యాపిల్ ఇంటెలిజెన్స్ దన్ను
ధర 799 డాలర్ల నుంచి ప్రారంభం
యాపిల్ వాచ్ 10 ఆవిష్కరణ
క్యుపర్టినో, అమెరికా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా కృత్రిమ మేథ ఆధారిత ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో 4 మోడల్స్ (ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మ్యాక్స్) ఉన్నాయి. ఐఫోన్ 16 ధర 799 డాలర్ల(సుమారు రూ.69000) నుంచి,16 ప్లస్ ధర 899 డాలర్ల(రూ.76000) నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్16లో ఐఫోన్ 15 కన్నా 30 శాతం వేగంగా పనిచేసే, 30 శాతం తక్కువ శక్తిని ఉపయోగించే 6–కోర్ ఏ18 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ల సైజు 6.1 అంగుళాల నుంచి 6.9 అంగుళాల వరకు ఉంటుంది.
భారీ జనరేటివ్ మోడల్స్‌ను ఉపయోగించేందుకు అనువుగా ఐఫోన్ 16 కోసం సరికొత్త ఏ18 చిప్‌ను తయారు చేశారు. గ్లోటైమ్ పేరిట నిర్వహించిన ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్, కొత్త తరం ఐఫోన్లను యాపిల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించినట్లు చెప్పారు. ప్రత్యేకంగా రూపొందించిన సర్వర్లపై యాపిల్ ఇంటెలిజెన్స్ పని చేస్తుందని పేర్కొన్నారు. కస్టమైజ్ చేసుకోతగిన యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 16లో 48 ఫ్యూజన్ కెమెరా ఉంటుంది. కొత్తగా యాపిల్ వాచ్ సిరీస్ 10ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. వీటి ధర 399 డాలర్ల నుంచి ఉంటుంది. సెప్టెంబర్ 20 నుంచి ఇవి లభ్యమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment