monalisa
-
పేడను ఒళ్లంతా రుద్దుకున్న నటి
భోజ్‌పురి సెన్సేషన్, బిగ్‌బాస్ 10 కంటెస్టెంట్ మోనాలిసాకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. తన ఫొటోలు, డ్యాన్స్ వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుందీ నటి. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఇందులో ఆమె తన శరీరం మొత్తానికి ఆవుపేడ పూసుకుంది. ముఖంతో సహా బాడీ అంతటికీ పేడను దట్టంగా పట్టించింది. అయితే పేడ రుద్దడంతో ఆమెకు దురద మొదలవగా దాన్ని భరించలేక మెలికలు తిరిగిపోయింది. ఇక ఇది చూసిన నెటిజన్లు.. ఇదేదో కామెడీ షోలో యాక్టింగ్ చేసినట్లుగా ఉందంటూ ఛలోక్తులు విసురుతున్నారు. కాగా బిగ్‌బాస్‌తో పాటు నాచ్ బలియే డ్యాన్స్ షోలో పాల్గొన్న మోనాలిసా.. ఇటీవల స్మార్ట్ జోడీ అనే షోలో తన భర్త విక్రాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి పాల్గొంది. ఈ షోలో ఆమె మాట్లాడుతూ.. వెండితెరపై తాను పోషించిన పాత్రలు చూసి జనాలు తనను అసహ్యించుకునేవారని తెలిపింది. ఇదిలా ఉంటే ఆమె రాత్రి కే యాత్రి 2 అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇది త్వరలో హంగామా ప్లే అనే ఓటీటీలో ప్రసారం కానుంది. చదవండి: వాళ్లిద్దరూ నా షోలో ఎప్పటికీ అడుగు పెట్టరు మళ్లీ పెళ్లి చేసుకోనున్న మేఘనా సర్జా? -
షాకింగ్ ఘటన: మోనాలిసా పెయింటింగ్ ధ్వంసానికి యత్నం!
ప్యారిస్: సుప్రసిద్ధ కళాకృతి, ప్రపంచంలోనే పాపులర్ పెయింటింగ్ మోనాలిసాను ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. కళా ప్రియులు, సందర్శకుల సమక్షంలోనే ఇది జరగడం గమనార్హం. వృద్ధురాలి గెటప్‌లో వీల్‌చైర్‌లో సందర్శనకు వచ్చిన ఓ యువకుడు ఈ దాడికి పాల్పడ్డాడు. వీల్‌చైర్ నుంచి ఒక్కసారిగా బయటకు దూకి.. పెయింటింగ్ వైపు దూసుకెళ్లాడు. ఆపై కేక్‌ను పెయిటింగ్ మీదకు విసిరికొట్టాడు. అంతటితో ఆగకుండా మళ్లీ పెయింటింగ్ దగ్గరగా దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డులు అతన్ని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. అయితే పెయింటింగ్ మీద ఉన్న గ్లాస్‌కు ఆ కేక్ అంటడంతో పెయింటింగ్‌కు ఎలాంటి డ్యామేజ్ కాలేదు. సుప్రసిద్ధ చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ గీసిన ఈ పెయింటింగ్.. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది. ప్రస్తుతం దాడి వీడియో వైరల్ అవుతోంది. దాడికి పాల్పడిన వ్యక్తి పర్యావరణవేత్తగా తెలుస్తోంది. ఈ భూమిని కొందరు నాశనం చేయాలనుకుంటున్నారు అంటూ ఫ్రెంచ్‌లో అతను నినాదాలు చేయడం విశేషం. Can anybody translate what ole dude was saying as they where escorting him out?😂 pic.twitter.com/Uy2taZ4ZMm — Lukeee🧃 (@lukeXC2002) May 29, 2022 అతను పెయింటింగ్ ధ్వంసం కోసమే యత్నించాడా? లేదంటే కేక్ పూయడం ద్వారా నిరసన తెలపాలనుకున్నాడా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సెక్యూరిటీ కళ్లు గప్పి అసలు కేకును అతను లోపలికి ఎలా తీసుకెళ్లడన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇదిలా ఉంటే.. మోనాలిసా పెయింటింగ్ ఇలా దాడులకు లక్ష్యంగా మారడం ఇదేం కొత్త కాదు. 1956లో ఓ ఆగంతకుడి సల్ఫ్యూరిక్ యాసిడ్ దాడిలో పెయింటింగ్ కింది భాగంగా.. బాగా డ్యామేజ్ అయ్యింది కూడా. అప్పటి నుంచి బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాసులో ఆ పెయింటింగ్‌ను భద్రపరిచారు. -
Viral Video : చీరకట్టులో గుర్రపు స్వారీ
వెబ్‌డెస్క్: ఒడిషాకు చెందిన మోనాలీసా ఇప్పుడు యూట్యూబ్ సంచలనంగా మారింది. యూట్యూబర్‌గా ఆమె చేస్తున్న వీడియోలు మిలియన్ల కొద్ది వ్యూస్ సాధిస్తున్నాయి. వెబ్ దునియాలో దుమ్మురేపుతున్నాయి. ఇంతగా ఆమె వీడియోలు సంచనలం కావడానికి కారణం, అందులోని ప్రత్యేకతలు ఏంటో ఓ సారి చూద్దాం.. యూట్యూబర్ యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా మంది సొంత ఛానళ్లు స్టార్ చేసి వీడియోలు చేస్తున్నారు. అయితే ఇందులో యూనిక్ పాయింట్ ఉన్న ఛానళ్లే నిలదొక్కుకుంటున్నాయి. మోనాలీసా వీడియోల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సంప్రదాయం. అవును సంప్రదాయ దుస్తుల్లో ఆల్మెస్ట్ అడ్వెంచరస్ పనులు చేస్తూ.. వాటిని తన యూట్యూబ్‌లో పెడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఒడిషా సంప్రదయా పద్దతిలో చీర కట్టి , బొట్టు పెట్టి సాధారణ మహిళలా కనిపిస్తూ... ఆమె రూపొందిస్తున్న వీడియోల్లోని కొత్తదనం ఆకట్టుకుంటోంది. దీంతో మామూలు గృహిణి స్థాయి నుంచి యూట్యూబ్ స్టార్‌గా ఆమె ఎదిగింది. సంప్రదాయ సాధికారత ఒడిషాలోని జాజ్‌పూర్ జిల్లా జాహర్ మోనాలీసా సొంతూరు. ఆమె భర్త బద్రి నారాయణ్ భద్ర క్రియేటివ్ వర్కర్. భర్త ప్రోత్సాహంతో సొంత యూట్యూబ్ ఛానల్‌ని 2016లో ప్రారంభించింది. సంప్రదాయ చీరకట్టులో గుర్రపుస్వారీ చేస్తూ ఆమె అప్లోడ్ చేసిన వీడియోకు నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. ఆమె గుర్రపు స్వారీ వీడియోను మహిళా సాధికారతకు చిహ్నాలైన ? లక్ష్మీబాయి, రాణి రుద్రమ, రజియా సుల్తానాలను గుర్తుకు తెచ్చింది. క్లాసిక్ అడ్వెంచర్ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది మోనాలీసా. ముఖ్యంగా సంప్రదాయ చీరకట్టులోనే ఆమె చేసిన ట్రాక్టర్‌తో పొలం దున్నే వీడియో, ట్రక్ డ్రైవింగ్, బుల్లెట్ డ్రైవింగ్, వోల్వో బస్ డ్రైవింగ్ వీడియోలు లక్షల కొద్ది వ్యూస్ సాధించాయి. క్లాసిక్ ప్లస్ అడ్వెంచర్ ఫ్యూజన్‌గా నెటిజన్లకు తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆమె ఛానల్‌కి 22 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉండగా నెలకు రూ. 1.5 లక్షలు సంపాదిస్త్నుట్లు సమాచారం. వివక్ష రూపుమాపాలనే - మోనాలీసా మహిళలపై సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపాలన్నదే నా లక్క్ష్యం. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తారని చెప్పాలనుకున్నాను. సంప్రదాయబద్ధంగా ఉంటూనే గుర్రపుస్వారీ చేయడంతో పాటు వివిధ వాహనాలను డ్రైవ్ చేయోచ్చని నిరూపించాను. నా ప్రయత్నాలకు నా భర్త సహకారం తోడవటంతో యూట్యూబర్‌గా మారాను. -
చీరకట్టులోనే యాక్షన్ ఫీట్
-
చీరకట్టులోనే యాక్షన్ ఫీట్
సినిమావాళ్లు మాత్రమే యాక్షన్ సీన్స్, సాహస ఫీట్లు చేస్తారనుకుంటారు చాలామంది. కానీ, వారికి ఏ మాత్రం తీసిపోకుండా బుల్లితెర మీద వస్తున్న యాక్షన్ సీన్లకు కొదవే లేదు. పలు సీరియల్స్, షోలలో సినీ నటులను మించి మరీ బుల్లితెర యాక్టర్లు సాహసాలకు పూనుకుంటున్నారు. దీనికి బుల్లితెర నటి మోనాలిసాను ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ భామ ‘నజర్’ అనే సీరియల్లో దయాన్ అనే నెగెటివ్ పాత్రను పోషిస్తోంది. ఇందులో ఆమెకు అశేష శక్తులు ఉంటాయి. పాత్రకు అనుగుణంగా ఆమె ఓ సాహస ఫీట్ చేయాల్సి వచ్చింది. దీనికి క్షణం కూడా ఆలోచించకుండా సరేనంటూ చీరకట్టులోనే యాక్షన్ సీన్‌కు రెడీ అయింది. అందులో భాగంగా తాడును పట్టుకుని పైకి ఎక్కుతూ చివరగా చెట్టు కొమ్మపై నిల్చుంది. ఇప్పుడు అసలైన యాక్షన్ సీన్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన వీడియోను మోనాలిసా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీనికి ఆమె భర్త విక్రాంత్ సింగ్ ‘నిన్ను చూసి గర్వపడుతున్నాను’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మోనాలిసా పని పట్ల చూపిస్తున్న అంకితభావానికి ముగ్ధులైన అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో బిగ్‌బాస్ 10లో తళుక్కున మెరిసిన మోనాలిసా ఈ ఒక్క షోతో కావాల్సినంత పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ కనిపించింది. 2016లో ప్రియుడు విక్రాంత్ సింగ్‌ను వివాహం చేసుకుంది. -
దుమ్మురేపుతున్న మోనాలిసా డ్యాన్స్ వీడియో
బిగ్‌బాస్ 10తో వెలుగులోకి వచ్చిన భోజ్‌పూరీ నటి మోనాలిసా సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటారు. తన అభిమానులను నిరాశపరచకుండా తరచూ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటారు. కామెడీ వీడియోలు లేదా తన వ్యక్తిగత వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తారు. తాజాగా ఆమె డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్ పాపులర్ సాంగ్ ‘ కాలా చష్మా’ కు తనదైన స్టైల్లో స్టెప్పులేశారు. తన కోస్టార్ నాజర్‌తో కలిసి మోనాలిసా వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
హోరెత్తించిన మోనాలిసా.. వైరల్ వీడియో..
బిగ్‌బాస్ 10తో వెలుగులోకి వచ్చిన భోజ్‌పూరీ నటి మోనాలిసా సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస పోస్ట్‌లతో ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన ‘లంబా టికేజీ’ పాటకు మోనాలిసా దుమ్మురేపే స్టెప్పులేశారు. మోనాలిసా డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బిగ్‌బాస్ 10లో మోనాలిసా డ్యాన్స్‌ను హోస్ట్ సల్మాన్ ఖాన్ పలుమార్లు తెగ మెచ్చేసుకున్నారు. అయితే, మోనాలిసా గురించి కొందరికి మాత్రమే తెలుసు. ఆమె ఇప్పటివరకూ 300 చిత్రాల్లో నటించారు. భోజ్‌పూరీ నటీమణుల్లో అత్యధిక రెమ్యునరైజేషన్ తీసుకునే వారిలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం దుపూర్ థాకుర్పొ 2 వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. -
స్టాంపుల్లో మోనాలిసా..!
న్యూయార్క్: స్టాంపుల ప్రపంచంలో ‘మోనాలిసా’గా అభివర్ణించే ఒక సెంటు విలువ(సుమారు 60 పైసలు) అయిన ఈ బ్రిటిష్ గయానా పోస్టల్ స్టాంపు.. వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి ప్రపంచంలోనే అతి ఖరీదైన స్టాంప్‌గా రికార్డు సృష్టించింది. 1856 నాటి ఈ స్టాంపును న్యూయార్క్‌లో సోత్‌బైస్ సంస్థ వేలం వేయగా.. రూ.59 కోట్ల ధర పలికింది. అలాగే సైజు పరంగా ప్రపంచంలోనే అతివిలువైన వస్తువుగా కూడా ఇది రికార్డు సృష్టించింది. అన్నట్టూ.. దీని అసలు ముఖ విలువతో పోలిస్తే.. ఇది అమ్ముడుపోయిన ధర ఎన్ని రెట్లు ఎక్కువో తెలుసా..? జస్ట్ వంద కోట్ల రెట్లు మాత్రమే!