
ఉన్నత విద్య, వృత్తిపరమైన శిక్షణ అందించడంలో ప్రపంచ అగ్రగామి అయిన 'గ్రేట్ లెర్నింగ్' (Great Learning) తన కెరీర్ ప్రోగ్రెషన్ నివేదిక 2024-25ను విడుదల చేసింది. ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ల నుంచి ఎంపిక చేసిన 1000 మంది పూర్వ విద్యార్థుల సమగ్ర సర్వే నుంచి ఈ నివేదికను సిద్ధం చేశారు. కెరీర్ ప్రారంభం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన సీనియర్ నాయకులు ఇందులో ఉంటారు.
నిరంతరం కృషి చేయడం ద్వారా.. కెరీర్ ఎలా పురోగతి చెందిందో.. నిపుణులు నాయకత్వ పాత్రలు, జీతం పెరుగుదల, ఉద్యోగావకాలను సాధించడం ఎలా అనే విషయాలు కూడా గ్రేట్ లెర్నింగ్ ఇందులో వెల్లడించింది. ప్రొఫెషనల్స్ కెరీర్ విషయంలో అప్‌స్కిల్లింగ్ పరివర్తనాత్మక ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరు విజయవంతంగా సక్సెస్ వైపు వెళ్తున్నారు.

అప్‌స్కిల్లింగ్ ప్రభావంతో.. 80 శాతం మంది ప్రమోషన్లు, జీతం పెరుగుదల విషయంలో ప్రగతి సాధించారు. 74 శాతం మంది పదోన్నతి పొందారు. 69 శాతం మంది ఉన్న సంస్థలలోని ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. లీడర్షిప్ పాత్రలలో ఉన్నవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
డేటా సైన్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి వాటిలో నైపుణ్యాలను సంపాదించడం వల్ల నిపుణులు నిర్వాహక, వ్యూహాత్మక నాయకత్వ పాత్రలలోకి ఎలా మారడానికి వీలు కల్పిస్తుందో ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ప్రొఫెషనల్స్ అప్‌స్కిల్లింగ్ తర్వాత జీతాల పెరుగుదల కూడా భారీగా ఉంది. అయితే సుమారు 87 శాతం మంది తక్షణ జీతాల పెంపు కంటే.. కెరీర్ వృద్ధికి కావాల్సిన నైపుణ్యాల పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment