
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో 'మోనాలిసా'(16) అనే యువతి అకస్మాత్తుగా రాత్రికి రాత్రి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అతిసాధారణ యువతి తన సహజ సౌందర్యంతో అందరినీ కట్టిపడేసింది. దీంతో రెండు మూడ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫోటోలు, రీల్స్ పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమెతో ఫోటోలు దిగాలిని, దగ్గరగా చూడాలని చాలామంది ఎగబడుతున్నారు. కనీసం మెనాలిసా అన్నం తినేందుకు కూడా అవకాశం లేకుండా అక్కడి వారు చేస్తుండటంతో ఆమె తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు.
రుద్రాక్షలు, పూసలు అమ్ముకుందామని మహా కుంభమేళాకు మెనాలిసా కుటుంబం వచ్చింది. ఇప్పుడు ఆమె అందమే తన కుటుంబాన్ని ఇబ్బందుల్లో పడేసింది. వారి వ్యాపారాన్ని పక్కన పెట్టేసి కూతురుని కాపాడుకునే పనిలో తండ్రి ఉన్నాడు. దీంతో ఆమెను తమ స్వస్థలం అయిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు పంపించారు. ఇదే విషయాన్ని తాజాగా ఆమె ఒక వీడియో ద్వారా ఇలా పంచుకుంది.

'రుద్రాక్షలు, పూసల దండలు అమ్మేందుకే ఇక్కడకు వచ్చాను, నా వల్ల మహా కుంభమేళాలో కాస్త అసౌకర్య వాతావరణం నెలకొంది. ఆపై నా కుటుంబంతో పాటు నాకు కూడా రక్షణ లేదు. మా ఫ్యామిలీ కొంతమేరకు ఇబ్బంది పడుతుంది. దీంతో ఇక్కడి నుంచి మా ఊరికి వెళ్లిపోతున్నా. అవకాశం ఉంటే మహా కుంభమేళా చివరన వచ్చి ఇక్కడ పుణ్యస్నానం చేస్తా. నాపై మీరు చూపిన ప్రేమ, మద్దతు ఎప్పటికీ మరిచిపోను. అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.' అని చెప్పింది. ప్రయాగరాజ్‌లో నిన్న కొందరు దుండగులు మెనాలిసా కుటుంబం పట్ల ఇబ్బందికరంగా ప్రవర్తించారని తెలుస్తోంది. ఈ కారణం వల్లే ఆమె తమ గ్రామానికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ ఇండోర్ సమీపంలో ఉన్న మహేశ్వర్ ప్రాంతానికి చెందిన మోనాలిసా భోంస్లే కుటుంబం ఈనెల 13న మహాకుంభమేళా ప్రారంభానికి ముందే ప్రయాగరాజ్ చేరుకుంది. అక్కడ రుద్రాక్ష దండల అమ్ముతూ కనిపించిన ఆ యువతిని అంతర్జాతీయ న్యూస్ ఛానల్ ప్రతినిధి ఇంటర్వ్యూ చేసి దానిని వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్టుచేశారు. అంతే.. ఆ వీడియోకు విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ తర్వాత దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమెకు విస్తృత ప్రచారం కల్పించి ఆకాశానికెత్తేశాయి.
परिवार और अपनी सुरक्षा के लिए मुझे बापस इंदौर जाना पड़ रहा है, हो सका तो अगले साही स्नान तक बापस मिलते हैं, प्रयागराज महाकुंभ में।
सभी के सहयोग और प्यार के लिए दिल से धन्यवाद 🙏 pic.twitter.com/GiRDmfSsDu— Monalisa Bhosle (@MonalisaIndb) January 23, 2025
Comments
Please login to add a commentAdd a comment