ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఓపెన్‌ఏఐ బోర్డులో పరిశీలక స్థానాన్ని పొందినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. యాపిల్ తన ఉత్పత్తుల్లో ఓపెన్‌ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీను వాడుతున్నట్లు ప్రకటించింది. దాంతో ఇరు కంపెనీల విధానాలను ఏకీకృతం చేయడానికి యాపిల్ ఓపెన్‌ఏఐ బోర్డులో స్థానం పొందినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఈ మేరకు యాప్‌స్టోర్‌కు సారథ్యం వహిస్తున్న ఫిల్ షిల్లర్‌ను బోర్డులో పరిశీలకుడిగా ఎంచుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఆయన గతంలో యాపిల్ మార్కెటింగ్ వ్యవహారాలు కూడా పర్యవేక్షించేవారు. అతడు ఓపెన్‌ఏఐ బోర్డులో సభ్యుడిగా ఉన్నా ఓటింగ్ హక్కులు వంటి కీలక అధికారాలు మాత్రం ఉండవని యాపిల్ స్పష్టం చేసింది. రెండు సంస్థల విధానాలను యాపిల్‌కు అనుగుణంగా ఏకీకృతం చేయాడానికి ఆయన ప్రయత్నిస్తారని తెలిపింది. ఈ ఏడాది చివరి నుంచి షిల్లర్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.
ఇదీ చదవండి: ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!
జూన్ నెలలో నిర్వహించిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో భాగంగా యాపిల్-ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. యాపిల్ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీను వినియోగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఏడాది చివరి నాటికి యాపిల్ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపాయి. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చని యాపిల్ పేర్కొంది. జనరేటివ్‌ఏఐ వినియోగానికి సంబంధించి యాపిల్ మెటా, గూగుల్‌తోనూ చర్చలు జరుపుతోంది. ఇంకా వాటిపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment