
లండన్: ప్రతి చిన్నఅంశానికీ మెదడుకు పనిచెప్పకుండా గూగుల్‌లో వెతికితే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కోల్పోయి చిత్తవైకల్యం(డిమెన్షియా) బారిన పడే ప్రమాదం పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేపనిగా ఇంటర్నెట్‌పై ఆధారపడటంతో భవిష్యత్‌లో ఎదురయ్యే దీర్ఘకాల ప్రతికూలతలను విస్మరించడం తగదని ప్రముఖ డిమెన్షియా పరిశోధక ప్రొఫెసర్ ఫ్రాంక్ గన్ మూర్ పేర్కొన్నారు.
మెరుగైన బ్రెయిన్ హెల్త్‌ను కాపాడుకోవడం కీలకమని, మెదడుకు పదునుపెట్టేలా వ్యవహరించాల్సిన మనం దీన్ని ఇప్పుడు ఇంటర్‌నెట్‌కు అవుట్‌సోర్స్ చేస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మనకు ఎలాంటి సమాచారం కావాల్సి ఉన్నా మన మెమరీకి పనిచెప్పడం మాని ఆన్‌లైన్‌లో ప్రయత్నించడం సరికాదని అన్నారు.
జీవన ప్రయాణంలో మానవాళి పరుగెడుతూ మెదడుకు పనిచెప్పడమే మాని ఇంటర్‌నెట్‌కు అప్పగించడం దుష్పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు.డిమెన్షియా బారినపడితే అది పలు తీవ్ర అనారోగ్యాలకూ అనర్ధాలకు కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.