1/11
సోషల్ మీడియా ఆ మహిళను ప్రపంచానికి పరిచయం చేసింది. అంతకుముందు తాను ఎవరో కూడా చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆమె సెలబ్రిటీ కాదు.. రాజకీయ నాయకురాలు అంత కన్నా కాదు.
2/11
ఆమె ఓ సాధారణ మహిళ. పొట్టికూటి కోసం రోడ్డు వెంట చిన్న చితకా వస్తువులు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఇప్పుడేమో ఆ మహిళ ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంది.
3/11
ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేసింది. అంతేకాదు బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టిసిందేనే వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటో తెలుసుకుందాం.
4/11
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహకుంభ్ మేళా మోనాలిసా అనే మహిళకు ఒక్కసారిగా ఫేమ్ తీసుకొచ్చింది. ఆమెను ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. దానికి కారణం ఆమె కళ్లు.
5/11
తేనేలాంటి కళ్లతో మహాకుంభ్ మేళాలో పూసల దండలు విక్రయిస్తున్న మోనాలిసా అనే మహిళను ఓ భక్తుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ తర్వాత అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.
6/11
ఏ సోషల్ మీడియా చూసిన ఆమె వీడియోలే దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోనాలిసా పేరు వైరల్ కావడంతో ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఆమెకు ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఏకంగా సినిమా ఛాన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాడు.
7/11
మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటున్న మోనాలిసా భోస్లే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన అమ్మాయి. వారి కుటుంబం పూసలు దండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నది. తన తమ్ముడిని చదివించేందుకు ఈ పని చేస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో అందరి కళ్లను తనవైపు తిప్పుకుంది ఈ తేనేకళ్ల సుందరి మోనాలిసా.
8/11
ఆమెను చూసిన ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన మూవీలో ఛాన్స్ ఇస్తానని ప్రకటించాడు.
9/11
దీనికి కారణం ఆమెకున్న స్పెషల్ అట్రాక్షన్ కళ్లు. ఆ అందమైన కళ్లతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
10/11
తన సినిమాలో అమ్మాయి కోసం వెతుకున్న బాలీవుడ్ డైరెక్టర్‌కు మోనాలిసా గురించి తెలిసింది. డైరీ ఆఫ్ మణిపూర్ మూవీలో ఆమెకు అవకాశమివ్వనున్నట్లు సనోజ్ మిశ్రా తెలిపారు.
11/11
ఆమెకు తన సినిమాలో ఓ రైతుకు బిడ్డగా నటించే పాత్ర ఇస్తానని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియా వల్ల ఓవర్‌నైట్ స్టార్ అయిన మోనాలిసా ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.