ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతోంది. ఈ మేళాకు పలువురు స్వామీజీలు, బాబాలు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో ఐఐటీ బాబాగా పేరొందిన అభయ్ సింగ్ కుంభమేళాలో సందడి చేశారు. సాధారణంగా ఐఐటీ అనగానే అక్కడ సీటు లభించడం మొదలుకొని చదువు పూర్తయ్యాక లభించే భారీ జీతం గురించి చర్చిస్తుంటారు. అయితే దీనికి భిన్నంగా ఐఐటీ చదువుతున్నవారు లేదా ఐఐటీ పూర్తి చేసిన పలువురు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ, బాబాలుగా పేరొందుతున్నారు. ఈ జాబితాలోకి వచ్చే కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గౌరంగ్ దాస్
ఐఐటీ బాంబే నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన గౌరంగ్ దాస్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్)లో చేరడం ద్వారా ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించారు. గౌరంగ్ దాస్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తన వీడియోల ద్వారా ఉన్నత వ్యక్తిత్వం గురించి ఆయన చెబుతుంటారు. గౌరంగ దాస్ పలు ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా రాశారు.
అభయ్ సింగ్
ఐఐటీ బాంబే నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన అభయ్ సింగ్ ఇటీవల వార్తల్లో నిలిచారు. అతను కెనడాలో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి, సన్యాసం స్వీకరించి, ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టారు.
ఆచార్య ప్రశాంత్
ఐఐటీ ఢిల్లీ నుండి ఇంజనీరింగ్ పట్టా పొందిన ఆచార్య ప్రశాంత్ కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. అతను తన కార్పొరేట్ కెరీర్‌ను వదిలి, ఆధ్యాత్మికత వైపు మళ్లారు. నేడు ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శిగా పేరొందారు. ఆధ్యాత్మికతపై ఆయన పలు పుస్తకాలు రాశారు.
సంకేత్ పారిఖ్
ఐఐటీ బాంబే నుండి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన సంకేత్ పారిఖ్ జైన సన్యాసం తీసుకున్నారు. దీనికి ముందు ఆయన అమెరికాలో ఉద్యోగం చేశారు. ఆయన జైన తత్వశాస్త్రాన్ని ఆకళింపు చేసుకుని, శాంతి వైపు అడుగులు వేశారు.
స్వామీ ఎంజే
ఐఐటీ కాన్పూర్, యూసీఎల్‌ఎ నుండి పీహెచ్‌డీ చేసిన ఎంజె.. రామకృష్ణ మఠంలో సన్యాసిగా మారారు. గతంలో ఆయన ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో గణిత శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. దీనికి ముందు ఎంజే హైపర్బోలిక్ జ్యామితి, రేఖాగణిత సమూహ సిద్ధాంతంపై పరిశోధనలు సాగించారు.
స్వామి ముకుందానంద
స్వామి ముకుందానంద్ ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి. ఆయన జగద్గురు కృష్ణపాల్జీ యోగా సంస్థను స్థాపించారు యోగా, ధ్యానం, ఆధ్యాత్మికతపై పలు పుస్తకాలను రాశారు. ప్రపంచవ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు.
అవిరళ్ జైన్
ఐఐటీ బీహెచ్‌యూ నుండి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన అవిరళ్ జైన్.. వాల్మార్ట్‌లో ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి, జైన సన్యాసం స్వీకరించారు. ఆయన కార్పొరేట్ జీవితాన్ని విడిచిపెట్టి, ధ్యాన మార్గాన్ని ఎన్నుకున్నారు.
స్వామి విద్యానాథ్ నంద్
ఐఐటీ కాన్పూర్ నుండి పట్టభద్రుడై, యుసిఎల్‌ఎ నుండి పిహెచ్‌డీ చేసిన స్వామి విద్యానాథ్ నంద్ రామకృష్ణ మఠంలో చేరి, తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేశారు.
సన్యాసి మహారాజ్
ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన సన్యాసి మహారాజ్ ఆధ్యాత్మిక జ్ఞానం అందిస్తుంటారు. అంతర్గత శాంతి, స్వీయ-సాక్షాత్కారం మనిషికి ఎంత ముఖ్యమో ఆయన జీవితం తెలియజేస్తుందని చాలామంది అంటుంటారు.ఈ బాబాలంతా భౌతికంగా విజయాలు సాధించడంతో పాటు, ఆధ్యాత్మిక పురోగతిని కూడా అందుకున్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: నాగసాధువులుగా మారిన మహిళా సాధకులు
Comments
Please login to add a commentAdd a comment