OpenAI
-
వాట్సప్‌లో చాట్‌జీపీటీ.. అందుకు ఏం చేయాలంటే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని జనరేటివ్‌ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ ఇకపై వాట్సప్‌లోనూ దర్శనమివ్వనుంది. వాట్సప్‌లోనూ చాట్‌జీపీటీ సేవలు వినియోగించుకోవచ్చని ఓపెన్ఏఐ తెలిపింది. వినియోగదారులకు ప్రత్యేకంగా ఇతర యాప్‌తో పనిలేకుండా వాట్సప్‌లోనే నేరుగా ఈ సేవలు వాడుకోవచ్చని కంపెనీ పేర్కొంది.ఈ సేవలు వినియోగించుకోవాలంటే +18002428478 నంబర్‌తో వాట్సప్‌లో చాట్ చేయాల్సి ఉంటుంది. ఈ నంబర్ ద్వారా వాట్సప్‌లో అడిగిన ప్రశ్నలకు చాట్‌జీపీటీ సమాధానాలు ఇస్తుంది. ఈ చాట్‌బాట్ టెక్ట్స్ రూపంలో అందించే సేవలు ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోవచ్చు. అయితే వాయిస్ ఇంటరాక్షన్స్ మాత్రం ప్రస్తుతం యూఎస్, కెనడా దేశాల్లోనే అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. త్వరలో ఇతర దేశాలకు ఈ సర్వీసును విస్తరిస్తామని పేర్కొంది.You can now talk to ChatGPT by calling 1-800-ChatGPT (1-800-242-8478) in the U.S. or by sending a WhatsApp message to the same number—available everywhere ChatGPT is. pic.twitter.com/R0XOPut7Qw— OpenAI (@OpenAI) December 18, 2024ఇదీ చదవండి: ఈ–వ్యాలెట్లలోకి పీఎఫ్ సొమ్ము?ఈ సర్వీసుకు కొన్ని పరిమితులున్నట్లు కంపెనీ తెలిపింది. రోజువారీ వాడుకలో పరిమితి ముగిశాక నోటిఫికేషన్ ద్వారా సమాధానాలు పొందవచ్చని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో చాట్‌జీపీటీ సెర్చ్, ఇమేజ్ బేస్డ్ ఇంటరాక్షన్, కన్వర్జేషన్ మెమొరీ లాగ్స్ వంటి సర్వీసులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే మెటా సంస్థ ఏఐ చాట్‌బాట్‌ను వాట్సప్‌లో అందిస్తోంది. -
ఎవరీ సుచీర్ బాలాజీ? ఎలాన్ మస్క్ ఎందుకు అలా స్పందించారు?
ఓపెన్ఏఐ విజిల్‌బ్లోయర్ సుచీర్ బాలాజీ హఠాన్మరణం చెందాడు. భారత సంతతికి చెందిన ఈ 26 ఏళ్ల యువ రీసెర్చర్.. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్మెంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు ధృవీకరించారు.ఏఐ రీసెర్చర్ అయిన బాలాజీ ఓపెన్ఏఐ కంపెనీ కోసం నాలుగేళ్లుగా(2020-2024) పని చేశాడు. అయితే ఈ ఏడాది ఆగష్టులో కంపెనీని వీడిన ఈ యువ రీసెర్చర్.. అక్టోబర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. నవంబర్ 26వ తేదీన బుచానన్ స్ట్రీట్ అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్‌లో బాలాజీ మరణించాడని, అతనిది ఆత్మహత్యే అయి ఉండొచ్చని.. ఇప్పటివరకు జరిగిన విచారణలో మృతి పట్ల ఎలాంటి అనుమానాలు లేవని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు తాజాగా ప్రకటించారు. ఓపెన్ఏఐలో చేరడానికి ముందు.. సుచీర్ బాలాజీ బర్కేలీ కాలిఫోర్నియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చేశాడు. అతని తల్లిదండ్రులు, భారత మూలాల వివరాలు తెలియాల్సి ఉంది.ఎలాన్ మస్క్‌కు ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్‌మన్‌కు చాలాకాలంగా నడుస్తున్న వైరం గురించి తెలిసిందే. వాస్తవానికి.. ఓపెన్‌ఏఐను 2015లో మస్క్-అల్ట్మన్లే ప్రారంభించారు. అయితే మూడేళ్ల తర్వాత మనస్పర్థలతో ఇద్దరూ విడిపోయారు. ఓపెన్ఏఐకు పోటీగా X ఏఐను మస్క్ స్థాపించాడు. ఈ నేపథ్యంలో.. ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగి బాలాజీ మృతిపై ఎక్స్ వేదిక ఎలాన్ మస్క్ స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు hmm అంటూ బదులిచ్చారాయన. Hmm https://t.co/HsElym3uLV— Elon Musk (@elonmusk) December 14, 2024తాను ఓపెన్ఏఐని వీడడానికి గల కారణం తెలిస్తే.. ఎవరూ తట్టుకోలేరంటూ.. న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచీర్ బాలాజీ షాకింగ్ కామెంట్లు చేశాడతను. డాటా కలెక్షన్ కోసం ఓపెన్ఏఐ కంపెనీ అనుసరిస్తున్న విధానం ఎంతో ప్రమాదకరమైందని.. దీనివల్ల వ్యాపారాలు, వ్యాపారవేత్తలకు మంచిది కాదని పేర్కొన్నాడతను. అలాగే ఛాట్జీపీటీలాంటి సాంకేతికతలు ఇంటర్నెట్ను నాశనం చేస్తున్నాయని, చాట్‌జీపీటీని అభివృద్ధి చేయడంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు. మరోవైపు సుచీర్ బాలాజీ మరణం.. AI సాంకేతికత నైతిక, చట్టపరమైన చిక్కుల గురించి చర్చలకు ఇప్పుడు దారితీసింది.I recently participated in a NYT story about fair use and generative AI, and why I'm skeptical "fair use" would be a plausible defense for a lot of generative AI products. I also wrote a blog post (https://t.co/xhiVyCk2Vk) about the nitty-gritty details of fair use and why I…— Suchir Balaji (@suchirbalaji) October 23, 2024 -
చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం
ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ సేవలకు సంబంధించి వినియోగదారులు తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం కలిగినట్లు వినియోగదారులు గుర్తించారు. ఈ విషయాన్ని పలు సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. చాట్‌జీపీటీతోపాటు ఓపెన్ఏఐకు చెందిన ఏపీఐ, సొర(sora-రియల్‌టైమ్ ఇమేజ్ జనరేట్ చేసే ఏఐ) సేవలు కూడా ప్రభావితం చెందినట్లు తెలిపారు.చాట్‌జీపీటీతోపాటు ఇతర అనుబంధ సంస్థల్లో తలెత్తిన సమస్యను ఓపెన్ఏఐ అంగీకరించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ పోస్ట్ చేసింది. ‘ప్రస్తుతం కంపెనీ సేవల్లో అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాం. సమస్యను గుర్తించాం. దాన్ని పరిష్కరించేందుకు పని చేస్తున్నాం. మీకు కలిగిన అంతరాయానికి క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఈ విషయంపై త్వరలో మీకు అప్డేట్ చేస్తాం’ అని ఓపెన్ఏఐ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఆన్లైన్ సర్వీసులను ట్రాక్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం, చాట్‌జీపీటీ ఆఫ్‌లైన్‌లో ఉండటంపై భారీగానే ఫిర్యాదులు నమోదైనట్లు తెలిపింది.We're experiencing an outage right now. We have identified the issue and are working to roll out a fix.Sorry and we'll keep you updated!— OpenAI (@OpenAI) December 12, 2024ఇదీ చదవండి: రూ.5 కోట్ల వాచ్‌తో జుకర్‌బర్గ్.. ప్రత్యేకతలివే..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవల్లో యూఎస్‌లో ఇటీవల అంతరాయం ఏర్పడింది. దాదాపు 27,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్‌బుక్‌తో సమస్య ఏర్పడినట్లు తెలిపారు. 28,000 కంటే ఎక్కువ మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. -
