మంచి ఉద్యోగం అన్నది ప్రతిఒక్కరి కల. ప్రతి రంగంలోనూ ఎక్కువమందికి ఆసక్తిగా ఉన్న ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఏ ఉద్యోగాలను ఎక్కువ మంది కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి రెమిటీ (Remitly) అనే సంస్థ 186 దేశాల నుండి గూగుల్ (Google) శోధనలను విశ్లేషించి ఒక అధ్యయనం చేసింది. 2024లో "(ఉద్యోగం) ఎలా అవ్వాలి" (how to become) అని వ్యక్తులు ఎన్నిసార్లు సెర్చ్ చేశారు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన కెరీర్‌లను ఈ అధ్యయనం వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది శోధించిన ఉద్యోగం పైలట్ (pilot). దీని కోసం 4,32,000 కంటే ఎక్కువ శోధనలు ఉన్నాయి. చెక్ రిపబ్లిక్, ఈజిప్ట్,స్లోవేకియాతో సహా 25 దేశాల్లో ఇది అత్యుత్తమ కెరీర్ ఎంపిక. తర్వాత 3,93,000 శోధనలతో లాయర్ వృత్తి రెండవ స్థానంలో నిలిచింది. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే ఆసక్తిలో బాగా పెరుగుదల కనిపించింది. ఇతర ఉన్నత ఉద్యోగాలలో పోలీసు అధికారి (2,72,000 శోధనలు), ఫార్మసిస్ట్ (2,72,630), నర్సు (2,48,720) ఉన్నాయి. గత రెండేళ్లలో పోలీసు వృత్తిపై ఆసక్తి 440 శాతం పెరిగింది.
డిజిటల్ కెరీర్
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కలలు కన్న సోషల్ మీడియా కెరీర్ యూట్యూబర్. యూట్యూబర్‌గా మారడం ఎలా అని 1,71,000 శోధనలు వచ్చాయి. యూకే, సింగపూర్, ఇండోనేషియాతో సహా 13 దేశాలలో అత్యధికంగా శోధించిన ఉద్యోగం ఇదే. అయితే 2022 నుండి ఈ కెరీర్‌పై ఆసక్తి 11% తగ్గింది. ఇతర డిజిటల్ కెరీర్‌ల విషయానికి వస్తే.. కంటెంట్ క్రియేటర్ 52,000 శోధనలను, సోషల్ మీడియా మేనేజర్ 36,000 శోధనలను పొందాయి. టెక్ ఫీల్డ్ కూడా ఆసక్తిని ఆకర్షిస్తోంది. కోడింగ్ 48,000 శోధనలతో అధిక ర్యాంక్‌ను పొందింది.
డిమాండ్‌లో హెల్త్‌కేర్, పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాలు
హెల్త్‌కేర్ అనేది ఎక్కువమంది కోరుకునే కెరీర్ మార్గాలలో ఒకటి. 272,000 శోధనలతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించి హెల్త్‌కేర్ జాబ్ ఫార్మసిస్ట్. ఇది ముఖ్యంగా జపాన్‌లో జనాదరణ పొందింది. ఇతర టాప్ హెల్త్‌కేర్ కెరీర్‌లలో ఫిజికల్ థెరపిస్ట్ (2,44,000 శోధనలు), టీచర్ (1,75,000), డైటీషియన్ (170,000) ఉన్నాయి.
పబ్లిక్ సర్వీస్‌లో 2,72,730 శోధనలతో పోలీసు అధికారి ఉద్యోగం అగ్రస్థానంలో ఉంది. తర్వాత నర్సింగ్, మిడ్‌వైఫరీ, అగ్నిమాపక విభాగాలు ఉన్నాయి. డాక్టర్ కావాలనే ఆసక్తి పెరిగినప్పటికీ, నర్సింగ్, మిడ్‌వైఫరీ కెరీర్‌ల గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా శోధిస్తున్నారు.
క్రియేటివ్, స్పోర్ట్స్ కెరీర్‌లకూ ఆదరణ
కళలు, వినోద ప్రపంచంలో, దాదాపు 2,00,000 శోధనలతో అత్యధికంగా శోధించిన సృజనాత్మక వృత్తి నటన. ఇతర ప్రసిద్ధ ఎంపికలలో వాయిస్ యాక్టింగ్, డీజే, సింగింగ్ ఉన్నాయి. "ఫుట్‌బాల్ ఆటగాడిగా ఎలా మారాలి" అని 95,000 శోధనలతో స్పోర్ట్స్ కెరీర్‌పై ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు. ఇది కాకుండా వ్యక్తిగత శిక్షకులు, కోచ్‌ల వంటి ఫిట్‌నెస్-సంబంధిత కెరీర్‌లు ఆదరణ పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment