న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాను సందర్శించనున్నారు. అనంతరం పవిత్ర తివేణీ సంగమంలో పుణ్య స్నానం చేయనున్నారు. బుధవారం, మాఘ మాసం అష్టమి తిథి నాడు ప్రధాని మోదీ పవిత్ర స్నానం చేయనున్నారు. తరువాత త్రివేణీ సంగమం ఒడ్డున గంగామాతను పూజించి, దేశప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు(బుధవారం) ఉదయం 10 గంటలకు మహాకుంభ్ ప్రాంతానికి చేరుకోనున్నారు. అనంతరం అరయిల్ ఘాట్ నుండి పడవ ద్వారా సంగమ ప్రాంతానికి వెళ్తారు. ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్‌లో దాదాపు గంటసేపు ఉంటారు. కాగా 2024 డిసెంబర్ 13న ప్రధాని సంగమం ఒడ్డున గంగా నదికి హారతినిచ్చి, పూజలు నిర్వహించి, కుంభమేళా విజయవంతం కావాలని ప్రార్థించారు. బుధవారం కుంభమేళాకు వస్తున్న ప్రధాని మోదీ అక్కడ అఖాడాలను కలుసుకోనున్నారు.
2019లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన అర్థ కుంభమేళాలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగి, సామాజిక సామరస్య సందేశాన్ని అందించారు. ప్రధాని నుంచి అటువంటి గౌరవాన్ని పొందిన ఐదుగురు సిబ్బందికి నోటమాటరాలేదు. ఆ దృశ్యాన్ని చూసిన ఇతర పారిశుధ్య కార్మికులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ కూడా దీనిని తన జీవితంలో అత్యంత మరపురాని క్షణంగా అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌తో భేటీ?
Comments
Please login to add a commentAdd a comment