లాన తమిళనాడు సర్కిల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రూ.379ప్లాన్: రోజుకు 4జీబీ 4జీ/3జీ డేటా .. బీఎస్ఎన్ఎల్ టూ బీఎస్ఎన్ఎల్ రోజుకు 30 నిమిషాల వాయిస్ కాల్స్, 30రోజులు వాలిడీటీ. అయితే ఈ ప్లాన్ కేరళ సర్కిల్లో మాత్రమే. రూ.551ప్లాన్: రోజుకు 1.5జీబీ 4జీ డేటా , కేరళకు మాత్రమే ప్రత్యేకం. రూ. 444 ప్లాన్:1.5జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్‌కాల్స్, 60 రోజులు వాలిడిటీ. రూ.666 ప్లాన్: 1 జీబీ 4జీడేటా, అన్‌లిమిటెడ్‌కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్లు,129 రోజులు వాలిడిటీ. రూ.485 ప్లాన్: రోజుకు1 జీబీ 4జీడేటా, రోజుకి వంద ఎస్ఎంఎస్లు, అన్‌లిమిటెడ్‌కాల్స్, 90 రోజులు వాలిడిటీ. దీంతోపాటు రూ.799ల మరో ప్రీమియం ప్రీపెయిడ్ ప్లాన్‌లో 30జీబీ డేటా, అన్‌లిమిటెడ కాల్స్ ఆఫర్ చేస్తోంది.అ లాగే ఇటీవల లాంచ్ చేసిన రూ.399 ప్లాన్‌ను మోడిఫై చేసి ఇపుడు అన్ లిమిటెడ్కాల్స్ అందిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి ఇవిఅమల్లోకి రానున్నాయి. మరోవైపు మిగతా ప్రాంతాల్లో ఈ ప్లాన్లను ఎపుడు అమలు చేసేదీ బీఎస్ఎన్ఎల్ వెల్లడిచేయలేదు. -
జియో ఎఫెక్ట్ : ఐడియా కొత్త కొత్త ప్లాన్స్
రిలయన్స్ జియో ఎఫెక్ట్‌తో ఐడియా తన పోస్టు పెయిడ్ యూజర్లకూ కొత్త ప్లాన్స్‌ను ప్రవేశపెట్టింది. నిర్వానా పోస్టు పోస్టు పెయిడ్ ప్లాన్స్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. ఈ పోస్టు పెయిడ్ ప్లాన్స్ రిలయన్స్ జియోతో పాటు, ఎయిర్టెల్, వొడాఫోన్లకు కౌంటర్‌గా నిలువనున్నాయి. నిర్వానా ప్లాన్స్ రూ.389 నుంచి ప్రారంభమై.. రూ.2,999 వరకు ఉన్నాయి. ఎనిమిది ఆఫర్లు ఉన్నాయి. ఈ ప్లాన్స్ కింద అపరమిత కాలింగ్, ఉచిత రోమింగ్ సౌకర్యం, అపరమిత మెసేజింగ్ వంటి అందిస్తోంది. ఎయిర్టెల్, వొడాఫోన్లలో అందిస్తున్న డేటా రోల్ ఓవర్ ఆఫర్ తరహాలోనే ఐడియా కూడా నిర్వానా పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను వాడే కస్టమర్లకు డేటా క్యారీ ఫార్వార్డ్ ఆఫర్‌ను వీటిలో ప్రవేశపెట్టింది. దీని వల్ల ఒక నెలలో యూజర్ తనకు లభించిన మొబైల్ డేటా వాడకపోతే అది మరుసటి నెలలో వచ్చే డేటా లిమిట్లో యాడ్ అవుతుంది. కొత్త ప్లాన్ల వివరాలు.. రూ.389 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, ఉచిత ఇన్కమింగ్ రోమింగ్ కాల్స్, 10 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, మూవీలు, గేమ్స్, మ్యూజిక్కు 12 నెలల వరకు ఉచిత సబ్స్క్రిప్షన్ రూ.499 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, ఉచిత ఇన్కమింగ్, అవుట్గోయింగ్ రోమింగ్ కాల్స్, 20 జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ రూ.649 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్, నెలంతా 35 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ రూ.999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత కాలింగ్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్, నెలంతా 60 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ రూ.1,299 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్ కాల్స్, ఉచితంగా 100 ఇంటర్నేషనల్ కాలింగ్ నిమిషాలు, నెలంతా 85 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 200జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ రూ.1,699 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్, ఉచిత ఇన్కమింగ్, అవుట్గోయింగ్ రోమింగ్ కాల్స్, 110జీబీ హైస్పీడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ రూ.1,999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత కాలింగ్, నేషనల్ రోమింగ్‌పై ఉచిత ఇన్కమింగ్, అవుట్గోయింగ్ కాల్స్, ఉచితంగా 200 ఇంటర్నేషనల్ నిమిషాలు, నెలంతా 135జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ రూ.2,999 ఐడియా నిర్వానా పోస్టు పెయిడ్ ప్లాన్.. అపరిమిత కాలింగ్, ఉచిత రోమింగ్ కాల్స్, ఉచితంగా 200 ఇంటర్నేషనల్ నిమిషాలు, నెలంతా 220జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, 500జీబీ వరకు డేటా క్యారీ ఫార్వడ్ లిమిట్ -
జియోకు పోటీ : ప్లాన్స్ పై ఆర్‌కామ్ డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ : అన్న ముఖేష్ అంబానీ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో దెబ్బకు తమ్ముడు అనిల్ అంబానీ టెలికాం రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్‌కామ్) భారీగా అప్పులో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ నష్టాల్లోంచి బయటపడటానికి ఓ వైపు నుంచి వ్యూహాత్మక ప్లాన్స్ అమలు చేస్తూనే.. మరోవైపు నుంచి కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆర్‌కామ్ తమ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ పై ఏడాది పాటు డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. ఎంపికచేసిన పోస్టు పెయిడ్ ప్లాన్స్ పై 28 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఈ కొత్త ఆర్‌కామ్ ప్లాన్స్ ఢిల్లీ, ముంబై, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ లోని 4జీ యూజర్లకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ కొత్త ఆఫర్స్ తో 1జీబీ 4జీ డేటా అతి తక్కువకు రూ.11.1కే అందుబాటులోకి రానుంది. ఈ డిస్కౌంటెడ్ ఆర్‌కామ్ ప్లాన్స్ కూడా ఎవరైతే కంపెనీ పోర్టల్ rcom-eshop.com ద్వారా సబ్ స్క్రైబ్ అవుతారో వారికి మాత్రమేనని తెలిపింది. ఎంపికచేసిన నెలవారీ ప్లాన్స్ లో ఈ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్ తర్వాత నెలవారీ ప్లాన్స్ రూ.333, రూ.499కు అందుబాటులోకి వచ్చాయి. సబ్ స్క్రైబర్ కు ఈ డిస్కౌంటెడ్ ధరలు 12 నెలల పాటు ఆఫర్ చేయనున్నామని, డిస్కౌంట్ విలువ ఏడాదికి రూ.2400గా కంపెనీ పేర్కొంది. రిలయన్స్ జియో రూ.509 ప్లాన్ కు పోటీగా రూ.499 ప్లాన్ ను ఆర్‌కామ్ ఆఫర్ చేస్తోంది. దీనికింద 30జీబీ 3జీ,4జీ,2జీ డేటా, హోమ్ సర్కిల్ లో అపరిమిత వాయిస్ కాల్స్, 3000 ఉచిత ఎస్ఎంఎస్ లు, ఉచిత ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ రోమింగ్ కాల్స్ అందుబాటులో ఉంటున్నాయి. రూ.333 ప్లాన్ ను జియో రూ.309 ప్యాక్ కు పోటీగా తీసుకొచ్చింది. ఈ ప్లాన్ లో కూడా 30జీబీ 4జీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు, ఉచిత ఇన్ కమింగ్ రోమింగ్ కాల్స్, 1000 అవుట్ గోయింగ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ ను ఆఫర్ చేస్తోంది. అవుట్ గోయింగ్ కాల్స్ పరిమితి దాటితే నిమిషానికి 50 పైసలు వసూలు చేయనుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లతో తన నెట్ వర్క్ లోకి కొత్త సబ్ స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి ఆర్‌కామ్ ప్రయత్నిస్తోంది. వొడాఫోన్, ఎయిర్ టెల్, జియోల నుంచి వచ్చే పోటీని కూడా అధిగమించాలని చూస్తోంది. -
జియో ఎఫెక్ట్: 'వొడాఫోన్ రెడ్' అన్లిమిటెడ్ కాల్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లు, ఎయిర్ టెల్ అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్లతో ఇతర టెల్కోల్లో గుబులు మొదలైంది. దీంతో ప్రముఖ మొబైల్ టెలికామ్ ఆపరేటర్ వొడాఫోన్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను సంస్కరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వోడాఫోన్ రెడ్ ప్లాన్స్ మూడింటిలో కూడా దాదాపు అదే అఫర్లను అందిస్తోంది. ఈ ప్యాక్ లపైనా అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్ చేస్తోంది. ఇప్పటివరకు అపరిమిత ఉచిత కాల్స్ రూ 16.999 ల రీచార్జ్ పై అందిస్తోంది. కానీ ఇప్పుడు ఈ ఆఫర్లలో మార్పులు చేసి ఫ్రీ కాల్స్, అదనపు డాటాను అందుబాటులోకి తెచ్చింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం వొడాఫోన్ రెడ్ పోస్ట్ పెయిడ్ లో ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ప్లాన్ 1 రూ 499లకు లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 1 జీజీ డాటా ఉచితం. 2 జీబీ 4 జీ డాటా, 4 జీ మొబైల్స్ లో 3 జీబీ డాటా ఉచితం. దీంతోపాటు 100 ఎస్ఎంఎస్ లుకూడా ఉచితం. ప్లాన్ 2 రూ. 699 ప్లాన్ లో లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ , 5జీబీ 4జీ , లేదా 2.5జీబీ డాటా ఉచితం. 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితం. ప్లాన్ 3 రూ.399 ఎంపిక చేసినప్రాంతాల్లో అన్ లిమిటెడ్ కాలింగ్.. 1 జీబీ 4 జీ డాటా తోపాటు 100 ఎస్ఎంఎస్ లు అదనం. కాగా పోస్ట్ పెయిడ్ వినియోగదారులు, ఎంటర్ప్రైజ్ ఖాతాదారుల కనెక్షన్ల సంఖ్యను మరింత పెంచుకునే ప్రణాళికలో గతంలో వొడాఫోన్ రెడ్', ‘వొడాఫోన్ రెడ్ఫర్ బిజినెస్' పేర్లతో ఆల్ ఇన్ వన్ పథకాలను మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పోటీలో వినియోగదారులను నిలబెట్టుకునే క్రమంలో ఈ సరికొత్త పునరుద్ధరణను కంపెనీ చేపట్టింది.