sadhu
-
సాధకులు... గురువులు
గురు అన్న మాటని అతి సామాన్యంగా వాడేస్తూ ఉంటాం. దారిలో కనపడిన ముక్కు మొహం తెలియని మనిషిని పలకరించటానికి, ఎలా సంబోధించాలో తెలియని సందర్భంలోనూ, స్నేహితులు ఒకరినొకరు పలకరించుకోటానికి, చివరికి బస్ కండక్టర్నీ, డ్రైవర్నీ, ఇంకా ఎవరిని పడితే వారిని గురూ అని సంబోధించటం చూస్తాం. కాస్త పెద్దవారైతే గురువుగారూ అంటారు. గురువు అంటే పెద్ద వాడు అన్న అర్థంలో వాడితే సరే! గురు అన్నది అర్థం మాట అటు ఉంచి, పదమే సరి కాదు. గురువు అన్నది సాధు పదం.అసందర్భంగా ఉపయోగించటమే కాదు కొంత మంది ఆ విధంగా పిలిపించుకోవాలి అని చాలా తాపత్రయ పడుతూ ఉంటారు. నిజానికి ఆ విధంగా పిలిపించుకోవటం చాలా పెద్ద బరువు. బాధ్యత అవుతుంది. నాలుగు లలిత గీతాలు నేర్పి, పది పద్యాలో, శ్లోకాలో నేర్పి, రెండు మూడు యోగాసనాలు నేర్పించి, నాలుగు ప్రవచనాలు చెప్పి ‘గురు’ అనే బిరుదాన్ని తమకు తామే తగిలించుకోవటం చూస్తాం. వారి వద్ద నేర్చుకుంటున్న వారు గురువుగారు అనటం సహజం. తప్పనిసరి. అందరూ అట్లాగే అనాలి అనుకోవటం వల్ల సమస్య. అందరూ ఎందుకు అంటారు? అందుకని తామే తమ పేరులో భాగంగా పెట్టుకుంటున్నారు. అయితే ఏమిటిట?గురువు అంటే అజ్ఞాన మనే చీకట్లని తొలగించి, జ్ఞానమనే వెలుగుని ప్రసాదించే వాడు అని కదా అర్థం. గురుత్వాన్ని అంగీకరిస్తే శిష్యుల పూర్తి బాధ్యత నెత్తి కెత్తుకోవలసి ఉంటుంది. వారి తప్పులకి బాధ్యత తనదే అవుతుంది. బోధకుడుగా ఒక విషయంలో బాధ్యత వహించ వచ్చు. కానీ, గురువు అంటే మొత్తం అన్ని విషయాలలోనూ బాధ్యత ఉంటుంది. ఈ బరువు మోస్తూ ఉంటే తన సాధన సంగతి ఏమిటి? తన జీవన విధానం ఆదర్శ్ర΄ాయంగా ఉన్నదా? ఒక్కసారి గురుస్థానం ఆక్రమిస్తే తరచుగా జరిగేది గర్వం పెరగటం. తాను ఒక స్థాయికి రావటం జరిగింది కనుక ఇక పై తెలుసుకోవలసినది, సాధన చేయవలసినది లేదు అనే అభి్ర΄ాయం కలుగుతుంది. దానితో ఎదుగుదల ఆగి΄ోతుంది. గిడసబారి, వామన వృక్షాలు అవుతారు. బోధిసత్వుడు తనను ‘తథాగతుడు’ అనే చెప్పుకున్నాడు కానీ గురువుని అని చెప్పుకోలేదు. శ్రీ రామ చంద్రుడికి అరణ్యవాసంలో మార్గనిర్దేశనం చేసిన ఋషులు కూడా ‘ఇది ఋషులు నడచిన దారి’ అనే చె΄్పారు. మా దారి అని చెప్పలేదు. ఎందుకంటే, వారు అప్పుడు ఉన్న స్థితి కన్నా ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళటం అనే ఆదర్శం ఉన్న వారు. ఒక్క సారి తనని గురువు అనిప్రకటించుకున్నాక ముందుకి సాగటం ఉండదు. ఈ జన్మకి ఇంతే! సాధకులు అనే స్థితి లేక ΄ోతే, సాధన ఎక్కడ? సిద్ధి ఎక్కడ? అటువంటి వారిని ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. ఏదో చిన్న సిద్ధి రాగానే దానిని ప్రకటించుకుంటూ ఆగి ΄ోతారు. పతనం కూడా అవుతారు. మరొక గొప్ప బాధకరమైన ఉదాహరణ. చిన్నపిల్లలలో ప్రతిభ ఉండచ్చు. దాన్ని ్ర΄ోత్సహించాలి కూడా. కానీ, వాళ్ళకి బిరుదాలు మొదలైనవి ఇచ్చిన తరువాత మరొక్క అడుగు ముందుకి వేయక ΄ోవటం అనుభవమేగా! ఒక రంగంలో అత్యున్నత స్థానాన్ని ΄÷ందిన వారు ఎవరు కూడా తాము గురువులము అని చెప్పుకోవటం చూడం. ఇంకా సాధన చేస్తున్నాము, జ్ఞానం అనంతం మాకు ఈ మాత్రం అందినందుకు ధన్యులం అంటారు. పైగా ప్రతిరోజు మరింతగా సాధన చేస్తూ ఉంటారు. సంగీత విద్వాంసులయినా, వేద పండితులైనా, క్రికెట్ ఆటగాళ్లయినా అభ్యాసం ఆపరు. తాను చెప్పినది విని తనని నలుగురు అనుసరిస్తున్నారు అంటే ఎంత జాగ్రత్తగా మసలుకోవాలి? – డా. ఎన్. అనంత లక్ష్మి -
మీరు ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఎలా తీసుకోవాలి : సద్గురు
-
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు నేర్పించండి
-
మోదీజీ వారిపై చర్యలు తీసుకోండి.. లేఖ రాసి సాధువు ఆత్మహత్యాయత్నం!
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పథకాల్లో అవినీతిని జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ సాధువు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇందులో భాగంగా తన చేతిని కత్తితో కోసుకున్నాడు. ఈ ఘటన యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సరయూ నది ఘాట్‌లో విమల్ కుమార్ అనే సాధువు తన చేతిని పదునైన ఆయుధంతో కోసుకున్నాడు. దీంతో, తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ క్రమంలో విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సాధువును ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు.. సాధువును ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో పోలీసులు అతడి వద్ద నుంచి ఓ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సదరు లెటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు ఉండటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఆ లేఖలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకం సహా పలు పథకాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని సాధువు ఆవేదన వ్యక్తం చేశాడు. అవినీతిపరులపై చర్యలు తీసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా, సాధువు వ్యాఖ్యలు ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇక, విమల్ కుమార్.. బీహార్‌లోని అరారియా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. दुर्गा अष्टमी पर सरयू स्नान के बाद साधू ने की होश उड़ा देने वाली हरकत https://t.co/gtUUvyUaMO https://t.co/DeiXZnfKxY #uttarpradesh #uttarpradeshnews #ayodhya_news @newstracklive — News Track (@newstracklive) October 3, 2022 -
నమ్మలేని నిజం.. 10 ఏళ్లకుపైగా ఎత్తిన చేతిని దించలేదు..!
మీ చేతిని పైకి ఎత్తి ఎంత సమయం వరకు ఉండగలరు? మహా అయితే ఓ 10-20 నిమిషాలు అతి కష్టంతో పైకి ఎత్తి ఉంచగలరేమో. కానీ, గంటలు కాదు, రోజులు కాదు.. ఏళ్ల తరబడి ఎత్తిన చేతిన దించకుండా ఉండటం అంటే నమ్మశక్యంగా లేదు కదా. అయితే, అది నిజం. ఓ సాధువు దానిని గతంలోనే చేసి చూపించారు. 70 ఏళ్ల సాధువు అమర్ భర్తీ.. సుమారు 50 ఏళ్లకుపైగా తన కుడి చేతిని పైకే ఎత్తి ఉంచినట్లు అప్పట్లో తెగవైరల్గా మారింది. తొలి రెండేళ్లు తీవ్రంగా నొప్పి ఉండేదటా! కానీ అది క్రమంగా తగ్గిపోయిందని, ఆ తర్వాత ఎలాంటి నొప్పిలేదని సాధువు అమర్ భర్తీ వెల్లడించారు. మరోవైపు.. ఆ చేతికి రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోవటం వల్లే ఎలాంటి నొప్పి కలగటం లేదని, ఇకపై ఆ చేతిని కిందకు దించలేదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. 1973 వరకు అమర్ భర్తీ ఒక సాధారణ వ్యక్తే. అందరిలా వివాహం చేసుకుని పిల్లాపాలతో జీవించేవారు. ఆ తర్వాత తన జీవితాన్ని శివుడికి అంకితం చేయాలని నిశ్చయించుకుని సాధువుగా మారారు. తనలోని శివుడిపట్ల ఉన్న నిబద్ధతను చాటుకునేందుకు కుడి చేతిని పైకి ఎత్తి ఉంచటం మొదలు పెట్టారు. భర్తీ అంశం 2020లోనే వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే భర్తీ లాగే మరో వ్యక్తి చేతిని పైకి ఎత్తి ఉంచుతుండటం వెలుగులోకి వచ్చింది. అమర్ భర్తీ 50 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయలేకపోయినా.. తనకు సాధ్యమైనంత మేరకు చేతిని పైకి ఎత్తే ఉంచుతానని చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా చేతిని పైకి ఎత్తే ఉంచానని వెల్లడించారు. ఓ రిపోర్టర్ సాధువుతో మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎన్ని రోజుల పాటు ఇలా చేతిని పైకి ఎత్తి ఉంచుతారని విలేకరి ప్రశ్నించగా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. చేతిని పైకి ఉంచే నిద్రపోతానని, ఆ సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది కలిగినట్లు అనిపించదని తెలిపారు. Guy from India hasen't put his arm down for 10 Years to honor his God 😱#amazing #india #pandit #guru #sacrifice #ENGvIND @unexpected_new pic.twitter.com/ldAVoXpMJi — Next Level (@NextInteresting) September 24, 2022 ఇదీ చదవండి: Viral Video: హీరో లెవల్లో యువకుడి బైక్ స్టంట్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు -
లోక కల్యాణం కోరుకునేది హిందూధర్మమే
సాక్షి, హైదరాబాద్: యువతలో ఆత్మవిశ్వాసం నింపే భగవద్గీత వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరముందని, లోకకల్యాణం కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మం అని సాధుసంతులు అన్నారు. శుక్రవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మాచార్యుల సమావేశం హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో జరిగింది. సమావేశానికి 82 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరై ప్రసంగించారు. వచ్చే డిసెంబర్ 14న గీత జయంతి రోజు లక్ష మంది యువకులతో ‘లక్ష యువగళ గీతార్చన‘కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా సాధు సంతులతో ధర్మాచార్యుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా విశ్వహిందూ పరిషత్ లక్ష యువగళ గీతార్చన వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. యువతీ యువకులకు సంస్కార అమృతం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రపంచ దేశాలకు గురు స్థానంలో ఉన్న భారత్.. భగవద్గీత ఆధారంగా జ్ఞానాన్ని అందించిందని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి మాట్లాడుతూ దేశంలో హిందుత్వం తగ్గితే మారణహోమం పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతీ హిందువు తమ కర్తవ్యంగా ధర్మ రక్షణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకుడు రాఘవులు, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమ కన్వీనర్ వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. -
76 ఏళ్లుగా తిండీ, నీళ్లు ముట్టని యోగి కన్నుమూత
గాంధీనగర్: 76 ఏళ్లుగా అన్నపానీయాలు ముట్టుకోని యోగి ప్రహ్లాద్ జాని(90) మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. భక్తుల సంర్శనార్థం ఆయన మృతతదేహాన్ని రెండు రోజుల పాటు బనస్కంతలోని ఆశ్రమంలో ఉంచనున్నారు. అనంతరం గురువారం నాడు అదే ఆశ్రమంలో అంత్యక్రియలు చేపట్టనున్నారు. కాగా ప్రహ్లాద్ జాని గుజరాత్‌లోని చరడా గ్రామంలో జన్మించారు. ఈ యోగిని అతని భక్తులు ప్రేమగా "చునిర్వాలా మాతాజీ" అని పిలుస్తారు. గుజరాత్లో ఇతని పేరు తెలియని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. తిండీ, నీళ్లు లేకుండా 76 ఏళ్లుగా జీవించడంతో అతనిపై ఎంతోమంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. అందులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ కూడా ఒకరు. ఏమీ తినకుండా ఎలా జీవిస్తున్నారో అర్థం కాక చాలా మంది సైంటిస్టులు తలలు పట్టుకున్నారు. (ఆశ్రమంలో ఇద్దరు సాధువుల హత్య) ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ అసలు కారణాన్ని మాత్రం రాబట్టలేకపోయారు. 2010లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఓ అధ్యయనం నిర్వహించాయి. అందులో భాగంగా యోగిని 15 రోజుల పాటు ఒక గదిలో ఉంచి వీడియో మానిటరింగ్ నిర్వహించారు. అనంతరం ఎమ్ఆర్ఐ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, తదితర వైద్య పరీక్షలు జరిపారు. ఈ ఫలితాల్లో ఆయనకు అసాధారణ రీతిలో ఆకలి, దాహాన్ని తట్టుకునే లక్షణాలున్నాయని వెల్లడైంది. అయితే ధ్యానమే తనను బతికిస్తోందని యోగి గతంలోనే సమాధానమిచ్చారు. కాగా ఆయన ఆశ్రమాన్ని సందర్శించిన వారిలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉండటం గమనార్హం. (శివాలయంలో సాధువుల దారుణ హత్య) -
వీడిన మిస్టరీ.. డబ్బు కోసమే హత్య
సాక్షి, మహారాష్ట్ర : మహారాష్ట్రలోని నాంధేడ్లో హత్య గురైన ఇద్దరు సాధువుల మర్డర్ మిస్టరీ వీడింది. ఈ కేసుతో సంబంధమున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా ఎల్వీలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో పోలీసుల విచారణలో పలు అంశాలు వెలుగుచూశాయి. డబ్బు కోసమే సాధువులను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడి వాంగ్మూలం తీసుకుని కస్టడికి తరలించారు. కాగా శనివారం రాత్రి విగతజీవిగా పడి ఉన్న ఇద్దరు సాధువులు బాలబ్రహ్మచారి శివాచార్య, ఆయన శిష్యుడు భగవాన్ షిండే మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 24 గంటల్లోనే హత్య కేసును పోలీసులు ఛేదించారు. (ఆశ్రమంలో ఇద్దరు సాధువుల హత్య) -
‘దేవుడు కోరాడనే సాధువులను చంపేశా’
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపిన శివాలయంలో సాధువుల హత్య కేసును పోలీసులు ఒక్క రోజులోనే ఛేదించారు. మంగళవారం ఈ జంట హత్యలతో సంబంధం ఉన్న మురారీ అలియాస్ రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సాధువులతో జరిగిన గొడవ కారణంగానే అతడు వారిని హత్య చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. బంగు మత్తులో శివాలయంలో పడుకుని ఉన్న సాధువులపై కర్రలతో దాడి చేసి చంపినట్లు వెల్లడించారు. అయితే పోలీసుల విచారణలో మొదట తనకు సాధువులకు ఎటువంటి గొడవ జరగలేదని, దేవుడు కోరినందుకే రెండు హత్యలు చేశానని రాజు చెప్పడం గమనార్హం. అనంతరం పోలీసులు గట్టిగా ప్రశ్నించటంతో అతడు చేసిన నేరం ఒప్పుకున్నాడు. కాగా, సోమవారం రాత్రి బులందర్షహర్జిల్లా పగోనా గ్రామంలోని శివాయం లోపల జగదీష్, షేర్ సింగ్ అనే ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ( శివాలయంలో సాధువుల దారుణ హత్య ) గుడి దగ్గర గుమికూడిన జనం పోలీసుల దర్యాపులో ఆ ఇద్దరు సాధువులు రెండు రోజుల క్రితం రాజుతో గొడవపడ్డారని తెలిసింది. గొడవ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు అతడిపై అనుమానం వచ్చింది. రాజు గురించి విచారించగా.. హత్య జరిగిన రోజు రాత్రి అతడు కత్తితో ఊరిబయట కనిపించాడని తెలిసింది. దీంతో పోలీసులు రాజు కోసం గాలించి ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో అర్థనగ్నంగా.. మత్తులో తూగుతున్న అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. (విషాదం: మంటలు ఆర్పేందుకు వెళ్లి..) -
శివాలయంలో సాధువుల దారుణ హత్య
లక్నో: మహారాష్ట్రలోని పాల్గరిలో సాధువుల హత్య ఘటన మరువకముందే మరో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బులంద్‌షహర్‌లోని పగోనా గ్రామంలో శివాయం లోపల ఇద్దరు సాధువులను గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధాలతో అతి కిరాతకంగా హతమార్చారు. సోమవారం నాడు ఈ ఘటన జరిగివుండవచ్చని భావిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి వచ్చిన కొందరు గ్రామస్తులు రక్తపు మడుగులో పడి ఉన్న సాధువులను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (విషాదం: మంటలు ఆర్పేందుకు వెళ్లి..) మృతి చెందిన సాధువులను జగదీష్(55), షేర్ సింగ్(46)గా గుర్తించారు. ఈ ఘటనపై బులంద్‌షహర్ ఎస్ఎస్ఎస్పీ సంతోష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "ఇటీవలే ఇద్దరు సాధువులకు ఓ వ్యక్తితో గొడవ జరిగింది. అతను వీరి వస్తువులు దొంగిలించేందుకు ప్రయత్నించే క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఆ కోపంతోనే అతను వాళ్లిద్దరినీ చంపేసి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలింద"న్నారు. ప్రస్తుతం సదరు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. కాగా మహారాష్ట్రలోని పాల్ఘర్లో ఇద్దరు సాధువులతోపాటు ఓ డ్రైవర్‌ను అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. (మూకహత్య: ఉద్ధవ్ ఠాక్రేకు అమిత్ షా ఫోన్) -
తోట పనీ ధ్యానమే
ఆ జెన్ గురువు ఓ పర్వతం పాదాలకింద ఓ పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనే ఏళ్ళ తరబడి నివసిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో ఓ అందమైన పూలతోట కూడా ఉంది. ఆ తోటలో బోలెడన్ని పూలమొక్కలు. వాటి బాగోగులు పరిశీలించే పనులన్నీ శిష్యులకు అప్పగించారు సాధువు. వాళ్ళూ గురువుగారి మాట మీరకుండా పూదోటను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నిత్యమూ బోలెడు పువ్వులు వికసిస్తూ చూపరులను ఆకర్షించడమే ఆ పూలమొక్కల పని. సాధువుకు ఆ పూలవనం అంటే ఎంతో ఇష్టం. వాటిని శిష్యులు ప్రాణప్రదంగా చూసుకోవడం గురువుకెంతో నచ్చింది. అందుకే ఆయన ప్రతిరోజూ ఆ తోటలో కొన్ని గంటలు గడుపుతారు. అంతేకాదు, ఆయన కూడా కొన్ని మొక్కలకు నీరు పోస్తారు. పువ్వులతోనూ, మొగ్గలతోనూ, పచ్చని ఆకులతోనూ కబుర్లు చెబుతూనే, రాలిన ఆకులను సేకరించి తోటనంతా శుభ్రం చేస్తుంటారు. గురువు తీరుని చూసి ఆశ్చర్యంతో ఒకరడిగారు... ‘‘అయ్యా, ఈ తోటలో చెత్తాచెదారం మీరు బాగు చేయాలా... మీరు ఏం చెప్తే అది చెయ్యడానికి శిష్యులు ఉన్నారు... ఒకవేళ శిష్యులు బద్దకించినా డబ్బులు వెదజల్లితే తోట పనులు చెయ్యడానికి మనుషులు ముందుకొస్తారు కదా’’ అని. సాధువు నవ్వి ‘‘ఎవరో ఎందుకూ... నేను ఈ తోట పని చేస్తే తప్పేంటీ...’’ అని ప్రశ్నించారు. ‘‘తప్పు లేదండి. కానీ మీరు మహాత్ములు. ఎన్నో ప్రసంగాలు చేసే గొప్ప ఆలోచనాపరులు. మీ అపూర్వమైన కాలాన్ని మీరు మరివేటికైనా ఉపయోగించుకోవచ్చు కదా’’ అని ఆయన మనసులోని మాట చెప్పాడు. సాధువు ‘‘మిత్రమా, నేను ఒట్టి తోట పనే చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజానికి నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నాను... ప్రతి రోజూ నేను ఈ సమయం కోసమే నిరీక్షిస్తుంటాను. తోటలోకెళ్ళి ఎప్పుడు శుభ్రం చేస్తానా అని. ఇక్కడే ఇతర ఆలోచనలేవీ మనసులోకి రానివ్వక మొక్కలతోనూ పువ్వులతోనూ నా సమయాన్ని గడుపుతాను. మొక్కలకు నీరు పోస్తూ, వికసించిన పువ్వులతో మాట్లాడుతూ పరవశించి నన్ను నేను మరచిపోతుంటాను. అలాంటి అమృతఘడియలు మరెక్కడా అంత అమోఘంగా అద్భుతంగా దొరకవు. కనుక నాకీ తోట పనీ ఓ ధ్యానమే‘‘ అని చెప్పారు. – యామిజాల జగదీశ్ -
ఏకం అనేకం! అనేకం ఏకమే!!
ఆయన ఒక సాధువు.... ఏకాంతం కోసం ఓ పర్వతప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఓ పూరిపాక ఏర్పాటు చేసుకున్నారు. ఆయన దర్శనం కోసం ఓరోజు ఓ సన్యాసిని వచ్చింది. ఆమె తలపై గడ్డితో చేసిన ఓ టోపీ ఉంది. ఆమె మూడుసార్లు ఆ పూరిపాక చుట్టూ ప్రదక్షిణం చేసి అనంతరం ఆయన ముందుకొచ్చి నిల్చుని నమస్కరించింది. ‘‘అయ్యా! ఒక్క మాట చెప్పండి. నా టోపీని తీసి మిమ్మల్ని గౌరవిస్తాను’’ అంది ఆమె. సాధువు ఏం చెప్పాలా అని ఆలోచించారు. ‘ఒక మాట అంటే పెద్దగా ఉండక్కరలేదు. ఏం చెప్పాలి. నన్ను చిక్కుల్లో పడేసిందా ఈమే?’ అనుకున్నారు. ‘‘మీరు చెప్పలేకపోయారు. నేను పోతున్నాను’’ అని ఆమె వెళ్ళిపోయింది... ‘‘ఆమె ఏమడిగింది? ఆమె గడ్డి టోపీ దేనికి సంకేతం?’’ అని సాధువు ఆలోచనలో పడ్డారు. ‘‘ఇక్కడ ఇంతకాలమూ ఏకాంతంలో ఉండి ఏం లాభం? ఓ సాధారణ మహిళకు ఒక మాట చెప్పలేకపోయాను....’’ అని బాధపడ్డారు.ఇక ఇక్కడుండి లాభం లేదు అనుకుని అలా వెళ్తుండగా ఓ గురువు ఎదురుపడ్డారు. ఈయన్ని చూడగానే, ‘‘ఏమిటీ ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నావు... ఏమైంది?’’ అని అడిగారు గురువు. ‘‘ఒక మహిళ దగ్గర నేను ఓడిపోయాను. అవమానభారంతో ఉన్నాను. నేనిక బతికుండి ఏం లాభం?’’ అనుకుంటూ జరిగినందతా చెప్పి బాధపడ్డారు సాధువు. గురువు తన చూపుడు వేలు పైకెత్తి చూపించారు. ‘‘అన్ని నిజాలకు ఇందులో ఉంది సమాధానం... అన్నీ ఇందులో ఒదిగిపోతాయి. ఒకటి వందై, వంద వేలై, వేలు లక్షయి, లక్ష కోటయి... విడిపోయి మళ్ళీ పెరుగుతాయి. కానీ అన్నీ ఒకట్లో ఒకటై పోతాయి...’’ అన్నారు గురువు. సాధువు ఆ వేలి వంక దీక్షగా చూసారు. ఆ వేలిలో ఆ మహిళా కనిపించింది. ఆమె టోపీ తీసి తల వంచి గౌరవించినట్టు అనుభూతి చెందారు సాధువు. – యామిజాల జగదీశ్ -
‘ఆర్పీ’ నిందితుల అరెస్ట్
పరారీలోనే ప్రధాన సూత్రధారి సాధూ మునుగోడు : నల్లగొండ జిల్లాలో ఆర్పీ (రేడియేషన్ పవర్) దందా పేరిట అమాయకులను బురిడీ కొట్టించి రూ. లక్షలు వసూలు చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారి సాధూ ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు. మునుగోడు మండలంలోని సింగారం వాసి షేక్ అఫ్జల్ నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కి వెళ్లాడు. అక్కడ మల్లేపల్లికి చెందిన సాదూతో పరిచయం ఏర్పడింది. అప్పుడే తన వద్ద ఆర్పీ ఉందని రూ.లక్ష పెట్టుబడి పెడితే పదిరెట్లు అంతకన్నా ఎక్కువ లాభం వస్తుందని సాదూ నమ్మబలికాడు. దానిని లండన్ మెటల్ కంపెనీకి విక్రయిస్తే రూ. 2 లక్షల కోట్లు వస్తాయని, వీసా తదితర ఖర్చులకు డబ్బు అవసరమని, పెట్టు బడి పెడితే రూ. వెయ్యి కోట్లు ఇస్తామని అఫ్జల్‌కు ఆశ చూపగా, వెంటనే అతను రూ. 4 లక్షలు ఇచ్చాడు. కమీషన్ ఇస్తానని.. అఫ్జల్ ఏడాది గడిచాక సాదూని సంప్రదిస్తే డబ్బులు సరిపోవని, ఎవరైనా ఉంటే పెట్టుబడి పెట్టించు.. కమీషన్ కూడా ఇస్తానని చెప్పాడు. దీంతో అఫ్జల్ తనకు పరిచయం ఉన్న సింగారంకు చెందిన పిట్టల రఘు, మునుగోడుకు చెందిన నీల పుల్లయ్య, జక్కలవారిగూడేనికి చెందిన జక్కల మల్లేశ్, జక్కల లింగస్వామిలను ఏజెంట్లుగా నియమించుకున్నాడు. వారితో పాటు బంధువులు, స్నేహితుల వద్ద ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 6 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టించాడు. ఐదుగురు ఏజెంట్లు సింగారం, జక్కలవారిగూడెం, మునుగోడు, చీకటిమామిడి, చొల్లేడు తదితర గ్రామాల్లోని 50 మంది సభ్యుల నుంచి రూ. 52 లక్షలకు పైగా వసూలు చేశారు. కమీషన్‌తో జల్సాలు చేశారు. రెండు నెలల క్రితం ప్రిన్స్ రంగప్రవేశం రెండు నెలల క్రితం తన సోదరుడైన ఫర్హాన్ అహ్మద్ ఖాన్ (ప్రిన్స్)ని ముఠా సభ్యులకు పరిచయం చేశాడు. మీరు ఇకనుంచి వసూలు చేసిన దాంట్లో మీరు సగం తీసుకొని, మాకు సగం ఇవ్వాలని చెప్పాడు. అప్పటి నుంచి ఈ ముఠా సభ్యు లు ప్రిన్స్‌తో కలసి రూ.35 లక్షలకు పైగా బ్యాంక్ ఖాతాల పేరుతో వసూలు చేసి అతడికి ఇచ్చారు. నిందితుల నుంచి రూ. 32 లక్షల ఆస్తులను పోలీసులు రికవరీ చేసుకున్నారు. సూత్రధారి సాదూ పరారీలోనే ఉన్నట్లు సీఐ తెలిపారు. -
విదేశీ మహిళపై సాధువు లైంగిక దాడి
హోళీ ఉత్సవాలకోసం ఉత్తరప్రదేశ్‌లోని వృందావన్‌కు వచ్చిన ఓ 40 ఏళ్ల అమెరికన్ మహిళపై ఓ సాధువు అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమెను తీవ్రంగా కొట్టి మరి లైంగికదాడి చేసినట్లు పోలీసులు చెప్పారు. కృష్ణుడి భక్తురాలైన కాలిఫోర్నియాకు చెందిన ఆమె గత ఫిబ్రవరి 26న హోళీ ఉత్సవాల కోసం వృందావన్‌కు వచ్చి ఓ గెస్ట్ హౌస్‌లో దిగింది. మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయింది. అనంతరం తీవ్రగాయాలై స్పృహకోల్పోయిన ఆమెను పోలీసులు గుర్తించారు. మెలకువవొచ్చిన అనంతరం ఆమెను ప్రశ్నించగా ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. తులసీమాల ధరించిన ఓ సాధువు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. -
సాధువు లైంగిక వేధింపులపై ఫిర్యాదు
ఒక సాధువు తనను వేధిస్తున్నాడంటూ ఇటలీకి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శనివారం నాడు విచారణ ప్రారంభించారు. తనను చూసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నితాయీ దాస్ అనే సదరు సాధువు తనపై యాసిడ్‌తో దాడి చేస్తానని కూడా బెదిరించినట్లు బ్రిజ్ బాసి దేవి దాసి తెలిపారు. ఆమె గత 40 ఏళ్లుగా బృందావనంలోనే ఉంటున్నారు. బ్రిజ్ బాసి దేవి ఫిర్యాదుపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు మథుర సీనియర్ ఎస్పీ మంజిల్ సైనే తెలిపారు. -
అన్నను హతమార్చిన తమ్ముడు
మానవత్వం మంటగ లిసి మనిషిలోని మృగం బయటపడింది. చిన్ననాటి నుంచి కలిసిమెలిసి గడిపిన క్షణాలు.. సరదాగా ఆడుకున్న సంఘటనలేవీ ఆ సమయంలో గుర్తురాలేదు. కసి కమ్మేసిన కఠిన హృదయానికి అన్నాదమ్ముల అనుబంధం.. అప్యాయతానురాగాలేవీ కనిపించలేదు. అన్నను అంతం చేయాలనే పగ తమ్ముడిని హంతకుడిగా మార్చింది.. అన్న ఉసురు తీసింది. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు.. ముప్పయింది. అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు రగిల్చింది. ఉన్మాదిగా మారిన తమ్ముడు నిద్రపోతున్న అన్నను గొడ్డలితో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. ఈ దారుణ సంఘటన సోమవారం అర్ధరాత్రి వర్గల్ మండలం అంబర్‌పేటలో జరిగింది. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ విషాదకర ఘటనకు సంబంధించి సీఐ వెంకట య్య, మృతుని తల్లి సుగుణమ్మ, బంధువుల వివరాలిలా ఉన్నా యి. అంబర్‌పేటకు చెందిన శ్యామల నర్సయ్య, సుగుణమ్మ దంపతులకు ఎల్లం (24), గణేష్ అలియాస్ సాధు (22) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. కూతురు కవితకు వివాహం జరగగా, కొడుకులకు పెళ్లిళ్లు కాలేదు. పెద్ద కొడు కు ఎల్లం శాకారం సమీప పరిశ్రమలో కార్మికునిగా పనిచేస్తూనే బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిన్న కొడుకు గణేష్ ట్రాలీ ఆటో నడిపే వాడు. ఇటీవల గుంటూరు ప్రాంతంలో పందిరి తోటలకు స్తంభాలు వేసే పనికి వెళ్తున్నాడు. తల్లిదండ్రులు కూడా కూలీనాలి చేసుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొత్తగా నిర్మించుకున్న ఇంటి కోసం రూ.4 లక్షల మేర అప్పు చేశారు. ఈ అప్పు విషయంలో అన్నదమ్ముల మధ్య తరచూ గొడవలు జరిగేవి. గణేష్ ఇటీవలే దీపావళి పండుగ సందర్భంగా గుంటూరు నుంచి ఇంటికి వచ్చాడు. అయితే అప్పుల విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. అయితే తాను నడిపించే ట్రాలీ ఆటోకు చెందిన బ్యాటరీని అన్న ఎల్లం అమ్మేశాడని తెలిసి మరింత ఆగ్రహానికి గురయ్యాడు. అన్నను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి నర్సయ్య నాలుగు రోజుల క్రితమే భువనగిరి ప్రాంతంలో రాతి స్తంభాలు పాతేందుకు వెళ్లిపోయాడు. సోమవారం రాత్రి ఇంట్లోని కుడి పక్క గదిలో ఎల్లం నిద్రపోయాడు. హాల్లో తల్లి సుగుణమ్మ నిద్రపోయింది. ఎడమ వైపు గదిలో గణేష్ నిద్రపోయినట్లు నటిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తూ గడిపాడు. తల్లి, అన్న గాఢ నిద్రలో ఉన్నట్లు గమనించి అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా గొడ్డలితో అన్న గదిలోకి ప్రవేశించాడు. నిద్రపోతున్న ఎల్లం తలపై (చెవి భాగంలో) రెండు సార్లు కొట్టాడు. దీంతో రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ అతడు మరణించాడు. ఈ శబ్దానికి లేచిన తల్లి సుగుణమ్మ చిన్న కొడుకు గదిలో చూడగా అతను కన్పించకపోవడంతో పెద్ద కొడు కు గదిలోకి తొంగిచూసింది. అక్కడ రక్తపు మడుగులో పెద్దకొడుకు, పక్కనే ఉన్మాదిలా చిన్న కొడుకు కన్పించడంతో హత్య జరిగినట్లు గుర్తిం చి గుండెలవిసేలా విలపించింది. ఈ అరుపులు, ఏడుపులతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని నిందితుడు పారిపోకుండా జాగ్రత్త వ హించారు. అదే రాత్రి గౌరారం పోలీసులకు సమాచారమందించి నిందితుడిని అప్పగించారు. సోమవారం రాత్రి గౌరారం ఎస్సై మధుసూదన్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలిం చి వివరాలు సేకరించారు. మంగళవారం ఉదయం గజ్వేల్ ఇన్చార్జ్ సీఐ వెంకటయ్య ఘటన స్థలంలో మృతదేహన్ని పరిశీలించారు. మృతుని తల్లి సుగుణమ్మ నుంచి వివరాలు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అప్పుల విషయంలో అన్నదమ్ములైన ఎల్లం, గణేష్‌ల మధ్య వైషమ్యాలు పెరిగాయని, ఈ నేపథ్యంలోనే ఉన్మాదిగా మారిన తమ్ముడు అన్నను గొడ్డలితో కిరాతకంగా హతమార్చాడని సీఐ పేర్కొన్నారు. నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వివరించా రు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. బోరుమన్న తల్లి చేతికందిన ఇద్దరు అన్నదమ్ములు తమ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారనుకుంటే శత్రువుల్లా మారి ప్రాణాల మీద కు తెచ్చుకున్నారని తల్లి రోదించింది. ఒకరు చనిపోయి, మరొకరు జైలుకు వెళితే తమకు దిక్కెవరంటూ శోకసంద్రంలో మునిగిపోయింది. కొడుకు హత్య సమాచారం తెలిసిన తిరిగొచ్చి తండ్రి గుండెలవిసేలా విలపించాడు.