iPhone
-
అయ్యయ్యో! నా ఐఫోన్ మురుగా..
సేలం(తమిళనాడు): ఆలయ హుండీలో పొరపాటుగా ఏది పడినా అది దేవుడికే సొంతమని పలు సినిమాల్లో సన్నివేశాలు మనం చూసి ఉంటాం. అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులోని తిరుపూర్‌లో చోటుచేసుకుంది. తిరుపోరూర్లోని మురుగన్ ఆలయానికి గత రెండు నెలల క్రితం చెన్నై అంబత్తూరుకు చెందిన దినేష్ దర్శనానికి వెళ్లాడు. ఆ సమయంలో దినేష్ హుండీలో కానుకలు వేస్తున్న సమయంలో పొరపాటుగా ఆయన చేతిలో ఉన్న ఐఫోన్ కూడా హుండీలో పడిపోయింది. ఈ విషయంగా ఆయన హిందూ దేవదాయ శాఖకు ఫిర్యా దు చేయగా, హుండీ లెక్కింపు సమయంలో తె లుపుతామని నిర్వాహకులు చెప్పి పంపించారు. ఈ స్థితిలో గురువారం ఆలయ హుండీని తెరి చారు. iPhone accidentally fell into the temple's hundi..The temple administration refused to return it the owner, saying it belonged to the temple.pic.twitter.com/4VgfcRk0Ib— Vije (@vijeshetty) December 20, 2024ఈ సందర్భంగా దినేష్‌కు సమాచారం ఇవ్వడం తన ఫోన్ తీసుకోవచ్చని ఎంతో ఆశగా ఆలయానికి వెళ్లాడు. హుండీ తెరిచిన ఆలయ నిర్వాహకులు దినేష్‌కు ఐఫోన్ చెందదని, హుండీలో ఏది పడినా మురుగనార్పణమేనని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందాడు. తర్వాత చేసేది లేక తన ఐఫోన్లో సిమ్‌కార్డును తీసుకుని, స్వామిని దర్శించుకుని నిరాశతో వెళ్లిపోయాడు. Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు -
యాపిల్ సీఈవో దిగిపోయేదెప్పుడు? పెదవి విప్పిన టిమ్ కుక్
లక్షల కోట్ల విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ యాపిల్. ఈ సంస్థకు 13 ఏళ్లుగా అధిపతిగా కొనసాగుతున్నారు టిమ్ కుక్. వయసవుతున్నప్పకీ చలాకీగా ఉండే ఆయన సీఈవోగా కంపెనీని విజయ పథంలో నడిపిస్తున్నారు. అయితే టిక్ కుక్ ఎప్పుడు రిటైర్ అవుతారు అనే ఆసక్తి చాలా మందిలో ఉంది.తన రిటైర్మెంట్ గురించి వైర్డ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుక్ వెల్లడించారు. ఇది తనను చాలా తరచుగా అడిగే ప్రశ్న అని చెప్పారు. యాపిల్ సీఈఓగా తాను ఎంతకాలం కొనసాగాలనుకుంటున్నాననే ప్రశ్నకు సమాధానమిస్తూ "ఈ చోటు (యాపిల్) అంటే ఇష్టం. ఇక్కడ ఉండటం జీవితకాల ప్రత్యేకత" అని బదులిచ్చారు.ఎప్పుడు దిగిపోతానంటే..రిటైర్మెంట్ ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పకుండా.. తాను వైదొలగడానికి సరైన సమయం ఎప్పుడదన్నది యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఓ హింట్ ఇచ్చారు. ‘ఇదీ సమయం అని నా అంతరాత్మ చెప్పే వరకు ఇక్కడ కొనసాగుతా.. తర్వాత ఏం చేయాలన్నది అప్పుడు దృష్టి పెడతా’ అన్నారు.టిమ్ కుక్ యాపిల్‌తో తన సుదీర్ఘమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. కంపెనీ లేని జీవితాన్ని తాను ఊహించడం అసాధ్యం అని ఒప్పుకున్నారు.యాపిల్ తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి చాలా కాలంగా కేంద్రంగా ఉందని, అది తన గుర్తింపు నుండి విడదీయరాని అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు.యాపిల్‌తో సుదీర్ఘ ప్రయాణంకంపెనీలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన టిమ్ కుక్ యాపిల్ పట్ల తన ఇష్టం ఎప్పటిలాగే బలంగా ఉంటుదని కుక్ స్పష్టం చేశారు. కుక్ 1998లో యాపిల్‌లో చేరారు. "నా జీవితం 1998 నుండి ఈ కంపెనీతో ముడిపడి ఉంది" అంటూ యాపిల్‌తో తన కెరీర్, వ్యక్తిగత ఎదుగుదల ఎంత లోతుగా ముడిపడి ఉందో కుక్ వివరించారు. టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ ఎయిర్‌పాడ్స్, యాపిల్ వాచ్ వంటి విప్లవాత్మక ఉత్పత్తులను ప్రారంభించింది. -
అధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు
నిత్యం మారుతున్న టెక్నాలజీ కారణంగా మొబైల్ రంగంలో మార్పులొస్తున్నాయి. దాంతో ఇప్పటికే మొబైల్ ఫోన్లు ఉన్నా చాలామంది కొత్త సాంకేతికతకు అప్డేట్ అవుతున్నారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలు చేసిన ఫోన్ల వివరాలను కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ విడుదల చేసింది.ఇదీ చదవండి: ప్రైవేట్ సంస్థ చేతిలో ‘సిబిల్’.. వ్యవస్థపై ఆందోళనఈ నివేదిక ప్రకారం టాప్ 10 మొబైళ్లు..యాపిల్ ఐఫోన్ 15యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్యాపిల్ ఐఫోన్ 15 ప్రోసామ్సంగ్ గెలాక్సీ ఏ15 4జీసామ్సంగ్ గెలాక్సీ ఏ15 5జీసామ్సంగ్ గెలాక్సీ ఏ05రెడ్మీ 13సీ 4జీసామ్సంగ్ గెలాక్సీ ఏ35ఐఫోన్ 14సామ్సంగ్ గెలాక్సీ ఎస్24 -
యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!
ప్రపంచ నం.1 కంపెనీగా పేరున్న యాపిల్ ఉద్యోగుల పట్ల కఠిన విధానాలు అమలు చేస్తుందని ఓ ఉద్యోగి ఆరోపించారు. ఉద్యోగుల వ్యక్తిగత ఐప్యాడ్, ఐఫోన్ వంటి పరికరాలతో నిబంధనలకు విరుద్ధంగా తమ కార్యకలాపాలపై రహస్యంగా నిఘా వేస్తోందని తెలిపారు. 2020లో కంపెనీలో చేరిన అమర్ భక్త అనే ఉద్యోగి ఈమేరకు సంస్థపై ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన కాలిఫోర్నియాలో కంపెనీపై కేసు దాఖలు చేశారు.అక్కడ ఉద్యోగం సాఫీగా ఉండదు..‘ఉద్యోగుల గోప్యత హక్కును యాపిల్ హరిస్తోంది. సిబ్బంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా వారిపై ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నిఘా ఉంచుతోంది. దీన్ని ఉద్యోగులు అంగీకరించాలని కంపెనీ ఒత్తిడి చేస్తుంది. యాపిల్ సంస్థలో పని వాతావరణం సాధారణంగా బయట అనుకున్నంత సాఫీగా ఉండదు. అదో జైలు జీవితం లాంటిది. యాపిల్ ఉద్యోగులు కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులను పని కోసం మాత్రమే ఉపయోగించాలి. అలాగని వ్యక్తిగత అవసరాల కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు వాడాలనుకుంటే మాత్రం కంపెనీ ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్‌తోనే వాటిని వినియోగించాలి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తలు‘వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించే పరికరాల్లో ఈమెయిల్‌లు, ఫొటోలు, వీడియో.. వంటి ఆప్షన్లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాకు లింక్ చేసిన ప్రతి డేటాను యాక్సెస్ చేసేందుకు యాపిల్‌కు అనుమతి ఉంటుంది. యాపిల్ ఉద్యోగులు వారి పని పరిస్థితులు, తమ వేతనాల గురించి బయట ఎవరితో మాట్లాడనివ్వకుండా కంపెనీ జాగ్రత్త పడుతోంది. ఉద్యోగులు ఈమేరకు ఏవిధంగానూ స్పందించకుండా ఉండడంతోపాటు రాజకీయ కార్యకలాపాలకు పరిమితం అయ్యేలా కట్టడి చేస్తోంది’ అని అన్నారు.సమాచారం తొలగించమని ఆదేశాలు‘కంపెనీకి సంబంధించి ఉద్యోగులు తమ అనుభవాలను పాడ్‌క్యాస్ట్‌లు వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ మాట్లాడకుండా యాపిల్ నిషేధించింది. ఈమేరకు ఏదైనా కార్యకలాపాలు సాగిస్తే వెంటనే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కంపెనీకి సమాచారం వెళ్తుంది’ అని చెప్పారు. ప్రస్తుతం తాను చేసిన పనికి సంబంధించి నిర్దిష్ట సమాచారాన్ని అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి తీసివేయమని కంపెనీ ఆదేశించించినట్లు భక్త పేర్కొన్నారు.ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..యాపిల్ స్పందన ఇదే..యాపిల్ దీనిపై స్పందిస్తూ దావాలోని అంశాలు నిరాధారమైనవని, అవాస్తవాలని కొట్టిపారేసింది. పని ప్రదేశాల పరిస్థితులను చర్చించడానికి ఉద్యోగుల హక్కులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. తమ బృందాలు అభివృద్ధి చేసిన ఆవిష్కరణలను పరిరక్షిస్తూ, ఉత్తమ ఉత్పత్తులు, సేవలను అందించడంపై కంపెనీ దృష్టి సారించిందని స్పష్టం చేసింది. -
వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపు
భారత్‌లో యాపిల్ సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ తన ఉద్యోగుల నియామక ఏజెంట్లకు ఆదేశాలు జారీచేసింది. కంపెనీ నియామక పద్ధతుల్లో మార్పులు చేసింది. ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వైవాహిక స్థితి, వయసు వంటి వివక్షతతో కూడిన ప్రమాణాలను తొలగించాలని స్పష్టం చేసింది. ఈమేరకు రాయిటర్స్ దర్యాప్తును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో వివాహిత మహిళలను అసెంబ్లింగ్-లైన్ విభాగంలో పని చేసేందుకు ఫాక్స్‌కాన్ గతంలో మినహాయించినట్లు రాయిటర్స్ దర్యాప్తులో తేలింది. కానీ హై ప్రోడక్టివిటీ అవసరం అయినప్పుడు మాత్రం వివాహత మహిళలపై ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ మేరకు జూన్ 25న రాయిటర్స్ సిద్ధం చేసిన పరిశోధన పత్రాన్ని అనుసరించి కంపెనీ తాజాగా వివక్షతతో కూడిన వివరాలు రిక్రూట్మెంట్ ప్రకటనలో ఉండకూడదని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారిని లింగం, వయసు, వైవాహిక స్థితిని అనుసరించి వేరు చేయడం సరికాదని తెలిపింది. దాంతో సదరు వివరాలు లేకుండానే చెన్నైలో కొన్ని సంస్థలు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: నారాయణ మూర్తిని మించిన సేనాపతిఫాక్స్కాన్ ఏజెన్సీ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్‌లోని మొత్తం అసెంబ్లింగ్ స్థానాలు తెలిపారు. కానీ వయసు, లింగం, వైవాహిక ప్రమాణాల గురించి ప్రస్తావించలేదు. ‘ఎయిర్ కండిషన్డ్ వర్క్‌ప్లేస్, ఉచిత రవాణా, క్యాంటీన్ సౌకర్యం, ఉచిత హాస్టల్, నెలవారీ జీతం రూ.14,974 లేదా దాదాపు 177 అమెరికన్ డాలర్ల’ వివరాలతో ప్రకటన ఇచ్చారు. -
యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలు
భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల తయారీ భాగస్వామిగా ఉన్న పెగాట్రాన్‌లో 60 శాతం వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఇటీవల ఈమేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. దాంతో భారత్‌లో యాపిల్ ఉత్పత్తులు తయారీ చేసే కంపెనీల్లో టాటా గ్రూప్ టాప్‌లో నిలిచింది.యాపిల్ సంస్థ చైనా భయట ఇతర దేశాల్లో తన ఉత్పత్తిని పెంచేలా ఇండియాలో ఉత్పాదకతను పెంచుతోంది. దానికోసం టాటా గ్రూప్, ఫాక్స్కాన్తోపాటు ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. కానీ కొన్ని చిన్న కంపెనీల్లోని మేజర్‌వాటాను ఇప్పటికే ఈ సంస్థలు కొనుగోలు చేశాయి. టాటా గ్రూప్ యాపిల్ తయారీదారుగా ఉన్న విస్ట్రన్ కంపెనీను ఇప్పటికే కొనుగోలు చేసింది. తాజాగా పెగాట్రాన్ కంపెనీలో 60 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో స్థానికంగా యాపిల్ ఉత్పత్తులను తయారీని పెంచాలని నిర్ణయించింది.తయారీదారుగా ఉండడం తేలికైన విషయం కాదు..పెగాట్రాన్, టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గత ఏడాది కాలంగా ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ‘యాపిల్‌కు కాంట్రాక్ట్ తయారీదారుగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. తయారీపై మార్జిన్లు కూడా అధికంగానే ఉంటాయి. యాపిల్ ఉత్పత్తుల అధునాతన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కంపెనీలు అత్యున్నత స్థాయితో ఉత్పత్తి చేపట్టాల్సి ఉంటుంది. నిత్యం నాణ్యతను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నందున ఉత్పత్తిలో ఎటువంటి అంతరాయాలు ఉండకూడదు’ అని యాపిల్ ఉత్పత్తుల తయారీ వ్యవస్థలో భాగమైన ఒక ఉన్నత అధికారి తెలిపారు. టాటా గ్రూప్ ఇప్పటికే భారత్‌లో ఐఫోన్ 16 తయారీని ప్రారంభించింది.ఇదీ చదవండి: ‘సామాన్యుడిపై భారం తగ్గించండి’పెగాట్రాన్ ఉత్పత్తి సామర్థ్యంపెగాట్రాన్ గత సంవత్సరం దేశీయంగా వినియోగిస్తున్న ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 10 శాతం సహకారం అందించింది. ఈ కంపెనీకి తమిళనాడులో తయారీ యూనిట్ ఉంది. ఇందులో దాదాపు 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ యూనిట్ ఏటా ఐదు మిలియన్ల ఐఫోన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. -
యాపిల్ యూజర్లకు కేంద్రం హైరిస్క్ అలర్ట్!
యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న వారికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హైరిస్క్ అలర్ట్‌లు పంపుతోంది. అవుట్‌డేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్న ఐఫోన్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్‌లు వంటి ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. దాంతో ఆయా వినియోగదారులకు హైరిస్క్ అలర్టులు పంపుతున్నట్లు స్పష్టం చేసింది.పాత సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న యాపిల్ డివైజ్‌ల్లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అడ్వైజరీని విడుదల చేసింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు, సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడేవారు వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన డేటాను యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. డేటా మానిప్యులేషన్‌కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. తాజా సెక్యూరిటీ అప్డేట్లో ఆపిల్ ఈ లోపాలను పరిష్కరించింది. సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి, భద్రతా ఉల్లంఘనల నుంచి రక్షించుకోవడానికి వినియోగదారులు తమ డివైజ్‌ల్లో తాజా సాఫ్ట్వేర్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని CERT-In సిఫార్సు చేసింది.ఇదీ చదవండి: తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!ఐఓఎస్ 18.1 లేదా 17.7.1 కంటే ముందున్న సాఫ్ట్వేర్ వెర్షన్లను వినియోగిస్తున్న యాపిల్ కస్టమర్లు వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది. వాచ్ఓఎస్, టీవీఓఎస్, విజన్ ఓఎస్, సఫారి బ్రౌజర్ వంటి పాత వెర్షన్లపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. కాబట్టి ఆయా వినియోగదారులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. -
ఐఫోన్ ఎగుమతుల్లో భారత్ హవా: ఆరు నెలల్లో..
భారతదేశంలో యాపిల్ ఐఫోన్ల తయారీ చాలా వేగంగా సాగుతోంది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఇండియా నుంచి సుమారు 6 బిలియన్ డాలర్ల (రూ. 50వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయినట్లు సమాచారం. దీన్నిబట్టి చూస్తే.. 2024 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా 10 బిలియన్ డాలర్ల (రూ. 85వేల కోట్లు) విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యే అవకాశం ఉందని అంచనా.అమ్మకాల పరంగా యాపిల్ గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయమైన వృద్ధి సాధించవచ్చని స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఉద్యోగులను ఉపయోగించుకుని.. కంపెనీ దేశంలో తన పరిధిని భారీగా విస్తరించడానికి సిద్ధమవుతోంది. అమెరికా.. చైనా దిగుమతులను తగ్గించుకోవడంతో ఐఫోన్ దిగుమతులు భారత్ ఇప్పుడు ప్రధాన కేంద్రంగా అవతరిస్తుంది.యాపిల్‌కు ప్రధాన సరఫరాదారులుగా ఉన్న ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్, పెగాట్రాన్ కార్పొరేషన్ రెండూ కూడా టాటా ఎలక్ట్రానిక్స్‌తో చేతులు కలిపాయి. స్వదేశీ కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ దక్షిణ భారతదేశంలో ఐఫోన్లను అసెంబ్లింగ్ చేస్తోంది. చెన్నై శివార్లలోని ఫాక్స్‌కాన్ యూనిట్ భారతదేశంలో అగ్ర సరఫరాదారుగా ఉంది. దేశంలో జరుగుతున్న మొత్తం ఐఫోన్ ఎగుమతుల్లో ఇది దాదాపు సగం వాటాను కలిగి ఉంది.గత సంవత్సరం యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'టిమ్ కుక్' ముంబై, న్యూఢిల్లీలోని ఆపిల్ స్టోర్స్ ప్రారంభించారు. దీంతో మన దేశంలో కూడా యాపిల్ విక్రయాలు భారీగా పెరిగాయి. రాబోయే రోజుల్లో యాపిల్ మరింత గొప్ప అమ్మకాలు పొందే అవకాశం ఉంది. 2030 నాటికి భారతదేశ యాపిల్ విక్రయాలు 33 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 2.7 లక్షల కోట్లు) చేరుకోవచ్చని బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ కూడా వెల్లడించారు. -
దేశంలో మరో ‘యాపిల్’ తయారీదారు!
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ భారత్‌లో తయారీ యూనిట్లను పెంచుకునేందుకు సిద్ధంగా ఉంది. కర్ణాటకకు చెందిన ఏక్యూస్ గ్రూప్ యాపిల్ ఉత్పత్తుల తయారీదారుగా ఎదిగేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. అందులో భాగంగా ట్రయిల్ స్టేజ్‌ను పూర్తి చేయనున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు. ఒకవేళ ఈ ట్రయిల్ స్టేజ్‌లో యాపిల్ నిబంధనల ప్రకారం ఏక్యూస్ గ్రూప్ ఉత్పత్తులను తయారు చేస్తే, భారత్‌లో టాటా ఎలక్ట్రానిక్స్ తర్వాతి స్థానం కంపెనీదేనని భావిస్తున్నారు. ఇప్పటికే టాటా ఎలక్ట్రానిక్స్ దేశీయంగా యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది.ఏక్యూస్ గ్రూప్ ప్రస్తుతం ఏరోస్పేస్ విడిభాగాలు, టాయ్స్ తయారీ రంగంలో సేవలందిస్తోంది. ఈ కంపెనీ ట్రయల్ దశను అదిగమిస్తే యాపిల్ ఉత్పత్తుల సరఫరాదారుల జాబితాలో చోటు సంపాదించిన రెండో భారతీయ కంపెనీగా నిలుస్తుంది. మ్యాక్‌బుక్ పర్సనల్ కంప్యూటర్లు, యాపిల్ వాచ్‌లు, యాపిల్ ఉత్పత్తుల విడిభాగాలను తయారు చేసే ఏకైక దేశీయ సంస్థగా అవతరించే అవకాశం ఉంది. ఏక్యూస్ ట్రయల్‌కు సంబంధించి యాపిల్ వాచ్, మ్యాక్‌బుక్ మెకానికల్ భాగాల ఉత్పత్తిని ప్రారంభించిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పారు. యాపిల్ ఉత్పత్తుల తయారీ ట్రయిల్‌కు సంబంధించి ఇరు కంపెనీల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి టాటా ఎలక్ట్రానిక్స్ మాత్రమే యాపిల్‌కు భారతీయ సరఫరాదారుగా వ్యవహరిస్తోంది. ఇది ఐఫోన్లను తయారు చేస్తోంది.ఇదీ చదవండి: త్వరలో రూ.లక్షకు.. ఎవరెస్ట్ ఎక్కేసిన బంగారం!యాపిల్ కంపెనీ భారతదేశంలో 2021లో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. క్రమంగా దేశంలో ఉత్పత్తిని పెంచుతోంది. దేశీయంగా ఐఫోన్ తయారీ విభాగం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.20 లక్షల కోట్లు సమకూర్చింది. ఇందులో రూ.85,000 కోట్ల ఎగుమతులు ఉన్నాయి. దీంతో యాపిల్ గ్లోబల్ సప్లై చెయిన్‌లో భారతదేశం కీలకంగా మారింది. కంపెనీ మొత్తం ఉత్పత్తిలో 14 శాతం ఇండియాలోనే ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. -
త్వరలో తక్కువ రేటు ఐఫోన్..!
యాపిల్ ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. కొత్త సిరీస్, మోడల్ ఐఫోన్ రాగానే కొనేందుకు డబ్బున్నవారు ఎగబడతుంటారు. అయితే ఐఫోన్ అన్నది సామాన్యులకు మాత్రం కలగానే మిగులుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ రేటులో ఐఫోన్ మోడల్‌ను తీసుకొచ్చేందుకు యాపిల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.అప్డేటెడ్ ఐఫోన్ ఎస్ఈ మోడల్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు యాపిల్ సిద్ధమైందని ఈ విషయం తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది. ఇది లో-ఎండ్ ఐఫోన్ మోడల్ కానుంది. దీంతోపాటు కొత్త ఐప్యాడ్ ఎయిర్ మోడల్లను కూడా యాపిల్ తయారు చేయాలనే లక్ష్యంతో ఉంది. ఈ కొత్త ఉత్పత్తులు వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల కావచ్చని నివేదిక పేర్కొంది.ఐఫోన్ ఎస్ఈని సాధారణంగా ఐఫోన్ సిరీస్లలోకెల్లా చౌకైన మోడల్‌గా పరిగణిస్తారు. దీని ధరలు 429 డాలర్ల (సుమారు రూ.36 వేలు) నుండి ప్రారంభమవుతాయి. 2022లో 5జీ, వేగవంతమైన A15 బయోనిక్ చిప్‌ను జోడించిన తర్వాత ఐఫోన్ ఎస్ఈ మోడల్‌కు ఇది మొదటి అప్డేట్ కానుంది. కొత్త ఐఫోన్ ఎస్ఈ కంపెనీ ఏఐ సాఫ్ట్వేర్, యాపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ చేస్తుందని నివేదిక వెల్లడించింది. మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న సామ్సంగ్, షావోమీ వంటి బ్రాండ్లతో ఈ మోడల్ ద్వారా యాపిల్ పోటీ పడనుంది. -
ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?
సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ముందుగా మార్చి 2025 వరకు దీన్ని యాపిల్ ఉత్పత్తుల్లో తీసుకురావాలని సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది. కానీ బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం సంస్థ గతంలో అనుకున్న సమయం కంటే ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.ఐఓఎస్ 18 సిరీస్‌లో యాపిల్ ఇంటెలిజన్స్ ద్వారా ‘సిరి’లో కొన్ని ఫీచర్లను అప్డేట్ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా మార్చి 2025 నాటికి ఐఓఎస్ 18.4 వెర్షన్లో సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. కానీ అంతకుముందే ఈ ఫీచర్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిసింది. సంస్థ గతంలో ప్రకటించిన విధంగా ఐఓఎస్ 18 సిరీస్ వర్షన్లను ఎప్పుడు అప్డేట్ చేస్తారో తెలిపారు.అక్టోబర్ 2024: ఐఓఎస్ 18.1 ఏఐ ఫీచర్లు ప్రారంభిస్తారు.డిసెంబర్ 2024: ఐఓఎస్ 18.2తో కొన్ని అదనపు ఫీచర్లు ప్రవేశపెడుతారు.జనవరి 2025: ఐఓఎస్ 18.3తో ‘సిరి’ని మరింత మెరుగుపరుస్తారు.మార్చి 2025: ఐఓఎస్ 18.4తో సమగ్ర యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్‌ను ప్రవేశపెడుతారు.బ్లూమ్‌బర్గ్ నివేదించిన ప్రకారంగా ముందుగానే యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్‌ను ఆవిష్కరిస్తే పైన తెలిపిన ఐఓఎస్ వర్షన్ల విడుదల తేదీల్లో మార్పులుండే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: కొత్తగా ఉద్యోగంలో చేరారా..? ఇవి తెలుసుకోండి..యాపిల్ ఇంటెలిజన్స్ ‘సిరి’లో గణనీయ మార్పులు చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందులో ప్రధానంగా సిరి సందర్భోచితంగా వినియోగదారుల అవసరాలు తీర్చనుంది. ఉదాహరణకు మీ స్నేహితుడు మొబైల్లో మీకు తన కొత్త చిరునామాను పంపితే ‘ఈ చిరునామాను తన కాంటాక్ట్ కార్డ్‌కు యాడ్ చేయమని’ చెబితే సిరి ఆ పని పూర్తి చేస్తుంది. సుదీర్ఘ ఈమెయిళ్లు చదవడం సమయంతో కూడుకున్న వ్యవహారం. సిరి సాయంతో దాని సారాంశాన్ని తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా రిప్లై ఇవ్వొచ్చు. వీటితోపాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ అధికారికంగా ప్రకటించిన తర్వాతే కంపెనీ అందించే ఫీచర్లపై స్పష్టత వస్తుంది. -
యాపిల్ బ్యాటరీ బుల్లెట్‌ప్రూఫ్!
ప్రపంచ నం.1 కంపెనీగా చలామణి అవుతున్న యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. టెక్ పరిశ్రమలో ఈ కంపెనీ గురించి తెలియని వారు దాదాపుగా ఉండరు. యాపిల్ కంపెనీ ఈరోజు (సెప్టెంబర్ 20) ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు ప్రారంభించింది. దాంతో మొబైల్ అవుట్లెట్ల వద్ద భారీగా కస్టమర్లు బారులు తీరారు. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఇటీవల ‘ఇట్స్గ్లోటైమ్’ ట్యాగ్‌లైన్‌తో జరిగిన ఈవెంట్లో కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. అటువంటి సంస్థ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఆదాయం, ఆస్తుల పరంగా యాపిల్ ప్రపంచంలోనే యాపిల్ అతిపెద్ద సంస్థ.కంపెనీ ప్రతి నిమిషానికి దాదాపుగా రూ.27 కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగి సగటు జీతం సంవత్సరానికి రూ.9 కోట్లు.2023 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా యాపిల్ కంపెనీ రోజుకు సగటున 6,32,000 ఐఫోన్ల అమ్మకాలు జరిపింది.యాపిల్ కో-ఫౌండర్‌లో ఒకరైన రొనాల్డ్‌వేన్ 1976లో తనకు చెందిన కంపెనీ 10శాతం షేర్లను 800 అమెరికన్ డాలర్లకే(ప్రస్తుత విలువ 4300 డాలర్లు-రూ.3.5లక్షలు) విక్రయించారు. కానీ ఇప్పుడు ఆ షేర్స్ విలువ 35 బిలియన్ డాలర్లు(సుమారు రూ.3లక్షలకోట్లు).ఇదీ చదవండి: అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులుప్రతి యాపిల్ ప్రకటనలోని ఫోన్ ఇమేజ్‌లో సమయం 9:41 AM అని ఉంటుంది. స్టీవ్ జాబ్స్ మొట్టమొదటి ఐఫోన్‌ను 09:41 AM కి ఆవిష్కరించాడు. అందుకు గుర్తుగా కంపెనీ అలా చేస్తోంది.యాపిల్ కంపెనీలో జాబ్ సాధించడం కంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సీట్ సాధించడం తేలికనే వాదనలున్నాయి.యాపిల్ మాక్‌బుక్ (Mac book) బ్యాటరీ మిమ్మల్ని తుపాకీ కాల్పుల నుంచి కాపాడగలదు. ఎలాగంటారా..? అది బుల్లెట్‌ప్రూఫ్.యాపిల్ కంప్యూటర్ల పరిసరాల్లో ధూమపానం చేస్తే దాని వారంటీ తగ్గిపోతుందని చెబుతుంటారు.స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉన్నపుడు తన వార్షిక వేతనం ఎంతో తెలుసా..? కేవలం 1 యూఎస్ డాలర్(ప్రస్తుతం రూ.83). -
#iPhone16 : ఐఫోన్ 16 కోసం బారులు తీరిన కస్టమర్లు (ఫొటోలు)
-
అన్నదానం కాదు.. ఐఫోన్ కోసం పరుగులు
ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. యాపిల్ ఇటీవల ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 20 నుంచి సేల్స్ ప్రారంభమవుతాయని తెలిపింది. దాంతో ముంబయిలోని యాపిల్ అవుట్లెట్ ముందు కస్టమర్లు ఉదయం నుంచే బారులు తీరారు. ఎప్పుడెప్పుడు ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలా అని వేచిచూస్తున్నారు. ఈమేరకు ముంబయిలోని యాపిల్ స్టోర్ ముందు వినియోగదారుల రద్దీని తెలియజేస్తూ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఏదో అన్నదానం కోసం వచ్చిన వారిలా గుంపులుగా చేరి స్టోర్‌లోకి పరుగెత్తుతూ వీడియోలో కనిపించారు. ఇదికాస్తా వైరల్‌గా మారింది.ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ కోసం ముంబైలోని యాపిల్ స్టోర్‌కు జనం భారీగా వచ్చారు. ఉదయాన్నే స్టోర్ వద్ద లైన్లో నిల్చున్నారు. pic.twitter.com/hEIPKSoSGT— greatandhra (@greatandhranews) September 20, 2024భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలుఐఫోన్ 16128 జీబీ: రూ.79900256 జీబీ: రూ.89900512 జీబీ: రూ.109900ఐఫోన్ 16 ప్లస్128 జీబీ: రూ.89900256 జీబీ: రూ.99900512 జీబీ: రూ.119900ఐఫోన్ 16 ప్రో128 జీబీ: రూ.119900256 జీబీ: రూ.129900512 జీబీ: రూ.1499001 టీబీ: 169900ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్256 జీబీ: రూ.144900512 జీబీ: రూ.1649001 టీబీ: రూ.184900ఇదీ చదవండి: టెలికాం కంపెనీల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు -
తమన్‌కి ఏడాదికో ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్న అనుష్క
సినిమా హిట్ అయితే డైరెక్టర్, హీరోకి నిర్మాత కారు లేదా విలువైన వస్తువులు గిఫ్ట్ ఇవ్వడం కామన్. కానీ ఓ హీరోయిన్ ప్రతి ఏడాది మ్యూజిక్ డైరెక్టర్‌కి బహుమతి ఇవ్వడం అంటే స్పెషలే కదా! స్వీటీ అనుష్క శెట్టి ఇలానే ప్రతి ఏటా మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి గిఫ్ట్ ఇస్తోంది. తాజాగా ఈ విషయాన్ని తమన్ బయటపెట్టాడు.'రాజా సాబ్', 'గేమ్ ఛేంజర్' లాంటి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉండే తమన్.. 'తెలుగు ఇండియన్ ఐడల్' పాటల పోటీకి జడ్జిగానూ వ్యవహరిస్తున్నాడు. తాజాగా టెలికాస్ట్ అయిన ఎపిసోడ్లో మాట్లాడుతూ అనుష్కని తెగ పొగిడేశాడు. తనకు 'భాగమతి' షూటింగ్ టైంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ ప్రతి ఏడాది ఓ ఐఫోన్ బహుమతిగా ఇస్తుందని చెప్పాడు.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు)'అనుష్క హీరోయిన్ అని కాదు గానీ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆమె మనసు బంగారం, అందం గురించి పక్కనబెడితే ఎంతో మంచి వ్యక్తి. ఇన్సైడ్ బ్యూటిఫుల్. నాకు ఇచ్చిన మాట ప్రకారం అనుష్క నుంచి ప్రతి సెప్టెంబరులో నాకు ఓ ఐఫోన్ గిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు వాడుతున్న ఫోన్ కూడా అదే. 'భాగమతి' షూటింగ్ టైంలో నాకు ఐఫోన్ అంటే ఇష్టమని అనుష్కతో చెప్పాను. మూవీ హిట్ అయితే ఇవ్వాలని అన్నాను. అలా ఐఫోన్ నాకు గిఫ్ట్‌గా వస్తుంటుంది. యూవీ ఆఫీస్ నుంచి అనుష్క ద్వారా నా దగ్గరకు ఐఫోన్ వస్తుంది. అలానే అనుష్క అంటే నాకు ఇష్టం. తనే నా జీవితం. నేను ఇంతవరకు చూసిన బెస్ట్ హ్యుమన్ అనుష్క' అని తమన్ చెప్పుకొచ్చాడు.చివరగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలో కనిపించిన అనుష్క.. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తోంది. మరోవైపు తమన్ చెప్పినట్లు 'భాగమతి 2' కోసం రెడీ అవుతోంది. ఇందుకోసం ఫిట్‌గా మారే పనిలో ఉంది. అందుకే బయట కనిపించట్లేదు. సరే ఇవన్నీ పక్కనబెడితే అప్పుడెప్పుడో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి ఏడాది ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వడం విశేషమనే చెప్పాలి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్)#AnushkaShetty is My Life, She is Gold, Very Lovely Human.We are Working on #Bhaagamathie 2 🔥She is Fantastic Character, Beauty is Inside. She is Most Sweetest. Every Year September, I Get an IPhone from Her as She Promised.- @MusicThaman 😍❤️🔥 pic.twitter.com/GhK73j2Z2I— Sweety Cults ❤️ (@AnushkaCults) September 15, 2024 -
ఇప్పటివరకు విడుదలైన అన్ని ఐఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్
ఒక ఫోన్ అంటే ఎంత సైజ్ ఉంటుంది.. 3 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇక ట్యాబ్ అంటే 7 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఏకంగా 6.74 అడుగుల ఫోన్ ఒకటి వెలుగులోకి వచ్చేసింది. అంటే సగటు మనిషి ఎత్తుకంటే ఎక్కువే.బ్రిటీష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ మైనీ.. ప్రపంచములోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ రూపొందించారు. దీనికి గిన్నిస్ రికార్డు కూడా దక్కింది. యితడు రూపొందిన ఫోన్ ఐఫోన్ 15 ప్రో మాక్స్. దీని ఎత్తు 6.74 అడుగులు. ఈ ఫోన్ తయారు చేయడానికి మైనీ గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్ 'మాథ్యూ పెర్క్స్'తో జతకట్టాడు.ఇదీ చదవండి: రూ.4.48 లక్షల కోట్లు: సంపాదనలో ఇతడే టాప్ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్ తయారీకి సంబంధించిన వీడియోను కూడా అరుణ్ రూపేష్ మైనీ యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఇందులో ఫోన్ తయారు చేయడానికి సంబంధించిన విషయాలను పూర్తిగా చూడవచ్చు. మొత్తానికి భారీ ఐఫోన్ రూపొందించేసారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఈ భారీ ఫోన్ చూసి ఆశ్చర్యపోతున్నారు.This scaled-up version of an iPhone 15 Pro Max was created by @mrwhosetheboss and @DIYPerks 📱 pic.twitter.com/vqhjMqTA0S— Guinness World Records (@GWR) September 6, 2024 -
డిజైన్, టెక్నాలజీలో మహిళలకు అగ్రస్థానం
ఐఫోన్ కాంట్రాక్టు తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ తమ భారత విభాగంలో మహిళలకు ప్రాధాన్యమివ్వడంపై మరింతగా దృష్టి పెడుతోంది. మహిళలను కేవలం అసెంబ్లింగ్ విభాగానికే పరిమితం చేయకుండా డిజైన్, టెక్నాలజీ సంబంధ హోదాల్లో సారథ్యం వహించేలా చర్యలు చేపడుతున్నట్లు ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యంగ్ లియు తెలిపారు.మహిళలు తమ కెరియర్లో పురోగతి సాధించేందుకు కంపెనీ మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు లియు పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. ఫాక్స్‌కాన్‌కు సంబంధించి భారత్‌లో మొత్తం 48,000 మంది ఉద్యోగులు ఉండగా, కొత్తగా రిక్రూట్ చేసుకున్న వారిలో 25 శాతం మంది వివాహిత మహిళలు ఉన్నట్లు లియు వివరించారు. సంస్థ ఇటీవలే చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబుదూర్‌లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను ఆవిష్కరించింది.ఇదీ చదవండి: ప్రభుత్వ కంపెనీలకు జరిమానా!ఫాక్స్‌కాన్ రూ.25,000 కోట్లతో కర్ణాటకలో మొబైల్ తయారీ ప్లాంటును నిర్మిస్తోంది. దీనితో 40,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ యూనిట్ ఏర్పాటు కోసం తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. -
ఇది టైప్ చేశారంటే అంతే.. ఐఫోన్ క్రాష్!
ఐఫోన్లు, ఐప్యాడ్లలో కొత్త బగ్ ఒకటి బయటపడింది. కొన్ని అక్షరాలను టైప్ చేస్తే ఐఫోన్లు, ఐప్యాడ్లు క్రాష్ అవుతున్నాయి. “”: తర్వాత ఏదైనా అక్షరం టైప్ చేయగానే స్ప్రింగ్‌బోర్డ్ అని పిలిచే యాపిల్ డివైజ్ ఇంటర్ఫేస్ క్షణంలో క్రాష్ అయ్యి తిరిగి లాక్ స్క్రీన్‌కి వెళ్తోంది.ఈ విషయాన్ని మొదట ఓ సెక్యూరిటీ రీసెర్చర్ గుర్తించారు. ఆ తర్వాత టెక్ పబ్లికేషన్ ‘టెక్‌క్రంచ్’ కూడా దీన్ని పరీక్షించింది. సెట్టింగ్స్ యాప్ లేదా యాప్ యాప్ లైబ్రరీలోని సెర్చ్ బార్లో ఈ అక్షరాలను టైప్ చేయగా క్రాష్ అవుతోందని ధ్రువీకరించింది. కొన్ని సందర్భాల్లో డివైజ్ సాధారణ స్థితికి రావడానికి ముందు స్క్రీన్ ఒక సెకను బ్లాక్‌గా ఫ్లాష్ కావచ్చని పేర్కొంది.అయితే ఈ బగ్ భద్రతా ముప్పు కాదని నిపుణులు చెబుతున్నారు. ఐఓఎస్ సెక్యూరిటీ రీసెర్చర్ అయిన రియాన్ స్టోర్జ్ సమస్యను విశ్లేషిస్తూ ఇది మీ డివైజ్ భద్రతకు హాని కలిగించదని నిర్ధారించారు. డబుల్యూ అనే సెక్యూరిటీ స్టార్టప్‌ని స్థాపించిన మరో ఐఓఎస్ నిపుణుడు పాట్రిక్ వార్డ్లే కూడా బగ్ కొంచెం ఇబ్బంది కలిగించేదే అయినా ప్రమాదకరం కాదని అంగీకరిస్తున్నారు.కాగా ఈ బగ్‌పై యాపిల్ ఇంకా స్పందించలేదు. అయితే వారు భవిష్యత్తు అప్డేట్లో దాన్ని పరిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ అసౌకర్యాన్ని నివారించాలనుకుంటే, మీ ఐఫోన్, ఐప్యాడ్ సెర్చ్ బార్లలో “”: అని మాత్రం టైప్ చేయొద్దు. -
యాపిల్ కీలక నిర్ణయం: మొదటిసారి భారత్‌లో..
యాపిల్ కంపెనీ తన 'ఐఫోన్ ఎస్ఈ' 2017లో భారతదేశంలో ఉత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 వంటివన్నీ మన దేశంలోనే తయారయ్యాయి. అయితే కంపెనీ ఇప్పటి వరకు ఇండియాలో ఎప్పుడూ ప్రో వేరియంట్లను తయారు చేయలేదు. ఇప్పుడు మొదటిసారి ఐఫోన్ 16 ప్రో మోడల్ తయారు చేయనున్నట్లు సమాచారం.యాపిల్ కంపెనీ ప్రో మోడల్ మొబైల్స్ తయారు చేయనున్నట్లు చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా యాపిల్ భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో & ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడల్‌ల తయారీని ప్రారంభించాలని యోచిస్తోందని పేర్కొంది. ప్రారంభంలో ఎంట్రీ-లెవల్, పాత ఐఫోన్ మోడళ్లపై దృష్టి సారించిన కంపెనీ క్రమంగా అప్డేటెడ్ మోడల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది.వచ్చే 3 - 4 సంవత్సరాలలో దేశంలో మొత్తం ఐఫోన్ ఉత్పత్తిలో 25 శాతం లక్ష్యంగా, యాపిల్ తన ప్రపంచ ఉత్పత్తిలో భారతదేశ వాటాను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే 16 ప్రో మోడల్స్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. స్థానిక ఉత్పత్తిని ప్రపంచవ్యాప్త విడుదలతో సమకాలీకరించాలనే లక్ష్యంతో ఫాక్స్‌కాన్ ఇప్పటికే తమిళనాడులోని తన సదుపాయంలో వేలాది మంది కార్మికులకు శిక్షణ ఇవ్వడం కూడా ప్రారంభించింది. దీన్ని బట్టి చూస్తుంటే కంపెనీ తన లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటుందని స్పష్టంగా తెలుస్తోంది. -
ఐఫోన్, ఐప్యాడ్ వాడుతున్నారా? హై రిస్క్ వార్నింగ్!
ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన సలహా జారీ చేసింది. కొన్ని యాపిల్ ఉత్పత్తుల్లో వినియోగదారుల భద్రత, గోప్యతకు ముప్పు కలిగించే సాంకేతిక లోపాలను ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ ప్రొసీజర్ టీమ్ (CERT-in) గుర్తించింది. ముప్పు ఉన్న పరికరాల జాబితాను విడుదల చేసింది.ఈ లోపాలను వినియోగించుకుని హ్యాకర్లు వినియోగదారుల వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సెర్ట్ ఇన్ తెలిపింది. స్పూఫింగ్‌పై వినియోగదారులను హెచ్చరించింది. ఈ లోపాల వల్ల యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్, ఐప్యాడ్ తదితర పరికరాల సాఫ్ట్వేర్లు ప్రభావితం కావచ్చని ప్రభుత్వం జారీ చేసిన హై రిస్క్ హెచ్చరికలో పేర్కొంది. వీటి నుంచి బయటపడటానికి యాపిల్ నుంచి సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.ముప్పు ఉన్న వెర్షన్లు ఇవే..17.6, 16.7.9కి ముందున్న iOS, iPadOS వెర్షన్లు, 14.6కి ముందు MacOS Sonoma వెర్షన్లు, 13.6.8కి ముందు MacOS వెంచురా వెర్షన్లు, 12.7.6కి ముందు macOS Monterey వెర్షన్లు, 10కి ముందు వాచ్OS వెర్షన్లు, 17.6కి ముందు tvOS వెర్షన్లు, 1.3కి ముందు visionOS వెర్షన్లు, 17.6కి ముందు Safari వెర్షన్లు.Safari versions before 17.6iOS and iPadOS versions before 17.6iOS and iPadOS versions before 16.7.9macOS Sonoma versions before 14.6macOS Ventura versions before 13.6.8macOS Monterey versions before 12.7.6watchOS versions before 10.6tvOS watchOS versions before 17.6visionOS versions before 1.3 -
ఐఫోన్ కోసం బ్లాక్మెయిల్.. ఆ తల్లి కళ్లలో నీళ్లు తిరిగే ఉంటాయి!
పిల్లలు కోరింది కాదని అనకుండా ఇచ్చే తల్లిదండ్రులను చాలామందినే చూస్తుంటాం. కానీ, తమ తల్లిదండ్రుల స్తోమతను బట్టి నడుచుకునే పిల్లలే ఈరోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నారు. అయితే.. ఇక్కడో పుత్రరత్నం గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడి తనని పోషిస్తుందన్న సోయి మరిచి.. కన్నతల్లిని ఐఫోన్ కోసం బ్లాక్మెయిల్ చేశాడా ఘనుడు.ఐఫోన్ కోసం మూడు రోజులపాటు అన్నం తినకుండా తల్లిని బ్లాక్మెయిల్ చేశాడు ఆ కొడుకు. దీంతో కన్నపేగు తల్లడిల్లిపోయింది. గుడి ముందు పూలు అమ్ముకుని జీవన సాగించే ఆమె.. కూడబెట్టిన డబ్బునంతా కొడుకు చేతిలో పెట్టింది. అయితే డబ్బు కొడుకు చేతికి ఇస్తే.. దారి తప్పే అవకాశం ఉందని ఆమె భయపడింది. కొడుకు కూడా వెళ్లి ఫోన్ షోరూంలో ఐఫోన్ కొనిచ్చింది. ఆ టైంలో వీడియో రికార్డు చేశారు అక్కడే ఉన్న సిబ్బంది. అయితే, ఆ కొడుకు కళ్లలో ఆనందం కంటే.. తన భావోద్వేగాన్ని అణుచుకుంటూ కన్నీళ్లను దిగమింగుకోవడం వీడియోలో హైలైట్ అయ్యింది. ఎంతైనా తల్లి మనసు కదా.. అలాగే ఉంటుందిలేండి!. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఖచ్చితంగా తెలియనప్పటికీ.. వీడియో వైరల్ కావడంతో నెట్టింట చర్చ నడుస్తోంది. మరి ఈ ఘటనపై మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్పేయండి.This nithalla boy stopped eating food and was demanding iPhone from her mother.His mother finally relented and gave him money to buy iPhone. She sells flowers outside a mandir.Too much love will always destroy children. Parents should know where to draw the line.This is… pic.twitter.com/govTiTKRAF— Incognito (@Incognito_qfs) August 18, 2024 -
ఏడాదిలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం
ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న యాపిల్ భారత్‌లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఇండియాలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపారం సాగించింది. దేశీయంగా ఐఫోన్లు, మ్యాక్బుక్లు, ఐప్యాడ్లు, యాపిల్ వాచ్లకు భారీ గిరాకీ ఏర్పడిందని కంపెనీ తెలిపింది. ఏడాది వ్యవధిలోనే రూ.2 లక్షల కోట్లు వ్యాపార మార్కును సాధించడానికిగల కారణాలను కంపెనీ విశ్లేషించింది.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎంతో ఉపయోగపడ్డాయి.పాక్స్‌కాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని తమిళనాడులో ఐఫోన్లను తయారు చేస్తోంది.2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా తయారైన రూ.1.35 లక్షల కోట్ల విలువైన ఐఫోన్లను కంపెనీ ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. స్థానికంగా రూ.68,000 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.అంతర్జాతీయంగా యాపిల్ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌కు తగిన విధంగా తయారీ పెంచేందుకు ఫాక్స్కాన్తోపాటు విస్ట్రోన్, పెగాట్రాన్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది.కర్ణాటకలో యాపిల్ ఐఫోన్ తయారీ ప్లాంట్ ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ను సిద్ధం చేస్తోంది. ఏటా ఆ ప్లాంట్‌లో దాదాపు 2 కోట్లు యూనిట్లను తయారుచేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.దేశీయంగా యాపిల్ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా ముంబయి, ఢిల్లీలో అవుట్లెట్లు ఏర్పాటు చేశారు.ఈకామర్స్ ప్లాట్‌పామ్‌లతో జతకట్టి యాపిల్ 42 శాతం ఉత్పత్తులను విక్రయిస్తోంది.ఇదీ చదవండి: చిన్న కిటుకుతో సిబిల్ స్కోర్ పెంపుప్రధానంగా యాపిల్ ప్రీమియం ఉత్పత్తులపై ఎక్కువ దృష్టి పెడుతోంది. దానివల్ల మార్జిన్ ఎక్కువగా సమకూరుతుంది.అత్యాధునిక మార్కెటింగ్‌తో పెరుగుతున్న బ్రాండ్ విలువ కంపెనీకి ఎంతో లాభం చేకూరుస్తోంది. -
‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ విస్తరణపై చర్చలు
ఫాక్స్‌కాన్ కంపెనీ భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయో కర్ణాటక ప్రభుత్వంతో చర్చించింది. ఈమేరకు కంపెనీ సీఈఓ యంగ్ లియు కర్ణాటకలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ ప్రారంభించేందుకు సీఎం సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ పేరుతో ఫాక్స్‌కాన్ ఐఫోన్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించింది. అనంతరం ఐటీఐఆర్ ఇండస్ట్రీ ఏరియాలో ప్రభుత్వం 300 ఎకరాల భూమిని ఫాక్స్‌కాన్‌కు కేటాయించింది. ఈమేరకు భవిష్యత్తు విస్తరణ అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై తాజాగా చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ..‘ఫాక్స్‌కాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం జతకట్టడం సంతోషంగా ఉంది. ఈ సహకారంతో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం) రంగంలో కర్ణాటక దేశ ఎగుమతుల్లో భాగమైంది. రాష్ట్రంలో సమర్థవంతమైన లాజిస్టిక్స్, విద్యుత్ సరఫరా, నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ ఉంది. కంపెనీలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని లాభాలు పొందాలి. దాంతోపాటు రాష్ట్రానికి మేలు చేయాలని భావిస్తున్నాం. ఫాక్స్‌కాన్ తన ప్రాజెక్ట్‌లను విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని అన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, భారీ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి ఎంబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.ఇదీ చదవండి: విషపూరిత మందులు.. లక్షల్లో మరణాలు!తమిళనాడులో ఇప్పటికే ఫాక్స్‌కాన్ ఐఫోన్లను తయారు చేస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా యాపిల్ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండడంతో తయారీని పెంచాలని కంపెనీ నిర్ణయించింది. దాంతో కర్ణాటకలో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ పేరుతో భారీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దొడ్డబల్లాపుర, దేవనహల్లిలో 300 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ విలువ రూ.22,000 కోట్లుగా అంచనా వేశారు. దీనివల్ల సుమారు 40,000 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ చెప్పింది. ఈ యూనిట్లో ఏటా రెండు కోట్ల స్మార్ట్ఫోన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫాక్స్‌కాన్ ఇప్పటికే ‘ప్రాజెక్ట్ చీతా’ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే మెకానికల్ కాంపోనెంట్ల తయారీ ప్లాంట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తోంది. -
భారత్‌లో ఐప్యాడ్ తయారీ..?
భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్‌కాన్ తన కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుతం తమిళనాడు యూనిట్లో యాపిల్ ఐఫోన్లను తయారుచేస్తున్న కంపెనీ త్వరలో ఐప్యాడ్లను కూడా అసెంబుల్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ మేరకు త్వరలో కంపెనీ నుంచి ప్రకటన విడుదల కావొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు తెలిపారు.యాపిల్ భారత్‌లో మరిన్ని ఉత్పత్తులను తయారుచేసేందుకు ఆసక్తిగా ఉందని గతంలోనే ప్రకటించింది. ఇప్పటికే ముంబయి, దిల్లీలో ప్రత్యేకంగా యాపిల్ అవుట్లెట్లను ప్రారంభించింది. తమిళనాడులో ఫాక్స్‌కాన్ ద్వారా ఐఫోన్లను తయారు చేస్తోంది. ఆ యూనిట్‌లోని పరికరాల్లో కొన్నింటిని అప్‌గ్రేడ్ చేసి ఐప్యాడ్లను తయారు చేయవచ్చని నిపుణులు సూచించినట్లు తెలిసింది. అందుకు సంస్థ కూడా ఆమోదం తెలిపిందని కొందరు అధికారులు చెప్పారు. త్వరలో దీనిపై కంపెనీ స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. యాపిల్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పూర్తిగా చైనాపైనే ఆధారపడకుండా విభిన్న ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగా ఐప్యాడ్ తయారీలో కొంత భాగాన్ని గత సంవత్సరం వియత్నాంకు మళ్లించారు.తమిళనాడులో కొత్త యూనిట్ కోసం భారత్‌కు చెందిన ఓ సంస్థ రూ.1,200 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఫాక్స్‌కాన్ ఫిబ్రవరిలో ప్రకటించింది. బడ్జెట్ 2024-25లో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బేసిక్ కస్టమ్స్ డ్యూటీను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు చెప్పారు. దాంతో దేశీయ తయారీకి ప్రోత్సహం లభించనుంది. యాపిల్ సంస్థ ఫాక్స్‌కాన్ ద్వారా భారత్‌లో ఐప్యాడ్ల ఉత్పత్తి ప్రారంభిస్తే స్థానికంగా మరింత మంది ఉపాధి పొందుతారని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు అంతర్జాతీయంగా భారత్‌లో తయారైన ఉత్పత్తులను ఎగుమతి చేసి సొమ్ము చేసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) వల్ల కూడా దేశీయ తయారీని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు.ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!ట్రెండ్‌ఫోర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ బోయ్స్ ఫ్యాన్ మాట్లాడుతూ..‘భారత్‌లో ఐప్యాడ్ ఉత్పత్తిని చేపట్టడం వల్ల సప్లై-చైన్ డిమాండ్‌ను భర్తీ చేయవచ్చు. దేశీయంగా యాపిల్ ఉత్పతులకు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఐప్యాడ్ ఎగుమతులు 49 మిలియన్ల(4.9 కోట్లు)కు చేరుకుంటాయని అంచనా’ అని తెలిపారు.