ఐఫోన్‌ 16 సిరీస్‌ డిజైన్లు.. తెరపైకి మరో రూమర్‌! | iPhone 16 To Come With A New Dedicated Camera Button - Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ 16 సిరీస్‌ డిజైన్లు.. తెరపైకి మరో రూమర్‌!

Published Sat, Jan 20 2024 2:18 PM | Last Updated on Sat, Jan 20 2024 2:45 PM

Iphone 16 New Dedicated Camera Button - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రతి ఏడాది ఐఫోన్‌ సిరీస్ ఫోన్‌లను విడుదల చేస్తుంది. ఇప్పటికే గత ఏడాది ఐఫోన్‌ 15 సిరీస్‌ను విడుదల చేసిన యాపిల్‌ ఈ ఏడాది ఐఫోన్‌ 16 సిరీస్‌ను మార్కెట్‌కు పరిచయం చేయనుంది. అయితే, ఈ లేటెస్ట్‌ సిరీస్‌ ఫోన్‌ డిజైన్‌పై రూమర్లు సోషల్‌ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.

ఐఫోన్‌ 16తో తీసుకునే ఫోటోలు, వీడియోల కోసం యాపిల్‌ సంస్థ కొత్త బటన్‌పై పనిచేస్తుందని, ప్రోటోటైప్‌లపై దాని వినియోగం ఎలా ఉందో పరిశీలిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ బటన్‌ను ఐఫోన్‌లపై అమర్చితే సింగిల్‌ క్లిక్‌తో ఫోటోలు, వీడియోలు తీసుకునే వెసులు బాటు కలగనుంది. నివేదిక ప్రకారం.. కెమెరా బటన్ ఫోన్‌కు కుడి దిగువన ఉండవచ్చని, అంటే ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో ఫోటోలు ,వీడియోలను తీసేటప్పుడు అది నేరుగా చూపుడు వేలు కింద ఉంటుందని పేర్కొంది.   

ముఖ్యంగా, గత సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్‌ చేసిన యాపిల్‌ ఐఫోన్‌ 15 సిరీస్‌ను పాత ఫోన్‌ సిరీస్‌ల కంటే భిన్నంగా మ్యూట్ బటన్‌ను భర్తీ చేస్తూ కొత్త యాక్షన్ బటన్‌తో వచ్చింది.   

మాక్‌ రూమర్స్‌ ప్రకారం.. ఐఫోన్‌ 16 సిరీస్‌లో ప్రాజెక్ట్ నోవా పేరుతో కొత్త కెమెరా బటన్ మెకానికల్‌కు బదులుగా కెపాసిటివ్ బటన్‌గా ఉంటుందని అంచనా వేయబడింది. ఐఫోన్‌ ఎస్‌ఈ లోని హోమ్ బటన్‌ను పోలి ఉండేలా కొత్త బటన్ ఉండవచ్చని తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement