iPhone 16 series
-
భారత్‌లో యాపిల్ కొత్తగా నాలుగు అవుట్లెట్లు!
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ భారత్‌లో నాలుగు అవుట్లెట్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ తెలిపారు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ గతంలో కంటే 6 శాతం పెరిగి 94.9 బిలియన్ డాలర్ల(రూ.7.9 లక్షల కోట్లు)కు చేరిందని తెలిపారు.ఈ సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ ముదుపర్లను ఉద్దేశించి మాట్లాడారు. ‘యాపిల్ తాజా త్రైమాసిక ఫలితాల్లో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఐఫోన్ అమ్మకాలు జరిగాయి. భారతదేశంలో యాపిల్ సేల్స్ గరిష్ఠాలను చేరుకున్నాయి. ఇండియాలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే దేశంలో ముంబయి, ఢిల్లీలో రెండు అవుట్లెట్లను ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో మరో నాలుగు అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీంతో కంపెనీ రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?మంబయిలో యాపిల్ బీకేసీ, ఢిల్లీలో యాపిల్ సాకెత్ పేరుతో రెండు అవుట్లెట్లను గతంలో ప్రారంభించింది. బెంగళూరు, పుణె, ముంబయి, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ల్లో మరో నాలుగు కొత్త స్టోర్లను ప్రారంభించే యోచనతో ఉన్నట్లు గతంలో ప్రతిపాదించింది. తాజాగా కంపెనీ సీఈఓ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం. ఇటీవల కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌ను ఆవిష్కరించింది. వారం కిందట యాపిల్ ఐఓఎస్ 18.1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులకు వినూత్న ఫీచర్లను అందించినట్లు కంపెనీ తెలిపింది. -
'ఐఫోన్ 16 ప్రో'పై అసంతృప్తి
ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ కోసం చాలామంది జనం ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే.. శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న భారతీయ సంతతికి చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ ఆదిత్య అగర్వాల్ కొత్త ఐఫోన్ కొనుగోలు చేయడం సమయం వృధా అంటూ ట్వీట్ చేశారు.చాలామంది తమ వద్ద పాత ఐఫోన్స్ స్థానంలో కొత్త ఐఫోన్స్ భర్తీ చేస్తున్నారు. పాత ఐఫోన్ నుంచి కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం సమయం వృధా అంటూ తన ఎక్స్ వేదికగా యాపిల్ ఐఫోన్ 16 ప్రో పట్ల తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈయన ఐఫోన్ 14 ప్రో నుంచి ఐఫోన్ 16 ప్రోకు మారినట్లు వెల్లడించారు. కొత్త ఫోన్ తనను చాలా నిరాశపరిచింది అన్నారు.ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 16 ప్రో మధ్య ఉన్న వ్యత్యాసం చెప్పలేను, అయితే ఏఐ సామర్థ్యాల పరంగా ఐఫోన్ 15, 16 మధ్య ఎక్కడ తేడా ఉందో అర్థం కావడం లేదని అన్నారు. కొత్త ఫోన్ సరిగ్గా సెట్ చేయడానికి తనకు 24 గంటల సమయం పట్టిందని అన్నారు. టెక్ ఎగ్జిక్యూటివ్ చేసిన వ్యాఖ్యలతో కొందరు ఏకీభవించారు. ఇందులో ఒకరు కేవలం యూఎస్బీ-సీ ప్లగ్ కోసం మాత్రమే మారానని చెప్పుకొచ్చారు. మరొకరు కూడా కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం సమయం వృధానే అంటూ పేర్కొన్నారు.I "upgraded" from the iPhone 14 Pro to the iPhone 16 Pro.I literally cannot tell the difference. It took me 24 hours to set up the new phone properly etc. It just feels like a waste of time.And I do not understand where this "Apple Intelligence" is????— Aditya Agarwal (@adityaag) October 3, 2024ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ఈ నెలాఖరు నాటికి మరికొన్ని ఫీచర్స్యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఈ ఫోన్లలో కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత కల్పించింది. డిజిటల్ జీవితాలను సులభతరం చేయడానికి సంస్థ లేటెస్ట్ ఫీచర్స్ అందిస్తోంది. ఈ ఫోన్లో కొన్ని ఫీచర్స్ ఈ నెలాఖరు నాటికి వస్తాయని తెలుస్తోంది. -
భారత్‌లో యాపిల్ నాలుగు స్టోర్లు..? ఎక్కడంటే..
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో తన రిటైల్ స్టోర్లను విస్తరించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబయిలో రిటైల్ స్టోర్లను ప్రారంభించిన యాపిల్ మరో నాలుగు అవుట్లెట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగా ఉత్పాదకతను పెంచేలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. దేశీయంగా యాపిల్ ఉత్పత్తుల తయారీ కోసం ఫాక్స్‌కాన్, టాటా వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 20న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో దేశంలోని ముంబయి, ఢిల్లీ స్టోర్‌ల్లో భారీగా వినియోగదారుల రద్దీ నెలకొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఆసరాగా చేసుకుని కంపెనీ రెవెన్యూ పెంచుకోవాలని ఆశిస్తుంది. దేశంలో కొత్తగా బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయిలో రిటైల్ స్టోర్లు ప్రారంభించాలని యోచిస్తోంది. దాంతోపాటు ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను స్థానికంగా తయారు చేయాలనే ప్రతిపాదనలున్నట్లు కంపెనీ అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిడ్రే ఓబ్రియన్ మాట్లాడుతూ..‘భారత్‌లో సంస్థ రిటైల్ స్టోర్లు విస్తరించాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా మెరుగైన టీమ్‌ను సిద్ధం చేస్తున్నాం. మా కస్టమర్ల సృజనాత్మకత, అభిరుచికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారి ఇష్టాలకు అనువుగా సరైన ఉత్పత్తులను అందించడం సంస్థ బాధ్యత. స్థానికంగా స్టోర్లను పెంచడం ద్వారా మరింత ఎక్కువ మంది వినియోగదారులకు సేవలందించే అవకాశం ఉంటుంది’ అన్నారు. -
ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?
సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ముందుగా మార్చి 2025 వరకు దీన్ని యాపిల్ ఉత్పత్తుల్లో తీసుకురావాలని సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది. కానీ బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం సంస్థ గతంలో అనుకున్న సమయం కంటే ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.ఐఓఎస్ 18 సిరీస్‌లో యాపిల్ ఇంటెలిజన్స్ ద్వారా ‘సిరి’లో కొన్ని ఫీచర్లను అప్డేట్ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా మార్చి 2025 నాటికి ఐఓఎస్ 18.4 వెర్షన్లో సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. కానీ అంతకుముందే ఈ ఫీచర్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిసింది. సంస్థ గతంలో ప్రకటించిన విధంగా ఐఓఎస్ 18 సిరీస్ వర్షన్లను ఎప్పుడు అప్డేట్ చేస్తారో తెలిపారు.అక్టోబర్ 2024: ఐఓఎస్ 18.1 ఏఐ ఫీచర్లు ప్రారంభిస్తారు.డిసెంబర్ 2024: ఐఓఎస్ 18.2తో కొన్ని అదనపు ఫీచర్లు ప్రవేశపెడుతారు.జనవరి 2025: ఐఓఎస్ 18.3తో ‘సిరి’ని మరింత మెరుగుపరుస్తారు.మార్చి 2025: ఐఓఎస్ 18.4తో సమగ్ర యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్‌ను ప్రవేశపెడుతారు.బ్లూమ్‌బర్గ్ నివేదించిన ప్రకారంగా ముందుగానే యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్‌ను ఆవిష్కరిస్తే పైన తెలిపిన ఐఓఎస్ వర్షన్ల విడుదల తేదీల్లో మార్పులుండే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: కొత్తగా ఉద్యోగంలో చేరారా..? ఇవి తెలుసుకోండి..యాపిల్ ఇంటెలిజన్స్ ‘సిరి’లో గణనీయ మార్పులు చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందులో ప్రధానంగా సిరి సందర్భోచితంగా వినియోగదారుల అవసరాలు తీర్చనుంది. ఉదాహరణకు మీ స్నేహితుడు మొబైల్లో మీకు తన కొత్త చిరునామాను పంపితే ‘ఈ చిరునామాను తన కాంటాక్ట్ కార్డ్‌కు యాడ్ చేయమని’ చెబితే సిరి ఆ పని పూర్తి చేస్తుంది. సుదీర్ఘ ఈమెయిళ్లు చదవడం సమయంతో కూడుకున్న వ్యవహారం. సిరి సాయంతో దాని సారాంశాన్ని తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా రిప్లై ఇవ్వొచ్చు. వీటితోపాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ అధికారికంగా ప్రకటించిన తర్వాతే కంపెనీ అందించే ఫీచర్లపై స్పష్టత వస్తుంది. -
ఐఫోన్ 13 రూ.11కే..?
ఐఫోన్ 13 కేవలం రూ.11కే లభ్యమవుతోందని ఫ్లిప్‌కార్ట్‌లో వెలిసిన ప్రకటనపై కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఆర్డర్ పెట్టినా స్టాక్ అయిపోయిందని పాప్అప్ మెసేజ్ రావడంతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ మాధ్యమాల్లో వినియోగదారులు పెడుతున్న పోస్టులుకాస్తా వైరల్‌గా మారుతున్నాయి.ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 22న రాత్రి 11 గంటలకు కేవలం రూ.11కే ఐఫోన్ 13 బుక్ చేసుకోవచ్చనేలా బ్యానర్లు వెలిశాయి. దాంతో వినియోగదారులు సరిగ్గా రాత్రి 11 గంటలకు ఆర్డర్ పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సమయంలో స్టాక్ అయిపోయిందని పాప్అప్ మెసేజ్ రావడం గమనించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే తంతు కొనసాగడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. దాంతో వివిధ సామాజిక మాధ్యమాల్లో విభిన్నరీతిలో స్పందించారు.Flipkart Deserves Belt Treatment From GovtThey Put a Banner of iPhone 13 at Just ₹11Product Went Out of Stock But Helps Them in Free Marketing On Social Media, WhatsAppIn Other Countries, They’ll Pay Penalty For Such Malpractices On The Name of Sale & Discount— Ravisutanjani (@Ravisutanjani) September 22, 2024 ‘ఫ్టిప్‌కార్ట్ వినియోగదారులను తప్పదోవ పట్టించేలా ప్రకటనలు విడుదల చేస్తుంది. వాట్సప్, సోషల్ మీడియాలో ఉచిత పబ్లిసిటీ కోసం దిగుజారుతుంది. ఇతరదేశాల్లో ఇలా చీప్ ట్రిక్స్ అమలు చేస్తే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి’ అని ఒకరు స్పందించారు. ‘ఈ ఆఫర్ నిజంగా నిరాశపరిచింది. నిత్యం తప్పుడు ప్రకటనలు వస్తూన్నాయి. సంస్థ దీనిపై తగిన విధంగా స్పందించాలి. తప్పుదోవ పట్టించే ప్రచారాలకు ఫ్లిప్‌కార్ట్ బాధ్యత వహించాలి’ అని ఇంకొక యూజర్ తెలిపారు. ‘వాహ్ తర్వాత ఏమిటి? మ్యాక్‌బుక్ ప్రో రూ.11?’ అని మరో యూజర్ స్పందించారు. ఏదేమైనా, తప్పు ఎవరు చేసినా దానికి ఫ్లిప్‌కార్ట్ బాధ్యత వహించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ఇదీ చదవండి: ఏఐకు కొత్త అర్థం చెప్పిన ప్రధానిఇటీవల ఐఫోన్ 16 సిరీస్ అమ్మకాలు ప్రారంభించిన యాపిల్ దానికంటే ముందు మోడళ్ల రేట్లను తగ్గిస్తుందనే వార్తలు వస్తున్నాయి. దాంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో ఇలాంటి ప్రకటనలు చూసి చాలా మంది వినియోగదారులు తక్కువ ధరకే ఇస్తున్నారని భ్రమపడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఆఫర్ ప్రకటించినపుడు విభిన్న ప్లాట్ఫామ్ల్లో ఆ మోడల్ ధరను పోల్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నమ్మశక్యంగా లేని ఆఫర్‌గా అనిపిస్తే ఆ ప్రకటన ఇస్తున్న కంపెనీ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి వివరాలు ధ్రువీకరించుకోవాలని సూచిస్తున్నారు. కంపెనీలు కూడా కస్టమర్లను తప్పుదోవ పట్టించే ప్రకటనలు నిలిపేయాలని చెబుతున్నారు. -
వామ్మో.. ఐఫోన్ 16 ని 10 నిమిషాల్లో డెలివరీ చేయనున్న టాటా గ్రూప్
-
ఐఫోన్ 16పై రూ.37,900 డిస్కౌంట్! ఎలాగంటే..
ఐఫోన్ 16 (iPhone 16) సిరీస్ అధికారికంగా భారతీయ మార్కెట్లోకి వచ్చింది. ఈ సీరీస్ లైనప్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడల్స్ ఉన్నాయి. ఈ కొత్త ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ పొందే మార్గం ఉంది. అదే యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్.అసలేంటి యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్.. సింపుల్‌గా చెప్పాలంటే పాత ఐఫోన్లను ఇచ్చి కొత్త ఐఫోన్‌పై డిస్కౌంట్ పొందడం అన్నమాట. కస్టమర్లు తమ పాత ఐఫోన్లను ఇచ్చి కొత్త ఐఫోన్ 16పై గణనీయమైన తగ్గింపు పొందవచ్చు. అయితే ఇది ట్రేడ్ చేసే ఐఫోన్ మోడల్ , స్థితిని బట్టి ఉంటుంది.ఐఫోన్ 16 బేస్ 128జీబీ మోడల్ రూ. 79,900 నుండి ప్రారంభమవుతుంది. దీనిపై యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ఆన్లైన్, యాపిల్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఐఫోన్ 12 వంటి పాత మోడల్లను కూడా ఈ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.ఏ మోడల్‌తో ఎంత?మీ వద్ద ఐఫోన్ 15 ఉంటే దీన్ని ఇచ్చి యాపిల్ ట్రేడ్-ఇన్ క్రెడిట్లో ఐఫోన్ 16పై రూ. 37,900 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఐఫోన్ 14 ఇచ్చేవారు రూ. 32,100 వరకు తగ్గింపును ఆశించవచ్చు. మీ వద్ద ఐఫోన్ 13 ఉంటే యాపిల్ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ గరిష్టంగా రూ. 31,000 వరకు క్రెడిట్‌ను అందిస్తుంది. ఐఫోన్ 12 ఇవ్వడం ద్వారా వినియోగదారులు ట్రేడ్-ఇన్ విలువలో రూ. 20,800 వరకు పొందవచ్చు. ఈ తగ్గింపులు ఫోన్ నిల్వ సామర్థ్యం, బ్యాటరీ స్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి. -
10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ సేల్స్ మొదలైపోయాయి. దేశంలోని పలు యాపిల్ స్టోర్లు కస్టమర్లతో కిటకిలాడాయి. చాలామంది ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 సిరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి నిత్యావసరాల సరఫరాదారు బిగ్ బాస్కెట్, బ్లింకిట్ సిద్ధమయ్యాయి. బుక్ చేసుకున్న కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేసి కస్టమర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.బిగ్ బాస్కెట్ఈ రోజు ఉదయం 8:00 గంటలకు ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. బిగ్ బాస్కెట్ దానిని 8:07 గంటలకు కస్టమర్ చేతికి అందించింది. అంటే కేవలం 7 నిమిషాల్లోనే డెలివరీ చేసింది. ఈ విషయాన్ని సీఈఓ హరి మీనన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఐఫోన్ డెలివరీ కోసం బిగ్ బాస్కెట్ ఎలక్ట్రానిక్ పరికరాల సేల్స్ విభాగం క్రోమాతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ వేగవంతమైన డెలివరీలు ఎంపిక చేసిన నగరాలకు (ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై) మాత్రమే పరిమితమై ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్ కొనుగోలు మీద ఎలాంటి ఆఫర్లను బిగ్ బాస్కెట్ ప్రకటించలేదు.Today’s the day!At 8:00 am, the first iPhone 16 order hit Bigbasket Now. By 8:07 am, it was in our customer’s hands. Yes, just 7 minutes from checkout to unboxing!We’re now serving more than groceries before you finish your morning coffee.Stay tuned, big things are on the… pic.twitter.com/J3uKHkkwk2— Hari Menon (@harimenon_bb) September 20, 2024ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్బ్లింకిట్బ్లింకిట్ కూడా ఐఫోన్ 16 సీరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి రంగంలోకి దిగింది. దీని కోసం కంపెనీ యూనికార్న్ సోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ బుక్ చేసుకున్న 10 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ఎస్బీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డులపైన రూ. 5000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం బ్లింకిట్ వేగవంతమైన డెలివరీలు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, బెంగళూరుకు మాత్రమే పరిమితమయ్యాయి.Get the all-new iPhone 16 delivered in 10 minutes!We’ve partnered with @UnicornAPR for the third year in a row, bringing the latest iPhone to Blinkit customers in Delhi NCR, Mumbai, Pune, Bengaluru (for now) — on launch day!P.S - Unicorn is also providing discounts with… pic.twitter.com/2odeJPn11k— Albinder Dhindsa (@albinder) September 20, 2024 -
ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్ ఇతనే..
ప్రపంచంలో ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖరీదైనా కొనడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఐఫోన్ 16 సిరీస్ విడుదలైంది. దీంతో ముంబైలోని యాపిల్ స్టోర్‌కు కస్టమర్లు పోటెత్తారు. స్టోర్ తెరవక ముందు నుంచే బారులు తీరారు.ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు స్థానిక స్టోర్‌లో ఐఫోన్ 16 అందుకున్న తొలి కస్టమర్‌గా మారాడు. ఇందు కోసం ముందు రోజే ఆయన ముంబైలోని బీకేసీలో ఉన్న యాపిల్ స్టోర్ వద్దకు చేరుకున్నాడు. 21 గంటల పాటు లైన్లో వేచి ఉన్నాడు. ముందు రోజు రాత్రి ఉజ్వల్ అక్కడికి చేరుకోగానే పదుల సంఖ్యలో జనం క్యూలో అతనితో చేరారు. ఉదయానికి వందల మంది వచ్చేశారు. యాపిల్ స్టోర్ తలుపులు తెరుచుకోగానే ఉజ్వల్ మొదటి కస్టమర్‌గా లోపలికి అడుగుపెట్టాడు.యాపిల్ అభిమాని అయిన ఉజ్వల్ ఐఫోన్ తొలి కస్టమర్ కావడం ఇదే మొదటిసారి కాదు. కొత్త ఐఫోన్ విడుదలైన ప్రతిసారి ముందు వరుసలో ఉంటుంటాడు. గత సంవత్సరం ఐఫోన్ 15 విడుదలైనప్పుడు కూడా కొనుగోలు చేయడానికి మొదటి వ్యక్తిగా 17 గంటలు వేచి ఉన్నాడు. యాపిల్ ఉత్పత్తుల పట్ల అతనికున్న క్రేజ్ ఎలాంటిదో దీన్ని బట్టి తెలుస్తోంది. -
యాపిల్ బ్యాటరీ బుల్లెట్‌ప్రూఫ్!
ప్రపంచ నం.1 కంపెనీగా చలామణి అవుతున్న యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టెక్ పరిశ్రమలో ఈ కంపెనీ గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. యాపిల్ కంపెనీ ఈరోజు (సెప్టెంబర్ 20) ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు ప్రారంభించింది. దాంతో మొబైల్ అవుట్లెట్ల వద్ద భారీగా కస్టమర్లు బారులు తీరారు. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఇటీవల ‘ఇట్స్గ్లోటైమ్’ ట్యాగ్‌లైన్‌తో జరిగిన ఈవెంట్లో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. అటువంటి సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్ అతిపెద్ద సంస్థ.కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది.యాపిల్ కో-ఫౌండర్‌లో ఒకరైన రొనాల్డ్‌వేన్ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్ విలువ 35 బిలియన్ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు).ఇదీ చదవండి: అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులుప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్‌లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్‌ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది.యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి.యాపిల్ మాక్‌బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్‌ప్రూఫ్.యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు.స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్ డాలర్(ప్రస్తుతం రూ.83). -
అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులు
ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. యాపిల్ ఇటీవల ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 20 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. దాంతో ముంబయిలోని యాపిల్ అవుట్లెట్ ముందు కస్టమర్లు ఉదయం నుంచే బారులు తీరారు. ఎప్పుడెప్పుడు ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలా అని వేచిచూస్తున్నారు. ఈమేరకు ముంబయిలోని యాపిల్ స్టోర్ ముందు వినియోగదారుల రద్దీని తెలియజేస్తూ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఏదో అన్నదానం కోసం వచ్చిన వారిలా గుంపులుగా చేరి స్టోర్‌లోకి పరుగెత్తుతూ వీడియోలో కనిపించారు. ఇదికాస్తా వైరల్‌గా మారింది.ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ కోసం ముంబైలోని యాపిల్ స్టోర్‌కు జనం భారీగా వచ్చారు. ఉదయాన్నే స్టోర్ వద్ద లైన్లో నిల్చున్నారు. pic.twitter.com/hEIPKSoSGT— greatandhra (@greatandhranews) September 20, 2024భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలుఐఫోన్ 16128 జీబీ: రూ.79900256 జీబీ: రూ.89900512 జీబీ: రూ.109900ఐఫోన్ 16 ప్లస్128 జీబీ: రూ.89900256 జీబీ: రూ.99900512 జీబీ: రూ.119900ఐఫోన్ 16 ప్రో128 జీబీ: రూ.119900256 జీబీ: రూ.129900512 జీబీ: రూ.1499001 టీబీ: 169900ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్256 జీబీ: రూ.144900512 జీబీ: రూ.1649001 టీబీ: రూ.184900ఇదీ చదవండి: టెలికాం కంపెనీల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు -
ఐఫోన్ 16 సిరీస్ సేల్స్ నేటి నుంచే..
న్యూఢిల్లీ: ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్ల విక్రయాలు భారత్‌లో నేటి నుంచి (సెప్టెంబర్ 20) ప్రారంభం కానున్నట్లు యాపిల్ వర్గాలు తెలిపాయి. ప్రో సిరీస్‌ను భారత్‌లో తెలిసారిగా అసెంబ్లింగ్ చేసే యోచనలో కంపెనీ ఉందని సమాచారం.ఇటీవలి బడ్జెట్లో దిగుమతి సుంకం తగ్గిన నేపథ్యంలో తొలిసారిగా గత సిరీస్ కన్నా కొత్త ప్రో సిరీస్ ఫోన్లను యాపిల్ తక్కువ రేటుకు విక్రయించనుంది. దేశీయంగా ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,19,000 నుంచి, ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,44,900 నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.గతేడాది ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900 నుంచి, ప్రో మ్యాక్స్ రేటు రూ. 1,59,900 నుంచి మొదలైంది. మరోవైపు, తాజా ఐఫోన్ 16 రేటు రూ. 79,900 నుంచి, 16 ప్లస్ ధర రూ. 89,900 నుంచి ప్రారంభమవుతుంది. యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు 128 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజీతో లభిస్తాయి. -
ఐఫోన్ 16 సిరీస్ ఫ్రీ-బుకింగ్స్: ఇలా బుక్ చేసుకోండి
యాపిల్ ఇటీవల తన ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఇప్పుడు సెప్టెంబర్ 13 నుంచి భారతదేశంలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ జాబితాలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. వీటిని వివిధ మార్గాల్లో బుక్ చేసుకోవచ్చు.ఫ్రీ ఆర్డర్ ఎక్కడ చేయాలంటే..యాపిల్ స్టోర్ ఆన్లైన్యాపిల్ స్టోర్ బీకేసీ, ముంబైయాపిల్ స్టోర్ సాకేత్, ఢిల్లీఅమెజాన్ఫ్లిప్కార్ట్క్రోమావిజయ్ సేల్స్రిలయన్స్ డిజిటల్యూనికార్న్ స్టోర్స్ఇమాజిన్ స్టోర్స్ ఆప్రోనిక్ స్టోర్స్మాపుల్ స్టోర్స్ఐప్లానెట్ స్టోర్స్ఐకాన్సెప్ట్ స్టోర్స్పైన పేర్కొన్న స్టోర్లలలో లేదా అధికారిక వెబ్సైట్లలో ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండటం మంచింది. ఎందుకంటే అధికారిక వెబ్‌సైట్స్ మాదిరిగానే ఉంటూ.. పలువురు సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశం ఉంది.డిస్కౌంట్ వివరాలుఐఫోన్ 16 సిరీస్ బుక్ చేసుకునేవారు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుంటే రూ. 5000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ 16 సిరీస్ అన్ని మోడళ్లకు వర్తిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకునే వారు మూడు లేదా ఆరు నెలల పేమెంట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. యాపిల్ ట్రేడ్ ఇన్ ప్రోగ్రాం కింద ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 4000 నుంచి రూ. 67500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలుఐఫోన్ 16128 జీబీ: రూ. 79900256 జీబీ: రూ. 89900512 జీబీ: రూ. 109900ఐఫోన్ 16 ప్లస్128 జీబీ: రూ. 89900256 జీబీ: రూ. 99900512 జీబీ: రూ. 119900ఐఫోన్ 16 ప్రో128 జీబీ: రూ. 119900256 జీబీ: రూ. 129900512 జీబీ: రూ. 1499001 టీబీ: 169900ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్256 జీబీ: రూ. 144900512 జీబీ: రూ. 1649001 టీబీ: రూ. 184900 -
ఐఫోన్ 16 వచ్చిందోచ్ (ఫొటోలు)
-
ఐఫోన్ 16 వచ్చేసింది..
క్యుపర్టినో, అమెరికా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా కృత్రిమ మేథ ఆధారిత ఐఫోన్ 16 స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో 4 మోడల్స్ (ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మ్యాక్స్) ఉన్నాయి. ఐఫోన్ 16 ధర 799 డాలర్ల(సుమారు రూ.69000) నుంచి,16 ప్లస్ ధర 899 డాలర్ల(రూ.76000) నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్16లో ఐఫోన్ 15 కన్నా 30 శాతం వేగంగా పనిచేసే, 30 శాతం తక్కువ శక్తిని ఉపయోగించే 6–కోర్ ఏ18 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ల సైజు 6.1 అంగుళాల నుంచి 6.9 అంగుళాల వరకు ఉంటుంది. భారీ జనరేటివ్ మోడల్స్‌ను ఉపయోగించేందుకు అనువుగా ఐఫోన్ 16 కోసం సరికొత్త ఏ18 చిప్‌ను తయారు చేశారు. గ్లోటైమ్ పేరిట నిర్వహించిన ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్, కొత్త తరం ఐఫోన్లను యాపిల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించినట్లు చెప్పారు. ప్రత్యేకంగా రూపొందించిన సర్వర్లపై యాపిల్ ఇంటెలిజెన్స్ పని చేస్తుందని పేర్కొన్నారు. కస్టమైజ్ చేసుకోతగిన యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 16లో 48 ఫ్యూజన్ కెమెరా ఉంటుంది. కొత్తగా యాపిల్ వాచ్ సిరీస్ 10ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. వీటి ధర 399 డాలర్ల నుంచి ఉంటుంది. సెప్టెంబర్ 20 నుంచి ఇవి లభ్యమవుతాయి. -
యాపిల్ ఫస్ట్ ఇండియన్ యాడ్ ఇదే.. చూశారా?
ఎంతగానో ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఈ రోజు (సెప్టెంబర్ 9) లాంచ్ కానుంది. 'ఇట్స్ గ్లోటైమ్' పేరుతో కాలిఫోర్నియాలోని యాపిల్ కుపెర్టినో పార్క్‌లో జరగనున్న కార్యక్రమంలో ఈ ఫోన్‌ను కంపెనీ చీఫ్ టిమ్ కుక్ ప్రారంభించనున్నారు.కంపెనీ 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్‌ను ప్రారంభించడానికి ముందే.. యాపిల్ కంపెనీ ఇంటర్నెట్లో ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు సమీర్ సోనీ నటించిన ఈ యాడ్ టెక్ ఔత్సాహికులను, అభిమానులను ఎంతగానో ఆకర్శించింది. ఈ యాడ్ గమనిస్తే.. ఇది ఒక సాధారణ కార్పొరేట్ ఆఫీసులో 1996లో జరిగిన సన్నివేశం అని తెలుస్తోంది.టీవీ1 ఇండియా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో షేర్ చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 10 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించినట్లు తెలుస్తోంది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను గమనిస్తే యాపిల్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.Found Apple's 1st (?) Indian ad film for the Power Macintosh, apparently aired on Doordarshan in 1996 — a full twenty years before it started making India-focussed iPhone ads again in 2016. pic.twitter.com/gHx0mzYtkx— Neil (@neilshroff) November 29, 2023యాపిల్ ఐఫోన్ 16 సిరీస్యాపిల్ ఈరోజు 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లాంఛ్ అవుతాయని సమాచారం. ఈ ఫోన్స్ 6.1 ఇంచెస్ నుంచి 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే పొందనున్నట్లు.. బ్లూ, గ్రీన్, రోస్, వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఐఫోన్ 16 ప్రో బ్రౌన్ కలర్ పొందనున్నట్లు సమాచారం. దీనిని డెసర్ట్ టైటానియం అని పిలుస్తారు. దీంతితో పాటు గోల్డ్ కలర్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 వరకు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్ 2x ఆప్టికల్ 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి వాటిని పొందే అవకాశం ఉంది. ఈ 16 సిరీస్ మోడల్స్ ఏ18 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది ఏఐకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. -
అద్భుత ఫీచర్లతో ఐఫోన్ 16 !
పుస్తకం హస్తభూషణం అనేది పాత మాట. చేతికో చక్కని స్మార్ట్‌ఫోన్ అనేది నవతరం మాట. మెరుపువేగంతో ఇంటర్నెట్, స్పష్టమైన తెరలు, అదిరిపోయే సౌండ్, వేగంగా పనికానిచ్చే చిప్, రామ్లుండే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ కోసం జనం ఎగబడటం సర్వసాధారణమైంది. మార్కెట్లోకి కొత్త ఫోన్ వస్తోందంటే చాలా మంది దాని కోసం వెయిట్ చేస్తారు. అందులోనూ యాపిల్ కంపెనీ వారి ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ సిరీస్‌లో కొత్త మోడల్ వస్తోందంటే టెక్ ప్రియులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. వారి నిరీక్షణకు శుభం పలుకుతూ నేడు అమెరికాలోని కుపర్టినో నగరంలో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్లను యాపిల్ ఆవిష్కరిస్తోంది. తమ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్ ఏటా యాపిల్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి విశేషమైన క్రేజ్ ఉంది. ఏటా సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం తెల్సిందే. యాపిల్ ఇన్నేళ్లలో వందల కోట్ల ఐఫోన్లను విక్రయించింది. అయితే కొత్త మోడల్ తెచ్చినప్పుడు దాంట్లో చాలా స్వల్ప స్థాయిలో మార్పులు చేసి కొత్తగా విడుదలచేసింది. దాంతో పెద్దగా మార్పులు లేవని తెలిసి ఇటీవలి కాలంలో యాపిల్ ఫోన్ల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. దీంతో యాపిల్ ఈసారి కృత్రిమ మేథ మంత్రం జపించింది. కొత్త సిరీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎక్కువగా వాడినట్లు వార్తలొచ్చాయి. దీంతో 17 ఏళ్లలో తొలిసారిగా ఐఫోన్లో విప్లవాత్మక మార్పులు చేసుకోబో తున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా లోని స్టీవ్ జాబ్స్ థియేటర్లో జరిగే యాపిల్ ఈవెంట్ యూట్యూబ్‌లో ప్రత్యక్షప్రసారంకానుంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఓస్ 18తో పాటు ఇతర సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇచ్చే ఛాన్సుంది. 16 సిరీస్ మోడళ్లలో యాక్షన్ బటన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రో మోడల్స్‌లో మాత్రమే యాక్షన్ బటన్ ఇచ్చారు. కొత్త తరం హార్డ్‌వేర్, ఏఐతో రూపొందిన ఐఫోన్లు యూజర్లను తెగ ఆకట్టుకుంటాయని యాపిల్ సంస్థ భావిస్తోంది. కొత్త ఏఐ ఆధారిత ఫోన్లతో ఫోన్ల విక్రయాలు ఊపందుకోవచ్చు. ఈ వార్తలతో ఇప్పటికే జూన్నుంచి చూస్తే కంపెనీ షేర్ విలువ స్టాక్మార్కెట్లో 13 శాతం పైకి ఎగసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ మరో 400 బిలియన్ డాలర్లు పెరిగింది. – వాషింగ్టన్ -
ఇట్స్ గ్లోటైమ్: యాపిల్ మెగా ఈవెంట్ రేపే
యాపిల్ 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్ రేపు (సెప్టెంబర్ 9) ప్రారంభమవుతుంది. ఈ ఈవెంట్లో కంపెనీ తన ఐఫోన్ 16 సిరీస్, వాచ్ సిరీస్ 10ను కూడా లాంచ్ చేయనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం కాలిఫోర్నియాలోని యాపిల్ కుపెర్టినో పార్క్‌లో జరుగుతుంది. యాపిల్ అధికారిక వెబ్సైట్, యూట్యూబ్, యాపిల్ టీవీ యాప్ ద్వారా ఈ ఈవెంట్ లైవ్ చూడవచ్చు.గ్లోటైమ్ ఈవెంట్లో.. యాపిల్ చీఫ్ టిమ్ కుక్ కొత్త ఐఫోన్ పరికరాలను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇందులో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉండనున్నాయి. వీటికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికానప్పటికీ కొన్ని పుకార్లు లేదా లీక్స్ ద్వారా కొన్ని విషయాలు వెల్లడయ్యాయి.బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లను భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు సమాచారం. కాబట్టి మనదేశంలో ఈ పరికరాల రిటైల్ ధర కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంది.యాపిల్ ఐఫోన్ 16 సిరీస్యాపిల్ ఐఫోన్ 16 సిరీస్.. 6.1 ఇంచెస్ నుంచి 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే పొందనున్నట్లు సమాచారం. ఈ ఫోన్లు బ్లూ, గ్రీన్, రోస్, వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఐఫోన్ 16 ప్రో బ్రౌన్ కలర్ పొందనున్నట్లు సమాచారం. దీనిని డెసర్ట్ టైటానియం అని పిలుస్తారు. దీంతితో పాటు గోల్డ్ కలర్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఇదే మార్గం: నితిన్ గడ్కరీ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 వరకు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్ 2x ఆప్టికల్ 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి వాటిని పొందే అవకాశం ఉంది. ఈ 16 సిరీస్ మోడల్స్ ఏ18 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది ఏఐకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. -
ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అప్పుడే.. ధర ఎంతంటే?
యాపిల్ తన కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్లో ఆవిష్కరించనుంది. మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా.. ఎయిర్ పాడ్స్, స్మార్ట్‌వాచ్ వంటి వాటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. యాపిల్ ఐప్యాడ్ మినీ 7ను కూడా కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉందని చెబుతున్నారు.యాపిల్ ఐఫోన్ 16 సిరీస్యాపిల్ ఐఫోన్ 16 సిరీస్.. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే పొందనున్నట్లు సమాచారం. ఇందులో మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 వరకు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్ 2x ఆప్టికల్ 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వంటి వాటిని పొందే అవకాశం ఉంది. ఈ 16 సిరీస్ మోడల్స్ ఏ18 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది ఏఐకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.యాపిల్ ఐప్యాడ్ మినీ 7కంపెనీ విడుదల చేయనున్న యాపిల్ ఐప్యాడ్ మినీ 7.. 60Hz రిఫ్రెష్ రేట్ రిజల్యూషన్‌తో అదే 8.3 ఇంచెస్ లిక్విడ్ రెటినా డిస్ప్లేను పొందవచ్చు. ర్యామ్ 4 జీబీ నుంచి 8 జీబీకి అప్‌గ్రేడ్ పొందుతుంది. దీని ధర వంటి వివరాలు లాంచ్ సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
యాపిల్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ ఏటా నిర్వహించే ‘యాపిల్ ఈవెంట్’ తేదీని ప్రకటించింది. ముందుగా ఈ ఈవెంట్‌ను సెప్టెంబర్ 10న నిర్వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్ జరుపుతామని ప్రకటించారు. కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది.యాపిల్ కంపెనీ ఈ ఈవెంట్లో తమ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు. ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ దిగ్గజ కంపెనీ ఎలాంటి టెక్నాలజీపై పనిచేస్తుందో ఇతర కంపెనీలు ఒక అంచనాకు వస్తాయి. అందుకు తగ్గట్టుగా ఆయా సంస్థలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేర్పులు చేస్తుంటాయి. అందుకే ఈ ఈవెంట్‌కు చాలా ఆదరణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏటా సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 12న కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న దీన్ని ఏర్పాటు చేయాలని ముందుగా ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఒకరోజు ముందే సెప్టెంబర్ 9న ఈ ఈవెంట్‌ను జరుపుతున్నట్లు ప్రకటించారు.ఇదీ చదవండి: టెలిగ్రామ్‌ను నిషేధిస్తారా..? సీఈఓ అరెస్టు!ఈ కార్యక్రమంలో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్, యాపిల్ వాచ్, మ్యాక్‌బుక్, ఎయిర్‌పాడ్స్‌లో కొత్త ఫీచర్లు, రాబోయే మార్పుల గుర్తించి తెలియజేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలాఉండగా, ఈ ఈవెంట్‌కు ‘ఇట్స్ గ్లోటైమ్’ అనే ట్యాగ్ లైన్‌ను జత చేశారు. దాంతో ఈ కార్యక్రమంపై అంచనాలు పెరుగుతున్నాయి. -
ఐఫోన్ 16 సిరీస్.. లాంచ్ ఎప్పుడంటే?
ప్రతి సంవత్సరం యాపిల్ కంపెనీ కొత్త సిరీస్ లాంచ్ చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా సంస్థ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌లను రాబోయే రోజుల్లో యాపిల్ నిర్వహించనున్న ఈవెంట్లో ఆవిష్కరించనున్నారు.గత ఏడాది యాపిల్ తన ఐఫోన్ 15 సిరీస్‌ను సెప్టెంబర్ 12న ఆవిష్కరించింది. దీన్ని బట్టి చూస్తే వచ్చే సెప్టెంబర్ నెలలో ఐఫోన్ 16 సిరీస్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్లలో అప్డేటెడ్ ఫీచర్స్ ఉండనున్నట్లు సమాచారం. ఐఫోన్ 16 సిరీస్ మొబైల్స్ హై-ఎండ్ ఫీచర్లకు సపోర్ట్ చేయడానికి ఏ18 ప్రో పొందనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16 సీరీస్‌తో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ ఐఓఎస్ 18 కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.గత సంవత్సరం యాపిల్ ఐఫోన్ 15 ప్రో కోసం యాక్షన్ బటన్ పరిచయం చేసింది. అయితే ఈ ఫీచర్ వనిల్లా ఐఫోన్ 15లో లేదు. కానీ ఐఫోన్ 16 ప్రో మోడళ్లలో ఈ యాక్షన్ బటన్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. దీనితోపాటు క్యాప్చర్ బటన్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఫోటో టేకింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రెండూ కూడా ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే కూడా పెద్ద డిస్ప్లేలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో డిస్ప్లే 6.1 ఇంచెస్ నుంచి 6.3 ఇంచెస్‌కు పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 16 ప్రో మాక్స్ 6.7 ఇంచెస్ నుంచి 6.9 ఇంచెస్ డిస్ప్లే పొందవచ్చు. వీటి బరువు కూడా దాని మునుపటి మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. -
యాపిల్ కీలక ప్రకటన.. ఐఫోన్ 16లో గూగుల్ జెమినీ!
యాపిల్ కంపెనీ తన ఐఫోన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను మెరుగుపరచడానికి కొత్త భాగస్వామ్యాన్ని ప్రకటించనుంది. గూగుల్ జెమినీ ఏఐని ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ లైనప్‌తో సహా దాని తర్వాతి తరం ప్లాట్‌ఫారమ్‌లలోకి అనుసంధానం చేయడం కోసం యూఎస్ బేస్డ్ టెక్ దిగ్గజం గూగుల్‌తో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో ఏఐ కోసం యాపిల్ కంపెనీ మెటాతో చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలం కావడంతో.. సంస్థ గూగుల్ జెమిని కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. ఐఫోన్ 16లో గూగుల్ జెమినీ అందుబాటులో రానుంది. ఆ తరువాత యాపిల్ ఫోన్లు అన్నీ కూడా గూగుల్ జెమినీ ఏఐ పొందే అవకాశం ఉందని సమాచారం.యాపిల్ గూగుల్ జెమినినీ ఆన్‌బోర్డ్ చేసినట్లయితే.. ఐఓఎస్, మ్యాక్ఓఎస్ వినియోగదారులు ఇద్దరూ కూడా ఈ మూడు చాట్బాట్లను ఉపయోగించుకోవచ్చు. అయితే యాపిల్ యూజర్ ఏది ఉపయోగించుకోవాలో అనే విషయాన్ని ముందుగానే నిర్దారించుకోవచ్చు. కాబట్టి యూజర్ ఇష్టానుసారంగానే ఏ ఇంటెలిజెన్స్ అయినా ఉపయోగించుకోవచ్చు.జూన్‌లో యాపిల్ యాన్యువల్ డెవలపర్ ఫోకస్డ్ ఈవెంట్.. వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో తన సొంత ఏఐ ఫీచర్ల సూట్‌ను ఆవిష్కరించింది. దీనిని సమిష్టిగా యాపిల్ ఇంటెలిజెన్స్ అని పిలుస్తారు. ఇది ప్రస్తుతానికి ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉంది. -
ఐఫోన్ లవర్స్‌కి గుడ్‌న్యూస్
యాపిల్ ఐఫోన్ ప్రియులకు శుభవార్త. త్వరలో మార్కెట్‌కి పరిచయం కానున్న ఐఫోన్ 16 తయారీ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్ 15 విడుదలైన మరుక్షణం నుంచి ఐఫోన్ 16 ఇలా ఉండబోతుందంటూ రకరకాల డిజైన్లను ప్రస్తావిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తయారీ ప్రారంభంతో ఆ ఫోన్ డిజైన్‌పై స్పష్టత రానుంది.ఐ ఫోన్ డిస్ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చే నెల నుంచి తయారీ ప్రారంభం కానుందని ట్వీట్ చేశారు. ఐఫోన్ 16 మోడళ్లను హై-ఎండ్ వేరియంట్ల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని తెలుస్తోంది. కాగా, గత ఏడాది ఐఫోన్ 15 సిరీస్ తయారీ ఆగస్ట్ నెలలో ప్రారంభం కాగా.. ఈ లేటెస్ట్ వెర్షన్ అంతకంటే ముందే మ్యానిఫ్యాక్చరింగ్కు సిద్ధమైంది. ఐఫోన్ 16 భారత్‌లో తయారవుతుందా? మరి యాపిల్ సంస్థ ఐఫోన్ 16ను భారత్‌లో తయారు చేస్తుందా? లేదా? అనే అంశంపై స్పష్టత రానప్పటికీ ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15లు మాత్రం దేశీయంగా తయారయ్యాయి.ఐఫోన్ 15 సిరీస్ ధరెంతంటేగతేడాది విడుదలైన ఐఫోన్ 15 ప్రో మోడల్ ధర రూ.1,34,900 నుండి ప్రారంభమవుతుండగా.. ప్రో మాక్స్ ధర రూ. 1,59,900. 128జీబీ స్టోరేజ్ ఐఫోన్ 15మోడల్ ధర భారత్‌లో రూ. 79,900, ప్లస్ మోడల్ రూ. 89,900కే మార్కెట్లో లభ్యమవుతుంది. ఐఫోన్ 16 సిరీస్.. చాలా కాస్ట్ గురూ..!అయితే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ ధరలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా. ఎందుకంటే ఇటీవలి నిక్కీ ఆసియా మ్యాగిజైన్ ఇంటర్వ్యూలో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తయారీకి 558 డాలర్ల ఖర్చవుతుందని యాపిల్ తెలిపింది. విడి భాగాల ధరలు పెరుగుదల కారణంగా ఐఫోన్ 16 ధరలు 12 శాతం పెరిగే అవకాశం ఉందని వెలుగులులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి.