ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వేడుకగా సాగుతోంది. ఈ కుంభమేళాలో పలు ఆసక్తికర ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి ఉదంతమొకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.
27 ఏళ్ల క్రితం తమ కుటుంబం నుంచి తప్పిపోయిన ఒక వ్యక్తిని కుంభమేళాలో కనుగొన్నామని జార్ఖండ్‌కు చెందిన ఒక కుటుంబం మీడియాకు తెలిపింది. దీంతో తమ 27 ఏళ్ల ఆవేదన ఇప్పుడు తీరిపోయిందని వారు ఆనందంగా చెబుతున్నారు. నాడు ఇంటి నుంచి తప్పిపోయిన గంగాసాగర్ యాదవ్ వయసు ఇప్పుడు 65 ఏళ్లు. ఇప్పుడాయన అఘోరి సాధువుగా కుటుంబ సభ్యులకు దర్శనమిచ్చారు. ఇప్పుడు అతని పేరు బాబా రాజ్ కుమార్.
1998లో గంగాసాగర్ కుటుంబ సభ్యులంతా బీహార్‌లోని పట్నాకు వెళ్లారు. అప్పుడు గంగాసాగర్ అదృశ్యమయ్యాడు. దీంతో అతని భార్య ధన్వ దేవి ఇంటి బాధ్యతలను భుజానికెత్తుకుని వారి కుమారులు కమలేష్, విమలేష్‌లను పెంచిపెద్దచేసింది. గంగాసాగర్ తమ్ముడు మురళీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ‘తమ సోదరుడిని తాము మళ్లీ చూస్తామనే ఆశను కోల్పోయాం. అయితే కుంభమేళాకు వెళ్లిన మా బంధువులలో ఒకరు గంగాసాగర్ ఫోటో తీసి మాకు పంపారు. దీంతో నేను, ధన్వా దేవి, వారి ఇద్దరు కుమారులతో కలిసి కుంభమేళాకు వెళ్లాం.
అక్కడ గంగాసాగర్‌ను గుర్తించాం. అయితే అతను తన పూర్వపు గుర్తింపును అంగీకరించేందుకు నిరాకరించారు. పైగా తాను బాబా రాజ్‌కుమార్‌ను అని చెబుతూ, వారణాసికి చెందిన సాధువును అని తెలిపాడు. అయితే తాము ఆయన నుదిటిపై, మోకాలిపై ఉన్న గాయాల గుర్తులును చూశాకనే ఆయనను గంగాసాగర్ యాదవ్‌గా గుర్తించాం. కుంభమేళా ముగిసే వరకు ఇక్కడే ఉంటాం. అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తాం. అవి సరిపోలకపోతే బాబా రాజ్‌కుమార్‌కు క్షమాపణలు చెబుతాం’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: సంగమ తీరంలో.. ఢిల్లీకి నాలుగింతల జనాభా
Comments
Please login to add a commentAdd a comment