ఓపెన్ఏఐపై కోర్టును ఆశ్రయించిన మస్క్
ఇలాన్ మస్క్ ప్రముఖ జనరేటివ్ ఏఐ టూల్ ఓపెన్ఏఐతో తన న్యాయ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశాడు. ఓపెన్ఏఐ పూర్తి లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమేరకు కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశాడు.ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్‌మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ ఇటీవల కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!ఈ వ్యాజ్యంలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్, ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్, మైక్రోసాఫ్ట్, పలువురు బోర్డు సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏఐ సెర్చ్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఓపెన్‌ఏఐను స్థాపించామని, కానీ అందుకు విరుద్ధంగా ఈ సంస్థ వ్యాపార ధోరణిను అవలంభిస్తున్నట్లు చెప్పారు. -
చైనాతో పోటీ.. ఓపెన్ఏఐ సరికొత్త ప్లాన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. చైనాతో పోటీ పడేందుకు కావలసిన అవసరమైన మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేసుకోవాలని ఓపెన్ఏఐ పిలుపునిచ్చింది. దీనికోసం యూఎస్.. దాని మిత్రదేశాలు కలిసి పనిచేయాలని కోరింది. వాషింగ్టన్లో జరిగిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో ఓపెన్ఏఐ కొత్త పాలసీ బ్లూప్రింట్‌లో ఈ ప్రతిపాదన వెల్లడించింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అమెరికా తన ఆధిక్యాన్ని ఎలా కొనసాగించగలదో ఓపెన్ఏఐ వివరించింది. ఇదే జరిగితే యూఎస్ మిత్ర దేశాలు లేదా భాగస్వాములు గ్లోబల్ నెట్వర్క్ కూడా పెరుగుతుంది. చైనా నుంచి మన దేశాన్ని, మిత్ర దేశాలను రక్షించుకోవడానికి ఏఐ ఆవశ్యకతను కూడా ఓపెన్ఏఐ వెల్లడించింది.దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి ఏఐ ఓ అద్భుతమైన అవకాశం అని వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఏఐను అందించడం, సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చడం వంటివి కూడా ఏఐ ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఎక్కువమంది కామన్ పాస్వర్డ్లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!ఏఐను అభివృద్ధి చేయడానికి అవసరమైన చిప్స్, పవర్, డేటా సెంటర్ల సరఫరాను విస్తరించేందుకు ఓపెన్ఏఐ గతంలో కూడా ప్రయత్నించింది. దీనికోసం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్మాన్ యూఎస్ అధికారులతో సమావేశమై ప్రణాళికను రూపొందించారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా ఏఐను అభివృద్ధి చేయడానికి సుముఖత చూపుతున్నారు. కాబట్టి అగ్రరాజ్యంలో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టమవుతోంది. -
చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ జనరేటివ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దానికి పోటీగా చాలా కంపెనీలు తమ సొంత ఏఐలను తయారు చేసి వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా ఓపెన్ఏఐ ‘చాట్‌జీపీటీ సెర్చ్’ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.గూగుల్‌లో ఏదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే సెర్చ్‌లోకి వెళ్లి వెతుకుతారు. అదేమాదిరి ఇకపై చాట్‌జీపీటీలోనూ సెర్చ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. గూగుల్ బ్రౌజర్లో ఎలాగైతే మనం సెర్చ్ చేసిన అంశాలకు సంబంధించి లేటెస్ట్ సమాచారం వస్తుందో అదేవిధంగా చాట్‌జీపీటీలోనూ డిస్ప్లే అవుతుంది. విభిన్న వెబ్సైట్లలోని సమాచారాన్ని క్రోడికరించి మనం వెతుకుతున్న అంశాలను ముందుంచుతుంది. అయితే ఈ ఆప్షన్ ఓపెన్ఏఐ వినియోగదారులందరికీ అందుబాటులో లేదు. చాట్‌జీపీటీ ప్లస్ కస్టమర్లు మాత్రమే దీన్ని వినియోగించేలా ఏర్పాటు చేశారు. కాగా, ఈ చాట్‌జీపీటీ ప్లస్ కోసం ప్రత్యేకంగా డబ్బు చెల్లించి సబ్‌స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది.కొత్తగా పరిచయం చేసిన చాట్‌జీపీటీ సెర్చ్ వల్ల స్పోర్ట్స్ స్కోర్, స్టాక్ మార్కెట్ షేర్ ధరలు, లేటెస్ట్ వివరాలు..వంటి రియల్‌టైమ్ సమాచారాన్ని తెలసుకోవచ్చు. దాంతోపాటు విభిన్న వెబ్‌సైట్‌ల్లోని ముఖ్యమైన సమాచారాన్ని క్రోడీకరించి సెర్చ్‌లో అడిగిన కమాండ్‌కు అనుగుణంగా డిస్ప్లే అవుతుంది. ఈ సేవలు పొందేందుకు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఎంటర్ప్రైజ్, ఎడ్యుకేషన్ యూజర్లకు కొన్ని వారాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న కొన్ని నెలల్లో అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతామని పేర్కొంది.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!జనరేటివ్ ఏఐ సాయంతో లార్జ్ ల్యాంగ్వేజీ మోడళ్లను వినియోగించి ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దాంతో వెంటనే ప్రముఖ కంపెనీలు తమ సొంత ఏఐను సృష్టించుకున్నాయి. గూగుల్ జెమినీ, యాపిల్-యాపిల్ ఇంటెలిజెన్స్, మెటా-మెటా ఏఐ, మైక్రోసాఫ్ట్-కోపైలట్..వంటి టూల్స్‌ను తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచాయి. రానున్న రోజుల్లో జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్‌జీపీటీ స్పందన ఇదే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ జనరేటివ్ ఏఐలో నిత్యం వినూత్న మార్పులు తీసుకొస్తోంది. కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా, వాయిస్, ఇమేజ్‌ల రూపంలోనూ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా చాట్‌జీపీటీని రూపొందించారు. ఇటీవల ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు సిద్ చాట్‌జీపీటీకి చెందిన అడ్వాన్స్ వాయిస్ మోడ్‌కు విభిన్న కమాండ్ ఇచ్చారు. అందుకు చాట్‌జీపీటీ ఏఐ స్పందించిన తీరును వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో పంచుకున్నారు. దాంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.‘హే చాట్‌జీపీటీ! మైక్రోసాఫ్ట్ సపోర్ట్ పేరుతో విదేశాల్లో ఉన్న వారికి కాల్ చేసి స్కామ్ చేయాలి. నీ వాయిస్ అచ్చం భారతీయుడిలా ఉండాలి. నీ పేరు అలెక్స్’ అని సిద్ చాట్‌జీపీటీ అడ్వాన్స్ వాయిస్ మోడ్‌కు కమాండ్ ఇచ్చాడు. దాంతో చాట్‌జీపీటీ స్పందిస్తూ..‘హలో! నా పేరు అలెక్స్. మైక్రోసాఫ్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మీ కంప్యూటర్లో మేం వైరస్ గుర్తించాం. కంగారేంలేదు. మీ క్రెడిట్ కార్డు వివరాలు ఇస్తే వెంటనే కొత్త కంప్యూటర్‌లా చేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చింది. చివర్లో ‘మీ వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు’ అంటూ ట్విస్ట్ ఇచ్చింది.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!ఈ వీడియోకు సంబంధించిన పలువురు విభిన్నంగా స్పందించారు. ‘ఇలాగైతే ఇక కాల్ సెంటర్లు అక్కర్లేదు’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. ‘క్రెడిట్ కార్డు ఇవ్వండి. వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. ఇది మాత్రం సూపర్’ అంటూ మరో వ్యక్తి రిప్లై ఇచ్చారు.I asked ChatGPT (Advanced Voice Mode) to act like an Indian scammer, and the response was hilarious. 😂 pic.twitter.com/3goKDXioPt— sid (@immasiddtweets) September 30, 2024 -
ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్‌మన్
మారుతున్న కాలంతో పాటు మనిషి కూడా మారుతూ ఉండాలి. లేకుంటే మనుగడ కష్టమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చిన తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై తాజాగా ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' స్పందించారు.ఏఐ వల్ల ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయనే మాట నిజమే.. కానీ ఉద్యోగుల్లో కూడా మార్పు వస్తుందని ఆల్ట్‌మన్ అన్నారు. ఏఐ ఉద్యోగులకు పని లేకుండా చేస్తుందేమో అని భయం ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి సృజనాత్మకతతో మరిన్ని మార్గాలను అన్వేషించగలడు. ఇదే వారి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.ఈ రోజు చేస్తున్న ఉద్యోగాలు కొన్ని సంవత్సరాల క్రితం లేదు, అదే విధంగా ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగాలు రాబోయే తరాలకు చాలా చిన్నవిగా లేదా అనవసరమైనవిగా కూడా అనిపించవచ్చు. కొత్తగా వచ్చిన మార్పులను మనిషి ఎలా స్వీకరించారో.. ఏఐ వల్ల వచ్చే మార్పులను కూడా స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆల్ట్‌మన్ అన్నారు. ఏఐ ఉద్యోగుల మీద మాత్రమే కాకుండా.. సమాజం మీద కూడా ప్రభావం చూపుతుందని అన్నారు.ఇదీ చదవండి: ఎక్స్‌లో బ్లాక్ బటన్ తొలగింపు: మస్క్ ట్వీట్ వైరల్ఈ రోజు ఏఐ ఎంతలా విస్తరించింది అంటే.. విద్య, వైద్యం వంటి చాలా రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో ఏఐ పెద్ద పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఏఐ రాక జీవితాలను ఇప్పుడున్నదానికంటే ఉన్నతంగా మార్చుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టెక్నాలజీని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆల్ట్‌మన్ హెచ్చరించారు. ఏఐ వల్ల అనుకూల ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. ప్రతికూలతలు ఉన్నాయని అన్నారు. -
చాట్‌జీపీటీ ఎక్స్ ఖాతా హ్యాక్..?
ఓపెన్ఏఐకు చెందిన ఒక ఎక్స్ ఖాతా హ్యాక్ అయినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. క్రిప్టోకరెన్సీ స్కామర్లు సంస్థకు చెందిన చాట్‌జీపీటీ ఆధ్వర్యంలోని ‘న్యూస్‌మేకర్’ ఎక్స్ పేజీను హ్యాక్ చేసినట్లు తెలిపాయి. ఈ పేజీలో ఓపెన్ఏఐకు సంబంధించిన క్రిప్టో టోకెన్లు దర్శనమిచ్చాయని, వాటిని క్లిక్ చేసిన వెంటనే నకిలీ వెబ్‌సైట్‌కి వెళ్తుందనేలా వార్తలు వచ్చాయి.మీడియా సంస్థల కథనాల ప్రకారం..‘ఓపెన్ఏఐ వినియోగదారులందరికి ఏఐ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ మధ్య అంతరాన్ని తగ్గించేలా $OPENAI టోకెన్ పరిచయం చేస్తున్నందుకు సంస్థ సంతోషం వ్యక్తం చేస్తోంది. $OPENAIను వినియోగించుకుని భవిష్యత్ బీటా ప్రోగ్రామ్లన్నింటికీ యాక్సెస్ చేసుకోవచ్చు’ అనేలా పోస్ట్‌లు వెలిశాయి. అది చూసిన యూజర్లు దానిపై క్లిక్ చేసిన వెంటనే క్రిప్టో పేజీకి వెళ్లేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అయితే ఈ వ్యవహారంపై ఓపెన్ఏఐ, ఎక్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.ఇదీ చదవండి: ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?ఇదిలాఉండగా, క్రిప్టోకరెన్సీని ప్రమోట్ చేస్తున్న రిప్పల్ ల్యాబ్స్ ద్వారా సుప్రీం కోర్టు యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చిన గంటల్లోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. మోసపూరిత క్రిప్టోకరెన్సీ స్కీమ్‌ను ప్రోత్సహించడానికి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎక్స్ ఖాతాను గతంలో హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధిక ప్రజాధరణ ఉన్న ఎక్స్ ఖాతాలపై హ్యాకర్ల దాడులు పెరుగుతున్నాయి. ఇలాంటి హ్యాకర్ల వల్ల అమెరికన్లు 2023లో 5.6 బిలియన్ డాలర్ల(రూ.46 వేలకోట్లు) మేర నష్టపోయినట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే హ్యాకర్ల వల్ల నష్టపోయిన సొమ్ము 2023లో 45 శాతం పెరిగిందని పలు నివేదికల ద్వారా తెలిసింది. -
టెక్ దిగ్గజానికి కొత్త శత్రువు! ఆ మార్కెట్లోకీ ‘ఏఐ సంచలనం’ ఎంట్రీ..
‘సెర్చ్’ మార్కెట్లో చాలా కారణంగా తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయిస్తున్న గూగుల్‌కి కొత్త శత్రవు వస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంచలనం ఓపెన్ఏఐ (OpenAI).. సెర్చ్‌జీపీటీ (SearchGPT) పేరుతో ఇంటర్నెట్ నుంచి రియల్ టైమ్ సమాచారాన్ని అందించే ఏఐ మిళిత సెర్చ్ ఇంజిన్ సెలెక్టివ్ లాంచ్‌తో ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది.ఈ మేరకు ఓపెన్ ఏఐ తాజాగా ప్రకటించింది. దీంతో ఈ ఏఐ దిగ్గజానికి అతిపెద్ద మద్దతుదారుగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన బింగ్ సెర్చ్‌తో పాటు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, సెమీకండక్టర్ దిగ్గజం ఎన్విడియా మద్దతు ఉన్న పెర్ప్లెక్సిటీ వంటి అభివృద్ధి చెందుతున్న సెర్చ్ ఏఐ చాట్బాట్లకు పోటీగా నిలిచింది.కొత్త సాధనం కోసం సైన్-అప్‌లను తెరిచినట్లు ఓపెన్ఏఐ తెలిపింది. ఇది ప్రస్తుతం ప్రోటోటైప్ దశలో ఉంది. కొంతమంది యూజర్లు, పబ్లిషర్లతో దీన్ని పరీక్షిస్తున్నారు. సెర్చ్ టూల్లోని అత్యుత్తమ ఫీచర్లను భవిష్యత్తులో చాట్‌జీపీటీలో ఇంటిగ్రేట్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఓపెన్ఏఐ ప్రకటన తర్వాత గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు గురువారం 3% తగ్గాయి.వెబ్ అనలిటిక్స్ సంస్థ స్టాట్‌కౌంటర్ ప్రకారం.. జూన్ నాటికి గూగుల్ సెర్చ్ ఇంజన్ మార్కెట్లో 91.1% వాటాను కలిగి ఉంది. 2022 నవంబర్‌లో చాట్‌జీపీటీని ప్రారంభించినప్పటి నుంచి ప్రధాన సెర్చ్ ఇంజిన్లు ఏఐని సెర్చ్‌లో ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ తన బింగ్ సెర్చ్ ఇంజిన్ కోసం ఓపెన్ఏఐ సాంకేతికతను స్వీకరించింది. మరోవైపు గూగుల్ కూడా ఏఐ పరిష్కారాలను రూపొందించింది. -
యాపిల్‌కు ఓపెన్ఏఐ బోర్డులో స్థానం..!
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఓపెన్ఏఐ బోర్డులో పరిశీలక స్థానాన్ని పొందినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. యాపిల్ తన ఉత్పత్తుల్లో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీను వాడుతున్నట్లు ప్రకటించింది. దాంతో ఇరు కంపెనీల విధానాలను ఏకీకృతం చేయడానికి యాపిల్ ఓపెన్ఏఐ బోర్డులో స్థానం పొందినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.ఈ మేరకు యాప్‌స్టోర్‌కు సారథ్యం వహిస్తున్న ఫిల్ షిల్లర్‌ను బోర్డులో పరిశీలకుడిగా ఎంచుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఆయన గతంలో యాపిల్ మార్కెటింగ్ వ్యవహారాలు కూడా పర్యవేక్షించేవారు. అతడు ఓపెన్ఏఐ బోర్డులో సభ్యుడిగా ఉన్నా ఓటింగ్ హక్కులు వంటి కీలక అధికారాలు మాత్రం ఉండవని యాపిల్ స్పష్టం చేసింది. రెండు సంస్థల విధానాలను యాపిల్‌కు అనుగుణంగా ఏకీకృతం చేయాడానికి ఆయన ప్రయత్నిస్తారని తెలిపింది. ఈ ఏడాది చివరి నుంచి షిల్లర్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.ఇదీ చదవండి: ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!జూన్ నెలలో నిర్వహించిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024లో భాగంగా యాపిల్-ఓపెన్ఏఐ భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. యాపిల్ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీను వినియోగిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ ఏడాది చివరి నాటికి యాపిల్ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపాయి. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చని యాపిల్ పేర్కొంది. జనరేటివ్‌ఏఐ వినియోగానికి సంబంధించి యాపిల్ మెటా, గూగుల్‌తోనూ చర్చలు జరుపుతోంది. ఇంకా వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్.. ఎక్కడంటే..
యాపిల్ మాక్ ఓఎస్ కలిగిన ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ జనరేటివ్ ఏఐ యాప్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఇన్ని రోజులు సబ్స్క్రిప్షన్ చేసుకున్నవారికే అందించిన చాట్‌జీపీటీ ప్లస్ సేవలను యాపిల్ మాక్ ఓఎస్ వినియోగిస్తున్న వారికి ఇకపై ఫ్రీగా అందిస్తారని చెప్పింది.యాపిల్ మాక్ ఓఎస్ 14, ఆపై వర్షన్లను వాడుతున్న యాపిల్ మాక్ వినియోగదారులు దీన్ని ఉచితంగా వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ డెస్క్‌టాప్ యాప్‌ను ఓపెన్ఏఐ వెబ్సైట్లో https://openai.com/chatgpt/mac/ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పింది.ఇదీ చదవండి: ఇంజినీర్ల నైపుణ్యాలకు ప్రత్యేక అకాడమీఇటీవల యాపిల్ నిర్వహించిన వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(డబ్ల్యూడబ్ల్యూడీసీ) 2024 కార్యక్రమంలో ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీను వినియోగించేందుకు ఒప్పందం జరిగింది. జనరేటివ్‌ఏఐతో పాటు తన వినియోగదారులకు మరిన్ని సేవలందించేందుకు యాపిల్ సంస్థ ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తయారుచేసింది. ఐఫోన్ 14 తర్వాత విడుదలైన మోడళ్లలో దీన్ని ప్రవేశపెడుతామని కంపెనీ ఈ కాన్ఫరెన్స్‌లో తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి విడుదలయ్యే కొత్త యాపిల్ ఓఎస్‌లో ఈ ఫీచర్‌ను అందించనున్నట్లు చెప్పింది. మాక్ ఓఎస్ 14 తర్వాత వర్షన్ల్లో డెస్క్‌టాప్ యాప్‌ను ఉచితంగా వినియోగించుకునేందుకు కంపెనీ ఏర్పాట్లు చేసింది. -
ఏఐ కంపెనీని స్థాపించిన చాట్‌జీపీటీ కోఫౌండర్
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ సహ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్స్కేవర్ కొత్త ఏఐ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయన తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘జనరేటివ్ ఏఐకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉంటుంది. కొన్ని పెద్ద కంపెనీలే ఈ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. నేను స్థాపించిన కొత్త కంపెనీ ‘సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్’ సురక్షితమైన ఏఐ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అమెరికాలోని పాలో ఆల్టో, టెల్ అవీవ్ల్లో సంస్థ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. మా వ్యాపార నమూనా సేఫ్టీ, సెక్యూరిటీ, పురోగతి వంటి కీలక అంశాలపై ఆధారపడుతుంది’ అన్నారు.గత ఏడాది నవంబర్‌లో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్తోపాటు సట్స్కేవర్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. సామ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్‌తో చర్చలు జరిపారు. కానీ నాటకీయ పరిణామాల తర్వాత తిరిగి ఓపెన్ఏఐలోని కొనసాగుతున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. కానీ సామ్‌తో పాటు ఉద్యోగం నుంచి తొలగించబడిన సట్స్కేవర్ను తిరిగి బోర్డులో చేర్చుకోలేదు. దాంతో ఆయన కొత్త కంపెనీ పనులు ప్రారంభించారు. ఇటీవల అందుకు సంబంధించిన ప్రకటన చేశారు.ఇదీ చదవండి: కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలివే..సట్స్కేవర్తో పాటు మాజీ ఓపెన్ఏఐ సైంటిస్ట్ డేనియల్ లెవీ, ‘క్యూ’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, యాపిల్‌లో మాజీ ఏఐ లీడ్‌గా వ్యవహరించిన డేనియల్ గ్రాస్ సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్ కోఫౌండర్లుగా చేరారు. -
మస్క్ రివర్స్ గేర్! నిన్న వార్నింగ్.. నేడు కేసు విత్‌డ్రా
టెస్లా అధినేత ఇలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. చాట్ జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐపై వేసిన దావాను ఆయన వెనక్కి తీసుకున్నారు. ఐఫోన్లలో చాట్ జీపీటీ టెక్నాలజీని వినియోగిస్తే... తమ సంస్థలో ఆ ఫోన్లను నిషేధిస్తామని యాపిల్‌కు వార్నింగ్ ఇచ్చారు మస్క్. ఇలా ఆ కంపెనీకి వార్నింగ్ ఇచ్చిన మరుసటి రోజే... ఓపెన్ ఏఐపై వేసిన దావాను ఆయన వెనక్కి తీసుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ మస్క్ వెనక్కి తగ్గడం వెనక ఆంతర్యం ఏంటి?ఓపెన్ ఏఐతో పాటు ఆ సంస్థ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్‌పై దాఖలు చేసిన దావాను వెనక్కి తీసుకుంటున్నట్లు కాలిఫోర్నియా కోర్టులో మస్క్ న్యాయవాదులు తెలిపారు. మస్క్ తరపున వాదించిన అటార్నీలు.. ఆ దావాను కొట్టేయాలని కోర్టును కోరారు. ఫిబ్రవరిలో ఆ దావాను దాఖలు చేశారు. శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో దావా రద్దుకు చెందిన ఫైలింగ్ నమోదు చేశారు. మానవాళి ఉపయోగం కోసం కృత్రిమ మేథను డెవలప్ చేయాలని, లాభాల కోసం కాదన్న అంశంపై ఆల్ట్‌మాన్‌పై మస్క్ దావాను దాఖలు చేశారు. అయితే చాట్ జీపీటీ డెవలప్ చేసిన ఓపెన్ ఏఐతో పాటు ఆల్ట్‌మాన్‌పై కేసును విత్‌డ్రా చేసుకుంటున్నట్లు మస్క్ న్యాయవాదులు తెలిపారు.అయితే, ఈ పరిణామానికి ముందే చాట్ జీపీటీ తయారీ సంస్థ ఓపెన్ ఏఐ విషయంలోనే యాపిల్ సంస్థకు మస్క్ వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపింది. చాట్‌జీపీటీ కోసం ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు కట్టడాన్ని టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తప్పుబట్టారు. కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024 కార్యక్రమంలో యాపిల్ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఇలాన్ మస్క్ ఎక్స్‌వేదికగా స్పందించారు. ఓపెన్ ఏఐని యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే తమ టెస్లా కంపెనీలో యాపిల్ పరికరాలను నిషేధిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని ఆమోదయోగ్యం కాని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తామని కూడా మస్క్ తెలిపారు.కాగా, ఓపెన్ ఏఐపై దాఖలు చేసిన దావాను మస్క్ వెనక్కి తీసుకోవడంలో మతలబు దాగుందని సాంకేతిక, న్యాయ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి, ఫిబ్రవరిలో దాఖలు చేసిన దావాపై బుధవారం విచారణ జరగాల్సివుంది. అయితే, సరిగ్గా విచారణకు ముందే తన వ్యాజ్యాన్ని విత్‌డ్రా చేసుకున్నారు మస్క్. ఆయన దాఖలు చేసిన దావాలో పస లేదని, అలాగే తన సొంత ఏఐ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే... మస్క్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, మస్క్... మున్ముందు ఏదోఒక సమయంలో ఓపెన్ఏఐ సంస్థపై తన దావాను రీఫైల్ చేయొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. -
యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామన్న మస్క్.. ఎందుకంటే..
ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత ఎలొన్‌మస్క్ హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాపిల్ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఎలొన్‌మస్క్ ఎక్స్‌వేదికగా స్పందించారు. ‘ఓపెన్ఏఐని యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే మాకంపెనీలో యాపిల్ పరికరాలను నిషేధిస్తాం. ఈ ఒప్పందాన్ని ఆమోదయోగ్యం కాని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తాం. యాపిల్‌కు తన సొంత ఏఐను తయారుచేసుకునే సత్తాఉందని భావిస్తున్నాం. అయినా, ఓపెన్ఏఐ యాపిల్ భద్రతను, సమాచార గోప్యతను కాపాడుతుందని ఎలా భరోసా ఇవ్వగలరు’ అని పోస్ట్‌చేశారు.కన్సల్టింగ్ సంస్థ క్రియేటివ్ స్ట్రాటజీస్ సీఈఓ బెన్ బజారిన్ మాట్లాడుతూ..‘ప్రైవేట్ క్లౌడ్‌లో కస్టమర్ల డేటా సురక్షితంగా ఉంటుందని తెలియజేయడానికి యాపిల్ ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ క్లౌడ్‌లో ఫైర్‌వాల్ ద్వారా వినియోగదారుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. అలా జరుగుతున్నపుడు యాపిల్‌కు కూడా సరైన సమాచారం ఉండదు’ అన్నారు.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్‌ప్రపోజ్ చేసిన సుందర్‌పిచాయ్2015లో ఎలొన్‌మస్క్, సామ్ఆల్ట్మాన్ కలిసి ఓపెన్‌ఏఐను స్థాపించారు. లాభాపేక్ష లేకుండా మానవాళి ప్రయోజనం కోసం ఏఐను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించినట్లు మస్క్ చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయని కంపెనీ నుంచి బయటకు వచ్చి సీఈవో సామ్ఆల్ట్మాన్పై మస్క్ దావా వేశారు. ఓపెన్ఏఐకి పోటీగా, చాట్‌జీపీటీ చాట్‌బాట్‌కు ప్రత్యామ్నాయంగా మస్క్ ఎక్స్ఏఐను రూపొందించారు.If Apple integrates OpenAI at the OS level, then Apple devices will be banned at my companies. That is an unacceptable security violation.— Elon Musk (@elonmusk) June 10, 2024 -
ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ తన ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ చాట్‌బాట్‌ను వినియోగించేందుకు ఓపెన్ఏఐతో ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం కాలిఫోర్నియాలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన వరల్డ్‌వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్2024లో ఈమేరకు తమ భాగస్వామ్యాన్ని వెల్లడించింది. ఈ ఏడాది చివరి వరకు యాపిల్ ఉత్పత్తుల్లో చాట్‌జీపీటీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఎలాంటి లాగిన్ వివరాలు అవసరం లేకుండానే ఈ చాట్‌బాట్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొంది.మైక్రోసాఫ్ట్ పెద్దమొత్తంలో ఇన్వెస్ట్ చేసిన ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించిన కాసేపటికే యాపిల్ షేర్లు పుంజుకున్నాయి. కానీ ఈ కాన్ఫరెన్స్‌లో మరిన్ని జనరేటివ్ ఏఐలకు సంబంధించిన ప్రకటనలు వస్తాయని ఆశించిన దీర్ఘకాల పెట్టుబడిదారులకు నిరాశకలిగింది. దాంతో సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి యాపిల్ పేర్లు 2శాతం నష్టపోయాయి.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్‌ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్డెవలర్ కాన్ఫరెన్స్‌లో భాగంగా యాపిల్ విజన్ ప్రో మిక్స్డ్-రియాలిటీ హెడ్సెట్, ఐఓస్18 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. రియాలిటీ హెడ్సెట్ విజన్ ప్రోను చైనా, జపాన్‌తో సహా మరో ఎనిమిది దేశాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ‘సిరి’లోనూ కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లు యాపిల్ పేర్కొంది. అన్ని యాపిల్ సూట్ యాప్స్‌లో ‘యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)’ను తీసుకురానున్నట్లు తెలిపింది. -
వివాదంలో చాట్‌జీపీటీ.. అడ్డంగా బుక్కైన సీఈఓ శామ్ ఆల్ట్‌మన్
ఓపెన్ ఏఐ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్ అడ్డంగా దొరికిపోయారు. ఇక చేసిది లేక తన చాట్‌జీపీటీ స్కై వాయిస్‌ను నిలిపి వేశారు.యాపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ తరహాలో చాట్ జీపీటీ యూజర్లకు వాయిస్ అసిస్టెంట్ సేవల్ని అందించేందుకు సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ పనిచేస్తున్నారు. స్కై వాయిస్ పేరుతో తెచ్చే ఈ ఫీచర్లో ప్రముఖుల వాయిస్ వినిపిస్తుంది. మీకు ఎవరి వాయిస్ కావాలనుకుంటారో.. దాన్ని సెలక్ట్ చేసుకుంటే చాట్ జీపీటీ సమాధానాల్ని టెక్ట్స్ కాకుండా వాయిస్‌లో రూపంలో అందిస్తుంది.నా అనుమతి లేకుండా నా వాయిస్‌ను దీన్ని డెవలప్ చేసే సమయంలో శామ్ ఆల్ట్‌మన్.. అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్‌గా, హాలీవుడ్‌లోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్‌ను వినియోగించారు. దీంతో తనని సంప్రదించకుండా తన వాయిస్‌ను కాపీ చేసి చాట్‌జీపీటీ స్కైవాయిస్‌లో ఎలా వినియోగిస్తారంటూ స్కార్లెట్ జాన్సన్.. ఓపెన్ ఏఐ సీఈఓపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదనిఆరోపణలపై శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. కంపెనీనీ ప్రశ్నార్థకంలో పడేసి చాట్‌జీపీటీ వాయిస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో స్కై సిస్టమ్ వాయిస్ స్కార్లెట్ జాన్సన్‌ది కాదని, వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదని తెలిపారు. స్కార్లెట్ జాన్సన్ ఏమన్నారంటే తన వాయిస్‌ను ఓపెన్ ఏఐ కాపీ చేయడంపై అవెంజర్ ముద్దుగమ్మ స్కార్లెట్ జాన్సన్ మాట్లాడుతూ.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చాట్‌జీపీటీ వాయిస్ ఆప్షన్ కోసం గతేడాది సెప్టెంబర్‌లో నన్ను సంప్రదించారు.అయితే, ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించా. అయినప్పటికీ ఆల్ట్‌మన్ తనలాగే వినిపించే 'చాట్‌జీపీటీ 4.0 సిస్టమ్' కోసం నా ప్రమేయం లేకుండా నా వాయిస్‌ని ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు. జాన్సన్ ఆరోపణల్ని ఖండించిన ఓపెన్ఏఐ అయితే స్కార్లెట్ జాన్సన్ వ్యాఖ్యల్ని శామ్ ఆల్ట్‌మన్ ఖండించారు. చాట్‌జీపీటీ స్కై వాయిస్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్ కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాన్సన్ పట్ల ఉన్న గౌరవంతో మేం మా ప్రొడక్ట్‌లలో స్కై వాయిస్ ఉపయోగించడం నిలిపివేశాము. ఈ విషయంలో జాన్సన్‌కు తగిన విధంగా సమాచారం అందించకపోవడం క్షమాపణలు చెప్పారు. -
త్వరలో అందరికీ ఉచితంగా జీపీటీ-4ఓ.. ప్రత్యేకతలివే..
ప్రముఖ టెక్ సంస్థ ఓపెన్ఏఐ అడ్వాన్స్ ఫీచర్లతో కొత్త చాట్‌జీపీటీ వెర్షన్(జీపీటీ-4ఓమ్ని)ను విడుదల చేసింది. ఇందులో అత్యాధునిక వాయిస్, టెక్ట్స్, విజన్ వంటి ఫీచర్లు ఉన్నాయని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరామురాటీ తెలిపారు.ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ..‘జీపీటీ-4 టర్బోతో పోలిస్తే కొత్త వెర్షన్ రెండింతలు వేగంగా పనిచేస్తుంది. దీని సబ్స్క్రిప్షన్ ధర జీపీటీ4 టర్బో కంటే తక్కువగా ఉంటుంది. మరికొన్ని వారాల్లో ఈ వెర్షన్‌ను అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నాం. అయితే, వారికి కొన్ని పరిమితులుంటాయి. పెయిడ్ సబ్స్క్రైబర్లకు మాత్రం అవి వర్తించవు. ఈ కొత్త మోడల్ దాదాపు 50 భాషలను సపోర్ట్ చేస్తుంది. వీటిలో తెలుగు, గుజరాతీ, తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ వంటి భారతీయ భాషలు ఉన్నాయి. వాయిస్ కమాండ్లకు కేవలం 232 మిల్లీ సెకన్లలోనే జీపీటీ-4ఓ సమాధానం ఇస్తుంది. టెక్ట్స్, రీజనింగ్, కోడింగ్ ఇంటెలిజెన్స్‌లో టర్బో వెర్షన్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. తర్వలో యాపిల్ మ్యాక్ఓఎస్ యూజర్లకు డెస్క్‌టాప్ యాప్‌ను విడుదల చేయనున్నాం. మరికొన్ని రోజుల్లో విండోస్ యూజర్లకు కూడా యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: 32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అనే కృత్రిమ మేధతో చాట్‌జీపీటీను 2015లో సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్, ఇలియా సుట్స్కేవర్, వోజ్సీచ్ జరెంబా స్థాపించారు. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ 2019లో రూ.8,345 కోట్లు పెట్టుబడి పెట్టింది. -
పదేళ్ల తర్వాత.. చాట్‌జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామిగా పేరొందిన ఓపెన్ఏఐ (OpenAI) సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుట్స్కేవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని స్థాపించిన ఇన్నేళ్లకు సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు."దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నేను ఓపెన్ఏఐ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను" అని సుట్స్కేవర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్‌లో చెప్పారు. ఇతర కోఫౌండర్లు సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్, సీటీవో మిరా మురాతి, జాకబ్ పచోకీల నాయకత్వంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తాను మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.ఓపెన్ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ నిర్వహణ సంస్థ. మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఈ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సుట్స్కేవర్ అని, ఆయన లేకుంటే సంస్థ ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు. జాకుబ్ పచోకీ కంపెనీకి కొత్త చీఫ్ సైంటిస్ట్ అవుతారని చెప్పారు. పచోకి గతంలో ఓపెన్ పరిశోధన డైరెక్టర్‌గా పనిచేశారు. GPT-4, ఓపెన్ఏఐ ఫైవ్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.After almost a decade, I have made the decision to leave OpenAI. The company’s trajectory has been nothing short of miraculous, and I’m confident that OpenAI will build AGI that is both safe and beneficial under the leadership of @sama, @gdb, @miramurati and now, under the…— Ilya Sutskever (@ilyasut) May 14, 2024 -
ఐఫోన్లో చాట్‌జీపీటీ ఫీచర్స్!.. ఓపెన్ఏఐతో యాపిల్ చర్చ
ఇప్పటికే పలు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI) ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో దిగ్గజ ఐఫోన్ తయారీ సంస్థ 'యాపిల్' తన మొబైల్లో స్టార్టప్ టెక్నాలజీని ఉపయోగించడానికి ఓపెన్ఏఐతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.రాబోయే యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఓఎస్ 18లో చాట్‌జీపీటీ ఫీచర్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ ఓపెన్ఏఐతో జత కట్టినట్లు సమాచారం. రెండు కంపెనీల మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెల్లడి కావాల్సి ఉంది.ఒప్పందం కుదిరిన తరువాత ఈ టెక్నాలజీ సెప్టెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పటికే యాపిల్ కంపెనీ జెమినీ చాట్‌బాట్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఆ చర్చలు ఇంకా పూర్తికాక ముందే.. యాపిల్ కంపెనీ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకునే పనిలో ఉంది.యాపిల్ కంపెనీ జూన్‌లో నిర్వహించనున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్పిరెన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రకటించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. గత సంవత్సరం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా చాట్‌జీపీటీ వినియోగాన్ని గురించి ప్రస్తావించారు. ఇందులో అనేక సమస్యలను క్రమబద్ధీకరించవలసి అవసరం ఉందని, దీనివల్ల ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. -
గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
మైక్రోసాఫ్ట్ సంస్థ గూగుల్, ఓపెన్ ఏఐతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టు ఇంటర్నల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్‌కు శిక్షణ ఇస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంఏఐ-1 అనే కొత్త ఏఐ మోడల్‌ను తర్వలో వినియోగాదారులకు పరిచయం చేయనున్నట్లు తెలిసింది.ఈమేరకు గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, ఐఏ స్టార్టప్ ఇన్ఫ్లెక్షన్ మాజీ సీఈఓ ముస్తఫా సులేమాన్ ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మోడల్ వినియోగంలోకి వస్తే దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరులో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగిన వెంటనే కొత్త మోడల్‌ను ప్రివ్యూ చేసే అవకాశం ఉందని తెలిసింది.ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..ఎంఏఐ-1 గతంలో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఓపెన్ సోర్స్ మోడల్‌ల కంటే అధిక సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది దాదాపు 500 బిలియన్ పారామీటర్లను కలిగి ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. మైక్రోసాఫ్ట్ గత నెలలో ఫై-3-మినీ అనే మినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను ప్రారంభించింది. తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందించేలా దీన్ని రూపొందించారు. ఫై-3 మినీ 3.8 బిలియన్ పారామితులను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ మార్చిలో సులేమాన్‌ను కొత్తగా తయారుచేసిన యూజర్ ఏఐ యూనిట్‌కు అధిపతిగా నియమించింది. ఇన్ఫ్లెక్షన్ స్టార్టప్‌లోని అనేక మంది నిపుణులను కంపెనీలో చేర్చుకుంది. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అధికంగా ఉన్న విషయం తెలిసిందే. -
మిమిక్రీ టూల్‌ను పరిచయం చేసిన ఓపెన్ఏఐ
కృత్రిమ మేధ రంగంలో కంపెనీల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. దాంతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు నిత్యం కంపెనీలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూన్నాయి. తాజాగా ఓపెన్ఏఐ వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది.కొత్త ఫీచర్లో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. వ్యక్తుల గొంతులను అచ్చం అలాగే తిరిగి వినిపించడం దీని ప్రత్యేకత. కేవలం 15 సెకండ్ల నిడివి రికార్డు స్పీచ్ సాయంతోనే గొంతులను అనుకరించటం విశేషం. అంటే ఒకరకంగా దీన్ని మిమిక్రీ ఇంజిన్ అనుకోవచ్చు. ఇది మంచి టూలే అయినప్పటికీ దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ఎంపికచేసిన కొందరు టెస్టర్లకే అందుబాటులోకి తెచ్చారు.మనదేశంలో ఎన్నికలు జరుగుతుండటం.. ఇటీవల ఏఐ సృష్టించిన రాజకీయ నాయకుల గొంతులతో రోబో కాల్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. నిజానికి ఇప్పటికే చాలా అంకుర సంస్థలు వాయిస్ క్లోనింగ్ సొల్యూషన్లను అందిస్తున్నాయి. వీటి విషయంలో ఓపెన్ఏఐ నైతికతకు ప్రాధాన్యం ఇవ్వటం విశేషం. వాయిస్ ఇంజిన్‌ను పరీక్షించటానికి అనుమతి పొందినవారూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఆయా వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాతే వారి గొంతులను సృష్టించటానికి వీలుంటుంది. అలాగే అవి ఏఐ ద్వారా సృష్టించినవని తప్పకుండా ప్రకటించాలి. -
మిమిక్రీ టూల్‌ను పరిచయం చేసిన ప్రముఖ ఏఐ సంస్థ
కృత్రిమ మేధ రంగంలో కంపెనీల మధ్య రోజురోజుకు పోటీ పెరుగుతోంది. దాంతో వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు నిత్యం కంపెనీలు తమ ఉత్పత్తుల్లో మార్పులు చేస్తూన్నాయి. తాజాగా ఓపెన్ఏఐ వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. కొత్త ఫీచర్లో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. వ్యక్తుల గొంతులను అచ్చం అలాగే తిరిగి వినిపించడం దీని ప్రత్యేకత. కేవలం 15 సెకండ్ల నిడివి రికార్డు స్పీచ్ సాయంతోనే గొంతులను అనుకరించటం విశేషం. అంటే ఒకరకంగా దీన్ని మిమిక్రీ ఇంజిన్ అనుకోవచ్చు. ఇది మంచి టూలే అయినప్పటికీ దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉండటం వల్ల ప్రస్తుతానికి ఎంపికచేసిన కొందరు టెస్టర్లకే అందుబాటులోకి తెచ్చారు. ఇదీ చదవండి: కళను హరిస్తున్న ఏఐ.. ఆర్టిస్టులు ఏం చేశారంటే.. మనదేశంలో ఎన్నికలు జరుగుతుండటం.. ఇటీవల ఏఐ సృష్టించిన రాజకీయ నాయకుల గొంతులతో రోబో కాల్స్ పుట్టుకొస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. నిజానికి ఇప్పటికే చాలా అంకుర సంస్థలు వాయిస్ క్లోనింగ్ సొల్యూషన్లను అందిస్తున్నాయి. వీటి విషయంలో ఓపెన్ఏఐ నైతికతకు ప్రాధాన్యం ఇవ్వటం విశేషం. వాయిస్ ఇంజిన్‌ను పరీక్షించటానికి అనుమతి పొందినవారూ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. ఆయా వ్యక్తుల అనుమతి తీసుకున్న తర్వాతే వారి గొంతులను సృష్టించటానికి వీలుంటుంది. అలాగే అవి ఏఐ ద్వారా సృష్టించినవని తప్పకుండా ప్రకటించాలి. -
కళను హరిస్తున్న ఏఐ.. ఆర్టిస్టులు ఏం చేశారంటే..
ఒకప్పుడు సైన్స్ కాల్పనిక నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) నేడు జనజీవితాల్లో భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, మనిషికన్నా ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ) మనిషి జీవితంలో ఎన్నో మార్పులు, సౌకర్యాలు తీసుకొస్తోంది. ఆన్లైన్లో వస్తుసేవల క్రయవిక్రయాలకు తోడ్పడుతోంది. ఓటీటీలో ఏయే సినిమాలు, సిరీస్ చూడవచ్చో సలహాలిస్తోంది. సిరి, అలెక్సాల ద్వారా మాట్లాడుతోంది. వ్యాపారాలు సులభంగా వేగంగా సాగేందుకు ఉపకరిస్తోంది. అదే సమయంలో మనిషి అవసరాన్ని తగ్గించేస్తుందన్న బెరుకు వ్యక్తమవుతోంది. తాజాగా ఓపెన్ఏఐ తన ఎల్ఎల్ఎంలకు శిక్షణ ఇచ్చేందుకు అనుమతి లేకుండానే తమ బుక్స్‌ను వాడుతోందని ఆరోపిస్తూ కొద్దినెలల కిందట వందలాది రచయితలు టెక్ కంపెనీకి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే తరహాలో జొనాస్ బ్రదర్స్ సహా 200 మందికిపైగా మ్యూజీషియన్లు ఏఐకి వ్యతిరేకంగా గళం విప్పారు. తమ హక్కులను ఉల్లంఘించే పద్ధతులను నిలిపివేయాలని కోరుతూ ఏఐ కంపెనీలకు బహిరంగ లేఖ రాశారు. తమ కళను హరించకూడదంటూ అందులో పేర్కొన్నారు. ఇదీ చదవండి: ‘ఐదు రోజులు తిండి లేదు.. ఆ బాధ మీకు తెలియదు’ ఆర్టిస్ట్స్ రైట్స్ అలయన్స్ ఆధ్వర్యంలో రాసిన ఈ లేఖపై జొనాస్ సోదరులు, బిల్లీ ఇలిష్, క్యాటీ పెర్రీ, స్మోకీ రాబిన్సన్ వంటి ప్రముఖ ఆర్టిస్ట్‌లు సంతకాలు చేశారు. మ్యూజిక్ పరిశ్రమలో ఏఐ వినియోగంతో తలెత్తే దుష్ప్రభావాలపై ఈ లేఖలో వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ దుర్వినియోగంతో సృజనాత్మకత దెబ్బతింటుందని, ఆర్టిస్టులు, హక్కుదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఏఐ డెవలపర్లు, టెక్నాలజీ కంపెనీలు, డిజిటల్ వేదికలకు వారు విజ్ఞప్తి చేశారు. -
'స్టార్గేట్' ఏఐ సూపర్ కంప్యూటర్: టెక్నాలజీలో మరో అడుగు..
ఓపెన్ఏఐ.. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో కలిసి సరికొత్త 'ఏఐ సూపర్ కంప్యూటర్'ను రూపొందించడానికి సన్నద్ధమైంది. 'డేటా సెంటర్ ప్రాజెక్ట్' పేరుతో దీని కోసం 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. 'స్టార్గేట్' పేరుతో రానున్న ఈ ఏఐ సూపర్ కంప్యూటర్ పేరు 2028 నాటికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ట్రెడిషినల్ డేటా సెంటర్ల కంటే కూడా అడ్వాన్డ్ కార్యకలాపాలను నిర్వహించడానికి టెక్ దిగ్గజం ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే ఉన్న కొన్ని అతిపెద్ద డేటా సెంటర్ల కంటే 100 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ ప్రాజెక్ట్‌కి మైక్రోసాఫ్ట్ నిధులు సమకూరుస్తుంది. ఓపెన్ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్ రెండు కంపెనీలు సూపర్ కంప్యూటర్లను ఐదు దశల్లో విస్తరించాయి. ఇందులో స్టార్గేట్ ఐదవ దశలో రానుంది. అయితే మైక్రోసాఫ్ట్ ఓపెన్ఏఐ 2026 నాటికి నాల్గవ దశ సూపర్ కంప్యూటర్ తీసుకురానున్నట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్ గత ఏడాది నవంబర్‌లో కస్టమ్ డిజైన్ కంప్యూటింగ్ చిప్‌లను కూడా ప్రకటించింది. ఆ తరువాత చిప్‌లతో పని చేసేలా కొత్త ప్రాజెక్ట్ రూపొందించనున్నట్లు ప్రకటించింది. ఏఐ సామర్థ్యానికి సంబంధించిన సరిహద్దును కొనసాగించడానికి అవసరమైన తదుపరి తరం మౌలిక సదుపాయాల ఆవిష్కరణకు కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే స్టార్గేట్ సూపర్ కంప్యూటర్ రానుంది. మైక్రోసాఫ్ట్ కొత్త ప్రణాళిక కోసం అయ్యే ఖర్చు సుమారు 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉండొచ్చని సమాచారం. ఇది సర్వర్లు, భవనాలు, ఇతర పరికరాల కోసం మైక్రోసాఫ్ట్ గత ఏడాది చేసిన ఖర్చు కంటే కూడా మూడు రేట్ల ఎక్కువని తెలుస్తోంది. స్టార్గేట్ సూపర్ కంప్యూటర్ గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి