ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్ అధికారికంగా భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ సీరీస్ లైనప్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి. ఈ కొత్త ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందే మార్గం ఉంది. అదే యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్.
అసలేంటి యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్.. సింపుల్‌గా చెప్పాలంటే పాత ఐఫోన్‌లను ఇచ్చి కొత్త ఐఫోన్‌పై డిస్కౌంట్ పొందడం అన్నమాట. కస్టమర్‌లు తమ పాత ఐఫోన్‌లను ఇచ్చి కొత్త ఐఫోన్ 16పై గణనీయమైన తగ్గింపు పొందవచ్చు. అయితే ఇది ట్రేడ్ చేసే ఐఫోన్ మోడల్ , స్థితిని బట్టి ఉంటుంది.
ఐఫోన్ 16 బేస్ 128జీబీ మోడల్ రూ. 79,900 నుండి ప్రారంభమవుతుంది. దీనిపై యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ఆన్‌లైన్, యాపిల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 వంటి పాత మోడల్‌లను కూడా ఈ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
ఏ మోడల్‌తో ఎంత?
మీ వద్ద ఐఫోన్ 15 ఉంటే దీన్ని ఇచ్చి యాపిల్ ట్రేడ్-ఇన్ క్రెడిట్‌లో ఐఫోన్ 16పై రూ. 37,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఐఫోన్ 14 ఇచ్చేవారు రూ. 32,100 వరకు తగ్గింపును ఆశించవచ్చు. మీ వద్ద ఐఫోన్ 13 ఉంటే యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ గరిష్టంగా రూ. 31,000 వరకు క్రెడిట్‌ను అందిస్తుంది. ఐఫోన్ 12 ఇవ్వడం ద్వారా వినియోగదారులు ట్రేడ్-ఇన్ విలువలో రూ. 20,800 వరకు పొందవచ్చు. ఈ తగ్గింపులు ఫోన్ నిల్వ సామర్థ్యం, బ్యాటరీ స్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment