లక్షల కోట్ల విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ యాపిల్. ఈ సంస్థకు 13 ఏళ్లుగా అధిపతిగా కొనసాగుతున్నారు టిమ్ కుక్. వయసవుతున్నప్పకీ చలాకీగా ఉండే ఆయన సీఈవోగా కంపెనీని విజయ పథంలో నడిపిస్తున్నారు. అయితే టిక్ కుక్ ఎప్పుడు రిటైర్ అవుతారు అనే ఆసక్తి చాలా మందిలో ఉంది.
తన రిటైర్‌మెంట్ గురించి వైర్డ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుక్ వెల్లడించారు. ఇది తనను చాలా తరచుగా అడిగే ప్రశ్న అని చెప్పారు. యాపిల్ సీఈఓగా తాను ఎంతకాలం కొనసాగాలనుకుంటున్నాననే ప్రశ్నకు సమాధానమిస్తూ "ఈ చోటు (యాపిల్) అంటే ఇష్టం. ఇక్కడ ఉండటం జీవితకాల ప్రత్యేకత" అని బదులిచ్చారు.
ఎప్పుడు దిగిపోతానంటే..
రిటైర్‌మెంట్ ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పకుండా.. తాను వైదొలగడానికి సరైన సమయం ఎప్పుడదన్నది యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఓ హింట్ ఇచ్చారు. ‘ఇదీ సమయం అని నా అంతరాత్మ చెప్పే వరకు ఇక్కడ కొనసాగుతా.. తర్వాత ఏం చేయాలన్నది అప్పుడు దృష్టి పెడతా’ అన్నారు.
టిమ్ కుక్ యాపిల్‌తో తన సుదీర్ఘమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. కంపెనీ లేని జీవితాన్ని తాను ఊహించడం అసాధ్యం అని ఒప్పుకున్నారు.యాపిల్ తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి చాలా కాలంగా కేంద్రంగా ఉందని, అది తన గుర్తింపు నుండి విడదీయరాని అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు.
యాపిల్‌తో సుదీర్ఘ ప్రయాణం
కంపెనీలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన టిమ్ కుక్ యాపిల్ పట్ల తన ఇష్టం ఎప్పటిలాగే బలంగా ఉంటుదని కుక్ స్పష్టం చేశారు. కుక్ 1998లో యాపిల్‌లో చేరారు. "నా జీవితం 1998 నుండి ఈ కంపెనీతో ముడిపడి ఉంది" అంటూ యాపిల్‌తో తన కెరీర్, వ్యక్తిగత ఎదుగుదల ఎంత లోతుగా ముడిపడి ఉందో కుక్ వివరించారు. టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ ఎయిర్‌పాడ్స్, యాపిల్ వాచ్ వంటి విప్లవాత్మక ఉత్పత్తులను ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment