engineer
-
భారతీయులపై తీవ్ర వ్యాఖ్యలు..మస్క్ టీమ్ సభ్యుడు రాజీనామా
వాషింగ్టన్:ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ నేతృత్వం వహిస్తున్న అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) టీమ్ నుంచి ఓ ఇంజినీర్ రాజీనామా చేశాడు. 25 ఏళ్ల మార్కో ఇలెజ్ అనే ఇంజినీర్ భారతీయులపై సోషల్‌మీడియాలో గతంలో చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు తాజాగా వైరల్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో దుమారం రేగింది. ముఖ్యంగా భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఇలెజ్ తన పోస్టుకు రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇలెజ్ రాజీనామాపై అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. అతడు గతంలో ‘నార్మలైజ్ ఇండియా హేట్’ అనే పోస్టుతో పాటు ఇండియా నుంచి వచ్చిన హెచ్-1బీ వీసాదారులను ఉద్దేశించి ‘గోయింగ్ బ్యాక్ డోంట్ వర్రీ’ అనే వివాదాస్పద పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో డీవోజీఈ ట్రెజరీ డిపార్ట్మెంట్కు ఇలెజ్ రాజీనామా చేశాడు. ఈ పోస్టు ఖాలీ అయినట్లు ప్రభుత్వం ఇప్పటికే నోటిపై చేసింది. ఇలెజ్ డీవోజీఈ కంటే ముందు ఎక్స్(ట్విటర్)లోనూ ఇలాన్ మస్క్‌తో కలిసి పనిచేయడం గమనార్హం.కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత భారతీయులతో సహా పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను అమెరికా నుంచి సైనిక విమానాల్లో పంపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు సన్నిహితుడైన ఇంజినీర్ భారతీయులకు వ్యతిరేకంగా చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతోంది. -
వీళ్లంతా ఐఐటీ బాబాలు.. మంచి ఉద్యోగాలు వదిలి..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరుగుతోంది. ఈ మేళాకు పలువురు స్వామీజీలు, బాబాలు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో ఐఐటీ బాబాగా పేరొందిన అభయ్ సింగ్ కుంభమేళాలో సందడి చేశారు. సాధారణంగా ఐఐటీ అనగానే అక్కడ సీటు లభించడం మొదలుకొని చదువు పూర్తయ్యాక లభించే భారీ జీతం గురించి చర్చిస్తుంటారు. అయితే దీనికి భిన్నంగా ఐఐటీ చదువుతున్నవారు లేదా ఐఐటీ పూర్తి చేసిన పలువురు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ, బాబాలుగా పేరొందుతున్నారు. ఈ జాబితాలోకి వచ్చే కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గౌరంగ్ దాస్ఐఐటీ బాంబే నుండి కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందిన గౌరంగ్ దాస్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్)లో చేరడం ద్వారా ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించారు. గౌరంగ్ దాస్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తన వీడియోల ద్వారా ఉన్నత వ్యక్తిత్వం గురించి ఆయన చెబుతుంటారు. గౌరంగ దాస్ పలు ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా రాశారు.అభయ్ సింగ్ఐఐటీ బాంబే నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన అభయ్ సింగ్ ఇటీవల వార్తల్లో నిలిచారు. అతను కెనడాలో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి, సన్యాసం స్వీకరించి, ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టారు.ఆచార్య ప్రశాంత్ఐఐటీ ఢిల్లీ నుండి ఇంజనీరింగ్ పట్టా పొందిన ఆచార్య ప్రశాంత్ కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు. అతను తన కార్పొరేట్ కెరీర్‌ను వదిలి, ఆధ్యాత్మికత వైపు మళ్లారు. నేడు ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శిగా పేరొందారు. ఆధ్యాత్మికతపై ఆయన పలు పుస్తకాలు రాశారు.సంకేత్ పారిఖ్ఐఐటీ బాంబే నుండి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన సంకేత్ పారిఖ్ జైన సన్యాసం తీసుకున్నారు. దీనికి ముందు ఆయన అమెరికాలో ఉద్యోగం చేశారు. ఆయన జైన తత్వశాస్త్రాన్ని ఆకళింపు చేసుకుని, శాంతి వైపు అడుగులు వేశారు.స్వామీ ఎంజేఐఐటీ కాన్పూర్, యూసీఎల్ఎ నుండి పీహెచ్డీ చేసిన ఎంజె.. రామకృష్ణ మఠంలో సన్యాసిగా మారారు. గతంలో ఆయన ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో గణిత శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. దీనికి ముందు ఎంజే హైపర్బోలిక్ జ్యామితి, రేఖాగణిత సమూహ సిద్ధాంతంపై పరిశోధనలు సాగించారు.స్వామి ముకుందానందస్వామి ముకుందానంద్ ఐఐటీ ఢిల్లీ పూర్వ విద్యార్థి. ఆయన జగద్గురు కృష్ణపాల్జీ యోగా సంస్థను స్థాపించారు యోగా, ధ్యానం, ఆధ్యాత్మికతపై పలు పుస్తకాలను రాశారు. ప్రపంచవ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక, సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించారు.అవిరళ్ జైన్ఐఐటీ బీహెచ్‌యూ నుండి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన అవిరళ్ జైన్.. వాల్‌మార్ట్‌లో ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి, జైన సన్యాసం స్వీకరించారు. ఆయన కార్పొరేట్ జీవితాన్ని విడిచిపెట్టి, ధ్యాన మార్గాన్ని ఎన్నుకున్నారు.స్వామి విద్యానాథ్ నంద్ఐఐటీ కాన్పూర్ నుండి పట్టభద్రుడై, యుసిఎల్ఎ నుండి పిహెచ్డీ చేసిన స్వామి విద్యానాథ్ నంద్ రామకృష్ణ మఠంలో చేరి, తన జీవితాన్ని ఆధ్యాత్మికతకు అంకితం చేశారు.సన్యాసి మహారాజ్ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన సన్యాసి మహారాజ్ ఆధ్యాత్మిక జ్ఞానం అందిస్తుంటారు. అంతర్గత శాంతి, స్వీయ-సాక్షాత్కారం మనిషికి ఎంత ముఖ్యమో ఆయన జీవితం తెలియజేస్తుందని చాలామంది అంటుంటారు.ఈ బాబాలంతా భౌతికంగా విజయాలు సాధించడంతో పాటు, ఆధ్యాత్మిక పురోగతిని కూడా అందుకున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh: నాగసాధువులుగా మారిన మహిళా సాధకులు -
త్రీ ఇడియట్స్లోని మాధవన్‌లా ఫోటోగ్రఫీ వైపు మళ్లాడు..!కట్ చేస్తే..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీని పేరుకి తగ్గట్టుగానే ఈ కుంభ మేళ ఆధ్యాత్మిక గురువులుగా మారిన మహా మహా మేధావులను పరిచయం చేసింది. ఎందరో గొప్ప గొప్ప చదువులు చదివి వాటన్నింటిని పరిత్యజించి సాధువుగా జీవిస్తున్న వాళ్లను కళ్లకుకట్టినట్లు చూపించింది. చూడటానికి సాదాసీదా సాధువుల అనుకుంటే పొరపడ్డట్టే.. అనేలా వాళ్ల చరితలు ఉన్నాయి. వారంతా ఏకంగా ఐఐటీ వంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో చదివి, మంచి జీతాలతో హుందాగా జీవించినవారే. ఆధ్యాత్మికతకు ఆకర్షితులై..అందుకోసమే జీవితాన్ని అర్పించి..సాధువులుగా జీవిస్తూ..అందర్నీ ఆశ్చర్యచికితుల్ని చేశారు. వారి జీవన విధానం మహాత్తర జీవన సారాన్ని గురించి వెలుగెత్తి చాటింది. అలాంటికోవకు చెందిన వ్యక్తే ఈ మహకుంభమేళలో ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతనెవరంటే..ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh,)ని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో పాల్గొని త్రివేణి సంగమ పవిత్ర జలాల్లో స్నానమాచరించి తరిచేందుకు లక్షలాది భక్తులు తరలివస్తున్నారు. ఈ ఆధ్మాత్మిక సంబరంలో మునిగితేలుతున్న ఎందరో సాధువులు, రుషులు, మత గురువుల మధ్య ఓ వ్యక్తి మీడియా దృష్టిని ఆకర్షించాడు. అతడే హర్యానా(Haryana,)కు చెందిన అభిసింగ్(Abhey Singh). ఆయన్ని అంతా ఇంజనీర్ బాబాగా పిలుస్తారు. ఎంతో ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి అకస్మాత్తుగా దైవ చింతన వైపుగా మళ్లాడు. అంతే ఇక వెంటనే ఉన్నతోద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని తృణప్రాయంగా విడిచి పెట్టి సన్యాసిలా జీవిస్తున్నాడు. అతడి కథ వింటే విస్తుపోతారు. అంతటి హోదాను వదలుకుని సాదాసీధాగా బతకాలని ఎలా నిర్ణయించుకున్నాడు?. ఇది మనోనిబ్బరమా..? ఆధ్యాత్మికతకున్న శక్తినా? అనేది మాటలకందనిది. ఇక్కడ అభిసింగ్ ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్(Aerospace Engineer) డిగ్రీని పూర్తి చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ మంచి ఉద్యోగాన్ని కూడా పొందాlo. అయితే ఇది తన కెరీర్ కాదని త్రీ ఇడియట్స్లోని మాధవన్ మాదిరి ఫోటోగ్రఫీపై మక్కువతో ట్రావెల్ ఫోటోగ్రఫీ కెరీర్ వైపుకి మళ్లాడు. ఆ కళ అతనికి జీవతం విలువ, తత్వశాస్త్రం గురించి తెలుసుకునేందుకు దోహదపడింది. ఆ తర్వాత భౌతిక శాస్త్రాన్ని బోధించే కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించాడు. అలా ఓ ఎంటర్ప్రెన్యూర్ టీచర్‌గా మంచి సక్సెస్‌ని కూడా అందుకున్నాడు. అయినా అవేమి అతడికి సంతృప్తినివ్వలేదు. క్రమంగా అతడి మనసు దైవ చింతన, ఆధ్యాత్మికత వైపుకి దృష్టిమళ్లింది. అందులో మమేకమై..గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకోవాలనే జిజ్ఞాస రేకెత్తింది. అలా అతను శివ సాధువుగా మారిపోయాడు. ఆయన తరచుగా అంతా శివమయం, సత్యమే శివుడు అని మాట్లాడుతుంటాడు. అంతేగాదు ఇంత సాధారణంగా ఉండే ఇంజనీరింగ్ బాబాకు సోషల్ మీడియాలో దాదాపు 30 వేలకు పైగా మంచి ఫాలోయింగ్ ఉంది కూడా. ప్రస్తుతం ఈ కుంభమేళలో పాల్గొన్న ఆయన అక్కడకు వచ్చిన మీడియా ముందు జర్నలిస్ట్‌లతో అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడటంతో అతడెవరనే ఉత్సుకతను రేకెత్తించింది. ఈ క్రమంలోనే అతడి ఆధ్మాత్మికత ప్రయాణం వెలుగులోకి వచ్చింది. (చదవండి: సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ ఆరోగ్యానికి మంచి గేమ్ ఛేంజర్..!) -
సుందిళ్ల బ్యారేజీ ఇంజినీర్లపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం
సాక్షి ,హైదరాబాద్ : సుందిళ్ల బ్యారేజీల నిర్మాణల కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగం(సీడీవో) ఇంజినీర్లపై కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యారేజీల నిర్మాణాలపై అఫిడవిట్లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా ఇంజినీర్లు సమాధానాలు చెప్పడంపై మండిపడింది. నిర్మాణాలపై తప్పుడు సమాధానాలు చెబితే క్రిమినల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజి సహా కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ క్షేత్రస్థాయి ఇంజినీర్లతో జరిపిన రెండు రోజుల పాటు జరిపిన బహిరంగ విచారణ జరిపింది. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్లో కాళేశ్వరం న్యాయవిచారణ కమిషన్ తొలిరోజైన సోమవారం మేడిగడ్డ, రెండో రోజైన మంగళవారం సుందిళ్ళ బ్యారేజి నిర్మాణాలపై విచారణ చేపట్టింది. ఈ విచారణలో కమిషనర్ ఆఫ్ డిజైన్స్ విభాగాని(సీడీవో)కి చెందిన ఏఈఈ,డీఈ,ఈఈ,డీసీఈ’ 16మంది ఇంజినీర్లను కమిషన్ సుందిళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగింది. కమిషన్ చైర్మన్ అడిగిన ప్రశ్నలకు ఇంజినీర్లు తప్పుడు సమాధానాలు చెప్పిటన్లు తెలుస్తోంది. అఫిడవిట్లో ఒకలా.. బహిరంగ విచారణలో మరోలా సమాధానాలు మార్చి చెప్పడంపై కమిషన్ చైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుందిళ్ళ బ్యారేజి బ్లాక్ 2ఏను డిజైన్ లేకుండానే నిర్మాణం చేశామని ఇంజినీర్లు కమిషన్‌కు వెల్లడించారు. దీంతో డిజైన్ లేకుండానే బ్లాక్ ఎలా నిర్మించారు? ఎలా సాధ్యమైంది? అని కమిషన్ ప్రశ్నించింది. కమిషన్ ప్రశ్నకు.. ఒకటో బ్లాక్,మూడు బ్లాక్‌ల మధ్య 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని ఒకసారి..రెండు,మూడు బ్లాక్‌ల మధ్య నిర్మాణం చేశామని బదులిచ్చారు. మధ్యలో రెండో బ్లాక్ తర్వాతే 2ఏ బ్లాక్ కట్టామని కమిషన్‌కు ఓ ఇంజినీర్ వివరించారు. 2ఏ బ్లాక్‌కు డిజైన్ లేకపోవడంతో రెండో డిజైన్ ఆధారంగా 2ఏ బ్లాక్ నిర్మాణం పూర్తి చేశామన్నారు. అప్పటి ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే డిజైన్ లేకపోయినా 2ఏ బ్లాక్ నిర్మాణం చేశామని కమిషన్‌కు వివరించారు.ఇలా ఇంజినీర్లు చెప్పిన తప్పుడు సమాధానాలపై అవసరమైతే క్రిమినల్ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని కమిషన్ హెచ్చరించింది. 16 మంది ఇంజినీర్ల నుండి బ్యారేజ్ పనుల రికార్డులపై సంతకాలు తీసుకుంది. ఆ రికార్డ్లను స్వాధీనం చేసుకున్న అనంతరం కమిషన్ తన విచారణను ముగించింది.తొలిరోజు మేడిగడ్డ నిర్మాణాలపై ప్రశ్నల వర్షంతొలిరోజు మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో పియర్స్ కుంగుబాటుకు కారణాలతో పాటు ఇతర నిర్మాణలపై కమిషన్ ఇంజినీర్లకు పలు ప్రశ్నలు సంధించింది. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ముందే సిద్ధం చేసుకుని వచ్చిన సమాధానాలు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్మాణలకు సంబంధించిన ఇంజినీర్లు సమర్పించిన రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్.. వారితో సంతకాలు చేయించుకుని విచారణను నిలిపివేసిందిఇవాళ (మంగళవారం) సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపై ఇంజినీర్లను కమిషన్ బహిరంగంగా విచారించింది. విచారణలో ఇంజినీర్లు చెప్పిన సమాధానాలకు కమిషన్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. -
Viral video: ఒకప్పుడు విదేశాల్లో టెకీ.. ఇప్పుడు బిచ్చగాడు
అతను ఒకప్పుడు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో, ఆ తరువాత బెంగళూరులో ఓ ప్రముఖ టెక్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. ఇప్పుడదే బెంగళూరులోని జయనగర్ వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నాడు. మద్యానికి బానిసవడమే తన దుస్థితికి కారణమని చెబుతున్నాడు. అతను తనతో పంచుకున్న కథను శరత్ యువరాజా అనే యువకుడు ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐన్‌స్టీన్ మొదలుకుని పలువురు తత్వవేత్తల దాకా అందరి గురించీ అతను అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ధ్యానం, తత్వశాస్త్రం, సైన్స్ వంటి అంశాలపై లోతైన వ్యాఖ్యలు చ్తేస్తున్నాడు. అయితేనేం, ‘తల్లిదండ్రులను కోల్పోవడం నన్ను మద్యం మత్తులోకి నెట్టింది. అది అదుపు తప్పి ఈ గతి పట్టింది. నిరాశ్రయుడిగా మారి బతకడం కోసం భిక్షాటన చేస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ‘‘మతం కులం, ఇవన్నీ కలగలసి చివరకు నేనేమయ్యానో చూడండి. నేనింకా చదవాలి’’ అని మరో వీడియోలో చెప్పాడు. సాయం చేయడానికి ప్రయత్నిస్తే నిరాకరించాడని శరత్ పేర్కొన్నారు. ‘‘దాంతో ఎన్జీవోలను సంప్రదించా. కానీ పోలీసుల ప్రమేయంతోనే అతన్ని మార్చడం సాధ్యమని డాక్టర్లు అంటున్నారు’’ అని చెప్పారు. వ్యసనాలకు దూరంగా ఉండటం, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వృత్తిలో విజయాలు తదితరాలపై ఈ వీడియోలు ఆన్లైన్లో గట్టి చర్చకు దారి తీశాయి. View this post on Instagram A post shared by 𝙎𝙃𝘼𝙍𝘼𝙏𝙃 YUVARAJ🌎 (@sharath_yuvaraja_official) -
అతి చిన్న వాషింగ్ మెషీన్‌తో ప్రపంచ రికార్డు..!
ఊహకే అందని విధంగా అత్యంత మైక్రో వాషింగ్ మెషిన్ని రూపొందించి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు భారతీయ ఇంజనీర్ సెబిన్ సాజీ. ఇదే ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్. దీని వైశాల్యం, పొడవు, వెడల్పలు వరుసగా 1.28 అంగుళాలు, 1.32 అంగుళాలు, 1.52 అంగుళాలే కావడం విశేషం. ఇది ఇది 1990ల నాటి ప్రసిద్ధ హ్యాండ్‌హెల్డ్ బొమ్మ అయిన డిజిటల్ పెంపుడు జంతువు సైజు కంటే కూడా చిన్నది. అయితే ఇది సాధారణ వాషింగ్ మెషీన్‌లానే పనిచేస్తుండటం మరింత విశేషం. ఇది చిన్న లోడ్ల కోసం రూపొందించడం జరిగింది. ఇంజీనీరింగ్ నైపుణ్యంతో సూక్ష్మీకరణ అనే హస్తకళకు సాజీ రూపొందించిన ఈ గాడ్జెట్ నిలువెత్తు నిదర్శనం. వర్కింగ్ పరంగా అసెంబుల్ చేసి చూస్తే..అది పూర్తిగా వర్క్ అవ్వడమే కాక, వాష్ , రిన్ , స్పిన్, వంటి వాటిని కొలిచేందుకు డిజిటల్ కాలిపర్లను ఉపయోగించారు. సాజీ వాషింగ్ మెషీన్ ఎలా వర్క్చేస్తుందో వివరిస్తున్న వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వాషింగ్ మెషీన్లో చిన్న క్లాత్, చిటికెడు వాషింగ్ పౌడర్ వేయగానే ఎలా వాష్ చేస్తుందో క్లియర్‌గా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటివరకు తయారైన మైక్రో వాషింగ్ మెషీన్లలో ఇదే అత్యంత చిన్నదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది. (చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!) -
ఆ వృద్ధుడు ఒకప్పుడు ఇంజనీర్..నేడు వీధుల్లో చెత్త ఏరుకుంటూ..!
కోట్లకు పడగలెత్తిన వ్యక్తులైన ఒక్కోసారి అమాంతం కుప్పకూలిపోతారు. ఉన్నదంతా తుడిచిపెట్టుకుపోయి రోడ్డుపాలవ్వుతారు. అరే ఒకప్పుడూ ఎలా ఉండేవాడు ఇప్పుడిలా అని అంతా నోరెళ్లబెడతారు. ఎందుకిలా అనేది ఇది అని చెప్పలేం కానీ చూసేవాళ్లకి ఎవ్వరికైన మనసు ఒక్కసారిగా చివుక్కుమంటుంది. అలాంటి దృశ్యమే నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియోని చూస్తే ఎవ్వరికైన ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చేస్తాయి. జిగల్ రావల్ అనే సామాజికి కార్యకర్త ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి చేసిన వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఓ వృద్ధ వ్యక్తి మాట్లాడుతూ కనిపిస్తాడు. అతడు ఒకప్పుడు ఇంజనీర్‌గా బాగా బతికిన వాడినని చెప్పాడు.తాను బాగా సంపాదించేందుకు భార్య పిల్లలతో సహా దుబాయ్ వెళ్లానని, అయితే అక్కడ తాను ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన భార్య తనను వదిలేసి పిల్లలను తీసుకుని వేరే అతనితో వెళ్లిపోయిందని బాధగా చెప్పాడు. ఆమె కోసం సంపాదించాలనుకోవడమే తనకు శాపమయ్యిందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం తాను పొట్ట పోషించుకోవడం కోసం ఇలా వీధుల్లో చెత్త ఏరుకుంటూ బతుకుతున్నానని చెప్పుకొచ్చాడు. అతడి పరిస్థితి విన్న ప్రతి ఒక్కరి మనసు చివుక్కుమంటుంది. ఒకప్పుడు మంచి ఫ్రోషనల్గా బతికిన వ్యక్తి ఇంత దారుణమైన స్థితిలో జీవనం సాగించడం ఏంటీ..? అసలు విధి ఇంత ఘోరంగా మనుషులతో ఆడుకుంటుందా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.(చదవండి: కింగ్ ఆఫ్ ఇడ్లీలు" గురించి విన్నారా? పాలక్కాడ్ ఫేమస్ వటకం..!) -
అంతరిక్షం నుంచి ఐక్యతా గీతం
అంతరిక్షంలో తొలి ప్రైవేట్ స్పేస్ వాక్ చేసిన వ్యోమగాముల్లో ఒకరిగా చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ ఇంజనీర్ సారా గిలిస్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా ‘స్టార్‌వార్స్: ద ఫోర్సెస్ అవేకెన్స్’లోని ప్రఖ్యాత ‘రేస్ థీమ్’ను అంతరిక్షం నుంచే పర్ఫామ్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. పొలారిస్ డాన్ ప్రైవేట్ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్ఎస్కు ప్రయాణించిన స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక నుంచే ఆమె ఈ మ్యూజికల్ ట్రిబ్యూట్లో పాల్గొన్నారు. సోలో వయోలిన్‌ను సారా వాయించగా పూర్తిస్థాయి ఆర్కెస్ట్రా బృందం భూమి నుంచి ఆమెకు వాద్య సహకారం అందించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘హార్మనీ ఆఫ్ రెసీలియన్స్’ పేరిట పొలారిస్ ప్రోగ్రాం బృందం శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘‘విశ్వభాష అయిన సంగీతమే ఈ వీడియోకు స్ఫూర్తి. అలాగే బాలల్లో క్యాన్సర్ తదితర మహమ్మారులపై పోరాటం కూడా. చుక్కలనంటే ఉన్నత ఆశయాలను నిర్దేశించుకునేలా తర్వాతి తరాన్ని ప్రేరేపించడమే దీని ఉద్దేశం’’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ‘అందమైన మన పుడమి చుట్టూ చక్కర్లు కొడుతున్న ఈ ఆనంద క్షణాలను సంగీతమయంగా మార్చి మీ అందరితో పంచుకునేందుకు చేసిన ఓ చిన్న ప్రయత్నమిది’ అంటూ సారా గొంతుతో వీడియో ముగుస్తుంది. ‘‘మానవాళి ఐక్యతకు, మెరుగైన ప్రపంచపు ఆకాంక్షలకు ఈ ప్రయత్నం ఓ ప్రతీక. బాలల్లో నిబిడీకృతమై ఉండే అనంతమైన ప్రతిభా పాటవాలకు ఇది అంకితం’’ అని సారా పేర్కొన్నారు. పొలారిస్ డాన్ మిషన్ కమాండర్ జరేద్ ఐజాక్‌మ్యాన్‌తో పాటు సారా గురువారం స్పేస్ వాక్ చేయడం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి నాన్ ప్రొఫెషనల్ వ్యోమగాములుగా వారు నిలిచారు. ఈ వీడియో తయారీలో సెయింట్ జూడ్ చి్రల్డన్స్ రీసెర్చ్ హాస్పిటల్ కూడా పాలుపంచుకుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బిగ్.. హంబగ్!
సాక్షి, హైదరాబాద్: కాలేజీలో క్యాంపస్ నియామకాలున్నాయా? ఏయే కంపెనీలు వస్తాయి? వార్షిక ప్యాకేజీలు ఎలా ఉంటాయి? ఇంజనీరింగ్‌లో చేరే ప్రతీ విద్యార్థి ముందుగా వాకబు చేసే అంశాలివి. పెద్ద కంపెనీలు క్యాంపస్ నియామకాలు చేపడతాయంటే ఆ కాలేజీకి ఎగబడతారు. కానీ ఐటీ కంపెనీల వల్ల ఇప్పుడు ట్రెండ్ మారిందంటున్నారు నిపుణులు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీల కన్నా... చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలే ఎక్కువ వేతనాలు ఇస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే నైపుణ్యం ఉన్న వారికి పెద్ద సంస్థల కన్నా భారీగా జీతాలు చెల్లిస్తున్నాయి. కోవిడ్ తర్వాత ఈ మార్పు స్పష్టంగా కన్పిస్తోందని స్పెషలిస్ట్ స్టాఫింగ్ కంపెనీ ‘ఎక్స్‌ఫెనో’ అధ్యయనంలో వెల్లడైంది.దూసుకెళ్లే అవకాశాలుదేశంలో ఐటీ సేవలు అందించే ఆరు కంపెనీల్లో దాదాపు 20 వేల మంది వేతనాలను పరిశీలించింది. వీళ్లంతా ఇంజనీరింగ్ పూర్తి చేసి, కొత్తగా ఐటీ ఉద్యోగాల్లో చేరినవాళ్ళే. వీళ్ళల్లో 74 శాతం మందికి ఏడాదికి రూ. 2.5 నుంచి రూ. 5 లక్షల వేతనం ఇస్తున్నారు. 12 శాతం మందికి రూ. 5.75 నుంచి రూ. 7 లక్షల వార్షిక వేతనం ఇస్తున్నారు. కేవలం 7 శాతం మంది మాత్రమే రూ. 7.5 లక్షల కన్నా ఎక్కువ వేతనం పొందుతున్నారు⇒ మధ్యస్థంగా ఉండే 10 ఐటీ సర్వీస్ కంపెనీల్లో 5 వేల మంది వేతనాలపై అధ్యయనం చేశారు. 57 శాతం మందికి రూ. 2.5–5 లక్షల వార్షిక ప్యాకేజీ ఇస్తున్నారు. 30 శాతం మందికి రూ.5.75 లక్షల ప్రారంభ వేతనం ఇస్తున్నాయి. 7 శాతం మందికి పెద్ద సంస్థలకన్నా ఎక్కువ వేతనం చెల్లిస్తున్నాయి.⇒ ఆరు పెద్ద కంపెనీల్లో రెండేళ్ల తర్వాతే పదోన్నతులు లభిస్తున్నాయి. వేతనంలో హైక్ నిమిత్తం మధ్యస్థ కంపెనీలు ప్రతీ ఆరు నెలలకూ వృత్తి నైపుణ్య అంచనా వేస్తున్నాయి. 58 శాతం ఫ్రెషర్స్‌కు స్కిల్‌ను బట్టి ప్రమోషన్లు ఇచ్చారు.కోతకు చాన్స్ తక్కువేగడచిన ఐదేళ్లుగా టైర్–1 ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగులను తగ్గించుకున్నాయి. ఆరు కంపెనీల్లో 15 శాతం మేర కోత పెట్టాయి. హై స్కిల్ ఉండి, మధ్యస్థ వేతనం ఉన్న వాళ్ళనే కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాయి. ఫ్రెషర్స్ విషయంలో పరిస్థితి దయనీయంగా ఉంటోంది. మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయంగా వచ్చే పరిస్థితులను పెద్ద కంపెనీలు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. చిన్న, మధ్యస్థ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల, స్కిల్స్ ఉంటే అంత తొందరగా తీసేసే అవకాశం ఉండదు. కాబట్టి వేగంగా ప్రమాదం ముంచుకొస్తుందన్న భయం ఉండదని ఉద్యోగులు భావిస్తున్నారు. పెద్ద కంపెనీల ఉద్యోగుల్లో అనుక్షణం భయం వెంటాడుతోంది.ట్రెండ్‌ను కాలేజీలూ పట్టుకోవాలిప్రతీ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా క్యాంపస్ నియామకాలకు సంబంధించిన విభాగం ఉంటుంది. మొదటి సంవత్సరం నుంచే విద్యార్థులకు స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నాయి. అయితే, పెద్ద కంపెనీల మనోభావాలనే ఈ శిక్షణలో భాగస్వామ్యం చేస్తున్నాయి. దీంతో పాటు చిన్న, మధ్యస్థ ఐటీ సంస్థల అవసరాలు, అవి ఆఫర్ చేస్తున్న జాబ్ మార్కెట్‌పైనా అవగాహన కల్పించాలని హైదరాబాద్ లోని ఓ మల్టీ నేషనల్ కంపెనీ సీనియర్ కన్సల్టెంట్ విశేష్ తెలిపారు. క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్‌లో ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీలకన్నా, చిన్న కంపెనీలే అత్యధిక వేతనాలు ఇస్తున్నాయి. ఈ దిశగా శిక్షణ ఇస్తే విద్యార్థుల ఉపాధి అవకాశాల్లో మార్పులుండే వీలుంది.వేతనాల్లో పెద్ద వాటితో పోటీ..ఉద్యోగి నిర్వహించే పాత్ర, అతని అనుభవాన్ని బట్టి కంపెనీల్లో వేతనాలుంటున్నాయి. ఈ విషయంలో పెద్ద కంపెనీలతో చిన్న కంపెనీలు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇది ఈ మధ్య కన్పిస్తున్న కొత్త ట్రెండ్. - రోహన్ సిల్వెస్టర్ (టాలెంట్ స్ట్రాటజీ అడ్వైజర్,ఇన్‌డీడ్ ఇండియా)నిలబడేందుకు పోరాటం చిన్న, మధ్యస్థ కంపెనీలు తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు ఓ రకంగా పోరాటం చేస్తున్నాయి. మార్కెట్లో నిలబడాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణంగా నైపుణ్యం ఉన్న ఫ్రెషర్స్‌కు పెద్ద కంపెనీల కన్నా 30 నుంచి 50 శాతం వేతనాలు ఎక్కువ ఇచ్చి చేర్చుకుంటున్నాయి. పదేళ్ళ నికర వృద్ధిలో ఇవి కూడా అత్యుత్తమ ప్రమాణాలకు చేరుకోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. - నీలమ్‌కౌర్ (ఐటీ ప్రొఫెషనల్, ముంబై) చిక్కులు తెస్తున్న ఆర్థికాంశాలు ఆర్థిక మాంద్యం పెద్ద కంపెనీ ఉద్యోగుల స్థితి గతులను మారుస్తోంది. ఈ ప్రభావం చిన్న, మధ్యస్థ కంపెనీల్లో తక్కువగా ఉంటోంది. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు కూడా ఐటీ సేవల్లో ఈ సంస్థలకే ప్రాధాన్యమిచ్చే ధోరణి కన్పిస్తోంది. కాబట్టి స్కిల్స్ ఉన్న వాళ్ళకు చిన్న కంపెనీల్లోనూ ఢోకా ఉండదు. ఎంఎస్ ప్రసాద్ (టైర్–1 కంపెనీలో వర్క్‌ఫోర్స్ హెడ్) -
అటల్ సేతు నుంచి సముద్రంలోకి దూకి...
మహారాష్ట్రలోని ముంబైలో అటల్ సేతుపై నుంచి దూకి ఓ యువ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు డోంబవలికి చెందిన శ్రీనివాసన్ కురుటూరి (38)గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాసన్ బుధవారం మధ్యాహ్నం 12.24 గంటలకు అటల్ సేతుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై న్హవా షెవా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.అటల్ సేతు వద్దనున్న సీసీటీవీ ఫుటేజీలో ఒక కారు అటల్ సేతు వద్ద అకస్మాత్తుగా ఆగడం, ఒక వ్యక్తి కారులో నుండి బయటకు వచ్చి వంతెన రెయిలింగ్‌పైకి వేగంగా ఎక్కి, సముద్రంలోకి దూకడం కనిపిస్తుంది. మృతుడు శ్రీనివాసన్ విదేశాల్లో ఉద్యోగం చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చి వ్యాపారం ప్రారంభించాడు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. పోలీసులు స్థానికుల సాయంతో సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. -
‘కావాలంటే కాళ్లు మొక్కుతా’.. ఇంజనీర్‌పై బిహార్ సీఎం అసహనం
పట్నా: బిహార్‌లోని జేపీ గంగా బ్రిడ్జ్ పనులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సహానం కోల్పోయారు. జేపీ గంగా ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇంజనీర్‌పై వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం 12. 5 కిలోమిటర్ల దూరం నిర్మించాల్సి ఉంది. అయితే ఇంకా 4. 5 కిలో మీటర్ల నిర్మాణం పెండింగ్‌లో ఉండటంతో ప్రాజెక్టు ఇంజనీర్‌పై సీఎం నితీష్ తీవ్ర అసహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంజనీర్‌తో మాట్లాడుతూ.. ‘‘మీరు కావాలనుకుంటే.. మేము కాళ్లు మొక్కుతాం. తొందరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి’’ అని చేతులు జోడించి కోపంతో ఊగిపోయారు. దీంతో ‘‘సర్, మీరు దయ చేసి అలా మాట్లాడవద్దు’’ అని సదరు ఇంజనీర్ తిరిగి సీఎంకు చేతులు జోడించి వివరణ ఇచ్చారు. దీంతో సీఎం నితీష్ శాంతించారు. ఈ కార్యకమ్రంలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, స్థానిక ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.Watch: Bihar CM Nitish Kumar urged an IAS officer to expedite the extension of JP Ganga Path up to Kangan Ghat in Patna, says "I touch your feet; please complete the work on time" pic.twitter.com/bAkFU6aAOK— IANS (@ians_india) July 10, 2024 ఇక.. ఇటీవల బిహార్‌లో పలు బ్రిడ్జ్‌లు, కాజ్‌వేలు కుప్పకూలడంతో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో 15 మంది ఇంజనీర్లపై బిహార్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. అనంతరం ప్రభుత్వం వరుస బ్రిడ్జ్‌లు కుప్పకూలటంపై ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 17 రోజుల్లో 10 బ్రిడ్జ్‌లు కూలిపోవడానికి ఇంజనీర్ల నిర్లక్ష్యం, సరిగా పర్వవేక్షించపోవటమే కారణమని దర్యాప్తు బృందం నివేదిక ఇచ్చినట్లు బిహార్ జలవనరుల విభాగం అడిషినల్ చీఫ్ సెక్రటరీ చైతన్య ప్రసాద్ పేర్కొన్నారు. -
'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!
ఏఐ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ శరవేగంగా దూసుకుపోతోంది. రోబోల దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు ప్రతి రంగంలో దీని సాంకేతికను వినియోగిస్తున్నారు. యావత్తు ప్రపంచం దృష్టి ఈ టెక్నాలజీ పైనే ఉంది. ఇప్పుడు అలానే తాజాగా ఏఐ సాంకేతికతో కూడిన దుస్తులు మన మందుకు వచ్చాయి. బహుశా ప్రపంచంలోనే తొలి ఏఐ దుస్తులు ఇవే. దీన్ని రూపొందించింది గూగుల్ ఇంజనీర్ క్రిస్టినా ఎర్నెస్ట్. ఈమె SheBuildsRobots.org వ్యవస్థాపకురాలు. ఈ వెబ్సైట్ సాయంతో రోబోట్లు రూపొందించడంపై బాలికలకు అవగాహన కల్పిస్తుంది క్రిస్టినా. ఆమె ఈ ఏఐ డ్రెస్‌ని రోబోటిక్ పాములను జోడించి మరి రూపొందించింది. ఇది "మెడుసా డ్రెస్"గా పిలిచే నలుపు రంగులో ఉంటుంది. ఈ డ్రెస్ ధరించి మరీ చూపించింది. అదెలా ఉంటుందంటే..ఆమె మెడ చుట్టూ పెద్ద రోబోటిక్ పాము ఉంటుంది. అలాగే నడుము చ్టుట్టూతా కూడా మూడు బంగారు రంగు పాములు ఉంటాయి. ఈ రోబోటిక్ స్నేక్ డ్రెస్‌ని ముఖాలను గుర్తించేలా రూపొందించినట్లు తెలిపింది. మనల్ని చూస్తున్న వ్యక్తి వైపుకి పాము తల తిప్పి చూసేలా కృత్రిమ మేధస్సుతో కోడింగ్ చేశానని తెలిపింది క్రిస్టినా. ఇలాంటి ఏఐ డ్రెస్ ప్రపంచంలోనే మొట్టమొదటిది అయ్యి ఉండొచ్చని పేర్కొంది. అలాగే ఈ డ్రెస్‌ని రూపొందించడానికి తాను ఎలాంటి ప్రయోగాలు చేశాను, ఎన్ని సార్లు విఫలమయ్యిందో కూడా వివరించింది క్రిస్టినా. అందుకు సంబందించిన వీడియోను నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ఈ వీడియోకి ఏకంగా లక్షకు పైగా లైక్‌లు, రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక క్రిస్టినా తాను ఇంజనీర్ అయినా ఫ్యాషన్ మీద ఇష్టంతోనే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు తెలిపారు. ఈ రకమైన ప్రాజెక్టు చేసేటప్పుడే ఎంత శ్రమ, సమయం, డబ్బు అవసరమవుతాయో కూడా తెలుసుకోగలిగానని అన్నారు క్రిస్టినా. నెటిజన్లు కూడా చాలా బాగా చేశారు. ఇది అద్భుతం, స్పూర్తిదాయకం అంటూ క్రిస్టినాపై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by She Builds Robots (@shebuildsrobots) (చదవండి: సరికొత్త ఫిట్నెస్ మంత్ర..సెవెన్ సెకండ్ కాఫీ ట్రెండ్..!) -
రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ ఓకే
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న కశ్మీరీ నాయకుడు, ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్) ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైంది. జూలై 5న రషీద్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. ప్రమాణ స్వీకారం నిమిత్తం రషీద్‌కు ఒకరోజు బెయిల్ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం ప్రత్యేక కోర్టుకు తెలిపింది. మీడియాతో మాట్లాడకూడదని, ప్రమాణ స్వీకార ప్రక్రియను ఒక రోజులో పూర్తి చేయాలని ఎన్ఐఏ షరతులు విధించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశారనే కేసులో కఠినమైన చట్ట వ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద 2019 ఆగస్టులో అరెస్టయిన రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ)పై నెగ్గారు. -
నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నార్సింగిలో ఓ ఇంజినీర్‌ను దారుణ హత్య చేశారు. ఇజాయత్ అలీ కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. శనివారం.. దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన దుండగులు ఇంజనీర్‌ను కదలకుండా పట్టుకోగా, మరొకరు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం పరారైనట్లు తెలుస్తోంది.వారిలో ఇద్దరు యువకులు కాగా.. ఓ యువతి ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం క్వాలిస్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వాహనాన్ని, రెండు ఫోన్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Snehil Dixit Mehra: ఇంజినీర్ టు క్రియేటివ్ డైరెక్టర్..
నేర్చుకోవాలనే తపన ఉంటే... అదే తపస్సు. ఆ తపస్సు ఫలితాలు ఊరకే పోవు. విజయాలకు బలాన్ని ఇస్తాయి. ఎలాంటి డిగ్రీలు, అనుభవం లేకుండానే ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది స్నేహిల్ దీక్షిత్ మెహ్రా. వేగంగా నేర్చుకోవాలనే తపన ఆమె బలం. సాఫ్ట్వేర్ ఇంజినీర్, రైటర్, కంటెంట్ క్రియేటర్, యాక్టర్, క్రియేటివ్ డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను సొంతం చేసుకుంది.జర్నలిస్ట్ కావాలనుకుంది స్నేహిల్. ‘అదేం కుదరదు. ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాల్సిందే’ అన్నారు తల్లిదండ్రులు. దీంతో భో΄ాల్లో ఇంజినీరింగ్ చేసింది. చదువు పూర్తయిన తరువాత ముంబైలోని ఒక ఐటీ సంస్థలో పనిచేసింది. ఉద్యోగం చేస్తున్న మాటేగానీ తన మనసంతా టీవీ రంగంపైనే ఉండేది. ఒక ఫైన్ మార్నింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక చానల్లో ట్రైనీగా చేరింది. తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు.‘జర్నలిజంలో ఎలాంటి డిగ్రీ లేకుండా నెగ్గుకు రావడం కష్టం’ అన్నారు.ఆ తరువాత తల్లి మాత్రం ‘ఫరవాలేదు’ అన్నట్లుగా మాట్లాడింది. అండగా నిలబడింది. ముంబైలో ఉండే సోదరుడుప్రోత్సహించాడు.కొత్త ప్రయాణంలో స్నేహిల్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ‘ఓటమిని దరి చేరనివ్వవద్దు’ అని బలంగా అనుకునే స్నేహిల్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తూ వెళ్లింది. సవాళ్లను అధిగమించే శక్తి తనకు త్వరగా నేర్చుకునే నైపుణ్యం నుంచి వచ్చింది.స్టోరీ టెల్లింగ్పై ఉన్న ΄ాషన్తో టెలివిజన్ నుంచి ఓటీటీకి అక్కడి నుంచి సోషల్ మీడియాకు వచ్చిన స్నేహిల్ ప్రతిచోటా తనను తాను నిరూపించుకుంది. ఎన్నో షోలు చేసి రైటర్‌గా, క్రియేటివ్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ‘అప్‌హరణ్’ వెబ్ సిరీస్‌లో నటించడం ద్వారా నటిగా కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. ఇదంతా ఒక్క ఎత్తయితే ‘హీరామండీ’ కోసం డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ టీమ్‌లో చేరడం మరో ఎత్తు.రైటింగ్ విభాగంలో పనిచేసిన స్నేహిల్‌కు సంజయ్ లీలా భన్సాలీ కొన్ని సీన్లను డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు. ఆ సీన్లు బాగా చేయడంతో ‘హీరామండీ’ సిరీస్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా ప్రమోట్ అయింది.‘ఇది పదిహేడు సంవత్సరాల కష్టఫలితం. భన్సాలీతో పని చేయడం వరంలాంటిది. ఫిల్మ్‌మేకర్,ప్రొడ్యూసర్‌గా ఆయనకు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయనతో పనిచేయడం అంటే ఫిల్మ్ స్కూల్లో చేరి ఎన్నో విషయాలు నేర్చుకోవడంలాంటిది’ అంటుంది స్నేహిల్.ఇక ఇన్ఫ్లూయెన్సర్గా తన అనుభవాన్ని గురించి చెబుతూ... ‘కామెడీ అనేది రిస్క్. కొన్నిసార్లు ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో ఊహించలేము. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా నా వీడియోల నుంచి ఇన్స్టంట్ ఫీడ్‌బ్యాక్ తెలుసుకునేదాన్ని. ఫలానా వీడియో అభ్యంతరకరంగా, నొప్పించేలా ఉంది అనే కామెంట్స్ కనిపిస్తే వెంటనే ఆ వీడియోను తొలిగించేదాన్ని. ఎవరినీ నొప్పించకుండా అందరూ హాయిగా నవ్వుకునేలా కంటెంట్‌ను రూ΄÷ందించడం అనేది నిజంగా సవాలే’ అంటుంది బహుముఖ ప్రజ్ఞాశాలి స్నేహిల్ దీక్షిత్ మెహ్ర. కలల దారిలో...కలలు కనడం అనేది నాకు చిన్నప్పటి నుంచే అలవాటు. కల కనడం గొప్ప ఉత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఉత్సాహం దగ్గర మాత్రమే ఆగిపోకుండా నా కలను సాకారం చేసుకోవడానికి కష్టపడ్డాను. నేర్చుకోవాలనే ఉత్సాహం, నిరంతర కష్టం మనకు విజయాన్ని చేకూరుస్తాయి. – స్నేహిల్ దీక్షిత్ మెహ్ర -
గూఢచర్యం కేసు.. ‘బ్రహ్మోస్’ మాజీ ఇంజినీర్‌కు జీవిత ఖైదు
నాగ్‌పూర్: బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్‌కు నాగ్‌పూర్ సెషన్స్‌కోర్టు జీవిత ఖైదు విధించింది. నాగ్‌పూర్‌లోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ టెక్నికల్ రీసెర్చ్ విభాగంలో నాలుగేళ్లు పనిచేసిన నిషాంత్ అగర్వాల్ పాకిస్థాన్‌కు ప్రాజెక్టు కీలక రహస్యాలను చేరవేశాడని కోర్టులో రుజువైంది. దీంతో కోర్టు నిషాంత్‌కు 14 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3వేల జరిమానా విధించింది. పాక్ గూడఛారి సంస్థ ఐఎస్ఐకి రహస్యాలు చేరవేస్తున్న నిషాంత్‌ను మిలిటరీ ఇంటెలిజెన్స్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2018లో అరెస్టు చేశాయి. అనంతరం నిషాంత్‌పై ఐపీసీతో పాటు అఫీషియల్స్ సీక్రెట్ యాక్ట్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 2018 నుంచి జైలులో ఉన్న నిషాంత్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లోనే మహారాష్ట్ర హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ బెయిల్ మంజూరు చేసింది. డీఆర్డీవో, మిలిటరీ పారిశ్రామిక కన్సార్టియం సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ కంపెనీని ఏర్పాటు చేశాయి. -
రూ.80 లక్షల ఉద్యోగాన్ని వదిలేసి, పూల సాగు..కట్ చేస్తే..!
సౌకర్యవంతమైన జీవితం, ఇంగ్లాండ్‌లో దిగ్గజ టెక్ కంపెనీలో ఆకర్షణీయమైన జీతం. యూరప్ టూర్లు, వీకెండ్ పార్టీలు.. అయినా మనసులో ఏదో వెలితి. ఏం సాధించాం అన్న ప్రశ్న నిరంతరం మదిలో తొలిచేస్తూ ఉండేది. కట్ చేస్తే, తాత ముత్తాతల వ్యవసాయ భూమిలో పూల వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్నాడు. అంతకు మించిన ఆత్మసంతృప్తితో జీవిస్తున్నాడు. ఎవరా అదృష్టవంతుడు ఈ కథనంలో తెలుసుకుందాం రండి.ఉత్తర ప్రదేశ్‌లో అజంగఢ్ జిల్లాలోని చిల్బిలా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్ కష్టపడి చదివాడు. ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ యూకేలో అధిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. రూ. 80 లక్షల ప్యాకేజీతో జీవనం సాఫీగా సాగుతోంది. కానీ తన వ్యవసాయ మూలాలతో తిరిగి కనెక్ట్ అవ్వాలనే ఆశ ఒక వైపు, తోటి వారికి అవకాశాలను సృష్టించాలనే కోరిక మరోవైపు అభినవ్ సింగ్‌ను స్థిమితంగా కూర్చోనీయలేదు. రైతుల జీవన స్థితిగతులను మార్చడం. వ్యవసాయం గౌరవప్రదమైన వృత్తి అనేది నిరూపించాలనేది లక్ష్యం. చివరికి ఉద్యోగాన్ని వదిలేసి సొంత గ్రామానికి వెళ్లి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.అభినవ్ 2014లో ఇండియాకు తిరిగి వచ్చాడు. గుర్గావ్లో కొన్నాళ్లు పనిచేశాడు. 2016లో 31 ఏళ్ల వయసులో అభినవ్ తన ఉద్యోగాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదిలి ఇండియాలో ఒక చిన్న గ్రామంలో వ్యవసాయాన్ని ఎంచుకోవడం అంత సులభం కాదు. కానీ పట్టుదలతో నిలిచి గెలిచాడు. స్వగ్రామంలో పూర్వీకుల భూమిలో గెర్బెరా వ్యవసాయం మొదలు పెట్టాడు. మొదట్లో సేంద్రీయ కూరగాయల సాగును ప్రయత్నించాడు, కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అయితే ఉత్తరప్రదేశ్‌లో పెళ్లిళ్ల సీజన్లో అలంకరణకు కావాల్సిన రంగురంగుల పూలకు ఎక్కువ డిమాండ్ ఉందనీ, కానీ సప్లయ్ సరిగ్గా లేదని గుర్తించాడు. అంతే జెర్బెరా పువ్వుల సాగు వైపు మొగ్గు చూపాడు. 4వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పాలీహౌస్లో పెట్టుబడి పెట్టాడు. మొత్తం రూ.58లక్షల పెట్టుబడిలో రూ.48 లక్షలు బ్యాంకు లోన్ కాగా, మిగతాది పొదుపు చేసుకున్నడబ్బు. ఫిబ్రవరి 2021లో తొలి పంటసాయం విజయవంతమైన వ్యాపారానికి నాంది పలికింది.ప్రారంభించిన కేవలం ఒక్క ఏడాదిలోనే జెర్బెరా సాగు నెలవారీ రూ. 1.5 లక్షల ఆదాయాన్ని సాధించాడు. అంతేకాదు పూలసాగు, ప్యాకేజింగ్, రవాణా , విక్రయాలు ఇలా పలు మార్గాల్లో 100 మంది వ్యక్తులకు జీవనోపాధిని అందించాడు. జెర్బెరా మొక్కలను స్థానికంగా ఇతర రైతులకు అందిస్తూ, స్థిరమైన వ్యాపార నమూనాను సృష్టించాడు. తోటి రైతులకు స్ఫూర్తినిగా నిలిచాడు. “ఉద్యోగంతో సంపాదించే దానికంటే తక్కువ సంపాదించవచ్చు, కానీ ఇతరులకు జీవనోపాధిని కల్పించడం, సొంత వూరిలో ఇష్టమైంది, ప్రత్యేకమైనది చేయడం. కుటుంబంతో కలిసి ఉండడం ఇన్ని ఆనందాల్ని ఎంత విలాసవంతమైన జీవితం మాత్రం అందిస్తుంది చెప్పండి’’ -అభినవ్. -
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
చాలామంది తమకు ఇష్టమైన డ్రీమ్ కంపెనీలో ఉద్యోగం పొందేందుకు ఎంతో కష్టపడతారు. ఆ క్రమంలో ఒక్కోసారి ఫెయిల్యూర్స్ వస్తుంటారు. తమ తోటి వాళ్లు సెలెక్ట్ అవుతున్న వీళ్లు మాత్రం పెయిల్ అవ్వుతూనే ఉండటంతో వెంటనే తమని తాము నిందించుకుంటూ ప్రయత్నాలు విరమించుకుంటుంటారు. అలాంటి వారికి గూగుల్‌లో పనిచేస్తున్న ఓ ఇంజినీర్ ఆసక్తికరమైన సలహాలు సూచనలు ఇస్తోంది. ఐతే ఇక్కడ ఆమె కూడా అంత ఈజీగా ఈ కంపెనీలో ఉద్యోగం పొందలేదట.ఆమె పేరు క్విన్గ్యూ వాంగ్. గూగుల్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఆమె కొత్తగా ఉద్యోగాల కోసం సర్చ్ చేయాలనుకునేవాళ్లు ముందు ఇలాంటి పనులు చేయకూడదంటూ..తన అనుభవాలను గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు ఉద్యోగాన్వేషణలో మిమ్మల్ని తక్కువ చేసుకుని నిందించుకోవడం వంటివి చేస్తారు. ఇదే ఫెయిల్యూర్‌కి ప్రధాన కారణం అని అంటోంది. తాను కూడా ఉద్యోగ అన్వేషణలో ఇలానే చేసి ఒకటి రెండు కాదు ఏకంగా ఐదుసార్లే ఫెయిల్ అయినట్లు చెప్పుకొచ్చింది. తాను తొలిసారిగా 2018లో గూగుల్‌లో ఉద్యోగం కోసం ట్రై చేశానని, ఆ టైంలో ఆన్లైన్ అసాస్మెంట్ (ఓఏ) రౌండ్లోనే పోయిందని చెప్పింది. అయితే ఇంటర్వ్యూర్ నాకు మరో అవకాశం ఇచ్చారు గానీ దురదృష్టవశాత్తు ఆ అవకాశం కూడా వినయోగించుకోలేకపోయా. మళ్లీ మూడోసారి అదే కంపెనీలో తన ప్రయత్నం 2020లో ప్రారంభమయ్యింది. అందులో కూడా ఫోన్ స్క్రీన్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో సైట్ రిలయబిలిటీ ఇంజీనీర్ రిక్రూట్మెంట్కి దరఖాస్తు చేశా నాలుగో రౌండ్లో మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చినా..సరిగ్గా మహమ్మారి కావడంతో ఆ ఇంటర్వ్యూని క్యాన్సిల్ చేసింది. ఇక ఐదో ప్రయత్నంలో ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించడమే గాక టెక్ దిగ్గజం నుంచి అభినందనల తోపాటు ఉద్యోగం సంపాదించటం చాలా కష్టం అని వ్రాసిన పేపర్‌ను కూడా అందుకుంది వాంగ్. ఎట్టకేలకు వాంగ్ ఐదో ప్రయత్నంలో తాను కోరుకున్నట్లుగా సాప్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించింది. అందుకు సంబంధించిన కాగితాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..ఉద్యోగాన్వేషణ ప్రక్రియ అంత సులువు కాదనీ, కష్టపడి లక్ష్యాన్ని అందుకోవాలని అంది. ఆ క్రమంలో ఓటమి ఎదురైనా ప్రతిసారి మిమ్మల్ని నిందించుకోవడం లేదా అవమానంగా భావించడం మానేయాలని చెబుతోంది. ఎన్ని తిరస్కరణలు ఎదురైనా.. ప్రయత్నం విరమించకుండా అనుకున్నది సాధించాలని అంటోంది వాంగ్. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమేగాక లక్షకు పైగా వ్యూస్, లైక్‌లు వచ్చాయి.(చదవండి: అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!) -
ఈ ఆనంద్ మంచి ‘సరస్సు’ లాంటి వాడు.. ఇంట్రస్టింగ్ స్టోరీ
సిలికాన్ వ్యాలీ బెంగళూరు ఇటీవల నీటి కొరత సంక్షోభానికి దారితీసింది. లేక్ సిటీగా పేరొందిన బెంగళూరులోజనం గుక్కెడు నీటికోసం అల్లాడిన పరిస్థితి తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ సందర్భంలో చెరువుల పునరుద్ధరణ మిషన్కోసం అహరహం శ్రమిస్తున్న బెంగళూరుకు చెందిన మెకానికల్ ఇంజనీర్ ‘లేక్ మ్యాన్’ స్ఫూర్తిదాయక జర్నీ గురించి తెలుసుకుందాం రండి! కర్ణాటక రాజధాని బెంగళూరుకు ఎన్నో మంచి నీటి చెరువులతో కళకళలాడుతూ ఉండేది. కానీ కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్న పరిస్థితిల్లో చెరువులన్నీ చాలా వరకు ఎండిపోయాయి. కొన్ని పూర్తిగాకనుమరుగయ్యే స్థితికి చేరాడు. దీనికితోడు తక్కువ వర్షపాతం మరింత ప్రభావితం చేసింది. ఇక్కడే మెకానికల్ ఇంజనీర్ ఆనంద్ మల్లిగవాడ్ హృదయం తప్పించిపోయింది. బాల్యంలో ఇంటికి సమీపంలోని చెరువు, దాని అందాలను ఆస్వాదించిన మల్లిగవాడ్కు చెరువుల దుస్థితి చూసి చలించిపోయాడు. ఇక అప్పటినుంచి బెంగళూరు నగర దుస్థితిని తలుచుకుని నీటి వనరుల సంరక్షణకు ఆనంద్ మల్లిగవాడ్ చెరువులను కాపాడటంలో ఒక యజ్ఞమే చేస్తున్నాడు. 36ఎకరాల ఎండిపోయిన సరస్సును కేవలం 45 రోజుల్లోనే పునరుద్ధరించి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. చెరువుల పునరుద్ధరించడం కోసం తన ఉద్యోగాన్ని విడిచి పెట్టేశాడు. ఇప్పుడు పర్యావరణ పరిరక్షకుడిగా మారిన ఆనంద్, ఇప్పటివరకు 7 సరస్సులను పునరుద్ధరించాడు. అంతేకాదు 2025 నాటికి నగరంలోని 45 చెరువులకు తిరిగి జీవం పోయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 1960లలో బెంగళూరులో దాదాపు 290 సరస్సులు ఉండేవి. 2017 నాటికి 90కి పడిపోయింది. తొలి ప్రాజెక్టుగా ఎండిపోయిన కైలాసనహళ్లి సరస్సును నీటితో నింపాలని నిర్ణయించుకున్నాడు. అందరూ చూసి నవ్వారు.. అందరూ పిచ్చి వాడన్నారు అయినా తన ప్రయాణం అపలేదు. ఈ ప్రయాణాన్ని ఒంటరిగానే ప్రారంభించాడు. అంతేకాదు ఇవాల్టి తాగు నీటి కష్టాలకు కారణం సరస్సులు, చెరువులు మాయం కావడం కూడా ఒక కారణమని అంటాడు. అందుకే భవిష్యత్తరాలకు చెరువులను ఎలా పునరుద్ధరించాలి అనే దానిపై అవగాహన కల్పించాలని అసవరం ఉందంటాడు. View this post on Instagram A post shared by Wyzr (@wyzr.in) ఒకప్పుడు బెంగళూరులో దాదాపు రెండువేల చెరువులు, ఐదొందలకు చేరడంతో వీటిరక్షణకు బిగించాడు.చెరువులను సంరక్షించుకునే క్రమంలో అనుసరించాల్సిన విధానాలను అధ్యయనం చేశాడు. నగరంలోని 180 పురాతనమైన చెరువులను పరిశీలించాడు ఆనంద్. ఎట్టకేలకు తాను పనిచేస్తున్న కంపెనీ సన్సేరా ఇంజనీరింగ్ కంపెనీని ఒప్పించి లక్ష డాలర్లు సహాయంగా పొందాడు. వీటితో బొమ్మసంద్రలోని 36 ఎకరాల కైలాసనహళ్లి చెరువుకు 2017లో మళ్లీ జీవం పోశాడు. స్థానికులు, కూలీల సహాయంతో, అతను సరస్సు ఎండిపోయిన బెడ్ నుండి నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగలిగాడు. ఆ మట్టిని ఉపయోగించి సరస్సులో చిన్న చిన్న దీవులను తయారు చేశాడు. ఇపుడీ ఈ ద్వీపాలు ఇప్పుడు వేలాది పక్షులు, చెట్లతో అలరారుతున్నాయి. అలాగే 2018లో రెండెకరాల వాబసంద్రా, 2019లో 16 ఎకరాల కోనసంద్ర లేక్‌ను పునరుద్ధరించాడు. ఫార్మ, గ్రానైట్ కంపెనీల వ్యర్థాలతో నిండి వున్నచెరువును 65 రోజుల్లో 80 లక్షలతో సుందరంగా తీర్చిదిద్దాడు. మల్లిగవాడ సరస్సు పునరుద్ధరణ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్లు మద్దతిచ్చారు. తిరుపాళ్య సరస్సు పునరుజ్జీవన ప్రాజెక్ట్ 180 రోజులలో పూర్తి చేశారు. పూర్తిగా ఎండిపోయిన ఈ చెరువు 30 సంవత్సరాల తర్వాత మంచినీటితో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. దీని నిల్వ చేసే సామర్థ్యాన్ని 3 రెట్లు పెరగడం విశేషం. ముఖ్యంగా ఈ చెరువుల పునరుద్ధరణ కోసం చెరువులో పూడిక, కలుపు, మట్టిని, చెత్తను ప్లాస్టిక్ వ్యర్థాలను త్రవ్వి తీసి కట్టలను బలోపేతం చేస్తాడు. తరువాత సరస్సు చుట్టూ బాగా మొక్కలు నాటిస్తారు. తద్వారా వలస పక్షుల కోసం ద్వీపాలను కూడా సృష్టించాడు. వర్షాకాలం తర్వాత ఆరు నెలల్లోనే సరస్సులను స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది. అలాగే విరాళాల ద్వారా చెరువుల రక్షణకు పూనుకున్నాడు. 3. 5 ఎకరాల్లో ఉన్న గవిని రక్షించారు. ఇప్పటివరకు 80 చెరువులకు మళ్లీ జీవం పోశాడు.దాదాపు ఎనిమిదేళ్లలో మల్లిగవాడ్ బెంగళూరులో మరో 35 సరస్సులను, అలాగే అయోధ్యలో ఏడు, లక్నోలో తొమ్మిది , ఒడిశాలో 40 చెరువును బాగు చేయడం విశేషం. దీంతో దేశవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ నిపుణుడిగా ప్రసిద్ధి చెందాడు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచుతూ,కార్పొరేట్ కంపెనీల సాయంతో ఈ ప్రయాణం ఇలా సాగుతోంది. 2026లో 900 ఎకరాల హెన్నాగర సరస్సును బాగు చేయాలనేది లక్ష్యం. తద్వారా చుట్టుపక్కల రైతులకు లాభం చేకూరాలని, భూగర్భ జలాలను కాపాడాలనేది ప్రయత్నం. ఆనంద్ మల్లిగవాడ్ సందేశం ‘‘సహజ వనరులను గౌరవించడం నేర్చుకుందాం. ప్రకృతిని ప్రేమించుదాం. ప్రకృతి అందించిన వనరులను మనకు అవసరమై నంత మాత్రమే వాడుకుందాం. నీటిని సంరక్షింకుందాం. జీవితంలో సగం మన కోసం జీవిద్దాం. మిగిలి జీవితాన్ని పరిరక్షణ కోసం వెచ్చించుదాం. మన భవిష్యత్తరాలకు కోసం ఇదే ఉన్నతమైన దృక్పథం. -
ఏఐ ప్రభావం.. ఉద్యోగాలు పోతాయ్..? ఇప్పుడేం చేయాలంటే..
పారిశ్రామిక విప్లవంతో ప్రపంచ స్వరూపం సమూలంగా మారిపోయింది. అప్పటిదాకా మానవ శ్రమపై ఆధారపడి సాగిన ఉత్పత్తి, రవాణా, ఇతర సేవా కార్యకలాపాలను యంత్రాలు నిర్వహించడం మొదలైంది. ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగింది. పాత ఉద్యోగాలు పోయాయి. యంత్రాలపై పనిచేసే నైపుణ్యం అవసరమైన కొలువులు పెరిగాయి. అలాంటి అనూహ్యమైన పరిణామం మరొకటి ఇప్పుడు రాబోతోంది. అదే కృత్రిమ మేధ! అది తెచ్చే మార్పులకు మనమంతా సన్నద్ధం కావాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ పవనాలు వేగంగా వీస్తున్నాయి. ఇకపై మనిషి చేసే ప్రతి పనినీ చక్కబెట్టేందుకు కంప్యూటర్లు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల తీరుతెన్నులు, సమాజ గమనం, ప్రజల జీవన విధానాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోక తప్పదు. ఇప్పటిదాకా మనం చూస్తున్న, చేస్తున్న ఉద్యోగాల్లో చాలా వరకు వచ్చే కొన్నేళ్లలో కనుమరుగవుతాయి. ప్రధానంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సవాలు విసిరేలా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. వారికి లక్షల్లో జీతాలు చెల్లించాలంటే కంపెనీలకు భారంగా మారుతుంది. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొన్ని రకాల ఉద్యోగాలను కోల్పోవలసి రావచ్చని సర్వేలు చెబుతున్నాయి. మెకిన్సే సంస్థ నివేదిక ప్రకారం నూతన సాంకేతిక మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 40-80 కోట్ల ఉద్యోగాలకు ముప్పు కనిపిస్తోంది. దాదాపు 35 కోట్ల మంది కొత్త ఉద్యోగాల్లోకి మారాల్సి వస్తుంది. సంప్రదాయ ఉద్యోగాల్లోనే కొనసాగుదామనుకొన్నా సాధ్యం కాదు. అటువంటి పనులన్నీ కంప్యూటర్లు, వాటికి అనుసంధానమయ్యే యంత్రాలు పూర్తిచేస్తాయి. అయితే, యంత్రాలను నియంత్రించడం, వాటికి పనుల్ని నిర్దేశించడం, స్టాఫ్ట్వేర్లు అయితే ఏఐకి సూచనలు ఇవ్వడం వంటివి మనుషులే చేయాలి. ఇలాంటి కొత్త తరహా విధులకు సంబంధించి సరికొత్త ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లభిస్తాయి. కోల్పోయిన ఉద్యోగాలకంటే పెద్దసంఖ్యలో లభ్యమవుతాయి. ఇదీ చదవండి: ఎన్నికల ఎఫెక్ట్.. హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్.. కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని 1990 దశకంలో అందరూ భయపడిపోయారు. తదనంతర కాలంలో కోల్పోయిన ఉద్యోగాలకంటే అధికంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది. కాకపోతే, నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా శక్తిసామర్థ్యాలను, నైపుణ్యాలను నేర్చుకోవాల్సి వచ్చింది. -
నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న తరుణంలో నాలుగు రెట్ల జీతమా..!
Google Paid 4 Times More : పెద్ద పెద్ద టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో కంపెనీ మారుతున్న ఉద్యోగిని నిలుపుకొనేందుకు ఓ టెక్ దిగ్గజం గూగుల్ జీతాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు సిద్ధమైంది. టెక్ పరిశ్రమలో లేఆఫ్‌ల పేరుతో వేలాది మందిని తొలగిస్తున్నప్పటికీ ప్రతిభా, పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను వదులుకునేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని చెప్పేందుకు ఇదే ఉదాహరణ. సెర్చ్ ఇంజన్ పెర్ప్లెక్సిటీ AI సీఈవో అరవింద్ శ్రీనివాస్ తాను నియమించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక ఉద్యోగి వేతనాన్ని గూగుల్ ఎలా నాలుగు రెట్లు పెంచిందో చెప్పారు. బిగ్ టెక్నాలజీ పాడ్‌కాస్ట్ హోస్ట్ అలెక్స్ కాంట్రోవిట్జ్తో సంభాషణలో శ్రీనివాస్ ఇలా అన్నారు.. “నేను గూగుల్ నుండి రిక్రూట్ చేయడానికి ప్రయత్నించిన ఒక అద్భుతమైన అభ్యర్థి ఉన్నాడు. అతను ఇప్పటికీ గూగుల్ సెర్చ్ బృందంలో పనిచేస్తున్నాడు. మా కంపెనీలో చేరబోతున్నాడని అతను వారికి చెప్పగానే వారు (గూగుల్) అతని ఆఫర్‌ను నాలుగు రెట్లు పెంచారు. నేనెప్పుడూ ఇలాంటివి చూడలేదు’’ అన్నారు. ప్రతిభను నిలుపుకోవడానికి పెద్ద పెద్ద టెక్ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ సంఘటన తెలియజేస్తోంది. వారి సంభాషణలో కాంట్రోవిట్జ్ శ్రీనివాస్‌ను టెక్ కంపెనీలు ఎందుకు చాలా మందిని తొలగిస్తున్నాయో మీకు తెలుసా అని అడిగారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ.. కంపెనీలు ఎలాంటివారిని తొలగిస్తున్నాయో తనకు తెలియదన్నారు. ఇది పనితీరుపై ఆధారపడి ఉందా లేదా మరేదైనా అన్నదాని తనకు స్పష్టమైన అవగాహన లేదన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విటర్) లో పోస్ట్ చేసిన ఈ సంభాషణపై యూజర్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పలువురు యూజర్లు రకరకాలుగా కామెంట్లు పెట్టారు. "ఆ ఇంజనీర్‌కు చాలా తెలుసు" అని ఓ యూజర్ చమత్కరించారు. "మీకు ఇంటర్నల్ హైక్ కావాలంటే KRAని పూరించాల్సిన అవసరం లేదు మరొక కంపెనీకి అప్లయి చేసుకుంటే సరిపోతుంది" అని మరో యూజర్ సూచించారు. "The moment he told them he's going to join us, they quadrupled his offer" - Perplexity CEO @AravSrinivas on recruiting from Google (k, here's the video) pic.twitter.com/HRhrLNPrHJ — Alex Kantrowitz (@Kantrowitz) February 16, 2024 -
లోకేశ్ చేసిన పనికి.. ఒక్కొక్కరికి రూ.50 వేల జరిమాన
కర్ణాటక: బెంగళూరు నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలోని వాహనదారులకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసుల నుంచి చలాన్లు వస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టు అందులో వారి బైక్ ఫోటోలతో సహా ఉంది. సుమారు 60 మందికి చలాన్లు రాగా, మొత్తం విలువ లక్షలాది రూపాయలుగా ఉంది. అయితే వారెప్పుడూ ద్విచక్ర వాహనాల్లో రాజధానికి వెళ్లింది లేదు. కానీ చలాన్లు రావడం చూసి లబోదిబోమన్నారు. ఒక్కొక్కరికి ఏకంగా రూ.50 వేల వరకూ బాదుడు పడింది, గ్రామ వాటర్ మ్యాన్‌కు హెల్మెట్ లేదని రూ.48వేలు జరిమానా వచ్చింది. వణికిపోయిన బాధితులు కనకపుర గ్రామీణ పోలీసుల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఎప్పుడూ బెంగళూరుకు వెళ్లకపోయినా చలాన్లు ఎలా వచ్చాయని అడిగారు. పోలీసులు కూడా మొదట అర్థం కాక ఆశ్చర్యం వ్యక్తం చేసారు. తీరా అసలు సంగతి తెలిశాక అవాక్కయ్యారు. లోకేశ్ చేసిన పని.. గ్రామంలో నివసిస్తూ, బెంగళూరులో ఇంజినీర్‌గా పనిచేస్తున్న లోకేశ్ అనే పోకిరీ యువకుడు దీనంతటికీ కారణమని తెలిసింది. గ్రామస్తులపై ఏదో కారణం చేత కక్ష పెంచుకున్న లోకేశ్ తన ఇంటి ముందు సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసుకుని బైక్‌లు, కార్ల ఫోటోలను కట్ చేసి బెంగళూరు సిటీ పోలీసు (బీసీపీ) యాప్‌లో అప్లోడ్ చేసాడు. నాలుగు నెలల నుంచి ఈ దందా చేశాడు. బాధితుల గోడు విన్న సీఐ క్రిష్ణ లమాణి బెంగళూరు పోలీసులతో మాట్లాడి చలాన్లను రద్దు చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. -
V R Lalithambika : వీఆర్ అంటే విజయ సంకేతం
ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో ‘ఫెయిల్యూర్’ ఎదురొచ్చి భయపెట్టాలని చూసింది. ‘అంతా గందరగోళం’ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. సందేహం వచ్చినప్పుడు ఎవరిని అడిగితే ఏమనుకుంటారో అనే భయం ఉండేది. అయినా సరే... ‘ఇస్రో’ రహదారిలో లలితాంబిక ఎక్కడా తన ప్రయాణాన్ని ఆపలేదు. అడుగడుగునా పాఠం నేర్చుకుంది. సుదీర్ఘ ప్రయాణంలో ఇస్రో టాప్ ఇంజనీర్లలో ఒకరిగా ఎదిగింది. తాజాగా... అత్యున్నత ఫ్రెంచ్ పౌర పురస్కారం ‘ది లెజియన్ డి ఆనర్ ఆఫ్ ఫ్రాన్స్’ను అందుకుంది వీఆర్ లలితాంబిక... కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది లలితాంబిక. తండ్రితో సహా చుట్టాలలో ఎక్కువమంది ఇంజినీర్లు. గణితశాస్త్రంలో దిట్టగా పేరున్న తాత వల్ల లలితకు శాస్త్రీయ విషయాలపై ఆసక్తి మొదలైంది. ఆ ఆసక్తే ఇస్రో వరకు తీసుకువెళ్లింది.చదువు పూర్తికాగానే పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి తరువాత కూడా చదువుకు విరామం ఇవ్వలేదు లలిత. ఎంటెక్ చేస్తున్న కాలంలో ఆమెకు కూతురు జన్మించింది. కాలేజీకి విరామం ఇచ్చినప్పటికి స్నేహితురాలు తెచ్చి ఇచ్చిన క్లాసులకు నోట్స్ ఇంట్లోనే చదువుకునేది. 1998లో తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో చేరింది. కొద్దిరోజుల్లోనే తాను పనిచేస్తున్న ఏరియాలో కంట్రోల్ సిస్టమ్‌కు సంబంధించిన సాఫ్ట్వేర్ ఎర్రర్ వల్ల ఫెయిల్యూర్ ఎదురైంది. ‘ఆ రోజుల్లో ప్రతిదీ కొత్తగానే అనిపించేది. ప్రతిరోజూ ఒక సవాలుగానే ఉండేది. ఒక సమస్యకు సంబంధించి పరిష్కారాన్ని అన్వేషించడానికి, అధ్యయనం చేయడానికి అవసరమైన పుస్తకాలు ఉండేవి కాదు. సీనియర్లను అడగాలంటే భయంగా ఉండేది. ఆత్మస్థైర్యం అంతంత మాత్రంగానే ఉండేది’ అని గతాన్ని గుర్తు చేసుకుంది లలిత. పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు లలిత యంగ్ మదర్. ఒకవైపు... ఏ టైమ్‌కు ఇంటికి వెళతారో తెలియనంత ఊపిరి సలపని పని. మరోవైపు... పని విరామంలో పదే పదే గుర్తుకు వచ్చే బిడ్డ. 1993లో పీఎస్ఎల్వీ లాంచ్ ఫెయిల్ అయింది. అదే సంవత్సరం రెండో ప్రయత్నానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చింది. పని ఒత్తిడి మరింత పెరిగింది. అలాంటి క్లిష్టమైన కీలక సమయంలోనూ ఎప్పుడూ ‘ఇక చాలు. ఈ ఉద్యోగం చేయడం మన వల్ల కాదు’ అనుకోలేదు. ‘ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని మాత్రమే అనుకుంది. ‘ఆ సమయంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. తప్పులు పునరావృతం కాకుండా చూసుకున్నాం. తప్పుల నుంచి నేర్చుకోవడం అనేది ఇస్రో సంస్కృతిలో ఒకటి’ అంటుంది లలిత. సెకండ్ పీఎస్ఎల్వీ లాంచ్ సక్సెస్‌కు సంబంధించిన ఆనందం లలితకు ఆత్మస్థైర్యం, అంతులేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘పీఎస్ఎల్వీలో ఆటోపైలట్ సిస్టమ్ విభాగంలో చాలాకాలం నుంచి ఉన్నాను. లాంచ్ రోజులు ఉత్కంఠభరితమైనవి. అదే సమయంలో సంతోషం రూపంలో ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసేవి. ప్రతి ఫెయిల్యూర్ కొత్త పాఠం నేర్పేది. ప్రతి సక్సెస్ కొత్త శక్తిని ఇచ్చేది’ అంటుంది లలిత. ‘మీ విజయరహస్యం?’ అనే ప్రశ్నకు లలిత చెప్పే మాట... ‘ఫ్యామిలీ సపోర్ట్’ ‘లాంచ్‌కు సంబంధించిన రోజుల్లో పనే లోకంగా ఉండేవాళ్లం. ఏ టైమ్‌కు ఇంటికి చేరుతామో తెలియదు. ఇలాంటి సమయంలోనూ నాకు కుటుంబ మద్దతు రూపంలో ప్రోత్సాహం, బలం లభించాయి. వ్యక్తిగత త్యాగాలను కూడా ఇష్టపూర్వకంగా చేసే రోజులు అవి. స్త్రీ, పురుషులను వేరు వేరుగా చూడడం అనే సంస్కృతి ఇస్రోలో కనిపించేది కాదు. ఎవరైనా ఒక్కటే అన్నట్లుగానే ఉండేది. మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారు’ అంటుంది లలిత. ఫ్రెంచ్ అత్యున్నత పౌర పురస్కారం విషయానికి వస్తే... ఫ్రాన్సు, మన దేశం మధ్య అంతరిక్ష సహకారాన్ని పెంపొందించడంలో చేసిన విశేష కృషికి ఇస్రోలో డైరెక్టరేట్ ఆఫ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగామ్ మాజీ డైరెక్టర్ అయిన వీఆర్ లలితాంబికను ఫ్రెంచ్ అత్యున్నత పౌరపురస్కారంతో సత్కరించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం తరపున మన దేశంలోని ఫ్రాన్స్ రాయబారి మాథ్యూ నుంచి ఈ అవార్డ్ అందుకుంది లలిత. ‘అంతరిక్ష సాంకేతికతలో విశిష్ట శాస్త్రవేత్త’ అని మాథ్యూ లలితాంబికను కొనియాడారు. ‘ఈ గౌరవం మరింత మంది మహిళలు స్టెమ్ రంగాలలోకి రావడానికి, విజయాలు సాధించడానికి స్ఫూర్తిగా నిలుస్తుంది’ అంటుంది వీఆర్ లలితాంబిక. -
పల్లెటూరి వాడివంటూ భార్య వేధింపులు
కర్ణాటక: కుటుంబ కలహాలతో ఓ మెట్రో ఇంజినీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గురువారం తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా కిబ్బనహళ్లి పరిధిలో చోటు చేసుకుంది. మంజునాథ్ (38) జిల్లాలోని కుందూరుపాళ్య గ్రామానికి చెందిన వాడు. బెంగూళూరు నగరంలో మెట్రోలో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న ఇతడు పదేళ్ల క్రితం తురువెకెరెకు చెందిన ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పల్లెటూరి వాడివంటూ మంజునాథ్‌ను ప్రియాంక వేధించేదని సమాచారం. ఆమె వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంజునాథ్ తన సోదరుడికి ఆడియో మెసేజ్ పంపాడు. కిబ్బనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఇచ్చట తల వెంట్రుకలు ఖండించబడును
సొంతంగా హెయిర్ కటింగ్ చేసుకోవాలనుకోవడం తేలికేగానీ, ్ర΄ాక్టికల్ విషయానికి వస్తేగానీ కష్టమేమిటో తెలియదు. బోలెడు ఓపిక ఉండాలి. దానికి నైపుణ్యం తోడు కావాలి. ‘ఇదంతా ఎందుకండీ... నా రోబోను చూడండి’ అంటున్నాడు షేన్ వైటన్. అమెరికన్ ఇంజినీర్ షేన్ వైటన్ హెయిర్ కట్ చేసే రోబోను తయారు చేశాడు. రోబో ఒక కుర్రాడికి హెయిర్ కట్ చేసే వీడియోను ‘గెట్టింగ్ ఏ రోబో టు కట్ యువర్ హెయిర్’ కాప్షన్‌తో తన యూ ట్యూబ్ చానల్లో ΄ోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది. ‘వీడియోను జాగ్రత్తగా గమనిస్తే అతడి కళ్లలో అంతులేని భయం కనిపిస్తుంది. అంతవసరమంటారా?’ అంటూ ఒక యూజర్ స్పందించాడు. -
రోజుకి గంట మాత్రమే పని.. రూ. 1.2 కోట్లు వేతనం
లక్షల ప్యాకేజి రావాలంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందనేది అందరికి తెలుసు. అయితే హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తూ ఒక 'సాఫ్ట్వేర్' ఇంజినీర్ రోజుకి కేవలం ఒక గంట మాత్రమే పనిచేస్తూ ఏకంగా రూ. 1.2 కోట్లు వేతనం తీసుకుంటున్నాడు. ఇంతకీ అతడెవరు? ఎక్కడ పనిచేస్తున్నాడనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. మనం చెప్పుకుంటున్న యువ సాఫ్ట్వేర్ (డెవాన్) గూగుల్ (Google) కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడు రోజుకి 1 గంట మాత్రమే ఆ కంపెనీకి సంబంధించిన పనిచేస్తాడు. మిగిలిన సమయం స్టార్టప్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. కంపెనీలో తాను ఇంటర్న్‌షిప్‌లో చేరినప్పుడు పని చాలా త్వరగా నేర్చుకున్నట్లు, కోడ్లను కూడా త్వరగా పూర్తి చేసినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఎవరీ మాయా టాటా? లక్షల కోట్ల 'టాటా' సామ్రాజ్యానికి వారసురాలు ఈమేనా? నిజానికి తనకు వారానికి సరిపడా వర్క్ ఇస్తే దాన్ని మొదటి రోజే దాదాపు పూర్తి చేస్తాడు, ఆ తరువాత మిగిలిన నాలుగు రోజులు కేవలం గంట మాత్రమే పనిచేసి చాలా రిలాక్స్‌గా ఉంటాడు. మొత్తానికి అతనికి ఇచ్చిన వర్క్ మాత్రం టైమ్‌కి పూర్తి చేస్తాడు. ఇచ్చిన టైమ్‌కి పని బాగా చేస్తుండటం వల్ల కంపెనీ ఇతనికి బోనస్ అందించడంతో పాటి రివార్డులు కూడా అందిస్తోంది. ప్రస్తుతం గూగుల్ కంపెనీలో ఎక్కువ జీతం తీసుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లలో ఇతడు కూడా ఒకడు కావడం గమనార్హం. అంతే కాకుండా గూగుల్ సంస్థలో జాబ్ చేయడం చాలా సులభమని చెప్పుకొచ్చాడు. డెవాన్ 1,50,000 డాలర్లను వార్షిక జీతంగా పొందుతున్నాడు. అంటే మన భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 1.2 కోట్లు. -
చెత్తతో 6 చక్రాల వాహనం.. ‘మెకానికల్ గాడిద’ సూపర్ సే ఊపర్ అంటూ కితాబు!
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా నూతన ఆవిష్కరణలకు సంబంధించిన వీడియోలు యూజర్స్‌ను ఇట్టే ఆకట్టుకుంటాయి. తాజాగా ఒక వ్యక్తి తన గ్యారేజీలోని పనికిరాని వస్తువులతో 6 చక్రాల వాహనాన్ని తయారు చేశాడు. అది నడిచే తీరు ఎంతో వింతగా ఉంది. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి చిన్న వాహనంపై కూర్చుని కనిపిస్తున్నాడు. ఆ వాహనాన్ని చూస్తే ఎవరికైనా పిల్లలు ఆడుకునే బొమ్మలా అనిపిస్తుంది. పరిశీలించి చూస్తే.. అది 6 చక్రాల వాహనం అని గమనించవచ్చు. చిన్నగా కనిపించే ఈ వాహనానికి నాలుగు కాళ్లు మాదిరిగా నాలుగు రాడ్లు కనిపిస్తాయి. మద్యలో రెండు చిన్న, చిన్న టైర్లు కనిపిస్తాయి. ఈ వాహనంపై కూర్చునేందుకు సీటు కూడా ఉంది. చూపరులను ఈ వాహనం ఎంతగానో ఆకర్షిస్తోంది. ఈ వీడియోను ట్విట్టర్లో @TansuYegen పేరుతో షేర్ చేశారు. వీడియోతో పాటు క్యాప్షన్‌గా చైనాకు చెందిన ఒక ఇంజినీరు గ్యారేజీలో పడివున్న సామానులను వినియోగిస్తూ మెకానికల్ గాడిదను తయరు చేశాడు అని రాశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 57 వేలకుపైగా వ్యూస్ దక్కాయి. పలువురు నెటిజన్లు ఈ వాహన తయారీని మెచ్చుకుంటున్నారు. ఒక యూజర్ ఈ వాహనం 5 నిముషాల్లో వెళ్లాల్సిన దూరానికి 50 నిముషాలు తీసుకుంటుందని కామెంట్ చేశాడు. ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్! 🇨🇳 In China, an engineer built and rode a mechanical donkey using spare parts from their garage. 🛠️🐴🚀 pic.twitter.com/8vZmTBL342 — Tansu YEĞEN (@TansuYegen) August 11, 2023 -
కార్పొరేట్ ఇంజినీర్ కన్నా క్యాబ్ డ్రైవరే నయం! సోషల్ మీడియా పోస్ట్ వైరల్..
ఈరోజుల్లో చాలా మంది తమ చదువుకు తగిన ఉద్యోగం చేయడం లేదు. ఒక వేళ చేసినా అందులో సంతృప్తి లేక కొన్ని రోజులకే మానేసి వేరే పని చేసుకుంటున్నారు. కొంతమంది విధి లేక ఇలా చేస్తుంటే మరికొంత మంది మాత్రం పెద్ద చదువులు చదువుకున్నా కూడా ఇష్టపూర్వకంగానే చిన్న చిన్న పనులు చేస్తున్నారు. ఇలా చిన్న పనులు చేసుకునేవారిని చిన్నచూపు చూస్తుంటారు. వారు పెద్దగా సంపాదించలేరు అనుకుంటుంటారు. కానీ కార్పొరేట్ కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవారి కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అలాంటి దానికి ఉదాహరణే ఈ సంఘటన. రద్దీగా ఉండే రోడ్డుపై క్యాబ్ నడిపే వ్యక్తి కూడా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చునే ఇంజనీర్ కంటే ఎక్కువే సంపాదిస్తున్నాడంటే మీరు నమ్మకపోవచ్చు. అయితే ఇది నిజం. ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఓ క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం, సంపాదన గురించి సోషల్ మీడియాలో శ్వేతా కుక్రేజా అనే యూజర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇటీవల తాను ఓ క్యాబ్‌లో ప్రయాణించానని, ఆ క్యాబ్ డ్రైవర్ ఇంజనీర్ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు క్వాల్కామ్ కంపెనీలో పనిచేసేవాడినని చెప్పిన అతను, ఆ ఉద్యోగంతో కంటే క్యాబ్ డ్రైవింగ్‌తోనే ఎక్కువగా సంపాదిస్తున్నానని చెప్పినట్లు శ్వేత ట్వీట్ చేశారు. శ్వేత ఆగస్ట్ 6న ఈ ట్వీట్ చేయగా ఇప్పటి వరకు 7.7 లక్షల మంది వీక్షించారు. 6,700లకు పైగా లైక్‌లు వచ్చాయి. క్యాబ్ డ్రైవర్ సంపాదనపై యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. కార్పొరేట్ జాబ్‌లు చేసినంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాదని, క్యాబ్ డ్రైవర్లు ఎంత మాత్రం తక్కువ కాదని శ్వేత పేర్కొన్నారు. I was in a cab yesterday and that driver was an engineer. He said he earns more from the cab driving than his corporate job at Qualcomm. 🥲 — Shweta Kukreja (@ShwetaKukreja_) August 6, 2023 -
ఇంజినీర్‌ను బురదలో దింపిన ఎమ్మెల్యే
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుండడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఇంజినీర్‌ను బురదలో దింపి పనిష్మెంట్ ఇచ్చిన సంఘటన నెలమంగలలో చోటుచేసుకుంది. దొడ్డబళ్లాపురం–నెలమంగల ప్రధాన రహదారి మార్గంలో గొల్లహళ్లి వద్ద రైల్వే పైవంతెన పనులు గత రెండు సంవత్సరాలుగా కుంటుతూ సాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు సంబంధించి స్థానికులు ఎమ్మెల్యే శ్రీనివాస్ వద్ద ఫిర్యాదు చేయడంతో ఘటనాస్థలానికి వచ్చిన ఎమ్మెల్యే ఇంజినీర్‌ను పిలిచి దుర్భాషలాడి ఒకసారి బురదలో దిగి పరిశీలించాలని ఆదేశించాడు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఇంజినీర్ బురదలో దిగి నడిచాడు. పనులు త్వగా పూర్తిచేయాలని లేదంటే ఇదే బురద ముఖానికి పూస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే మరికొందరు అధికారులు ఇలా చేస్తే కనీసం పనులు త్వరగా చేస్తారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి తల్లీకొడుకులను కలిపిన భారీ వరదలు.. 35 ఏళ్ల క్రితం వేరయి.. -
డ్యూటీలో మద్యం తాగి ఇంజినీర్లు చిందులు.. వీడియో వైరల్ కావడంతో
భువనేశ్వర్: ఉద్యోగస్తులు బయట ఎలా ఉన్న ఆఫీసులోకి వెళ్లగానే హుందాగా ప్రవర్తించడంతో పాటు వారి పనిని నిబద్దతతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ సంస్థ తమ ఉద్యోగుల నుంచి ఆశిస్తుంది. అయితే కొందరు మాత్రం ఇవేవి తమకు పట్టవంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒరిస్సాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేంద్రాపడా జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఇంజినీర్లు తమ కార్యాలయంలో మద్యం సేవిస్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. దీంతో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ జెనా జలవనరుల శాఖను సోమవారం ఆదేశించారు. ఈ ఇరువురు నిందితులు మహానది నార్త్ డివిజన్లో ఇంజినీర్లుగా ఉన్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లాలోని నారాయణపూర్ సెక్షన్ కార్యాలయంలో ఇంజినీర్లు, మరికొందరు వ్యక్తులు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మద్యం, ఆహారం సరంజామాతో సమగ్ర వీడియో చిత్రీకరించి, సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇరువురు ఇంజినీర్లపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖను ఆదేశిస్తూ సీఎస్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి అన్యోన్యంగా ఉండేవాళ్లు,ఎలాంటి లోటు లేదు.. కానీ ఆ ఒక్క కారణంతో భార్యను హతమార్చాడు! -
డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కుమ్మరిగా మారిన సివిల్ ఇంజనీర్
ఏదైనా సమస్య ఎదురైతే చాలామంది దాని నుంచి దూరంగా పారిపోవడానికి చూస్తారు. కొంతమంది మాత్రం సమస్యను అధిగమించేందుకు రకరకాల మార్గాలు వెదుకుతారు. అలా వెతికిన వారికి .. పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని చెబుతోంది సైమాషఫీ. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సైమా చేసిన ప్రయత్నం నేడు మరికొంతమందికి ఉపాధి కల్పించడంతోపాటు, కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తోంది. కశ్మీర్‌కు చెందిన 33 ఏళ్ల సైమాషఫీ జమ్ము అండ్ కశ్మీర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఎందుకో తనకి తెలియకుండానే మనసులో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. వాటి నుంచి ఎలాగైనా బయట పడాలని రకరకాలుగా ప్రయత్నించేది. ఒకరోజు చైనా తత్త్వవేత్త చెప్పిన ‘‘మట్టిని పాత్రగా మలిచినప్పటికీ, మనం ఏం కోరుకుంటామో దానితోనే ఆ పాత్రలోని శూన్యం నిండుతుంది’’ అన్న కొటేషన్ గుర్తుకొచ్చింది. దీంతో తన డిప్రెషన్‌ను కుండలో నింపాలని నిర్ణయించుకుంది సైమా. చిన్నప్పటి నుంచి మట్టి అంటే సైమాకు ఇష్టం. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు.. మట్టితో కుండలేగాక, బొమ్మలు కూడా తయారు చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్న వెంటనే మట్టి కుండల తయారీకి పూనుకుంది. కశ్మీరి వ్యాలీలో కుండల తయారీ శిక్షణ ఇచ్చేవారు లేరు. పైగా కుండల తయారీ, కుండలకు వేసే రంగులకు సైతం అధునాతన పద్ధతులను జోడించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. కుండల తయారీ ఒక కళే కాదు సంప్రదాయంలో భాగం. అది అంతరించకూడదు అనుకుని... కుండల తయారీకి ఎలక్ట్రిక్ చక్రం, గ్యాస్ బట్టీ తీసుకురావాలనుకుంది. కానీ కశ్మీర్‌లోయలో అవి ఎక్కడా దొరకలేదు. బెంగళూరులో శిక్షణ కుండల తయారీలో శిక్షణ తీసుకునేందుకు బెంగళూరు వెళ్లింది. అక్కడ కుండల తయారీలో క్రాష్ కోర్సు చేసి వివిధ ఆకారాల్లో కుండలు ఎలా తయారు చేయాలో నేర్చుకోవడంతోపాటు, కశ్మీరీలు వాడే సంప్రదాయ పాత్రల తయారీని సైతం నేర్చుకుని అధునాతన సాంకేతికత జోడించి కుండల తయారీని ప్రారంభించింది. రకరకాల కుండలను తయారు చేసి విక్రయిస్తూనే, మరోపక్క కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న కుండల తయారీ కేంద్రాలను సందర్శించి అనుభవం కలిగిన నిపుణులతో వర్క్‌షాపులు నిర్వహించేది. ఇలా కుండల తయారీలో సరికొత్త పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తోంది. వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కశ్మీరి కుండలను ఎలా పరిరక్షించుకోవాలో చెబుతోంది. తన కుండల తయారీ జర్నీ గురించి వివరిస్తూ... అందరిలో స్ఫూర్తి నింపుతోంది. ప్రభుత్వ సహకారంతో.. కశ్మీరీ సనాతన కుండల తయారీని కాపాడుతోన్న విషయం అక్కడి ప్రభుత్వానికి తెలియడంతో స్టేట్ హ్యాండీ క్రాఫ్ట్స్ విభాగం సైమాతో.. తన అనుభవాలను ఇతర కళాకారులకు చెబుతూ సలహాలు సూచనలు ఇప్పిస్తోంది. దీంతో కుండల పునరుద్ధరణకు మంచి స్పందన లభిస్తోంది. అంతేగాక నైపుణ్యం గల కళాకారుల డేటాను హస్తకళల శాఖాధికారులు సేకరిస్తున్నారు. సైమా గురించి తెలిసిన చాలామంది యువతీయువకులు కుండల తయారీ మొదలు పెట్టి ఉపాధి పొందుతున్నారు. -
'కరోనా వైరస్ అక్కడి నుంచే..' వుహాన్ ల్యాబ్ పరిశోధకుడు సంచలన వ్యాఖ్యలు..
చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందలేదని అమెరికా నిఘా సంస్థలు తేల్చి చెప్పేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వుహాన్ ల్యాబ్ పరిశోధకుడిగా పనిచేసిన చావో షాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ను చైనానే ఉద్దేశపూర్వకంగా తయారు చేసిందని చెప్పారు. బయోవెపన్‌గా ఉపయోగించుకోవాలని చైనా కరోనాను సృష్టించిందని అన్నారు. మనుషులతో సహా అన్ని జీవులకు వ్యాప్తి చెందగల కరోనా రకాలను గుర్తించే బాధ్యతను తమ పరిశోధక బృంధానికే అప్పగించినట్లు చెప్పారు. మానవ హక్కుల కార్యకర్త జెన్నీఫర్ జంగ్‌తో జరిగిన ఇంటర్వూలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. ప్రభావవంతమైన కరోనా రకాలను గుర్తించాలని చావో షాన్‌తో సహా తమ సహచర పరిశోధకులకు బాధ్యతను అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. 2019లో నంజిన్ నగరంలో చావో షాన్‌కు స్వయంగా నాలుగు రకాల కరోనాలను పరిశోధనల నిమిత్తం ఇచ్చారని చెప్పారు. అందులో ఓ రకం అత్యంత వ్యాప్తి చెందగల శక్తి ఉన్నది గుర్తించినట్లు వెల్లడించారు. చావో కరోనా వైరస్‌ను ఓ బయోవెపన్‌గా వ్యాఖ్యానించారు. 2019 నుంచి తమ సహచర పరిశోధకులు కనిపించకుండా పోయారని చెప్పారు. పరిశోధనల కోసం మరికొందర్ని అతర దేశాలకు పంపించినట్లు పేర్కొన్నారు. అయితే.. వైరస్ వ్యాప్తి చేయడానికే తమ సహచరులను ఇతర దేశాలకు పంపించినట్లు చావో అనుమానించారు. ఇదీ చదవండి: ‘వుహాన్ ల్యాబ్’ నివేదికలో అదిరిపోయే ట్విస్ట్ -
టాటా కంపెనీలో ఒకప్పుడు రోజులు గుర్తొచ్చేశాయి - సుధామూర్తి
భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో 'రతన్ టాటా' (Ratan Tata) గురించి తెలుసు. దీనికి ప్రధాన కారణం ఈయన గొప్ప పారిశ్రామిక వేత్త అని మాత్రమే కాదు.. దాత్రుత్వంలో కలియుగ కర్ణుడగా కీర్తించబడటం కూడా. టాటా మోటార్స్ కంపెనీ ఇప్పుడు భారతదేశంలో తిరుగులేని సంస్థగా అవతరించినప్పటికీ దీని ఫౌండర్ మాత్రం JRD టాటా. జెఆర్‌డి టాటా ప్రారంభించిన ఈ కంపెనీలో మొదటి మహిళా ఇంజనీర్ ఇన్ఫోసిస్ చైర్పర్సన్ 'సుధామూర్తి' (Sudha Murty) అని చాలా మందికి తెలియకపోవచ్చు. నిజానికి సుధామూర్తి టాటా కంపెనీలో ఇంజనీర్ కావడం వెనుక పెద్ద కథే ఉంది. అప్పట్లో టాటా సంస్థను టెల్కో అని పిలిచేవారు. ఇప్పుడు టాటా కంపెనీలో సగం మంది మహిళలు పనిచేయడానికి ప్రధాన కారకురాలు కూడా ఈమే కావడం గమనార్హం. 1974లో బెంగళూరులో టాటా ఇన్స్టిట్యూట్లో సుధామూర్తి ఎమ్.టెక్ చేస్తున్న సమయంలో తమ క్లాసులో అందరూ అబ్బాయిలే ఉండేవారని, అంతకు ముందు బీఈ చేసినప్పుడు కూడా క్లాసులో తానొక్కటే అమ్మాయని వెల్లడించింది. ఒకరోజు కాలేజీ నోటీస్ బోర్డులో ఉన్న ప్రకటనలో పుణెలోని టెల్కో కంపెనీలో పనిచేసేందుకు ఉత్సాహవంతులైన యువకులు కావాలని ఉండటం చూసింది. అయితే అందులోనే యువతులు అప్లై చేసుకోకూడదని అందులో వెల్లడించారు. (ఇదీ చదవండి: ఆ ఖరీదైన కార్లన్నీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్యారేజీలోనే! అవేంటంటే..) ఇది చూడగానే ఆమెకు పట్టరాని కోపం వచ్చి హాస్టల్‌కి వెళ్లి జేఆర్డీ టాటాకు లేఖ రాసి అందులో మహిళలు సంస్థలో అవకాశం ఇవ్వకపోతే భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదని.. సమాజంలో 50 శాతం పురుషులు ఉంటే మిగిలిన 50 శాతం మంది స్త్రీలు ఉన్నారు. ఉద్యోగావకాశాలను కేవలం పురుషులను మాత్రమే ఎంపిక చేస్తే సమాజం ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించినట్లు చెప్పింది. (ఇదీ చదవండి: ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?) లేఖను అనుసరించి జెఆర్‌డీ టాటా సుధామూర్తిని ఇంటర్వ్యూకి పిలిచారు, ఆ తరువాత అందులో పనిచేసారు. అయితే సుధా మూర్తి సోషల్ మీడియావైలో చేసిన ఒక పోస్ట్ ప్రకారం, సుమారు 40-50 సంవత్సరాల తరువాత టాటా మోటార్స్‌గా పిలవబడే పూణే టెల్కోను సందర్శించినట్లు.. అక్కడ 300 మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారని, అది చూడగానే తనకు ఏడుపు వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇదంతా సుధామూర్తి రతన్ టాటా తాతకు చేసిన ఆ ఒక్క అభ్యర్థన ప్రతి ఫలమే. -
ఇంజినీర్ చెంప చెల్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే.. వీడియో వైరల్..
మహారాష్ట్ర: మహారాష్ట్రకు చెందిన మహిళా ఎమ్మెల్యే ఓ సివిల్ ఇంజినీర్‌పై చేయి చేసుకున్నారు. అందరూ చూస్తుండగానే అధికారి చెంప చెల్లుమనిపించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నిర్మాణాలను కూల్చివేసిన ఘటనలో ఎమ్మెల్యే ఫైర్ అయినట్లు తెలుస్తోంది. థాణే జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని మీరా భయందర్ ఎమ్మెల్యే గీతా జైన్. అయితే.. భయందర్ మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని నిర్మాణాలను కూల్చివేసిన వ్యవహారంలో సివిల్ ఇంజినీర్‌ను ఆమె ప్రశ్నించారు. అధికారులను బూతులు తిడుతూ కోపగించుకున్నారు . నిర్మాణాలను కూల్చివేసిన కారణంగా పిల్లలతో సహా నిర్వాసితులు రానున్న వర్షాకాలంలో రోడ్లపైనే ఉండాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందని ఎమ్మెల్యే.. అధికారి చెంప చెల్లుమనిపించారు. భయందర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బీజేపీ తరుపున మాజీ మేయర్‌గా గీతా జైన్ పనిచేశారు. 2019 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం బీజేపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. आमदार गीता जैन ताई ही कुठली पद्धत आहे अधिकाऱ्यावर हात उचलून प्रश्न सोडवण्याची.अधिकारी चुकला असेल तर सरकार मधे आहात कायदेशीर कार्यवाही करा कायदा हातात घेण्याचा अधिकार तुम्हाला कोणी दिला आहे ? @CMOMaharashtra यांच्यावर कार्यवाही करणार की आमदारांना कायदा हातात घेण्याची सूट आहे ? pic.twitter.com/ndJGyhLVyR — Suraj Chavan (सूरज चव्हाण) (@surajvchavan) June 20, 2023 ఇదీ చదవండి: మమత ప్రభుత్వానికి షాక్..! కేంద్ర బలగాల మోహరింపుపై సుప్రీం ఓకే.. -
14 ఏళ్లకే వేలకోట్ల కంపెనీలో జాబ్.. ఎవరీ కైరాన్ క్వాజీ?
Youngest Engineer Kairan Quazi: తెలివికి వయసుతో సంబంధం లేదని మళ్ళీ నిరూపించాడు 14 ఏళ్ల 'కైరాన్ క్వాజీ' (Kairan Quazi). త్వరలోనే ఈ చిన్నారి ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ కంపెనీలో ఇంజనీర్ ఉద్యోగంలో చేరనున్నారు. ఇప్పటికే ఇతడు స్పేస్ఎక్స్ టెక్నాలజీ ఛాలెంజింగ్ ఇంటర్వ్యూను కూడా క్లియర్ చేసాడు. ఇంత గొప్ప విజయం సాధించిన కైరాన్ క్వాజీ ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన క్వాజీ 11 సంవత్సరాల వయసులోనే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ చదవడం ప్రారంభించాడు. గత మే నెలలో శాంటా క్లారా యూనివర్సిటీ (SCU) నుంచి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. చిన్నప్పటి నుంచి స్పేస్ఎక్స్లో పనిచేయాలని కోరిక ఉన్న క్వాజీ ఆ వైపుగానే అడుగులు వేసాడు. అనుకున్నది సాధించాడు. జాబ్‌కి సెలెక్ట్ అయిన వెంటనే కైరాన్ క్వాజీ లింక్డ్ఇన్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో నా నెక్స్ట్ స్టాప్ స్పేస్ఎక్స్. నేను త్వరలో ఇంజినీరింగ్ బృందంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరుతాను. కంపెనీ నా వయసుని చూడలేదు.. నా సామర్థ్యం మాత్రమే చూసిందని రాసాడు. సంస్థ నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ లెటర్ స్క్రీన్‌షాట్ కూడా ఇందులో యాడ్ చేశారు. (ఇదీ చదవండి: క్వీన్ ఎలిజబెత్కే గిఫ్ట్ ఇచ్చేంత కుబేరుడితడు.. భారతదేశపు ఫస్ట్ బిలీనియర్!) View this post on Instagram A post shared by Kairan Quazi (@thepythonkairan) క్వాజీ తన ఫ్యామిలీతో కలిసి స్పేస్ఎక్స్లో పనిచేయడం ప్రారంభించేందుకు కాలిఫోర్నియాలోని ప్లెసాంటన్ నుంచి వాషింగ్టన్కు వెళ్లాలని యోచిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా ఉద్యోగ ఇంటర్వ్యూకి సిద్ధమవుతున్నట్లు తెలియజేశాడు. ఈ పోస్ట్ చేసిన కొన్ని వారాల తర్వాత, ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లు వెల్లడించారు. (ఇదీ చదవండి: ఈ బాలీవుడ్ కపుల్స్ కొన్న లగ్జరీ కారు ధర ఎంతో తెలుసా?) View this post on Instagram A post shared by Kairan Quazi (@thepythonkairan) నిజానికి క్వాజీ తన తొమ్మిదేళ్ల వయసులో మూడవ తరగతి చదువుతున్నప్పుడు ఇంటెల్ ల్యాబ్స్‌లో AI రీసెర్చ్ కో-ఆప్ ఫెలోగా ఇంటర్న్‌షిప్ పొందాడు. ఆ తరువాత 11 సంవత్సరాల వయసులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో రీసర్చ్ ప్రారంభించాడు. 2022 లో సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ Blackbird.AIలో మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా నాలుగు నెలలు పనిచేశాడు. కాగా తన తల్లి వాల్ స్ట్రీట్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. కైరాన్ తండ్రి ముస్తాహిద్ క్వాజీ ఒక ఇంజనీర్ కావడం విశేషం. -
స్నేహితురాలి వివాహ రిసెప్షన్.. డాన్స్ చేస్తూ ఇంజినీర్ మృతి
తిరువొత్తియూరు: చైన్నె ముగప్పేర్‌లో తన స్నేహితురాలి వివాహ రిసెప్షన్లో డ్యాన్స్ చేస్తున్న ఇంజినీర్ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. చైన్నెలోని తాంబరం, చిట్లపాక్కానికి చెందిన ఇంజినీర్ మణిప్రసాద్ (21) సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతను తాంబరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనితో అదే సంస్థలో పని చేస్తున్న స్నేహితురాలికి ముగప్పేర్ వెస్ట్ లోని కల్యాణ మండపంలో వివాహం జరిగింది. ఇందులో మణిప్రసాద్, ఆయనతో పాటు పనిచేసే స్నేహితులు పాల్గొన్నారు. రిసెప్షన్ జరిగినప్పుడు ఓ పాటకు మణిప్రసాద్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ స్ఫృహతప్పి పడిపోయాడు. షాక్‌కు గురైన అతని స్నేహితులు శ్యామ్, భరత్ మణిప్రసాద్ను కీల్పాకం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మణిప్రసాద్ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. నొలంబూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగానికి వచ్చి... విగతజీవిగా మారి
బనశంకరి: బెంగళూరు నగరంలో కేఆర్.సర్కిల్ అండర్‌పాస్‌లో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి కారు మునిగిపోవడంతో మృతిచెందిన ఐటీ ఇంజనీరు భానురేఖ మృతదేహానికి విక్టోరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపి సోమవారం కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు అంబులెన్స్ ద్వారా విజయవాడకు తీసుకెళ్లారు. ఆమె బెంగళూరులో ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తుండేది. ఉన్నతస్థాయికి చేరాల్సిన తమ బిడ్డ పాతికేళ్లు నిండకుండానే పాడి ఎక్కిందని బంధువులు విలపించారు. పాలికె అధికారులపై కేసు అండర్‌పాస్ ఘటనపై హలసూరుగేట్ పోలీసులు బీబీఎంపీ అధికారులపై కేసు నమోదు చేశారు. యువతి సోదరుడు సందీప్ హలసూరుగేట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోయిందని, నీరు బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో స్థానిక బీబీఎంపీ అధికారులపై ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాల సమయంలో స్థానిక పాలికె అధికారులపై కేసులు నమోదు చేశారు. అవి ఏమయ్యాయో ఇప్పటికీ తెలియదు. కారు డ్రైవరు అరెస్ట్ భానురేఖ మృతికేసులో క్యాబ్ డ్రైవరు హరీశ్ ను హలసూరుగేట్ పోలీసులు అరెస్ట్‌చేశారు. నిర్లక్ష్యంగా కారు నడిపి మృతికి కారణమయ్యాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా భానురేఖ ఎలక్ట్రానిక్‌సిటీలో నివాసం ఉంటుండగా బెంగళూరునగరం చూపించాలని కుటుంబసభ్యులతో కలిసి క్యాబ్‌బుక్ చేసుకుని కారులో బయలుదేరి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఆమె మృతిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ నగర పాలికె పనితీరుపై విమర్శలు కురిపించారు. -
డబ్బా చక్రాల సైకిల్.. ఈజీగానే తొక్కొచ్చు!
సైకిల్ అంటే ఎలా ఉంటుంది? రెండు పెద్ద చక్రాలు.. వాటిని అటాచ్ చేస్తూ ఫ్రేమ్, చైన్ అంతేకదా! సైకిల్ అనే కాదు.. ఏ వాహనానికైనా ఉండేది గుండ్రని టైర్లు, చక్రాలే. అలా కాకుండా సైకిల్‌కు చతురస్రాకారంలో టైర్లు ఉంటే? అలా సింపుల్‌గా తొక్కేసుకుంటూ వెళ్లిపోగలిగితే? అదెలా సాధ్యమనిపిస్తోంది కదా! రష్యాకు చెందిన ‘ది క్యూ’సంస్థ ఇంజనీర్ సెర్గీ గోర్డీవ్ మాత్రం దీనిని చేసి చూపించాడు. చతురస్రాకారంలో టైర్లను రూపొందించి.. సాధారణ సైకిల్ ఫ్రేమ్‌కు అమర్చి నడిపించాడు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది కూడా. ‘స్క్వేర్’టైర్లతో నడిచేదెలా? యుద్ధ ట్యాంకుల చక్రాల్లో వాడే టెక్నాలజీని ‘స్క్వేర్ టైర్’సైకిల్లో వినియోగించారు. సింపుల్‌గా చెప్పాలంటే.. ఇందులో చక్రాలు మొత్తానికి మొత్తంగా తిరగవు. జస్ట్ వాటి అంచున ఏర్పాటు చేసే ప్రత్యేకమైన బెల్ట్ మాత్రమే కదులుతుంది. అలాగే ‘స్క్వేర్ వీల్’సైకిల్లో చతురస్రాకారపు వీల్స్ కదలకుండా అలాగే ఉంటాయి. సెర్గీ గోర్డీవ్ ప్రత్యేకమైన బెల్ట్‌ను తయారు చేసి వాటి అంచులో అమర్చాడు. పెడల్స్ తొక్కినప్పుడు ఆ బెల్ట్ కదిలేలా.. గేర్లను, చైన్లను అమర్చి అనుసంధానించాడు. పెడల్‌ను తొక్కినప్పుడు.. బెల్ట్ కదులుతూ సైకిల్ ముందుకు వెళుతుంది. ఇదో వినూత్న ఆలోచన, చాలా బాగుందని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుంటే.. అంతా బాగానే ఉందిగానీ.. స్పీడ్ బ్రేకర్లు, గుంతలు వస్తే పరిస్థితి ఏమిటన్న కామెంట్లూ వస్తున్నాయి. -
రెడిక్యులస్..నా పాపులారిటీ తగ్గుతోందంటావా? ట్విటర్ ఉద్యోగిపై వేటు
సాక్షి,ముంబై: ట్విటర్ ఇంజనీర్ ఉద్యోగి ఒకరు పొరపాటున డేటాను డిలీట్ చేయడమే బుధవారం నాటి సర్వర్ డౌన్ సమస్యకు కారణమని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ ఉద్యోగాల కోత నేపథ్యంలో బుధవారం టెక్నికల్ సమస్యను పరిష్కరించే నాధుడే లేకపోయాడట. ట్విటర్ యూజర్ల ట్వీట్లు, ఫాలోవర్లు తదితర అంశాలపై ట్విటర్ కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ సెటింగ్స్ నిర్వహణలోనే యాక్సిడెంటల్‌గా డేటా డిలీట్ అయిందట. ఇది ఉలా ఉంటే మరో కీలక పరిణామం మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెర్జ్ నివేదిక ప్రకారం ట్విటర్ మస్క్ తన అకౌంట్‌ను ఒక రోజు ప్రయివేట్ ఖాతాగా మార్చాడు. తద్వారా ఫాలోవర్ల సంఖ్య పెరుగుతుందా, లేదా, తన ట్వీట్ల ఎంగేజ్మెంట్, ప్రభావం తదితర విషయాలపై స్టడీ చేస్తున్నాడట. ఈ మేరకు ఇంజనీర్లు, సలహాదారుల బృందంతో రివ్యూ చేస్తున్నాడు. అయితే ఈ పరిశీలనలో తనకు 100 మిలియన్లకు మించి ఫాలోయర్లు ఉండగా కేవలం పదివేల ఇంప్రెషన్లు మాత్రమే వస్తున్నాయని తెలిసి మస్క్ అసహనంతో రగిలి పోయాడు. దీనిపై అసంతృప్తితో మస్క్ ఇచ్చిన వివరణను అంగీకరించని ఉద్యోగిపై వేటు వేశాడు మస్క్. రెడిక్యూలస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడని నివేదించింది. మస్క్ ట్వీట్లపై ప్రజల ఆసక్తి క్షీణిస్తోందని సదరు ఇంజనీరు వాదించాడు. దీనికి సంబంధించి గూగుల్ ట్రెండ్స్ డేటాను కూడా చూపించాడు. అంతేకాదు ట్విటర్ అల్గారిథమ్ మస్క్ పట్ల పక్షపాతంగా ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కూడా ఇంజనీర్ చెప్పాడు. అంతే మరుక్షణమే యూ ఫైర్డ్ అంటూ మస్క్ మండిపడటం హాట్ టాపిగ్ నిలిచింది. అయితే తాజా పరిణామం ట్విటర్ ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కాగా ట్విటర్ డేటా ప్రకారం మస్క్ చేసిన ట్వీట్లు మామూలుగా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తాయనీ, కానీ మస్క్ 128 మిలియన్ల ఫాలోయర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువేనని ఫార్చ్యూన్ నివేదిక వ్యాఖ్యానించింది -
బోలెడు ప్రత్యేకతలు ఉన్న బాహుబలి ట్రక్కు.. ఏడేళ్ల పాటు
ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ ట్రక్కు. అత్యంత శక్తిమంతమైన రిగ్ కలిగి ఉన్న ఈ ట్రక్కుకు రెండు డీజిల్ ఇంజిన్లు, 24 సిలిండర్లు ఉండటం విశేషం. దీని రిగ్ 3,974 హార్స్పవర్ శక్తితో పనిచేస్తుంది. ఇంత భారీగా ఉన్నప్పటికీ ఈ ట్రక్కు గంటకు 209 కిలోమీటర్ల గరిష్ఠవేగంతో దూసుకుపోగలదు. అమెరికన్ ఆటోమొబైల్ ఇంజినీరు మైకేల్ హర్రా ఏడేళ్ల పాటు శ్రమించి, ‘థోర్–24’ పేరిట ఈ ట్రక్కును రూపొందించాడు. దీని నిర్మాణానికి 70 లక్షల డాలర్లు (రూ.58.03 కోట్లు) ఖర్చయింది. ఇందులో 40 అంగుళాల టీవీ, 1500 వాట్ ఆడియో సిస్టమ్ వంటి అదనపు హంగులు కూడా ఉన్నాయి. చదవండి: సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు.. ఆహా అనిపించేలా నగరం! -
రాష్ట్రపతి ఆశీస్సుల కోసం ప్రయత్నించింది.. సస్పెన్షన్‌కు గురైంది!
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఓ మహిళా జూనియర్ ఇంజనీర్ అత్యుత్సాహం ప్రదర్శించింది. రాష్ట్రపతి సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి ఆమె పాదాలను తాకే ప్రయత్నం చేసింది. దీంతో, సదరు మహిళా ఇంజనీర్ సస్పెన్షన్‌కు గురైంది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జనవరి 3, 4 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజస్థాన్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా జనవరి 4న రోహెత్‌లోని స్కౌట్ గైడ్ జంబోరీ ప్రారంభ కార్యక్రమానికి ముర్ము హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రత్యేక ఆర్మీ విమానం అక్కడికి వచ్చారు. ఈ సందర్బంగా ప్రోటోకాల్ ప్రకారం అధికారులందరూ ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకుతున్నారు. ముర్ము కూడా వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఇంతలో అక్కడే ఉన్న పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన మహిళా జూనియర్ ఇంజనీర్ అంబా సియోల్.. రాష్ట్రపతి ముర్ము పాదాలు తాకేందుకు ప్రయత్నించారు. అయితే, వెంటనే అప్రమత్తమైన రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ద్రౌపది ముర్ము ముందుకు సాగారు. కాగా, రాష్ట్రపతి ప్రొటోకాల్‌ను అతిక్రమించినందుకు ఈ ఘటనను కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. ఈ క్రమంలో ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించిన అంబా సియోల్‌ను రాజస్థాన్ ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ జనవరి 12న ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. A female engineer, who touched the feet of President Draupadi Murmu, has been suspended by the Rajasthan government, Video surfaced#thesummernews #DraupadiMurmu #president pic.twitter.com/U1SehLfY7A — The Summer News (@TheSummerNews2) January 14, 2023 -
ఇళ్లల్లో నివాసం, అబ్బే కిక్కు లేదని.. అందులో ఉంటున్నాడు!
ఇళ్లల్లో నివాసం ఉండటంలో విశేషం ఏముంది? విమానాన్నే నివాసంగా మార్చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాడు ఓ బ్రిటిష్ పెద్దాయన. వెతికి వెతికి ఒక కాలంచెల్లిన బోయింగ్ విమానాన్ని కారుచౌకగా– కేవలం 82 వేల పౌండ్లకు (రూ.81.82 లక్షలు) కొనుగోలు చేసి, దానినే తన నివాసంగా మార్చుకుని ఇటీవల వార్తలకెక్కాడు. బ్రూస్ కాంప్‌బెల్ (73) ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పనిచేసేవాడు. ‘విమానాలంటే నాకు చిన్నప్పటి నుంచి తగని పిచ్చి. కాలంచెల్లిన విమానాలు ప్లేన్ బోన్యార్డుల్లో (విమానాల షెడ్లు) పడి ఉండటంపై అడపా దడపా వార్తలు చూసేవాణ్ణి. అలాంటి వాటిలో ఒక విమానాన్ని సొంతం చేసుకోవాలని అనుకునేవాణ్ణి. ఇన్నాళ్లకు ఒక విమానాన్ని సొంతం చేసుకున్నాను. ఇప్పుడు దీనినే నా ఇల్లుగా మార్చుకున్నాను. నివాసం ఉండటానికి ఇది నాకెంతో బాగుంది’ అని కాంప్‌బెల్ మీడియాకు చెప్పాడు. ‘అమెరికా మాజీ అధ్యక్షుడు జె.ఎఫ్.కెన్నెడీ భార్య జాకీ కెన్నెడీని పెళ్లాడిన అరిస్టాటిల్ ఒనాసిస్ ఒకప్పుడు ఉపయోగించిన ‘బోయింగ్–727’ విమానం 1999 నుంచి గ్రీస్‌లో పడి ఉన్నట్లు తెలుసుకుని, దీనిని కొనుగోలు చేశాను’ అని కాంప్‌బెల్ వివరించాడు. విమానం ధర 82 వేల పౌండ్లు అయినా, గ్రీస్ నుంచి తాను నివాసం ఉంటున్న ఓరెగాన్‌కు దీనిని తరలించడానికి 99 వేల పౌండ్లు (రూ.98.83 లక్షలు) ఖర్చు కావడం విశేషం. చదవండి: స్టార్టప్‌లో పెట్టుబడులు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న బాలీవుడ్ స్టార్లు! -
Sudheera Valluri: మన వృత్తే మన గుర్తింపు
విమానం నడిపిన అమ్మాయిలను చూస్తున్నాం. విమానంలో యుద్ధం చేసే అమ్మాయిలనూ చూశాం. ఇప్పుడు... విమానాలు తయారు చేస్తున్న అమ్మాయిని చూద్దాం. వల్లూరి సుధీర ఏరో స్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్. జర్మనీలోని లిలియుమ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీలో మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్‌కి హెడ్. ఆ కంపెనీ స్థాపించిన తర్వాత ఉద్యోగంలో చేరిన వంద మంది ఇంజనీర్లలో ఒకే ఒక యువతి ఆమె. సెలవు మీద హైదరాబాద్‌కి వచ్చిన సుధీర ఈ రంగంలో అడుగుపెట్టడానికి స్ఫూర్తినిచ్చిన సందర్భాన్ని, ఏరోస్పేస్ మ్యాన్యుఫాక్చరింగ్ విభాగంలో తన ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు. ఆ ఉద్యోగ ప్రకటన! ‘‘మా తాతయ్య జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సైంటిస్ట్‌గా పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో ఉద్యోగం చేశారు. అమ్మమ్మ అదే డిపార్ట్మెంట్లో క్లర్క్‌గా భువనేశ్వర్‌లో రిటైర్ అయ్యారు. నేను ఏరోస్పేస్ ఇంజనీర్ కావడానికి డైరెక్ట్‌గా ప్రభావితం చేయలేదు, కానీ పరోక్షంగా వారి నేపథ్యం నాకు మంచి భరోసానిచ్చింది. నిజానికి మా అమ్మానాన్నలిద్దరి మూలాలూ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులోనే ఉన్నాయి. అమ్మానాన్న హైదరాబాద్‌లో సెటిల్ కావడంతో నా బాల్యం భాగ్యనగరంలోనే. విద్యానగర్‌లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాను. ఎయిత్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇంగ్లిష్ పేపర్లో ఒక ప్రకటన చూశాను. పైలట్ల కోసం ప్రకటన అది. అయితే మగవాళ్లకు మాత్రమే. అప్పుడు ‘అమ్మాయిలెందుకు వద్దు’ అనిపించింది. అమ్మాయిలు విమానయాన రంగానికి సంబంధించిన కోర్సులు చదవరా అని కూడా అనుకున్నాను. నేను ఏరోస్పేస్ లేదా ఏరోనాటికల్ కోర్సులు చేయాలని నిర్ణయించుకున్నాను. మా అమ్మానాన్న పెద్దరికపు సవరణలేమీ చేయకుండా నన్ను నేను కోరుకున్న కోర్సులో చేర్చారు. బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, దుండిగల్‌లోని ఎమ్ఎల్ఆర్ ఇన్స్టిట్యూట్లో చేశాను. అప్పట్లో నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరి ఆర్మీలో పని చేయాలని ఉండేది. పరీక్షలు రాశాను, కానీ సెలెక్ట్ కాలేదు. అప్పుడు ఆదిభట్లలో ఉన్న ‘టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ కంపెనీ మా క్యాంపస్‌కి ప్లేస్మెంట్ గురించి వచ్చింది, అలా 2012లో టాటా కంపెనీలో ఉద్యోగంలో చేరాను. ప్రొడక్షన్ ప్లానింగ్, కంట్రోల్ విభాగాల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా చేయడంతో పని మీద మంచి పట్టు వచ్చింది. రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత మాస్టర్స్ చేయాలని, అది కూడా మాన్యుఫాక్చరింగ్లోనే చేయాలనుకుని యూఎస్‌లోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి వెళ్లాను. కోర్స్ పూర్తయిన తర్వాత గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ కార్పొరేషన్లో ఉద్యోగం చేశాను. అది బిజినెస్ జెట్లు తయారు చేసే కంపెనీ. ఇప్పటి వరకు నాది చాలా మామూలు జర్నీనే. 2017లో పెళ్లి, అబ్బాయి నాకు బీటెక్ క్లాస్మేటే. ఇప్పుడు ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఏవియేషన్ ఆఫీసర్. పెళ్లి తర్వాత ఇండియాలో ఉద్యోగం కోసం చూస్తున్నప్పుడు జర్మనీలో మంచి అవకాశం వచ్చింది. నాలుగేళ్ల కిందట నేను మాత్రమే జర్మనీలో ‘లిలియుమ్ ఎయిర్ క్రాఫ్ట్’ కంపెనీలో ఎయిర్ క్రాఫ్ట్ ఫైనల్ అసెంబ్లీ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీలో అప్పుడు... అంటే 2018లో వందమంది ఇంజనీర్లలో అమ్మాయిని నేను మాత్రమే. అయితే ఆ గుర్తింపు నాకు పెద్దగా సంతోషాన్నివ్వదు. అమ్మాయిలు కోరుకోవాల్సింది జెండర్ సెపరేషన్తో కూడిన గుర్తింపు కాదు. వందమందిలో యాభై మంది అమ్మాయిలు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించుకోవాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనేది నా ఆకాంక్ష. ఇప్పుడు మా కంపెనీలో ఎనిమిది వందల మంది ఇంజనీర్లున్నారు, వారిలో వందమంది వరకు అమ్మాయిలున్నారు. ఈ నాలుగేళ్లలో వచ్చిన పురోగతి. ఈ ఫీల్డ్‌లో అమ్మాయిలు నెగ్గుకురావడం కష్టమనేది అపోహ మాత్రమే. నేనిప్పుడు మ్యాన్యుఫాక్చరింగ్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ టీమ్‌కి హెడ్‌ని. ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగంలోకి సెలెక్ట్ చేసుకోగలిగాను. మా టీమ్‌లో పోలండ్, బ్రెజిల్, యూకే, యూరప్ దేశాల వాళ్లు ఉన్నారు. వాళ్లతో కలిసి పని చేయడం, వాళ్ల నుంచి పని తీసుకోవడంలో ఎక్కడా ఇబ్బందులేవీ రాలేదు. అయితే ఒక టాస్క్ ఇచ్చే ముందు వాళ్ల బేసిక్ అండర్స్టాండింగ్ లెవెల్స్‌ని అర్థం చేసుకోగలిగితే టీమ్‌తో పని చేయించుకోవడం ఏ మాత్రం కష్టంకాదనేది నా అభిప్రాయం. నేను టీమ్ లీడర్లుగా, ఇంజనీర్లుగా ఎంతో మంది మహిళలను చూశాను, వారితో పనిచేశాను కూడా. మిగిలిన అన్ని రంగాల్లోలాగానే ఈ రంగంలో కూడా మహిళలు బాగా రాణిస్తున్నారు’’ అన్నారు ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ వల్లూరి సుధీర. సబ్జెక్ట్‌ని నిరూపించుకోవాల్సిందే! ఆటోమొబైల్, మాన్యుఫాక్చరింగ్ వంటి సాంకేతికత ఎక్కువగా ఉంటే రంగాల్లో టెక్నికల్ పీపుల్‌తో పని చేసేటప్పుడు వాళ్లు ఆడవాళ్ల మాటను పట్టించుకోరనే అభిప్రాయం కూడా ఉంటుంది. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే... యంగ్ ఇంజనీర్కంటే సీనియర్ టెక్నీషియన్‌కి ఎక్కువ విషయాలు తెలిసి ఉంటాయనడంలో సందేహం లేదు. కొత్త మార్పును తెచ్చేటప్పుడు టెక్నికల్ పీపుల్‌కి మనం విషయమంతా వివరించేటప్పుడు సబ్జెక్ట్ పరంగా మనం ఒక అడుగు ముందున్నామనే విషయాన్ని నిరూపించుకోవాలి. ఈ నిరూపణ మగవాళ్లకైనా ఉంటుంది, ఆడవాళ్లకూ ఉంటుంది. నేను మహిళలకు చెప్పే మాట ఒక్కటే... మనల్ని మనం ‘ఇంజనీర్, సైంటిస్ట్, పైలట్’ అని ప్రొఫెషన్పరంగా మాత్రమే గుర్తించుకోవాలి, ‘ఉమన్ ఇంజనీర్, ఉమన్ పైలట్, ఉమన్ సైంటిస్ట్’ అని జెండర్‌పరంగా కాదు. అన్ని పరీక్షలనూ మగవాళ్లతోపాటు పూర్తి చేసి ఈ స్థాయికి వచ్చాం. రిజర్వేషన్లలో రాలేదు. ఇక ఉమన్ అని జెండర్‌తో ఐడింటిఫై అవడం ఎందుకు? – వల్లూరి సుధీర, ఏరోస్పేస్ మాన్యుఫాక్చరింగ్ ఇంజనీర్ – వాకా మంజులారెడ్డి -
50 రోజులు.. 5 వేల కిలోమీటర్లు
యాదగిరిగుట్ట: ఆస్ట్రియా దేశానికి చెందిన ఇంజినీర్ హెన్స్‌పీటర్ ఢిల్లీ నుంచి యాదాద్రి వరకు చేపట్టిన సైకిల్‌యాత్ర ఆదివారం యాదగిరిగుట్ట పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా హెన్స్‌పీటర్ శ్రీభోదనందగిరి గో ఆశ్రమ పీఠాధిపతి బోదనందగిరి స్వామిజీని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వంటలు అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. వివిధ ప్రాంతాల ప్రజలను కలిసి వారిగురించి తెలుసుకునేందుకు ఆస్ట్రియా నుంచి సైకిల్ యాత్ర చేపట్టానని వివరించారు. పాకిస్తాన్ సరిహద్దు దగ్గర పరిస్థితులు అనుకూలించకపోవడంతో విమానంలో దుబాయ్ చేరుకొని, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చినట్లు వెల్లడించారు. ఢిల్లీ నుంచి యాదాద్రికి తిరిగి సైకిల్ యాత్ర ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 50 రోజుల్లో 5 వేల కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించినట్లు వివరించారు. యాదాద్రి క్షేత్రాన్ని మంగళవారం సందర్శించనున్నట్టు తెలిపారు. -
ఉదయం ప్రేమవివాహం.. సాయంత్రానికి శవమైన సాఫ్ట్వేర్ ఇంజినీర్
సాక్షి, చెన్నై(అన్నానగర్): ప్రేమ వివాహం చేసుకున్న చెన్నై ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. చెన్నైలోని తాంబరానికి చెందిన సురేష్ కుమార్ (30) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను, విల్లుపురం జిల్లా కోటకుప్పం ప్రాంతానికి చెందిన గోమతి (30) పెరంబలూరు ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. గోమతి ప్రస్తుతం కోటకుప్పంలో మున్సిపల్ ఉద్యోగినిగా పని చేస్తోంది. వారి కుటుంబసభ్యులకు కూడా వీరిద్దరి ప్రేమ గురించి తెలిసింది. ఈ క్రమంలో సురేష్ కుమార్, గోమతి తల్లిదండ్రుల అంగీకారంతో ఆమెను శుక్రవారం ఉదయం పుదుచ్చేరిలోని కాలాపట్టు ప్రాంతంలో ఉన్న బాలమురుగన్ ఆలయంలో వివాహం చేసుకున్నాడు. తరువాత సాయంత్రం కోటకుప్పంలోని ఓ ప్రైవేట్ హాలులో వీరి రిసెప్షన్ జరగాల్సి ఉంది. చదవండి: (బెడ్రూమ్లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. ఏం జరిగింది?) ఈ స్థితిలో వరుడు సురేష్ కుమార్ కుటుంబం చెన్నైకి చెందిన వారు కావడంతో రిసెప్షన్‌కు ముందు కొత్తకుప్పంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో బస చేశారు. తర్వాత సురేష్ కుమార్ దుస్తులు మార్చుకుని, వస్తానని చెప్పి గదిలోకి వెళ్లాడు. చాలాసేపటికి అతను బయటకు రాలేదు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు గదిలోకి వెళ్లి చూశారు. ఆ సమయంలో సురేష్ కుమార్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. బంధువులు సురేష్ కుమార్‌ను పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే సురేష్ కుమార్ మృతి చెందాడు. పోలీసులు సురేష్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుదుచ్చేరి జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (కీచక ఉపాధ్యాయుడు.. విద్యార్థిని పదేపదే గదికి పిలిపించి...) -
అదిరిపోయే గ్యాడ్జెట్.. కొత్తగా చూసేవాళ్లు కొరివిదెయ్యమని భయపడతారు!
లాంతరు నడవటమేంటి? లాంతరు పట్టుకుని మనిషి నడవాలి కదా అనుకుంటున్నారా? ఈ హైటెక్ లాంతరు మాత్రం తనంతట తానే నడుస్తుంది. రాత్రివేళ ఇంట్లో దీపాలార్పేసి, దీన్ని వెలిగించుకుంటే ఇల్లంతా కలియదిరుగుతూ రంగు రంగుల్లో వెలుగులు విరజిమ్ముతుంది. కొత్తగా చూసేవాళ్లు ఇదేదో కొరివిదెయ్యంలా ఉందనుకుని భయపడే అవకాశాలూ లేకపోలేదు. మామూలుగా చార్జింగ్ చేసుకుని వాడుకునే ఎమర్జెన్సీ దీపాల్లాగానే దీనిని వాడుకోవచ్చు. అయితే, దీనికింద సాలీడు కాళ్లలాంటి రోబోటిక్ కాళ్లను అమర్చడం వల్ల ఇది నడవగలుగుతుంది కూడా. జపాన్‌కు చెందిన ఐటీ ఇంజనీర్ ఇయానియస్ తన ప్రాజెక్టులో భాగంగా దీనికి రూపకల్పన చేశాడు. దీని తయారీ కోసం త్రీడీ ప్రింటింగ్ ద్వారా ముద్రించిన విడిభాగాలను ఉపయోగించాడు. దీని పనితీరును ప్రత్యక్షంగా చూపడానికి తీసిన వీడియో ‘ట్విట్టర్’లో పెడితే, కొద్ది గంటల్లోనే అది వైరల్‌గా మారింది. చదవండి: ‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్’ -
38 మంది ఇంజనీర్లకు ఒక రోజు జీతం కట్
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలంలో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, గతంలో మాదిరి సంఘటనలు పునరావృతం కారాదని మంత్రి కేటీఆర్, స్పెషల్ సీఎస్ల నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్, ఈఎన్సీల వరకు కొంతకాలంగా హెచ్చరించినా విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన 38 మంది ఇంజినీర్లపై జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. ఈ మేరకు వారికి ఒకరోజు వేతనం కోత విధిస్తూ కమిషనర్ లోకేశ్‌కుమార్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. 13 సర్కిళ్లకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు(డీఈఈ), అసిస్టెంట్లు ఇంజినీర్లు(ఏఈ) వీరిలో ఉన్నారు. డీఈఈలే ఈఈలుగా కూడా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నవారు వీరిలో ముగ్గురు ఉన్నారు. గత సంవత్సరం అక్టోబర్‌లో నాలాల సమస్యలు వర్షాకాల విపత్తులపై అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్, భవిష్యత్‌లో ప్రాణనష్టాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పలు పర్యాయాలు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీరియస్‌గా హెచ్చరించారు. స్పెషల్ సీఎస్ అర్వింద్‌కుమార్ పూర్తి కావాల్సిన పనులు కాలేదని గత నెలాఖరులో తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తూ జూన్ 5లోగా పనులు పూర్తిచేయాలని మెమో జారీచేశారు. కమిషనర్ లోకేశ్‌కుమార్, ఈఎన్సీ జియావుద్దీన్‌లు సైతం పలు సందర్భాల్లో అలర్ట్ చేస్తూ, సీరియస్‌గా చెప్పినా పనులు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో స్వయానా ఈఎన్సీ తోపాటు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి పూర్తికాని పనుల ఫొటోలతో సహా పంపిస్తూ కొన్నిరోజులుగా దాదాపు 50 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. పనులు పూర్తిచేసి.. ఫొటోలు జోడించి, తగిన వివరణ ఇచ్చిన వారికి తదుపరి కఠినచర్యలు తీసుకోకుండా జీతంలో కోత విధించారు. తిరిగి ఇలాంటి ఘటనలు పునరావతమైతే ఎలాంటి నోటీసు లేకుండానే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తీవ్రంగా హెచ్చరించారు. క్రిమినల్ కేసు నమోదుతోపాటు నోటీసుల్లేకుండానే ఉద్యోగం కూడా ఊస్ట్ అవుతుందనే హెచ్చరికలు ఇదివరకే జారీ చేసినా నిర్లక్ష్యం కనబరుస్తున్నవారిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నందున, ప్రజలకు ప్రాణాంతకంగా ఉన్న ప్రాంతాల్లో నూరుశాతం సేఫ్టీ ఏర్పాట్లు చేయాలన్నా చేయకపోవడంతో తీవ్ర తప్పిదంగా పరిగణిస్తూ ప్రస్తుతానికి ఈ చర్య తీసుకున్నారు. బల్దియా చరిత్రలోనే ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమమని జీహెచ్ఎంసీ వర్గాలంటున్నాయి. ఈ సర్కిళ్లలోని వారికి.. జీతాల కోత పడిన వారిలో అల్వాల్, చందానగర్, శేరిలింగంపల్లి, కాప్రా, సికింద్రాబాద్, ఖైరతాబాద్, మల్కాజిగిరి, యూసుఫ్‌గూడ, సంతోష్‌నగర్, ఫలక్‌నుమా, రాజేంద్రనగర్, గాజుల రామారం, కుత్బుల్లాపూర్ సర్కిళ్లకు చెందిన ఇంజినీర్లున్నారు. వారిలో.. ఈఈలు.. కేవీఎస్ఎన్టీ రాజు, సి.శ్రీకాంత్, డి.ఆశాలత, ఆర్.ఇందిరాబాయి, ఆర్. లక్ష్మణ్, యు, రాజ్‌కుమార్, బి.రాములు, టి.లక్ష్మా, బి.నరేందర్‌గౌడ్, వి.శ్రీనివాస్ (ఎఫ్ఏసీ), డి.గోవర్ధన్‌గౌడ్ (ఎఫ్ఏసీ), పి. కష్ణచైతన్య, వి.హరిలాల్(ఎఫ్ఏసీ). డిప్యూటీ ఈఈలు.. ఎం.కార్తీక్, ఎస్. స్రవంతి, ఎస్.రఘు, పీసీవీ కష్ణకుమార్, ఈ.లౌక్య, ఎస్. శ్రీరాములు, డి.దేవేందర్, ఎం. వెంకటేశ్వర్లు, బి.శంకర్, ఎస్.శిరీష, బి.భానుచందర్. కె.అరుణ్‌కుమార్, ఎంవీ శివరామ్‌ప్రసాద్, సీహెచ్.సునీల్‌కుమార్, జి.సంతోష్‌కుమార్‌రెడ్డి, ఎన్.కౌశిక్, వి.శ్రీనివాసరావు, జి.చరణ్, కె.దివ్యజ్యోతి,ఎండి జమీల్‌పాషా, ఎస్ఎంఆర్ అన్సారీ, ఎంఏ రహీమ్, ఎల్.బల్వంత్‌రెడ్డి, టి.సంపత్‌కుమార్, ఆర్.మల్లారెడ్డి. (చదవండి: సీఐకి రివర్స్ పంచ్) -
ఆహా ఏమి కారు.. రూ. 30 ఖర్చుతో 300 కి.మీ ప్రయాణం..!!
-
‘కారు’చౌక. ఖర్చు తక్కువ.. రూ.30తో 300 కిలోమీటర్లు!
ఈ ఎలక్ట్రికల్ కారు చూస్తే చిన్నగా, పనితీరు మిన్నగా ఉంది. అందులో ప్రయాణం ‘కారు’చౌక. ఖర్చు తక్కువ, మైలేజీ ఎక్కువ. ఈ కారును ఖమ్మం నగరానికి చెందిన ఇంజనీర్ రాకేశ్ తయారుచేశాడు. ఒక్కసారి చార్జ్ చేస్తే 5 నుంచి 10 యూనిట్ల వరకు విద్యుత్ అవసరమవుతుందని, పది యూనిట్లు వినియోగమైనా రూ.30 వరకు ఖర్చు అవుతుందని రాకేశ్ వెల్లడించారు. ఒకసారి చార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల మేర ప్రయాణించొచ్చని, కారు నడుస్తుంటే కూడా చార్జింగ్ అవుతుందని వివరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌కు కారును తీసుకురాగా, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తదితరులు ఆసక్తిగా పరిశీలించి వివరాలు ఆరా తీశారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం -
35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం
కోటా: రాజస్తాన్‌కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఆ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికీ లబ్ధి చేకూర్చాడు. 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్‌లో స్వామి టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. క్యాన్సలేషన్‌లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జిని కూడా టికెట్ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది. అదేమంటే జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్న బదులు వచ్చింది. జూలై 1కి ముందే రద్దు చేసుకున్న టికెట్‌పై సర్వీస్ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్‌ను టాగ్ చేశాడు. ఎట్టకేలకు సర్వీస్ చార్జీ మొత్తాన్ని వెనక్కిస్తామంటూ రైల్వే శాఖ 2019లో దిగొచ్చింది. కానీ రౌండాఫ్ పేరుతో 33 రూపాయలే రీఫండ్ చేసింది. దాంతో మిగతా 2 రూపాయల కోసం కూడా పట్టుబట్టిన స్వామి, మూడేళ్ల పోరాటంతో వాటినీ సాధించాడు! 2017 జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికీ రూ.35 సర్వీస్ చార్జి రిఫండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. -
పేదింటికి పెద్ద కష్టం !
అనంతపురం కల్చరల్ /రాప్తాడు: జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్త కళ్ల ముందే మరణించడంతో ఓ మహిళ కన్నీరు మున్నీరైంది. ఆ బాధ నుంచి తేరుకోకముందే కన్న కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. చిన్న వయసులోనే కట్టుకున్న భర్త మంచం పట్టడంతో భార్య ... తన తండ్రికి ఏమైందో తెలీక ఓ మూడేళ్ల బాలుడు.. ఇలా ఓ కుటుంబాన్ని కష్టాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గుత్తి మండలం రజాపురానికి చెందిన ఆదిలక్ష్మమ్మ భర్త మార్కెట్‌యార్డులో పనిచేస్తుండేవాడు. ఆయన చనిపోవడంతో కుమారుడు కృష్ణమూర్తి, కోడలు ఆదెమ్మతో కలసి అనంతపురంలోని చిన్మయనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. ఆదిలక్ష్మమ్మ పెన్షన్‌తో ఆ కుటుంబం జీవనం సాగించేది. అయితే ఆదిలక్ష్మమ్మ 2021 ఫిబ్రవరిలో మరణించడంతో వారి కష్టాలు ప్రారంభమయ్యాయి. అదే సంవత్సరం అక్టోబరులో ఆదెమ్మ కుమారుడు సాకే శ్రీకాంత్ (32)కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. కుమారుడికి వచ్చిన జబ్బును చూసి కుంగిపోయిన ఆదెమ్మ భర్త కృష్ణమూర్తి కూడా నవంబరు 1న చనిపోవడంతో ఇక ఆ ఇల్లు దిక్కులేనిదైంది. వారంలో ఐదుసార్లు డయాలసిస్ చేస్తేకానీ శ్రీకాంత్ బతికే పరిస్థితి లేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి ఆదెమ్మ , భార్య మల్లిక కన్నీరుమున్నీరవుతున్నారు. కష్టాల్లో శ్రీకాంత్ కుటుంబం బీటెక్ పూర్తి చేసిన సాకే శ్రీకాంత్ ఆరు నెలల కిందట వరకు హుషారుగానే ఉండేవాడు. హైదరాబాద్‌లో అనే సంస్థల్లోనూ పనిచేశాడు. 2018లో వజ్రకరూరు మండలం, కొనకొండ్లకు చెందిన మల్లికతో వివాహం జరగడంతో విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లిలో హార్డ్‌వేర్ ఇంజనీరుగా చేరాడు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే విధి వారిని చిన్నచూపు చూసింది. గత సంవత్సరం అక్టోబరు నెలలో అనారోగ్యంగా ఉందని హాస్పిటల్‌కు వెళితే శ్రీకాంత్ రెండు కిడ్నీలు పాడయ్యాయని తేలింది. దీంతో అప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరిగేందుకు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశారు. ఆఖరికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు మాత్రం ఆపరేషన్‌తో సమస్య తీరుతుందని దానికి రూ.40 లక్షలు అవసరమవుతాయని తేల్చి చెప్పారు. బిడ్డను బతికించండయ్యా... రెండు కిడ్నీలు పాడైపోయి నా బిడ్డ పడుతున్న బాధ చూడలేకపోతున్నా. ఉన్న డబ్బంతా ఆస్పత్రులకే ఖర్చు పెట్టా. మా ఇంటి భారాన్ని కూతురు, అల్లుడు మోస్తున్నారు. బిడ్డ బతకాలంతే రూ.40 లక్షలు అవసరమంట. దయగల మారాజులు చేతనైంత సాయం చేసి నా కొడుకును బతికించండయ్యా.. – ఆదెమ్మ , సాకే శ్రీకాంత్ తల్లి దాతలు సాయం చేయదలిస్తే... సాకే శ్రీకాంత్ సెల్ నంబర్ – 7658971971 ఎస్బీఐ , జేఎన్టీయూ బ్రాంచ్ అకౌంట్ నం: 30453144331 ఐఎఫ్ఎస్సీ కోడ్ – ఎస్బీఐఎన్ 0021008 గూగుల్‌పే /ఫోన్‌పే నం – 7658971971 -
నయా సావిత్రి.. భర్తను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. భార్య ఏం చేసిందంటే..?
రాయ్‌పూర్ : పురాణాల్లో భర్త ప్రాణాల కోసం యుముడినే సావిత్రి ఎదురించిందని చెబుతుంటారు. అదే విధంగా తన భర్త ప్రాణాల కోసం అడవి బాట పట్టింది ఓ మహిళ. మావోయిస్టుల చెర నుండి తన భర్తను రక్షించుకునేందుకు రెండున్నరేళ్ల కూతురితో సహా తన ప్రాణాలనూ ఫణంగా పెట్టింది. తీరా భర్తను మావోయిస్టులు విడిచిపెట్టినా.. ఆమె మాత్రం అడవి నుంచి ఇంకా బయటకు రాకపోవడం కుటుంబ సభ్యులను ఆందోళన గురిచేస్తోంది. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల ఇంజినీర్ అశోక్ పవార్, కార్మికుడు ఆనంద్ యాదవ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలిసిన అశోక్ పవార్ భార్య సోనాలీ పవార్ తీవ్ర ఆవేదనకు గురైంది. దీంతో తాను ఎలాగైనా తన భర్తను రక్షించుకోవాలని భావించి.. పవార్‌ను విడుదల చేయాలని మావోయిస్టులను వేడుకుంటూ ఓ వీడియోను విడుదల చేసింది. కాగా, ఈ వీడియోకు నక్సల్స్ నుంచి స్పందన రాకపోవడంతో ఆమె అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. స్థానిక జర్నలిస్టు సాయంతో ఆమె తన రెండున్నరేళ్ల కూతురిని వెంటతీసుకొని దండకారణ్యంలోకి వెళ్లింది. ఇదిలా ఉండగా కిడ్నాప్‌కు గురైన అశోక్ పవార్, ఆనంద్ యాదవ్‌ను మావోయిస్టులు విడిచిపెట్టడంతో వారు సురక్షితంగా బయటకు వచ్చారు. కానీ, వారిని వెతుక్కుంటూ వెళ్లిన సోనాలీ పవర్ మాత్రం అడవి నుంచి బయటకు రాకపోవడంతో పోలీసులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. అడవి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అశోక్ పవార్, ఆనంద్ యాదవ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. అశోక్ పవార్ స్వల్ప అస్వస్థతకు గురైనట్టు పేర్కొన్నారు. సోనాలీ పవార్ కూడా సురక్షితంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, నక్సల్స్ తమను ఇబ్బంది పెట్టలేదని, ఇరువురికి రూ. 2వేలు ఇచ్చి అడవి నుంచి పంపించినట్టు ఆనంద్ యాదవ్ వెల్లడించారు. -
అడవిబాట పట్టిన భార్య.. మావోయిస్టుల చెరలో ఇంజనీర్
-
మధుమేహులకు వర్షిత తీపికబురు!
డయాబెటిస్ రోగికి రోజూ వేలికి సూది గుచ్చుకుని మరీ పరీక్ష చేస్తేగానీ... రక్తంలో చక్కెర మోతాదు ఎంత ఉందో తెలియదు. మరి అలాంటి అవసరమే లేకుండా దేహంలో షుగర్ ఎంత ఉందో చటుక్కున తెలిసిపోతే ఎంత బాగుంటుంది? క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాల్సి రావడం వల్ల నెలకు నాలుగైదు వేలు ఖర్చు తప్పదు. కానీ ఇలా రోజూ పరీక్షలు చేయిస్తున్నా సరే... నాలుగేళ్లు గడిచాక కూడా ఆ వ్యయం... నెల ఖర్చుకు మించకపోతే ఇంకెంత బాగుంటుంది? చక్కెర జబ్బు అంటూ పేరులో మాత్రమే తీపి ఉన్న డయాబెటిస్ అనే ఈ సమస్య రోజూ చేసుకోవాల్సిన చిన్నపాటి గాయాలతోనూ, వ్యయాలతోనూ చాలా బాధిస్తుంటుంది. కానీ ఇకపై అలాంటి బాధలేవీ లేకుండానే... మొబైల్సహాయంతోనే చక్కెర మోతాదును తెలుసుకునే యాప్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేసింది దువ్వూరు వర్షిత. ఆ ప్రయత్నానికి సాంకేతికంగా సహాయపడ్డాడు విమల్ అనే ఇంజినీర్. కాలం కలిసొస్తే ఎలాంటి గుచ్చుకోవడాలు లేకుండా మన మొబైల్లోనే గ్లూకోమీటర్ రూపొంది... దాని సహాయంతో చక్కెర మోతాదులు చాలా తేలిగ్గా తెలుసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనీ, మహా అయితే మరో ఆర్నెల్లు లేదా ఏడాది లోపే ఇది అందుబాటులోకి రావచ్చంటున్నారు 20 ఏళ్ల వర్షిత, యువ ఇంజనీర్ విమల్ కుమార్ లు. వారిరువురూ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పిన విషయాలు డయాబెటిస్తో బాధపడుతున్న ఎందరికో తీపికబురు కాబోతున్నాయి. అవేమిటో తెలుసుకుందాం. ‘‘నా పేరు దువ్వూరు వర్షిత. మాది నెల్లూరు. పుట్టినప్పట్నుంచే టైప్–1 డయాబెటిస్ తో బాధపడుతున్నాను. ఒక్కోసారి ఒకేరోజు నాలుగైదుసార్లు సూదితో వేలిని గుచ్చుకుని చక్కెరను పరీక్షించుకోవాల్సి వచ్చేది. ఒక్కసారి పరీక్ష కోసం పెట్టే ఖర్చు రూ. 40 వరకు అయ్యేది. అంటే ఒక్కరోజుకు రూ. 160 అన్నమాట. అలా చూస్తే నెలలో కేవలం వైద్యపరీక్ష కోసమే ఐదువేల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువే ఖర్చు చేయాల్సి వచ్చేది. చిన్నప్పుడు పెద్దగా బాధ తెలియకపోయినా పెరుగుతున్న కొద్దీ వేదన మరింత ఎక్కువైంది. రోజులో ఇన్నిసార్లు పరీక్షల కోసం పెట్టే ఖర్చే కాకుండా... ఇక మందులు, ఇన్సులిన్ లాంటివాటికి ఎంతవుతుందో ఊహించవచ్చు. ఓ సగటు మధ్యతరగతి వారికి ఇది ఎంత పెద్ద మొత్తమో ఎవరికైనా తెలిసే విషయమే. ఎప్పటికైనా నాలాంటివాళ్లకోసం ఏదైనా చేస్తానంటూ పదేళ్ల వయసప్పుడే నాన్న దగ్గర ఓ సంకల్పం తీసుకున్నా. అందుకే ఐఐటీకి క్వాలిఫై అయి, అందులో చేరాక కూడా బయోటెక్నాలజీపై ఆసక్తితో బయటకి వచ్చి చెన్నైలో ఆ కోర్సులో చేరాను. కోయంబత్తూరులో 2019లో ఓ హ్యాకాథాన్ (కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై తమ తమ భావాలు, ఆలోచనలు పంచుకునే సదస్సు) నిర్వహించారు. అక్కడ పరిచయమయ్యారు తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన విమల్‌కుమార్ అనే యువ ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఈ హ్యాకాథాన్లో నా ఆలోచనలను వివరించా. తన ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సామర్థ్యంతో నా ఐడియాలను సాకారం చేయవచ్చని విమల్‌తో మాట్లాడినప్పుడు తెలిసింది. అంతే... మేమిద్దరమూ కలిసి మా ప్రాజెక్టు కోసం పనిచేయడం ప్రారంభించాం. ఇందుకోసం రూపొందించిన గ్లూకోమీటర్ కూడా చాలా సింపుల్‌గా పనిచేస్తుంది. నిజానికి ఇదో చిన్న పెన్ డ్రైవ్ తరహాలో ఉండే పరికరం. దీన్ని మన మొబైల్‌కి జతచేయాలి. అక్కడ మన వేలిని ఉంచితే చాలు... ఎలాంటి సూదిగాయాలూ, నొప్పి లేకుండానే మన రక్తంలోని చక్కెర మోతాదులు తెలిసిపోతాయి’’ అంటూ తమ ప్రాజెక్టు గురించి వివరించింది వర్షిత. ‘‘ఇది వన్ టైమ్ ఎక్స్పెన్స్ ఎక్విప్మెంట్. అంటే ఒక్కసారి కొంటే చాలు ఎప్పటికీ వాడుకునేలా రూపొందించిన డివైస్ ఇది. నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ (ఎన్ఐఆర్) అనే సాంకేతికత సహాయంతో ఎలాంటి గాటూ లేకుండానే మన దేహంలోని చక్కెరను అంచనా వేస్తుంది ‘ఈజీ లైఫ్’ అనే పేరున్న ఈ పరికరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో చక్కెర విలువలను విశ్లేషించడం వల్ల నిమిషంలోపే షుగర్ రీడింగ్స్ మనకు తెలిసిపోతాయి. ఎక్కడైనా ఎప్పుడైనా నిస్సంకోచంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు’’ అంటూ వివరించారు విమల్. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ సదస్సులో వర్షిత, విమల్‌ల ఈ ‘స్టార్ట్ అప్’ ప్రథమస్థానంలో నిలిచింది. అంతేకాదు ‘ఎమ్పవర్–2021’ పేరిట గతేడాది నిర్వహించిన ‘వుమన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాంపిటీషన్’లో రన్నరప్‌గా నిలిచింది. ఇదొక్కటే కాదు... ‘ఎన్ఐటీటీఈ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్’ హ్యాకథాన్‌తో పాటు మరికొన్ని సదస్సుల్లోనూ వీరి ఆవిష్కరణ అనేక బహుమతులను గెలుచుకుంది. గతంలో దుబాయిలో గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్వహించిన ఓ సదస్సులో దాదాపు 42 దేశాల నుంచి యువతులు పాల్గొన్నారు. ‘టై ఉమన్ గ్లోబల్ పిచ్–2021 హైదరాబాద్ చాప్టర్’ ప్రాజెక్టును ప్రోత్సహించి... వర్షితను ఆ సదస్సు కు పంపినప్పుడు అక్కడ కూడా ఆమె ప్రాజెక్టుకు మంచి ప్రశంసలు దొరికాయి. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని గుర్తించిన హైదరాబాద్‌కు చెందిన గ్రేలాజిక్ టెక్నాలజీస్ అండ్ ఎడిఫై పాత్ సంస్థల డైరెక్టర్ వర్ల భానుప్రకాశ్‌రెడ్డి... ఈ ప్రాజెక్టుకు మెంటార్‌గా, ప్రమోటర్‌గా వర్షిత, విమల్లకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఈ పరిశోధనలో పాలు పంచుకునేలా అనేక ఇతర సంస్థలను సైతం వీరి ప్రాజెక్టుతో అనుసంధానిస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో రూపొందించనున్న ఈ ప్రాజెక్టుకు ‘వివాలైఫ్’ అని పేరు పెట్టుకున్నారు. వీళ్ల పరిశోధనలకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వేదికగా నిలిచింది. -
ఉన్మాదిలా మారిన ఐటీ ఉద్యోగి.. భార్యను క్రికెట్ బ్యాట్‌తో కొట్టి
సాక్షి, చెన్నై(తమిళనాడు): రెండేళ్లుగా చవి చూసిన కష్టాలతో ఓ ఐటీ ఉద్యోగి ఉన్మాది మారాడు. తన భార్యను క్రికెట్‌బ్యాట్‌తో కొట్టి చంపేశాడు. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లల్ని తల దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు. ఆ పై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం చెన్నై పెరుంగుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెరుంగుడిలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో మణిగండన్(42) నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య ప్రియ(36), ధరన్(10), దహన్(01) అనే కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకు ఓ ఐటీ సంస్థలో మణిగండన్ ఉద్యోగం చేసేవాడు. లగ్జరీ గానే కుటుంబ జీవనం సాగింది. అయితే, హఠాత్తుగా ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటికే మణిగండన్ పరిమితం అయ్యాడు. కుటుంబ పోషణ∙కోసం కొన్ని ప్రైవేటు బ్యాంక్‌ల నుంచి, స్నేహితుల నుంచి రూ.లక్షల్లో అప్పు చేశాడు. ప్రస్తుతం అప్పులు భారంగా మారడంతో మణిగండన్ ఉన్మాది అయ్యాడు. ఆదివారం భార్య ప్రియను, బిడ్డలను చంపేశాడు. ఆ తర్వాత వంట గదిలో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం క్రోంపేట జీహెచ్‌కు తరలించారు. -
శిక్షణలో ఉన్న యువతిపై ఇంజినీర్ల అసభ్య ప్రవర్తన
సాక్షి, శంషాబాద్(హైదరాబాద్): ఎయిరోటెక్నిక్‌లో శిక్షణ పొందుతున్న యువతితో ఇంజినీర్లు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం..మహారాష్ట్ర ముంబాయికి చెందిన ఓ యువతి(25) మామిడిపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలో నివాసముంటోంది. ఎయిర్‌పోర్టులో ఎరోటెక్నిక్ కోర్సులో కొంతకాలంగా శిక్షణ తీసుకుంటోంది. అదే విభాగంలో సీనియర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న వెంకట్, ఫళనిస్వామి ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో సదరు యువతి బుధవారం ఉదయం పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎయిర్‌పోర్టులో జరిగిన ఘటన కావడంతో వారు మహిళా పోలీసుల సహాయంతో ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మాజీ మంత్రికి ఝలక్.. 69 చోట్ల విజిలెన్స్ సోదాలు -
మహారాష్ట్రలో "ఒమిక్రాన్" వేరియంట్ కలకలం!!
థానే: మహారాష్ట్రలో దక్షిణాఫ్రికా నుండి థానేకి తిరిగి వచ్చిన 32 ఏళ్ల ఇంజనీర్‌కి చేసిన కోవిడ్ పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు కొత్త వైరస్ వేరియంట్ దృష్ట్య కోవిడ్-19 ఐసోలేషన్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే సదరు వ్యక్తిని ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు నిర్వహించడంతో అతను కరోనా బారిన పడినట్లు గుర్తించామని కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) అంటువ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ ప్రతిభా పాన్ పాటిల్ తెలిపారు. పైగా ఏడు రోజుల తర్వాతే ఫలితాలు తెలుస్తాయని అన్నారు. అయితే ఆ ఇంజనీర్ కాస్త తీవ్ర ఆందోళనకు గురవ్వడంతో కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు పాటిల్ వెల్లడించారు. (చదవండి: నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!) అంతేకాదు కేడీఎంసీ కమీషనర్ డాక్టర్ విజయ్ సూర్యవంశీ కళ్యాణ్ డోంబివిలి టౌన్షిప్ పౌరులను ఈ కొత్త వేరియంట్ దృష్ట్యా ఎటువంటి ఆందోళనలకు గురికావద్దని అన్నారు. పైగా కోవిడ్ ప్రోటోకాల్‌ని కచ్చితంగా పాటించాలంటూ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అతని కుటుంబ సభ్యులు ఎనిమిది మందికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించడమే కాక ఆ ఇంజనీర్‌తో ప్రయాణించిన వారి గురించి కూడా విచారిస్తున్నాం అని అధికారులు అన్నారు. అయితే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ప్రపంచానికి పెను ముప్పు వాటిల్లనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. (చదవండి: చపాతీలు కోసం చంపేశారు..!) -
డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు, నగలు.. అవాక్కయిన ఏసీబీ అధికారులు
సాక్షి, బెంగళూరు: అవినీతి అధికారుల గుట్టు రట్టు చేసేందుకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఓ ఇంట్లోని డ్రైనేజీ పైపులో భారీగా దాచిన నోట్ల కట్టలు, బంగారు నగల్ని చూసి అవాక్కయ్యారు. కర్ణాటకలోని కలబురగి ప్రజాపనుల శాఖ అధికారి శాంతగౌడ బిరాదార్ ఇంటిని ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తుండగా.. ఆ ఇంట్లోని డ్రైనేజీ పైపులు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో ప్లంబర్‌ను పిలిపించి పైపులను తొలగించగా.. అందులో దాచిన కట్టలకొద్దీ నగదు, బంగారం బయటపడ్డాయి. కర్ణాటక వ్యాప్తంగా 60 చోట్ల ఏసీబీ అధికారులు బుధవారం ఏకకాలంలో భారీగా సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. 15 మంది అధికారులు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. బెంగళూరు సిటీ, రూరల్, మండ్య, కలబురగి, బళ్లారి, మంగళూరు, గదగ్, బెళగావి, గోకాక్, దొడ్డబళ్లాపుర తదితర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పలువురి నివాసాల్లో లెక్కలు లేని నగదు, నగలు, ఆస్తి పత్రాలను పెద్దమొత్తంలో గుర్తించారు. నాలుగో తరగతి ఉద్యోగులు వద్ద కూడా కోట్లాది ఆస్తులు బయటపడటం గమనార్హం. -
అచ్చం రోజా సినిమా తరహాలోనే.. అడవి బాట పట్టిన సబ్ ఇంజనీర్ భార్య
చర్ల(ఛత్తీస్‌గఢ్): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు వారం క్రితం కిడ్నాప్ చేసిన సబ్ ఇంజనీర్‌ను బుధవారం విడుదల చేశారు. దీంతో వారంరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజాపూర్ జిల్లా మాంకేలీ సమీపంలోని ఘట్కేర్నీ లో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం (పీఎంజీఎస్‌వై) కింద చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించేందుకు ఈనెల 11న సబ్ ఇంజనీర్ అజయ్‌రోషన్, అటెండర్ లక్ష్మణ్‌తో కలసి వెళ్లారు. ఈ సందర్భంగా మావోయిస్టులు వీరిద్దరినీ కిడ్నాప్ చేయగా, మరుసటి రోజు లక్ష్మణ్‌ను విడిచిపెట్టారు. అప్పటి నుంచి అధికారులు సబ్ ఇంజనీర్ విడుదల కోసం ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. అడవి బాట పట్టిన అజయ్ భార్య సబ్ ఇంజనీర్ అజయ్‌ను విడుదల చేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన భార్య అంకిత అడవి బాట పట్టారు. రెండేళ్ల కుమారుడిని వెంట పెట్టుకుని ఆమె మీడియా బృందంతో కలసి అడవిలోకి వెళ్లారు. ఈ క్రమంలో ఐదు రోజులకు మావోయిస్టుల శిబిరానికి చేరుకున్న అంకిత, మీడియా బృందం సభ్యులు.. మావోయిస్టులతో చర్చలు జరిపారు. అనంతరం మావోయిస్టులు అదే ప్రాంతంలో ప్రజాకోర్టు నిర్వహించి సబ్ ఇంజనీర్ అజయ్‌ను విడిచిపెట్టారు. దీంతో బుధవారం సాయంత్రం అజయ్ బీజాపూర్‌కు చేరుకోగా అస్వస్థతతో ఉన్న ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, తన మొర విని భర్త ప్రాణాలకు హాని తలపెట్టకుండా విడిచిపెట్టడంపై అంకిత మావోయిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. రోజూ 40 కిలోమీటర్ల ప్రయాణం.. తన భర్తను మావోయిస్టుల చెర నుంచి విడిపించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రెండేళ్ల కుమారుడితోపాటు అడవి బాట పట్టిన అజయ్ భార్య అంకిత ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అడవిలో అన్వేషణ సాగించారు. ఈనెల 13, 14, 15, 16వ తేదీల్లో అక్కడి మీడియా ప్రతినిధులు ఒకరిద్దరితో కలసి ద్విచక్ర వాహనాలపై రోజూ 30, 40 కిలోమీటర్ల మేర అడవిలో ప్రయాణించి ఆదివాసీ గూడేల్లో భర్తకోసం వెతికారు. చివరకు బుధవారం వీరు వెళ్లిన ఓ గ్రామం వద్ద మావోయిస్టుల కొరియర్ తారసపడి తన వెంట అంకిత సహా మీడియా బృందాన్ని తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా మావోయిస్టులు ఓ ఆదివాసీ గ్రామంలో ప్రజాకోర్టు నిర్వహించి ఇకనైనా రోడ్డు పనులను నిలిపివేయాలని హెచ్చరిస్తూ అజయ్‌ను విడుదల చేశారు. -
Seema Rayal: ప్రమాదకరమైనా... భర్తతో పాటు కుటుంబ ప్రోత్సాహంతో..
పెళ్లిచేసి అత్తారింటికి పంపించే ఆడపిల్లకు చదువెందుకు? చదివి ఊళ్లు ఏలాలా! దేశాన్ని ఉద్ధరించాలా? వంటి మాటలన్నెంటినో దాటుకుని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఇంజినీర్‌గా రాణిస్తోంది సీమా రాయల్. మగవాళ్లు ఎక్కువగా ఉండే ఈ రంగంలో ఈజీగా ఆయిల్‌ను తోడేస్తోంది. రాజస్థాన్‌కు చెందిన సీమా రాయల్‌కు ముగ్గురు తమ్ముళ్లు. ఒక్కతే అమ్మాయి కాబట్టి అల్లారుముద్దుగా పెరిగి ఉండొచ్చు అనుకోవడానికి లేదు. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్ కావాలన్న తన కలను నిజం చేసుకోవడానికి అనేక అడ్డంకులను దాటాల్సి వచ్చింది. ఆడపిల్ల ఇంటి పనులు నేర్చుకుంటే చాలన్న భావన ఉన్న సమాజంలో పుట్టిన సీమకు చదువుకోవడమే పెద్ద సవాలు. చదువు ఎందుకు అనే మాటలను పోగొట్టడానికి ఆమె చిన్నప్పటి నుంచి శ్రద్ధగా చదువుకునేది. జూడో, కరాటే ప్రాక్టీస్ చేస్తూనే ఇంటి పనులన్నింటినీ నేర్చుకుంది. సీమ చురుకుదనాన్ని గమనించిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారి మాటలను పట్టించుకోకుండా తనని చదువుకునేందుకు ప్రోత్సహించేవారు. ఫైనలియర్లో ఉండగానే.. చిన్నప్పటి నుంచి క్రీడల్లో చురుకుగా ఉండే సీమ ..ఇంజినీరింగ్ కాలేజీలో తోటి విద్యార్థులు ఎవరూ క్రీడలపై ఆసక్తి కనబర్చక పోవడం కనిపించింది. దీంతో సీమానే అమ్మాయిలతో ఒక టీమ్‌ను ఏర్పరిచి రకరకాల ఆటలపోటీలలో పాల్గొనేది. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటూనే ఇంజినీరింగ్ సబ్జెక్టులను ఏకాగ్రతతో చదివేది. ఫైనలియర్లో ఉండగా కాలేజీలో క్యాంపస్ ఇంటర్య్వూలు జరిగాయి. ఇంటర్య్వూలో పాసవ్వడంతో.. కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో సీమకు ఉద్యోగం వచ్చింది. కానీ ఇంటికి దూరంగా బర్మర్ ప్రాంతంలో కంపెనీ ఉంది. ‘‘అంతదూరం వెళ్లి అమ్మాయి ఉద్యోగం చేయాలా? ఆయిల్ కంపెనీ అంటే అంతా మగవాళ్లే ఉంటారు! ఎందుకొచ్చిన గోల ’’ అంటూ ఇరుగుపొరుగు సీమ తల్లిదండ్రులకు పదేపదే చెప్పేవారు. ఈ మాటలేవీ పట్టించుకోని కుటుంబసభ్యులు సీమను ఉద్యోగం చేసేందుకు అనుమతించారు. దీంతో కెయిర్న్ కంపెనీలో ‘ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్’గా చేరింది. కంపెనీలో పనిని వేగంగా నేర్చుకుని పై అధికారుల మన్ననలను అందుకుంది. సీమ పనితీరు మెచ్చిన కంపెనీ యాజమాన్యం ఆమెను అనేక పదోన్నతులతో ప్రోత్సహించింది. ప్రమాదకరమైనప్పటికీ.. ‘‘ఇన్స్ట్రమెంట్ ఇంజినీర్ అంటే చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ఆటోమాటిక్‌గా పనిచేసే అనేక పరికరాలను చూసుకోవాల్సి ఉంటుంది. బావి నుంచి ఆయిల్ తియ్యాలి. కొన్ని మెషిన్లతో, కొన్నింటిని మ్యానువల్‌గా తీయాలి. నీళ్లు, గ్యాస్, మట్టి నుంచి ఆయిల్‌ను వేరుచేసి పైప్లైన్లకు పంపించాలి. ఈ మొత్తం ప్రక్రియలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. ఇనుస్ట్రుమెంట్ ఇంజినీర్ నుంచి సీనియర్ ఇంజినీర్‌గా పదోన్నతి వచ్చినప్పుడు బాధ్యతలు పెరిగాయి. ప్రస్తుతం సూపరిండెంట్, ఇన్స్టాలేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. పద్నాలుగేళ్లలో నేను ఎదిగేందుకు కంపెనీ అనేక అవకాశాలు కల్పించింది. ఇప్పటికీ రాజస్థాన్‌లో ఉన్న అమ్మాయిలు అంత చురుగ్గా ముందుకు సాగడం లేదు. టీచర్ ఉద్యోగం చేస్తే చాల్లే అనుకునేవారే ఎక్కువ. ఇంతకు మించి ఆలోచించడం లేదు. ఆయిల్ గ్యాస్ కంపెనీలవైపు అసలే చూడడంలేదు. నా పెళ్లి అయ్యాక భర్తతో పాటు కుటుంబం కూడా చాలా ప్రోత్సహించింది. వృత్తిపరంగా కొన్నిసార్లు ఇంటికి దగ్గరగా, మరికొన్ని సార్లు ఇంటికి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో కూడా వాళ్లు నాకు అండగా నిలిచారు. అందువల్లే ఒకపక్క ఉద్యోగం, మరోపక్క పిల్లల్ని చూసుకోగలిగాను. ఎప్పుడూ మంచి జరుగుతుందనే ఆశావహ దృక్పథంలో ఉండేదాన్ని. ఎంతవరకు కష్టపడగలమో అంతవరకు శ్రమిస్తే విజయం దానంతట అదే వస్తుందని నేను నమ్ముతాను. కష్టాలనేవి సహజం. వాటిని దాటుకుని ముందుకెళ్తేనే జీవితంలో విజయం సాధించగలం. అందుకే ఎంతటి కఠిన రంగంలోనైనా రాణించగలరు’’ అని చెప్పే సీమ ఎంతో మంది అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తోంది. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! -
Joshi Anumuthu: అప్పుడు కన్నీళ్లు తాగి ఆకలి తీర్చుకున్నాడు.. ఇప్పుడు ఎందరికో ఆసరా..!
మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే...ఆనందించే బాల్యం కాదు అతనిది. మెరుపు మెరిస్తే భయం... వానొస్తుందని, వాన కురిస్తే భయం... ఇంట్లో ఉండలేమని... ఎందుకంటే అది పేరుకే ఇల్లు. పేదవాడి ఇల్లు. ఇంటి పై కప్పుకు అన్నీ చిల్లులే! ఆకసమున హరివిల్లు సంగతి సరే... మరి తన ఆకలి సంగతి ఏమిటి? చదవండి: Mental Health: టీనేజర్స్ మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా బ్యాడ్ ఎఫెక్ట్..! ఎన్నో కష్టాలకు ఎదురీది పెద్ద చదువు చదువుకున్నాడు పుదుచ్చేరికి చెందిన అనుముతు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తయింది, ఆ తరువాత తనకు ఇష్టమైన ఫొటోగ్రఫీ కోర్స్ చేశాడు. సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది! అంతమాత్రాన నడిచొచ్చిన దారిని మరవలేదు. తాను ఎదుర్కొన్న కష్టాలు ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఎదుర్కొంటూనే ఉంటారు. వారికి అండగా నిలవాలనుకున్నాడు. కష్టాలు దాటి ముందుకు వెళ్లినవాడు కష్టపడుతున్న వారి కోసం వెనక్కి తిరిగి చూసుకున్నాడు. తల్లి కడుపుమాడ్చుకుని మరీ.. అనుమతు తండ్రి వడ్రంగి. తాను ఏడుసంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. ఇక కష్టాలు మొదలయ్యాయి. ‘మేమున్నాం’ అని ధైర్యం చెప్పే చుట్టాలు,పక్కాలు లేరు. తల్లీకొడుకులు కలిసి కూలీ పనులకు వెళ్లేవాళ్లు. కూలి ఉన్నరోజు తిండి. లేకపోతే పస్తులు. ఎప్పుడైనా ఇంట్లో ఒక్కరు తినడానికి మాత్రమే చాలినంత ఉంటే ‘నాకు ఆకలిగా లేదు. నువ్వు తిను నాయనా’ అనేది తల్లి! చదవండి: Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్? నా జీవితం స్థిరపడింది.. నాలాంటి వాళ్లకోసం.. ఎన్ని కష్టాలు పడుతున్నా బాగా చదువుకోవాలనే కోరిక మాత్రం బలంగా ఉండేది అనుమతులో. ఇది గమనించిన ఒక పూజారి అనుమతును చదివించే బాధ్యతను తీసుకున్నాడు... అలా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు అనుమతు. ‘ఇక నా జీవితం స్థిరపడింది. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు’ అనుకోలేదు. తనవంతుగా సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశాడు. ఆ తరువాత తానే స్వయంగా ‘స్నేహన్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు. అందుకే ఆ సంస్థ ఏర్పాటు.. ఆటోరిక్షా నడిపే సురేష్‌కు చూపు దెబ్బతింది. కంటి ఆపరేషన్ చేసుకోవడం తప్పనిసరి. లేకపోతే ఆటో నడపలేడు. నడపకుంటే ఇల్లు గడవడం కష్టం. ఇలాంటి క్లిష్ట సమయంలో సురేష్‌కు కంటి ఆపరేషన్ చేయించి అతని జీవితం గాడిన పడడానికి సహాయపడ్డాడు. కొందరు యువకులతో ఒక బృందాన్ని తయారు చేశాడు. ఈ బృందంలోని సభ్యులు రైల్వేస్టేషన్, పార్క్, దేవాలయం, ఫ్లై ఓవర్ల దగ్గర ఆకలితో ఉన్న వ్యక్తులకు భోజనం, టీ, బిస్కెట్లు అందిస్తారు. వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చికిత్స చేయిస్తారు. వారికి ఉపాధి చూపి.. నగరంలో యాచన చేసే చాలామంది యాచకులతో అనుమతు మాట్లాడాడు. కొందరు గతం చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. తాము యాచించిన సొమ్మును రౌడీలు బెదిరించి తీసుకుంటున్నారని కొందరు ఫిర్యాదు చేశారు... ఇలా ఎంతకాలమని యాచిస్తారు? వీరికి ఏదైనా ఉపాధి చూడాలి అనుకున్నాడు అనుమతు. తిరువనంతపురంలోని కంతరి లీడర్షిప్ ప్రోగాంలో చేరి శిక్షణ తీసుకున్నాడు. ఈ శిక్షణ ఫలితంగా ఉపాధి అవకాశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు అర్థం అయ్యాయి. ఫలితంగా 75 మందికి పైగా ఉపాధి మార్గాలు చూపించగలిగాడు. ఇలా.. సోషల్ సర్వీస్ కాటన్‌తో రకరకాల సంచుల తయారీ కోసం పేద మహిళలకు శిక్షణ ఇప్పించాడు. ఒకవైపు వీరికి ఉపాధి అవకాశం కలిపిస్తూనే, ‘స్నేహన్’ బ్రాండ్‌తో రూపొందించిన ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులు, ఫొటోగ్రఫీ ద్వారా వచ్చిన డబ్బును సేవాకార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. ‘షెల్టర్‌హోమ్’ ఒకటి నిర్మించాలని, సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలనే ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. చదవండి: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? ఈ సమస్యలు పొంచి ఉన్నట్లే!! -
అడుక్కోవడానికి వెళ్లాలి.. ఆదివారం సెలవివ్వండి: ఇంజనీర్
భోపాల్: సాధారణంగా మనకు ఆరోగ్యం బాగాలేకపోతేనే.. లేక వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెడతాం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ లీవ్లెటర్ని చూస్తే.. ఇదేందిరా భయ్ ఇలాంటి వాటికి కూడా సెలవు అడుగుతారా అనిపిస్తుంది. ఆ వెరైటీ లీవ్‌లెటర్ వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజ్‌కుమార్ యాదవ్ ఈ వింత లీవ్ లెటర్ సృష్టికర్త. డిప్యూటీ ఇంజనీర్‌గా పని చేస్తున్న రాజ్‌కుమార్ ఆదివారం నేను భిక్షాటనకు వెళ్లాలి.. దయచేసి నాకు సెలవు మంజూరు చేయమంటూ తన పైఅధికారులను అభ్యర్ధించాడు. ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న నీవు అడుక్కోవడం ఏంటయ్యా అని రాజ్‌కుమార్‌ను ప్రశ్నించిన ఉన్నతాధికారులు.. అతడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. (చదవండి: ‘వీడియో చూస్తుంటే.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి’) వారిని షాక్‌కు గురి చేసిన ఆ సమాధానం ఏంటంటే.. తనకు గతజన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని.. అందుకే భిక్షాటన చేయాలనుకుంటున్నాని తెలిపాడు. అంతేకాక తనలోని అహాన్ని చెరిపివేయడానికి మతపరమైన అన్వేషణ చేస్తూ.. ఆత్మ శోధన చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు రాజ్‌కుమార్. మరింత ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే పూర్వ జన్మలో రాజ్‌కుమార్, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దున్ ఓవైసీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముగ్గురు మంచి స్నేహితులట. వీరంతా మహాభారత కాలంలో స్నేహితులుగా ఉండేవారట. ఇక వీరిలో ఓవైసీ పాండవ రాకుమారుడు నకులుడు కాగా మోహన్ భగవత్ శకుని మామ అట. గత జన్మలో వీరు ఇద్దరు రాజ్‌కుమార్ ప్రాణ స్నేహితులట. అంతేకాక ఆదివారం సెలవు పెట్టి భిక్షాటనతో పాటు మరన్ని గత జన్మ స్మృతులను గుర్తుకు తెచ్చుకోవడం కోసం భగవద్గీత పారాయణం కూడా చేయాలని భావిస్తున్నట్లు రాజ్ కుమార్ తన లేఖలో పేర్కొన్నాడు. (చదవండి: ప్రేమికులపై పైశాచికం: మెడలో టైర్లు వేసి..) ఇక ఈ లేఖ చదివిన రాజ్‌కుమార్ ఉన్నతాధికారులు ఇచ్చిన రిప్లై కూడా మరింత ఫన్నీగా ఉంది. జనపద్ పంచాయితీ సీఈఓ పరాగ్ పంథి, “ప్రియమైన డిప్యూటీ ఇంజనీర్, మీరు మీ అహాన్ని చెరిపివేయాలనుకుంటున్నారు, ఇది చాలా సంతోషకరమైన విషయం. మీ లక్ష్యాన్ని సాధించడంలో మా సహకారం మీకు సహాయపడుతుంది. ఈ అహాన్ని దాని మూలాల నుంచి నాశనం చేయడం మీ పురోగతికి ఎంతో అవసరం’’ అని రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ లీవ్ లెటర్‌పై నెటిజనులు ఇలాంటి బిత్తిరి జనాలు మన దగ్గరే ఉంటారు అని కామెంట్ చేస్తున్నారు. In Agar Malwa of Madhya Pradesh, a sub-engineer has written a leave application to his superior saying that he gained recollection of his past life and wanted to do Bhagavad Gita paath to know more about his life & also beg alms to erase ego every Sunday pic.twitter.com/qOmMpyZB9j — ANI (@ANI) October 11, 2021 చదవండి: కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం -
ఆన్లైన్ రమ్మీకి బానిసై ఇంజినీర్ ఆత్మహత్య
సాక్షి, వేలూరు: ఆన్లైన్ రమ్మీకి బానిసై రూ. 10 లక్షల నగదును పోగొట్టకోవడంతో.. జీవితంపై విరక్తి చెంది చెన్నై ఐటీ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తిరుపత్తూరు జిల్లా వానియంబాడిలో చోటు చేసుకుంది. కాటుకొల్లై గ్రామానికి చెందిన ఆనందన్(31) చెన్నైలోని ఐటీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు ఆన్లైన్ ద్వారా సెల్ఫోన్లో రమ్మీకి బానిస అయ్యాడు. కుటుంబ సభ్యులు ఖండించారు. అయినప్పటికీ రమ్మీ ఆడేవాడు. గత వారంలో మాత్రం ఆన్లైన్ రమ్మీ ఆడి రూ. 10 లక్షల నగదు పోగొట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో స్నేహితుల వద్ద రూ. 6 లక్షల అప్పు కూడా ఉంది. ఇదిలా ఉండగా స్థానిక ఎన్నికల ఓటు వేసేందుకు ఆనందన్ సొంత గ్రామమైన కాట్టుకొల్లై గ్రామానికి మూడు రోజుల క్రితం వచ్చాడు. శనివారం ఓటు హక్కు వినియోగించుకొని ఇంటిలో ఉన్నాడు. ఆ సమయంలో ఆనందన్ ఆన్లైన్ రమ్మీ ద్వారా భారీగా నగదు పోగొట్టుకున్న విషయం తెలిసింది. దీంతో తల్లిదండ్రులు మందలించారు. మనోవేదనకు గురై ఆనందన్ ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఆనందన్ రూం నుంచి బయటకు రాక పోవడంతో కుటుంబ సభ్యులు కిటికీల ద్వారా చూడా ఆనందన్ మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. వానియంబాడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్ధులకు అమెజాన్ అదిరిపోయే శుభవార్త
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంప్యూటర్ సైన్స్ విద్య రంగంలో భారత్‌లో పెద్ద ముందడుగు. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ బృహత్తర కార్యక్రమాన్ని దేశీయంగా చేపట్టనుంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ (ఏఎఫ్ఈ) ప్రోగ్రాంను పరిచయం చేయనుంది. ఇందులో భాగంగా తక్కువ ప్రాతినిధ్యం, వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నాణ్యమైన కంప్యూటర్ సైన్స్ (సీఎస్) విద్యను అందిస్తారు. అలాగే భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు పొందేందుకు సాయం చేస్తారు. తొలి ఏడాది లక్ష మందికిపైగా విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలోని 900 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను ఎంపిక చేస్తారు. 6–12 తరగతి విద్యార్థులకు.. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమంలో భాగంగా 6–12 తరగతి విద్యార్థులకు బోధన ఉంటుంది. కోడింగ్ మూల సిద్ధాంతాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, నేచురల్ ల్యాంగ్వేజ్ ప్రాసెసింగ్ (వాయిస్ టెక్నాలజీ) వంటి భవిష్యత్ కేంద్రీకృత సాంకేతిక కోర్సులను భారతీయ భాషల్లో బోధిస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు విద్యార్థులకు అమెజాన్ నిపుణులను కలిసే అవకాశమూ ఉంటుంది. అమెజాన్ సైబర్ రోబోటిక్స్ చాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రోగ్రామింగ్ బేసిక్స్, కోడింగ్ నేర్చుకోవచ్చు. ఉపకార వేతనాలు, ఇంటర్న్షిప్స్, హాకథాన్స్, మార్గదర్శకత్వం సైతం లభిస్తుంది. సీఎస్‌ను మరింత ఆకర్షణీయంగా బోధించడానికి ఉపాధ్యాయులు, విద్యావేత్తలకు శిక్షణ ఇస్తారు. భారత్‌లో నాణ్యమైన సీఎస్‌ను పరిచయం చేసేందుకు కంపెనీ అంతర్జాతీయ నాలెడ్జ్ పార్ట్నర్ కోడ్.ఓఆర్జీ అనే స్వచ్చంద సంస్థతో కలిసి అమెజాన్ పనిచేస్తోంది. రాబోయే కాలంలో ఇతర రాష్ట్రాలకూ ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో.. ఏఎఫ్ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు విద్యారంగానికి సేవలు అందిస్తున్న లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలతో అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. ‘ఉపాధి రంగంలో కంప్యూటర్ సైన్స్ ఒక క్లిష్టమైన నైపుణ్యంగా మారింది. సీఎస్‌ను యువత ముందస్తుగా నేర్చుకోవడం ద్వారా ఉత్తమ భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం ఉంటుంది’ అని అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ‘నాణ్యమైన కోర్సు కంటెంట్ లేకపోవడం, స్థానిక భాషలో పరిమితంగా అధునాతన కంటెంట్ వంటివి సీఎస్ కెరీర్‌ను ఎంచుకోవాలనుకున్న వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు అడ్డంకులు. ప్రతిభ, అభిరుచి యువకులందరిలో విస్తరించినప్పటికీ అవకాశాలు పరిమితమే. ఏఎఫ్ఈతో సీఎస్ విద్యను ముందస్తుగా అందించడం ద్వారా ఈ అంతరాన్ని పరిష్కరించాలనేది మా లక్ష్యం’ అని పేర్కొన్నారు. చదవండి: వారం తిరగకుండానే మారిన జాతకాలు! మళ్లీ టాప్‌లోకి. -
వేలంవెర్రి, చార్మినార్ ఏం ఖర్మ తాజ్‌మహల్, చైనా వాల్ కూడా మావే!
కోడి కాని కోడి? పకోడి. బడి కాని కాని బడి? రాబడి. మరి భూమి కాని భూమి? డిజిటల్ భూమి! అదేమిటి అంటారా? అయితే ఇది చదవాల్సిందే... సౌత్ కొరియా యువ ఇంజనీర్ శౌన్ ఇటీవల భారీ మొత్తం వెచ్చించి విలువైన భూమి కొన్నాడు. ‘చాలా ప్లాన్స్ ఉన్నాయి. రకరకాల బిల్డింగ్స్ నిర్మించాలనుకుంటున్నాను. కె–పాప్ లైవ్‌పెర్‌ఫార్మెన్సెస్, కె–డ్రామా స్క్రీనింగ్ కోసం ఆడిటోరియమ్స్ కూడా నిర్మించాలనుకుంటున్నాను’ అంటున్నాడు శౌన్. ‘అయ్యా! ఇంతకీ ఆ భూమి ఏ నగరంలో ఉంది?’ అని అడిగిచూడండి. ‘నగరంలో కాదండీ... దీనిలో ఉంది’ అని ల్యాప్‌ట్యాప్ ఓపెన్ చేయబోతే...‘ఏం ఎకసెక్కాలుగా ఉందా!’ అని సీరియస్ కానక్కర్లేదు. ఎందుకంటే అతడు అక్షరాలా అబద్ధం చెప్పలేదు. నిజంగానే నిజం చెప్పాడు. ఇంతకీ విషయం ఏమిటంటే...గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్స్...కాలంతో పాటు పొదుపు మార్గాలు పెరుగుతుంటాయి. పొదుపు మార్గం అనాలో, ట్రెండ్ అనాలో తెలియదుగానీ ‘జెనరేషన్ ఎంజెడ్’ (మిలియనల్స్ అండ్ జెనరేషన్ జెడ్) వర్చువల్ ల్యాండ్‌పై దృష్టి పెడుతుంది.శౌన్ విషయానికి వస్తే అతడు డిసెంట్రల్యాండ్లో భూమి కొన్నాడు. ఏమిటీ డిసెంట్రల్యాండ్? డిసెంట్రలైజ్డ్ 3డీ వర్చువల్ రియాలిటీ ప్లాట్‌ఫామ్ ఇది. యూజర్లు ఈ డిజిటల్ భూభాగంలో భూములను కొనవచ్చు. వాటిని డెవలప్ చేయవచ్చు. అమ్మవచ్చు. క్రియేట్, ఎక్స్ప్లోర్ అండ్ ట్రేడ్...అంటుంది డిసెంట్రల్యాండ్! ‘ఎర్త్–2’ కూడా ఇలాంటిదే. మ్యాప్‌బాక్స్ టెక్నాలజీతో సృష్టించిన వర్చువల్ ల్యాండ్ ఇది. భూగ్రహాన్ని డిజిటల్ గ్రిడ్ లేయర్స్, టైల్స్గా విభజిస్తారు. ఈ టైల్స్ విలువ యూఎస్‌లో ఒకరకంగా, ఆస్ట్రేలియాలో ఒక రకంగా, ఇండియాలో ఒకరకంగా ఉంటుంది. దీన్ని డిజిటల్ ఎస్టేట్ అని కూడా పిలుస్తున్నారు. ‘వాస్తవిక ప్రపంచంలో భూములు, ఇండ్ల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. వాటిని కొనలేని నిరాశ నన్ను జియోలొకేషన్ బేస్డ్ ప్లాట్‌ఫామ్ ఎర్త్–2పై ఆసక్తి పెరిగేలా చేసింది’ అంటున్నాడు సౌత్ కొరియాకు చెందిన చౌయి అనే యువకుడు. ఇతడికి మిత్రుడైన వాంగ్ కెఔన్ పక్క దేశానికి ఎప్పుడు వెళ్లింది లేదు. అలాంటి వాంగ్ ఇప్పుడు సౌత్ కొరియాలోనే కాదు ఇరాన్, ఈజిప్ట్‌లలో భూములు కొన్నాడు...ఎర్త్–2లో! ‘మిగిలిన దేశాలకంటే సౌత్ కొరియా యూత్ మా ప్లాట్‌ఫామ్‌పై ఆసక్తి చూపుతుంది అంటున్నారు ఎర్త్–2 నిర్వాహకులు. ‘డిసెంట్రల్యాండ్’ కూడా ఇలాగే అంటుందిగానీ, తమ ల్యాండ్‌పై ఆదరణ ఇతరదేశాల్లోనూ పెరుగుతుందని చెబుతుంది. ఏదో సినిమాలో చార్మినార్‌ను చూపించి ‘ఇది నాదే. ఇప్పుడు అమ్మేస్తున్నాను’ అని కమెడియన్ అంటే నవ్వుకున్నాం. డిజిటల్ ల్యాండ్‌లో చార్మినార్ ఏం ఖర్మ తాజ్‌మహల్, చైనావాల్లు నావే అంటున్నారు. వేలంవెర్రిగా కనిపిస్తున్న ఈ సోషల్ ట్రెండ్ కాలానికి నిలబడుతుందా? బుడగలా పేలుతుందా? కచ్చితంగా కాలమే చెబుతుంది. చదవండి : నైట్‌ఫ్రాంక్ హౌసింగ్ ర్యాంకింగ్ సర్వే.. భారత్‌లో ఇళ్ల రేట్లు తగ్గాయా? -
జాబ్ వదిలేసి పాత డ్రమ్ములతో వ్యాపారం.. అతని జీవితాన్నే మార్చేసింది
ఉద్యోగంలో జీతం ఉంటుంది గానీ జీవితం కాదు.. అదే వ్యాపారం అయితే కాస్త కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఏదో ఓ రోజు జీవితం మనకు నచ్చినట్లు మారుతుందని నమ్మాడు.. చేసి చూపించాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర, అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రమోద్ సుసారే 2015 లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, పూణేలోని ఒక ఎంఎన్సీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అయితే ఆ జీతం సరిపోకపోయినా ఎలాగో జీవితాన్ని నెట్టుకొచ్చేవాడు. 2017లో చైనాకు వ్యాపార పర్యటన కోసం వెళ్లడం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఆ సమయంలో అక్కడ డ్రమ్స్, టైర్లు వంటి ఉపయోగించిన వస్తువులను ఆకర్షణీయమైన ఫర్నిచర్‌గా రీసైక్లింగ్ చేసే అమ్ముతున్నారు. అప్పడే అతనికి ఓ ఐడియా వచ్చింది. తను కూడా ఈ బిజినెస్ చేద్దామని. ఇక భారత్‌కు తిరిగి రాగానే.. ఇటువంటి రీసైక్లింగ్ బిజినెస్ పెద్దగా ఎవరూ చేయడం లేదని తెలుసుకుని వెంటనే పీ2ఎస్ ఇంటర్నేషనల్ అనే కంపెనీనీ స్థాపించాడు.డ్రమ్స్ టైర్లను ఫర్నిచర్‌గా ఎలా మార్చాలో గైడెన్స్ కోసం యూట్యూబ్‌లో చూసి నేర్చుకునే వాడినని, అలా మొదట్లో యూట్యూబ్‌లోనే ఎక్కువ కాలం గడిపినట్టు తెలిపాడు ప్రమోద్. అయితే 2018 సెప్టంబర్లో వ్యాపారాన్ని ప్రారంభిస్తే డిసెంబర్ వరకు ఒక్క కస్టమర్ కూడా రాలేదు. దీంతో అమ్మకానికి మార్కెటింగ్ ముఖ్యమని భావించిన ప్రమోద్ తన వస్తువులను అందరికీ కనిపించేలా రోడ్డు పక్కన ఉండే జ్యూస్ స్టాళ్ల దగ్గర, ఫుడ్ స్టాళ్ల దగ్గర ఈ ఫర్నీచర్‌ను ప్రదర్శించేవాడు. అలా జనవరి 2019లో పూణెలోని ఓ కేఫ్ యజమానికి అవి నచ్చడంతో 50 వేల రూపాయల ఆర్డర్ ఇచ్చాడు. దీంతో అతని దశ అప్పటి నుంచి తిరిగింది. ఆ తరువాత ఒకేసారి థానెలో పెద్ద ప్రాజెక్ట్ రాగా అందులో 5.5 లక్షలు సంపాదించాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదని, అతని వ్యాపారానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం వ్యాపారం రూ .1 కోటి టర్నోవర్‌తో, 14 మంది సిబ్బంది ప్రమోద్ కంపెనీలో పని చేస్తున్నారు. 2022 నాటికి ముంబై, థానేలలో అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని తాను ప్లాన్ చేస్తున్నట్లు ఈ యువ వ్యాపారవేత్త తెలిపారు. చదవండి: Viral Video: ఇంటర్వ్యూలో ఉండగా చెల్లిని చితకబాదిన అక్క.. కూతురు పుట్టిందని.. పానీపూరి వ్యాపారి గొప్పతనం.. Anand Mahindra: గల్లీ క్రికెట్.. పిల్లల ఐడియాకి ఆనంద్ మహీంద్రా ఫిదా -
ఒకప్పుడు బెంగళూరులో హార్డ్‌వేర్ ఇంజనీర్.. ఇప్పుడేమో
అనంతపురం జిల్లా గోరంట్ల మండలం మందలపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మందలపల్లి హరీష్‌కు వ్యవసాయం పట్ల ఎనలేని మక్కువ. చదువు, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పటికీ ఆలోచనలు మాత్రం నిరంతరం సొంత ఊరు, వ్యవసాయం చుట్టూ తిరిగేవి. ఎమ్మెస్సీ చదివి బెంగళూరులో ఒక కార్పొరేట్ కంపెనీలో హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా చిప్ డిజైనింగ్ విభాగంలో ఉద్యోగం చేస్తూ వారాంతాల్లో స్వగ్రామానికి వచ్చి సొంత భూమిలో వ్యవసాయ పనులు చక్కబెట్టుకునే వారు. ప్రస్తుతం కరోనా వల్ల ఇంటి నుంచి పనిచేసే అవకాశం లభించడంతో.. పని గంటలు ముగిసిన తర్వాత.. పూర్తిస్థాయిలో వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు తనకు ఎదురైన ఆరోగ్య సమస్యలకు నగర కాలుష్యం, జీవనశైలి కారణాలని డాక్టర్లు చెప్పటంతో.. హరీష్ ఆహారపు అలవాట్లు మార్చుకొని చిరుధాన్యాలు తినడం ప్రారంభించారు. ఆరోగ్యం నెమ్మదిగా కుదుట పడడం మొదలైంది. దీంతో సొంత ఊర్లోనే అవసరమైన పంటలు పండించుకొని కాలుష్యానికి దూరంగా ఉంటూ ఆరోగ్యంగా జీవించవచ్చని నిర్ణయించుకున్నారు. దాదాపుగా 10 సంవత్సరాల పాటు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేశారు. పాలేకర్ చెప్పిన ప్రకృతి వ్యవసాయంలో ఆవు ప్రాముఖ్యత, గోమూత్రం, గోమయం వల్ల కలిగే వ్యవసాయ, ఆరోగ్య ప్రయోజనాలను అవగతం చేసుకున్నారు. అంతటితో ఆగలేదు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని పంచగవ్య విద్యాపీఠంలో సంవత్సరం పాటు శిక్షణ పొందారు. విద్యార్థి దశలో నేర్చుకున్న వేదం, పంచగవ్య శిక్షణకు ఎంతగానో దోహదపడిందని చెప్పారు. చిరుధాన్యాలతో తొలి ప్రయత్నం చిరుధాన్యాల వినియోగం పెరుగుతుండటంతో 18 ఎకరాలలో అరికలు, సామలు, ఊదలు, వరిగలు, కొర్రలు, అండు కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్నల సాగును హరీష్ చేపట్టారు. తాను పండించడంతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులను కూడా చిరుధాన్యాలు పండించేలా ప్రోత్సహిస్తుండటం విశేషం. పంటల చీడపీడలు, యాజమాన్య సమస్యలు అధిగమించేందుకు ఉమ్మడిగా పరిష్కారాలు వెతుక్కుంటూ పరస్పర సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారు. కేవలం పంటలు పండించడం వరకే పరిమితం కాకుండా వాటికి విలువ జోడించడం ద్వారా ఆర్థికంగా లబ్ధి ఉంటుందని ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. తద్వారా తన పంటతో పాటు రైతుల పంటను కూడా ప్రాసెస్ చేశారు. తనకు తెలిసిన వినియోగదారులను నేరుగా సంప్రదించి వారికి చిరుధాన్యాలు సరఫరా చేశారు. రైతులు పండించిన పంటకు మాత్రం ప్రాసెసింగ్ చార్జీలు మాత్రమే తీసుకుని విలువ జోడింపు ద్వారా వచ్చిన మొత్తాన్ని వారికే అందేలా సహాయపడ్డారు. ప్రాసెసింగ్ చేసిన చిరుధాన్యాలకు మంచి ధర లభించడంతో రైతులంతా ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు. దేశీ వరి రకాల సాగు చిరుధాన్యాల ధరలు తగ్గడంతో ప్రస్తుతం 8 ఎకరాల్లో విస్తృతంగా అమ్ముడవుతున్న వరి సాగు మొదలు పెట్టారు హరీష్. నల్లబియ్యం, ఎర్రబియ్యపు దేశీయ వరి విత్తనాలను సాగు చేస్తున్నారు. నవారా, రాజముడి, రాక్తశాలి, చెన్నంగి, చిట్టిముత్యాలు, కాలాబట్టి, మణిపూర్ బ్లాక్ చఖావో, కర్పు కవునీ, సేలం సన్నాలు రకాలను పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే రసాయనాలు లేకుండా పండిస్తున్నారు. మిల్లెట్స్, మిల్లెట్స్‌ను యంత్రంతో శుద్ధిచేస్తున్న హరీష్ రసాయనాల అవశేషాలు లేని మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యంగా జీవించాలనే ఆకాంక్షతో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన హరీష్ ఇప్పుడు పలువురి జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్న, సన్న కారు రైతులకు ప్రకృతి వ్యవసాయం చేయడం, లాభసాటిగా గోశాల నిర్వహించడం పట్ల అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని హరీష్ (76010 80665) అంటున్నారు. – ప్రసన్న కుమార్, బెంగళూరు ఇంటి వద్ద నుంచే హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూనే పూర్తిస్థాయి రైతుగా మారి స్వయంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు హరీష్. చిరుధాన్యాలు, దేశీ వరి రకాల సాగుపై దృష్టి సారించారు. చుట్టుపక్కల రైతుల ప్రయోజనం కోసం కూడా కృషి చేస్తూ ఈ హార్డ్‌వేర్ ఇంజనీర్ శభాష్ అనిపించుకుంటున్నారు. బ్లాక్ రైస్ కాలాబట్టి పొలంలో హరీష్ నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ // మీ అభిప్రాయాలు, సూచనలను prambabu.35@gmail.com కు పంపవచ్చు. -
పవర్‌గ్రిడ్‌లో ఫీల్డ్ ఇంజనీర్లు, సూపర్ వైజర్ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన మహారత్న సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ ఇంజనీర్, సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (నిట్, వరంగల్‌లో 129 నాన్‌టీచింగ్ పోస్టులు) ► మొత్తం పోస్టుల సంఖ్య: 137 ► పోస్టుల వివరాలు: ఫీల్డ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్)–48, ఫీల్డ్ ఇంజనీర్(సివిల్)–17, ఫీల్డ్ సూపర్వైజర్(ఎలక్ట్రికల్)–50, ఫీల్డ్ సూపర్వైజర్(సివిల్)–22. ► అర్హత: ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్)/బీఈ(పవర్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు కనీసం 55శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి. ► వయసు: 27.08.2021 నాటికి 29 ఏళ్లు మించకుండా ఉండాలి. ► వేతనం: ఫీల్డ్ ఇంజనీర్లకు నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000, ఫీల్డ్ సూపర్వైజర్లకు నెలకు రూ.23,000 నుంచి రూ.1,05,000లతో పాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. (టీఎస్ఏసీఎస్లో ఉద్యోగాలు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు) ► ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్(టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్, అప్టిట్యూడ్ టెస్ట్), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021 ► వెబ్సైట్: http://www.powergrid.in -
జెఫ్‌బెజోస్‌కు భారీ దెబ్బకొట్టిన భారత సంతతి వ్యక్తి..!
వాషింగ్టన్: అమెజాన్ అధినేత జెఫ్‌బెజోస్‌కు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. తాజాగా జెఫ్ బెజోస్‌కు చెందిన స్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ నుంచి టాప్ ఇంజనీర్ బయటకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. భారత సంతతికి చెందిన నితిన్ అరోరా బ్లూ ఆరిజిన్ కంపెనీలో మూన్ ల్యాండర్ మిషన్‌కు లీడ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నితిన్ మూడు సంవత్సరాల పాటు బ్లూఆరిజిన్ సంస్థలో లీడ్ ఇంజనీర్‌గా కొనసాగుతున్నారు. (చదవండి: Wikipedia:హ్యాక్..! లిస్ట్‌లో టాప్ సెలబ్రిటీలు..!) మూన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా వివిధ రకాల పేలోడ్లను చంద్రునిపైకి తీసుకెళ్లే మాడ్యుళ్లను నితిన్ డిజైన్ చేశారు. నితిన్ బ్లూ ఆరిజిన్ సంస్థను వీడుతూ..బ్లూ ఆరిజిన్ సంస్థలో మూడు సంవత్సరాల పాటు పనిచేసినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాగా నితిన్ బ్లూ ఆరిజిన్ సంస్థ నుంచి స్పేస్ ఎక్స్ సంస్థలో జాయిన్ అయ్యారు. తాజాగా నాసా ఏకపక్షవిధానాన్ని అవలంభించినందుకుగాను బ్లూ ఆరిజిన్ నాసాపై కోర్టులో దావా వేసింది. బ్లూ ఆరిజిన్ ప్రతినిధి ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. "నాసా హ్యూమన్ ల్యాండింగ్ మిషన్‌లో భాగంగా అక్వసిషన్ ప్రాసెస్‌లో(సముపార్జన) దొర్లిన తప్పులను పరిష్కారించాలని వెల్లడించింది. కోర్టుకు వెళ్లేముందు బ్లూ ఆరిజిన్ నాసా నిర్ణయంపై గొంతెత్తింది. అంతేకాకుండా బ్లూ ఆరిజిన్ సంస్థ మూన్ ల్యాండర్ మిషన్కోసం భారీగా 2 బిలియన్ల డాలర్లును నాసాకు ఆఫర్ చేసింది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) -
రష్యా ఇంజినీర్ విశాఖలో మృతి
మల్కాపురం (విశాఖ పశ్చిమ): రష్యా నుండి వచ్చిన ఓ ఇంజినీర్ గుండెపోటుతో విశాఖలో మృతిచెందారు. సంఘటనకు సంబంధించి మల్కాపురం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రష్యా దేశానికి చెందిన గ్రాచవ్ దిమిత్రి (43) ఈ ఏడాది ఫిబ్రవరి 27న విశాఖ వచ్చారు. ఇండియన్ నేవీకి చెందిన సబ్‌మెరైన్ నౌకలో సాంకేతిక లోపం ఏర్పడడంతో వాటిని సరిచేసేందుకు ఆయనను ఇక్కడికి పిలిపించారు. దిమిత్రి యారాడ డాల్ఫిన్ హిల్స్ ప్రాంతంలోని క్వార్టర్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం ఉదయం నౌకలో పనులు చేస్తుండగా మ.1.15 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. అక్కడి సిబ్బంది వెంటనే ఆయనను ఐఎన్ఎస్ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మ.2.45 గంటలకు మృతిచెందారు. నేవల్ అధికారుల ఫిర్యాదు మేరకు మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: చంటి బిడ్డను ఇంట్లో వదిలేసి పార్టీలకు.. వచ్చి చూస్తే..) -
చర్మం నల్లబడితే పెళ్లిచేసుకోరా?!
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలోంచి బయటకు చూడటమే తప్ప రైల్వే ట్రాక్ ఇన్స్పెక్షన్ ఇంజినీర్ అవుతాననుకోలేదంటుంది కశిష్ శర్మ. రైల్వే లైన్స్, ట్రాక్స్ నిర్మాణంలో సాంకేతికతకు సంబంధించి రోజూ పది గంటల పాటు ఆన్సైట్లో ఉండి పరీక్షించే ఏకైక మహిళా తనిఖీ ఇంజినీర్ కశిష్. పది మంది మగవారు చేసే పని తానొక్కదాన్నే పూర్తిచేయగలను అనే ధీమాను వ్యక్తం చేస్తోన్న ఈ పట్టాలమ్మాయిని పరిచయం చేసుకుందాం... రైల్వే ట్రాక్స్ తనిఖీ చేసే ఇన్స్పెక్షన్ ఇంజినీర్ కశిష్ది రాజస్థాన్‌లోని అజ్మీర్. ఇండియన్ రైల్వే ప్రాజెక్ట్ (డబ్లు్యడిఎఫ్సి–వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రీయిట్ కారిడార్) కోసం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఇన్స్పెక్షన్ ఇంజనీర్‌గా వర్క్ చేస్తోంది. జాబ్‌లో చేరి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. సైట్ వద్ద సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి కిలోమీటర్ల దూరం నడుస్తుంది కశిష్. మూడు పదుల వయసున్న కశిష్ ఫీల్డ్‌లో పట్టిన చెమటలను తుడుచుకోవడం కంటే ఎక్సెల్ షీట్లను తయారు చేసే డెస్క్ ఉద్యోగానికి బాగా సరిపోతుంది. కానీ, ‘నేనెందుకు ఈ పని చేయలేను అనే పంతంతో ఎంచుకున్న ఉద్యోగం అది. ‘నిజానికి ఇది నా స్వభావానికి విరుద్ధమైన జాబ్. కానీ, ఒక అమ్మాయి మగవారు చేసే పని చేయలేదు అంటే మాత్రం ఊరుకోలేకపోయాను. సవాల్‌గా తీసుకున్నాను. చేసి చూపిస్తున్నాను’ అంటోంది కశిష్. ఈ జాబ్ గురించి మరింత వివరంగా మాట్లాడుతూ... ‘ఉద్యోగంలో చేరిన మొదట్లో సైట్‌కు పంపాలా వద్దా అనే విషయంపై ఆఫీసులో ప్రతి వారం చర్చలు జరిగేవి. ప్రతి వారం నేను బలంగా చెప్పేదాన్ని ‘నేను సైట్లో చేయగలను’ అని. ఈ రంగంలో నాకు అవకాశం ఇవ్వమని మా సీనియర్లను ఒప్పించాను. మొదటి అడుగు వేసే ముందు నేను పని చేసే బృందంతో మాట్లాడాను. సైట్లో ఉన్నంతసేపు ఒక మహిళగా చూడద్దు, నిపుణురాలిని మాత్రమే చూడాలని చెప్పాను. ఇప్పుడు ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరికి నా సామర్థ్యం ఏమిటో తెలుసు. 10 – 15 మంది మగవాళ్లు చేసే పనిని ఒక్కదాన్ని నిర్వహించగలను. అలా చేసినప్పుడు నువ్వు మా ‘కొడుకు’వి అని చెప్తారు. అదే బాధనిపిస్తుంది. చర్మం నల్లబడితే పెళ్లిచేసుకోరా?! ఈ వృత్తిలో అమ్మాయిని చూసినప్పుడు దానిని జీర్ణించుకోవడం కష్టం. ముఖ్యంగా ఆమె కింద పని చేయాల్సిన వారికి మరీనూ. ఇది వారి తప్పు కాదు, ఎందుకంటే గతంలో అమ్మాయిలెవ్వరూ ఈ రంగంలో లేరు. వాళ్లు ఆడవారి నుంచి సూచనలు తీసుకోలేదు. ఇది మన సంస్కృతిలో అలా ఇమిడిపోయింది. కొంతకాలం ఇబ్బంది పడ్డారు. కానీ, నేను వారి మనస్తత్వాన్ని మార్చగలను అని నమ్మాను. సాధించాను. ఇంటర్వ్యూలో నన్ను అడిగారు.. ‘ఆన్సైట్లో కొన్ని గంటల పాటు ఉండటం వల్ల చర్మం నల్లబడుతుంది. వరుడు దొరకడు, పెళ్లి అవడం కష్టం’ అని. ‘చర్మం రంగు ఆధారంగా నన్ను వివాహం చేసుకున్న వారితో కలిసి ఉండటానికి ఎంతమాత్రం నాకు ఆసక్తి లేదు’ అని చెప్పడంతో ఈ ఉద్యోగం నన్ను వరించింది. హక్కులు.. గౌరవం తప్పనిసరి సైట్‌లోని కార్మికుల పిల్లల భవిష్యత్తును మెరుగుపర్చడానికి ఏం చేయాలా ఆలోచించాను. ఆ పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వారికి చదువు చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను నా హక్కులను, నా గౌరవాన్ని కాపాడుకుంటూ నా విధిని నిర్వర్తిస్తున్నాను. నేను ఎప్పుడూ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం వైపు మొగ్గు చూపేదాన్ని. ఇస్రో పరీక్షకు అప్లై చేసుకున్నాను. అయితే, దానికి ముందే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. అందుకు నా తల్లిదండ్రుల మద్దతు కూడా ఉంది. సైట్లో వాష్‌రూమ్ కోసం నిజానికి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. వాష్‌రూమ్‌లు సైట్లో ఉండాలనేది తప్పనిసరి నిబంధన. కాని కాంట్రాక్టర్ దీనిని ఏర్పాటు చేయడు. ఎందుకంటే ఇది మగ వాళ్లు పనిచేసే చోటు. నాకు వాష్‌రూమ్ అవసరమనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి వారికి 6 నెలలు పట్టింది. నన్ను వెనక్కి వెళ్లిపొమ్మన్న జనాలే ఉన్నారు అక్కడ. మొత్తానికి సాధించాను. కొంతమంది మద్దతు కోసం నేను చాలా పోరాడాల్సి వచ్చింది. మొదట అందరూ నన్నో గ్రహాంతరవాసిలా చూసారు. కొన్ని రోజుల పాటు నేను ఒంటరిగానే పని చేశాను. నా కింది వారు కూడా నన్ను తప్పించడానికి ప్రయత్నించారు. కానీ, నేను బలంగా నిలబడ్డాను. మద్దతు కోసం సోషల్ మీడియాలో పేజీని ప్రారంభించాను. ఈ పేజీని ప్రారంభించిన తరువాత, పాతిక మంది యువతులు రైల్వేలో ఈ జాబ్‌లోకి రావడానికి అర్హత ఏంటని నన్ను అడగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మహిళలు చేయలేరనే విభాగంలోకి ఎక్కువ మంది మహిళలు రావాలి. సమాజం మనలో నింపే భయాన్ని అడ్డుకోవాలి’ అని వివరిస్తుంది కశిష్. -
బెల్లో 16 ట్రెయినీ ఇంజనీర్ పోస్టులు
బెంగళూరులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 16 » పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్ (సివిల్) –10, ట్రెయినీ ఇంజనీర్(ఎలక్ట్రికల్) –06. ట్రెయినీ ఇంజనీర్(సివిల్): » అర్హత: సివిల్ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి. » వయసు: 01.01.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. » వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది–రూ.28,000, మూడో ఏడాది–రూ.31,000 చెల్లిస్తారు. ట్రెయినీ ఇంజనీర్(ఎలక్ట్రికల్): » అర్హత: ఎలక్ట్రికల్ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి. » వయసు: 01.01.2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. » వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది–రూ.28000, మూడో ఏడాది–రూ.31,000 చెల్లిస్తారు. » పని ప్రదేశాలు: ఏఆర్కోణం, వైజాగ్, కొచ్చి, పోర్ట్‌బ్లెయిర్, గోవా, ముంబై. » ఎంపిక విధానం: బీఈ/బీటెక్ మార్కులు, గత అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వివిధ విభాగాలకు కింద సూచించిన విధంగా వెయిటేజ్ ఉంటుంది. –బీఈ/బీటెక్ మార్కులకు75శాతం; –పోస్టు క్వాలిఫికేషన్ అనుభవానికి 10శాతం; ఇంటర్వ్యూకు 15శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో పొందుపరుస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.02.2021 » వెబ్సైట్: https://careers.bhel.in/bhel/jsp/ బీహెచ్ఈఎల్ భోపాల్‌లో 300 అప్రెంటిస్ ఖాళీలు భోపాల్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్).. 2021–2022 విద్యా సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 300 » ట్రేడుల వారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్–80, ఫిట్టర్–80, మెషినిస్ట్ కంపోజిట్–30, వెల్డర్(గ్యాస్–ఎలక్ట్రిక్)–20, టర్నర్–20, కంప్యూటర్(కోపా/పాసా)–30, డ్రాఫ్ట్‌మెన్ (మెకానిక్)–05, ఎలక్ట్రిక్ మెకానిక్–05, మెకానికల్ మోటార్ వెహికిల్–05, మెషినిస్ట్(గ్రైండర్)–05, మాసన్–05, పెయింటర్(జనరల్)–05, కార్పెంటర్–05, ప్లంబర్–05. » అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 14–27ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం–బీసీ/ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.02.2021 » దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 01.03.2021. » చిరునామా: బీహెచ్ఈఎల్, భోపాల్ (మధ్యప్రదేశ్)– 462022. » వెబ్సైట్: https://bpl.bhel.com/bplweb_new/careers/index.html -
ఏసీబీకి చిక్కిన ఏఈ.. పంచాయతీరాజ్‌లో కలవరం
సాక్షి, ఆదిలాబాద్: రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్‌రూరల్ ఏఈ చంద్రశేఖర్ ఏసీబీకి పట్టుబడిన వ్యవహారం పంచాయతీరాజ్ శాఖలో కలకలం కలిగిస్తోంది. నడి రోడ్డు మీదా కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా అధికారి దొరికిపోయాడు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ఏసీబీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసుల్లో రూ.2 లక్షలు పట్టుబడటం ఇది రెండోసారి. ఇంతకుముందు 2016– 17 సంవత్సరంలో రెబ్బెన తహసీల్దార్ రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అయితే ప్రస్తుత వ్యవహారంలో ఒక్క ఏఈకే సంబంధం ఉందా.. పర్సంటేజీ రూపంలో మిగితా అధికారులకు ముట్టాల్సిన రుక్కం కూడా ఉందా అన్న చర్చ సాగుతోంది. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలో ప్రతీ పనికి సంబంధించిన బిల్లు మంజూరులో కింది నుంచి పైస్థాయి వరకు నిర్ధారిత పర్సంటేజీ ఉండడమే దీనికి కారణం. ఏసీబీ విచారణలో ఈ వ్యవహారం కూడా బయటకు వస్తుందా అనేది వేచిచూడాల్సిందే. అనేక పద్దులు.. కోట్ల విలువైన పనులు పంచాయతీరాజ్ శాఖలో అనేక పద్దుల్లో కోట్ల రూపాయల విలువైన పనులు జిల్లాలో నడుస్తున్నాయి. పద్దుల పరంగా గమనిస్తే.. జెడ్పీ జనరల్ ఫండ్, నాబార్డు, ఎస్ఎఫ్సీ, సీఆర్ఆర్, పీఎంజీఎస్‌వై, సీబీఎఫ్, ఎంపీ ల్యాడ్స్, సీడీపీ నిధులతో అనేక పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వైకుంఠధామాలు, రైతు వేదికలు కూడా ఈ శాఖ ఆధ్వర్యంలోనే ఉంటాయి. రోడ్లు, భవనాల నిర్మాణ పనులు జోరుగా సాగుతుంటాయి. అయితే ఈ శాఖలో క్షేత్రస్థాయి నుంచి పై అధికారుల వరకు పర్సంటేజీల రూపంలో ప్రతీ పనిలో నిర్ధారిత మొత్తం బిల్లు చెల్లించే ముందు కాంట్రాక్టర్ ఇవ్వడం జరుగుతుందనేది బహిరంగ రహస్యమే. ఇందులో పని విలువపై క్షేత్రస్థాయిలో అధికారులకు 5శాతం, డివిజన్ స్థాయి అధికారులకు 3 శాతం, జిల్లా స్థాయి అధికారులకు 2 శాతం కాంట్రాక్టర్ల నుంచి నేరుగా ముడుతాయి. దొరక్కపోతే పర్సంటేజీ.. దొరికితే లంచం అన్నట్టు.. ప్రస్తుతం ఏసీబీ దాడితో అంత పెద్ద మొత్తం లంచమా అన్న ఆశ్చర్యం వ్యక్తమవుతున్నప్పటికీ ఈ శాఖలో ఇది ‘మామూలే’. -
మంత్రి ఫైర్: రాస్కెల్, ఎగిరి తంతా!
సాక్షి, బెంగళూరు: అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని మంత్రి జేసీ మాదుస్వామి అధికారులను హెచ్చరించారు. గురువారం జిల్లా పంచాయతీ సమావేశం హాల్లో అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... టెండర్లు పిలిచినా ఎందుకు జాప్యం చేస్తున్నారని జెడ్పీ ఇంజినీర్ రంగస్వామిపై తీవ్రంగా మండిపడ్డారు. టెండర్ పిలిచి కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించాలని నేను 4వ తేదీన చెప్పినా కూడా ఇప్పటివరకు ఏం చేస్తున్నావు? రాస్కెల్, ఎగిరి తంతే ఎక్కడ పడతావో తెలుసా? పని చేయకుండా గాడిదలు కాస్తున్నావా అని మంత్రి అగ్గిమీద గుగ్గిలం కావడంతో అధికారులు కంగుతిన్నారు. పనిచేయని వాళ్లను ఇంటికి పంపించాలని జెడ్పీ సీఈఓకు మంత్రి స్పష్టంచేశారు. చదవండి: (చిక్కుల్లో నటి రాధికా కుమారస్వామి) -
సందేహాలకు సమాధానమిస్తాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సర్కార్ లేవనెత్తిన సందేహాలన్నింటినీ అపెక్స్ కౌన్సిల్ భేటీలో నివృత్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను సైతం సమావేశంలో లేవనెత్తుతామని వెల్లడించారు. ఈ నెల 25న అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన ముఖ్యమంత్రి.. భేటీ విషయంలో సంసిద్ధతను వ్యక్తం చేస్తూ లేఖ రాయాలని నిర్ణయించారు. ఎజెండాలో చేర్చాల్సిన అంశాలను సైతం ఆ లేఖలో పేర్కొంటామని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. అభ్యంతరాలను తిప్పికొడదాం.. తెలంగాణలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్రం, ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని సందేహాలను కౌన్సిల్ భేటీలో నివృత్తి చేయాలని, దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వాస్తవానికి తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టలేదని, ఉమ్మడి ఏపీలోని ప్రాజెక్టులనే రాష్ట్ర అవసరాలను తీర్చేలా రీడిజైన్ చేశామని తెలిపారు. ఇదే విషయాన్ని ఆధారాలతో సహా కౌన్సిల్ సమావేశంలో చెప్పాలని నిర్ణయించారు. ఆయా ప్రాజెక్టులు ఎప్పుడు మంజూరయ్యాయి.. ఎన్ని నిధులు కేటాయించారు.. తెలంగాణ వచ్చే నాటికి ఎంత ఖర్చు చేశారు.. ఎంతభూమి సేకరించారు.. ఎన్ని టీఎంసీలు కేటాయించారన్న వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డుకు అనుగుణంగానే తెలంగాణ వ్యవహరించిందన్న విషయాన్ని ఆధార సహితంగా వివరించాలని సూచించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపుతో పాటు ఏపీ కొత్తగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై గట్టిగా అభ్యంతరం చెప్పాలని నిర్ణయించారు. (పరీక్షలపై పునరాలోచన ఉత్తమం) నీటి కేటాయింపులు లేకున్నా, అనుమతులు లేకున్నా, ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా గోదావరి, కృష్ణా నదుల్లో ఏపీ అక్రమంగా వాడుకుంటున్న నీటి విషయంలో కూడా సమావేశంలో నిలదీయాలని స్పష్టం చేశారు. వీటికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. కేంద్రం కానీ, ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో వ్యక్తం చేసిన అభ్యంతరాలన్నీ అర్ధంపర్థం లేనివే అని పేర్కొన్నారు. నదీ జలాల వినియోగం విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గతంలో అనేకసార్లు ఫిర్యాదు చేశామని, ఈ అపెక్స్ కౌన్సిల్లో అయినా ఆ అంశాలను చేర్చి న్యాయం చేయాలని కోరతామని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, జలవనరుల శాఖ సలహాదారు ఎస్కే జోషి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్ సీ నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంజినీర్లూ.. మీ పనితీరు బాలేదు
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, కనీస నిబంధనలు అమలు కావడం లేదు... ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడంతోనే ఇలా జరుగుతోంది.. అని గ్రేటర్ వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్, హన్మకొండలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులతో పాటు సీకేఎం కాలేజీ మైదానంలో నిర్మించిన వాకింగ్ ట్రాక్ పనులను ఆమె మంగళవారం క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నాణ్యత లోపించినట్లు గుర్తించిన ఆమె ఇకనైనా ఇంజనీర్లు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కట్టుకథలతో కాలం వెళ్లదీయకుండా పనిపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే, వరంగల్‌లోని అంధుల లూయిస్ పాఠశాల భవన పునఃనిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు పూర్తయి, అగ్రిమెంట్ జరిగినా పనులు చేపట్టని కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని తెలిపా రు. ఇక వరంగల్ 28వ డివిజన్లో మహిళా కమ్యూనిటీ భవన పనులు,వరంగల్ ఆటోనగర్‌లో స్మృతి వనానికి వెళ్లే అప్రోచ్ రోడ్డు పనులు చేపట్టాలని, ఏ నుమాముల మార్కెట్‌రోడ్డు విస్తరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.ఈతనిఖీల్లో డీఈ రవీందర్,ఏఈలు కృష్ణమూర్తి,కార్తీక్ పాల్గొన్నారు. సుందరంగా ‘వావ్ వరంగల్’ కాజీపేట ఫాతిమా నగర్ జంక్షన్ వద్ద ఏర్పాటుచేసి న ‘వావ్ వరంగల్’ లోగోను సుందరంగా తీర్చిదిద్దాలని కమిషనర్ పమేలా సత్పతి ఆదేశించారు. ఫాతి మానగర్ వద్ద పనులను పరిశీలించిన కమిషనర్... అందమైన చిత్రాలు వేయించడంతో పాటు వాటర్ ఫాల్స్ ఏర్పాటుచేయాలని తెలిపారు. ఈ పరిశీలనలో సీహెచ్ఓ సునీత, డీఈ రవీకిరణ్, ఏఈ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. -
వణుకుతున్న అక్రమార్కులు..
సాక్షి, విశాఖపట్నం: అవినీతిపరులపై దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవినీతిని ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడంతో కొద్ది రోజులుగా ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఇంజినీర్ కందుల తవిటరాజు ఇంటిపై శుక్రవారం ఏబీసీ దాడులు చేపట్టింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు జరుపుతున్నారు. విశాఖ గాజువాకలోని శ్రామికనగర్, శ్రీకాకుళం జిల్లా రాజాం, విజయనగరం జిల్లా రామభద్రపురం దరి కొట్టక్కిలో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. (బినామీల ఇళ్లలో సిట్ సోదాలు) -
ఇంజనీర్‌ను వేధించిన ఎమ్మెల్యేకు కస్టడీ
ముంబై : ఇంజనీర్‌పై బురద చల్లి అవమానపరిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నితీష్ రాణే, 18 మంది ఆయన సహచరులను మహారాష్ట్రలోని కంకవలి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. పీడబ్ల్యూడీ ఇంజనీర్‌ను వేధించి, ఆయనపై బురద విసిరినందుకు అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులను జులై 9 వరకూ పోలీస్ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. కస్టడీ గడువు ముగిసిన అనంతరం మంగళవారం వీరిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా జ్యుడిషియల్ కస్టడీకి న్యాయస్ధానం తరలించాలని ఆదేశించింది. కోర్టు నిర్ణయంతో వీరు బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభించింది. గత వారం ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న పనులను పర్యవేక్షించేందుకు తన అనుచరులతో కంకవలి హైవేకు ఎమ్మెల్యే చేరుకున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పనులు సాగుతున్న తీరుపై ఇంజనీర్ ప్రకాష్ కదేకర్‌ను ఎమ్మెల్యే దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాణే అనుచరులు ఇంజనీర్‌ను హైవే రెయిలింగ్‌కు కట్టివేసి బకెట్లతో బురుద నీటిని చల్లడం వీడియోలో కనిపించింది. అనంతరం వీరి చర్యపై ఇంజనీర్ ప్రకాష్ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇంజినీర్‌పై బురద పోసిన ఎమ్మెల్యే
సాక్షి, ముంబై: మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాధికారిని బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్‌వర్గీయా బ్యాటుతో కొట్టిన ఘటన జరిగి పక్షం రోజులైనా గడవక ముందే మహారాష్ట్రలోనూ దాదాపు అలాంటి ఘటనే గురువారం జరిగింది. గుంతలమయంగా మారిన హైవేపై మరమ్మత్తులు చేపట్టాలని వినతిపత్రాలు సమర్పించినా లాభంలేకపోవడంతో కోపంతో కాంగ్రెస్‌కు చెందిన నితేశ్ రాణే అనే ఎమ్మెల్యే ఓ ఇంజినీర్‌ను వంతెన కమ్మీకి కట్టేసి, ఆయనపై బక్కెట్లతో బురదపోశారు. నితేశ్ మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే కొడుకు. ముంబై–గోవా రహదారిపై, సింధుదుర్గ్ జిల్లాలోని కనకవ్లీ పరిసరాల్లో ఈ ఘటన గురువారం జరిగింది. ఇంజినీర్ ప్రకాశ్ ఖేడేకర్పై ఎమ్మెల్యే నితేశ్, కనకవ్లీ పురపాలక మండలి అధ్యక్షుడు సమీర్ నలవాడేలు బకెట్లతో బురద పోశారు. ‘గుంతల్లోంచి వెళ్లే వాహనాల కారణంగా పాదచారులపై బురద పడుతోందని, ఈ రోజు మీ మీదా బురద పడనీయండి’ అని నితేశ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో పోలీసులు నితేశ్ను అదుపులోకి తీసుకున్నారు. -
వెబ్ ఆప్షన్లు వాయిదా!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మరోసారి వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 5 నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాల్సి ఉంది. అయితే అన్ని ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను ఖరారు చేశాకే ముందుకెళ్లాలన్న నిర్ణయం నేపథ్యంలో.. 5నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలా? వద్దా? అన్న ఆలోచనల్లో అధికారులున్నారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలంటే కాలేజీ వారీగా వివరాలన్నీ అందుబాటులోకి తేవాల్సి ఉంది. అయితే ఈనెల 5వ తేదీ నాటికి సాధ్యం అవుతుందా? లేదా? అన్నదే అసలు ప్రశ్న. గత వారం వరకు ఫీజులను ఖరారు చేయకపోవడంతో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించి, ఫీజులను ఖరారు చేయాలి.. లేదా యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలన్న ఉత్తర్వులను పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆగమేఘాలపై ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చైర్మన్‌ను నియమించడం, ఫీజుల ఖరారు ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బుధవారంతో కోర్టును ఆశ్రయించిన 81 కాలే జీల్లో 79 కాలేజీలకు ఏఎఫ్ఆర్సీ హియరింగ్ నిర్వహించి ఫీజులను ఖరారు చేసింది. అంతేకాదు కోర్టుకు వెళ్లని మరో 108 కాలేజీల ఫీజులను ఈనెల 4వ తేదీ నుంచి చేపట్టి రోజుకు 36 కాలేజీల చొప్పున హియరింగ్ నిర్వహించి 6వ తేదీనాటికి అన్నింటికి ఫీజులను ఖరారు చేసేందుకు ముందుకు సాగుతోంది. ఆ తరువాత బీ–ఫార్మసీ ఫీజులను కూడా ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త ఫీజులతో వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలంటే ఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఇందుకు మరో మూడు నాలుగు రోజుల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల పాటు వెబ్ ఆప్షన్లు వాయిదా పడే పరిస్థితి కనిపిస్తోంది. లేదా కోర్టును ఆశ్రయించిన కాలేజీలకు ఖరారు చేసిన ఫీజులపై ఉత్తర్వుల కోసం గురువారం ప్రభుత్వానికి పంపి, మిగతా కాలేజీలు ఎలాగూ ఫీజు రూ.50 వేలకు పైగా ఉంటే 15%, రూ.50 వేల లోపు ఉంటే 20% పెంచేందుకు అంగీకరించిన నేపథ్యంలో వాటిని అమలు చేయాలా? అన్న ఆలోచనల్లో అధికారులున్నారు. దీనిపై గురువారం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారీగా ఫీజుల పెరుగుదల ఏఎఫ్ఆర్సీ వివిధ కాలేజీలతో నిర్వహిస్తున్న హియరింగ్ సందర్భంగా కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి వచ్చే మూడేళ్లలో అమలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేస్తోంది. ఇప్పటివరకు 79 కాలేజీలకు హియరింగ్ నిర్వహించి ఫీజులను ఖరారు చేసింది. ఇందులో కొన్ని ప్రముఖ కాలేజీలున్నాయి. ఏఎఫ్ఆర్సీ ప్రతిపాదిత ఫీజుకు ఆయా కాలేజీలు అంగీకరించినట్లు తెలిసింది. శ్రీని«ధి, సీబీఐటీ కాలేజీల ఫీజులను గురువారం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొన్ని టాప్ కాలేజీల్లో ఫీజులు గతంలో కంటే ఈసారి ఎక్కువగా పెరిగినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని కాలేజీల్లో ఫీజుల పరిస్థితి (కొంత మార్పు ఉండవచ్చు) కాలేజీ పాత ఫీజు కొత్త ఫీజు వాసవి 86,000 1,30,000 వర్ధమాన్ 1,05,000 1,25,000 సీవీఆర్ 90,000 1,15,000 కేఎంఐటీ 77,000 1,03,000 సీవీఎస్ఆర్ 93,000 1,20,000