Maha Kumbh Mela 2025
-
‘డిజిటల్ మహాకుంభ్’.. సంస్కృతి, సాంకేతికతల కలబోత
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జనవరి 13 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి జరుగుతున్న కుంభమేళాను ‘డిజిటల్ మహా కుంభ్’గా చెప్పుకోవచ్చు. ఈ మహా కుంభమేళాలో క్యూఆర్ కోడ్ ఆధారిత రైల్వే టిక్కెట్లు మొదలుకొని, డ్రోన్ల ద్వారా నిఘా, ఏఐ పార్కింగ్ వరకు ఉన్న అన్ని సాంకేతికతలను అధికారులు వినియోగిస్తున్నారు.40 కోట్లకు పైగా జనం వస్తారని అంచనాఈ మహా కుంభమేళాకు వచ్చేవారంతా సనాతన సంస్కృతితో పాటు సాంకేతికత శక్తిని కూడా చూడగలుగుతారు. ఈసారి మహా కుంభమేళాకు 40 కోట్లకు పైగా జనం తరలివస్తారని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే భక్తుల భద్రత కోసం వీలైనంత సాంకేతికలను వినియోగిస్తున్నారు. ఇంతవరకు జరిగిన ఏ కుంభమేళాకూ ఇటువంటి సాంకేతికత అందుబాటులోకి రాలేదు. భక్తుల భద్రత దృష్ట్యా, కుంభమేళా జరిగే ప్రాంతాన్ని డ్రోన్ల ద్వారా పర్యవేక్షించనున్నారు. ఎవరైనా భక్తులు స్నానం చేస్తూ, ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోతే వారిని లైఫ్ సేవర్ బోట్ ద్వారా రక్షించనున్నారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేశారు. భక్తులకు ఉచిత వైఫైతో సహా అనేక హైటెక్ సౌకర్యాలు కల్పించనున్నారు.క్యూఆర్ రైల్వే టికెట్ప్రయాగ్రాజ్లో జరిగే మహాకుంభమేళాకు రైల్వేశాఖ మూడు వేలకు పైగా రైళ్లను నడుపుతోంది. ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ రైల్వే టికెటింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లో ప్రత్యేక విధుల్లో నియమితులైన రైల్వే సిబ్బంది క్యూఆర్ కోడ్లు కలిగిన జాకెట్లను ధరించనున్నారు. వీటి సాయంతో భక్తులు డిజిటల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుండి ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే భక్తులకు కలర్ కోడెడ్ టిక్కెట్లను జారీ చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.స్మార్ట్ కెమెరా నిఘా వ్యవస్థమహా కుంభమేళాలో 50 వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. ఈ భద్రతా సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చారు. వీరికి ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా సమయంలో ప్రతి అంగుళాన్ని పర్యవేక్షించగలిగేలా ఏఐ ఆధారిత సాధనాలు అందించనున్నారు. కుంభమేళా ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. కుంభమేళా ప్రాంతం అంతటా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏఐ ఆధారిత డ్రోన్లను కూడా వినియోగించనున్నారు.జన సాంద్రత ఆధారిత హెచ్చరిక వ్యవస్థఅత్యవసర పరిస్థితుల్లో జనసమూహం అదుపు తప్పకుండా చూసేందుకు జన సాంద్రత ఆధాధిత హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. భక్తులు గూగుల్ భాగస్వామ్యంతో ఘాట్లు, టాయిలెట్లు, ఫుడ్ కోర్టులు మొదలైన వాటిని సెర్చ్ చేయవచ్చు. భక్తుల వాహనాలను పార్కింగ్ చేయడానికి పార్క్+ యాప్‌తో అధికారులు భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఏఐ సాయంతో ప్రభుత్వ పార్కింగ్ స్థలాలలో ఐదు లక్షలకు పైగా వాహనాలను పార్క్ చేయవచ్చు. ఫాస్ట్ ట్యాగ్ ద్వారా పార్కింగ్ ఫీజు చెల్లించే సౌకర్యం కూడా ఉంటుంది.భాషిణి యాప్ సాయంతో..మహా కుంభమేళాలో బహుభాషా చాట్‌బాట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. భక్తులు వారి సొంత భాషలో ఇక్కడ అన్ని వ్యవహారాలు చేసుకోగలుగుతారు. దీనికోసం యూపీ ప్రభుత్వం భాషిణి యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా జాతర ప్రాంతంలో నియమితులైన అధికారులు భక్తుల భాషను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. భాషిణి యాప్ 11 విభిన్న భాషలకు సహకారిగా నిలుస్తుంది.ఇది కూడా చదవండి: Mahakumbh 2025: తొమ్మిదేళ్లకే నాగ సన్యాసి.. గడ్డకట్టే చలిలో కఠోర తపస్సు -
Mahakumbh 2025: తొమ్మిదేళ్లకే నాగ సన్యాసి.. గడ్డకట్టే చలిలో కఠోర తపస్సు
మహాకుంభమేళా ఈ నెల(జనవరి) 13 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా ప్రారంభంకానుంది. ఇందుకోసం ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు ఇప్పటికే పలువురు సాధువులు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. వారిలో ఒకరే తొమ్మిదేళ్ల నాగసన్యాసి గోపాల్ గిరి మహారాజ్.ఈయన హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని చంపా నుండి వచ్చారు. మహాకుంభ్‌లో అతి పిన్న వయస్కుడైన నాగ సన్యాసిగా గోపాల్ గిరి నిలిచారు. ప్రస్తుత శీతాకాలంలో గడ్డకట్టే చలి మధ్య గోపాల్ గిరి మహారాజ్ శరీరంపై ఎటువంటి దుస్తులు లేకుండా, కవలం బూడిద పూసుకుని తపస్సు కొనసాగిస్తుంటారు. గోపాల్ గిరికి మూడేళ్ల వయసు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు బాలుడిని ఒక గురుపుకు అప్పగించారు. నాటి నుంచి గోపాల్ గిరి సాధన ప్రారంభించారు.గోపాల్ గిరి మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ మహా కుంభమేళా(Kumbh Mela) తర్వాత తన చదువును తిరిగి కొనసాగిస్తానని అన్నారు. తనకు మొదట్లో తనకు ఇంటికి దూరమయ్యాననే బాధ ఉండేదని, అయితే తన గురువు అందించిన జ్ఞానం, మార్గదర్శకత్వం తనను ప్రాపంచిక అనుబంధాల నుండి దూరంగా ఉంచాయని అన్నారు. కాగా గోపాల్ గిరి మహారాజ్ దినచర్య చాలా క్రమశిక్షణతో కూడి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలోనే మేల్కొని, తన దైనందిన కార్యకలాపాలు నిర్వహిస్తారు. తరువాత గురువు సమక్షంలో వేదాలను నేర్చుకుంటారు. మహా కుంభమేళాలో గోపాల్ గిరి మహారాజ్ కత్తి కళను ప్రదర్శిస్తున్నారు. ఈ కళతో పాటు గోపాల్ గిరి చేసే అతీంద్రియ తపస్సు అతనికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది.ఇది కూడా చదవండి: గుంపులో చిక్కుకుపోయారా? మిమ్మల్ని మీరు ఇలా కాపాడుకోండి -
జాతీయ ఆధ్యాత్మిక ఉత్సవం కుంభమేళా
మహా కుంభమేళా భారతీయ ఆధ్యాత్మిక పరంపరకు ఒక నిలువుటద్దం. భారతదేశపు అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక ప్రాముఖ్యతకలిగిన మహాసమారోహం. గంగా నదీ తీరంలో కూడే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహం. మహా కుంభ మేళాకు సుమారు 40 కోట్ల్ల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా. పురాణాల ప్రకారం, దేవతలు అసురులు అమృతాన్ని పొదేందుకు కలసి సముద్ర మథనాన్ని నిర్వహించారు. అమృతపు కుంభం (పాత్ర)నుంచి నాలుగు బిందువులు హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్ రాజ్‌లలో పడ్డాయి. అవి పడ్డ ఈ నాలుగు ప్రదేశాలూ కుంభమేళా జరిగే పవిత్ర క్షేత్రాలుగా స్థిరపడ్డాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామేళా జరుగుతుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ (మునుపటి అలహాబాద్) లో జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి 26తో ముగుస్తుంది.కుంభమేళాలో పాల్గొనడం పాపవిమోచనకు దోహదపడుతుందని, మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. భారతదేశంలోని వివిధ ్రపాంతాల నుండి వచ్చిన సాధువులు, నాగసాధువులు, ఆధ్యాత్మిక గురువులు ఈ మహాసమారోహంలో పాల్గొంటారు. ఈ సాధువులు తమ ఆధ్యాత్మిక సాధనను ప్రదర్శించడం, భక్తులకు ఉపదేశాలు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. పండితులు, ఆధ్యాత్మిక గురువులు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలపై ఆసక్తికరమైన చర్చలు నిర్వహిస్తారు. ఈ చర్చలు భక్తులకు జ్ఞానం ప్రసాదిస్తాయి. ఈ ఉత్సవంలో సంగీతం, నృత్యం, నాటకాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పర్యావరణ పరిరక్షణ...ఈసారి కుంభమేళాలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ్రపాధాన్యం ఇస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, నదీజలాల శుభ్రతను మెరుగుపరచడం వంటి చర్యలు చేపడుతున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేసే ఈ ఉత్సవంలో పాల్గొనడం అందరూ సుకృతంగా భావిస్తారు. ‘కుంభమేళా భారతదేశపు ఆధ్యాత్మికత, ఐక్యత, విశ్వభావనల ప్రతీక. భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచానికి చాటి చెప్పే ఈ‘మహాకుంభమేళా’ సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు అంటే జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు పవిత్ర గంగ, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమ ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్‌లో జరగనుంది. చరిత్ర...మరో పారాణిక గాథ ప్రకారం విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు పినతల్లి కద్రువ బానిసత్వం నుంచి విముక్తి కోసం కద్రువ కుమారులైన నాగుల కోరిక మేరకు దేవలోకం వెళ్లి ఇంద్రలోక రక్షకులందరినీ ఓడించి అమృత కలశాన్ని తీసుకొని వస్తుండగా ఇంద్రుడు వచ్చి కారణం తెలుసుకుని విషాన్ని చిమ్మే పాములకు మృత్యువే లేకుండా అమృతం ఇవ్వడం భావ్యం కాదని హితవు పలికి గరుత్మంతుని శక్తిని మెచ్చుకుంటూనే ‘నీవు అమృతభాండాన్ని నాగులకప్పగించి, వారి ఎదురుగా దర్భలపై ఉంచితే నీవు, నీ తల్లి విముక్తులు కాగలరు. అప్పుడు నేను వెంటనే ఆ అమృతాన్ని దేవలోకం తీసుకొని వెళ్తాను’ అని చెప్పి అలాగే చేశాడు. ఈ క్రమంలోనే ఆ కలశం నుంచి భూలోకం లో నాలుగు నదులలో నాలుగుచోట్ల కొన్ని అమృతం చుక్కలు పడినట్లు చరిత్ర, ఆ అమృతపు బిందువులు పడిన ప్రదేశాలను పుణ్యస్థలాలుగా... పుణ్యతీర్థాలుగా భావించి ప్రజలు పుణ్యస్నానాలు చేసే పరంపర ్రపారంభమైంది.ధర్మరక్షణ కోసం...కుంభమేళాలో సాంప్రదాయిక ఊరేగింపు జరిగేటప్పుడు నాగ సాధువులు, మండలేశ్వరులు, మహామండలేశ్వరులు, అఖాడాలు కత్తులు, త్రిశూలాలు, గదలు ధరించి సనాతన ధర్మాన్ని రక్షించడానికి మేము ముందుంటామని నడుస్తుండ గా వెనుక శిష్యులు, సామాన్య భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు. అనంతరం పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కుంభమేళాకు హాజరయ్యేందుకు సంక్రాంతి నుండి శివరాత్రి వరకు కోట్లమంది భక్తులు వస్తారు. వీరంతా ధర్మరక్షణకు మేమూ నిలబడతామనీ,’ధర్మరక్షణ అంటే వ్యక్తిగతంగా ధర్మాన్ని పాటించడమే అని భావించి సంకల్పం తీసుకొని పుణ్యస్నానాలాచరించి తిరిగి వస్తుంటారు’.పూజ్యులు పీఠాధిపతులు మఠాధిపతులు భక్తులకు మంత్రోపదేశము చేస్తుంటారు, ప్రవచనాలు చేస్తుంటారు, కుంభమేళాలో వేలాదిమంది సాధ్విమణులు (మహిళా సన్యాసులు) కూడా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకొని ప్రబోధాలు చేస్తుంటారు. వారు చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు అందరికీ పరిచయం చేయడం జరుగుతుంటుంది.అలనాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ప్రయాగరాజ్‌ను సందర్శించి కుంభమేళాలో పాల్గొనగా, 1514 లో బెంగాల్‌కు చెందిన చైతన్య మహాప్రభు. తులసీ రామాయణాన్ని రచించిన సంత్ తులసీదాస్ కూడా కుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించినట్లుగా చరిత్ర.వెల్లివిరిసే సమరసత...పుణ్యస్నానాలు ఆచరించడం కోసం దేశం నలుమూలల నుంచేగాక ప్రపంచంలోని అనేక దేశాల నుంచి కోట్లమంది ప్రజలు కలిసి వచ్చి ్రపాంతీయ, భాషా, కుల భేదాలు మరచి తరతమ భేదాలు లేకుండా కుంభమేళా సందర్భంగా కలసి స్నానాలు చేస్తారు. ఇంతటి సమాన భావనతోనే.. వచ్చిన భక్తులందరికీ ఆవాసాలు, పానీయాలు, అల్పాహారాలు, భోజనాలు అందించడం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. పుణ్యస్నానాలు మాత్రమే కాదు..కుంభమేళా అంటే కేవలం కుటుంబమంతా వెళ్లి పుణ్యస్నానాలు చేయడం మాత్రమే కాదు, పండితులు నిర్ణయించిన క్షణం నుండి అనేకానేక వేడుకలు. కుంభమేళా ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ఆర్థిక శాస్త్రం సామాజిక శాస్త్రం, ఆధ్యాత్మికత, సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు, విజ్ఞాన శాస్త్రాలన్ని పండితులచేత, ఋషుల చేత మునులచేత సన్యాసుల చేత నెలల తరబడి ఆ ్రపాంతంలోనే ఉండి కఠినసాధన చేస్తూ గడచిన 12 సంవత్సరాలలో వారు కనుగొన్న ఎన్నో విషయాలను దేశం నలుమూలల నుంచి ప్రజలకు ప్రబోధించే సన్నివేశం అది. పాటించవలసిన మంచిని బోధించి సమాజానికి మార్గదర్శనం చేసి చూపించే ఈ çకుంభమేళాను అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం అవసరం. కుంభమేళా జరిగే పవిత్ర స్థలాలు1. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వద్ద గంగానదిలో,2. మధ్యప్రదేశ్ ఉజ్జయిని వద్ద క్షీరాబ్ది నదిలో,3. మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గోదావరి నదిలో 4. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో గంగా, యమున, అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతి నది సంగమం వద్ద.12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పవిత్ర స్నానాల సమయాన్ని‘కుంభమేళా’ అని. ఆరు సంవత్సరాలకు ఒకసారి జరిగే దాన్ని ‘అర్ధ కుంభమేళా’ అని, ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరిగే పవిత్ర స్నానాలను ’మాఘీమేళా’ అనే పేరుతో పిలుస్తారు. ఖగోళంలో జరిగే మార్పులను అనుసరించి పంచాంగం ప్రకారం లెక్కించిన విధంగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క సమయంలో కుంభమేళా జరుగుతుంది. 2025 మేళా ముఖ్యమైన తేదీలు జనవరి 13 పూర్ణిమ సందర్భంగా, మొదటి రాజస్నానం జరుగుతుంది. జనవరి 14 మకర సంక్రాంతి, 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 03 వసంత పంచమి, ఫిబ్రవరి 12మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి. ముఖ్యంగా గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. -
దేశంలో జరిగిన తొక్కిసలాటలు.. మిగిల్చిన విషాదాలు
ఆంధప్రదేశ్‌లోని తిరుపతిలో వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారిని దర్శించుకోవాలనే భక్తుల అపరిమితమైన తపన తీవ్ర విషాదానికి దారితీసింది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దేశంలో ఇటువంటి ఘటనలు గతంలోనూ చోటుచేసుకుని, తీవ్ర విషాదాన్ని మిగాల్చాయి.మంధర్‌దేవి ఆలయం2005, జనవరి 25న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధర్‌దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 350 మందికి పైగా భక్తులు మృతిచెందారు. వందలాది మంది గాయపడ్డారు. కొబ్బరికాయలు పగులగొడుతుండగా, కొంతమంది మెట్లపై నుంచి పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది.కుంభమేళా2003 ఆగస్టు 27న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన కుంభమేళాలో పవిత్ర స్నానాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతిచెందారు. 140 మంది గాయపడ్డారు.చాముండా దేవి ఆలయంరాజస్థాన్లోని చాముండా దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృతి చెందారు. బాంబు ఉందంటూ వదంతులు తలెత్తిన నేపధ్యంలో తొక్కిసలాటలో జరిగింది. ఈ ప్రమాదంలో 300 మందికి పైగా జనం గాయపడ్డారు.నైనా దేవి ఆలయంహిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో 2008లో జరిగిన మతపరమైన వేడుకలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో162 మంది ప్రాణాలు కోల్పోయారు.రతన్‌గఢ్ ఆలయం2013 అక్టోబర్ 13న మధ్యప్రదేశ్‌లోని దాటియా జిల్లాలోని రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మరణించారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు. యాత్రికులు దాటుతున్న నది వంతెన కూలిపోబోతున్నదనే వదంతితో తొక్కిసలాట జరిగింది.ఇండోర్2023, మార్చి 31 న ఇండోర్‌లోని ఒక ఆలయంలో పూజలు జరుగుతుండగా ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతిచెందారు.శబరిమల2011, జనవరి 14న కేరళలోని శబరిమల పరిధిలోని పుల్లమేడు వద్ద యాత్రికులను జీపు ప్రమాదానికి గురైంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 104 మంది భక్తులు మరణించారు. 40 మందికి పైగా జనం గాయపడ్డారు.గాంధీ మైదానంబీహార్లోని పాట్నాలో గల గాంధీ మైదానంలో 2014 అక్టోబర్ 3న దసరా వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు.పట్నా2012 నవంబర్ 19న పట్నాలోని గంగా నది ఒడ్డున ఉన్న అదాలత్ ఘాట్ వద్ద ఛఠ్ పూజ సందర్భంగా ఒక తాత్కాలిక వంతెన కూలిపోయింది. ఫలితంగా జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు.వైష్ణోదేవి ఆలయం2022, జనవరి 1న, జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందారు.రాజమండ్రి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో 2015, జూలై 14న పుష్కరాల ప్రారంభం రోజున గోదావరి నది ఒడ్డున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతిచెందారు. 20 మంది గాయపడ్డారు.హరిద్వార్ఉత్తరప్రదేశ్లోని హరిద్వార్‌లో 2011 నవంబర్ 8న గంగానది ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతిచెందారు.రామ్ జానకి ఆలయం2010 మార్చి 4న ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని రామ్ జానకి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో దాదాపు 63 మంది మృతి చెందారు.హత్రాస్2024లో ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట 121 మంది మృతిచెందారు. 300కుపైగా జనం గాయపడ్డారు. జూలై 2న సూరజ్‌పాల్ అలియాస్ భోలే బాబా అలియాస్ నారాయణ్ సకర్ హరి సత్సంగ్‌లో ఈ తొక్కిసలాట జరిగింది.రాజ్‌కోట్2024, మే 23న గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని గేమింగ్ జోన్లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందారు.గుంపులో చిక్కుకున్నప్పుడు..ఎప్పుడైనా మనం రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లి, గుంపులో చిక్కుకుపోయినప్పడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. సురక్షితంగా బయటపడేందుకు ప్రయత్నించాలి. కింద తెలిపిన పది ఉపాయాలు మనం గుంపునుంచి సురక్షితంగా బయటపడేందుకు సాయపడతాయి.1. మీరు ఎప్పుడైన రద్దీగా ఉండే ప్రదేశానికి వెళితే ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను గుర్తుంచుకోవాలి.2. మీరు వెళ్లిన ప్రదేశం గురించిన పూర్తి సమాచారం మీ వద్ద ఉండాలి. మీరు జనసమూహంలో చిక్కుకుపోయినప్పుడు, ఆ ప్రాంతం మీకు పూర్తిగా తెలిస్తే అప్పడు మీరు సులభంగా బయటపడగలుగుతారు.3. రద్దీగా ఉండే ప్రదేశానికి వెళ్ళే ముందు, ఏదైనా అవాంఛనీయ సంఘటనను ఎదుర్కోవడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. నిష్క్రమణ ద్వారం సమీపంలో ఉండటం ఉత్తమం.4. మీరు ఎప్పుడైనా జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, వ్యతిరేక దిశలో ముందుకు వెళ్లకూడదు. ఇలా చేస్తే ఆపద మరింత పెద్దదవుతుంది.5. మీరు గుంపులో చిక్కుకుంటే వీలైనంత త్వరగా అక్కడి నుండి బయటపడటానికి ప్రయత్నించాలి. ఆందోళన చెందే బదులు, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ముందుకు నడవాలి.6. జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, ఆ జనసమూహం దిశగానే ముందుకు కదలాలి. అప్పుడు ఆపద నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా కొంచెం స్థలం కనిపించినా, దానిని సద్వినియోగం చేసుకోవాలి.7. జనసమూహంలో చిక్కుకున్నప్పుడు, మీరు మీ చేతులను బాక్సర్ మాదిరిగా మీ ఛాతీ ముందు ఉంచుకోవాలి. తద్వారా మీ ఛాతీ సురక్షితంగా ఉంటుంది.8. మీరు ఎప్పుడైనా జనసమూహంలో చిక్కుకుని కిందపడిపోతే త్వరగా లేవడానికి ప్రయత్నించండి.9. మీరు జనసమూహంలో పడిపోయి లేవలేకపోతే, వెంటనే ఒక పక్కకు తిరిగి పడుకోండి. అలాగే మీ రెండు కాళ్ళను మీ ఛాతీకి తగిలించి, మీ చేతులను మీ తలపై ఉంచుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుతారు.10 మీరు రద్దీగా ఉండే ప్రదేశంలో చిక్కుకుంటే గోడలకు దూరంగా ఉండండి. బారికేడింగ్‌కు కూడా దూరంగా ఉండాలి. వెంటనే బయటకు వెళ్లడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇది కూడా చదవండి: ఆరేళ్ల బుడతడు.. వెయ్యి కిలోమీటర్లు పరిగెడుతూ అయోధ్యకు.. -
Mahakumbh Mela: ‘ధాన్యం బాబా’ తలపై పంటలు.. చూసేందుకు జనం క్యూ
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా సందడి నెలకొంది. ఈ నెల 13 నుంచి ఇక్కడ కుంభమేళా జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంతలో పలువురు బాబాలు, స్వామీజీలు కుంభమేళా ప్రాంతానికి చేరుకుంటున్నారు. వీరిలో కొందరి వేషధారణ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాంటివారిలో ఒకరే అనాజ్వాలీ బాబా.బాబా అమర్జీత్ ‘అనాజ్వాలీ బాబా’('Anajwali Baba')గా పేరొందారు. ఈయనను చూసేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాకు చెందిన బాబా అమర్జీత్ బాబా తన తన తలపై ధాన్యం, గోధుమలు, మినుములు లాంటి పంటలను పండిస్తూ, అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. గత ఐదేళ్లుగా ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు.హఠ యోగి అమర్జీత్ బాబా మీడియాతో మాట్లాడుతూ తాను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రపంచంలో శాంతిని పెంపొందించడానికి, పచ్చదనం(Greenery) ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడానికి ఒక మార్గమన్నారు. అటవీ నిర్మూలన అనేది పర్యావరణానికి హాని కలిగిస్తున్నదన్నారు. చెట్లను నరికివేయడం కారణంగా మన పర్యావరణానికి జరుగుతున్న చేటును గుర్తించి, తాను తన తలపై పంటలను పండిస్తూ, అందరికీ పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేయాలని అనుకున్నానని అమర్జీత్ బాబా తెలిపారు.తాను ఎక్కడికి వెళ్లినా అక్కడి జనం పచ్చదనాన్ని పెంచిపోషించేలా ప్రోత్సహిస్తానని, తన తలపై ఉన్న పంటలకు క్రమం తప్పకుండా నీటిని చిలకరిస్తూ వాటిని పోషిస్తానని తెలిపారు. బాబా మాటలు విన్నవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం కిలా ఘాట్ సమీపంలో ఈ ధాన్యం బాబా ఉంటున్నారు. ఇతనిని చూసేందుకు జనం క్యూ(Queue) కడుతున్నారు. బాబా తన తలపై పంటలను ఎలా పండిస్తున్నాడో చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది కూడా చదవండి: బీహార్ భూకంపం: 90 ఏళ్ల క్రితం ఇదేవిధంగా.. చెరగని ఆనవాళ్లు -
నాడు సస్పెండ్.. నేడు కుంభమేళా బాధ్యతలు.. ఎవరీ వైభవ్ కృష్ణ?
ఉత్తరప్రదేశ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఈ మేళాకు లక్షలాదిమంది తరలిరానున్నారు. ఈ నేపధ్యంలో పటిష్టమైన భద్రత అవవసరమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకున్న యూపీ సర్కారు మహాకుంభమేళా భద్రతా బాధ్యతలను ఓ ఐపీఎస్ అధికారికి అప్పగించింది. ఈయన గతంలోనూ పలుమార్లు వార్తల ప్రధానాంశాల్లో కనిపించారు. ఇంతకీ ఆయన ఎవరు? ఆయనకే ఈ కీలక భాధ్యతలు ఎందుకు అప్పగించారు?ఐపీఎస్ వైభవ్ కృష్ణ(IPS Vaibhav Krishna).. ఈయన అజంగఢ్ డీఐజీ. ఇప్పుడు ఇతనిని ప్రభుత్వం మహాకుంభ్ డీఐజీగా నియమించింది. uppolice.gov.in వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం వైభవ్ కృష్ణ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ నివాసి. ఆయన 1983 డిసెంబర్ 12న జన్మించారు. 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. వైభవ్‌కృష్ణ 2021, డిసెంబర్ 20న పోలీసుశాఖలో ప్రవేశించారు.వైభవ్ కృష్ణ మొదటి నుంచి చదువులో ఎంతో చురుకుగా ఉండేవారు. 12వ తరగతి తర్వాత ఐఐటీలో అడ్మిషన్ దక్కించుకున్నారు. ఐఐటీ రూర్కీ(IIT Roorkee)లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమయ్యారు. 2009లో తొలిసారిగా యూపీఎస్సీ పరీక్షకు హాజరై 86వ ర్యాంక్ సాధించారు. ఈ నేపధ్యంలోనే వైభవ్‌కృష్ణ యూపీ కేడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.ఐపీఎస్ వైభవ్ కృష్ణ తన ఉద్యోగ జీవితంలో చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. 2020 జనవరి 9న నోయిడాలో ఎస్ఎస్పీగా ఉన్నప్పుడు వైభవ్ కృష్ణ ఒక కేసులో సస్పెండ్ అయ్యారు. దాదాపు 14 నెలల తర్వాత 2021, మార్చి 5న తిరిగి ఉద్యోగంలో నియమితులయ్యారు. మూడు నెలల తరువాత ఆయనకు లక్నోలోని పోలీస్ ట్రైనింగ్ అండ్ సెక్యూరిటీ(Police Training and Security) సూపరింటెండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు.అనంతరం 2012 జూన్‌లో ఐపీఎస్ వైభవ్ కృష్ణ అజంగఢ్ జోన్ డీఐజీగా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆయన బల్లియాలో రైడ్ నిర్వహించి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న పోలీసు సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ కేసులో ఉన్నతాధికారులు 18 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. ఇటీవల యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ మహాకుంభమేళా జరిగే ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం ఐపీఎస్ వైభవ్ కృష్ణకు మహాకుంభమేళా బాధ్యతలు అప్పగించారు.ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: 16 ఏళ్లకే ఇంటిని వదిలి.. తాళాల బాబా సాధన ఇదే.. -
Maha Kumbh Mela: 16 ఏళ్లకే ఇంటిని వదిలి.. తాళాల బాబా సాధన ఇదే..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఇందుకు బారీఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. కుంభమేళాకు సాధుసన్యాసులతో పాటు సామాన్యులు కూడా లక్షలాదిగా తరలిరానున్నారు. సంగమతీరంలో పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.కుంభమేళా(Kumbh Mela) సందర్భంగా ఇప్పుటికే పలువురు బాబాలు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. వీరిలో ఒకరే హరిశ్చంద్ర విశ్వకర్మ కబీరా బాబా. ఇతనిని చాబీవాలే బాబా(తాళాల బాబా) అని పిలుస్తుంటారు. ఈ బాబా ఎప్పుడూ తన వెంట 20 కిలోల తాళంచెవులను మోసుకెళుతుంటారు. ఈయనను ప్రయాగ్‌రాజ్‌లోని వారు బహువింతగా చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన హరిశ్చంద్ర విశ్వకర్మ కబీరా బాబా తన 16 ఏళ్ల వయసులోనే తన ఇంటిని విడిచిపెట్టి, ఆధ్యాత్మిక చింతనా మార్గాన్ని అవలంబించారు.తాళాల బాబా మీడియాతో మాట్లాడుతూ ‘నా తల్లిదండ్రులు సన్యాసమార్గం అవలంబించారు. వారు నాకు హరిశ్చంద్ర అని పేరు పెట్టాడు. ఆ పేరును నిలబెట్టుకునేందుకు నేను నా ఆధ్యాత్మిక జీవన ప్రయాణం(Spiritual life journey) ప్రారంభించాను. హరిశ్చంద్రుడు మనందరికీ సన్మార్గాన్ని చూపాడు. నేను హరిశ్చంద్రుడు అందించిన మార్గాన్ని అనుసరిస్తున్నాను. ఇందుకోసం చిన్నతనంలోనే ఇంటిని విడిచిపెట్టాను. సత్యమార్గాన్ని అనుసరించడం ద్వారా జీవితంలో ముక్తిని పొందేందుకు ప్రయత్నిస్తున్నాను.సమాజంలో ప్రబలంగా ఉన్న దురాచారాలు, ద్వేషాలను తొలగించడంలో తనవంతు పాత్రను పోషించేందుకే ఇంటిని విడిచిపెట్టానని బాబా తెలిపారు. నా జీవన మార్గంలో లెక్కకుమించినన్ని పాదయాత్రలు చేశాను. ఎన్నోకష్టనష్టాలను ఎదుర్కొంటూ సత్యమార్గాన్ని విడవకుండా ముందుకు సాగుతున్నాను. రాబోయే మహాకుంభ మేళాను ఘనంగా నిర్వహించేందుకు ప్రధాని మోదీ, సీఎం యోగి అమితమైన కృషి చేస్తున్నారు. తాను ధరించిన తాళాలు హృదయరాముని దర్శింపజేస్తాయని’ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న 10 వైరస్లు.. కరోనాకు ముందే.. -
కుంభమేళాకు కొత్త వైరస్ ముప్పు.. అధికారులు అప్రమత్తం
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌ను మరువక ముందే చైనాలో మరో ప్రాణాంతక వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పుడది భారత్‌నూ తాకింది. తాజాగా కొత్తవైరస్ ఎంపీహెచ్‌వీకి చెందిన రెండు కేసులు కర్నాటకలో బయటపడ్డాయి. ఈ నేపధ్యంలో ఈనెల 13 నుంచి జరగబోయే కుంభమేళాకు ఈ వైరస్ ముప్పు పొంచివుందనే వార్తలు వినిపిస్తున్నాయి.చైనాలో పుట్టిన ఈ కొత్త వైరస్‌ను హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్(Human metapneumo virus)(హెచ్ఎంపీవీ) అని పిలుస్తారు. చైనాలోని పలు ఆసుపత్రులు ఈ వైరస్ బారిన పడినవారితో నిండిపోయాయి. ఈ వైరస్ సంక్రమణ గత 10 రోజుల్లో 600 రెట్లు పెరిగింది. తాజాగా భారత్‌లో ఈ వైరస్‌కు సంబంధించిన రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో లక్షలాదిమంది తరలివచ్చే కుంభమేళాపై ఈ వైరస్ ముప్పు పొంచివుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ముప్పును ఎదుర్కోవాలంటే చైనా నుంచి భారత్ వచ్చే వారిపై నిషేధం విధించాలని ఇప్పటికే సాధువులు విజ్ఞప్తి చేశారు. చైనా నుంచి వచ్చే విమానాలను తక్షణమే నిషేధించాలని అఖిల భారతీయ అఖాఢా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మరోవైపు కుంభమేళాకు వచ్చే వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఈ ముప్పును విస్మరించలేమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఈ నేపధ్యంలోనే కుంభమేళాలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు 100 పడకల ఆసుపత్రి(100 bed hospital)ని సిద్ధం చేశారు. వైద్యులు, ఇతర సిబ్బందిని రౌండ్ ది క్లాక్ ఆస్పత్రులలో ఉండేలా చూస్తున్నారు.హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ముందుగా శ్వాసకోశ వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ అన్ని వయసుల వారికీ వ్యాపిస్తుంది. అయితే దీని ప్రభావం చిన్న పిల్లలు, వృద్ధులపై ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 2019 నవంబర్‌లో కరోనా వైరస్ పుట్టినప్పుడు, అది ప్రపంచమంతటా పెను సంక్షోభాన్ని సృష్టిస్తుందని ఎవరూ గ్రహించలేదు. నాడు ఈ వైరస్‌ను దాచేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చైనా(China) కుట్ర ప్రపంచానికి తెలిసిపోయింది. 2019 జనవరిలో తొలిసారిగా కరోనా భారతదేశానికి వచ్చింది. తరువాత వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు ఆ ఏడాది మార్చిలో దేశంలో లాక్డౌన్ విధించారు. తాజాగా హెచ్ఎంపీవీ వ్యాప్తి దరిమిలా యూపీలోని అలహాబాద్ మెడికల్ అసోసియేషన్.. చైనా నుంచి వచ్చే ప్రయాణీకులందరికీ స్క్రీనింగ్ అవసరమని ప్రభుత్వానికి సూచించింది.ఇది కూడా చదవండి: అధిక ప్లాట్పారంలున్న రైల్వే స్టేషన్లివే.. చర్లపల్లి స్థానం ఎక్కడ? -
కుంభమేళాకు సుందరంగా ముస్తాబైన ప్రయాగ్‌రాజ్
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13నుంచి జరగబోయే మహాకుంభమేళాకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. నగరంలోని ప్రతీప్రాంతాన్ని అధికారులు అందంగా తీర్చిదిద్దుతున్నారు.ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌ను అంత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ ప్రతిష్టను మరింతగా పెంచడంలో భారతీయ రైల్వే కూడా గొప్ప పాత్ర పోషిస్తోంది.‘పెయింట్ మై సిటీ’ ప్రచారం పేరిట ప్రయాగ్‌రాజ్‌లోని రైల్వేస్టేషన్‌ను అద్భుత కళ, అందమైన సంస్కృతికి నిలయంగా మార్చారు.స్టేషన్ గోడలపై హిందూ పురాణాలు, భారతీయ సంప్రదాయాలను వర్ణించే అందమైన, ఆకర్షణీయమైన వర్ణచిత్రాలను రూపొందించారు.ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, నైని జంక్షన్, ఫఫామౌ, ఝూన్సీ రైల్వే స్టేషన్, రాంబాగ్ రైల్వే స్టేషన్, చివ్కీ రైల్వే స్టేషన్, ప్రయాగ్‌రాజ్ సంగమ్ రైల్వే స్టేషన్, సుబేదర్‌గంజ్ రైల్వే స్టేషన్లన్నింటినీ అత్యంత సుందరంగా మలచారు.రైల్వే స్టేషన్ గోడలపై రామాయణం, శ్రీకృష్ణ లీలలు, బుద్ధుడు, శివ భక్తి, గంగా హారతి, మహిళా సాధికారత తదితర చిత్రాలను రూపొందించారు.పలువురు కళాకారులు తమ జీవితానుభవాలను ఈ కళాకృతులలో ప్రతిబింబించారు.ఈ కళాకృతులు భక్తులకు, పర్యాటకులకు ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేకంగా నిలిచిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని చూపిస్తాయి. రైల్వేశాఖ చూపిన ఈ చొరవ కేవలం సుందరీకరణకే పరిమితం కాకుండా, ప్రయాగ్‌రాజ్ చారిత్రక, సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచింది.రైల్వేశాఖ చేపట్టిన ‘పెయింట్ మై సిటీ’ కార్యక్రమం మహా కుంభమేళాను తిలకించేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది.ఋషి సంప్రదాయం, గురు-శిష్య సంప్రదాయం, జ్ఞానం, త్యాగాలకున్న ప్రాముఖ్యత ఈ కళాకృతులలో కనిపిస్తుంది.ఈ కళాఖండాలు మహాకుంభమేళాకు వచ్చే లక్షలాది మంది భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.భారతీయ రైల్వే చేస్తున్న ఈ ప్రయత్నం ప్రయాగ్‌రాజ్ గొప్పతనాన్ని తెలియజేస్తుంది.ఎంతో వైవిధ్యతతో కూడిన ఈ చిత్రాలు అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నాయి.ఇది కూడా చదవండి: బీహార్‌లోనూ ఎర్రకోట.. చరిత్ర ఇదే -
కాశీలోనూ కుంభమేళా ఉత్సాహం.. పోటెత్తనున్న భక్తులు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఇప్పుడు కుంభమేళా ఉత్సాహం వారణాసి(కాశీ)లోనూ కనిపిస్తోంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులు తప్పక వారణాసికి కూడా వస్తారని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పలు ఏర్పాట్లు చేస్తున్నారు.కుంభమేళా(Kumbh Mela)కు వచ్చే లక్షలాది మంది యాత్రికులు సంగమ స్నానం ముగించుకున్నాక నేరుగా వారణాసికి వచ్చి, గంగలో స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా చూస్తే కుంభమేళా సందర్భంగా కాశీకి వచ్చే యాత్రికుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. కుంభమేళా రోజుల్లో విశ్వనాథుని దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ స్వామివారి దర్శన సమయాల్లో మార్పులు చేసింది. 2024 జనవరి 13 నుండి ఫిబ్రవరి 12 వరకూ విశ్వనాథుని ఐదు హారతులతో కూడా మార్పులు చేసింది.జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సాధారణ రోజులలో మంగళ హారతి సమయం తెల్లవారుజాము 2.45, భోగ్ హారతి ఉదయం 11.35, సప్తఋషి హారతి రాత్రి 7.00, శృంగర్-భోగ్ హారతి రాత్రి 8.45, శయన హారతి రాత్రి 8.45కు నిర్వహించనున్నారు. మహా కుంభమేళా సమయంలో అంటే జనవరి 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీలలో శృంగార-భోగ్ హారతి రాత్రి 9 గంటలకు, శయన హారతి రాత్రి 10.45 గంటలకు నిర్వహించనున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాశీ విశ్వనాథ్ ధామ్(Kashi Vishwanath Dham)లో పౌర్ణమి రోజు ఇచ్చే హారతి వేళల్లోనూ మార్పులు చేశారు. జనవరి 13, ఫిబ్రవరి 12 తేదీలలో బాబా విశ్వనాథుని సప్తఋషి హారతి సాయంత్రం 6.15 గంటలకు ప్రారంభమవుతుంది, శృంగార-భోగ్ హారతి సాయంత్రం 6.15 గంటలకు, తిరిగి రాత్రి 8 గంటలకు జరుగుతుంది. మంగళ హారతి, మధ్యాహ్న భోగ్ హారతి, శయన హారతి సమయాలలో ఎటువంటి మార్పులు ఉండబోవు.మహాకుంభమేళా.. మహాశివరాత్రి(Mahashivratri)(ఫిబ్రవరి 26)తో ముగియనుంది. ఆ రోజున విశ్వనాథుని దర్శనం, పూజల కోసం నాగా సాధువులు, అఖాడాలే కాకుండా పెద్ద సంఖ్యలో భక్తులు కూడా తరలి వస్తారు. ఆ రోజున తెల్లవారుజామున 2.15 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. మధ్యాహ్నం జరిగే భోగ్ హారతి 11.35 గంటలకు ప్రారంభమై 12.35 వరకు కొనసాగనుంది. మహాశివరాత్రి నాటి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు నాలుగు గంటలపాటు హారతి కార్యక్రమం ఉంటుంది.ఇది కూడా చదవండి: కనిపించని ఏసీ కోచ్.. కంగుతిన్న ‘రిజర్వేషన్’ ప్రయాణికులు.. తరువాత? -
Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజం అని ఎందుకంటారు?
జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో నగరంలోని ప్రతీవీధి కొత్త కళను సంతరించుకుంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని శాఖలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని పురాతన ఆలయాలు, ఆశ్రమాలకు మరమ్మతులు చేశారు. కొన్ని చోట్ల కారిడార్లు నిర్మించారు. శిథిలావస్థకు చేరిన ఆలయాలను పునరుద్ధరించారు. ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను చూస్తుంటే, మహాకుంభమేళాకు వచ్చే భక్తులు ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసి మైమరచిపోవడం ఖాయమనినిపించేలా ఉన్నాయని స్థానికులు అంటున్నారు.ప్రయాగ్‌రాజ్‌లోని భరద్వాజ ఆశ్రమం ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఇక్కడ పర్యాటక శాఖ కారిడార్‌ను నిర్మించింది. ఈ కారిడార్‌కు ఇరువైపులా మహర్షి భరద్వాజునికి సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు ఈ ఆశ్రమానికి వచ్చిన చిత్రాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. సీతారాములకు ఇక్కడి నుండే భరద్వాజ మహర్షి చిత్రకూట్‌కు వెళ్లే మార్గం చూపాడని చెబుతారు. అలాగే లంకలో విజయం సాధించిన శ్రీరాముడు ఇక్కడికి వచ్చి భరద్వాజుని ద్వారా సత్యనారాయణుని కథను విన్నాడని చెబుతారు. ఇలాంటి ఎన్నో పురాణగాథలు ప్రయాగ్‌రాజ్‌తో ముడిపడి ఉన్నాయి.ఈ ప్రదేశానికున్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మ దేవుడు ఈప్రాంతాన్ని తీర్థరాజం అని పిలిచాడని చెబుతారు. దీని అర్థం అన్ని పుణ్యక్షేత్రాలకు రాజు. ఈ ప్రదేశాన్ని వేదపురాణాలు, రామాయణం, మహాభారతాలలో ప్రయాగగా పేర్కొన్నారు. పద్మపురాణం ప్రకారం ప్రయాగలోని గంగా యమునా తీరంలో స్నానం చేస్తే కోట్లాది అశ్వమేధ యాగాల ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ తీర్థరాజం గురించి మరొక కథ కూడా ప్రచారంలో ఉంది. శేష భగవానుని సూచనల మేరకు బ్రహ్మ దేవుడు అన్ని తీర్థయాత్రల పుణ్యాన్ని తూచాడు. తీర్థ ప్రదేశాలు, ఏడు సముద్రాలు, ఏడు ఖండాలు ఒక వైపు ఉంచారు. మరోవైపు తీర్థరాజం ప్రయాగను ఉంచారు. ఈ నేపధ్యంలో తీర్థరాజం ప్రయాగ అత్యంత బరువుతో భూమిని తాకిందట.కాగా పర్యాటక శాఖ ప్రయాగ్‌రాజ్‌లో పలు ఆలయాల పునరుద్ధరణకు ఎర్ర ఇసుకరాయిని వినియోగించింది. ఇవి ఎంతో మన్నికైన రాళ్లుగా గుర్తింపుపొందాయి. మరోవైపు స్థానిక అధికారులు కుంభమేళా సందర్భంగా నగరంలోని పలుప్రాంతాల్లో 10 సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని పర్యాటక ప్రాంతాలు, ఆలయాలకు సంబంధించిన సమాచారంతో కూడిన బుక్లెట్లను భక్తులకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు.ఇది కూడా చదవండి: World Braille Day: బ్రెయిలీ లిపి అంటే ఏమిటి? ఎలా ఆవిష్కృతమయ్యింది? -
అర్థ, పూర్ణ, మహాకుంభమేళాల్లో తేడాలేమిటి?.. ఈసారి ఎందుకంత ప్రత్యేకం?
ప్రపంచంలోని హిందువులంతా ఎంతో పవిత్రమైనదిగా భావించే మహాకుంభమేళా ఈనెల(జనవరి)లోనే జరగనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. మహాకుంభమేళా 2025, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరగనుంది. ఈసారి మహాకుంభమేళాను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి, పుణ్యస్నానాలు చేయనున్నారు.కుంభమేళా అనేది అర్థకుంభమేళా, పూర్ణకుంభమేళా, మహాకుంభమేళా అనే వర్గాలుగా జరుగుతుంటుంది. ఈ మూడూ వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. దీని వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది. దేశంలోని నాలుగు ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుంటుంది. వీటిలో హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్‌రాజ్‌లున్నాయి. కుంభమేళా సమయంలో భక్తులు గంగా, గోదావరి, క్షిప్రా నదులలో భక్తిప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు.ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేళాను అర్ధ కుంభమేళా అంటారు. ఇది యూపీలోని ప్రయాగ్‌రాజ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లలో మాత్రమే జరుగుతుంది. ఈ అర్థకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. పూర్ణ కుంభమేళా విషయానికొస్తే ఇది ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమ తీరంలో జరుగుతుంది.గతంలో అంటే 2013లో పూర్ణకుంభమేళా జరిగింది. ఇప్పుడు 2025లో మరో పూర్ణ కుంభమేళా వచ్చింది. అయితే దీనికి మహాకుంభమేళా అనే పేరుపెట్టారు. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో 12 సార్లు పూర్ణ కుంభమేళా జరిగిన దరమిలా ఇప్పుడు మరోమారు జరుగుతున్నందున దీనికి మహాకుంభమేళా అనే పేరు పెట్టారు. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుండగా, 12 పూర్ణకుంభమేళాల తరువాత మహాకుంభమేళా వస్తుంది. ఇది కూడా చదవండి: భోపాల్ దుర్ఘటన: 40 ఏళ్ల తర్వాత విషపూరిత వ్యర్థాల తరలింపు