CEO Tim Cook
-
ఐఫోన్ 16 వచ్చేసింది..
క్యుపర్టినో, అమెరికా: టెక్ దిగ్గజం యాపిల్ తాజాగా కృత్రిమ మేథ ఆధారిత ఐఫోన్ 16 స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో 4 మోడల్స్ (ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మ్యాక్స్) ఉన్నాయి. ఐఫోన్ 16 ధర 799 డాలర్ల(సుమారు రూ.69000) నుంచి,16 ప్లస్ ధర 899 డాలర్ల(రూ.76000) నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్16లో ఐఫోన్ 15 కన్నా 30 శాతం వేగంగా పనిచేసే, 30 శాతం తక్కువ శక్తిని ఉపయోగించే 6–కోర్ ఏ18 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ల సైజు 6.1 అంగుళాల నుంచి 6.9 అంగుళాల వరకు ఉంటుంది. భారీ జనరేటివ్ మోడల్స్‌ను ఉపయోగించేందుకు అనువుగా ఐఫోన్ 16 కోసం సరికొత్త ఏ18 చిప్‌ను తయారు చేశారు. గ్లోటైమ్ పేరిట నిర్వహించిన ఉత్పత్తుల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న యాపిల్ సీఈవో టిమ్ కుక్, కొత్త తరం ఐఫోన్లను యాపిల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించినట్లు చెప్పారు. ప్రత్యేకంగా రూపొందించిన సర్వర్లపై యాపిల్ ఇంటెలిజెన్స్ పని చేస్తుందని పేర్కొన్నారు. కస్టమైజ్ చేసుకోతగిన యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 16లో 48 ఫ్యూజన్ కెమెరా ఉంటుంది. కొత్తగా యాపిల్ వాచ్ సిరీస్ 10ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. వీటి ధర 399 డాలర్ల నుంచి ఉంటుంది. సెప్టెంబర్ 20 నుంచి ఇవి లభ్యమవుతాయి. -
రెండో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్
భారత్‌లో యాపిల్ రెండో స్టోర్ ఢిల్లీలోని యాపిల్ సాకేత్ (apple saket)ను సీఈవో టిక్‌కుక్ గురువారం (ఏప్రిల్ 20) ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు కస్టమర్లు, నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా టిమ్‌కుక్ కస్టమర్లకు అభివాదం చేసి స్వాగతం పలికారు. పలువురిని పలకరించారు. కస్టమర్లు కూడా చప్పట్లు కొడుతూ, బిగ్గరగా అరుస్తూ తమ మద్దతు తెలియజేశారు. ఇదీ చదవండి: apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది! #WATCH | Apple CEO Tim Cook meets customers visiting India’s second Apple Store at Delhi's Select City Walk Mall in Saket. pic.twitter.com/ZeEubKU92w — ANI (@ANI) April 20, 2023 ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో రెండు రోజుల ముందే తమ మొదటి స్టోర్‌ను స్టోర్‌ను యాపిల్ ప్రారంభించింది. ఢిల్లీలో ప్రారంభించిన ఈ యాపిల్ సాకేత్ స్టోర్ భారత్‌లో రెండవది. కాగా పరిమాణంలో ఢిల్లీ స్టోర్.. ముంబై స్టోర్ కంటే చిన్నది. స్టోర్ ప్రారంభానికి ముందే కస్టమర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇదీ చదవండి: Tim Cook ఢిల్లీలో సందడి: వాటిపై మనసు పారేసుకున్న కుక్ -
త్వరలోనే యాపిల్ స్టోర్ గ్రాండ్ ఓపెనింగ్.. భారత్ రానున్న టిమ్‌కుక్!
యాపిల్ సీఈవో టిమ్‌కుక్ భారత్ వస్తారని, ఇక్కడ ఏర్పాటవుతున్న యాపిల్ స్టోర్ ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తారని అంచనా వేస్తూ ఎకనమిక్ టైమ్స్ కథనం వెలువరించింది. ఈ మేరకు టిమ్‌కుక్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకునే అవకాశం ఉంది. కుక్ 2016లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా మోదీతో భేటి అయ్యారు. కాలిఫోర్నియాలోని కుపెర్టినోలో ఉన్న యాపిల్ ప్రధాన కార్యాలయం కుక్ భారత పర్యటన ప్రణాళికను, ముంబై స్టోర్ ప్రారంభ తేదీని ఖరారు చేస్తోంది. కుక్ వెంట యాపిల్ రిటైల్ అండ్ పీపుల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డీర్డ్రే ఓబ్రియన్ ఉంటారని తెలుస్తోంది. టిమ్ కుక్ చివరి సారిగా 2016లో భారత్‌లో పర్యటించారు. బాలీవుడ్ స్టార్స్, టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశమయ్యారు. స్టేడియంకు వెళ్లి క్రికెట్ మ్యాచ్‌ను కూడా వీక్షించారు. ముంబై నగరంలోని జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో ఈ నెలాఖరున ప్రారంభించబోతున్న రీటైల్ స్టోర్‌కు సంబంధించిన ఫొటోలను యాపిల్ విడుదల చేసింది. నగరానికి ప్రత్యేకమైన కాళీ-పీలీ ట్యాక్సీ కళాకృతి ప్రేరణతో ముంబై స్టోర్ ముఖభాగాన్ని తీర్చిదిద్దారు. -
భారత్‌లో యాపిల్ రికార్డు.
న్యూఢిల్లీ: ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ భారత్‌లోనూ దుమ్మురేపుతోంది. భారత్ సహా పలు మార్కెట్లలో పటిష్టమైన పనితీరు ఆసరాతో ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో యాపిల్ రికార్డు స్థాయిలో 64.7 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో 59 శాతం విదేశీ అమ్మకాల ద్వారా వచ్చిందే కావడం గమనార్హం. ఇక నికర లాభం 12.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. సెప్టెంబర్‌లో యాపిల్ భారత్‌లో మొట్టమొదటిసారిగా ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, రీసెర్చ్ సంస్థ కెనాలిస్ వెల్లడించిన గణాంకాల ప్రకారం యాపిల్ జూలై–సెప్టెంబర్ కాలంలో రెండంకెల వృద్ధితో రికార్డు స్థాయిలో సుమారు 8 లక్షల ఐఫోన్లను విక్రయించినట్లు అంచనా. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్‌ల భాగస్వామ్యంతో యాపిల్ ఇటీవలే భారత్‌లో ఐఫోన్ 11 అసెంబ్లింగ్‌ను ప్రారంభించింది. ‘భౌగోళికంగా, అమెరికా, యూరప్, మిగతా ఆసియా పసిఫిక్‌లో మేం సెప్టెంబర్ క్వార్టర్లో రికార్డులు సృష్టించాం. భారత్‌లోనూ మాకు ఇది రికార్డు క్వార్టర్‌గా నిలిచింది. తాజాగా ప్రారంభించిన ఆన్లైన్ స్టోర్‌కు భారత్‌లో అపూర్వ ఆదరణ లభించడం ఆనందం కలిగిస్తోంది’ అని ఫలితాల ప్రకటన సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చెప్పారు. -
ఆపిల్ సీఈవోకు వేధింపులు, ఫిర్యాదు
శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌పై భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. పాలో ఆల్టోలోని కుక్ అధికారిక నివాసంలోకి రెండు సార్లు అక్రమంగా చొరబడి అనుచితంగా ప్రవర్తించడంతో పాటు, ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఆపిల్ ఫిర్యాదు చేయడంతో కాలిఫోర్నియా కోర్టు అతనిపై తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. సిలికాన్ వ్యాలీలోని కుక్ నివాసం, ఆయన సెక్యూరిటీ గార్డులు ముగ్గురు, ఆపిల్ పార్క్ ప్రధాన కార్యాలయానికిదూరంగా ఉండాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3వ తేదీ దాకా ఈ ఉత్తర్వులు అమల్లో వుంటాయని కోర్టు తెలిపింది. ఆపిల్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ విలియం బర్న్స్ ప్రకారం శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన రాకేశ్ శర్మ అలియాస్ "రాకీ" (41) రెండుసార్లు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. 25 సెప్టెంబర్ 2019న వాయిస్ మెయిల్‌తో శర్మ వేధింపులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 4 న షాంపైన్ బాటిల్, పువ్వులు తీసుకొని అనుమతిలేకుండా నేరుగా కుక్ ఇంటికి వచ్చాడు. ఒక వారం తరువాత మరో అవాంఛనీయ కాల్ చేసిన బెదిరింపులకు పాల్పడ్డాడు. కొంతకాలం తర్వాత, శర్మ తన ట్విటర్ ఖాతాలో ఆపిల్ ఎగ్జిక్యూటివ్‌ను ట్యాగ్ చేస్తూ కొన్నిఅభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఫోటోలు షేర్ చేశాడు. అలాగే జనవరి 15 న మరోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుండగా భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని హెచ్చరిస్తూ ఆపిల్ న్యాయవాదులు రాకీకి ఒక లేఖ పంపారు. అయినా ఏ మాత్రం బెదరని రాకీ ఈసారి ఆపిల్ టెక్నికల్ టీంకు కాల్ చేశాడు. కంపెనీ తనను చంపడానికి చూస్తోందని ఆరోపించాడు. మళ్లీ ఒక నెల తరువాత తిరిగి వచ్చిన అతగాడు ఏకంగా టిమ్ కుక్ నివాసంలోని గేటులోకి ప్రవేశించి డోర్ బెల్ మోగించాడని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. మరోవైపు కుక్ నివాసం వద్ద పదపదే నిబంధనలను ఉల్లంఘించడం, తుపాకీ గురించి మాట్లాటడం చేశాడని, శారీరకంగా తనకు హాని చేస్తాడని గట్టిగా నమ్ముతున్నానని కుక్ సెక్యూరిటీ బృందంలోని ఒక సభ్యుడు ఆరోపించారు. -
ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపర్చిన యాపిల్ సీఈవో
కాలిఫోర్నియా : యాపిల్ సీఈవో టిమ్ కుక్ కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంలో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. శుక్రవారం ఉదయం అనూహ్యంగా యాపిల్ ప్రధాన కార్యాలయం, ఐకానిక్ గ్లాస్ క్యూబ్‌లోకి ప్రవేశించారు. దీంతో అభిమానుల సందడి నెలకొంది. కొత్త ఐ ఫోన్ 11 విక్రయాలు సందర్భంగా ఈ స్మార్ట్ఫోను కొనుగోలు చేయడానికి వచ్చిన అభిమానులు టిమ్ కుక్‌తో సెల్ఫీదిగేందుకు క్యూ కట్టారు. అటు కొత్త ఫోన్ కోసం తెల్లవారుజాము నుండి లైన్లో ఉన్న వందలాది మంది కస్టమర్లను టిమ్ పలకరించారు. వారికి హై ఫైలు ఇస్తూ, సెల్పీలు దిగుతూ ఆకట్టుకున్నారు. రెండున్నర సంవత్సరాలుగా మూసివేసిన ఈ ఆఫీసును పూర్తి హంగులతో ఐదవ అవెన్యూ స్టోర్ అసలు 32వేల చదరపు అడుగుల స్థలాన్ని 77వేల చదరపు అడుగులకు రెట్టింపు చేసారు. రెన్బో కలర్స్ దీన్ని అత్యంత సొగుసుగా తీర్చి దిద్దారు. 32 అడుగుల గ్లాస్ క్యూబ్ ను ఈ నెల ప్రారంభంలో తిరిగి ప్రారంభించారు. ఇది 24 గంటలు, 365 రోజులు వినియోగదారులకు అందుబాటులో ఉండే యాపిల్ స్టోర్ ఇదేనట. కాగా ఇటీవల యాపిల్ హెడ్‌క్వార్టర్స్ క్యుపర్టినోలోని స్టీవ్ జాబ్స్ ఆడిటోరియంలో ఐఫోన్ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్ అధునాతన స్మార్ట్ఫోన్లను జరిగిన ప్రత్యేక ఈవెంట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. స్పెషల్ ఆడియో, డాల్బీ అట్మోస్ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 6.1 లిక్విడ్ రెటినా డిస్ప్లే, స్లో మోషన్ సెల్ఫీలు, ఏ13 బయోనిక్ చిప్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఐఫోన్ 11 ధర 699 డాలర్ల నుంచి ప్రారంభం. Tim Cook arrives at @Apple 5th Ave reopening as iPhone 11s go on sale. Greeted by about 300 customers. After a few selfies, some handshakes he made his way inside. 24-hour store reopens at 8 after being closed for nearly 3 years for renovations. More on @SquawkCNBC pic.twitter.com/aV2Z0WgJLS — Rahel Solomon (@RahelCNBC) September 20, 2019 -
మ్యాచ్‌కు టిమ్ కుక్
కాన్పూర్: ఆపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ తన జీవితంలో తొలి సారి క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌లో ఉన్న కుక్ ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఆహ్వానం మేరకు స్టేడియానికి వచ్చి గుజరాత్, కోల్‌కతా మ్యాచ్‌ను తిలకించారు. ‘చాలా అద్భుతంగా ఉంది. నాకు తెగ నచ్చేసింది. ఇంత వేడిలో మ్యాచ్ చూడటం అంత సులువు కాకపోయినా నాకు ఇదో కొత్త అనుభూతి. క్రికెట్ ఏమిటో, క్రీడల ప్రాధాన్యత ఏమిటో ఇక్కడ కనిపించింది’ అని కుక్ ఆనందపడ్డారు. -
యాపిల్ సీఈవో జీతమెంతో తెలుసా?
ఐఫోన్లు, ఐ ప్యాడ్లు విక్రయించే యాపిల్ సంస్థ గత ఏడాది భారీ లాభాలు ఆర్జించింది. 2015లో సంస్థ అమ్మకాలు 28శాతం పెరిగి.. లాభాలు 38శాతం పెరిగాయి. దీంతో యాపిల్ సీఈవో టిమ్ కూక్ వేతనం కూడా భారీగా పెరిగింది. 2015లో ఆయన వేతన 11.5శాతం పెరిగి 10.3 మిలియన్ డాలర్ల (రూ. 69 కోట్ల)కు చేరుకుంది. ఇదంతా బాగానే ఉన్నా 2008 తర్వాత తొలిసారి యాపిల్ వాటాలు మాత్రం గత ఏడాది పతనమయ్యాయి. ఇక యాపిల్ కంపెనీలో సీఈవో కూక్ కన్నా ఇతర ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు అధికంగా ఉండటం గమనార్హం. గత ఏడాది యాపిల్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారి లుకా మేస్ట్రీ వేతనం 81శాతం పెరిగి 25.3 మిలియన్ డాలర్ల (రూ. 169 కోట్ల)కు పెరిగింది. అదేవిధంగా రిటైల్, ఆన్లైన్ స్టోర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఏంజెలా ఎరెండట్స్ వేతనం భారీగా పెరిగి 25.8 మిలియన్ డాలర్ల (రూ. 172 కోట్ల)కు చేరుకుంది. 2015లో కూక్ మౌలిక వేతనం 14.4 శాతం పెరిగి రెండు మిలియన్ డాలర్లకు చేరుకోగా, ఆయనకు చెల్లించే నాన్ ఈక్విటీ పరిహారం 19శాతం పెరిగి 8 మిలియన్ డాలర్లకు చేరుకుంది. కూక్ నేతృత్వంలో 2015 యాపిల్‌కు బాగా కలిసొచ్చింది. చైనాలో యాపిల్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఐఫోన్ అమ్మకాలు రికార్డుస్థాయిలో కొనసాగాయి.