పాకిస్తానీల కళ్లన్నీ భారత్‌పైనే.. గూగుల్‌లో ఏం వెతికారంటే.. | India things that pakistan searched for on google in 2024 | Sakshi
Sakshi News home page

పాకిస్తానీల కళ్లన్నీ భారత్‌పైనే.. గూగుల్‌లో ఏం వెతికారంటే..

Published Mon, Dec 16 2024 11:46 AM | Last Updated on Mon, Dec 16 2024 12:50 PM

India things that pakistan searched for on google in 2024

వివిధ దేశాలలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్‌  ట్రెండ్స్‌, భిన్న అంశాలను వెల్లడిస్తూ గూగుల్‌ (Google) ప్రతి సంవత్సరం తన "ఇయర్ ఇన్ సెర్చ్" నివేదికను ఆవిష్కరిస్తుంది. ఇందులో వార్తలు, క్రీడా ఈవెంట్‌ల దగ్గర నుండి సెలబ్రిటీలు, సినిమాలు, టీవీ షోలు, సందేహాలు వంటివెన్నో ఉంటాయి.

ఈ క్రమంలోనే గూగుల్ ఇటీవల పాకిస్తాన్‌కు సంబంధించిన  “ఇయర్ ఇన్ సెర్చ్ 2024”ని విడుదల చేసింది. ఏడాది పొడవునా పాకిస్తాన్ ప్రజలు గూగుల్‌ ఏం వెతికారు..కీలక పోకడలు, అంశాలను హైలైట్ చేస్తూ విభిన్న రంగాలలో జాతీయ ఆసక్తిని ఆకర్షించిన వాటిపై ఒక సంగ్రహావలోకనం ఈ నివేదిక అందిస్తుంది.

గూగుల్‌ పాకిస్తాన్ 2024 సంవత్సరాంతపు జాబితాలో క్రికెట్, వ్యక్తులు, సినిమాలు&నాటకాలు, హౌ-టు సందేహాలు, వంటకాలు, టెక్నాలజీ వంటి ఆరు కేటగిరీల్లో అత్యధిక సెర్చ్‌ చేసిన టాప్ 10 అంశాలు ఉన్నాయి. అయితే 
యాదృచ్ఛికంగా వీటిలో భారత్‌ గురించి లేదా దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. భారతీయ వ్యాపారవేత్తలు, సోనీ, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో భారతీయ షోలు, టీ20 ప్రపంచ కప్ సిరీస్‌లో భారత జట్టు క్రికెట్ మ్యాచ్‌లు వీటిలో ఉన్నాయి.

పాకిస్థానీల ఆసక్తులు ఇవే..
క్రికెట్‌లో పాకిస్థాన్‌లో అత్యధికంగా శోధించిన ఐదు గేమ్‌లు భారత్ ఆడిన మ్యాచ్‌లే. వీటిలో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య పోరు ఒకటి. ఇది కాకుండా అత్యధికంగా సెర్చ్‌ చేసిన ఇతర మ్యాచ్‌లలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌లు ఉన్నాయి.ఇ‍క వ్యక్తుల విషయానికి వస్తే.. 'పీపుల్ లిస్ట్ ఫర్ పాకిస్థాన్'లో భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఉన్నారు.

సినిమాలు & నాటకాల జాబితాలో అత్యధికంగా భారతీయ టీవీ షోలు, నాలుగు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. హీరామండి, ట్వల్త్‌ ఫెయిల్, మీర్జాపూర్ సీజన్ 3, బిగ్ బాస్ 17 పాకిస్తానీలు అత్యధికంగా సెర్చ్‌ చేసిన టీవీ షోలు కాగా యానిమల్, స్త్రీ 2, భూల్ భులైయా 3, డంకీ 2024లో అత్యధికంగా గూగుల్ చేసిన బాలీవుడ్ సినిమాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement