ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ తన ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను వినియోగించేందుకు ఓపెన్‌ఏఐతో ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్2024లో ఈమేరకు తమ భాగస్వామ్యాన్ని వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు యాపిల్ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన ఓపెన్‌ఏఐతో యాపిల్ ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించిన కాసేపటికే యాపిల్ షేర్లు పుంజుకున్నాయి. కానీ ఈ కాన్ఫరెన్స్‌లో మరిన్ని జనరేటివ్ ఏఐలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని ఆశించిన దీర్ఘకాల పెట్టుబడిదారులకు నిరాశకలిగింది. దాంతో సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి యాపిల్ పేర్లు 2శాతం నష్టపోయాయి.
ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్‌ప్రపోజ్ చేసిన సుందర్‌పిచాయ్
డెవలర్ కాన్ఫరెన్స్‌లో భాగంగా యాపిల్ విజన్ ప్రో మిక్స్‌డ్-రియాలిటీ హెడ్‌సెట్, ఐఓస్18 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. రియాలిటీ హెడ్‌సెట్ విజన్ ప్రోను చైనా, జపాన్‌తో సహా మరో ఎనిమిది దేశాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ‘సిరి’లోనూ కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లు యాపిల్ పేర్కొంది. అన్ని యాపిల్ సూట్ యాప్స్‌లో ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తీసుకురానున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment