ఓపెన్‌ఏఐ సీఈఓ పదవి నుంచి శామ్ ఆల్ట్‌మన్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్‌ను తిరిగి వెనక్కి తీసుకున్నారు ఆ సంస్థ బోర్డ్ సభ్యులు. అయితే ఆల్ట్‌మన్‌ను ఓపెన్‌ఏఐ నుంచి తొలగించేలా బోర్డ్ సభ్యులకు ఓపెన్ ఏఐ కో-ఫౌండర్ ఇల్యా సుట్స్‌కేవర్ సహాయం చేశారు. ఇప్పుడు అదే సుట్స్‌కేవర్‌కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ బంపరాఫర్ ఇచ్చారు.
హోల్ మార్స్ కేటలాగ్ అనే ఎక్స్.కామ్ యూజర్ ఓ ట్వీట్ చేశారు. అందులో సుట్స్‌కేవర్ ఓపెన్‌ఏఐలో అదృశ్యమయ్యారు. అతని భవిష్యత్ ఆందోళన కరంగా మారిందన్న వార్త కథనాన్ని షేర్ చేశారు. దీనికి సుట్స్‌కేవర్ మీరు టెస్లాలో పనిచేయొచ్చనే క్యాప్షన్‌ను జోడించాడు.
కేటలాగ్ ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ‘‘ఆర్ ఎక్స్’’ అంటూ తన కృత్తిమ మేధ కంపెనీలో ఎక్స్‌ఏఐలో సుట్స్‌కేవర్ చేరొచ్చంటూ ఎలాన్ మస్క్ పరోక్షంగా సంకేతాలిచ్చారు.
Ilya should come work at Tesla! pic.twitter.com/UDk4WKu6ts
— Whole Mars Catalog (@WholeMarsBlog) December 9, 2023
అయితే ఒక సారి లేఆఫ్స్ గురై.. తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆల్ట్‌మన్.. సుట్స్‌కేవర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుట్స్‌కేవర్ కు తనకు మధ్య ఎలాంటి విరోధం లేదు. నేను తనిని గౌరవిస్తాను. సుట్స్‌కేవర్ ఇకపై బోర్డులో పనిచేయనప్పటికీ, చేస్తున్న పనిలో ఇరువురి సహకారంతో ముందుకు సాగుతాం’’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు సుట్స్‌కేవర్ ఓపెన్‌ఏఐ నుంచి అదృశ్యమయ్యాడన్న కథనాలతో పరిశ్రమ వర్గాల్లో సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment