చంద్రబాబు కంటే.. కేసీఆరే ఎక్కువ పాపులర్!!
రెండు తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు. తెలంగాణకు కేసీఆర్, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు. కానీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ పాపులర్? 2004 నుంచి 2014 వరకు.. అంటే పదేళ్ల కాలం పాటు ఎవరి గురించి ఎక్కువగా గూగుల్ సెర్చింజన్లో జనం వెతికారు.. అన్నింటికీ సమాధానం ఒక్కటే.. అదే కేసీఆర్! అవును.. ఇద్దరు ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు కంటే కేసీఆర్ చాలా ఎక్కువ పాపులర్ అని, ఆయన కోసం తమ సెర్చింజన్లో విపరీతంగా గాలించారని గూగుల్ ట్రెండ్స్ తెలిపింది.
వాస్తవానికి టెక్నాలజీని ఎక్కువగా వాడుకోవడంలో కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు చాలా ముందుంటారు. కానీ ఆయన కోసం వెతికేవాళ్లు మాత్రం తక్కువని గూగులమ్మే చెబుతోంది. అయితే.. మళ్లీ మొత్తమ్మీద చూసుకుంటే మాత్రం రాజకీయ నాయకుల్లో అగ్రస్థానం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కింది. ఆయనతో పోల్చినప్పుడు కేసీఆర్ కొన్ని వందల మైళ్ల దూరంలో ఉన్నారు.