బెస్ట్ పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేయడంలో భారతీ ఎయిర్‌టెల్ ఎల్లప్పుడు ముందు ఉంటుంది. కానీ ఎంట్రీ లెవల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల విషయంలో మాత్రం ఈ కంపెనీ, వొడాఫోన్ కంటే వెనుకంజలోనే ఉంది. వొడాఫోన్ రెడ్ రేంజ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 299 రూపాయల నుంచి ప్రారంభమవుతుంటే, భారతీ ఎయిర్‌టెల్ మైప్లాన్ ఇన్ఫినిటీ ప్లాన్‌ను 399 రూపాయలకు ఆఫర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్ తన రూ.399 ప్లాన్‌పై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. 399 రూపాయల ప్లాన్‌పై 300 రూపాయల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు పేర్కొంది. 50 రూపాయల చొప్పున ఈ డిస్కౌంట్‌ను ఆరు నెలల పాటు ఆఫర్ చేయనుంది. అంటే మొత్తంగా రూ.300 డిస్కౌంట్ లభించనుంది. దీంతో తర్వాత ఆరు నెలలు రూ.399 ప్లాన్ ధర రూ.349కు తగ్గనుంది. అయితే అదనపు పన్నులతో మాత్రం దీని ధర రూ.385గా ఉండనుందని ఎయిర్‌టెల్ చెప్పింది.
ఎయిర్‌టెల్ రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు....
ఈ ప్లాన్ కింద నెలకు 20 జీబీ డేటా పొందనున్నారు. డేటా క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీని ఎయిర్‌టెల్ ఆఫర్‌చేస్తోంది. ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితులు లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఇది అందిస్తోంది. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభ్యం కానున్నాయి. అదనంగా ఎయిర్‌టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఎయిర్‌టెల్ ఆఫర్‌చేస్తుంది. కానీ యూజర్లు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు అర్హులు కారు.
వొడాఫోన్ మాదిరి ఆఫర్ చేసేందుకు ఎయిర్‌టెల్ అదనంగా ప్రతి నెల 20 జీబీ డేటాను 12 నెలల పాటు అందిస్తుంది. దీంతో మొత్తంగా ఎయిర్‌టెల్ యూజర్లు 40జీబీ డేటా పొందుతారు.
Comments
Please login to add a commentAdd a comment