google trends
-
మెటా కొంపముంచిన ఆ ఒక్క నిర్ణయం
మెటా గ్రూప్ తన ఆన్లైన్ సర్వీసులైన ఫేస్బుక్, థ్రెడ్స్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో ఫ్యాక్ట్ చెకింగ్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కంపెనీకి చుక్కెదురవుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్‌ను ఎలా డెలిట్ చేయాలని గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు అనలిటిక్స్ ద్వారా తెలిస్తుంది. ప్రస్తుతం ఆయా అకౌంట్లను ఎలా నిలిపేయాలని అధిక సంఖ్యలో గూగుల్‌లో సెర్చ్ చేస్తుండడంతో ప్రస్తుతం అవి ట్రెడింగ్లో ఉన్నాయి. ఇందుకు ఇటీవల మెటా తీసుకున్న నిర్ణయమే కారణమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మెటా యాప్స్‌లో థర్డ్‌పార్టీ ఫ్యాక్ట్ చెకింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు బదులుగా కంపెనీ ‘కమ్యూనిటీ నోట్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేసింది. కమ్యూనిటీ నోట్స్ అనే కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థ వల్ల తప్పుదోవ పట్టించే పోస్ట్‌లను కట్టడి చేయవచ్చని మెటా తెలిపింది. ఇప్పటికే ఈ వ్యవస్థను ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాడుతున్నట్లు తెలుస్తుంది.ట్రంప్ మెప్పు పొందేందుకేనా..?ట్రంప్ త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న తరుణంలో మెటా ఇలా ఫ్యాక్ట్ చెకింగ్ సదుపాయాన్ని నిలిపేస్తున్న తీసుకున్న నిర్ణయంపట్ల కంపెనీపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలని నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పటికే ప్రధాన కంపెనీలు కొత్త ప్రభుత్వం పట్ల అభిమానాన్ని చూరగొనేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మార్పుపై ట్రంప్ అధికారులకు మెటా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ అధినేత, ట్రంప్ చిరకాల మిత్రుడు డానా వైట్‌ను మెటా బోర్డులో చేర్చుకున్నట్లు కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు.కఠిన నిర్ణయాలు తప్పవురాబోయే రోజుల్లో అమెరికాలో మార్పు రావాలని ఆశిస్తున్నట్లు మార్క్ చెప్పారు. అందరూ స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయలని నొక్కి చెప్పారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వేగంగా వ్యాపిస్తుందన్నారు. దాంతో కంపెనీలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. దీనివల్ల కొందరి పోస్టులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘వినాశనమే తప్ప విజయం కాదు.. వివరణతో దిగజారారు’తప్పుడు సమాచారం తగ్గుతుందా..?మార్క్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటివరకు మెటా అనుసరించిన ఫ్యాక్ట్ చెకింగ్ విధానంతో ఇటీవల అధికారంలోకి వచ్చిన కన్జర్వేటివ్‌పార్టీ నేతలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నట్లు గతంలో భావించారు. ట్రంప్ అధికారంలోకి వస్తే మెటాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందేమోనని భావించి ముందుగానే మార్క్ ఈ మార్పులు చేశారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కన్జర్వేటివ్ మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే అనేక డిజిటల్ హక్కుల సంఘాలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో తప్పుడు సమాచారం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. -
పాకిస్తానీల కళ్లన్నీ భారత్‌పైనే.. గూగుల్‌లో ఏం వెతికారంటే..
వివిధ దేశాలలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ట్రెండ్స్, భిన్న అంశాలను వెల్లడిస్తూ గూగుల్ (Google) ప్రతి సంవత్సరం తన "ఇయర్ ఇన్ సెర్చ్" నివేదికను ఆవిష్కరిస్తుంది. ఇందులో వార్తలు, క్రీడా ఈవెంట్ల దగ్గర నుండి సెలబ్రిటీలు, సినిమాలు, టీవీ షోలు, సందేహాలు వంటివెన్నో ఉంటాయి.ఈ క్రమంలోనే గూగుల్ ఇటీవల పాకిస్తాన్‌కు సంబంధించిన “ఇయర్ ఇన్ సెర్చ్ 2024”ని విడుదల చేసింది. ఏడాది పొడవునా పాకిస్తాన్ ప్రజలు గూగుల్ ఏం వెతికారు..కీలక పోకడలు, అంశాలను హైలైట్ చేస్తూ విభిన్న రంగాలలో జాతీయ ఆసక్తిని ఆకర్షించిన వాటిపై ఒక సంగ్రహావలోకనం ఈ నివేదిక అందిస్తుంది.గూగుల్ పాకిస్తాన్ 2024 సంవత్సరాంతపు జాబితాలో క్రికెట్, వ్యక్తులు, సినిమాలు&నాటకాలు, హౌ-టు సందేహాలు, వంటకాలు, టెక్నాలజీ వంటి ఆరు కేటగిరీల్లో అత్యధిక సెర్చ్ చేసిన టాప్ 10 అంశాలు ఉన్నాయి. అయితే యాదృచ్ఛికంగా వీటిలో భారత్ గురించి లేదా దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉన్నాయి. భారతీయ వ్యాపారవేత్తలు, సోనీ, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో భారతీయ షోలు, టీ20 ప్రపంచ కప్ సిరీస్‌లో భారత జట్టు క్రికెట్ మ్యాచ్‌లు వీటిలో ఉన్నాయి.పాకిస్థానీల ఆసక్తులు ఇవే..క్రికెట్లో పాకిస్థాన్‌లో అత్యధికంగా శోధించిన ఐదు గేమ్‌లు భారత్ ఆడిన మ్యాచ్‌లే. వీటిలో టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య పోరు ఒకటి. ఇది కాకుండా అత్యధికంగా సెర్చ్ చేసిన ఇతర మ్యాచ్‌లలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ ఇంగ్లండ్, ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌లు ఉన్నాయి.ఇక వ్యక్తుల విషయానికి వస్తే.. 'పీపుల్ లిస్ట్ ఫర్ పాకిస్థాన్'లో భారత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఉన్నారు.సినిమాలు & నాటకాల జాబితాలో అత్యధికంగా భారతీయ టీవీ షోలు, నాలుగు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. హీరామండి, ట్వల్త్ ఫెయిల్, మీర్జాపూర్ సీజన్ 3, బిగ్ బాస్ 17 పాకిస్తానీలు అత్యధికంగా సెర్చ్ చేసిన టీవీ షోలు కాగా యానిమల్, స్త్రీ 2, భూల్ భులైయా 3, డంకీ 2024లో అత్యధికంగా గూగుల్ చేసిన బాలీవుడ్ సినిమాలు. -
#CM YS Jagan: గూగుల్ ట్రెండ్స్‌లో టాప్ సీఎం జగన్
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు సుస్పష్టంగా ఉండబోతుందని గూగుల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. ఏపీ రాజకీయాల గురించి చేసే వేర్వేరు ప్లాట్‌ఫాంలపై చేసే పోస్టులను విశ్లేషించి, ఎవరిపై ఏ టాపిక్‌పై ఎంత సమయం గడుపుతున్నారన్న దాన్ని బట్టి.. గూగుల్ ట్రెండ్స్ ఫలితాలు ఇస్తుంది. ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టాప్‌లో ఉండగా.. దరిదాపుల్లో కూడా చంద్రబాబు లేకపోవడం గమనార్హం. గూగుల్ ట్రెండ్స్‌కు సంబంధించి రెండు రకాల రిపోర్టులు పరిశీలిద్దాం. ఒకటి 90 రోజులకు సంబంధించి, మరొకటి గత 30 రోజులకు సంబంధించి. ముందుగా గడిచిన 90 రోజుల ట్రెండ్స్ చూస్తే.. యావరేజ్ ఇంటరెస్ట్ ఓవర్ టైం ►సీఎం వైఎస్ జగన్- 39 నిమిషాలు ►చంద్రబాబు నాయుడు- 12 నిమిషాలు (ఒక్కో యూజర్ ఆయా వ్యక్తుల మీద ఒక రోజు వెచ్చించిన సమయం) గడచిన 90 రోజుల్లో సీఎం జగన్‌కు దగ్గరగా చంద్రబాబు వచ్చింది ఒకే ఒక సారి. అది కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు మాత్రమే. ఆ కేసులో చంద్రబాబు విజ్ఞప్తిని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. తనపై కేసు కొట్టేయాలంటూ వేసిన క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. పైగా అరెస్ట్ సబబేనని తేల్చిచెప్పింది కూడా. ఇక గడచిన 30 రోజులు అంటే ఎన్నికల వేడి బాగా పెరిగిన తర్వాత గూగుల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే.. యావరేజ్ ఇంటరెస్ట్ ఓవర్ టైం ►సీఎం వైఎస్ జగన్- 45 నిమిషాలు ►చంద్రబాబు నాయుడు- 16 నిమిషాలు తెలుగు భాషలో ఉన్న మీడియాలో సింహాభాగం చంద్రబాబు, ఆయన మనుష్యుల చేతిలో ఉంది. ఇన్నాళ్లు చంద్రబాబు, ఎల్లోమీడియా ఏది చెప్పినా అది నిజమని నమ్మేవారు. ఇప్పుడు జనం ముందు సోషల్ మీడియా పుణ్యమా అని అసలు నిజాలను నెటిజన్లు మాత్రం బయటకు తీస్తూనే ఉన్నారు. అందుకే ఎన్నికల వేళ చంద్రబాబును మరింత దూరం పెట్టారు. -
గూగుల్ ట్రెండ్స్ లో ట్రెండ్ సృష్టించిన సీఎం జగన్
-
గూగుల్ సెర్చ్‌లో ట్రెండ్ కరోనాదే.. టాప్ 10 జాబితా ఇదే!
Google Search 2021 Trends: ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలన్నా, ఏదైనా విషయం మీద వార్తలో, వివరాలో కావాలన్నా ఆశ్రయించేది ‘గూగుల్’నే. జనం దేనిపై ఆసక్తిగా ఉన్నారో, ఎప్పుడెప్పుడు దేని గురించి సెర్చ్ చేస్తున్నారో గూగుల్ ట్రెండ్స్ చెప్పేస్తుంది. అలా 2021లో భారతీయులు ఎక్కువగా వెతికినది దేని గురించో తెలుసా.. కరోనాకు సంబంధించే. ఇదొక్కటే కాదు.. వివిధ అంశాల్లో జనం దేనిగురించి ఎక్కువగా వెతికారో గూగుల్ ట్రెండ్స్ తాజాగా వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దామా? – సాక్షి సెంట్రల్‌డెస్క్ టాప్–10లో ఉన్నవి ఇవీ.. మొత్తంగా ఏడాదంతా కలిపి చూస్తే.. గూగుల్ సెర్చ్‌లో ఐపీఎల్ టాప్‌లో.. కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన కోవిన్ పోర్టల్ రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐసీసీ టీ20 వరల్డ్ కప్, యూరో కప్, టోక్యో ఒలింపిక్స్, కోవిడ్ వ్యాక్సిన్, ఫ్రీఫైర్ గేమ్ రిడీమ్ కోడ్, కోపా అమెరికా, నీరజ్ చోప్రా, ఆర్యన్ ఖాన్ (షారూక్‌ఖాన్ కుమారుడు) గురించి నెటిజన్లు వెతికారు. దగ్గరిలో ‘కోవిడ్’గురించే.. మనం ఉన్న ప్రాంతంలో మనకు కావాల్సిన అవసరాల కోసం చేసే ‘నియర్ మి’సెర్చ్‌లో.. కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ పరీక్షల కోసమే కోసమే జనం అత్యధికంగా వెతికారు. తర్వాతి స్థానాల్లో ఫుడ్ డెలివరీ, ఆక్సిజన్ సిలిండర్, కోవిడ్ హాస్పిటల్, టిఫిన్ సెంటర్, సీటీ స్కాన్, టేక్ఔట్ రెస్టారెంట్స్, ఫాస్టాగ్, డ్రైవింగ్ స్కూల్ నిలిచాయి. మొత్తంగా ‘నియర్ మి’సెర్చ్ టాప్–10లో ఐదు అంశాలు కరోనాకు సంబంధించినవే. ఎలా చేయాలనే లిస్టులోనూ.. ఏదైనా పని ఎలాచేయాలనే దానికి సంబంధించిన ‘హౌ టు’సెర్చ్‌లో నూ కరోనా అంశాలే ఎ క్కువగా నిలిచాయి. కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగనే దానిపైనే ఎ క్కు వ మంది సెర్చ్ చేశారు. ఆ తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ డౌన్లోడ్, ఆక్సిజన్ స్థాయిలు పెంచుకోవడమెలా? పాన్–ఆధార్ లింకేజీ, ఇంట్లో ఆ క్సిజన్ తయారీ, డోగె కాయిన్ (వర్చువల్ కరె న్సీ) కొనేదెలా? బనానా బ్రెడ్ తయారీ, బిట్కా యిన్‌లో ఇన్వెస్ట్ చేసేదెలాగనే వాటిపై వెతికారు. మార్కుల శాతాన్ని లెక్కించడం ఎలాగనేదానిపై చాలామంది సెర్చ్ చేయడం గమనార్హం నీరజ్ చోప్రానే టాప్ భారతీయుల్లో ఎక్కువగా క్రీడాకారుడు నీరజ్ చోప్రా గురించి గూగుల్ సెర్చ్ చేశారు. బాలీవుడ్ హీరో షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్, నటి షెహనాజ్ గిల్, నటి శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా, స్పేస్ ఎక్స్ అంతరిక్ష సంస్థ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్, నటుడు విక్కీ కౌశల్, క్రీడాకారులు పీవీ సింధు, భజరంగ్ పునియా, సుశీల్‌కుమార్, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. బ్లాక్ ఫంగస్ ఏంటని వెతుకుతూ.. ఏదైనా అంశం గురించి తెలుసుకునేందుకు వాడే ‘వాట్ ఈజ్’సెర్చ్‌లో గత ఏడాది ‘బ్లాక్ ఫంగస్’టాప్‌లో నిలిచింది. కరోనా రెండో వేవ్ సమయంలో.. బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోవడంతో అదేమిటనే దానిపై జనం గూగుల్‌లో వెతికారు. ఇక గణితానికి సంబంధించి.. ‘వందకు కారకం (ఫ్యాక్టోరియల్ ఆఫ్ హండ్రెడ్)’ఏమిటి? తాలిబాన్ ఏంటి? అఫ్గానిస్తాన్‌లో ఏం జరుగుతోంది? రెమ్‌డెసివిర్ ఏమిటి, నాలుగుకు స్వే్కర్ రూట్ ఏమిటి? స్టెరాయిడ్లు, టూల్‌కిట్, స్క్విడ్‌గేమ్, డెల్టాప్లస్ వేరియంట్ ఏమిటన్న దానిపై నెటిజన్లు సెర్చ్ చేశారు. వార్తల్లో నిలిచినవేంటి? ఎప్పటికప్పుడు జరిగే వార్తాంశాల సెర్చింగ్‌లో గత ఏడాది టోక్యో ఒలింపిక్స్ టాప్‌లో నిలిచింది. బ్లాక్ ఫంగస్, అఫ్గానిస్తాన్ వార్తలు, బెంగాల్ ఎన్నికలు, టౌక్టీ తుఫాను, కరోనా రెండోవేవ్ లాక్డౌన్, సూయజ్ కెనాల్లో నౌక చిక్కకుపోయిన సంక్షోభం, ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళనలు, బర్డ్‌ఫ్లూ వ్యాప్తి, యాస్ తుఫానుకు సం బంధించిన వార్తలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. పాత, కొత్త రుచుల కోసం.. గత ఏడాది లాక్డౌన్ సమయంలో చాలా మంది గూగుల్‌లో వివిధ రకాల వంటలు ఎలా చేయాలనేదానిపై విపరీతంగా సెర్చ్ చేశారు. అందులో పాత, కొత్త రుచుల కలయిక ఉండటం గమనార్హం. ఇనోకి మష్రూమ్ (పుట్టగొడుగుల వంటకం) ఇందులో టాప్‌లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మోదక్, మేతీ మటర్ మలాయి, పాలక్, చికెన్ సూప్, పోర్న్‌స్టార్ మర్తిని (కాక్టెయిల్), లసగ్నా, కుకీస్, మటర్ పనీర్, కడా వంటకాలు నిలిచాయి. -
గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2021: మనోడు కాదు.. అయినా తెగ వెతికారు!
Google Year in Search 2021.. Billionaire Elon Musk was Searched Extensively By Indians: ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సెర్చింజన్ గూగుల్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2021’ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. కరోనా హవాను తట్టుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్.. భారత్‌లో ఓవరాల్ టాప్ సెర్చ్ లిస్ట్‌లో నిలిచింది. ఇక మిగతా జాబితాలోనూ వార్తల్లో నిలిచిన వైవిధ్యమైన అంశాలు, కరోనా సంబంధిత టాపిక్స్ సెర్చ్ ట్రెండ్‌లో టాప్‌లో నిలిచాయి. సాధారణంగా సినీ సెలబ్రిటీలు, ముఖ్యంగా సన్నీ లియోన్, కత్రినా కైఫ్ లాంటి ఫీమేల్ సెలబ్రిటీల గురించి మనోళ్ల వెతుకులాట ఎక్కువగా కొనసాగుతూ వచ్చేది. అయితే ఈ ఏడాది కొంచెం భిన్నంగా Google Year in Search 2021లో భారతీయుల వెతుకులాట కొనసాగింది. ఇక పర్సనాలిటీ లిస్ట్‌లో టోక్యో ఒలింపిక్స్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా టాప్‌లో నిలవగా.. ఈ లిస్ట్‌లో ఒక్కరు తప్ప అంతా మన దేశస్తులే ఉన్నారు. ఆ ఒక్కరు ఎవరో కాదు.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్. 278 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా కొనసాగుతున్నాడు ఎలన్ రీవ్ మస్క్. ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడిగా, టెస్లా సీఈవోగా కొనసాగుతున్న ఎలన్ మస్క్.. ఇండియన్ గూగుల్ ఇన్ సెర్చ్ 2021 లిస్ట్‌లో ఐదవ స్థానంలో నిలిచాడు. భారత్‌లో టెస్లా ఈవీ ఎంట్రీ ప్రయత్నాలు, స్పేస్ఎక్స్కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కంపెనీ ‘స్టార్‌లింక్’ కనెక్షన్ ఇచ్చే ప్రయత్నాలతో పాటు స్పేస్ఎక్స్ ప్రయోగాలు, పలు అంతర్జాతీయ పరిణామాల్లో జోక్యం కారణంగా ఎలన్ మస్క్ గురించి ఎక్కువగా వెతికారు భారతీయులు. క్లిక్: లక్ష కోట్లకుపైగా నష్టం.. అయినా ‘అయ్యగారే’ నెంబర్ 1! మరోవైపు పోటీదారు కంపెనీలపై చేసే వెకిలి కామెంట్లు.. ఇచ్చే ప్రకటనలు, క్రిప్టో కరెన్సీ మీద తన వైఖరి, టెస్లాలో షేర్ల అమ్మకం, సోషల్ మీడియాలో ఆరున్నర కోట్ల మంది ఫాలోవర్స్.. వెరసి ఎలన్ మస్క్ గురించి భారతీయుల్లో ఒకరకమైన ఆసక్తిని కలగజేసింది. ఇంకోవైపు వ్యక్తిగత అంశాలతోనూ 50 ఏళ్ల ఎలన్ మస్క్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఊహకందని చేష్టలతో ‘థగ్ లైఫ్’ పర్సనాలిటీగా ఎలన్ మస్క్‌కి భారతీయ యువతలోనూ మాంచి క్రేజ్ దక్కింది. అంతేకాదు ఆనంద్ మహీంద్రా లాంటి వ్యాపార దిగ్గజాలు సైతం ఎలన్ మస్క్ వ్యవహారాల్ని నిశితంగా పరిశీలిస్తూ.. అప్పుడప్పుడు స్పందిస్తుంటారు కూడా. చదవండి: రాజకీయాల నుంచి ''ఆ ముసలోళ్లను ఎలిమినేట్ చేయండి సార్''..! -
2020లో ఐపీఎల్ టాప్, ఎలాగంటే..
సాక్షి, అమరావతి : మన దేశంలో కోవిడ్ మహమ్మారిపైనా క్రికెట్ ఆధిపత్యం సాధించింది. కోవిడ్ వైరస్ నిలువెల్లా వణికించిన తరుణంలోనూ గూగుల్‌లో అత్యధిక శాతం మంది క్రికెట్‌పైనే ఆసక్తి చూపించారు. 2020లో గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన అంశంగా ఐపీఎల్ నిలిచింది. దాని తర్వాతే కరోనా వైరస్ గురించి జనం వెతికారు. ఈ రెండింటి తర్వాత అమెరికా ఎన్నికలు, పీఎం కిసాన్ యోజన, బిహార్ ఎన్నికల అంశాలు వరుసగా మూడు, నాలుగు, ఐదవ స్థానాల్లో ఉన్నాయి. 2020లో ఎక్కువ మంది వెతికిన అంశాల జాబితాను గూగుల్ ఇటీవల విడుదల చేసింది. త్రిపుర రాష్ట్రంలో అత్యధికంగా ఐపీఎల్ క్రికెట్ గురించి సెర్చ్ చేయగా, మన రాష్ట్రంలో 41 శాతం మంది మాత్రమే దీని ఆరా తీశారు. తెలంగాణలో మన కంటె ఒక్క శాతం ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఏపీలో ఈ అంశంపై విశాఖపట్నం, భీమవరం, చిత్తూరు నుంచి అత్యధికంగా.. నంద్యాల, అనంతపురంలో అతి తక్కువగా శోధించారు. కరోనాపై హిందూపూర్, చిత్తూరులో ఎక్కువ ఆసక్తి కరోనా వైరస్ గురించి గోవా, జమ్మూ–కశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల్లో 90 శాతం మంది సెర్చ్ చేయగా, మన రాష్ట్రంలో 42 శాతం, తెలంగాణలో 54 శాతం సెర్చ్ చేశారు. మన రాష్ట్రంలో ఈ అంశాన్ని హిందూపూర్, శ్రీకాకుళం, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువ మంది సెర్చ్ చేయగా.. విశాఖ, విజయవాడ ప్రాంతాల్లో చాలా తక్కువ మంది సెర్చ్ చేయడం గమనార్హం. కేరళలో అతి తక్కువగా 30 శాతం మంది మాత్రమే దీని గురించి వెతికారు. (చదవండి: అదే టీమిండియా కొంపముంచింది..) మన చూపంతా అమెరికా ఎన్నికలపైనే అమెరికా ఎన్నికల గురించి మన రాష్ట్రంలో 38 శాతం మంది, తెలంగాణలో 42 శాతం మంది సెర్చ్ చేయడం విశేషం. ఐపీఎల్, కరోనా అంశాల సెర్చింగ్‌లో 20వ స్థానంలో ఉన్న ఏపీ ఈ అంశంలో నాలుగో స్థానంలో ఉండడం విశేషం. ఆశ్చర్యకరంగా పీఎం కిసాన్ యోజన ఈ సంవత్సరం టాప్ సెర్చింగ్ జాబితాలో ఉంది. దీన్ని బట్టి రైతుల అంశం ప్రజల్లో విస్తృతంగా నానుతున్నట్లు స్పష్టమైంది. ప్రముఖ వ్యక్తుల్లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, టీవీ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, అమితాబ్, కమలా హారిస్ గురించిన సమాచారం కోసం ఎక్కువ మంది వెతికారు. ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన దిల్ బేచారాను ఎక్కువ మంది సెర్చ్ చేశారు. తమిళ సినిమా సూరారై పొట్రు, బాలీవుడ్ సినిమాలు తన్హజి, శకుంతలాదేవి గురించి ఆ తర్వాత అన్వేషించారు. టీవీ, వెబ్ సిరీస్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన క్రైం డ్రామా మనీ హీస్ట్ గురించి ఎక్కువ మంది అన్వేషించారు. స్కామ్‌స్టర్ హర్షద్ మెహతా స్టోరీ, హిందీ బిగ్‌బాస్–14 గురించి ఆ తర్వాత ఎక్కువగా వెతికారు. (చదవండి: ఒలింపిక్స్‌కు మళ్లీ ఎంత కష్టమొచ్చే..!) తాజా పరిణామాలపై ఇలా.. వార్తలకు సంబంధించి నిర్భయ కేసు, లాక్డౌన్స్, ఇండియా–చైనా సరిహద్దు పరిణామాలు, మిడతల దండు, రామ మందిరం సమాచారం కోసం ఎక్కువ మంది సెర్చ్ చేశారు. లాక్డౌన్ కారణంలో ఇళ్లల్లోనే ఉండిపోయిన జనం పన్నీర్ ఎలా తయారు చేయాలనే దానిపై గూగుల్‌లో ఎక్కువగా వెతికారు. ఆ తర్వాత ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి, పాన్–ఆధార్‌కార్డు ఎలా లింక్ చేసుకోవాలి, ఇంట్లోనే శానిటైజర్ ఎలా తయారు చేసుకోవాలి వంటి వాటి గురించి అన్వేషించారు. కరోనా వైరస్ అంటే ఏమిటి (వాట్ ఈజ్) అనే దాని గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారు. అలాగే సోషల్ మీడియా ట్రెండ్ అయిన బినాడ్ గురించి, ప్లాస్మా థెరపీ గురించి వెతికారు. స్థానికంగా తమ ఇళ్లకు ఏవి దగ్గరగా ఉన్నాయో తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్‌లో అన్వేషించారు. దగ్గరలోని ఫుడ్ షెల్టర్స్ గురించి అత్యధికులు అన్వేషించారు. దగ్గరలో కోవిడ్ టెస్ట్, మద్యం షాపు గురించి జనం వెతికారు. క్రికెట్‌పైనా జనం ఆసక్తి మన దేశంలో క్రికెట్‌కు సంబంధించిన అంశాలపైనే జనం ఆసక్తి చూపుతారు. ఏ సంవత్సరమైనా క్రికెట్‌పైనే మన వాళ్లకు ఆసక్తి ఎక్కువ అని ఈ ట్రెండ్స్‌ని బట్టి అర్థమవుతోంది. విద్యా సంబంధిత అంశాలు, ఓటీటీ ప్లాట్‌ఫాంలు, రాజకీయ అంశాలు, ఎన్నికల గురించి తెలుసుకునేందుకు కూడా మన రాష్ట్ర ప్రజలు ఉత్సుకత ప్రదర్శిస్తారు. – శ్రీ తిరుమల, డిజిటల్ మార్కెటింగ్ నిపుణుడు, విజయవాడ -
పాకిస్తానీయులు ఎక్కువగా వెతికింది వీరి కోసమే!
ఇస్లామాబాద్: ఈ ఏడాదిగానూ పాకిస్తానీయులు గూగుల్‌లో అత్యధికంగా వెదికిన వ్యక్తుల జాబితాలో భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్ధమాన్, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌లు టాప్-10లో నిలిచారు. పాకిస్తాన్లో అత్యధిక మంది వీరికి సంబంధించిన సమాచారం గురించే వెదికినట్లు సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ పేర్కొంది. అదే విధంగా ఇండియన్ టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్- 13, మోటూ పాట్లూ షోపై కూడా వారు అత్యంత ఆసక్తిని కనబరిచారని వెల్లడించింది. కాగా పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాక్ విమానాన్ని వెంబడిస్తూ అక్కడి భూభాగంలో దిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాల అనంతరం జెనీవా ఒప్పందం ప్రకారం ఆయన భారత్‌కు చేరుకున్నారు. శత్రు సైన్యం చిత్రహింసలకు గురిచేసినా రహస్య సమాచారం వారికి ఇవ్వకుండా ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత్‌తో పాటు పాక్ మీడియా కూడా వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. ఇక సారా అలీఖాన్.. పటౌడీ వంశ వారసురాలు, బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు అన్న సంగతి తెలిసిందే. కేదార్నాథ్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన సారా.. తొలి సినిమాతోనే నటిగా గుర్తింపు పొందారు. అదే విధంగా వివిధ కార్యక్రమాల్లో తన కట్టూబొట్టుతో ఫ్యాషన్ ఐకాన్‌గా యువతలో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ నంబర్.1’ సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా భారతీయులు ఆర్టికల్ 370, అయోధ్య కేసు, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అంటే ఏమిటి తదితర అంశాల గురించి అత్యధికంగా వెదికినట్లు గూగుల్ ఇండియా తెలిపిన విషయం తెలిసిందే.(మనోళ్లు గూగుల్‌ను ఏమడిగారో తెలుసా?) -
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌పై పాకిస్తానీల ఆసక్తి!
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు జరిపిన విషయం తెలిసిందే. సర్జికల్ స్ట్రయిక్-2తో భారత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. పాక్ మాత్రం ప్రతీకార దాడులు జరుపుతామని హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మంగళవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి గూగుల్‌లో Indian Air Force, Pakistan Air Force, Balakot, surgical strike and LoC కీవర్డ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. పాకిస్తానీలు మాత్రం ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ కన్నా భారత వాయుసేనపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ విషయం గూగుల్ ట్రెండ్స్‌లో స్పష్టమైంది. భారత్‌లో surgical strike కీ వర్డ్ ఎక్కువగా ట్రెండ్ అవ్వగా.. పాక్‌లో 'Balakot' కీ వర్డ్ ట్రెండ్ అయింది. అయితే భారత్ కన్నా ముందే ఈ దాడికి సంబంధించిన కీవర్డ్స్ పాక్‌లో ట్రెండ్ అవ్వడం గమనార్హం. పాక్‌లో 7.40 గంటలకు ఈ కీవర్డ్స్ ట్రెండ్ ప్రారంభమవ్వగా.. భారత్‌లో 8.50 గంటలకు ప్రారంభమైంది. ఇక 10 గంటల సమయం వరకు పాక్‌లో 'Balakot' కీ వర్డ్ పీక్స్‌కు వెళ్లగా.. భారత్‌లో surgical strike కీవర్డ్ దూసుకెళ్లింది. ట్విటర్లో సైతం #surgicalstrike ట్యాగ్ హల్చల్ చేసింది. గూగుల్‌లో 'Pakistan Army', 'Pakistan Air Force', 'Indian Air Force' 'Indian Army' కీవర్డ్స్ సెర్చ్‌ని పరిశీలించగా.. పాకిస్తానీయులు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కన్నా.. భారత ఎయిర్ ఫోర్స్ కీ వర్డ్నే ఎక్కువగా సెర్చ్ చేశారు. -
కాంగ్రెస్ నుంచి ఆయనే టాప్..
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ నెటిజన్లు ఎక్కువగా ఏయే విషయాలపై గూగుల్‌లో వెతుకులాట సాగిస్తున్నారో తెలిసిపోయింది. తాజాగా విడుదలైన గూగుల్ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే.. గత 90 రోజులుగా తెలంగాణలోని చాలా మంది నెటిజన్లు ‘2018 తెలంగాణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు’ అనే విషయంపై ఎక్కువగా వెతుకులాట సాగిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలు, నేతల గురించి కూడా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్టు తేలింది. సెప్టెంబర్ 6వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి గూగుల్‌లో ‘టీఆర్ఎస్’ కోసం ఎక్కువ వెతుకులాట సాగింది. ఆ తర్వాత నవంబర్ 1వ తేదీ వచ్చేసరికి కాంగ్రెస్, టీఆర్ఎస్ కోసం నెటింట్లో వెతికేవారి సంఖ్య సమానంగా ఉంది. కాగా, గత 20 రోజులుగా మాత్రం నెటిజన్లు టీఆర్ఎస్ కన్నా ఎక్కువగా కాంగ్రెస్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి నెటింట్లో కాంగ్రెస్ కోసం వెతికే వారి సంఖ్య పెరిగింది. అలాగే మహాకూటమి కోసం వెతికేవారి సంఖ్యలో కూడా పెరుగుదల నమోదయింది. నేతల విషయానికి వస్తే.. కేసీఆర్ గురించి ఎక్కువగా శోధన జరుగుతుండగా, ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కన్నా రేవంత్‌కు హిట్స్ ఎక్కువగా ఉన్నాయి. కేసీఆర్ కోసం వెతికేవారిలో.. ఆయన సభలు, స్పీచ్‌లు, కేసీఆర్ మెడికల్ కిట్స్ మీద ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కోసం వెతికేవారిలో.. చాలా మంది ఆయన ఫోన్ నంబర్, వాట్సప్ నంబర్ కోసం సెర్చ్ చేస్తున్నారు. రేవంత్ నియోజకవర్గం, ఫ్యామిలీ ఫొటోస్ కోసం నెటిజన్లు ఎక్కువగా శోధిస్తున్నారు. భారత్ వెలుపల.. యూఏఈ, సౌదీ అరేబియా, యూఎస్, సింగపూర్లలో తెలంగాణ ఎన్నికల గురించి ఎక్కువగా సెర్చ్ జరుగుతుంది. అలాగే నెటిజన్లు ఏపీ సీఎం చంద్రబాబు కన్నా ఎక్కువగా కేసీఆర్ కోసమే గూగుల్‌లో అధికంగా శోధిస్తున్నారని తేలింది. -
గూగుల్ సెర్చ్‌లో టాప్ నాయకుడు ఎవరో తెలుసా?
-
గూగుల్ సెర్చ్‌లో టాప్ నాయకుడు ఎవరో తెలుసా?
రాష్ట్రంలో అత్యధికంగా నెటిజన్లు ఎవరికోసం సెర్చ్ చేశారో తెలుసా.. ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించే. పెద్దపెద్ద నాయకులందరినీ పక్కన పెట్టి మరీ జగన్ విశేషాల గురించి తెలుసుకోడానికి నెటిజన్లు ఆసక్తి చూపించారు. మరో రెండేళ్లలో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. గూగుల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయని పరిశీలించగా ఈ విషయం తేలినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. గడిచిన 90 రోజులలో గూగుల్ ట్రెండ్స్ సమాచారాన్ని సేకరించి వాటిని సగటున చూడగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో సమానంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపులారిటీ పెరిగినట్లు గూగుల్ తెలిపింది. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాత్రం అసలు పెద్దగా నెటిజన్లు పట్టించుకోవడం లేదు. వాళ్లిద్దరికీ చాలా తక్కువ సంఖ్యలోనే సెర్చ్‌లు వచ్చాయట. మోదీ గురించి సెర్చ్ చేసినవారిలో సగం మంది, కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేసినవారిలో మూడింట రెండొంతుల మంది ఏపీ నుంచి జగన్ కోసం సెర్చ్ చేశారు. విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో అయితే రాష్ట్ర నాయకుల కంటే జాతీయ స్థాయి నాయకుల గురించే ఎక్కువగా సెర్చ్ చేయడం గమనార్హం. అలాగే హైదరాబాద్‌లో కూడా ఎక్కువమంది నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్ గురించి సెర్చ్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఫేస్బుక్ పేజీకి 10 నెలల్లోనే 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ విషయాన్ని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. -
చంద్రబాబు కంటే.. కేసీఆరే ఎక్కువ పాపులర్!!
రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. తెలంగాణకు కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు. కానీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ పాపులర్? 2004 నుంచి 2014 వరకు.. అంటే పదేళ్ల కాలం పాటు ఎవరి గురించి ఎక్కువగా గూగుల్ సెర్చింజన్లో జనం వెతికారు.. అన్నింటికీ సమాధానం ఒక్కటే.. అదే కేసీఆర్! అవును.. ఇద్దరు ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు కంటే కేసీఆర్ చాలా ఎక్కువ పాపులర్ అని, ఆయన కోసం తమ సెర్చింజన్లో విపరీతంగా గాలించారని గూగుల్ ట్రెండ్స్ తెలిపింది. వాస్తవానికి టెక్నాలజీని ఎక్కువగా వాడుకోవడంలో కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు చాలా ముందుంటారు. కానీ ఆయన కోసం వెతికేవాళ్లు మాత్రం తక్కువని గూగులమ్మే చెబుతోంది. అయితే.. మళ్లీ మొత్తమ్మీద చూసుకుంటే మాత్రం రాజకీయ నాయకుల్లో అగ్రస్థానం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కింది. ఆయనతో పోల్చినప్పుడు కేసీఆర్ కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్నారు. -
నెటిజన్లు మెచ్చిన నాయకుడు.. జగన్!!
జగన్.. జగన్.. జగన్.. నెటిజన్లు చేస్తున్న నామజపమిది!! అవును.. మన రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చూసినా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న పేరు ఎవరిదో కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డిదే!! కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్.. ఇలాంటి నాయకులందరినీ తలదన్ని జగన్ మోహనరెడ్డి ముందంజలో నిలిచారు. 2009 జనవరి నుంచి 2013 సెప్టెంబర్ వరకు 'గూగుల్ ట్రెండ్స్'ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. జగన్, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్.. ఈ నలుగురు నాయకులలో భారతదేశంలో ఉన్న నెటిజన్లు ఎక్కువగా ఎవరిపేరు సెర్చ్ చేస్తున్నారో చూస్తే, అందరి కంటే ఎక్కువగా జగన్ కోసమే సెర్చ్ చేశారు. సగటున చూసుకుంటే జగన్ కోసం 23% మంది, కిరణ్ కుమార్ రెడ్డి కోసం 0% మంది, చంద్రబాబు నాయుడు కోసం 1% మంది, కేసీఆర్ కోసం 13% మంది సెర్చ్ చేసినట్లు గూగుల్ ట్రెండ్స్‌లో స్పష్టమైంది. జాతీయ పత్రికలు కూడా ఈ విషయాన్ని పతాక శీర్షికలతో ప్రధాన కథనాలలో ప్రచురించాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన నాటినుంచి జగన్‌కు సంబంధించిన కథనాలు, చిత్రాల కోసం నెటిజన్లు ఇంటర్నెట్ను విపరీతంగా గాలించారు. ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, కొత్తగా పార్టీ ఏర్పాటు... ఇవన్నీ నెటిజన్ల హాట్ ఫేవరెట్లే అయ్యాయి. ఇక తాజాగా 484 రోజుల జైలు జీవితం నుంచి జనజీవితంలోకి జగన్ అడుగుపెట్టగానే ఒక్కసారిగా వెబ్సైట్ల మీద నెటిజన్లు దాడి చేసినంత పనిచేశారు. ఒకేసారి వేల సంఖ్యలో జగన్ విడుదలకు సంబంధించిన కథనాలు, చిత్రాలు, వీడియోలను వీక్షించారు.