google search
-
ఎక్కువమంది కోరుకున్న జాబ్.. 25 దేశాల్లో బెస్ట్ కెరీర్ ఇదే..
మంచి ఉద్యోగం అన్నది ప్రతిఒక్కరి కల. ప్రతి రంగంలోనూ ఎక్కువమందికి ఆసక్తిగా ఉన్న ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ఏ ఉద్యోగాలను ఎక్కువ మంది కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి రెమిటీ (Remitly) అనే సంస్థ 186 దేశాల నుండి గూగుల్ (Google) శోధనలను విశ్లేషించి ఒక అధ్యయనం చేసింది. 2024లో "(ఉద్యోగం) ఎలా అవ్వాలి" (how to become) అని వ్యక్తులు ఎన్నిసార్లు సెర్చ్ చేశారు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన కెరీర్లను ఈ అధ్యయనం వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది శోధించిన ఉద్యోగం పైలట్ (pilot). దీని కోసం 4,32,000 కంటే ఎక్కువ శోధనలు ఉన్నాయి. చెక్ రిపబ్లిక్, ఈజిప్ట్,స్లోవేకియాతో సహా 25 దేశాల్లో ఇది అత్యుత్తమ కెరీర్ ఎంపిక. తర్వాత 3,93,000 శోధనలతో లాయర్ వృత్తి రెండవ స్థానంలో నిలిచింది. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే ఆసక్తిలో బాగా పెరుగుదల కనిపించింది. ఇతర ఉన్నత ఉద్యోగాలలో పోలీసు అధికారి (2,72,000 శోధనలు), ఫార్మసిస్ట్ (2,72,630), నర్సు (2,48,720) ఉన్నాయి. గత రెండేళ్లలో పోలీసు వృత్తిపై ఆసక్తి 440 శాతం పెరిగింది.డిజిటల్ కెరీర్ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కలలు కన్న సోషల్ మీడియా కెరీర్ యూట్యూబర్. యూట్యూబర్‌గా మారడం ఎలా అని 1,71,000 శోధనలు వచ్చాయి. యూకే, సింగపూర్, ఇండోనేషియాతో సహా 13 దేశాలలో అత్యధికంగా శోధించిన ఉద్యోగం ఇదే. అయితే 2022 నుండి ఈ కెరీర్‌పై ఆసక్తి 11% తగ్గింది. ఇతర డిజిటల్ కెరీర్ల విషయానికి వస్తే.. కంటెంట్ క్రియేటర్ 52,000 శోధనలను, సోషల్ మీడియా మేనేజర్ 36,000 శోధనలను పొందాయి. టెక్ ఫీల్డ్ కూడా ఆసక్తిని ఆకర్షిస్తోంది. కోడింగ్ 48,000 శోధనలతో అధిక ర్యాంక్‌ను పొందింది.డిమాండ్‌లో హెల్త్‌కేర్, పబ్లిక్ సర్వీస్ ఉద్యోగాలుహెల్త్కేర్ అనేది ఎక్కువమంది కోరుకునే కెరీర్ మార్గాలలో ఒకటి. 272,000 శోధనలతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా శోధించి హెల్త్‌కేర్ జాబ్ ఫార్మసిస్ట్. ఇది ముఖ్యంగా జపాన్‌లో జనాదరణ పొందింది. ఇతర టాప్ హెల్త్‌కేర్ కెరీర్లలో ఫిజికల్ థెరపిస్ట్ (2,44,000 శోధనలు), టీచర్ (1,75,000), డైటీషియన్ (170,000) ఉన్నాయి.పబ్లిక్ సర్వీస్‌లో 2,72,730 శోధనలతో పోలీసు అధికారి ఉద్యోగం అగ్రస్థానంలో ఉంది. తర్వాత నర్సింగ్, మిడ్వైఫరీ, అగ్నిమాపక విభాగాలు ఉన్నాయి. డాక్టర్ కావాలనే ఆసక్తి పెరిగినప్పటికీ, నర్సింగ్, మిడ్వైఫరీ కెరీర్ల గురించి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా శోధిస్తున్నారు.క్రియేటివ్, స్పోర్ట్స్ కెరీర్లకూ ఆదరణకళలు, వినోద ప్రపంచంలో, దాదాపు 2,00,000 శోధనలతో అత్యధికంగా శోధించిన సృజనాత్మక వృత్తి నటన. ఇతర ప్రసిద్ధ ఎంపికలలో వాయిస్ యాక్టింగ్, డీజే, సింగింగ్ ఉన్నాయి. "ఫుట్‌బాల్ ఆటగాడిగా ఎలా మారాలి" అని 95,000 శోధనలతో స్పోర్ట్స్ కెరీర్‌పై ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు. ఇది కాకుండా వ్యక్తిగత శిక్షకులు, కోచ్‌ల వంటి ఫిట్నెస్-సంబంధిత కెరీర్లు ఆదరణ పొందాయి. -
పాకిస్తానీల కళ్లన్నీ భారత్‌పైనే.. గూగుల్‌లో ఏం వెతికారంటే..
వివిధ దేశాలలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ట్రెండ్స్, భిన్న అంశాలను వెల్లడిస్తూ గూగుల్ (Google) ప్రతి సంవత్సరం తన "ఇయర్ ఇన్ సెర్చ్" నివేదికను ఆవిష్కరిస్తుంది. ఇందులో వార్తలు, క్రీడా ఈవెంట్ల దగ్గర నుండి సెలబ్రిటీలు, సినిమాలు, టీవీ షోలు, సందేహాలు వంటివెన్నో ఉంటాయి.ఈ క్రమంలోనే గూగుల్ ఇటీవల పాకిస్తాన్‌కు సంబంధించిన “ఇయర్ ఇన్ సెర్చ్ 2024”ని విడుదల చేసింది. ఏడాది పొడవునా పాకిస్తాన్ ప్రజలు గూగుల్ ఏం వెతికారు..కీలక పోకడలు, అంశాలను హైలైట్ చేస్తూ విభిన్న రంగాలలో జాతీయ ఆసక్తిని ఆకర్షించిన వాటిపై ఒక సంగ్రహావలోకనం ఈ నివేదిక అందిస్తుంది.గూగుల్ పాకిస్తాన్ 2024 సంవత్సరాంతపు జాబితాలో క్రికెట్, వ్యక్తులు, సినిమాలు&నాటకాలు, హౌ-టు సందేహాలు, వంటకాలు, టెక్నాలజీ వంటి ఆరు కేటగిరీల్లో అత్యధిక సెర్చ్ చేసిన టాప్ 10 అంశాలు ఉన్నాయి. అయితే యాదృచ్ఛికంగా వీటిలో భారత్ గురించి లేదా దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. భారతీయ వ్యాపారవేత్తలు, సోనీ, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో భారతీయ షోలు, టీ20 ప్రపంచ కప్ సిరీస్‌లో భారత జట్టు క్రికెట్ మ్యాచ్‌లు వీటిలో ఉన్నాయి.పాకిస్థానీల ఆసక్తులు ఇవే..క్రికెట్లో పాకిస్థాన్‌లో అత్యధికంగా శోధించిన ఐదు గేమ్‌లు భారత్ ఆడిన మ్యాచ్‌లే. వీటిలో టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య పోరు ఒకటి. ఇది కాకుండా అత్యధికంగా సెర్చ్ చేసిన ఇతర మ్యాచ్‌లలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌లు ఉన్నాయి.ఇక వ్యక్తుల విషయానికి వస్తే.. 'పీపుల్ లిస్ట్ ఫర్ పాకిస్థాన్'లో భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఉన్నారు.సినిమాలు & నాటకాల జాబితాలో అత్యధికంగా భారతీయ టీవీ షోలు, నాలుగు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. హీరామండి, ట్వల్త్ ఫెయిల్, మీర్జాపూర్ సీజన్ 3, బిగ్ బాస్ 17 పాకిస్తానీలు అత్యధికంగా సెర్చ్ చేసిన టీవీ షోలు కాగా యానిమల్, స్త్రీ 2, భూల్ భులైయా 3, డంకీ 2024లో అత్యధికంగా గూగుల్ చేసిన బాలీవుడ్ సినిమాలు. -
భార్యను కడతేర్చి ఆపై గూగుల్‌లో ఏం సెర్చ్ చేశాడంటే..
అమెరికాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఆమెను చంపిన తర్వాత తనకేం తెలియదన్నట్లు పెద్ద నాటకమే ఆడాడు. భార్య కనిపించడం లేదని తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. ఆమె మరణానంతరం ఏం జరుగుతుందని గూగుల్‌లో సెర్చ్ కూడా చేశాడు. అయితే తన నాటకం ఎన్నో రోజులు నడవలేదు. చివరికి పోలీసులు భర్తే హంతకుడని తేల్చి కటకటాల వెనక్కి పంపారు.వర్జినియాకు చెందిన నరేష్ భట్(33).. నేపాల్‌కు చెందిన తన భార్య మమతా కప్లే భట్(28)తో కలిసి జీవిస్తున్నాడు. వీరికి ఓకూతురు కూడా ఉంది. మమతా గత జూలై 19 నుంచి కనిపించకుండాపోయింది. ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న మమతా.. ఆ రోజు సాయంత్రం హెల్త్ ప్రిన్స్ విలియం మెడికల్ సెంటర్లో చివరిసారిగా కనిపించింది. తరువాత ఆమె ఆచూకీ తెలియరాలేదు. దీంతో పనికి వెళ్లిన తన భార్య కనిపించకుండాపోయిందని భర్త ఆగష్టు 5న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనేక మందిని విచారించారు. కానీ ఇప్పటి వరకు ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేక పోయారు. ఈ క్రమంలో మొదట ఆమె న్యూయార్క్, టెక్సాస్‌లో ఉన్న బంధువులను కలిసేందుకు వెళ్లి ఉంటుందని పోలీసులకు చెప్పాడు. కానీ తరువాత, ఆమెకు ఆ రాష్ట్రాల్లో ఎవరూ బంధువులు లేరని, ఆమె ఫోన్ ఆగస్టు 1వ తేదీ వరకు ఆన్‌లో ఉందని పోలీసులు కనుగొన్నారు. ఈ క్రమంలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో అతడు తడబడ్డాడు.ఆగస్టు 22న నరేష్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు అనుమానం వచ్చి భర్త నరేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో తన భార్యతో విడియేందుకు సిద్ధమైనట్లు పోలీసులకు చెప్పాడు. అంతేగాక ‘భార్య చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది. భాగస్వామి చనిపోయాక అప్పులు ఏమవుతాయి.. వర్జినీయాలో జీవిత భాగస్వామి కనిపించకుండా పోతే ఏం జరుగుతుంది’ అంటూ నరేష్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.అయితే భర్త మమతాను హత్య చేసి ఉంటాడని భావిస్తున్న పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేగాక నరేష్ తన ఇంటి సమీపంలోని వాల్‌మార్ట్‌లో మూడు కత్తులను కొనుగోలు చేసినట్లు ఆధారలు వెలువడ్డాయి. వాటిలో రెండిటి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. భార్య అదృశ్యమైన తర్వాత భట రక్తంతో తడిసిన బాత్ మ్యాట్, బ్యాగ్‌లను చెత్త కాంపాక్టర్లో పడేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చెత్త సంచులను పారవేస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో మమతను ఆమె భర్తే హత్య చేసి ఉంటాడనే పోలీసుల అనుమానం బలపడింది. దీని ద్వారా తన నేరాన్ని దాచడానికి ప్రయత్నించాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడికి సెప్టెంబర్‌లో బెయిల్ నిరాకరించడంతో కస్టడీలోనే ఉన్నాడు. -
గూగుల్‌ను గుడ్డిగా నమ్మితే.. మీకూ ఇలాంటి మోసమే జరగొచ్చు!
ప్రస్తుతం ఏది కావాలన్నా గూగుల్లోనే వెతికేస్తున్నాం. అయితే అందులో వచ్చిన ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్తే మోసపోయే అవకాశం ఉంది. ఇలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలోని ఉడిపిలో క్యాబ్ బుక్ చేసుకునే ప్రయత్నంలో ఆన్లైన్ మోసానికి గురై రూ.4.1 లక్షలు పోగొట్టుకున్నాడు.మోసం జరిగిందిలా..గూగుల్ సెర్చ్‌లో కనిపించిన మోసపూరిత కార్ రెంటల్ వెబ్‌సైట్‌తో లింక్ అయిన నకిలీ చెల్లింపు పేజీలో తన కార్డ్ వివరాలను నమోదు చేసి బాధితుడు మోసపోయినట్లు తెలుస్తోంది. ఓ వార్తా నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి కార్ రెంటల్ సర్వీస్‌ల కోసం గూగుల్‌లో శోధించాడు. “శక్తి కార్ రెంటల్స్” అని కనిపించిన లింక్‌పై క్లిక్ చేశాడు. కొద్దిసేపటికే కంపెనీ ప్రతినిధినంటూ ఒక వ్యక్తి అతన్ని సంప్రదించాడు. అతను వెబ్సైట్ ద్వారా టోకెన్‌గా రూ. 150 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించమని సూచించాడు.దీంతో బాధితుడు తన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో ఫీజు చెల్లించడానికి ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా లావాదేవీ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీ రాలేదు. కానీ, కొద్దిసేపటికే అతని ఖాతాల నుండి డబ్బులు కట్ అయినట్లు బ్యాంక్ నుంచి నోటిఫికేషన్లు వచ్చాయి. తన ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి రూ.3.3 లక్షలు, కెనరా బ్యాంక్ డెబిట్ కార్డు నుంచి రూ.80,056 మొత్తం రూ.4.1 లక్షలు కట్ అయ్యాయి.దేనికోసమైనా గూగుల్‌లో వెతికేటప్పుడు అందులో వచ్చే లింక్‌లను ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకుని ముందుకెళ్లాలి. ఆర్థిక విషయాలకు సంబంధించినవైతే మరింత జాగ్రత్త అవసరం. మరోవైపు గూగుల్ కూడా ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఒక కొత్త అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసినట్లు కొన్ని నెలల క్రితం తెలిపింది. -
ఫేక్ వెబ్సైట్లకు చెక్.. గూగుల్‌లో కొత్త ఫీచర్
Google Badges: మనకు ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ చేసేస్తాం. అలా సెర్చ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఫేక్ వెబ్సైట్ కూడా దర్శనమిస్తుంటాయి. తెలియనివారు వీటితో నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో యూజర్ల భద్రత కోసం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.ఫేస్బుక్, వాట్సాప్, ‘ఎక్స్’ (ట్విటర్) వంటి వాటిలో ప్రసిద్ధమైన వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లను గూగుల్ కూడా తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. గూగుల్ సెర్చ్ ఫలితాల్లో ఇప్పటికే ఈ తేడాను చూడవచ్చు. అధికారిక మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వెబ్సైట్లకు లింక్‌ల పక్కన బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది.ప్రముఖ కంపెనీల అధికారిక ఖాతాలను గుర్తించేందుకు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ ప్రకటించింది. ధ్రువీకరణ చిహ్నాలు (Google Badges) ఇప్పుడు కొన్ని పరిశ్రమలలోని ప్రముఖ కంపెనీల వెబ్ అడ్రస్ పక్కన కనిపిస్తాయి. దీంతో ఫేక్ వెబ్సైట్లను యూజర్లు సులభంగా గుర్తించగలరు. ఇందుకోసం ఆటోమేటెడ్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. -
గూగుల్ హిస్టరీ ప్రింట్ తీసి.. జాబ్ నుంచి తీసేసిన కంపెనీ
కొందరు తమ తెలితక్కువ పనులతో ఉద్యోగాలు పోగొట్టుకుంటుంటారు. ఇలాగే యూకేలో ఉద్యోగి గూగుల్ హిస్టరీని ప్రింట్ తీసి మరీ అతన్ని ఉద్యోగం నుంచి తీసేసింది ఓ కంపెనీ. అతను గూగుల్‌లో వెతికింది అశ్లీల విషయాలు మాత్రం కాదు. మరి ఏం సెర్చ్ చేశాడు.. దీని వల్ల పడిన ఇబ్బందులేంటి అన్నది స్వయంగా అతడే ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.‘మిర్రర్స్’ నివేదిక ప్రకారం.. యూకేకి చెందిన జోస్ విలియమ్స్ అనే 26 ఏళ్ల యువకుడు ఓ కంపెనీలో కస్టమర్ సర్వీస్ అడ్మినిస్ట్రేటర్‌గా చేరాడు. పెద్దగా పనులేవీ అప్పగించకపోవడంతో అతడు ఆఫీస్ కంప్యూటర్లో "టర్కీ దంతాలు", "సైమన్ కోవెల్ బాచ్డ్ బొటాక్స్" వంటి అనవసర వాటి కోసం శోధించాడు. అతని ప్రవర్తనను గమనించిన బాస్ ఆఫీస్ కంప్యూటర్లో అతడు ఏమేం సెర్చ్ చేశాడన్నది మొత్తం 50 గంటల హిస్టరీని ప్రింట్ తీసి మందలించి ఉద్యోగంలోంచి తీసేశారు.దీని గురించి విలియమ్స్ టిక్‌టాక్ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో తాను చాలా ఇబ్బందులు పడ్డానని, మూడు కంపెనీలు జాబ్ రిజక్ట్ చేశాయని చెప్పుకొచ్చాడు. జాబ్ లేకపోవడంతో డబ్బులు లేక ఇంటి అద్దె కూడా కట్టలేకపోయాన్నాడు. అయితే అతను టిక్‌టాక్ పెట్టిన ఈ వీడియోకు మాత్రం 450 పౌండ్లు (రూ.50 వేలు) దాకా డబ్బులు రావడం గమనార్హం. కంటెంట్ క్రియేషన్‌లో అభిరుచి ఉన్న విలియమ్స్ ప్రస్తుతం ఫుడ్ ఇండస్ట్రీలో సప్లయి చైన్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. -
గూగుల్‌లో వెతికి మరీ..
హైదరాబాద్: ఒకవేళ ఎవరైనా మిస్ అయితే..పోలీసులు ఎలా కనుక్కుంటారని 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి గూగుల్‌లో సెర్చ్ చేశాడు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, సీసీఫుటేజీల ఆధారంగా పోలీసులు ట్రేస్ చేసి పట్టుకుంటారని గూగుల్ నుంచి సమాధానం దొరికింది. అంతే..సెల్‌ఫోన్‌ను ఇంట్లో పడేశాడు..సీసీ కెమెరాలకు దొరక్కుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుని..చాకచక్యంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తనను ఎప్పటికీ కనుక్కోకూడదన్న ఆలోచనతో వెళ్లిపోయిన ఆ విద్యార్థి ఆచూకీ కనుగొనాలంటూ కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జూబ్లీహిల్స్ కమలాపురికాలనీ ఫేజ్–2కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శైలేష్ కొనోడియా కుమారుడు జయేష్ కొనోడియా (17) ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి చదువుతున్నాడు. గత నెల 17వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అయితే వెళ్లే సమయంలో సెల్‌ఫోన్‌ను ఇంట్లో వదిలేశాడు. కుటుంబ సభ్యులు సెల్‌ఫోన్‌ను చెక్ చేయగా మిస్ అయితే పోలీసులు ఎలా ట్రేస్ చేస్తారనే విషయాలను గూగుల్ ద్వారా తెలుసుకున్నట్లు గుర్తించారు. ఆ మేరకే సెల్‌ఫోన్‌ను ఇంట్లో వదిలేసి, సీసీ కెమెరాలకు చిక్కకుండా వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. శైలేష్ సోదరుడు నీలేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
రోగాలకు ‘గూగుల్ చికిత్స’ వద్దు
మాదాపూర్: కిడ్నీ సమస్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మాదాపూర్‌లోని యశోద హాస్పిటల్లో అత్యాధునిక క్రిటికల్ కేర్ నెఫ్రాలజీపై శనివారం అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, రోజురోజుకీ జీవన విధానంలో మార్పులు రావడం వల్లనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ మెరుగైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. గ్రామాలలో చాలా మందికి కిడ్నీ సమస్యలపై అవగాహన లేకపోవడంతో, సంబంధంలేని డాక్టర్ల వద్దకు వెళ్లి మోతాదుకు మించిన మందులను వాడుతుండటంతో కిడ్నీ సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. చాలా మంది గూగుల్ సెర్చ్ చేసి స్వయంగా మందులు వాడటంతో అవి పెద్ద సమస్యలుగా మారుతున్నాయన్నారు. డాక్టర్ల సలహా మేరకు మాత్రమే మందులను వాడాలని, సంబంధించిన డాక్టర్ వద్ద మాత్రమే చికిత్స పొందాలని గవర్నర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల రూపాయల ఆరోగ్య బీమాను అందిస్తోందని, ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. కిడ్నీలను పరీక్షించేందుకు గతంలో సరైన పరికరాలు ఉండేవి కాదని, ప్రస్తుతం అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇలాంటి సదస్సులను నిర్వహించడం వల్ల రోగులకు వ్యాధులపై అవగాహనతో పాటు మెరుగైన చికిత్సను అందించవచ్చని చెప్పారు. యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ, ఏకేఐ నిర్ధారణ సీరం క్రియాటిన్ పెరుగుదలపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రపంచంలో దాదాపు 850 మిలియన్ ప్రజలు ఏదో ఒక మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్నారని తెలిపారు. కిడ్నీ వ్యాధులు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి, క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ వ్యాధులపై చర్చించడానికి సదస్సులో అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ సదస్సులో వేయి మందికిపైగా వైద్య నిపుణులు పాల్గొన్నారు. -
గూగుల్‌లో ఎక్కువగా వెతికిన పర్యాటక ప్రాంతాలివే
ప్రస్తుతమున్న రోజుల్లో గూగుల్ వాడకం బాగా పెరిగింది. ఎలాంటి సందేహాలు ఉన్నా క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే గూగుల్‌ను ఆశ్రయిస్తున్నారు. 2023కి త్వరలోనే ఎండ్‌కార్డ్ పడనుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్ లిస్ట్‌ను గూగుల్ రిలీజ్ చేసింది. మరి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాలేంటి? టాప్ 10 లిస్ట్ ఏంటన్నది చూసేద్దాం. వియత్నాం గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన టూరిస్ట్ ప్రాంతాల్లో వియత్నాం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడి ప్రకృతి సోయగాలు,బీచ్‌లు,రుచికరమైన ఆహారం, చారిత్రక అంశాలతో మనసు దోచే ఈ ప్రాంతం టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తోంది. నవంబర్ నుంచి ఏప్రిల్ సీజన్లో వియత్నంలో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గుహకు నిలయమైన సోన్డూంగ్, ఫోంగ్ న్హా-కే బ్యాంగ్ నేషనల్ పార్క్, హాలాంగ్ బే, న్హా ట్రాంగ్, కాన్ దావో, ఫు క్వాక్, హోయ్ యాన్,నిన్ బిన్ ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు. View this post on Instagram A post shared by Vietnam 🇻🇳 Travel | Hotels | Food | Tips (@vietnamtravelers) గోవా 2023లో మోస్ట్ సెర్చ్డ్ డెస్టినేషన్స్‌లో భారత్‌లోని గోవా రెండో స్థానంలో నిలవడం విశేషం. బీచ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన గోవా ట్రిప్ యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఇక్కడి బీచ్‌లు, చర్చ్‌లు, పచ్చదనం సహా ఎన్నో అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుల కోసం సలీం అలీ బర్డ్ శాంక్చురీ,దూద్‌సాగర్ జలపాతాలు, బామ్ జీసస్, సే కేథడ్రల్ చర్చిలు, బోమ్ జీసస్ బసిలికా, ఫోర్ట్ అగ్వాడా ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. బాలి భూతల స్వరంగా పిలిచే బాలి ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇండోనేషియాలోని జావా, లాంబాక్ దీవుల మధ్య లో బాలి దీవి ఉంటుంది. 17 వేల దీవులు ఉన్న ఇండోనేషియాలో బాలి ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిఉస్తుంది. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. అందుకే బాలిని దేవతల నివాసంగా పిలుస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. సేక్రెడ్ మంకీ ఫారెస్ట్, ఉబుద్ ప్యాలెస్,ఉలువతు ఆలయం, లొవియానా వంటి ప్రాంతాలు ఇక్కడ అస్సలు మిస్ కావొద్దు. చదవండి: 2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్ కోసం వెతికారో తెలుసా? View this post on Instagram A post shared by Bali - The Island of the Gods (@bali) శ్రీలంక గూగుల్ సెర్చ్‌లో ఈ ఏడాది ఎక్కువగా వెతికిన ట్రావెల్ డెస్టినేషన్‌లో శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచింది.అందమైన ద్వీప దేశాల్లో శ్రీలంక ఒకటని చెప్పుకోవచ్చు. పురాతన శిథిలాలు, దేవాలయాలు, అందైన బీచ్‌లు, తేయకు తోటలు.. ఇలా ఎన్నో పేరుగాంచిన పర్యాటక ప్రదేశాలు శ్రీలంకలో ఉన్నాయి. ఇక్కడ సిగిరియా రాక్ ఫారెస్ట్,యాలా నేషనల్ పార్క్,మిరిస్సా బీచ్,ఎల్లా హిల్ స్టేషన్, బౌద్ధ దేవాలయం, డచ్ స్టైల్లో నిర్మించిన ఇళ్లు, హెరిటేజ్ మ్యూజియంలు, రెయిన్ ఫారెస్ట్లు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. థాయ్‌లాండ్ అందమైన ప్రకృతికి థాయ్‌లాండ్ పెట్టింది పేరు. ల్యాండ్ ఆఫ్ స్మైల్స్‌గా దీనికి పేరుంది. ఇక్కడ దట్టమైన అడవులు, థాయిలాండ్ ఫుకెట్, కో ఫై ఫై, క్రాబీ, కో స్యామ్యూయ్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి. థాయ్ టూర్లో ప్రత్యేకత బ్యాంకాక్‌లో ఉన్న ఎమరాల్డ్ బౌద్ధ ఆలయం. అంతేకాకుండా ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి. వీటితో పాటు కశ్మీర్, కూర్గ్, అండమాన్ నికోబార్ దీవులు,ఇటలీ, స్విట్జర్లాండ్ కూడా టాప్-10 డెస్టినేషన్ లిస్ట్‌లో ఉన్నాయని గూగుల్ వెల్లడించింది. -
2023లో గూగుల్‌లో అత్యధికంగా ఏ ఫుడ్ కోసం వెతికారో తెలుసా?
ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే 2024లో అడుగు పెట్టబోతున్నాం. కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. 2023లో ఫ్యాషన్, బ్యూటీ, ఫుడ్ విషయంలో అనేక కొత్త ట్రెండ్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఫుడ్ రెసిపిల్లోనూ వెరైటీ ప్రయోగాలెన్నో చూశాం. అలా 2023లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన 10 ఆహార పదార్థాలుఏంటో చూసేద్దాం. మిల్లెట్స్ 2023 సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆహార పదార్థాల్లో మిల్లెట్స్ పేరు ముందుంది. మిల్లెట్స్ తయారీ విధానం, దాని ప్రయోజనాలు తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. దీనికి ప్రధాన కారణం.. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించడమే. అవకాడో అవకాడో ఒక అమెరికన్ ఫ్రూట్. దీన్ని తెలుగులో వెన్నపండు అంటారు. గూగుల్‌లో అత్యధికంగా వెతిక ఆహార పదార్థాల్లో అవకాడో ఒకటి. అవకాడలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫ్రూట్‌కి బాగా డిమాండ్ ఉంది. అరటిపండు కంటే అవోకాడోలో ఎక్కువ పొటాషియం ఉంది. అవకాడో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అవకాడోను పలు స్మూతీల్లో, సలాడ్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది కాస్త కాస్ట్లీ అయినప్పటికీ అవకాడోలోని పోషకాలు, హెల్తీ ఫ్యాట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కారణంగానే గూగుల్ మోస్ట్ సెర్చ్డ్ ఫుడ్ ఐటెమ్స్‌లో ఒకటిగా నిలిచింది. మటన్ రోగన్ జోష్ గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఫుడ్ ఐటమ్స్‌లో మటన్ రోగన్ జోష్ మూడో స్థానం దక్కించుకుంది. ఇది పాపులర్ కశ్మీరీ వంటకం. నాన్ లేదా రైస్‌తో తినే ఈ స్పైసీ ఫుడ్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ ఏడాది ఎక్కవుగా సెర్చ్ చేసిన టాప్-3 ఐటెం ఇది. కతి రోల్స్ 2023లో గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ఆహార పదార్థాల్లో కతి రోల్స్ నాలుగో స్థానంలో నిలిచింది. కోల్‌కతాలోని పాపులర్ స్ట్రీట్‌ఫుడ్స్‌లో ఇది ఒకటి. రోల్స్‌లో స్టఫింగ్ కోసం వెజ్ లేదా నాన్‌వెజ్‌ను ఎంచుకోవచ్చు. వీటిని చట్నీ లేదా సాస్‌తో వడ్డిస్తారు. టిన్ట్ ఫిష్ చేపల్లో ప్రోటీన్, ఒమేగా-2 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. 2023లో ఎక్కువగా సెర్చ్ చేసిన వంటకాల్లో టిన్ట్ ఫిష్ కూడా ఉంది. సలాడ్,శాండ్విచ్, పాస్తా,,క్యాస్రోల్ వంటకాల్లో ఎక్కువగా టిన్ట్ ఫిష్‌ను ఉపయోగిస్తారు. -
గూగుల్ సెర్చ్‌లో ఈ ఏటి మేటి?
2023 ముగియడానికి.. 2024 ప్రారంభం కావడానికి మరెన్నో రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది భారతదేశంలో ఎక్కువ మంది గూగుల్‌లో ఏమి సెర్చ్ చేశారు, నెటిజన్ల దృష్టిని ఆకర్శించిన అంశాలు ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇయర్ ఇన్ సెర్చ్ 2023 ప్రకారం.. ఈ సంవత్సరం ఎక్కువమందిని ఆకర్శించిన అంశం చంద్రయాన్ 3. ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న సంఘటనల్లో చంద్రయాన్-3 సక్సెస్ ఒకటి. ఆ తరువాత కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన అంశాలను కూడా ఎక్కువగా గూగుల్ సర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్దానికి సంబంధించిన విషయాలు, బడ్జెట్ 2023, టర్కీ భూకంపం, ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించిన వార్తలను ఎక్కువమంది గూగుల్ సెర్చ్ చేసినట్లు ఇటీవల విదులైన కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. 2023లో ఎక్కువమంది గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు చంద్రయాన్-3 కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇజ్రాయెల్ వార్తలు సతీష్ కౌశిక్ బడ్జెట్ 2023 టర్కీ భూకంపం అతిక్ అహ్మద్ మాథ్యూ పెర్రీ మణిపూర్ వార్తలు ఒడిశా రైలు ప్రమాదం ఇదీ చదవండి: ఆస్ట్రేలియాలో ఇండియన్ బ్రాండ్ డీలర్షిప్ ఎలా ఉందో చూసారా.. (వీడియో) పైన తెలిపిన విషయాలు మాత్రమే కాకుండా చాట్‌జీపీటీ, ఇన్స్టాగ్రామ్, యూనిఫాం సివిల్ కోడ్ సంబంధిత చాలా విషయాలను కూడా గూగుల్ సెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో.. జీ20 అంటే ఏమిటి,యూసీసీ అంటే ఏమిటి, చాట్‌జీపీటీ అంటే ఏమిటి, హమాస్ అంటే ఏమిటి, 2023 సెప్టెంబర్ 28 ప్రత్యేకత, ఇన్స్టాగ్రామ్ థ్రెడ్ అంటే ఏమిటి, సెంగోల్ అంటే ఏమిటి అనే అంశాలు ఉన్నాయి. -
‘నాటు నాటు’ ప్రభంజనం.. ఆస్కార్ ఫీట్‌తో గూగుల్ సెర్చ్‌లో జూమ్
సాక్షి,ముంబై: 95వ అకాడమీ అవార్డ్స్‌లో సత్తాచాటిన సెన్సేషనల్ సాంగ్ నాటు నాటు హవా ఒక రేంజ్లో కొనసాగుతోంది. ఆస్కార్ గెల్చుకున్న ఇండియన్ తొలి సాంగ్‌గా రికార్డును కొట్టేసిన తర్వాత గూగుల్‌లో నెటిజన్లు తెగ వెతికేశారట. టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని ఈ సూపర్-హిట్ సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్ గెల్చుకున్న తరువాత దీనిపై నెటిజన్ల ఆసక్తి 10 రెట్లకు పైగా పెరిగింది. ఫలితంగా నాటు నాటు సూపర్ ట్రెండింగ్‌లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై సెర్చెస్ 1,105 శాతం పెరిగాయని ఒక నివేదిక బుధవారం వెల్లడించింది. జపనీస్ ఆన్లైన్ క్యాసినో గైడ్ 6తకరకుజీ, గూగుల్ సెర్చ్ ట్రెండ్ డేటాను విశ్లేషించింది. ఇందులో తెలుగు చిత్రం ఆస్కార్ అవార్డును గెలుచుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే నాటునాటు కోసం ఆన్లైన్లో భారీ క్రేజ్ వచ్చిందనీ, సగటు కంటే 10 రెట్లు శోధనలు పెరిగాయని వెల్లడించింది. టాలీవుడ్ హీరోలు, జూ.ఎన్టీఆర్, మెగా హీరో రాంచరణ్ పెర్ఫామెన్స్ హైలైట్‌గా నిలిచింది. నాటు నాటు ఒక హై-టెంపో రిథమ్, డ్యాన్స్ , స్టెప్పులు గ్లోబల్‌గా విపరీతంగా ఆకట్టుకున్నాయి. పాపులర్ సింగర్స్ లేడీ గాగా , రిహన్న వంటి సంగీత దిగ్గజాల మనసు కూడా దోచుకుందీ పాట. అంతేనా ఈ సాంగ్ టిక్‌టాక్‌లో ప్రముఖ సంచలనంగా మారింది, గత సంవత్సరం మార్చిలో విడుదలైనప్పటి నుండి 52.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సంవత్సరం ఆస్కార్ వేడుకలో ఆర్ఆర్ఆర్మూవీకిసముచిత గౌరవం లభించిందనీ, అవార్డుతో చరిత్ర సృష్టించిదంటూ 6టకరకుజీ ప్రతినిధి ప్రశంసించారు. కాగా 95వ అకాడమీ ఆస్కార్ వేడుకలో, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ ఎలక్ట్రిఫైయింగ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఉర్రూత లూగిపోయారు. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో నాటు నాటు ప్రదర్శనకు అపురూపమైన స్టాండింగ్ ఒవేషన్‌తో పెద్ద ఎత్తున ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. -
గూగుల్ సెర్చ్‌లో ఆ సినిమానే టాప్.. ఆర్ఆర్ఆర్ ఎక్కడంటే?
బాలీవుడ్ జంట అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మస్త్ర-పార్ట్ 1'. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా పలు రికార్డులు సాధించింది. అయితే ఈ ఏడాది అత్యధికంగా గూగుల్‌లో వెతికిన చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్- 2, ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారను వెనక్కినెట్టి 2022లో అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సాధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2022'ని ఆవిష్కరించింది. ఈ ఏడాది 11 నెలల్లో ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న జాబితాను ప్రకటించింది. అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ జాబితాలో రెండోస్థానంలో కేజీఎఫ్-2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదో స్థానంలో కాంతార నిలిచాయి. ఆ తరువాత వరుసగా పుష్ప-ది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్ధా, దృశ్యం-2, థోర్-లవ్ అండ్ థండర్ సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హిట్ మూవీ పుష్ప: ది రైజ్ గతేడాది విడుదలైనప్పటికీ 2022లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన ఐదు చిత్రాలు ఉండగా.. కేవలం నాలుగు హిందీ చిత్రాలు మాత్రమే చోటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. -
గూగుల్‌లో ఈ 3 విషయాలు వెతకొద్దు.. సెర్చ్ చేశారంటే జైలుకెళ్లడం ఖాయం!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచం డిజిటల్ మయమైంది. అదీ ఇదీ అని కాకుండా ఏ చిన్న సందేహం వచ్చినా ఇంటర్నెట్ను ఆశ్రయిస్తాం. గూగుల్, యూట్యూబ్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ బింగ్, బైడూ, యాండెక్స్ వంటి సెర్చ్ ఇంజిన్లు చాలా ఉన్నప్పటికీ.. ఎక్కువమంది గూగుల్ తల్లివైపే మొగ్గు చూపుతారు. అయితే, అక్కడేది వెతికినా పర్లేదు అనుకుంటే పొరపాటే! కాలం మారింది.. క్రైంను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమల్లోకి వచ్చాయి. గూగుల్‌లో కొన్ని విషయాల గురించి సెర్చ్ చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సిందే. అవేంటో చూద్దాం! 1. చైల్డ్ పోర్నోగ్రఫీ చిన్నారులకు సంబంధించి పోర్నోగ్రఫీ కంటెంట్‌ను గూగుల్‌లో వెతికితే శిక్షార్హులవుతారు. పొరపాటున సెర్చ్ చేసినా పోక్సో చట్టం కింద జైలు ఖాయం అవ్వొచ్చు. ఈ నేరం కింద 5 నుంచి ఏడేళ్లవరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త! చదవండి👉🏼 గుడ్‌బై ఐపాడ్.. బరువెక్కిన గుండెలతో వీడ్కోలు.. 2. బాంబుల తయారీ బాంబులను ఎలా తయారు చేయాలని గూగుల్‌లో సెర్చ్ చేస్తే చిక్కులు తప్పవు. ఇటువంటి కంటెంట్‌ను వెతికినవారిని సెక్యురిటీ సంస్థలు గుర్తిస్తాయి. చట్టపరమైన చర్యలు తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. 3. అబార్షన్ అబార్షన్ చేయడమెలా? అని గనుగ గూగుల్‌లో వెతికితే కటకటాలు తప్పవు. గర్భస్రావాలను నిరోధించేందుకు భారత్ గట్టి చట్టాలను రూపొందించింది. అబార్షన్‌కు సంబంధించిన కంటెంట్‌ను సెర్చ్ చేస్తే భారతీయ చట్టాల ప్రకారం శిక్షార్హులు. డాక్టర్ అనుమతితోనే గర్భస్రావానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. చదవండి👉🏻 చైనా అధ్యక్షుడికి బ్రెయిన్‌కి సంబంధించిన వ్యాధి -
గూగుల్‌లో సెర్చ్ చేసి దోపిడీకి ప్లాన్.. బంగారం అమ్ముతామని రప్పించి దారుణం
బనశంకరి (కర్ణాటక): దుండగులు గూగుల్‌ను సెర్చ్ చేశారు. గోల్డ్ కంపెనీ ఉద్యోగుల వద్ద నగదు ఉంటుందని గుర్తించి వల వేశారు. బంగారం అమ్ముతామని చెప్పి ఆ కంపెనీ ఉద్యోగిని రప్పించి హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసి నగదుతో ఉడాయించారు. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. పుట్టేనహళ్లిపోలీసుల కథనం మేరకు వివరాలు...బనశంకరి సరబండెపాళ్య నివాసి దివాకర్ ఎస్ఎస్ఆర్ గోల్డ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రజల వద్ద బంగారు నగలు డిపాజిట్ చేయించుకొని రుణాలు ఇచ్చేవారు. ఇదిలా ఉండగా తుమకూరుకు చెందిన మంజునాథ్, మునిరాజ్‌లు దోపిడీ కోసం ప్లాన్ వేశారు. గూగుల్‌లో గాలించి ఎస్ఎస్ఆర్ గోల్డ్ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసి దివాకర్ నంబర్ తీసుకున్నారు. ఈనెల 19న ఫోన్ చేశారు. చదవండి: (కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాఫ్ హెల్మెట్‌కు బై బై?) డబ్బు అవసరం ఉందని, 65.70 గ్రాముల ఆభరణాలు విక్రయిస్తామని చెప్పి సుందనకట్టెకు ఈనెల 20న రప్పించి అతని వద్ద ఉన్న రూ.5లక్షలు లాక్కొని తర్వాత అతన్ని గొంతునులిమి హత్య చేసి శవాన్ని మూటగట్టి అతను వచ్చిన బైక్‌తో సహా మాగడిరోడ్డు హొన్నాపుర చెరువులో పడేశారు. దివాకర్ అదృశ్యంపై లక్ష్మీ అనే మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు అతని ఫోన్‌కు వచ్చిన నంబర్లను పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. బుధవారం దివాకర్ మృతదేహాన్ని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. చదవండి: (యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..?) -
గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2021: మనోడు కాదు.. అయినా తెగ వెతికారు!
Google Year in Search 2021.. Billionaire Elon Musk was Searched Extensively By Indians: ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సెర్చింజన్ గూగుల్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2021’ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. కరోనా హవాను తట్టుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్.. భారత్‌లో ఓవరాల్ టాప్ సెర్చ్ లిస్ట్‌లో నిలిచింది. ఇక మిగతా జాబితాలోనూ వార్తల్లో నిలిచిన వైవిధ్యమైన అంశాలు, కరోనా సంబంధిత టాపిక్స్ సెర్చ్ ట్రెండ్‌లో టాప్‌లో నిలిచాయి. సాధారణంగా సినీ సెలబ్రిటీలు, ముఖ్యంగా సన్నీ లియోన్, కత్రినా కైఫ్ లాంటి ఫీమేల్ సెలబ్రిటీల గురించి మనోళ్ల వెతుకులాట ఎక్కువగా కొనసాగుతూ వచ్చేది. అయితే ఈ ఏడాది కొంచెం భిన్నంగా Google Year in Search 2021లో భారతీయుల వెతుకులాట కొనసాగింది. ఇక పర్సనాలిటీ లిస్ట్‌లో టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా టాప్‌లో నిలవగా.. ఈ లిస్ట్‌లో ఒక్కరు తప్ప అంతా మన దేశస్తులే ఉన్నారు. ఆ ఒక్కరు ఎవరో కాదు.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. 278 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడు ఎలన్ రీవ్ మస్క్. ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడిగా, టెస్లా సీఈవోగా కొనసాగుతున్న ఎలన్ మస్క్.. ఇండియన్ గూగుల్ ఇన్ సెర్చ్ 2021 లిస్ట్‌లో ఐదవ స్థానంలో నిలిచాడు. భారత్‌లో టెస్లా ఈవీ ఎంట్రీ ప్రయత్నాలు, స్పేస్ఎక్స్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కంపెనీ ‘స్టార్‌లింక్’ కనెక్షన్ ఇచ్చే ప్రయత్నాలతో పాటు స్పేస్ఎక్స్ ప్రయోగాలు, పలు అంతర్జాతీయ పరిణామాల్లో జోక్యం కారణంగా ఎలన్ మస్క్ గురించి ఎక్కువగా వెతికారు భారతీయులు. క్లిక్: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1! మరోవైపు పోటీదారు కంపెనీలపై చేసే వెకిలి కామెంట్లు.. ఇచ్చే ప్రకటనలు, క్రిప్టో కరెన్సీ మీద తన వైఖరి, టెస్లాలో షేర్ల అమ్మకం, సోషల్ మీడియాలో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్.. వెరసి ఎలన్ మస్క్ గురించి భారతీయుల్లో ఒకరకమైన ఆసక్తిని కలగజేసింది. ఇంకోవైపు వ్యక్తిగత అంశాలతోనూ 50 ఏళ్ల ఎలన్ మస్క్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఊహకందని చేష్టలతో ‘థగ్ లైఫ్’ పర్సనాలిటీగా ఎలన్ మస్క్‌కి భారతీయ యువతలోనూ మాంచి క్రేజ్ దక్కింది. అంతేకాదు ఆనంద్ మహీంద్రా లాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఎలన్ మస్క్ వ్యవహారాల్ని నిశితంగా పరిశీలిస్తూ.. అప్పుడప్పుడు స్పందిస్తుంటారు కూడా. చదవండి: రాజకీయాల నుంచి ''ఆ ముసలోళ్లను ఎలిమినేట్ చేయండి సార్''..! -
రీసెంట్‌గానే బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా: విజయ్ దేవరకొండ
Vijay Devarakonda Reveals About His Break Up: రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన బ్రేకప్ను బయటపెట్టేశాడు. తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమాకు విజయ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయారు. తాజాగా తమ గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసిన పలు ప్రశ్నలకు దేవరకొండ బ్రదర్స్ సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ డేటింగ్లో ఉన్నారా? సింగిలా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. 'ఈ మధ్యే నా హార్ట్ బ్రేక్ అయ్యింది. అందుకే కొంచెం బాధలో ఉన్నా' అని తెలిపాడు. అంతేకాకుండా ఈ విషయం ఇప్పటివరకు ఎవరికి తెలియదని కూడా చెప్పుకొచ్చాడు.దీంతో దేవరకొండతో బ్రేకప్ అయిన ఆ అమ్మాయి ఎవరా అని ఫ్యాన్స్ మళ్లీ ఆలోచనలో పడ్డారు. మరోవైపు ఆనంద్ దేవరకొండ..తాను ఇంకా సింగిల్ అంటూ తన రిలేషన్షిప్ స్టేటస్‌పై క్లారిటీ ఇచ్చాడు. -
గూగుల్‌లో సూపర్ ఫీచర్, ఇక ఇంగ్లీష్‌లో అదరగొట్టేయొచ్చు
ఇంగ్లీష్..! ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అవసరమైన లాంగ్వేజ్. ఎడ్యుకేషన్ లేకపోయినా, డిగ్రీలు చదవకపోయినా ఇంగ్లీష్ మాట్లాడడం, చదవడం, రాయడం వస్తే చాలు అవకాశాలు దానంతటే అవే మనల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. అందుకే ఇంగ్లీష్ నేర్పించేందుకు ఇనిస్టిట్యూట్లు, యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం యూజర్లకు ఉచితంగా ఇంగ్లీష్ నేర్పించేందుకు సిద్ధమైంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు ఇంగ్లీష్ ల్వాంగేజ్ను నేర్పించాలనే ఉద్దేశంతో గూగుల్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ప్రతిరోజూ కొత్త ఇంగ్లీష్ అర్ధాన్ని నేర్చుకోవచ్చు. యూజర్లు తమ ఫోన్లలో ఈ ఫీచర్‌ను యాక్టివేషన్ చేసుకుంటే గూగుల్ ప్రతిరోజూ ఒక కొత్త అర్ధాన్ని నేర్పిస్తుంది. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్ ఇంగ్లీష్‌లో ప్రావీణ్యులైన అధ్యాపకుల్ని నియమించినట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. తద్వారా ఇంగ్లీష్ భాషపై పట్టుసాధించవచ్చని గూగుల్ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో గూగుల్ ట్రెండ్స్‌లోని టాప్ సెర్చ్‌లో కొన్ని ఇంగ్లీష్ అర్ధాల్ని తెలుసుకునేందుకు ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. వాటిలో ఇంట్రోవర్ట్, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉన్నాయని, అందుకే యూజర్ల రోజూవారి జీవితాల్లో అవసరమైన ఇంగ్లీష్‌లో నైపుణ్యం సాధించేలా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ వెల్లడించింది. గూగుల్ ఫీచర్‌ను ఎలా యాక్టీవ్ చేసుకోవాలి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తరువాత సెర్చ్బార్లో ఉదాహరణకు ఇంటిగ్రిటీ అనే పదం అర్ధం తెలుసుకోవాలని ఉంటే..ముందుగా define అని టైప్ చేయాలి. ఆ వర్డ్ పక్కనే ఇంటిగ్రిటీ (define integrity) అని టైప్ చేస్తే ఆ పదం అర్ధం వస్తుంది. పైన ఇమేజ్‌లో చూపించినట్లుగా సెర్చ్ బార్ పక్కనే బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని మీరు యాక్టివేషన్ చేసుకుంటే గూగుల్ ప్రతిరోజు ఓ కొత్త అర్ధాన్ని నేర్పించేలా మీ మొబైల్‌కి నోటిఫికేషన్ పంపిస్తుంది. చదవండి: Facebook: పేరు మారిస్తే ఫేస్బుక్ ఇమేజ్ దెబ్బతినదా? -
Google: ఇంటర్నెట్తో ముందు ముందు కష్టమే!
ఇంటర్నెట్లో ఏదైనా కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నారా? అది ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? అది అసలు అర్థమయ్యేలా ఉంటోందా? లేదంటే అవతలి వాళ్లను రెచ్చగొట్టేదిగా ఉందా? పోనీ పోస్ట్ చేసేముందు విషయాన్ని ఒకసారి సమీక్షించుకుంటున్నారా?.. ఇలాంటి విషయాల్ని పరిగణనలోకి తీసుకుని ఇంటర్నెట్లో వ్యవహరిస్తే మంచిది. ఎందుకంటే ఎలా పడితే అలా కంటెంట్ పోస్ట్ చేస్తామంటే ఇక మీదట కుదరదు. కొత్త ఐటీ చట్టాల్ని (మే 26) నుంచి బలవంతంగా రుద్దిన కేంద్రం.. కంటెంట్ కట్టడి విషయంలో తనపని తాను చేసుకుంటూ పోతోంది. ఈ తరుణంలో ఇంటర్నెట్ దిగ్గజాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నాయి. పారదర్శకంగా, సమ్మతి ఉన్న కంటెంట్‌ను మాత్రమే అనుమతి ఇస్తూ.. ఫిర్యాదులు, అభ్యంతరకర కంటెంట్‌ను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. అంతేకాదు నెలనెలా ఆ సమీక్ష వివరాల్ని నివేదికల రూపంలో సైతం విడుదల చేస్తున్నాయి. కంప్లయింట్ చేస్తే చాలు భారత్ విషయానికొస్తే.. ఆగష్టు నెలకుగానూ గూగుల్ కంటెంట్ విషయంలో మొత్తం 35, 191 ఫిర్యాదులు వచ్చాయి. వీటి ఆధారంగా 93, 550 పీసుల కంటెంట్‌ను తొలగించింది గూగుల్. ఇది కాకుండా యూజర్ల నుంచి వచ్చిన రిపోర్ట్స్(ఫిర్యాదులు) ఆధారంగా ఆటోమేటెడ్ డిటెక్షన్ ద్వారా మరో ఆరున్నర లక్షల కంటెంట్ పీసులను తీసిపడేసింది. జులై నెలలో ఫిర్యాదులు 36, 934 ఫిర్యాదులు అందగా.. 95, 680 పీసుల కంటెంట్‌ను తొలగించింది. ఇక ఆటోమేటెడ్ డిటెక్షన్ ద్వారా ఐదున్నర లక్షలకు పైగా కంటెంట్ పీసుల్ని తొలగించింది. కాపీనే టాప్ వీటిలో చాలావరకు థర్డ్ పార్టీ కంటెంట్‌కు సంబంధించిన ఫిర్యాదులు ఉండడం విశేషం. స్థానిక చట్టాల్ని ఉల్లంఘించే కంటెంట్(పోస్టులు), వ్యక్తిగత హక్కుల్ని భంగం కలిగించడం, పరువుకు నష్టం వాటిల్లడం, మనోభావాల్ని దెబ్బతీయడం లాంటి ఫిర్యాదుల ఆధారంగా ఈ కంటెంట్‌ను తొలగించినట్లు గూగుల్ ప్రకటించుకుంది. ఫిర్యాదులు కేటగిరీల వారీగా.. ► కాపీరైట్స్ - 92, 750 ► ట్రేడ్‌మార్క్- 721 ► కోర్ట్ ఆర్డర్ - 12 ► గ్రాఫిక్ సెక్సువల్ కంటెంట్- 12 ► ఇతరత్ర లీగల్ రిక్వెస్టులు - 4 అశ్లీల, అనుచిత కంటెంట్‌ను(పోస్టులు, కామెంట్లు, ఫొటోలు, వీడియోలు ఏవైనా సరే) ఫిర్యాదుల ఆధారంగా తొలగించింది గూగుల్. ఒకే కంటెంట్ లేదంటే ఒకే తరహా కంటెంట్ విషయంలో పదే పదే ఫిర్యాదులు అందిన తరుణంలో వాటిని తొలగించినట్లు తెలిపింది. కంటెంట్ విషయంలో ‘యూఆర్ఎల్’ ఆధారంగానే తొలగించిన కంటెంట్‌ను లెక్కగట్టినట్లు స్పష్టం చేసింది. అంతేకాదు పదేపదే కాపీ కంటెంట్ ఫిర్యాదులు అందితే మాత్రం కఠినచర్యలు తప్పవని, అవసరమైతే లీగల్ యాక్షన్స్..నిషేధం(తాత్కాలికం/శాశ్వతం) తప్పదని హెచ్చరిస్తోంది గూగుల్. ఆగష్టు నెలలో మిగతా ప్లాట్‌ఫామ్స్ తీసుకున్న చర్యల్ని పరిశీలిస్తే.. ఫేస్బుక్.. 31.7 మిలియన్ల కంటెంట్(పది కేటగిరీలుగా విభజించి) పీసులను తొలగించింది ఇన్స్టాగ్రామ్.. 2.2 మిలియన్ పీసుల కంటెంట్(తొమ్మిది కేటగిరీలుగా విభజించి)ను తీసేసింది వాట్సాప్ 2 మిలియన్ల అకౌంట్లను నిషేధించింది. కంటెంట్‌తో పాటు ఫొటోలు, వీడియోలు, కామెంట్లు ఏదీ అతీతం కాదు కంటెంట్ రెచ్చగొట్టేదిగా, అవతలి వాళ్లను నేరాలకు ప్రేరేపించేదిగా.. వుసిగొల్పేదిగా ఉండకూడదు ‘వార్నింగ్’ ‘గ్రాఫిక్స్ వార్నింగ్’ ఇచ్చిన కంటెంట్‌ను సైతం ఫిర్యాదు అందితే తొలగించడమే ఇక! రిపోర్టుల ఆధారంగానూ కంటెంట్ తీసేయాల్సిందే! కంటెంట్ గందరగోళంగా ఉన్నాసరే రిపోర్ట్/ఫిర్యాదు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ఆ కంటెంట్‌ను తొలగిస్తారు. -
Google: వెతుకులాట.. అలా మొదలైంది
ఏ ప్రశ్నకైనా సమాధానం కావాలన్నా, ఎటువంటి విషయంలోనైనా అనుమానాల్ని నివృత్తి చేసుకోవాలన్నా.. గూగుల్‌ను ఆశ్రయించాల్సిందే అని ఫిక్స్ అయిపోతోంది మనిషి మెంటాలిటీ. అందుకే రోజూ లక్షల ప్రశ్నలతో సెర్చ్ పేజీలను క్రియేట్ చేసుకునేందుకు శ్రమిస్తోంది గూగుల్‌కి. ఇంతకీ ఈ ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్‌లో మొట్టమొదటగా సెర్చ్ చేసిన పదం ఏదో తెలుసా? ఇంటర్నెట్లో మనం ఏదైనా వెతకాలంటే సెర్చ్ చేయడం అని కాకుండా.. ‘గూగుల్ ఇట్’ అంటున్నాం. అంటే.. సెర్చింజిన్‌తో మనిషి జీవితంలో అంతలా పాతుకుపోయింది గూగుల్ సెర్చ్. సుమారు 23 ఏళ్ల క్రితం ఆసక్తికరంగానే మొదలైంది. ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్లు ‘బ్యాక్‌రబ్’ పేరుతో సెర్చ్ సాఫ్ట్‌వేర్‌ను ఒకదానిని తయారు చేశారు. అప్పటికే ఆల్ట్విస్టా, లైకోస్, ఆస్క్ జీవ్స్ లాంటి సెర్చ్ ఇంజిన్లు ఉన్నాయి. అయితే అప్పటిదాకా పరిమితంగా ఇంటర్నెట్లో ఉన్న వెతుకులాటను.. ఆ పరిధిని దాటిపోయేలా రూపొందించారు వీళ్లిద్దరూ. 1998 సెప్టెంబర్ 5న బ్యాక్‌రబ్(ఇదే గూగుల్ అయ్యింది) స్టాన్ఫోర్డ్ ఇంజినీరింగ్ స్కూల్ డీన్ జాన్ హెన్నెస్సీకి చూపించారు. ఆయన అప్పటి యూనివర్సిటీ చైర్మన్ గెర్హెర్డ్ కాస్పర్ అనే పేరును టైప్ చేశాడు. ఆల్టావిస్టాలో అదే సెర్చ్ ‘కాస్పర్ ది ఫ్రెండ్లీ ఘోస్ట్’ అని చూపించగా.. వీళ్లు తయారు చేసిన సెర్చ్ ఇంజిన్‌లో మాత్రం సరైన రిజల్ట్(గెర్హర్డ్ కాస్సర్కు సంబంధించిన వివరాలే) వచ్చాయి. ఆ తర్వాత అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పేరు వైట్‌హౌజ్ రాసలీలల వ్యవహారంతో ప్రపంచమంతా మారుమోగిపోగా.. గూగుల్‌లో సెర్చ్ కోసం బిల్ క్లింటన్ పేరుతో ప్రత్యేక పేజీని క్రియేట్ చేశారు. బ్యాక్‌రబ్.. కంప్యూటర్ గ్రాడ్యుయేట్స్ ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్‌ల బ్యాక్‌రబ్ సృష్టి.. కోడింగ్ అందించిన స్కాట్ హాసన్ 1998లో బ్యాక్బర్.. గూగుల్‌గా మార్పు గూగుల్ అనే పదం గూగోల్ నుంచి వచ్చింది. దాని విలువ టెన్ టుది పవర్ ఆఫ్ 100. దానర్థం.. అపరిమితం. అందుకే ఆ పేరు పెట్టారు. 2000లో ఇంటర్నేషనలైజేషన్ అయ్యింది. మొత్తం పదమూడు లాంగ్వేజ్‌ల్లో రిలీజ్ అయ్యింది. 2001 నుంచి గూగుల్ న్యూస్, గూగుల్ బుక్స్, గూగుల్ స్కాలర్ 2007లో సెర్చ్ ఇంజిన్‌ను వర్టికల్‌గా మార్చేసి.. యూనివర్సల్ సెర్చ్ ఇంజిన్‌గా మార్చేశారు. 2009లో గూగుల్ రియల్ టైంకి వెళ్లింది. తద్వారా లేటెస్ట్ ఆన్లైన్ అప్డేట్స్ కనిపించడం మొదలైంది 2010 నుంచి.. హౌ, వై, వేర్, వాట్.. ఇలాంటి పదాలతో సెర్చ్ వ్యవహారం మొదలైంది. 2012లో.. గూగుల్ వికీపీడియాకు వెళ్లింది. అప్పటి నుంచి జ్ఞానభాండాగారంగా మారిపోయింది. 2014లో.. పాత సెర్చ్ విషయాల్ని తొలగించే వెసులుబాటును తీసుకొచ్చింది చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల ఆఫర్, గూగుల్ స్పందన -
ఇదేం టెక్నాలజీ! మన తారలకు చెప్పుకోలేని తలనొప్పి
గ్లామర్ ప్రపంచం.. ఎక్కువ మందిని తనవైపు లాగే ఒక ఆకర్షణ. సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూస్ అవుతున్న రోజులివి. ముఖ్యంగా ఫిమేల్ సెలబ్రిటీల విషయంలో ఇది ఎక్కువగా ఉంటోంది. వాళ్ల దృష్టిలో ఇంటర్నెట్ అనేది ఫ్రీ ప్రమోషన్ ఎలిమెంట్. అందుకే తమ క్రేజ్‌ను నిలబెట్టుకునేందుకు గ్లామర్ ఫొటో-వీడియో కంటెంట్‌ను క్రమం తప్పకుండా షేర్ చేస్తుంటారు. అయితే వాళ్లకు తెలియకుండానే ఆ కంటెంట్ తప్పుడు దోవలో వెళ్తోంది. ఆ కంటెంట్‌ను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్నిండా ఫేక్ ఫొటోలు, అశ్లీల వీడియోలతో నింపేస్తున్నారు కొందరు. వెబ్ డెస్క్: ‘ఫేస్ మారిపోతది.. ఫన్ పుడుతది’.. ఈ ప్రచారంతోనే ఎడిటింగ్ యాప్స్‌ల హవా సాగుతోంది ఇప్పడు. కానీ, తెర వెనుక జరిగే తతంగం అంతా వేరే ఉంటోంది. సరదా కోణంలో చూసుకుంటున్నప్పటికీ.. అశ్లీల కంటెంట్ విపరీతంగా జనరేట్ కావడానికి ఇవే ప్రధాన కారణం అవుతున్నాయి. రోజుకి సుమారు 40 లక్షల ఎడిటింగ్ వీడియోలు, 3 కోట్లకు పైగా ‘ఫేక్’(ఎడిటింగ్) కంటెంట్ అప్లోడ్ అవుతున్నట్లు ఒక అంచనా. ఈ విషయంలో మామూలు వ్యక్తుల కంటే సెలబ్రిటీలు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారు. . దీంతో విదేశాల్లో ఈ వ్యవహారాన్ని సెలబ్రిటీలు అంత తేలికగా తీసుకోవడం లేదు. హాలీవుడ్లో అయితే ఇలాంటి అశ్లీల కంటెంట్ కట్టడి కోసం పెద్ద ఉద్యమమే నడుస్తోంది. వీళ్లంతా పోరాడుతున్నారు మనదగ్గర దాదాపు పాతరం, కొత్త తారలంతా ఫేక్ఎడిటింగ్ కంటెంట్ బాధితులుగానే ఉన్నారు. అయితే తమను నెట్టింటికీడుస్తున్న వ్యవహారాలపై పోరాడటానికి ఎందుకనో వెనుకంజ వేస్తున్నారు. విదేశాల్లో మాత్రం ఇలాంటి కంటెంట్‌ను హీరోయిన్లు సహించడం లేదు. హాలీవుడ్ నటీమణులు కేట్ విన్స్లెట్, జెస్సికా ఆల్బాలు ఈ విషయంలో సైబర్ సంబంధిత విభాగాల్లో ఫిర్యాదులు చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై ఓపెన్‌గా చర్చించారు. ఇక ‘వండర్ వుమెన్’ గాల్ గడోట్అయితే ఏకంగా అశ్లీల కంటెంట్ కట్టడి కోసం చిన్నసైజు ఉద్యమాన్నే నడిపిస్తోంది. నటి గాల్ గాడోట్ ఈజిప్ట్ నటి నెల్లీ కరీం.. ఓ అడుగు ముందుకు వేసి తన పేరుతో వైరల్ అవుతున్న కంటెంట్‌ను సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ షేర్ చేసి మరీ నిరసన వ్యక్తం చేసింది. కొందరు బ్రిటన్ భామలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ప్రత్యేక చట్టాల ద్వారా కట్టడికి వీలు లేనప్పుడు.. అలాంటి సైట్లను పూర్తిగా నిషేధించడం ద్వారా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. మన దగ్గరికి వస్తే బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్..భాషలకతీతంగా చాలామంది హీరోయిన్లు ఈ వ్యవహారంలో బాధితులుగా మారుతున్నారు. గూగుల్‌లో వాళ్ల కంటెంట్ కుప్పలుగా కనిపిస్తోంది. దారుణమైన విషయం ఏంటంటే.. ప్రముఖ సోషల్ మీడియా యాప్స్‌లోనూ వందల కొద్ది అకౌంట్ల ద్వారా అవి వైరల్ అవుతుండడం, వాటికి వేల నుంచి లక్షల మంది ఫాలోవర్స్ ఉండడం. వాళ్లే బెటర్ నాలుగు నెలల క్రితం కోలీవుడ్‌కు చెందిన ఓ నటి.. ట్విటర్లో హీరోయిన్ల ఫేక్ ఫొటోల్ని షేర్ చేస్తున్న ఓ అడల్ట్ అకౌంట్‌కు ఫాలో రిక్వెస్ట్ పెట్టింది. అది చూసి సంబురంగా ఆ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి.. ఆమె రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు ఆ అకౌంట్ అడ్మిన్. వెంటనే సైబర్ విభాగానికి ఫిర్యాదు చేసిన ఆ నటి.. అతన్ని కటకటాల వెనక్కి నెట్టించింది. తాజాగా భోజ్‌పురికి చెందిన ఇద్దరు హీరోయిన్లు తమ పేరుతో వైరల్ అవుతున్న కంటెంట్ మీద కోర్టుకు వెళ్లారు. ఇలా ఎంతోమంది చిన్నాచితకా హీరోయిన్లు అశ్లీల కంటెంట్ వ్యాప్తిపై ధైర్యంగా ముందుకొచ్చి పోరాడుతున్నారు. సాధారణంగా ఇలాంటి వేధింపులు ఎవరికైనా ఎదురైనప్పుడు వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేయడానికి ఆస్కారం ఉంటుందని, అవసరం అనుకుంటే ఫిర్యాదుదారుడి సమాచారం సైతం గోప్యంగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు న్యాయ నిపుణులు. ►సెక్షన్ 292(అశ్లీల కంటెంట్‌ను సర్క్యులేట్చేయడం) ► 354సీ (అనుమతి లేకుండా అసభ్య వీడియోల్ని చిత్రీకరించడం), ► 499 (వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం), ► 509 (మహిళా గౌరవానికి భంగం కలిగించడం), ► వీటితో పాటు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్లు 66ఈ, 67, 67ఎ, 72 సెక్షన్ల ప్రకారం ఉపశమనం పొందొచ్చు. ఫేస్ స్వాప్ ఫొటో, వీడియో ఎడిటింగ్ యాప్‌లలో ఫిల్టర్లు, ఫొటో మార్ఫింగ్‌లు సాధారణమైన వ్యవహారాలు. కానీ, టెక్నాలజీ అప్డేట్ మూలంగా అది మరీ శ్రుతి మించిపోతోంది. ఫేస్ స్వాప్.. అశ్లీల టెక్నాలజీని పెంపొదిస్తున్న వాటిల్లో ఒకటిగా మారింది. ఒకరి ముఖం ప్లేస్‌లో మరొకరి ఫేస్ ఉంచడమే దీని ఉద్దేశం. మొదట్లో రివెంజ్ పోర్న్ ద్వారా వార్తల్లో నిలిచిన ఫేస్ స్వాప్.. ఆ తర్వాత ఓ ఎంటర్టైనింగ్ ఫీచర్\టూల్‌గా మారింది. ఇప్పుడు దీనిని ఆసరాగా తీసుకుని సెలబ్రిటీలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. హీరోయిన్ల ఫొటోలను ఎడిట్ చేసి.. ఇంటర్నెట్లో వదులుతున్నారు. డీప్‌ఫేక్ ఫీచర్ ఇది ఒకరకంగా మార్ఫింగ్ లాంటిదే. అల్రెడీ ఉన్న వీడియోతోగానీ, అప్పటికప్పుడు చేసే వీడియోతో ఫన్నీ కంటెంట్ క్రియేట్ చేసేందుకు ఉద్దేశించి రూపొందించిన ఫీచర్. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ(ఏఐ)తో పని చేసే సింథటిక్ టెక్నాలజీ ఇది. దీని ద్వారా ఒక వీడియోలోగానీ, ఫొటోలోగానీ ముఖాన్ని ఈ ఫీచర్ ద్వారా మార్చేయొచ్చు. ఆ ప్లేస్‌లో యూజర్ తన ఫేస్‌ని లేదంటే తనకు కావాల్సిన ముఖాన్ని అప్డేట్ చేసి ఓ కొత్త వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక సరదా వ్యవహారం. ఇందుకోసం కోట్లు ఖర్చు చేసి ఏఐ టెక్నాలజీ సాయం తీసుకుంటున్నాయి వీడియో ఎడిటింగ్ యాప్‌లు. కానీ, గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న సెలబ్రిటీలకు.. ఫేక్ వీడియోల ద్వారా ఈ టెక్నాలజీ కొత్త తలనొప్పి తీసుకొస్తోంది. కంట్రోల్ కాదనేనా? గతంలో ఇలాంటి కంటెంట్ తెరపైకి వచ్చినప్పుడు.. ఖండించిన తారలూ లేకపోలేదు. కానీ, ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. కొందరు సరదా కోసం ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంటే.. మరికొందరు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. అనని మాటల్ని అన్నట్లు.. చేయని పనుల్ని చేసినట్లు చూపిస్తున్నారు. కాంట్రవర్సీలు, ఫేక్ సెక్స్ స్కాండల్స్‌తో ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారు. దీంతో టెక్నాలజీ ‘సేఫ్టీ’పై అనుమానాలు తలెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి ‘ప్రీ ఎంప్టివ్ రీసెర్చ్’ సర్వీస్ ఉంది. ఈ సర్వీస్ ద్వారా యూజర్ జనరేట్ కంటెంట్‌ను కంట్రోల్ చేయగలిగినా.. ఇతర సైట్లతో మళ్లీ వైరల్ అవ్వొచ్చని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వ్యవహారాలేవీ కొత్తేం కాదని, ఎంత నియంత్రించినా మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉంటాయని చెప్తున్నారు నెదర్లాండ్స్ ఆర్ట్ఈజెడ్ యూనివర్సిటీ ‘ఎస్తెటిక్స్ అండ్ కల్చర్ ఆఫ్ టెక్నాలజీ’ ప్రొఫెసర్ నిశాంత్షా. బహుశా ఈ కోణంలోనే ఆ ఫేక్ బురదలో రాయి వేయడం ఎందుకని ఈ తలనొప్పిని పంటి బిగువున భరిస్తున్నారనే వాదన కూడా ఒకటి వినిపిస్తోంది. చదవండి: సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..! -
రిహన్నా ట్వీట్.. గూగుల్‌లో ఏం సెర్చ్ చేశారంటే?
రైతుల నిరసనలపై స్పందించిన్పటి నుంచి ప్రముఖ పాప్ సింగర్ రిహన్నా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారారు. ప్రపంచ గాయని, నటి రిహన్నా భారత్‌లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు తెలుపుతున్న రైతులకు మద్దతుగా మంగళవారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. "మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకోకూడదు?" అంటూ ఫార్మర్స్ ప్రొటెస్ట్ హ్యాష్ ట్యాగ్‌ను, ఓ మీడియాలో ప్రచురితమైన వార్తను జోడిస్తూ పోస్ట్ పెట్టారు. ఇక ఈ ట్వీట్ చేయడంతో రిహన్నా వైరల్‌గా మారారు. ఆమె ట్వీట్ చాలా సేపు ట్విట్టర్లో ట్రెండ్ అయ్యింది. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపితే.. పూర్తి స్థాయి అవగాహన తర్వాత స్పందించాలని మరికొంతమంది హితవు పలికారు. చదవండి: కంగనాకు ట్విటర్ మరోసారి షాక్ ఇదిలా ఉండగా అన్నదాతల ఆందోళనలపై స్పందించడంతో రిహాన్నా గూగుల్లోనూ ట్రెండింగ్ మారారు. ఈ గాయని గురించి అనేకమంది నెటిజన్లు మొదటిసారి వినడంతో తన గురించి తెలుసుకోవాలనే ఉత్సుకతతో గూగుల్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. రిహన్నా ఎవరనే విషయంతోపాటు ఆమె మతం ఏంటని ఎక్కువగా శోధించారు. రిహన్నా పాకిస్తానీనా? ముస్లిమా కాదా అన్న విషయాన్ని ఎక్కువగా సెర్చ్ చేశారు. రిహన్నాతో పాటు, రైతుల నిరసనల గురించి ట్వీట్ చేసిన అనేక ఇతర అంతర్జాతీయ వ్యక్తులు గ్రేటా థన్‌బెర్గ్, హసన్ మిన్హాజ్, లిల్లీ సింగ్, జాన్ కుసాక్, అమండా సెర్నీ, మియా ఖలీఫా గురించి సెర్చ్ చేశారు. చదవండి: సెలబ్రిటీలపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా, ప్రముఖ పాప్ సింగర్ రిహానా, యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు, లాయర్ మీనా హారిస్ సహా పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే భారత్‌లో విభజన సృష్టించేందుకు కొందరు బయటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, కరణ్ జోహార్, కంగనా రనౌత్, దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, విరాట్, అనిల్ కుంబ్లే తదితరులు పిలుపునిచ్చారు. అంతేగాక రిహానా చేసిన ట్వీట్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటుగా కౌంటరిచ్చారు. భారతదేశ ఐకమత్యాన్ని ఇలాంటి ప్రచారాలు దెబ్బతీయలేవని..దేశ పురోగతిని అడ్డుకోలేవని అమిత్ షా స్పష్టం చేశారు. -
గూగుల్ సెర్చ్ లో అవే టాప్..!
ఏదైనా వెతకాలంటే అందరూ మొదటగా తెరిచేది గూగుల్. అదే గూగుల్ ఈ సంవత్సరం ఏది ఎక్కువ వెతికారో ఆ సంస్థ బయట పెట్టింది. గూగుల్ సెర్చ్ టాప్ 10 లో నాలుగు అహార పదార్ధాలకు సంబంధించినవే ఉన్నాయి. ఇందులో ఎలా చేయాలి అనే వెతికినవాటిని చూస్తుంటే ప్రజలందరూ లాక్డౌన్లో ఎలా గడిపారో అర్థమవుతుంది. అయితే సెర్చ్ చేసిన వాటిలో పన్నీర్ ఎలా చేయాలి అనేది టాప్‌లో ఉంది. తరువాత రోగ నిరోధక శక్తి ఎలా పెంచకోవాలి అని రెండవ స్ధానంలో ఉండగా డల్గోనా కాఫీ ఎలా తయారు చేయాలని మూడవ స్థానంలో ఉంది. ఇక ఆహార ప్రియులు డెజర్ట్ట్స్ ని , స్వీట్స్ ని ఇష్టపడని వారు ఉండరు. అయితే ఇందులో వెతికిన వాటిల్లో కేకు తయారీ ఎలా? జిలేబి ఎలా తయారు చేయాలి? అని లాక్డౌన్ సమయంలో బయటికి వెళ్లలేక ఇలా వెతికారు. ఇవే కాకుండా పాన్ కార్డుకి ఆధార్ ఎలా లింక్ చేయాలి? ఫాస్టాగ్‌కి ఎలా రీఛార్జ్ చేయాలి? కరోనా వైరస్‌ని ఎలా నిరోధించాలి? అంతేకాకుండా ఈ-పాస్‌కి ఎలా అప్లై చేయాలి? అనేవి కూడా లిస్ట్ లో ఉన్నాయి. ఎలా అనేవి అలా ఉండగా ఇంక అసలు అది ఏమిటి? అనేవి కూడా సెర్చ్ లిస్ట్‌లో ఉన్నాయి. ఇందులో కరోనా వైరస్ గురించి, నెపోటిజమ్, ప్లాస్మా థెరపీ, కోవిడ్-19,సిఏఏ,సూర్య గ్రహణం, హంటా వైరస్ వీటన్నింటిని గురించి ప్రశ్నలో జాబితాలో ఉన్నాయి. 2020లో కరోనా వైరస్ సెర్చ్‌లో ఆధిపత్యం కనబరిచినప్పటికి ఐపీఎల్ టాప్ స్థానంలో నిలించింది. దీని తరువాత కరోనా వైరస్, అమెరికా ఎన్నికలు, పీఎం కిసాన్ యోజన,బీహార్ ఎన్నికలు, డిల్లీ ఎన్నికలు జాబితాలో ఉన్నాయి. ఇంక 2020లో ఎక్కువగా వ్యక్తులను వెతికి టాప్‌లో నిలిచిన వారిలో జో బిడెన్, అర్ణబ్ గోస్వామి, కనికా కపూర్, కిమ్ జాంగ్ యున్, అమితా బచ్చన్, రషీద్ ఖాన్, రియా చక్రవర్తి, కమలా హారిస్, అంకిత లోకండె, కంగనా రనౌత్ నిలిచారు. దిల్ బెచారా సినిమా ఇండియాలో ఎక్కువగా వెతికిన సినిమాలల్లో టాప్‌లో నిలిచింది. ఇంకా సూరారై పట్రు,తానాజీ,శకుంతలదేవి, గుంజన్ సక్సేనా సినిమాలు టాప్‌లో ఉన్నాయి. -
నెలలో 16.2 లక్షల సార్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత తరం క్రికెటర్లలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి హవా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ కోహ్లి అభిమాన గణం భారీగానే ఉంటుంది. తాజాగా సెమ్రష్ సంస్థ చేసిన అధ్యయనం ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తోంది. 31 ఏళ్ల ఈ భారత స్టార్ ప్రపంచంలోనే అత్యధిక ప్రాచుర్యం పొందిన క్రికెటర్ అని ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు నెలకు సగటున 16.2 లక్షల సార్లు అభిమానులు కోహ్లి పేరును ఇంటర్నెట్లో వెతికారంట! ఆ తర్వాతి స్థానాల్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (9.7 లక్షలు), భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (9.4 లక్షలు) గురించి ఆరా తీశారంట. ఈ జాబితాలోని తొలి పది స్థానాల్లో ఆరుగురు భారత క్రికెటర్లే ఉండటం గమనార్హం. వీరి తర్వాత జార్జి మకాయ్ (9.1 లక్షలు), జోష్ రిచర్డ్స్ (7.1 లక్షలు), హార్దిక్ పాండ్యా (6.7 లక్షలు), సచిన్ టెండూల్కర్ (5.4 లక్షలు), క్రిస్ మాథ్యూస్ (4.1 లక్షలు), శ్రేయస్ అయ్యర్ (3.4 లక్షలు) ఉన్నారు. భారత పురుషుల క్రికెట్లో గొప్పగా రాణిస్తోన్న ఎందరో క్రికెటర్లను వెనక్కి నెట్టి మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (12వ స్థానం), ఆసీస్ ప్లేయర్ ఎలీస్ పెర్రీ (20వ స్థానం) టాప్–20లో నిలవడం గమనార్హం. ఈ అధ్యయనం మహిళా క్రికెట్ పట్ల ప్రేక్షకుల్లో ఉన్న ఉత్సుకతను తెలుపుతోందని సెమ్రష్ కమ్యూనికేషన్స్ హెడ్ ఫెర్నాండో ఆంగ్యులో అన్నారు. ఆటగాళ్ల కేటగిరీలోనే కాకుండా జట్ల విభాగంలోనూ టీమిండియా టాప్ లేపింది. టీమిండియా గురించి నెలకు సగటున 2.4 లక్షల సార్లు ఆన్లైన్లో మారుమోగిందంట! ఆ తర్వాత వరుసగా ఇంగ్లండ్ (66 వేలు), ఆస్ట్రేలియా (33 వేలు), వెస్టిండీస్ (29 వేలు), పాకిస్తాన్ (23 వేలు), దక్షిణాఫ్రికా (16 వేలు), బంగ్లాదేశ్ (12 వేలు), న్యూజిలాండ్ (12 వేలు), శ్రీలంక (9 వేలు), ఐర్లాండ్ (5 వేలు), ఆఫ్గానిస్తాన్ (4 వేలు), జింబాబ్వే (3 వేలు) జట్ల గురించి అభిమానులు ఆరా తీసినట్లు అధ్యయనంలో తెలిసింది. -
నొప్పిలేని మరణం ఎలా?
ముంబై/పట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణించే సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడినట్లు ముంబై పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు. ఆత్మహత్యకు ముందు ‘నొప్పి లేకుండా ఎలా చనిపోవాలి? మెంటల్ డిజార్డర్ అంటే ఏమిటి?’ అనే అంశాలపై గూగుల్‌లో పదే పదే సెర్చ్ చేశాడని చెప్పారు. మాజీ మేనేజర్ దిశా షాలియన్ మరణంతో తనకు సంబంధం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలతో సుశాంత్ కలత చెందాడని వివరించారు. అతడు మరణించిన వెంటనే కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 56 మంది సాక్షుల స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు వెల్లడించారు. విచారణలో భాగంగా ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడి ప్రస్తావన రాలేదన్నారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తి ఖాతాలోకి నేరుగా నగదు బదిలీ అయినట్లు ఇంకా తేలలేదన్నారు. సుశాంత్ ఆత్మహత్యపై విచారణ నిమిత్తం బిహార్ ఐపీఎస్ అధికారి ఆదివారం ముంబై చేరుకున్నారు. అయితే ముంబై పోలీసులు ఆయనను బలవంతంగా క్వారంటైన్‌కు పంపించారు. ఈ ఘటనను బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖండించారు. -
సెర్చ్‌లో ‘కరోనా’యే టాప్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బలహీనపడుతోందా? భారతదేశంలో కరోనా వాక్సిన్ ఎప్పుడు వస్తుంది? అసలు ఈ మహమ్మారికి ముగింపు ఉందా? ఇలాంటి ప్రశ్నలను జూన్ నెలలో భారతీయ నెటిజన్లు సెర్చ్ చేసినట్టు గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ వెల్లడించింది. కరోనా వైరస్‌కి ఏ మాస్క్ మంచిది, కరోనా వైరస్‌ని న్యూజిలాండ్ ఎలా అణచివేసింది, కరోనా వైరస్ లక్షణాలు ఎన్ని రోజులు ఉంటాయి, ప్రపంచంలో కరోనా వైరస్ వల్ల ఎంతమంది మరణించారు లాంటి ప్రశ్నలను నెటిజన్లు అడిగినట్లు గూగుల్ డేటా ద్వారా తెలిసింది. మేతో పోలిస్తే జూన్‌లో కరోనా వైరస్ గురించి నెటిజన్లు సెర్చ్ చేయడం 66 శాతం తగ్గింది, ఫిబ్రవరిలో కంటే జూన్‌లో కరోనాపై గూగుల్ సెర్చ్ రెట్టింపు కంటే ఎక్కువైందని తేలింది. -
గూగుల్ @కరోనా సెంటర్
న్యూఢిల్లీ: కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాల గురించి సమాచారాన్ని ఇకపై గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ మ్యాప్స్‌లో కూడా తెలుసుకోవచ్చు. తాము కొత్తగా ప్రవేశపెట్టిన ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు దగ్గరగా ఉన్న కోవిడ్ పరీక్షా కేంద్రాల గురించి తెలుసుకోవచ్చని గూగుల్ ప్రకటించింది. దీనికోసం గూగుల్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), మై గవర్నమెంట్ నుంచి అధికారిక సమాచారాన్ని పొందనుంది. ఈ సమాచారం ఇంగ్లిష్తో పాటు హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ భాషల్లోనూ లభించనుంది. ఈ సమాచారాన్ని పొందడం చాలా సులభం. గూగుల్‌లో నెటిజన్లు కరోనా గురించిన సమాచారాన్ని వెతికేటపుడు సెర్చ్ రిజల్ట్స్‌లో టెస్టింగ్ అనే బటన్ కూడా కనిపించనుంది. కరోనా వైరస్ నిర్ధారణ జరిపే ల్యాబ్ వివరాలు ఆ బటన్ నొక్కడం ద్వారా పొందవచ్చని గూగుల్ తెలిపింది. ఇదే సదుపాయం గూగుల్ మ్యాప్స్‌లో కరోనా నిర్ధారణ ల్యాబ్‌ల గురించి వెతికే వారికి కనిపించనుంది. ప్రస్తుతానికి 300 నగరాల్లోని 700 పరీక్షా కేంద్రాలను గూగుల్ సెర్చ్, అసిస్టెంట్, మ్యాప్స్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న మరిన్ని కేంద్రాల సమాచారాన్ని పొందుపరచేందుకు అధికారులతో కలసి పని చేస్తున్నట్లు పేర్కొంది. -
గూగుల్ సెర్చ్ హెడ్‌గా ప్రభాకర్ రాఘవన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టెక్నాలజీ దిగ్గజమైన గూగుల్ సంస్థలో మరో భారతీయుడు కీలక పదవిని అలంకరించారు. భారతీయ అమెరికన్ అయిన ప్రభాకర్ రాఘవన్ గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్ ప్రాజెక్టుల హెడ్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న బెన్‌గోమ్ నూతన బాధ్యతల్లోకి వెళ్లనున్నారు. ప్రభాకర్ ఐఐటీ మద్రాస్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని పూర్తి చేయగా, యూసీ బెర్క్లే నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ అందుకున్నారు. ప్రభాకర్ రాఘవన్ గూగుల్‌లో 2012లో చేరగా, 2018లో గూగుల్ అడ్వర్టయిజింగ్ అండ్ కామర్స్ విభాగ హెడ్‌గా ఎంపికయ్యారు. అంతకుముందు గూగుల్ యాప్స్, గూగుల్ క్లౌడ్ సర్వీసెస్‌కు వైస్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు. జీమెయిల్, గూగుల్ డ్రైవ్ వృద్ధిలో ప్రభాకర్ పాత్ర కూడా ఉంది. ‘మన ఉత్పత్తుల విభాగాల్లో చాలా వాటిల్లో ఆయన పనిచేయడం వల్ల వాటి మధ్య అంతరాలను కచ్చితంగా గుర్తించగలరు. గూగుల్‌తో ఆయన అనుబంధం గూగుల్‌ను ముందుంచుతుంది’ అంటూ ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో గూగుల్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. -
గూగుల్ కీలక పదవిలో మరో భారత సంతతి వ్యక్తి
న్యూయార్క్ : సెర్చి ఇంజన్ దిగ్గజం గూగుల్‌లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి కీలక పదవిలో నియమితులయ్యారు. గూగుల్ సెర్చ్ హెడ్‌గా భారత సంతతికి చెందిన ప్రభాకర్ రాఘవన్ నియమితులయ్యారు. బెన్ గోమ్ స్ధానంలో ఈ పదవిని చేపట్టే రాఘవన్ నూతన బాధ్యతల్లో నేరుగా సీఈఓ సుందర్ పిచాయ్‌కు రిపోర్ట్ చేస్తారు. ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తి చేసిన ప్రభాకర్ బెర్క్లీ యూనివర్సిటీ నుంచి ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్డీ పొందారు. 2012లో గూగుల్‌లో చేరిన రాఘవన్ 2018లో గూగుల్ అడ్వర్టైజింగ్, కామర్స్ బిజినెస్ హెడ్‌గా ఎదిగారు. సెర్చి డిస్ప్లే పర్యవేక్షణ, వీడియా అడ్వర్టైజింగ్ అనలిటిక్స్, షాపింగ్, పేమెంట్స్ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు. రాఘవన్ అంతకుముందు గూగుల్ క్లౌడ్ సేవలు, గూగుల్ యాప్స్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఇక ఐబీఎం, యాహూల్లోనూ ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. జీమెయిల్, గూగుల్ డ్రైవ్ నెలకు 100 కోట్ల యాక్టివ్ యూజర్ల మైలురాయిని అధిగమించడంలో రాఘవన్ పాత్ర కీలకం. జీ సూట్లో స్మార్ట్ రిప్లై, స్మార్ట్ కంపోజ్, డ్రైవ్ క్విక్ యాక్సెస్ వంటి ఫీచర్లను ఆయన ప్రవేశపెట్టారు. కొత్త బాధ్యతల్లో రాఘవన్ ప్రభాకర్ అనుభవం ఎంతో ఉపకరిస్తుందని.. అలాఘరిథంలు, ర్యాంకింగ్‌ల విషయంలో రెండు దశాబ్ధాలకు పైగా అనుభవం ఆయన సొంతమని, గూగుల్ కంటే ముందే గూగుల్ సెర్చ్‌తో రాఘవన్‌కు అనుబంధం ఉందని గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సభ్యుడిగా ఈ రంగంలో గొప్ప ఇంజనీరింగ్ మేథస్సుల్లో ఆయన ఒకరని ప్రస్తుతించారు. చదవండి : ‘నాన్న ఏడాది జీతం అందుకే ఖర్చయింది’ -
గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చ్ ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కలకలంతో మే నెలలో లాక్డౌన్ 4.0 గూగుల్ టాప్ ట్రెండింగ్ సెర్చ్‌గా నిలిచింది. దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెర్చ్ ట్రెండ్స్‌ను గూగుల్ వెల్లడించింది. ‘కరోనావైరస్ లాక్డౌన్ జోన్స్ ఢిల్లీ’ అంటూ గూగుల్ సెర్చ్‌లో వెతికిన వారి సంఖ్య మే నెలలో 1800 శాతం ఎగబాకిందని పేర్కొంది. కరోనా కట్టడికి మార్చి 24న విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ మే 17 నాటికి మూడు దశలు పూర్తయి మే 18న నాలుగో దశలోకి అడుగుపెట్టే క్రమంలో పెద్దసంఖ్యలో ప్రజలు ప్రభుత్వం వెల్లడించే తాజా మార్గదర్శకాలను తెలుసుకునేందుకు గూగుల్‌ను ఆశ్రయించారు. ఇక మేలో ‘లాక్డౌన్ 4.0’ పదం సెర్చ్ 3150 శాతం పెరగ్గా, తర్వాత స్ధానంలో ‘ఈద్ ముబారక్’ నిలిచింది. ఏప్రిల్‌లో మూడో టాప్ సెర్చింగ్ పదంగా నిలిచిన కరోనావైరస్ ఆ తర్వాత 12వ స్ధానానికి పడిపోయింది. అయితే దేశంలో విశేష ఆదరణ కలిగిన క్రికెట్‌తో పోలిస్తే కరోనావైరస్ గురించి సెర్చ్ ఇప్పటికీ అయిదు రెట్లు అధికంగా ఉందని గూగుల్ పేర్కొంది. గూగుల్‌లో కరోనా వైరస్ సంబంధిత టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా వ్యాక్సిన్‌కు చోటు దక్కింది. మేలో వ్యాక్సిన్ పదం సెర్చి 190 శాతం పెరిగిందని తెలిపింది. ‘ఇటలీ కరోనావైరస్ వ్యాక్సిన్’ కోసం సెర్చి సైతం 750 శాతం పెరిగిందని వెల్లడించింది. కరోనా వైరస్ సంబంధిత వ్యాధి ఏంటి..? చైనాలో తొలి వైరస్ కేసును ఎక్కడ గుర్తించారు..? లక్షణాలు లేనివారు కరోనాను వ్యాప్తిచేయగలరా..? వంటి ప్రశ్నలు టాప్ ట్రెండింగ్ ప్రశ్నలుగా నిలిచాయని గూగుల్ తెలిపింది. ఇక ఫిల్మ్, న్యూస్, వెదర్ వంటి టాపిక్స్ సెర్చిలో కరోనావైరస్ను అధిగమించాయని, క్రైమ్ థ్రిల్లర్ పాతాళ్ లోక్ మూవీ గూగుల్‌లో అత్యధికులు అన్వేషించిన ఫిల్మ్‌గా నిలిచింది. చదవండి : తెరుచుకున్న మాల్స్, రెస్టారెంట్లు.. -
ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించిన తర్వాత ఒక పదానికి అర్థం తెలుసుకోవడానికి గూగుల్‌లో మనోళ్లు తెగ వెతికారు. 'ఆత్మనిర్భర్' అంటే ఏమిటి? అంటూ గూగుల్‌లో శోధించారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’ పేరిట రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఆత్మబలం, ఆత్మ విశ్వాసం నిండుగా ఉన్న ‘ఆత్మ నిర్భర్ భారత్’ దేశ ప్రజల నినాదం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. (రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీ) ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ‘ఆత్మ నిర్భర్’కు అర్థం కోసం గూగుల్‌లో చాలా మంది వెతికారు. కర్ణాటక, తెలంగాణ వాసులు ఎక్కువగా శోధించినట్టు గూగుల్ ట్రెండ్స్ బట్టి వెల్లడైంది. మహారాష్ట్ర, గుజరాతీయులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. గూగుల్ మాత్రమే కాదు, చాలా మంది తక్షణ సమాధానాల కోసం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను కూడా ఆశ్రయించారు. ‘ఆత్మ నిర్భర్ అంటే ఏమిటి? సమాధానం చెప్పండి ప్లీజ్’ అంటూ అడిగారు. ఆత్మ నిర్భర్ అంటే స్వావలంభన అని అర్థం. స్వావలంబన దిశగా దేశం అడుగులు వేయడానికి ఆర్థిక ప్యాకేజీ ఊతమిస్తుందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. మన దేశంలో తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా స్వావలంబన సాధించాలని ఆయన కోరారు. (ఆ రైళ్లను ఎక్కువ చోట్ల ఆపండి.. ) -
మందెక్కడ.. గూగుల్ తల్లీ!
సాక్షి, అమరావతి: కరోనా దెబ్బకు మద్యం షాపులు, బార్లు మూతపడ్డాయి. మద్యం ప్రియులకు మందు చుక్క నోట్లో పడి నెల రోజులు దాటిపోయింది. ఈ పరిస్థితుల్లో అనేక మంది గూగుల్‌ను ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. గడచిన నెల రోజుల్లో దేశవ్యాప్తంగా గూగుల్‌లో సెర్చ్ చేసిన అంశాల్లో మద్యానికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. మార్చి 22 నుంచి 28వ తేదీ వరకు.. ఏప్రిల్ 12 నుంచి 18వ తేదీ వరకు మద్యం సంబంధిత అంశాలపై సెర్చింగ్ పీక్ లెవల్ (టాప్ ట్రెండింగ్)లో ఉన్నట్లు తేలింది. గూగుల్ ట్రెండ్స్ ఇండియా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెగ వెతికేస్తున్నారు ► మద్యం ఎక్కడ దొరుకుతుంది.. ఆన్లైన్ మార్కెట్లో మద్యం అమ్ముతున్నారా..? బ్లాక్‌లో ఎక్కడ విక్రయిస్తున్నారు..? విస్కీ తయారీ ఎలా..? తక్కువ ఆల్కాహాల్ శాతం ఉండే బీరును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు? అనే అంశాల్ని నెటిజన్లు వెతుకుతున్నారు. ► మద్యానికి సంబంధించిన అన్ని అంశాలనూ గూగుల్‌లో వెతకడంలో కేంద్రపాలిత ప్రాంతాలైన గోవా, పాండిచ్చేరి, డయ్యూ అండ్ డామన్, కర్ణాటక, ఢిల్లీ, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, సిక్కిం, చండీగఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరుస పది స్థానాల్లో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో నిలిచింది. ► మద్యం తయారీ ఎలా అనే అంశాన్ని సెర్చ్ చేసిన రాష్ట్రాల్లో మణిపూర్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, అసోం, ఆంధ్రప్రదేశ్ వరుస ఆరు స్థానాల్లో ఉండగా.. తెలంగాణ పదో స్థానంలో ఉంది. ► బీరు తయారీ ఎలా అనే విషయాన్ని తెలుసుకునేందుకు గూగుల్‌లో శోధించిన రాష్ట్రాల్లో ఢిల్లీ, కేరళ, హరియాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి. మందుబాబులు గత 30 రోజులుగా మద్యం కోసం గూగుల్ సెర్చ్‌లో వెతకడాన్ని తెలుపుతున్న గ్రాఫ్ వీటిపైనా ఆసక్తి అధికమే లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇంటర్నెట్లో అంశాలను శోధిస్తూ.. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మద్యంతోపాటు భారతీయులు అత్యధికంగా వెతికిన 30 అంశాలు ఇవీ.. ► కరోనా వైరస్ టిప్స్, కరోనా వైరస్, లాక్డౌన్ ఎక్స్టెన్షన్, కోవిడ్–19, హైడ్రాక్సీ క్లోరోక్విన్. ► కరోనా వైరస్ సింప్టమ్స్, ఆరోగ్యసేతు యాప్, లాక్డౌన్, ఆరోగ్య సేతు, కరోనా వైరస్ ప్రివెన్షన్. ► ఇండియా కోవిడ్–19 ట్రాకర్, ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్, లాక్డౌన్ ఇన్ ఇండియా, బీసీజీ వ్యాక్సిన్. ► ఎంహెచ్ఏ గైడ్‌లైన్స్, కరోనా అప్ డేట్ ఇన్ ఇండియా, కోవిడ్–19 ట్రాకర్, లేటెస్ట్ కరోనా వైరస్ న్యూస్, కరోనా వైరస్ ట్రీట్మెంట్. ► లాక్డౌన్ న్యూస్, కోవిడ్–19 ఇండియా, పీపీఈ కిట్, హెచ్‌సీక్యూ (హైడ్రాక్సీ క్లోరోక్విన్), ఇవర్ మెక్టిన్ (మెడిసిన్). ► లాక్డౌన్ ఎక్స్టెండెడ్, హాట్‌స్పాట్, లాక్డౌన్ ఇన్ ఢిల్లీ, లాక్డౌన్ లేటెస్ట్ న్యూస్, ఇండియా లాక్డౌన్ ఎక్స్టెన్షన్. -
ఇంట్లో మద్యం తయారు చేసుకోవచ్చా?
-
గూగుల్ టాప్ సెర్చ్‌లో మద్యం గురించే
-
ఇంట్లోనే మద్యం తయారు చేసుకోవడం ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో మద్యం ప్రియులు అల్లాడుతున్నారు. ఆల్కహాల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం మద్యం సేవించేవారు లాక్డౌన్ కాలంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఆత్మహత్యకు సైతం పాల్పడుతుండగా.. మరికొందరు మానసికంగా కుంగుబాటుకు గురవ్వుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో అధికారుల కళ్లు కప్పి.. అధిక ధరలకు మద్యంను విక్రయిస్తున్నారు. దీంతో రూ. 700 విలువ చేసే మద్యం బాటిల్స్‌ను ఏకంగా రూ.3వేలు పెట్టిమరీ కొనుగోలు చేస్తున్నారు. అంతగా ఆర్థిక స్తోమత లేనికొందరు ఏకంగా వైన్‌షాపులకే కన్నాలు వేస్తున్నారు. (ఇలా కూడా మద్యం తాగొచ్చు) ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కొంతమంది మందుబాబులకు మాత్రం ఆల్కహాల్ దొరకడం లేదు. అయితే లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో ఇంట్లోనే స్వయంగా ఆల్కహాల్ తయారీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీని కోసం ఇంటర్నెట్కి పనిచెప్పారు. ‘ఇంట్లోనే స్వతహాగా ఆల్కహాల్ తయారు చేయడం ఎలా’ అని మద్యం ప్రియులు గూగుల్‌లో పెద్ద ఎత్తున సెర్చ్ చేశారు. దేశంలో లాక్డౌన్ విధించిప్పటి నుంచి గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన వాటిల్లో ఇది కూడా ట్రెండింగ్‌లో ఉండటం గమనార్హం. మార్చి 22-28 మధ్య ఈ టాపిక్ గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. -
కరోనా పుణ్యమా.. గూగుల్ వేటలో అదే టాప్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ (కోవిడ్-19) భయంతో జనాలు హడలిపోతున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అందరూ హ్యాండ్ శానిటైజర్లు, మాస్క్‌ల మీద పడ్డారు. దీంతో ఆ రెండింటి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కొక్కరూ అయిదారు శానిటైజర్లు కొనడంతో చాలా దుకాణాల్లో స్టాక్ అయిపోయిందని దుకాణదారులు చెబుతున్నారు. జనాలు విపరీతంగా శానిటైజర్లు, ఫేస్ మాస్క్‌లు కొంటున్నారని, దీంతో తాము భారీ ఎత్తున వాటి కోసం కంపెనీలకు ఆర్డర్లు పెడుతున్నామని దుకాణదారులు చెబుతున్నారు. (చదవండి : కరోనా ఎఫెక్ట్ : మార్చి 30 వరకు సెలవులు) హ్యాండ్ శానిటైజర్లు,ఫేస్ మాస్క్ అందుబాటులో లేకపోవడం.. ఉన్నా ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు. కొంతమంది అయితే ఇంట్లోనే హ్యాండ్ శానిటైజర్ల తయారు చేసుకుంటున్నారు. ఇక దీని కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ‘హ్యాండ్ శానిటైజర్లు తయారు చేసుకోవడం ఎలా’ అనేది గూగుల్‌లో సెర్చ్‌చేసి తెలుసుకుంటున్నారు. గూగుల్ ట్రెండ్స్, అలస్కా ప్రకారం.. ఇంట్లోనే శానిటైజర్ల తయారి కోసం గూగుల్‌లో సెర్చ్ తెలుసుకున్న వారిలో అమెరికా వాసులు అత్యధికంగా ఉన్నారు. అమెరికాలోని వెర్మోంట్, రోడ్ ఐలాండ్ ప్రాంతాలలో దీని గురించి ఎక్కువగా శోధించారు. ఆ తర్వాత యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని వేల్స్లో అత్యధిక మంది ‘ ఇంట్లో హ్యాండ్ శానిటైజర్లు తయారు చేసుకోవడం ఎలా’ అనేదానిని సెర్చ్ చేసి తెలుసుకున్నారు. మరోవైపు.. చైనాలో కోవిడ్ వైరస్ వ్యాపించినప్పటి నుంచి మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజర్లు సరఫరా తగ్గిపోయింది. సాధారణ రోజుల్లో గుడ్డ మాస్క్‌లు చౌకగా దొరికేవి. అయితే ఇప్పుడు వాటి ధర కూడా అమాంతం పెరిగిపోయాయి. రూ.20, రూ.30 ఇచ్చి మరి కొనాల్సి వస్తుందని జనాలు వాపోతున్నారు. హ్యాండ్ శానిటైజర్లు రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. ఇక యూకేలో అయితే హ్యాండ్ శానిటైజర్లు రేట్లు 255శాతం పెరిగిపోయాయి. దీంతో ప్రజలు ఇంట్లోనే హ్యాండ్ శానిటైజర్లు తయారుచేసుకునే పనిలో పడ్డారు. కానీ ఇంట్లో తయారు చేసుకునే హ్యాండ్ శానిటైజర్లతో కరోనాను దూరం పెట్టడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. అవి పనిచేయకపోవడమే కాకుండా.. చర్మాన్ని కూడా దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు. హ్యాండ్ శానిటైజర్ల కంటే సబ్బుతో చేతులను కడుక్కోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. -
మన బిర్యానీకి ప్రపంచమే ఫిదా
న్యూఢిల్లీ : భోజన ప్రియులు అత్యధికంగా తినే ఆహార పదార్ధాల్లో బిర్యానీ ముందు వరసలో ఉంటుంది. ఇందులో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తీసుకునే ఆహరం చికెన్ బిర్యానీ. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంట్లో తయారు చేసుకోనో లేదా ఫుడ్ యాప్స్‌లో ఆర్డర్ చేసుకొనో లొట్టలేసుకుంటూ తింటారు. ఇక ఆన్లైన్ బుకింగ్‌లో చికెన్ బిర్యానీది ఎప్పుడూ నెంబర్ వన్ ప్లేసే.ఇది ఒక్క హైదరాబాద్ లేదా ఇండియాకే పరిమితం కాదు.. ప్రపంచమంతా మన బిర్యానీకి ఫిదా అయిపోయింది. 2019 సంవత్సరానికి గానూ ఆన్ లైన్ ఫుడ్ యాప్ సెర్చ్ లో టాప్ 10 ఐటమ్స్ లో దీనికే తొలిస్థానం దక్కింది. ఆ తర్వాతి స్థానంలో బటర్ చికెన్, సమోసా, చికెన్ టిక్కా మసాలా, దోశ, తందూరి చికెన్, పాలక్ పనీర్, నాన్, దాల్‌మఖని, చాట్ వంటి భారత వంటకాలు నిలిచాయి. వీటి గురించి కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో వెతుకుతున్నట్టు అధ్యయనంలో తేలింది. పంజాబీ ప్రత్యేక వంటకమైన బటర్ చికెన్ కోసం 4 లక్షలసార్లు వెతికారట. సమోసా కోసం 3.9 లక్షల సెర్చ్‌లు రాగా, చికెన్ టిక్కా మసాలా కోసం నెలకు సగటున 2.5 లక్షల సెర్చ్‌లు వస్తున్నట్లు సర్వే తెలిపింది.ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో భారతీయులు ఉండడం వల్లే ఇండియన్ ఫుడ్స్ టాప్ లో ఉన్నాయని సర్వే పేర్కొంది. -
మనోళ్లు గూగుల్‌ను ఏమడిగారో తెలుసా?
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 అంటే ఏమిటి ?, అయోధ్య కేసు ఏమిటి ?, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అంటే ఏమిటి ? ఇవీ గూగుల్‌ను భారతీయులు ఎక్కువగా అడిగిన ప్రశ్నలు. 2019ఏడాదికిగాను వీటి గురించే అత్యధికంగా వెదికారని గూగుల్ 2019 నివేదిక తెలిపింది. ఎగ్జిట్ పోల్స్, బ్లాక్‌హోల్, హౌడీ–మోడీలను శోధించారు. క్రికెట్ వరల్డ్ కప్‌తోపాటు లోక్‌సభ ఎన్నికల గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారు. ఓటేయడం ఎలా ? ఓటరు లిస్టులో పేరును ఎలా చూసుకోవాలి వంటి ప్రశ్నలను గూగుల్‌ను అడిగారు. చంద్రయాన్–2, నీట్ ఫలితాలు, పీఎం కిసాన్ యోజన, కబీర్ సింగ్, అవెంజర్స్ ఎండ్ గేమ్, కెప్టెన్ మార్వెల్ గురించీ వెదికారు. వ్యక్తుల గురించి చేసిన శోధనలో.. ‘ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్’ తొలిర్యాంక్ సాధించారు. తర్వాత లతా మంగేష్కర్, యువరాజ్ సింగ్, ‘సూపర్ 30’ ఆనంద్‡ వంటివారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగాచూస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీవీ షో గురించి వెదికారు. -
నేను చనిపోయానని చూసి షాకయ్యా : కేంద్రమంత్రి
ప్రస్తుతం కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్న బబుల్ సుప్రియో 2011లోనే మృతిచెందినట్టు ఆయన పేరును గూగుల్‌లో సెర్చ్ చేస్తే వచ్చింది. దీంతో ఈ విషయాన్ని నెటిజన్లు మంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన అవాక్కయ్యారు. గూగుల్ సెర్చ్‌లో వచ్చిన తప్పిదాన్ని గూగుల్ ఇండియా అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ని ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. 'డీయర్ గూగుల్ ఇండియా, వ్యక్తిగతంగా నా గురించి గూగుల్‌లో సెర్చ్ చేసి, 2011 డిసెంబర్ 30న నేను చనిపోయానని చూసి షాక్‌కు గురయ్యా. నేను బతికే ఉన్నానని మీకు లిఖితపూర్వకంగా ఇవ్వమంటారా. దేవుడి దయవల్ల నాకు తిరిగి ప్రాణం పోస్తారనుకుంటున్నా. జీవితం ఎంతో అందమైంది. పిక్చర్ అబీ బాకీ హై మేరే దోస్త్. నాకు ఇంకా బతకాలనుంది' అంటూ బబుల్ సుప్రియో ట్వీట్ చేశారు. అయితే మంత్రి ట్వీట్ చేసిన కొద్ది సమయానికే గూగుల్ సెర్చ్‌లో వచ్చిన తప్పిదాన్ని సరిచేశారు. -
నంబర్ 2
సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ అనే ట్యాగ్ ఇక ఆమెకు అవసరం లేదు. ఎందుకంటే ఆమె కథానాయికగా నటించిన ‘కేదార్నాథ్’ చిత్రం విడుదలైంది. సారా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు సారా నంబర్ 2. ఒక్క సినిమా రిలీజైతేనే నంబర్ 2 ఏంటి? అని ఆశ్చర్యపోకండి. ఆమె నంబర్ 2గా నిలిచింది గూగుల్ సెర్చ్‌లో అన్నమాట. ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బాలీవుడ్ కథానాయికల్లో సారా నంబర్ టూ. ఫస్ట్ ప్లేస్‌లో ప్రియాంకా చోప్రా నిలిచారు. ఇక రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సింబా’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. తెలుగు హిట్ ‘టెంపర్’కు ఇది హిందీ రీమేక్. -
ఎంత వెతికితే అంతే టాప్!
నేటి సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఒకే ఇంట్లో నాలుగైదు స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. రోజులో కొంత సయమాన్ని ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియాకి యువత టైమ్ కేటాయిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. మరి.. ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు వెతికిన సౌత్ ఇండియా టాప్ ట్రెండింగ్ స్టార్‌గా చిరంజీవి నిలిచారని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఇంకా ఈ ‘టాప్ ట్రెండింగ్ సౌత్ ఇండియన్ మూవీ స్టార్స్ 2018’ విభాగంలో నాని ద్వితీయ స్థానం సంపాదించారు. ఇంకా మూడు, నాలుగు, ఆరు, ఎనిమిది, తొమ్మిది, పది స్థానాల్లో వరుసగా బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మోహన్‌బాబు, జగపతిబాబు, నాగశౌర్య నిలిచారని సదరు పత్రిక పేర్కొంది. ఇక ఈ జాబితాలో కథానాయికల్లో ఐదో స్థానంలో రష్మికా మండన్నా, యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఆరో స్థానం కైవశం చేసుకోవడం విశేషం. ఈ సంగతి అలా ఉంచి... టాప్ ట్రెండింగ్ సౌత్ ఇండియన్ మూవీస్ విషయానికి వస్తే.. విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్ దర్శకత్వం వహించిన ‘గీత గోవిందం’ సినిమా టాప్‌లో నిలిచిందట. తమిళ హీరో విజయ్–దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన ‘సర్కార్’ చిత్రం సెకండ్ ప్లేస్‌ను దక్కించుకుంది. రామ్‌చరణ్ ‘రంగస్థలం’, మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’, రజనీకాంత్ చిత్రాలు ‘కాలా, 2.ఓ’, కీర్తీసురేశ్ నటించిన ‘మహానటి’, వరుసగా 3,4,5,6,7 స్థానాల్లో నిలిచిన చిత్రాలు. అలాగే టాప్ ట్రెండింగ్ సౌత్ ఇండియన్ సాంగ్స్ కేటగిరీని పరిశీలిస్తే... నాగార్జున, నాని మల్టీస్టారర్ మూవీ ‘దేవదాసు’ చిత్రంలోని ‘వారు వీరు..’ అనే సాంగ్ టాప్ ప్లేస్‌లో నిలవడం విశేషం. ‘టాక్సీవాలా’లోని ‘మాటే వినదుగా...’, హలో గురు ప్రేమకోసమే..’ సినిమాలో ‘మై వరల్డ్ ఈజ్ ఫ్లైయింగ్’, ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం ఇంకేం కావాలే..’ సాంగ్స్ వరసగా 2,3,4 స్థానాల్లో నిలిచాయట. అలాగే ఈ ఏడాది ఐఎమ్‌డిబి (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) విడుదల చేసిన టాప్ టెన్ బెస్ట్ ఇండియన్ మూవీస్ జాబితాలో ‘మహానటి’, ‘రంగస్థలం’ చిత్రాలు వరుసగా 4,7 స్థానాల్లో నిలిచాయి. ఇక బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. తమిళ హీరో విష్ణువిశాల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘రాక్షసన్’ రెండో స్థానంలో నిలవగా విజయ్ సేతుపతి, త్రిష నటించిన ‘96’ చిత్రం మూడో ప్లేస్‌లో నిలిచింది. ‘బధాయి హో (5), ప్యాడ్ మ్యాన్ (6), స్త్ర్రీ (8), రాజీ (9), సంజు (10) ఈ లిస్ట్‌లో చోటు సంపాదించిన మిగతా హిందీ చిత్రాలు. బాలీవుడ్లో అంతమంది స్టార్లు ఉన్నప్పటికీ యువనటుడు ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘అంధాధూన్, బధాయి హో’ చిత్రాలు టాప్ టెన్‌లో ఉండటం చెప్పుకోవాల్సిన విషయం. ప్రభాస్ 13 సెక్సీయస్ట్ ఆసియన్మెన్ 2018 జాబితా కూడా విడుదలైంది. సౌత్ కొరియాకు చెందిన బీటీఎస్ అనే మ్యూజిక్ బ్యాండ్ బృందం టాప్‌ప్లేస్‌ను దక్కించుకుంది. ఈ బృందంలో ఏడుగురు సభ్యులు ఉన్నారు. మూడో స్థానంలో ఉన్న షాహిద్ కపూర్ సెక్సీయస్ట్ బాలీవుడ్ యాక్టర్‌గా నిలిచారు. ఇక రణ్వీర్ సింగ్, ప్రభాస్, సల్మాన్‌ఖాన్, వరుణ్ ధావన్, షారుక్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ వరుసగా 11,13,14,18,25,29 స్థానాల్లో నిలిచారు. కన్నుకొట్టి అందరి కళ్లను తనవైపు తిప్పుకున్న మలయాళ హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్ ఇండియా గూగుల్ సెర్చ్‌లో మోస్ట్ సెర్డ్చ్ పర్సనాలిటీ–2018గా తొలి స్థానం సంపాదించుకున్నారు. డ్యాన్సింగ్ పర్సనాలిటీ స్పనా చౌదరి రెండో స్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్ నటి సోనమ్‌కపూర్ భర్త ఆనంద్ ఆహూజా ఈ జాబితాలో ఐదోస్థానంలో నిలిచారు. -
‘సింగపూర్ ఎక్కడుంది...?’
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ట్రంప్ - కిమ్‌ల భేటీ మంగళవారం, సింగపూర్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు అధ్యక్షుల భేటీ నేపధ్యంలో అమెరికా ప్రజలు గూగుల్‌లో ఎక్కువగా సర్చ్ చేసింది దేని గురించో తెలుసా...‘వేర్ ఇజ్ సింగపూర్ ఇన్ ది వరల్డ్?’(ప్రపంచంలో సింగపూర్ ఎక్కడుంది?). వీరిద్దరి భేటీ గురించి ప్రకటించిన తర్వాత చాలా మంది అమెరికన్స్ సింగపూర్ గురించే ఎక్కువగా సర్చ్ చేశారంట. దాంతో పాటు ‘ఉత్తర కొరియా ఎక్కడుంది?’, ‘సింగపూర్ చైనా లేదా జపాన్‌లో భాగమా?’ లేదా ‘సింగపూర్ స్వయంగా ఒక దేశమా..?’ వంటి పలు ఆసక్తికర అంశాల గురించి సర్చ్ చేశారంట. కేవలం సింగపూర్ గురించే కాక మరికొందరు కిమ్ గురించి కూడా సర్చ్ చేసారంట. ‘కిమ్ ఎత్తు ఎంత..?’, ‘కిమ్ ఇంగ్లీష్ మాట్లడగలడా...?’ అంటూ సర్చ్ చేసారు. ట్రంప్ - కిమ్‌లు ఇద్దరు సింగపూర్‌లోని సెంటసోలోని కెపెల్లా ద్వీపంలో మంగళవారం ఉదయం భేటీ అయిన సంగతి తెలిసిందే. దాదాపు 48 నిమిషాల పాటు ట్రంప్ - కిమ్ మధ్య చర్చలు జరిగాయి. అణ్వాయుధాలను వీడాలని, అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా సహకరించాలని ట్రంప్ కిమ్‌కు సూచించారు. ఇందుకు అంగీకరిస్తే.. ఉత్తర కొరియా భద్రతకు హామీ ఇస్తామని, దీనితోపాటు ఆర్థిక సాయం అందిస్తానని ట్రంప్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కిమ్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదని ఆసక్తికరంగా మారింది. -
టాప్ ట్రెండింగ్‌లో ‘గన్ కంట్రోల్’!
వాషింగ్టన్: ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా నరమేధాలు జరుగుతున్నాయి. అయితే అమెరికాలో వీటి శాతం చాలా ఎక్కువ. అమెరికాలో ఏటేటా తుపాకీ కాల్పుల మోత పెరుగుతూ వస్తోంది. మన దేశంలో చాక్లెట్లు దొరికినంత ఈజీగా అమెరికాలో గన్స్ లభిస్తాయి. ఎంతలా అంటే అక్కడి పౌరుల చేతిలో గన్ ఉండటం ఓ అలవాటుగా మారుతోంది. అమెరికాలో స్వేచ్ఛగా బతకవచ్చని అందరూ భావిస్తుంటారు... కానీ, స్వేచ్ఛ హత్యలు జరుగుతున్నాయని గుర్తించడం లేదు. కోపం వచ్చినా, నచ్చని ఘటన జరిగినా... అక్కడి వారు చేసే పని తమ తుపాకీకి పని చెప్పడం. కాల్పులకు పాల్పడ్డ యువకుడిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు (ఫైల్) జాతి విధ్వేషమనీ కొందరు, డబ్బుల కోసమనీ మరికొందరు, సరదా కోసం ఇంకొందరు.. ఇలా ఏదో రకంగా ఇతరుల ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. అక్కడి వారి చేతుల్లో గన్ అత్యవసర సరుకుగా మారింది. గత కొంతకాలం నుంచి జాతి విధ్వేషదాడులు మరీ ఎక్కువ కాగా, ఆసియా వాసులు ముఖ్యంగా భారతీయులైతే మరీ బిక్కు బిక్కుమంటూ పరాయి దేశంలో గడపాల్సి వస్తోంది. ఈ మధ్య ఫ్లోరిడా హైస్కూల్లో జరిగిన నరమేధంలో దాదాపు 17మంది అమాయక విద్యార్థులు మృత్యుఒడికి చేరారు. ఈ విషాదంతో అమెరికా సహా ఇతర అగ్రదేశాలు మొత్తం విస్తుపోయాయి. ఫ్లోరిడా నరమేధం ముందువరకు అమెరికా పౌరులు గన్ షాప్‌లు ఎక్కడ? గన్స్ ఈజీగా ఎక్కడ దొరుకుతాయి? అని గూగుల్‌లో వీటి గురించే వెతికేవారు. అమెరికన్లు సెర్చ్ చేసే వాటిలో గన్స్, గన్ కల్చర్ టాప్ లిస్ట్‌లో ఉండేవి. కానీ ఆ ఉదంతం తర్వాత పరిస్థితిలో మార్పొచ్చింది. ఇప్పుడు అమెరికా పౌరులంతా.. గన్ కల్చర్‌ను ఎలా కంట్రోల్ చేయాలి? అందుకోసం ఏ చర్యలు తీసుకోవాలి? మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గన్ కల్చర్‌పై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.. లాంటి వాటికోసం గూగుల్‌లో వెతుకుతున్నారని ఓ తాజా సర్వేలో తేలింది. -
సన్నీని దాటేసిన ప్రియా ప్రకాష్
సాక్షి, న్యూఢిల్లీ : కంటిబాసలతో కుర్రకారును ఫిదా చేసిన మళయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ ఆన్లైన్ హల్చల్ కొనసాగుతోంది. గూగుల్ సెర్చ్‌లో ఇప్పటివరకూ అత్యధికంగా బాలీవుడ్ హాట్‌బ్యూటీ సన్నీలియోన్‌ను టాప్‌లో ఉండగా, తాజాగా సన్నీని ప్రియా ప్రకాష్ దాటేసింది. ఓ సాంగ్‌లో కన్నుమీటుతూ ప్రియా ప్రకాష్ చేసిన అభినయం సోషల్ మీడియాను ఊపేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సంచలనంగా మారింది. ప్రియా ధాటికి కత్రినా కైఫ్, అనుష్క శర్మ, దీపికా పదుకోన్‌లూ గూగుల్ సెర్చ్‌లో వెనుకపడ్డారు. కేరళలోని త్రిసూర్‌కు చెందిన 18 ఏళ్ల ప్రియా వైరల్ వీడియాలో కట్టిపడేసే ఎక్స్‌ప్రెషన్స్‌లో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది. త్వరలో విడుదల కానున్న మళయాళం మూవీ ఒరు ఆధార్ లవ్‌లోని క్లిప్ ప్రియా పలికించిన హావభావాలతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
అందరి కళ్లు బాహుబలి 2నే వెతికాయి
సాక్షి, హైదరాబాద్ : బాహుబలి -2 : ది కన్‌క్లూజన్ మరో రికార్డు సొంతం చేసుకుంది. 2017కు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో అత్యంత ఎక్కువసార్లు శోధించిన అంశంగా ముందు వరుసలో నిలిచింది. 2017 సంవత్సరంలో అత్యంత ఎక్కువగా నెటిజన్లు శోధించిన టాప్ ట్రెండింగ్ అంశాల జాబితాను గూగుల్ ప్రకటించింది. అందులో ఇప్పటికే పలు రికార్డులను బద్ధలు కొట్టి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బాహుబలి 2 తొలి స్ధానం దక్కించుకుంది. అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్), లైవ్ క్రికెట్ స్కోర్ అనేది మూడో సెర్చింగ్ వర్డ్‌గా నిలిచింది. మొత్తం మీద శోధించిన టాప్ అంశాలు, టాప్ ట్రెండింగ్ వార్తలు, టాప్ ట్రెండింగ్ ఎంటర్ ట్రైనర్స్, టాప్ ట్రెండింగ్ మూవీస్, టాప్ ట్రెండింగ్ సాంగ్స్, స్పోర్టింగ్ ఈవెంట్స్, టాప్ ట్రెండింగ్ నియర్ మి, టాప్ ట్రెండింగ్ హౌ టు, టాప్ ట్రెండింగ్ వాట్ ఈజ్ వంటి పేరిట మొత్తం తొమ్మిది అంశాలతో జాబితాను సిద్ధం చేసి గూగుల్ విడుదల చేసింది. మొత్తంగా చూసినప్పుడు బాలీవుడ్ అంశాలు, క్రీడలకు సంబంధించినవి ఉన్నట్లు కూడా వెల్లడించింది. -
అలా చేస్తే డిమెన్షియా ముప్పు
లండన్: ప్రతి చిన్నఅంశానికీ మెదడుకు పనిచెప్పకుండా గూగుల్‌లో వెతికితే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కోల్పోయి చిత్తవైకల్యం(డిమెన్షియా) బారిన పడే ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేపనిగా ఇంటర్నెట్పై ఆధారపడటంతో భవిష్యత్‌లో ఎదురయ్యే దీర్ఘకాల ప్రతికూలతలను విస్మరించడం తగదని ప్రముఖ డిమెన్షియా పరిశోధక ప్రొఫెసర్ ఫ్రాంక్ గన్ మూర్ పేర్కొన్నారు. మెరుగైన బ్రెయిన్ హెల్త్‌ను కాపాడుకోవడం కీలకమని, మెదడుకు పదునుపెట్టేలా వ్యవహరించాల్సిన మనం దీన్ని ఇప్పుడు ఇంటర్నెట్కు అవుట్సోర్స్ చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మనకు ఎలాంటి సమాచారం కావాల్సి ఉన్నా మన మెమరీకి పనిచెప్పడం మాని ఆన్లైన్లో ప్రయత్నించడం సరికాదని అన్నారు. జీవన ప్రయాణంలో మానవాళి పరుగెడుతూ మెదడుకు పనిచెప్పడమే మాని ఇంటర్నెట్కు అప్పగించడం దుష్పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు.డిమెన్షియా బారినపడితే అది పలు తీవ్ర అనారోగ్యాలకూ అనర్ధాలకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
కీబోర్డు డాక్టర్లు
లండన్: జలుబు, దగ్గు నుంచి ఛాతీ ఇన్ఫెక్షన్ల వరకూ వైద్య నిపుణుల సాయం లేకుండా బ్రిటన్ పౌరులు తామే నయం చేసుకుంటున్నారు.వ్యాధి లక్షణాలను గూగుల్‌లో శోధించి ఇంటర్నెట్లోనే నివారణకు మార్గాలు అన్వేషిస్తున్నారు.చిన్న,చిన్న అనారోగ్యాల నుంచి ఓ మాదిరి వ్యాధులకూ డాక్టర్ వద్దకు వెళ్లేందుకు పదిమందిలో ఏడుగురు నిరాకరిస్తున్నారని బ్రిటన్‌లో నిర్వహించిన ఓ అథ్యయనం తేల్చింది.మూడింట రెండు వంతుల మంది సొంత వైద్యానికే మొగ్గుచూపుతున్నారని ఈ అథ్యయనం నిగ్గుతేల్చింది. వైరస్లు, ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి వైద్య నిపుణుల చేయి పడకుండానే స్వస్ధత పొందగలమని భావించే వారి సంఖ్య పెరుగుతోంది.దీంతో ఏడాదికి ఒకటి రెండు సార్లు మించి ఎవరూ వైద్య నిపుణుడిని సందర్శించడం లేదని వెల్లడైంది.చిన్నపాటి అనారోగ్యాలకు ఇప్పుడు చాలావరకూ విశ్రాంతి తీసుకుని, ఆరోగ్యకర ఆహారంతో పాటు రాత్రివేళల్లో కంటి నిండా నిద్ర పోతే చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం బలపడిందని ఈ అథ్యయనం నిర్వహించిన ఫ్యూచర్యూ ప్రతినిధి చెప్పారు. ఇంటి చిట్కాతో గతంలో అనారోగ్యం దూరం చేసుకున్నామని 75 శాతం మంది చెప్పినట్టు అథ్యయనం పేర్కొంది. ఇక ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్న తర్వాత తమ ఆరోగ్యం బాగా కుదుటపడిందని 70 శాతం మంది వెల్లడించారు. మరికొందరు డాక్టర్ వద్దకు వెళ్లే లోగానే తమ వ్యాధి లక్షణాలను గూగుల్‌లో శోధిస్తున్నారని తేలింది. ఇక జలుబుకు సంబంధించి 78 శాతం మంది వైద్యుడు ఊసే ఎత్తడం లేదు. జలుబు, గొంతునొప్పి, తలనొప్పి, దగ్గు, డయేరియా, పంటినొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, ఇన్సోమ్నియా, హెమరాయిడ్స్, అలర్జిక్ రియాక్షన్, అర్ధరైటిస్, జాయింట్ పెయిన్, ఛాతీ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులకు నెట్టింట్లోనే పరిష్కారం వెదుక్కుంటున్నట్టు వెల్లడైంది. -
ఇక తెలుగులోనూ గూగుల్ సెర్చ్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘గూగుల్’ తాజాగా తన వాయిస్ సెర్చ్ ఫీచర్‌కు తెలుగు భాషను యాడ్ చేసింది. దీంతో ఇక తెలుగులో చెబుతూనే గూగుల్‌లో కంటెంట్‌ను సెర్చ్ చేయవచ్చు. తెలుగుతోపాటు ఇకనుంచి తమిళ్, మలయాళం, బెంగాలి, గుజరాతి, కన్నడ, మరాఠి, ఉర్దూ భాషల్లోనూ గూగుల్‌ను జల్లెడ పట్టొచ్చు. కాగా ఇదివరకు కేవలం ఆంగ్లం, హిందీలో మాత్రమే గూగుల్ వాయిస్ సెర్చ్ అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు తెలుగులో చెబుతూ గూగుల్ సెర్చ్ చేయాలనుకుంటే.. గూగుల్ యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌లో ఉన్న ‘సెర్చ్ లాంగ్వేజ్’ ఆప్షన్లో ఆంగ్లం బదులుగా తెలుగును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. -
గూగుల్ సెర్చిలో టాపర్ ఎవరో తెలుసా?
భారతదేశంలో ఎక్కువ మంది గూగుల్‌లో ఏ అంశం గురించి సెర్చ్ చేశారో తెలుసా.. పీవీ సింధు గురించి. ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో సింధు ఆడుతుండటంతో ఆమె గురించిన వివరాలు తెలుసుకోడానికి ఎక్కువగా ఆమె పేరు సెర్చ్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో ఇప్పటికే రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్‌ను వెతికారు. ప్రపంచ నెంబర్ 6 ర్యాంకర్ నొజొమి ఒకుహరాను ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్న పీవీ సింధు భారతదేశంలో అతి ఎక్కువగా సెర్చ్ అయిన అథ్లెట్ సింధుయేనని గూగుల్ సంస్థ తెలిపింది. ఆ తర్వాత వరుసగా సాక్షి మాలిక్, కిదాంబి శ్రీకాంత్, దీపా కర్మాకర్, సానియా మీర్జా, సైనా నెహ్వాల్, వినేష్ ఫోగట్, లలితా బాబర్, వికాస్ యాదవ్, నర్సింగ్ యాదవ్‌లు నిలిచారు. భారతీయులు ఎక్కువగా బ్యాడ్మింటన్ గురించి, ఆ తర్వాత రెజ్లింగ్ గురించి సెర్చ్ చేశారట. ఒలింపిక్స్‌లో మన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ అద్భుత ప్రదర్శన తర్వాత ఆ అంశం గురించి కూడా బాగానే వెతికారంటున్నారు. గత వారం రోజుల్లో ఒలింపిక్స్ గురించి ఎక్కువగా వెతుకుతున్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో ఉంది. కేవలం మనవాళ్ల గురించే కాదు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే ఉసేన్ బోల్ట్ గురించి కూడా వివరాలు తెలుసుకోడానికి భారతీయులు ప్రయత్నించారు. ఇక విదేశీ క్రీడాకారుల విషయానికొస్తే, బోల్ట్ తర్వాత శ్రీకాంత్‌ను ఓడించిన చైనా షట్లర్ లిన్ డాన్, సింధు చేతిలో ఓడిన ఒకుహరా, బంగారు చేప మైఖేల్ ఫెల్ప్స్, చైనా షట్లర్ వాంగ్ యిహాన్ తదితరుల గురించి భారతీయులు బాగానే గూగులమ్మను అడిగినట్లు తేలింది. దేశంలోని ఇతర ప్రాంతాల కంటే ఈశాన్య రాష్ట్రాల వారికి ఒలింపిక్స్ అంటే ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు ఈ సెర్చ్‌లో తేలింది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, మణిపూర్, సిక్కిం, నాగాలాండ్.. ఈ ఆరు రాష్ట్రాలలో నెటిజన్లు రియో గేమ్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు. టాప్ 10 రాష్ట్రాలలో ఇంకా గోవా, పుదుచ్చేరి, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలున్నట్లు గూగుల్ తెలిపింది. -
గూగుల్ సెర్చ్ టాప్‌లో సల్మాన్, సన్నిలియోన్లు
ముంబై : గత దశాబ్ద కాలంలో గూగుల్ ఎక్కువగా వెదికిన భారతీయ నటీ నటులుగా బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్, సన్నీలియోన్లు మొదటిస్థానం దక్కించుకున్నారు. సల్మాన్ తర్వాత షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్‌లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, రణ్‌బీర్ కపూర్, ఆమిర్ ఖాన్, ఇమ్రాన్ హష్మీలు టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్నారు. హీరోయిన్ల జాబితాలో సన్నీ తర్వాత కత్రినా కైఫ్, కరీనా కపూర్, కాజల్ అగర్వాల్, దీపికా పదుకునే, ఐశ్వర్య రాయ్, ప్రియాంకా చోప్రా, తమన్నా, అలియా భట్, సోనాక్షి సిన్హాలు గూగుల్ జాబితాలో నిలిచారు. క్లాసిక్ నటుల్లో అమితాబ్ బచ్చన్, రేఖలు మొదటి స్థానాల్లో నిలిచారు. అమితాబ్ తర్వాత కమల్ హాసన్, రాజేష్ ఖన్నా, మిథున్ చక్రవర్తి, రాజ్‌కుమార్, ధర్మేంద్ర తదితరులు ఉన్నారు. -
గూగులమ్మను తెగ వెతికేశారు
అసలు బ్రెగ్జిట్ అంటే ఏంటి, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే ఏం జరుగుతుంది, ఈయూ ఎప్పుడు రూపొందింది.. ఇలాంటి విషయాలేవీ రిఫరెండంలో ఓటు వేసే ముందు చాలామంది బ్రిటిషర్లకు తెలియదు. ఎందుకంటే, ఓటింగ్ పూర్తయ్యి.. ఫలితాలు కూడా వెలువడిన తర్వాత చాలామంది ఈ తరహా ప్రశ్నలతో గూగుల్ సెర్చిని మోతెక్కించారట. కేవలం రిఫరెండం ఫలితాల గురించే కాక.. బ్రెగ్జిట్ గురించిన ప్రాథమిక సమాచారం కోసం చాలామంది గాలించినట్లు గూగుల్ తెలిపింది. ‘‘మనం యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతే ఏమవుతుంది’’ అనే ప్రశ్న చాలా ఎక్కువగా వచ్చిందని ప్రకటించిది. ఇంకా చాలామందికి అసలు యూరోపియన్ యూనియన్ అంటే ఏంటి, అది ఎప్పుడు ప్రారంభమైంది, అందులో ఎన్ని దేశాలున్నాయి.. ఇలాంటి విషయాలు కూడా తెలియవని, ఇలాంటి అనేక ప్రశ్నలను గూగుల్ సెర్చ్‌లో ఎక్కువగా వేశారని తెలిపింది. డేవిడ్ కామెరాన్ వయసెంత, ఆయన రాజీనామా చేశారా, ఆ తర్వాత ప్రధాని ఎవరవుతారు.. ఇలాంటి ప్రశ్నలు సైతం వచ్చాయి. అలాగే అసలు మనం యూరోపియన్లమేనా అనే ప్రశ్నను కూడా చాలా ఎక్కువ మంది అడిగారంటూ గూగుల్ వివరించింది. వాళ్లు వేసిన మరికొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి... నేను ఈయూ రిఫరెండంలో ఎలా ఓటు వేయాలి బ్రెగ్జిట్ అంటే ఏంటి ఈయూ రిఫరెండంలో ఎవరెవరు ఓట్లు వేయచ్చు ఈయూ రిఫరెండం ఎప్పుడు నిర్వహిస్తారు నేను ఎక్కడ ఓటు వేయచ్చు మనం ఈయూలో ఎందుకు ఉండాలి మనం ఈయూను ఎందుకు వదిలేయాలి మనం వదిలేస్తే ఏం జరుగుతుంది ఈయూ డిబేట్లో ఎవరు నెగ్గారు ఈయూలో ఏవేం దేశాలు ఉన్నాయి డేవిడ్ కామెరాన్ తర్వాత ఎవరు వస్తారు డేవిడ్ కామెరాన్ రాజీనామా చేశారా అసలు కామెరాన్ ఎందుకు రిఫరెండం పిలిచారు డేవిడ్ కామెరాన్ వయసెంత -
బామ్మకు గూగుల్ సలాం
లండన్: ఓ లండన్ బామ్మ విషయం ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ గా మారింది. తరుచు టీవీలు చూసే అలవాటు ఉన్న ఆ బామ్మ తనకు కావాల్సిన ఒక పదానికి సంబంధించిన వివరాలు తెలియజేయాలంటూ గూగుల్ సెర్చ్ బాక్స్ చాలా గౌరవంగా అడిగింది. ఆమె అడిగిన విధానాన్ని చూసిన మనుమడు ఆన్ లైన్లో పోస్ట్ చేయగా విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా గూగుల్ యాజమాన్యం సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. తమ మొత్తాన్ని మనస్ఫూర్తిగా నవ్వుకునేలా చేసిన బామ్మగారు మీకు ధన్యవాదాలు అంటూ బదులు ఇచ్చింది. తనకు కావాల్సిన పదం కోసం అంతటి గౌరవపూర్వకంగా అడగడంపట్ల మరో థ్యాంక్స్ చెప్పింది. బ్రిటన్‌లోని అశ్వర్థ్ అనే 86 ఏళ్ల బామ్మకు బాగా టీవీ చూసే అలవాటు ఉంది. అయితే, టీవీ చానెల్స్ వాళ్లు తమ రేటింగ్స్ స్థాయిని రోమన్ అంకెలలో ఇస్తుంటారు. అసలు ఈ పదాలకు అర్థం ఏమై ఉంటుందా తెలుసుకోవాలనుకున్న ఆ బామ్మ తన కంప్యూటర్లో 'దయచేసి ఈ రోమన్ సంఖ్యలకు అర్థం అనువాదం చేసి చెప్పగలరు.. కృతజ్ఞతలు' అంటూ టైప్ చేసింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మనుమడు బెన్ ఎకర్ స్లీ తన బామ్మ చేసిన ప్రయోగానికి ముగ్దుడై బామ్మ ఫోటోను, ఆమె సెర్చ్ చేసిన కంప్యూటర్ కీ వర్డ్స్‌ను ఫొటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దాంతో ఆ ఫొటోకు, తక్కువ నిడివి ఉన్న వీడియోకు విపరీత స్పందన వచ్చి వైరల్ గా మారింది. గూగుల్ సంస్థ స్వయంగా బామ్మగారికి ధన్యవాదాలు అంటూ తెగ మెచ్చుకుంది. రోజుకు కొన్ని కోట్ల పదాలను వెతుకుతుంటారాని, ఆమె వెతికిన పదంమాత్రం తమకు నిజంగా నవ్వు తెప్పించిందని, అంతటి మర్యాదపూర్వకంగా అడిగిన ఆమెపై ఎంతో గౌరవం పెరిగిందటూ గూగుల్ పేర్కొంది. -
గూగుల్ క్వీన్ రాధికా ఆప్తే
-
గూగుల్ క్వీన్ రాధికా ఆప్తే
టెక్నాలజీ అభివృద్ధిలో భాగంగా ప్రాబల్యం పెంచుకున్న వాటిలో గూగుల్ ఒకటి. ఇవాళ ఏ కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న వాళైయినా గూగుల్‌ను టచ్ చెయ్యకుండా ఉండలేరు. అంతగా ప్రాముఖ్యతను గూగుల్ సంతరించుకుంది. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మధ్య గూగుల్ అన్వేషణలో రెండవ స్థానంలో నిలిచిన నటిగా నటి రాధికా ఆప్తే పేరు నమోదవ్వడం విశేషం. ఇంకా చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే ఇటీవల కన్ను మూసిన అబ్దుల్ కలామ్ ప్రథమ స్థానంలో నిలవగా ద్వితీయ స్థానాన్ని నటి రాధిక ఆప్తే పొందారు. ఇందుకు కారణాలేమిటన్న విషయం గురించి కొంచెం లోతుగా పరిశీలిస్తే ఇటీవల ఆమె సంచలన ప్రచారాలకు కేంద్ర బిందువు కావడమే నని భావించాల్సి ఉంటుంది. హిందీ, మరాఠి చిత్రాల్లో నటించిన రాధికా ఆప్తే మరాఠీలో నటించిన ధోని చిత్ర తమిళ రీమేక్ ద్వారా ఆమెను నటుడు ప్రకాష్‌రాజ్ కోలీవుడ్‌కు పరిచయం చేశారు. ఆ తరువాత తమిళ్ సెల్వన్ లాంటి రెండు మూడు చిత్రాల్లో నటించి మంచి ప్రచారమే పొందారు. తెలుగులో బాలక్రిష్ణ సరసన లెజెండ్, లయన్ చిత్రాల్లో కథానాయికగా నటించారు. ఇవన్నీ పక్కన పెడితే రాధికా ఆప్తే హిందీలో సుజాయ్ ఘోష్ దర్శకత్వంలో అహల్య అనే 13 నిమిషాల లఘు చిత్రంలో పిచ్చపిచ్చగా అందాలారబోశారు. ఆ చిత్రాన్ని సమీపకాలంలో యూట్యూబ్‌లలో పెట్టారు. రాధికా ఆప్తే శృంగారాన్ని ఒలకబోశారనగానే అవకాశం ఉన్న వారందరూ ఆ లఘు చిత్రాన్ని చూడడానికి గూగుల్‌ను టచ్ చేశారు.అంతకంటే ముందు మరో షార్టు ఫిలింలో రాధికాఆప్తే నగ్నంగా నటించారనే ప్రచారం జరగడంతో అది చూడడానికి గూగుల్ వీక్షకులు విరగపడ్డారు. ఇత్యాది సంఘటనలతో జూలై 22 వరకూ గణాంకాల ప్రకారం గూగుల్ అన్వేషణలో రాధికా ఆప్తే రెండవ స్థానంలో నిలిచారు. ఇప్పటికే ఈ స్థాయిలో ఉంటే త్వరలో సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన నటించబోతున్నారు. ఆ తరువాత రాధికా ఆప్తే హల్చల్ ఏ లెవల్ల్లో ఉంటుందో నంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
సామాజిక సైట్లతో కొలువు వేట ఫలించాలంటే!
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు... ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న మాట. ఇలాంటి సైట్లతో ఉపయోగం ఎంత ఉందో, అపాయం కూడా అంతే ఉంది. వీటిపై ప్రస్తుతం విసృ్తతమైన చర్చ జరుగుతోంది. అందుకే దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవడం నేటి ఉద్యోగార్థులకు తప్పనిసరిగా తెలిసి ఉండాలి. కొలువుల వేటలో సామాజిక అనుసంధాన సైట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉద్యోగ సమాచారం ఇవ్వడం దగ్గర నుంచి దరఖాస్తును తీసుకోవడం, ఇంటర్వ్యూను పూర్తిచేయడం వరకు ఈ సైట్ల ద్వారా జరుగుతున్నాయి. కంపెనీలు తమకు కావాల్సిన ఉద్యోగుల కోసం సామాజిక సైట్ల ద్వారానే గాలిస్తున్నాయి. అందుకే అభ్యర్థులు కొలువు కోసం సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏం చేయాలో, ఏం చేయకూడదో అభ్యర్థులు కచ్చితంగా తెలుసుకోవాలి. ఆన్లైన్లో క్రియాశీలకంగా: మీరు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఆన్లైన్లో క్రియాశీలకంగా వ్యవహరించాలి. మీ అర్హతలు, నైపుణ్యాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. కంపెనీలకు మీ గురించి తెలియడానికి ఆన్లైన్ ప్రొఫెల్ ఎంతగానో ఉపయోగపడుతుం ది. ఒకవేళ ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ ప్రొఫైల్ కెరీర్లో మీ ఎదుగుదలకు సాయపడుతుంది. పోస్టుల్లో నిర్లక్ష్యం వద్దు : ఆన్లైన్లో మీరు ఏదైనా అంశాన్ని పోస్టు చేస్తే దాన్ని చాలా మంది చదువుతారు. మీపై ఒక అంచనాకు వస్తారు. కాబట్టి మీరు పోస్టు చేసే ప్రతిదీ తప్పుల్లేకుండా ఉండేలా జాగ్రత్తపడండి. పోస్టు చేసేముందు క్షుణ్నంగా చదువుకోండి. అక్షర, అన్వయ, వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోండి. పోస్టుల్లో తప్పులుంటే.. మీరు నిర్లక్ష్యమైన మనిషి అని ఇతరులు తుది నిర్ణయానికొచ్చే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల మీకు అవకాశాలు సన్నగిల్లుతాయి. గూగుల్‌లో పేరు: అంతర్జాలంలో ఏదైనా సమాచారం కావాలంటే అందరూ వెంటనే చేసే పని.. గూగుల్ సెర్చ్‌లో వెతకడం. కంపెనీకి రెజ్యూమెను పంపడానికి ముందు గూగుల్‌లో మీ సమాచారాన్ని పొందుపర్చండి. మీ పేరు టైప్ చేయగానే మీకు సంబంధించిన వివరాలు ప్రత్యక్షం కావాలి. రిక్రూటర్లు కూడా గూగుల్‌లో మీ వివరాలను, ఫోటోలను పరిశీలిస్తారు. అభ్యంతరకరమైన సమాచారం, ఫోటోలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించండి. కనెక్ట్.. అందరితో వద్దు: ఇతరులతో సంబంధాలను నెలకొల్పుకోవడానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్లను ఉపయోగిస్తుంటాం. ఎక్కువ మందితో కనెక్ట్ అయితే నష్టమే తప్ప ఆశించిన ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ అవసరాలకు సరిపోయే వారితోనే కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించండి. వారి అవసరం మీకు, మీ అవసరం వారికి ఉండాలి. అప్పుడే ఇద్దరికీ మేలు జరుగుతుంది. ట్విట్టర్‌తో జాగ్రత్త: ట్విట్టర్లో పోస్టు చేసే వ్యాఖ్యలు వివాదాలను సృష్టిస్తుండడం చూస్తూనే ఉన్నాం. రిక్రూటర్లు కొలువుల భర్తీకి ట్విట్టర్‌ను కూడా ఉపయోగించుకుంటున్నారు. కనుక మీరు ఏదైనా ట్వీట్ చేసేముందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. సంస్థ గురించి, యాజమాన్యం గురించి ప్రతికూలమైన వ్యాఖ్యలు చేయకండి. అభ్యర్థులు వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది. హాస్యం.. శ్రుతి మించొద్దు: అతి ఎప్పటికీ అనర్థమే. మీకు నవ్వు తెప్పించే విషయం మరొకరికి కోపం తెప్పించొచ్చు. రిక్రూటర్/ హైరింగ్ మేనేజర్ మహిళ అయితే.. అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసభ్యకరమైన జోక్స్‌ను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్టు చేయకండి. అలాగే కులం, మతం వంటివాటిపై కూడా జోక్స్ సృష్టించొద్దు. ఒకవేళ ఇలాంటివి మీకు ఇష్టమైతే వివాదాల్లో, కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఉద్యోగం సంగతి తర్వాత.. వాటి నుంచి బయటపడడమే చాలా కష్టం. సామాజిక సైట్లను సరిగ్గా వాడుకోగలిగితే ఇష్టమైన ఉద్యోగం సులువుగా సంపాదించుకోవచ్చు. -
మాటలతోనే వెతికేయండి!
గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను మీరెలా వాడుతున్నారు? ఏముంది... గూగుల్ వెబ్సైట్లో కీవర్డ్స్ టైప్ చేసి ఎంటర్ నొక్కితే చాలంటున్నారా! అంత కష్టం కూడా పడాల్సిన అవసరం లేదిప్పుడు. గూగుల్ ‘నౌ’ ఫీచర్‌తో ఎంచక్కా మీ మాటలతోనే వెతికేయవచ్చు... ఇంకొన్ని పనులూ చక్కబెట్టుకోవచ్చు. అదెలాగో చూడండి... ఆపిల్ ఐఫోన్‌ను ఉపయోగించే వారందరికీ ‘సిరి’ వాయిస్ అసిస్టెంట్ గురించి తెలిసే ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ మీ సహాయకుడిలా పనిచేస్తుంది. మీ మాటల్నే ఆదేశాలుగా నెట్లో సమాచారం వెతికి పెడుతుంది... నోట్స్ టైప్ చేసి పెడుతుంది. చెప్పినవాళ్లకు మెయిల్ కూడా చేసేస్తుంది. దీనికి పోటీగా గూగుల్ అభివద్ధి చేసిన వాయిస్ అసిస్టెంట్ పేరు గూగుల్ ‘నౌ’. డెస్క్‌టాప్ పీసీలతోపాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లతో పనిచేస్తుంది. చాలావరకూ స్మార్ట్ఫోన్లతోపాటు వచ్చే ఈ ఫీచర్‌ను ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చునంటే... లెక్కలేస్తుంది... ఎప్పటికప్పుడు మారిపోయే విదేశీ కరెన్సీ రేట్లను తెలుసుకునేందుకు, శాతాలు లెక్కకట్టేందుకు, కొలతలు తెలుసుకునేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు... "Ok Google, what's ten dollars in Japanese Yen?" "Ok Google, how many teaspoons in a liter liquid?"ఇలాగన్నమాట! భాషల హద్దులు వద్దు... మీరు విదేశాలకు వెళ్లారనుకుందాం. అక్కడి భాషలోనే సమాచారం తెలుసుకోవాలన్నా? మాట్లాడాలన్నా గూగుల్ నౌకు మించిన సహాయకుడు దొరకడు. మీకు ఏం కావాలో ఎంచక్కా ఈ అప్లికేషన్‌తో మాట్లాడేయండి. అంతేకాదు. మీ ప్రయాణపు టికెట్లను ఖరాదు చేసిన మెయిళ్లు జీమెయిల్ ద్వారా వచ్చి ఉంటే గూగుల్ నౌ మీకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందిస్తూ ఉంటుంది. ఆయా ప్రదేశాల వాతావరణం వంటివన్నమాట. మీరు స్పెయిన్ వెళ్లారనుకుంటే కింద చూపినట్లుగా గూగుల్ నౌను అడిగేయవచ్చు. "Ok Google, say in Spanish, 'Where is the bathroom?'" "Ok Google, say in Spanish, 'I'm sorry officer.'" "Ok Google, say in Spanish, 'I want to go to the Indian embassy.'" కుతూహలంగా ఉంటే.. చాలా సందర్భాల్లో అకస్మాత్తుగా మనకు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలని అనిపిస్తుంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉన్నా గూగుల్ సెర్చ్ చేసే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు గూగుల్ నౌ అక్కరకొస్తుంది. మీరు చేయాల్సిందల్లా నేరుగా ప్రశ్న అడిగేయడమే. ఉదాహరణకు... "Ok Google, who is Narendra Modi?" "Ok Google, what's FORTRAN?"ఈ ప్రశ్నలకు గూగుల్ నౌ వికీపీడియా వంటి ప్రముఖ వెబ్సైట్ల నుంచి సమాచారం సేకరించి మీకు అందిస్తుంది. అంతేకాదు... ఈ అప్లికేషన్‌ను ఇప్పుడు ఎలాంటి సందర్భంలోనైనా ఉపయోగించుకోవచ్చు. అంటే... ప్రత్యేకంగా వెబ్సైట్ ఓపెన్ చేసే పనిలేకుండా... మామూలుగా బ్రౌజ్ చేస్తున్నప్పుడు కూడా వాడుకోవచ్చునన్నమాట. అయితే దీనికోసం గూగుల్ ప్లే స్టోర్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్‌లో అప్లికేషన్‌ను వెతికిన తరువాత... Settings >Language & Input >Voice Search >"Ok Google"లోకి వెళ్లండి. ఆ తరువాత ఏఏ సందర్భాల్లో ఈ అప్లికేషన్ పనిచేయాలో మీరే నిర్ణయించుకోవచ్చు. దీంతోపాటు మ్యూజిక్ ప్లేయర్‌ను మాటలతోనే నియంత్రించగలగడం, పాటల వివరాలు తెలుసుకోగలగడం కూడా గూగుల్ నౌలో ఉన్న కొన్ని ఇతర ఫీచర్లు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే స్మార్ట్‌ఫోన్ లేదా డెస్క్టాప్పై ఉన్న మీ గూగుల్ నౌను వాడటం మొదలుపెట్టండి. చేయాల్సిందల్లా గూగుల్ సెర్చ్‌బార్ పక్కనే కనిపించే చిన్న మైక్‌ను క్లిక్ చేయడం అంతే! -
గూగుల్‌లో జాబ్ సెర్చ్ చేయండిలా!
జాబ్ స్కిల్స్: అన్నీ వేదాల్లో ఉన్నాయష... అన్నట్లుగా గూగుల్లోనూ సమస్తం ఉన్నాయి. ఇందులో ప్రపంచాన్నే వీక్షించొచ్చు. ఎక్కడేం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. కంప్యూటర్ను ఉపయోగించే వారందరికీ గూగుల్‌తో తప్పని సరిగా పరిచయం ఉంటుంది. ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ సెర్చ్‌ను ఆశ్రయిస్తుం టారు. ఉద్యోగాల వేటలోనూ యువతకు ఇది ఎంతగానో సహకరిస్తోంది. గూగుల్ ప్రపంచంలోని కొలువుల వివరాలను క్షణాల్లో కళ్లముందుంచుతోంది. నిజంగా ఇదొక శక్తివంతమైన సాధనం. దీన్ని సరిగ్గా వినియోగించుకోవడం నేర్చుకోవాలి. ఏదైనా ఉద్యోగం గురించి సమాచారం కావాలంటే గూగుల్ సెర్చ్‌లోకి వెళ్లి దానికి సంబంధించిన పదాలను టైప్ చేస్తుంటాం. కొన్నిసార్లు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరక్కపోవచ్చు. గూగుల్‌లో జాబ్ సెర్చ్‌కు కొన్ని చిట్కాలున్నాయి. వాటిని పాటిస్తే శ్రమ లేకుండా తక్కువ సమయంలోనే కావాల్సిన వివరాలు తెలుసుకోవచ్చు. సరైన పదం టైప్ చేయాలి ఉద్యోగం కావాలంటే మొదట జాబ్ లేదా జాబ్స్ అనే పదం, తర్వాత జాబ్ టైటిల్, కావాల్సిన ప్రాంతం పేరును వరుస క్రమంలో టైప్ చేయాలి. ఇలా కాకుండా ఇష్టం వచ్చినట్లు టైప్ చేస్తేఅసలైన సమాచారం లభించదు. కొటేషన్ మార్కులు కొన్ని పదాలను టైప్ చేస్తే.. ఆ పదాలున్న పేజీలు ప్రత్యక్షమవుతాయి. ఇవి వందలు, వేలల్లో ఉండే అవకాశం ఉంది. వీటిలో కావాల్సిన పేజీలను వెతుక్కోవడం కష్టమే. ఇలాంటి సందర్భాల్లో కొటేషన్ మార్కులను ఉపయోగించాలి. ఉదాహరణకు entry level jobs అనే పదాన్ని కొటేషన్లలో "entry level jobs'' అని రాస్తే వరుసగా అవే పదాలున్న పేజీలు వస్తాయి. కావాల్సిన పేజీని చూసుకోవడం సులభమవుతుంది. క్యాపిటల్ లెటర్స్ రెండు విషయాలకు సంబంధించిన వివరాలు కావాలంటే ఆ రెండు పదాల మధ్య or అని రాస్తుంటాం. కానీ, ఇలాంటి సందర్భాల్లో క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఉపయోగించాలి. చిన్న అక్షరాలను టైప్ చేస్తే గూగుల్ గుర్తించలేదు. అంటే OR అని పెద్ద అక్షరాలను టైప్ చేయాలి. దీనివల్ల ఆ పదాలున్న పేజీలే తెరపైకి వస్తాయి. ఉదాహరణకు Jobs in Telecom OR Power. స్పేస్ వదిలేయండి కొన్నిసార్లు సరైన పదాలు ఏమిటో తెలియదు. ఇలాంటప్పుడు ఒక పదం రాసి, దాని ముందు స్పేస్ వదిలేస్తే.. గూగుల్ దాన్ని పూరిస్తుంది. ఉదాహరణకు స్పేస్ ఇచ్చి మేనేజర్ జాబ్స్ అని టైప్ చేస్తే.. ఇంజనీరింగ్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ వంటి వివిధ రకాల మేనేజర్ పోస్టుల వివరాలు తెరపైకి ప్రత్యక్షమవుతాయి. ఒక విభాగానికి సంబంధించిన వివరాలు కావాలంటే మొదట ్ణ గుర్తును, తర్వాత పదాన్ని టైప్ చేయాలి. ఉదాహరణకు lawer jobs అని టైప్‌చేస్తే లీగల్, అటార్నీ వంటి న్యాయ సంబంధ ఉద్యోగాల వివరాలన్నీ తెలుస్తాయి. సైట్లు తెలుసుకోండి ఉద్యోగాల సమాచారం ఇస్తున్న వెబ్సైట్లు ఎన్నో ఉన్నాయి. ఏ సైట్లో ఏ ఉద్యోగంపై ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసుకోవాలంటే... గూగుల్ సెర్చ్‌లో site: అని టైప్‌చేసి, ఆ పోస్టును టైప్ చేయాలి. ఉదాహరణకు site:software developer అని టైప్ చేస్తే సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాల వివరాలున్న వెబ్సైట్లన్నీ కనిపిస్తాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గూగుల్ సెర్చ్‌లో టైప్ చేసే పదాల్లో అక్షరాల మధ్య ఎలాంటి స్పేస్‌లు, అనవసరమైన గుర్తులు లేకుండా జాగ్రత్తపడాలి. -
'గూగుల్‌లో వెతకండి.. అన్నిచోట్లా రేప్లే'
బడౌన్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, హత్య.. రేప్‌ను అడ్డుకుందని కిరోసిన్ పోసి తగలబెట్టేశారు.. మహిళా జడ్జిపై ఆమె అధికారిక నివాసంలోనే అత్యాచారం.. మళ్లీ తాజాగా పదిహేనేళ్ల బాలికపై అత్యాచారం, ఉరి.. ఇవన్నీ ఉత్తరప్రదేశ్‌లో గత వారం రోజులుగా వరుసపెట్టి జరుగుతున్న సంఘటనలు. అయితే, వీటి గురించి ప్రశ్నిస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు ఎక్కడలేని కోపం వచ్చింది. గూగుల్ సెర్చిలో వెతికితే దేశవ్యాప్తంగా అన్నిచోట్లా అత్యాచారాలే కనిపిస్తాయని ఆయన అన్నారు. ఇవి కేవలం యూపీలో మాత్రమే జరగట్లేదని, దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల లెక్కలిచ్చినా మళ్లీ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారని ఆయన విలేకరులతో అన్నారు. ఇది గూగుల్ యుగం కాబట్టి, మీరే ఆన్‌లైన్‌లోకి వెళ్లి వెతుక్కోవాలని ఓ ఉచిత సలహా కూడా పారేశారు. కేవలం ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న సంఘటనలను మాత్రమే మీడియా అతిచేసి చూపిస్తోందని ఆరోపించారు. ఇక్కడ జరిగిన ప్రతి కేసులోనూ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అఖిలేష్ అన్నారు. అయితే.. సెం ఇంత చెబుతున్నా, తమకు మాత్రం బెదిరింపులు వస్తూనే ఉన్నాయని బడౌన్ సంఘటన బాధిత కుటుంబం వాపోతోంది. ''మీడియా వెళ్లిపోతుంది, నాయకులు వెళ్లిపోతారు గానీ ప్రభుత్వం మాత్రం మరో మూడేళ్లు ఉంటుంది. మహాభారత యుద్ధం సృష్టిస్తాం జాగ్రత్త'' అని తనను బెదిరించినట్లు బాధిత బాలిక తండ్రి తెలిపారు. -
గూగుల్ సెర్చిలన్నీ మోడీ కోసమే!
మనకున్న మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో.. ఎవరి కోసం ఎక్కువగా గూగుల్‌లో సెర్చి చేశారో తెలుసా? ఏమాత్రం అనుమానం అక్కర్లేదు.. నరేంద్ర మోడీ కోసమే. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సెర్చింజన్ గూగుల్ తన ట్రెండ్స్ వివరాలను బయటపెట్టింది. డిసెంబర్ 13 నుంచి మార్చి 13 వరకు మూడు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని గూగుల్ ఈ వివరాలను తెలిపింది. దేశం మొత్తమ్మీద అత్యధికం సెర్చి చేసిన ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా తమిళనాడు సీఎం జయలలిత, ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ నిలిచారు. ఇంకా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, జమ్ము కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, కేరళ సీఎం ఊమెన్ చాందీ కూడా ఈ జాబితాలో చోటు సంపాదించినట్లు గూగుల్ వెల్లడించింది. -
ఈ యేటి మేటి చిత్రం.. ఆషికీ 2
హిందీలో అత్యధికంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలేవో తెలుసా? దీనికి ప్రమాణాలేంటని అనుకుంటున్నారా? వీక్షకులు గూగుల్‌లో ఎక్కువగా ఏయే సినిమాలను సెర్చ్ చేశారన్నదే ఇందుకు అతిపెద్ద ప్రమాణం. దాని ప్రకారం చూసుకుంటే, అగ్రస్థానంలో 'ఆషికీ 2' నిలిచింది. ఇది రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా. ఇందులో ప్రధానంగా 'అప్నే కరమ్ కీ కర్ అదాయే' అంటూ వచ్చే మొదటిపాట యూట్యూబ్‌లో ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తోంది. వివిధ రకాలుగా దీన్ని ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది యూట్యూబ్‌లో చూశారు. ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించగా, భూషణ్ కుమార్, ముఖేష్ భట్ నిర్మించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్ 3, ధూమ్ 3, హిమ్మత్వాలా, రేస్ 2, ఏబీసీడీ, భాగ్ మిల్కా భాగ్, దబాంగ్ 2, మద్రాస్ కేఫ్ నిలిచాయి. -
ఈ యేటి మేటి చిత్రం.. ఆషికీ 2
హిందీలో అత్యధికంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలేవో తెలుసా? దీనికి ప్రమాణాలేంటని అనుకుంటున్నారా? వీక్షకులు గూగుల్‌లో ఎక్కువగా ఏయే సినిమాలను సెర్చ్ చేశారన్నదే ఇందుకు అతిపెద్ద ప్రమాణం. దాని ప్రకారం చూసుకుంటే, అగ్రస్థానంలో 'ఆషికీ 2' నిలిచింది. ఇది రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా. ఇందులో ప్రధానంగా 'అప్నే కరమ్ కీ కర్ అదాయే' అంటూ వచ్చే మొదటిపాట యూట్యూబ్‌లో ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తోంది. వివిధ రకాలుగా దీన్ని ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది యూట్యూబ్‌లో చూశారు. ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించగా, భూషణ్ కుమార్, ముఖేష్ భట్ నిర్మించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్ 3, ధూమ్ 3, హిమ్మత్వాలా, రేస్ 2, ఏబీసీడీ, భాగ్ మిల్కా భాగ్, దబాంగ్ 2, మద్రాస్ కేఫ్ నిలిచాయి. -
సన్నీ లియోన్ కోసం గూగుల్‌లో గాలింపు!
ఈ సంవత్సరం మొత్తం మీద గూగుల్‌లో అత్యధికంగా ఎవరి కోసం సెర్చ్ చేశారో తెలుసా? బూతు చిత్రాలతో మొదలుపెట్టి, ఇటీవలి కాలంలో షారుక్ ఖాన్ కూడా ఆమెతో కలిసి సినిమా చేయాలని ఉందంటూ చెప్పిన సన్నీ లియోన్. కత్రినా కైఫ్, దీపికా పదుకొనే లాంటి అగ్రతారలను సైతం ఆమె ఈ వెదుకులాటలో వెనక్కి నెట్టేసింది. ఇలా వివిధ సినీ నటుల కోసం చేసిన సెర్చ్‌లో అగ్రస్థానంలోను, చిట్టచివరి స్థానంలో కూడా సెక్సిణులే ఉండటం గమనార్హం. మొదటి స్థానంలో సన్నీ లియోన్, పదో స్థానంలో పూనమ్ పాండే ఉన్నారు. ఇప్పుడంటే పూనమ్ పాండే వార్తల్లో లేదు గానీ, అంతకుముందు భారత్ విజయం సాధిస్తే తాను నగ్నంగా పోజులిస్తానంటూ బహిరంగంగా చెప్పి విపరీతంగా వార్తల్లో నిలిచింది. గూగుల్ సెర్చ్‌లో టాప్ టెన్ స్థానాల్లో నిలిచిన వ్యక్తులు ఎవరెవరో చూస్తే.. వరుసగా సన్నీ లియోన్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, షారుక్ ఖాన్, హనీ సింగ్, కాజల్ అగర్వాల్, కరీనా కపూర్, సచిన్ టెండూల్కర్, పూనమ్ పాండే ఉన్నారు. -
స్పాట్లైట్
ఎల్జీ జీ2 ప్రోస్: కొత్త డిజైన్, ఐ ఫోన్ 5, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 4, హెచ్‌టీసీల స్థాయి కాన్స్: పవర్, పెర్ఫార్మెన్స్ అన్నింటిలోనూ బెటర్ మాత్రమే. బెస్ట్ కాలేదు. బోటమ్ లైన్: గుడ్ ఫోన్, కొన్ని బలాలున్నాయి, బలహీనతలు కూడా. కిండ్లే ఫైర్ హెచ్‌డీఎక్స్ టాబ్లెట్ ప్రోస్: ఆండ్రాయిడ్ ఎస్, లైట్ వెయిట్, షార్ప్ డిస్ప్లే కాన్స్: ఇతర టాబ్లెట్లతో పోల్చినప్పుడు కొంత వెనుకబడి ఉంది. బోటమ్ లైన్: ఐప్యాడ్ మినీ, నెక్సస్7 లతో పోలిక ఉంది. పోరాడుతుంది. గూగుల్‌సెర్చ్ గజినీలను చేస్తోంది! సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నెటిజన్లను మతిమరపు రాయుళ్లుగా చేస్తోంది... అంటున్నారు అధ్యయనకర్తలు. ఇంటర్నెట్ను బాగా వినియోగించే రెండువేల మంది యువతీ యువకులపై చేసిన పరిశోధన ఫలితంగా ఈ విషయం తేలిందట. వీరు ఏ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికైనా గూగుల్ ఆశ్రయించడం వల్ల క్రమంగా గజినీలు అవుతున్నారని అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు. గూగుల్ అందుబాటులో ఉండటంతో ఏదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అనే భావనకు వస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ట్విన్ టవర్స్‌పై తీవ్రవాద దాడులు ఎప్పుడు జరిగాయి, బెర్లిన్ వాల్ ఎప్పుడు కూలింది.. వంటి చారిత్రక ఘటనలను కూడా చాలామంది యువతీ యువకులు మరచిపోయారని, అవసరమైనప్పుడు గూగుల్‌ను సంప్రదిస్తున్నారని, ఫలితంగా వారిని మతిమరపు ఆవహిస్తోందని అధ్యయనకర్తలు విశ్లేషించారు. డెల్ నుంచి కొత్త టాబ్లెట్లు వెన్యూ 7 వెన్యూ 8 : వెన్యూ - 7 (ఏడు అంగుళాలు) వెన్యూ - 8 (ఎనిమిది అంగుళాలు) టాబ్లెట్లు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయి. హై డెఫినిషన్ క్వాలిటీతో ఎల్సీడీ స్క్రీన్‌తో ఉంటుంది. వెన్యూ - 7 ధర రూ.9500. వెన్యూ - 8 ధర రూ.11,500. వెన్యూ - 8 ప్రో, వెన్యూ - 11 ప్రో: విండోస్ - 8.1 ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేస్తాయి. డే-లాంగ్ బ్యాటరీ లైఫ్ ఈ టాబ్లెట్ల ప్రత్యేకత. వీటి ధరలు వరసగా రూ.19,000, రూ.32,000 -
విహారం: లక్షద్వీప్.. జలచరాలతో విహారం
లక్షద్వీప్... పేరులో లక్షణంగా లక్ష ఉంది. గూగుల్ సెర్చ్ ఏరియల్ వ్యూలో చూస్తే లెక్కపెట్టలేనన్ని ద్వీపాలు కనిపిస్తాయి. కానీ అన్ని దీవులు ఉండే అవకాశం లేదు. పచ్చదనాన్ని రంగరించుకున్న నీలం రంగులో సముద్రం, వెండి వెన్నెల లేకపోయినా సరే... తెల్లగా మెరుస్తామంటూన్న తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, పర్యాటక శాఖ అభివృద్ధి చేసిన అంతర్జాతీయస్థాయి హాలిడే రిసార్టులతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. నిజానికి అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఏర్పడిన ముక్కలు ఈ దీవులు... అని అధ్యయనకారుల అంచనా. అరేబియా సముద్రంలో ఆఫ్రికా - ఆసియా ఖండాల వ్యాపార మార్గంలో ఉన్నాయి లక్షద్వీప్ దీవులు. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా ఈ దీవుల మీదుగానే. వీటి పేరు లక్షదీవులు... అనే కానీ మనదేశంలోని యూనియన్ టెరిటరీల్లో చిన్నది ఇదే. భూభాగం అంతా కలిపితే విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లకు మించదు. ఒక మోస్తరు పెద్ద దీవులు 36 ఉన్నప్పటికీ పది దీవులే జనావాసాలు. పది సబ్ డివిజన్లతో ఒకే ఒక జిల్లా ఇది. జనాభా పది దీవుల్లో కలిసి 65 వేలకు మించదు. స్థానికుల్లో ఎక్కువ శాతం మలయాళీలే. అధికార భాష కూడా మలయాళమే, మినికోయ్ దీవిలో నివసించే వాళ్లు మాత్రం మహిల్ భాష మాట్లాడుతారు. ఇది మాల్దీవుల్లో మాట్లాడే భాష. ఈ దీవి మిగిలిన దీవుల సమూహానికి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. ఇక్కడి ప్రజల జీవనశైలి మిగిలిన దీవులకు భిన్నంగా ఉండదు, కానీ భాష వేరు. లక్షద్వీప్ దీవుల్లో మనుష్య సంచారం లేని చిన్న చిన్న దిబ్బల్లాంటివి లెక్కలేనన్ని ఉంటాయి. కొన్ని దీవుల్లోకి పగడాల వేటగాళ్లు మాత్రమే అడుగుపెడుతుంటారు. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి రాజధాని కరావట్టి దీవి. లక్షద్వీప్ దీవుల్లోని స్థానికులకు చేపల వేట, కొబ్బరి తోటల సాగు, కొబ్బరి పీచు తీయడం ప్రధాన వృత్తులు. అత్యంత ఖరీదైన ‘ట్యూనా ఫిష్’ ఇక్కడి నుంచి పెద్దమొత్తంలో ఎగుమతి అవుతుంది. ఇప్పుడు పర్యాటకం పెద్ద పరిశ్రమ అయింది. కొన్ని దీవులను పూర్తిగా టూరిస్టు రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్ కోసమే డెవలప్ చేశారు. ఇలాంటి దీవుల్లో నివసించేవాళ్లంతా పర్యాటకశాఖ ఉద్యోగులే. వలయాకారంగా ఉండే పగడపు దీవుల్లోకి విహారానికి వెళ్లడం అనే ఆలోచన జానపద సినిమాను తలపిస్తుంటే, సముద్రపు నీటి లోపలికి దూసుకెళ్లే స్కూబా డైవింగ్‌ను తలుచుకుంటేనే కళ్లు మెరుస్తాయి. సముద్రజీవరాశులను దగ్గరగా చూడడానికి పెద్దవాళ్లు ట్యూబ్‌లో వెళ్లి సంతోషపడుతుంటే... యూత్ మాత్రం అంతరిక్ష చోదకుల్లాగ ఒళ్లంతా కప్పేసే వాటర్‌ప్రూఫ్ దుస్తులు ధరించి, ఆక్సిజన్ మాస్క్ తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్ గాగుల్స్ పెట్టుకుని జలచరాల్లా నీటిలో చక్కర్లు కొడుతూ ఆనందిస్తుంటారు. అగట్టి, బంగారం దీవుల్లో స్కూబా డైవింగ్ స్కూళ్లున్నాయి. ఒక్కో దీవిలో పర్యటిస్తూ ఇక ఈ దీవిని చూసింది చాలనిపించి ఫెర్రీ ఎక్కి మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ పర్యాటకులు వాటర్ సర్ఫింగ్కి సిద్ధమవుతుంటారు. నీటి మీద అలలతో పోటీ పడుతూ ఎగిరి గంతులేయడాన్ని టెలివిజన్ ప్రోగ్రామ్‌లో చూసి ఆనందించడమే తప్ప స్వీయానుభవం లేని వాళ్లకు అలలతో ఆడుకోవాలనే సరదాతోపాటు కొంచెం భయం కూడా వేస్తుంది. కానీ ఇక్కడి ట్రైనర్లు ‘సర్ఫింగ్ బోర్డు మీద ఎలా నిలబడాలి, అల వస్తున్న దిశకు అనుగుణంగా ఎలా కదలాలి...’ వంటి ప్రాథమిక విషయాల్లో శిక్షణనిచ్చి నీటి మీదకు పంపిస్తారు. పొరపాటున నీటిలో పడిపోయినా వెంటనే బయటకు తీసుకొస్తారు. తమాషా ఏమిటంటే... ఒకసారి పట్టుతప్పి నీటిలో పడిపోయిన వాళ్లు బయటకు వచ్చి ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుని ఒడ్డున కూర్చోరు. కొంచెం తేరుకోగానే మళ్లీ నీటిలోకి పరుగులు తీస్తారు. ఆశ్చర్యకరంగా రెండోసారికి ఒడుపు తెలిసిపోయి అలలతో గెంతులేస్తుంటారు. మరో దీవిలోకి అడుగుపెడితే అక్కడ కొంతమంది పర్యాటకులు కేయాకింగ్(తెడ్డు పడవ) తో గాలికంటే వేగంగా నీటి మీద సాగిపోతుంటారు. ఇంతమంది ఇన్ని సాహసోపేతమైన ఆటలు ఆడుకుంటూ సముద్రాన్ని తలకిందులు చేస్తున్నప్పటికీ నీరు స్వచ్ఛంగా ఉంటుంది. అగట్టి, అమిని, అండ్రాట్, బిట్రా, చెట్లాట్, కాడ్మాట్, కాల్పెనీ, కరావట్టి, కిల్టాన్, మినికోయ్... ఈ దీవులన్నింటినీ ఒక రోజులో చుట్టేయవచ్చు. సముద్రంలో ఎన్ని రకాల జీవరాశులుంటాయో కదా! అని చూస్తే చేపలు రకరకాల ఆకారాల్లో కనిపిస్తాయి. చేపల్లో ఇన్ని రకాలుంటాయా అని ఆశ్చర్యపోవడం మన వంతైతే సెప్టెంబరు నుంచి డిసెంబర్ మధ్యలో వచ్చిన పర్యాటకులకు షార్క్ చేపలు కూడా హలో చెప్తాయి. అరేబియా సముద్రంలో దుర్భిణీ వేసి వెతికితే తప్ప కనిపించని ఈ దీవుల్లో మనిషి సంచరించిన ఆనవాళ్లు క్రీ.పూ 1500 నాటికే ఉన్నాయి. బుద్ధుని జాతక కథల్లో ఈ దీవుల ప్రస్తావన ఉంది... అంటే అప్పటికే ఇక్కడ మనుషులు నివసించారనే అనుకోవాలి. ఈ కథలన్నీ పుక్కిటి పురాణాలు అని కొట్టిపారేద్దామంటే చరిత్ర అధ్యయనానికి ప్రామాణిక గ్రంథం ‘పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ’ కూడా దీనినే నిర్ధారించింది. ఆ తర్వాత మధ్యయుగం నాటికి ఈ దీవులను చోళులు పాలించారు. కాలానుగుణంగా బ్రిటిష్ పాలనను రుచి చూసి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మన జాతీయ జెండా ఎగురవేయడంతో ఇండియాలో భాగమేనని ఖరారయ్యాయి ఈ దీవులు. స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దానికి కేంద్రపాలిత ప్రాంతంగా స్థిరపడింది ఈ దీవుల సమూహం. ఎక్కడ ఉన్నాయి? కేరళ తీరానికి సుమారు 250 మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఎప్పుడు వెళ్లాలి? ఇక్కడి వాతావరణం అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్య ఆహ్లాదంగా ఉంటుంది. ఎలా వెళ్లాలి? విమానంలో... లక్షద్వీప్‌కు దగ్గరగా ఉన్న తీరం కేరళలోని కొచ్చి నగరం. కొచ్చి నుంచి అగట్టి దీవికి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. అగట్టి ద్వీపంలో దిగిన తర్వాత ఇతర దీవులకు వెళ్లడానికి హెలికాప్టర్, ఫెర్రీ, షిప్, మిషన్‌బోట్ సౌకర్యం ఉంటుంది. దీవిలోపల తిరగడానికి ఆటోరిక్షాలు, క్యాబ్‌లు ఉంటాయి.రైలు మార్గం... కొచ్చి వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి విమానం లేదా షిప్లో లక్షద్వీప్ చేరాల్సి ఉంటుంది. షిప్ ప్రయాణం... లక్షద్వీప్ పర్యాటక శాఖ కొచ్చి నుంచి అగట్టి దీవికి షిప్ క్రూయిజ్ నడుపుతోంది. ‘ఎం.వి. టిప్పు సుల్తాన్, ఎం.వి. భరత్సీమ, ఎం.వి. ఆమినిదీవి, ఎం.వి. మినికోయ్’ అనే నాలుగు క్రూయిజ్లున్నాయి. వీటిలో ప్రయాణానికి లక్షద్వీప్ అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎయిర్‌కండిషన్ క్రూయిజ్‌లే. ఎక్కడ ఉండాలి? సీషెల్స్ బీచ్ రిసార్టు, ఐలాండ్ హాలిడే హోమ్, లక్షద్వీప్ హోమ్‌స్టే, కోరల్ ప్యారడైజ్, కాడ్మట్ బీచ్ రిసార్టు వంటివి చాలా ఉన్నాయి. ఒక రోజుకు ఐదు వందల రూపాయలు వసూలు చేసే గెస్ట్ హౌస్‌ల నుంచి ఐదు వేలు చార్జ్ చేసే రిసార్టుల వరకు ఉన్నాయి. భోజనం ఎలా? ఈ ప్రదేశం కేరళకు దగ్గరగా ఉండడంతో ఆ ప్రభావం ఆహారం మీద కూడా ఉంటుంది. కొబ్బరి వాడకం ఎక్కువ. వంటల్లో సుగంధద్రవ్యాల వినియోగమూ ఎక్కువే. రెస్టారెంట్లలో ప్రధానమైన మెనూలో సీఫుడ్ రకాలు ఎక్కువగా కనిపిస్తాయి. శాకాహారం కూడా దొరుకుతుంది. కేరళ నుంచి టిన్డ్ ఫుడ్ వస్తుంది. ఇక్కడ ఏమేమి చూడాలి? హజ్రత్ ఉబాయిదుల్లా సమాధి, కరావట్టి మసీదు, కరావట్టి అక్వేరియం, బుద్ధిస్ట్ ఆర్కియోలాజికల్ మ్యూజియం, ట్యూనా క్యానింగ్ ఫ్యాక్టరీ ప్రధానమైనవి. ఏయే సాహసాలు చేయవచ్చు? కామత్ ఐలాండ్‌లో కానోయింగ్, యాచింగ్, కాయాకింగ్, స్నోర్కెలింగ్, విండ్ సర్ఫింగ్, వాటర్ స్కీయింగ్, స్కూబా డైవింగ్ వంటి చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి.