
పట్నా: బిహార్‌లోని జేపీ గంగా బ్రిడ్జ్ పనులకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సహానం కోల్పోయారు. జేపీ గంగా ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇంజనీర్‌పై వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం 12. 5 కిలోమిటర్ల దూరం నిర్మించాల్సి ఉంది. అయితే ఇంకా 4. 5 కిలో మీటర్ల నిర్మాణం పెండింగ్‌లో ఉండటంతో ప్రాజెక్టు ఇంజనీర్‌పై సీఎం నితీష్ తీవ్ర అసహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇంజనీర్‌తో మాట్లాడుతూ.. ‘‘మీరు కావాలనుకుంటే.. మేము కాళ్లు మొక్కుతాం. తొందరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయండి’’ అని చేతులు జోడించి కోపంతో ఊగిపోయారు. దీంతో ‘‘సర్, మీరు దయ చేసి అలా మాట్లాడవద్దు’’ అని సదరు ఇంజనీర్ తిరిగి సీఎంకు చేతులు జోడించి వివరణ ఇచ్చారు. దీంతో సీఎం నితీష్ శాంతించారు. ఈ కార్యకమ్రంలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, స్థానిక ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
Watch: Bihar CM Nitish Kumar urged an IAS officer to expedite the extension of JP Ganga Path up to Kangan Ghat in Patna, says "I touch your feet; please complete the work on time" pic.twitter.com/bAkFU6aAOK
— IANS (@ians_india) July 10, 2024
ఇక.. ఇటీవల బిహార్‌లో పలు బ్రిడ్జ్‌లు, కాజ్‌వేలు కుప్పకూలడంతో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో 15 మంది ఇంజనీర్లపై బిహార్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటువేసింది. అనంతరం ప్రభుత్వం వరుస బ్రిడ్జ్‌లు కుప్పకూలటంపై ప్రభుత్వం దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 17 రోజుల్లో 10 బ్రిడ్జ్‌లు కూలిపోవడానికి ఇంజనీర్ల నిర్లక్ష్యం, సరిగా పర్వవేక్షించపోవటమే కారణమని దర్యాప్తు బృందం నివేదిక ఇచ్చినట్లు బిహార్ జలవనరుల విభాగం అడిషినల్ చీఫ్ సెక్రటరీ చైతన్య ప్రసాద్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment